Saaho Released on Amazon Prime-video | Telugu, Tamil, Malayalam Version on prime, Hindi on Netflix | అమెజాన్‌ ప్రైమ్‌లో సాహో మూవీ! - Sakshi
Sakshi News home page

అమెజాన్‌ ప్రైమ్‌లో సాహో మూవీ!

Published Wed, Oct 16 2019 1:57 PM | Last Updated on Wed, Oct 16 2019 7:32 PM

Soon, Saaho Movie on Amazon Prime Video - Sakshi

బాహుబలి తరువాత ప్రభాస్‌ హీరోగా అదేస్థాయి అంచనాలతో తెరకెక్కిన భారీ  సినిమా సాహో..  ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి రోజు నుంచే డివైడ్‌ టాక్‌ వచ్చింది. అయినా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. దక్షిణాదిలో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘సాహో’ హిందీలో మాత్రం అదిరిపోయే కలెక్షన్లతో ‘సాహో’ అనిపించింది.

త్వరలోనే ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం కానుంది. ఈ నెల 19 నుంచి తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాషల్లో సాహో సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. రూ.42 కోట్ల భారీ ధ‌ర‌తో ‘సాహో’ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకుంది. ఇక, ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఉండనుందని సమాచారం.

రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సాహో సినిమాను తెరకెక్కింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్‌, చంకీ పాండే, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్ విజయ్‌, లాల్‌, వెన్నెల కిశోర్‌, మందిర బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement