ప్రభాస్ ఇంటి ఫుడ్‍‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే | Sharddha Kapoor Comments On Prabhas Home Food | Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: ప్రభాస్ ఇంటి ఫుడ్.. హీరోయిన్ ఫన్నీ కామెంట్

Jun 3 2024 2:09 PM | Updated on Jun 3 2024 3:00 PM

 Sharddha Kapoor Comments On Prabhas Home Food

డార్లింగ్ ప్రభాస్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది 'బాహుబలి'. ఎందుకంటే ఓ సాదాసీదా హీరో.. ఈ సినిమా వల్ల పాన్ ఇండియా వైడ్ అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. అలానే ప్రభాస్ అంటే అద్భుతమైన ఫుడ్ కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే తనతో పనిచేసే వాళ్లకు తినలేనంత వెరైటీ ఫుడ్ పెట్టి చంపేస్తాడనే అంటుంటారు. కానీ ఐదేళ్లయినా సరే డార్లింగ్ హీరో ఇంటి ఫుడ్‌ని బాలీవుడ్ హీరోయిన్ మర్చిపోలేకపోతోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)

'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. 'సాహో' మూవీ చేశాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా చేసింది. మన దగ్గర మూవీ సరిగా వర్కౌట్ కాలేదు కానీ హిందీలో మంచి వసూళ్లు దక్కించుకుంది. అలానే ప్రభాస్-శ్రద్ధా జోడీ కూడా ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. ఈ కాంబో మళ్లీ సెట్ అయితే బాగుండు అని చాలామంది అనుకుంటున్నారు. తాజాగా ఓ నెటిజన్.. ఈ విషయమై శ్రద్ధాని అడిగాడు.

'ప్రభాస్‌తో మళ్లీ ఎప్పుడు నటిస్తారు?' అని నెటిజన్ అడగ్గా.. 'ప్రభాస్, మళ్లీ తన ఇంటి ఫుడ్ పంపించినప్పుడు..' అని రిప్లై ఇచ్చింది. దీనిబట్టి ఐదేళ్లయినా సరే ఇంకా ప్రభాస్ ఇంట్లో చేసిచ్చిన ఫుడ్‌ని శ్రద్ధా మర్చిపోలేకపోతోంది అనమాట. మరి అట్లుంటది ప్రభాస్ అతిథ్యం అంటే!

(ఇదీ చదవండి: రామ్ చరణ్ కూతురు క్లీంకార కోసం ప్రభాస్ స్పెషల్‌ గిఫ్ట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement