Saaho
-
ప్రభాస్ ఇంటి ఫుడ్‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే
డార్లింగ్ ప్రభాస్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది 'బాహుబలి'. ఎందుకంటే ఓ సాదాసీదా హీరో.. ఈ సినిమా వల్ల పాన్ ఇండియా వైడ్ అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. అలానే ప్రభాస్ అంటే అద్భుతమైన ఫుడ్ కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే తనతో పనిచేసే వాళ్లకు తినలేనంత వెరైటీ ఫుడ్ పెట్టి చంపేస్తాడనే అంటుంటారు. కానీ ఐదేళ్లయినా సరే డార్లింగ్ హీరో ఇంటి ఫుడ్‌ని బాలీవుడ్ హీరోయిన్ మర్చిపోలేకపోతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. 'సాహో' మూవీ చేశాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా చేసింది. మన దగ్గర మూవీ సరిగా వర్కౌట్ కాలేదు కానీ హిందీలో మంచి వసూళ్లు దక్కించుకుంది. అలానే ప్రభాస్-శ్రద్ధా జోడీ కూడా ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. ఈ కాంబో మళ్లీ సెట్ అయితే బాగుండు అని చాలామంది అనుకుంటున్నారు. తాజాగా ఓ నెటిజన్.. ఈ విషయమై శ్రద్ధాని అడిగాడు.'ప్రభాస్‌తో మళ్లీ ఎప్పుడు నటిస్తారు?' అని నెటిజన్ అడగ్గా.. 'ప్రభాస్, మళ్లీ తన ఇంటి ఫుడ్ పంపించినప్పుడు..' అని రిప్లై ఇచ్చింది. దీనిబట్టి ఐదేళ్లయినా సరే ఇంకా ప్రభాస్ ఇంట్లో చేసిచ్చిన ఫుడ్‌ని శ్రద్ధా మర్చిపోలేకపోతోంది అనమాట. మరి అట్లుంటది ప్రభాస్ అతిథ్యం అంటే!(ఇదీ చదవండి: రామ్ చరణ్ కూతురు క్లీంకార కోసం ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్) -
బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించిన సాహో భామ.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆషిక్-2 సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ఆ తర్వాత పలు చిత్రాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఈ ఏడాది రణ్‌బీర్ కపూర్ సరసన తూ జూటి మెయిన్ మక్కర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీలో బాగీ, ఎక్ విలన్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, స్త్రీ, ఓకే జాను లాంటి చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సాహో చిత్రంలో కనిపించింది శ్రద్ధా కపూర్. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: హ్యాపీ బర్త్ డే బాబాయ్.. ఉపాసన స్పెషల్ విషెస్!) అయితే తాజాగా ఈ సాహో భామ ముంబయిలో ఓ థియేటర్ వద్ద కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా చూసి బయటకు వస్తుండగా కెమెరాల కంటికి చిక్కింది. అయితే ఆమెతో పాటు బాయ్‌ఫ్రెండ్ రాహుల్ కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి థియేటర్లో సినిమా చూసి వెళ్తుండగా ఫోటోలకు పోజులిచ్చింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ బీ టౌన్లో చర్చ మొదలైంది. కానీ ఇంతవరకు వీరి రిలేషన్‌పై ఎక్కడా స్పందించలేదు. అయితే వీరిద్దరు వేరు వేరు కార్లలో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. రాహుల్ తూ జూతీ మైన్ మక్కార్ సినిమాకు రచయితగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. అంతే కాకుండా రాహుల్ ప్యార్ కా పంచ్‌నామా- 2, సోను కే టిటు కి స్వీటీతో సహా లవ్ రంజన్ చిత్రాలకు కూడా పనిచేశాడు. కాగా.. గతంలో శ్రద్ధా కపూర్.. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో కొన్నాళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు 2022లో విడిపోయినట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపించాయి. (ఇది చదవండి: విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఏ సౌత్ హీరో వల్ల కాలేదు!
మీకు తెలిసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు? అని అడిగితే ఇప్పటి జనరేషన్ టక్కున చెప్పే పేరు ప్రభాస్. 'బాహుబలి' ముందు వరకు కేవలం తెలుగుకే పరిమితమైన ఇతడు.. ఆ తర్వాత తన రేంజుని అంతకంతకు పెంచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు ఏకంగా సౌత్ లో ఏ హీరోకి సాధ్యం కానీ విధంగా ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. పాన్ ఇండియా స్టార్ అంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాలి. తన సినిమాలతో ఎంటర్ టైన్ చేయాలి. డార్లింగ్ ప్రభాస్ ని చూస్తుంటే అచ్చం అలానే అనిపిస్తోంది. ఎందుకంటే 'ఆదిపురుష్'నే తీసుకోండి. డివైడ్ టాక్ వచ్చినాసరే కలెక్షన్స్ సాధిస్తూనే ఉంది. సౌత్ లో అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. నార్త్ లో ఈ సినిమాకు ప్రేక్షకులు వెళ్తున్నారు. చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కారణం వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. (ఇదీ చదవండి: ఆ నెలంతా పాన్ ఇండియా మూవీసే.. ఏకంగా అన్ని!) 'బాహుబలి' తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్'.. ఇలా మూడు భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు ప్రభాస్. వీటి టాక్ ఏంటనేది పక్కనబెడితే నార్త్ లో ఇవన్నీ కూడా కలెక్షన్స్ లో వావ్ అనిపించాయి. మొత్తం ఈ నాలుగు చిత్రాలు.. కేవలం హిందీలోనే తలో రూ.100 కోట్లు చొప్పున నెట్ వసూళ్లు సాధించాయి. తద్వారా దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్ లో ఈ ఘనత సాధించిన ఫస్ట్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రభాస్ తన నాలుగు సినిమాలతో తలో రూ.100 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తే దక్షిణాది నుంచి మరే హీరో కూడా కనీసం ఒక్కటంటే ఒక్క మూవీతోనూ ఈ క్లబ్ లో చేరలేకపోయాడు. దీన్నిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు అసలు సిసలు 'పాన్ ఇండియా స్టార్' ప్రభాస్ అని. మరోవైపు బాలీవుడ్ లో ఇలా రూ.100 కోట్లు సాధించిన హీరోలు ఒకరో ఇద్దరో ఉంటారంతే! (ఇదీ చదవండి: వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?) -
'ఆదిపురుష్'తో ప్రభాస్ సరికొత్త రికార్డు.. దేశంలో ఫస్ట్ హీరోగా!
డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. రామాయణాన్ని చాలావరకు మార్చి తీశారని, వీఎఫ్ఎక్స్.. హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి గెటప్ సరిగా లేదనని.. ఇలా ఎవరికివాళ్లు తమ తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు. మరోవైపు టాక్ తో సంబంధం లేకుండా ఇందులో నటించిన ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. (ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్) 'బాహుబలి' తర్వాత డార్లింగ్ ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ ఊపులో చాలా సినిమాలు ఒప్పేసుకున్నాడు. వాటిలో సాహో(2019), రాధేశ్యామ్ (2022) ప్రేక్షకుల ముందుకొస్తే, తాజాగా 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చింది. రామాయణం ఆధారంగా తీసిన ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఘోరంగా ట్రోల్స్ వచ్చాయి. కానీ ట్రైలర్స్ తో కాస్త రిలీఫ్ అనిపించింది. ఇప్పుడు సినిమా బిగ్ స్క్రీన్ పై చూసిన ఆడియెన్స్ మాత్రం చాలావరకు పెదవి విరుస్తున్నారు. 'ఆదిపురుష్' మూవీ టాక్ ఏంటనేది పక్కనబెడితే తొలిరోజు కలెక్షన్స్ మాత్రం అదిరిపోయే రేంజులో వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే దాదాపు రూ.140 కోట్ల వరకు ఈ మూవీ కలెక్ట్ చేసింది. గతంలో 'బాహుబలి', 'సాహో'తో పాటు ఇప్పుడు 'ఆదిపురుష్'.. రిలీజైన మొదటిరోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. తద్వారా మూడు సినిమాలతో ఈ మార్క్ ని అందుకున్న ఓన్లీ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రస్తుతానికైతే ఏ హీరో కూడా.. తొలిరోజు కలెక్షన్స్ విషయంలో ప్రభాస్ కి దరిదాపుల్లో లేకపోవడం విశేషం. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ సరికొత్త రికార్డ్) -
తల్లి కాబోతున్న 'సాహో' నటి.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటి, యే జవానీ హై దివానీ ఫేమ్ ఎవెలిన్ శర్మ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది. తాను రెండోసారి తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ వార్త విన్న పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎవెలిన్ శర్మ మే 2021లో బాయ్‌ఫ్రెండ్ తుషాన్ భిండిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఫ్రెండ్ అయిన మరో నటి ఫంక్షన్లో తొలిసారి కలుసుకున్నారు. గతంలో నవంబర్ 12, 2021న ఈ జంటకు కుమార్తె జన్మించింది. పాపకు అవ రానియా భిండి అని పేరు పెట్టారు. బాలీవుడ్ కెరీర్: ఎవెలిన్ శర్మ 2012లో 'ఫ్రం సిడ్నీ విత్ లవ్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'నౌతంకీ సాలా', 'వైజేహెచ్డీ', 'యారియాన్', 'మెయిన్ తేరా హీరో', 'కుచ్ కుచ్ లోచా హై', 'హిందీ మీడియం' వంటి చిత్రాలలో నటించింది. 2019లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన 'సాహో' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Evelyn Sharma (@evelyn_sharma) -
జపాన్‌లో తగ్గని ప్రభాస్ క్రేజ్!
‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.‘సాహో’ సినిమాతోనూ వసూళ్లపరంగా సత్తా చాటి తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నాడు. ఈ రెండు సినిమాలకు జపాన్‌లో లభించిన ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డార్లింగ్ నటనకు ఫిదా అయిన జపాన్‌వాసులు ‘బాహుబలి’తో పాటు ‘సాహో’పై కూడా కలక్షన్ల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఇప్పుడు అక్కడ కొంతమంది ఫ్యాన్స్ మరో ముందడుగు వేసి.. ప్రభాస్ పేరిట షుగర్‌లెస్ మింట్ క్యాండీస్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చారు.(దంగల్ రికార్డును బద్దలు కొట్టిన సాహో!) కాగా గతంలో చైనాలోనూ డార్లింగ్ అభిమానులు ప్రభాస్ ఫొటోతో గాజు పాత్రలు తయారు చేసి అమ్మిన సంగతి తెలిసిందే. అంతేగాక ప్రభాస్‌తో పాటు బాహుబలి సినిమాలోని క్యారెక్టర్ల పేర్లన్నింటితో ఫుడ్ ఐటమ్స్‌ను విక్రయించారు. ఇక బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న డార్లింగ్ ‘సాహో’తో సందడి చేసినా అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. అందుకే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ సినిమాను లైన్లో పెట్టిన ప్రభాస్.. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీలో నటించనున్నాడు.(సీతగా మహానటి?) ఇక బాలీవుడ్లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన ఈ పాన్ ఇండియా స్టార్.. ‘ఆదిపురుష్’ అనే పౌరాణిక చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనువిందు చేయనున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూడు సినిమాల బడ్జెట్ కలిపి మొత్తంగా సుమారు వెయ్యి కోట్ల వరకు ఉండవచ్చని వినికిడి. దీంతో ఎటువంటి రికార్డు సృష్టించాలన్నా తమ హీరోకి మాత్రమే సాధ్యమవుతుందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
ప్రేయసిని పెళ్లాడిన 'సాహో' డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్ : సాహో’ చిత్ర దర్శకుడు సుజీత్ ప్రేయసిని ఆగస్టు 2న పెళ్లాడాడు. పంచభూతాల సాక్షిగా డెంటిస్ట్ ప్రవళికతో ఏడడుగులు వేశాడు. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ పెద్దల అంగీకారంతో ఇష్టసఖిని మనువాడాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు రిసార్టులో జరిగిన ఈ పెళ్లి వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. 29 ఏళ్ల యంగ్ డైరెక్టర్ సుజీత్ సాంప్రదాయ ధోతి, కుర్తా ధరించగా, వధువు ప్రవళిక గులాబీ రంగు చీరలో మెరిసిపోయింది. హిందూ సాంప్రదాయం ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ పెళ్లి వేడుక జరిగింది. వివాహానికి హాజరైన బంధువులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇటీవల హీరో నితిన్, నిఖిల్, కమెడియన్ మహేష్, నిర్మాత దిల్ రాజు ఇలా చిత్రపరిశ్రమకు చెందిన ఒక్కొక్కరు పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెలిసిందే. (నితిన్ సినిమాకు నో చెప్పిన బుట్టబొమ్మ!) డైరెక్టర్ సుజీత్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జూన్ 10న హైదరాబాదులో సుజీత్ -ప్రవళికల నిశ్చితార్థం జరిగింది. 'రన్ రాజా రన్' సినిమాతో దర్శకుడిగా వెండితెరపై అడుగుపెట్టిన సుజీత్‌కు ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ఏకంగా ప్రభాస్‌తో కలిసి పని చేసే ఛాన్స్ కొట్టేశాడు. హాలీవుడ్ అంతటి రేంజ్లో 'సాహో' చిత్రాన్ని తెరకెక్కించి విశేష గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం సుజీత్ 'లూసిఫర్' రీమేక్ తెరకెక్కించనుండగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారని సమాచారం. ఇంకా స్క్రిప్ట్‌ను మెరుగులు దిద్దుతూ ఉన్నందున ఈ ఏడాది చివరికి ఆ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. (వర్మ నోట ‘మర్డర్’పాట.. విడుదల) @sujeethsign Happy Married Life Sujeeth Bro Wishing All Success , Good Health , and Happiness 🖤 pic.twitter.com/2tdaPLxRQq — P.GIREESH REDDY (@GReddyPetluru) July 28, 2020 -
హీరోయిన్ శ్రద్ధా కపూర్ గ్లామర్ ఫోటోలు
-
డెంటిస్ట్‌తో ప్రేమ.. జూన్ 10న నిశ్చితార్థం?
హైదరాబాద్: ‘సాహో’ చిత్ర దర్శకుడు సుజీత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవలే నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ వరుసగా ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. ఇదే జాబితాలో సుజిత్ కూడా త్వరలో చేరనున్నారు. ప్రవళిక అనే డెంటిస్ట్‌తో గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ పెద్దల అంగీకారంతో త్వరలోనే ఆమె మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 10న హైదరాబాద్‌లో సుజీత్-ప్రవళికల నిశ్చితార్థం ఉండనున్నట్లు సమాచారం. (హ్యాపీ బర్త్‌డే ‘కామ్రేడ్ భారతక్క’) లాక్డౌన్ కారణంగా ఎంగేజ్మెంట్ చాలా సింపుల్‌గా జరగనుందని, ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలిసింది. నిశ్చితార్థం రోజునే పెళ్లి తేదీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందని టాలీవుడ్ టాక్. అయితే ఈ వార్తలపై సుజీత్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక రన్రాజాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన సుజీత్ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో హాలీవుడ్ రేంజ్లో తీసిన ‘సాహో’ చ్రితంతో ఫుల్ ఫేమ్‌తో పాటు క్రేజ్ సాధించాడు. దీంతో తన మూడో చిత్రం మెగాస్టార్‌తో తీసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ‘లూసిఫర్’ రీమేక్‌ను తెలుగులో ఈ యువ దర్శకుడే డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. (మహేశ్‌తో మరో సినిమా?) -
టాలీవుడ్ @ 2020
గడిచిన పదేళ్ల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ.. ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. మరెన్నో శిఖరాలను అందుకుంది. గొప్ప గొప్ప విజయాలను సాధించింది. తన మార్కెట్ వ్యాల్యూనూ అనూహ్యంగా పెంచుకుంది. ఇవాళ జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగానే కాదు.. ఓవర్సీస్లోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇందుకు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. తెలుగు సినిమాను అంతర్జాతీయంగా నిలబెట్టడంలో, టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరింపజేయడంలోనూ బాహుబలి సినిమాలది ప్రత్యేకమైన స్థానం. కానీ అంతకుముందు నుంచి టాలీవుడ్ సినిమాలు వడివడిగా ఎదుగుతూ ఎంతో పేరుప్రఖ్యాతలు పొందాయి. ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ దిశదిశలా వ్యాపించింది. ఇప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగానే క్రేజ్ నెలకొంది. అంతర్జాతీయంగానూ గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో విస్తరించిన మార్కెట్‌ను అందిపుచ్చుకోవడం.. పెరిగిపోయిన అంచనాలకు దీటుగా సత్తా ఉన్న సినిమాలు నిర్మించడం తెలుగు చిత్రసీమకు కత్తిమీద సాములాంటిదే. పెరిగిన బడ్జెట్.. అంచనాలు! బాహుబలి ఇచ్చిన జోష్‌తో భారీ సినిమాలు తెరకెక్కించేందుకు ఇప్పుడు దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నారు. ఒకప్పుడు 30, 40కోట్ల బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు వెనుకాముందు అయ్యేవారు. సినిమా హిట్టయినా అంత బడ్జెట్ తిరిగొస్తుందా? అన్న సందేహాలు వెంటాడేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిష్టాత్మక సినిమాల కోసం, క్రేజీ కాంబినేషన్ల కోసం వందల కోట్లు పెట్టేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు సాహసిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన సినిమాలే సాహో, సైరా, మహర్షి, వినయవిధేయ రామ. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు. ఇందులో సాహో, సైరాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు 200 కోట్లకుపైగా బడ్జెట్‌తో భారీ అంచనాలతో, కళ్లుచెదిరే విజువల్స్, స్టంట్లతో ఈ సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలకు టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. అయితే, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఏమాత్రం కథ, కథనాలు ఏమాత్రం ప్రేక్షకుడి అంచనాలకు మించి లేకపోతే.. కథ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని ఈ ఏడాది వచ్చిన సినిమాలు నిరూపించాయి. బాహుబలి తర్వాత భారీ అంచనాలతో, దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పటికీ.. అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. దర్శకుడు సినిమాలోని స్టంట్ల మీద పెట్టిన ఫోకస్లో కొంతమేరకైనా కథ, స్క్రీన్‌ప్లే మీద పెట్టి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదేమోనని వినిపించింది. మొత్తానికి హిందీలో తప్ప మిగతా అన్ని భాషల్లో సాహో సినిమా భారీ పరాభవాన్నే ముటగట్టుకుంది. హిందీలో వందకోట్లకుపైగా వసూళ్లు రావడం, ప్రభాస్ స్టార్డమ్ కలిసిరావడంతో ఈ సినిమా నిర్మాతలకు కొంత ఊరటనిచ్చే విషయం. ఇక, చారిత్రక నేపథ్యంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైరానరసింహారెడ్డి సినిమా కూడా అంచనాలకు దూరంగానే ఉండిపోయింది.రేనాటి సూరీడు, స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాంచరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో హిట్టైనప్పటికీ.. అంచనాలను అందుకోలేకపోయింది. ఇతర భాషల్లో ఓ మోస్తరు వసూళ్లే రాబట్టింది. మహేశ్‌బాబు 25వ సినిమా మహర్షి కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే, ఈ సినిమా హిట్ అయినప్పటికీ.. ప్రిన్స్ మహేశ్ స్టామినాకు తగ్గట్టు వసూళ్లు రాబట్టంలో సక్సెస్ కాలేదు. ఇక, రాంచరణ్ హీరోగా తెరకెక్కిన వినయవిధేయ రామ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. రంగస్థలం లాంటి పర్ఫార్మెన్స్ ఒరియంటెడ్ పాత్ర చేసిన చరణ్.. ఆ వెంటనే రోటిన్ ఫార్ములా సినిమాలో నటించడం.. ఫైట్లు, రక్తపాతంతో దర్శకుడు బోయపాటి శ్రీను ప్రేక్షకులను బెంబెలెత్తించడంతో ఈ సినిమా బోల్తా కొట్టింది. మారిన బాక్సాఫీస్ సరళి! తెలుగు చిత్రపరిశ్రమ మార్కెట్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశీయంగానూ పొరుగు రాష్ట్రాల్లోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. అంతేకాదు ఓవర్సీస్లోనూ గణనీయంగా వసూళ్లు రాబట్టే సత్తా ఉన్నట్టు తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో సినిమా జయాపజయాల ప్రమాణాలూ మారిపోయాయి. ఒకప్పడు 50 రోజులు ఆడితే బొమ్మ హిట్టు అనేవారు. వందరోజులు ఆడితే సూపర్‌హిట్టు.. 175, 200 రోజులు ఆడితే బ్లాక్‌బస్టర్ హిట్టు, ఆల్‌టైమ్ హిట్టు అని కొనియాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడంతో 40రోజుల్లోనే కొత్త సినిమా ప్రేక్షకుల చెంతకు చెరిపోతోంది. టీవీల్లోనూ, ఇంకా వీలైతే యూట్యూబ్‌లోనూ వీలైనంత త్వరగా కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ ఎన్ని థియేటర్లలో విడుదలైంది.. ఏ స్థాయిలో ప్రారంభ వసూళ్లు సాధించింది.. ఎన్ని వారాలపాటు నిలకడగా వసూళ్లు రాబట్టగలిగిందనేని సినిమా విజయానికి ఇప్పుడు ప్రమాణంగా మారింది. ప్రారంభ వసూళ్ల ఆధారంగా సినిమా జయాపజయాలు బేరిజు వేసే పరిస్థితి వచ్చింది. మొదటి మూడు రోజులు బంపర్ వసూళ్లు సాధిస్తే బొమ్మ హిట్టు, సూపర్‌హిట్టు ఖాతాలోకి వెళ్లిపోతోంది. మొదటి రెండు వారాల వసూళ్లు సినిమా విజయానికి ప్రాణపదంగా మారిపోయాయి. థియేటర్లలో లాంగ్రన్ అనేది చాలావరకు కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బాహుబలి, రంగస్థలం లాంటి బలమైన కథాచిత్రాలే చాలాకాలంపాటు ప్రేక్షకులను థియేటర్లకు లాక్కొచ్చాయి. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఎంత మంచి టాక్ వచ్చిన సినిమా అయినా, స్టార్ హీరో మూవీ అయినా మూడు, నాలుగు వారాలకు మించి థియేటర్లలో నిలబడని పరిస్థితి. మారిన పరిస్థితులకు అనుగుణంగా టాలీవుడ్ కూడా తన పద్ధతలను మార్చుకుంది. ప్రారంభ వసూళ్లపైనే ఇప్పుడు దర్శక నిర్మాతలు, సినీ తారలు ఫోకస్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున విడుదల చేసి మొదటి ఒకటిరెండు వారాల్లోనే దండిగా వసూళ్లు రాబడట్టంపై దృష్టి పెట్టారు. ఆన్లైన్లో వరుసగా ఫస్ట్‌లుక్, టీజర్లు, పాటలు, ట్రైలర్లు విడుదల చేస్తూ.. ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుతూనే.. క్షేత్రస్థాయి పర్యటనలతో సినిమా విడుదలకు ముందే ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. ఈ పరిణామాలు కొంతమేరకు సక్సెస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా సినిమాలోబలమైన కథకథనాలు, భావోద్వేగాలు, వినోదం ఉంటే.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకులు థియేటర్ వైపు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కథకథనాలు బాగుండి.. స్టార్ బలం లేకపోయినా, అంతగా ప్రచారం లేకపోయినా హిట్టు కొట్టవచ్చునని ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవురా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఎవరు, మల్లేశం వంటి సినిమాలు నిరూపించాయి. మొత్తానికి కళ్లుచెరిరే స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ మాత్రమే సినిమాను ప్రేక్షకులకు చేరువచేయలేదని, ప్రేక్షకుడిని రంజింపజేసే కథ, స్క్రీన్‌ప్లే, బలమైన భావోద్వేగాలు ఉంటే తప్ప బొమ్మ హిట్టు కావడం అంత ఈజీ కాదని 2019 బాక్సాఫీస్ హిస్టరీ చాటుతోంది. మూస సినిమాలకు కాలం చెల్లిపోయిందని, రొటీన్ ఫార్మూలాలతో తెరకెక్కించే మసాలా సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దొరకడం కష్టమేనని తాజా పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, పెరిగిన మార్కెట్ అంచనాలకు దీటుగా.. మారిన ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని.. ఫ్రెష్ కంటెంట్‌నూ, క్రియేటివ్ కథలను అన్వేషించి తెరకెక్కించాల్సిన అవసరముందని టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమర్షియల్ సినిమా పేరిట ఇన్నాళ్లు అవలంబించిన రోటిన్, మూస ఫార్ములా చిత్రాలను పక్కనబెట్టి.. ఒరిజినాలిటీ ఉన్న కథలను, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో వినూత్నంగా తెరకెక్కిస్తే ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడం ఈజీ అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి రాబోతున్న టాలీవుడ్ పందెకోళ్లు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. సరికొత్త కథాకథనాలతో కొత్త సంవత్సరంలో రాబోయే సినిమాలు ప్రేక్షకులను ఆదరిస్తాయని, నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయని ఆశిద్దాం. - శ్రీకాంత్ కాంటేకర్ -
‘వార్-2’: హృతిక్‌ను ప్రభాస్ ఢీకొడతాడా?
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్న నటుడు ప్రభాస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలతో ప్రభాస్ కెరీర్ ఎవరెస్ట్ శిఖరాలను అందుకుంది. ‘బాహుబలి’ సినిమాల అనంతరం ఇటీవల ప్రభాస్.. ‘సాహో’ తో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ డివైడ్ టాక్ వచ్చింది. విమర్శకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయినా దేశవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల పరంగా పర్వాలేదనిపించింది. హిందీలో సుమారు రూ. 150 కోట్లు వసూలుచేసి.. ‘సాహో’ హిట్ అనిపించికుంది. మొత్తానికి ‘సాహో’ ప్రభాస్‌ను, ఆయన ఫ్యాన్స్ నిరాశపరిచినా.. ప్యాన్ ఇండియా స్టార్‌గా డార్లింగ్ స్టామినా ఏంటో చాటింది. ఈ క్రమంలో తన స్టార్‌డమ్‌ను కాపాడుకుంటూ.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా భారీ సినిమాలు తీసేందుకు ప్రభాస్ ఈ సమయాతమవుతున్నాడు. డార్లింగ్‌గా ఫ్యాన్స్ హృదయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్రభాస్ బుధవారం 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. చెన్నైలో సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్‌కు పెద్దనాన్న. ప్రభాస్ దేశవ్యాప్తంగా టాప్ స్టార్‌గా వెలుగొందుతున్నాడంటే అందుకు కారణం రాజమౌళి తీసిన బాహుబలి, బాహుబలి-2 సినిమాలు. బాహుబలి-2 సినిమా వసూళ్లపరంగా దేశంలోని అన్ని రికార్డులను చెరిపేసింది. మొదటి పదిరోజుల్లోనే ఈ సినిమా దేశంలో వెయ్యికోట్లు వసూలు చేసింది. అంతేకాదు ఇండియాలో రూ. 1500 కోట్ల మైలురాయి చేరిన తొలి సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. మరో సరదా అంశం ఏమిటింటే.. ప్రభాస్ గత మూడు చిత్రాల (బాహుబలి, బాహుబలి-2, సాహో)కు అయిన బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్డే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్‌కు రీచ్ అయ్యేలా ప్రభాస్ భారీ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. 2017లో జీక్యూ మ్యాగజీన్ ప్రచురించిన అత్యంత ప్రభావవంతమైన యువత జాబితాలో ప్రభాస్ ఆరోస్థానంలో నిలిచాడు. బాహుబలి-2 సక్సెస్ దేశవ్యాప్తంగా యువతలో ప్రభాస్‌కు మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. ప్రభాస్‌కు 40 ఏళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఓ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. అదే ఆయన పెళ్లి. ప్రభాస్ ఎప్పుడు మ్యారెజ్ చేసుకుంటారు. ఈ ప్రశ్న ఆయనకు నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. గతంలో తన కో-స్టార్ అనుష్కను ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని వదంతులు వచ్చాయి. ఈ ఇద్దరు ‘మిర్చి’ సినిమా చేసినప్పటి నుంచి ఈ వదంతులు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తన పెళ్లి వదంతుల గురించి స్పందించిన ప్రభాస్.. తాను, అనుష్క మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. కనీసం నువ్వు అయినా పెళ్లి చేసుకో.. ఈ వదంతులు అగుతాయని అనుష్కను అడిగినట్టు ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానించారు. దక్షిణాది సినీ స్టార్స్‌లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం ప్రభాస్‌కి దక్కింది. బ్యాంకాక్‌లోని ప్రపంచ ప్రఖ్యాత మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఆయన మైనపు బొమ్మ కొలువదీరింది. బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి పాత్ర రూపంలో ఆయన మ్యూజియంలో దర్శనమిస్తున్నారు. ప్రభాస్ బాగా నచ్చిన సినిమా తన పెద్దనాన్న కృష్ణంరాజు నటించిన 'భక్తకన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సినిమాలు అన్నా పడిచస్తాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రి ఇడియట్స్ సినిమాలను 20సార్లకుపైగా చూశాడట. ఇక హాలీవుడ్ విషయానికొస్తే రాబర్ట్ డీనీరో నటన అంటే ఇష్టం. ప్రభాస్‌కు వాలీబాల్ అంటే ఇష్టం. బాహుబలి సినిమా కోసం మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి ప్రత్యేకంగా దేహాదారుఢ్యంపై ప్రభాస్‌కు శిక్షణ ఇచ్చారు. కండలు తిరిగిన దేహసౌష్ఠవం కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా రూ. 1.5 కోట్లు విలువచేసే జిమ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. చాలామంది నటులు వరుసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతుండగా ప్రభాస్ మాత్రం ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. 'బాహుబలి' సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సాహో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ప్రస్తుతం 'జిల్' దర్శకుడు కె.కె. రాధాకృష్ణ డైరెక్షన్లో మరో భారీ సినిమాలో నటించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో తెరకెక్కనున్న త్రిభాషా చిత్రానికి ‘జాను’ టైటిల్ ప్రచారంలో ఉంది. హృతిక్‌ను ఢీకొంటాడా? హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ ‘వార్’ ఈ ఏడాది సంచలన విజయాన్ని అందుకుంది. రూ. 300 కోట్లు వసూలు చేసి.. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ ఉంది. ఈ సినిమా సీక్వెల్లో హృతిక్ పాత్ర యథాతథంగా కొనసాగనుండగా.. టైగర్ ష్రాఫ్ పాత్రను మాత్రం మరొకరు చేయాల్సి ఉంది. ఈ పాత్ర కోసం పలువురు హీరోల పేర్లు తెరపైకి వస్తుండగా.. ప్రభాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హం. బాలీవుడ్ మీడియా వర్గాలు కూడా ప్రభాస్ పేరును ‘వార్-2’కు ప్రముఖంగా సూచిస్తున్నాయి. ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్డమ్ ఉండటం.. దక్షిణాదిలో తిరుగులేని క్రేజ్ ఉండటంతో ‘వార్-2’లో హృతిక్, ప్రభాస్ కలిసి నటిస్తే.. దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ తథ్యమని సినీ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. -
‘సాహో’కు తప్పని కష్టాలు
సాక్షి, హైదరాబాద్: బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన ‘సాహో’కు కష్టాలు కొనసాగుతున్నాయి. తమను మోసం చేశారంటూ సాహో చిత్ర నిర్మాతలపై అవుట్ షైనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం సాహో సినిమాలో హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధ కపూర్ తమ కంపెనీకి చెందిన బ్యాగ్ వాడలేదని కంపెనీ మార్కెటింగ్ హెడ్ బి.విజయరావు గురువారం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకట్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సినీ నిర్మాతలు వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి, హిమాక్ దువ్వూరు తమ కంపెనీకి చెందిన అర్కిటిక్ ఫాక్స్ లగేజ్ బ్యాగ్‌ను సాహో సినిమాలో హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధ కపూర్ వాడేలా ఒప్పందం చేసుకున్నారన్నారు. ఇందుకు గాను రూ.37లక్షలు చెల్లించామని, మరో కోటి రూపాయలు ఖర్చు అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఒప్పందం ప్రకారం బ్యాగ్‌ను వాడకుండా మోసం చేశారని ఫిర్యాదు పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారుల సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా ప్లాప్ కావడంతో అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆగస్టు 30న విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 19 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సాహో సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. (చదవండి: అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!) -
అమెజాన్ ప్రైమ్‌లో సాహో మూవీ!
బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా అదేస్థాయి అంచనాలతో తెరకెక్కిన భారీ సినిమా సాహో.. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయినా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. దక్షిణాదిలో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘సాహో’ హిందీలో మాత్రం అదిరిపోయే కలెక్షన్లతో ‘సాహో’ అనిపించింది. త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఈ నెల 19 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సాహో సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. రూ.42 కోట్ల భారీ ధరతో ‘సాహో’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇక, ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఉండనుందని సమాచారం. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సాహో సినిమాను తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, చంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిశోర్, మందిర బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
రొమాంటిక్‌గా సాహో భామ నిశ్చితార్థం
సాహోలో తన నటనతో ఆకట్టుకున్న జర్మన్ బ్యూటీ ఎవెలిన్ శర్మ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్ సర్జన్ తుషన్ బైనాండితో తన ఎంగేజ్మెంట్ జరిగినట్టు ఎవెలిన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సిడ్నీలోని ప్రముఖ హార్బర్ బ్రిడ్జి బ్యాక్‌డ్రాప్‌లో తుషన్‌తో రోమాంటిక్‌గా దిగిన ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. కాగా ఎవెలిన్ గత కొంతకాలంగా తుషన్‌తో డేటింగ్లో ఉన్నారు. ఎవెలిన్ తన ఎంగేజ్మెంట్ అయిందని ప్రకటించగానే అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో తనను విష్ చేసిన వారందరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. జర్మనీలో పుట్టి, పెరిగిన ఎవెలిన్ ‘ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్’ అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ‘సాహో’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఎవెలిన్.. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. -
ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా..!
సాహో సినిమాతో మరోసారి సత్తా చాటిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నెక్ట్స్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 20 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 1950ల కాలంలో ఇటలీలో జరిగే ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు విలన్ పాత్రలో నటించనున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో జగపతి బాబు పాత్రలో చాలా విభిన్నంగా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. -
సాహో సీఐ దిలీప్
కృష్ణరాజపురం: ఖాకీ చొక్కా వెనుక కరుకైన హృదయమే కాదు కారుణ్యం కూ డా ఉంటుందని అ డుగోడి సీఐ దిలీప్ నిరూపించారు. ఉత్తర కర్ణాటకకు చెందిన సురేశ్ అనే యువకుడు ఇటీవల విడుదలైన సాహో చిత్రాన్ని చూడడానికి ఓ థియేటర్‌కు వెళ్లాడు. అయితే టికెట్ లేకుండా థియేటర్ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా అడ్డుకున్న సిబ్బంది సురేశ్‌ను అడుగోడి పోలీసులకు అప్పగించారు. దీంతో సీఐ దిలీప్ సురేశ్‌ను వివరాలు అడగ్గా కుటుంబ పోషణ కోసం బెంగళూరుకు వచ్చానని, అయితే ఎక్కడా పని లభించకపోవడంతో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నానని వివరించాడు. తెలుగు హీరో ప్రభాస్‌కు అభిమానని అందుకే సాహో సినిమా చూడడానికి థియేటర్లోకి వెళ్లడానికి ప్రయత్నించానని తెలిపాడు. సురేశ్ పరిస్థితి తెలుసుకున్న సీఐ దిలీప్ అదే స్టేషన్లో హౌస్ కీపింగ్‌తో పాటు ఓ హోటల్లో కూడా పని ఇప్పించి గొప్ప మనసు చాటుకున్నారు. దీంతో సీఐ దిలీప్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
‘సాహో’ రిలీజ్ తరువాత తొలిసారి మీడియాతో ప్రభాస్
బాహుబలి తరువాత అదే స్థాయి అంచనాలతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా సాహో. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటింది. అయితే సినిమా రిలీజ్‌కు ముందు వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రభాస్ రిలీజ్ తరువాత మాత్రం మీడియాకు దూరంగా ఉంటున్నారు. సాహో రిలీజ్ అయిన రెండు వారాల తరువాత ప్రభాస్ మీడియా ముందుకు వచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో హిందీ సినిమాల పట్ల పక్షపాత ధోరణిపై ప్రభాస్ స్పందించాడు. ఇతర భాషల సినిమాలను బాలీవుడ్ జనాలు పెద్దగా ఆదరించరన్నా విషయాన్ని అంగీకరిస్తూనే, ఇలాంటి పరిస్థితులు అన్ని రంగాల్లో ఉన్నాయన్నాడు. ‘ప్రతి భాషలో అక్కడి ప్రాంతీయ నటులు ఉంటారు. వారు 20, 30 సంవత్సరాలుగా వారికి తెలుసు. అందుకే కొత్తగా వచ్చిన వారిని త్వరగా యాక్సెప్ట్ చేయలేరు. కానీ సినిమా బాగుంటే ఇవ్వని పక్కన పెట్టి ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. లేదంటే కొత్త నటుడికి, దర్శకుడికి అసలు అవకాశమే రాదు. బాహుబలి గతంలో ఉన్న ఎన్నో హద్దులను చెరిపేసి జాతీయ స్థాయి సినిమాలకు అవకాశం కల్పించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి’ అన్నారు. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన సాహో ఇప్పటికే 425 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరిన్ని రికార్డ్ల దిశగా దూసుకుపోతోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, చంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిశోర్, మందిర బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
మరో మైల్స్టోన్ దాటిన ‘సాహో’
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. ఆగస్టు 30 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సరికొత్త రికార్డ్లను సృష్టిస్తోంది. తొలి రోజే 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సాహో పది రోజుల్లో 400 కోట్ల మార్క్‌ను అందుకుంది. ఇప్పటికీ సాహో కలెక్షన్లు స్టడీగా ఉండటంతో ముందు ముందుకు మరిన్ని రికార్డ్‌లు సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. చిత్రయూనిట్ కూడా సినిమాను వార్తల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సాహో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అంతేకాదు ప్రభాస్ అభిమానులతో కలిసి సాహో సినిమా చూడటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లతో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. Boom💣 & BAM💥 All that ACTION behind the reality of #Saaho #SaahoMaking #WorldofSaaho ➡➡ https://t.co/FXN5LjWFX2 — UV Creations (@UV_Creations) September 9, 2019 -
అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!
‘‘దెబ్బలు ఎక్కడ పడ్డాయో తెలుసు, బెటర్ చేసుకుంటా. ఓ పది రోజులు బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నా, అది ఎవరో పెట్టిన రచ్చకు మనం ఆలోచిస్తున్నట్టు ఉంటుంది. ఫ్రెష్‌గా మొదలుపెడతాను’’ అన్నారు సుజీత్. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘సాహో’ ఆగస్ట్ 30న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు సుజీత్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు. ► ‘సాహో’ సినిమాకు వస్తున్న స్పందన ఎలా ఉంది? ప్రస్తుతం బెటర్‌గా ఉంది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్లు బావున్నందుకు హ్యాపీ. రివ్యూలు కఠినంగా ఉన్నాయనిపించింది. మరీ అంత సెన్సిబులిటీస్ లేకుండా తీయను కదా? షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను. నా జర్నీ వేరే వాళ్లకు ఆశ కలిగించాలి. నా టీమ్ నన్ను బాగా సపోర్ట్ చేసింది. ప్రభాస్ అన్న, నిర్మాతలు రివ్యూలకు కంగారు పడొద్దని ధైర్యం ఇచ్చారు. రివ్యూ రాసేవాళ్లు సినిమాను సినిమాలా చూడకుండా కొంచెం పర్సనల్ అయినట్టు అనిపించింది. బహుశా వాళ్లు ‘బాహుబలి 3’లా ఉంటుందని ఊహించుకొని ఉండొచ్చు. వాళ్లు ఊహించినట్టు సినిమా లేకుండా ఉండి ఉండొచ్చు. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్ష్ బాలేదు అన్నట్టు రాశారు. రెండు రోజుల తర్వాత ‘ఎక్కువగా ఊహించుకొని వెళ్లడం వల్ల ఎంజాయ్ చేయలేదేమో’ అన్నారు. అయితే నాకు కోపం ఏమీ లేదు. హిందీ వాళ్లు ఏ ఉద్దేశంతో తక్కువ రేటింగ్ ఇచ్చారో? మన వాళ్లు కూడా అలానే రాశారు కదా (నవ్వుతూ). అది ఆడియన్స్‌ను సినిమాకు వెళ్లకుండా ఆపేస్తుంది. రివ్యూలను ఒకటీ రెండు రోజులు ఆపితే బావుండు అనిపిస్తుంది. రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్నారు. కొంచెం బాధ అనిపించింది. ► ‘బాహుబలి’తో ప్రభాస్‌కి వచ్చిన స్టార్డమ్ వల్ల స్క్రిప్ట్‌లో ఏదైనా మార్పులు చేశారా? ఏ మార్పులూ చేయలేదు. అయితే యాక్షన్‌లో చేశాం. దాని వల్ల యాక్షన్ పెద్దగా అనిపించి కథ లేదనిపించిందేమో? సినిమాలో కథ ఉంది. కథ లేదంటే నేను ఒప్పుకోను. ఒకటి ఎక్కువ డామినేట్ చేస్తే మిగతావి చిన్నగా అనిపిస్తాయి. ఉదాహరణకు సినిమాలో పాటల్లాగా. ఒక పాట బావుంటే మిగతావి కిల్ అయిపోతుంటాయి. ► 300 కోట్ల సినిమాను డీల్ చేయడం ఎలా అనిపిం చింది? 350 కోట్లతో సినిమా చేయాలనే లక్ష్యంతో చేయలేదు. అలానే అనుకుంటే ఆ రోజే చేసేవాళ్లం కాదేమో? రాజమౌళి గారు ‘బాహుబలి’ని ఒక్క సినిమాలా చేయాలనుకున్నారు. మొదలుపెట్టాక రెండు భాగాలు అయింది. ఎవ్వరైనా సరే పనిలో దిగిన తర్వాతే పెరిగే చాన్స్ ఉంటుంది. సినిమా సినిమాకు విధానం మారిపోతుంది. కథకు ఏం కావాలో అది చేస్తుంటాం. బడ్జెట్ ఎంతైనా సరే అది స్క్రీన్ మీద కనబడాలనుకున్నాం. ► ‘అనుభవం లేని కుర్రాడితో’ సినిమా ఏంటి? అనే కామెంట్స్ వినిపించాయి... అవి నా వరకూ రాలేదు. నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరు. పనైపోగానే ఇంటికి వెళ్లిపోతాను. మళ్లీ ఆఫీస్‌కి వచ్చి పని చేసుకోవడమే. ఆ మధ్య ఫిల్మ్ చాంబర్‌కు వెళ్ళినప్పుడు ‘సాహో చాలా పెద్ద సినిమా’ అని మాట్లాడుతుంటే కొంచెం భయమేసింది. రియాలిటీ నిజంగా భయపెడుతుంది. కొన్నిసార్లు మనం అనుకున్నది సాధించాలంటే వాస్తవికతకు దూరంగా ఉండి ప్యాషన్‌తో పని చేస్తుండాలి. ఫీల్డ్‌లో దిగిన తర్వాత ఆలోచనలు ఉండకూడదు. ► బడ్జెట్ పెరిగిపోతున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? భయం కంటే బాధ్యత ఎక్కువ. బడ్జెట్ ఇలా పెరిగింది.. అలా పెరిగింది అని చెబితే వేరేవాళ్లను నిందించినట్టు ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. సినిమా చేయడం కూడా పెళ్లి లాంటిదే. అక్కడ ఆ పూలు ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. కొంచెం ఖర్చయినా తెప్పిస్తాం. చూసే వాళ్లందరికీ నచ్చాలి అన్నట్టు చేస్తాం. పెళ్లి వల్ల ఏం వస్తుంది? అయిపోయిన తర్వాత అందరూ వెళ్లిపోతారు. కానీ మన బెస్ట్ ఇవ్వాలనుకుంటాం. రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ప్యాషన్‌తో చేశాం. డబ్బులు వృథాగా ఖర్చు చేశారనేవాళ్లు అంటూనే ఉంటారు. ► ప్రభాస్ ప్యాన్ ఇండియా సూపర్‌స్టార్ అయ్యారు. ఆయన స్టార్డమ్ కోసం అయినా ‘సాహో’ హిట్ అవాల్సిన పరిస్థతి. అదేమైనా ఒత్తిడిగా? కచ్చితంగా అనిపించింది. ప్రభాస్‌గారి పేరు పెంచకపోయినా ఫర్వాలేదు కానీ తగ్గించకూడదు అనుకున్నాం. ఈ రివ్యూలతోనూ నార్త్‌లో కలెక్షన్స్ చూస్తుంటే ప్రభాస్‌ని నార్త్‌లో ఎంత ప్రేమిస్తున్నారో అర్థం అవుతోంది. ► ‘మళ్లీ ఒక్కసారి చూడండి. నచ్చుతుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు..? ఎమోషనల్‌గా కాకుండా ఫైర్ అయిపోదాం అన్నట్టు పోస్ట్ చేయాలనుకున్నాను. మళ్లీ ఆగిపోయాను. ‘రెండోసారి చూశాక బాగా నచ్చింది’ అంటూ చాలా మెసేజ్‌లు వచ్చాయి. రెండో సారి చూస్తే అర్థం చేసుకుంటున్నారు అనిపించింది. రెండోసారి చూసి కలెక్షన్లు పెంచేయండి అనే ఉద్దేశంతో అనలేదు. అర్థం కాలేదు అనడం వేరు. అర్థం లేదు అనడం వేరు. అర్థం లేకుండా సన్నివేశాలు రాయలేదు.. తీయలేదు. దేశం మొత్తంగా అందర్నీ మెప్పించే సినిమా తీయడం చాలా కష్టం. ఈ సినిమా ద్వారా పెద్ద స్టార్స్‌తో తీస్తున్నప్పుడు ప్రతీ విషయాన్ని ఒలిచి చెప్పాలని నేర్చుకున్నా. ఇంటెలిజెన్స్‌ని కొంచెం తగ్గించుకొని సినిమాలు చేయాలి. ► మీ కెరీర్‌కు ‘సాహో’ ప్లస్సా? మైనస్ అంటారా? దర్శకుడిగా ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. ఒక్క సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నాను. కొత్త టెక్నాలజీలు తెలుసుకున్నాను. నేను ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉన్నాను. ఆడియన్స్ చెప్పిన దాన్ని కచ్చితంగా గౌరవిస్తాను. ► ఒక అవకాశం వస్తే ‘సాహో’లో ఏదైనా మారుస్తారా? లేదు. రిలీజ్ అయిన తర్వాత సినిమా మన చేతుల్లో నుంచి ప్రేక్షకులకు వెళ్లిపోయినట్టే. కట్ చేసినా, ట్రిమ్ చేసినా మనం సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్టే అవుతుంది. ► ‘సాహో’ కథ హాలీవుడ్ సినిమా ‘లార్గో వించ్’ పాయింట్ నుంచి తీసుకున్నారనే కామెంట్స్ గురించి? ఇలా కామెంట్ చేసే వాళ్లలో సగం మంది ‘లార్గో వించ్’ సినిమా చూసి ఉండరు. చూసే సినిమా కూడా కాదది. ‘ప్రపంచానికి తెలియకుండా కొడుకుని ఓ తండ్రి దాచిపెట్టడం అనే కాన్సెప్ట్‌తో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి’. ఆ సినిమా స్క్రీన్‌ప్లే వేరు. నా సినిమా స్క్రీన్‌ప్లే వేరు. వాళ్లకు నెక్ట్స్ సినిమా రిలీజ్ వరకూ ఫీడింగ్ కావాలి. ప్రస్తుతానికి మేమే ఉన్నాం. ఈ కాంట్రవర్శీ ఇంకా జనాల్లో ఉండాలి. అందుకే రాస్తుంటారు. ఓ పెద్ద హిట్ సినిమా నుంచి ప్రేరణ పొందాం అని చెప్పినా సంతోషపడొచ్చు. ► ఇదంతా మీ మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా? ఇది రియాలిటీ. ఈ వారం నేను, నెక్ట్స్ వారం మరొకరు. జనం మారుతుంటారు. కథ మాత్రం ఇలానే జరుగుతుంటుంది. ఆ కాంట్రవర్శీలు ఇక్కడితో ఆగిపోవాలా, ఇంకా నడుస్తుండాలా అన్నది నా చేతుల్లో ఉంది. దాని గురించి మాట్లాడి ఇంకో నాలుగు రోజులు ఫీడింగ్ ఇవ్వదలచుకోలేదు. -
‘సాహో’ వరల్డ్ రికార్డ్!
ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సాహో. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే భారత్‌లో మరో నటుడికి సాధ్యం కానీ స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ప్రభాస్, సాహోతో వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి వారాంతంలో అంతర్జాతీయ స్థాయి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో సాహో రెండో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ మూవీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ : హాబ్స్ అండ్ షా’ ఒక్కటే సాహో కన్నా ముందు ఉంది. ది లయన్ కింగ్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, ఏంజల్ హ్యాస్ ఫాలెన్ లాంటి సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలు కూడా సాహో తరువాతి స్థానాలతో సరిపెట్టుకోవటం విశేషం. సెలవులు ముగియటంతో సాహో కలెక్షన్లు కాస్త స్లో అయినా ఇప్పటికీ సినిమా మంచి వసూళ్లనే సాధిస్తోంది. ఇప్పటికే 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సాహో ముందు ముందు మరిన్ని రికార్డ్ల దిశగా దూసుకుపోతోంది. -
సాహోకు తిప్పలు తప్పవా..?
బాహుబలి ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా భారీబడ్జెట్తో తెరకెక్కిన ‘సాహో’ హిందీలో రూ.100 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. సాహో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ వెర్షన్లలో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్‌లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో కలుపుకుని మూడు రోజుల్లో దాదాపు 300 కోట్ల కలెక్షన్లు సాధించింది. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా, సినీ విశ్లేషకులు నెగెటివ్‌గా రివ్యూలిచ్చినా బాక్సాఫీస్ వసూళ్లు వాటికి గట్టి సమాధానం చెప్పాయి. ఇకపోతే మూడు రోజలుగా కలెక్షన్లు కురిపిస్తున్న సాహో కాస్త నెమ్మదించినట్టు తెలుస్తోంది. సోమవారం వినాయక చవితి ఉండటంతో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా దీని ప్రభావం హిందీ వెర్షన్‌పై పడింది. హిందీలో వసూళ్లు 50 శాతానికి పైగా పడిపోయి రూ.14 కోట్లు మాత్రమే రాబట్టింది. గత నాలుగు రోజులుగా బాలీవుడ్లో పలు రికార్డులను మట్టి కరిపిస్తూ రూ.93 కోట్లు వసూళ్లు సాధించిన సాహో సెంచరీకి చేరువలో ఉంది. ఎలాగోలా సాహో హిందీలో సెంచరీ కొట్టడం ఖాయం. అయితే సాహోకు అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. సెలవులు పూర్తయ్యాయి. మరి ఇప్పుడు నిజంగా సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి చూస్తాడా లేదా అనేది తేలనుంది. ఇక అనవసర సీన్లు ఉన్నాయని, స్క్రీన్‌ప్లే సాగదీసినట్టుగా ఉందంటూ పలువురు సినిమాపై విమర్శలు ఎక్కుపెట్టారు. మూడు సంవత్సరాల తర్వాత ప్రభాస్ సాహో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుండటంతో భారీ అంచనాలతో హైప్ క్రియేట్ అయినా చివరకు ఉసూరుమనిపించిందని పెదవి విరిచారు. హాలీవుడ్ డైరెక్టర్ జేరోమ్ సల్లే తన ‘లార్గో వించ్’ సినిమాను కాపీ కొట్టి సాహోను చిత్రీకరించారని సాహో యూనిట్‌పై మండిపడ్డారు. గతంలోనూ లార్గో వించ్ చిత్ర కథా కథనాలను కాపీ చేసి అజ్ఞాతవాసి తీశారని, దీనిపై పోరాడుతానని చెప్పినా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో గమ్మునుండిపోయాడు. ఇప్పుడు సాహో కూడా కాపీ సినిమా అంటూ కామెంట్ చేస్తూ.. ‘తీస్తే తీశారు. కనీసం కాపీ కొట్టడమైనా కరెక్ట్‌గా చేయండి’ అంటూ తెలుగు దర్శకులకు సూచించారు. సాహోపై విమర్శలు రావటం ఇది మొదటిసారేం కాదు.. గతంలోనూ బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్ అనుమతి తీసుకోకుండా తన ఆర్ట్‌ను సినిమాలో సెట్ డిజైన్ వాడుకున్నారని ఆరోపించారు. పలు పోస్టర్లు కూడా హాలీవుడ్ చిత్రాల్లో నుంచి మక్కీకి మక్కీ దించారని సాహో టీం ఆరోపణలు ఎదుర్కొంది. -
కాపీ అయినా సరిగా చేయండి : ఫ్రెంచ్ డైరెక్టర్
ఇటీవల కాలంలో సినిమాల మీద కాపీ ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మన దర్శకులు ఇంగ్లీష్, ఫ్రెంచ్ సినిమాలను ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యదాతథంగా ఫ్రీమేక్ (అనుమతులు లేకుండా రీమేక్) చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా సాహో సినిమా విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఏకంగా ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సల్లే సాహోను ఉద్దేశిస్తూ తన సినిమాను మరోసారి ఫ్రీమేక్ చేవారంటూ ట్వీట్ చేశాడు. గతంలో అజ్ఞాతవాసి సినిమాను జెరోమ్ తెరకెక్కించిన లార్గో వించ్ సినిమా ఆధారంగా తెరకెక్కించారన్న ఆరోపణలు వినిపించాయి. కథతో పాటు కథనం కూడా యదాతథంగా ఉండటంతో అప్పట్లో జెరోమ్‌కు పెద్ద ఎత్తున మద్ధతు లభించింది. తాజాగా సాహో కథనం ట్రీట్మెంట్ భిన్నంగా ఉన్నా.. మూల కథ దాదాపు లార్గో వించ్‌ను పోలి ఉండటంతో మరోసారి జెరోమ్ స్పందించారు. తన సినిమాను కాపీ చేసి తెరకెక్కించిన రెండు సినిమాలకు నెగెటివ్ రావటంతో కనీసం కాపీ అయినా సరిగా చేయండి అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు జెరోమ్. అంతేకాదు ఇండియాలో తన కెరీర్ చాలా ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందన్నాడు జెరోమ్. అయితే టాక్ ఎలా ఉన్న ప్రభాస్ సాహో మాత్రం కలెక్షన్ల పరంగా సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే మూడు వందల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. -
సాహోపై కేటీఆర్ కామెంట్
బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో.. చిత్రం గతవారం విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. డివైడ్ టాక్ వచ్చినా... వసూళ్లలో మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు 300కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీని వీక్షించిన కేటీఆర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. సాహో టెక్నికల్‌గా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించాడు. ఈ సినిమాతో పాటు ‘ఎవరు’ ను వీక్షించినట్టు తెలిపాడు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమా బ్రిలియెంట్‌గా తెరకెక్కించారంటూ.. అడివి శేష్, రెజీనా, నవీన్‌చంద్ర అద్భుతంగా నటించారని ట్వీట్ చేశాడు. ఎవరు చిత్రం వసూళ్ల పరంగా దుమ్ములేపగా.. ప్రస్తుతం సాహో కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. Watched two fabulous Telugu movies today; #Saaho was technically brilliant & raised the bar for movie makers in India. Compliments to #Prabhas and #Sujeeth 👍#Evaru was brilliant for its gripping screenplay & fabulous performances by @AdiviSesh @reginacassandra @Naveenc212 👍 — KTR (@KTRTRS) September 1, 2019 -
రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..
మూడు సంవత్సరాల నిరీక్షణ అనంతరం డార్లింగ్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు సాహో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. ఇక బాహుబలి ఎంటర్ అయ్యాడంటే వార్ వన్‌సైడే అంటూ రెబల్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. పూనకం వచ్చినట్టుగా థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. ఒకవైపేమో సాహో ఆశించిన స్థాయిలో లేదని కొందరు పెదవి విరుస్తుంటే.. మరోవైపేమో ఇండియన్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిందని మరి కొందరు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదలైన ఈ చిత్రం రికార్డుల పరంగా చక్రం తిప్పుతోంది. హిందీలో రూ.25 కోట్లకు పైగా షేర్ సాధించి ఈ ఏడాది భారీ ఓపెనింగ్స్ సాధించిన మూడో చిత్రంగా సాహో నిలిచింది. అయితే సాహోతో ప్రభాస్ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా బాహుబలితో తనపేరిట ఉన్న రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయారు. విడుదలైన తొలినాడే రూ.121 కోట్లు వసూలు చేసిన బాహుబలి-2 రికార్డును ఈ సినిమా అధిగమించలేకపోయింది. తొలిరోజు సెంచరీ కొట్టిన సాహో రెండు రోజల్లోనే రూ.200 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. డివైడ్ టాక్, తక్కువ రేటింగ్ ఇవేవీ సాహో వసూళ్లపై ప్రభావాన్ని చూపించలేకపోయాయి. వరుస సెలవులు ఉండటంతో సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోని యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన సాహో మొదటి రోజు కలెక్షన్లతో పలు రికార్డులు మట్టి కొట్టుకుపోయాయి. విడుదలైన తొలిరోజే కలెక్షన్లను కొల్లగొట్టిన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాల అవెంజర్స్ ఎండ్‌గేమ్ రూ.53 కోట్లు, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ రూ.52 కోట్లు పేరిట ఉన్న రికార్డుల్ని సాహో దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయి. చదవండి: ‘సాహో’ మూవీ రివ్యూ -
ముద్దంటే ఇబ్బందే!
ప్రభాస్‌కి మొహమాటం ఎక్కువ. ‘రొమాంటిక్ సన్నివేశాలు, ముఖ్యంగా లిప్‌లాక్ సన్నివేశాలకు ఇబ్బందిపడతాను’ అంటున్నారు. ‘సాహో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయం గురించి ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘నాకు చాలా సిగ్గు ఎక్కువ. అందుకే ముద్దు సన్నివేశాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సన్నివేశాల్లో యాక్ట్ చేస్తున్నంతసేపు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది’’ అన్నారు. ‘సాహో’ సినిమాలో శ్రద్ధాతో ఓ ముద్దు సన్నివేశం ఉండగా గతంలో ‘బాహుబలి 2’లో అనుష్కతో ఓ చిన్న ముద్దు సన్నివేశంలో నటించారు ప్రభాస్. -
తొలి రోజే వంద కోట్లు.. ‘సాహో’ ప్రభాస్!
డివైడ్ టాక్‌తో మొదలైనా.. సాహో తన సత్తా చూపిస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావటంతో పాటు, ఇండియాస్ బిగెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అన్న ప్రచారం జరగటంతో సాహోపై భారీఅంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే తొలి రోజు ఈ సినిమా సత్తా చాటింది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా సాహో సినిమా భారీ వసూళ్లు సాదిస్తుండటంతో డార్లింగ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఘనత సాధించిన రెండో భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది సాహో. మొదటి స్థానంలోనూ ప్రభాస్ సినిమాయే ఉండటం విశేషం. బాహుబలి 2తో తొలి రోజే 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన రికార్డ్ నెలకొల్పిన ప్రభాస్, సాహోతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు. కేవలం హిందీలోనే 24 కోట్లకు పైగా షేర్ సాధించి ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది సాహో. మరో మూడు రోజుల పాటు సెలవులు కావటంతో వసూళ్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. భారత్‌లో సాహో మంచి వసూళ్లు సాధిస్తున్నా.. ఓవర్ సీస్లో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు అంత ఆశాజనకంగా లేవు. -
‘సాహో’ టాక్.. ఆ సెంటిమెంట్లే కారణమా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో. యూవీ క్రియేషన్స్ సంస్థ సుజీత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి డివైడ్ టాక్ రావటంపై అభిమానులు రకరకాల కారణాలు చెపుతున్నారు. (మూవీ రివ్యూ : ‘సాహో’) రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలకు తదుపరి చిత్రాలు పెద్దగా కలిసి రావన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాల్లో నటించాడు తారక్, అయితే ఆ సినిమాల తరువాత ఎన్టీఆర్‌కు వరుసగా సుబ్బు, ఆంద్రావాలా, కంత్రీ లాంటి భారీ డిజాస్టర్లు వచ్చాయి. మగధీర లాంటి భారీ హిట్ తరువాత రామ్‌చరణ్‌కు కూడా ఆరెంజ్ లాంటి డిజాస్టర్ ఎదురైంది. విక్రమార్కుడు సినిమా తరువాత రవితేజ కూడా ఖతర్నాక్ సినిమాతో నిరాశపరిచాడు. గతంలో రాజమౌళితో కలిసి ఛత్రపతి సినిమా చేసిన ప్రభాస్‌కు తరువాత పౌర్ణమి సినిమాతో షాక్ తగిలింది. ఇప్పుడు మరోసారి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తరువాత చేసిన సాహోకు కూడా నెగెటివ్ వస్తుండటంతో ఆ వాదనకు మరింత బలం చేకూరినట్టైంది. సాహో ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి, ప్రభాస్ అంతేకాదు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తెలుగులో నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. అస్త్రం, శక్తి, పంజా లాంటి తెలుగు సినిమాల్లో నటించాడు జాకీ. ఆ సినిమాలన్నీ ఫ్లాప్ కావటంతో ఈ నటుడిపై ఐరన్ లెగ్ ముద్ర వేశారు. పంజా తరువాత తెలుగు సినిమాల్లో నటించని జాకీని సాహో కోసం తీసుకొచ్చారు చిత్రయూనిట్. జాకీ ష్రాఫ్ (ఫైల్ ఫోటో) దీంతో సినిమాకు నెగెటివ్ టాక్ రావటానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు టాలీవుడ్లో దర్శకులకు ద్వితీయ విఘ్నం అనే సెంటిమెంట్ కూడా ఉంది. దాదాపు టాలీవుడ్ దర్శకులంతా రెండో సినిమాతో నిరాశపరిచారు. అందుకే సుజీత్ విషయంలోనూ అదే సెంటిమెంట్ నిజమౌతుంది అన్న ప్రచారం జరుగుతోంది. -
ఫేమస్ అవ్వటానికి ఇలా చేస్తావా..? : హీరో
బాలీవుడ్లో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకపోయినా హీరోగా క్యారెక్టర్, ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఆకట్టుకున్న నటుడు నీల్ నితిన్ ముఖేష్. ఇటీవల సౌత్ సినిమాలతోనూ అలరిస్తున్న ఈ నటుడు తాజాగా సాహో సినిమాతో మరోసారి మెప్పించాడు. అయితే సాహో రిలీజ్ తరువాత అంకూర్ పాటక్ అనే వ్యక్తి నీల్‌ను ఉద్దేశిస్తూ అభ్యంతరకర ట్వీట్ చేశాడు. ‘ఇది 2019, ఇంకా సినిమాలో నటిస్తున్నందుకు నిర్మాతలు నీల్ నితిన్ ముఖేష్‌కు డబ్బు ఎందుకు ఇస్తున్నారు? నాకు సమాధానం కావాలి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన నీల్.. ‘మీరు ఎవరో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. కానీ మీరు ఫేమస్ కావడానికి ఇది సరైన పద్ధతేనా..? మీకో విషయం చెప్పాలి. నేను గాడ్ ఫాదర్ లేకుండా 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటికీ కొనసాగుతున్నాను’ అంటూ రిప్లై ఇచ్చారు. నీల్ స్పందనపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రోల్స్‌కు సరైన సమాధానమిచ్చారంటూ నీల్‌ను అభినందిస్తున్నారు. Waise Pathak ji. Aap kaun hai pata nahi aur Janna bhi nahi chahta. But Is this the best way YOU seek attention haha. Let me tell you one thing. I’ve survived for 12 years without Godfathers and I will keep surviving. https://t.co/gVPgYuLeIb — Neil Nitin Mukesh (@NeilNMukesh) August 30, 2019 -
ఓవర్సీస్లో దుమ్మురేపిన సాహో
ప్రభాస్ నటించిన సాహో.. కలెక్షన్లపరంగా దుమ్మురేపుతోంది. బాహుబలి సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. రెండేళ్ల గ్యాప్ తరువాత సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ చిత్రం కావడం.. హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కించడంతో సాహోపై అంచనాలు ఆకాశన్నంటాయి. ఈ రోజు విడుదలైన సాహోతో.. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. (‘సాహో’ మూవీ రివ్యూ) అయితే ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను సంతృప్తి పరిచేలా ఉందంటూనే.. కొంత డివైడ్ టాక్‌ను మూటగట్టుకుంది. అయినా.. వసూళ్లపరంగా రికార్డులను క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రం దాదాపు 60-70 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు. ఓవర్సీస్లోనూ ఈ చిత్రం సత్తా చాటుతోంది. ఒక్కరోజులోనే మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసి ఔరా అనిపించింది. ఈ మేరకు యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మరి మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. యూవీ క్రియేషన్స్‌పై సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. -
‘సాహో’ మూవీ రివ్యూ
-
సాహో ఫస్ట్ డే కలెక్షన్స్!
బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడం, భారీ బడ్జెట్ చిత్రంగా మునుపెన్నడూ చూడని యాక్షన్ ఎపిసోడ్‌తో సాహో రిలీజ్ అవ్వడంతో రికార్డులు బద్దలు అవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో.. మొదటి రోజే వసూళ్లలో ప్రభంజనం సృష్టిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. (‘సాహో’ మూవీ రివ్యూ) జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడటంతో.. అవేంజర్ ఎండ్‌గేమ్(53కోటు), థగ్స్ ఆఫ్ హిందూస్తాన్(52.25) రికార్డులను క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు కాస్త నెగెటివ్ టాక్ కూడా రావడంతో సినిమా వసూళ్లపై ప్రభావం చూపేలా ఉందని అంటున్నారు. కానీ ఫస్ట్ డే కలెక్షన్లలో మాత్రం రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది. ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి దాదాపు 60-70కోట్లు కలెక్ట్ చేయవచ్చని తెలుస్తోంది. తెలుగులో 35, హిందీలో 15-20, తమిళంలో 15కోట్లు మలయాళంలో 5కోట్ల వరకు వసూళ్లను సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటించింది. యూవీ క్రియేషన్స్‌పై నిర్మించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించాడు. -
ఆన్లైన్లో ‘సాహో’ సినిమా ప్రత్యక్షం!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో సినిమాకు పైరసీ తప్పలేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కొద్దిసేపటికే ఈ సినిమా పైరసీ వీడియోను ఆన్లైన్లో పెట్టేశారు. థియేటర్లలో ప్రీమియర్ షో ముగిసిన తర్వాత పైరసీ వెబ్సైట్లలో సినిమా ప్రత్యక్షమైంది. తమిల్ రాకర్స్, పైరేట్ బే వంటి పలు వెబ్సైట్లలో ఈ సినిమా పైరసీ వీడియో పెట్టినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాను పైరసీ చేయడం పట్ల చిత్రయూనిట్ ఆందోళన చెందుతోంది. మిషన్ మంగళ్, బాట్లాహౌస్, సేక్రేడ్ గేమ్స్-2 కూడా ఆన్‌లైన్‌లోకి లీక్ చేశారు. తమిళ స్టార్ అజిత్ నటించిన తాజా చిత్రం ‘నేర్కొండ పార్వై’ను విడుదలకు ముందే పైరసీ చేశారు. సింగపూర్‌లో ప్రీమియర్ షో తర్వాత ఈ సినిమా పైరసీ వెబ్సైట్లలోకి వచ్చేసింది. కాగా, భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఆరంభ వసూళ్లు భారీగానే ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (చదవండి: ‘సాహో’ మూవీ రివ్యూ) -
నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్ చరణ్
సాక్షి, సూళ్లూరుపేట(నెల్లూరు): సాహో, సైరా ట్రైలర్లు అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి సినిమాలను భారీ స్క్రీన్లపై చూస్తే మరపురాని అనుభూతి కలుగుతుందని మెగా హీరో రామ్‌చరణ్ పేర్కొన్నారు. యూవీ ఆర్ట్ క్రియేషన్స్ అధినేతలు నిర్మించిన వీ సెల్యులాయిడ్ గ్రూప్ మల్టీఫ్లెక్స్ థియేటర్లను గురువారం ప్రారంభించారు. దక్షిణాసియా, ఇండియాలో తొలిసారిగా భారీ స్క్రీన్‌ను ఈ థియేటర్లలో ఏర్పాటు చేశారు. ప్రారంభం సందర్భంగా సాహో, సైరా ట్రైలర్లను ప్రదర్శించారు. వెంకటగిరి, సర్వేపల్లి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు.అనంతరం రామ్‌చరణ్ రెండు సినిమాల ట్రైలర్లను వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్‌లో విడుదల కానున్న సైరా సరసింహారెడ్డి సినిమాకు మెగాస్టార్ చిరంజీవిని ఇక్కడికి తీసుకొస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు. వీ సెల్యులాయిడ్ గ్రూప్ థియేటర్లను సాంకేతిక విలువలతో నిర్మించడం విశేషమన్నారు. ఇలాంటి సాంకేతిక విలువలు కలిగిన స్క్రీన్ అన్నా, ఇలాంటి వాటిని ప్రోత్సహించే విషయంలో ఎప్పుడూ ముందుండే గుణం చిరంజీవిలో ఎక్కువగా ఉందని, ఈ క్రమంలో తాను, ఎన్వీ ప్రసాద్ ఆయన్ను ఇక్కడికి తీసుకొస్తామని తెలిపారు. సాహో సినిమాను డైరెక్టర్ సుజిత్ ఎంతో సాంకేతిక విలువలతో తీశారని, ఈ సినిమాలో హీరో ప్రభాస్‌ను ఎంతో స్టయిలిష్‌గా చూపించారని తెలిపారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌తో సాహో సినిమాను అత్యంత భారీ సాంకేతిక విలువలతో తీసి ఉంటారని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోందని పేర్కొన్నారు. అతి పెద్ద భారీస్క్రీన్ కలిగిన వీ సెల్యులాయిడ్ గ్రూప్ థియేటర్లను నిర్మించిన యూవీ ఆర్ట్ క్రియేషన్స్ అధినేతలు వేమారెడ్డి వంశీకృష్ణారెడ్డి, వేమారెడ్డి విక్రమ్ శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు. -
‘సాహో’ మూవీ రివ్యూ
టైటిల్ : సాహో జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండే, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్ సంగీతం : తనిష్క్ బగ్చీ, గురు రాంద్వా, బాద్షా నేపథ్య సంగీతం : జిబ్రాన్ నిర్మాత : వంశీ, ప్రమోద్ దర్శకత్వం : సుజీత్ బాహుబలి తరువాత అదే స్థాయి హైప్ తీసుకువచ్చిన సినిమా సాహో. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు, లొకేషన్లు ఆడియన్స్‌ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లటం ఖాయం అని చిత్ర యూనిట్ నమ్మకంగా చెప్పింది. మరి ప్రభాస్.. బాహుబలి తరువాత మరోసారి సాహో అనిపించాడా..? ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న సుజీత్ ఇంతటి భారీ చిత్రాన్ని ఎలా డీల్ చేశాడు..? మరోసారి సౌత్ సినిమా జాతీయ స్థాయిలో సత్తా చాటిందా.? కథ : వాజీ అనే సిటీ కేంద్రంగా గ్యాంగ్ స్టర్స్ తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. రాయ్ (జాకీ ష్రాఫ్) ఓ గ్రూప్‌ను ఫాం చేసి సిండికేట్ నడిపిస్తుంటాడు. ఆ క్రైమ్ వరల్డ్‌కు కింగ్ కావాలనుకున్న దేవరాజ్ (చంకీ పాండే), రాయ్ మీద పగ పెంచుకుంటాడు. ఓ పని మీద ముంబై వచ్చిన రాయ్ ప్రమాదంలో చనిపోతాడు. ఇదే అదునుగా భావించిన దేవరాజ్ క్రైమ్ వరల్డ్‌ను తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాడు. కానీ అదే సమయంలో రాయ్ కొడుకు విశ్వక్ క్రైమ్ వరల్డ్‌లోకి అడుగుపెడతాడు. మరోవైపు ముంబైలో ఓ భారీ చోరీ జరుగుతుంది. రెండు వేల కోట్లకు సంబంధించిన ఈ కేసును దర్యాప్తు చేయడానికి అండర్ కవర్ కాప్‌గా అశోక్ చక్రవర్తి (ప్రభాస్) ఎంట్రీ ఇస్తాడు. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అమృతా నాయర్ (శ్రద్ధా కపూర్) తో కలిసి కేసు విచారణ మొదలు పెడతాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. చివరకు అశోక్ ఆ కేసును సాల్వ్ చేశాడా..? అసలు క్రైమ్ సిండికేట్‌ను నడిపే రాయ్ ఎలా చనిపోయాడు? అశోక్, అమృత ప్రేమ ఏమైంది..? అసలు ఈ కథలో సాహో ఎవరు? అన్నదే మిగతా కథ. నటీనటులు: సినిమా అంతా తన భుజాల మీద మోసిన ప్రభాస్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. రెండు వేరియేషన్స్‌లోనూ ప్రభాస్ నటన ఆకట్టుకుంటుంది. లుక్స్ పరంగానూ ప్రభాస్ సూపర్బ్ అనిపించాడు. ఇక యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్ చూపించిన ఈజ్, పర్ఫెక్షన్ వావ్ అనిపించేలా ఉంది. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. పోలీసు అధికారి పాత్రలో శ్రద్ధా కపూర్ ఒదిగిపోయింది. యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించింది. విలన్లుగా చాలా మంది నటులు తెర మీద కనిపించినా ఎవరికీ పెద్దగా స్క్రీన్ టైం దక్కలేదు. చంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్లు తమ పాత్రల పరిధి మేరకు ఓకె అనిపించగా జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, మహేష్ మంజ్రేకర్ లాంటి నటులకు సరైన పాత్రలు దక్కలేదు. మరో కీలక పాత్రలో నటించిన మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల కిశోర్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. విశ్లేషణ : రన్ రాజా రన్ లాంటి చిన్న సినిమా చేసిన అనుభవం మాత్రమే ఉన్న సుజీత్‌కు ఇంత భారీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టడం అంటే రిస్క్ అనే చెప్పాలి. భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్, జాతీయ స్థాయి సినిమా... ఇంత ఒత్తిడిని హ్యాండిల్ చేయటంలో సుజీత్ తడబడ్డాడు. ప్రభాస్‌ను స్టయిలిష్‌గా, హాలీవుడ్ స్టార్లా చూపించటం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన దర్శకుడు కథా కథనాల విషయంలో ఆ స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఇంత భారీ ప్రాజెక్ట్‌కు ఒక రొటీన్ క్రైమ్ ఫార్ములా కథను ఎంచుకున్న సుజీత్, ఆ కథను కూడా ఆకట్టుకునేలా చెప్పలేకపోయాడు. లెక్కలేనన్ని పాత్రలు, ప్రతీ పాత్రకు ఓ సబ్ ప్లాట్‌తో కథనం గజిబిజీగా తయారైంది. అయితే డార్లింగ్ అభిమానులను మాత్రం ఖుషీ చేశాడు. లాంగ్ గ్యాప్ తరువాత వెండితెర మీద కనిపించిన ప్రభాస్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి చూపించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో కథ ఆసక్తికరంగా మారినా ద్వితీయార్థం లోనూ తడబాటు కనిపించింది. లవ్ స్టోరీ కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి. చదవండి - ‘గద్దలకొండ గణేష్’ మూవీ రివ్యూ పాటలు విజువల్‌గా వావ్ అనిపించేలా ఉన్నా కథనంలో మాత్రం స్పీడు బ్రేకర్లలా మారాయి. జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. చాలా సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరింతగా ఎలివేట్ చేశాడు జిబ్రాన్. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ యాక్షన్ కొరియోగ్రఫి. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ రెప్ప వేయకుండా చూసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫి కూడా సూపర్బ్. గతంలో ఎప్పుడు చూడని లొకేషన్లను ఎంతో అందంగా వెండితెర మీద ఆవిష్కరించారు. సినిమాకు మేజర్ డ్రా బ్యాక్ ఎడిటింగ్. ప్రతీ సన్నివేశం దేనికి దానికి వచ్చిపోతున్న ఫీలింగ్ కలుగుతుందే తప్ప ఫ్లో ఉండదు. నిర్మాణ విలువ అద్భుతం. ప్రభాస్ మీద ఉన్న ప్రేమతో నిర్మాతలు అవసరానికి మించి ఖర్చు చేశారు. ప్లస్ పాయింట్ : యాక్షన్ సీన్స్ ప్రభాస్ నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : కథా కథనాలు నిడివి ఎడిటింగ్ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
‘సాహో’ మూవీ స్టిల్స్
-
సాహో రివ్యూ.. ఓవర్ సీస్ రిపోర్ట్
బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీన్స్‌తో ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను సాహో అందుకుందా..? బాహుబలి తరువాత మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నాడా..? కేవలం ఒక సినిమా అనుభవంతో సుజీత్, సాహో లాంటి మెగా ప్రాజెక్ట్‌ను ఎలా డీల్ చేశాడు..? అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే దుమ్ము రేపిన సాహో, ఓవర్‌సీన్‌లో ప్రీమియర్స్‌తో మంచి వసూళ్లను సాధించింది. ఇక సినిమా విషయానికి వస్తే బాహుబలిగా ఆకట్టుకున్న ప్రభాస్, సాహోతో మరోసారి మెస్మరైజ్ చేశాడంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్, యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్ ఈజ్ సూపర్బ్ అన్న టాక్ వినిపిస్తోంది. సినిమా కథ ఏంటి అన్నది దాదాపు ట్రైలర్లోనే చెప్పేశారు. కోట్ల డబ్బు, చాలా మంది విలన్స్ వారి మధ్య ఆదిపత్యపోరు. ఈ యుద్ధాన్ని సూపర్ హీరోలాంటి ఒక్క ఆఫీసర్ ఎలా ఆపాడు? విలన్స్ ఆట ఎలా కట్టించాడు? అన్నదే కథ. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సాహో) చెప్పడానికి సింపుల్‌గానే అనిపించినా దర్శకుడు సుజీత్ తన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సినిమాను ప్రేక్షకుడి ఊహకందని రీతిలో నడిపించాడు. ప్రారంభ సన్నివేశాలతోనే సినిమాను యాక్షన్ మూడ్‌లోకి తీసుకెళ్లిన దర్శకుడు ఆకట్టుకున్నాడు. తొలి షాట్‌లోనే సినిమా స్కేల్ ఎలా ఉండబోతుంది అన్నది చూపించిన యూనిట్, ప్రతీ సీన్ ది బెస్ట్ అనే స్థాయిలో రూపొందించారు. అయితే కథ పరంగా తొలి అర్ధభాగంలో చెప్పడానికి ఏమీ లేకపోవడంతో ప్రధాన పాత్రల పరిచయం, గ్రాండ్ విజువల్స్‌తో సరిపెట్టాడన్న టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా రెగ్యులర్ సినిమాల స్టైల్లోనే ఉందంటున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. శ్రద్ధా కపూర్ క్యారెక్టర్ కూడా ఆశించిన స్థాయిలో లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లోపాలన్నింటినీ ప్రభాస్ తన స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కవర్ చేశాడంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇతర పాత్రల విషయానికి వస్తే ప్రభాస్ వన్‌మేన్ షో కావటంతో భారీ స్టార్ కాస్ట్ ఉన్నా సినిమాలో ఎవరికీ పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్ దక్కలేదు. ఉన్నంతలో ఒక్క చంకీ పాండే మాత్రం తన మార్క్ చూపించారు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. పాటలు, వాటి పిక్చరైజేషన్ అద్భుతంగా ఉన్నా కథనంలో స్పీడు బ్రేకర్లలా మారాయి. కామెడీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ద్వితీయార్థం ఆసక్తికరంగానే ఉన్నా సినిమా మీద ఉన్న అంచనాలను అందుకునే స్థాయిలో మాత్రం లేదంటున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ సినిమాకు మేజర్ డ్రా బ్యాక్‌గా చెపుతున్నారు. ఓవరాల్‌గా సాహో విజువల్ గ్రాండియర్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో అలరించినా బలహీనమైన కథ, కథనంలోని లోపాల కారణంగా అక్కడక్కడా కాస్త నిరాశపరుస్తుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జీవితం భలే మారిపోయింది
‘‘తొలిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేశా. అందరూ ఆయన్ని డార్లింగ్ డార్లింగ్ అంటారు. అలా ఎందుకంటారో ‘సాహో’ సినిమా చేసినప్పుడు తెలిసింది’’ అన్నారు మురళీ శర్మ అన్నారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘సాహో’ నేడు విడుదలవుతోంది. ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేసిన మురళీ శర్మ చెప్పిన విశేషాలు. ► ‘సాహో’ తొలిరోజు షూటింగ్ లంచ్‌టైమ్‌లో ‘ఇంటి భోజనం నాకు చాలా ఇష్టం’ అన్నాను. ఆ తర్వాత 60 రోజుల పాటు ప్రభాస్‌గారి ఇంటి నుంచి నాకు భోజనం వచ్చేది. నాకే కాదు.. పదిమందికి సరిపడే పెద్ద క్యారియర్‌లో భోజనం వచ్చేది. గుత్తి వంకాయ కూర ఎంత బాగుంటుందంటే చెప్పడానికి మాటల్లేవ్. నిజంగా ప్రభాస్ మంచి మనిషి.. యూనివర్సల్ డార్లింగ్. ► ‘భాగమతి’ సినిమా టైమ్‌లో సుజీత్ ‘సాహో’ కథ చెప్పాడు. తనది మంచి బ్రెయిన్. కథని అద్భుతంగా రాసుకున్నాడు. వంశీ, ప్రమోద్, విక్కీ చాలా ప్యాషనేట్ నిర్మాతలు. ఎప్పుడూ సెట్లో ఉండి సినిమా ఎలా వస్తోంది? ఏంటి? అని చూసుకునేవారు. యూవీ క్రియేషన్స్ నాకు హోమ్ బ్యానర్‌లాంటిది. ‘అభినేత్రి’ సినిమాకి మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పా. ఇప్పుడు ‘సాహో’కి కూడా. ఓ సినిమాని ఒకేసారి పలు భాషల్లో చేయడం, డబ్బింగ్ చెప్పడం ఓ ప్రయోగం. ఏ భాషలో అయినా భావోద్వేగాలు ఒక్కటే.. భాష మాత్రం వేరు. ► ఏ సక్సెస్‌కి అయినా ప్రిపరేషన్ ముఖ్యం. నా పాత్రకి ముందుగానే నేను ప్రిపేర్ అవుతా. ఇటీవల ‘ఎవరు, రణరంగం’ చిత్రాల్లోనూ మంచి పాత్రలు చేశా. ప్రతి పాత్రనీ ఎంజాయ్ చేస్తా. తండ్రి పాత్ర చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నా జీవితం మారిపోయింది. ► నేను పుట్టి, పెరిగింది ముంబైలో. మా అమ్మగారు తెలుగువారే. ‘అతిథి’ చిత్రంలో నాకు చాన్స్ వచ్చింది. బిగినింగ్‌లోనే మహేశ్‌బాబులాంటి సూపర్‌స్టార్‌తో, అంత పెద్ద సినిమాలో మంచి పాత్ర చేస్తాననుకోలేదు. ‘మా అబ్బాయి కృష్ణగారి అబ్బాయి సినిమాలో చేస్తున్నాడు’ అని మా అమ్మ అందరికీ చెప్పుకున్నారు. తెలుగు, తమిళ్, మరాఠీ, హిందీ భాషలను మేనేజ్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం ‘అల.. వైకుంఠపురములో’, శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నా. మారుతిగారితో ఓ చిత్రం చేశా. సందీప్ కిషన్–నాగేశ్వర్రెడ్డిగారి సినిమా దాదాపు పూర్తి కావస్తోంది. ‘అతిథి’ తర్వాత మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేశా. -
ప్రభాస్ థియేటర్లో రామ్ చరణ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సన్నిహితులు, యూవీ క్రియేషన్స్ అధినేతలు నిర్మించి భారీ మల్టీప్టెక్స్ వీ సెల్యులాయిడ్. ఈ మల్టీప్లెక్స్ రేపు సాహో సినిమాతో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చెర్రీ ‘ఆసియా లోనే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడం అభినందనీయం. చిరంజీవి నటించిన సైరా సినిమాను కూడా ఇక్కడ ప్రదర్శించేలా చూస్తాం చిరంజీవిని కూడా ఇక్కడకు తీసుకువస్తా’ అన్నారు. ఈ కార్యక్రమంలో చరణ్‌తో పాటు మల్టీప్లెక్స్ నిర్వహకులు, సాహో చిత్ర దర్శకుడు సుజీత్ పాల్గొన్నారు. -
నానీని.. మెగా అభిమానులు అంగీకరిస్తారా?
నాని.. గ్యాంగ్ లీడర్ సినిమాను మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల షూటింగ్ తరువాత సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. తరువాత గ్యాంగ్‌లీడర్ అనే టైటిల్‌ను ప్రకటించటంతో మెగా అభిమానులు ఫైర్ అయ్యారు. దీనికి తోడు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ వేరే నిర్మాతలు రిజిస్టర్ చేయించుకోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా టైటిల్‌ను ‘నానీస్ గ్యాంగ్ లీడర్’గా మార్చాల్సి వచ్చింది. రిలీజ్ డేట్ విషయంలోనూ గ్యాంగ్ లీడర్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని భావించారు. కానీ అదే రోజు సాహో రిలీజ్ అంటూ ప్రకటన రావటంతో ఆగస్టు 30కి మార్చారు. కానీ సాహో కూడా వాయిదా పడి ఆగస్టు 30కి రావటంతో సినిమాను సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. ఆ రోజు కూడా వరుణ్ తేజ్ వాల్మీకితో పోటి పడాల్సి రావటంతో సినీ పెద్దలు కలగజేసుకొని వాల్మీకిని సెప్టెంబర్ 20కి వాయిదా వేయించారు. తాజాగా ట్రైలర్లో మెగా అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశాడు నాని. ట్రైలర్లో గ్యాంగ్ లీడర్లో చిరు ఇంట్రడక్షన్ సీన్ తరహాలో వెల్డర్‌గా ఓ షాట్, తరువాత చిరంజీవి ఫేస్ మాస్క్‌తో మరో షాట్లో కనిపించాడు. మరి ఈ రెండు సీన్స్‌తోనే మెగా అభిమానులు శాంతిస్తారా..? గ్యాంగ్ లీడర్‌గా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను చూసుకోవాలనుకుంటున్న ఫ్యాన్స్ ఆ స్థానంలో నానిని అంగీకరిస్తారా..? లేదా..? తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే -
సాహో అ'ధర'హో!
సాక్షి, హైదరాబాద్: మొన్న మహర్షి నేడు సాహో.. టికెట్ల ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. ఈ నెల 30న విడుదల కానున్న సాహో సినిమా టికెట్ల ధరలను రాష్ట్రంలో కొన్ని థియేటర్ యాజమాన్యాలు అమాంతంగా పెంచేశాయి. దీంతో సామాన్య ప్రేక్షకులకు వినోదభారం తప్పడం లేదు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాకు సగానికిపైగా థియేటర్లు రేట్లు పెంచడం వినోద ప్రియులను కలవరపెడుతోంది. ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసే ‘బుక్ మై షో’వెబ్సైట్లో ఈ మేరకు పెంచిన ధరలు దర్శనమిస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా ఈ పెంచిన ధరలతోనే బుకింగ్‌లు జరుగుతున్నాయి. ఈ సినిమా శుక్రవారం విడుదలవనుంది. తరువాత శని, ఆదివారాలు సెలవు దినాలు రావడం, సోమవారం వినాయక చవితి కావడంతో సినిమా బుకింగ్‌లు అమాంతం పెరిగాయి. రూ.10 నుంచి రూ.150 అధికంగా.. సాధారణంగా నాన్ ఏసీ థియేటర్లలో బాల్కనీ టికెట్ ధర రూ.80, ఏసీ థియేటర్లలో రూ.125గా ఉంటుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక చాలా థియేటర్లు ఇవే ధరల్ని కొనసాగిస్తున్నాయి. కానీ కొన్ని మాత్రం అస్సలు పాటించడం లేదు. మొదటివారం వీలైనంత వసూలు చేసుకోవాలన్న ఆలోచనతో టికెట్ ధరలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ల్లో ఈ వ్యత్యాసం అధికంగా ఉంటోంది. వాస్తవానికి జీఎస్టీతో కలిపి మల్టీప్లెక్స్‌లో టికెట్ల ధర రూ.138 వద్ద మొదలై గరిష్టంగా రూ.150 వరకు ఉంది. కానీ, సాహో సినిమాకు ఈ వ్యత్యాసం మరీ పెరిగిపోయింది. కొన్ని రూ.175, ఇంకొన్ని రూ.230కి చేరింది. ఇక ఓ ప్రముఖ థియేటర్లో అయితే సోఫా టికెట్ ధర రూ.300, బాల్కనీ ధర రూ.200గా ఉంది. అయినా దీనిపై అధికారులు దృష్టి సారించకపోవడం గమ నార్హం. ప్రస్తుతం అన్ని సినిమాలకు ఇవే థియేటర్లు వసూలు చేస్తోన్న మొత్తంలో సాహో సినిమాకు వసూలు చేస్తో న్న మొత్తంలో కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.150కి వరకు వ్యత్యాసం ఉండటం గమనార్హం. సామాన్యులకు అందుబాటులో ఉండే సెకండ్ క్లాస్ టికెట్ ధరలను సైతం భారీగా పెంచారు. చాలా థియేటర్లలో సెకండ్ క్లాస్ కనిపించకుండా పోతోంది. ఏపీ హైకోర్టుకు వివాదం.. సాహో సినిమాకు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారని ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. సాహో సినిమా టికెట్ల రేటు పెంపునకు అనుమతించలేదు. తమకు అన్ని సినిమాలు ఒక్కటేనని, ఒక్కో సినిమాను ఒక్కోలా చూడలేమని తేల్చి చెప్పింది. కాగా, మహర్షి సినిమా విడుదల సమయంలోనూ కొన్ని థియేటర్ యాజమాన్యాలు తమకు తామే టికెట్ల రేటు పెంచాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కానీ, రెండు మూడు రోజుల అనంతరం థియేటర్ యాజమాన్యాలు టికెట్ల రేట్లు తగ్గించడంతో వివాదం సద్దుమణిగింది. -
ఇక ‘నాన్ బాహుబలి రికార్డ్’ అన్న పదం వినిపించదా!
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా భారతీయ సినిమా ముఖచిత్రాన్నే మార్చేసింది. వందకోట్ల వసూళ్లు సాధించటమే టార్గెట్ అనుకున్న ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో వసూళ్లకు గేట్లు తెరిచింది. బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా బాహుబలి విజయం ముందు దాసోహం అన్నాయి. బాహుబలి రిలీజ్ తరువాత ఆ రికార్డ్లను చెరిపేసేందుకు బాలీవుడ్ చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు సాహో సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతుండటంతో మరోసారి బాహుబలి రికార్డ్‌లపై చర్చ మొదలైంది. ఇన్నాళ్లు భారీ విజయం సాధించిన సినిమాలను నాన్ బాహుబలి రికార్డ్ సాధించిందంటూ చెపుతూ వస్తున్నారు. కానీ సాహో రిలీజ్ తరువాత రికార్డ్‌లకు సరికొత్త స్టాండర్ట్స్ సెట్ అవుతాయంటున్నారు ఫ్యాన్స్. సాహో.. బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపేయటం ఖాయం అని భావిస్తున్నారు. అయితే విశ్లేషకుల మాట మాత్రం మరోలా ఉంది. సాహో మీద భారీ అంచనాలు ఉన్నా బాహుబలి మార్క్‌ను అందుకోవటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాహో బ్రేక్ఈవెన్ సాధించాలంటే దాదాపు 400 వందల కోట్ల వసూళ్లు సాధించాలి. కేవలం బాలీవుడ్లోనే 125 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఆ స్థాయి వసూళ్లు సాహోకు సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాహుబలి కాస్ట్యూమ్ డ్రామా కావటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సాహో రెగ్యులర్ సోషల్ యాక్షన్ కథ కావటంతో ఆ స్థాయిలో అంచనాలు కష్టమే అంటున్నారు. హిందీలో ఇప్పటికే ధూమ్ లాంటి యాక్షన్ సినిమాల చాలా వచ్చాయి. మరి సాహో వాటిని మించి బాలీవుడ్ జనాలు సాహో అలరిస్తుందా లేదా చూడాలి. -
'సాహో' సుజీత్.. డబురువారిపల్లి బుల్లోడు
కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టాడాయన. తండ్రికి వారసునిగా చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకున్న ఆయన అనూహ్యంగా సినీ రంగంవైపు మళ్లీ హాలీవుడ్ స్థాయి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆయనే రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘సాహో’ సినిమాకు దర్శకత్వం వహించిన ఎద్దుల సుజీత్ రెడ్డి.సుజీత్ సినీ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కుగ్రామం నుంచి... అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన పుట్టపర్తి నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతంలో డబురువారిపల్లి ఓ కుగ్రామం. ఇక్కడ 150 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ మొత్తం జనాభా 350. ఈ గ్రామంలో ఎద్దుల వారి కుటుంబానికి చెందిన వారే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నింటా ఉన్నత స్థానంలో ఉన్నారు. సాహో చిత్ర దర్శకుడు సుజీత్‌రెడ్డి తండ్రి ఎద్దుల గోపీనాథ్‌రెడ్డి వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. అనంతపురం, ఆ తర్వాత హైదరాబాద్‌లో పనిచేసి అక్కడే స్థిరపడ్డారు. గోపీనాథ్‌రెడ్డి, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు వినీత్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. అనూహ్యంగా సినీరంగంవైపు సుజీత్‌రెడ్డి 1990, అక్టోబర్ 10న జన్మించారు. అప్పట్లో వారి కుటుంబం అనంతపురంలో ఉండేది. అక్కడే ఎల్‌ఆర్‌జీ స్కూల్లో 1 నుంచి 3వ తరగతి వరకూ చదువు. ఇంతలో తండ్రికి బదిలీ కావడంతో చెన్నైలో 4 నుంచి పదో తరగతి వరకు చదివి, ఇంటర్మీడియట్ కోసం తిరిగి అనంతపురానికి వచ్చారు. తన తండ్రి బాటలోనే తాను కూడా సీఏ చేయాలని భావించి ఇంటర్లో ఎంఈసీ పూర్తి చేశారు. తర్వాత విజయవాడ సూపర్‌విజ్ కళాశాలలో సీఏ విద్య కోసం చేరారు. దాన్ని వదిలి బీకాం ఆనర్స్ పూర్తి చేసి, తల్లిదండ్రుల అనుమతితో 2012–13లో చెన్నైలోని ఎల్వీ ప్రసాద్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో పీజీడీఎఫ్‌టీ (పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫిలిం టెక్నాలజీ) చేశారు. తల్లిదండ్రులు ఎద్దుల గోపీనాథ్‌రెడ్డి, నాగమణి,అన్న వినీత్రెడ్డిలతో సుజీత్ లఘు చిత్రాల ద్వారా తొలి అడుగు పీజీడీఎఫ్‌టీ పూర్తి చేసిన తర్వాత 2014 నుంచి షార్ట్ ఫిలిమ్స్(లఘు చిత్రాలు)పై సుజీత్ దృష్టిసారించారు. లఘు చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే ప్రముఖ సినీ హీరోలతో పరిచయాలు పెంచుకున్నారు. 23ఏళ్ల వయస్సులోనే ‘రన్ రాజా రన్’ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ నవ్వులు పూయించిన ఆ చిత్రం సుజీత్‌కు మంచి పేరు తెచ్చింది. ప్రభాస్ ఆశీస్సులతో... సుజీత్ వయస్సు ఇప్పుడు 28 ఏళ్లు. అతనిలోని దర్శకత్వ ప్రతిభను యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ గుర్తించారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు భాషల్లో తీసిన ‘సాహో’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించారు. హాలీవుడ్ చిత్రాలను మరిపించేలా చిత్రాన్ని రూపొందించి యావత్ ప్రపంచ దృష్టిని సుజీత్ ఆకర్షించారు. అందరి అంచనాలను మించి చిత్రం విజయవంతమవుతుందని ఇప్పటికే ‘సాహో’ టీజర్లు చూసిన నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇంతటి ఖ్యాతి గడించిన సుజీత్ తమ గ్రామ వాసి కావడంతో డబురువారిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 30 సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. సుజీత్ స్వగ్రామం ఇదే -
‘బాహుబలి నా ముందు మోకాళ్లపై!’
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాహో ఫీవర్ నడుస్తోంది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలలోనూ ఈ సినిమాకు సంబంధించి భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ నటులు పెద్ద సంఖ్యలో నటించిన ఈ సినిమాకు అక్కడ మీడియా కూడా మంచి కవరేజ్ ఇస్తోంది. తాజాగా సాహోలో నటించిన బాలీవుడ్ నటుడు చంకీ పాండే సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభాస్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ‘ప్రభాస్ అంత వినయం ఉన్న స్టార్ హీరోను ఇంత వరకు చూడలేదు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ముంబై నుంచి వచ్చిన నటులు షూటింగ్ పూర్తి చేసుకొని హోటల్స్‌కు వెళ్లే వరకు ప్రభాస్ సెట్ లోనే ఉండేవారు. ముఖ్యంగా సినిమాలో ఓ సన్నివేశంలో ప్రభాస్ నా ముందు మోకాళ్ల మీద కూర్చుంటాడు. అప్పుడు నాకు బాహుబలి నా ముందుకు మోకరిల్లినట్టుగా అనిపించింది’ అన్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన సాహో సినిమాకు సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. -
అంత కష్టపడకురా అంటున్నారు
ప్రభాస్ ఫుల్ బిజీ...రెండేళ్లుగా ‘సాహో’ సినిమాతో బిజీ.ఇప్పుడు ‘సాహో’ ప్రమోషన్స్‌తో బిజీ.బెంగళూరు, ముంబై, చెన్నై.. అంటూ ‘సాహో’ కోసం జర్నీలు చేస్తూ బిజీ.కొడుకు ఇంత బిజీగా ఉంటే ఏ తల్లికైనా ఆనందమే.కానీ కొడుకు ఎంత స్టార్ అయినా, ‘ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్’ అయినా తల్లికి కొడుకే.మరి ఈ బిజీ సన్‌కి తల్లితో కలిసి భోజనం చేసే తీరిక ఉందా? కొడుకుకి ఇంత పేరు వచ్చినందుకు ఆ తల్లి ఫీలింగ్ ఏంటి? తనయుడు చేసిన సినిమాలన్నీ బాగున్నాయనే ఆ తల్లికి అనిపిస్తుందా? విమర్శను నిక్కచ్చిగా చెబుతారా? ఇలాంటి విశేషాలతో పాటు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోప్రభాస్ చాలా విషయాలు చెప్పారు. ♦ మీరు చాలా మొహమాటస్తులు. ‘బాహుబలి’ నుంచి కొద్దిగా అవుట్ స్పోకెన్ అయ్యారు. ఈ మార్పుని మీరు గమనించా...? ప్రభాస్: (మధ్యలోనే అందుకుంటూ) బాగా మాట్లాడేస్తున్నాను కదా? ఎంటర్టైన్ చేసేస్తున్నాను కదా? ఇలా మాట్లాడటం నాకే అడ్వాంటేజ్. బాగా మాట్లాడితే బాగా రాస్తారు. ఇంతకు ముందు ఇంటర్వ్యూ అంటే ‘అమ్మో రేపటి నుంచి ఇంటర్వ్యూలు’ అని చిన్న టెన్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ♦ ‘బాహుబలి’ రూపంలో మీ కెరీర్లో ఓ అద్భుతం జరిగింది. ఈ అద్భుతం తర్వాత మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? ప్రభాస్:భయంకరమైన లక్ ఉంటే కానీ ‘బాహుబలి’ లాంటి సినిమాలు రావు. అది నాకు జరిగింది. ఒక అద్భుతం జరిగిపోయింది. అయితే ఇప్పట్లో మళ్లీ అంత ఒత్తిడి పెట్టుకోవాలనుకోలేదు. కానీ వెంటనే ‘సాహో’లాంటి సినిమా చేయాల్సి వచ్చింది. అన్నీ పక్కన పెట్టేసి ఇంకొక్కసారి కష్టపడదాం అని రెండేళ్లు శ్రమించాం. ‘బాహుబలి’కి ముందే నా ఫ్రెండ్స్ (యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్)తో సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాను. ‘బాహుబలి’ వర్కౌట్ అవ్వకపోయినా నెక్ట్స్ వీళ్లతోనే అనుకున్నా. నా ఫ్రెండ్స్ నా కంటే పిచ్చోళ్లు. విపరీతంగా ఖర్చు పెట్టి ‘సాహో’ తీశారు. ♦ జీవితంలో అనుకోని ‘అద్భుతం’ జరిగినప్పుడు మన ఆలోచనా విధానం కూడా మారిపోతుంది. అలాంటి మార్పు ఏదైనా మీలో వచ్చిందా? ప్రభాస్:అలా ఏం మారలేదు. మే బీ నాకు తెలియదేమో? అది డెస్టినీ అవ్వచ్చు. అయితే అంతకుముందు ‘లక్’ అనే విషయాన్ని నేను ఎక్కువగా నమ్మేవాణ్ణి కాదు. ఒక టైమ్ తర్వాత ఉంటే ఉంటాయి. మన పని మనదే అనుకునేవాణ్ణి. కానీ ‘బాహుబలి’ తర్వాత కొంచెం నమ్ముతున్నాను. ♦ జీవితాన్ని చూసే కోణం కూడా మారిందా? ప్రభాస్:కచ్చితంగా మారుతుంది. ఇంకా కష్టపడాలి, ఇంకా తెలివిగా ఉండాలి, ప్రతిదానికి పక్కా ప్లానింగ్ ఉండాలనే మైండ్ సెట్ వచ్చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు. దానికి మించి ఏదో ఉంది అనే విషయాన్ని నమ్ముతున్నాను. ఆ ఏదో అనేది ‘ఏదో పవర్’ అని నా ఉద్దేశం. ♦ ‘బాహుబలి’ గురించి ప్రస్తావించినప్పుడల్లా ‘అద్భుతం’ అని అంటున్నాం. కానీ కెరీర్ పరంగా చూస్తే ‘రిస్క్’. ఆ తర్వాత 350 కోట్లతో ‘సాహో’ అనే మరో రిస్క్ చేశారు. రిస్క్ తీసుకుందాం అనే స్వభావం ఏర్పడిందా? ప్రభాస్:ఆ స్వభావం ఉండబట్టే ‘బాహుబలి’ చేయగలిగాను. అయితే ‘బాహుబలి’ అప్పుడు నిర్మాత శోభుగారిని చూస్తే టెన్షన్ అనిపించేది. యుద్ధ సన్నివేశాలు తీసేటప్పుడు రోజుకి పాతిక లక్షలు ఖర్చు పెట్టేవారు. అయినా ఆయన నవ్వుతూ కనబడుతుండేవారు. ‘టెన్షన్ పడడా? రోబోనా’ అనుకునేవాణ్ణి. ‘బాహుబలి’ తర్వాత శోభుగారి ఇంటికి ఫోన్ చేసి ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌తో ‘మళ్లీ ఇంత పెద్ద సినిమాలు చేయనీకండి’ అని చెప్పాను. కట్ చేస్తే.. నేనే పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశాను. నా ఫ్రెండ్స్‌ని ఇన్వాల్వ్ చేశా. నాకెంత స్ట్రెస్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి’ చేయడానికి ఫస్ట్ రీజన్ అలాంటి ప్రాజెక్ట్ చేసే అవకాశం మళ్లీ వస్తుందా? లేదా? అని. ఇప్పుడు ‘బాహుబలి’ ఇంత బాగా రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? కనీసం ప్రయత్నిద్దాం అని ‘సాహో’ చేశాను. అలా ఆరేడేళ్లు ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాలకే వెచ్చించాను. ♦ ‘ప్రభాస్ సినిమా అంటే ఇంత భారీ బడ్జెట్, ఇంత రేంజ్ ఉండాలి’ అనే స్పేస్‌లో ఇరుక్కుపోయాం అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? ప్రభాస్:అలా ఏం లేదు. ‘ఛత్రపతి’తో నాకు యాక్షన్ హీరో ఇమేజ్ వచ్చింది. కానీ వెంటనే ‘డార్లింగ్’ అనే సాఫ్ట్ సినిమా చేశాను. అందులో పెద్దగా ఫైట్స్ కూడా ఉండవు. అమ్మాయి, అబ్బాయి ప్రేమకథ. అదీ ఆడింది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో బంధాలకు, బిజినెస్‌కు మధ్య డిఫరెన్స్ తెలియని ఒక క్యారెక్టర్. క్లైమాక్స్‌లో హీరో సారీ చెబుతాడు. ఫ్యాన్స్‌కి నచ్చలేదు. కానీ ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు. మెల్లిగా అందరికీ నచ్చింది. స్టోరీని కనెక్ట్ చేయగలిగితే ఏ సినిమా అయినా వర్కౌట్ అవుతుంది. కరెక్ట్ కథ ఉంటే నన్ను పెట్టి రెండు కోట్ల సినిమా తీసినా కూడా ఆడుతుంది. ♦ ‘బాహుబలి, సాహో’ ప్యాన్ ఇండియా సినిమాలు. మీ నుంచి వచ్చే ప్రతీ సినిమా అన్ని భాషల వాళ్లు చూడాలనుకుంటారు. కానీ ప్రతి సినిమాకి అది కుదరకపోవచ్చు. దాన్ని ఎలా అధిగమిస్తారు? ప్రభాస్:ప్యాన్ ఇండియా సినిమానే చే యాలని రూల్‌గా ఏమీ పెట్టుకోలేదు. ‘బాహుబలి’ తర్వాత ఇది ఇంపార్టెంట్ టైమేమో అనిపించింది. ఒకవేళ ‘సాహో’ వర్కౌట్ అయినా నెక్ట్స్ ప్యాన్ ఇండియా సినిమానే చేస్తానని పెట్టుకోలేదు. తెలుగు సినిమానే చేస్తాను. వేరే భాషలో గెస్ట్ పాత్ర చేయొచ్చు. అంతే తప్ప ఇకనుంచి చేసే ప్రతి సినిమా అన్ని భాషలనీ దృష్టిలో పెట్టుకుని చేయాలని రూల్ అయితే పెట్టుకోలేదు. ♦ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాజకీయాల మీద ఆసక్తి లేదన్నారు. పొలిటికల్ మూవీ ఆఫర్ వస్తే? ప్రభాస్:పాలిటిక్స్ వేరు పొలిటికల్ ఫిల్మ్ వేరు. కథ బావుంటే చేయొచ్చు. యాక్షన్ సినిమా చేస్తూ బోలెడు మందిని చంపేస్తున్నాను. బయట చేస్తున్నానా? (నవ్వుతూ). అలాగే సినిమాలో పొలిటీషియన్‌గా చేస్తే.. నిజంగా రాజకీయాల్లోకి వస్తానని కాదు కదా. ♦ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్లినా ‘ప్యాన్ ఇండియన్ సూపర్‌స్టార్’ అని పిలుస్తున్నారు. ఆ పిలుపుకి అలవాటు పడ్డారా? ప్రభాస్:నిజంగా నేను ప్యాన్ ఇండియన్ సూపర్‌స్టార్ అని ఫీల్ అయ్యుంటే నా ఫ్రెండ్స్‌తో ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చుపెట్టించేవాణ్ణి? 50 కోట్లతో తీయిస్తే చాలు. అప్పుడు అందరూ అంటున్నట్లు ప్యాన్ ఇండియన్ స్టార్‌ని కాబట్టి సినిమాలు ఆడేస్తాయి. అవన్నీ నేను నమ్మను. క్వాలిటీ ముఖ్యం. ‘బాహుబలి’తో తెచ్చుకున్న ఆడియన్స్‌ను సంతృప్తిపరచాలి. సరదా సమాధానాలు ♦ ‘సాహో’కి బడ్జెట్ పెరుగుతుంటూ వెళ్లినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ♦ నిద్ర పట్టేది కాదు. ♦ మీరు బయట చాలా కూల్. సినిమాల్లో ఫుల్ వయొలెంట్. ఈ మార్పు ఎలా? ♦ డబ్బులు తీసుకుంటున్నాను కదా. ♦ అందరి ప్రెషర్ మీరే తీసుకుంటున్నారు. మీ ప్రెషర్ని పంచుకునే వాళ్లు మీ లైఫ్‌లోకి ఎప్పుడు వస్తారు? ♦ ప్రెషర్ తీసుకునే వాళ్లు వస్తారో? ప్రెషర్ పెట్టేవాళ్లు వస్తారో? ♦ ట్రైలర్ చూసి మీ పెద్దనాన్నగారు (కృష్ణంరాజు) ఎలా ఫీల్ అయ్యారు? ♦ అందరూ నా గురించి చెప్పడం విని తబ్బిబ్బిపోయి.. ఇంకా లావైపోతున్నారు. ♦ మీ పాపులారిటీ దేశాలు దాటే కొద్దీ మీరింకా ‘డౌన్ టు ఎర్త్’గా మారిపోతున్నారు... ♦ మంచిదే కదా. అది నాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది. ఇలా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయాన్ని మాత్రం రాజమౌళి నుంచే నేర్చుకున్నాను. ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సాధించినా తను ఒకేలా ఉన్నాడు. ఆయన పక్కనే ఉండి గమనించాను. మనం ఎప్పుడైనా పెద్ద హిట్ సాధిస్తే ఈయనలా ఉండగలగాలి అనుకున్నాను. ♦ మళ్లీ రాజమౌళితో సినిమా ఎప్పుడు? ప్రభాస్:ఏమో తెలియదు. ‘బాహుబలి’ అప్పుడు 7–8 వెర్షన్స్లు, చాలా ఐడియాలు చెప్పాడు. ‘బాబుని పైకి లేపి తల్లి చనిపోవడం, కట్టప్పే బాహుబలిని చంపడం, కొడుకుని తల్లే చంపమని చెప్పడం’ ఇవన్నీ చెబుతున్నప్పుడే నాకు గూస్బంప్స్ వచ్చాయి. రాజమౌళి ఇలాంటి సినిమాని చంపేస్తాడు అనుకున్నాను (నవ్వుతూ). నిజంగానే చంపేశాడు. అయితే కొడుకుని తల్లే చంపేయమని చెప్పడం సీన్ విన్నప్పుడు మాత్రం ఒళ్లు గగుర్పొడిచింది. వామ్మో... అనుకున్నాను. ♦ అమ్మ టాపిక్ వచ్చింది కాబట్టి... మీ సక్సెస్‌ని మీ అమ్మగారు చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఆ ఫీలింగ్‌ని ఆమె మీతో షేర్ చేసుకుంటారా? ప్రభాస్:అమ్మ, సిస్టర్ చాలా హ్యాపీ. నా సిస్టర్ అయితే గాల్లో తేలిపోతుంది. వాళ్లకు ఎవరైనా నా గురించి మాట్లాడితే చాలు.. సంతోషపడతారు. నా కెరీర్ ఈ రేంజ్‌కి వచ్చినందుకు ఆనందపడుతున్నారు. అమ్మ ఎక్కువ బయటపడరు. బయటపడితే నేనెక్కడ మారిపోతానో అని భయం అనుకుంటా (నవ్వుతూ). ♦ మరి ‘రిస్కులు తీసుకోవద్దు’ అని అమ్మ జాగ్రత్తలు చెబుతుంటారా? ప్రభాస్:బేసిక్‌గా నేను బద్ధకస్తుడ్ని. కాలేజీ రోజుల్లో.. లేటుగా లేవడం, కాలేజ్‌కి వెళ్లకపోవడం చేస్తుండేవాణ్ణి. ‘బద్ధకం వదిలించుకో.. పని చెయ్యి.. పని చెయ్యి’ అని చెబుతూనే ఉండేవారు. ఇప్పుడేమో విపరీతంగా కష్టపడుతుంటే ‘అంత కష్టపడకురా..’ అంటున్నారు (నవ్వుతూ). ‘షూటింగ్లో బాగా ఎండగా ఉందా?’ అని అడుగుతారు. ‘అమ్మా.. ప్రపంచం మొత్తం ఎండలో కష్టపడుతున్నారు. నేను ఒక్కడినేనా’ అంటాను. అప్పుడేమో పని చెయ్యమని.. ఇప్పుడేమో ఇలా కష్టపడి చేస్తుంటే బాధ.. అమ్మలు అంతే (నవ్వేస్తూ). ‘సాహో’ హైలైట్స్ ♦ ‘సాహో’ ఫ్యూచర్ ఫిల్మ్ కాదు. ప్రజెంట్ టైమ్‌లో జరిగేదే. లార్జర్ దేన్ లైఫ్ అపీల్ కోసం కొన్ని గ్రాండియర్ ఎలిమెంట్స్ యాడ్ చేశాం. ‘బాహుబలి’కి పెరిగిన బరువుని ఈ సినిమా కోసం తగ్గించడానికి వెజిటేరియన్‌గా మారాను. ♦ సుజీత్ మీద ఫస్ట్ నుంచి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ‘రన్ రాజా రన్’ తర్వాత నాతో నీ నెక్స్› సినిమా చేస్తావా? అని అడిగాను. కథ తీసుకువస్తాను అన్నాడు. అబ్బ ఏం కాన్ఫిడెన్స్రా అనుకున్నాను. ♦ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఎడిట్ చేయించాం. ♦ ‘సాహో’లో నాది డ్యూయెల్ రోల్ కాకపోవచ్చు. అలాంటి క్యూరియాసిటీ ఉండాలనే ట్రైలర్‌ను అలా కట్ చేశాం. ♦ 150 కోట్లతో ‘సాహో’ చేయాలనుకున్నాం. అది 350 కోట్లు అయింది. ♦ ప్రాగ్, ప్యారిస్, జర్మనీ దేశాల నుంచి కావాల్సిన పరికరాలను తీసుకొచ్చాం. ♦ రిస్కీ యాక్షన్ సీన్స్ తీసినప్పుడు ఒక్క దెబ్బ కూడా తగలేదు. చాలా జాగ్రత్తగా చేయించారు. ఒకప్పుడు యాక్షన్ సీన్స్ అన్నీ నేనే చేయాలనుకునేవాణ్ణి. ఇప్పుడు అవసరమైనవే చేస్తున్నాను. ♦ సీక్వెల్‌కి స్కోప్ ఉన్న కథ ‘సాహో’. అన్నీ కుదిరితే చేస్తాం. అయితే ఇప్పుడప్పుడే కాదు. ♦ ఏ సినిమాకైనా కథే మాస్టర్. ఆ తర్వాత డైరెక్టర్. ♦ యాక్షన్ సినిమా అంటున్నాం కానీ సినిమాలో యాక్షన్ యాక్షన్ యాక్షనే ఉండదు. లవ్ స్టోరీ ఉంది. యాక్షన్‌లో కూడా కార్ చేజ్లు, ఎడారి దుమ్ములో ఓ ఫైట్, హీరోహీరోయిన్ రొమాంటిక్ సాంగ్‌తో ఓ ఫైట్.. ఇలా అందరూ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేశాం. ♦ తెలుగు సినిమా మంచి ఫేజ్‌లో ఉంది. కంటెంట్ ఉన్న సినిమాలు ఆడుతున్నాయి. ‘అర్జున్ రెడ్డి, జెర్సీ..’.. ఇలా ఈ మధ్య చాలా సినిమాలు ఆడాయి. అందరూ భిన్నంగా ప్రయత్నిస్తున్నారు. ♦ నెక్ట్స్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేస్తున్నాను. ఈ సినిమాని గోపీకృష్ణ, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ♦ ప్రమోషన్స్ కోసం రాష్ట్రాలు తిరుగుతున్నారు. అమ్మతో కలిసి భోజనం చేసి ఎన్ని రోజులు అయింది? ప్రభాస్:నెల రోజులు అయినట్టుంది. కలిసి మాట్లాడుతున్నాను. కానీ ఈ క్వొశ్చన్ విన్నాక అమ్మతో కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందో ఆలోచిస్తున్నా. మేం కలిసి భోజనం చేసి నెల దాటి పోయింది. ♦ మీ సినిమాలను మీ అమ్మ విమర్శిస్తుంటారా? ప్రభాస్:అమ్మో! సూపర్ క్రిటిక్. మామూలుగా కాదు. ‘బాహుబలి’లో ఓ సీన్లో నీ హెయిర్ చాలా చిన్నగా ఉందిరా అన్నారు. అమ్మా.. నా కిరీటం ఉంది. కీరిటానికి చైయిన్ కూడా ఉంది. అంత యాక్షన్ సన్నివేశాల్లో కూడా జుట్టు ఎలా గమనించావు నువ్వు? ‘అమ్మ.. మదరో’ అనుకున్నాను. ఇక్కడ మేకప్ కొంచెం బాగాలేదు. కళ్లు కొంచెం డార్క్‌గా ఉన్నాయి. క్రాఫ్ బాలేదు అని చెబుతుంటారు. డైట్ అంటూ సరిగ్గా తినకపోతే తిను తిను అంటారు. మళ్లీ కొంచెం పొట్ట వచ్చినట్టుందిరా అంటారు. తినకపోతే తినమని... తింటే లావు అయ్యావని. నాకు ఇవన్నీ చాలా ఎంజాయబుల్‌గా ఉంటాయి. ♦ ఇటీవల ముంబైలో చిరంజీవిగారిని కలిశారు. ఒకరి సినిమా గురించి ఒకరు మాట్లాడుకున్నారా? ప్రభాస్:మేం ఒకే హోటల్లో ఉన్నాం. గౌరవంగా వెళ్లి కలిశాను. మా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆయన ఫోన్ చేశారు. ఆయన తన సొంత సినిమాలా మాట్లాడారు. చిరంజీవిగారు∙మాట్లాడిన విధానం నాకు భలే సంతోషంగా అనిపించింది. సినిమాను అంతలా ప్రేమించకపోతే ఇనేళ్లు ఇండస్ట్రీలో ఉండలేరు. ♦ యాక్టర్స్‌కి చిరంజీవి ఆదర్శం అంటారు. అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’కు డోర్ ఓపెన్ చేసింది ‘బాహుబలి’ అని ఆయన అన్నారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ప్రభాస్:అది నాకు తెలియదు. అదంతా రాజమౌళి. ‘బాహుబలి’ రాజమౌళి ఫిల్మ్. అది మీరు రాజమౌళినే అడగాలి. ♦ ‘బాహుబలి’ టీమ్‌కి రాజమౌళియే స్ఫూర్తి నింపారని అన్నారు. మరి ‘సాహో’ టీమ్‌కి ఆ స్థానంలో మీరు ఉండాల్సిన పరిస్థితి. ఆ అనుభవం ఎలా అనిపించింది? ప్రభాస్:మా ‘సాహో’ టీమ్‌కి కూడా ‘బాహుబలి’యే స్ఫూర్తి. యూవీ వంశీ, ప్రమోద్ మంచి ప్యాషనేట్. నేను యూవీకి, యూవీకి నేను, మాకు డైరెక్టర్ సుజీత్.. మాకన్నా సుజీత్ వయసులో చిన్నవాడు. కానీ ‘ఏం కాదు అన్నా’ అని ధైర్యం చెప్పాడు. అతని వయసు ఏంటి? మాకు చెప్పడం ఏంటీ? అనుకున్నాం (నవ్వుతూ). బట్ ‘సాహో’ టీమ వర్క్. ♦ యాక్టర్‌గా మీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు? ప్రభాస్:‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి ఇండియన్ సినిమాకు ఇంకేదో చూపించారు. నెక్ట్స్ నా సినిమాలకు ఆడియన్స్ వచ్చినప్పుడు మేం ఏదో చూపించాలని ప్రయత్నం చేశామని చెప్పడానికి నానా తంటాలు పడ్డాం. ‘సాహో’ చేశాం. నెక్ట్స్ ఎలాంటి సినిమాలంటే... చూడాలి. ♦ బ్యాంకాంక్‌లో మేడమ్ తుస్సాడ్స్‌లో మీ మైనపు విగ్రహం పెట్టడం ఎలా అనిపించింది? ప్రభాస్:‘బాహుబలి’ వల్ల చాలా విషయాలు జరిగాయి. జపాన్ వెళ్లినప్పుడు అక్కడ రానాని ఫ్యాన్స్ పట్టుకుని ఏడవడం అవి అన్నీ వింటుంటే...‘బాహుబలి’ రూపంలో ఏదో ఒక అద్భుతం జరిగిపోయింది. అందులో మేడమ్ తుస్సాడ్స్ ఒకటి. ♦ ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని ‘డార్లింగ్’ అని పిలుచుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో ఓ అమ్మాయి ఏకంగా మీ బుగ్గ గిల్లి పారిపోవడం? ప్రభాస్:అది నేను ఊహించలేదు. ఎందుకంటే మేల్ ఫ్యాన్స్ కొంచెం గట్టిగా పట్టుకుని లాగడం అనుభవమే. అయితే ఒక అమ్మాయి నుంచి ఈ సంఘటనను నేను ఊహించలేదు. అప్పటికే నేను 18గంటలు ట్రావెలింగ్‌లో ఉన్నాను. అప్పుడే ఫ్లయిట్ దిగాను. ఫొటో అడిగింది. సరే కదా అని కళ్లజోడు పెట్టుకుని ఫొటో ఇచ్చాను. ఆ అమ్మాయి బాగా హైపరైపోయి నా బుగ్గ గిల్లింది. కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యా. కానీ ఇదంతా ప్రేమలో భాగమే కదా అనిపించింది (నవ్వుతూ). ♦ మీరు కనిపించినప్పుడు పెద్ద స్థాయిలో మీ చుట్టూ ఫ్యాన్స్ గుమిగూడతారు. ఫోటోల కోసం పోటీ పడుతుంటారు. అయినా మీరు సహనం కోల్పోకుండా ఎంతో ఓర్పుగా ఉంటారు... ప్రభాస్:అది ఫస్ట్ నుంచే డిసైడైపోయాను. నేనైతే అభిమానులను కొట్టలేను. తొయ్యలేను. నాకు రక్షణగా ఉన్నవారు అలా చేయడానికి ప్రయత్నించినా నాకు ఏదోలా ఉంటుంది. ఒక్క ఫ్యాన్ వస్తే చాలు అనుకున్నప్పుడు... ఇంత మంది ఫ్యాన్స్ ఉండటం అంటే హ్యాపీనే కదా. ఎలాగూ నేను బయట కనిపించేది తక్కువ. కనిపించినప్పుడు అభిమానం చూపిస్తారు. అది నాకు ఇష్టమే. ♦ ‘బాహుబలి 2’ విడుదలప్పుడు కన్నా... ‘సాహో’ విడుదలకు ఏమైనా ఎక్కువ టెన్షన్ పడుతున్నారా? ప్రభాస్:‘బాహుబలి 2’ అప్పుడు పెద్దగా టెన్షన్ లేదు. ఎందుకుంటే అప్పటికే ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలైపోయింది. యాభై శాతం సక్సెస్ వచ్చింది. ఇండియా అంతా యాక్సెప్ట్ చేశారు. ‘బాహుబలి 2’ లో కూడా మంచి కంటెంట్ ఉంది. మినిమమ్ గ్యారంటీ అనుకున్నాం. కానీ ‘బాహుబలి 1’ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు ముంబై వెళ్లాం. తమిళనాడు వెళ్లాం. కేరళ వెళ్లాం.. మాట్లాడాం. ‘బాహుబలి’లో అది చేశాం.. ఇది చేశాం అని చెప్పాం. రేపు ఈ సినిమా చూసి.. ఇదేం సినిమారా అంటారేమోనని భయం. మళ్లీ బడ్జెట్ ఒకటి. ఆపేయాలా.. ఆగిపోవాలా? ఏమైనా తేడా జరిగితే.. ఇలాంటి ఆలోచనలతో ‘బాహుబలి 2’ అప్పుడు భయంకరమైన ప్రెజర్. ‘సాహో’ రిలీజ్ అప్పుడు ఇంకో రకమైన ప్రెజర్. ♦ హిందీలో కరణ్ జోహార్ ఓ సినిమా చేయమంటే మీరు చేయనన్నారనే వార్తలు వచ్చాయి.. ప్రభాస్:అదేం లేదు. నేను, కరణ్ జోహార్ ఇప్పటికీ మాట్లాడుకుంటాం. భవిష్యత్‌లో కరణ్‌తో సినిమా ఉండొచ్చు. ఏమో.. ఇప్పుడే చెప్పలేను. ♦ నెగటివ్ కామెంట్స్‌ని ఎలా తీసుకుంటారు? ప్రభాస్:నేను ఎక్కువగా సోషల్ మీడియాను ఫాలో అవ్వను. కానీ సక్సెస్‌లో అవి కూడా భాగం అనుకుంటాను. సక్సెస్ రోడ్ స్ట్రైయిట్‌గా ఉండదు కదా. చాలా దార్లు తొక్కి వచ్చాం. కొన్నిసార్లు నా తప్పులు ఉంటాయి. మరికొన్ని సార్లు పరిస్థితుల ప్రభావం కావొచ్చు. నెగటివ్, పాజిటివ్ సక్సెస్‌లో భాగమే. ♦ ఫైనల్లీ దాదాపు 2 కోట్లు (ఫస్ట్ సినిమా ‘ఈశ్వర్’ బడ్జెట్) నుంచి 350 కోట్ల (‘సాహో’ బడ్జెట్) వరకు చేరుకున్న మీ ప్రయాణం గురించి? ప్రభాస్:‘ఈశ్వర్’కి కోటీపాతిక లక్షలు అయింది. ఆ సినిమా అంతా రోడ్డు మీదే చేశాం. పెద్ద స్టార్స్ కూడా లేరు. అక్కణ్ణుంచి కెరీర్ ఇంతదాకా వచ్చింది. ఇది నా ఒక్కడివల్ల కాదు. నాతో సినిమాలు చేసిన అందరికీ దక్కుతుంది. – సినిమా డెస్క్ -
విడుదలైన సాహో రొమాంటిక్ పాట!
సాహో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆ సినిమాకు సంబంధించిన ఒక్కోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలోని మూడు పాటలను ఒక్కొక్కట్టిగా రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్న చిత్రబృందం తాజాగా ‘బేబీ వోంట్ యూ టెల్ మీ’ పాటను విడుదల చేసింది. హీరో ప్రభాస్ ‘సాహో నుంచి రొమాంటిక్, మెలోడియస్ పాట విడుదల’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను పోస్ట్ చేశాడు. ఈ పాటకు విడుదలైన ఒక్క గంటలోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే ఓ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ మరో పాటను విడుదల చేసింది. ‘బేబీ వొంట్ యూ టెల్ మీ’ అంటూ సాగనున్న ఈ పాటకు మనోజ్ యాదవ్ లిరిక్స్‌ని అందించాడు. శంకర్ , ఎహాన్స్, లాయ్ త్రయంలు హీందీ వెర్షన్లో ఈ పాటను కంపోస్ చేయగా శంకర్ మహదేవన్, రవి మిష్రా, అలిస్సా మన్డొన్సా ఆలపించారు. అందమైన సాహిత్యంతో కూడిన పాట సన్నివేశాలను అస్ట్రియాలోని పలు అద్భతమైన సుందర ప్రదేశాల్లో చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో ప్రభాస్, శ్రద్ధలు పోలీసుల పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆగష్టు 30న విడుదల చేయనున్నారు. View this post on Instagram New symphony from Saaho with romance and lots more is out now. Hope you all like it! #Saaho #SaahoOnAugust30 @shraddhakapoor @sujeethsign @neilnitinmukesh @apnabhidu @chunkypanday @arunvijayno1 @mandirabedi @maheshmanjrekar @sharma_murli @vennelakish @uvcreationsofficial @bhushankumar @tseries.official @officialsaahomovie A post shared by Prabhas (@actorprabhas) on Aug 25, 2019 at 11:24pm PDT -
అతడు నిజంగానే డై హార్డ్ ఫ్యాన్
సాహో చిత్రంలోంచి డై హార్డ్ఫ్యాన్స్ అనే డైలాగ్ ప్రస్తుతం ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అది ప్రభాస్ అభిమానుల కోసం దర్శకుడు ప్రత్యేకంగా రాసిన సంగతి తెలిసిందే. డార్లింగ్‌కు బయట నిజంగానే డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సిరీస్‌తో జాతీయస్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్‌కు.. దేశమంతటా అభిమానులు ఉన్నారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనితో.. అతను ఓన్లీ ఫ్యాన్ కాదు డై హార్డ్ ఫ్యాన్ అని తెలుస్తోంది. ఒరిస్సాకు చెందిన ఓ అభిమాని 486 రూబిక్ క్యూబ్స్‌తో దాదాపు 13 గంటలు శ్రమించి.. ప్రబాస్ ముఖచిత్రం వచ్చేట్లుగా సమకూర్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక సాహో రికార్డుల విషయానికొస్తే.. సెకన్లలో టిక్కెట్లు అమ్ముడైపోతున్నట్టు తెలుస్తోంది. బుక్‌మైషోలో సాహోకు 360k (3,60,000) లైక్స్ వచ్చినట్లు పేర్కొంది. బాలీవుడ్లో ఖాన్ చిత్రాలకు మాత్రం 150-200k లైక్స్ వస్తాయని ..కానీ సాహో మాత్రం వారి సినిమాలను దాటేసిందని తెలిపింది. సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ మూవీ ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. -
లైటింగ్ + షాడో = సాహో
లార్జర్ దాన్ లైఫ్ సినిమాలను ‘విజువల్ వండర్’ అని సంబోధిస్తుంటారు. దర్శకుడు మెదడులో అనుకున్న కథను సినిమాటోగ్రాఫర్ తన కెమెరాతో స్క్రీన్ పై చూపిస్తాడు. మన కంటే ముందే తన లెన్స్‌తో సినిమా చూసేస్తాడు కెమెరామేన్. ‘సాహో’ లాంటి భారీ సినిమాని తన కెమెరా కన్నుతో ముందే చూసేశారు చిత్ర ఛాయాగ్రాహకుడు మది. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’కి మది ప్రత్యేకంగా చెప్పిన ‘మేకింగ్ ఆఫ్ సాహో’ విశేషాలు. ► 350 కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేసే చాన్స్ తరచు రాదు. ప్రభాస్‌తో గతంలో ‘మిర్చి’ చేశాను. స్వతహాగా ఆయన హ్యాండ్సమ్గా ఉంటారు. ‘మిర్చి’లో స్టైలిష్‌గా చూపించే అవకాశం నాకు దక్కింది. ఇప్పుడు ‘సాహో’లో మరిన్ని షేడ్స్‌లో ప్రభాస్‌ని చూపించాను. దర్శకుడు సుజీత్ తీసిన ‘రన్ రాజా రన్’కి వర్క్ చేశాను. యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నాకు మంచి స్నేహితులు. ‘సాహో’ లాంటి విజువల్ వండర్‌కి పని చేయడం అద్భుతమైన అవకాశం. విజువల్‌గా ఈ సినిమా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ► ఇలాంటి భారీ సినిమాకు హోమ్ వర్క్ లేకుండా డైరెక్ట్‌గా సెట్లో దిగలేం. ‘సాహో’ సినిమాకు ప్రీ–ప్రొడక్షన్ వర్క్, ప్రీ–డిజైన్ వర్క్ చాలా ఎక్కువ చేశాం. అవుట్‌పుట్ ఎలా వస్తుందో? అని ముందే రఫ్‌గా చూసుకున్నాం. కెమెరామేన్, యాక్షన్ డైరెక్టర్, వీఎఫ్ఎక్స్ టీమ్ అందరం కలిసి టీమ్‌గా వర్క్ చేశాం. ► ‘సాహో’ బహుభాషా చిత్రం. ఒక భాషలో ఓ సన్నివేశం తీయగానే అదే సన్నివేశాన్ని యాక్టర్స్ అందరూ వేరే భాషలో నటించాలి. దానికి లైటింగ్ చాలా ముఖ్యం. అందుకే సన్నివేశానికి సంబంధించిన వాతావరణాన్ని మొత్తం లైటింగ్‌తో సృష్టించాం. అప్పుడు కంటిన్యూటీ మొత్తం మా కంట్రోల్లోనే ఉంటుంది. కొన్ని సన్నివేశాలకు లైటింగ్ సృష్టించడానికి రెండు మూడు రోజులు పట్టేది. ► ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పలు షేడ్స్‌లో ఉంటుంది. కథకు తగ్గట్టు క్యారెక్టర్ మారినప్పుడల్లా లైటింగ్ కూడా మార్చాలి. మామూలుగా ఏ సినిమాకైనా 4కెడబ్లు్య (కిలో వాట్స్), 6కెడబ్లు్య లేకపోతే 9కెడబ్లు్య లైటింగ్ వాడతాం. కానీ, ‘సాహో’కి మాత్రం హై ఇంటెన్సిటీ లైటింగ్ వాడాం. 16కెడబ్లు్య నుంచి 18కెడబ్లు్య లైటింగ్ వాడాం. దాన్నిబట్టి ఈ కథ మైలేజ్‌ని ఊహించుకోవచ్చు. చెప్పాలంటే సినిమా మొత్తం లైటింగ్, షాడో ఓరియంటెడ్‌గా ఉంటుంది. కథకు, సినిమాటోగ్రఫీకి వారధిలా లైటింగ్ నిలిచిందని చెప్పొచ్చు. ► ఈ సినిమాకు ఒకటి రెండు కాదు కొత్త కొత్త కెమెరా పరికరాలు చాలా ఉపయోగించాం. సుమారు 7–8 కెమెరా హెడ్స్‌ను వాడాం. ఈవో కార్, స్కార్పియో రిమోట్ హెడ్ కెమెరాలు, స్పెషల్ జీఎఫ్8 కెమెరాలు, 2 జిమ్మీ జిబ్స్, మాక్సిమస్ కెమెరా హెడ్ (అన్నింటి కంటే కొంచెం ఖరీదైన పరికరం ఇది). వెబ్రేషన్స్‌ను అదుపులో ఉంచే జింబల్ హ్యాండ్ కెమెరాలు, చాప్‌మ్యాన్ డాలీ, జీఎఫ్ఎమ్ క్రేన్ ఇవన్నీ ఉపయోగించాం. హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ కెన్నీ బేట్స్‌తో సంభాషించి కొన్ని పరికరాలను జర్మనీ నుంచి తీసుకువచ్చాం. సన్నివేశానికి అనుగుణంగా, క్వాలిటీకి రాజీపడకుండా కెమెరాలు వాడాం. ► అబుదాబిలో షూట్ చేసిన యాక్షన్ సన్నివేశాలకు ప్రతిరోజు సెట్లో 14 కెమెరాలు వరకూ ఉండేవి. మెయిన్ కెమెరాలు 7, ఇతర కెమెరాలు 7. సుమారు 25 రోజులు ఆ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించాం. నా టీమ్ మొత్తం 60 మంది. అబుదాబి షెడ్యూల్లో దాదాపు 80మంది కెమెరా డిపార్ట్‌మెంట్‌కే వర్క్ చేశారు. ఫోకస్ పుల్లర్స్, లైటింగ్ డిపార్ట్మెంట్, క్రేన్స్ ఇలా ఒక్కో విభాగం చూసుకున్నారు. అందులో 20 శాతం ఫారిన్ వాళ్లు కూడా పని చేశారు. ఫారిన్ వాళ్లతో పని చేసే సమయంలో ఓ ఇబ్బంది ఉంది. అదేంటంటే కమ్యూనికేషన్. ఒక్కో డిపార్ట్మెంట్కు టెక్నికల్ పదాలు ఒక్కోలా ఉంటాయి. యాక్షన్ వాళ్ల టెక్నికల్ పదాలు ఒకలా ఉంటాయి. కెమెరా వాళ్లవి ఒకలా ఉంటాయి. వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పడం కూడా చిన్న చాలెంజే (నవ్వుతూ). ► ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నలిగిపోయినవన్నీ ఒరిజినల్ ట్రక్కులు, కార్లు. ముందు డమ్మీలతో ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఒరిజినల్ కార్స్, ట్రక్స్‌ని బద్దలు కొట్టారు. సినిమాలో ఎంత మోతాదులో యాక్షన్ ఉందో.. అంతే ప్రాముఖ్యత లవ్‌స్టోరీకి కూడా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలకు ఒక మూడ్ ఉంటుంది. ప్రేమ సన్నివేశాలు ఒక మూడ్. ఈ వ్యత్యాసాన్ని స్క్రీన్ మీద చూపించడం చాలా ఎంజాయ్ చేశాను. ప్రభాస్, శ్రద్ధాకపూర్ ► అబుదాబి ఫైట్ ఎపిసోడ్ కాకుండా గన్‌ఫైట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. డమ్మీ బులెట్స్‌తో షూట్ చేసినప్పటికీ ఈ ఎఫెక్ట్ కొత్తగా ఉంటుంది. కెమెరా మూమెంట్స్ అన్నీ గన్ పాయింట్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. అటు కెమెరాకి ఇటు మాకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ ఫైట్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ► భారీ యాక్షన్ సినిమా చేస్తున్నప్పుడు ప్రమాదాలు అనివార్యం. కానీ మే మాత్రం ఎవరి లైఫ్‌నీ రిస్క్ చేయదలచుకోలేదు. యాక్షన్ సన్నివేశాల్లో కారు 150 కి.మీ. ల వేగంతో వెళ్తుందంటే అంత స్పీడ్‌తో కెమెరా ఫాలో కానక్కర్లేదు. మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఉపయోగించుకున్నాం. అలా టెక్నాలజీ హెల్ప్‌తో ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. 225 రోజులు వర్కింగ్ డేస్ ఉన్నప్పటికీ ఒక్క కెమెరా పరికరానికి డ్యామేజ్ జరగలేదు. అదే పెద్ద విశేషం. పెద్ద పెద్ద ట్రక్కులను, కార్లను మాత్రమే డ్యామేజ్ చేశాం (నవ్వుతూ). టోటల్‌గా ‘సాహో’ మాకో మంచి అనుభూతి. రేపు ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతి అవుతుంది. ► అబుదాబి వాతావరణం భిన్నంగా ఉంటుంది. అక్కడ ఎండ 45 డిగ్రీలు పైనే. అబుదాబి షెడ్యూల్లో చాలామంది వడదెబ్బకు గురయ్యారు. మాలో కొంతమందికి చర్మం ఊడొస్తుండేది. అనూహ్యంగా ఇసుక తుఫానులు కూడా వస్తుండేవి. అలాంటి సమయాల్లో మమ్మల్ని మేం కాపాడుకుంటూనే మా ఖరీదైన కెమెరాలను కూడా జాగ్రత్త చేసేవాళ్లం. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడానికి చాలా కష్టపడతాం. అవుట్‌పుట్ చూశాక ఆ కష్టాలన్నీ మర్చిపోతాం. ► ఈ సినిమా చిత్రీకరణకు 230 రోజులు పట్టింది. అది కూడా 8 రోజులు టెస్ట్ షూట్, 50 రోజుల లైటింగ్ అరేంజ్‌మెంట్‌ను మినహాయించి. ► ‘సాహో’ కోసం సుమారు 60 సెట్లను ఏర్పాటు చేశారు. ఈ సెట్లన్నీ హైదరాబాద్, పూణే, ముంబై, అబుదాబి, యూరోప్‌లో వేశారు. ► 350 కోట్ల బడ్జెట్లో కెమెరా డిపార్ట్మెంట్కు కేటాయించిన బడ్జెట్ సుమారు 25 కోట్లు (కెమెరామేన్ల రెమ్యూనరేషన్లు మినహాయించి). – గౌతమ్ మల్లాది -
ఇక అలాంటి సినిమాలు చేయను : ప్రభాస్
సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రభాస్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అనుష్కతో తన అనుబంధం గురించి క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. ఇక మీదట ఎట్టిపరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పేశాడు. భారీ బడ్జెట్ చిత్రాల వల్ల చాలా రోజులు పాటు షూటింగ్ చేయాల్సి రావటంతో పాటు రిలీజ్ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురికావాల్సి వస్తుందన్నాడు ప్రభాస్. అభిమానుల కోరిక మేరకు ఇక మీదట ఏడాదికి రెండు సినిమాలు చేసేలా ప్రయత్నిస్తానని చెప్పాడు. అంతేకాదు ‘సాహో భారీ వసూళ్లు సాధించి చరిత్ర సృష్టిస్తుందో లేదో చెప్పలేను కానీ బాహుబలి అభిమానులను మాత్రం తప్పకుండా అలరిస్తుంద’న్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. శ్రద్ధకపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. -
సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!
సాహో సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఆ సినిమాకు సంబంధించిన ఒక్కోవార్త మీడియా సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా సినిమా బడ్జెట్, పారితోషికాలకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ప్రత్యేకగీతంలో నటించిన జాక్వలిన్ ఫెర్నాండెజ్‌కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక్క పాటలో నటించినందుకు ఈ భామకు రూ. 2 కోట్ల పారితోషికంగా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఉత్తరాది నటులనే తీసుకున్న సాహో టీం, సినిమా మీద అంచనాలు మరింత పెంచేందుకు జాక్వలిన్‌తో స్పెషల్ సాంగ్ చేయించారు. అందుకే భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈవార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మహేష్ మంజ్రేకర్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, లాల్, మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సాహో సినిమా ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
‘సాహో’ రన్ టైమ్ ఎంతంటే..?
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు దగ్గరకు వచ్చేస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరగడం.. ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా అత్యంత భారీఎత్తున సాహోను నిర్మించడంతో అంచనాలు ఆకాశన్నంటాయి. పాటలతో, టీజర్, ట్రైలర్‌తో భారీ హైప్ క్రియేట్చేసిన సాహో.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 171.52 నిమిషాలు (2 గంటల 51 నిమిషాలు). ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 30న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉంది. -
సాహోకు ఆ రికార్డు దాసోహం
చెన్నై : సాహో ఫీవర్ పీక్స్‌కు చేరడంతో రికార్డులు సైతం సాహోకు దాసోహం అంటున్నాయి. ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సాహో అత్యధిక స్ర్కీన్లలో విడుదలవుతూ బాహుబలి రికార్డులను అధిగమిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ్, మళయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతున్న సాహో తమిళ్ వెర్షన్‌కు అత్యధిక స్క్రీన్లు దక్కాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 తమిళనాడులో 525 థియేటర్లలో రిలీజ్ కాగా సాహో ఏకంగా 550 స్క్రీన్లలో సందడి చేయనుంది. సాహోకు పెద్దసంఖ్యలో థియేటర్లు అందుబాటులోకి రావడంతో బాహుబలి 2 వసూళ్ల రికార్డును అధిగమించే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు. సాహోతో తమిళ ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం చూసిన అనుభూతి దక్కుతుందని దర్శకుడు సుజీత్ చెప్పారు. బాహుబలి సిరీస్ విడుదల అనంతరం పలు భాషా పరిశ్రమల మధ్య హద్దులు చెరిగిపోవడం విశేషం. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, ఇస్మార్ట్ శంకర్ వంటి పలు తెలుగు సినిమాలు తమిళ తెరపైనా వినోదం పంచాయి. సాహో తరహాలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా సైతం తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ భాషల్లో భారీ స్ధాయిలో విడుదలకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’
టాలీవుడ్లో ఇప్పటివరకు ఏ చిత్రానికి దక్కని అరుదైన ఘనతను ‘సాహో’ సొంతం చేసుకుంది. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. యువీ క్రియేషన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిని చిత్ర బృందానికి మరింత జోష్ కలిగించే వార్త లభించింది. తాజాగా సాహోకు ట్విటర్ ఎమోజీ వచ్చింది. ఇందులో వింతేముంది అనుకోకండి. ట్విటర్ ఎమోజీ లభించిన తొలి తెలుగు సినిమాగా ‘సాహో’నిలిచింది. టాలీవుడ్‌ను ఏలిన అగ్రహీరోల సినిమాలకు సాధ్యంకానీ ఘనతను ప్రభాస్ సాహో సాధించింది. ఈ మధ్యకాలంలో తమిళంలో కాలా, సర్కార్, బాలీవుడ్లో జీరో, సుల్తాన్ సినిమాలకు ట్విటర్ ఎమోజీలు వచ్చాయి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లతో ‘సాహో’పై భారీ అంచనాలే నమోదయ్యాయి. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చదవండి: ‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు ‘సాహో నుంచి తీసేశారనుకున్నా’ సాహో : ప్రభాస్ సింగిలా.. డబులా? -
నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా: ప్రభాస్
‘బాహుబలి’తో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించిన ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా అంతే భారీగా ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలతో ప్రభాస్ బిజీ అయ్యాడు. ఇందులో భాగంగా సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా మీడియాతో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈటీ టైమ్స్‌తో మాట్లాడిన యంగ్ రెబల్ స్టార్‌కు హీరోయిన్ అనుష్కతో ఉన్న రిలేషన్షిప్ ఏంటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా ప్రభాస్....‘ నేను లేదా అనుష్క ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటేనే(వేర్వేరు వ్యక్తులను) తప్ప ఈ వదంతులు ఆగేలా లేవు. ఈ విషయం గురించి అనుష్కతో ఓసారి మాట్లాడాల్సిందే. ఇదిగో అనుష్క నువ్వైనా తొందరగా పెళ్లి చేసుకో అని తనకు చెబుతాను. అప్పుడే ఇటువంటి పుకార్లకు తెర పడుతుందేమో’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. నిజంగా తాము రిలేషన్షిప్లో ఉంటే ఏ ఇటలీలోనో, ఏదైనా బీచ్లోనో సంతోషంగా తిరిగేవాళ్లమే కదా ప్రభాస్ అని ప్రశ్నించాడు. అసలు ఇందులో దాచాల్సిన విషయం ఏమిటో తనకు అర్థం కావడం లేదని, అయినా ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం మంచిపద్ధతి కాదని హితవు పలికాడు. కాగా అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని, ఆమె కోసం లాస్ఏంజెల్స్లో సాహో ప్రత్యేక షో వేయిస్తున్నాడంటూ పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దేశ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ‘సాహో’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేశ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు
అభిమానులు ఓ సినిమాపై అంచనాలు పెట్టుకుంటే ఏ రేంజ్లో ఆదరిస్తారో చరిత్రలో అనేక సార్లు చూశాం. ఆ సినిమాకు సంబంధించిన ఫోటో, టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఎంతో హైలెట్ చేస్తారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘సాహో’పై కూడా అంతకుమించి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు రికార్డులు క్రియేట్ చేసాయి. తాజాగా సాహో సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో ప్రభాస్ బ్యాడ్ బ్యాయ్ అంటూ ఓ ప్రత్యేక గీతానికి స్టెప్పులేసిన వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 24 గంటల్లోనే ఈ పాటను 85,24,114 మంది వీక్షించారు. అంతేకాకుండా 3,58,664 మంది లైక్ కొట్టారు. దీంతో ప్రపంచంలోనే కేవలం 24 గంటల్లో ఇన్ని లక్షల మంది వీక్షించిన తొలి పాటగా ‘సాహో.. బ్యాడ్ బాయ్’నిలిచింది. ఇక ఆగస్టు 30న విడుదల కానున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. చదవండి: ‘సాహో నుంచి తీసేశారనుకున్నా’ ప్రభాస్ సింగిలా.. డబులా? -
‘సాహో నుంచి తీసేశారనుకున్నా’
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సాహో టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌లోనూ భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఆ అంచనాలు అందుకునే స్థాయిలో సినిమా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ప్రధాన పాత్రదారులు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన నీల్ నితిన్ ముఖేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘దర్శకుడు సుజీత్ ఈ సినిమా కథ బాహుబలి తొలి భాగం రిలీజ్ సమయంలోనే నాడు వినిపించాడు. కథ నచ్చటంతో వెంటనే ఓకె కూడా చెప్పాను. కానీ ప్రభాస్.. బాహుబలి 2తో బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ ఆలస్యమైంది. నేను కూడా ఇతర సినిమాలు చేశాను. ఒక దశలో నన్ను సాహో నుంచి తీసేశారేమో అనుకున్నా. కానీ సుజీత్ ఇచ్చిన మాట ప్రకారం నన్ను కీలక పాత్ర కోసం మళ్లీ పిలిచారు’ అని వెల్లడించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘సాహో’ను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈసినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సాహో : ప్రభాస్ సింగిలా.. డబులా?
సాహో రిలీజ్‌కు ఇంకా పది రోజులు మాత్రమే సమయముంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అదే స్థాయిలో ఈ సినిమా మీద రకరకాల వార్తలు మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. సాహోలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే పోస్టర్లు, టీజర్, ట్రైలర్ల రిలీజ్ తరువాత ఆ టాక్ మరింత బలపడింది. ప్రభాస్ రెండు రకాల హెయిర్ స్టైయిల్స్‌తో కనిపిస్తుండటంతో సినిమాలో ప్రభాస్ అండర్‌కవర్ పోలీస్‌గా, దొంగగా రెండు పాత్రల్లో కనిపిస్తాడని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిసన్న ఈ సినిమాను సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. -
ఒకే రోజు పది సినిమాల రిలీజ్!
ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు చిన్న సినిమా పండుగ జరగనుంది. పెద్ద హీరోలు బరిలో లేకపోవటంతో, నెలాఖరున సాహో మేనియా మొదలవుతుండటంతో చిన్న సినిమాలన్ని ఆగస్టు 23న రిలీజ్‌కు క్యూ కట్టాయి. దీంతో ఒకే రోజు 10 సినిమాలో బాక్సాఫీస్ బరిలో తలపడుతున్నాయి. అయితే వీటిలో ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతా సినిమాలు రిలీజ్ అవుతున్నట్టుగా కూడా ప్రేక్షకులకు తెలియదు. తమిళ్లో సక్సెస్ అయిన కనా సినిమాను తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఏదైనా జరగొచ్చు సినిమాలపై కాస్త అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు బాయ్, ఉండిపోరాదే, నివాసి, హవా లాంటి సినిమాల సందడి మీడియాల కాస్త కనిపిస్తుంది. నేనే కేడీ నెం 1, జిందా గ్యాంగ్, నీతోనే హాయ్ హాయ్, కనులు కనులు దోచేనే విషయంలో ఆ సందడి కూడా కనిపించటం లేదు. మరి ఈ పది సినిమాల్లో ప్రేక్షకులు ఎన్ని సినిమాలను ఆదరిస్తారో చూడాలి. -
వైరల్ అవుతున్న ప్రభాస్, జాక్వెలిన్ స్టెప్పులు
‘సాహో’ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మేకర్స్.. ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అభిమానులు పోటెత్తడంతో అక్కడి వాతావరణం అంతా సందడిగా మారింది. ప్రభాస్‌ను వెండితెర మీద చూసేందుకు అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారో నిన్నటి ఈవెంట్‌ను చూస్తే అర్థమవుతుంది. బాహుబలి తరువాత రెండేళ్ల గ్యాప్‌తో వస్తోన్న ఈ మూవీపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్లే సాహోను తెరకెక్కించినట్లు దర్శకుడు, నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. సాహో పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఏ రేంజ్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సాహో ట్రైలర్ అయితే యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా బ్యాడ్ బ్యాయ్ అంటూ ఓ ప్రత్యేక గీతాన్ని వదిలారు. ఈ పాటలో మన డార్లింగ్.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుజీత్ తెరకెక్కించిన సాహో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
ప్రభాస్ అంతర్జాతీయ స్టార్ కావాలి – కృష్ణంరాజు
‘‘హాలీవుడ్ సినిమాలతో పోటీ పడగల గొప్ప సినిమా ‘సాహో’ అని చాలామంది ఫోన్లు చేశారు. ప్రభాస్‌తో ఈ సినిమా గురించి ‘ఏం కంగారు పడొద్దు. నీ కష్టానికి తగ్గట్టు ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది’ అని చెప్పాను. ప్రభాస్ అంతర్జాతీయ స్టార్ కావాలని కోరుకుంటున్నాను’’ అని కృష్ణంరాజు అన్నారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మించారు. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటించారు.ఈ నెల 30న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘సాహో’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా ఫోన్లు వచ్చాయి. ప్రభాస్ ఇంకా కనిపించాలన్నారు. ఆ తర్వాత విడుదల చేసిన పోస్టర్లు బాగున్నాయన్నారు. టీజర్‌కు ఆహో.. ఓహో అన్నారు. ట్రైలర్ విడుదల తర్వాత అబ్బో అన్నారు. ఆ అబ్బో అనేది ఇంటర్నేషనల్ లెవల్‌కి వెళ్లింది. ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్ కెన్నీ బెట్స్.. ‘కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా కొన్ని ఫైట్స్‌ని ప్రభాస్ బాగా చేశాడు’ అన్నారు. చాలా హ్యాపీ. ప్రభాస్ చాలా కష్టపడ్డాడు. నా అనుభవంతో చెబుతున్నా.. 150 పర్సెంట్ ఏం తేడా ఉండదు. సినిమా విడుదల తర్వాత సుజిత్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవ్వాలని రాజమౌళిగారు ఆశీర్వదించారు. నేను తథాస్తు అంటున్నాను. వంశీ, ప్రమోద్‌లు చాలా కష్టపడ్డారు’’ అన్నారు కృష్ణంరాజు. ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘ఫ్యాన్స్.. డై హార్డ్ ఫ్యాన్స్..’ డైలాగ్ రాసింది సుజితే. తనకి మాస్ పల్స్ తెలుసు. కెమెరామేన్ మదిగారు యూవీ ఫ్యామిలీలో ఒకరు అయిపోయారు. సాబు సిరిల్గారిని ఈ సినిమా చేయమని నేనే అడిగాను. నన్ను ఎగై్జట్ చేస్తేనే చేస్తాను అన్నారు. నచ్చింది.. చేశారు. టీమ్ అందరికీ థ్యాంక్స్. అనిల్ ఠాడానీగారే ‘బాహుబలి’ సినిమాను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ‘సాహో’కు ఫస్ట్ డే నుంచి సపోర్ట్ చేశారు. టీ సిరీస్ భూషణ్ కుమార్‌గారు రావడానికి కుదర్లేదు. సుజిత్ 22 ఏళ్లకి ‘రన్ రాజా రన్’ చేశాడు. 24 ఏళ్లకి ‘సాహో’ కథ చెప్పాడు. కథ చెప్పడం కూడా 40 ఏళ్ల అనుభవం ఉన్నవాడిలా చెప్పాడు. ప్రీ– ప్రొడక్షన్ కోసం ఏడాది కష్టపడ్డాడు. షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాడని కంగారు పడ్డాం. తను హ్యాండిల్ చేసిన విధానానికే గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిపోతాడనుకుంటున్నాను. ఇంత పెద్ద సినిమా చేయడం జోక్ కాదు. సుజిత్ ఇంటర్నేషనల్ లెవల్‌కి వెళ్లిపోతాడని అనుకుంటున్నాను. శ్రద్ధా రెండేళ్లుగా ఈ సినిమా కోసం పని చేశారు. ఒక్క రోజు కూడా ప్రొడక్షన్‌కి ప్రాబ్లమ్ రాలేదు. తను సూపర్ పెర్ఫార్మర్. యాక్షన్ సీన్లు ఇరగదీసింది. ఏడాదికి రెండు సినిమాలు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను’ అని ‘బాహుబలి’ అప్పుడు చెప్పాను. మిస్ అయ్యాను. ఈసారి మాట ఇవ్వకుండా చేయాలనుకుంటున్నాను. అనుకున్నదానికంటే యూవీ వాళ్లు పెద్దగా చేశారు. 100 కోట్లు లాభం వచ్చేది జాగ్రత్తగా చేసుకుంటే. దాన్ని వదిలేసుకొని ఈ సినిమాను ఇలా ఖర్చుపెట్టి చేశారు. వాళ్లు నా ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ అందరం కలసి పెరిగాం. వాళ్ల గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అందరికీ అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ల హీరో సినిమా హిట్ అవ్వాలనుకుంటారు. అందరి హీరోల ఫ్యాన్స్ ప్రభాస్ సినిమా హిట్ అవ్వాలనుకుంటారు. ప్రభాస్ ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడడు. తన చుట్టూ ఎప్పుడూ పాజిటివిటి ఉంటుంది. అదే అంత మంది ఫ్యాన్స్‌ని తెచ్చిపెట్టింది. ప్రభాస్‌కి దూరదృష్టి ఎక్కువ. ‘బాహుబలి’ తర్వాత ఏ సినిమా చేయాలి అని చాలా తపన పడ్డాడు. ఒకరోజు ఎగై్జటింగ్‌గా వచ్చి సుజిత్ సూపర్ కథ చెప్పాడు అన్నాడు. కథని నమ్మి సినిమా చేశాడు. సుజిత్ చిన్న కుర్రాడు. చాలామంది చాలా సందేహించారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కి అందరికీ అర్థం అయిపోయింది. సుజిత్ కంగ్రాట్స్. ప్రొఫెషనల్ డైరెక్టర్లా చేశావు. అతని భుజాల మీదే సినిమా నిలబడింది. వంశీ, ప్రమోద్‌కి సింహాలకి ఉండే గుండె ఉన్నట్టుంది. ప్రభాస్ ఏం అడిగినా కళ్లు మూసుకొని ఖర్చుపెడతారు. అందరూ సుజిత్ కథను నమ్మారు. అందుకే నాకు సినిమా మీద నమ్మకం. చాలా పెద్ద రేంజ్, రికార్డ్ క్రియేట్ చేస్తుంది. పెట్టిన డబ్బులకు డబుల్ ట్రిపుల్ రావాలి. సెట్లు, వీఎఫ్ఎక్స్, అన్నీ బాగా కుదిరాయి. సూపర్ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘ప్రభాస్‌లాంటి మిత్రుడు మన జీవితంలో ఉంటే ఇంకేం అక్కర్లేదు... ప్రభాస్ బాలీవుడ్‌లోనూ∙పెద్ద స్టార్ అయినందుకు సంతోషంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీని ప్రభాస్ ఇంకా.. వెయ్యికోట్లు, 2 వేల కోట్ల బడ్జెట్ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. ‘‘మా అమ్మకు 80 ఏళ్లు. ‘సాహో’ ఫంక్షన్‌కి వెళ్తున్నాను అంటే.. ‘రేయ్ కుర్రాడు ఒడ్డూ పొడుగు బావుంటాడు.. మీ నాయనలాగా’ అన్నారు మా అమ్మ. ‘అవును.. ప్రభాస్ చూడటానికి భలే ఉంటాడు’ అని మా ఆవిడ చెప్పింది. ‘నాకు ఫస్ట్ డే టికెట్స్ కావాలిరా’ అని మా సిస్టర్, ‘నాకు 10–15 టికెట్స్ కావాలి. ప్రభాస్ కోసం కాలేజ్ ఎగ్గొట్టొచ్చు’ అంటుంది మా మేనకోడలు. నాలుగు జనరేషన్స్‌లో తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెండేళ్ల క్రితం రాజమౌళితో కలసి మ్యాజిక్ చేశారు. ఈ సినిమా దానికంటే పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి. ‘‘ప్రభాస్ ఇప్పుడు ఆల్ ఇండియా స్టార్స్ రేంజ్‌కి ఎదిగిన మన తెలుగువాడు. ఇంత పెద్ద హీరో అవ్వడం గర్వించదగ్గ విషయం. నిర్మాతలు భయం లేకుండా ఖర్చుపెట్టారు. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘‘నన్ను చూసి సినిమాల్లోకి వచ్చామని వంశీ, ప్రమోద్, విక్కీలు అంటుంటారు. కానీ ఇప్పుడు వారిని చూసి ఆల్ ఇండియా ఫిల్మ్ ఎలా తీయాలో నేను నేర్చుకుంటున్నాను. ‘బాహుబలి’ లాంటి సినిమాను ఆల్ ఇండియా స్థాయికి తీసుకుని వెళ్లడానికి రాజమౌళిగారికి 15 ఏళ్లు పట్టింది. సెకండ్ సినిమాతోనే ప్రభాస్‌తో సినిమా తీశాడు సుజీత్’’ అన్నారు ‘దిల్’ రాజు.‘సాహో’ టీమ్‌తో, ప్రభాస్‌తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు శ్రద్ధా కపూర్. ‘‘నేను షార్ట్‌ఫిల్మ్స్ చేస్తున్న రోజుల్లో నా దగ్గర ఉన్న ఓ డీవీడీ యువీ క్రియేషన్స్ వాళ్ల దగ్గరకు వెళ్లింది. స్క్రీన్‌ప్లే బాగా రాస్తున్నాడు పిలవండి అన్నారు ప్రభాస్. నేను వెళ్లలేదు. తర్వాత యువీ క్రియేషన్స్‌కి వెళ్లి ప్రభాస్‌ని కలిసినప్పుడు ‘ఏంటి డార్లింగ్ అప్పుడు రాలేదు’ అన్నారు. ప్రభాస్‌గారు 100 టీబీ హార్డ్‌డిస్క్. మాట్లాడినవన్నీ ఆయనకు గుర్తుంటాయి. ‘బాహుబలి’ తర్వాత నాతో పని చేస్తున్నప్పుడు అంతే కష్టపడ్డారు. గౌరవించారు. ప్రభాస్ అన్నా మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియదు. వీడు తీయగలడా అని కొందరు అడిగారు. ప్రతిసారీ నన్ను నమ్మారు. వంశీ, ప్రమోద్, విక్కీ.. నాకు ముగ్గురు అన్నలు.’’ అన్నారు సుజీత్. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాధాకృష్ణ, నిర్మాత విజయ్ చిల్లా, నటులు అరుణ్ విజయ్, మురళీ శర్మ, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, గేయ రచయిత కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. ‘సాహో’ సినిమా కోసం వాడిన గన్స్, కత్తులు, కార్లు, క్రేన్స్ అన్నింటినీ ఈ వేడుకలో ప్రేక్షకుల వీక్షించడం కోసం ఏర్పాటు చేశారు. -
వైరల్ అవుతున్న ప్రభాస్ కటౌట్
కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మెయ్యాలి డ్యూడ్.. అంటూ మిర్ఛి సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్‌ను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. అలాంటి డైలాగ్ చెప్పిన ప్రభాస్‌కు ఆయన ఫ్యాన్స్ భారీ కటౌట్‌ను ఏర్పాటుచేశారు. ప్యాన్ ఇండియా మూవీగా భారీ హైప్ క్రియేట్చేసిన సాహో రిలీజ్‌కు సిద్దమవుతోంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆదివారం సాయంత్రం సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అక్కడికి అభిమానులు తండోపతండాలుగా రావడంతో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ఈ ఈవెంట్లో ఆయన అభిమానులు అరవై అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కటౌట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్టు 30న అభిమానుల ముందుకు రానుంది. -
వైఎస్ జగన్ పాలనపై ప్రభాస్ కామెంట్
బాహుబలి చిత్రాల తరువాత ప్రభాస్ చేస్తున్న సాహోపై ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరకీ తెలిసిందే. బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న సాహోను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు. పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్‌తో హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. ట్రైలర్‌ను రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక అప్పటినుంచి అన్ని భాషల్లో ప్రమోషన్స్ కార్యక్రమాలను చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ పాల్గొన్నాడు. అక్కడి మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమిళనాడులో వైఎస్ జగన్‌ను పొలిటికల్ బాహుబలిగా చూస్తారు.. మరి మీ మాటల్లో? అంటూ ప్రభాస్‌ను ప్రశ్నించగా... నాకు పాలిటిక్స్ అంతగా తెలియవు. అయితే, ఓ యువనేతగా జగన్ ఏపీని అభివృద్ది పథంలో నడిపిస్తారనే నమ్మకం ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు బాగుంది. వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగుంటుందనుకుంటున్నా’ అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం సాహో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
‘సాహో’ రన్‌టైం ఎంతంటే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. 350 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ వైరల్‌గా మారుతోంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా నిడివి 2 గంటల 46 నిమిషాలకు ఫిక్స్ చేశారట. స్మోకింగ్ యాడ్స్ కూడా కలుపుకుంటే దాదాపు 2 గంటల 50 నిమిషాల అని తెలుస్తోంది. ఈ రన్‌టైంతోనే సినిమాను సెన్సార్‌కు పంపేందుకు ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. కాస్త లెంగ్తీగా అనిపించినా అనుకున్న కథను ఇంట్రస్టింగ్‌గా చెప్పేందుకు ఆ డ్యూరేషన్ తప్పదని ఫిక్స్ అయ్యారట సాహో టీం. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సాహో.. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్రయూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకను రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నారు. -
సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!
బాహుబలి చిత్రాన్ని మెచ్చిన ప్రేక్షకులను సాహో అలరిస్తే చాలని నటుడు ప్రభాస్ పేర్కొన్నారు. బాహుబలి 1, 2 చిత్రాలతో భారతీయ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులను అలరించిన నటుడు ప్రభాస్. ముఖ్యంగా తమిళంలో మంచి పేరు తెచ్చుకున్నారు. బాహుబలి 1, 2 చిత్రాల తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. బాహుబలి చిత్రాలకు మించిన భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్న చిత్రం సాహో. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో నటుడు అరుణ్‌విజయ్, నీల్‌నితిన్ ముఖేశ్, జాకీష్రాఫ్ ముఖ్యపాత్రలను పోషించారు. యువదర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా సాహో నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 30న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సాహో చిత్ర తమిళ వెర్షన్ ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు ప్రభాస్ మాట్లాడుతూ ‘సాహో అంటే జయహో అని అర్థం. చిత్రం చూస్తే అది మీకే అర్థం అవుతుంది. సాహో చిత్రం కోసం రెండేళ్లు కాల్షీట్స్ ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదు. బాహుబలి చిత్రాల తరువాత ఆ స్థాయిలో మంచి కథా చిత్రాన్ని చేయాలని అనుకున్నా. అలాంటి సమయంలో సుజిత్ చెప్పిన కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించా’ అని తెలిపారు. నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెట్టారని, ఒక్కో యాక్షన్ సన్నివేశానికి ముందు చాలా ప్రీ ప్రొడక్షన్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. తమిళ్, తెలుగు, హాలీవుడ్‌లకు చెందిన పలువురు స్టంట్‌మాస్టర్లు కలిసి ఫైట్స్ సన్నివేశాలను రూపొందించినట్లు చెప్పారు. అందుకు చాలా సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని అన్నారు. ఇకపోతే తాను పుట్టింది చెన్నైలోనేనని, తమిళంలో స్ట్రయిట్ చిత్రం చేయాలని చాలా ఆశగా ఉందని అన్నారు. అందుకు మంచి కథ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. త్వరలోనే తమిళంలో స్ట్రయిట్ చిత్రంలో నటిస్తానని ప్రభాస్ అన్నారు. బాహుబలి చిత్రాన్ని మెచ్చిన ప్రేక్షకులను ఈ సాహో చిత్రం అలరిస్తే చాలునని ఆయన పేర్కొన్నారు. అయితే సాహో చిత్రాన్ని బాహుబలి చిత్రంతో పోల్చరాదని, అది చారిత్రక కథా చిత్రం కాగా సాహో ఈ కాలానికి చెందిన సోషల్ కథా చిత్రం అని అన్నారు. అయితే ఇందులో మీరు ఇంత వరకూ చూడనటువంటి యాక్షన్ సన్నివేశాలను చూస్తారని అన్నారు. ఇకపోతే తమిళ ప్రేక్షకులకు సాహో చిత్ర యూనిట్ నుంచి చిన్న సర్ఫ్రైజ్ ఉంటుందన్నారు. అదేమిటన్నది ఈ నెల 23న తెలుస్తుందని ప్రభాస్ పేర్కొన్నారు. అదేవిధంగా తనకు హిందీ, ఇంగ్లిష్ చిత్రాల్లో నటించాలన్న ఆశ లేదని చెప్పారు. ఈ సమావేశంలో నటి శ్రద్ధాకపూర్, అరుణ్‌విజయ్, దర్శకుడు సుజిత్ పాల్గొన్నారు. -
ప్రపంచ ప్రఖ్యాత థియేటర్లో ‘సాహో’ షో
రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్న సాహో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రపంచ ప్రఖ్యాత థియేటర్ గ్రాండ్ రెక్స్‌లో ప్రదర్శించనున్నారు. పారిస్‌లోని ఈ థియేటర్లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమా చూసే వీలుంది. ఇప్పటికే సౌత్ నుంచి కబాలి, బాహుబలి, మెర్సల్, విశ్వరూపం 2 లాంటి సినిమాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా సాహోకు ఈ ఘనత దక్కింది. అద్భుతమైన ఇంటీరియర్‌లో అత్యాధునిక సదుపాయాలున్న ఈ థియేటర్లో సినిమా ప్రదర్శనకు అవకాశం దక్కటం గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే గ్రాండ్ రెక్స్ థియేటర్ వద్ద సాహో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన సాహో సినిమా ఆగస్టు 30 ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది. -
చుక్కలనంటుతున్న ‘సాహో’ లెక్కలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాహో ఫీవర్ కొనసాగుతోంది. బాహుబలి తరువాత ప్రభాస్ మరోసారి అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిన సాహో ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్‌లు సృష్టిస్తోంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌లోనే అంత మొత్తాన్ని వెనక్కి రాబట్టే అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు. అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 330 కోట్లకు పైగా జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.125 కోట్లు పలికాయట. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు మొత్తం కలిపి రూ. 46 కోట్లు పలకగా హిందీ వర్షన్ రూ.120 కోట్లకు అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు అమ్ముడైన ఓవర్సీస్ లెక్కలు రూ.42 కోట్లుగా తెలుస్తోంది. ఇవి కాక శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ రూపంలో భారీ మొత్తం వచ్చే అవకాశం ఉంది. ఇవన్ని చూస్తుంటే సాహో, బాహుబలి రికార్డ్లను సైతం తుడిచిపెట్టే ఛాన్స్ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడీ, మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, వెన్నల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు సంగీతమందిస్తుండగా జిబ్రాన్ నేపథ్య సంగీతమందిస్తున్నాడు. -
పెళ్లి వార్తలపై స్పందించిన ప్రభాస్
సాహో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్న ప్రభాస్, ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలను పలకరించిన యంగ్ రెబల్ స్టార్ వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ప్రభాస్ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ వార్తలపై స్పందించిన ప్రభాస్ అవన్నీ రూమర్స్ అంటూ కొట్టి పారేశాడు. అంతేకాదు అనుష్క తో తాను డేటింగ్లో ఉన్నట్టుగా వస్తున్న వార్తల్లోనూ నిజం లేదన్నాడు. ప్రస్తుతం సాహో ప్రమోషన్లో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ తరువాత జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటించనున్నాడు. -
‘సాహో’ టీం మరో సర్ప్రైజ్
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్ సాహో. ఈ నెల 30 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా దాదాపు 350 కోట్లతో యూవీ క్రియేషన్ సంస్థ సినిమాను రూపొందించింది. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా మరో సర్ప్రైజ్ ఇచ్చారు. సాహో గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు ప్రభాస్. యాక్షన్ జానర్‌లోరూపొందించిన ఈ గేమ్‌లో లీడ్ క్యారెక్టర్‌గా ప్రభాస్ కనిపిస్తున్నాడు. ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో రూపొందించిన ఈ గేమ్ టీజర్‌కు మంచి రెస్సాన్స్ వస్తోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
సాహో కోసం...
ఎత్తుగా ఉన్న పర్వతాన్ని చూసి భయపడనక్కర్లేదు. లోయలో నిలబడి కుంగిపోనక్కర్లేదు. అధిరోహించొచ్చు. ఆ పర్వతం భుజం మీద ఎక్కి పర్వతం ఇచ్చిన ఆనందానికి చప్పట్లు కొట్టొచ్చు. ‘సాహో’ సినిమా ఒక పర్వతం లాంటిది. దాన్ని గౌరవించడానికి, కీర్తించడానికి మాత్రమేచాలా సినిమాలు డేట్లు మార్చుకున్నాయి. ఆ సినిమాల హీరోలు ‘సాహోను సెలబ్రేట్ చేద్దాం’ అని పర్వతం భుజం మీద ఎక్కి చప్పట్లు కొడుతున్నారు. ‘టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో.. అలా ఉంటుంది నేను గుద్దితే’ అని ‘బుజ్జిగాడు’ సినిమాలో విలన్‌కు తన స్టామినా గురించి వార్నింగ్ ఇస్తాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ టిప్పర్ లారీ కాదు బుల్డోజర్. బాక్సాఫీస్‌ని బలంగా తాకి వసూళ్లను భారీగా కొల్లగొట్టే బుల్డోజర్. ఇప్పుడు ఆ బుల్డోజర్ మరోసారి బాక్సాఫీస్‌ను ఢీ కొనడానికి దూసుకొస్తోంది. రోడ్డు ఎంత ఖాళీగా ఉంటే ఫోర్స్ అంత గట్టిగా ఉంటుంది. ‘సాహో’ ఇంకా గట్టిగా యాక్సలేటర్ తొక్కేందుకు మిగతా సినిమాలు సైడ్ ఇండికేటర్లు వేసి సైడ్ అయ్యాయి. రూట్ క్లియర్ చేశాయి. ‘సాహో’ సోలో రిలీజ్ కోసం తమ సినిమాల రిలీజ్లు వాయిదా వేసుకున్నాయి. ‘సాహో’ డేట్ పోస్ట్‌పోన్ కావడంతో డేట్స్ షిఫ్ట్ అయిన సినిమాలు, డేట్ షిఫ్ట్ చేసుకున్న సినిమాల వివరాలు ఓ సారి చూద్దాం. ‘సాహో’ సినిమాను ముందుగా ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం. నేషనల్ హాలిడే. ఓపెనింగ్స్ సృష్టించడానికి ఓపెన్ గ్రౌండ్. కానీ పోస్ట్ ప్రొడక్షన్లో పూర్తవ్వాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఉడకని విందుభోజనాన్ని ఆడియన్స్‌ను అందించడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి... అందుకే 15 రోజులు పోస్ట్‌పోన్ చేసుకున్నారు. ఆగస్ట్ 30న వస్తున్నారు. దాంతో ఆగస్ట్15 ఖాళీ ఏర్పడింది. ఆ డేట్‌ను శర్వానంద్ ‘రణరంగం’, అడవి శేష్ ‘ఎవరు’ సద్వినియోగం చేసుకున్నాయి. సరైన డేట్ కోసం చూస్తున్న ‘రణరంగం’కి మంచి డేట్ కుదిరింది. 23 వస్తున్నాం అని అనౌన్స్ చేసిన ‘ఎవరు’ వారం ముందే వచ్చేస్తోంది. క్యాలెండర్లో కొంచెం ముందుకెళ్తే ఆగస్ట్ 30. నానీ ‘గ్యాంగ్ లీడర్’, సూర్య ‘బందోబస్త్’ (తమిళంలో ‘కాప్పాన్’) రిలీజ్ డేట్లు ప్రకటించాయి. ‘సాహో’ ఆగస్ట్ 30కు రావడంతో ఆ రెండు చిత్రాలు వాయిదా పడ్డాయి. ‘సాహో’ కథేంటి? ట్రైలర్‌ను బట్టి గమనిస్తే... ముంబైలో రెండు వేల కోట్ల చోరీ జరుగుతుంది. దీన్ని ఛేదించడానికి ‘అశోక్ చక్రవర్తి’ (ప్రభాస్ పాత్ర పేరు) అనే అండర్ కవర్ ఆఫీసర్ రంగంలో దిగుతాడు. మరోవైపు ‘వాజీ’ అనే భయంకరమైన సిటీ. గ్యాంగ్స్టర్స్ అడ్డా. అందులో ఓ బ్లాక్ బాక్స్. ఆ బాక్స్ సంపాదిస్తే చాలు ప్రత్యేకంగా డబ్బు సంపాదించాల్సిన పనిలేదు. కోటీశ్వరులు అయిపోవచ్చు. దానికోసం ప్రయత్నాలు జరుగుతుంటాయి. ముంబైలో చోరీకి, వాజీ సిటీకి ఏంటి సంబంధం? తెలియాలి. ‘‘సాహో’ స్క్రీన్‌ప్లే ప్రధానమైన చిత్రం. పాత్రలు మంచివా చెడ్డవా అనేవి స్క్రీన్‌ప్లే మారుస్తుంది’’ అంటోంది చిత్రబృందం. మరి ప్రభాస్ హీరో నా? హీరో ముసుగులో ఉన్న విలనా? విలన్‌గా కలరింగ్ ఇచ్చే హీరోనా? ప్రస్తుతానికి సస్పెన్సే. పోస్ట్‌పోన్ చేసుకున్న సినిమాల వివరాల్లోకి వెళ్తే ... ‘గ్యాంగ్ లీడర్’ కహానీ క్యా హై? పార్థసారథి.. రివెంజ్ స్టోరీల రైటర్. రివెంజ్ కథలు రాశాడంటే తిరుగే లేదు. ఓ రివెంజ్ స్టోరీ రాయమని పార్థసార థి దగ్గరకు వస్తుందో గ్యాంగ్. ఆ గ్యాంగ్‌లో స్కూల్ పాప నుంచి బామ్మ వరకూ ఐదుగురు అమ్మాయిలు ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే వాళ్ల రివెంజ్ తీర్చుకునే ప్లాన్‌ను సారథి రాయాలి. రాయడమే కాదు వాళ్లకు రథసారథి కూడా కావాలి. నానీ ‘గ్యాంగ్ లీడర్’ చిత్ర కథ ఇది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతోంది. ‘‘సాహో’ మనందరి సినిమా. దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేస్తోంది. ‘సాహో’ విజయం సాధిస్తే మనందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రభాస్ అన్నకు, సాహో టీమ్ అందరికీ బ్లాక్‌బస్టర్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీటర్ ద్వారా ‘సాహో’కు శుభాకాంక్షలు తెలిపారు నాని. ‘బందోబస్త్’ ఎవరికి? ప్రధాన మంత్రిని కాపాడే ‘స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్’ అతను. ప్రధానిగా మోహన్‌లాల్, అతనికి బందోబస్త్‌గా నిలిచే పాత్రను సూర్య చేశారు. కేవీ ఆనంద్ దర్శకుడు.‘అయాన్’ (తెలుగులో వీడొక్కడే), ‘మాట్రాన్’ (బ్రదర్స్) ఇది వరకు వీళ్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ‘బందోబస్త్’ వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా. ఆగస్ట్ 30న విడుదల చేయాలనుకున్నా ఈ సినిమా సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఏడుగురు ఛిఛోరేల కథ కాలేజీ రోజుల్లో రేపు అనేది లేనట్టు జీవితాన్ని ఆస్వాదిస్తాం. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాం. మన గ్యాంగ్‌తో జ్ఞాపకాల్ని సృష్టించుకుంటాం. కాలేజీ అయిపోయిన తర్వాత? కలుస్తామో లేదో? కుదురుతుందో లేదో? ఈ కాన్సెప్ట్‌తో ‘దంగల్’ దర్శకుడు నితేష్ తివారీ తీసిన సినిమా ‘చిచోరే’. ఏడుగురు స్నేహితుల జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్, నవీన్ పొలిశెట్టి ముఖ్యపాత్రల్లో నటించారు. ‘ఛిఛోరే’ కూడా ఆగస్ట్ 30 రిలీజ్ . ఇప్పుడు సెప్టెంబర్ 6కి పోస్ట్‌పోన్ చేశారు. మేడ్ ఇన్ చైనా ‘మేడ్ ఇన్ చైనా’... మన రోజువారి జీవితంలో చాలాసార్లు వింటాం, చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదే క్రేజీ టైటిల్‌తో రాజ్ కుమార్ రావ్ ఓ సినిమా చేస్తున్నారు. గుజరాతీ బిజినెస్ మేన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకోవాలని చైనా వెళ్లి అక్కడ ఏం నేర్చుకున్నాడు అన్నది కథ. ఈ సినిమా కూడా ఆగస్ట్ 30న థియేటర్స్‌లో పడాలి. కానీ పోస్ట్‌పోన్ అయిందని తెలిసింది. ఏదైనా పెద్ద సినిమా ముందు ప్లాన్ చేసినట్టుగా రిలీజ్ కాకపోతే ఆ ప్రభావం అన్ని సినిమాల మీద పడుతుంది. తేదీలు మార్చుకోవాల్సి ఉంటుంది. సైకిల్ దెబ్బతింటుంది. ఉదాహరణకు గత ఏడాదినే తీసుకుంటే.. రజనీకాంత్ ‘కాలా’ ఏప్రిల్ 27న రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. ఆ డేట్‌పై ఆల్రెడీ మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలు కన్నేశాయి. ఈ రెండు చిత్రబృందాలు చర్చలు జరిపి రిలీజ్ డేట్లు మార్చుకున్నాయి. మొండిగా తలపడి థియేటర్లను, కలెక్షన్లను షేర్ చేసుకునే బదులు విడివిడిగా సోలో రిలీజ్ బెనిఫిట్లు ఎంజాయ్ చేసుకోవచ్చు. (పండగ సీజన్లను మినహాయించి) ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ‘ఫస్ట్ వీక్’ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందన్నదే కీలకంగా మారింది. క్లాష్ వద్దూ కాంప్రమైజే ముద్దు అనుకోవడం శుభ పరిణామం. క్లాష్ అయి ఏ టిక్కెట్టు కొనాలో ఆడియన్స్‌ని కన్ఫ్యూజ్ చేయకుండా సోలోగా వస్తే నిలువుదోపిడీ సమర్పించు కోవడానికి ప్రేక్షకుడు ఎప్పుడూ సిద్ధమే. – గౌతమ్ మల్లాది అందరికీ ధన్యవాదాలు... ‘సాహో’ సినిమాకు సోలో రిలీజ్ ఇవ్వడం కోసం పోస్ట్‌పోన్ చేసుకున్న సినిమా టీమ్స్ అందరికీ ‘సాహో’ బృందం తరఫున ధన్యవాదాలు తెలిపారు ప్రభాస్. ‘‘తమ సినిమాలను పోస్ట్‌పోన్ చేసుకున్న యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరికీ పెద్ద థ్యాంక్స్. మా ‘సాహో’ టీమ్ మీ అందరికీ గ్రేట్‌ఫుల్‌గా ఉంటుంది. మీ సినిమాలకు ఆల్ ది బెస్ట్’’ అని ప్రభాస్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. శ్రద్ధా వర్సెస్ శ్రద్ధా.. నహీ! ఏ ఆర్టిస్ట్‌కైనా ఒకేరోజు తన రెండు సినిమాలు విడుదలైతే అదో కిక్కు. ఒకప్పటి స్టార్స్‌కి ఇలాంటి సీన్ దాదాపు ప్రతి శుక్రవారం ఉండేది. అయితే ఈ తరం తారలకు ఎప్పుడో కానీ అలా కుదరదు. ఈ ఏడాది శ్రద్ధాకపూర్ ఆ కిక్‌ని ఆస్వాదించగలుగుతారని చాలామంది ఊహించారు. ఎందుకంటే ‘సాహో’, ‘ఛిఛోరే’ ఒకేరోజు విడుదలయ్యే పరిస్థితి కనిపించింది. అయితే శ్రద్ధా వర్సెస్ శ్రద్ధా నహీ (లేదు). ఎందుకంటే ‘సాహో’ హిందీలోనూ విడుదలవుతోంది కాబట్టి.. అక్కడి సినిమాలు కొన్ని వెనక్కి తగ్గాయి. అలా శ్రద్ధా కపూర్ ‘ఛిఛోరే’ కూడా వాయిదా పడింది. -
‘సాహో’ బడ్జెట్‌ను స్వయంగా వెల్లడించిన ప్రభాస్
బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా ‘సాహో. దేశ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ‘సాహో’ ఈ నెల 30న ప్రేక్షకులను పలుకరించబోతోంది. ప్రభాస్‌తోపాటు శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేశ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా కోసం చిత్రయూనిట్ ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇటీవల విడుదలైన ‘సాహో’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘సాహో’ చిత్ర బడ్జెట్‌పై అనేక రుమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ కంపానియన్ అనుపమ చోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్ చిత్ర బడ్జెట్‌పై స్పందించారు. రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్టు ఇంతకముందు కథనాలు వచ్చాయి. చిత్ర బడ్జెట్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ కళ్లు చెదిరే విషయాలు వెల్లడించారు. ఈ సినిమా బడ్జెట్ అక్షరాల రూ. 350 కోట్లు అని తెలిపారు. ఇక, ఇది ఫ్యూచరిస్టిక్ సినిమా కాదని స్పష్టం చేసిన ప్రభాస్.. ‘ఇది ప్రస్తుతం నడిచే కథ. సినిమాలో కొన్ని పార్ట్స్ ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయి. అవి యదార్థంగానే సాగుతాయి. ట్రైలర్లో నేను ఎగరడం మీరు చూస్తారు. ఈ సీన్లను మేం పెద్దస్థాయిలో తీశాం. ట్రైలర్లో పింక్ సరస్సు కనిపిస్తోంది. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. అది కూడా నిజమైనదే. ప్రపంచం నలుమూలాల్లోని ఉత్తమమైన వాటిని ఒకచోట చేర్చి ఈ సినిమాలో చూపిస్తున్నాం’ అని ప్రభాస్ వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషాల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలవుతోంది. ఇక, అబుదాబిలో చిత్రీకరించిన ఓ ఛేజింగ్ సీన్ కోసం అక్షరాల రూ. 80 కోట్లు ఖర్చు పెట్టినట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
డిఫెన్స్ ఇష్టముండదు.. కొడితే సిక్సరే!
‘‘గల్లీ క్రికెట్లో సిక్సర్ ఎవడైనా కొడతాడు. స్టేడియంలో సిక్స్ కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది’’ అనే డైలాగ్‌తో ‘సాహో’ ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయిక. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘ స్క్రీన్‌ప్లే ప్రధానమైన స్క్రిప్ట్ ఇది. నిఖిల్, సుజీత్ ఇద్దరూ ట్రైలర్ కట్ చేశారు. 137 వెర్షన్స్ కట్స్ చేశారు. సినిమా చూశాక ట్రైలర్ కట్ చేయడం ఎంత కష్టమో అనిపిస్తుంది. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. ప్రమోద్, నేను కలసి పెరిగాం. మేం ఫ్రెండ్స్ కాదు.. ఫ్యామిలీ. అందుకే ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ‘సాహో’ లో యాక్షన్ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయి’’ అన్నారు. ‘‘హైదరాబాద్ నా రెండో ఇల్లు. రెండేళ్లుగా ‘సాహో’ షూటింగ్ చేస్తున్నాం. ఇలాంటి సినిమాతో తెలుగులో పరిచయం కావడం చాలా బావుంది’’ అన్నారు శ్రద్ధా కపూర్. ‘‘సాహో’ ఫస్ట్ తెలుగు సినిమా. ఆ తర్వాత ప్యా¯Œ ఇండియా సినిమా. ఇక నుంచి నాన్‌స్టాప్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు ప్రమోద్. ‘‘సాహో’ను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. కొన్ని థియేటర్స్‌లో ‘సాహో’ కోసమని స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్‌లు అప్డేట్ చేస్తున్నారు. ఐమాక్స్ ఫార్మాట్లోనూ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు విక్కీ. ఈ సందర్భంగా విలేకరులతో ప్రభాస్, శ్రద్ధా మాటామంతీ... ► ప్రభాస్‌తో రొమాన్స్, యాక్షన్ రెండూ చేశారు. దేన్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు? శ్రద్ధా కపూర్ : రెండూ (నవ్వుతూ) ► శ్రద్ధా సెట్స్‌లో తెలుగులో ఎలా మాట్లాడారు. ప్రభాస్: షూటింగ్ ఫస్ట్‌డే నుంచి తెలుగు డైలాగ్స్ బాగా చెప్పింది. మేం షాక్ అయ్యాం. చాలా కష్టపడి నేర్చుకున్నారు. శ్రద్ధా మంచి లవ్‌స్టోరీలు చేసింది. యాక్షన్ మూవీలో ఎలా ఉంటుందో అనుకున్నాం. మమ్మల్ని సర్ప్రైజ్ చేసింది. ► సుజీత్ మీద ‘బాహుబలి’ సినిమా తాలుకా ఒత్తిడి ఏమైనా ఉందా? ప్రభాస్ : సుజీత్ మీదే కాదు.. మా అందరి మీద కూడా ఒత్తిడి ఉంది. అందుకే టైమ్ తీసుకుని క్వాలిటీగా చేశాం. అతని వయసు తక్కువ. సినిమాలో పెద్ద టెక్నీషియన్స్‌ని బాగా డీల్ చేశాడు. సెట్లో తను కోప్పడటం, అరవడం కనబడలేదు. ► ఒక సినిమా అనుభమున్న సుజీత్‌ని ఎలా నమ్మారు? సినిమా అనుకున్నట్టే తీస్తున్నాడు అని ఏ పాయింట్లో అనిపించింది. ప్రభాస్ : ఫస్ట్ డే షూట్ చాలా క్లిష్టమైన సన్నివేశం. ఒక్క సీన్ 5–6 వేరియేషన్స్ ఉంటాయి. సినిమాలో నాలుగైదు సార్లు వస్తుంది. సినిమాను దాంతోనే స్టార్ట్ చేశాం. రీషూట్ చేయలేదు, కరెక్షన్ లేదు. స్టోరీలో 8 లేయర్స్ ఉంటాయి. అంత ఈజీగా డీల్ చేసినప్పుడే తను చేయగలడనిపించింది. ► ‘సాహో’తో బాలీవుడ్ బాద్షా అవుతారని అనుకుంటున్నారా? ప్రభాస్: ‘బాహుబలి’ ఆడియన్స్‌ను, ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేయాలి. దానికోసం పగలు, రాత్రి కష్టపడ్డాం. వాళ్లు సంతృప్తి చెందితే చాలు. సినిమా బాగా ఆడాలనుకుంటున్నాను. ► ట్రైలర్లో సిక్సర్ డైలాగ్ ఉంది. మీరు సిక్సర్ కొడతారా? ప్రభాస్ : నేను క్రికెట్ ఆడటానికి వెళ్లినప్పుడు లాగి కొట్టడమే. తగిలితే సిక్సరే. డిఫెన్స్ ఆడటం ఇష్టముండదు. ► యాక్షన్స్ సీన్స్ చాలెంజింగ్‌గా అనిపించాయా? ప్రభాస్ : చాలా మంది ఫైట్ మాస్టర్స్ ఉన్నారు. చాలా యాక్షన్ సన్నివేశాలున్నాయి. కొన్నిటి కోసం 6 నెలలు శిక్షణ తీసుకున్నాం. స్టోరీ బోర్డ్‌లు వేశాం. ప్రీ– ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. శ్రద్ధా : మొదట్లో గన్ పట్టుకున్నప్పుడు చేతులు వణికేవి. నేను పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తూ అలా వణకకూడదు. తర్వాత గన్ పట్టుకోవడం అలవాటు అయింది. ► ‘సాహో’తో ఖాన్స్‌కి షాక్ ఇవ్వబోతున్నారా? ఖాన్స్ (సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్) ఇండియాను ఇన్స్పైర్ చేశారు. వాళ్లకు పోటీ అని అనకూడదు. బాలీవుడ్ వాళ్లు నన్ను బాగా ఆదరించారు. పెద్ద పెద్ద స్టార్స్ నాకు మెసేజ్‌లు పంపారు. ‘సాహో’ ట్రైలర్ చూసి రాజమౌళిగారు బావుందని చెప్పారు. షాక్ ఏంటంటే చిరంజీవిగారు ఫోన్ చేశారు. బావుందని అభినందించారు. మెసేజ్ కూడా చేశారు. ఫుల్ హ్యాపీ అనిపించింది. -
హైదరాబాద్‌లో సాహో మీడియా సమావేశం
-
ట్రైలర్ చూసి మెగాస్టార్ మెసెజ్ చేశారు : ప్రభాస్
పాన్ ఇండియా సినిమాగా సాహో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో అందరి దృష్టి సాహోపై నెలకొంది. టీజర్, సాంగ్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. నిన్న ట్రైలర్‌ను రిలీజ్ చేసి అంచనాలను పెంచేసింది. సోషల్ మీడియాలో సాహో ట్రైలర్ హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ట్రైలర్‌పై స్పందించారు. ట్రైలర్ రిలీజ్ చేసిన సందర్భంగా.. నేడు హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ట్రైలర్‌చూసి మెగాస్టార్ చిరంజీవి మెసెజ్ చేశాడని, ట్రైలర్ బాగుందని ఆయన అన్నారని ఓ ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిచ్చాడు. తనకు హైదరాబాద్ రెండో ఇళ్లుగా మారిందని, గత రెండేళ్లుగా ఇక్కడి వస్తూ ఉన్నానని శ్రద్దా కపూర్ తెలిపారు. ఇప్పటి నుంచి సినిమా రిలీజయ్యే వరకు ప్రమోషన్ కార్యక్రమాలు చేపడతామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి జిబ్రాన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారని ప్రభాస్ పేర్కొన్నాడు. ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్
సాక్షి, సినిమా : ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం సాహో. శనివారం ట్రైలర్ రిలీజైంది. అనంతరం తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు యంగ్ రెబల్ స్టార్. ఆయన మాటల్లోనే.. ‘సాహో కోసం రెండు సంవత్సరాల సమయం కేటాయించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు బాహుబలికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. కానీ అబుదాబిలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాల వంటి వాటికే ఏడాది సమయం పట్టింది. అందువల్ల సినిమా పూర్తవ్వడానికి రెండేళ్లు కేటాయించాల్సి వచ్చింద’న్నారు. మరోవైపు తొలిసారి హిందీ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పానని, కొంచెం కష్టమైనా కొత్తగా ఫీలయ్యానని తెలిపారు. తన తదుపరి చిత్రం గురించి చెప్తూ కె.కె. రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఇప్పటికే 20 రోజులు షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు. కాగా, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన భారీ ఎత్తున విడుదలవుతోంది. -
‘సాహో’ ట్రైలర్ వచ్చేసింది
దేశవ్యాప్తంగా హీట్ పెంచేస్తున్న సినిమా సాహో. బాహుబలితో జాతియ స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్.. సాహోతో రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఇదివరకెన్నడూ చూడని యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే టీజర్స్, సాంగ్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సాహో.. యూట్యూబ్‌ను షేక్చేసేందుకు సిద్దమైంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు వేల కోట్ల రాబరీ.. దాన్ని చేజ్ చేసేందుకు పోలీసులు.. చేజిక్కించుకునేందుకు అండర్ వరల్డ్ డాన్స్.. ఇది వరకు చూడని పోరాట సన్నివేశాలను మన ముందుకు తీసుకొస్తుంది సాహో. ఈ రెండు నిమిషాల 46 సెకన్లలోనే ఈ రేంజ్లో చూపించాము.. ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించుకోండి అనేట్టుగా ట్రైలర్‌ను కట్‌చేశారు. అశోక్ చక్రవర్తి అనే క్యారెక్టర్లో ప్రభాస్.. క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అమృతా నాయర్‌గా శ్రద్దా నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్నీ ఉన్నాయని తెలిసేట్టుగా ట్రైలర్‌ను డిజైన్ చేసి రిలీజ్ చేశారు. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, మందిరా బేడీ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సాహోతో సైరా!
టాలీవుడ్లో రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సాహో రిలీజ్ తోనే సైరా ప్రమోషన్లలో వేగం పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. అందుకే సాహో సినిమాతో పాటు సైరా థ్రియేట్రికల్ ట్రైలర్‌ను థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న సైరా టీం, ట్రైలర్‌ను మరింత ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుధీప్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
సాహో పోస్టర్: కల్కిగా మందిరాబేడీ
‘సాహో’ పోస్టర్ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు ‘కల్కి’ పాత్ర పోషించిన మందిరా బేడి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో నటించిన వారి పాత్రలను పరిచయం చేస్తూ గత కొన్ని రోజులుగా చిత్ర దర్శకుడు సుజీత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘గుడ్ ఇస్ బ్యాడ్’ (మంచి చెడుగా మారినప్పుడు) అనే ట్యాగ్‌తో వచ్చిన ఈ పోస్టర్లో మందిరా మెటాలిక్ బ్లాక్, గ్రే కలర్ శారీలో చిన్న జుట్టుతో సీరియస్ లుక్‌లో కనిపిస్తోంది. దీంతో పాటు జెన్నిఫర్‌గా నటించిన హాలీవుడ్ నటి ఎవ్లీన్ శర్మ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను దాదాపు 90 కోట్ల ఖర్చుతో అబుదాబిలో చిత్రీకరించారు. ఆగస్టు 30న విడుదలవుతున్న ఈ సినిమాలో ఇదే హైలెట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరోవైపు సాహో ట్రైలర్‌ను ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేస్తామని నిర్మాతలు ట్విట్టర్లో ప్రకటించారు. -
అనుష్క కోసం సాహో స్పెషల్ షో..?
‘ప్రభాస్-అనుష్క’ ఈ జంట తెరపై కనిపిస్తే అభిమానులకు కన్నుల పండగే. ఇప్పటికే మూడు సినిమాల్లో కలిసి నటించిన వీరు బాహుబలి సినిమాతో టాలీవుడ్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆన్ స్క్రీన్‌పై వీళ్ల జంట అంత బాగుంటుంది మరి. అయితే నిజ జీవితంలోనూ వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు గత కొద్దికాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను వీరిద్దరూ కొట్టి పారేశారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం అని మాత్రమే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగస్టు 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. కానీ దాని కంటే ముందే ప్రభాస్, అనుష్క కోసం ప్రత్యేకంగా ఓ షో వేయనున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ విషయం గురించి ఇటీవలే ఓ ఆంగ్ల పత్రిక తెలియజేసింది. విభిన్న భాషల్లో తెరకెక్కుతున్న సాహో చిత్రంతో ప్రభాస్ మొదటిసారి బాలీవుడ్లో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే ట్రైలర్, టీజర్ పోస్టర్లతో జాతీయ వ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 30న విడుదలకు సిద్ధంగా ఉంది. -
ఒప్పుకో.. లేదా చచ్చిపో
అతని పేరు రాయ్. అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం ఇష్టం ఉండదు. ఒకటీ అతను చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదా చచ్చిపోవడం. సింపుల్. ‘సాహో’లో ఇలాంటి పాత్రనే పోషిస్తున్నారు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్. ‘సాహో’ సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. గురువారం ‘రాయ్’ పాత్రధారి జాకీ ష్రాఫ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాను సుజీత్ దర్శకత్వం వహించారు. వంశీ, ప్రమోద్, విక్కీలు నిర్మించారు. ఆగస్ట్ 30న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ రేపు రిలీజ్ కానుంది. -
‘సాహో’ మన సినిమా : నాని
బాహుబలి తరువాత టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ చిత్రం సాహో. బాహుబలి తరహాలోనే సాహోపై కూడా జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. అయితే సాహో రిలీజ్ డేట్ వాయిదా పడటం కారణంగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల రిలీజ్లు డైలామాలో పడ్డాయి. వాటిలో నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ ఒకటి. తాజాగా తన సినిమా రిలీజ్ డేట్‌పై నాని స్పందించాడు. ‘దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సాహో మన సినిమా. ఆ సినిమా విజయాన్ని కూడా మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రభాస్ అన్న, సాహో టీంకు నా శుభాకాంక్షలు. గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్‌ను రేపు ప్రకటిస్తా’ అంటూ ట్వీట్ చేశాడు. #Saaho is our film which is making noise nation wide and when it succeeds its our celebration. wishing Prabhas Anna and team nothing less than a huge blockbuster on August 30th 🤗#GANGLEADER release date will be announced tomorrow 🔥 pic.twitter.com/D6oJXOmFDA — Nani (@NameisNani) August 8, 2019