Bahubali To Adipurush, List Of 4 Prabhas Movies Which Collects Rs 100 Crores Net Collections In Hindi - Sakshi
Sakshi News home page

Prabhas Movies Collections: ఇది ప్రభాస్ అంటే.. దక్షిణాది నుంచి తొలిహీరోగా

Published Fri, Jun 23 2023 4:43 PM | Last Updated on Fri, Jun 23 2023 5:55 PM

Prabhas 4 Movies 100 Nett collection In Hindi - Sakshi

మీకు తెలిసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు? అని అడిగితే ఇప్పటి జనరేషన్ టక‍్కున చెప్పే పేరు ప్రభాస్. 'బాహుబలి' ముందు వరకు కేవలం తెలుగుకే పరిమితమైన ఇతడు.. ఆ తర్వాత తన రేంజుని అంతకంతకు పెంచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు ఏకంగా సౌత్ లో ఏ హీరోకి సాధ్యం కానీ విధంగా ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. 

పాన్ ఇండియా స్టార్ అంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాలి. తన సినిమాలతో ఎంటర్ టైన్ చేయాలి. డార్లింగ్ ప్రభాస్ ని చూస్తుంటే అచ్చం అలానే అనిపిస్తోంది. ఎందుకంటే 'ఆదిపురుష్'నే తీసుకోండి. డివైడ్ టాక్ వచ్చినాసరే కలెక్షన్స్ సాధిస్తూనే ఉంది. సౌత్ లో అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. నార్త్ లో ఈ సినిమాకు ప్రేక్షకులు వెళ్తున్నారు. చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కారణం వన్ అండ్ ఓన్లీ ప్రభాస్.

(ఇదీ చదవండి: ఆ నెలంతా పాన్ ఇండియా మూవీసే.. ఏకంగా అన్ని!)

'బాహుబలి' తర్వాత 'సాహో', 'రాధేశ‍్యామ్', 'ఆదిపురుష్'.. ఇలా మూడు భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు ప్రభాస్. వీటి టాక్ ఏంటనేది పక్కనబెడితే నార్త్ లో ఇవన్నీ కూడా కలెక్షన్స్ లో వావ్ అనిపించాయి. మొత్తం ఈ నాలుగు చిత్రాలు.. కేవలం హిందీలోనే తలో రూ.100 కోట్లు చొప్పున నెట్ వసూళ్లు సాధించాయి. తద్వారా దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్ లో ఈ ఘనత సాధించిన ఫస్ట్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. 

ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రభాస్ తన నాలుగు సినిమాలతో తలో రూ.100 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తే దక్షిణాది నుంచి మరే హీరో కూడా కనీసం ఒక్కటంటే ఒక్క మూవీతోనూ ఈ క్లబ్ లో చేరలేకపోయాడు. దీన్నిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు అసలు సిసలు 'పాన్ ఇండియా స్టార్' ప్రభాస్ అని. మరోవైపు బాలీవుడ్ లో ఇలా రూ.100 కోట్లు సాధించిన హీరోలు ఒకరో ఇద్దరో ఉంటారంతే!

(ఇదీ చదవండి: వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement