సూపర్‌స్టార్ రజనీకాంత్ పనైపోయిందన్నారు. సినిమాలు చేయడం ఆపేస్తే బెటర్ అన్నారు. కట్ చేస్తే 'జైలర్' బ్లాక్‌బస్టర్ అయింది. దెబ్బకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ గల్లంతైపోతున్నాయి. ప్రస్తుతం రూ.500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాతో రజనీ మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆ విషయం ఆలోవర్ ఇండియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఏంటి రికార్డ్?
రజనీకాంత్ 'రోబో' సినిమా సంచలనం సృష్టించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన 'రోబో 2.0'.. కంటెంట్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు గానీ వసూళ్లు మాత్రం రూ.500 కోట్లకు పైనే వచ్చాయి. దీని తర్వాత సూపర్‌స్టార్ పలు సినిమాలు చేస్తున్నప్పటికీ డబ్బులు సాధించలేకపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు 'జైలర్' వల్ల రజనీ మూవ రూ.500 కోట్ల మార్క్ క్రాస్ చేసింది.
(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త)
ప్రభాస్ తర్వాత
అయితే రజనీకాంత్ కంటే ముందు ఈ లిస్టులో ప్రభాస్ మాత్రమే ఉన్నాడు. 'బాహుబలి' రెండు పార్ట్‌లతో రూ.500 కోట్ల మార్క్ ని క్రాస్ చేశాడు. సౌత్ నుంచి ఇప్పటివరకు ఈ ఘనత సాధించింది ప్రభాస్ మాత్రమే. ఇప్పుడు రజనీకాంత్ కూడా చేరడం కొత్త జోష్ తీసుకొచ్చింది. ఏదేమైనా ఇక పనైపోయిందనుకునే టైంలో రజనీ కమ్‌బ్యాక్ ఇవ్వడం అంతటా చర్చనీయాంశంగా మారిపోయింది.
కలెక్షన్స్ ఎంత?
'జైలర్' ప్రస్తుతం 10 రోజుల్లో రూ.560 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఇప్పటికే హైయస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. ఇక తెలుగులో రూ.60 కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం.. యూఎస్‌లోనూ 5 మిలియన్ల కలెక్షన్స్ క్రాస్ అయిపోయింది. కన్నడ, మలయాళంలోనూ మంచి నంబర్స్ నమోదు చేయడం విశేషం. లాంగ్ రన్‌లో ఎన్ని కోట్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
(ఇదీ చదవండి: 'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ!)
Comments
Please login to add a commentAdd a comment