సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడం చూసి చాలా ఏళ్లయిపోయింది. 'రోబో' తర్వాత సినిమాలు చేస్తున్నారు. డబ్బులు ఓ మాదిరిగా వస్తున్నాయి. తాజాగా రిలీజైన 'జైలర్' మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా బాక్సాఫీస్ దగ్గర రచ్చ రంభోలా చేస్తోంది. రజనీ దెబ్బకు ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ గల్లంతవుతున్నాయి.
అన్ని కోట్ల వసూళ్లు
ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జైలర్ సినిమాకు తొలిరోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. రెండోరోజు నుంచి మాత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ వినిపించింది. మరోవైపు 'భోళా శంకర్' అంతగా ఆకట్టుకోలేకపోవడం రజనీ మూవీకి ఓ రేంజులో కలిసొచ్చింది. ఫలితంగా ఇప్పటివరకు అంటే ఆరు రోజుల్లో రూ.416 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.40 కోట్ల వరకు వచ్చాయట.
(ఇదీ చదవండి: 'జైలర్' కోడలు.. సినిమాలో పద్ధతిగా బయట మాత్రం!)
'విక్రమ్' రికార్డ్ బ్రేక్
అయితే గతేడాది కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాకు లాంగ్ రన్ లో మొత్తంగా రూ.410 కోట్లు వచ్చాయి. కానీ రజనీ 'జైలర్' మాత్రం ఆ మార్క్ ని ఆరు రోజుల్లోనే దాటేయడం విశేషం. ఇప్పటివరకు తమిళ సినిమాలు సెట్ చేసిన రికార్ట్స్ బ్రేక్ చేసిన 'జైలర్'.. లాంగ్ రన్ లో ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందనేది చూడాలి.
'జైలర్'కి అదే ప్లస్
రజనీకాంత్ నటించిన 'జైలర్' స్టోరీ కొత్తదేం కాదు. అయినాసరే రజనీ స్వాగ్, స్టైల్ తోపాటు అనిరుధ్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఈ వీకెండ్ లో మరో పెద్ద మూవీ ఏదీ థియేటర్లలో లేకపోవడం.. ఇలా అన్ని అంశాలు 'జైలర్'కు కలిసొచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేచిపోతోంది.
(ఇదీ చదవండి: Chiranjeevi : సర్జరీ @ ఢిల్లీ, వచ్చే వారం హైదరాబాద్ కు చిరంజీవి)
Comments
Please login to add a commentAdd a comment