ప్రియురాలిని పరిచయం చేసిన ' జైలర్‌' ఫేమ్‌ జాఫర్‌ సాదిఖ్‌.. ఆమె ఎవరంటే | Jailer Fame Jaffer Sadiq Reveals His Girlfriend - Sakshi
Sakshi News home page

ప్రియురాలిని పరిచయం చేసిన జైలర్‌ నటుడు.. ఆమె ఏం చేస్తుందంటే?

Aug 26 2023 5:00 PM | Updated on Aug 26 2023 5:11 PM

Jailer Fame Jaffer Sadiq Reveal His Girlfriend - Sakshi

కోలీవుడ్‌ నటుడు జాఫర్‌ సాదిఖ్‌ పేరు జైలర్‌ సినిమాతో మరోసారి ట్రెండింగ్‌ అవుతుంది. లోకేష్ కనగరాజ్- కమల్‌ హాసస్‌ కాంబోలో వచ్చిన విక్రమ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ రెండు సినిమాల్లో మరగుజ్జుగా ఆయన నటించిన తీరు అందరనీ ఆకట్టుకుంటుంది. తాజాగ ఆయన ప్రియురాలు 'సిద్ధికా షెరిన్‌'ను ఓ ఇంటర్వ్యూ ద్వారా తన అభిమానులకు పరిచయం చేశాడు.

ఎక్కడ పరిచయం
కోలీవుడ్‌లో విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ రియాలిటీ షోలలో జాఫర్‌ సాదిఖ్‌ పాల్గొనేవాడు. అదే టీవీలో  ఆమె కింగ్స్ ఆఫ్ డ్యాన్స్, జోడి నంబర్ 1, ఉంజాలిల్‌ యార్‌ ప్రభుదేవా-2 వంటి డ్యాన్స్‌ షోలలో సిద్ధిక పోటీదారురాలిగా కనిపించింది. మొదట ప్రకాశ్‌రాజ్‌-సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన పావ కథైగల్ అనే వెబ్‌ సీరిస్‌తో జాఫర్‌ సాదిఖ్‌ ఎంట్రీ ఇచ్చాడు.  ఈ సీరిస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో పలు విభాగాలుగా విడుదలైంది. అది చూసి లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాలో ఓ పాత్ర ఇచ్చి సినీ రంగానికి పరిచయం చేశారు. 

ఈ సినిమాలో విజయ్ సేతుపతి గ్యాంగ్‌లో ఒకరిగా జాఫర్ మాస్‌గా నటించాడు. విక్రమ్‌ సినిమా క్లైమాక్స్‌ సీన్‌లో కమల్ కాలు కోసే ప్రయత్నంలో జాఫర్‌ సాదిఖ్‌ కనిపిస్తాడు. ఈ సన్నివేశమే ఆతన్ని పాపులర్ చేసింది. మరోవైపు అతను కొరియోగ్రాఫర్‌గా కూడా బిజీగా ఉన్నాడు. అతను తన స్వంత డ్యాన్స్ స్టూడియోను కూడా నడుపుతున్నాడు. విక్రమ్ సినిమా తర్వాత అతనికి  శింబుతో  సినిమా ఛాన్స్‌ దక్కింది. ఆ తర్వాత జైలర్‌ ఇలా వరుసగా ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో కూడా జాఫర్‌ కొన్ని ప్రాజెక్ట్స్‌కు సైన్‌ చేశాడు. ఇలా సినిమాలతో  బిజీగా ఉన్న జాఫర్ తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు.

జాఫర్ యొక్క ప్రత్యేక లక్షణం అతని పొట్టి పొట్టితనమే. కానీ అతని స్నేహితురాలు జాఫర్ కంటే పెద్దది, అందమైనది కూడా. వీరిద్దరూ స్టైలిష్‌గా పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాఫర్ ప్రియురాలి పేరు సిద్ధిక అని వెల్లడించారు. ఆమె కోలీవుడ్‌లో మంచి డ్యాన్సర్‌గా రానిస్తుంది. పలు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లకు కొరియోగ్రాఫర్‌గా ఆమె వర్క్‌ చేస్తుంది. 

(ఇదీ చదవండి; ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు: కస్తూరి)

జాఫర్‌ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మూడు మాత్రమే కానీ అతనికి అభిమానుల నుంచి మరింత మద్ధతు అందుతున్నందున మరెన్నో సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆ ఆనందంలో తన ప్రియురాలు సిద్ధికను కూడా అభిమానులకు పరిచయం చేశాడు. ఈ వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నా తాజాగ ఆయన ప్రకటించాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement