jafar
-
రూ. 2వేల కోట్ల డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత అరెస్ట్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ సభ్యుడు జాఫర్ సాదిక్ అరెస్ట్ అయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ను తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది. రూ. 2000 కోట్ల డ్రగ్స్ రాకెట్లో ఆయన ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్ భారతదేశం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలకు విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం తమిళనాడులో భారీ ఎత్తున డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని శ్రీలంకకు స్మగ్లింగ్ చేసేందుకు యత్నిస్తుండగా అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారి నుంచి తీగ లాగితే ఈ అంతర్జాతీయ డ్రగ్స్ దందా బయటపడింది. వీరి వెనుక జాఫర్ సాదిక్ ఉన్నట్లు తేలడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దీంతో తాజాగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశాడు. సాదిక్ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన వ్యక్తి. డీఎంకే ఎన్ఆర్ఐ విభాగానికి చెందని ఆఫీస్ బేరర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన్ను పార్టీ నుంచి తొలగించడం జరిగింది. కోలీవుడ్‌లో ఆయన ఇప్పటి వరకు నాలుగు సినిమాలు నిర్మించాడు. -
ప్రియురాలిని పరిచయం చేసిన ' జైలర్' ఫేమ్ జాఫర్ సాదిఖ్.. ఆమె ఎవరంటే
కోలీవుడ్ నటుడు జాఫర్ సాదిఖ్ పేరు జైలర్ సినిమాతో మరోసారి ట్రెండింగ్ అవుతుంది. లోకేష్ కనగరాజ్- కమల్ హాసస్ కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ రెండు సినిమాల్లో మరగుజ్జుగా ఆయన నటించిన తీరు అందరనీ ఆకట్టుకుంటుంది. తాజాగ ఆయన ప్రియురాలు 'సిద్ధికా షెరిన్'ను ఓ ఇంటర్వ్యూ ద్వారా తన అభిమానులకు పరిచయం చేశాడు. ఎక్కడ పరిచయం కోలీవుడ్‌లో విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ రియాలిటీ షోలలో జాఫర్ సాదిఖ్ పాల్గొనేవాడు. అదే టీవీలో ఆమె కింగ్స్ ఆఫ్ డ్యాన్స్, జోడి నంబర్ 1, ఉంజాలిల్ యార్ ప్రభుదేవా-2 వంటి డ్యాన్స్ షోలలో సిద్ధిక పోటీదారురాలిగా కనిపించింది. మొదట ప్రకాశ్‌రాజ్-సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన పావ కథైగల్ అనే వెబ్ సీరిస్తో జాఫర్ సాదిఖ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరిస్ నెట్‌ఫ్లిక్స్‌లో పలు విభాగాలుగా విడుదలైంది. అది చూసి లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాలో ఓ పాత్ర ఇచ్చి సినీ రంగానికి పరిచయం చేశారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి గ్యాంగ్‌లో ఒకరిగా జాఫర్ మాస్‌గా నటించాడు. విక్రమ్ సినిమా క్లైమాక్స్ సీన్లో కమల్ కాలు కోసే ప్రయత్నంలో జాఫర్ సాదిఖ్ కనిపిస్తాడు. ఈ సన్నివేశమే ఆతన్ని పాపులర్ చేసింది. మరోవైపు అతను కొరియోగ్రాఫర్‌గా కూడా బిజీగా ఉన్నాడు. అతను తన స్వంత డ్యాన్స్ స్టూడియోను కూడా నడుపుతున్నాడు. విక్రమ్ సినిమా తర్వాత అతనికి శింబుతో సినిమా ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత జైలర్ ఇలా వరుసగా ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో కూడా జాఫర్ కొన్ని ప్రాజెక్ట్స్‌కు సైన్ చేశాడు. ఇలా సినిమాలతో బిజీగా ఉన్న జాఫర్ తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. జాఫర్ యొక్క ప్రత్యేక లక్షణం అతని పొట్టి పొట్టితనమే. కానీ అతని స్నేహితురాలు జాఫర్ కంటే పెద్దది, అందమైనది కూడా. వీరిద్దరూ స్టైలిష్‌గా పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాఫర్ ప్రియురాలి పేరు సిద్ధిక అని వెల్లడించారు. ఆమె కోలీవుడ్‌లో మంచి డ్యాన్సర్‌గా రానిస్తుంది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్లకు కొరియోగ్రాఫర్‌గా ఆమె వర్క్ చేస్తుంది. (ఇదీ చదవండి; ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు: కస్తూరి) జాఫర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మూడు మాత్రమే కానీ అతనికి అభిమానుల నుంచి మరింత మద్ధతు అందుతున్నందున మరెన్నో సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆ ఆనందంలో తన ప్రియురాలు సిద్ధికను కూడా అభిమానులకు పరిచయం చేశాడు. ఈ వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నా తాజాగ ఆయన ప్రకటించాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by sidhiqa sherin (@sidhiqasherink) -
తెరపైకి జాక్సన్ జీవితం
పాప్ సంగీత సామ్రాజ్యానికి రాజుగా వెలిగిన మైఖేల్ జాక్సన్ జీవితంతో ‘మైఖేల్’ పేరుతో బయోపిక్ రూపొందనుంది. ఈ చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకుడు. మైఖేల్‌గా ఆయన సోదరుడు జెర్మైన్ కుమారుడు జాఫర్ జాక్సన్ నటించనున్నారు. వెండితెరపై యాక్టర్‌గా జాఫర్‌కు ఇదే తొలి చిత్రం. ‘‘మా అంకుల్ కథలో నటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు జాఫర్. ‘‘మైఖేల్ జాక్సన్ లక్షణాలు జాఫర్లో చాలా ఉన్నాయి. మైఖేల్‌గా నటించగల ఒకే ఒక్క వ్యక్తి జాఫర్ అని నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన గ్రాహం. ఇక 1958 ఆగస్టు 29న పుట్టిన మైఖేల్ జాక్సన్ 2009 జూన్ 25న మరణించిన విషయం తెలిసిందే. -
బినామీ పేర్లతో జేసీ సోదరులు దోచుకున్నారు
సాక్షి, అనంతపురం(తాడిపత్రి) : గత ఐదేళ్ళ టీడీపీ ప్రభుత్వ పాలనలో జేసీ సోదరులు పేదవారి గృహాలను కూడా వదలకుండా బినామీల పేర్ల మీద దోచుకొని దాచుకున్నారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్ ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ జేసీ సోదరులు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన ఇంట్లో పనిచేస్తున్న గుమస్తాల పేరు మీద భూములు కొనుగోలు చేసి అక్రమ మైనింగ్‌లకు పాల్పడి కోట్లాది రూపాయాలు ఆర్జించారని.. నిజమైన పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని విమర్శించారు. జేసీ సోదరుల హయాంలో ఇందిరమ్మ గృహాల పేరిట పేదలను మోసం చేశారని, గృహాలను మంజూరు చేస్తామని ఒక్కొక్కరితో రూ.2 వేలు వసూలు చేసి కేవలం అనుచరులకు మాత్రమే 300 పక్కా గృహాలు మంజూరు చేశారని ఆరోపించారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వమైనా అర్హులైన పేదలకు పక్కా గృహాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ అధికారులకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, సహాయ కార్యదర్శి వెంకట్రాముడు యాదవ్, పట్టణ కార్యదర్శి చిరంజీవియాదవ్, సహాయ కార్యదర్శి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలు
అనంతపురం సెంట్రల్ : ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 2014 సెప్టెంబర్‌లో ఓ మహిళపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. మూడవ పట్టణ సీఐ వెంకటేసులు కథనం మేరకు... నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన గుణ అలియాస్ మహేష్, రాణినగర్‌కు చెందిన జాఫర్ కలిసి 2014లో ఓ మహిళను హత్య చేయడానికి యత్నించారు. త్రీవంగా గాయపడిన ఆమెను స్థానికులు పోలీసులకు సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా కేసు విచారణ చేపట్టిన ప్రిన్సిపాల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి మాలతి నేరం రుజువు కావడంతో నిందితులకు ఐదు సంవత్సరాలపాటు జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.