ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 2014 సెప్టెంబర్‌లో ఓ మహిళపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సంచలన తీర్పు వెలువరించారు.
అనంతపురం సెంట్రల్ : ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 2014 సెప్టెంబర్‌లో ఓ మహిళపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. మూడవ పట్టణ సీఐ వెంకటేసులు కథనం మేరకు... నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన గుణ అలియాస్ మహేష్, రాణినగర్‌కు చెందిన జాఫర్ కలిసి 2014లో ఓ మహిళను హత్య చేయడానికి యత్నించారు.
త్రీవంగా గాయపడిన ఆమెను స్థానికులు పోలీసులకు సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా కేసు విచారణ చేపట్టిన ప్రిన్సిపాల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి మాలతి నేరం రుజువు కావడంతో నిందితులకు ఐదు సంవత్సరాలపాటు జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.