
కూతుర్ని ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని కసి
మద్యం, మత్తు మందు ఇచ్చి.. గొంతుకోసి హతం
బెంగళూరు రియల్టర్ మర్డర్ కేసులో మలుపు
దొడ్డబళ్లాపురం: ఓ యువతిని మోహించి పెళ్లాడాడు, కానీ అక్కడితో తన బతుకు అంతమవుతుందని ఊహించలేకపోయాడు. హెసరఘట్ట వద్ద బీజీఎస్ లేఔట్‌లో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి లోకనాథ్ సింగ్ (37) హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
డిసెంబరులో వివాహం...
పోలీసుల కథనం మేరకు... మాగడి నియోజకవర్గ ఎమ్మెల్యే బాలక్రిష్ణకు సన్నిహితునిగా లోకనాథ్ సింగ్‌కు పేరుంది. 22న రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. లోకనాథ్ భార్య తల్లి (అత్త) స్వయంగా అల్లున్ని హత్య చేయించిందని తెలిసింది. గత డిసెంబర్‌లో లోకనాథ్ ఒక యువతిని బెదిరించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇష్టం లేకపోయినా, ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. కానీ అల్లునిపై పగ పెంచుకున్నారు. అనుకున్న ప్రకారం శనివారం బీజీఎస్ లేఔట్‌కు లోకనాథ్‌తో పాటు భార్య, అత్త వచ్చారు.
కొత్తగా నిర్మిస్తున్న కట్టడంలో భార్యతో కలిసి లోకనాథ్ మద్యం తాగాడు. లోకనాథ్‌తో వచ్చిన గన్‌మ్యాన్‌ను అత్త ఏదో సాకుతో పంపించేసింది. లోకనాథ్‌కు భోజనంలో మత్తు మందిచ్చింది. అతి తినగానే మద్యం, మత్తు ప్రభావం వల్ల స్పృహ తప్పి పడిపోయాడు. అత్త పదునైన కత్తితో అల్లున్ని గొంతుకోసి ప్రాణాలు తీసింది. తరువాత తల్లీ కూతురు ఏమీ ఎరగనట్టు ఇంటికి వెళ్లిపోయారు. ఎవరో స్నేహితులు హత్య చేసినట్టు నాటకం ఆడారు. పోలీసులు తల్లి, కుమార్తెను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment