mother in law
-
చెవి కొరికిన కోడలు.. ఆస్పత్రికి పరుగులు పెట్టిన అత్త
సాక్షి,గుంటూరు:అత్త చెవిని కోడలు కొరికేసిన ఘటన గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో మంగళవారం(అక్టోబర్8)జరిగింది.కుటుంబ కలహాల నేపధ్యంలో అత్త నాగమణి,కోడలు పావని మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలోనే అత్త చెవిని కోడలు పావని కొరికింది. బలంగా కొరకడంతో అత్త చెవిలోని ఒక ముక్క ఊడిపడింది.ఊడిపడిన చెవి ముక్కను తీసుకుని అత్త నాగమణి గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి వచ్చింది.చెవి ముక్క తెగిపోయి సమయం ఎక్కువవడంతో తిరిగి అతికించడం సాధ్యం కాదని డాక్టర్లు చెప్పారు. ఇదీ చదవండి: ధర్మవరం సీఐ కిడ్నాప్ ఆపై హత్య -
పెళ్లి చేసుకున్న అత్తాకోడళ్లు!.. ఇదేం కర్మరా బాబు
-
అత్తను దారుణంగా చంపిన కోడలికి మరణ శిక్ష
భోపాల్: కోడళ్లను వేధించే అత్తల గురించి అందరం వింటుంటాం. సమాజంలో ఇది మామూలే. అయితే మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలోని అట్రాలా గ్రామంలో ఓ కోడలు అత్తను అతి దారుణంగా చంపింది. కొడవలితో ఒక్కసారి కాదు ఏకంగా 95సార్లు నరికి నరికి చంపింది. ఈ కేసు విచారించిన రెవా జిల్లా కోర్టు బుధవారం(జూన్12) మరణ శిక్ష విధించింది. 2022 జులై12న కోడలు కంచన్ చేతిలో అత్త సరోజ్కోల్ హత్యకు గురైంది. అత్త సరోజ్కోల్ హత్యకు మామ వాల్మీకికోల్ దగ్గరుండి కోడలిని పురిగొల్పినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కానీ ఆధారాలు లేక వాల్మీకి కోల్‌ను కోర్టు విడుదల చేసింది. -
భర్త గుర్తింపుమీద ఆధారపడొద్దు.. నీ గుర్తింపు నువ్వు తెచ్చుకో..!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర పట్టణమైన బృందావన్‌లోని యమునా నదిలో పవిత్ర స్నానాలు చేయడానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. అలా వచ్చే వారిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా లక్ష్మికి ఫోన్ చేస్తారు. ‘నేను ఉన్నాను’ అంటూ వారికి అండగా నిలబడుతుంది డా.లక్ష్మి. వితంతువులు, అనాథలు, నిరుపేదలకు ఆమె బృందావన దేవదూత.బృందావన్ ‘సిటి ఆఫ్ విడోస్’ అని పేరు తెచ్చుకుంది. దీనికి కారణం లక్ష్మి మాటల్లో చెప్పాలంటే... పశ్చిమ బెంగాల్‌తోపాటు మన దేశంలోని మారుమూల ప్రాంతాల్లో బాలవితంతువులు ఉన్నారు. కొద్దిమంది విషయంలో భర్త చనిపోయినా, వదిలి వెళ్లినా వారిని పట్టించు కునేవారు ఉండరు. ఈ నేపథ్యంలో వితంతువులకు సురక్షితమైన ఆశ్రమాలు ఉన్న పట్టణంగా బృందావన్ మారింది’ सेवा-सहयोग-सद्भाव.. कनकधारा, बीमार-घायल निराश्रित, असहाय माँ को अपना घर भेजा pic.twitter.com/jD6CINaT5H — Dr.laxmi gautam (@Drlaxmigautam1) February 12, 2019 అయితే అందరి పరిస్థితి ఒకేలా లేదు. కొంతమంది వితంతువులు ఇక్కడ కష్టాలు పడేవారు. కొన్ని సంవత్సరాల క్రితం దర్శనం కోసం బృందావన్‌కు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు వితంతువుల దుస్థితిని చూసి ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని వేశారు. అలా నియమించిన కమిటీలో లక్ష్మి కూడా ఉన్నారు. ఈ కమిటీలో భాగం కావడం ద్వారా వితంతువుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను లోతుగా తెలుసుకునే అవకాశం దొరికింది. వితంతువుల అంతిమ సంస్కారాలను ఎవరూ పట్టించుకోక΄ోవడం ఆమెను ఆవేదనకు గురిచేసింది. బృందావనంలో ఏ ఒక్క వితంతువు కూడా దయనీయస్థితిలో చనిపోకూడదు. వారి కర్మకాండలు గౌరవప్రదంగా చేయాలనే ఉద్దేశంతో ‘కనకధార’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. ‘కనకధార’ అనేది ఆమె అత్తయ్య పేరు. మృదుభాషి అయిన తనను అత్తయ్య నలుగురి ముందు గట్టిగా మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది. ‘భర్త గుర్తింపు మీద ఆధారపడవద్దు. నీదైన గుర్తింపు తెచ్చుకో’ అని చెప్పేది ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అత్తయ్య. అత్తయ్య ప్రోత్సాహంతో లక్ష్మి పీహెచ్డీ చేసి అధ్యాపక వృత్తిలోకి వచ్చింది. వృత్తిని, స్వచ్ఛందసంస్థ కార్యకలాపాలతో బ్యాలెన్స్ చేసుకోవడం అంత సులభం కాదు. అయితే సంకల్పబలం ఉన్న వాళ్లకు అదేమీ కష్టం కాదు. లక్ష్మీగౌతమ్ ఈ కోవకు చెందిన మహిళ. ‘కనక ధార’ స్వచ్ఛంద కార్యక్రమాలలో అత్తయ్యతో΄ాటు భర్త విజయ్ గౌతమ్ కూడా భాగం అయ్యారు. ఇప్పటివరకు లక్ష్మి వెయ్యి మందికి పైగా వితంతువుల అంతిమ సంస్కారాలు నిర్వహించింది. అంబులెన్స్ అవసరాల నుంచి ఫైనల్ డ్రెస్సింగ్ వరకు అన్నీ ఆమె చూసుకునేది. కరోనా మహమ్మారి కాటేస్తున్న సమయంలో మధురలో 72 రోజుల పాటు వందలాది మంది అనాథలకు వండి వడ్డించేది. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన యువతులకు మార్గదర్శనం చేయడంలో, అపహరణకు గురైన యువతులను రక్షించి అండగా నిలవడంలో ‘కనక ధార’ స్వచ్ఛంద సంస్థ సహాయపడుతోంది. వృత్తి జీవితాన్ని, సామాజిక సేవను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేదాన్ని. సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాలకు తప్ప వ్యక్తిగత పనుల కోసం సెలవుపెట్టే దాన్ని కాదు. ఒక వితంతువు చనిపోయిందని, మృతదేహాన్ని క్లెయిమ్ చేయకుండా అనాథలా పడి ఉందని ఒకరోజు ఫోన్ వచ్చింది. ఆ సమయంలో కాలేజీలో ఉన్నాను. వెంటనే ప్రిన్సిపల్‌ను అనుమతి అడిగి బయటికొచ్చాను. బైకర్ నుంచి లిఫ్ట్ తీసుకొని ఘటన స్థలానికి చేరకున్నాను. అక్కడ ఎన్నో గంటల పాటు ఉండాల్సి వచ్చింది. అంబులెన్స్ ఏర్పాటు చేసి అంత్యక్రియలు చేశాను. ఇలాంటి సంఘటనలెన్నోఉన్నాయి – డా.లక్ష్మీ గౌతమ్ -
పొలం ఇప్పుడే ఇవ్వడం కుదరదన్న అత్తమామ.. మామపై అల్లుడి దారుణం!
ఉప్పునుంతల: పెళ్లి సమయంలో తనకు కట్నంగా ఇస్తామన్న ఎకరం పొలం విషయంలో తరచుగా అత్తమామలతో గొడవపడుతున్న అల్లుడు మామను దారుణంగా కొట్టి హత్యచేసిన ఘటన మండలంలోని మర్రిపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ గురుస్వామి వివరాల ప్రకారం.. మండలంలోని మర్రిపల్లికి చెందిన సోనమోని అలివేళ, వెంకటయ్య (50) దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కూతురు మాధవిని రెండేళ్ల క్రితం ఉప్పునుంతలకు చెందిన గడ్డం సాయిబాబుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో 13 తులాల బంగారం, రూ.3.50 లక్షలు నగదుతోపాటు ఎకరం పొలాన్ని తమ కూతురుకు ఇస్తామని చెప్పారు. ఇప్పుడే అల్లుడికి పొలం ఇస్తే అమ్ముకుంటాడనే భావనతో వారు వాయిదా వేస్తూ వస్తున్నారు. తనకు ఇస్తామన్న ఎకరం పొలాన్ని ఇవ్వాలంటూ సాయిబాబు పెళ్లయిన ఆరు నెలల నుంచి తరుచుగా భార్యను కొట్టడంతోపాటు అత్తమామలు సోనమోని అలివేళ, వెంకటయ్యలతో గొడపపడేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం తన బైక్‌పై మర్రిపల్లికి వెళ్లిన సాయిబాబు ఇంటివద్ద ఉన్న అత్త అలివేళతో పొలం తన పేరిట చేయాలని గొడ వపడ్డాడు. ఆ సమయంలో ఇరుగుపొరుగు వా రు తిట్టడంతో అక్కడి నుంచి వెళ్లిపోయా డు. మామ వెంకటయ్యను చంపుతానంటూ గ్రా మంలో అతనికోసం వెతికాడు. వెంకటయ్య వ్యవసాయ పొలం వద్దకు వెళ్లినట్లు తెలుసుకొని అక్కడకు వెళ్లాడు. అతనితో గొడవపడి కొట్టడంతో వెంకటయ్య తలకు బలమైన గాయాలై అక్కడిక్కడే పడి చనిపోయాడు. పక్క పొలం రైతు రెడ్డమోని జగదీష్ గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వెంకటయ్యను అల్లుడే కొట్టి చంపాడని శుక్రవారం భార్య అలివేల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని మహిళ మృతి అచ్చంపేట రూరల్: అనారోగ్యంతో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. అచ్చంపేట పట్టణంలోని పాతబజార్ ప్రధాన రహదారిపై గతనెల 28న గుర్తుతెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉండగా.. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం 108 లో స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అత్తగారిఇంటిలో 'అత్త'ను చంపిన అల్లుడి..!
మంచిర్యాల: గ్రేటర్ వరంగల్ పరిధిలోని రెండవ డివిజన్ గుండ్లసింగారంలో గురువారం జరిగిన కాల్పుల ఘటన మంచిర్యాల జిల్లాలోనూ కలకలం రేపింది. అప్పుగా ఇచ్చిన డబ్బు ఇవ్వలేదని ఓ కానిస్టేబుల్ పోలీసు సర్వీస్ రివాల్వర్‌తో అత్తపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వరంగల్ నగరంలోని కీర్తినగర్‌కు చెందిన అడ్డె ప్రసాద్‌కు గుండ్లసింగారానికి చెందిన రమాదేవితో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రసాద్‌తోపాటు అత్త కుటుంబసభ్యులు గుండ్లసింగారంలో వేర్వేరు ఇళ్లలో అద్దెకు ఉంటున్నారు. ప్రసాద్ మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలం క్రితం ప్రసాద్ తన అత్త కమలాదేవి(58)కు రూ.4లక్షల అప్పుగా ఇవ్వగా తిరిగి ఆమె ఇవ్వలేదు. దీంతోపాటు అతని కాపురంలోనూ విభేదాలు వచ్చాయి. వారిపై కోపం పెంచుకున్న ప్రసాద్ అత్తతోపాటు భార్య, బావమరిదిని టార్గెట్ చేశాడు. అత్తను చంపిన తర్వాత ఇంట్లోనే ఉన్న బావమరిదిని.. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్యను తుదముట్టించాలని భావించాడు. బుధవారం కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్‌హౌజ్ ఆఫీసర్ తన రివాల్వర్ని క్లీన్‌చేసి భద్రపర్చమని ప్రసాద్‌కు చెప్పాడు. కానీ ప్రసాద్ ఆ రివాల్వర్‌ను భద్రపరిచి ఆ తరువాత ఎవరికీ తెలియకుండా తీసుకున్నాడు. అనంతరం గుండ్లసింగారం వచ్చాడు. గురువారం ఉదయం స్టేషన్‌కు వచ్చిన స్టేషన్‌హౌస్ ఆఫీసర్ రివాల్వర్ తీసుకునేందుకు వెళ్లగా కనిపించలేదు. దీంతో స్టేషన్‌లోని సీసీ ఫుటేజీని పరిశీలించి రివాల్వర్‌ను ప్రసాద్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అతడికి పోలీసులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని సమాచారం. కోటపల్లి నుంచి గురువారం ఉదయం గుండ్లసింగారం చేరుకున్న ప్రసాద్ నేరుగా అత్త కమలాదేవి ఇంటికి వెళ్లి ఆమెను కాల్చాడు. అప్పటికే స్థానికులు గుమిగూడడం, కుటుంబ సభ్యులు రావడం.. అతనిపై దాడి చేయడంతో ముందుగా అనుకున్న ప్లాన్ వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. తూటా శబ్దంతో కలకలం కమలాదేవిపై రివాల్వర్‌తో ఒక రౌండ్ కాల్పులు జరపడంతో ఆమె ఇంటి గేటు నుంచి రోడ్డుమీదికి రక్తమోడుతూ వచ్చి కింద పడింది. ఒక్కసారిగా పెద్దశబ్ధం రావడంతో ఇరుగుపొరుగు వారు ఆందోళనకు గురయ్యారు. కొద్దిదూరంలో ఉన్న ప్రసాద్ భార్య రమాదేవితోపాటు ఆమె కూతుళ్లు, సోదరుడు హుటాహుటిన వచ్చి చూసేసరికి తల్లి చనిపోయి కనిపించడంతో బోరున విలపించారు. ఓ వైపు తల్లి మృతదేహం.. మరో వైపు ప్రసాద్ దర్జాగా కుర్చీలో కూర్చొని ఉండడంతో ఆగ్రహానికి గురయ్యారు. అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతని తల, శరీరంపై తీవ్రగాయాలై రక్తంతో తడిసిపోయాడు. ఆధారాల సేకరణ.. సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఘటనస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై ఇరుగుపొరుగు వారిని, కమలాదేవి కూతురు రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. రక్తనమూనాలు సేకరించారు. కాల్చిన బుల్లెట్ షెల్ కోసం దాదాపు గంటరన్నపాటు వెతికినా లభ్యం కాలేదు. కొంతకాలంగా వేర్వేరుగా.. ప్రసాద్, రమాదేవిలు కుటుంబ కలహాలతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం తనను వేధింపులకు గురి చేస్తున్నాడని రమాదేవి నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయాన్ని ప్రసాద్ అవమానకరకంగా భావించినట్లు చర్చ జరుగుతోంది. దీనంతటికి భార్యతోపాటు అత్త, బావమరిది కారణమని కోపం పెంచుకున్న అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సమగ్ర దర్యాప్తు – ఎంఏ బారి, డీసీపీ హత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి తెలిపారు. ఈ హత్యకు ఆర్థిక, ఇతరత్రా కారణాలు ఉన్నాయనే అంశంపై విచారణ చేపడతామన్నారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మృతురాలి కూతురు రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మిస్సింగ్‌పై విచారణ కోటపల్లి పోలీసుస్టేషన్లో గన్ మిస్సింగ్‌పై రామగుండం కమిషనరేట్ పోలీసులు గురువారం విచారణ చేపట్టారు. మంచిర్యాల డీసీపీ సుధీర్‌రాంనాథ్ కేకన్ స్టేషన్‌కు చేరుకుని సుమారు ఆరు గంటలపాటు విచారణ జరిపారు. నిందితుడు ఉపయోగించింది సర్వీస్ గన్ కావడంతో పోలీసు అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆయుధం అతడి చేతికెలా వచ్చింది..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రసాద్ షార్ట్ వెపన్ తీసుకెళ్లడంపై సమగ్ర విచారణ చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించిన డీసీపీ పలువురి వాంగ్మూలం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పదుడే.. ప్రసాద్ వైఖరి మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో హోంగార్డుగా పని చేసిన ప్రసాద్ 2012–13 కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో పెద్దపల్లి జిల్లాలో పని చేశాడు. మద్యానికి బానిసై విధుల్లో నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందులతో గొడవ పడేవాడని సమాచారం. మూడు నెలల క్రితమే పెద్దపల్లి జిల్లా నుంచి మారుమూల ప్రాంతమైన కోటపల్లి పోలీసుస్టేషన్‌కు బదిలీ అయ్యాడు. విధుల్లో చేరినప్పటి నుంచి ఎక్కువగా విధులకు డుమ్మా కొట్టడం, తోటి సిబ్బందితో అమర్యాదగా వ్యవహరించడంతో సిబ్బంది అతడికి దూరంగా ఉండేవారని తెలిసింది. దొంగతనం కేసు కానిస్టేబుల్ ప్రసాద్‌పై దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.సురేష్‌కుమార్ తెలిపారు. స్టేషన్‌లోని ఆయుధ కారాగారంలో ఉంచిన పిస్టల్‌ను అపహరించుకుపోయాడని పేర్కొన్నారు. -
కోడలి ప్రాణం కోసం అత్త త్యాగం.. ఇది కదా కావాల్సింది!
జీవితం సంతోషంగా సాగుతున్న టైంలోనే కదా మనిషికి కష్టాలు వచ్చేవి. అలా ఆమెకూ అనుకోని కష్టం వచ్చి పడింది. హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారినపడ్డ అమిషాకు.. కిడ్నీ జబ్బు ఉన్నట్లు డాక్టర్లు చెప్పడంతో ఆమె, ఆమె భర్త జితేష్ కుదేలయ్యారు. పైగా రెండు కిడ్నీలు దెబ్బతిని.. వ్యాధి ప్రాణాంతక దశకు చేరుకుందని.. వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తేనే ఆమె బతికేదని తేల్చి చెప్పడంతో.. కుంగిపోసాగారు ఆ భార్యాభర్తలు. ముంబైకి చెందిన అమిషా జితేష్ మోటా(43)కు రెండు కిడ్నీలు దెబ్బతిని.. జబ్బు అడ్వాన్స్డ్ స్టేజీకి చేరిందని డాక్టర్లు చెప్పారు. కిడ్నీ మారిస్తేనే ఆమె బతుకుతుందన్నారు. అమిషా భర్త జితేష్‌కు అంతకు కొన్నిరోజుల ముందే షుగర్ వచ్చింది. దీంతో ఆయన కిడ్నీ డొనేట్ చేయడం కుదరదని వైద్యులు తేల్చారు. అమిషా తల్లిదండ్రులతో పాటు రక్తసంబంధీకులను ముందుకురాగా.. వైద్య ప్రమాణాల దృష్ట్యా అది వీలుకాలేదని వైద్యులు తెగేసి చెప్పారు. అంతా చీకట్లు అలుముకున్న తరుణంలో.. అనుకోని వ్యక్తి రూపంలో ఓ వెలుగురేఖ కిడ్నీ దానానికి ముందుకొచ్చింది. ఆమె పేరు ప్రభ కంటిలాల్ మోటా. జితేష్ తల్లి.. అమిషా అత్త. కానీ.. ప్రభ వయసు 70 ఏళ్లు. వయసురిత్యా ఆమె కిడ్నీ ఇచ్చేందుకు సరిపోతారా? అనే విషయంలో వైద్యులు తర్జన భర్జనలు చేశారు. ఆశ్చర్యంగా అన్ని టెస్టుల్లోనూ ఆమె ఫిట్‌గా తేలారు. అయినప్పటికీ వైద్యుల నుంచి ఆమెకు చెప్పాల్సింది చెప్పారు. భర్త, ఇద్దరు కొడుకులు వద్దని వారించినా ఆమె వినలేదు. చివరకు.. అమిషా కూడా వద్దని బతిమాలుకుంది. మొండిగా తన కోడలి ప్రాణం కాపాడుకునేందుకే ముందుకు వచ్చారు ప్రభ. ఆ అత్త సంకల్పానికి తగ్గట్లే.. కిడ్నీ కూడా అమిషాకు మ్యాచ్ అవుతుందని వైద్యులు ప్రకటించారు. ఆరోగ్యం క్షీణిస్తూ అమిషా పడుతున్న బాధను మా అమ్మ చూడలేకపోయింది. అందుకే ఆమెను కాపాడాలనుకుంది. వద్దని నేను, నా సోదరుడు ఆమెను ఎంతో బతిమాలాం. మా నాన్న కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా కోడలి కోసం మా అమ్మ సాహసం చేసింది. ‘‘అమిషా నా బిడ్డ లాంటిది.. బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి ఎంతదాకా అయినా వెళ్తుంది కదా’’ అని ప్రభ తేల్చేశారు. కిందటి నెలలో నానావతి ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. డాక్టర్ జతిన్ కొఠారి నేతృత్వంలో విజయవంతమైంది. అంతా హ్యాపీస్.. ఆ అత్తాకోడళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. సర్జరీ నుంచి కోలుకున్న ప్రభ.. ఆగష్టు 4వ తేదీన తిరిగి ఇంటికి చేరుకున్నారు. కుటుంబం.. చుట్టుపక్కల వాళ్లు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమిషా తల్లి ఆమెను హత్తుకుని కంటతడి పెట్టుకుంది. తల్లిగా తాను జన్మ ఇచ్చినప్పటికీ, అత్తమ్మగా.. అదీ కిడ్నీ దానంతో పునర్జన్మ ఇచ్చిందంటూ భావోద్వేగానికి లోనైంది. సమాజంలో అత్తాకోడళ్లంటే.. ఎప్పుడూ కస్సుబుస్సు లాడుతూనే ఉండాలా? కలిసి ‘సెల్ఫీ’లు తీసుకుని ప్రేమలు ప్రదర్శిస్తే సరిపోతుందా?.. ప్రభ-అమిషా ప్రేమానురాగాల గురించి తెలిశాక ఇది కదా మనకు కావాల్సింది అనిపించకమానదు. -
పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న అత్తా కోడళ్లు .. వీడియో తీసిన కొడుకు
అత్తా కోడళ్ల గొడవలనేవి తెగని పంచాయితీ.. ప్రతి ఇంట్లోనూ అత్తా కోడళ్ల మధ్య గొడవలు సర్వ సాధారణం. కొన్నిసార్లు ఈ గొడవలు పెద్దవై భార్యభర్తలు విడిపోవడం, లేదా వేరే కాపురం పెట్టే వరకు పోయిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. అయితే అత్తా కోడళ్ల గొడవలోకి మగాళ్లు వెళ్లే సాహసం చేయరని అందరికీ తెలిసిందే. ఒకవేళ వెళ్లినా.. లేదా అటు తల్లికి, భార్యకు మధ్య సర్దిచెప్పలేక, వాళ్ల సమస్యలు పరిష్కరించలేక తలలు పట్టుకోవాల్సిందే. తాజాగా ఇద్దరు అత్తా కోడళ్లు గొడవపడిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇది అట్టాంటి ఇట్టాంటి పంచాయితీ కాదు. అత్తా కోడళ్లు ఇద్దరూ ఒకరిపై ఒకరు భయంకరంగా దాడి చేసుకునే వరకు పోయింది. వంటింట్లో కూర్చొని ఒకరు జుట్టు ఒకరు పట్టుకొని దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. అరవింద్ కుమార్, ప్రీతి దేవి కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అరవింద్ తన తల్లిదండ్రులు భూప్ ప్రకాష్, రాణి దేవితో కలిసి గాంధీ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివిసిస్తున్నారు. అరవింద్ నిరుద్యోగి కావడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. గతంలో ప్రీతి తన అత్త రాణి దేవిపై దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈసారి రాణి కోడలపై దాడి చేసింది. ఆమెను తలను నేలకేసి కొట్టడం, కాలితో తన్నడం, గోడకేసి నెట్టడం వీడియోలో కనిపిస్తోంది. కోడలు ఏడుస్తూ అత్తను ఆపడం కూడా చూడవచ్చు. ఇక విచిత్రం ఏంటంటే ఈ తంతంగాన్ని మొత్తం మహిళా కొడుకే వీడియో తీయడం కొసమెరుపు. అంతేగాక దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా వంట పేరుతో అత్త రోజు దూషించేదని, మగ పిల్లాడిని కనలేదనే కారణంతో వేధించేదని కోడలు ప్రీతి ఆరోపించింది. అయితే అత్త వర్షన్ ఇందుకు విరుద్దంగా ఉంది. తనకు ఒక్కడే కొడుకు కావడం, ఇతర సంతానం ఏం లేకపోవడంతో వారు నివసించే ఇంటిని తన పిల్లల పేరు మీద రాయాలని కోడలు బలవంతం చేస్తుందని రాణి ఆరోపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు చెబుతున్నారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా సదరు మహిళలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. #उत्तरप्रदेश : #अलीगढ़ में बहू के तीन बेटियां पैदा होने पर नाराज सास ने बहू से की मारपीट#Violence #fightvideos #viralvideo #UttarPradesh #DelhiRains #OperationVijay #Gadar2Trailer #Haryanaclerk35400 #KargilVijayDiwas #अध्यात्म_के_शिरोमणि pic.twitter.com/XDLtOPeNs6 — NCR Samachar (@ncrsamacharlive) July 26, 2023 -
అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్
లక్నో: కాసేపట్లో పెళ్లి జరగబోతోందనగా కాస్త ముందుగానే కళ్యాణ మండపానికి వచ్చిన వరుడికి సూపర్ షాకిచ్చింది వధువు తల్లి. కళ్యాణ మండపానికి వధువుని వెంటబెట్టుకుని వచ్చే క్రమంలో డాన్సులు చేస్తూ ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ కనిపించిన అత్తగారిని చూసి కాబోయే అల్లుడు హతాశుడయ్యాడు. అత్తగారి విచిత్ర ధోరణికి మండిపడి పెళ్లి పెటాకులు చేసుకుని మరీ వెళ్ళిపోయాడు. ఉత్తరాదిలో పెళ్లిళ్లంటే ఆ ధూమ్ ధామ్ సందడే వేరు. పెళ్ళికి ముందు నుంచే ప్రతిరోజూ పెళ్లే అన్నంత కోలాహలంగా ఉంటుంది వాతావారణం. హల్దీ, మెహందీ, సంగీత్, షాదీ ఇలా పెళ్ళి పేరుతో పెద్ద తంతే నడుస్తుంది. ఇక అక్కడి పెళ్లిళ్లలో లింగ భేదం లేకుండా విందు చేయడం చిందులేయడం సర్వసాధారణం. కానీ ఎందుకో ఈ పధ్ధతి రుచించక వరుడు పెళ్లి వద్దనుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఇరుపక్షాల పెద్దలు కూర్చుని పంచాయతీ జరిపిన తర్వాత పెళ్ళికి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని సంభాల్ జిల్లాకు చెందిన వరుడికి, రాజ్ పురకు చెందిన వధువుకి జూన్ 27న వివాహం జరగాల్సి ఉంది. వివాహ వేదిక వద్ద ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు. పెళ్లిలో సందడి చేయడానికి డీజే కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోందనగా వరుడు బంధువర్గ సపరివారసమేతంగా ముందే కళ్యాణ మండపానికి ఊరేగింపుగా వచ్చి వధువు కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలోనే వధువు తరపు బృందం ఊరేగింపుగా వచ్చారు. కానీ వధువు పల్లకికి ముందు వధువు తల్లి సిగరెట్ కాలుస్తూ తన్మయత్వంతో చిందులేస్తూ కనిపించింది. వధువు కోసం వేచి ఉన్న వరుడు అత్తని అలా చూసి షాక్ కి గురయ్యాడు. కోపోద్రిక్తుడై పెళ్లి వద్దనుకుని పెళ్లి మటపం నుంచి వెళ్ళిపోయాడు. అనంతరం రెండువర్గాల పెళ్లి పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో వరుడు పెళ్ళికి అంగీకరించాడు. తర్వాత పెళ్లి కార్యక్రమం యధాతధంగా కొనసాగింది. ఇది కూడా చదవండి: ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. షిండే -
అత్త చేతిలో ధోని బిజినెస్...
-
బట్టల తీగకు కరెంట్.. కాపాడబోయి భార్య, అత్త కూడా..
క్రైమ్: బట్టలు ఆరేసుకునే తీగకు కరెంట్ వైర్ తగలడం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. ఇజార్ అక్తర్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం బట్టలు ఆరేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆ ఇనుప తీగకు గాలిదుమారం కారణంగానే ఆ పక్కనే ఉన్న కరెంట్ తీగ తగిలింది. దీంతో ఇజార్‌కు కరెంట్ షాక్ కొట్టగా.. విలవిలలాడిపోయాడు. అది గమనించిన భార్య ముంతాహ బేగం, ఆమె తల్లి ఖైరుల్ నెస్సా, ఇజార్‌ను ఆలస్యం చేయకుండా రక్షించేందుకు యత్నించారు. ఈ క్రమంలో వాళ్లిద్దరికీ కరెంట్ షాక్ తగిలింది. వాళ్లిద్దరూ అక్కడికక్కడే మరణించారు. అయితే.. ఇజార్‌కు మాత్రం కరెంట్ షాక్‌తో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇజార్ కన్నుమూశాడు. కోల్‌కతా(పశ్చిమ బెంగాల్) ఏక్బల్పోర్లో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన విషాదం నింపింది. ఇదీ చదవండి: గురుద్వారా ఆవరణలో మద్యం తాగిన మహిళ.. కాల్చి చంపిన సేవాదార్ -
Sudha Murty: 'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది!'
రిషి సునాక్ అతి చిన్న వయసులో బ్రిటన్ ప్రధాని అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతని అత్తగారు సుధా మూర్తి చేసిన వ్యాఖ్యలు.. అతని అధికార హోదాను మరోసారి వార్తల్లో హైలెట్‌గా నిలిచేలా చేసింది. ఈమేరకు ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుడు, దిగ్జజ పారిశ్రామిక వేత్త నారాయణ మూర్తి భార్య సుధామూర్తి మాట్లాడుతూ..తన కూతురు కారణంగానే రిషి సునాక్ అతి చిన్న వయసులో యూకేకి ప్రధాని అయ్యారని ఆన్లైన్లో ప్రసారం అవుతున్న ఓ వీడియోలో అన్నారు. ఆ వీడియోలో..తన కూతురే దీన్ని సాధ్యం చేసిందన్నారు. తాను తన భర్తను వ్యాపారవేత్తను చేస్తే తన కుమార్తె తన భర్తను ప్రధానిని చేసిందని చెప్పారు. "ఇదంతా భార్య మహిమే. భార్య భర్తను ఎలా మారుస్తుందో చూడండి. ఐతే నేను నా భర్తను మాత్రం మార్చలేకపోయాను..నేను ఆయన్ని కేవలం వ్యాపారవేత్తని చేశానని, కానీ నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో అన్నారు. కాగా, రిషి సునాక్ 2009లో అక్షతామూర్తిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడేళ్లలోనే యూకేకి ప్రధాని అయిన ఎంపీగా నిలవడమే గాక, అతిపిన్న వయస్కుడైన ప్రధానిగా పేరుగాంచారు. కాగా అక్షతమూర్తి ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్లలో ఒకరి కుమార్తె, దాదాపు 730 మిలియన్ల పౌండ్ల వ్యక్తిగత సంపదతో శక్తిమంతమైన మహిళగా ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు, భారతదేశానికి చెందినవారు. అక్షతామూర్తి తండ్రి నారాయణమూర్తి ఇన్పోసిస్ వ్యవస్థాపకుడు, భారతదేశంలోని అత్యంత సంపన్నులో ఆయన ఒకరు. (చదవండి: మణిపూర్‌లో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు) -
MS Dhoni : ఖుష్బూ ఇంట్లో ధోనీ సందడి.. అత్తయ్య సర్ప్రైజ్! (ఫొటోలు)
-
ప్రేమ పెళ్లి.. ఇంటికి వచ్చిన కోడలిని గుడికి తీసుకెళ్లి
బీహార్ ఛప్రాలోని పానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ధేనుకి చావర్ గ్రామ సమీపంలో 15 రోజుల క్రితం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన మహిళ గౌరా ఓపీ పరిధిలోని చందా గ్రామానికి చెందిన నితీష్ కుమార్ భార్య పూజా కుమారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన అనంతరం మహిళను ఆమె అత్త హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్ల క్రితం నితీష్, పూజని వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి అతని కుటుంబసభ్యులకు ఇష్టం లేకుండా జరిగింది. పెళ్లయిన తర్వాత నితీష్ తన భార్యతో కలిసి వేరే చోట నివాసం ఉంటున్నాడు. కొన్నాళ్ల తర్వాత నితీష్ కుటుంబ సభ్యులు అతనితో పాటు పూజను ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి వచ్చిన కొడుకు, కోడలితో నితీష్ తల్లి ఎంతో అప్యాయంగా మాట్లాడింది. కొడుకుకి అనుమానం రాకుండా నితీష్ తల్లి తన స్నేహితులతో కలిసి కోడలిని గుడికి తీసుకెళ్తున్నట్లు చెప్పింది. కోడలిపై కోపం పెంచుకున్న అత్త.. ధనుక గ్రామంలో పూజను హత్య చేసి మృతదేహాన్ని చన్వార్‌లోని కాలువలో పడేసింది. భార్య అదృశ్యమైన తర్వాత నితీష్ ఆమె కోసం అన్ని చోట్ల వెతికాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. పది రోజుల తర్వాత, పూజ మృతదేహాన్ని పోలీసులు కాలువలో కనుగొన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా విచారణ జరపగా పూజను ఆమె అత్త హత్య చేసినట్లు అసలు బండారం బయటపడింది. -
అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన.. అసలు ఏం జరిగిందంటే?
సాక్షి, సూర్యాపేట జిల్లా: అత్తగారింటి ఎదుట అల్లుడు నిరసనకు దిగిన ఘటన కోదాడలో జరిగింది. తన కొడుకుని చూపించకుండా అత్తమామలు వేధిస్తున్నారంటూ ఆ అల్లుడు ఆరోపిస్తున్నాడు. భార్యాభర్తలైన ప్రవీణ్ కుమార్, పృథ్వీ రమణీల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. బాబుని తల్లిదండ్రుల చెంతనే ఉంచి పృథ్వీ రమణీ కెనడా వెళ్లింది. వారం వారం కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటున్న ప్రవీణ్.. తన కొడుకును చూడకుండా అత్తామామలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు. తన నుంచి కొడుకును దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ ప్రవీణ్.. తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటి ఎదుట ఆందోళనకు దిగాడు. చదవండి: హైదరాబాద్‌లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ..ఎక్కడో తెలుసా -
షాకింగ్.. ‘టీ’ చల్లారిందన్న అత్తను.. కోడలు ఏం చేసిందంటే?
తమిళనాడు: ఇటీవల క్షణికావేశంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరికొన్ని వాటిలో చిన్న చిన్న గొడవలే హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా తమిళనాడులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వేడి వేడి ‘టీ’ అడిగిన అత్తను కోడలు ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన ఘటన తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో జరిగింది. మలైక్కుడిపట్టికి చెందిన వేల్, పళనియమ్మాళ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నాడు. పళనియమ్మాళ్ కుమారుడు సుబ్రమణ్యన్ వద్ద ఉంటోంది. మంగళవారం రాత్రి బయటి నుంచి వచ్చిన పళనియమ్మాళ్.. కోడలు కనుకును పిలిచి టీ పెట్టాలని కోరింది. కోడలు పెట్టిన టీ చల్లారిపోవడంతో ఆమె.. కోడలిని మందలించింది. దీంతో ఆగ్రహించిన కనుకు.. ఇనుప రాడ్డు తీసుకుని అత్త తలపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పళనియమ్మాళ్‌ను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించింది. అయితే సుబ్రమణియన్ తల్లి పళనియమ్మాళ్, కనుకు మధ్య సఖ్యత లేదని స్థానికులు చెబుతున్నారు. నిందితురాలు చాలాకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోందని తెలిపారు. చదవండి: నవీన్‌తో బ్రేకప్ అయ్యాకే హరి దగ్గరయ్యాడు: నిహారిక! -
మహబూబాబాద్: టమాటా కూర అత్త ప్రాణం మీదకు తెచ్చింది
సాక్షి, మహబూబాబాద్: కోడలు వండిన టమాట కూర.. ఆ అత్త ప్రాణం మీదకు తెచ్చింది. భార్యను అవమానించిందంటూ సొంత తల్లిపైనే ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ మండలంలో జరిగింది. వేంనూరులో ఆత్తకోడళ్ళ మధ్య ఘర్షణ.. ఒక ప్రాణం మీదకు తెచ్చింది. వండిన టమాటా కూర బాగలేదని కోడలిని మందలించింది అత్త బుజ్జి. ఈ విషయంపై భర్తకు ఫిర్యాదు చేసింది నందిని. తన భార్యనే అట్లా అంటావా అంటూ మటన్ కొట్టే కత్తితో కొడుకు మహేందర్ సొంత తల్లిపైనే దాడికి దిగాడు. ఈ దాడిలో తల్లి బుజ్జి తల్లి తలకు తీవ్రగాయ్యాలు. వెంటనే ఆమెను స్థానికులు మహబూబాబాద్ ఏరియా హస్పటల్ కి తరలించారు. ఆపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
అత్త హత్య కేసులో అల్లునికి జీవితఖైదు
సాక్షి, తుమకూరు: పిల్లనిచ్చిన పాపానికి అత్తను హత్య చేసిన కేసులో ఘరానా అల్లునికి కోర్టు జీవితఖైదుని విధించింది. వివరాలు.. శిర తాలూకాలోని హులికుంటె వద్దనున్న యలపేనహళ్లివాసి ఎస్.ప్రదీప్ కుమార్ ఈ కేసులో దోషి. కుటుంబ కలహాల వల్ల అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను వెంట పంపాలని ప్రదీప్ 2019 సెప్టెంబర్ 20వ తేదీన మధుగిరి తాలూకాలోని బడవనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రి వెనుక అద్దె ఇంట్లో ఉండే అత్త ప్రేమలత (55) ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో ఘర్షణ జరిగింది. అతడు చాకు తీసుకుని ప్రేమలతను, ఆమె తండ్రి దొడ్డన్న, కుమారుడు వెంకటేష్‌పైన దాడి చేయడంతో తీవ్ర గాయాలతో ప్రేమలత మరణించింది. బడవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో తుమకూరు సెషన్స్ కోర్టు జడ్జి యాదవ కరికెరె జీవితఖైదుతో పాటు రూ.11 లక్షల జరిమానాను విధిస్తూ తీర్పు వెలువరించారు. (చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో లివ్ ఇన్ రిలేషన్.. పెళ్లి చేసుకోమని అడిగితే దారుణంగా..) -
దేవుని మాలలో ఉండి దారుణం..కూతురు కోసం వచ్చి అత్తపై దాడి
సాక్షి, జ్యోతినగర్: కూతురి ఆచూకీ కోసం వచ్చిన ఓ తల్లిని ఆమె అల్లుడే క్షణికావేశంలో హతమార్చాడు. ఈ విషాద ఘటన ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కృష్ణానగర్‌కు చెందిన కాసు సతీశ్–పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. సతీశ్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్యతో గొడవలు మొదలయ్యాయి. దీంతో కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లి, మరో ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం పద్మ తీవ్ర మనోవేదనకు గురై, ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు శృతి తండ్రి వద్దకు వెళ్లి, అమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపింది. దీంతో అతను తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని, ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు రామయ్యపల్లెలో ఉంటున్న పద్మ తల్లిదండ్రులు ఈర్ల లక్ష్మీ(65)–రాజయ్యలకు సమాచారం అందించడంతో ఠాణాకు చేరుకున్నారు. అనంతరం మనవరాళ్లను చూసేందుకు కృష్ణానగర్ వెళ్లారు. ఇంట్లో అల్లుడు సతీశ్ కనిపించడంతో తమ కుమార్తె నీ మూలంగానే ఇంటి నుంచి వెళ్లిపోయి ందన్నారు. ఇది గొడవకు దారితీసింది. క్షణికావేశంలో సతీశ్ తాను దేవుని మాల వేసుకున్న విషయాన్నీ మర్చి పోయి, అత్త లక్ష్మీపై దాడి చేశాడు. స్థానికులు అతన్ని సముదాయించి, స్పృహ కోల్పోయిన లక్ష్మిని గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటనతో ఆస్పత్రి ఆవరణలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై బి.జీవన్, పోలీసు సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి చిన్న కుమారుడు గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సతీశ్‌పై హత్య కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పోలీసుల అదుపులో నిందితుడు? లక్ష్మి మృతి చెందిన విషయం తెలుసుకున్న సతీశ్ తన మెడలోని మాల తీసివేశాడు. అనంతరం పోలీ స్‌స్టేషన్‌కు వెళ్లి, లొంగిపోయినట్లు సమాచారం. (చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య) -
వైరల్ వీడియో : ఉల్లిగడ్డలను పొలంలో నాట్లు వేస్తున్న జర్మనీ కోడలు ..
-
అమ్మనా జర్మనీ కోడలా?.. వైరల్
సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతీ మనిషి గౌరవం పెంచేవే. వాటిని మరొకరితో పంచుకున్నప్పుడు ఆ ఫీలింగ్ మరోలా ఉంటుంది. అదే స్నేహం, పెళ్లి వంకతో ఎల్లలు దాటిపోతే!. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. జర్మనీకి చెందిన ఓ యువతి.. ఉల్లిగడ్డలను పొలంలో నాట్లు వేస్తూ కనిపించింది. ఇక్కడి యువకుడిని పెళ్లి చేసుకోవడంతోనే ఆమె ఆగిపోలేదు. ఇక్కడి సంస్కృతిని ఆకళింపు చేసుకుంటోంది. అత్తతో కలిసి పొలంలో నాట్ల పనులకు వెళ్లిందామె. నమస్తే జూలీ పేరుతో ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆమె ఈ వీడియోను పోస్ట్ చేసింది. అత్తను అమ్మగా పేర్కొంటూ.. ఆమె వీడియోలో వివరణ ఇవ్వడం చూడొచ్చు. అమ్మ రియాక్షన్ ఎంతో బాగుంది. కుటుంబంతో సాధారణంగా జీవించడాన్ని ఆస్వాదిస్తున్నా. నా భర్త ఊరికి వచ్చి దాదాపు నెల అయ్యింది. నా కుటుంబంతో ఇలా గడపడం, ప్రకృతికి దగ్గరగా ఉండడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అని పేర్కొన్నారామె.ఈ పరిణామం ఎక్కడిదో తెలియదుగానీ.. 26 మిలియన్ల మంది ఈ వీడియోను చూశా. ఎంతో మంది లైకులు, షేర్లు చేశారు. ఆమె అంకిత భావానికి, భారత సంస్కృతిని స్వీకరించడాన్ని అభినందిస్తున్నారు కూడా. View this post on Instagram A post shared by जूली शर्मा 🦋 (@namastejuli) -
భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య
గార్లదిన్నె: భార్య పుట్టింటికి పోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన షాహినాకు గుంతకల్లు నివాసి జిలాన్ (38)తో వివాహమైంది. అదే గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో సొంత ఇల్లు నిర్మించుకుని బేల్దారి పనులతో జీవనం సాగించేవారు. పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. శనివారం భర్త గొడవ పడడంతో షాహిన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన జిలాన్ అదే రోజు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి దుర్వాసన వెలువడుతుండడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న జిలాన్ మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జమేదార్ దేవకుమార్ తెలిపారు. (చదవండి: వింత మనుషులు..చీకటి గదిలో నుంచి వెలుగులోకి) -
అత్తారింటికి వెళ్లి కాల్పులు.. ఘరానా భర్త హల్చల్
యశవంతపుర: గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి రావాలని ఒత్తిడి చేయడానికి కాల్పులు జరిపాడో ఘరానా భర్త. బెళగావి జిళ్లా అథణి తాలూకాలో ఈ సంఘటన జరిగింది. విజయపుర జిల్లా సింధగికి చెందిన శివానంద కాలేబాగ సోమవారం సాయంత్రం భార్య ప్రీతి పుట్టినిల్లు అయిన అథణికి వెళ్లాడు. ప్రీతితో అతనికి నాలుగేళ్ల క్రితం పెళ్లి కాగా మూడేళ్ల చిన్నారి ఉంది. భర్త మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సంసారంలో విభేదాలు ఏర్పడడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం సాయంత్రం శివానంద అత్తవారింటికి వెళ్లి ప్రీతితో గొడవపడ్డాడు. తన వెంట రావాలని కోరగా ఆమె తిరస్కరించింది. ఇది తట్టుకోలేక శివానంద తనవద్దనున్న రివాల్వర్‌తో రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపాడు. నిన్ను చంపి నేను చచ్చిపోతానని వీరంగం సృష్టించాడు. దీంతో ప్రీతి, ఆమె తల్లిదండ్రులు అథణి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అతన్ని అరెస్ట్ చేసి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీకి లైసెన్స్ ఉందని, విజయపుర జిల్లా వరకు మాత్రమే అనుమతి ఉందని గుర్తించారు. (చదవండి: అమ్మ కావాలి.. కన్నీరు పెట్టించిన విషాద ఘటన..) -
అత్తింటివారి దాష్టీకం!...బాలింత అయిన కోడలిని ఇంట్లోకి రానివ్వకుండా...
యశవంతపుర: భర్త మృతి చెందిన దుఃఖంలో ఉన్న కోడలికి అండగా ఉండాల్సిన అత్తింటివారు నిర్దయగా వ్యవహరించి ఆమెను ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. 30 రోజుల బాలింత అయిన ఆమె తన చిన్నారితో కలిసి ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతోంది. ఈ ఘటన ఉడిపిలో జరిగింది. బాదామికి చెందిన అయ్యప్ప(28) ఉడిపిలో మెకానిక్ పని చేసేవాడు. రెండేళ్ల క్రితం గంగావతికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరి వివాహానికి ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. దీంతో అయ్యప్ప పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. నెల రోజుల క్రితం ఈ దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. అయితే ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. 20 రోజుల క్రితం అయ్యప్ప కింద పడగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లిన తల్లిదండ్రులు కోడలిని మాత్రం ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. దిక్కుతోచని స్థితిలో ఆమె తన చిన్నారితో కలిసి ఉడిపి సమాజ సేవక విశుశెట్టి అంబలపాడి నిట్టూరు సఖి ఆశ్రయంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతోంది. (చదవండి: చైన్‌స్నాచింగ్ చేయకపోతే నిద్రపట్టదు) -
తాగుబోతు అల్లుని కిరాతకం.. భార్యను ఇంటికి పంపలేదని
సాక్షి, బెంగళూరు: మద్యం మత్తులో అల్లుడు, అత్తను సుత్తితో కొట్టి హత్యచేశాడు. ఈ ఘటన బెంగుళూరులోని హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆరేళ్ల క్రితం నాగరాజు అనే వ్యక్తితో సౌభాగ్య (50) కుమార్తె భవ్యశ్రీకి పెళ్లి చేశారు. నాగరాజు, భవ్యశ్రీ దంపతులకు ఐదేళ్లు కుమారుడు ఉన్నారు. డ్రైవరుగా పనిచేస్తున్న నాగరాజు మద్యానికి బానిసై ఇంట్లో గొడవపడేవాడు. భర్త వేధింపులను తట్టుకోలేక భవ్యశ్రీ మూడేళ్ల క్రితం హెచ్ఏఎల్ సంజయనగరలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. మద్యం మత్తులో ఉన్న నాగరాజు భార్య కావాలంటూ ఈ నెల 12 తేదీన భార్య వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. అత్త సౌభాగ్య, కుటుంబసభ్యులు మందలించి పంపేశారు. మరుసటిరోజున నాగరాజు సుత్తితో వచ్చి సౌభాగ్య తలపై దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన సౌభాగ్యను స్థ్దానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ క్రితం మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నహెచ్‌ఏఎల్ పోలీసులు నాగరాజును అరెస్ట్ చేశారు. చదవండి: సైకో భర్త చిత్రహింసలు.. భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ.. -
ఇంటి ముందు కల్లేపు చల్లే విషయంపై గొడవ.. స్నేహితుడితో కలిసి..
వేలూరు: తిరుపత్తూరు జిల్లా సెవ్వాత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలోని పుదూరు గ్రామానికి చెందిన సెల్వరాజ్ ఓ ప్రైవేటు కంపెనీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య రామరోజ అలియాస్ రాణి(50). ఈమె కుమారుడు ఏయుమలై, భార్య హంస దంపతులకు 10 నెలల కుమార్తె ఉంది. ఇదిలా ఉండగా గత నెల 29వ తేదీన సెల్వరాజ్ డ్యూటీకి వెళ్లాడు. ఇంటి హాలులో రాణి, తన గదిలో కోడలు హంస నిద్రించారు. గురువారం ఉదయం రాణి రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఆ సమయంలో హంస తరచూ ఒక యువకుడితో సెల్ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించి.. ప్రశ్నించారు. హంస హైస్కూ ల్ చదువుతున్న సమయంలో గున్నచ్చి మోటూరు గ్రామానికి చెందిన కార్తికేయన్ కలిసి చదువుకుంది. గత నెల 30వ తేదీ రాత్రి అత్త కోడలి మధ్య ఉదయం ఇంటి ముందు కల్లేపు చల్లే విషయంపై వాదనలు జరిగాయి. దీంతో కోడలు హంస ఆగ్రహం చెంది తన స్నేహితుడు కార్తికేయన్‌ను రప్పించి అత్త రాణిని హత్య చేసింది. మృత దేహాన్ని అక్కడే వదిలి పెట్టి ఏమీ తెలియనట్లు నాటకం ఆడారని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. చదవండి: ఉద్యోగం లేదు.. పెళ్లి కాలేదు.. 24వ అంతస్తు నుంచి దూకిన యువతి -
భార్య చేసిన పనికి.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు
వేలూరు(చెన్నై): తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని వళయంపట్టు గ్రామానికి చెందిన జయేంద్రన్. ఇతని కుమార్తె నిషా. నిషాకు కల్లకురిచ్చికి చెందిన రమేష్‌తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే గత ఏడు సంవత్సరాలుగా భార్యాభర్తలు విడిపోవడంతో భార్య నిషా రెండవ వివాహం చేసుకుని రెండవ భర్త రవికుమార్‌తో కలిసి జీవిస్తోంది. ఈ నేపథ్యంలో నిషా మొదటి భర్త రమేష్ వీరిని నిలదీశారు. దీనిపై ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇదిలా ఉండగా శనివారం రాత్రి అత్తింటికి∙వచ్చిన రమేష్ ఆగ్రహించి నిప్పు పెట్టాడు. ఈ విషయాన్ని భార్య నిషాకు ఫోన్ చేసి చెప్పాడు. గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసి వాణియంబాడి పోలీసులు సమాచారం అందించారు. అనంతరం రమేష్‌ను అదుపులోకి తీసుకుని ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..! -
అత్తను గెంటేసిన కోడళ్లు! అనాథగా మారిన అవ్వ
నా అనుకున్న వారు ఇంకా కళ్ల ముందే ఉన్నారు. రూ.లక్షలు విలువ చేసే ఆస్తిపాస్తులున్నాయి. ఒకరిపై ఆధారపడనవసరం లేదు. అయినా ఆ వృద్ధురాలు వీధిన పడింది. డబ్బు ముందు మానవ సంబంధాలు అడుగంటడంతో ఏడు పదుల వయసులో ఇతరుల దయాదాక్షిణ్యాలపై బతుకు బండి లాగిస్తోంది. రాప్తాడు/అనంతపురం కల్చరల్: రాప్తాడు మండలం గంగులకుంట గ్రామానికి చెందిన నారాయణమ్మకు 74 ఏళ్లు. ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సిద్దన్నతో ఆమెకు వివాహమైంది. పెళ్లి అనంతరం గంగులకుంటలోనే వారు స్థిరపడ్డారు. వీరికి ఒక్కగానొక్క కుమారుడు లక్ష్మీనారాయణ సంతానం. కొడుకు మృతితో కష్టాలు మొదలు దాదాపు 20 ఏళ్ల క్రితం సిద్దన్న మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి, కుమారుడు కలిసే ఉంటున్నారు. తండ్రి బతికున్నప్పుడే కుమారుడు లక్ష్మీనారాయణ రాప్తాడుకు చెందిన ఓబుళమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానం కాకపోవడంతో రెండో పెళ్లికి లక్ష్మీనారాయణ సిద్ధమయ్యాడు. ఆ సమయంలో మేనమామ కుమార్తె లక్ష్మీదేవి అయితే తన తల్లిని బాగా చూసుకుంటుందని భావించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొడుకున్నంత కాలం తల్లికి ఏ కష్టమూ రాలేదు. పదేళ్ల క్రితం పిడుగుపాటుకు గురై లక్ష్మీనారాయణ మృతి చెందాడు. ఆ తర్వాత నారాయణమ్మకు కష్టాలు మొదలయ్యాయి. జీమాను కట్టనే దిక్కు భర్త మరణించే నాటికి నారాయణమ్మ పేరుపై 12 సెంట్ల దొడ్డి, 6 ఎకరాల మెట్ట పొలం, రెండు ఇళ్లు, కొంత నగదు ఉండేది. స్థిరాస్తుల విలువ రూ. లక్షల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో కోడళ్లు చెరి సగం డబ్బు పంచుకుని నారాయణమ్మను పట్టించుకోకపోవడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. నా అనుకున్న తమ్ముడు సైతం కుమార్తె సుఖం కోసం అక్కను పట్టించుకోవడం మానేశాడు. ఆత్మాభిమానం.. అమాయకత్వమున్న నారాయణమ్మ ఎవరు చెప్పినా వినకుండా గ్రామం మధ్యలో జీమాను కట్టను ఆశ్రయించింది. మొండితనం... మంకుపట్టు జీమాను కట్టపై జీవనం సాగిస్తున్న నారాయణమ్మ తన ఇంటికి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. స్థానికులు ఎంత నచ్చచెప్పినా వినకుండా కోడళ్ల ముఖం చూడనని భీష్మించుకుంది. దీంతో నారాయణమ్మకు ఏమైనా జరిగితే గ్రామానికి చెడ్డపేరు వస్తుందని భావించిన గ్రామస్తులే ఏ పూటకా పూట తిండి పెట్టి బాగోగులు చూస్తున్నారు. అధికారులు స్పందించి నారాయణమ్మ విషయంలో జోక్యం చేసుకుని ఆమె శేష జీవితం ప్రశాంతంగా సాగిపోయేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. (చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి) -
భార్య, అత్తపై కత్తితో దాడి
హిందూపురం: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, అత్తపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం హిందూపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. స్థానిక మోడల్ కాలనీకి చెందిన శ్రావణ్, గౌతమి దంపతులు. ఆరేళ్ల క్రితం వివాహమైన వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానాలు పెంచుకున్న శ్రావణ్ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ విషయంగా పలుమార్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. కౌన్సెలింగ్‌తో దంపతుల మధ్య విభేదాలను పోలీసులు దూరం చేస్తూ వచ్చారు. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు దంపతులిద్దరూ విడాకుల కోసం న్యాయస్థానం మెట్టు ఎక్కారు. ఈ క్రమంలోనే తల్లి సుశీలమ్మ వద్దకు గౌతమి చేరుకుంది. ఆదివారం తన కొడుకును తనకిచ్చేయాలంటూ అత్తారింటికి వెళ్లి శ్రావణ్ గొడవపడ్డాడు. వాదన శ్రుతి మించడంతో తమ్ముడు నవీన్‌తో కలిసి కత్తితో శ్రావణ్ దాడి చేసి, పారిపోయాడు. ఘటనలో గౌతమి, ఆమె తల్లి సుశీలమ్మ గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరినీ బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై రెండో పట్టణ సీఐ సూర్యనారాయణ కేసు నమోదు చేశారు. (చదవండి: ఆడియో వైరల్: బండ బూతులు తిట్టుకున్న టీడీపీ నాయకులు ) -
వివాహేతర సంబంధం.. పలుసార్లు ఇల్లు కూడా మార్చాడు.. చివరికి
యశవంతపుర: అక్రమ సంబంధం అనుమానంతో భార్యతో పాటు అత్తను కూడా హత్య చేశాడో భర్త. బెంగళూరు గోవిందరాజనగర పోలీసుస్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. వివరాలు.. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లికి చెందిన రవికుమార్ భార్య సావిత్రి, అత్త సరోజమ్మలతో కలిసి మూడలపాళ్యలో బాడుగ ఇంటిలో ఉంటున్నారు. బెంగళూరుకు 20 ఏళ్లు క్రితం వలస వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని భర్త అనుమానించసాగాడు. దీనిపై అనేకసార్లు దంపతులు గొడవపడ్డారు. పలుసార్లు ఇల్లు కూడా మార్చాడు. మంగళవారం ఉదయం పిల్లలను స్కూల్ వద్ద వదిలి భార్యతో మళ్లీ ఘర్షణ పడ్డాడు. కోపం పట్టలేక కొబ్బరికాయలను కొట్టే కత్తిని తీసుకుని భార్య సావిత్రి, ఆమె తల్లి సరోజమ్మను నరికిచంపాడు. తరువాత స్కూటర్‌పై గోవిందరాజనగర పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాలకు విక్టోరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
గతేడాది వివాహం.. అత్తవారింటికి వెళ్లి ఎవరూ లేని సమయం చూసి..
రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని కాసీపూర్ సమితి ఒండ్రాకంచ్ పోలీస్ స్టేషన్ పరిధి కంటాలి గ్రామంలో యువకుడు గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు తొలొజొరి గ్రామానికి చెందిన నందొ మజ్జి(18)గా పోలీసులు గుర్తించారు. ఒండ్రాకంచ్ ఐఐసీ తపన్‌కుమార్ మహాలి తెలిపిన వివరాల ప్రకారం.. కటాలి గ్రామానికి చెందిన శివమజ్జి పెద్ద కుమార్తెతో నందొ మజ్జికి గతేడాది వివాహం నిశ్చయమయ్యింది. (చదవండి: సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు ) ఈ క్రమంలో నందొ అప్పుడప్పుడు అత్తవారింటికి వెళ్లి, వస్తుండేవాడు. బుధవారం కూడా అదే విధంగా వెళ్లిన యువకుడు.. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడు సాయంతో ఉరి వేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఘటన హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
అందగత్తె అని ఏరికోరి కొడుక్కిచ్చి పెళ్లి చేసింది, కానీ..
కోడలిని కూతురిలా స్వీకరించే అత్తలు ఎంతమంది? ఆ సంగతి ఏమోగానీ ఇక్కడో అత్త.. కోడలిని కూతురిగానే భావించింది. కారణం.. కొడుకు తన కళ్ల ముందే కన్నుమూయడం. ఆ విషాదాన్ని దిగమింగుకున్న ఆ అత్త.. కోడలిని కన్నకూతురిలా దగ్గరుండి చదవించింది. అంతేకాదు మరో వ్యక్తిని చూసి పెళ్లి చేసింది కూడా! ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాజస్థాన్ సికార్‌లో కమలా దేవి, దిలావర్ దంపతులు ఉన్నారు. వీళ్లకు శుభమ్ అనే కొడుకు ఉండేవాడు. 2016లో సునీత అనే అమ్మాయితో శుభమ్ వివాహం జరిగింది. సునీతది పేద కుటుంబం. కాకపోతే గుణం-రూపం రెండూ మంచివే. అందుకే పైసా కట్నం తీసుకోకుండా కోడలిగా స్వీకరించింది కమలా దేవి. చూడముచ్చటైన జంట అని ఊరంతా అంటుంటే.. దిష్టి తీసింది ఆ తల్లి. ప్చ్.. దురదృష్టం కొద్దీ ఆరు నెలలకే సునీత భర్త చనిపోయాడు. కొడుకు శుభమ్ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయాడు. అయితే చిన్నవయసులో భర్త చనిపోయిన సునీతను దూరం చేసుకునేందుకు ఆ వృద్ధ దంపతుల మనసు అంగీకరించలేదు. నష్టజాతకురాలు అని బంధువులంతా తిట్టిపోస్తుంటే.. కమలాదేవి వాళ్లను వారించింది. కొడుకు చనిపోతే? కోడలి తప్పేంటని సునీతకు మద్దతు నిలిచింది. పైగా పేదింటి బిడ్డ కావడంతో అమ్మగారింటికి పంపకుండా.. తమతోనే ఉంచాలని నిర్ణయించుకుంది. సునీతను మంచిగా చదవించింది. మంచి ఉద్యోగం వైపు ఆమెను ప్రొత్సహించింది. ఎంఏ బీఈడీ చదివిన సునీత.. ఈమధ్యే జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించింది. శనివారం(22, జనవరి 2022) సునీతను ముఖేష్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. సునీత వివాహం చాలా ఘనంగా జరిగింది. ఆ వివాహంలో కాళ్లు కడిగి కన్యాదానం చేసింది కమలాదేవి-దిలావర్ దంపతులే. అంతేకాదు అప్పగింతల సమయంలో వాళ్ల బంధం చూసి.. అత్తమామలు కాదు.. అమ్మానాన్న అనుకున్నారట అంతా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వివాహ వేడుక ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు..
మహబూబాబాద్ అర్బన్: కులం పేరుతో దూషించి, నన్ను నా కుమారులను ఇద్దరిని మా అత్తా, బావలు ఇంటి నుంచి గెంటేస్తున్నారని పెసర సునీత అనే మహిళ తెలిపింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 31వ వార్డు హన్మంతునిగడ్డ గణేష్‌నగర్‌లో పెసర సునీత అత్తారింటి ఎదుట మృతి చెందిన భర్త(రాము) ఫొటోతో పాటు తన ఇద్దరు కుమారులతో శుక్రవారం ధర్నా చేపట్టింది. 2005లో రాము, సునీత కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే రాము నవంబర్ 7, 2021న టీబీ వ్యాధితో మృతి చెందాడు. ఈ క్రమంలో వచ్చే ఆస్తులు ఇవ్వకుండా కులంపేరుతో దూషిస్తూ ఇంట్లో నుంచి వెల్లగొట్టారు. 26– 11– 2021న పోలీస్‌స్టేషన్‌లో అత్తా, బావలు బెదిరిస్తున్నారని పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, ఏమైన ఉంటే పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకోండి అని అన్నారని తెలిపారు. -
అనారోగ్యంతో భర్త మృతి.. భార్య ఖాతాలో బీమా డబ్బులు పడటంతో అత్త మామ దారుణం..
సాక్షి,శివమొగ్గ(బెంగళూరు): ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన కోడలిపై అత్త, మామ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దారుణ ఘటన శనివారం శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా హోళెనల్కెర గ్రామంలో చోటుచేసుకుంది. రిహానా బాను మంటల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు... తడగ గ్రామానికి చెందిన రిహానాబానుకు ఏడేళ్ల క్రితం ఇమ్రాన్ అలీకి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఏడాది క్రితం ఇమ్రాన్ క్యాన్సర్‌తో మృతి చెందాడు. అప్పటి నుంచి రిహానా తన ఇద్దరు పిల్లలతో వేరుగా ఉంటోంది. రెండు రోజుల క్రితం భర్తకు చెందిన ఇన్సూరెన్స్ నగదు రూ .2 లక్షలు వచ్చాయి. నగదు ఆమె ఖాతాలో పడింది. ఈ విషయం తెలుసుకున్న అత్త, మామ కోడలు ఉంటున్న ఇంటికి వచ్చారు. డబ్బుల కోసం గొడవ పడ్డారు. డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వారు కోడలిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. తీవ్ర గాయాలతో రిహానా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి.. -
హైదరాబాదీ అల్లుడి చేతిలో తల్లీ కూతుళ్ల హతం
సాక్షి, రాయచూరు : కర్ణాటకలోని రాయచూరులో దారుణం చోటు చేసుకుంది. అల్లుడి చేతిలో తల్లీ కూతుళ్లు హత్యకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి తాలూకాలోని యరమరాస్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. యరమరాస్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద నివాసం ఉంటున్న పారిశుధ్య కార్మికురాలు సంతోష్ (45)కి వైష్ణవి(25), ఆరతి(16) కూతుళ్లు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాయి అనే యువకుడితో పెద్దకూతురు వైష్ణవికి వివాహం జరిపించారు. సాయి హైదరాబాద్‌లో వడ్డీ వ్యాపారి. పెళ్లయినప్పటి నుంచి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో ఇటీవల వైష్ణవి పుట్టింటికి వచ్చింది. మంగళవారం రాత్రి సాయి అత్తవారింటికి వచ్చాడు. తనతో హైదరాబాద్‌కు రావాలని భార్యను ఒత్తిడి చేయడంతో ఆమె ససేమిరా అంది. చదవండి: అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బ్లాస్ట్: రూ.2.21 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం ఈ క్రమంలో ఉన్మాదిగా మారిన సాయి భార్యను, అడ్డు వచ్చిన అత్త సంతోషిని, మరదలు ఆరతిని కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో బాధితులు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచారు. అర్ధరాత్రి సమయం కావడంతో అందరూ నిద్రలో ఉన్నందున ఘటన గురించి ఎవరికీ తెలియలేదు. బుధవారం ఉదయం సంతోషి బంధువులు పనిమీద ఇంటికి రాగా రక్తపు మడుగులో ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. అక్కడికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్పీ శ్రీహరి బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. రాయచూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి హంతకుడి కోసం గాలింపు చేపట్టారు. అతడి కోసం హైదరాబాద్‌కు పోలీసు బృందాలు వచ్చాయి. చదవండి: మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని మరదలుకు చెప్పి -
జైలు నుంచి వచ్చేసరికి భార్యకు రెండో పెళ్లి.. గర్భవతని తెలిసి అత్తను..
ముంబై: జైలు నుంచి విడుదలైన ఓ వ్యక్తి తన అత్తను చంపినందుకు మళ్లీ అరెస్టు అయ్యాడు. నిందితుడుని ఇక్బాల్ అబ్బాస్ షేక్(42) గా గుర్తించారు. అతనిపై ముంబైలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అబ్బాస్ షేక్‌పై ముంబైలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. బుధవారం పూణేలోని ఎరవాడ జైలు నుంచి విడుదలైన షేక్ తన భార్యను వెతుకుంటూ అత్త షమల్ శ్యామ్ శిగామ్ ఇంటికి వెళ్లాడు. శిగామ్(61) తన కుమార్తెకు మళ్లీ వివాహం జరిగిందని, ఆమె ప్రస్తుతం గర్భవతని తెలిపింది. చదవండి: పెళ్లికి పిలవలేదని.. పిల్లల ఆటను సాకుగా తీసుకుని.. దీంతో కోపోద్రిక్తుడై అత్త శిగామ్‌పై అబ్బాస్ షేక్ విచక్షణారహితంగా దాడి చేశాడు. పార, కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైన శిగామ్ అక్కడిక్కడే మృతి చెందింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. శిగామ్‌ను కలుసుకోవడానికి అబ్బాస్ షేక్ వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనపై షేక్ స్నేహితులను విచారించగా.. అతడు పూణేలో ఉన్నట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. అక్కడ అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: అయ్యో పాపం.. టీవీ మీద పడి చిన్నారి మృతి, బర్త్‌డేకు తెచ్చిన గౌను వేసి.. -
‘నేర చరిత్ర ఉన్న వ్యక్తిని అత్త పెళ్లి చేసుకోమంటుంది’
భువనేశ్వర్: ‘సార్.. మా ప్రాణాలు కాపాడండి’ అంటూ వివాహిత సునీతా ప్రధాన్ గురువారం ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలైన ఈమె భర్తతో కలిసి గంజాం జిల్లాలోని చికిటి సమితి, కె.నువాగాం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరాడ గ్రామంలో కొన్నాళ్ల నుంచి నివాసముంటోంది. అయితే కొన్నిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె భర్త చనిపోగా అప్పటి నుంచి తన ఐదేళ్ల కూతురితో కలిసి అత్త వారి ఇంట్లో ఉంటోంది. అప్పటి నుంచి ఆమెని తన అత్త, ఆడపడుచు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఎస్పీకి తెలిపింది. దీంతో పాటు తన అత్త నేర చరిత్ర కలిగిన మహేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బలవంతం పెడుతున్నారని బాధితురాలు వాపోయింది. ఇదే విషయంపై తన తండ్రి వారిని ప్రశ్నించగా, అతనిపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని ఆమె ఎస్పీ ఎదుట వాపోయింది. ఈ ఘటన పట్ల కె.నువాగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసులు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఎప్పటికైనా తమ అత్తవారింటి నుంచి ముప్పు ఉందని, నిందితులపై చర్యలు చేపట్టాల్సిందిగా ఎస్పీని ఆమె కోరారు. అనంతరం ఎస్పీ పినాకి మిశ్రాకి ఫిర్యాదు పత్రం అందజేశారు. -
అత్త 60వ పుట్టినరోజుకు కోడలి సర్ప్రైజ్.. నెటిజన్ల ఫిదా!
సాక్షి, పశ్చిమగోదావరి: అత్తాకోడళ్లు అంటేనే జగడాలకు మారుపేరుగా మారిపోయింది నేటి కాలంలో. టివీ సీరియళ్లలో అత్తాకోడళ్ళ పోరాట సన్నివేశ దృశ్యాలే ముందుగా కళ్ల ముందుకొస్తాయి. చాలా కుటుంబాల్లో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ నిత్యం ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే స్థాయికి చేరింది. అయితే అత్తాకోడళ్ల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది చాలా తక్కువగా వింటుంటాం. అత్తాకోడళ్లు అనుబంధం బాగుంటే ఆ ఇల్లు ఆనందంగా కళకళలాడుతుంది. కోడలిని కూతురిగా, అత్తను కూడా తల్లిగా భావించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం అత్తకోడళ్ళ మధ్య ఉన్న ప్రేమను చాటే ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇది జరిగింది ఎక్కడో పరాయి దేశం, పక్క రాష్ట్రంలో కాదు. మన ఆంధ్రప్రదేశ్‌లోనే. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కుటుంబంలో అత్తగారి పుట్టిన రోజుకు కోడలు ఏకంగా 60 రకాల వంటకాలను తయారు చేసింది. వంటకాలను ప్లాస్టిటిక్ డబ్బాల్లో నింపి వాటిపై పేర్లు రాసి పెట్టింది. పులిహోర మొదలు, కొబ్బరి రైస్, మ్యాగీ నూడిల్స్, పెరుగు ఇడ్లీ, వంకాయ బజ్జీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తనపై ఉన్న కోడలి ప్రేమను ఇలా రకరకాల వంటకాలు చేసి చూపించడంతో అత్త ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఇక కోడలి వంటకాల వీడియోకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అత్తాకోడళ్ళ బంధమంటే ఇలాగే ఉండాలంటూ కోడలిని మెచ్చుకుంటున్నారు. మాకూ అలాంటి వంటకాలుచేసే కోడలు ఉంటే బాగుండేదని, చూస్తుంటేనే నోరూరిపోతుందని కామెంట్ చేస్తున్నారు. -
మా అత్తగారికి బాయ్ ఫ్రెండ్ కావాలి, కండీషన్స్ అప్లై
సాధారణంగా ఉద్యోగాలు, స్థలాల అమ్మకాల కోసం ప్రకటనలు ఇస్తుంటారు. అయితే ఓ యువతి ఏకంగా బాయ్ ఫ్రెండ్ కావాలంటూ ప్రకటన ఇచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రకటన తన కోసం కాదట వారి అత్త గారి కోసమని తెలిపింది. కాకపోతే ఇందులో కొన్ని కండీషన్స్ కూడా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వింత ప్రకటన ఓ రేంజ్లో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆ ప్రకటనలో ఏముంది.. ఆ కండీషన్స్ ఏంటి! న్యూయార్క్‌లోని హడ్సన్ వ్యాలీకి చెందిన ఓ కోడలు తన అత్తగారికి బాయ్ ఫ్రెండ్ కావాలని తెలుపుతూ.. అందుకు సదరు వ్యక్తికి అర్హతలుగా 40 నుంచి 60 ఏళ్ల , వీటితో పాటు డ్యాన్స్ వచ్చుండాలని, చక్కని మాటకారిగా ఉండాలని పేర్కొంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. కేవలం రెండు రోజులకు మాత్రమే ఆ వ్యక్తి తన అత్తగారికి బాయ్ ఫ్రెండ్‌గా వ్యవహరిస్తే సరిపోతుందని కూడా ఈ ప్రకటనలో వెల్లడించింది. అందుకు గాను సుమారు 960 డాలర్లు( సుమారు రూ. 72000) చెల్లించనున్నట్లు తెలిపింది. దీని వెనుక అసలు కారణం ఏమిటంటే.. తాము ఓ స్నేహితురాలి వివాహానికి హాజరుకావాల్సి ఉందని, అక్కడ తన అత్తగారు బోర్‌గా ఫీల్ కాకూడదనే ఉద్దేశ్యంతో ఓ బాయ్ ఫ్రెండ్‌ను ఆమెకు తోడుగా తీసుకెళ్లాలనుకుంటున్నట్లు ఆ కోడలు తెలిపింది. రెండు రోజులకు సుమారు వెయ్యి డాలర్లు అంటే మంచి ఆఫరే కాబట్టి దీనికి చాలా మంది అప్లై కూడా చేసుకుంటున్నారట. వీరి నుంచి వాళ్ల అత్తకు ఓ బాయ్ ఫ్రెండ్‌ను ఎలా సెలక్ట్ చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ గా మారి హల్ చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు కొందరు ఇలాంటి ప్రకటనలు కూడా ఉంటాయా అని నవ్వుతుంటే మరి కొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటు కొట్టి పారేస్తున్నారు. -
అత్త, అల్లుడు అరెస్ట్; వీరి రూటే సపరేటు
శివమొగ్గ: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అత్త, అల్లుడు పోలీసులకు అతిథిగా వెళ్లారు. ఉత్తర కన్నడ జిల్లాలోని శిరావాడ గ్రామానికి చెందిన కమలమ్మ, అల్లుడు మరియప్ప గోపినాయక్‌లు ఇళ్ల్లల్లో చొరబడి దొరికిన విలువైన సొత్తును ఎత్తుకెళ్లేవారు. వారం రోజుల క్రితం ఈ ఇద్దరు కలిసి జిల్లాలోని సోరబ పట్టణంలో ఓ ఇంట్లో చోరీ చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేయగా ఇద్దరూ దొరికిపోయారు. 37 గ్రాముల బంగారు నగలు, 200 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. -
దారుణం: కోపంతో అత్తపై కాగుతున్న నూనె పోసిన కోడలు
సాక్షి, అమరావతి: డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ కోడలు అత్తపై సల సల కాగుతున్న నూనె పోసింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడివాడ పరిధిలోని మందపాడు గ్రామంలో నివసిస్తున్న చుక్కా లక్ష్మికి ఆర్థిక సాయం రూపంలో ప్రభుత్వం అందిస్తున్న డబ్బులు వచ్చాయి. దీంతో ఆమె కొడుకు శివ ఇంటిలో మరమ్మత్తులు చేయడం కోసం తల్లిని ఆ డబ్బులు ఇవ్వాలని కోరాడు. అందుకు లక్ష్మీ నిరాకరించింది. కాగా ఈ విషయమై శనివారం రాత్రి లక్ష్మీ ఆమె కోడలు స్వరూపకు స్వల్ప వివాదం తలెత్తింది. డబ్బులు ఇవ్వలేదని కోపంతో స్వరూప తన అత్తపై కాగుతున్న నూనె పోసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వరూప, కొడుకు శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: రెండు రోజులుగా వెతుకుతున్నా.. ఎందుకిలా చేశావు తల్లీ..! -
గుడివాడ : కోపంతో అత్తపై కాగుతున్న నూనె పోసిన కోడలు
-
తప్పతాగి వధువుకి బదులు కాబోయే అత్త మెడలో..
పెళ్లిలో వరుడు చేసిన బిత్తిరి పనికి వచ్చిన అతిథులంతా షాకయ్యారు. అతగాడి అవతారం చూసి.. పెళ్లినాడే ఇలా ఉంటే.. ఇక జీవితాంతం ఎలా ఉంటాడు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ వరుడు చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఇంతకు అతగాడు వెలగబెట్టిన ఆ ఘనకార్యం ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే. నిరంజన్ మహామాత్ర అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో పెళ్లి జరుగుతుంటుంది. ఇక వరుడు తప్పతాగి మంటపానికి చేరుకుంటాడు. ఫుల్లుగా తాగి ఉండటంతో వరమాల మార్చుకునే సమయంలో.. వధువుకి బదులు ఆమె తల్లి.. అంటే కాబోయే అత్త మెడలో దండ వేయబోతాడు. పక్కనున్న వారు ప్రమాదాన్ని గ్రహించి పెళ్లికొడుకుని పక్కకు జరపుతారు. ఆ తర్వాత వరుడి స్నేహితులు అతడిని పట్టుకుని.. వధువు మెడలో వరమాల వేయించే ప్రయత్నం చేస్తారు. కానీ ఫుల్లుగా తాగి ఉండటంతో వధువు మెడలో వరమాల వేయకుండానే స్టేజీ మీదే పడిపోతాడు. పెళ్లికి వచ్చిన వారంతా వరుడి బిత్తరి చర్యకు షాక్ అయ్యారు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే దాని గురించి ఎలాంటి వివరాలు లేవు. ఇక పాతదే అయినా ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా ‘‘వీడికిందే పోయే కాలం.. పెళ్లి నాడు కూడా తప్పతాగి వచ్చాడు’’ అంటూ విమర్శిస్తున్నారు. చదవండి: పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్.. వైరల్ వీడియో View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
అత్తపై కోడలు ఫిర్యాదు, షాకైయిన పోలీసులు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అత్త తనకు వేడి వేడి అన్నం వడ్డించడంలేదంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరస్తోంది. గోరఖ్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఇక ఈ విషయం తెలిసిన వారంత ఒకప్పుడు అత్తలకు కోడళ్లు సపర్యలు చేయడం చుశాము కానీ ఇలా అత్త తనకు సేవలు చేయడం లేదని కోడలు ఫిర్యాదు చేయడమెంటని అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. వివరాలు.. గజహా పోలీసు స్టేషన్ పరిధిలోని మంజ్‌గన్వాలో అత్త, కోడళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరిద్దరి భర్తలు ఉద్యోగాల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో అత్త సమయానికి ఆహారం వడ్డించలేదంటూ కోడలు ఇటీవల పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిందట. దీంతో పోలీసులు వారింటికి చేరుకుని దర్యాప్తు చేయగా... ఆమె అత్త రోజంతా టీవీ సీరియల్స్‌లో లీనమైపోతోందని, తనకు వేడి వేడి ఆహారం వడ్డించడం లేదంటూ సదరు కోడలు పోలీసులకు చెప్పింది. అంతేగాక తనకు పాడైన ఆహారం పెట్టడం వల్ల ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని కోడలు పోలీసులతో వాపోయింది. ఇక ఆమె మాటలు విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. కోడలు తనపై ఫిర్యాదు చేయడం చూసి అత్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కోడలు పనులు చేయకుండా రోజంతా ఫోన్ పట్టుకునే ఉంటుందని, ఇంటి పనుల్లో తనకు సాయం చేయడం లేదంటు పోలీసులకు చెప్పింది. అలాగే వంటింటి పనుల్లో కూడా తోడుగా ఉండటంలేదని వివరించింది. ఇక వారిద్దరి వాదనలు విన్న పోలీసులు.. అత్తకోడళ్లను మందలించారు. ఇలాంటి చిన్న విషయాలకే ఫోన్ చేసి పోలీసుల సమయం వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: మెగాస్టార్ పాటకు ఓ రేంజ్లో స్టెప్పులేసిన అనసూయ లైంగిక వేధింపులు: రాఖీ కడితే సరిపోతుందా?! -
ఎన్టీఆర్ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి
సాక్షి, అమరావతి: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు అత్తగారి ఊరు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న పామర్రు మండలం కొమరవోలు గ్రామ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు ఓటమి పాలయ్యారు. టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థిపై వైఎస్సార్సీపీ అభిమాని డి.రత్నకుమారి 243 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ గ్రామాన్ని టీడీపీ తమదిగా భావించేది. అందుకే భువనేశ్వరి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. -
దారుణం: జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ..
సాక్షి, హైదరాబాద్ : కన్నతల్లిలా చూసుకోవాల్సిన అత్తను జట్టు పట్టుకొని కోడలు.. విచక్షణారహితంగా కొడుతున్న హృదయ విదారక సన్నివేశం హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో వెలుగు చూసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ఉబైద్ అలీ ఖాన్ అనే వ్యక్తి తల్లి తషనిమా సుల్తానా, తండ్రి అహ్మద్ సాహిద్ ఖాన్‌తో కలిసి హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతంలో నివసిస్తున్నాడు. కాగా ఉబైద్ వృత్తిరీత్యా గత పదేళ్లుగా సౌదీలో ఉంటున్నాడు. (చదవండి : చిత్తూరులో సైకో వీరంగం) ఈ మధ్యనే ఉబైద్ మొదటి భార్య చనిపోవడంతో 2019లో ఉజ్మా బేగం అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా పెళ్లైన నెల రోజులకే ఉబైద్ సౌదీ వెళ్లిపోయాడు. అప్పటినుంచి కోడలు ఉజ్మా బేగం అత్త తషనిమా సుల్తానాను వేధింపులకు గురి చేసేది. కొన్నిరోజుల కిందట హుమయూన్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో అత్తా కోడలు ఒకరినొకరు ఫిర్యాదు చేసుకున్నారు. తన మీద ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఉజ్మాబేగం అత్తను ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించింది. మల్లేపల్లిలోని వారి నివాసం నుంచి తషనిమాను జట్టు పట్టుకొని రోడ్డుపై పడేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఇంతలో ఉజ్మా బేగం తల్లి కూడా అక్కడికి చేరుకొని కూతురితో కలిసి తషనిమాను విపరీతంగా కొట్టింది. ఇదంతా గమనిస్తున్న ఒక బాలుడు ఫోన్లో వీడియో తీయబోతుంటే ఉజ్మా బేగం అందుకు అడ్డుకుని, అతడిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. అయితే ఉజ్మా బేగం చర్యలన్నీ రోడ్డుపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ ఘటన బుధవారం(అక్టోబర్ 8న) చోటుచేసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన మల్లేపల్లి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
వైరల్: అల్లుడి కోసం 67 రకాల వంటకాలు
-
వైరల్: అల్లుడి కోసం 67 రకాల వంటకాలు
కొత్త అల్లుడు అత్తారింటికి వస్తే వారికి మర్యాదలు ఆకాశాన్నంటుతాయి. కొత్త బట్టలు, కానుకలతోపాటు పిండి వంటలతో అల్లుడికి మొహం మొత్తేలా చేస్తారు కొందరు అత్తా మామలు. ఈ క్రమంలోనే భోజనంలోకి పలు రకాల కూరలు, రకారకాల స్వీట్స్, పిండివంటలతో అరిటాకు వేసి మరీ వడ్డించేస్తారు. ఈ పద్దతి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అల్లుడు ఎప్పుడొచ్చినా వారికి ఇలా స్వాగతం పలుకుతారు అత్తింటివారు. ఆంధ్రాకు చెందిన ఓ అత్తగారు కూడా ఇటీవల పెళ్లైన తన కూతురు, ఆమె భర్త(అల్లుడు) కోసం తమ పద్దతిలో మర్యాద చేయాలనుకున్నారు. ఇంటికి వస్తున్న అల్లుడి కోసం ఏకంగా 67 రకాల వంటలు వండి 5 కోర్స్ మీల్స్ అరిటాకును సిద్దం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (చదవండి: అడవి గుండా 30 ఏళ్లుగా 15 మైళ్లు నడుస్తూ..) ఈ వీడియోను అనంత్ రూపనగుడి అనే ట్విటర్ యూజర్ గురువారం షేర్ చేశాడు. అందులో ప్రతి వంటకాన్ని చూపిస్తూ వివరించిన ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరి నోట్లో నీళ్లూరాల్సిందే. ఈ 67 రకాల వంటకాల్లో చాట్స్, ఎన్నో రకాల భిన్నమైన స్వీట్స్, వెల్కం డ్రింక్, మెయిన్ కోర్స్, స్నాక్స్‌తో పాటు డిసెర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోకు ఇప్పటి వరకు 68 వేలకు పైగా వ్యూస్ రాగా, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ‘వెంటనే ఈ మీల్స్‌ను నాకు కూడా పంపించండి, ఒకవేళ అలా చేయకపోతే తే ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. -
అలాగే అత్తయ్యా
ఇంటికి కోడలు వస్తే బాగుంటుంది. ఇంటిని చక్కదిద్దే, ఇంటికి శక్తినిచ్చే కోడలు వస్తే నిజంగా బాగుంటుంది. తప్పును తప్పు అని ఒప్పుని ఒప్పు అని, ఇష్టం ఉన్నది ఇష్టం ఉన్నది అని ఇష్టం లేనిది ఇష్టం లేదు అని చెప్పే కోడలు వస్తే బాగుంటుంది. జవ జీవాలు ఉన్న, చేవ ఉన్న కోడలు వస్తే బాగుంటుంది. వినయ విధేయతలతో పాటు ఆత్మగౌరవం ఉన్న కోడలు వస్తే బాగుంటుంది. అంతే తప్ప మర బొమ్మ వస్తే బాగుంటుందా? అలాగే అత్తయ్యా అని తలాడించే కోడలు వస్తే బాగుంటుందా? ‘జమీల్యా.. ఇదేం పేరు?’ అని అడిగాడతను పరిచయమైన కొత్తలో. కాచిన పాలరంగులో ఉన్న ముఖం మీది వెంట్రుకలను తోసుకుంటూ నవ్వి ‘ఇది మా నాన్న పెట్టిన పేరు. ఏదో రష్యన్ నవలలో హీరోయిన్ అట’ అందా అమ్మాయి. ‘ఇప్పుడు నిన్ను ఇంప్రెస్ చేయాలంటే నేను ఓల్గా నదిలో మూడు మునకలేసి రావాలా?’ నవ్వాడు. ‘గర్జించు రష్యా.. గాండ్రించు రష్యా అని శ్రీశ్రీకు మల్లే కవిత్వం చెప్పాల్సిన పని కూడా లేదులే’ మళ్లీ నవ్వింది. ‘మీ అన్న పేరు స్టాలిన్ కదూ’ ‘పేరుకే స్టాలిన్. వాడు లోకమే తెలియకుండా పెరిగి లోకమే తెలియనివ్వని సాఫ్ట్వేర్ రంగంలో పని చేయడానికని సింగపూర్ వెళ్లిపోయాడ్లే’ ‘సో.. నీ పెళ్లికి మీ అమ్మా నాన్నా ఓకే అంటే సరిపోతుందన్న మాట’ ‘నా సంగతి వొదిలిపెట్టవోయ్. నీ పెళ్లికి ఎవరు ఓకే అంటే సరిపోతుంది?’ ‘మా అమ్మ. నువ్వు ఆమె ఒక్కదాన్ని ఇంప్రెస్ చేస్తే చాలు’ ‘మొదట నువ్వు నన్ను ఇంప్రెస్ చేయి. తర్వాత ఆమెను నేను ఇంప్రెస్ చేసే సంగతి ఆలోచిస్తాను’ జమీల్యా, కృష్ణకాంత్ ప్రేమలో పడ్డారు. కృష్ణకాంత్ అద్భుతమైన కుర్రవాడు. చక్కగా ఉంటాడు. చక్కగా మాట్లాడతాడు. బ్లూకలర్ ట్రౌజర్స్‌లో ఫుల్‌హ్యాండ్స్ వైట్‌షర్ట్ ఇన్ చేశాడంటే చీల్చిన వెదురుబద్దలా తళతళా మెరుస్తాడు. ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో ఉద్యోగం. ఆఫీసూ ఇల్లూ తప్ప వేరే ఏమీ తెలియని కృష్ణకాంత్‌ని జమీల్యా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ చూపించింది. ఖాదిర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివల్‌కు తీసుకెళ్లి నాటకాలు చూపించింది. లామకాన్ తీసుకెళ్లింది. ఒకటి రెండు ధర్నాలను కనీసం దూరం నుంచి చూపించింది. ఎప్పుడూ నవ్వుతూ, ధైర్యంగా, చేతనతో ఉండే జమీల్యాను చూస్తే కృష్ణకాంత్‌కు చాలా ఇష్టం. ఎప్పుడూ సహృదయంగా ఆర్ద్రంగా ఉండే కృష్ణకాంత్ అంటే జమీల్యాకు కూడా. కానీ.. కృష్ణకాంత్ ఆ రోజు చాలా డిప్రెస్డ్గా కనిపించాడు జమీల్యాకు. ‘ఏంటి సంగతి?’ అడిగింది. ‘నిన్ను కోల్పోతాననే భయం ఎక్కువైంది’ అన్నాడు. ‘ఎందుకు?’ ‘మా అమ్మ చాదస్తం మనిషి. నాన్న చనిపోయాక నా కోసమే బతికింది. ఆ వొంటరితనంలో పూజలు, పునస్కారాలు అంటూ వేరే ప్రపంచంలోకి వెళ్లిపోయింది. కోడలు కూడా అలాగే ఉండాలని అనుకుంటోంది. దైవకృప ఒక్కటే మనిషిని కాపాడుతుందని ఆమెకు నమ్మకం. నీకు ఇవన్నీ తెలియదు. ఎలా?’ జమీల్యకు కూడా భయం వేసింది. భయం కాబోయే అత్తగారి గురించి కాదు. కృష్ణకాంత్‌ను ఎక్కడ మిస్సవుతుందోనని. ‘నువ్వు నాకు కావాలి’ అంది జమీల్యా. ‘మా అమ్మను దాటితేనే నా దాకా రాగలవు జమీల్యా’ తల వొంచుకుంటూ కంట తడితో అన్నాడు కృష్ణకాంత్. మొదట జమీల్యా పేరు జయలక్ష్మిగా మార్చింది వర్థనమ్మ. ‘మా ఇంట్లో ఈ పేరుతోనే పిలుచుకుంటాం’ అని జమీల్యా అమ్మా నాన్నలకు చెప్పింది. వాళ్లు ఇబ్బందిగా చూసినా జమీల్యా తేలగొట్టేసింది. ‘అలాగే అత్తయ్యా’ అంది. కృష్ణకాంత్ ఇల్లు చాలా బాగుంది. మంచి కాలనీలో ఉంది. ఉన్నది అత్తయ్య, కృష్ణకాంత్, జమీల్యా. హాయిగా చక్కదిద్దుకోవచ్చు అనుకుంది. ‘ఉద్యోగం చేసింది చాల్లే జయ. ఆడదానికి మొగుడి ధ్యాసే ఉండాలిగానీ వేరే గోల ఎందుకు’ అంది వర్థనమ్మ. ఇది చాలా పెద్ద దెబ్బ. ‘ముందు సరే అను. మెల్లగా నచ్చచెబుదాం’ అన్నాడు కృష్ణకాంత్. ‘అలాగే అత్తయ్య’ అంది జయ. జయకు టీ అలవాటంటే వర్థనమ్మ వంక పెట్టింది. కాఫీ అలవాటు చేసుకుంది. లేటుగా లేచే అలవాటు ఉందంటే వర్థనమ్మ వంక పెట్టింది. తొందరగా లేచే అలవాటు చేసుకుంది. పంజాబీ డ్రస్సులు, షార్ట్ హెయిర్ అంటే వర్థనమ్మ వంక పెట్టింది. జడ, పూలు, చీర, బొట్టు.. కొత్త ఆహార్యం వచ్చేసింది. పుస్తకాలు చదువుతుంటే వంక పెట్టింది. వర్థనమ్మతో కలిసి మధ్యాహ్నం సీరియల్స్ చూడటం తప్పనిసరి చేసుకుంది. వారంలో రెండుసార్లు సాయంత్రాలు వర్థనమ్మ కోసం గుడికి వెళ్లడం. ఇంట్లో ఏదో ఒక వ్రతమో పూజో వర్థనమ్మ కోసం చేయడం. స్వాములారు యూ ట్యూబ్‌లో ఏమన్నారో వర్థనమ్మకు చూపించడం... ఒక పెద్ద సీసా వర్థనమ్మ అయితే ఆమె మూసబోసిన చిన్నసీసాలో తాను కుదురుకోవడం మొదలెట్టింది జయ. ‘నేను రెండు మనుషులుగా మారాను కృష్ణ. ఒకటి జయగా. రెండు జమీల్యాగా. జమీల్యా చనిపోవడం నాకు తెలుస్తూ ఉంది’ అని ఒకరోజు బాధపడింది భర్త దగ్గర. కాని ఈ ఇల్లు వీడటం, అతన్ని వీడటం ఆమెకు ఇష్టం లేదు. అవి కావాలంటే వర్థనమ్మను కావాలనుకోవాలి. అనుక్షణం ఆమెను సంతోషపెడుతూ ఉండాలి. అందుకోసం తనను తాను చంపుకుంటూ ఉండాలి. ‘ఏంటి అన్నిసార్లు చేతులు కడుగుతున్నావ్?’ అన్నాడు కృష్ణకాంత్ ఒకరోజు జయను చూస్తూ. ‘కడిగిందే కడుగుతున్నానా?’ ‘అవును’ ‘అత్తయ్యకు పరిశుభ్రత ఎక్కువ కదా. మురికి చేతులు అంటుందని’ అంది జయ. రోజులు గడిచే కొద్దీ జయ పనులు చాదస్తంగా మారాయి. దుప్పట్లు మాటిమాటికి సరి చేయడం, చెప్పులు మాటిమాటికి సర్దడం, పూజగదిలో పటాలు మాటిమాటికి తుడవడం, ఇంటిని మాటిమాటికి చిమ్మడం, రోజుకు మూడుసార్లు స్నానం చేయడం, పదే పదే దేవుడికి దండం పెట్టుకోవడం... ఆమెలో మెల్లగా నెగెటివిటి పెరిగిపోయింది... ఏ తప్పు చేసి అత్తయ్య మనసును నొప్పించి తద్వారా కృష్ణకాంత్‌ను కోల్పోతానో అనే భయంతో ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’లోకి వెళ్లిపోయింది. ‘సముద్రంలోని చేపను బకెట్లో పడేశాను’ అనుకున్నాడు కృష్ణకాంత్ ఒకరోజు. ‘ప్రాబ్లమ్ నీలో, నీ భార్యలో లేదు కృష్ణ. ముందు మీ అమ్మను తీసుకురా’ అన్నాడు సైకియాట్రిస్ట్ కృష్ణతో, జయను చూశాక. జయ కేసంతా విన్నాక ఆమెకు కొద్దిపాటి మందులు అవసరమయ్యాయి. కాని అసలు కౌన్సెలింగ్ వర్థనమ్మకే ఇవ్వాల్సి వచ్చింది. ‘చూడండమ్మా... అత్తయ్యలు కోడళ్లని మార్చుకోవాలనుకోవడం మంచిదే. కాని మీరు మాయం చేసేస్తున్నారు. మిమ్మల్ని, మీ అబ్బాయిని జయ చాలా ప్రేమిస్తూ ఉండటం వల్లే మీ ఆటలు సాగుతున్నాయి. జయ స్థానంలో మీ అమ్మాయిని ఊహించుకోండి. మీరు మీ అమ్మాయిని అత్తగారింటికి పంపాక ఆమె పేరు మార్చేసి, పద్ధతి మార్చేసి, తిండి తిప్పలు మార్చేసి, అలవాట్లు మార్చేసి, ఆఖరుకు ఉద్యోగం కూడా పీకించేస్తే మీరేం చేస్తారు. ఊరుకుంటారా? అసలు మీరు జయను కోడలిగా ఎందుకు చూస్తున్నారు? కూతురిలా చూడొచ్చు కదా. అప్పుడు ఆమె మీలో భాగం అవుతుంది. ఆమె సంతోషం మీ సంతోషం అవుతుంది. ఆమె స్వేచ్ఛ మీకు ఆనందం ఇస్తుంది. మీ అల్లుడు మీ కూతురిని ఎలా చూసుకోవాలనుకుంటాడో మీ అబ్బాయి మీ కోడలిని అలా చూడాలని అనుకోండి. ఆ అమ్మాయి నలిగిపోతోంది. ఆమెను కోడలిగా ఉండనివ్వండి. ఇంకో అత్తగారిలా కాదు’ అన్నాడు. వర్థనమ్మ మొదట తొట్రు పడింది. మెల్లగా ఆమెకు కొడుకు కోడలు పరిస్థితి అర్థమయ్యింది. ఆ మరుసటి రోజు జయ నిద్ర లేచాక వర్థనమ్మ అడిగిన మొదటి ప్రశ్న ‘టీ తాగుతావా జమీల్యా’. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
నిజంగానే అత్తగారు అంత రాక్షసా?
ప్రతి అత్తా ఒకప్పటి కోడలే. ప్రతి కోడలూ ఒకనాటికి కాబోయే అత్తే. వేర్వేరు తరాలను కలిపే బంధమిది. ఇది వట్టి బంధంగా మిగిలిపోతుందా లేక అనుబంధంగా అల్లుకుపోతుందా అన్నది ఆ అత్తా కోడళ్లను బట్టే ఉంటుంది. అత్తగారిపై కోడలికి గౌరవభావం ఉండాలి. కోడలికి అత్తగారి ఆశీస్సులు ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు.. నిత్యం వేడుకల పందిరి అవుతుంది. అక్టోబరు నాలుగో ఆదివారాన్ని అత్తగార్ల దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకుంటోంది. అత్తగార్లు ప్రపంచమంతా ఉంటారుగా. మదర్ ఇన్ లా అని పిలిచినా, సాసు అని బులాయించినా, అత్తయ్య అని పలకరించినా అత్తగారు అత్తగారే. ‘అత్తగారు’ అనే పదం వినపడగానే ఆడపిల్లలు ఉలిక్కిపడతారు. అత్తవారిల్లు అనగానే నెత్తి మీద పిడుగు పడినంతగా అదిరి పడతారు.. ముఖ్యంగా కాబోయే కోడళ్లు! ‘అత్తగారు’ పదానికి గయ్యాళి గంప చేర్చి, ‘గయ్యాళి అత్తగారు’ అని 90 శాతం మంది అనకుండా ఉండలేరు. ఆడపిల్లకు సూర్యకాంతం పేరు పెట్టాలంటే గజగజలాడిపోతుంది ప్రతి తల్లి. రాక్షసి అత్తగారు అనే పేరుకు ప్రతీకగా నిలబడిపోయింది సూర్యకాంతం పేరు. అత్తగార్లు కోడళ్లను ఏడిపించుకు తింటున్నందు వల్లనేనేమో ‘అత్తా ఒకింటి కోడలే’ అనే సామెత పుట్టుకొచ్చి ఉంటుంది. మరో అడుగు ముందుకు వేసి, ‘అత్త లేని కోడలు ఉత్తమురాలు’ అని ఒంటరి కోడలి సౌఖ్యాన్ని వివరించడానికి కూడా ఇదే కారణం కావొచ్చు. పాపం నిజంగానే అత్తగారు అంత రాక్షసిలా ఉంటుందా? కోడలి నుంచి అత్తగారి స్థాయికి ఎదిగిన తరవాత ఆవిడలో ఇంత మార్పు వస్తుందా. ఏమో! వస్తుందేమో మరి!! ఒక్కసారి త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి ప్రయాణం చేద్దాం. శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రుడు సీతను చేపట్టాడు. కౌసల్యకు కోడలు అయ్యింది సీతాదేవి. కైకేయి కోరిక ప్రకారం రాముడు అరణ్యవాసానికి బయలుదేరాడు. సీతాదేవి తాను కూడా వెంట వస్తానంది. అప్పుడు కౌసల్య, ‘‘ఈ ఇంటి కోడలు సీతాదేవి. ఆమె నార వస్త్రాలు ధరించవలసిన అవసరం లేదు. ఆమెకు సరిపడా చీనిచీనాంబరాలు, నగలు వెంట ఇచ్చి పంపండి. ఈ ఇంటికి వచ్చిన కోడలిని మర్యాదగా చూసుకోవడం మన వంతు’ అని పలికి, అరణ్యవాసంలో ఉన్నన్ని రోజులు ఆమె ధరించడానికి అవసరమైనదుస్తులు, ఆభరణాలు అన్నింటినీ ఇచ్చి ఆమెను హత్తుకుని దీవించి మరీ పంపింది. కౌసల్య సీతకు అత్తగారే కదా! రాముడితో పాటు లక్ష్మణుడు కూడా అరణ్యాలకు బయలుదేరాడు. లక్ష్మణుడు వచ్చేవరకు ఊర్మిళ గాఢంగా నిద్రపోయింది. ఒక్కనాడు కూడా ఊర్మిళను నిద్ర లేపలేదు సుమిత్ర. ఆవిడ కూడా అత్తగారే కదా! ద్వాపర యుగంలోకి ప్రవేశిస్తే..! వ్యాసుడి తల్లి సత్యవతి. ఎంతో లౌక్యం తెలిసిన స్త్రీ. తన కుమారులైన విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు మరణించడంతో కురు వంశం నిర్వంశం అవుతుందని భావించింది. రాజు లేని రాజ్యంగా కూడా మారుతుందని ఒక రాజమాతలా ఆలోచించింది. వ్యాసుడిని స్మరించుకుని, తన కోడళ్లకు సంతానం ప్రసాదించమని కోరింది. సత్యవతిని మించిన అత్తగారు ఉంటుందా! ఆ రోజు ఆవిడ బాధ్యత గల అత్తగారిగా ఆలోచన చేసి ఉండకపోతే, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులు జన్మించేవారే కాదుగా. అసలు కురు వంశమే అంతమైపోయేది కదా. వంశం నాశనం కాకుండా చూసిన సత్యవతి సాక్షాత్తు అత్తగారు.పాండురాజుని వివాహమాడిన కుంతి... దేవతల వర ప్రభావంతో ముగ్గురు కుమారులకు జన్మనిచ్చింది. మాద్రికి ఇద్దరు సంతానం కలిగారు. పాండురాజు గతించిన తరువాత, హస్తినాపురానికి వచ్చింది కుంతి. ధర్మరాజుతో దుర్యోధనుడు మాయా జూదం ఆడి, పాండవులను ఓడించి, ద్రౌపదిని దాసిగా సంబోధిస్తూ, వస్త్రాపహరణం చే శాడు. కృష్ణుని సహాయంతో ద్రౌపది మానం కాపాడుకుంది. పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసి, ఒప్పందం ప్రకారం తమ రాజ్యం తమకు ఇమ్మని రాయబారం పంపారు. వాడి సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వనని దుర్యోధనుడు మొండికేయడంతో, పాండవులు యుద్ధానికి సన్నద్ధులయ్యారు. దాయాదుల సంరక్షణలో ఉన్న తల్లి కుంతిని చేరి, విషయం వివరిస్తారు. అప్పుడు కుంతీదేవి, ‘నా కోడలు ద్రౌపది చెప్పిన ప్రకారం నడుచుకోండి. ఆమె ప్రతిజ్ఞను దృష్టిలో ఉంచుకుని యుద్ధం నడపండి’ అంది కుంతి. అక్కడ కుంతీదేవి అత్తగారిలా మాట్లాడింది. ఒక తల్లిగా ఆలోచించలేదు. హిడింబికి భీముడి మీద అనురాగం కలిగినప్పుడు, కుంతీదేవి అనుమతితోనే హిడింబి భీముని వివాహమాడింది. ఇంతమంది మంచి అత్తగార్లను మన పురాణాలు మనకు ఆదర్శంగా చూపాయి. మరి ఇప్పుడో?! ఏ సీరియల్ చూసినా అత్తగారు ఒక విలన్‌గానే కనపడుతోంది. కోడల్ని చిత్ర హింసలు పెట్టడం, ఆమెకు ప్రత్యక్ష నరకం చూపడం అత్తగారి ధ్యేయంగా చూపుతూ రేటింగ్ పెంచుకుని, కాసుల వర్షాలు కురిపించుకుంటున్నాయి నిర్మాణ సంస్థలు. ఏ మాత్రం బాధ్యత లేనివారి ఆలోచన నుంచి వచ్చినవే ఈ కథలు. ఏది ఎలా ఉన్నా.. కోడలిని అత్తగారు కూతురుగా బుజ్జగించాలి. అత్తగారిని కోడలు తల్లిగా ప్రేమించాలి. – వైజయంతి పురాణపండ -
బువ్వ కోసం అవ్వ ధర్నా
ఖమ్మంరూరల్: వయసు మీదపడ్డ తనను సాకాల్సిన వాళ్లే ఇంట్లో నుంచి గెంటేస్తే ఆ అవ్వ వృద్ధాశ్రమంలో చేరలేదు. రోడ్డునా పడకుండా, న్యాయం కోసం రోడ్డెక్కింది. తనకు జరిగిన అన్యాయానికి ఎదురుతిరిగింది. వివరాలు.. ఖమ్మంరూరల్ మండలంలోని ఏదులాపురం శివారు తాళ్లేసేతండాలో గురువారం హాలవత్ హుంకులమ్మకు ఇద్దరు కుమారులు. వారికి వివాహమైంది. అనంతరం కుమారులిద్దరు మృతి చెందారు. అయితే వారి కోడళ్లు తిరుపమ్మ, వీరమ్మలు తమ అత్తను చెరి ఒక నెల చూసుకోవాలనే ఒప్పందం ఉంది. అయితే చిన్న కోడలు వైరాలో ఉంటోంది, ఆమె నెల అయిపోయాక తాళ్లేసేతండాకు అత్త హుంకులమ్మను పంపించింది. అయితే మరో కోడలు అత్తను తాను సాకలేనని ఇంట్లో నుంచి గెంటేసింది. దీంతో హంకులమ్మ తనకు దిక్కెవరంటూ? తనకు బువ్వ పెట్టేదెవరంటూ? గురువారం ఖమ్మం–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని, అప్పటి వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చుంది. దీంతో భారీగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని నచ్చజెప్పి, హామీ ఇచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. -
‘అబ్బాయిలు అలాంటి అమ్మాయినే ఇష్టపడతారు’
పెళ్లైన తర్వాత సమంత సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికపప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంటారు. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫోటోతో పాటు దానికి సమంత ఇచ్చిన క్యాప్షన్ ఆమె అభిమానులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహానికి సమంత, నాగ చైతన్య కూడా హాజరయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత తన భర్త, అత్త లక్షి దగ్గుబాటితో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘మా అత్తతో కలిసి చాలా ఎంజాయ్ చేశాను. ఒకే రోజు.. ఒకే లాంటి దుస్తుల్లో అనుకోకుండా బయటకు వెళ్లాం. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. మీరంతా దాన్ని తప్పక నమ్మాలి. అబ్బాయిలు తమ అమ్మలా ఉండే అమ్మాయినే ఇష్టపడతారు. అనుకోకుండా మా విషయంలో అదే నిజమైంది’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటో అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. నాగచైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి సాధరణంగా బయట ఎక్కువగా కనిపించరు. అలాంటిది ఈ ఫోటోలో కొడుకు, కొడలితో కనిపించడం.. పైగా అత్తాకోడళ్లిద్దరు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉండటంతో అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. మెగా కోడలు ఉపాసన ఈ ఫోటోను లైక్ చేయడమే కాక ‘ఉత్తమ కోడలు’ అంటూ కామెంట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చైతన్య, సమంత మజిలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఇక పెళ్లి తర్వాత మొదటి సారి సమంత- నాగచైతన్య కలిసి నటిస్తుండటంతో ‘మజిలీ’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. -
బిందెతో కొట్టి అత్తను చంపిన కోడలు
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అత్తాకోడళ్ల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఇరగవరం మండలం రేలంగిలో చోటుచేసుకుంది. వివరాలు.. కుటుంబ కలహాల కారణంగా అత్తా కోడళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు భౌతికదాడి చేసుకున్నారు. ఈ క్రమంలో అత్త తలపై కోడలు బిందెతో బలంగా కొట్టింది. తీవ్ర గాయాలతో అత్త కూసంపూడి మహాలక్ష్మి మృతిచెందిందని స్థానికులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లి కావాలంటే అత్తతో చావుదెబ్బలు...
-
పెళ్లి కావాలంటే అత్తతో దెబ్బలు తినాల్సిందే..
పెరూ: పై ఫొటోలో యువకుడిని ఓ మహిళ కర్రతో చితకబాదుతోంది. ఆ దెబ్బలను యువకుడు ఓపిగ్గా భరిస్తున్నాడు. ఇంతకీ సదరు యువకుడు చేసిన పని ఏంటో తెలుసా.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అవును నిజమే.. ఫోటోలో ఉన్న మహిళ కూతురినే ఆ యువకుడు వివాహం చేసుకోవాలి. కాబోయే అల్లుడిని.. ఆమె ఎందుకు కొడుతోంది అనుకుంటున్నారా.. ఏం లేదు దక్షిణ అమెరికాలోని పెరూలో ఓ వింత ఆచారముంది. పెళ్లి కొడుకు గురించి తెలుసుకునేందుకు అక్కడ కఠినమైన పరీక్ష పెడతారట. అదే ఈ పరీక్ష. పెళ్లికి ముందే కాబోయే అల్లుడిని అత్త కర్రతో చావబాదుతుంది. ఈ పరీక్ష ద్వారా అతను బాధ్యత గల వ్యక్తా.. మా అమ్మాయిని బాగా చూసుకుంటాడా.. ఇలాంటి పలు విషయాలను నిర్ధారించుకుంటారట. ఈ పరీక్షలో నెగ్గితేనే తమ కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తారట. చూడటానికి వింతగా ఉన్నా, ఈ ఆచారాన్ని పెరూలో చాలా ఏళ్లుగా అక్కడి వాళ్లు పాటిస్తున్నారు. -
మీ కోడల్ని తీసుకొస్తేనే : సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : పారిపోయిన కోడల్ని పట్టుకొస్తేనే ఆస్తులపై ఉన్న సీజ్‌ను ఎత్తివేస్తామని సుప్రీంకోర్టు ఓ అత్తకు స్పష్టం చేసింది. ఆమె కోడలు కోర్టుకు ఇచ్చిన మాట తప్పిందని, ముందు న్యాయ వ్యవస్థపై ఆమెకు లెక్కలేనితనం, గౌరవం లేకపోయినా.. వెనక్కు వచ్చి కనీసం మంచి కోడలు అనిపించుకోవాలని హితవు పలికింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రితికా అవస్తీ అనే మహిళ బుష్ ఫుడ్స్ ఒవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకీ ప్రమోటర్‌గా పనిచేసేవారు. ఈ కంపెనీతో చాలా మందికి టోకరా పెట్టారు. చీటింగ్, ఫోర్జరీ, కుట్ర పూరిత నేరం తదితర నేరాలకు పాల్పడింది. అయితే, ఆమె అరెస్టు సమయంలోనే తాను లండన్ వెళ్లి వస్తానని కోర్టుకు హామీ ఇచ్చి వెళ్లి ఇక తిరిగి రాలేదు. సుప్రీంకోర్టు పలుమార్లు నోటీసులు పంపించినా పట్టించుకోలేదు. దీంతో కోర్టు దిక్కారం కింద సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె అత్తగారి ఆస్తులన్నింటిని సీజ్ చేసింది. అయితే, ఆమె తరుపు న్యాయవాది కోర్టుకు హాజరై సీజ్ చేసిన ఆస్తులను తిరిగి అప్పగించాలంటూ కోరారు. ఇందుకు స్పందించిన కోర్టు.. 'మీరు మీ కోడల్ని వెనక్కి తీసుకురాకుంటే మేం అటాచ్ చేయించిన ఆస్తులను విడుదల చేయలేము. ఆమె తిరిగి భారత్‌కు వస్తే కచ్చితంగా ఆస్తులు ఇచ్చేస్తాం. మీరే ఆమెను వెనక్కు తీసుకురావాలి. ఆమెతో మాట్లాడండి.. ఇక్కడకు రమ్మని చెప్పండి.. మా ఆదేశాల్లో మార్పు చేసుకుంటాం.. ఆమె వెనక్కు వచ్చినప్పుడు మాత్రమే. ఆమెతో చెప్పండి కనీసం మంచి కోడలిగానైనా నడుచుకోవాలని' అంటూ సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. అయితే, ఢిల్లీలో ఉన్న ఆమె అత్తగారి నివాస ఆస్తులను కూడా అటాచ్ చేశారని, ఆమె ఎక్కడకు వెళ్లే పరిస్థితి లేనప్పుడు అలా చేయడం సరికాదని, కనీసం వాటినైనా విడిపించాలని కోర్టును కోరారు. దీనిపై విచారణను ఏప్రిల్ 5కు కోర్టు వాయిదా వేసింది. -
బావిలో పడి అత్తా కోడలు మృతి
జూపాడుబంగ్లా: పిల్లోడికి ఒడుగులు (సున్తీ) చేయించి ఫంక్షన్ పెట్టాలనుకున్నారు. ఈ ఫంక్షన్‌కు పిల్లోడి అత్తను కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో అతని తండ్రి బయలుదేరివెళ్లాడు. అతను తిరిగొచ్చేలోపే తల్లి, భార్య మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన జూపాడుబంగ్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సలీమాబీ(52), అజీంబాష(లేట్) దంపతులకు వలి, చాంద్‌బాష అనే ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు వలి భార్య మైమూన్(24)తో కలిసి నందికొట్కూరులో నివాసముంటున్నారు. చిన్నకుమారుడు చాంద్‌బాష జైన్ఇరిగేషన్ కంపెనీలో కారుడ్రైవర్‌గా పనిచేస్తూ తల్లితో కలిసి జూపాడుబంగ్లాలో ఉంటున్నారు. వలి తన తొమ్మిదేళ్ల కుమారుడికి ఒడుగులు (సున్తీ) చేయాలని తల్లితో చర్చించేందుకు భార్య మైమూన్‌తో కలిసి ఆదివారం జూపాడుబంగ్లాకు వచ్చారు. సోమవారం మధ్యాహ్నం తరిగోపులకు (కేసీ కాల్వ కట్ట వెంట) వెళ్లే మార్గంలోని జామతోట వద్ద ఉన్న పొలాన్ని చూసేందుకు వలి, అతని భార్య, తల్లి ముగ్గురూ వెళ్లారు. తర్వాత తాటిపాడులో ఉన్న అక్క మాసుంబీని తీసుకురావాలని తల్లి చెప్పటంతో వలి బైక్‌పై అక్కడి నుంచే బయలుదేరి వెళ్లాడు. ఇదే సమయంలో మైమూన్ దాహంతో బావిలో నీటిని తాగేందుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలుజారి బావిలోకి పడిపోయింది. ఈత రాక మునిగిపోతుండడంతో అత్త సలీమాబీ గమనించి కోడలును రక్షించేందుకు తన చీరకొంగును అందించింది. ప్రాణభయంతో కోడలు చీరను గట్టిగా లాగటంతో ఒడ్డుపైనున్న సలీమాబీ కూడా బావిలోకి పడిపోయింది. ఈత రాకపోవటంతో ఇద్దరూ మునిగిపోయారు. తర్వాత అక్కను తీసుకుని అక్కడికి వచ్చిన వలికి తల్లి, భార్య కనిపించలేదు. తల్లి వద్ద ఉండాల్సిన మొక్కజొన్నలు, చిక్కుడుబుడ్డల సంచులు బావిలో పడి ఉన్నాయి. దీన్ని గమనించిన వలి తల్లి, భార్య ఇద్దరూ బావిలో పడి మరణించి ఉంటారని భావించి బంధువులకు, గ్రామస్తులకు సమాచారమిచ్చారు. వారు బావిలోని నీటిని కొంతమేర మోటార్లతో తోడారు. చివరికి ఇనుప కొక్కేలను బావిలో వేసి వెతకగా వాటికి తట్టుకొని అత్తాకోడళ్ల మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న ఏఎస్సై శివశంకర్ తన సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. -
అత్తను చంపిన అల్లుడు
కృష్ణా జిల్లా : పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అత్తను అల్లుడు గొడ్డలితో నరికి చంపాడు. వివరాలు..నాగాయలంక మండలం నాచుకుంట ఏసుపురం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ శివలీల (52) కుమార్తె శశిరేఖకు వణుకూరులో నివసిస్తున్న కన్నా జోజి ప్రసాద్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేకపోవడంతో రెండు రోజుల క్రితం కుమార్తెను ఆసుపత్రిలో చూపించేందుకు శివలీల వణుకూరు వచ్చింది. శనివారం రాత్రి గేదె అమ్మగా వచ్చిన డబ్బులను మద్యం సేవించేందుకు భార్యను ప్రసాద్ అడగటంతో వివాదం మొదలైంది. గొడవ మధ్యలో అత్త శివలీల వెళ్లి మందలించింది. దీంతో అక్కడినుంచి వెళ్లిపోయిన ప్రసాద్ బాగా మద్యం సేవించి తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చిన అనంతరం భార్య శశిరేఖతో మళ్లీ గొడవపడి గొడ్డలి తీసుకుని వెంబడించాడు. గమనించి అత్త అడ్డుపడటంతో కోపంలో అత్తను గొడ్డలితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను కాపురానికి పంపలేదని..!
నిజాంపట్నం (రేపల్లె): అత్తపై అల్లుడు దాడి చేసి హతమార్చిన సంఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం సంజీవనగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, కొత్తపాలెం పంచాయతీ కొత్తూరుకు చెందిన కొక్కిలిగడ్డ వెంకట బసవమ్మ (60) కుమార్తె వెంకట నాగేశ్వరికి, అదే గ్రామానికి చెందిన వాటుపల్లి వెంకటకృష్ణకు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. నాగేశ్వరి, వెంకటకృష్ణల మధ్య తరచూ వివాదాలు జరగడం, పెద్దమనుషులు సర్దిచెప్పి కాపురానికి పంపించడం జరుగుతుండేది. 15 రోజుల క్రితం వెంకటనాగేశ్వరి భర్తతో వివాదం రావడంతో పుట్టింటికి వచ్చి తల్లి వెంకట బసవమ్మ దగ్గర ఉంటోంది. వెంకట బసవమ్మ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటోంది. అయితే వెంకటకృష్ణ తన భార్యను తన వద్దకు రానీయకుండా అత్త అడ్డుపడుతోందని భావించి అత్తపై కక్ష పెంచుకున్నాడు. బసవమ్మ శుక్రవారం సంజీవనగర్‌లో నిర్మాణం జరుగుతున్న తుపాను షెల్టర్ భవనం వద్ద కూలిపనులకు వెళ్లింది. మరో ఆరుగురు కూలీలతో పాటు అక్కడ పనిచేస్తుండగా అల్లుడు వెంకటకృష్ణ అక్కడకు వెళ్లి అకస్మాత్తుగా మారణాయుధంతో దాడిచేసి బసవమ్మను హతమార్చాడు. బసవమ్మకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని రేపల్లె సీఐ పెంచలరెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్తింటికే కన్నం వేసిన అల్లుడు
-
అత్తింటి ముందు మహిళ ధర్నా
-
మేనల్లుడి చేతిలో అత్త హతం
కంచికచర్ల (కృష్ణా జిల్లా) : అల్లుడి చేతిలో అత్త హత్యకు గురైంది. ఈ సంఘటన కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. బొర్రా సత్యవతి(55) అనే మహిళను ఆమె మేనల్లుడు దామోదర రత్నాకర్ చౌదరి(27) బండతో తలపై మోది హత్య చేశాడు. రత్నాకర్‌కు మతిస్థిమితం సరిగ్గా ఉండదు అని కుటుంబసభ్యులు చెబుతున్నారు. సంఘటనాస్థలాన్ని నందిగామ సీఐ పచ్చి నారాయణ పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'చనిపోతే పెన్షన్ భార్యకే.. తల్లికి రాదు'
న్యూఢిల్లీ: చనిపోయిన ఓ వ్యక్తికి సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ విషయంలో అత్త కోడళ్ల మధ్య మొదలైన వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఫ్యామిలీ పెన్షన్ మాత్రం చనిపోయిన వ్యక్తి భార్యకు మాత్రమే వస్తుందని, అతడి తల్లి ఆ పెన్షన్ తీసుకునేందుకు అర్హురాలు కాదని తేల్చింది. దాదాపు పాత చట్టాలను తిరగేయించిన ఈ కేసు హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలో యశ్ పాల్ అనే ఉద్యోగి చనిపోయాడు. అతడికి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అయితే, ఈ పెన్షన్ తనకే వస్తుందని అతడి తల్లి డిమాండ్ చేయగా తనకే వస్తుందని భార్య చెప్పింది. ఈ వివాదం కాస్త కోర్టు వరకు వెళ్లింది. తొలుత హైకోర్టుకు వెళ్లగా అక్కడ తల్లికి 50శాతం పెన్షన్ ఇవ్వాలని చెప్పారు. చివరకు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అయితే, పెన్షన్ అనేది చనిపోయిన వ్యక్తి ఆస్తిగా భావించి పంచలేమని, అది బాధితుడి భార్యకు మాత్రమే అందుతుందని, తల్లికి ఇవ్వడం కుదరదని చెప్పింది. కుమారుడు వద్ద మిగిలిపోయిన స్థిరాస్తి ఉంటే మాత్రం తల్లికి 50శాతం ఇవ్వొచ్చని చెప్పింది. 'కుటుంబ భృతి పథకం ప్రకారం వితంతువు (చనిపోయిన వ్యక్తి భార్య) మాత్రమే చనిపోయిన వ్యక్తి కుటుంబానికి చెందిన వ్యక్తి అవుతుంది. ఆమెకు మాత్రమే పెన్షన్ వస్తుంది. చనిపోయిన వ్యక్తి తల్లికి పెన్షన్ పొందేందుకు ఏమాత్రం అర్హత లేదు. ఒక వేళ చనిపోయిన యశ్ పాల్ వద్ద ఏవైనా ఆస్తులు ఉంటే మాత్రం వాటిని అత్తాకోడళ్లకు పంచి ఇవ్వొచ్చు' అని సుప్రీం వ్యాఖ్యానించింది. -
భార్య, అత్తా కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించారు
సారంగాపూర్ (కరీంనగర్) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై అతని భార్య, అత్త కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఇరగదిండ్ల గంగయ్య(30) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మరోసారి వారి మధ్య వివాదం చెలరేగింది. దీంతో విసిగిపోయిన భార్య రజిత, ఆమె తల్లితో కలిసి గంగయ్యపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
భార్య,అత్తపై దాడి చేసిన భర్త
-
అడ్డు వచ్చిన అత్తపై అల్లుడు కత్తితో దాడి..
నిజామాబాద్: కుటుంబ కలహాలతో దంపతుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో అడ్డు వచ్చిన అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం సిద్ధాపూర్ తండాలో ఆదివారం చోటుచేసుకుంది. కూతుర్ని ఎందుకు కొట్టావని అడగటానికి వచ్చిన అత్తపై అల్లుడు కత్తితో దాడికి దిగాడు. ఆమెను గట్టిగా పొడవటంతో పేగులు బయటకు వచ్చాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అల్లుడు నానక్ సింగ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అత్త సెల్‌ఫోన్ లాక్కొందని..
బలియా: అత్త సెల్‌ఫోన్ లాక్కునందుకు ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా రెవతి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఆత్మహత్యకు పాల్పడిన యువతి భర్త గుజరాత్లో పనిచేస్తున్నాడు. ఆమె అత్తవారి ఇంట్లో ఉండేది. గత గురువారం ఇల్లు విడిచి వెళ్లిన ఆ మహిళ మరుసటి రోజు తిరిగి వచ్చింది. ఆమెకు అదే గ్రామంలోని ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని అత్త అనుమానించింది. ఆ మహిళ ఇంటికి రాగానే అత్త సెల్‌ఫోన్ లాక్కోని మందలించింది. మనస్తాపం చెందిన ఆ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
భార్యను తనతో పంపనందుకు..
భవనం పై నుంచి అత్తను తోసేసిన అల్లుడు బాధితురాలి పరిస్థితి విషమం అబిడ్స్: భార్యను తనతో పంపమని అత్తతో గొడవకు దిగిన ఓ అల్లుడు అత్తను భవనంపై నుంచి కోపంతో నెట్టివేయడంతో ఆమె తీవ్రంగా గాయపడిన సంఘటన టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్ పరిధిలోని కార్వాన్ జోషివాడిలో గురువారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ బండారి రవీందర్ వివరాల ప్రకారం..బోరబండకు చెందిన గోపాల్(45),కు కార్వాన్ జోషివాడికి చెందిన యశోదాభాయి(60) కూతురు రాణితో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఎలక్ట్రిషియన్‌గా పని చే స్తున్న గోపాల్ తరచూ భార్యతో గొడవ పడుతూ వేధింపులకు గురి చేసేవాడు. అతని వేధింపులు భరించలేని రాణి తన పుట్టింటికి వెళ్లి పోయింది. దీంతో గురువారం సాయంత్రం అత్తగారింటికి వచ్చిన గోపాల్ భార్యను తనతో పంపాలని అత్త యశోదాభాయితో వాగ్వాదానికి దిగాడు. అయితే ఆమె పంపనని చెప్పడంతో కోపోద్రిక్తుడైన గోపాల్ యశోదాభాయిని రెండవ అంతస్తులోని బాల్కనీ నుండి కిందకు తోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను టప్పాచబుత్ర పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు గోపాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
తల్లీకుమారుడు అనుమానాస్పద మృతి.. విచారణ
వైఎస్సార్ జిల్లా: తల్లీకుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లాలోని విజయదుర్గకాలనీలో శనివారం చోటుచేసుకుంది. కోడలు, మనవడు మృతిచెందిన విషయం గుట్టుచప్పుడు కాకుండా అత్తంటి వారు ఖననం చేసినట్టు వారి తరపు బంధువులు ఆరోపించారు. తల్లీ కుమారుడు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అత్తింటి వేధింపులు,కోడలి ఆత్మహత్య
-
భర్తతో కలిసి తల్లిని చంపేసింది
తాడూరు (మహబూబ్‌నగర్ జిల్లా) : ఆస్తి కోసం కన్నతల్లినే చంపేసింది ఓ కూతురు. 6 ఎకరాల భూమి తన పేరు మీద రాయలేదని భర్తతో కలిసి తల్లిని హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా తాడూరు మండలపరిధిలోని కుమ్మెర గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తిరుపతమ్మ(55), బచ్చన్నలు దంపతులు. వీరికి ఇద్దరు ఆడ సంతానం. దాంతో పెద్ద కూతురు నాగమణికి అదే గ్రామానికి చెందిన ఆంజనేయులుతో వివాహం జరిపి ఇల్లరికం కుదుర్చుకున్నారు. చిన్న కూతురుని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. కాగా తిరుపతమ్మ భర్త బచ్చన్న అనారోగ్యంతో జనవరి నెలలో మృతి చెందాడు. ఇక అప్పటి నుంచి ఇంట్లో ఆస్తి తగాదాలతో అత్తకి అల్లుడి వేధింపులు మొదలయ్యాయి. తండ్రి బచ్చన్న పేరుతో ఉన్న ఆరెకరాల భూమి తమ పేరున రాయాలని బిడ్డ నాగమణి, అల్లుడు ఆంజనేయులు తరుచూ పట్టుబట్టి వేధించసాగారు. దీంతో తిరుపతమ్మ తాను ఉన్నంత వరకు భూమి ఎవరి పేరునా రాసేది లేదని తెగేసి చెప్పడంతో అల్లుడు ఆంజనేయులు, కూతురు నాగమణి కలిసి పథకం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తిరుపతమ్మ తల, ముఖంపై బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. శనివారం తెల్లవారుజామున విషయం తెలియడంతో గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి చిన్న కూతురు పద్మమ్మ ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి హత్యకు పాల్పడిన కూతురు, అల్లునిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పాపం.. ఎడాపెడా వాయించి, తోసేసింది
వృద్ధురాలు అని జాలి చూపలేదు. సాటి మహిళ అన్న మానవత్వం లేనేలేదు. కాటికి దగ్గరైన అత్తపై... కోడలు రాక్షసిలా ప్రవర్తించింది. పక్షవాతంతో మంచానికే పరిమితమై లేవలేని స్ధితిలో ఉన్న అత్తను అమానుషంగా కొట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కోడలు ఎడాపెడా వాయించి, మంచంపై నుండి కిందకు తోసేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబిలో జరిగిన ఈ అమానవీయ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. వివరాలిలా ఉన్నాయి. వృద్థురాలు తన కొడుకు, కోడలు వద్ద ఉంటోంది. ఆమెకు పక్షవాతం రావడంతో మాట్లాడలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. కాగా తల్లి వంటిపై గాయాలు ఉండటాన్ని కొడుకు గుర్తించాడు. అయితే ఏం జరిగిందో చెప్పే పరిస్థితిలో ఆమె లేదు. కొడుకుకు తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దాంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా సీసీటీవీ కెమెరాను అమర్చాడు. దాంతో భార్య బండారం బయటపడింది. సీసీటీవీ ఫుటేజీలో తన భార్య విచక్షణ రహితంగా తల్లిని కొడుతున్న దృశ్యాలను చూసి చలించిపోయాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్యపై ఫిర్యాదు చేశాడు. దేశంలో వృద్దుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. -
అది కోడలు కాదు రాక్షసి..
-
కోడలు కేసు పెట్టిందని అత్త ఆత్మహత్య
రంగారెడ్డి (బషీరాబాద్) : కోడలు కేసు పెట్టిందని అత్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంతట్టి గ్రామానికి చెందిన మానెప్ప, పవిత్రమ్మలు భార్యాభర్తలు. పది సంవత్సరాల క్రితం ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. అయితే ఐదు సంవత్సరాల క్రితం కట్నం కోసం తనను వేధిస్తున్నారంటూ కోడలు పవిత్ర, తన అత్త,మామ,భర్తపై కేసు పెట్టింది. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరందరినీ అరెస్ట్ చేశారు. కాగా వీరు కేసుల నుంచి బయటపడేందుకు సగం ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా మానెప్ప ఇంట్లో చెప్పాపెట్టకుండా వేరే ఊరికి చెందిన మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన పవిత్ర మరోసారి వీరిపై కేసు పెట్టింది. దీంతో కేసుల బాధ భరించలేక అత్త మాణిక్యమ్మ(50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మా మిక్కీ మౌస్ అత్తగారు...
ఆత్మబంధువు ‘‘భవానీ... భవానీ... కాఫీ కావాలని చెప్పి ఎంతసేపైంది?’’ అరిచింది రత్నమాంబ. ‘‘తెస్తున్నా అత్తమ్మా.’’ ‘‘తెస్తున్నా, తెస్తున్నా... అని అరగంట నుంచి చెప్తున్నావ్... తెచ్చిస్తే కదా!’’ ‘‘ఇదిగోండి అత్తమ్మా కాఫీ. ఐదు నిమిషాల్లో తెచ్చేశా.’’ ‘‘అంటే... అరగంటని నేను అబద్ధం చెప్తున్నానా?’’ ‘‘అయ్యో... నేనలా అన్లేదు అత్తమ్మా’’ నవ్వుతూ చెప్పింది భవాని. ‘‘ఏంటే నవ్వుతున్నావ్. అంత ఎగ తాళిగా ఉందా?’’ అరిచింది రత్నమాంబ. ‘‘అదేంటత్తమ్మా... మిమ్మల్ని అలా ఎందుకనుకుంటాను!’’ ‘‘మరెందుకే నేను మాట్లాడుతుంటే నవ్వుతున్నావ్?’’ ‘‘అలాంటిదేంలేదత్తమ్మా’’ అని ముసిముసిగా నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్లింది భవాని. ‘‘భవానీ... ఏంటిది ఇల్లు ఇలా ఉంది? నీపాటికి నువ్వు నీటుగా రెడీ అయ్యి ఆఫీసుకు వెళ్తే సరిపోతుందా? ఇల్లెలా ఉందో చూసుకునే పన్లేదా?’’... అరిచింది రత్నమాంబ. ‘‘పొద్దున్నే ఇల్లు సర్దాకే మిగతా పనులు చేశానత్తమ్మా.’’ ‘‘అంటే... నువ్వు ఇల్లు సర్దినా సర్దలేదని నేనంటున్నానా?’’ అని రాగం తీసింది రత్నమాంబ. ఇక ఆవిడతో మాట్లాడటం అనవసరమని ఆఫీసుకు వెళ్లిపోయింది భవాని. ఇవి మచ్చుకు రెండు సంఘటనలు మాత్రమే. కానీ ఈ ఆర్నెల్లలో ఇలాంటివి ఎన్నో. రత్నమాంబకు ఇద్దరు కుమారులు... రమేష్, సురేష్. రమేష్‌కు ఓ పెద్దింటి అమ్మాయితో పెళ్లి చేసింది. సురేష్ తన కొలీగ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారిది కులాంతర వివాహం. రత్న మాంబకు బొత్తిగా ఇష్టం లేని పని అది. కానీ కొడుకు పట్టుపట్టడంతో చేసేదేంలేక అంగీకరించింది. కొత్తకోడలు భవాని ఇంటిలో అడుగు పెట్టినప్పటినుంచీ ఇలా సూటిపోటి మాటలతో హింసిస్తోంది. కానీ భవాని నవ్వుతూ తన పని తాను చేసుకు పోతుంది. అత్తగారలా చీటికీ మాటికీ సూటిపోటి మాటలంటున్నా భవాని నవ్వుతూ ఎలా ఉండగలుగుతుందో పెద్దకోడలు మాధవికి అర్థం కాలేదు. వింటున్న తనకే కోపమొస్తుంది, ఈ అమ్మాయెలా నవ్వ గలుగుతుందని ఆశ్చర్యం. ఒకసారి కాక పోతే మరోసారైనా అత్తగారికి భవాని ఎదురు మాట్లాడుతుందని ఎదురు చూసింది. కానీ భవాని ముసిముసి నవ్వులతోనే సరిపెడుతోంది. ఇక ఉండబట్టలేక ఓ రోజు అడిగేసింది. ‘‘భవానీ... అత్తగారు రోజూ నిన్ను అన్ని మాటలంటున్నా నువ్వు మాట్లాడవేం?’’ నవ్వింది భవాని. ‘‘ఇదిగో ఇలాగే ముసిముసిగా నవ్వుకుంటావ్. నీకు కోపం రాదా?’’ అడిగింది మాధవి. ‘‘మిక్కీ మౌస్ మాట్లాడుతుంటే ఎవరికైనా కోపమొస్తుందా అక్కా?’’ ‘‘మిక్కీ మౌసా? నేను మాట్లాడు తోంది కార్టూన్ చానల్ గురించి కాదు భవానీ, మన అత్తగారి గురించి.’’ ‘‘అక్కా... అత్తగారు మాట్లాడుతుంటే నీకెందుకు కోపమొస్తుందో చెప్పు?’’ అడిగింది భవాని. ‘‘ఆవిడలా లేనిపోని దానికి వంకలు పెడుతుంటే కోపం రాదా మరి.’’ ‘‘వస్తుందనుకో. మరి అదే పని మిక్కీమౌస్ చేస్తే?’’ ‘‘మధ్యలో ఈ మిక్కీమౌస్ ఏంటి భవానీ? నాకు అర్థం కావడంలేదు.’’ ‘‘అక్కా... అత్తగారు అలా తప్పులు పడతారనీ, గట్టిగా అరుస్తారనే కదా నీకు కోపం. అదే పని మిక్కీమౌస్ చేసిం దనుకో... నువ్వు కోప్పడతావా? నవ్వు కుంటావా? మిక్కీమౌస్ ఏం చేసినా నవ్వే వస్తుంది కదా. నేను రోజూ నవ్వుతున్నది అందుకే. అంటే... నేను అత్తగారిని మిక్కీమౌస్‌లా చూస్తున్నా నన్నమాట’’... ‘‘అత్తగారిని మిక్కీమౌస్‌లా చూడ్డ మేంటి భవానీ? అర్థమయ్యేలా చెప్పవా?’’ ‘‘చెప్పినా నీకు అర్థం కాదక్కా. ఓ సారి చేసి చూస్తావా?’’ ‘‘ఓకే.’’ ‘‘సరే.. కళ్లు మూసుకుని ఓసారి మన అత్తగారిని ఊహించుకో. ఆవిడెలా కనిపిస్తుందో, వినిపిస్తుందో, నీకేం అనిపిస్తుందో చెప్పు.’’ కళ్లు మూసుకుని అంది మాధవి. ‘‘రాక్షసిలా కనిపిస్తుంది భవానీ, గట్టిగా అరుస్తోంది. నాకైతే పీక నొక్కేయాలని పిస్తోంది తెలుసా!’’ ‘‘కదా... ఇప్పుడు ఆ రాక్షసిని మిక్కీ మౌస్లా మార్చెయ్.’’ ‘‘ఓకే... యా... నౌ షి ఈజ్ లైక్ ఎ మిక్కీమౌస్. హహహ... భలే ఫన్నీగా ఉంది భవానీ. ఆమె అరుపుల్ని ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.’’ ‘‘కదా... ఓ నాలుగు రోజులు ఇలా ప్రాక్టీస్ చెయ్. ఐదో రోజు నుంచి ఆవిడెలా అరిచినా నీకు మిక్కీమౌస్ అరిచినట్లే వినిపిస్తుంది. నేను రోజూ చేస్తుంది అదే’’ అని పకపకా నవ్వింది భవాని. ‘‘అంటే.. రోజూ నువ్వు అత్తగారిని మిక్కీమౌస్‌లా చూస్తున్నావా? ఎక్కడ నేర్చుకున్నావ్ ఈ టెక్నిక్?’’ ‘‘ఎక్కడ నేర్చుకుంటేనేం.. బావుంది కదా. ఆవిడ అరుస్తున్నకొద్దీ మనకు ఎంటర్టైన్మెంట్.’’ ‘‘హహహ... నిజమే. ఇవ్వాల్టి నుంచి నేను కూడా నీ టెక్నిక్‌నే ఫాలో అవుతా’’... అని నవ్వుతూ చెప్పింది మాధవి. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న అత్తాకోడళ్లు
కర్నూలు : కుటుంబ కలహాలతో అత్తాకోడళ్లు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటనలో కోడలు మృతి చెందగా.. అత్త మాత్రం పూర్తిగా కాలిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నర్సాపురం గ్రామంలో చోటుచేసుకుంది. అత్తాకోడళ్ల సుబ్బులమ్మ, మహాదేవి మధ్య తరచుగా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో గురువారం ఉదయం జరిగిన గొడవలో అత్త సుబ్బులమ్మ(48), కోడలు మహాదేవి(25) కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే సరికి మహాదేవి మృతి చెందింది. సుబ్బులమ్మను మాత్రం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. -
రాత్రికి రాత్రే దహనం చేసేశారు!
పెద్ద దోర్నాల (ప్రకాశం): అత్తాకోడళ్ల మధ్య జరిగిన గొడవలో కోడలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ విషయం బయటకు రానీయకుండా కుటుంబసభ్యులు వెంటనే రాత్రికి రాత్రే దహన సంస్కారాలు పూర్తిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామానికి చెందిన మధుమతి (24)కి, వాళ్ల అత్తకు మధ్య గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం కూడా కుటుంబంలో ఏదో గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన మధుమతి గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతి విషయం బయటకు రానీయకుండా కుటుంబసభ్యులు తెల్లవారేలోపు దహన సంస్కారాలు ముగించారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మార్కాపురం డీఎస్పీ శ్రీహరి రావు, తహశీల్దార్‌తో కలిసి శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మధుమతి ఆత్మహత్య చేసుకోలేదని, కుటుంబసభ్యులే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికే వెంటనే దహనం చేశారని స్థానికులు అంటున్నారు. -
కోడలిపై అత్తింటి వారి పైశాచికత్వం
గుంటూరు(నరసరావుపేట): భర్తను కోల్పోయిన కోడలికి అండగా ఉండాల్సిన అత్తింటి వారు రాక్షసంగా ప్రవర్తించారు. బాధితురాలి కథనం ప్రకారం.. నరసరావుపేట రూరల్ మండలం ములకలూరుకు చెందిన ఒక వితంతువు పట్ల మామ, ఇద్దరు మరుదులు కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మామ ప్రవర్తనపై ఏడాదికిందట ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాలనీ పెద్దలు రాజీ కుదిర్చి ఇకమీదట ఇలా జరగదని చెప్పడంతో ఆమె నమ్మింది. స్నానం చేస్తుండగా ఫొటోలు తీశామని, వాటిని బయటపెడతామంటూ మరుదులు కొద్ది రోజులుగా ఆమెను బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆమెపై రెండో మరిది అత్యాచారం కూడా చేశాడు. తరువాత మామ, మరుదులు ఈ విషయం గురించి బయట చెప్తే బ్లేడుతో కోసి చంపుతామని బెదిరించారు. ఆదివారం ఉదయం కూడా ఆమెపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆమె ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి మామ, మరుదులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అమ్మ కాదంది.. అత్త ప్రాణదానం చేసింది
న్యూఢిల్లీ: అత్త అంటే కోడలికి గయ్యాళి. వేధించేకుతినే రకం. అందుకే అత్తాకోడళ్లకు సరిపడదు. చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలను చూసుంటారు. అయితే తల్లీకూతుళ్ల మాదిరిగా ఉండే అత్తాకోడళ్లు కూడా ఉంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూతురును కాపాడేందుకు తల్లి చివరి నిమిషంలో నిరాకరించగా.. అత్త అవయదానం చేసి కోడలికి పునర్జన్మ ప్రసాదించింది. ఇది సినిమా కథ కాదు. ఢిల్లీలో జరిగిన మానవీయ వాస్తవ సంఘటన. పశ్చిమఢిల్లీకి చెందిన కవిత (36) కిడ్నీలు పాడయ్యాయి. దీంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు సూచించారు. కవిత తల్లి తన కిడ్నీల్లో ఒకటి ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందుకు ఆపరేషన్ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే చివరి నిమిషంలో కిడ్నీ ఇచ్చేందుకు కవిత తల్లి నిరాకరించారు. దీంతో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. కవిత ప్రాణాలు దక్కాలంటే కిడ్నీ మార్చడం తప్పనిసరి. ఇలాంటి సమయంలో కవితకు కిడ్నీ ఇచ్చేందుకు ఆమె అత్త విమల ముందుకొచ్చారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కవిత క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. అత్తాకోడళ్ల బంధం అందరికీ ఆదర్శనీయంగా నిలిచింది. -
కాపురానికి పిలవలేదని.. ఏడుగురి సజీవదహనం