‘అబ్బాయిలు అలాంటి అమ్మాయినే ఇష్టపడతారు’ | Samantha Shares A Photo With Mother in Law And Naga Chaitanya | Sakshi
Sakshi News home page

రేర్‌ ఫోటోతో వైరలవుతోన్న సమంత పోస్ట్‌

Published Wed, Mar 27 2019 5:59 PM | Last Updated on Sun, Jul 14 2019 4:41 PM

Samantha Shares A Photo With Mother in Law And Naga Chaitanya - Sakshi

పెళ్లైన తర్వాత సమంత సోషల్‌ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికపప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. అభిమానులతో పంచుకుంటారు. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫోటో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఫోటోతో పాటు దానికి సమంత ఇచ్చిన క్యాప్షన్‌ ఆమె అభిమానులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. వెంకటేష్‌ కూతురు ఆశ్రిత వివాహానికి సమంత, నాగ చైతన్య కూడా హాజరయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత తన భర్త, అత్త లక్షి దగ్గుబాటితో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

‘మా అత్తతో కలిసి చాలా ఎంజాయ్‌ చేశాను. ఒకే రోజు.. ఒకే లాంటి దుస్తుల్లో అనుకోకుండా బయటకు వెళ్లాం. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. మీరంతా దాన్ని తప్పక నమ్మాలి. అబ్బాయిలు తమ అమ్మలా ఉండే అమ్మాయినే ఇష్టపడతారు. అనుకోకుండా మా విషయంలో అదే నిజమైంది’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ ఫోటో అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. నాగచైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి సాధరణంగా బయట ఎక్కువగా కనిపించరు. అలాంటిది ఈ ఫోటోలో కొడుకు, కొడలితో కనిపించడం.. పైగా అత్తాకోడళ్లిద్దరు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉండటంతో అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. మెగా కోడలు ఉపాసన ఈ ఫోటోను లైక్‌ చేయడమే కాక ‘ఉత్తమ కోడలు’ అంటూ కామెంట్‌ చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చైతన్య, సమంత మజిలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఇక పెళ్లి తర్వాత మొదటి సారి సమంత- నాగచైతన్య కలిసి నటిస్తుండటంతో ‘మజిలీ’  సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement