rare photo
-
దీని కళ్లను చూడండి : హిప్నటైజ్ చేసేయగలవు, జాగ్రత్త!
అనంతమైన ప్రకృతిలో మనకు తెలియని ఎన్నోరహస్యాలు, మరెన్నో విశేషాలు దాగి ఉంటాయి. అలాంటి విశేషాలు వెలుగులోకి వచ్చినపుడు వావ్ అనిపిస్తుంటుంది. తాజాగా కర్ణాటకలో ఉన్న బందీపూర్ టైగర్ రిజర్వ్ లో ఒక అరుదైన చిరుతను గుర్తించారు. దీనికి సంబంధించిన విశేషాలను తమిళనాడు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి సుప్రిహ సాహు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అవుతోంది.‘‘జాగ్రత్త ఈ చిరుత కళ్ళు మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తాయి. భారతదేశంలో ఇలాంటి ఫోటోను తీయడం ఇదే తొలిసారి బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో రెండు వేర్వేరు రంగుల కళ్లతో ఉన్న చిరుతపులిఫోటోను ధృవ్ పాటిల్ తీశారు. ఎంత అపురూపం, హెటెరోక్రోమియా ఇరిడియం అనేది చాలా అరుదైన జన్యు పరివర్తన వలన రెండు కళ్లకు వేర్వేరు రంగుల్లో ఉంటాయి.’’ అని ఆమె ట్వీట్ చేశారు. దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. హెటెరోక్రోమియా ఇరిడియం గురించి ఇపుడే తెలుసుకుంటున్నా.. అద్భుత మైన ఫోటో నన్ను మెస్మరైజ్ చేస్తోంది. మరొకరు కమెంట్ చేశారు.Beware ! The eyes of this leapord will hypnotise you. In a first documentation of its kind in India, a leopard with two different coloured eyes has been photographed in Bandipur Tiger Reserve by Dhruv Patil. How incredible ! Heterochromia Iridium is a very rare genetic mutation… pic.twitter.com/cR1i9VAa6u— Supriya Sahu IAS (@supriyasahuias) August 3, 2024 -
టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోని ఏకైక హీరోయిన్.. సౌందర్య జయంతి (ఫొటోలు)
-
చిన్న వయసులోనే స్టార్డమ్, నేషనల్ అవార్డ్.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈమె స్టార్ హీరోయిన్. టీనేజీలోనే హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ మూవీ హిట్. ఆ తర్వాత అద్భుతమైన నటనతో చాలా మూవీస్‌తో హిట్స్ కొట్టింది. తనకంటూ సెపరేట్ బ్రాండ్ సృష్టించుకుంది. పాన్ ఇండియా లెవల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న బూరె బుగ్గల చిన్నారి పేరు ఆలియా భట్. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో సీతగా నటించి, దక్షిణాదిలోనూ అభిమానుల్ని సొంతం చేసుకుంది. తండ్రి మహేశ్ భట్ ప్రముఖ దర్శకుడు. తల్లిది బ్రిటన్. ఈమె నటి కూడా. ఫ్యామిలీది మూవీ బ్యాక్ గ్రౌండే కాబట్టి 19 ఏళ్లకే 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటిస్తూ హీరోయిన్గా అద్భుతమైన గుర్తింపు సంపాదించింది. 'గంగూబాయ్' సినిమాలో యాక్టింగ్ దెబ్బకు ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుంది. ఇక ఆస్కార్ తెచ్చిపెట్టిన 'ఆర్ఆర్ఆర్'లోనూ చిన్న పాత్రలో కనిపించింది. ఇకపోతే ఫాదర్స్ డే సందర్భంగా తండ్రితో తాను చిన్నప్పుడు ఉన్న ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. ఇందులో ఆలియాని చూసి ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఆలియా ఫ్యామిలీ విషయానికొస్తే.. హీరోయిన్గా ఫామ్‌లో ఉండగానే హీరో రణ్‌బీర్ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు రహ అనే కూతురు కూడా ఉంది. ఇలా ఓ వైపు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో) -
Nasa: చంద్రుని అరుదైన ఫొటో ! నాసా ఏం చెప్పిందంటే..
కాలిఫోర్నియా: చంద్రుడంటే భూమి మీదున్న ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ఇటీవల భారత్ చంద్రయాన్ మిషన్ సక్సెస్ అయినప్పటి నుంచి చంద్రుని గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ మరింత పెరిగింది. దీంతో చంద్రునికి సంబంధించి ప్రపంచంలో ఏ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఎలాంటి ప్రకటన చేసినా ఇటీవలి కాలంలో అది సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలోనే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తాజాగా ఈ నెల 4న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అమావాస్యకు దగ్గరగా ఉన్న అర్ధ చంద్రుని(వేనింగ్ క్రిసెంట్ మూన్) అరుదైన ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. అమావాస్యకు దగ్గరగా ఉన్నపుడు చంద్రుడు భూమి మీద నుంచి చూసేవాళ్లకు కొద్ది కొద్దిగా అదృశ్యమవుతూ కనిపిస్తాడు. ఈ సమయంలో భూమి మీద ఉన్నవాళ్లకు కనిపించని పక్క చంద్రునిపై సూర్య కాంతి పడిన చిత్రాన్ని నాసా ఒడిసిపట్టింది. ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదీచదవండి.. భారత్, అమెరికా సంబంధాలు.. చపాతీ, పూరీలతో పోలిక -
Manoj Sharma: వారెవ్వా.. నిజంగానే మధుర జ్ఞాపకం!
కొందరి గురించి తెలిసినా.. వాళ్ల విజయగాథలు చదివినా(చూసినా).. వాళ్ల మీద గౌరవం అమాంతం పెరిగిపోతుంది. అలా యావత్ దేశం నుంచి 12th ఫెయిల్ చిత్రం ద్వారాసెల్యూట్ అందుకున్న అధికారి మనోజ్ కుమార్ శర్మ. అది ఈయన బయోపిక్ అని ప్రత్యేకంగా ఇక్కడ చెప్పనక్కర్లేదనుకుంటాం. క్వారీ కూలీ, ఓ మాస్టారింట్లో పనివాడు, లైబ్రరీకి సెక్యూరిటీ గార్డు, మిల్లు కూలీ, వంటవాడు, చివరికి- కుక్కల్ని రోజూ వాకింగ్‌కి తీసుకెళ్ళేవాడు.. ఇన్ని పనులూ చేశాడీయన. కడు పేదరికంలో పెరిగిన యువకుడు.. కష్టాల కడలిని ఈదీ సివిల్స్ కలల తీరానికి ఎలా చేరాడనేది క్షుప్తంగా ఆయన సక్సెస్‌స్టోరీ. ఇన్ని పనులు చేసినా.. ఎక్కడా అదే తన బతుకని ఆగిపోలేదు. ‘జీవితాన్ని ఏ స్థాయి నుంచైనా రీ-స్టార్ట్’ చేయొచ్చని నమ్మాడు. ఆ నమ్మకమే ఆయన్ని ఉన్నత అధికారిగా నిలబెట్టింది. ముంబయి మహానగరానికి అడిషనల్ కమిషనర్‌గా ఉంటున్న మనోజ్ జీవితాన్ని ఆయన మాజీ రూమ్మేట్ పాండే ఉరఫ్ అనురాగ్ పాథక్ ‘ట్వెల్త్ ఫెయిల్’ అనే పుస్తకంగా రాశాడు. దాన్నే- ప్రముఖ హిందీ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాగా తీసి సూపర్‌హిట్ కొట్టాడు. ఇక ఈ ఫొటో.. తన వివాహం జరిగిన కొన్ని రోజులకు దిగారట. తాజాగా ఆ ఫొటో దొరికిందంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. భార్య శ్రద్ధా జోషితో సరదాగా నదీ తీరాన దిగిన ఫొటో అది. ఇంకేం.. ఆయన ఫాలోవర్స్ ఆ ఫొటోను లైక్ చేసేస్తున్నారు. జోషి కూడా సివిల్స్ అధికారిణే(ఐఆర్ఎస్). యూపీఎస్సీ క్లాస్‌ల సమయంలోనే వీళ్ల మధ్య బంధం ఏర్పడింది. 12th ఫెయిల్ చిత్రంలో అది తెరపై భావోద్వేగంగా చూపించారు. सर आप बहुत भाग्यशाली हो कि आपको ऐसी धर्मपत्नी मिली जिनके भीतर आपके लिए सच्चा प्रेम है । जबकि अधिकतर मामलों में देखा गया है लड़की उसी लड़के से शादी करती है जो सफल होता है । pic.twitter.com/nZCqllINbl — Nadeem Ram Ali (@NadeemRamAli) January 10, 2024 మనోజ్ కథలోకి వెళ్తే.. మనోజ్‌ది మధ్యప్రదేశ్ రాష్ట్రం మొరానాబాద్ జిల్లాలోని బిల్గ్రామ్ అనే కుగ్రామం. తండ్రి వ్యవసాయశాఖలో చిరుద్యోగి కానీ పైఅధికారి అక్రమాలని బయటపెట్టినందుగ్గాను సస్పెండ్ అయ్యాడు. దాంతో వాళ్లది ఆదాయంలేని ఇల్లయింది. ఆ సమయంలోనే మనోజ్ ఇంటర్ పరీక్షలకి హాజరయ్యాడు. అక్కడి బడులు తమ పాస్ పర్సంటేజీని ఎక్కువగా చూపించుకోవడం కోసం విద్యార్థుల చేత మాస్‌కాపీయింగ్ చేయించడం ఆనవాయితీ. మనోజ్ సహా ఓ రోజు విద్యార్థులందరూ యథేచ్ఛగా చూసి రాస్తుండగా... అక్కడికొచ్చారు దుష్యంత్ సింగ్ అనే సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం). ఇదివరకటి అధికారుల్లా చూసీచూడనట్టు వెళ్ళిపోలేదాయన.. కాపీయింగ్‌ని ఆపేశాడు. పరీక్షలున్న అన్నిరోజులూ అక్కడే మకాం వేశాడు! ఫలితంగా ఆ స్కూల్ నుంచి ఇద్దరే పాసయ్యారు. మనోజ్ అయితే ఒక్క హిందీలో తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిలయ్యాడు. అయితేనేం- ఆ అధికారిలోని నిజాయతీ, ముక్కుసూటిదనం మనోజ్‌ని కట్టిపడేశాయి. తానూ అలాంటి అధికారి కావాలనుకున్నాడు. అక్కడి నుంచి ఒడిదుడుకుల నడుమ మనోజ్ ప్రయాణం ఎలా సాగిందో.. Disney+ Hotstarలో స్ట్రీమ్ అవుతున్న ట్వెల్త్ ఫెయిల్ చూసి మీరే తెలుసుకోండి. -
Kannada Superstar Shivarajkumar: కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ అరుదైన ఫోటోలు.. ఓ లుక్కేయండి
-
Actress Raasi Unseen Photos: అందాల తార రాశి .. ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
ఆ అద్భుతం వెనకాల కష్టం మామూలుది కాదు!
అదో అరుదైన జీవి. మనిషి కంటపడకుండా తిరగడం దాని నైజం. అలాంటి జీవిని.. అంతే అద్భుతంగా కెమెరాలో బంధించింది ఓ ఫీమేల్ ఫొటోగ్రాఫర్. అదీ ఎముకలు కొరికే చలిలో.. ఎంతో కష్టపడి మరీ!. అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్ కిట్టియా పాలోస్కి.. మంచు పర్వత శిఖరాన ఠీవిగా కూర్చున్న మంచు చిరుతను కెమెరాలో బంధించింది. నేపాల్ ఖుంబు గ్లేసియర్‌లో ఫాంటోమ్ అల్లేగా పిలువబడే చోట ఆమెకు ఈ దృశ్యం తారసపడింది. కాలినడకన దాదాపు.. 165 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆమె ఈ అద్భుతాన్ని బంధించారట!. View this post on Instagram A post shared by Kittiya Pawlowski (@girlcreature) ఈ ఫొటో మాత్రమే కాదు.. ఎవరెస్ట్ పర్వతం, పుమోరి పర్వతాల నీడన మంచు చిరుత పయనిస్తున్న ఫొటోలను ఎంతో సుందరంగా తీశారు పాలోస్కి. ఎప్పుడైతే అవి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయో.. అప్పటి నుంచి అవి వైరల్ కావడం ప్రారంభించింది. యానిమల్ప్లానెట్తో పాటు కొన్ని ప్రభుత్వ సంస్థలు సైతం ఆమె ఫొటోల్ని వాడేస్తున్నాయి. పాంథెరా జాతికి చెందిన మంచు చిరుతకు.. ఘోస్ట్ ఆఫ్ మౌంటెయిన్స్గా పేరుంది. సిగ్గుపడే స్వభావం కారణంగా అది మనుషుల కంట పడదు.. పడినా దాడి చేసిన సందర్భాలు లేవు!. అయితే వేట, అక్రమ రవాణా కారణంగా వీటి జనాభా బాగా తగ్గిపోతూ వస్తోంది. 2040 నాటికి ఇవి అంతరించుకునే పరిస్థితికి చేరుకుంటాయనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్తే ఇలాగే ఉంటది! వీడియో వైరల్ -
పెళ్లిలో చిరు నవ్వులు చిందిస్తున్న ఈ స్టార్ డైరెక్టర్ని గుర్తు పట్టారా?
పై ఫోటోలో పెళ్లి కూతురు పక్కన కూర్చొని చిరు నవ్వులు చిందిస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీని గుర్తుపట్టారా? అబ్బే.. చాలా కష్టమండి అంటారా? సరే అయితే మీ మీకోసం ఒక క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో చెక్ చేసుకోండి. టాలీవుడ్లో ఆయనో స్టార్ డైరెక్టర్. మాటల మాంత్రికుడు. తేలికైన పదాలతో, చాలా అర్థవంతమైన సంభాషణలు చెప్పడం ఆయన స్పెషాలిటీ. గుర్తొచ్చిందా? డౌట్ పడకండి.. మీరనుకున్నట్లుగా ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే. ఈ ఫోటోలో త్రివిక్రమ్ కొంచెం బొద్దుగా ఉండటంతో వెంటనే గుర్తు పట్టడం కష్టమే. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ మీకు త్రివిక్రమ్ పెళ్లి స్టోరీ తెలుసా? ఆయన పెళ్లి కూడా సినిమా మాదిరే జరిగింది. అక్కని చూడడానికి వెళ్లి చెల్లిని పెళ్లి చేసుకొని వచ్చాడు మన మాటల మాంత్రికుడు. ప్రముఖ గేయరచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి సోదరుడి కూతురే సౌజన్య. మొదట సౌజన్య అక్కని చూడడానికి వెళ్లాడట త్రివిక్రమ్. అయితే అక్కడ అక్క పక్కన ఉన్న సౌజన్యని చూసి తొలి చూపుకే ప్రేమలో పడిపోయాడట. వెంటనే తన మనసులోని మాటను సౌజన్య తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా ఇందుకు ఒప్పుకున్నారట. అయితే సౌజన్య అక్క పెళ్లి అయిన తరువాత మీ పెళ్లి చేస్తామని వారి తల్లిదండ్రులు కండిషన్ పెట్టారట. దీనికి త్రివిక్రమ్ ఒప్పుకొని ఆమె పెళ్లయిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేశ్‌బాబుతో ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వీరిద్ధరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ సాధించగా.. రాబోయే సినిమాపై ఇప్పటి నుంచే అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. చదవండి: మీనాక్షి చౌదరి గురించి ఈ విషయాలు తెలుసా? మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి! -
ప్రభాస్ ఫొటో వైరల్: స్టన్నవుతున్న ఫ్యాన్స్
గతేడాది లాక్డౌన్ వల్ల సినిమాలు లేకుండా ఎంతో ఖాళీగా ఉన్నారు హీరోలు. కానీ ఇప్పుడు వరుస షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీబిజీగా మారారు. 'బాహుబలి' ప్రభాస్ అయితే భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న ప్రభాస్ వీటి షూటింగ్ ముగిసే సమయానికి 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో నటించనున్నాడు. తర్వాత 'మాస్టర్' డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే సోషల్ మీడియాలో ప్రభాస్ అరుదైన ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇందులో డార్లింగ్ హీరో మునీశ్వరుడి వేషం కట్టాడు. గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'యమదొంగ' చిత్రాన్ని విశ్వామిత్ర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ బ్యానర్ లోగో కోసం విశ్రామిత్రుడి గెటప్ అవసరం కాగా దానికి ప్రభాస్ కరెక్ట్‌గా సెట్ అవుతారని అంతా అనుకున్నారు. ఇంకేముందీ.. ప్రభాస్‌ను వెంటనే విశ్వామిత్రుడిగా మార్చారు. ఆ ఫొటోనే ప్రస్తుతం నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఇదిలా వుంటే రాజమౌళి ఈ బ్యానర్లో 'యమదొంగ' తర్వాత మరే చిత్రాన్ని నిర్మించలేదు. ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. చదవండి: నీటి లోపల మెహరీన్ లవ్ ప్రపోజల్ దేహంలో చెత్త లేకుండా చూసుకోవాలి: రకుల్ -
ఈ ఫొటోలో ఎన్ని పులులు దాగున్నాయి?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అటవీ శాఖ అధికారి సుసాంటా నంద నెటిజన్లకు సవాలు విసిరారు. కమోఫ్లాగ్(నిగూఢమైన) ఆర్టుకు సంబంధించిన ఫొటో షేర్ చేసిన ఆయన.. అందులో ఎన్ని పులులు కనిపిస్తున్నాయో చెప్పాల్సిందిగా కోరారు. ‘‘కమోఫ్లాగింగ్, మిస్‌డైరెక్షన్ బాగా వివరిస్తాయి. ఇక్కడ ఎడమ వైపు ఓ పులిని మీరు చూస్తున్నారు. అదే విధంగా కుడివైపు ఫొటోలో ఎన్ని పులులు ఉన్నాయో కనిపెట్టగలరా’’ అంటూ రెండు ఫొటోలను పోస్ట్ చేశారు. అయితే ఇది కేవలం చాలెంజ్ కాదని.. తమను తాము రక్షించుకునేందుకు పులి చర్మపు రంగులు దానికి ఏవిధంగా ఉపయోగపడతాయో చెప్పే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాల గురించి తర్వాత పూర్తిగా వివరిస్తానని.. ఇప్పటికైతే ఈ ఫొటోలో ఉన్న పులులను గుర్తించమని పజిల్ విసిరారు. ఇందుకు స్పందించిన నెటిజన్లు... ‘‘ఇది చాలా కష్టంగా ఉంది. ఆ గడ్డిలో పులుల జాడ కనుక్కోవడం సవాలుతో కూడుకున్నదే. అయితే ఒకటి మాత్రం చెప్పగలం. అది రణతంబోర్ వద్ద తీసిన ఫొటో అని గుర్తించగలిగాం’’ అంటూ ఎవరికి తోచిన విధంగా వారు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సుసాంటా షేర్ చేసిన ఫొటోను క్షుణ్ణంగా పరిశీలించి.. ఆ పజిల్‌ను ఛేదించండి. Camouflaging & misdirection explained best. U can see one tiger in the left. Can you find out how many are there in the right picture? pic.twitter.com/zSvvjwAjvX — Susanta Nanda IFS (@susantananda3) March 11, 2020 -
అరుదైన ‘మంచు చిరుత’ను చూశారా?
‘ఘోస్ట్ ఆఫ్ మౌంటేన్’గా పిలుచుకునే అరుదైన మంచు చిరుతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని హిక్కిం గ్రామంలో మంచు కొండల మీద ఠీవీగా నడుస్తున్న ఈ చిరుత నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘ స్పిటి జిల్లాలో ఈ అద్భుతం దర్శనమిచ్చింది. మంచు చిరుతలు ఎంతో అందమైనవి. సాధారణ చిరుతల వలె పసుపు రంగు కళ్లు.. గాకుండా ఇవి పచ్చని, బూడిద రంగు కళ్లు కలిగి ఉంటాయి. వాటి తోకలు కూడా ఎంతో బారుగా ఉంటాయి. చలిని తట్టుకునేందుకు ఐదు ఇంచుల మందం గల జుత్తు కూడా ఉంటుంది. ఘోస్ట్ ఆఫ్ మౌంటేన్ అరుదుగా కన్పిస్తూ ఉంటుంది’’ అంటూ అటవీశాఖ అధికారి సుసాంటా నందా ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఇక అప్పటి నుంచి ఇది లైకులు, రీట్వీట్లతో దూసుకుపోతోంది. మంచు చిరుతను చూసిన వారంతా.. ‘అరుదైన వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు. బిగ్ క్యాట్ చాలా బాగుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా మంచు చిరుతలు భూమి నుంచి దాదాపు 9800 నుంచి 17 వేల అడుగుల ఎత్తున కనిపిస్తాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కిబ్బర్ వైల్డ్ లైఫ్ సాంక్చువరీ, కిన్నార్ జిల్లాలో ఇవి అప్పుడప్పుడూ సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతూ ఉంటారు. Majestic grandeur in the tranquility of Spiti District👍🏻Snow leopard is the most beautiful & mystical big cats with grey/green eyes,unlike the yellow eyes of other big cats.Tails as long as de body& 5inch fur at bottom to survive cold weathe,rare to see these ghost of de mountain pic.twitter.com/iiEAGaWgop — Susanta Nanda IFS (@susantananda3) February 17, 2020 -
అబ్బురపరిచిన వానరం!
‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అనే మంచిమాటను మనుషులు మర్చిపోతున్న పరిస్థితి. ఇక జంతువుల విషయానికొస్తే ఆపదను తెచ్చిపెట్టేవి అవే అయినా.. కొన్నిసార్లు ఆపద నుంచి రక్షించేవి కూడా అవే. ఈ క్రమంలో ఒరాంగుటాన్ అనే జంతువు మనిషి ప్రమాదంలో ఉన్నాడని భావించి అతనికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చి అందరినీ అబ్బురపరిచిన ఘటన బొర్నియాలో చోటు చేసుకుంది. బోలెడు తెలివి తేటలుండే ఒరాంగుటాన్ అనే వానరం కొన్ని విషయాల్లో మనిషిలాగే ప్రవర్తిస్తాయన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. తాజాగా బొర్నియా ప్రాంతంలో సంచరిస్తున్నన ఒరాంగుటాన్ బురద నీటిలో సగం వరకు మునిగి ఉన్న ఓ వ్యక్తిని గమనించి అతను ఆపదలో ఉన్నాడని భావించింది. వెంటనే అతన్ని సమీపించి చేయి చాచి సహాయం అందించింది. దీన్ని అనిల్ ప్రభాకర్ అనే వ్యక్తి ఫొటో తీయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతరించిపోతున్న జీవజాతుల కోసం పనిచేస్తున్న ‘బొర్నియో ఒరాంగుటాన్ సర్వైవల్ ఫౌండేషన్’ అనే సంస్థ ఈ అద్భుతమైన ఫొటోను గురువారం తమ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ‘మనుషుల్లో అడుగంటిపోతున్న మానవత్వాన్ని కొన్ని జంతువులు మనకు గుర్తు చేస్తున్నాయి’ అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ ఫొటో ఎంతోమంది నెటిజన్ల హృదయాలను కరిగిస్తోంది. ‘ఆ జంతువు చూపిన ప్రేమకు మేం దాసోహమయ్యాం’ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పైన చెప్పుకున్న ఫౌండేషన్‌లో పని చేస్తాడు. కాగా ఆ నదిలో పాముందని సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని దాని కోసం వెదికానని ఆయన పేర్కొన్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒరాంగుటాన్ తాను ప్రమాదంలో ఉన్నానని భ్రమించి సహాయం చేయడానికి వచ్చిందని తెలిపాడు. అయితే అది అడవు జంతువు కాబట్టి, దాని సహాయాన్ని తిరస్కరించానని తెలిపాడు. (మీ పిడకల వేట అదుర్స్) -
‘అబ్బాయిలు అలాంటి అమ్మాయినే ఇష్టపడతారు’
పెళ్లైన తర్వాత సమంత సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికపప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంటారు. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫోటోతో పాటు దానికి సమంత ఇచ్చిన క్యాప్షన్ ఆమె అభిమానులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహానికి సమంత, నాగ చైతన్య కూడా హాజరయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత తన భర్త, అత్త లక్షి దగ్గుబాటితో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘మా అత్తతో కలిసి చాలా ఎంజాయ్ చేశాను. ఒకే రోజు.. ఒకే లాంటి దుస్తుల్లో అనుకోకుండా బయటకు వెళ్లాం. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. మీరంతా దాన్ని తప్పక నమ్మాలి. అబ్బాయిలు తమ అమ్మలా ఉండే అమ్మాయినే ఇష్టపడతారు. అనుకోకుండా మా విషయంలో అదే నిజమైంది’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటో అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. నాగచైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి సాధరణంగా బయట ఎక్కువగా కనిపించరు. అలాంటిది ఈ ఫోటోలో కొడుకు, కొడలితో కనిపించడం.. పైగా అత్తాకోడళ్లిద్దరు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉండటంతో అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. మెగా కోడలు ఉపాసన ఈ ఫోటోను లైక్ చేయడమే కాక ‘ఉత్తమ కోడలు’ అంటూ కామెంట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చైతన్య, సమంత మజిలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఇక పెళ్లి తర్వాత మొదటి సారి సమంత- నాగచైతన్య కలిసి నటిస్తుండటంతో ‘మజిలీ’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. -
అరుదైన ఫొటోను షేర్ చేసిన క్రిష్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం యావత్తు తెలుగు ప్రజలను కలిచివేస్తోంది. హరికృష్ణ మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.. సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియా వేదికగా హరికృష్ణ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. దివంగత నేత `ఎన్టీఆర్` బయోపిక్‌ను రూపొందిస్తున్న డైరెక్టర్ క్రిష్ కూడా హరికృష్ణ మృతికి సంతాపం తెలియజేశారు. ఆయనకు సంబంధించిన ఓ అరుదైన ఫొటోను పంచుకున్నారు. చిన్న వయసులో తండ్రి ముందు నడుస్తున్న హరికృష్ణ ఫొటోను ట్విట్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా `మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథ సారథ్యం.. చిన్న నాటే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం.. 1962లో దేశ రక్షణ కోసం విరాళాలు సేకరిస్తున్న ఎన్టీఆర్ ముందు నడుస్తున్న హరికృష్ణ` అంటూ పేర్కొన్నారు. (చదవండి: కలవాలి తమ్ముడు అన్నారు కానీ..) మార్పుకోసం రామ రధ చక్రాలు నడిపిన చైతన్యరధసారధ్యం చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడచిన వారసత్వం#NandamuriHarikrishna garu leading NTR garu during the National Defence Fund activity in 1962.. pic.twitter.com/8LXvDP8Dzw — Krish Jagarlamudi (@DirKrish) August 29, 2018 హీరో ప్రభాస్ సైతం ఫేస్బుక్ పేజిలో హరికృష్ణ మృతికి సంతాపం తెలిపారు. ‘హరికృష్ణ గారి మరణం బాధ కలిగించింది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నందమూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అని ప్రభాస్ ఫేస్బుక్ పోస్ట్ చేశాడు. చదవండి: ప్రముఖుల ఇంట విషాదం రేపిన రోడ్డుప్రమాదాలు! హరికృష్ణ మరణం : సమంతను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు -
బద్ధశత్రువులంతా కలిసిన వేళ...
వాళ్లంతా బద్ధ శత్రువులు. మొత్తం నలుగురు. వాళ్లలో ఒకరిని చంపడానికి మరొకరు మిగిలిన ఇద్దరిని కిరాయికి పిలిపించుకుంటారు. కానీ నలుగురూ కలిసి భుజాల మీద చేతులు వేసుకుని నవ్వుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది? పైన చెప్పింది షోలే సినిమా స్టోరీ. ఆ తర్వాత చెప్పింది ఆ సినిమా షూటింగ్లో సన్నివేశం. సినిమాలో వీరూ, జై, ఠాకూర్, గబ్బర్ సింగ్ పాత్రలలో నటించిన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, అమ్జాద్ ఖాన్.. ఈ నలుగురూ షూటింగ్ సమయంలో సరదాగా నవ్వుకుంటూ ఒకళ్ల భుజాల మీద ఒకళ్లు చేతులు వేసుకుని తీయించుకున్న అరుదైన ఫొటోను దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. సాధారణంగా తన ట్వీట్లలో ఎవరో ఒకరిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే రాము.. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా, బాగా ఇష్టమైన షోలే సినిమాకు సంబంధించిన ఈ ఫొటోను ప్రేక్షకుల కోసం అందించాడు రామూ. Jai,Veeru,Thakur and Gabbar on the sets of Sholay..Height of deceit is that they were sworn enemies on screen pic.twitter.com/PvoQBtQD3D — Ram Gopal Varma (@RGVzoomin) 11 August 2016 -
4 లక్షలు పలికిన మార్లిన్ మన్రో ఫొటో!
శృంగార దేవత మార్లిన్ మన్రో ఫొటోలంటే అభిమానులకు ఎప్పుడైనా క్రేజే. అలాంటిది ఆమె అరుదైన ఫొటో అంటే అసలు ఆగుతారా? అసలు సినిమాల్లోకి రాకముందు మార్లిన్ మన్రో తీయించుకున్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను వేలానికి పెట్టగా.. దానికి ఏకంగా 4 లక్షల రూపాయలకు పైగా ధర పలికింది. 1946లో ఏజెన్సీ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ జస్గర్ ఈ ఫొటో తీశారు. మార్లిన్ మన్రో తొలిసారి మోడలింగ్ చేసినప్పుడు కాలిఫోర్నియాలోని జుమా బీచ్‌లో ఈ ఫొటో తీసి ఉంటారని భావిస్తున్నారు. దీని ఫొటో మాత్రమే 4 లక్షలు పలకగా.. దాని నెగెటివ్, కాపీరైట్ లాంటివి మరోసారి అమ్మకానికి పెట్టబోతున్నారు. వాటికి రెట్టింపు ధర పలకవచ్చని అంచనా వేస్తున్నారు.