కాలిఫోర్నియా: చంద్రుడంటే భూమి మీదున్న ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ఇటీవల భారత్ చంద్రయాన్ మిషన్ సక్సెస్ అయినప్పటి నుంచి చంద్రుని గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ మరింత పెరిగింది. దీంతో చంద్రునికి సంబంధించి ప్రపంచంలో ఏ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఎలాంటి ప్రకటన చేసినా ఇటీవలి కాలంలో అది సంచలనంగా మారుతోంది.
ఈ క్రమంలోనే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తాజాగా ఈ నెల 4న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అమావాస్యకు దగ్గరగా ఉన్న అర్ధ చంద్రుని(వేనింగ్ క్రిసెంట్ మూన్) అరుదైన ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. అమావాస్యకు దగ్గరగా ఉన్నపుడు చంద్రుడు భూమి మీద నుంచి చూసేవాళ్లకు కొద్ది కొద్దిగా అదృశ్యమవుతూ కనిపిస్తాడు. ఈ సమయంలో భూమి మీద ఉన్నవాళ్లకు కనిపించని పక్క చంద్రునిపై సూర్య కాంతి పడిన చిత్రాన్ని నాసా ఒడిసిపట్టింది. ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment