
ఇస్లామాబాద్: ప్రభుత్వం ఆధీనంలోని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)ను పాక్ ప్రభుత్వం మరోసారి విక్రయానికి పెట్టింది. గతేడాది అక్టోబర్‌లో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఒత్తిడి మేరకు జూలై నెలకల్లా ఎలాగోలా పీఐఏను అమ్మేస్తామని తాజాగా హామీ ఇచ్చింది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తీవ్ర నష్టాల్లో నడుస్తున్న సంస్థల్లో ఒకటైన పీఐఏలోని 51 శాతం నుంచి 100 శాతం వరకు వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
గతేడాది పాక్‌కే చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి వెయ్యి కోట్ల రూపాయలకు కొనేందుకు ముందుకు వచ్చింది. మరెవరూ పీఐఏపై ఆసక్తి చూపడం లేదు. అయితే, దీన్ని విక్రయిస్తేనే 7 బిలియన్ డాలర్ల రుణం ఇస్తామంటూ ఐఎంఎఫ్ (IMF) మెలికపెట్టడంతో పాకిస్తాన్ (Pakistan) ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది.
పాకిస్తాన్ ప్రభుత్వానికి షాకిచ్చిన అమెరికా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వానికి అమెరికా (America) షాకిచ్చింది. తుర్క్‌మెనిస్తాన్‌లో పాక్ రాయబారి కేకే అహ్సాన్ వాగన్‌ను తమ దేశంలోకి అనుమతించలేదు. సెలవుల రీత్యా లాస్‌ఏంజెలెస్ వెళ్లిన వాగన్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. చెల్లుబాటయ్యే వీసా, ప్రయాణ పత్రాలున్నా అమెరికాలోకి ప్రవేశించనివ్వకుండా తిప్పి పంపారు. ఇమిగ్రేషన్ అభ్యంతరాలే ఇందుకు కారణమని పాక్ విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది. దీనిపై విచారణకు లాస్ ఏంజెలెస్‌లోని తమ కాన్సులేట్‌ను ఆదేశించింది.
చదవండి: రైలు హైజాక్.. రెస్క్యూలో పాకిస్తాన్ ఆర్మీ ప్లాన్ సక్సెస్!
Comments
Please login to add a commentAdd a comment