PIA
-
కెనడాలో పాక్ ఎయిర్ హోస్టెస్ అదృశ్యం? 2018 నుంచి ఎందుకిలా?
పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ పీఐఏ ప్రస్తుతం విచిత్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాక్ ఎయిర్ హోస్టెస్‌లు ఫ్లైట్ డ్యూటీ చేస్తూ కెనడా వెళుతున్నారు. కానీ తిరిగి రావడం లేదు. కొద్ది రోజుల క్రితం పిఐఎ విమానంలో టొరంటో చేరుకున్న విమాన సహాయకురాలు మరియం రజా తిరిగి రాలేదు. హోటల్లో ఆమె గదిని వెతకగా ఆమె పీఐఏ యూనిఫాంతో పాటు ‘ధన్యవాదాలు పీఐఏ’ అని రాసివున్న చీటీ లభ్యమయ్యింది. కెనడాలో దిగిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) సిబ్బంది కనిపించకుండా పోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి వ్యవహారం కొనసాగుతోంది. పలువురు పీఐఏ ఎయిర్ హోస్టెస్‌లు కెనడాకు వెళ్లి అక్కడ స్థిరపడుతున్నారు. ఇందుకోసం వారు పీఐఏ ఆమోదం తీసుకోవడం లేదు. అలాగే ముందుగా ఎటువంటి వీసా కోసం కూడా దరఖాస్తు చేయడం లేదు. 2024, జనవరిలో కెనడాలో పీఐఏ ఫ్లైట్ అటెండెంట్ ఫైజా ముఖ్తార్ అదృశ్యమైన నెల రోజల తర్వాత మరియం అదృశ్యమైంది. పీఐఏ సిబ్బంది 2018 నుండి కెనడాలో ఆశ్రయం పొందుతున్నారు. పీఐఏకి ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. పాక్‌కు చెందిన పలువురు నిపుణులు తమ భవిష్యత్ కలలను నెరవేర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో దేశం విడిచి వెళుతున్నారు. ఏవియేషన్ న్యూస్ వెబ్సైట్ సింప్లీ ఫ్లయింగ్ తెలిపిన వివరాల ప్రకారం కెనడాకు వెళ్లిన పాకిస్తాన్ వైమానిక సిబ్బంది అదృశ్యమవడం అనేది 2019లో ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో ఇది మరింతగా పెరిగింది. 2023లో కెనడాలో దిగిన ఏడుగురు పీఐఏ ఫ్లైట్ అటెండెంట్లు అదృశ్యమయ్యారు. పీఐఏ ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ నుండి టొరంటోకు వచ్చిన ఇద్దరు పీఐఏ క్యాబిన్ సిబ్బంది డిసెంబర్ 2023లో తమ డ్యూటీని రిపోర్ట్ చేయలేదు. దీంతో సిబ్బంది లేకుండా ఆ పీఐఏ విమానం ఇస్లామాబాద్‌కు తిరిగి వచ్చిందని తెలిపారు. -
షాకింగ్.. భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానం.. 10 నిమిషాల పాటు..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ విమానం భారత్‌లో దాదాపు 10 నిమిషాల పాటు ప్రయాణించి 141 కిలోమీటర్లు చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. మే 4న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ మీడియా సంస్థ నివేదికలో వెల్లడించింది. పీకే248 అనే పీఐఏ విమానం మస్కట్ నుంచి తిరిగి పాకిస్తాన్‌కు మే4న రాత్రి 8 గంటల సమయంలో చేరుకుంది. అలామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా విమానం ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. పైలట్ ల్యాండ్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో విమానాన్ని కొద్దిసేపు గాల్లో తిప్పాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పైలట్‌కు సూచించారు. అయితే భారీ వర్షం కారణంగా దారితప్పిన పైలట్ విమానాన్ని భారత గగనతలంలోకి తీసుకొచ్చాడు. ఈ సమయంలో గంటలకు 292 కిలీమీటర్ల వేగం, 13,500 అడుగల ఎత్తులో అది ప్రయాణించింది. బధానా పోలీస్ స్టేషన్ పరిధి గగనతలం మీదుగా భారత్‌లోకి వచ్చింది. భారత పంజాబ్‌లోని తరన్ సాహిబ్ , రసూల్పూర్ ప్రాంతాల్లో దాదాపు 140 కిలోమీటర్లు గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో విమానాన్ని 20వేల అడుగులకుపైగా ఎత్తులో ఉంచాడు పైలట్. ఏడు నిమిషాల పాటు అటు ఇటు తిప్పాడు. ఆ తర్వాత భారత పంజాబ్‌లోని జాగియాన్ నూర్ మహమ్మద్ గ్రామం మీదుగా విమానం తిరిగి పాకిస్తాన్ చేరుకుంది. ఆ తర్వాత పాక్ పంజాబ్‌లోని డొనా మబ్బోకి, ఛాంట్, ధుప్సారి కాసుర్, ఘఠి కలంజార్ ప్రాంతాల్లో ప్రయాణించి తిరిగి మళ్లీ భారత గగనతలంలోకి వచ్చింది. మళ్లీ మూడు నిమిషాలు చక్కర్లు కొట్టిన అనంతరం భారత పంజాబ్‌లోని లఖా సింఘ్వాలా హిథార్ గ్రామం మీదుగా తిరిగి పాక్ చేరుకుంది. ఈ సమయంలో విమానం 23,000 ఎత్తులో ప్రయాణించింది. అయితే ఈ ఘటనకు భారత అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
పైలట్ తప్పిదం వల్లే ఆ ఘోర ప్రమాదం
కరాచి : గత మే 22న పాకిస్తాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఎ320 ఎయిర్‌బస్ విమానం ఇంజిన్లు సహకరించకపోవడంతో పైలట్ అర్థంతరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 97 మంది దుర్మరణం చెందగా, ఇదరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా దీనిపై పాకిస్తాన్ ఏవియేషన్ అధికారులు పీఐఏకు మరోసారి నివేదికను అందించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలను పట్టించుకోకుండానే ప్రయాణీకులతో వెళుతున్న ఎ320 ఎయిర్‌బస్ విమానాన్ని పైలట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించాడని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు తెలిపారు. కేవలం పైలట్ తప్పిదం వల్లే ఈ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుందని ఏవియేషన్ అధికారులు మరోసారి తేల్చి చెప్పారు.(కుప్పకూలిన పాక్ విమానం) 'ప్రమాదం గురించి తాము మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశామని.. కానీ పైలెట్ వాటిని పట్టించుకోలేదన్నారు. లాహోర్ నుంచి కరాచీకి ప్రయాణమైన ఎయిర్ బస్ ఏ-320 విమానం జిన్నా ఇంటరర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఏటీసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటికి భూమికి 7 వేల అడుగుల ఎత్తులో ఉండాల్సిన విమానం కాస్తా.. 10,000 అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు ఎత్తును తగ్గించాలల్సిందిగా పైలెట్‌ను హెచ్చరించారు. కానీ అతడు పట్టించుకోలేదు' అంటూ పేర్కొన్నారు. కాగా ఇంతకుముందు సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ)కు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంజన్ మూడు సార్లు రన్‌వేకు తగిలిందని.. దాంతో ఇంజన్ ట్యాంక్, పంపు దెబ్బతిన్నాయని పేర్కొంది. పైలెట్, ఏటీసీ ఇచ్చిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిస్థితి అదుపు తప్పిందని.. ఫలితంగా ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు.(పాక్‌కు సాయం ఆపేయండి.. అమెరికాకు విజ్ఞప్తి!) పీఐఏ జనరల్ మేనేజర్ అబ్దుల్లా హఫీజ్ ఖాన్ రాయిటర్స్‌తో స్పందిస్తూ.. ' అవును, మాకు లేఖ వచ్చింది, వారు దానిని డాక్యుమెంట్ చేస్తున్నారు. విమానంలోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా బాక్స్‌ను ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ వైమానిక ఏజెన్సీ బీఏ డీకోడ్ చేస్తోందని' పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను జూన్ 22 న పార్లమెంటుకు అందజేస్తామని పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ తెలిపారు. -
'దయచేసి మమ్మల్ని క్షోభ పెట్టకండి'
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన విమాన ఘోర ప్రమాదంలో 97 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలోంచి బాధిత కుటుంబాలు ఇంకా ఇంకా తేరుకోలేకపోతుండగా.. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం(పీఐఏ) మాత్రం వారిని ప్రశ్నలతో వేధిస్తూ మరింత చిత్రవధ చేస్తోంది. "మీకు మృతదేహాలు అందాయా?" అంటూ పదేపదే ఫోన్ చేస్తూ వారిని మానసిక క్షోభకు గురి చేస్తోంది. పీఐఏ తీరుపై మండిపడ్డ అదిల్ రెహ్మాన్ అనే వ్యక్తి ట్విటర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. (‘పైలెట్‌ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’) "ఈ భయంకర ప్రమాదంలో నా తల్లిదండ్రులను కోల్పోయాను. వారి మరణాన్ని నేను అంగీకరిస్తున్నాను. అయితే పీఐఏ చేతిలో మేము అనుభవిస్తున్న నరకం క్షమార్హం కానిది. అధికారులు ఫోన్ చేసి అడిగిన ప్రశ్నే మళ్లీ మళ్లీ అడుగుతూ మమ్మల్ని మరింత బాధకు గురి చేస్తున్నారు. తెల్లవారు జామున 2.30కి కూడా కాల్ చేసి అదే ప్రశ్న సంధిస్తున్నార"ని వాపోయాడు. కాగా రెహ్మాన్ యూఎస్‌లో నివసిస్తున్నాడు. శుక్రవారం లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న విమానం ప్రజానివాస ప్రాంతంలో కుప్పకూలగా, ఈ ప్రమాదంలో అతడి తల్లిదండ్రులు ఫజల్, వలీదా రెహ్మాన్ మరణించారు. వారి మృతదేహాలు ఇప్పటివరకు కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. దీంతో పీఐఏ అధికారులు మృతదేహాలు అందాయో లేదో తెలుసుకునేందుకు పదేపదే ఫోన్లో సంప్రదించడంతో అతడు విసిగిపోయాడు. అదే సమయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది. (ఇద్దరు తప్ప అందరూ..) ఈ విషయం గురించి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ట్యాగ్ చేస్తూ.. "కాస్త మా బాధల్ని అర్థం చేసుకోండి. ఇప్పటికే లాహోర్, కరాచీ ఫోరెన్సిక్ బృందాల మధ్య గొడవ వల్ల మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతోంది. ఈ సమయంలో కొన్ని మృతదేహాలు కూడా దొంగతనానికి గురవుతున్నాయి. అసలు మీకు ఆత్మ అనేదే లేదా?, కనీసం అల్లా అంటే కూడా భయం లేదా? దయచేసి చనిపోయిన మా పేరెంట్స్‌పై దయ చూపండి" అని రెహ్మాన్ ట్విటర్లో వేడుకున్నాడు. ఇప్పటివరకు 41 మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబానికి అందజేసినట్లు పాకిస్తాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. 19 మృతదేహాలను కరాచీ ఆసుపత్రిలో నుంచి వారి బంధువులు బలవంతంగా తీసుకెళ్లడంతో మిగతా మృతుల గుర్తింపు ఆలస్యం అయింది. (కుప్పకూలిన పాక్ విమానం) -
‘పైలెట్‌ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’
కరాచీ: రెండు రోజుల క్రితం పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పైలెట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తాము మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశామని.. కానీ పైలెట్ వాటిని పట్టించుకోలేదన్నారు. లాహోర్ నుంచి కరాచీకి ప్రయాణమైన ఎయిర్ బస్ ఏ-320 విమానం జిన్నా ఇంటరర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఏటీసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటికి భూమికి 7 వేల అడుగుల ఎత్తులో ఉండాల్సిన విమానం కాస్తా.. 10,000 అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు ఎత్తును తగ్గించాలల్సిందిగా పైలెట్‌ను హెచ్చరించారు. కానీ అతడు పట్టించుకోలేదు. (‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’) తర్వాత విమానాశ్రయానికి 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు విమానం ఎత్తు 3 వేల అడుగుల ఎత్తులో ఉండాలల్సింది. కానీ అప్పుడు విమానం 7 వేల అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు మరో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కానీ పైలెట్ మాత్రం ఏం పర్వాలేదని.. తాను హ్యాండిల్ చేయగలనని చెప్పాడు. సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) ఇచ్చిన నివేదిక ప్రకారం పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంజన్ మూడు సార్లు రన్‌వేకు తగిలిందని.. దాంతో ఇంజన్ ట్యాంక్, పంపు దెబ్బతిన్నాయని పేర్కొంది. పైలెట్, ఏటీసీ ఇచ్చిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిసస్థితి అదుపు తప్పిందని.. ఫలితంగా ప్రమాదం ఏర్పడిందని పాకిస్తాన్ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. (కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు) ఇంధనం అయిపోవడం వల్ల ప్రమాదం సంభవించిందని ప్రచారం అవుతున్న వార్తల్ని కొట్టి పారేశారు. అంతేకాక విమానంలో సరిపడా ఇంధనం ఉందని అధికారులు స్పష్టం చేశారు. విమానంలో ఉన్న ఇంధనంతో దాదాపు 2.34 గంటల పాటు ప్రయాణించగలదని.. కానీ ప్రమాద సమయానికి కేవలం 1.30 గంటలపాటే ప్రయాణించిందని అధికారులు తెలిపారు. (ఆ విమానంలో లేను : నటి) -
కుప్పకూలిన విమానం..57 మంది మృతి
-
కుప్పకూలిన పాక్ విమానం
కరాచీ: పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీలో శుక్రవారం మధ్యాహ్నం జనావాస ప్రాంతంలో ప్రయాణికుల విమానం కుప్పకూలింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఈ విమానంలో మొత్తం 99 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎంతమంది చనిపోయారనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఘటనాస్థలం నుంచి 57 మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జఫర్ మసూద్ సహా ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కరోనా లాక్డౌన్ అనంతరం పాకిస్తాన్లో గతవారమే పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను పునఃప్రారంభించారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య లాహోర్ నుంచి వస్తున్న పీకే–8303 విమానం మరికొద్ది క్షణాల్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ కానుండగా, విమానాశ్రయం పక్కనే ఉన్న జిన్నా గార్డెన్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ పీఐఏ ఎయిర్‌బస్ ఏ320 విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 31 మంది మహిళలు, 9మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఏర్పడిందని కూలిపోవడానికి కాసేపటి ముందు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రధాని ఇమ్రాన్ అధికారులను ఆదేశించారు. తక్షణమే సహాయ చర్యల్లో పాలు పంచుకోవాలని ఆర్మీని జనరల్ బజ్వా ఆదేశించారు. విమానం కూలిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమైన దృశ్యాలను స్థానిక వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. ధ్వంసమైన ఇళ్లలో నుంచి పలు మృతదేహాలను వెలికితీశామని పోలీసులు, సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న సిబ్బంది తెలిపారు. అలాగే, పలువురు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామన్నారు. కనీసం 25 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. కాగా, విమానంలో ఎంతమంది ఉన్నారనే విషయంలో అధికారులు వేర్వేరు రకాలైన సమాచారం ఇచ్చారు. అయితే, 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) అధికార ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ వెల్లడించారు. మధ్నాహ్నం 2.37 గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు నిలిచిపోయాయని హఫీజ్ తెలిపారు. సాంకేతిక సమస్య ఏర్పడిందన్న పైలట్ సజ్జాద్ గుల్‌తో.. ల్యాండింగ్‌కు రెండు రన్వేలు సిద్ధంగా ఉన్నాయని కంట్రోల్ టవర్ అధికారులు చెప్పారని పీఐఏ చైర్మన్ అర్షద్ మాలిక్ తెలిపారు. కూలే ముందు విమానం రెక్కల్లో నుంచి మంటలు వచ్చాయని, ఆ తరువాత క్షణాల్లోనే అది ఇళ్లపై కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. -
పాక్ విమాన దుర్ఘటన: మృతదేహాల వెలికితీత
-
పాక్ విమాన దుర్ఘటన: మృతదేహాల వెలికితీత
48 మంది దుర్మరణం అబోటాబాద్ పర్వత ప్రాంతంలో ప్రమాదం ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. బుధవారం అబోటాబాద్ సమీపంలోని పర్వతాల్లో జరిగిన ఈ దుర్ఘటనలో 48 మంది మరణించారు. ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్సులోని చిత్రల్ నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన పీకే-661 అనే విమానం ఇంజిన్‌లో లోపం తలెత్తి హవేలియన్‌లోని పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సమీపాన సద్ధా బటోల్ని గ్రామం దగ్గర్లో కూలిపోయింది. అనంతరం విమానం నుంచి మంటలు పైకి ఎగిశాయని విమానయాన శాఖ అధికారి తెలిపారు. విమాన ప్రమాదాల గురించి తెలిపే ఏవియేషన్ హెరాల్డ్ అనే వెబ్సైట్ కూడా ఇంజిన్‌లో సమస్య వల్లే విమానం కూలిపోయిందని తెలిపింది. విమానంలో ఉన్న వారందరూ చనిపోయారనీ, ఇప్పటిదాకా 36 మృతదేహాలను వెలికితీశామని పాకిస్తాన్ పౌర విమానయాన సంస్థ వెల్లడించింది. పీకే-661 విమానం మధ్యాహ్నం 3.30 గంటలకు చిత్రల్ నుంచి బయలుదేరింది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం సాయంత్రం 4.40 గంటలకు ఇస్లామాబాద్‌లోని బెనజీర్ భుట్టో విమానాశ్రయాన్ని చేరుకోవాల్సి ఉంది. అంతలోనే ఘోర దుర్ఘటన సంభవించింది. ప్రముఖ పాప్ గాయకుడిగా పేరు తెచ్చుకుని తర్వాత ఇస్లాం మత బోధకుడిగా మారిన జునైద్ జంషెద్, ఆయన భార్య కూడా ప్రమాదంలో మృతి చెందారు. 52 ఏళ్ల జునైద్ మత ప్రచారానికి సంబంధించిన పనిపై చిత్రల్కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విమానం పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎరుుర్‌లైన్‌స (పీఐఏ)కు చెందినది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 42 మంది ప్రయాణికులు (వారిలో 9 మంది మహిళలు, ఇద్దరు శిశువులు, ముగ్గురు విదేశీయులు), ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌లు, ముగ్గురు పైలట్లు, ఒక ఇంజినీర్ ఉన్నారు. విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయే కొద్ది సేపటి ముందు.. తాము ప్రమాదంలో ఉన్నామనీ, సహాయం కావాలనే సంకేతాలను పైలట్లు ట్రాఫిక్ నియంత్రణ విభాగానికి పంపారని అధికారులు తెలిపారు. ఈ విమానం పదేళ్ల నుంచి సేవలు అందిస్తోందనీ, మంచి కండిషన్లోనే ఉందని తెలిసింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్లు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలను చేపట్టారు. ప్రమాదం కొండ ప్రాంతంలో జరిగినందున మృతదేహాల తరలింపునకు ఎక్కువ సమయం పడుతోందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. పాక్‌లో గత ప్రమాదాలు ► 2012లో భోజా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్ 737 కూలి 121 మంది మృతి. ► 2010లో ఎయిర్ బ్లూ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ 321 విమానం కూలిపోరుు 152 మంది చనిపోయారు. ►1992లో పీఐఏకు చెందిన ఎయిర్‌బస్ ఏ300 విమానం కూలి 167 మంది మరణించారు. -
భారత్‌కు విమాన సర్వీసులు ఆపేసింది..
కరాచీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో కరాచీ నుంచి ముంబై, ఢిల్లీకి విమాన సర్వీసులను పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) రద్దు చేసింది. ప్రయాణికుల సంఖ్య తగ్గడమే దీనికి కారణమని పేర్కొంది. ఉడీ ఉగ్రదాడుల ప్రభావం విమాన సర్వీసులపైనా పడింది. దీనిపై పీఐఏ శనివారం ఓ ప్రకటన చేసింది. లాహోర్-ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు యాథాతథంగా కొనసాగుతున్నాయని పీఐఏ అధికారి తెలిపారు. గత మూడు, నాలుగు వారాలుగా కరాచీ నుంచి ముంబై, ఢిల్లీకి వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, దీంతో ఆ మార్గాల్లో నడిచే విమానాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే రద్దు చేసిన మార్గాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు వేరే రూట్లలో నడిచే విమానాల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అలాగే భారత్ నుంచి కరాచీ వచ్చే ప్రయాణికులు ఢిల్లీ, ముంబైలోని పీఐఎ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. కాగా భారత్ నుంచి పాకిస్తాన్‌ను నేరుగా వెళ్లేందుకు విమాన సర్వీసులు లేవు. పాక్ ఇంటర్నరేషనల్ ఎయిర్‌లైన్స్ ద్వారానే ఇరు దేశాల మధ్య రాకపోకలు కొనసాగేవి. ఢిల్లీ-కరాచీ, ఢిల్లీ-లాహోర్, ముంబై-కరాచీల మధ్య అయిదు విమానాలు నడిచేవి. పీఐఏ నిర్ణయంతో శనివారం నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. -
ఉగ్రమూక దాడి