పాక్‌ విమాన దుర్ఘటన: మృతదేహాల వెలికితీత | PIA plane crash: 43 bodies recovered; Pakistani pop star on board | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 8 2016 7:18 AM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM

పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. బుధవారం అబోటాబాద్ సమీపంలోని పర్వతాల్లో జరిగిన ఈ దుర్ఘటనలో 48 మంది మరణించారు. ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్సులోని చిత్రల్ నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన పీకే-661 అనే విమానం ఇంజిన్‌లో లోపం తలెత్తి హవేలియన్‌లోని పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సమీపాన సద్ధా బటోల్ని గ్రామం దగ్గర్లో కూలిపోయింది. అనంతరం విమానం నుంచి మంటలు పైకి ఎగిశాయని విమానయాన శాఖ అధికారి తెలిపారు. విమాన ప్రమాదాల గురించి తెలిపే ఏవియేషన్ హెరాల్డ్ అనే వెబ్‌సైట్ కూడా ఇంజిన్‌లో సమస్య వల్లే విమానం కూలిపోయిందని తెలిపింది. విమానంలో ఉన్న వారందరూ చనిపోయారనీ, ఇప్పటిదాకా 36 మృతదేహాలను వెలికితీశామని పాకిస్తాన్ పౌర విమానయాన సంస్థ వెల్లడించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement