plane crash
-
ఫ్రాన్స్ లో గాల్లో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు
-
రన్‌వేపై విమానం బోల్తా
టొరంటో: కెనడాలో టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్ లైన్స్ విమానం రన్‌వేపై దిగుతూ ఒక్కసారిగా బోల్తా పడింది! మంచు తుపాను, బలమైన గాలుల ధాటికి ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 80 మంది అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే 18 మంది గాయపడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విమానం బోల్తా పడ్డ తీరు, అందులోంచి ప్రయాణికులు సురక్షితంగా బయట కొస్తున్న వీడియోలు, అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు సిబ్బంది నురగ స్ప్రే చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ప్రమాదంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రతికూల వాతావరణం...వాతావరణ ఇబ్బందులతో పియర్సన్ విమానాశ్రయంలో కొన్ని రోజులుగా విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. బుధ, ఆదివారాల్లో రెండు తుపాన్లు నగరాన్ని 50 సెంటీమీటర్ల మంచుతో కప్పేశాయి. వారాంతంలోనైతే విమానాశ్రయంలో 22 సెంటీమీటర్లకు పైగా మంచు కురిసింది. ప్రమాద సమయంలోనూ తేలికపాటి మంచు కురిసినట్లు సమాచారం.ప్రాణాలతో ఎలా బయటపడ్డరంటే?విమానం పరిమాణం, సీట్ బెల్ట్, ఇంజనీరింగ్ నైపుణ్యం తదితరాలే టొరంటో ప్రమాదంలో ప్రయాణికులను కాపాడినట్టు నిపుణులు చెబుతున్నారు. విమానాలు తలకిందులవడం చాలా అరుదు. అలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కొనేలా డెల్టా విమానాన్ని రూపొందించారు. విమానంలోని సీట్లు గురుత్వాకర్షణ శక్తికి పదహారు రెట్లు ఎక్కువ శక్తిని కూడా తట్టుకునేలా ఉంటాయి. విమానం బోల్తా పడ్డా ప్రయాణికులు మాత్రం స్థిరంగా ఉండేలా, వారిని కట్టిపడేసేలా సీట్లను రూపొందిస్తారు.అందుకే టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విధిగా సీటు బెల్టులు ధరించేలా చూస్తారు. విమానం తలకిందులయితే రెక్కలు, తోకభాగం మాత్రమే విచ్ఛిన్నమయ్యేలా నిర్మాణం ఉంటుంది. ఇలాంటప్పుడు విమాన సిబ్బంది పాత్ర చాలా కీలకం. ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు వీలుగా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా వారికి శిక్షణ ఇస్తారు. సాధారణ సమయాల్లో ఫ్లైట్ అటెండెంట్లు మాత్రమే అయినా ఇలాంటప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తారు. విమానం కూలగానే ప్రయాణికులను సిబ్బంది హుటాహుటిన ఖాళీ చేయిస్తున్న దృశ్యాలు దీనికి నిదర్శనం. అత్యవసర సిబ్బంది కూడా క్షణాలపై స్పందించారు. ఆలస్యం చేయకుండా మంటలను ఆర్పేసి పెను ప్రమాదాన్ని నివారించారు.సైజూ కలిసొచ్చింది...ప్రమాదానికి గురైన బొంబార్డియర్ సీఆర్జే 900 విమానం చిన్నగా ఉంటుంది. ప్రయాణికులు ప్రా ణాలతో బయట పడేందుకు ఇది కూడా కారణమే. కేబిన్ ఎత్తు కేవలం ఆరడుగులే. దాంతో బోల్తా పడ్డా ప్రయాణికులు ఎక్కువ దూరం పడిపోరు. -
US Air Crash: పెళ్లి కావాల్సిన పైలట్, ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం!
అమెరికాలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ ( Ronald Reagan Airport)వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా కలకల రేపింది. పాతికేళ్లలో లేని విధంగా అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదంగా దీన్ని భావిస్తున్నారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రాంతీయ జెట్ - యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో తొందరలో పెళ్లి కొడుకుగా ముస్తాబవ్వాల్సిన పైలట దుర్మరణం పాలయ్యాడు. ఒక్కొక్క మృతదేహాన్ని గుర్తిస్తున్న కొద్దీ అనేక హృదయ విదారక కథనాలు పలువురి మనసుల్ని కకావికలం చేస్తున్నాయి. ఫస్ట్ ఆఫీసర్ సామ్ లిల్లీ ,కెప్టెన్ జోనాథన్ కాంపోస్భారతీయ కుటుంబానికి చెందినయువతితో పాటు తన వివాహం కోసం ఎదురుచూస్తున్నఫస్ట్ ఆఫీసర్ సామ్ లిల్లీ మరణం వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం సురక్షితమైన ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాలముందు, ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు , విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ వర్జీనియాలోని పోటోమాక్ నదిలో పడిపోయారు. వీరిలో విమాన సిబ్బంది ఫస్ట్ ఆఫీసర్ సామ్ లిల్లీ (28) ,కెప్టెన్ జోనాథన్ కాంపోస్ కూడా ఉన్నారు. దీంతొ సామ్ తండ్రి ఆవేదన వర్ణనాతీంగా ఉంది.లిల్లీ తండ్రి తిమోతి లిల్లీ గురువారం ఫేస్బుక్ పోస్ట్‘‘సామ్ పైలట్ అయినప్పుడు నేను చాలా గర్వపడ్డాను..ఇప్పుసలు నిద్ర పట్టడంలేదు. చాలా బాధగా ఉంది, ఏడ్చే శక్తి కూడాలేదు. నేను వాడిన ఇక చూడలేనని తెలుసు నా గుండె బద్దలైపోతోంది." అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్లో, వ్యక్తిగత జీవితంలో గొప్పగా రాణిస్తున్నాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసు కోబోతున్నాడు. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. తన జీవితంలో ఇంతకంటే బాధకరమైన రోజు మరొకటి ఉండదు అంటూ విలపించారు. ఆర్మీ పైలట్ ఘోరమైన తప్పు చేశాడంటూ 20 ఏళ్ల పాటు ఆర్మీలో హెలికాప్టర్ పైలట్‌గా పనిసిన తిమోతి వాపోయారు.అటు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమాన కెప్టెన్ జోనాథన్ కాంపోస్ మరణంపై తోటి పైలట్లు సంతాపం ప్రకటించారు. కాంపోస్ 2022లో ఎయిర్‌లైన్‌కు కెప్టెన్ అయ్యాడని గుర్తు చేసుకున్నాడు. కాంపోస్ చాలా అద్భుతమైన వ్యక్తి అని, విమాన ప్రయాణాలంటే చాలా ఇష్టపడేవాడని, కుటుంబం అంటే ఎనలేని ప్రేమ అని కుటుంబం సభ్యుడొకరు కంట తడిపెట్టారు.ఇయాన్ ఎప్స్టీన్53 ఏళ్ల ఇయాన్ ఎప్స్టీన్ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో విమాన సహాయకుడిగా ఉన్నాడు, ఈ ఘోర ప్రమాదంలో చనిపోవడంపై అతని సోదరి రాబీ బ్లూమ్ విచారాన్ని ప్రకటించారు. "నా సోదరుడు చాలా అద్భుతమైన వ్యక్తి. జీవితాన్ని ప్రేమించాడు. ప్రయాణాలంటే ఇష్టం. అందుకే తన ఉద్యోగాన్ని కూడా ప్రేమించాడు. అతను వెళ్ళిన ప్రతిచోటా స్నేహితులను తయారు చేసుకునేవాడు. ఇలా అర్థాంతరంగా కుటుంబానికి దూరం కావడం విషాదం అంటూ బ్లూమ్ చెప్పారు.ట్రిప్‌కు వెళ్లిన ఏడుగురు స్నేహితుల విషాదాంతంమైఖేల్ “మైకీ” స్టోవాల్ ,జెస్సీ పిచర్, ఇతర స్నేహితులతో కలిసి, కాన్సాస్కు విహారానికి వెళ్లారు. అక్కడ కొన్ని రోజుల గడిపి తిరిగి ఇంటికి తిరిగి వస్తూ, తిరిగి రాని లోకాలకు తరలిపోయారు.మైకీకి అజాత శత్రువు. అందర్నీ ప్రేమిస్తాడు. చాలా హ్యాపీగా జీవనం సాగించే మనషి, కొడుకుగా, తండ్రిగా చాలా మంచివాడు స్టోవాల్ తల్లి క్రిస్టినా స్టోవాల్ కన్నీరుమున్నీరైంది. పిచర్కు పెళ్లి అయ్యి ఏడాది మాత్రమే. కొత్త ఇల్లు కట్టుకోవాలనే ప్లాన్‌లో ఉన్నాడు. తనలాంటి కష్టం మరే తండ్రికి రాకూడదంటూ పిచర్ తండ్రి జేమ్సన్ పిచర్ చెప్పారు. ఇదీ చదవండి: US air crash: భారతీయ యువతి లాస్ట్ మెసేజ్ భర్త కన్నీరుమున్నీరుముగ్గురు యువ స్కేటర్లు , ఒక కోచ్ డెలావేర్కు చెందిన యూత్ స్కేటర్లు సీన్ కే, ఏంజెలా యాంగ్, కోచ్ అలెగ్జాండర్ “సాషా” కిర్సనోవ్ ఈ ప్రమాదంలో మరణించారని రాష్ట్ర సెనెటర్ క్రిస్ కూన్స్ ధృవీకరించారు.పుట్టిన రోజునే మరణించినఎలిజబెత్ కీస్ : ఎలిజబెత్ కీస్ ఒక న్యాయవాది,34వ పుట్టినరోజున ప్రమాదంలో తనకు దూరమైందని ఆమె భర్త డేవిడ్ సీడ్మాన్ చెప్పారు -
US air crash: భారతీయ యువతి లాస్ట్ మెసేజ్ భర్త కన్నీరుమున్నీరు
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రాంతీయ జెట్, యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారిలో భారతీయు యువతి ఉండటం విషాదాన్ని నింపింది. 2001 తర్వాత అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంలో భావిస్తున్న ఈ ఉదంతంలో 67 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అమెరికా రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ ( Ronald Reagan Airport)వద్ద జరిగిన ఘోర విమాన26 ఏళ్ల అష్రాహుస్సేన్ రజా (Ashra Hussain Raja) కూడా చనిపోయారు. దీంతో బాధితుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆమె భర్త, హమాద్ స్నేహితుల మధ్య శోకసంద్రంలో మునిగిపోయారు. మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ విమానం అవుతుందనగా ఈ ఘోరం జరిగింది.భారతీయ వలసదారుల కుమార్తె అయిన హుస్సేన్ రజా 2020లో ఇండియానా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది .ఆగస్టు 2023లో స్నేహితుడు హమాద్ను ప్రేమ వివాహం చేసుకుంది. వాషింగ్టన్ డీసీలో కన్సల్టెంట్‌గా (consultant in Washington, DC)ఉద్యోగం చేస్తున్నారని ఆమె మరణం తమకు తీరని లోటని ఆమె మామ డాక్టర్ హాషిమ్ రాజా(Dr.Hashim Raja) విషాద వదనంతో చెప్పారు. విద్యాపరంగా చాలా తెలివైనది. అద్భతుంగా వంట చేస్తుంది. నా కొడుకుకు ప్రాణ స్నేహితురాలు" అని అస్రా హుస్సేన్ మామ హషీమ్ రజా అన్నారు. వైద్యుడిగా చాలామందికి వైద్యం చేశాను, సలహాలిచ్చాను చాలా మరణాలను చూశాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు.ఆమె అక్కడ ఒక ఆసుపత్రి కోసం టర్నరౌండ్ ప్రాజెక్ట్‌లో పని చేయడానికి నెలకు రెండుసార్లు విచితకు ప్రయాణించిందని చెప్పారు. తన కెరీర్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. నైట్ షిప్ట్‌లలో మేల్కొని ఉండేందుకు తరచుగా తనకి ఫోన్ చేసేదని, అందరి కోసం ఆలోచించేదని .ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించేది” అని ఆయన తెలిపారు. మరోవైపు భార్య అష్రా తనకు పంపిన మెసేజ్‌ను తలుచుకుంటూ భర్త హమాద్ రాజా కన్నీరు మున్నీరవుతున్నారు. “మేం 20 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నాం” అని ఆమె మెసేజ్ చేసిందని, ఆమె కోసం ఎయిర్‌పోర్ట్‌లో ఎదురు చూస్తుండగానే అంతా జరిగిపోయిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఇదంతా ఒక పీడకలలా ఉంది” అంటూ హమాద్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. నిజానికి ఒక రోజు ఆమె రావాల్సి ఉంది.. కానీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. ఇందుకేనేమో అంటూ కంటతడిపెట్టుకన్నారు. ఇలాంటి ప్రమాదాల గురించి వినడమేగానీ,తమ జీవితాల్లో ఇంత విషాదం ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ విలపించారు. -
అమెరికాలో మరో విమాన ప్రమాదం..
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియా రాష్ట్రంలో విమానం ఇళ్లపై కూలిపోయింది. దీంతో, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్టు సమాచారం. ఇక, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. అమెరికాలోని ఈశాన్య ఫిలడెల్ఫియాలో విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్ సమీపంలో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇళ్లపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. విమానం కూలిపోయిన వెంటనే భారీ పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందినట్టు సమాచారం. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. First hand video of what happened in northeast Philadelphia pic.twitter.com/LJt912Tw6l— Darren Minto (@FB_Darren) February 1, 2025ప్రమాదానికి గురైన విమానాన్ని లీఆర్‌జెట్ 55గా గుర్తించారు. విమాన ప్రమాదం నేపథ్యంలో పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ శాప్రియా స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే, విమానం మిస్సోరీ వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురైనట్టు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల రోడ్లను మూసివేసి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, సాంకేతిక లోపం కారణంగానే విమాన ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇక, ఫెలడెల్ఫియా ఎయిర్‌పోర్టు నుంచి బిజినెస్ సంబంధిత జెట్స్, చిన్న విమానాలు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. 🚨BREAKING: A small plane fell out of the sky in Northeast Philadelphia.Wow, less than 2 weeks in trump's America, egg prices through the roof, tariffs making other prices skyrocket, and planes falling out of the sky.MAGA: Making America Gross Againpic.twitter.com/yiLjKYyaAB— BrooklynDad_Defiant!☮️ (@mmpadellan) February 1, 2025ఇదిలా ఉండగా.. శుక్రవారం ఉదయమే అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అరుదైన రీతిలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీకొని, నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 64 మంది ప్రయాణీకులు మృతిచెందారు. ఈ దుర్ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌లో సిబ్బంది కొరత కూడా ప్రమాదానికి ఓ కారణంగా తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లను, విమానాలను ఒకే కంట్రోలర్ ఏకకాలంలో నియంత్రించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ పనులకు ఇద్దరు విధుల్లో ఉండాలి. కానీ, ఒకరు మాత్రమే ఉన్నారని ఇంటర్నేషనల్ ప్రిలిమినరీ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
అమెరికా విమాన ప్రమాదం.. ఒబామా, బైడెన్‌పై ట్రంప్ సీరియస్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర విమాన ప్రమాదం కారణంగా 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వాషింగ్టన్ సమీపంలో ప్యాసింజర్ విమానం, హెలికాప్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాల ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రమాదానికి గత అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్ పాలసీ విధానాలే కారణమని కామెంట్స్ చేశారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా విమాన ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేపడుతామని, మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో అమెరికాలో గత అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్లు ఆకాశ భద్రతా ప్రమాణాలకు సంబంధించి రాజీపడ్డారు. కానీ, మేము మాత్రం భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఒబామా, బైడెన్, ఇతర డెమొక్రాట్లు తమ విధానాలకే మొదటి ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. వారు కొందరికే ప్రాధాన్యత ఇచ్చారని, మేము సమర్థులైన వారినే కావాలనుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎఫ్ఏఏకు తాత్కాలిక కమిషనర్‌ను నియమిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.ఇదే సమయంలో సుపీరియర్ ఇంటెలిజెన్స్ అవసరం అయ్యే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో అనర్హులను నియమించినట్లు ట్రంప్ విమర్శించారు. గతవారం తాను సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ప్రమాణాల పునరుద్ధరణ సైతం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని ప్రకటించారు. ఈ ప్రమాదం చాలా మందిని కుదిపేసిందన్నారు. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోని ప్రజలపై దీని ప్రభావం ఉందని తెలిపారు. అలాగే, ప్రమాదంలో బాధితుల కోసం నిరంతరం శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌ను అభినందించారు.ఇక, అంతకుముందు.. బాధితులకు ట్రంప్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా కాసేపు మౌనం పాటించారు. అలాగే, విమాన ప్రమాదానికి సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ఈ ప్రమాదం తనను ఎంతో వేదనకు గురిచేసిందన్నారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో జరిగిన సంభాషణల టేపులను తాను విన్నానని తెలిపారు. విమానం సరైన మార్గంలోనే వెళ్లిందని, పైలట్ తప్పిదం లేదని పేర్కొన్నారు. అయితే అదేసమయంలో హెలికాప్టర్ అదే ఎత్తులో ఎగిరిందని, దీంతో పెను ప్రమాదం జరిగినట్లు తెలిపారు. -
నల్లపెట్టె మౌనరాగం!
నల్ల రంగులో ఉండదు. పేరు మాత్రం బ్లాక్ బాక్స్. ‘డెత్ కోడ్’ను తనలో గోప్యంగా దాచుకుంటుంది. నిజానికిది ఒక్క బాక్సు కూడా కాదు. రెండు పెట్టెలు! విమానం కూలిందంటే అందరి కళ్లూ దానికోసమే చూస్తాయి. రికవరీ బృందాలు దాని వేటలో నిమగ్నమవుతాయి. అది దొరికితే ప్రమాద కారణాలు తెలిసినట్టే. కానీ ఇటీవల బ్లాక్‌బాక్సులు తరచూ విఫలమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.గాలిలో ప్రయాణం ఎప్పుడూ గాల్లో దీపమే. రన్ వే నుంచి ఎగిరిన విమానం క్షేమంగా కిందికి దిగేదాకా టెన్షనే. వైమానిక దుర్ఘటనలకు కచి్చతమైన కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ చిక్కాలి. అందులో ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) అని రెండు భాగాలుంటాయి. వీటిని ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. సులభంగా గుర్తు పట్టేందుకు వీలుగా అవి ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉంటాయి. బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా ప్రమాదాల్లో తక్కువ నష్టం జరిగే తోక భాగంలో అమర్చుతారు. ఎఫ్డీఆర్ సెకన్ల వ్యవధిలో దాదాపు వెయ్యి పరామితులను నమోదు చేస్తుంది. ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు, ప్రయాణ మార్గం, దిశ తదితరాలను రికార్డు చేస్తుంది. ఇక సీవీఆర్ పైలట్ల సంభాషణలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు వారు పంపిన, స్వీకరించిన సమా చారం, కాక్‌పిట్ శబ్దాల వంటివాటిని నమోదు చేస్తుంది. కనుక విమాన ప్రమాదాలకు దారితీసిన కారణాలు, చివరి క్షణాల్లో మార్పులు తదితరాలను బ్లాక్ బాక్స్ మాత్రమే వెల్లడించగలదు. దాని డేటాను విశ్లేషించి ప్రమాద కార ణంపై పరిశోధకులు అంచనాకు వస్తారు. ఇంత కీలకమైన ఈ ‘నల్ల పెట్టె ఇటీవల మొండికేస్తుంది. మూగనోము పడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘జెజు ఎయిర్’విమానం గత నెల 29న కూలిపోయి ఇద్దరు మినహా 179 దుర్మరణం పాలవడం తెలిసిందే. కూలడానికి నాలుగు నిమిషాల ముందు నుంచే అందులోని ఫ్లైట్ రికార్డర్లు పని చేయడం మానేశాయి. దాంతో దర్యాప్తు క్లిష్టంగా మారింది.వైఫల్యానికి కారణాలివీ...బ్లాక్ బాక్సులోని రెండు రికార్డర్లు 4.5 కిలోలుంటాయి. గురుత్వశక్తి కంటే 3,400 రెట్లు అధిక శక్తితో విమానం కూలినా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతనూ కాసేపటిదాకా భరించగలదు. సము ద్రంలో కూలినా హై పిచ్ శబ్దాలతో 90 రోజులపాటు సంకేతాలు పంపగలదు. 20 వేల అడుగుల లోతులోనూ నెల పాటు పని చేయగలదు. దొరికాక కీలక డేటా, ఆడియో చెరిగిపోకుండా జాగ్రత్తగా వివరాలు సేకరిస్తారు. డేటాను డౌన్లోడ్ చేసి కాపీ చేస్తారు. దాన్ని డీకోడ్ చేసి గ్రాఫ్స్ రూపొందిస్తారు. అయితే... → సర్క్యూట్ పాడవటం, సెన్సర్లు విఫ లమవడం తదితర సాంకేతిక అవరోధాలు, సాఫ్ట్వేర్ లోపాలు తలెత్తినప్పుడు బ్లాక్ బాక్సు పనిచేయదు. → ప్రమాద తీవ్రత విపరీతంగా ఉండి భౌతికంగా ధ్వంసమైనప్పుడు కూడా దానిపై ఆశ వదిలేసుకోవాల్సిందే. → విమాన సిబ్బంది ఉద్దేశపూర్వకంగా డీ యాక్టివేట్ చేసినా బ్లాక్‌బాక్స్ పనిచేయడం మానేస్తుంది. → డేటా ఓవర్ లోడ్ అయినప్పుడు కూడా మొరాయిస్తుంది. → కొన్ని పాత బ్లాక్ బాక్సుల్లో నిరీ్ణత కా లం తర్వాత డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. దాంతో వాటినుంచి ఎ లాంటి సమాచారమూ లభించదు. నిరుడు జనవరిలో అలస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం ప్రయాణ సమయంలో తలుపు ఊడటంతో సీవీఆర్ పూర్తిగా ఓవర్ రైట్ అయింది. దాని నుంచి డేటా లభ్యం కాలేదు. → అత్యుష్ణ, అత్యల్ప ఉష్ణోగ్రతలు, ఎక్కువ కాలం నీటిలో నానడం వల్ల కూడా ఫ్లైట్ రికార్డర్లు పాడవుతాయి. → తేమ చేరి సున్నిత భాగాల్లో పరికరాలు దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ కావడం, అత్యధిక ఎత్తుల్లో పీడనం, పక్షులు ఢీకొనడం, పిడుగుపాట్లు వంటి వాటి వల్ల కూడా బ్లాక్ బాక్సు పనిచేయకపోవచ్చు. పదేళ్లుగా జాడ లేని మలేసియా విమానం! నిజానికి ఫ్లైట్ రికార్డర్ల సామర్థ్యం పెంచాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఖర్చు, పరిమితుల దృష్ట్యా అది ఆలస్యమవుతోంది. అత్యవసర సందర్భాల్లో ఫ్లైట్ రికార్డర్లు పనిచేయాలంటే వాటికి విమానంలో ప్రత్యేక వ్యవస్థల నుంచి పవర్ సరఫరా తప్పనిసరి. రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు విమానమంతటా ఎలక్ట్రికల్ పవర్ నిలిచిపోతుంది. 1999లో న్యూయార్క్ నుంచి కైరో వెళుతున్న ‘ఈజిప్ట్ ఎయిర్’విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 217 మంది మరణించారు. ఎలక్ట్రికల్ పవర్ ఆగిపోగానే దాని ఫ్లైట్ రికార్డర్లు పని చేయడం మానివేశాయి. దాంతో, విమానం లోపల సాధారణ అవసరాల కరెంటుపై ఆధారపడకుండా ఫ్లైట్ రికార్డర్లు 10 నిమిషాలు అదనంగా రికార్డింగ్ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయ బ్యాకప్ పవర్ ఏర్పాట్లుండాలని అమెరికా జాతీయ రవాణా సేఫ్టీ బోర్డు సిఫార్సు చేసింది. బ్లాక్ బాక్సుల బ్యాకప్ బ్యాటరీల జీవితకాలం తక్కువ. కొన్ని సందర్భాల్లో పనే చేయవు. దక్షిణ కొరియా ‘జెజు ఎయిర్’విమానంలోనూ విద్యుత్ వ్యవస్థ విఫలమై ఫ్లైట్ రికార్డర్లకు పవర్ అందక మూగవోయాయని భావిస్తున్నారు. సీవీఆర్ ఒక విడతలో రెండు గంటలపాటు మాత్రమే రికార్డు చేయగలదు. ఆ డేటానే రిపీట్ చేస్తుంది. రికార్డింగ్ నిడివిని 25 గంటలకు పెంచాలన్న డిమాండ్ కార్యరూపం దాలుస్తోంది. 2009లో ఎయిర్ ఫ్రాన్స్ విమానం బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళ్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 228 మంది చనిపోయారు. మలేసియా ఎయిర్‌లైన్స్ ఎంహెచ్ 370 విమానానిదైతే ఇప్పటికీ అంతు లేని వ్యథే! 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ అకస్మాత్తుగా రాడార్ తెర నుంచి అదృశ్యమైంది. మొత్తం 239 మందీ మరణించారని భావిస్తున్నారు. విమానం ఎందుకు, ఎలా అదృశ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. వైమానిక చరిత్రలోనే ఇదో పెద్ద మిస్టరీ. విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిందని అనుమానిస్తున్నారు. దాని జాడ కోసం మళ్లీ అన్వేషణ చేపట్టాలని మలేసియా తాజాగా నిర్ణయించింది. ‘ఎయిర్ ఫ్రాన్స్’దుర్ఘటన దరిమిలా మహా సముద్రాలను దాటి ప్రయాణించే విమానాల కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల డేటా రికార్డింగ్ తప్పనిసరి చేయాలని ఫ్రాన్స్ సిఫార్సు చేసింది. అమెరికా కూడా దీన్ని చట్టంలో చేర్చింది. కానీ కొత్తగా తయారయ్యే విమానాల్లోనే ఈ మార్పులకు వీలుంది. పాతవాటిలో సాధ్యపడటం లేదు. ఇప్పుడు తిరిగే చాలా విమానాల జీవిత కాలం 40–50 ఏళ్లు! కొత్త టెక్నాలజీతో బ్లాక్ బాక్సులు! తాజా సవాళ్లు, మారిన సాంకేతికత నేపథ్యంలో అధునాతన రీతిలో సరికొత్త బ్లాక్ బాక్సుల కు పకల్పన జరుగుతోంది. ఎక్కువ గంటల రికార్డింగ్, అధిక డేటా స్టోరేజీ, బ్యాకప్ బ్యాటరీల జీవితకాలం పెంపు వంటివి వీటిలో ప్రధానాంశాలు. ప్రమా ద తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సమర్థంగా పనిచేసే బ్లాక్ బాక్సులూ రానున్నాయి. సముద్రాల్లో కూలినప్పుడు తక్కువ శ్రమతో సత్వరం గుర్తించే అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. ముఖ్యంగా, డేటాను రియల్ టైమ్‌లో పంపే బ్లాక్ బాక్సులు రానున్నాయి. తద్వారా కీలక సమాచారం వెంటనే గ్రౌండ్ స్టేషనుకు చేరుతుంది కనుక ప్రమాదంలో బ్లాక్ బాక్స్ నాశనమైనా ఇబ్బంది ఉండబోదు. – జమ్ముల శ్రీకాంత్ -
‘నల్ల పెట్టె’ మౌనరాగం!
బ్లాక్ బాక్స్... చూసేందుకు నల్ల రంగులో ఉండదు. ‘డెత్ కోడ్’ను రహస్యంగా తనలో దాచుకుంటుంది. ఈ బాక్స్ ఒకటి కూడా కాదు. నిజానికి రెండు పెట్టెలు! విమానం కూలిపోతే అందరి కళ్లూ దానికోసమే చూస్తాయి. రికవరీ బృందాలు దాని వేటలో నిమగ్నమవుతాయి. అది దొరికితే చాలు... ప్రమాద కారణాలు తెలిసినట్టే. ఆ తప్పులు, లోపాలు పునరావృతమవకుండా జాగ్రత్తపడితే భవిష్యత్ ప్రమాదాలను నివారించవచ్చు. విమానయానాన్ని అందరికీ సురక్షితం చేయవచ్చు.గాలిలో ప్రయాణం గాలిలో దీపం. రన్ వే మీది నుంచి పైకి ఎగిరిన విమానం మళ్లీ క్షేమంగా కిందికి దిగేదాకా టెన్షనే. వైమానిక దుర్ఘటనలకు కారణాలు తెలియాలంటే, కచ్చితమైన ఆధారాలు కనుగొనాలంటే తొలుత దాని బ్లాక్ బాక్స్ పరిశోధకుల చేతికి చిక్కాలి. అందుకే దర్యాప్తు సంస్థలు ముందుగా దాని అన్వేషణ కోసం రంగంలోకి దిగుతాయి. బ్లాక్ బాక్స్ వాస్తవానికి రెండు భాగాలు. అవి ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్). వీటిని ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. బ్లాక్ బాక్స్ పేరుకు తగ్గట్టుగా ఇవి నల్ల రంగులో ఉండవు! ప్రమాద స్థలిలో సులభంగా గుర్తుపట్టగలిగేలా ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉంటాయి.విమానం కూలిపోయినప్పుడు ఆ నష్ట ప్రభావం దాని తోకభాగంపై స్వల్పంగా పడుతుంది. అందుకే కీలక డేటా నిక్షిప్తమైన బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా దాన్ని విమానం తోక భాగంలో అమర్చుతారు. సెకన్ల వ్యవధిలో ఎఫ్డీఆర్ దాదాపు వెయ్యి పరామితులను నమోదు చేస్తుంది. ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ఎగురుతోంది? ఇంజిన్ పనితీరు ఎలా ఉంది? ప్రయాణ మార్గం, దిశ వంటి వివరాలను అది నమోదు చేస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రానికి పైలట్లు పంపిన, స్వీకరించిన సమాచారమేంటి? పైలట్ల సంభాషణలు, విమానంలోని కాక్‌పిట్ శబ్దాలు వంటి వివరాలను సీవీఆర్ రికార్డు చేస్తుంది.విమాన ప్రమాదాలకు దారితీసిన కారణాలేమిటి? దుర్ఘటన చివరి నిమిషాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి? అనే వివరాలను బ్లాక్ బాక్స్ మాత్రమే వెల్లడించగలదు. ఫ్లైట్ రికార్డర్ల డేటాను విశ్లేషించి ప్రమాద హేతువులపై పరిశోధకులు ఓ అంచనాకు వస్తారు. మరి దర్యాప్తులో ఇంత కీలకమైన ఈ ‘నల్ల పెట్టె’… తాను మాట్లాడబోనంటూ అప్పుడప్పుడు మొండికేస్తుంది. కావాల్సిన డేటా ఇవ్వకుండా మొరాయించి ఇన్వెస్టిగేటర్లను ముప్పుతిప్పలు పెడుతుంది. క్లిష్ట సమయాల్లో రహస్యాలు బయటికి చెప్పకుండా మూగనోము పడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘జెజు ఎయిర్’ విమానం గత నెల 29న కూలిపోయి ఇద్దరు మినహా 179 మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమానం కూలడానికి నాలుగు నిమిషాల ముందు నుంచే అందులోని ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి. దాంతో ఆ దుర్ఘటన దర్యాప్తు ప్రస్తుతం క్లిష్టంగా మారింది. దక్షిణ కొరియా విమానంలోని బ్లాక్ బాక్స్ ఎందుకు విఫలమైంది? బ్లాక్ బాక్సులు ఇలా విఫలమైన సందర్భాలు గతంలో ఉన్నాయా? అందుకు దారితీసే కారణాలేంటి? ఈ సమస్యను అధిగమించేదేలా? వివరాలు మీకోసం... వైఫల్యానికి కారణాలివీ...బ్లాక్ బాక్సులో భాగమైన రెండు ఫ్లైట్ రికార్డర్ల బరువు సుమారు 4.5 కిలోల దాకా ఉంటుంది. గురుత్వశక్తి కంటే 3,400 రెట్ల అధిక శక్తితో విమానం కూలుడు సంభవించినా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతనూ కొంతసేపు భరించగలదు. విమానం సముద్రంలో కూలినా తానెక్కడున్నదీ తెలిపేలా హై పిచ్ శబ్దాలతో బ్లాక్ బాక్స్ 90 రోజులపాటు సంకేతాలు పంపగలదు. నీటిలో 20 వేల అడుగుల లోతులోనూ 30 రోజులు పనిచేయగలదు. దానిలోని కీలక డేటా, ఆడియో చెరిగిపోకుండా టెక్నీషియన్లు జాగ్రత్తగా వివరాలు సేకరిస్తారు. డేటాను డౌన్లోడ్ చేసుకుని కాపీ చేస్తారు. అనంతరం డేటాను డీకోడ్ చేసి గ్రాఫ్స్ రూపొందిస్తారు. సర్క్యూట్ పాడవటం, సెన్సర్లు విఫలమవడం తదితర సాంకేతిక అవరోధాలు, సాఫ్ట్వేర్ (Software) లోపాలు తలెత్తినప్పుడు బ్లాక్ బాక్సులు పనిచేయవు.ప్రమాద తీవ్రత విపరీతంగా ఉండి భౌతికంగా ధ్వంసమైనప్పుడు వాటిపై ఆశ వదిలేసుకోవాల్సిందే. విమాన సిబ్బంది ఉద్దేశపూర్వకంగా డీ-యాక్టివేట్ చేసినప్పుడు అవి పనిచేయడం మానివేస్తాయి. డేటా ఓవర్ లోడ్ (Overload) అయినప్పుడు కూడా అవి మొరాయిస్తాయి. కొన్ని పాత బ్లాక్ బాక్సుల్లో నిర్ణీత కాలం తర్వాత డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. ఫలితంగా వాటి నుంచి ఎలాంటి సమాచారం లభించదు. నిరుడు జనవరిలో అలస్కా ఎయిర్‌లైన్స్ (airlines) బోయింగ్ విమానం ప్రయాణ సమయంలో దాని తలుపు ఊడినప్పుడు (డోర్ ప్లగ్ బ్లో-అవుట్) సీవీఆర్ పూర్తిగా ఓవర్ రైట్ అయింది. దాని నుంచి డేటా లభ్యం కాలేదు. అత్యుష్ణ లేదా అత్యల్ప ఉష్ణోగ్రతలు, నీటిలో ఎక్కువ కాలం నానడం వల్ల కూడా ఫ్లైట్ రికార్డర్లు పాడవుతాయి. తేమ చేరుకుని సున్నిత భాగాల్లోని ఎక్విప్మెంట్ దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ కావడం, అత్యధిక ఎత్తుల్లోని పీడనం, పక్షులు ఢీకొనడం, పిడుగుపాట్లు వంటి వాటి వల్ల కూడా బ్లాక్ బాక్సులు పనిచేయకపోవచ్చు. పదేళ్లుగా జాడ లేని మలేసియా విమానం!ఫ్లైట్ రికార్డర్ల సామర్థ్యంపై కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. ఆవశ్యకత ఎంతో ఉన్నా ఖర్చు, పరిమితుల దృష్ట్యా వాటి సామర్థ్యం పెంపు అంశంలో కొంత జాప్యం సంభవిస్తోంది. అత్యవసర సందర్భాల్లో ఫ్లైట్ రికార్డర్లు పనిచేయాలంటే వాటికి విమానంలోని సాధారణ సిస్టమ్స్ నుంచి కాకుండా వేరే వ్యవస్థల నుంచి పవర్ సరఫరా తప్పనిసరి. విమానంలోని రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు విమానం అంతటా ఎలక్ట్రికల్ పవర్ నిలిచిపోతుంది. 1999లో న్యూయార్క్ నుంచి కైరో వెళుతున్న ‘ఈజిప్ట్ ఎయిర్’ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి అందులోని 217 మంది మరణించారు. ఈ విమానంలో ఆన్‌బోర్డ్ (onboard) ఎలక్ట్రికల్ పవర్ ఆగిపోగానే ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి.విమానం లోపల సాధారణ అవసరాలకు సరఫరా అయ్యే కరెంటుపై ఆధారపడకుండా ఫ్లైట్ రికార్డర్లు మరో 10 నిమిషాలపాటు అదనంగా రికార్డింగ్ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయ బ్యాకప్ పవర్ ఏర్పాట్లు ఉండాలని సదరు ప్రమాదం దరిమిలా అమెరికా జాతీయ రవాణా సేఫ్టీ బోర్డు సిఫార్సు చేసింది. బ్లాక్ బాక్సులకు బ్యాకప్ బ్యాటరీలున్నా వాటి జీవితకాలం తక్కువ. ఆ బ్యాటరీలు కొన్ని సందర్భాల్లో పనిచేయవు. దక్షిణ కొరియా ‘జెజు ఎయిర్’ విమానంలోనూ విద్యుత్ వ్యవస్థ విఫలమవడంతో ఫ్లైట్ రికార్డర్లకు పవర్ అందక అవి పనిచేయడం మానివేసి ఉంటాయని భావిస్తున్నారు.ఇక సీవీఆర్ విషయానికొస్తే అది సాధారణంగా ఒక విడతలో గరిష్ఠంగా రెండు గంటలపాటు మాత్రమే రికార్డు చేయగలదు. ఆ రెండు గంటల్లో రికార్డయిన డేటానే అది రిపీట్ చేస్తుంది. ఈ రికార్డింగ్ నిడివిని 25 గంటలకు పెంచాలనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న డిమాండ్. ఇది ప్రస్తుతం కార్యరూపం దాలుస్తోంది. 2009లో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 రియో డి జెనీరో (బ్రెజిల్) నుంచి ప్యారిస్ వెళుతూ నడి అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి విమానంలోని 228 మంది చనిపోయారు. ఇక మలేసియా ఎయిర్‌లైన్స్ (airlines) ఎంహెచ్ 370 ఫ్లైట్ వ్యధ... ఇప్పటికీ అంతు లేని కథ! 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ ప్రయాణిస్తూ అకస్మాత్తుగా రాడార్ తెర మీది నుంచి ఆ విమానం అదృశ్యమైంది.అందులోని 239 మందీ మరణించారని భావిస్తున్నారు. విమానం అలా ఎందుకు అదృశ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. వైమానిక చరిత్రలో అదొక పెద్ద మిస్టరీ. ఆ విమానం ఏమైపోయిందో కనుక్కోవడానికి బోలెడు వ్యయమైంది. ఆ అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. ఆ విమానం దక్షిణ హిందూమహాసముద్రంలో కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దాని జాడ కనుగొనేందుకు అన్వేషణ పునః ప్రారంభించాలని మలేసియా తాజాగా నిర్ణయించింది. ‘ఎయిర్ ఫ్రాన్స్’ విమానం దుర్ఘటన దరిమిలా... మహాసముద్రాలను దాటి దూర ప్రయాణాలు చేసే ట్రాన్స్-ఓషనిక్ ఫ్లైట్స్ విషయంలో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల వాయిస్ డేటా రికార్డింగ్ ఉండాల్సిందేనని ఫ్రాన్స్ సిఫార్సు చేసింది.మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం అదృశ్యంతో ఆ సిఫార్సుకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ దిశగా అమెరికా కూడా ముందడుగు వేసింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల రికార్డింగును తమ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రీ-ఆథరైజేషన్ చట్టంలో చేర్చింది అమెరికా. అయితే కొత్తగా తయారయ్యే విమానాల్లోనే ఈ మార్పులకు వీలవుతోంది. ఇప్పుడు తిరుగుతున్న చాలా విమానాల జీవిత కాలం 40-50 ఏళ్లు. పాత విమానాల్లో సీవీఆర్ రికార్డింగ్ వ్యవధి పెంపు సాధ్యపడటం లేదు.కొత్త టెక్నాలజీతో బ్లాక్ బాక్సులు!తాజా సవాళ్లు, మారిన సాంకేతికత నేపథ్యంలో అధునాతన రీతిలో సరికొత్త బ్లాక్ బాక్సులకు రూపకల్పన జరుగుతోంది. ఎక్కువ గంటల రికార్డింగ్, అధిక డేటా స్టోరేజి, బ్యాకప్ బ్యాటరీల జీవిత కాలం పెంపు వంటివి ఇందులోని ప్రధానాంశాలు. విమానాల కూలుళ్ల తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సమర్థంగా పనిచేసే బ్లాక్ బాక్సులూ రాబోతున్నాయి. విమానాలు సముద్రాల్లో కూలిపోయే మెరైన్ ప్రమాదాల్లో రికవరీ బృందాలు తక్కువ శ్రమతో సత్వరం బ్లాక్ బాక్సును గుర్తించేలా మెరుగుపరచిన ‘అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. దీంతోపాటు అతి ముఖ్యమైన రియల్ టైమ్ డేటాను గ్రౌండ్ స్టేషన్లకు ప్రసారం చేసే కొత్త డిజైన్లతో బ్లాక్ బాక్సులు రూపుదిద్దుకుంటున్నాయి. విమానానికి సంబంధించిన కీలక సమాచారం ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టేషనుకు చేరుతుంది కనుక ఒకవేళ ప్రమాదంలో బ్లాక్ బాక్స్ భౌతికంగా నాశనమైనా పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. - జమ్ముల శ్రీకాంత్ -
South Korea: బ్లాక్‌బాక్స్ సైలెన్స్!!
దక్షిణ కొరియా ఘోర విమాన ప్రమాదంపై ఆ దేశ రవాణా శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రమాదానికి సరిగ్గా నాలుగు నిమిషాల ముందే విమానంలో బ్లాక్ బాక్సు పని చేయకుండా పోయిందని ప్రకటించింది. దీంతో కేసు దర్యాప్తు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.179 మంది ప్రాణాలను బలిగొన్న జెజు విమానం శకలాల నుంచి బాక్ బాక్స్‌ను సేకరించి అధికారులు విశ్లేషించారు. అయితే అందులో ఎలాంటి సమాచారం లేకపోయేసరికి అధికారులు ఆశ్చర్యపోయారు. దీంతో.. అమెరికాలోని ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ల్యాబోరేటరీకి పంపించారు. యూఎస్ సేఫ్టీ రెగ్యులేటరీ సహకారంతో డాటా రికార్డర్‌ను విశ్లేషిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది.‘‘రక్షణగోడను ఢీకొట్టి ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందే విమానంలో ఉండే బ్లాక్ బాక్సుల్లో ఎలాంటి డేటా రికార్డు కాలేదని దర్యాప్తులో భాగంగా వెల్లడైంది. అసలు ఆ డేటా పోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం ’’ అని మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే దర్యాప్తులో కీలకమైన ఈ సమాచారం కోల్పోవడంతో ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలుసుకోవడం కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే ఇది అత్యంత అరుదైన ఘటన అని మాజీ అధికారి సిమ్ జై డోంగ్ అంటున్నారు. ఇలా బ్లాక్‌బాక్స్‌లు మూగబోయిన సందర్భాలు గతంలోనూ నమోదయ్యాయని చెబుతున్నారాయన.ఇటీవల జెజు ఎయిర్ విమానం థాయ్‌లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియా ముయాన్కు బయలుదేరింది. మరో అయిదు నిమిషాల్లో క్షేమంగా దిగుతామనుకుంటుండగా.. విమానం రన్‌వేపై జారుతూ.. నిప్పురవ్వలు రాజేస్తూ రక్షణగోడ వైపు దూసుకెళ్లి, గోడను ఢీకొట్టి, పేలిపోయింది. విమాన వెనుక భాగంలో కూర్చున్న ఇద్దరు మినహా మిగతా వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు.Death toll from the crash of a Jeju Air passenger plane during landing in South Korea has risen to 96▪️ The plane failed to deploy its landing gear on the first attempt and crashed during an emergency landing on the second attempt▪️ The aircraft veered off the runway and… pic.twitter.com/8uDMwRcIpn— Anadolu English (@anadoluagency) December 29, 2024అనుమానాలెన్నో..విమానాన్ని పక్షి ఢీ కొట్టిందనే సమాచారాన్ని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. అయితే అత్యవసర ల్యాండింగ్‌కు విమానం ఒకసారి ప్రయత్నించి విఫలమైంది. ఈ క్రమంలో రెండోసారి సింగిల్ రన్‌వేపై దిగగా ల్యాండింగ్ గేర్ సమస్యతో దూసుకెళ్లి అక్కడున్న గోడను ఢీ కొట్టింది. అయితే విమాన ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవై దర్యాప్తు జరుగుతున్న తీరుపైనా బాధిత కుటుంబాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే.. లోకలైజర్‌ను రన్‌వే చివర.. అదీ అంతటి గట్టి పదార్థంతో నిర్మించాల్సిన అవసరం ఏంటనే కోణంలో దర్యాప్తు జరగాల్సి ఉంది. -
California: కూలిన విమానం
-
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమాదంలో 26 ఏళ్ల భారత సంతతికి వైద్యుడు సులేమాన్ అల్ మాజిద్ దుర్మరణం పాలయ్యారు. యూఏఈలోని రస్ అల్ ఖైమా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్, కోపైలట్ ఇద్దరూ చనిపోయారని యుఎఇ ప్రభుత్వ విభాగమైన జెనెరల్ సివిల్ ఏమియేషన్ అథారటీ ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేసింది.చనిపోయిన ఇద్దరిలో 26 ఏళ్ల పాకిస్థానీ మహిళ కాగా మరొకరు సులేమాన్ అల్ మాజిద్. ఇతను విమానంలో కోపైలట్‌గా ఉన్నాడు. సులేమాన్ దుబాయ్‌లోనే పుట్టి పెరిగాడు. విమానాన్ని అద్దెకు తీసుకున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. బెంగుళూరుకి చెందిన ఇతని కుటుంబం యూఏఈ దేశానికి వలస వెళ్లింది. యూకే దేశంలోని డుర్హాం కౌంటీ, డార్లింగ్టన్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్‌లో ఫెలో డాక్టర్‌గా ఉద్యోగం చేసేవాడు. బిట్రీష్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా, హానరరీ సెక్రటరీ, నార్తరన్ రెసిడెంట్ డాక్టర్స్ కమిటీలో కో-చైర్మన్ పదవులు చేపట్టాడు. అలాగే యూకేలో డాక్టర్‌గా ఉన్న సమయంలోజూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల వేతనం పెంచాలని ఉద్యమం చేసినట్టు సోషల్‌మీడియా ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది.సులేమాన్ తన కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరాన్ని సరదాగా కొంత సమయం గడిపాడు. ఆ తరువాత తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి ఒక ప్రైవేట్ ఏమియేషన్ క్లబ్ కు వెళ్లాడు. అక్కడ ముందుగా సులేమాన్ సరదాగా గాల్లో విహరించేందుకు క్లబ్ విమానంలో వెళ్లాడు. పైలట్ ఒక పాకిస్తానీ మహిళ ఉన్నారు. అయితే వీరి విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కాంటాక్ట్ మిస్ అయింది. కోవ్ రొటానా హోటల్ సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ ఆస్పత్రి తరలించారు. కానీ ఇద్దరూ చనిపోయారు. సులేమాన్ అకాల మరణంపై తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకుతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో ఉన్నాం. త్వరలోనే అతడికి పెళ్లి కూడా చేయాలనుకున్నాం. కానీ ఇంతలోనే అతను మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. తమకు సర్వస్యం అయిన సులేమాన్ లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
విమానంలో ఏ సీటు భద్రం?
ఆదివారం దక్షిణకొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో వెనకవైపు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు వార్తలొచ్చాయి. దీంతో విమానంలో ముందువైపు లేదంటే వెనుకవైపు అసలు ఏ నంబర్ సీటులో కూర్చుంటే ప్రమాదం జరిగినా బయటపడొచ్చనే అంశంపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. తరచూ విమానప్రయాణాలు చేసే అంతర్జాతీయ ప్రయాణికులు ఈ చర్చలను తీక్షణంగా గమనిస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిజంగానే వెనుకవైపు సీట్లు భద్రమా? అనే ప్రశ్న ఇప్పుడు ప్యాసింజర్లను తొలచేస్తోంది. మిగతా ప్రయాణాలతో చూస్తే భద్రమే ఎక్కడ కూర్చుంటే క్షేమంగా ఉంటామనే ప్రశ్న కంటే అసలు విమానంలో ప్రయాణమే అత్యంత భద్రమని మరో వాదన మొదలైంది. నిర్లక్ష్య డ్రైవింగ్, గతుకుల రోడ్డు, ఎత్తుఒంపులు ఉన్న చోట్ల సాంకేతిక ప్రమానాలు పాటించకుండా నిర్మించిన రోడ్లు, సరైన సూచికల వ్యవస్థ లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రయాణంతో పోలిస్తే విమాన ప్ర యాణం ఎంతో క్షేమదాయకమని వారు చెబుతున్నారు. విమానంలో ఎక్కడ కూర్చున్నా భద్ర మేనని, ఎప్పటికప్పుడు మొత్తం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీచేసి సుశిక్షుతులైన పైలట్ల పర్యవేక్షణలో విమానం ప్రయాణిస్తుందని, అ త్యంత అరుదుగా మాత్రమే, అసాధారణ వాతావరణ పరిస్థితుల్లోనే వి మా నం ప్రమాదంబారిన పడుతుంద ని విశ్లేషకులు చెబుతు న్నారు. అమెరికాలో ఎలా? ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికా రోడ్లపై ప్రతి 10 కోట్ల వాహన ప్రయాణాల్లో కేవలం 1.18 మరణాలు సంభవిస్తున్నాయి. అదే 10 కోట్ల మైళ్ల రైలు ప్రయాణంలో 0.04 మరణాలు సంభవిస్తున్నాయి. ఇక 10 కోట్ల మైళ్ల విమాన ప్రయాణాల్లో అత్యంత స్వల్పంగా కేవలం 0.003 మరణాలు సంభవిస్తున్నాయి. అంతర్జాతీయ పౌర విమానయాన రంగ గణాంకాల ప్రకారం 2023లో ప్రతి వంద కోట్ల మంది ప్రయాణికులకు కేవలం 17 మంది మాత్రమే విమాన ప్రమాదాల్లో చనిపోయారు. 2022 ఏడాదిలో ఈ సంఖ్య 50గా ఉంది. అత్యాధునిక విమానాల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నా అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగానే అత్యల్ప స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తోక క్షేమమే విమానం ద్రవరూప ఇంధనం(ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్)తో నడుస్తుంది. చిన్న జెట్ విమానాలను మినహాయిస్తే అంతర్జాతీయ సర్వీస్‌లకు వాడే భారీ పౌరవిమానాల్లో రెక్కల కింద ఈ ఇంధనాన్ని నిల్వచేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి నిప్పురవ్వులు రాజుకుంటే రెక్కల కింద ఇంధనం భగ్గున మండి రెక్కల సమీప సీట్లలోని ప్రయాణికులు బుగ్గిపాలుకావడం ఖాయం. ఈ కోణంలో చూస్తే రెక్కల సమీపంలోని సీట్లు ప్రమాదసందర్భాల్లో అంత క్షేమదాయకం కాదని గత ప్రమాదరికార్డులు తేటతెల్లంచేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాలో పాపులర్ మెకానిక్స్ అనే మేగజైన్ 1971 నుంచి 2005 వరకు జరిగిన విమాన ప్రమాదాలను విశ్లేíÙస్తూ ఒక నివేదిక సిద్ధంచేసింది. దీని ప్రకారం తోకభాగంలో కూర్చుంటే ప్రమాదాల్లో బతికే అవకాశాలు మిగతా సీట్లతో పోలిస్తే 40 శాతం అధికంగా ఉంటాయి. ముందు సీట్లతో ముప్పే ప్రమాదంలో ఇంధనం అంటుకుని మంటలు చుట్టుముట్టకపోయినా ముందు సీట్లు ఒకరకంగా ప్రమాదకరమని నివేదించారు. ఎదురుగా ఏదైనా కొండను ఢీకొట్టినా, నేలపై కుప్పకూలినా, వేరే విమానాన్ని ఢీకొట్టినా, రన్‌వే చివరన గోడలాంటి నిర్మాణాన్ని ఢీకొట్టినా, రన్‌వే దాటి లోయ లేదంటే సముద్రం, సరస్సు వంటి జలాశయంలోకి దూసుకెళ్లినా ప్రమాద ప్రభావం ముందు సీట్లపైనే అధికంగా ఉంటుంది. మధ్య సీట్ల పరిస్థితి విచిత్రం మధ్య సీట్లలో కూర్చుంటే రెక్కలకు సమీపంలో ఉండటం వల్ల ఇంధనంలో మంటలొస్తే ప్రమాదమే. కానీ మంటలు చెలరేగని పక్షంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గం వీళ్లకే దగ్గరగా ఉంటుంది. తప్పించుకునే అవకాశాలు వీళ్లకే ఎక్కువ. ఏదేమైనా విమానం ప్రమాదంలో పడిన తీరు, వేగం, దిశను బట్టి విమానంలోని ముందు, వెనుక, పక్క భాగాలు దెబ్బతింటాయి. భారత్‌లో గంటకొకటి చొప్పున జరిగే రోడ్డు ప్రమాదాలు, ఇటీవల సర్వసాధారణమైన పట్టాలు తప్పడం వంటి రైలు ప్రమాదాలతో పోలిస్తే అత్యంత అరుదుగా జరిగే విమాన ప్రమాదాలను భూతద్దంలో చూడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చే వాళ్లు ఈ ‘సీటు క్షేమం’చర్చలో పాల్గొన్నారు. బతికే అవకాశాలు 60 శాతం అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డ్ నివేదికను విశ్లేíÙస్తూ బ్రిటన్ పాత్రికేయుడు మ్యాక్స్ ఫాస్టర్ తాజాగా ఒక విషయాన్ని బయటపెట్టారు. ‘‘విమానం నేలపై కూలినా, నీటిలో పడినా, గాల్లోనే పేలిపోయినా ముందు సీట్లలో కూర్చునే ప్రయాణికులు 49 శాతం వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. రెండు రెక్కల మధ్యభాగంలోని సీట్లలో కూర్చుంటే 59 శాతం వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. ఇక వెనుకవైపు అంటే తోక సమీప సీట్లలో కూర్చుంటే 69 శాతం బతికే అవకాశాలు ఉన్నాయి’’అని అన్నారు. అయితే ఇక్కడో ఘటనను తప్పక గుర్తుచేసుకోవాలని ఆయన చెబుతున్నారు. ‘1989లో అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురైనప్పుడు 269 మంది ప్రయాణికుల్లో 184 మంది బతికారు. వీరిలో చాలా మంది ముందు సీట్లలో కూర్చున్నారు’’అని ఆయన గుర్తుచేశారు. ప్రఖ్యాత ‘టైమ్’మేగజైన్ నివేదిక సైతం వెనుక సీట్లు క్షేమమని తెలిపింది. మిగతా సీట్లతో పోలిస్తే వెనుకవైపు సీట్లలో మధ్య వాటిల్లో కూర్చుంటే మరింత క్షేమమని పేర్కొంది. ఇక్కడ కూర్చుంటే మరణించే అవకాశం కేవలం 28 శాతమని, అదే విమానం మధ్యలో కూర్చుంటే ముప్పు శాతం 44 శాతంగా ఉంటుందని వెల్లడించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గాలిలో ప్రాణాలు
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో వైమానిక భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. గత ఐదారేళ్లుగా అత్యంత ఘోరమైన ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది... టేకాఫ్ అయిన కాసేపటికే... గత ఐదేళ్లలో అత్యంత విషాదకరమైన, చర్చనీయమైన విమాన ప్రమాదం లయన్ ఎయిర్ ఫ్లైట్ 610. 2018 అక్టోబర్ 29న ఇండోనేసియాలోని జకార్తా నుంచి పాంగ్‌కల్ పినాంగ్‌కు బయలుదేరిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే జావా సముద్రంలో కూలిపోయింది. 189 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది చనిపోయారు. విమానంలోని ఆగ్మెంటేషన్ సిస్టమ్ (ఎంసీఏఎస్)లో లోపమే ప్రమాదానికి కారణమని తేలింది. బోయింగ్ విమానాల రూపకల్పన, ఏవియేషన్ రెగ్యులేటర్లు, ముఖ్యంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్ఏఏ) పర్యవేక్షణలో తీవ్ర లోపాలను ఈ దుర్ఘటన ఎత్తిచూపింది. ఐదు నెలలకే మరోటి... లయన్ ఎయిర్ ప్రమాదం జరిగిన ఐదు నెలలకే మరో బోయింగ్ 737 మ్యాక్స్ కూలిపోయింది. 2019 మార్చి 10న ఇథియోపియా ఎయిర్‌లైన్స్ విమానం 302 అడిస్ అబాబా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది చనిపోయారు. దీనికీ ఎంసీఏఎస్ వ్యవస్థే కారణమని తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన అధికారులు మాక్స్‌ను నిలిపివేశారు. బోయింగ్ చట్టపరమైన, ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంది. సముద్రంలో కూలిన విమానం... 2021 జనవరి 9న ఇండోనేషియాలోని జకార్తాలో విమాన ప్రమాదం జరిగింది. సోకర్నో–హట్టాలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాంటియానాక్కు బయలుదేరిన బోయింగ్ 737–500 విమానం సముద్రంలో కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సముద్రంలో కూలిపోవడంతో అందులో ఉన్న 62 మంది చనిపోయారు. ఇండోనేషియాలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇది. యాంత్రిక వైఫల్యం, మానవ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విమానంలోని ఆటోథ్రోటిల్ సిస్టమ్‌లో లోపం వల్ల విమానం ఇంజన్లు అసమతుల్యం కావడంతో అదుపు తప్పి కూలిపోయింది. పైలట్ పరిస్థితికి తగిన విధంగా స్పందించడంలో విఫలమయ్యారని తేలింది. ఈ ప్రమాదం పాత విమానాల నిర్వహణలో అప్రమత్తతను, విమానాల అప్‌గ్రేడేషన్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. యాంత్రిక వైఫల్యాలు తలెత్తినప్పుడు ప్రతిస్పందించడానికి విమానయాన సిబ్బంది అందరికీ శిక్షణ ఇవ్వాలని ఉద్ఘాటించింది.ఇళ్లపైనే కూలిన విమానం.. 2020 మే 22న పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఫ్లైట్ 8303, ఎయిర్‌బస్ ఎ 320 కరాచీలోని ఇళ్లపై కూలిపోయింది. లాహోర్ నుంచి బయలుదేరిన ఈ విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ల్యాండింగ్ సమయంలో పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ల్యాండింగ్ గేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా విమానం రన్ వేపైకి దూసుకెళ్లడంతో ఇంజన్లు ధ్వంసమయ్యాయి. చివరకు అదుపు తప్పిన విమానం నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లింది. పైలట్లుప్రామాణిక అత్యవసర విధానాలను పాటించలేదని విమానం బ్లాక్ బాక్స్ వెల్లడించింది. ఈ ప్రమాదం పైలట్ల శిక్షణ, నియంత్రణ పర్యవేక్షణలో లోతైన లోపాలను బహిర్గతం చేసింది. పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీలో శిక్షణ నాణ్యతపై విచారణకు దారితీసింది, రన్‌వే నుంచి జారి లోయలో పడి... గత ఐదేళ్లలో భారత్‌లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం 1344ది. దుబాయ్ నుంచి వచి్చన ఈ విమానం 2020 ఆగస్టు 7న కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 165 మంది ఉండగా.. 21 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా రన్‌వే తడిసిపోయి ఉంది. ఇక్కడ రన్‌వే పొడవు కూడా తక్కువగా ఉండటంతో ల్యాండ్ అయిన విమానం జారి లోయలో పడిపోయింది. వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదం, రన్ వే మౌలిక సదుపాయాల సరిగా లేకపోవడం వల్ల జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదం తరువాత దేశంలోని విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను సమీక్షించారు. రన్‌వే నుంచి జారి..నేపాన్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పొఖారాకు బయల్దేరిన విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. 18 మంది మృతి చెందగా, పైలట్ కెపె్టన్ ఎంఆర్ షాక్యా తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రన్‌వే దక్షిణం వైపు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా, రెక్కల కొన భూమిని తాకడంతో ఒక్కసారిగా పలీ్టలు కొట్టింది. దీంతో వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి.మంచు కారణంగా... ఈ సంవత్సరం బ్రెజిల్ విమానయాన సంస్థకు చెందిన వోపాస్ 2283, ఏటీఆర్ 72 ట్విన్ఇంజన్ టర్బోప్రాప్ ఆగస్టు 9న కూలిపోయింది. 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం.. సావోపావో సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారంతా మరణించారు. విమాన ప్రమాదానికి మంచు కారణమని తేలింది. పండుగ రోజున ప్రమాదం.. ఇటీవలే.. క్రిస్మస్ పర్వదినాన అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజీ్నకి వెళ్తుండగా కాస్పియన్ సముద్ర సమీపంలో కూలిపోయింది. విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా 38 మంది మరణించారు. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులను తిప్పికొడుతున్న రష్యా వైమానిక రక్షణ దళాలు విమానాన్ని కూలి్చవేశాయని రష్యా అంగీకరించింది. దాడి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్ క్షమాపణ చెప్పారు. వీడని మిస్టరీ.. చైనాలో జరిగిన అత్యంత విషాద ఘటనల్లో ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంయూ 5735 కుప్పకూలడం ఒకటి. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737–800.. 2022 మార్చి 21న దక్షిణ చైనాలోని పర్వతాల్లో కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది సహా విమానంలో ఉన్న 132 మంది మరణించారు. విమానం ఎత్తునుంచి కిందికి దించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తాత్కాలిక దర్యాప్తులో తేల్చారు. విమానం వేగంగా, ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ చేసినట్లు బ్లాక్ బాక్స్ డేటా వెల్లడించింది. ఈ ప్రమాదం యాంత్రిక వైఫల్యమా, మానవ తప్పిదమా అనే విషయంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ విపత్తుకు అసలు కారణం మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌత్ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి
-
సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం
-
విమాన ప్రమాదంపై పుతిన్ ‘సారీ’
మాస్కో: కజకిస్తాన్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ శనివారం అజెర్బైజాన్ అధ్యక్షుడు ఇలాహ్మ్ అలియేవ్‌కు క్షమాపణ చెప్పారు. అది అత్యంత విషాదకర ఘటన అని పేర్కొన్నారు. రష్యాలోని చెచెన్యా రిపబ్లిక్ రాజధాని గ్రోజ్నీలో ల్యాండవ్వాల్సిన విమానం బుధవారం అనూహ్యంగా కుప్పకూలి 38 మంది మరణించడం తెలిసిందే. దీనికి రష్యా గగనతల రక్షణ వ్యవస్థలోని క్షిపణి కారణమంటూ ఆరోపణలు వస్తున్న వేళ పుతిన్ క్షమాపణ చెప్పడం గమనార్హం. అయితే, విమాన ప్రమాదానికి బాధ్యత తమదేనంటూ ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అంగీకరించలేదు. ‘అజెర్బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం గ్రోజ్నీ విమానాశ్రయంలో ల్యాండయ్యేందుకు పదేపదే ప్రయత్నించడంతో గగనతల రక్షణ వ్యవస్థలు కాల్పులు జరిపాయి’ అని అంతకుముందు అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ కాల్పుల వల్లే విమానం కూలిందంటూ వేరుగా అందులో పేర్కొనలేదు. రష్యా గగనతలంలో ఈ ఘటన చోటుచేసుకున్న కారణంగా అధ్యక్షుడు పుతిన్ అజెర్బైజాన్ ప్రెసిడెంట్ అలియేవ్‌కు క్షమాపణ చెప్పారని క్రెమ్లిన్ వివరించింది. దీనిని అజెర్బైజాన్ అధ్యక్షుడి కార్యాలయం కూడా ధ్రువీకరించింది. -
రష్యానే కూల్చిందా..?
-
రష్యా క్షిపణి వల్లే కూలిందా?
న్యూఢిల్లీ: కజకిస్తాన్‌లోని అక్తావ్ సమీపంలో బుధవారం విమానం కూలడానికి వెలుపలి శక్తుల ప్రమేయమే కారణమని అజెర్బైజాన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. వెలుపలి భౌతిక, సాంకేతిక పరమైన ప్రమేయం వల్లే విమానం కూలినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని శుక్రవారం వెల్లడించింది. ఈ విమానం కుప్పకూలడానికి రష్యా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థే కారణమని అంతకు ముందు వార్తలొచ్చాయి. రష్యా వైమానిక విభాగం ప్రతినిధి యడ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రోజ్నీ, వ్లాడికవ్కాజ్లలోని మౌలిక వసతులు, జనావాసాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి. అందుకే గ్రోజ్నీలో ల్యాండ్ చేయకుండా విమానాన్ని దారి మళ్లించారని తెలిపారు. ‘దీన్నిబట్టి చూస్తే, ఆ ప్రాంతంలోని గగనతలాన్ని మూసివేసినట్లు అర్థమవుతోంది. అంటే, ఆ జోన్లోకి వచ్చే ఏదైనా విమానం తక్షణమే బయటకు రావాల్సి ఉంటుంది. లేకుంటే ప్రమాదమే’అని విశ్లేషకులు అంటున్నారు. ‘విమానం గ్రోజ్నీలో ల్యాండయ్యేందుకు రెండుసార్లు ప్రయత్నించింది. అయితే, డ్రోన్ దాడుల భయంతో వేరే విమానాశ్రయాల్లో ల్యాండ్ చేయాలని అధికారులు పైలట్‌కు సూచించారు. అందుకే, పైలట్ అక్తావ్ ఎయిర్‌పోర్టు దిశగా విమానాన్ని మళ్లించారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో కురుస్తున్న దట్టమైన మంచు ప్రమాదానికి కారణమైంది’అని యడ్రోవ్ వివరించారు. కానీ, రష్యా మీడియా విమాన ప్రమాదం గురించిన అసత్యాలు ప్రచారం చేస్తోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సిబిహా ఆరోపించారు. క్షిపణి దాడిలో దెబ్బతిన్న విమానంలో ఆనవాళ్లు దొరక్కుండా చేయడానికి రష్యా అధికారులు సముద్రం దాటాలని పైలట్‌పై ఒత్తిడి చేశారని విమర్శించారు. విమానం కూలిన తర్వాత కేబిన్ నుంచి భారీగా పొగలు వస్తున్నట్లుగా చూపే వీడియోలు, ఫొటోలు కూడా ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. విమానం ముక్కలై మంటలు అంటుకోవడం, కాస్పియన్ సముద్ర తీరానికి సమీపంలో నేలను తాకి నల్లని పొగలు కమ్ముకుంటున్న వీడియో ఒకటి ఆన్లైన్లో కనిపిస్తోంది. ఘటనా ప్రాంతంలో విమానం ధ్వంసమైన తీరును గమనిస్తే రష్యా మిలటరీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్లే నేలకూలినట్లు కనిపిస్తోందని యూకేకు చెందిన ఓస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ సంస్థ చీఫ్ మ్యాట్ బోరీ విశ్లేషించారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. రష్యన్లే ఆ విమానాన్ని కూల్చేశారని ఉక్రెయిన్ జాతీయ భద్రతాధికారి అండ్రీ కొవలెంకో చెప్పారు. యుద్ధం జరుగుతున్న వేళ గ్రోజ్నీ గగనతలాన్ని రష్యా మూసివేయకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు. -
అంత ప్రమాదంలో బతికి బట్టకట్టాడు.. మరో వీడియో వైరల్
ఒక ఘోర ప్రమాదం.. అందులో చావు అంచు నుంచి బయటపడితే ఎవరైనా ఏం చేస్తారు?.. దేవుడికి దణ్ణం పెట్టి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ఇంకాస్త ధైర్యవంతులైతే ఆపదలో ఉన్నవాళ్లకు సాయం చేస్తారు. కానీ, ఇక్కడో ప్రయాణికుడు మాత్రం స్పాట్లో కలియదిరుగుతూ ఆ తీవ్రతను తెలియజేస్తూ ఏకంగా ఓ వీడియో తీశాడు. అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్(Azerbaijan Airlines) ప్రమాదం తాలుకా మరో వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం ప్రమాదానికి గురికావడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదం జరిగాక ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సుబ్ఖోన్ రఖిమోవ్ అనే ఆ ప్రయాణికుడు అదృష్టంకొద్దీ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 🚨AZERBAIJAN AIRLINES PASSENGER WHO SURVIVED CRASH FILMS SHRAPNEL DAMAGESubkhon Rakhimov, a passenger on the Azerbaijan Airlines flight that tragically crashed, miraculously survived the incident. He initially filmed a video for his wife as the plane plummeted from the sky.… https://t.co/J9oGZIpGiG pic.twitter.com/0nk9YIbtJV— Mario Nawfal (@MarioNawfal) December 26, 2024అయితే ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే.. తన ఫోన్లో అక్కడి దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే విమాన తోకభాగంపై, రెక్కలపై చిన్న చిన్న రంధ్రాలు ఉండడం గమనించవచ్చు. విశేషం ఏంటంటే.. అంతకు ముందు ప్రమాద సమయంలోనూ వైరల్ అయిన వీడియో కూడా ఈయనగారు పోస్ట్ చేసిందే.ప్రమాదం సమయంలో భయాందోళనకు గురైన ప్రయాణికుల హాహాకారాలు వీడియోలో వినిపిస్తున్నాయి. సుబ్ఖోన్ రఖిమోవ్ మాత్రం భగవంతుడ్ని ప్రార్థిస్తూ కనిపించాడు. ఆపై విమానం కూలిన అనంతరం ప్రయాణికులు చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలు కనిపించాయి.The final moments of the Azerbaijan Airlines plane before its crash in Kazakhstan were captured by a passenger onboard.Aftermath also included in the footage. pic.twitter.com/nCRozjdoUY— Clash Report (@clashreport) December 25, 2024బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజకిస్థాన్(Kazakhstan)లోని అక్టౌలో కూలిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై అంతర్జాతీయ మీడియా పలు కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రమాదం నుంచి 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన అజర్బైజన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం నేపథ్యంలో గురువారం ఒక్కరోజు జాతీయ సంతాపం దినంగా పాటించారు.ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. పొగమంచు కారణంగా జరిగిందని.. పక్షిని ఢీ కొట్టడంతో జరిగిందని రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన తీరు.. విమాన రెక్కలకు ఉన్న రంధ్రాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా పనిగా ఊహాజనిత కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడిని తిప్పికొట్టే క్రమంలో రష్యా వైమానిక దళాలు జరిపిన దాడిలో.. ఈ విమాన ప్రమాదం జరిగిందా? అని తొలుత చర్చ నడిచింది. అయితే ఇటు రష్యాతో పాటు అటు కజకస్తాన్.. ఘటనపై దర్యాప్తు పూర్తి కాకుండా ఒక నిర్దారణకు రావడం సరికాదని చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఉక్రెయిన్‌కు బైడెన్ బంపరాఫర్ -
కజకిస్తాన్ విమాన ప్రమాదం..రష్యా కీలక ప్రకటన
మాస్కో:కజకిస్తాన్‌లో జరిగిన విమానప్రమాదానికి తామే కారణమని జరుగుతున్న ఊహాజనిత ప్రచారాన్ని రష్యా ఖండించింది. విమాన ప్రమాదంపై ఊహాగానాలు ఆపాలని కోరింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదంపై విచారణ పూర్తయ్యేదాకా ప్రమాదానికి గల కారణాలపై ఊహాగానాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలడానికి రష్యా ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థే కారణమన అజర్బైజాన్ మీడియాలో కథనాలు ప్రచురితమవడంపై రష్యా స్పందించింది. బుధవారం(డిసెంబర్ 25) అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి బయలుదేరిన విమానాన్ని పొగమంచు కారణంగా తొలుత కజకిస్తాన్‌లోని అక్తౌకు మళ్లించారు. ఇక్కడే విమానం కుప్పకూలింది. ప్రమాదానికి ముందు విమానం కాస్పియన్ సముద్రంపై కాసేపు ఎగిరింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 67 మందిలో 29 మంది మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. -
కజకిస్తాన్ ప్రమాదంపై కొత్త ట్విస్ట్.. రష్యానే కారణమా?
మాస్కో: కజకిస్తాన్‌లో విమాన ప్రయాణం తీవ్ర విషాదం మిగిల్చింది. విమానం కుప్పకూలడంతో మంటలు చెలరేగి దాదాపు 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, విమాన ప్రమాదానికి రష్యానే కారణమంటూ సోషల్ మీడియాతో కామెంట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జే2–8243 విమానం 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో రష్యాకు బయలుదేరగా మధ్యలో ప్రమాదం సంభవించింది. అజర్బైజాన్ రాజధాని బాకూ సిటీ నుంచి విమానం.. రష్యాలోని నార్త్ కాకస్ ఉన్న గ్రాజ్నీ నగరానికి బయలుదేరింది. అయితే, గ్రాజ్నీలో ల్యాండింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు. ఈ క్రమంలో అక్టౌకు వెళ్తున్న సందర్బంగా విమానం కూలిపోయింది. అయితే, ఈ విమాన ప్రమాదానికి పక్షి ఢీకొనడమే కారణమని పలువురు చెబుతున్నారు. ఇదే సమయంలో రష్యా దాడి కారణంగానే విమాన ప్రమాదం జరిగిందని మరికొందరు కొన్ని వీడియోలను షేర్ చేస్తున్నారు.Unknown holes in Azerbaijan Airlines E190 that might have been shot down over Russia and has crash landed in Kazakhstan on 25 December.#planecrash #AzerbaijanAirlines #russia #Azerbaijan #ei90 pic.twitter.com/YN0wfJlu8C— Wildly Amusing (@Wildly_Amusing) December 26, 2024 సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ప్రమాదానికి గురైన విమానం బాడీపై పలుచోట్ల అనుమానాస్పదంగా రంధ్రాలు ఉన్నాయి. దాడులు జరిగితే రంధ్రాలు ఏర్పడినట్టుగా కనిపించడం గమనార్హం. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న సమయంలోనే ఈ విమానంపై దాడి జరిగిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంజిన్ టెక్నికల్ సమస్యల కారణంగా పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోరి ఉంటారని అంటున్నారు. ఇక, విమానం రాడార్ దిశను చూసినప్పుడు విమానం మొదట రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్ మీదుగా వెళ్తోంది. తర్వాత ట్రాకర్ నుండి అదృశ్యమైందని చెబుతున్నారు.🚨‼️Breaking updates! The plane crash today involved an Azerbaijan Airlines Embraer jet flying from Baku to Russia, which went down near Aktau, Kazakhstan. With 67 passengers and 5 crew members on board, initial reports suggest the plane was shot down. See below for more details.… pic.twitter.com/pIJd3vwIv1— MagaVeteran1969 (@LouisCuneo1) December 25, 2024ఇదిలా ఉండగా.. ప్రమాదానికి ముందు విమాన పరిస్థితిని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో విమానం లోపల ఎంతో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిని చూడవచ్చు. విమానం కూడా కొంత దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.Footage from today’s crash of the Embraer 190 operated by Azerbaijan Airlines. Before the crash, visible damage can be seen on the wing, and afterward, marks on the fuselage suggest it may have been hit by ground fire. pic.twitter.com/jzbooDH9W8— 𝕏 Aliu ™ 𝕏 (@Aliu_312) December 26, 2024 -
కజకిస్తాన్ ప్రమాదంలో రెండు ముక్కలైన విమానం (ఫొటోలు
-
కజకిస్తాన్ ప్రమాదం.. విమానం లోపల ప్రయాణికుడి వీడియో వైరల్
మాస్కో: కజకిస్తాన్‌లో విమాన ప్రయాణం తీవ్ర విషాదం మిగిల్చింది. విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలడంతో మంటలు చెలరేగి దాదాపు 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కజకిస్తాన్‌లోని అక్తావ్ నగర సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జే2–8243 విమానం 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో రష్యాకు బయలుదేరగా మధ్యలో ప్రమాదం సంభవించింది. అజర్బైజాన్ రాజధాని బాకూ సిటీ నుంచి రష్యాలోని నార్త్ కాకస్ ఉన్న గ్రాజ్నీ నగరానికి బయలుదేరింది. అయితే, గ్రాజ్నీలో ల్యాండింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు. ఈ క్రమం అక్టౌలో కూలిపోయింది.అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో విమానంలోని ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం సమయంలో భయాందోళనకు గురైన ప్రయాణికుల హాహాకారాలు వీడియోలో వినిపిస్తున్నాయి. విమానం కూలిన అనంతరం ప్రయాణికులు చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలు కనిపించాయి. ఈ ప్రమాదం నుంచి 32 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన అజర్బైజన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం నేపథ్యంలో గురువారం జాతీయ సంతాపం దినంగా ప్రకటించారు.The final moments of the Azerbaijan Airlines plane before its crash in Kazakhstan were captured by a passenger onboard.Aftermath also included in the footage. pic.twitter.com/nCRozjdoUY— Clash Report (@clashreport) December 25, 2024 -
కజకిస్తాన్ లో కుప్పకూలిన విమానం
-
తిరుగుబాటుదారుల చేతుల్లోకి సిరియా.. అధ్యక్షుడు అసద్ విమానం కూల్చివేత!
డెమాస్కస్: సిరియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డెమాస్కన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని ప్రకటించారు. ఇదే సమయంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశం విడిచి పారిపోయారని రెబల్స్ తెలిపారు. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు.సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ కనిపించకపోవడంతో గందరగోళం పరిస్థితి నెలకొంది. అయితే, అసద్ విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రయాణిస్తున్న ఐఎల్-76 విమానం ఎత్తు ఒక్కసారిగా 3,650 మీటర్ల నుంచి 1,070 మీటర్లకు పడిపోయిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ల సమాచారం ఇచ్చాయి. ఈ ప్రదేశం లెబనాన్ గగనతలం పరిధిలో ఉంది. ఎవరైనా దీనిని కూల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.🚨Syrian rebels enter Bashar al-Assad's presidential palace in Damascus. pic.twitter.com/LsB7F2eNmF— Lou Rage (@lifepeptides) December 8, 2024మరోవైపు..హెచ్‌టీఎస్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు రాజధాని నగరం డెమాస్కస్‌ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో డమాస్కస్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అసద్, ఆయన కుటుంబానికి చెందిన అనేక ఆస్తులను, అధికార చిహ్నాలను తిరుగుబాటుదారులు ధ్వంసం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తాము రాజధాని చుట్టూ బలమైన రక్షణ వ్యవస్థను తయారు చేస్తున్నామని సిరియా హోం శాఖ చెబుతోంది. ఇక, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.Syrian state television aired a video announcing the fall of President Bashar al-Assad. pic.twitter.com/p2wi5RI5Ov— Geo View (@theGeoView) December 8, 2024Em Deir ez-Zor, leste da Síria, cai a estátua de Hafez al-Assad. Na foto ao lado, arde a imagem de seu filho, Bashar al-Assad, que fugiu há pouco da Síria dando fim a um regime que perdura desde 1971. pic.twitter.com/zKTjccvbaB— GugaNoblat (@GugaNoblat) December 8, 2024ఇదిలా ఉండగా.. సిరియా పరిస్థితులపై తిరుగుబాటుదారులు కీలక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా..‘50 ఏళ్ల అణచివేత, 13 ఏళ్ల నేరాలు, దౌర్జన్యాలు, సుదీర్ఘ కాలం అవస్థలు, యుద్ధం, ఆక్రమిత సేనల నియంత్రణ నేటితో ముగిశాయి. ఇది ఒక చీకటి యుగం. ఇక సిరియాలో సరికొత్త శకం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వలసపోయిన వారి కోసం సిరియా ఎదురు చూస్తోందని’ తెలిపారు.Syrians tear down a large poster of Soleimani and Nasrallah outside the Iranian embassy in Damascus pic.twitter.com/n7F77kfNVN— Aleph א (@no_itsmyturn) December 8, 2024Did Bashar al-Assad's Plane Crash?Sudden Disappearance and Altitude Change Suggests It Was Shot Down!!Unconfirmed information is being circulated about the sudden descent of the plane that was reportedly carrying Assad after it disappeared from radar and dropped suddenly from… pic.twitter.com/fpFQxQaq0K— khaled mahmoued (@khaledmahmoued1) December 8, 2024అసద్ శకం ముగిసింది..మరోవైపు సిరియా ఆర్మీ కమాండ్ ఇప్పటికే అధ్యక్షుడు అసద్ శకం ముగిసిందని తమ ఆఫీసర్లకు సమాచారం అందించినట్లు మీడియా సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో సిరియా ప్రధాన ప్రతిపక్షం హది అల్ బహ్ర కూడా దేశ రాజధాని అసద్ నుంచి విముక్తి పొందిందని తెలిపింది. -
కుప్పకూలిన విమానం..
-
ఎయిర్‌షోలో అపశృతి.. సముద్రంలో కుప్పకూలిన విమానం
ప్యారిస్: ఫ్రాన్స్‌లో ఓ ఎయిర్‌షోలో అపశృతి దొర్లింది. 65 ఏళ్ల పైలట్ ఓ ట్రైనింగ్ విమానంలో ఆకాశంలో విన్యాసాలు చేస్తుండగా మధ్యదరా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతిచెందారు. ప్రమాదానికి గురైన ఫోగా మ్యాగిస్టర్ జెట్ విమానం వరల్డ్‌వార్ 2 తర్వాత తయారైంది కావడం గమనార్హం. ఈ విమానాన్నిఫ్రాన్స్ ఆర్మీ శిక్షణ కోసం వాడుతోంది. విమానంలో ఎజెక్షన్ సీటు లేకపోవడమే పైలట్ మృతికి కారణమని చెబుతున్నారు. -
బ్రెజిల్లో కూలిన విమానం.. 62 మంది మృత్యువాత!
సావో పౌలో: బ్రెజిల్‌లోని సావో పౌలో రాష్ట్రంలో శుక్రవారం విమానం కుప్పకూలిన ఘటనలో అందులోని మొత్తం 62 మంది ప్రయాణికులు చనిపోయారు. సావో పౌలో అంతర్జాతీయ విమానం వైపు వెళ్తున్న ఆ విమానం విన్హెడో నగరంలోని జనసమ్మర్ధం ఉన్న ప్రాంతంపై కూలింది. విమానం శిథిలాల నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వెలువడుతున్న దృశ్యాలను టీవీలు ప్రసారం చేశాయి. ఓ విమానం నిట్టనిలువునా గిరికీలు తిరుగుతూ కూలడాన్ని, ఆ వెంటనే ఆ ప్రాంతంలో మంటలు ఎగసిపడటాన్ని చూపించాయి. ఘటనలో విమానంలో ఉన్న 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా పేర్కొన్నారు. మృతులకు సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఫైర్ సిబ్బందితోపాటు మిలటరీ పోలీసులు, పౌర రక్షణ అధికారులు విన్హెడోని ఘటనా ప్రాంతంలో రక్షణ, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
నేపాల్‌లో విమాన ప్రమాదం
కఠ్మాండు: హిమాలయాల నేల నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలిన ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారిసహా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. పైలట్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలైన పైలట్ మనీశ్ రత్న శాక్యకు కంటి, వెన్నుముక శస్త్రచికిత్స చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కఠ్మాండు ఎయిర్పోర్ట్ నుంచి పొఖారా సిటీకి బయల్దేరేందుకు టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే బంబార్డియర్ తయారీ సీఆర్జే–200 రకం విమానం కూలింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. టేకాఫ్ అయ్యాక ఎడమ వైపుగా పయనించాల్సిన విమానం దిశను హఠాత్తుగా కుడి వైపునకు తిప్పడంతో స్థిరత్వం కోల్పోయి నేలరాలిందని ఎయిర్పోర్ట్ చీఫ్ జగన్నాథ్ నిరౌలా ‘బీబీసీ న్యూస్ నేపాలీ’ వార్తాసంస్థతో చెప్పారు. కూలిన విమానంలో సాధారణ ప్రయాణికులెవరూ లేరుగానీ పైలెట్, సాంకేతిక సిబ్బంది, ఇద్దరూ విమాన సిబ్బందితో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. విమానం రన్ వే మీద పడిన వెంటనే మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటనే రంగంలోకి దిగిన అగి్నమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పేశారు. 15 మంది ఘటనాస్థలిలో ముగ్గురు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ మరణించారు. ఘటనాస్థలిని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి సందర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. టేబుల్ టాప్ రన్‌వే చుట్టూతా ఉండే హిమాలయ పర్వతాల మధ్య నుంచి దిగుతూ నేపాల్ ఎయిర్‌పోర్ట్‌ల గుండా రాకపోకలు సాగించడం ఇక్కడి పైలెట్లకు కత్తిమీద సామే. పర్వతప్రాంతం కావడంతో ఇక్కడి గాలి వీచే దిశ, వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతుంటాయి. తక్కువ ఎత్తులో నడపడం సవాల్‌తో కూడిన పని. అందులోనూ కఠ్మాండు విమానాశ్రయంలో టేబుల్ టాప్ రన్‌వే ఉంది. అంటే రన్‌వే దాటి ఏమాత్రం ముందుకు వెళ్లినా లోయలో పడే ప్రమాదముంది. రన్‌వేకు ఒక వైపు గానీ, రెండు వైపులా గానీ లోయ లేదా ఏటవాలు భూమి టేబుల్ టాప్ రన్‌వేగా పిలుస్తారు. దీనిపై టేకాఫ్, ల్యాండింగ్ ఖచి్చతత్వంతో చేయకుండా ప్రమాదమే. బుధవారం జరిగిన ప్రమాదానికి ఈ రకం రన్‌వే కూడా ఒక కారణమని వార్తలొచ్చాయి. భారత్‌లో సిమ్లా, కాలికట్, మంగళూరు, లెంగ్‌పుయ్ (మిజోరం), పాక్యోంగ్ (సిక్కిం)లలో ఈ టేబుల్–టాప్ రన్వేలు ఉన్నాయి. వీటిలో కేరళ, మంగళూరులో గతంలో పెద్ద విమాన ప్రమాదాలు జరగడం గమనార్హం. -
నేపాల్ ప్రమాదానికి టేబుల్ టాప్రనేవే కారణం!.. ఏంటిది?
నేపాల్ రాజధాని ఖాట్మండులో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో సిబ్బంది సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయానికి విమానంలో నలుగురు సిబ్బంతో సహా 19 ప్రయాణికులుండగా.. కేవలం పైలట్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే హిమాలయ పర్వతాల మధ్య ప్రకృతి అందాల్లో ఉండే నేపాల్‌లో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఇందుకు అక్కడ ఎక్కువగా టేబుల్-టాప్ రన్వేలు ఉండటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇవి సవాళ్లతో కూడుకుని ఉంటాయి. తాజాగా ప్రమాదం జరిగిన త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా టేబుల్ టాప్ విమానాశ్రయమే. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర విమానాశ్రయాల్లో ఒకటి.అన్ని వైపులా లోతైన లోయలు ఉండి.. ఎత్తైన కొండపై భాగంలో ఎయిర్‌పోర్టు ఉంటుంది.. ఈ రన్‌వే చుట్టుపక్కల భూభాగం కంటే ఎత్తులో ఉంటాయి. వీటికి దాదాపు అన్ని వైపులా లోయలు ఉంటాయి. కానీ దూరం నుంచి చూస్తే రన్‌వే, పక్కన ఉన్న భూభాగం సమాంతరంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల విమానం రన్‌వేపై అదుపుతప్పితే అది లోయలో పడి క్రాష్ అవ్వడం జరుగుతుంది.సాధారణంగా విమానం టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేప్పుడు అది రన్‌వేపై ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం మధ్యలో విమానం టైరు నేలను తాకాలో ముందుగానే నిర్ణయించి మార్కింగ్ చేసి ఉంటుంది. అయితే వర్షాలు, ఇతర కారణాలతో రన్‌వే సరిగా కనిపించకపోతే విమానం దానికి మార్కింగ్ చేసిన నేలను దాటి తాకుతుంది. దీన్ని ఓవర్ షూట్ అంటారు. సాధారణ రన్‌వేలపై ఇలా జరిగినప్పుడు విమానం ఆగడానికి తగినంత అదనపు స్థలం ఉటుంది. కానీ టేబుల్‌టాప్ రన్‌వేలపై ఓవర్ షూట్ జరిగితే మాత్రం విమానం నేరుగా లోయ వంటి ప్రదేశంలో పడిపోతుంది.ఇక భారత్‌లోనూ అయిదు విమానాశ్రయాలు టేబుల్-టాప్ రన్‌వేలను కలిగి ఉన్నాయి. సిమ్లా(హిమాచల్ ప్రదేశ్), కాలికట్(కేరళ), మంగళూరు(కర్ణాటక), లెంగ్‌పుయ్ (మిజోరం). పాక్యోంగ్ (సిక్కిం). వీటిలో కేరళ, మంగళూరు విమానాశ్రయాలు గతంలో పెద్ద ప్రమాదాలు సైతం జరిగాయి. మే 22, 2010న, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వస్తుండగా ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బందితో సహా 158 మంది ప్రయాణికులు మరణించారు. -
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 18 మంది దుర్మరణం
ఢిల్లీ: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండ్‌లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి టేకాఫ్ తీసుకునే విమానం జారిపోయి కుప్పకూలింది. దీంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 19 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యం అయ్యాయి. పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన్ను ఖాఠ్మాండ్‌లోని మెడికల్ కాలేజీ టీచింగ్ ఆసుపత్రికి తరలించారు. #WATCH | Plane crashes at the Tribhuvan International Airport in Nepal's KathmanduDetails awaited pic.twitter.com/DNXHSvZxCz— ANI (@ANI) July 24, 2024ప్రమాదానికి గురైన విమానం శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేపాల్ ఆర్మీ తమ బృందాన్ని పంపించింది. కొన్నేళ్ల క్రితం త్రిభువన్ ఎయిర్పోర్ట్ వద్ద బంగ్లాదేశ్ ప్రయాణికుల విమానం కూలిపోయింది. ఈ ప్రమదంలో కూడా పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. #BREAKING : A plane has crashed at Tribhuvan International Airport. Sources at TIA reported that the aircraft skidded off the runway during takeoff as it was departing for Pokhara with 19 passengers. #Nepal #planecrash #TribhuvanInternationalAirport #skid #landing #airport… pic.twitter.com/ILnl0zQnZH— mishikasingh (@mishika_singh) July 24, 2024 -
విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ దుర్మరణం
బ్లాంటైర్: ఆఫ్రికా దేశం మలావీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ షిలిమాతోపాటు మరో 9 మంది దుర్మరణం పాలయ్యారు. దేశ ఉత్తర భాగంలోని పర్వత ప్రాంతంలో విమానం శకలాలను గుర్తించినట్లు మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం వెల్లడించారు.ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని అన్నారు. ఉపాధ్యక్షుడు షిలిమా సహా మొత్తం 10 మంది సోమవారం ఉదయం సైనిక విమానంలో మలావీ రాజధాని లిలోంగ్వే నుంచి 370 కిలోమీటర్ల దూరంలోని మజుజు సిటీకి బయలుదేరారు. ముజుజులో ప్రతికూల వాతావరణం వల్ల ల్యాండ్ అయ్యే అవకాశం లేకపోవడంతో వెనక్కి వెళ్లాలని విమానం పైలట్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సమాచారం ఇచ్చారు. 45 నిమిషాల తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయి. రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. -
ప్లేన్ క్రాష్.. బిలియనీర్ కుటుంబంలో తీవ్ర విషాదం.. ఒక్కరూ మిగల్లేదు!
జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదం భారత్‌కు చెందిన మైనింగ్ దిగ్గజం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురు వ్యక్తులలో ఒక భారతీయ బిలియనీర్, ఆయన కుమారుడు ఉన్నట్లు స్థానిక మీడియా నివేదికల ద్వారా తెలిసింది. బంగారం, బొగ్గుతోపాటు నికెల్, రాగిని వెలికితీసి శుద్ధి చేసే ‘రియోజిమ్’ అనే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ యజమాని హర్పాల్ రంధావా, ఆయన కొడుకుతో పాటు మరో నలుగురు మషావా, ఐహరారేలోని జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోవడంతో మృతిచెందినట్లు జింబాబ్వేకు చెందిన ఓ న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. తమ వజ్రాల గని వద్దే ప్రమాదం రియోజిమ్ కంపెనీకి చెందిన ‘సెస్నా 206’ విమానం హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ కంపెనీకి చెందిన చెందిన మురోవా డైమండ్స్ గని సమీపంలోనే ఈ సింగిల్-ఇంజిన్ విమానం కూలిపోవడం గమనార్హం. ఒక్కరూ మిగల్లేదు.. జ్వామహండే ప్రాంతంలోని పీటర్ ఫామ్‌లోకి దూసుకెళ్లే ముందు విమానం సాంకేతిక లోపం తలెత్తినట్లుగా తెలుస్తోంది. గాల్లోనే విమానం పేలిపోయినట్లు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రాణాలు కోల్పోయారని మీడియా నివేదిక పేర్కొంది. మృతుల్లో నలుగురు విదేశీయులు కాగా, మిగిలిన ఇద్దరు జింబాబ్వే దేశీయులు అని పోలీసులను ఉటంకిస్తూ ప్రభుత్వ యాజమాన్యంలోని దినపత్రిక హెరాల్డ్ పేర్కొంది. మృతుల పేర్లను పోలీసులు ఇంకా విడుదల చేయలేదు. అయితే రంధావా స్నేహితుడైన పాత్రికేయుడు, చిత్రనిర్మాత హోప్వెల్ చినోనో ఆయన మరణాన్ని ధ్రవీకరించారు. రంధావా 4 బిలియన్ డాలర్ల (రూ.33 వేల కోట్లకు పైగా) ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జెమ్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు. -
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి
రియో డి జెనారో: అమెజాన్ అడవుల్లో బార్సెలోస్ ప్రాంతానికి వెళ్తోన్న టూరిస్టు విమానం కుప్పకూలడంతో సిబ్బందితో కలిపి మొత్తం 14 మంది మృతి చెందారు. బ్రెజిల్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన అమెజాన్ అడవుల్లోని బార్సెలోస్ను సందర్శించేందుకు 14 మందితో కూడిన టూరిస్టు విమానం వాతావారణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అడవుల్లో కుప్పకూలింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది పర్యాటకులతోపాటు ఇద్డరు సిబ్బంది కూడా మృతిచెందారు. భారీ వర్షంలో ప్రయాణిస్తున్న ఈ విమానం పైలట్ ఎదురుగా ఏమీ కలిపించకపోయిన అలాగే నడుపుకుంటూ వెళ్లారు. ఇదే క్రమంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించక విమానం అడవుల్లో కుప్పకూలిందని ఆమెజోనా స్టేట్ సెక్యూరిటీ సెక్రెటరీ వినిషియస్ అల్మెయిదా తెలిపారు. ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని మృతుల్లో స్పోర్ట్ ఫిషింగ్ నిమిత్తం బయలుదేరిన 12 మంది మగవారితో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారని ఒక స్టేట్మెంట్లో తెలిపింది అక్కడి ప్రభుత్వం. మృతుల కుటుంబానికి స్నేహితులకు ప్రగాఢ సానుభూతులు తెలిపిన గవర్నర్ విల్సన్ లిమా ప్రమాదం గురించి తెలిసిన మరుక్షణం నుండి విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. మీడియా కథనాల ప్రకారం ప్రమాదానికి గురైన విమానం బ్రెజిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ మేకర్ ఎంబ్రేయర్ తయారు చేసిన ట్విన్-ఇంజన్ టర్బోప్రాప్ ఈఎంబీ-10 12 మంది టూరిస్టులతో మనౌస్ నుంచి బార్సెలోస్‌కు బయలుదేరింది.. మనౌస్ నుంచి బార్సెలోస్‌కు గంటన్నర ప్రయాణ సమయం పడుతుందని వాతావరణంసరిగ్గా లేనందునే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. #Breaking A small plane crashed in Amazonas, Brazil, leaving at least 14 people dead, including the pilot and co-pilot. Among the victims were several American tourists. pic.twitter.com/RZ0GrYbfe6 — Bowner (@agentbowner) September 16, 2023 ఇది కూడా చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందటే.. -
ప్రిగోజిన్ మృతి.. రష్యా అధికారిక ప్రకటన..
పుతిన్ ప్రభుత్వంపై తిరుగుబాటుదారుడు, వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మరణించినట్లు రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. ఈ మేరకు జన్యు పరీక్షల రిపోర్టును బహిర్గతం చేసింది. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించాడనే వార్తల అనంతరం అనేక పుకార్లు వెలుగులోకి వచ్చాయి. ప్రిగోజిన్ మరణం వెనక రష్యానే కుట్ర పన్నిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల అనంతరం క్రెమ్లిన్ జన్యు పరీక్షలకు అనుమతినిచ్చింది. 'విమాన ప్రమాద ఘటన ద్యర్యాప్తులో భాగంగా జన్యు పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో ప్రిగోజిన్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఆయన విమాన ప్రమాదంలో మరణించారు.' అని ఇన్వెస్టిగేటివ్ కమిటీ అధికార ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో తెలిపారు. విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌తో పాటు మరో తొమ్మిది మంది అనుయాయులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ తొమ్మిది మందిలో డిమిత్రి ఉట్కిన్ ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా ఇంటెలిజెన్స్‌లో పనిచేసి, ప్రస్తుతం వాగ్నర్ గ్రూప్ నిర్వహణలో ప్రధాన వ్యక్తిగా అయన్ను చెప్పుకుంటారు. విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ట్రాఫిక్ ఉల్లంఘణలపై రష్యా దర్యాప్తు చేపట్టింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. విమాన ప్రమాదం.. పుతిన్‌పై తిరుగుబాటు చేసిన రెండు నెలల తర్వాత వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్.. రష్యాలోని మాస్కో నుంచి ప్రైవేట్ విమానంలో బయలుదేరగా ప్రమాదం జరిగింది. ఉన్నట్లుండి విమానం గాల్లో నుంచి కూలిపోయింది. ఈ ఘటనలో చెలరేగిన మంటల్లో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని రష్యా మీడియా వెల్లడించింది. ఇందులో ప్రిగోజిన్‌తో పాటు ఆయన అనుచరులు మొత్తం పది మంది ఉన్నట్లు మీడియా తెలిపింది. "The plane will fall apart in mid-air", a video of Prigozhin predicting his death has appeared. 💬"You better kill me, but I won't lie. I have to be honest: Russia is on the brink of disaster. If these cogs are not adjusted today, the plane will fall apart in mid-air", Prigozhin… pic.twitter.com/sG8beb2HLp — Anton Gerashchenko (@Gerashchenko_en) August 27, 2023 పుకార్లపై క్రెమ్లిన్ రియాక్షన్.. తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్‌ను రష్యానే హతమార్చిందని పశ్చిన దేశాల నాయకులు ఆరోపణలు చేశారు. దీనిపై క్రెమ్లిన్ ఇటీవల స్పందించింది. అదంతా పచ్చి అబద్దం అని తెలిపింది. ప్రిగోజిన్ ఖచ్చితంగా చనిపోయాడనే విషయాన్ని తెలపడానికి నిరాకరిచింది. ప్రస్తుతం ఆ వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఇదీ చదవండి: Biden On Yevgeny Prigozhin Death: యెవ్గెనీ ప్రిగోజిన్ మృతిపై బైడెన్ షాకింగ్ కామెంట్స్ -
ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు!
వాషింగ్టన్: రష్యాలోని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణంపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ సహా పదిమంది దుర్మరణం పాలయ్యారు. అయితే, ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, విమానం కూలిన తీరుతో పాటు ఇతరత్రా అంశాలను విశ్లేషించి ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపాయి. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి జనరల్ పాట్ రైడర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో కూల్చేశారని చెప్పారు. అయితే, దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుతిన్ తన శత్రువులను తుదముట్టించే క్రమంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, కూల్చేశారని వివరించారు. అయితే, పేలుడుకు కారణమేమిటనే విషయం కానీ, తన పేరును కానీ వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. మరోవైపు, తన సెక్యూరిటీతో పాటు తన అనుచరుల భద్రత విషయంలో తమ చీఫ్ ప్రిగోజిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని వాగ్నర్ గ్రూపుకు చెందిన సైనికులు చెబుతున్నారు. అలాంటిది కీలక అనుచరులను వెంటబెట్టుకుని ఒకే విమానంలో ఎందుకు ప్రయాణించారో తెలియడం లేదంటున్నారు. వాగ్నర్ గ్రూపులోని కీలక వ్యక్తులంతా సెయింట్ పీటర్స్బర్గ్కు ఎందుకు వెళుతున్నారో కూడా తెలియదని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా ప్రిగోజిన్ ఆఫ్రికా దేశంలో ఉన్నారని అక్కడ తమ సైన్యంలో ఎవరైనా చేరాలనుకుంటే చేరవచ్చని ఆయన తెలుపుతున్నట్లు ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం చూస్తే తిరుగుబాటు నాయకుడిని ఆఫ్రికాలోనే హత్య చేసి దాన్ని విమాన ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రిగోజిన్ చనిపోయాడన్న వార్తపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. వాస్తవాలు ఏమిటో తెలియదు కానీ ఇందులో ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ అయితే.. ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై హేతుబద్దమైన అనుమానాలున్నాయని అన్నారు. మొత్తంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఎదురు తిరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనడానికి ప్రిగోజిన్ ఉదంతాన్ని ఉదహరిస్తూ ప్రపంచ నేతలు స్పందించడం కొసమెరుపు. ఇది కూడా చదవండి: భారత్ చైనా సంబంధాలు బలపడాలి: జిన్‌పింగ్ -
రష్యాలో విమాన ప్రమాదం..వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతి
మాస్కో: రష్యాలో బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. రష్యా అనుకూల కిరాయి సైనిక ముఠా వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ కూడా మృత్యువాతపడ్డారు. ప్రయాణికుల జాబితాలో ఆయన పేరు కూడా ఉన్నట్టు అధికారులు ధ్రువీకరించారు. అతని సొంత విమానమని చెబుతున్న సదరు ప్రైవేట్ బిజినెస్ జెట్ రష్యా రాజధాని మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో త్వెర్ ప్రాంతంలో కుప్పకూలింది. వివరాల ప్రకారం.. మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌బర్గ్‌కు వెళ్తున్న ప్రైవేటు జెట్ కూలి.. మృతిచెందిన వారిలో ఏడుగురు ప్రయాణికులతో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కుప్పకూలిన జెట్ ప్రిగోజిన్ పేరున ఉన్నట్లు సమాచారం. అయితే, క్రెమ్లిన్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన దాదాపు రెండు నెలల లోపే ప్రిగోజిన్ దుర్మరణం పాలవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పాటు రష్యా ఎయిర్ ఫోర్స్ కమాండర్ సెర్గీ సురోవికన్ను తొలగించినట్లు రష్యా మీడియా ఇటీవల పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రిగోజిన్ విమానం కుప్పకూలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుతిన్‌పై తిరుగుబాటు.. ఉక్రెయిన్‌పై.. సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్.. జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా.. రష్యా ఉలిక్కిపడింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ బృందాల తిరుగుబాటుకు తెరపడింది. ఎవరీ ప్రిగోజిన్..? రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్‌ను.. పుతిన్ షెఫ్‌గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990ల్లో పుతిన్‌కు-ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర కూడా బయటకు వచ్చింది. ఇది కూడా చదవండి: వీడియో: నేలపై జెండా.. ప్రధాని మోదీ ఏం చేశారంటే.. -
కూలిన చిన్న విమానం..10 మంది మృతి
కౌలాలంపూర్: మలేసియాలోని సెంట్రల్ సెలంగోర్‌లో గురువారం చిన్న విమానం కూలిన ఘటనలో మొత్తం 10 మంది చనిపోయారు. లంగ్క్వావి నుంచి సుబంగ్ విమానాశ్రయం వైపు వస్తున్న ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా విమానం పల్టీలు కొడుతూ రహదారిపై కుప్పకూలింది. రహదారిపై వెళ్తున్న బైక్, కారుపై పడటంతో విమానంలోని 8 మందితోపాటు మరో ఇద్దరు చనిపోయారు. ఘటనకు కారణం తెలియాల్సి ఉంది. విమానం బ్లాక్‌బాక్స్ కోసం గాలింపు జరుగుతోంది. -
Malaysia Plane Crash: హైవేపై కుప్పకూలిన విమానం.. వైరల్ వీడియో
కౌలాలంపూర్: మలేషియాలో ఓ విమానం హఠాత్తుగా నేలపై కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై వెళ్తోన్న ఇద్దరు వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక కారు డాష్ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు క్షణాల వ్యవధిలో వైరల్ గా మారాయి. మలేషియాలోని ఒక నాలుగు లైన్ల రహదారిపై వెళ్తోన్న కారు డాష్ కెమెరాలో ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు రికార్డయ్యాయి. ఆకాశం నుండి ఒక్కసారిగా ఊడిపడినట్టుగా ఓ విమానం రెప్పపాటులో నేలకొరిగింది. అంతే వేగంగా కూలిన విమానం నుండి దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానం లాంగ్కావి లోని నార్తర్న్ రిసార్ట్ ఐలాండ్ నుండి బయలుదేరి రాజధాని కౌలాలంపూర్ కు పశ్చిమాన ఉన్న సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి చేరాల్సి ఉంది. విమానంలో ఆరుగురు ప్యాసింజర్ల తోపాటు ఇద్దరు సిబంది ఉన్నారని తెలిపారు. విమానంలో ఎనిమిది మంది తోపాటు రోడ్డుపై వెళ్తోన్న ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. Dashcam footage shows final moments of the private jet crash in Malaysia. https://t.co/1rsoP7ALGx Viewer discretion advised. pic.twitter.com/fo4Fqxu319 — Breaking Aviation News & Videos (@aviationbrk) August 17, 2023 మలేషియా సివిల్ ఏవియేషన్ అథారిటీ అధిపతి నొరాజ్ మన్ మహమూద్ తమకు ఈ విమానం నుండి ఎలాంటి మేడే(ప్రమాదాన్ని సూచించే) సిగ్నల్స్ అందలేదన్నారు. మలేషియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ సభ్యుడు మహమ్మద్ స్యామీ మహమ్మద్ హషీమ్ ఈ విమానం అస్థిరంగా వెళ్తుండటాన్ని తానూ చూశానని కొద్దిసేపటికే పెద్ద శబ్దం విన్నానని అన్నారు. ఇది కూడా చదవండి: సింగపూర్‌లో భారీ కుంభకోణం.. రూ.4492 కోట్ల ఆస్తులు స్వాధీనం -
అమెజాన్ కారడవిలో పసివాళ్లను కాపాడారు ఇలా.. (ఫొటోలు)
-
అమెజాన్ అడవుల్లో అద్భుతం
బొగొటా: దక్షిణ అమెరికాలోని కొలంబియాలో దట్టమైన అమెజాన్ అడవుల్లో ఒక అద్భుతం జరిగింది. విమాన ప్రమాదంలో చిక్కుకొని అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు ఏకంగా 40 రోజుల తర్వాత మృత్యుంజయులుగా బయటపడ్డారు. విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడమే ఒక అద్భుతమైతే, క్రూరమృగాలు తిరిగే అడవుల్లో 40 రోజులు ప్రాణాలతో ఉండడం మరో అద్భుతం. దట్టమైన అటవీ ప్రాంతంలో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న సైనికులు వారిని క్షేమంగా వెనక్కి తీసుకువచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పౌష్టికాహార లోపంతో బాగా బలహీనపడిపోవడంతో పాటుగా ఆ చిన్నారుల శరీరంపై పురుగు పుట్రా చేసిన కాట్లు ఉన్నాయి. ఒకే తల్లి బిడ్డలైన నలుగురు చిన్నారుల్లో 13, 9. 4 ఏళ్లతో పాటుగా ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడు. చరిత్రలో నిలిచిపోతారు : అధ్యక్షుడు పెట్రో అడవుల్లో కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు క్షేమంగా వెనక్కి తిరిగి రావడంతో దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో మృత్యుంజయులు అన్న మాటకి వీరంతా ఉదాహరణగా నిలుస్తున్నారని అన్నారు. వీరు ప్రాణాలతో ఉండడం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఇదొక మేజికల్ డే అని సైనికులు చేసిన కృషిని అభినందించారు. అసలేం జరిగింది? అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలో అరారాక్యూరా నుంచి శాన్‌జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి గత నెల మే 1న ఒక సింగిల్ ఇంజిన్ విమానం బయల్దేరింది. నలుగురు చిన్నారులు, వారి తల్లి, ఒక గైడ్, ఒక పైలెట్‌తో విమానం బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తి ఇంజిన్ విఫలం కావడంతో దట్టమైన కీకారణ్యంలో కుప్పకూలిపోయింది. విమానం రాడార్ నుంచి అదృశ్యం కావడంతో అధికారులు వారిని కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. ఆపరేషన్ హోప్ పేరుతో సహాయ చర్యలు మొదలు పెట్టారు. విమాన ప్రమాదం జరిగిన రెండు వారాల అనంతరం మే 16న అధికారులు విమాన శకలాలను గుర్తించగలిగారు. అక్కడ పైలెట్, గైడ్, చిన్నారుల తల్లి మృతదేహాలు మాత్రమే లభించడంతో పిల్లలు నలుగురు సజీవంగా ఉన్నారని నిర్ణారణకి వచ్చారు. పిల్లలు క్షేమంగానే ఉన్నారనడానికి సైనికుల గాలింపుల్లో పాలసీసా, సగం తిని పారేసిన పండు, జడకు కట్టుకునే రిబ్బన్ వంటివి దొరకడంతో సహాయ చర్యలు మరింత ముమ్మరం చేశారు. పిల్లల అడుగు జాడలు కూడా చాలా చోట్ల కనిపించాయి. వాటి ఆధారంగా దాదాపుగా 150 మంది సైనికులతో పాటుగా జాగిలాల సాయంతో దట్టమైన అడవుల్లో గాలించారు. అడవుల్లో ఉండే గిరిజన తెగలు వారికి సహకారం అందించారు. మొత్తానికి ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత అధికారులు ఆ పిల్లల జాడ కనిపెట్టగలిగారు. హెలికాప్టర్లో రాజధాని బొగొటాలో ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎలా మనుగడ సాగించారు? అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇన్నాళ్లూ పులులు, పాములు ఇతర క్రూరమృగాల మధ్య ఎలా మనుగడ సాగించారో వివరాలు తెలియాల్సి ఉంది.ఆ పిల్లలు హ్యూటోటో అనే స్థానిక తెగకు చెందినవారు. పుట్టినప్పట్నుంచి అటవీ ప్రాంతాల్లోనే వారు నివాసం ఉంటున్నారు. అడవుల్లో చెట్లకు కాసే ఏ పళ్లు తినాలో , క్రూర మృగాల బారిన పడకుండా ఎలా తమని తాము కాపాడుకోవాలో కొంతవరకు వారికి అవగాహన ఉంది. అందుకే కీకారణ్యంలో తప్పిపోయినా ప్రాణాలు నిలబెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సహాయ కార్యక్రమాల్లో భాగంగా హెలికాప్టర్ల ద్వారా జారవిడిచిన ఆహార పొట్లాలు బహుశా పిల్లలను కాపాడి ఉంటాయని సైనికాధికారులు భావిస్తున్నారు. పిల్లలు క్షేమంగా తిరిగిరావడంతో వారి బామ్మ ఫాతిమా వాలెన్సియా ఆనందానికి హద్దులే లేవు. పిల్లల తల్లి పనిలో ఉన్నప్పుడు పెద్దమ్మాయి మిగిలిన చిన్నారుల ఆలనాపాలనా చూసేదని, అదే ఇప్పుడు అడవుల్లో వాళ్లు ఇన్నాళ్లూ గడపడానికి ఉపయోగపడిందని చెప్పారు. -
NRI News: తల్లిని చిదిమేసిన విమానం.. కూతురి పరిస్థితి విషమం
న్యూజెర్సీ: న్యూయార్క్‌లో జరిగిన విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళ ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో ఆమె కూతురు, పైలట్ గాయాలతో బయటపడినప్పటికీ.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోమా గుప్తా(63), ఆమె తనయ రీవా గుప్తా(33)లు ఆదివారం ఓ తేలికపాటి ప్రదర్శన విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో కాక్‌పిట్ నుంచి పొగ రావడంతో పైలెట్ దానిని లాంగ్ ఐల్యాండ్ వద్ద క్రాష్ ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో విమానంలో మంటలు చెలరేగి రోమా అక్కడిక్కడే మృతి చెందగా.. కాలిన గాయాలతో రీవా, పైలెట్(23)లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు ఫార్మింగ్డేల్ రిపబ్లిక్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ముగ్గురితో టేకాఫ్ అయ్యింది. ప్రమాదానికి గురైన ఫోర్ సీటర్ విమానం టూరిస్ట్ ఫ్లైట్ అని, కేవలం ప్రదర్శన(డెమో) కోసమే ఉంచారని అధికారులు చెబుతున్నారు . అయితే న్యూజెర్సీకి చెందిన ఆ తల్లీకూతుళ్లు ఆ తేలికపాటి విమానాన్ని కొనుగోలు చేసినట్లు విమాన కంపెనీ తరపు న్యాయప్రతినిధులు చెప్తున్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టేందుకు ఒకవైపు ఎన్టీఎస్బీ(National Transportation Safety Board), మరోవైపు ఎఫ్ఏఏ(Federal Aviation Administration) దర్యాప్తు చేపట్టాయి. ఇప్పటికే మూడుసార్లు ప్రమాద స్థలానికి వెళ్లి.. శకలాలను పరిశీలించారు. ఇదిలా ఉంటే.. గుప్తా కుటుంబం కోసం GoFundMe ద్వారా ఇప్పటికే 60వేలకు పైగా డాలర్లను సేకరించారు. -
ఆ విమానం కూలి మంటల్లో చిక్కుకుంది..కానీ ఆ ఇద్దరు పైలట్లు..
విమానం కూలి పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. ఆ విమానం బూడిద అయ్యి చివరి తోక భాగం మాత్రమే కనిపిస్తుంది. వైమానికి చిత్రాల్లో నేలపై కనిపిస్తున్న దృశ్యం చాలా భయానకంగా ఉంది. కానీ ఆ ఇద్దరు పైలట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడటం అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో పెర్త్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఆగ్నేయంగా 420 కి.మీ దూరంలో ఫిట్జ్‌గెరాల్డ్ నేషనల్ పార్క్‌లో బోయింగ్ 737 వాటర్ బాంబింగ్ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. అది కూలడంతో భూమికి సమాంతరంగా.. బలంగా తాకడంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మొత్తం అక్కడ ఉన్న పచ్చని చెట్లు బూడిదయ్యి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ ఘటనలో విమానం పూర్తిగా ధ్వంసమై వెనుకభాగం మాత్రమే కనిపిస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే తీసిన ఎమర్జెన్సీ సర్వీసెస్ చిత్రాలు విమానం తోకభాగం వేరు చేయబడి ఉన్నట్లు కనిపించింది. ఈ ప్రమాదం బారి నుంచి విమానంలోని ఇద్దరు పెలెట్లు సురక్షితంగా బయటపడటం మిరాకిల్ అని ఆస్ట్రేలియా అత్యవసర సేవల మంత్రి స్టీఫెన్ డాసన్ అన్నారు. వాస్తవానికి అది ఎయిర్ ట్యాంకర్‌గా మార్చబడిన ప్రయాణికుల విమానం అని చెప్పారు. అయితే ఆయా ప్రాంతాల్లో నీటిని సరఫరా చేసేశాకే ఆ విమానం కూలినట్లు వెల్లడించారు. వీటిని అగ్నిమాపక విమానాలుగా వ్యవహరిస్తారన్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే అధికారుల సంఘటనస్థలి నుంచి ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పీట్ రికార్డర్ని స్వాధీనం చేసుకోన్నట్లు చెప్పారు. గత ఐదేళ్లో 64 అగ్నిమాపక విమాన ప్రమాదాలు జరిగాయని, ఆయా సంఘటనల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాల గురించి భద్రతా విభాగం పరిశీలిస్తోందన్నారు. ఇలింటి అనహ్య ఘటనల్లో సిబ్బందిని సురక్షితంగా రక్షించడంపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భద్రతా అధికారులు దృష్టి సారించనున్నట్లు మంత్రి స్టీఫెన్ పేర్కొన్నారు. (చదవండి: ముగ్గురు అమ్మాయిలను పెళ్లాడిన వ్యక్తి!) -
విమాన ప్రమాదం: అంజూను మర్చిపోలేం.. షాక్‌కు గురైన సహ విద్యార్థులు
సాక్షి, తెనాలి: నేపాల్‌లోని పొఖారాలో జరిగిన విమాన ప్రమాదంలో కోపైలట్ అంజూ ఖతివాడ మరణించడంతో.. తెనాలిలోని ఆమె సహ విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. నేపాల్‌లోని విరాట్ నగర్‌కు చెందిన అంజూ 1995లో తెనాలిలోని వివేకానంద జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ విద్యాభ్యాసం చేశారు. ఆ బ్యాచ్‌లో నేపాలీలు మొత్తం 125 మంది వరకు ఉన్నారని.. అందులో అంజూ అందరితో కలివిడిగా.. చదువులో చురుగ్గా ఉండేది. బైపీసీలో 72 శాతం మార్కులు సాధించిందని.. వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరితో టచ్‌లో ఉండేదని సహ విద్యార్థి లింగం మకుటం శివకుమార్ చెప్పారు. ఆమె భర్త కూడా పైలట్ అని.. ఓ విమాన ప్రమాదంలో మరణించారని పేర్కొన్నారు. బీమా డబ్బుతో అంజూ పైలట్ శిక్షణ తీసుకుందని చెప్పారు. 6,400 గంటలకు పైగా విమానం నడిపిన అంజూ ఇలా ప్రమాదంలో మరణించడాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. అంజూను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. కాగా, అంజూ మృతిపై వివేక విద్యాసంస్థల డైరెక్టర్ వీరనారాయణ సంతాపం తెలిపారు. చదవండి: (శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్ భార్య ఆత్మహత్య) -
నేపాల్ విమానానికి రంద్రాలు..టిష్యూతో కవర్ చేసిన ఎయిర్‌హోస్ట్
నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో 70 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం నాటికి ఈ సంఘటనలో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు. This is really really sad. Few yrs ago on my flight to Pokhara, when I told the stewardess that airflow was coming from the corner of a window while airborne, she brought a tissue paper & stuffed the crevice. Decided to never fly to Pokhara again expecting the worst one day 😔 https://t.co/Mf8kBHqIWV — Kunal Bahl (@1kunalbahl) January 15, 2023 ఇక ఈ విమాన ప్రమాదంపై స్నాప్ డీల్ కో-ఫౌండర్ కునాల్ బహ్ల్ విచారం వ్యక్తం చేశారు. నేపాల్ విమాన ప్రమాద వార్తని ట్వీట్ చేశారు. గతంలో బిజినెస్ పనిమీద పొఖారాకు వెళ్లిన బహ్ల్‌కు విమానంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఇది నిజంగా విచారకరం. కొన్ని సంవత్సరాల క్రితం నేను పోఖారాకు వెళ్లాను. నేను ప్రయాణిస్తున్న విమానం కిటికీలకు ఏర్పడిన పగుళ్ల కారణంగా ఆకాశ మార్గంలో ఉండగా.. బయట నుంచి గాలి విమాన కిటికీల పగుళ్ల గుండా లోపలికి వస్తుంది. ఇదే విషయాన్ని గుర్తించిన నేను వెంటనే పక్కనే ఉన్న ఎయిర్ హోస్ట్‌కి సమాచారం అందించా. ఆమె ఓ టిష్యూ పేపర్‌ను అడ్డం పెట్టి గాలి లోపలికి రాకుండా ప్రయత్నించింది. నా దృష్టిలో అదే అంత్యత వరస్ట్ డే. నాటి నుంచి మళ్లీ పోఖారాకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను’ అని ట్వీట్లో తెలిపారు. -
Nepal Plane Crash: వద్దన్నా! పట్టుబట్టి డ్యూటీకి వెళ్లింది..ఓ నాన్న ఆవేదన
నేపాల్ విమానా ఘటన తర్వాత పలువురు గురించి వస్తున్న ఆసక్తికర విషయాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ఆ ఘటన బాధిత కుటుంబాలకు అంత తేలిగ్గా మర్చిపోలేని అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆ దుర్ఘటన రోజు విధులు నిర్వర్తించేందకు వెళ్లిన ఫ్లైట్ అటెండెంట్ ఓషిన్ అలే మగర్ది మరో విషాద గాథ. ఆ ఫ్లైట్ అటెండెంట్ అలే మగర్ రెండేళ్లుగా యతి ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తోంది. ఆమె ఖట్మాండ్లో తన కుటుంబంతో నివశిస్తోంది. వాస్తవానికి ఆరోజు విధులు నిర్వర్తించాల్సింది కాదు. ఇంట్లో తండ్రి మోహన్ అలే మగర ఆమెను ఆరోజు డ్యూటీ మానేయమని, సంక్రాంతి పండుగ చేసుకుందామని చెప్పారు. అయినా సరే ఆమె పట్టుపట్టి మరీ ఆ రోజు విధులకు వెళ్లింది. పైగా తాను రెండు విమానాల్లో చేయాల్సిన డ్యూటీని ముగించుకుని సంక్రాంతి రోజుకల్లా వచ్చేస్తానంటూ వెళ్లిందన ఆమె తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. కచ్చితంగా సంక్రాంతి రోజున ఇంట్లోనే ఉంటానని హామీ ఇచ్చిందంటూ విలపించారు. అంతలోనే ఈ ప్రమాదం బారిన పడి కానరాని లోకాలకు వెళ్లిపోయిందని ఆవేదనగా చెప్పారు. ఆమెకు పెళ్లై రెండేళ్లే అయ్యిందని, ఆమె భర్త యూకేలో ఉన్నట్లు తెలిపారు. ఐతే ఇప్పుడూ ఆ ఫ్టైల్ అటెండెంట్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..నెటిజన్లు ఆ యతి ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోడానికి కొన్ని క్షణాల ముందు రికార్డు చేసిన వీడియో అని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇది గతేడాది సెప్టెంబర్ 11న రికార్డు చేసిన వీడియో అని, విమానం క్రాష్ జరగడానికి ముందు తీసినది కాదని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేసిన వీడియో ఆధారంగా తెలుస్తోంది. కాగా, నేపాల్‌లో ఆదివారం యతి ఎయిర్‌లైన్ ఏటీఆర్ 72 విమానం కూలి సుమారు 68 మంది దాక మృతి చెందిన సంగతి తెలిసిందే. The Air hostess in #YetiAirlinesCrash Live life to the fullest as long as you are alive because death is unexpected! Just sharing TikTok video of Air Hostess Oshin Magar who lost her life in #NepalPlaneCrash today जहां भी रहो ऐसे ही रहो! Rest in Peace !!💐#Nepal #planecrash pic.twitter.com/Bh6DBDnhnt — Deep Ahlawat 🇮🇳🎭 (@DeepAhlawt) January 15, 2023 (చదవండి: ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు) -
ప్రాణాంతక పర్యాటకం
దారుణం... అందరినీ కన్నీరు పెట్టించిన అనూహ్య ప్రమాదం. సంక్రాంతి పూట ఆదివారం ఉదయం హఠాత్తుగా జరిగిన నేపాల్ విమాన ప్రమాదఘటన తీవ్రత అలాంటిది. ఆ హిమాలయ దేశంలోని రెండో అతి పెద్ద దేశీయ విమానయాన సంస్థ యతీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండింజన్ల ఏఆర్టీ–72 విమానం ప్రమాదానికి గురై, అయిదుగురు భారతీయులతో సహా అందులోని 72 మందీ ప్రాణాలు కోల్పోయారు. కాఠ్మండూకు పశ్చిమాన 125 కి.మీ.ల దూరంలో, పోఖరాలో కాసేపట్లో దిగాల్సిన విమానం వాతావరణం బాగున్నా ఇరుకు కొండమార్గంలో కూలిపోవడం దురదృష్టకరం. నేపాల్‌లో గత మూడు దశాబ్దాల్లో అతి పెద్ద విమాన దుర్ఘటన ఇదేనట. వరుస ప్రమాదాలతో అపకీర్తిని మూటగట్టుకున్న నేపాల్ నిద్ర మేల్కొని నిర్లక్ష్యం వీడాలని ఇది గుర్తుచేస్తోంది. టేకాఫైన 20 నిమిషాల్లో అంతా అయిపోయింది. అప్పటి దాకా నవ్వుతూ, తుళ్ళుతూ సాగిన ప్రయాణం రెప్ప పాటున ఎగసిన అగ్నికీలల్లో ఆర్తనాదాల మధ్య దుఃఖభరితం కావడం దిగ్భ్రాంతికరం. విమానం కిందకు దిగుతున్న వేళ ప్రయాణికులు కొందరు ఫేస్బుక్ లైవ్ చేస్తుండడంతో యాదృచ్ఛికంగా ఈ ప్రమాద ఘటన దృశ్యాలు ప్రత్యక్షంగా సోషల్ మీడియాకు చిక్కాయి. విమానంలోని బ్లాక్ బాక్స్ దొరికింది గనక, దాని సమాచార విశ్లేషణతో ప్రమాద కారణాలు త్వరలోనే బయటపడవచ్చు. మూడు దశాబ్దాల క్రితం 1992లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమానం కాఠ్మండు విమానాశ్రయానికి వస్తూ, ఘోర ప్రమాదానికి గురై 167 మంది ప్రాణాలను బలి తీసుకుంది. నేపాలీ విమానయాన చరిత్రలో ఆ పీఐఏ ప్రమాదం అతి పెద్దది. ఆ తర్వాత ఈ హిమాలయ ప్రాంతంలో అనేక విమాన ప్రమాదాలు జరిగినా, ప్రాణనష్టం, తీవ్రతల్లో తాజా ఘటన మళ్ళీ ఆ గత చరిత్రను గుర్తు చేసింది. నిజానికి, ఇలాంటి విషాదాలు నేపాల్‌కు కొత్త కావు. ఎనిమిది నెలల క్రితమే నిరుడు మే నెలలో తారా విమానం కూలి, 22 మంది మరణించారు. 2000 నుంచి చూస్తే 22 ఏళ్ళలో నేపాల్‌లో 18 విమాన ప్రమాదాలు జరిగాయి. 350కి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ పర్వత ప్రాంత దేశంలో మారుమూల ప్రాంతాలు, సంక్లిష్టమైన రన్వేలు, ఆ పక్కనే ఎల్తైన కొండలు, ఇరుకైన కొండ మలుపుల లాంటివి అనేకం. కొమ్ములు తిరిగిన పైలట్లకూ అక్కడ విమానాలు నడపడం సవాలే. ప్రపంచంలోని అతి ఎల్తైన 14 పర్వత శిఖరాల్లో 7 నేపాల్‌లోనే ఉన్నాయి. పర్వతారోహకులకు సవాలు విసిరే ప్రసిద్ధ ఎవరెస్ట్ సైతం ఈ చిన్న హిమాలయ దేశంలోనే నెలకొంది. ఎల్తైన పర్వతశిఖరాలకు తోడు అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు సరేసరి. కొన్నేళ్ళుగా నేపాల్‌లో జరిగినన్ని విమాన ప్రమాదాలు మరెక్కడా జరగలేదంటే ఇవే కారణం. పర్వత ప్రాంత నేపాలీ పర్యాటకమే ఆకర్షణగా విదేశీ పర్వతారోహకుల తాకిడి కొన్నేళ్ళుగా బాగా పెరిగింది. ఫలితంగా, ఆ దేశంలోని సంక్లిష్ట ప్రాంతాలకు సైతం సరకులనూ, మనుషులనూ తీసుకెళ్ళే విమాన రంగం కొన్నేళ్ళుగా విస్తరించింది. అదే సమయంలో ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వద్ద లూక్లాలోని టెన్సింగ్– హిల్లరీ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోకెల్లా ప్రమాదభరితమైన వాటిలో ఒకటైంది. 1960 నుంచి 2019 ఏప్రిల్ వరకు జరిగిన ప్రమాదాలు, ప్రాణనష్టాల లెక్క చూస్తే లూక్లా, జామ్సమ్, సిమీకోట్, జుమ్లా, దోల్పాలు నేపాల్‌లో ప్రమాద భూయిష్ఠమైనవని తేల్చారు. పైపెచ్చు, నిర్వహణ లోపాలు, తగినంత శిక్షణ లేకపోవడం, ప్రమాణాలు పాటించకపోవడం, అలసిసొలసిన పైలట్లు – ఇలా అనేకం ఆ దేశ విమానయాన రంగాన్ని పట్టిపీడిస్తున్నాయి. వీటి నుంచి నేపాల్ పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. చివరకు యూరోపియన్ యూనియన్ సైతం భద్రతా కారణాల రీత్యా నేపాలీ విమానసర్వీసుల్ని నిషేధించాయంటే అర్థం చేసుకోవచ్చు. వాతావరణ వైవిధ్యం, సంక్లిష్ట భౌగోళిక ప్రాంతమనేవి నేపాల్‌లో విమానయానానికి సవాళ్ళనీ, చిన్న విమానాలు తరచూ ప్రమాదాల పాలవుతున్నది అందుకేననీ నేపాల్ పౌర విమానయాన ప్రాధి కార సంస్థ 2019లోనే తన నివేదికలో పేర్కొంది. అయితే, పరిష్కారానికి చేసిన ప్రయత్నాలే పెద్దగా లేవు. వరుస విమాన ప్రమాదాల పాపం నేపాల్ పాలకులదనేది అందుకే! ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ దర్యాప్తులు చేస్తూనే ఉన్నారు. దర్యాప్తు సంఘాలు నివేదికలు ఇస్తూనే ఉన్నాయి. కానీ, ఆ నివేదికల్లోని సిఫార్సుల అమలు శూన్యం. అందుకే, ప్రమాదాలు, ప్రాణనష్టం ఆగడమే లేదు. తాజా ఘటనాస్థలమైన పోఖరా విమానాశ్రయ ప్రాంతం ప్రమాదభరితమే. నేపాల్‌ను చంక నెట్టుకోవాలని చైనా చేస్తున్న దోస్తీ భారత్‌కు మరింత ప్రమాదభరితం. చైనాతో ఒప్పందంతో ఏడేళ్ళలో ఈ ఎయిర్పోర్ట్ వచ్చింది. బీజింగ్ ఒత్తిడితో, నిపుణుల మాట తోసిపుచ్చి, సర్వసన్నద్ధం కాకుండానే ఈ ఎయిర్‌పోర్ట్‌ను ఇటీవలే ప్రారంభించారు. హిమాలయ శ్రేణుల్లో భారత్‌ను ఇరుకున పెట్టాలన్నది డ్రాగన్ వ్యూహం కాగా, ప్రయాణికుల ప్రాణాల కన్నా పర్యాటకమే ముఖ్యమన్నట్టు నేపాల్ ముందుకు సాగడం దుస్సహం. షార్ట్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (స్టోల్) విమానాలతో పర్యాటక వాణిజ్య లబ్ధికై విజువల్ ఫ్లైట్ నిబంధనల్ని కూడా ఆ దేశం గాలికొదిలేస్తోంది. గత పదేళ్ళలో జరిగిన 19 ప్రమాదాల్లో 16 ఘటనలు స్టోల్ విమానాలవే గనక, భారత్ మన పర్యాటకుల్ని అప్రమత్తం చేయాలి. ప్రాణాలకు పూచీపడని పొరుగు దేశంపై ఒత్తిడి తేవాలి. అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ సైతం తన 193 సభ్య దేశాల్లో ఒకటైన నేపాల్ తన వైమానిక భద్రత పెంచుకొనేలా కట్టుదిట్టం చేయాలి. నివేదికల్ని బుట్టదాఖలు చేస్తున్న నేపాలీ పాలకులు తక్షణమే పూర్తిస్థాయి భద్రతే లక్ష్యంగా కఠినచర్యలు చేపట్టకపోతే మరిన్ని ప్రాణాలకు ప్రమాదం! -
నేపాల్ విమాన ప్రమాదం.. జానపద గాయని మృతి
నేపాల్‌లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ సంఘటనలో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు. రష్యా సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, అర్జెంటీనా దేశస్థులు కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి ఇప్పటి వరకు ఎవరు ప్రాణాలతో బయటపడలేదు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలం వద్ద రెస్కూ చర్యలు సోమవారం తిరిగి ప్రారంభించారు. జానపద గాయని మృతి విమానం కుప్పకూలిన ప్రమాదంలో నేపాల్ ప్రముఖ జానపద గాయని నీరా ఛాంత్యల్ ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో నీరా చనిపోయిందనే విషయాన్ని ఆమె సోదరి హీరా ఛాంత్యల్ షెర్చాన్ వెల్లడించింది. ‘పోఖారాకు విమానంలో బయలుదేరిన నీరా మరణించింది. ఆమె మాఘ్ సంక్రాంతి సందర్భంగా పోఖారరాలో నిర్వహిస్తున్న ఓ ఈవెంట్లో పాల్గొనడం కోసం వెళ్లింది. అంతకుముందు నీరా.. అభిమానులకు మాఘ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. అందులో రేపు పొఖారాలో చాలా ఎంజాయ్ చేస్తాను అంటూ రాసుకొచ్చింది. ఎవరీ నీరా? కాగా నేపాల్‌లోని బగ్లుండ్ ప్రాంతంలో పుట్టి పెరిగన నీరా.. కొంతకాలంగా రాజధాని ప్రాంతమైన ఖాట్మాండులో నివసిస్తోంది. జానపద పాటలలో పాపులారిటీ సాధించిన ఆమె గొంతుకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. జాతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వస్తధారణతో ఈవెంట్స్‌లో పాల్గొనే నీరా తన పాటలనుసోషల్ మీడియాలో పోస్టూ చేస్తూ ఉంటుంది. అయితే నీరా ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవ్వడంతో మాఘ్ సంక్రాంతి కార్యక్రమాన్ని రద్దు చేశామని నేపాల్ ఛంత్యాల్ యువజన సంఘం అధ్యక్షుడు నవీన్ ఘాత్రి ఛంత్యాల్ తెలిపారు. చదవండి: నేపాల్ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరిని ప్రాణాలతో గుర్తించలేదు.. బ్లాక్ బాక్స్ స్వాధీనం తాజాగా ఆర్మీ అధికారులు సంఘటన స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైందని ఖాట్మండు విమానాశ్రయ అధికారి షేర్ బాత్ ఠాకూర్ తెలిపారు. కాగా ఈ బ్లాక్ బాక్స్ ద్వారా కాక్‌పిట్‌లో పైలెట్ల మధ్య సంభాషణను రికార్డ్ చేస్తోంది. అంతేగాక ఫ్లైట్ డేటా ఇందులో రికార్డ్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్ సహాయంతో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: గాల్లో ఎగురుతున్నామని ఎంత ఉత్సాహం.. కానీ, గాల్లోనే కలిసిపోతామని..! -
Nepal Plane Crash: ఘోర ప్రమాదం.. నేపాల్‌లో కుప్పకూలిన విమానం, ఫోటోలు వైరల్
-
గాల్లో ఎగురుతున్నామని ఎంత ఉత్సాహం.. కానీ, గాల్లోనే కలిసిపోతామని..!
విమాన ప్రమాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సోమవారం ‘జాతీయ సంతాప దినం’ ప్రకటించింది. విమాన కూలిన ఘటనపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ అధ్యక్షతన మంత్రి మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా విమాన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 68 మంది మృతదేహాలను గుర్తించగా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు మరో నలుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయిదుగురు భారతీయులు రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం వల్లనే ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రమాదం సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా 72 మంది ఉన్నారు. వీరిలో అదుగురు భారతీయులతో కలిపి మొత్తం 15 విదేశీ ప్రయాణికులు ఉన్నారు. మరణించిన ఐదుగురు భారతీయులను అభిషేక్ కుష్వాహా(25), విషాల్ శర్మ(22), అనిల్ కుమార్ రాజ్‌భర్(27), సోను జైస్వాల్(35),సంజయ్ జైస్వాల్గా గుర్తించారు. అయిదుగురిలో యూపీకి చెందిన నలుగురు శుక్రవారమే(జనవరి 13) ఖట్మాండుకు వచ్చారు. వీరు పర్యాటక కేంద్రమైన లేక్ సిటీ పోఖారాలో పారాగ్లైడింగ్ అస్వాదించేందుకు వచ్చినట్లు దక్షిణ నేపాల్‌లోని సర్లాహి జిల్లా నివాసి అజయ్ కుమరా్ తెలిపారు. తామంతా ఒకే వాహనంలో భారత్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. పోఖారాకు బయలు దేరే ముందు పశుపతినాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారని,కి సమీపంలోని గౌశాలో, తరువాత హౌట్ డిస్కరీ ఆఫ్ తమెలో బస చేశారని వెల్లడించారు. ఫోఖారా నుంచిగోరఖ్‌పూర్ మీదుగా ఇండియాకు తిరిగి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. యూసీ సీఎం సంతాపం ఘోర ప్రమాదంలో మరణించిన ఐదుగురు భారతీయులలో నలుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నలుగురు యువకుల మృతదేహాలను సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి ముందు ఫేస్బుక్ లైవ్ నేపాల్ ప్రమాద ఘటన ముందు విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. సోనూ జైశ్వాల్ అనే అనే యూపీకి చెందిన యువకుడు విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు.. నవ్వుతూ వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. 58 సెకన్ల వీడియోలో విమానం ఒక్కసారిగా ఎడమవైపు మళ్లింపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అనంతరం నేలను ఢీకొని, మంటలు వ్యాపించాయి. ఈ దృశ్యాలన్నీ ఫోన్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. During the Nepal plane accident,a passenger who was the victim of the accident was doing Facebook Live, the video went viral on social media. At least 68 people have died after a 72-seater plane crashed. #planecrash #NepalPlaneCrash #Nepal #pokhra #NepalPlaneCrashVideo pic.twitter.com/KSLpWhBIRp — Gajraj Singh Parihar (@GAJRAJPARIHAR) January 15, 2023 అసలేం జరిగిందంటే.. నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తోన్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఖాట్మాండు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 10.33 నిమిఫాలకు టేకాఫ్ అవ్వగా.. 20 నిమిషాలు ప్రయాణించిన తర్వాత 10.50 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. పోఖారా చేరుకోవడానికి క్షణాల ముందు సెటి గండకి నది ఒడ్డున ఈ దుర్ఘటన జరిగింది. కాగా రెండు వారాల క్రితమే జనవరి 1న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. విమాన శిథిలాల నుంచి వెలికితీసిన మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం గండకి ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి, గుర్తించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కూలిపోయిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
నేపాల్ విమాన ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సంతాపం
న్యూఢిల్లీ: నేపాల్‌లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 72 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదం తనను బాధించిందని, ఎన్నో విలువైన ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు వాళ్లకు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. Pained by the tragic air crash in Nepal in which precious lives have been lost, including Indian nationals. In this hour of grief, my thoughts and prayers are with the bereaved families. @cmprachanda @PM_nepal_ — Narendra Modi (@narendramodi) January 15, 2023 ఈ ఘటనలో చనిపోయిన ఐదుగరు భారతీయుల్లో నలుగురిని ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌కు చెందిన విశాల్ శర్మ, సోను జైశ్వాల్, అనిల్ రాజ్‌భర్, అభిశేస్ కుశ్వాహాగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. సీఎం యోగి ఆదేశాలు.. మృతులు యూపీ వాసులు కావడంతో వారి పార్థీవ దేహాలను రాష్ట్రానికి తీసుకురావాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. విదేశీ వ్యవహరాల శాఖతో సమన్వయం చేసుకుని త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. नेपाल में हुई विमान दुर्घटना अत्यंत दुःखद है। इसमें भारतीय नागरिकों समेत काल-कवलित हुए सभी लोगों के प्रति विनम्र श्रद्धांजलि! मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं। प्रभु श्री राम दिवंगत आत्माओं को अपने श्री चरणों में स्थान व घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें। — Yogi Adityanath (@myogiadityanath) January 15, 2023 చదవండి: నేపాల్ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరిని ప్రాణాలతో గుర్తించలేదు.. -
నేపాల్ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరు కూడా..
నేపాల్‌లోని పోఖారా సమీపంలో ఆదివారం విమానం కుప్పకూలిన ఘటన ఘోర విషాదాన్ని మిగిల్చింది. సమయం గడిచే కొద్దీ ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దుర్ఘటన సమయంలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉండగా.. ఎవరూ ప్రాణాలతో బయట పడేలా కనిపించడం లేదు. ఒక్కరైనా బతికి బట్టకడతారనే ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. ప్రమాద స్థలం నుంచి అధికారులు ఇప్పటివరకు 68 మృతదేహాలను వెలికితీశారు. కాగా యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్-72 విమానం ఆదివారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఖాట్మండు నుంచి బయలుదేరిన విమానం పోఖారా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో కుప్పకూలింది. మరికొద్ది క్షణాల్లో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుందనగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం మరింత బాధాకరం. ఘటన సమయంలో విమానంలోప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 72 మంది ఉన్నారు. వీరిలో 68 ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. విమాన శిథిలాల నుంచి ఆర్మీ అధికారులు 68 మృతదేహాలను వెలికితీయగా.. మరో నలుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఘటన జరిగిన ప్రాంతం ప్రమాదకర ప్రదేశం కావడంతో రెస్క్యూ ప్రయత్నాలకు ఆటంకం కలిగిందని ఆర్మీ సిబ్బంది చెబుతున్నారు. అలాగే ఆదివారం రాత్రి చీకటి పడటంతో రెస్క్యూ చర్యలకు బ్రేక్ పడిందని సోమవారం ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ మళ్లీ ప్రారంభం కానుందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఎవరిని ప్రాణాలతో గుర్తించలేదని నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి క్రిష్ణ ప్రసాద్ బండారి తెలిపారు. చదవండి: కేంద్ర మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం.. మరణించిన వారి మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం గండకి ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి, గుర్తించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాణీకులలో 15 మంది విదేశీ పౌరులు ఉన్నారని చెప్పారు. వీరిలో అయిదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు దక్షిణ కొరియన్లు, ఒక ఆస్ట్రేలియన్, ఒక ఫ్రెంచ్, ఒకరు అర్జెంటీనా కాగా మరొకరు ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి. नेपाल प्लेन हादसे से पहले फेसबुक का लाइव वीडियो#NepalPlaneCrash pic.twitter.com/N7lyXS8HEV — Dhyanendra Singh (@dhyanendraj) January 15, 2023 Tragic plane crash in #Pokhara . In this difficult situation, we must acknowledge the bravery of the pilot in potentially preventing further loss of life by avoiding a crash in a populated area.#YetiAirlines #planecrash #Nepalcrash #PokharaAirport #NepalPlaneCrash pic.twitter.com/6yGLgUqEvK — Mutahir Showkat (@mutahirshowkat) January 15, 2023 -
నేపాల్ లో కుప్పకూలిన విమానం, 68 మంది మృతి
-
నేపాల్ విమాన ప్రమాదం.. 10 సెకన్ల ముందు వీడియో వైరల్..
కాఠ్మాండు: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు 10 సెకన్ల ముందు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓ స్థానికుడు మొబైల్లో ఈ వీడియోను చిత్రీకరించాడు. ఇందులో విమానం అతి తక్కువ ఎత్తులో ఎగురుతోంది. క్షణాల్లోనే అదుపుతప్పి ఏటవాలుగా ప్రయాణించింది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. The terrible last moments of the #NepalPlaneCrash! pic.twitter.com/wRTnB9i0QW — Ayushi Agarwal (@ayu_agarwal94) January 15, 2023 విమానం నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి పోఖారా వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. కాఠ్మాండు నుంచి టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత పోఖారా చేరుకోవడానికి క్షణాల ముందు విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఘటన తర్వాత అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కూలిపోయిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. Aerial shots of plane crash site in Pokhara#NepalPlaneCrash #pokhra #PokharaAirport #nepal pic.twitter.com/Fz1KsdqB4y — Vivek Bajpai (@vivekbajpai84) January 15, 2023 ప్రమాదం సమయంలో సిబ్బంది సహా మొత్తం 72 మంది విమానంలో ఉన్నారు. ఇందులో 68 మంది చనిపోయినట్లు నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి వారి మృతదేహాలను సిబ్బంది వెలికి తీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ విమానంలోని ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. #NepalPlaneCrash Prayers! pic.twitter.com/pn7ECs1Gyk — Rukhsar (@Rukhsar987) January 15, 2023 काठमांडू से पोखरा के लिए रवाना हुआ था विमान हादसे का शिकार, 72 में से अब तक 36 शव बरामद#YetiAirlines #NepalPlaneCrash #planecrash pic.twitter.com/wse90PU3n2 — Anchor Charul Sharma (@Anchor_Charul) January 15, 2023 చదవండి: వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే! -
విమాన ప్రమాదంపై నేపాల్ ప్రభుత్వం అధికారిక ప్రకటన
-
నేపాల్ లో రన్‌వేపై కుప్ప కూలిన విమానం
-
'తృటిలో తప్పించుకున్నా.. ఆలస్యమయ్యుంటే గాల్లో ప్రాణాలు'
కెన్యాకు చెందిన అథ్లెట్ డేవిడ్ రుడిషా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కెన్యాలోని కిమానా వైల్డ్‌లైఫ్ సాంచురీలో జరిగిన మసాయి ఒలింపిక్స్ కాంపిటీషన్‌కు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో అతను ప్రయాణిస్తున్న విమానం క్రాష్‌కు గురైంది. ఈ సమయంలో రుడిషాతో పాటు మరో ఐదుగురు ఉన్నారు. ల్యాండింగ్ చేసే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ విమానం టేకాఫ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో విమానంకు చెందిన రెక్క ఒకటి చెట్లకు తగిలి గుండ్రంగా తిరుగుతూ మట్టి పెళ్లపై పడిపోయింది. అప్పటికే డోరు తీసుకొని రుడిషా సహా మిగతా ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం రుడిషాతో పాటు మిగతావారు క్షేమంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఇక ప్రమాదంపై రుడిషా స్పందించాడు. ''మరో ఏడు, ఎనిమిది నిమిషాల్లో విమానం టేకాఫ్ తీసుకుంటుందనగా ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. విమానం రెక్క ఒకటి చెట్లకు తగిలి కింద పడడం ప్రారంభమైంది. అప్పటికే మేము గాయాలతో బయట పడ్డాం.. కొద్దిగా ఆలస్యమైనా మా ప్రాణాలు పోయేవే.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక డేవిడ్ రుడిషా 800 మీటర్ల రేసులో రెండుసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్‌లో 800 మీటర్ల రేసులో వరుసగా రెండు స్వర్ణ పతకాలు అందుకున్నాడు. అంతేకాదు 2011, 2015 వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ 800 మీటర్ల రేసులో పతకాలు సాధించాడు. David Rudisha after surviving a crash landing in Amboseli pic.twitter.com/aFzB6exHAl — Kenyans.co.ke (@Kenyans) December 11, 2022 -
విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లిన విమానం.. 90 వేల ఇళ్లకు పవర్ కట్..
వాషింగ్టన్: అమెరికా మేరీలాండ్‌లోని మాంట్గోమెరీ కౌంటీలో ఓ చిన్న సైజు విమానం విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటీ హాని జరగలేదు. కానీ కరెంటు తీగలు తెగిపోవడంతో కౌంటీలోని 90 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కౌంటీవాసులంతా అంధకారంలోకి వెళ్లారు. వర్షాలు పడటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 10 అంతస్తుల ఎత్తులోనే ఈ ప్రమాదం జరగడానికి కచ్చితమైన కారణాలు మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఈ ప్రమాదంపై మాంట్గోమెరీ పోలీసులు ట్వీట్ చేశారు. విమానం విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లిన ప్రాంతం వైపు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. అక్కడ కరెంటు తీగలు నెలపై పడి ఉన్నాయని పేర్కొన్నారు. చదవండి: తిరగబడ్డ చైనా.. మితిమీరిన ఆంక్షలపై కన్నెర్రజేసిన జనం.. -
ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం
దార్ ఎస్ సలాం: ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. బుకోబా నగరంలో ల్యాండింగ్ కావాల్సిన కొద్ది సమయానికి ముందే వాతావరణం అనుకూలించకపోవటంతో సరస్సులో పడిపోయింది. ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ‘ప్రెసిషన్ ఎయిర్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఎయిర్‌పోర్ట్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న నీటిలో పడిపోయింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు భద్రతా బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.’ అని రీజనల్ పోలీస్ కమాండర్ విలియమ్ వాంపఘేల్ తెలిపారు. మరోవైపు.. విమానంలో ప్రయాణికులు 49 మంది ఉన్నట్లు స్థానిక మీడియాలు నివేదించగా.. ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉడొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. టాంజానియా ఆర్థిక రాజధాని దార్ ఎస్ సలాం నుంచి బుకోబాకు ప్రయాణిస్తోంది. ప్రెసిషన్ ఎయిర్ సంస్థ టాంజానియాలో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ. విమాన ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. ప్రమాద ఘటనా స్థలానికి సహాయక బృందాలను పంపామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఉత్తర టాంజానియాలో సఫారీ సంస్థకు చెందిన విమాన ప్రమాదంలో 11 మంది చనిపోయిన 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రమాదం జరిగింది. Precision Air plane crashes into Lake Victoria while trying to land in Tanzania; no word on casualties pic.twitter.com/EpRrgPvAVB — BNO News (@BNONews) November 6, 2022 ఇదీ చదవండి: వారెవ్వా.. సరికొత్త గిన్నిస్ రికార్డ్.. ‘కీహోల్’లోంచి ఏడు బాణాలు! -
చైనా విమాన ప్రమాదంలో సంచలన విషయాలు.. పైలెట్లు కావాలనే అలా...
బీజింగ్: చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. విమానాన్ని పైలట్లే ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. బ్లాక్‌బాక్స్ డేటా విశ్లేషణలో ఈ విషయం తెలిసింది. విమానం ఎత్తు ఒక్కసారిగా తగ్గడాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గుర్తించి.. వెంటనే పైలట్లను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. కానీ, పైలట్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు తెలిపారు. దీనిని బట్టి కాక్‌పిట్‌లో ఉన్న సిబ్బందే కావాలని విమానం ఎత్తును ఒక్కసారిగా కిందకు దించి కూల్చేసి ఉంటారని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై బోయింగ్ గానీ, చైనా అధికారుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బోయింగ్ 737 మార్చి 21న గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలింది. 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. చదవండి👇 మీరొస్తానంటే.. నేనొద్దంటా! చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి! -
షాకింగ్: సిగరెట్ వల్లే ఆ ఘోర విమాన ప్రమాదం!
EgyptAir Flight 804 Mishap Details: ఆరేళ్ల కిందట జరిగిన ఓ విమాన ప్రమాదం గురించి దిగ్భ్రాంతి కలిగించే విషయం ఒకటి తెలిసింది. అనేక అనుమానాల నడుమ దాదాపుగా చిక్కుముడి వీడింది. మొత్తం 66 మంది ప్రయాణికులతో 37వేల అడుగులో వెళ్తూ.. సముద్రంలో కూలిన ఈజిప్ట్ ఎయిర్ విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈజిప్ట్ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఫ్రెంచ్ ఏవియేషన్ నిపుణులు.. ప్రమాదానికి ఒక సిగరెట్ కారణమని తేల్చారు. పైలట్ సిగరెట్ అంటించడం వల్ల కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయని, ఫలితంగా విమానం కుప్పకూలిందని నిర్ధారించారు. దర్యాప్తునకు సంబంధించి 134 పేజీల నివేదికను పారిస్‌లోని అప్పీల్ కోర్టులో గత నెల సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో ‘న్యూయార్క్ పోస్ట్’ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించడంతో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ విమాన ప్రమాదాన్ని ఉగ్రవాద దాడిగా ఈజిప్ట్ ప్రకటించింది. కానీ, ఏ ఉగ్రసంస్థ కూడా దానిని తామే చేసినట్లు నిర్ధారించలేదు. ఈ తరుణంలో విమానంలోని లోపమే కారణమని ఇంతకాలం అనుకున్నారు. అయితే.. ఆ విమానం 2003 నుంచే సర్వీసుల్లోకి అడుగుపెట్టింది. అంటే కేవలం 13 ఏళ్ల సర్వీసు మాత్రమే పూర్తి చేసుకుంది. సాధారణంగా ఆ విమానం లైఫ్ 30 నుంచి 40 ఏళ్ల ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుమానాలు.. విస్తృతస్థాయి దర్యాప్తు వైపు అడుగులు వేయించాయి. కాక్‌పిట్‌లో పైలట్ సిగరెట్ వెలిగించగానే అత్యవసర మాస్క్ నుంచి ఆక్సిజన్ లీకై కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయి. ఫలితంగా విమానం కుప్పకూలిందని దర్యాప్తు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కాక్‌పిట్‌లో మంటలు అంటుకున్న సమయంలో సిబ్బంది భయంతో అరుస్తున్న శబ్దాలు మాస్క్‌కు ఉన్న మైక్రోఫోన్లో రికార్డయ్యాయి. ఇక పైలెట్ సిగరెట్ పొగ పీల్చినట్లు రికార్డయిన శబ్దాల గురించి ఇటాలియన్ పత్రిక కార్రియర్ డెల్లా సెరా కూడా ఓ కథనం ప్రచురించింది. ప్రమాదానికి గురైన ఈజిప్ట్ ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్-ఎ320, 2016 మే 19న తేదీన పారిస్ నుంచి ఈజిప్ట్ రాజధాని కైరోకు బయలుదేరింది. గ్రీక్ ద్వీపాలకు 130 నాటికల్ మైళ్ల దూరలో రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. ఆ తర్వాత కాసేపటికే క్రెటె ద్వీపం సమీపంలో తూర్పు మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 40 మంది ఈజిఫ్ట్ పౌరులు, 15 మంది ఫ్రెంచ్ పౌరులు సిబ్బంది సహా మొత్తం 66 మంది ఉండగా, అంతా ప్రాణాలు కోల్పోయారు. చదవండి: పాక్-అఫ్గన్.. డామిట్ కథ అడ్డం తిరిగింది! -
ఘోర విమాన ప్రమాదం.. చైనీస్ విమానశాఖ సంచలన నిర్ణయం
చైనా దక్షిణ గ్వాంగ్జీ ఝువాంగ్ ప్రాంతంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా మంగళవారం షెడ్యూల్ చేయబడిన 11,800 విమానాలలో 74% రద్దు చేస్తున్నట్లు చైనీస్ విమాన శాఖ తెలిపింది. వీటిలో ఎక్కువ భాగం బీజింగ్, షాంఘై మధ్య ప్రయాణించాల్సి ఉంది. సాధారణంగా ప్రపంచంలోని అత్యంత రద్దీ దేశీయ మార్గాలలో ఇదీ ఒకటి. గతంలో కోవిడ్ పరిమితుల కారణంగా చైనీస్ విమానాలు చాలా కాలాం గాల్లో ఎగరలేదు. దీంతో చైనీస్ విమానశాఖ చాలా వరకు ఆర్థికంగా నష్టపోయింది. అయితే తాజాగా మంగళవారం చేసిన రద్దుతో ఆ నష్టం మరింత పెరగనున్నట్లు చైనీస్ ఏవియేషన్ డేటా కంపెనీ డేటా పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ గ్వాంఝుకు వెళ్లేందుకు కున్మింగ్ నుంచి స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 1.10కి బయలుదేరరిన విమానం వుఝు సమీపంలోని టెంగ్జియాన్ కౌంటీ ప్రాంతంలోకి రాగానే కొండను ఢీకొని కూలిపోయింది. ప్రమాదంలో అంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. అందులో 132 మంది ప్రయాణికులు ఉన్నారు. 2010 తర్వాత చైనాలో జరిగిన తొలి విమాన ప్రమాదం ఇదే. చదవండి: China Flight Crash: చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి! -
Mystery: 10 వేల అడుగుల పైనుంచి ఆ కుర్చీ కిందపడింది.. చుట్టూ విషసర్పాలు.. అయినా
Lansa Flight 508 Crash Incredible Survival Of Juliane Koepcke: కొందరి ఊహల్లోంచి ఉట్టిపడే కథనాలకంటే.. కొన్ని నిజజీవితాలు భలే గొప్పగా ఉంటాయి. ‘ఏదో శక్తి పక్కనే ఉండి, తీర్చిదిద్దిన కథలా ఇవి?’ అన్నట్లుగా అబ్బురపరుస్తాయి. ప్రకృతి, పరిస్థితులు, గత అనుభవాలు.. ఇలా అన్నీ ఆ కథను ఆసక్తిగా నడిపిస్తాయి. తరతరాలకు గుర్తుండే పాఠాలను నేర్పిస్తాయి. పెరూ దేశంలో అలాంటి అద్భుతమే జరిగింది. ఓ విమాన ప్రయాణం.. పదిహేడేళ్ల అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. అది 1971, డిసెంబరు 24.. వాతావరణం అనుకూలించక పోవడంతో పెరూ రాజధాని లిమా విమానాశ్రయంలో అప్పటికే కొన్ని గంటల నుంచి ‘లాన్సా 508’ ఫ్లయిట్ డిలే అవుతూ వస్తోంది. దాని టేకాఫ్‌ను బలంగా కోరుకుంటోంది పదిహేడేళ్ల జూలియన్ అదెక్కి పుకాల్పాకి వెళ్లేందుకు చాలా ఆత్రంగా ఎదురుచూస్తోంది. లిమాలో ఆ ఫ్లయిట్ ఎక్కితే.. సరిగ్గా గంటలో తన తండ్రి ముందు వాలిపోవచ్చని.. మరునాడే క్రిస్మస్ కావడంతో పేరెంట్స్‌తో కలిసి బాగా సెలబ్రేట్ చేసుకోవాలనే ఊహల్లో విహరిస్తోంది. ఎదురు చూస్తున్నకొద్దీ ఫ్లయిట్ ఆలస్యం అవుతూనే ఉంది. జర్మనీకి చెందిన మారియా, హన్స్ విల్హెల్మ్ కోయెప్కే దంపతులకు 1954, అక్టోబర్ 10న జన్మించింది జూలియన్. తన తల్లితో కలిసుంటూ లిమాలో చదువుకునేది. తండ్రి హన్స్.. పుకాల్పాలోని రెయిన్ ఫారెస్ట్‌లో పనిచేస్తుండేవాడు. కోయెప్కే దంపతులు పెరూలో స్థిరపడిన జువాలజిస్ట్లు. నిజానికి కొన్ని రోజుల ముందే జూలియన్, మారియాలు.. హన్స్ దగ్గరకు వెళ్లేందుకు ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ జూలియన్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరు కావాల్సిరావటంతో ఆ టికెట్స్‌ను రద్దు చేసుకొని.. ‘లాన్సా ఫ్లయిట్ 508’కి ప్రయాణం ఖరారు చేసుకున్నారు. సుమారు 7 గంటల ఎదురు చూపుల తర్వాత ‘ఫ్లయిట్ నంబర్ 508’ లిమా నుంచి బయలు దేరేందుకు సిద్ధంగా ఉందనే అనౌన్స్మెంట్.. జూలియన్ కి చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. కానీ తనకు తెలియదు అదే తన తల్లితో తను చేసే చివరి ప్రయాణమని. ఆ విమానంలో జూలియన్, మారియాలతో కలిపి 85 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది.. మొత్తం 91 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత గుండెలదిరిపడే శబ్దం వినిపించింది. ఏమిటా అని తెలుసుకునేలోపే పెద్ద మెరుపు మెరిసింది. విమానం వెనుక ట్యాంక్ నుంచి మంటలు అలుముకున్నాయి. ఆ భీకరశబ్దం విమానంపై పడిన పిడుగుదని వారందరికీ తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఓ పక్క ప్రయాణికుల హాహాకారాలు.. మరో పక్క చావు భయం. మెల్లగా విమానంలో ఒక్కో భాగం ఊడిపోసాగింది. తల్లి మారియా.. జూలియన్ చేతిని గట్టిగా పట్టుకుంది. కానీ జూలియన్ కూర్చున్న కుర్చీతో సహా ఊడి విమానం నుంచి విడిపోయింది. పదివేల అడుగుల పైనుంచి ఆ కుర్చీ వేగంగా నేలరాలడం తనకు తెలుస్తూనే ఉంది. సుమారు 24 గంటల తర్వాత కళ్లు తెరిచిన జూలియన్ .. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి హడలిపోయింది. కలేమోనని వణుకుతున్న చేతులతో కళ్లు నులుముకుని మరీ చూసింది. ఎటు చూసినా దట్టమైన చెట్ల నీడలే. అప్పుడు తనకు తెలియదు అది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని. అంతా మసకమసకగా కనిపిస్తోంది. జూలియన్కి దృష్టి లోపం ఉండటంతో కళ్లజోడు పెట్టుకుంటేనే కానీ ఏదీ సరిగా కనిపించదు. కానీ ప్రమాదంలో అదీ పోయింది. భుజం విరిగి, మోకాలు బెణికి, కాళ్లు, చేతులు కోసుకుపోయాయి. ఎటు చూసినా విషసర్పాల బుసలు, క్రూరమృగాల గర్జనలే. జరిగిందంతా కళ్లముందు కదులుతుంటే.. తల్లి ఏమైపోయిందోనన్న ఆవేదన, ఎలా బయటపడాలో తెలియని ఆందోళన జూలియన్ మనసుని అతలాకుతలం చేశాయి. తల్లి కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఎలా బయటపడాలో తెలియలేదు. ఎంత దూరం నడిచినా పెద్దపెద్ద మానులే, వాటిని చుట్టుకున్న పాములే. విమానం కూలిన ప్రాంతం వైపు నడవడం మొదలుపెట్టింది జూలియన్. పైన సెర్చ్ ఆపరేషన్ విమానాలు తిరుగుతున్నాయి కానీ వాళ్లకి ఆమె కనిపించలేదు. కాపాడండనే ఆమె అరుపులూ వినిపించలేదు. చుట్టూ మనుషులైతే ఉన్నారు కానీ ఏ ఒక్కరికీ ప్రాణం లేదు. తెగిపడిన తలలు, ఛిద్రమైన శవాలు జూలియన్ని చాలా భయపెట్టాయి. రోజులు గడుస్తున్నాయి. నీరసం ఆవహించేసింది. అప్పుడే దారిలో ఓ మహిళ శవం కనిపించింది. తన తల్లేమోనని ఏడుస్తూ అటు పరుగుతీసింది. కానీ కాదు. ఆ పక్కనే పడి ఉన్న లగేజ్‌లో స్వీట్స్ తీసుకుని తింటూ.. నడవడం మొదలుపెట్టింది. శక్తి కోసం కొన్ని సార్లు ఆకులనూ తిన్నది. ‘నీరు ఉన్నచోట ఆ పల్లానికి మనిషి మనుగడ ఉంటుంద’నే తన తండ్రి మాటలు గుర్తొచ్చి.. ‘ఒక్క మనిషైనా కనిపించకపోతాడా?’ అనే ఆశతో ఓ వాగు ప్రవాహాన్ని అనుసరిస్తూ... నడక సాగించింది. పది రోజులు గడిచాయి. కాస్త దూరంగా మనుషుల మాటలు వినిపించాయి. అటుగా పరుగు తీసిన జూలియన్ నదిలో పడవపై వెళ్తున్నవాళ్లని చూసింది, గట్టిగా అరిచింది. ఈ సారి ఆ అరుపులు వాళ్ల చెవిన పడ్డాయి. ప్రాణాలతో బయటపడిన జూలియన్ కథ ప్రపంచానికి తెలిసింది. బతకడం కోసం తను చేసిన ఒంటరి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. విలేకర్లు ఆమె వెంట పరుగుతీశారు. ఇక తన భార్య, కూతురు ప్రాణాలతో లేరనే నిజాన్ని నమ్మడం మొదలుపెట్టిన జూలియన్ తండ్రి హన్స్.. ప్రాణాలతో తిరిగి వచ్చిన జూలియన్ని చూసి నివ్వెరపోయాడు. కూతుర్ని గుండెకు హత్తుకుని తనివితీరా ఏడ్చాడు. మరియా కూడా ఎక్కడో బతికే ఉండి ఉంటుందనే ఆశ హన్స్‌ని కుదురుగా ఉండనివ్వలేదు. కొన్ని రోజుల పాటు మరియాని వెతుకుతూనే ఉన్నాడు. చివరికి జనవరి 12న మరియా మృతదేహం దొరికింది. జూలియన్ తప్ప ఆ విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరని తేలింది. జర్మన్ ఫిల్మ్ డైరెక్టర్ వెర్నర్ హెర్జోగ్.. జూలియన్ పర్యవేక్షణలో ఇదే స్టోరీ లైన్‌తో 1998లో ‘వింగ్స్ ఆఫ్ హోప్’ అనే సినిమా తీశాడు. 2011 నవంబర్ 1న జూలియన్.. నాటి తన బతుకుపోరాటం గురించి.. ‘వెన్ఐ ఫెల్ ఫ్రమ్ ది స్కై’ అనే పుస్తకం రాసింది. 68 ఏళ్ల జూలియన్ ఇప్పటికీ పెరూలో తన తల్లిదండ్రులు స్థాపించిన పంగువానా పరిశోధనా కేంద్రాన్ని నడుపుతోంది. అంత ఎత్తునుంచి పడినా చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడటం ఓ మిస్టరీ అయితే.. ప్రాణాలు నిలుపుకోవడానికి ఆమె చేసిన పోరు ప్రపంచానికే స్ఫూర్తి. వైద్యపరిభాషలో చెప్పాలంటే అదో మిరాకిల్. ప్రమాదానికి ముందు.. సుమారు ఏడాదిన్నర పాటు నేను మా పేరెంట్స్‌తో రెయిన్ ఫారెస్ట్ పరిశోధనల కేంద్రంలో గడిపాను. అది నాకు బాగా కలిసి వచ్చింది – జూలియన్. -సంహిత నిమ్మన -
కుప్పకూలిన రష్యా మిలటరీ రవాణా విమానం
మాస్కో: ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ ప్రకటించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలసిందే. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే వందల సంఖ్యలో మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజాగా రష్యాకు చెందిన ఆంటోనోవ్ యాన్-26 మిలటరీ రవాణా విమానం ఉక్రెయిన్ సమీపంలో రష్యాలోని దక్షిణ వొరోనెజ్ ప్రాంతంలో కుప్పకూలినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానికి మీడియా కథనం ప్రకారం.. మిలిటరీ పరికరాలను రవాణా చేస్తుండగా రష్యన్ ఏరోస్పేస్ దళాలకు చెందిన ఏఎన్-26 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని సిబ్బంది మొత్తం మరణించారని, ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ ప్రమాదం కారణంగా నేలపై ఎటువంటి విధ్వంసం జరగలేదని పేర్కొంది. విమాన ప్రమాదం జరిగినట్లు ధృవీకరించినప్పటికీ, అందులో ఎంత మంది మరణించారో చెప్పడానికి రక్షణశాఖ నిరాకరించింది. ఏఎన్-26 విమానంలో ఆరుగురు సిబ్బందితో పాటు 38 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం. ( చదవండి: రష్యాకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ దేశాల జోలికొస్తే ఖబడ్దార్ ) -
ఫిబ్రవరి 6, 1958.. ఫుట్‌బాల్ చరిత్రలో అతి పెద్ద విషాదం
చరిత్రలో కొన్ని ఘటనలు విషాదాలుగా మిగిలిపోయాయి. సమయం వచ్చినప్పుడు వాటి గురించి ప్రస్తావించుకోవడం తప్ప వాటిని మార్చలేం. అలాంటి కోవకు చెందినది 1958 మునిచ్ ఎయిర్ డిజాస్టర్. మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన ఫుట్‌బాల్ టీమ్‌తో వెళ్తున్న ఎయిర్‌క్రాప్ట్ క్రాష్ అవడంతో అందులో ఉన్న 23 మంది ఆనవాళ్లు లేకుండా పోయారు. ఫుట్‌బాల్ చరిత్రలోనే అతి పెద్ద విషాదంగా మిగిలిపోయిన ఆ ఘోర దుర్ఘటనకు నేటితో(ఫిబ్రవరి 6) 64 ఏళ్లు పూర్తయ్యాయి. ఆరోజు ఏం జరిగింది.. 1958 ఫిబ్రవరి 6.. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ మంచి ఉత్సాహంతో ఉంది. ఏ మ్యాచ్‌లో పాల్గొన్న విజయం వారిదే అవుతుంది. ఎందుకంటే జట్టు మొత్తం యువ ఆటగాళ్ల రక్తంతో నిండిపోయింది. ఉరకలేసే ఉత్సాహానికి తోడు మంచి మేనేజర్ కలిగి ఉన్నాడు. అందుకే ఆ జట్టుకు బస్బే బేబ్స్ అని నిక్‌నేమ్ వచ్చింది. జర్మనీలోని మ్యునిచ్‌లో మ్యాచ్ ఆడడానికి ఫుట్‌బాల్ ప్లేయర్లు సహా ఇతర సిబ్బంది ఎయిర్‌బేస్‌లో బయలుదేరారు. విజయంతో తిరిగి రావాలని మాంచెస్టర్ ప్రజలు దీవించి పంపారు. కానీ వారి దీవెనలు పనిచేయలేదు. ఆకాశంలో ఎగిరిన కాసేపటికే ఎయిర్‌బేస్‌కు ట్రాఫిక్ సంబంధాలు తెగిపోయాయి. 𝑭𝒐𝒓𝒆𝒗𝒆𝒓 𝒂𝒏𝒅 𝒆𝒗𝒆𝒓, 𝒘𝒆'𝒍𝒍 𝒇𝒐𝒍𝒍𝒐𝒘 𝒕𝒉𝒆 𝒃𝒐𝒚𝒔. In 2018, our participants joined @ManUtd players to record this moving poem to mark the 60th anniversary of the Munich Air Disaster. Today, we share it again, as we remember the #FlowersOfManchester 🔴❤️ pic.twitter.com/rOk3tsdIDQ — Manchester United Foundation (@MU_Foundation) February 6, 2022 దీంతో ఎయిర్‌బేస్ కుప్పకూలిందేమోనన్న అనుమానం కలిగింది. వారి అనుమానమే నిజమయింది. సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిన ఎయిర్ బేస్‌లో ఉన్న 8 మంది ఫుట్‌బాల్ ప్లేయర్స్ సహా, మాంచెస్టర్ యునైటెడ్ సిబ్బంది, జర్నలిస్టులు, ఎయిర్‌బేస్ సిబ్బంది సహా మరో ఇద్దరి ప్రయాణికులు మొత్తం 23 మందిలో ఏ ఒక్కరు బతికి బట్టకట్టలేదు. మ్యునిచ్ ఎయిర్‌బేస్ విమాన శకలాలు ఇప్పటికి అక్కడే ఉన్నాయి. చనిపోయిన వారి జ్ఞాపకార్థం అక్కడే మ్యూజియం ఏర్పాటు చేసి విమాన శకలాలను భద్రపరిచారు. మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్ళు జియోఫ్ బెంట్ రోజర్ బైర్న్ ఎడ్డీ కోల్మన్ డంకన్ ఎడ్వర్డ్స్ మార్క్ జోన్స్ డేవిడ్ పెగ్ టామీ టేలర్ లియామ్ "బిల్లీ" వీలన్ మాంచెస్టర్ యునైటెడ్ సిబ్బంది వాల్టర్ క్రిక్మెర్ - క్లబ్ కార్యదర్శి టామ్ కర్రీ - శిక్షకుడు బెర్ట్ వాలీ - చీఫ్ కోచ్ ఎయిర్‌బేస్ సిబ్బంది కెప్టెన్ కెన్నెత్ రేమెంట్ టామ్ కేబుల్ జర్నలిస్టులు ఆల్ఫ్ క్లార్క్ డానీ డేవిస్ జార్జ్ అనుసరిస్తాడు టామ్ జాక్సన్ ఆర్చీ లెడ్బ్రూక్ హెన్రీ రోజ్ ఫ్రాంక్ స్విఫ్ట్ ఎరిక్ థాంప్సన్ -
డొమినికన్ రిపబ్లిక్లో కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి
శాంటా డొమింగో: కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్లో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలను కొల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, శాంటో డొమింగోలో.. ఒక ప్రైవేటు విమానం లా ఇసబెల్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఫ్లోరిడా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ విమానంలో ప్రముఖ ప్యూర్టోరికన్ సంగీత నిర్మాత జోస్ ఏంజెల్ హెర్నాండెజ్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయన ‘ఫ్లోలా మూవీ, టె బోటే’వంటి హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. హెర్నాండెజ్ 38 ఏళ్లకే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. మృతి చెందిన వారిలో అమెరికాకు చెందిన ఆరుగురు, డొమినికన్ రిపబ్లిక్ నుంచి ఇద్దరు, వెనిజులాకు చెందిన మరో ప్రయాణికుడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: బంగ్లాలో భారత రాష్ట్రపతికి ఘనస్వాగతం -
విమాన ప్రమాదం, తండ్రి - కూతురు ప్రాణాలు కాపాడిన ఐపాడ్..!
‘మనిషి.. వాడుకోవలసిన వస్తువులను ప్రేమిస్తున్నాడు, ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకుంటున్నాడు’ ఇది సినిమా డైలాగే. కానీ, ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు ఆ డైలాగ్ అర్ధాన్నే మార్చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం యాపిల్ స్మార్ట్ వాచ్ యువకుడి ప్రాణం కాపాడింది. ఇప్పుడు అదే యాపిల్ సంస్థకు చెందిన ఐపాడ్..విమాన ప్రమాదం నుంచి తండ్రి - కూతుర్ని కాపాడింది. సీఎన్ఎప్ కథనం ప్రకారం..అమెరికా పెన్సిల్వేనియాకు చెందిన 58ఏళ్ల పైలెట్ తన 13ఏళ్ల కుమార్తెతో కలిసి రెండు సీట్ల విమానంలో మరో ప్రాంతానికి బయలుదేరారు. అయితే కొద్దిసేపటికే రాడార్‌లో విమానం ఆచూకీ తప్పిపోయింది. దీంతో అప్రమత్తమైన యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ సిబ్బంది విమానం చివరి సారిగా తప్పిపోయిన ప్రదేశంలో కోఆర్డినేటర్లు, రెస్క్యూ టీమ్‌లు, 30 మంది వాలంటీర్లు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అదే సమయంలో పైలట్ జాడ గుర్తించిన రెస్క్యూ టీమ్ అతని భార్యను సంప్రదించి, బాధితుడి ఫోన్ నెంబర్‌ను సేకరించారు. కానీ ఆ ఫోన్ నెంబర్ నుంచి బాధితుడికి ఫోన్ చేయగా.. ఆఫోన్ సిగ్నల్స్ మిస్సవ్వడంతో అతడి కుమార్తె వద్ద ఐపాడ్ ఉందని గుర్తించారు. ఐపాడ్ సిగ్నల్స్ ఆధారంగా అధికారులు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తండ్రి, కుమార్తె' ఆచూకీ లభ్యమైంది. విమానం టేకాఫ్ అయిన విల్కేస్-బారే స్క్రాంటన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి చెందిన చెట్ల మధ్య చిక్కుకున్నట్లు గుర్తించారు. విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. బాధితుల్ని ఆలస్యంగా ఆస్పత్రిలో జాయిన్ చేసి ఉంటే ప్రాణాలు పోయేవని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ప్రమాదంలో గాయపడ్డ బాధితుడి భార్య...విమాన ప్రమాదంలో గాయపడ్డ కుటుంబ సభ్యులు ఐపాడ్ వల్ల ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారని సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: యాపిల్ లోగో..! టచ్ చేసి చూడండి..అదిరిపోద్దంతే..! -
Jeff Bezos: నా గుండె పగిలి ముక్కలయ్యింది
William Sharner Dies In a Plane Crash: హలీవుడ్ యాక్టర్ స్టార్‌ట్రెక్ ఫేం విలియం శాట్నర్ ప్లేన్ క్రాష్ ప్రమాదంలో మరణించారు. న్యూజెర్సీలో వుడ్‌ల్యాండ్ ఏరియాలోని ససెక్స్ కౌంటీ దగ్గర జరిగిన విమాన ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. సింగిల్ ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆయన ప్రమాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శాట్నర్తో పాటు థామస్ ఫిషర్ కూడా చనిపోయారు. విలియం శాట్నర్ గతంలో అమెజాన్ అధినేత జెఫ్‌బేజోస్‌కి చెందిన బ్లూ ఆరిజిన్ రాకెట్లో అంతరిక్ష ప్రయాణం చేశారు. జెఫ్‌బేజోస్, శాట్నర్ల మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో శాట్నర్ మరణించడం జెఫ్ బేజెస్ షాక్‌కు గురయ్యారు. ఈ సందర్భంగా శాట్నర్‌ను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. మరణ వార్త విని తన గుండె ముక్కలయ్యిందన్నారు జెఫ్ బేజోస్. Such a tragic loss. Warm and full of life, Glen made us laugh and lit up the room. He was a visionary, and an innovator – a true leader. Lauren and I are heartbroken and will remember the precious time we got to spend together. (1/2) pic.twitter.com/AYKCGIUQfD — Jeff Bezos (@JeffBezos) November 12, 2021 -
ఘోర విమాన ప్రమాదం: ప్రముఖ సింగర్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో మ్యూజికల్ కన్పర్ట్లో అభిమానులను ఉర్రూతలూగించాల్సిన ప్రముఖ గాయని ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. తను ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలి పోవడంతో బ్రెజిలియన్ గాయని మారిలియా మెండోంకా (26) కన్నుమూసింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమెతో పాటు మేనేజర్ , సహాయకుడు, పైలట్ , కో-పైలట్ కూడా మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మరణానికి కొన్ని గంటల ముందు విమానంనుంచే ఆమె ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇంతలోనే ఆమె తిరిగిరాని లోకాలకు తరలిపోవడం విచారకరమంటూ ఆమె స్నేహితులు, సన్నిహితులు కంటతడి పెడుతున్నారు. మిడ్‌వెస్ట్రన్ నగరం గోయానియా నుండి కరాటింగాకు బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైంది. విమానం భూమిని ఢీకొట్టడానికిముందు తమ విద్యుత్ పంపిణీ లైన్‌ను ఢీకొట్టిందని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ సెమిగ్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో బ్రెజిల్‌లోని ప్రముఖ గాయకులలో ఒకరైన మారిలియా మెండోంకా, మేనేజర్ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హోతో పాటు పైలట్, కోపైలట్ కూడా మరణించినట్లు మెండోంకా ప్రతినిధి వెల్లడించారు. ఈ విషాద వార్తపై ఆమె అభిమానులు, రాజకీయ నాయకులు, పలువురు గాయనీ గాయకులు, సాకర్ ఆటగాళ్లతో సహా బ్రెజిల్ నలుమూలల నుండి సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. దీంతో బాధితుల అభిమానులు,కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై ఐ రిఫ్యూజ్ టు బిలీవ్, ఐ జస్ట్ రిఫ్యూజ్" అంటూ ఆమె స్నేహితుడు, బ్రెజిల్ సాకర్ స్టార్ నెయ్మార్ ట్వీట్ చేశారు. బ్రెజిల్ ప్రభుత్వం కూడా సంతాపాన్ని తెలిపింది .ఈ వార్తతో దేశం మొత్తం షాక్ అయ్యిందంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో విచారం ప్రకటించారు. మెండోంకా గొప్ప కళాకారిణి అని, ఆమె లేని లోటు తీరనిదని బోల్సోనారో ట్వీట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా మెండోంకా బ్రెజిలియన్ కంట్రీ మ్యూజిక్ స్టైల్ "సెర్టానెజో" ద్వారా పాపులర్ అయింది. 2019లో రిలీజ్ చేసిన ఆల్బంకు లాటిన్ గ్రామీని గెలుచుకుంది. గత సంవత్సరం, కోవిడ్-19 మహమ్మారి బ్రెజిల్లో విస్తృత లాక్డౌన్లకు దారితీసినప్పుడు, మెండోంకా ప్రత్యక్ష ప్రసారంచేసిన వీడియో 3.3 మిలియన్ల వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 39.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. మెండోంనాకు ఒక కుమారుడు ఉన్నాడు. వచ్చే నెలకు ఆ బాలుడికి 2 సంవత్సరాలు నిండనున్నాయి. View this post on Instagram A post shared by Marilia Mendonça (@mariliamendoncacantora) -
ఇళ్ల మీద కూలిన విమానం.. ఇద్దరు మృతి
వాషింగ్టన్/లాస్ ఏంజెల్స్: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. విమానం ఒకటి ఇళ్ల మీద కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో ఇళ్లతో పాటు.. పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఫాక్స్ ఐ సాన్ డియాగో రిపోర్ట్ ప్రకారం ఆరు సీట్ల ఎయిర్‌క్రాఫ్ట్ ట్విన్ -ఇంజిన్ సెస్నా 340, అరిజోనాలోని యుమా నుంచి బయలుదేరింది. ఒక గంట తర్వాత కాలీఫోర్నియా చేరుకున్న విమానం.. ఉన్నట్టుండి అక్కడ ఉన్న ఇళ్ల మీద కూలిపోయింది. (చదవండి: తాలిబన్లతో డీల్.. మెలిక పెట్టిన అమెరికా) ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోగా.. ఇద్దరు మరణించారు. పక్కనే ఉన్న డెలివరీ ట్రక్ కూడా పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. చదవండి: భయానకం: రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన విమానం Plane crash in #Santee, #California.pic.twitter.com/btP9TgyFVP — G219_Lost (@in20im) October 11, 2021 -
కూలిన విమానం.. తొమ్మిది మంది దుర్మరణం
Sweden Plane Crash స్వీడన్లో చిన్నసైజు విమానం కూలిన దుర్ఘఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో పైలట్ సహా ఎనిమిది మంది స్కై డైవర్లు ఉన్నట్లు సమాచారం. గురువారం స్టాక్‌హోంకి వంద మైళ్ల దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్వీడన్ జాయింట్ రెస్క్యూ కో ఆర్టినేషన్ సెంటర్ ప్రతినిధులు సహాయక చర్యలకు రంగంలోకి దిగారు. విమానం దిగే టైంలోనే ఘటన జరిగిందని భావిస్తున్నారు. కాగా, ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్వీడన్ ప్రభుత్వం.. బాధితుల కుటుంబాలను ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. 2019లో ఇలాగే ఓ చిన్న విమానం స్కై డైవర్లతో వెళ్తుండగా.. ఈశాన్య స్వీడన్‌లోని ఉమేయాలో ఘోర ప్రమాదానికి గురైంది. -
ఘోర దుర్ఘటన.. కూలిన వైమానిక విమానం
మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 40 మందిని రక్షించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ సిరిలిటో సోబెజన తెలిపారు. దక్షిణ కగయాన్ డీ ఓరో నగరం నుంచి 92 మంది సిబ్బందిని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వాళ్లలో ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 17 మృతదేహాలను గుర్తించినట్లు సిరిలిటో వెల్లడించారు. కాగా, సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం నేలకూలగా.. అనంతరం మంటలు చెలరేగాయి. విమానం శిథిలాల నుంచి 40 మందిని రక్షించి, వారిని ఆసుప్రతికి తరలించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. మిగతా వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ముస్లిం ప్రావిన్స్ సులులో ప్రభుత్వ దళాలు దశాబ్దాలుగా అబూ సయ్యఫ్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. కానీ, ఈ ఘటన ప్రమాదమా? లేదంటే ఉగ్ర దాడినా? అనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెప్తున్నారు. కిందటి నెలలో బ్లాక్ హ్యాక్ హెలికాఫ్టర్ ఒకటి కూలిపోయి.. ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. -
ఘోర ప్రమాదం.. ‘టార్జాన్’ దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న జెట్ విమానం కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. వీరిలో నటుడు జోయ్ లారా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, జోయ్ లారా ‘టార్జన్’ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. శనివారం ఉదయం టెన్నెస్సి నుంచి ఫ్లోరిడాకు విమానం వెళ్తుండగా.. 11 గంటల సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. సౌత్ నాష్‌విల్లేలోని పెర్సీ స్ట్రీక్ లేక్‌లో విమాన శకలాలు కూలినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ ఘటనలో చనిపోయినవాళ్లలో నటుడు జోయ్ లారా, అతని భార్య గ్వెన్ ష్వాంబ్లిన్ ఉన్నారు. కాగా, ఈ దుర్ఘటనలో శకలాలు చెల్లాచెదురు అయ్యాయని, సోమవారం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తామని అధికారులు చెప్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, లారా(విలియమ్ జోసెఫ్ లారా) 1989లో వచ్చిన ‘టార్జాన్ ఇన్ మాన్‌హట్టన్’ సినిమా ద్వారా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత 1996 నుంచి ఏడాదిపాటు టెలికాస్ట్ అయిన ‘టార్జాన్ ది ఎపిక్ అడ్వెంచర్స్’ టీవీ సిరీస్ ద్వారా గ్లోబల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ నిపుణుడైన లారా.. టార్జాన్‌గా డూప్ లేకుండా స్టంట్స్ చేసేవారు. ఇక చాలా ఆలస్యంగా 55 ఏళ్ల వయసులో లారా.. గ్వెన్ ష్వాంబ్లిన్ను 2018లో వివాహం చేసుకున్నాడు. చదవండి: ఆమెతో డేటింగ్ కోసం క్యూ -
భయానకం: రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన విమానం
వాషింగ్టన్: రోడ్డుపై వెళ్తున్న కారుపై అకస్మాత్తుగా దూసుకువచ్చిన ఓ విమానం కూలిపోయింది. కారుపై కూలడంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఆ ప్రమాదం ధాటికి పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో సంభవించింది. దక్షిణ ఫ్లోరిడాలోని నార్త్ పెర్రీ విమానాశ్రయం నుంచి సింగిల్ ఇంజన్ ఉన్న ఓ చిన్న విమానం టేకాఫ్ తీసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి పెంబ్రోక్ పైన్స్లో రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దహనమయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆలోపే మృతిచెందారు. అయితే ఈ ఘటనలో ఓ బాలుడు కూడా ఉన్నాడని తెలుస్తోంది. #BREAKING: 2 killed in plane crash at North Perry Airport in Pembroke Pines, Florida after hitting car, injuring woman and child — Billy Corben (@BillyCorben) March 15, 2021 -
విమాన ప్రమాదంలో ఫుట్‌బాల్ ఆటగాళ్ల మృతి
బ్రసీలియా: ఇండోనేషియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే బ్రెజిల్లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. విమానం కుప్పకూలి నలుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. బ్రెజిల్‌లోని టొకాన్టిన్ రాష్ట్రంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. పామాస్ ఫుట్‌బాల్ క్లబ్ అధ్యక్షుడితో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. విలానోవా జట్టుతో ఆట ఆడేందుకు ఆటగాళ్లంతా జోయియానియాకు వెళ్తున్నారు. టేకాఫ్ అవుతుండగా దక్షిణాది రాష్ట్రమైన టొకాన్టిన్లో ఈ ప్రమాదం సంభవించిందని ఆ దేశ మీడియా వెల్లడించింది. టేకాఫ్ అయ్యే సమయంలో విమానం ఒక్కసారిగా నేలకూలడంతో ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతి చెందిన వారిలో అధ్యక్షుడు లుకాస్ మెయిరా, ఆటగాళ్లు లుకాస్ ప్రాక్సేడెస్, గుయిల్హెర్మె నో, రనులే, మార్కస్ మోలినారి ఉన్నారు. పామాస్ ఫుట్‌బాల్ క్లబ్ ను 1997లో స్థాపించారు. ఇది బ్రెజిల్‌లోని నార్త్ ఫోర్ డివిజన్‌కు చెందిన క్లబ్. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం తీరుపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. -
కూలిన విమానం?
జకార్తా: ఇండోనేసియాకు చెందిన ప్రయాణికుల జెట్ విమానం ఒకటి ఆచూకీ తెలియకుండా పోయింది. శ్రీవిజయ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంతన్ ప్రావిన్సు రాజధాని పొంటియానక్కు బయలుదేరింది. విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నారు. వీరంతా ఇండోనేసియన్లే. జకార్తా– పొంటియానక్ ప్రయాణ సమయం సుమారు గంటన్నర కాగా విమానం షెడ్యూల్ సమయానికి గంట ఆలస్యంగా బయలుదేరింది. 2.40 గంటల సమయంలో కంట్రోల్ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని ఇండోనేసియా రవాణా శాఖ మంత్రి బుది కార్య సుమది తెలిపారు. అంతకుముందే విమానాన్ని 29 వేల అడుగుల ఎత్తుకు తీసుకువస్తానంటూ పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడని తెలిపారు. గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే విమానం 11 వేల అడుగుల ఎత్తులో ఉండగా కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయాయన్నారు. దీంతో ఈ విమానం జావా సముద్రంలో కూలిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ శకలాలు దానివేనా? ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్న జకార్తాకు ఉత్తరంగా ఉన్న లంకాంగ్, లాకి ద్వీపాల మధ్య గాలింపు కోసం నాలుగు యుద్ధ నౌకలు సహా 12 ఓడలను ఆ ప్రాంతానికి పంపినట్లు మంత్రి సుమది తెలిపారు. ఆ విమానానివే అని అనుమానిస్తున్న కొన్ని శకలాలు, దుస్తులు జకార్తాకు ఉత్తరంగా ఉన్న థౌజండ్ ఐలాండ్స్ వద్ద మత్స్యకారులకు లభించగా వాటిని స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం పంపినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘మత్స్యకారులకు కొన్ని కేబుళ్లు, లోహపు ముక్కలు లభించాయి. సమీపంలో భీకర శబ్ధం, మిరుమిట్లు గొలిపే మెరుపు కనిపించిన కొద్దిసేపటికే వారున్న ప్రాంతంలో నీళ్లలో పడిపోయాయి. అదే ప్రదేశంలో నీటిపై విమాన ఇంధనం జాడలు మత్స్యకారులకు కనిపించాయి’ అని స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదం వల్లే కూలిందా అనేది నిర్ధారణ చేసుకునేందుకు ఉపయోగపడే అత్యవసర లొకేటర్ ట్రాన్స్‌మీటర్(ఈఎల్టీ) ఎందుకు పనిచేయలేదనే విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. జకార్తా, పొంటియానక్ విమానాశ్రయాల్లో ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్న బంధువులు, కుటుంబసభ్యులు, మిత్రులు దైవ ప్రార్థనలు చేస్తున్నట్లు, రోదిస్తున్నట్లు ఉన్న దృశ్యాలను స్థానిక టీవీలు ప్రసారం చేస్తున్నాయి. అతిపెద్ద ద్వీపసమూహ దేశమైన ఇండోనేసియాలో తరచూ రోడ్డు, నౌక, విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. -
విమాన శకలాలు లభ్యం : తీరని విషాదమేనా?
జకార్తా: ఇండోనేషియాకు చెందిన ఎయిర్ బోయింగ్-737 శ్రీవిజయ విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. జావా సముద్రంలో పడిపోయినట్లు గుర్తించారు. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత విమానం సముద్రంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా విమాన శకలాలు కనపించడంతో విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. (ఇండోనేషియా విమానం గల్లంతు) 56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 62 మంది ప్రయాణిస్తున్న ప్యాసింజర్ జెట్ ఇండోనేషియా రాజధాని నుంచి బయలుదేరిన తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సంబంధాలు కోల్పోయాయని అధికారులు తెలిపారు. రాడార్ డేటాబాక్స్ ప్రకారం మధ్యాహ్నం 1.56 గంటలకు జకార్తా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కంట్రోల్ టవర్‌తో పరిచయం కోల్పోయిందని ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అదితా ఇరావతి తెలిపారు. ఈ ఘటనపై నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ, జాతీయ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ దర్యాప్తు మొదలుపెట్టిందన్నారు. మరోవైపు జకార్తా సమీపంలోని తంగేరాంగ్‌లోని సూకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. #Indonesia plane crash: #Boeing737 vanishes over sea with 50 on board as debris found. #FlightSj182 https://t.co/pU0qMokV84 pic.twitter.com/3lY2HZlhJi — Atlantide (@Atlantide4world) January 9, 2021 -
నా రెండు చేతులూ పోయాయనుకున్నా..
తిరువనంతపురం: కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో నా రెండు చేతులు పోయాయనుకున్నా. తీవ్రమైన నొప్పితో కనీసం కదపడానికి కూడా వీలు లేనంత బాధను భరించా అని ప్రమాదం నుంచి బయటపడిన ఆశిక్ పెరుంబల్ అనే ప్యాసింజెర్ తెలిపాడు. 'స్పృహ కోల్పోయి మెలకువ రాగానే నా సోదరుడిని నేను అడిగిన మొదటి ప్రశ్న నా చేతులు ఏవి అని. ఆ సమయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరో నన్ను స్ట్రెచర్‌పై పడుకోబెట్టారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం 2:05 గంటలకు బయలుదేరింది. విమానం ఎక్కేముందే అందరం కరోనా పరీక్షలు చేయించుకున్నాం. ప్రతీ ఒక్కరిలో కరోనా గురించి భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్కరూ మాస్క్‌ను కొంచెం సేపు కూడా పక్కన పెట్టలేదు. ఎవరూ వాష్‌రూంకు కూడా వెళ్లలేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అనే ఉత్కంఠే అందరిలోనూ ఉంది. ల్యాండింగ్ అవుతున్న సమయంలోనే పెద్ద శబ్ధం రావడంతో అందరం చాలా భయపడ్డాం ఏం జరుగుతుందో తెలుసుకనేలోపే విమానం ముక్కలైంది. ఆ తర్వాత ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాం' అనే విషయాలను గుర్తుచేసుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ శుక్రవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. (కోళీకోడ్ ప్రమాదం: భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం) దుబాయ్ నుంచి వచ్చిన విమానం కోళీకోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండుగా విరిగిపోయింది. ముందు భాగం పూర్తిగా ధ్వంసమవడంతో ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు గాయాలపాలై ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అలాంటి వారిలో ఆశిక్ ఆయన సోదరుడు మొహమ్మద్ అస్సియాస్ కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పృహ కోల్పోయి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నామని, చాలామంది సహాయం చేయడానికి వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి తన సోదరుడు ఏమై పోయాడో అని మళ్లీ వెనక్కి వచ్చి చూసుకున్నట్లు తెలిపాడు. భగవంతుడి దయ వల్ల తాము క్షేమంగా బయటపడ్డామని తనకు సహాయం చేసిన వైద్యులు, సిబ్బందికి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపాడు. (కోళీకోడ్ ఘటన: ప్రాణం కాపాడిన ఫైన్) -
కుప్పకూలిన విమానం; ఐదుగురు మృతి
కాంగో : ఆఫ్రికా దేశమైన కాంగోలో శుక్రవారం అర్థరాత్రి కార్గో విమానం అడవుల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు మృతిచెందారు. ఏజ్‌ఫ్రెకో అనే కంపెనీకి చెందిన చిన్న కార్గో మనీమా ప్రావిన్స్‌లోని కలిమా నుంచి దక్షిణ కివూ ప్రావిన్స్‌లోని బుకావు వెళ్తున్నది. మరికొద్ది సేపట్లో లాండింగ్ అవుతుందనగా దక్షిణ కివూ ప్రావిన్స్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. అందులో ఇద్దరు పైలట్లతోపాటు ముగ్గురు ప్రయాణికులు ఉన్నారని, ప్రమాదంలో అందరూ మరణించారని ప్రావిన్స్ రవాణ, సమాచార శాఖ మంత్రి క్లౌడీ స్వీడి బాసిలా తెలిపారు. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై అమెరికా మిషన్ బృందం దర్యాప్తు చేస్తున్నదని వెల్లడించారు. కాంగోలో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం వల్ల విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా యూరోపియన్ యూనియన్ కాంగో విమాన సర్వీసులపై నిషేధం విధించింది. -
కోళీకోడ్ ఘటన: 22 మంది అధికారులకు కరోనా
తిరువనంతపురం: కోళీకోడ్ విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాటి విమాన ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సహా 18 మంది మరణించారు. అయితే తాజాగా శుక్రవారం మరోక షాకింగ్ న్యూస్ తెలిసింది. విమాన ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మలప్పురానికి చెందిన 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిసింది. ఈ మేరకు మలప్పురం జిల్లా వైద్యాధికారి ప్రకటన చేశారు. ప్రస్తుతం వీరంతా హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ వార్త ఇప్పటికే బాధితులను భయపెడుతోంది. దీని గురించి కేరళ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే దాని గురించి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. (చిమ్మచీకట్లో మిన్నంటిన రోదనలు) దుబాయ్ నుంచి వచ్చిన విమానం కోళీకోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండుగా విరిగిపోయింది. ముందు భాగం పూర్తిగా ధ్వంసమవడంతో ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
కళ్లె దుటే ముక్కలైంది
సాక్షి, హైదరాబాద్ : కేరళలోని కోళీకోడ్ విమాన ప్రమాదంలో మొదటి, ఆఖరి 2–3 వరుసల్లోని సీట్లలో కూర్చున్నవారే తీవ్రంగా ప్రభావితమయ్యారని సీఐఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్ సెక్టార్(సౌత్‌వెస్ట్) ఐజీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కాక్‌పిట్ సైతం ప్రభావితం కావడంతోనే పైలట్, కో–పైలట్లు మరణించారన్నారు. మధ్య వరుస సీట్లలో కూర్చున్నవారిలో మృతులు, క్షతగాత్రులు లేరని పేర్కొన్నారు. ఆ దుర్ఘటనలో సీఐఎస్ఎఫ్ సహాయకచర్యలకు సంబంధించి సీవీ ఆనంద్ ఆదివారం వెల్లడించిన వివరాలివి... పెరిమీటర్ గోడకు విమానం గుద్దుకుని.. కేవలం 3 కి.మీ. పొడవు టేబుల్ టాప్ రవ్వేతో కూ డిన కోళీకోడ్ విమానాశ్రయం చుట్టూ పెరిమీటర్ వాల్‌గా పిలిచే సరిహద్దు గోడ ఉంది. ఆ గోడకు ఉన్న ఎమర్జెన్సీ గేట్ నం.8 వద్ద శుక్రవారంరాత్రి ఏఎస్సై మంగళ్ సింగ్, పెరిమీటర్ గస్తీలో ఏఎస్సై అజిత్‌సింగ్ విధులు నిర్వహిస్తున్నారు. రన్‌వే వీరికి 45–50 అడుగుల ఎత్తులో ఉంది. ఆ సమయంలో పెద్ద శబ్దం వినిపించడంతోపాటు ఎయిర్ ఇండియాకు చెందిన దుబాయ్–కోళీకోడ్ బోయింగ్ 737 విమానం పెరిమీటర్ గోడకు గుద్దుకుని రెండు ము క్కలవడం గమనించారు. వెంటనే మంగళ్, అజిత్‌లు వైర్లెస్ సెట్స్ ద్వారా ఎయిర్పోర్ట్ కంట్రోల్‌కు, సమీపంలోని బ్యారెక్స్‌లో విశ్రాంతి తీసుకునే సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం తెలుసుకున్న ఐజీ సీవీ ఆనంద్ సీఐఎస్ఎఫ్ హెడ్– క్వార్టర్స్‌తోపాటు డీజీని అప్రమత్తం చేసి సహాయక చర్యల్ని పర్యవేక్షించడం ప్రారంభించారు. సీఐఎస్ఎఫ్ కృషి ఫలితంగానే.. కాప్‌పిట్ పెరిమీటర్ గోడను బలంగా ఢీ కొట్టడంతో పైలట్ అక్కడికక్కడేతమరణించగా, కో–పైలట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సీఐఎస్ఎఫ్, ఇతర విభాగాలు, స్థానికుల కృషి ఫలితంగానే మృతుల సంఖ్య 18కి పరిమితమైంది. పైలట్ అప్రమత్తత, వర్షం కారణంగా విమానంలో ఉన్న ఫ్యూయల్‌కు మంటలంటుకోలేదు. అదే జరిగితే ప్రమాదం తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. విమానం లైట్ల వెలుతురులో నడుచుకుంటూ... ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ ఏరియాకు లోపలే ప్రమాదం జరగడం, పెరిమీటర్ గోడకు అవతల రోడ్లు ఉండటంతో సిబ్బంది, అంబులెన్స్‌లు, జేసీబీలు, స్థానికులు ప్రమాదస్థలానికి చేరుకోవడం తేలికైంది. ఇది కూడా మృతుల సంఖ్య తగ్గడానికి కారణమైంది. భారీవర్షం, చిమ్మ చీకటి వల్ల సహాయకచర్యలకు ఇబ్బంది కలిగింది. విమానంలోని మొదటి, చివరి 2–3 వరుసల్లో కూర్చున్న వారిలో అత్యధికులు సీట్ల మధ్యలో ఇరుక్కుని తీవ్రంగా గాయపడటం, చనిపోవడం జరిగింది. విమానం లైట్లు వెలుగుతూనే ఉండటంతో చాలామంది ఆ వెలుతురులో నడుచుకుంటూ బయటకు రాగలిగారు. ఫ్లాష్లైట్ల వెలుతురులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు ముమ్మరం చేశారు. మొత్తం 184 మంది ప్రయాణికులు, ఫ్లైట్ అటెండెంట్స్‌లో నలుగురు మినహా మిగిలినవారిని రాత్రి 9.45 గంటలకల్లా రెస్క్యూ చేయగలిగారు. విమానం నుంచి ఆఖరులో బయటకు తీసుకువచ్చిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. -
భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం..
సాక్షి, కోళీకోడ్: కేరళలోని కోళీకోడ్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గురై విమానం నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి ఈ దుర్ఘనటన తీవ్రమైన వేదనను మిగిల్చింది. ‘ఇది చాలా పెద్ద విషాదం. విమానం నేలపై కూలినపప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో మమ్మల్ని మేము సమన్వయం చేసుకోవడానికి మా ముందు సీట్లను భయంతో గట్టిగా పట్టుకున్నాము. ఇక విమానం కూలిపోవటంతో అది రెండు ముక్కలుగా విరిగిపోయింది’ అని ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఐదుగురు ప్రయాణికుల్లో ఒకరు తెలిపారు. ‘చుట్టు పక్కల అందరూ ఏడుస్తున్నారు. పైలట్లు, ఇద్దరు మహిళలు మృతి చెందారని ఎవరో నాకు చెప్పారు. ఆ తర్వాత పేపర్లో 18మంది చనిపోయినట్లు వచ్చింది. బహుశా ఈ ప్రమాదానికి వాతావరణం కారణం కావొచ్చని మరో బాధితుడు తెలిపారు. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోతే మరో విమాశ్రయంలో ల్యాండ్ చేయల్సింది. కానీ ఒక్కసారిగా ఏం జరిగిందో కూడా తెలియదు. ఒక కలలా విమానం కూలి ప్రమాదం జరిగింది’ అని మరొక ప్రయాణికుడు చెప్పారు. ఐదుగురు బాధితులను విమ్స్ ఆస్పత్రిలో చేర్చినట్లు డాక్టర్ ముహమ్మద్ షఫీ పేర్కొన్నారు. అదే విధంగా చాలామంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ సత్య ప్రధాన్ తెలిపారు. శుక్రవారం రాత్రి కోళీకోడ్ విమనాశ్రయంలో విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో విమానం రెండు ముక్కలైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో పది మంది చిన్నారులు.. ఇద్దరు పైలట్లు, అయిదుగురు క్యాబిన్ క్రూ ఉన్నారు. -
కోళీకోడ్ ప్రమాదం : అచ్చం అలానే జరిగింది
తిరువనంతపురం : దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం క్యారిపూర్ ఎయిర్ పోర్టు రన్‌వేపై ప్రమాదానికు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదాన్ని మంగళూరు ప్రమాదంతో పోల్చి చూడటం సరికాదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కోళీకోడ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే దీనికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. (‘ఈ ప్రమాదం గురించి 9 ఏళ్ల క్రితమే హెచ్చరించా’) మంగళూరు ప్రమాదం నుంచి పాఠం నేర్చుకున్నామని తాజా సంఘటనను పదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంతో పోల్చడం చాలా తొందరపాటు చర్య అవుతుందన్నారు. పైలట్ కెప్టెన్ దీపక్ సాతే, కో-పైలట్ అఖిలేష్ కుమార్‌లకు అత్యంత అనుభవజ్ఞులని మంత్రి తెలిపారు. అయితే శుక్రవారం జరిగిన దుర్ఘటనకు, మంగళూరులో జరిగిన ప్రమాదానికి పోలీకలు ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ విమానం కూడా టేబుల్‌టాప్ రన్వేనే. బోయింగ్ 737 రకానికి చెందిన విమానమే. 2010 మే 22న దుబాయ్ నుంచి మంగళూరుకు పయనమైన విమానం కూడా ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయ్యే సమయంలోనే ప్రమాదానికి గురైంది. అప్పటి విమానం కూడా ఎయిర్ ఇండియాకు చెందినదే . మంగళూరు ఘటనలో మొత్తం 158 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం అది. కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్నవారిని వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి చేరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం క్యారిపూర్ విమనాశ్రయంలో విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి ప్రమాదానికి గురి అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటికే ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 20కు చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో దుబాయ్-కోళీకోడ్ విమానం పూర్తి వేగంతో ఉందని, రన్‌వేను ఓవర్‌షాట్ చేసిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ల్యాండింగ్‌కు రెండు సార్లు ప్రయత్నించడం, కాస్త ఎక్కువ వేగంతో ల్యాండ్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. (కేరళ విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!) -
మృతుల కుటుంబాలకు ఎయిరిండియా ఎక్స్‌గ్రేషియా
సాక్షి,తిరువనంతపురం: కేరళ కోళీకోడ్ విమాన ప్రమాదంపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమైనదిగా అభివర్ణించింది. ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించిది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. (కోళీకోడ్ ప్రమాదం : అచ్చం అలానే జరిగింది) 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మృతుల కుటుంబాలకు 10లక్షల రూపాయలు, 12 ఏళ్లలోపు మృతుల కుటుంబీకులకు 5 లక్షల రూపాయలు చొప్పున తక్షణ మధ్యంతర పరిహారం చెల్లించనున్నామని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు 2 లక్షలు, గాయపడినవారికి 50 వేలు చెల్లిస్తామని పేర్కొంది. బీమా నిబంధనల ప్రకారం బాధితులకు సంబంధిత పరిహారం చెల్లిస్తామని చెప్పింది. ప్రయాణీకులకు తగిన సమాచారాన్ని అందించేందుకు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 1800222271టోల్ ఫ్రీ నంబర్ ను ప్రకటించింది. (ఘోర ప్రమాదం : ఎంత విషాదమీ దృశ్యం) మరోవైపు కేరళ ప్రభుత్వం కూడా పరిహారాన్ని ప్రకటించింది. 10 లక్షల రూపాయలను మృతుల కుటుంబాలకు చెల్లిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. అలాగే గాయపడిన వారి చికిత్స ఖర్చులను మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. (విమాన ప్రమాదం : కరోనా కలకలం) -
‘కోళీకోడ్ ఘటన ప్రమాదం కాదు.. హత్య!’
తిరువనంతపురం : కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదాన్ని గతంలోనే ఊహించామని వైమానిక రంగ నిపుణులు వెల్లడించారు. ఈ విమానాశ్రయం కొండలపై ఉండటం, రన్‌వేకు రెండు వైపులా లోయలు ఉండటం వల్ల ఎక్కువ ప్రమాదాన్ని సూచిస్తుందని వారు తెలిపారు. దీనిపై తాము అనేకసార్లు సంబంధిత అధికారులకు విజ్ఙప్తి చేసిన వారు పట్టించుకోలేదని పేర్కొన్నారు. విమానాశ్రయ రన్‌వే వద్ద సరైన చర్యలు తీసుకోకపోతే శుక్రవారం కోళీకోడ్‌లో జరిగిన సంఘటన లాంటిదే భవిష్యత్తులో జమ్మూకశ్మీర్, పాట్నా విమానాశ్రయాల్లో సంభవించే ప్రమాదం ఉందని వాయు భద్రతా నిపుణులు కెప్టెన్ మోహన్ రంగనాథన్ హెచ్చరించారు. (కేరళ విమాన ప్రమాదం: బ్లాక్‌బాక్స్ స్వాధీనం) పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన భద్రతా సలహా కమిటీలో రంగనాథన్ సభ్యుడిగా ఉన్నారు. తొమ్మిదేళ్ల కిందటే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కోళీకోడ్ రన్‌వే విమానాలు దిగడానికి సరైనది కాదని తాను ఒక నివేదికను సమర్పించినట్లు తెలిపారు. రంగనాథన్ మాట్లాడుతూ.. ‘నా హెచ్చరికను విస్మరించారు. నా అంచనాకు తగ్గట్లే అది ఇప్పుడు జరిగింది. నా అభిప్రాయంలో ఈ ఘటన ప్రమాదం కాదు. హత్య!. తమ సొంత భద్రతా చర్యల్లోనే సమస్యలు ఉన్నాయి. కోళీకోడ్ విమానశ్రయం టేబుల్ టాప్ రన్‌వే చాలా తక్కువ స్థలాన్ని కలిగి ఉంది. అందువల్ల అక్కడ ఎక్కువ భద్రతా చర్చలు అవసరం’అని తెలిపారు. కోళీకోడ్ విమనాశ్రయం రన్‌వే చివరలో 70 మీటర్ల డ్రాప్ ఉంది. మంగళూరులో ఇది 100 మీటర్లు ఉంది. ఒక విమానం అదుపు తప్పితే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. సరిగ్గా ఇలాగే జమ్మూ, పాట్నాలో కూడా జరగవచ్చు. ఈ రెండు చోట్ల కూడా సరైన భద్రత చర్యలు లేవు’ అని తెలిపారు. (కేరళ: ఒకే రోజు రెండు విషాదాలు) కోళీకోడ్ విమానశ్రయంలోని టేబుల్ టాప్ మిమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఓవర్‌షాట్ అవ్వడంతో రన్‌వే మీద నుంచి జారీ లోయలోకి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందగా.. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సరిగ్గా ఇంటి ఘటనే 2010లో మంగళూరు విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో విమానం నుంచి మంటలు రావడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు) -
విమాన ప్రమాదం : కరోనా కలకలం
సాక్షి, తిరువనంతపురం : కేరళ విమాన ప్రమాద విషాదానికి తోడు మరో సంచలన విషయం వెలుగు చూసింది. కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్నవారిని వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి చేరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం అన్ని రక్షణాత్మక చర్యలతో ప్రయాణికులను తరలిస్తున్నారు. కానీ శుక్రవారం నాటి కోళీకోడ్ విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన రేపింది. (ఘోర ప్రమాదం : ఎంత విషాదమీ దృశ్యం) మృతుల్లో ఒకరికి కరోనా సోకినట్టుగా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ ప్రకటించారు. దీంతో ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరికీ కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ముందు జాగ్రత్తగా వారంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. వీరి వివరాలను సేకరిస్తున్నట్టు మంత్రి తెలిపారు. (ఆయన ధైర్యమే కాపాడింది!) My heart goes out to the families & friends of the 18 people who lost their lives in the air accident involving @FlyWithIX Flight IX-1344 in Kozhikode last evening & offer my heartfelt condolences. Reasons for the mishap are being investigated. pic.twitter.com/awEGpU9EmK — Hardeep Singh Puri (@HardeepSPuri) August 8, 2020 మరోవైపు కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి,కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్, కేంద్ర మంత్రి వి మురళీధరన్ ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ హర్దీప్ సింగ్ ట్వీట్ చేశారు. -
విమాన ప్రమాదం: బ్లాక్‌బాక్స్ స్వాధీనం
తిరువనంతపురం : కేరళలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 20కు చేరుకున్నది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఇవాళ ఉదయం డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు ఎయిర్ ఇండియా విమాన బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానం నుంచి డిజిటల్ ఫ్లయిట్ డేటా రికార్డర్(డీఎఫ్ఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్)ను తీశారు. ఇది విమాన ఎత్తు, స్థితి, వేగం, అలాగే పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను రికార్డు చేస్తుంది. ప్రమాదానికి గురయ్యే ముందు విమానంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు బ్లాక్‌బాక్స్ దోహదపడుతుంది. (విమాన ప్రమాదం : మృత్యుంజయులైన కవలలు) కేరళలోని కోళీకోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయి- కోళీకోడ్ ఎయిరిండియా విమానం (ఐఎక్స్ - 1344) ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి రన్ వే నుంచి జారిపోయిన విషయం తెలిసిందే. దీంతో విమానం రెండు ముక్కలైంది. విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఎయిరిండియా ప్రత్యేక సహాయ బృందం ఇప్పటికే కోళీకోడ్‌కు చేరుకుంది. ‘ఏంజిల్స్ ఆఫ్ ఎయిర్ ఇండియా’ అని పిలువబడే ప్రత్యేక సహాయ బృందాన్ని ఢిల్లీ, ముంబై నుంచి కోళీకోడ్‌కు పంపించినట్లు ఎయిర్ ఇండియా తెలిసింది. వీరు సహాయక చర్యలను సమన్వయం చేయడం, బాధితులకు, మృతులకు, వారి కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వడం వారి విధి. (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు) కాగా ప్రమాదానికి కారణం టేబుల్ టాప్ రన్ వేనే కారణమని తెలిపింది. కేరళలో భారీ వర్షాల కారణంగా విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వే పై తడిగా ఉండటంతో విమానం ఓవర్ షాట్ అయ్యి జారి లోయలో పడిపోయింది. అయితే అదృష్టవశాత్తు మంటలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండే చోట ఈ టేబుల్ రన్‌వేను నిర్మిస్తారు. అందువల్ల ఈ రన్‌వేలకు ఇరువైపులా, ముందూ వెనుకా కొండలు.. లోయలు ఉంటాయి. సాధారణ విమానాశ్రయాల్లోని రన్‌వేల కంటే వీటి నిడివి కూడా చిన్నదిగా ఉంటుంది. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లకు కూడా అయోమయాన్ని కలిగిస్తాయి. (విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!) -
విమాన ప్రమాదం : మృత్యుంజయులైన కవలలు
సాక్షి, తిరువనంతపురం: సమయం గడుస్తున్న కొద్దీ కేరళ కోళికోడ్ విమాన ప్రమాదం బాధితుల గాథలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. నిపుణుడు, అనుభవజ్ఞుడైన పైలట్ దీపక్ వసంత్ సాథే సారధ్యంలో విమానం అదుపు తప్పడం ఒక విషాదమైతే...మరికొద్ది క్షణాల్లో సొంతగడ్డపై కాలు మోపే సమయంలో కొంతమంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడం మరో విషాదం. అయితే ఇంతటి ఘోర ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడి కవలలు మృత్యుంజయులుగా నిలిచిన వార్త కాస్త ఊరటనిస్తోంది. (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు) న్యూస్ మినిట్ కథనం ప్రకారం ఈ కవలల కుటుంబం దుబాయ్ లో నివసిస్తోంది. తండ్రి దుబాయ్ లోనే ఉండిపోగా, తల్లి, తన నలుగురు బిడ్డలతో కలసి వందే భారత్ మిషన్ ద్వారా కేరళకు ఎయిరిండియా విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో చిక్కుకోగా, ఏడేళ్ల కవలలు జైన్, జమిల్ కుండోట్ పారకల్ ప్రాణాలతో బయటపడిన అదృష్ట వంతులుగా నిలిచారు. వీరి సోదరి, సోదరుడు కూడా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జియాకు (10) ఫ్రాక్చర్ కావడంతో ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందుతుండగా, జియాన్ (14) ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే తల్లి ఎలా ఉన్నారనేది దానిపై వివరాలు తెలియరాలేదు. దీంతో బంధువులు ఆందోళనలో పడిపోయారు. (విషాదం : మృత్యువును ముందే పసిగట్టాడేమో? ) స్వల్పంగా గాయపడిన వీరిని స్థానికులు, రక్షణ సిబ్బంది ఫిరోక్ చుంగమ్‌లోని రెడ్ క్రెసెంట్ ఆసుపత్రికి తరలించారు. 'గుర్తు తెలియని కవలలు' పేరుతో జిల్లా అధికారులు పేరుతో వీరిని ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. తద్వారా వీరిని మలప్పురం వాసులుగా గుర్తించారు. వారి సమీప బంధువు, మేనమామ రావడంతో శుక్రవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు. -
విషాదం : మృత్యువును ముందే పసిగట్టాడేమో?
సాక్షి, తిరువనంతపురం: కేరళ కోళీకోడ్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మరణించిన షరాఫు పిలాసేరీ (35)విషాధ గాథ కంటి తడిపెట్టిస్తోంది. ముద్దులొలికే చిన్నారి, భార్యతో కలిసి ఎంతో ఉద్వేగంగా స్వదేశానికి బయలుదేరిన షరాఫు రాబోయే మృత్యువును ముందే ఊహించారా. ఆయన సిక్స్త్ సెన్స్ ఇలాంటి వార్నింగ్ ఇచ్చిందా? షరాఫు ప్రాణ స్నేహితుడు ఈ అనుమానాల్నే వ్యక్తం చేశారు. (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు) కోళీకోడ్‌లోని కున్నమంగళానికి చెందిన షరాపు గల్ఫ్‌లో పని చేస్తున్నారు. కరోనా సంక్షోభంతో అత్యవసరంగా భార్య అమీనా షెరిన్, కుమార్తె ఇసా ఫాతిమాతో కలిసి స్వదేశానికి పయనమయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకున్న ఈ యువ దంపతులు "బ్యాక్ టూ హోం'' అంటూ ఒక సెల్ఫీని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని తలచుకుని దుబాయ్ లో ఒక హోటల్ నడుపుతున్న షరాఫు స్నేహితుడు షఫీ పరక్కులం కన్నీటి పర్యంతమయ్యారు. ఇండియాకు వెళ్లేముందు తనను కలిసిన స్నేహితుడి జ్ఙాపకాలను సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకున్నారు. (ఆయన ధైర్యమే కాపాడింది!) "కేరళకు బయలుదేరే ముందు, వీడ్కోలు చెప్పడానికి నా హోటల్‌కు వచ్చాడు. కొంచెం కలతగా కనిపించాడు. ఎందుకో నాకు టెన్షన్ అనిపిస్తోంది..అన్నాడు. అంతేకాదు ఈ కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయమని, వారికి అన్న పెట్టాలంటూ కొంత డబ్బు కూడా ఇచ్చాడు. ఇదంతా గమనిస్తోంటే.. ప్రమాదాన్ని ముందే పసిగట్టాడా...ఇదొక సూచనా అని అనిపిస్తోంది'' అని ఫేస్ బుక్ పోస్ట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. షరాఫు గతంలో మహమ్మారి సమయంలో కూడా పేదలకు డబ్బులిచ్చాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా కన్నవారిని కలుసుకోవాలన్నకోరిక తీరకుండానే..తన పసిబిడ్డ బోసినవ్వులను శాశ్వతంగా వీడి మృత్యువు ఒడికి చేరడం బంధువుల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. కాగా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో షరాఫు బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. అతని భార్య అమీనా ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండగా, కుమార్తె ప్రస్తుతం కోళీకోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. -
రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు
సాక్షి, కోళీకోడ్: కేరళ కోళీకోడ్ విమాన ప్రమాద దృశ్యాలు కలిచి వేస్తున్నాయి. మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ అవుతుందనగా జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు 18 మంది ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదం. ప్రమాద స్థలంలో భయంతో పిల్లల రోదనలు మిన్నంటిన దృశ్యం హృదయాల్ని కదిలించక మానవు. రక్తమోడే దుస్తులతో కకావికలమైన ప్రయాణికులు ఒకవైపు..ఏం జరిగిందో తెలియని గందరగోళంలో తీవ్ర నొప్పితో క్షతగ్రాతుల ఆర్తనాదాలు, మరోవైపు అంబులెన్స్ సైరన్ల మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ప్రమాద తీవ్రతను గమనించేలోపే ప్రయాణీకుల ప్రాణాల్లో కలిసిపోయిన వైనం బాధితుల బంధువుల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది. (ఆయన ధైర్యమే కాపాడింది!) రెండు ముక్కలై పోయిన విమాన శిథిలాల మధ్య చిక్కుకున్నవారిని రక్షించేందుకు అక్కడికి చేరుకున్న స్థానిక సివిల్ పోలీసులతో సహా రెస్క్యూ సిబ్బంది బాధితులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చిన్న పిల్లలు సీట్ల క్రింద చిక్కుకుపోయిన దృశ్యం చాలా బాధ కలిగించిందని స్థానికులు చెప్పారు. భయంకరమైన శబ్దం రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్నామనీ, చాలా మంది తీవ్రంగా గాయ పడ్డారు... కొందరికి, చేతులు కాళ్ళు విరిగిపోయాయి.. వారిని తరలిస్తున్న సమయంలో తమ చేతులు, దుస్తులు రక్తంలో తడిచిపోయాయంటూ తన భయంకర అనుభవాన్ని వివరించారు. నాలుగైదు సంవత్సరాల లోపు పిల్లలు భయంతో తమకు అతుక్కుపోయారంటూ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు. అంబులెన్స్‌లు చేరుకోడానికే ముందే గాయపడిన వారిని కార్లలో వివిధ ఆసుపత్రులకు తరలించడం ప్రారంభించామన్నారు. కాగా ప్రమాదానికి గురైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో 10 మంది చిన్నారులతోపాటు 174 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్ సిబ్బంది ఉండగా, ఇద్దరు పెలెట్లు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. షార్జా, దుబాయ్‌లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. -
కేరళ: ఒకే రోజు రెండు విషాదాలు
తిరువనంతపురం : వరుస దుర్ఘటనలు కేరళీయులను విషాదంలో ముంచెత్తాయి. భారీ వర్షాలతో ఇప్పటికే కుదేలయిన కేరళ విమాన ప్రమాదంతో మరింత తల్లడిల్లింది. శుక్రవారం ఒకే రోజు జరిగిన రెండు దుర్ఘటనలు కేరళలో తీవ్ర విషాదం నింపాయి. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొని కుదుటపడుతున్న రాష్ట్రం వరుస ప్రమాదాలతో మరోసారి ఉలిక్కి పడింది. ఓ వైపు రాష్ట్రంలో కురుస్తున్న జోరు వర్షాలు, మరోవైపు కోళీకోడ్ విమాన ప్రమాదం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇడుక్కి జిల్లాలోని మున్నార్‌కు సమీపంలో రాజమలై ప్రాంతంలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడి 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, 13 ఏళ్ల బాలిక, ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన దాదాపు 80 మంది కార్మికులు గుడిసెలు ఏర్పాట్లు చేసుకుని నివాసముంటున్నారు. ఇప్పటికి 15 మంది మృతదేహాలు వెలికితీయగా.. మరో 50 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొండ చరియలు విరిగిపడ్డ ఘటనా స్థలాల్లో నిరంతరాయంగా సహాయక చర్యలు కొసాగుతున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. (విమాన ప్రమాదం; ఆయన ధైర్యమే కాపాడింది!) ఇదిలా ఉండగా వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్‌కు చేరిన విమానం.. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కిందికి దిగుతూనే రన్‌వే పై నుంచి కిందికి జారి రెండు ముక్కలయ్యింది. ఈ విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది చనిపోగా.. వీరిలో పైలట్ కెప్టెన్ దీపక్ సాథే, కో పైలట్ అఖిలేష్ కుమార్ కూడా ఉన్నారు. క్షతగాత్రుల్ని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే రోజు కేరళలో రెండు దుర్ఘటనల్లో దాదాపు 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు. (విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!) ఈ ప్రమాద ఘటనలపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హోం మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. వీరితోపాటు కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి కేజే ఆల్ఫోన్స్ ‘ఈ రోజు ఇది రెండో విషాదం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ కూడా స్పందించారు. ‘కేరళకు ఈ రోజు విషాదకరమైన రోజు. మొదట మున్నార్‌లో వరదల వల్ల సంభవించిన మరణాలు, ఇప్పుడు విమాన ప్రమాదం. పైలట్లు ఇద్దరూ మరణించడం బాధాకరం. ప్రయాణికులను రక్షించడంలో సహాయక చర్యలు విజయవంతమవుతాయని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. (విమాన ప్రమాదం: అత్యవసర సమావేశం) Second tragedy of the day in Kerala : Air India Express skids off the run way at Kozhikode, front portion splits , pilot dies and lots of passengers injured . All passengers evacuated. Very lucky the aircraft didn’t catch fire @narendramodi @JPNadda — Alphons KJ (@alphonstourism) August 7, 2020 Tragic day for Kerala. First the deaths in Munnar & now this: I hear both pilots have died. Hope rescue efforts will succeed in saving all the passengers #KozhikodeAirCrash https://t.co/Jd6ZjgzkHH — Shashi Tharoor (@ShashiTharoor) August 7, 2020 -
విమాన ప్రమాదం; ఆయన ధైర్యమే కాపాడింది!
తిరువనంతపురం: కేరళ కోళీకోడ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో అసువులు బాసిన పైలట్ దీపక్ వసంత్ సాథే (59) అసమాన ప్రతిభ గురించి అనేక కీలక విషయాలను సీనియర్ అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. 22 ఏళ్ల అపార అనుభవం, విమానాలు నడపడంలో నిష్ణాతుడైన వసంత్ సాథే వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగానే విమానాన్ని నియంత్రించలేక పోయారనీ, విమానం రెండు ముక్కలైన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోందని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (విమాన ప్రమాదంపై లోతుగా దర్యాప్తు) వింగ్ కమాండర్ దీపక్ వసంత సాథే గతంలో భారత వాయుసేనలో యుద్ధవిమానం (మిగ్21) పైలట్‌గా పనిచేశారు. ఖరాక్ వస్లాలోని ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 58వ బ్యాచ్‌కు చెందిన సాథే అనేక మంది పైలెట్లకు శిక్షణ ఇచ్చారు. బోయింగ్ 737 విమానాలు నడపడంలో పైలెట్ సాథేది అందె వేసిన చెయ్యి. అంతేకాదు జూన్, 1981లో హైదరాబాద్ లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి ‘స్వోర్డ్ ఆఫ్ ఆనర్’ అందుకున్నారు. 2003లో వాయుసేన నుంచి రిటైరైన అనంతరం 2005లోఎయిరిండియాలో చేరారు. అంకితభావం, అపారమైన నైపుణ్యం సాథే సొంతమని రాష్ట్రపతి గోల్డ్ మెడల్ కూడా సాధించారంటూ అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. (రెండు ముక్కలైన విమానం) మరోవైపు ఆయన అప్రమత్తత వల్లనే ప్రాణాలతో బయటపడ్డామని, ఈ ప్రమాదంలో గాయపడిన వారు వ్యాఖ్యానించారు. ఆయన అనుభవం, ధైర్యంతోనే ప్రమాదం జరిగిన తరువాత మంటలను నివారించగలిగా రంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. భారీ వర్షం కారణంగా వాతావరణం అస్సలు బాలేదని ల్యాండింగ్ ముందే హెచ్చరించారు. రెండుసార్లు సురక్షితమైన ల్యాండింగ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారని ఇబ్రహీం అనే ప్రయాణికుడు తెలిపారు. కానీ ఆయన తెగువతో తాము అద్భుతంగా తప్పించుకుని స్వల్ప గాయాలతో సురక్షితంగా ఉన్నామని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ విమానానికి జరిగిన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్ సహా 18 మంది మరణించిన సంగతి తెలిసిందే.. -
విమాన ప్రమాదం: అత్యవసర సమావేశం
న్యూఢిల్లీ: కోళీకోడ్ ఘోర విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో పౌర విమానయాన శాఖ శుక్రవారం రాత్రి ఎయిర్ ఎండియా ఎక్స్‌ప్రెస్, పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ) అధికారులతో ఢిల్లీలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ విషాదకర ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ)ను ఆదేశించింది. కాగా ఏఐఈఏఎక్స్‌బీ-1344 బోయింగ్ 737 విమానం ప్రమాదానికి లోనైనట్లు డీజీసీఏ తెలిపింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేపై ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి లోయలో పడినట్లు వెల్లడించింది. అయితే ఈ ప్రమాదం తమ నెట్‌వర్క్‌పై ప్రభావం చూపినా, వందేభారత్ మిషన్ కొనసాగుతుందని పేర్కొంది.(రెండు ముక్కలైన విమానం ) కేరళలో శుక్రవారం రాత్రి ఎయిర్ ఇండియా విమానం రెండు ముక్కలైన ఘటనలో పైలట్ కెప్టెన్ దీపక్ సాథే, కో- పైలట్ అఖిలేశ్ కుమార్ సహా 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 125 మందికి పైగా క్షతగాత్రులు కాగా.. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై వెంటనే స్పందించిన రక్షణా బృందాలు సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆస్పత్రికి తరలించాయి. ఘటనాస్థలిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తైందని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడంతో పాటుగా విమాన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కూడా బయటకు తీసినట్లు మలప్పురం కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు.. ఈ ఘటనలో మరణించిన, గాయపడిన ప్రయాణీకులు, సిబ్బంది వివరాలకై షార్జా, దుబాయ్‌ల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. +971565463903, +9715430 90572, +971543090575 హెల్ప్లైన్లు ప్రారంభించారు. అదే విధంగా కేరళలోని బాధితుల కుటుంబ సభ్యుల కోసం 0495–2376901 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు కోళీకోడ్ కలెక్టర్ తెలిపారు. -
విమానాలు కుప్పకూలి ఏడుగురు మృతి
అలస్కా: అమెరికాలోని అలస్కాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు విమానాలు ఢీకొని కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అలాస్కాకు సమీపంగా కెనాయ్ ద్వీపకల్పంలోని సోల్డోట్నా నగరంలో ఉన్న విమానాశ్రయం వద్ద రెండు విమానాలు ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. అలస్కా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేట్ రిపబ్లిక్ సభ్యుడు గ్యారీ నాప్ ఒక విమానంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. మరో విమానంలో దక్షిణ కెరొలిన నుంచి నలుగురు పర్యాటకులు, కాన్సాస్ నుంచి ఒక పర్యాటక గైడ్, సోల్డోట్నా నుంచి ఒక పైలప్ ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. రెండు విమానాలు సోల్డోట్నా నగరంలోని విమానాశ్రయం వద్ద ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ప్రమాదానికి గురైన విమానాల్లో ఒకటి హవిలాండ్ డీహెచ్సీ-2గా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిష్ట్రేషన్(ఎఫ్ఏఏ) గుర్తించింది. అదే విధంగా ఈ ప్రమాదంపై ఎఫ్ఏఏ, జాతీయా రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో మృతి చెందిన గ్యారీ నాప్(67) రిపబ్లికన్, స్టేట్ హౌజ్‌లో సభ్యుడుగా కొనసాగుతున్నారు. -
కుప్పకూలిన మరో జెట్ ఫ్లైట్
వాషింగ్టన్ డీసీ: అమెరికా వైమానిక దళానికి చెందిన మరో అమెరికా విమానం మంగళవారం కూలిపోయింది. న్యూమెక్సికోలో తెల్లవారు జాయిన 3:50 గంటల సమయంలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16 జెట్ కుప్పకూలింది. హోలోమన్ ఎయిర్ బేస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో జెట్ విమానం అదుపు తప్పింది. కాగా, ఫైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు 5 సార్లు ఇలా అమెరికా వైమానిక దళానికి చెందిన విమానాలు కుప్పకూలాయి. గడిచిన రెండు వారాలలో రెండు ఎఫ్-6 జెట్లు ప్రమాదానికి గురి కావడం గమనార్హం. చదవండి: కుప్పకూలిన అమెరికా విమానం -
పాక్: ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరు ఫేక్
కరాచీ: పాక్‌లో వెలుగు చూసిన ఘోర నిజం తెలిస్తే మనం ముక్కున వేలేసుకుంటాం. కానీ పాక్ ప్రజలు మాత్రం భయంతో వణికిపోవాల్సిందే. దీనికి కారణం పాకిస్తాన్లో పనిచేసే పైలట్లలో ముప్పై శాతం మంది బోగస్ పైలట్లు అని ఆ దేశ మంత్రే పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు. అంటే ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరు ఫేక్ పైలట్ అన్నమాట. కరాచీలో జరిగిన విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ విస్తుపోయే విషయం బయటపడింది. ('దయచేసి మమ్మల్ని క్షోభ పెట్టకండి') దీని గురించి బుధవారం ఆ దేశ పౌర విమానయాన శాఖ మంత్రి గులామ్ సర్గార్ ఖాన్ మాట్లాడుతూ.. "పాక్‌లో 860 మంది పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 262 మంది పరీక్ష రాయనేలేదు. వారికి బదులుగా డబ్బులిచ్చి వేరొకరిని పరీక్షకు పంపించారు. కనీసం వీరికి విమానం నడపడంలో అనుభవం కూడా లేదు" అని తెలిపారు. అంటే ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలపై ఎంత పట్టింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం నకిలీ లైసెన్సులు పొందిన 150 మందిని విధుల నుంచి తొలగించడం అక్కడి ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త. ఇక పాకిస్తాన్‌లోని కరాచీలో మే 22న అత్యంత ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 97 మంది మరణించారు. (ఆ భయం వల్లే విమానం కుప్పకూలింది!) -
ఆ భయం వల్లే విమానం కుప్పకూలింది!
ఇస్లామాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) గురించి చర్చల్లో మునిగి పైలట్, కో- పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే 97 మంది ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ తెలిపారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఎ320 విమానం కుప్పకూలిన ఘటనలో ఎటువంటి సాంకేతిక లోపం చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. పైలట్లు, అధికారుల తప్పిదం వల్లే ఘోర ప్రమాదం సంభవించిందని వెల్లడించారు. ఈ మేరకు బుధవారం పార్లమెంటుకు ఆయన నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘నిజానికి విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదు. 100 శాతం ఫిట్‌గా ఉంది. కెప్టెన్, పైలట్ కూడా అనుభవం కలవారు. (‘పిల్లలు, పెద్దల ఆర్తనాదాలు.. చుట్టూ మంటలు’) అదే విధంగా విమానం నడిపేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నారు. కానీ వారి మెదడులో కరోనా గురించిన భయాలు నిండిపోయాయి. దాని గురించి చర్చిస్తూ విమాన గమనంపై దృష్టి సారించలేకపోయారు. అందుకే వారితో పాటు ఇతర కుటుంబాలు నష్టపోయాయి’’అని పేర్కొన్నారు. అదే విధంగా.. పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల సూచనలు పట్టించుకోలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ల్యాండింగ్ విషయంలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ‘నేను చూసుకుంటానులే’ అని వ్యాఖ్యానించిన పైలట్.. అనంతరం మళ్లీ కరోనా గురించి మాట్లాడటం మొదలుపెట్టాడని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డైందని వెల్లడించారు. కాగా మే 22న పాకిస్తాన్లో కరాచిలో జనావాసాల్లో విమానం కుప్పకూలిన ఘటనలో 97 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే.(‘పైలెట్‌ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’) -
కుప్పకూలిన అమెరికా విమానం
వాషింగ్టన్: అమెరికా వైమానిక దళానికి చెందిన విమానం ఒకటి సోమవారం ఉత్తర సముద్రంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఒక పైలెట్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతని గురించి ఎలాంటి సమాచారం తెలియలేదని వారు వెల్లడించారు. 48 వ ఫైటర్ వింగ్‌కు చెందిన ఎఫ్ -15 సీ ఈగిల్ విమానం ఆర్ఏఎఫ్ లాకెన్హీత్లో ఒక సాధారణ శిక్షణా కార్యక్రమంలో ఉండగా ఉదయం 9:40 గంటలకు కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. సమాచారం అందుకున్న యూకే రెస్క్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. లాకెన్‌హీత్ అనేది రాయల్ వైమానిక స్థావరం. ఇది అమెరికా వైమానిక దళం లిబర్టీ వింగ్‌గా పిలిచే 48 వ ఫైటర్ వింగ్‌కు ఆతిథ్యం ఇస్తుంది. ఈ స్థావరం లండన్ నుంచి ఈశాన్యంగా 80 మైళ్ల (130 కిలోమీటర్లు) దూరంలో ఉంది. -
విమానం కూలి 5 మంది మృతి
-
జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి
జార్జియా : అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో విమాన ప్రమాదం సంభవించింది. వివరాలు.. ఫ్లోరిడాకు చెందిన షాన్ చార్ల్స్ లామోంట్(41) తన కుటుంబసభ్యులతో కలిసి ఇండియానాలో జరిగే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పీఏ-31టి అనే చిన్న విమానంలో పైలట్‌తో సహా బయలుదేరాడు. అయితే జార్జియాలోని ఈటన్టన్‌కు ఈశాన్యంగా ఆరు మైళ్ల దూరంలో టాన్వార్డ్ రోడ్ సమీపంలోని దట్టమైన అడవుల్లో విమానం కూలిపోయింది. కాగా విమానం కూలిపోతున్న దృశ్యాలను ఒకరు తన ఫోన్లో బంధించారు. విమానం కూలడానికి ముందు ఆకాశంలోనే విమానానికి మంటలంటుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత విమానం కూలిపోవడం వీడియోలో కనిపించింది. ఈ ప్రమాదంలో షాన్ చార్ల్స్ సహా భార్య జోడిరే మోంట్, పిల్లలు జేస్ లామోంట్(6), ఎలిస్ లామోంట్(4)లతో పాటు పైలట్ లారీ రే ప్రూట్ (67) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ' రెండు ఇంజిన్లు గల టర్బో విమానం విల్స్టన్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. అయితే అకస్మాత్తుగా వచ్చిన తుఫానే ప్రమాదానికి కారణమై ఉండవచ్చు' అంటూ పోలీసులు పేర్కొన్నారు. -
పైలట్ తప్పిదం వల్లే ఆ ఘోర ప్రమాదం
కరాచి : గత మే 22న పాకిస్తాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఎ320 ఎయిర్‌బస్ విమానం ఇంజిన్లు సహకరించకపోవడంతో పైలట్ అర్థంతరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 97 మంది దుర్మరణం చెందగా, ఇదరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా దీనిపై పాకిస్తాన్ ఏవియేషన్ అధికారులు పీఐఏకు మరోసారి నివేదికను అందించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలను పట్టించుకోకుండానే ప్రయాణీకులతో వెళుతున్న ఎ320 ఎయిర్‌బస్ విమానాన్ని పైలట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించాడని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు తెలిపారు. కేవలం పైలట్ తప్పిదం వల్లే ఈ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుందని ఏవియేషన్ అధికారులు మరోసారి తేల్చి చెప్పారు.(కుప్పకూలిన పాక్ విమానం) 'ప్రమాదం గురించి తాము మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశామని.. కానీ పైలెట్ వాటిని పట్టించుకోలేదన్నారు. లాహోర్ నుంచి కరాచీకి ప్రయాణమైన ఎయిర్ బస్ ఏ-320 విమానం జిన్నా ఇంటరర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఏటీసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటికి భూమికి 7 వేల అడుగుల ఎత్తులో ఉండాల్సిన విమానం కాస్తా.. 10,000 అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు ఎత్తును తగ్గించాలల్సిందిగా పైలెట్‌ను హెచ్చరించారు. కానీ అతడు పట్టించుకోలేదు' అంటూ పేర్కొన్నారు. కాగా ఇంతకుముందు సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ)కు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంజన్ మూడు సార్లు రన్‌వేకు తగిలిందని.. దాంతో ఇంజన్ ట్యాంక్, పంపు దెబ్బతిన్నాయని పేర్కొంది. పైలెట్, ఏటీసీ ఇచ్చిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిస్థితి అదుపు తప్పిందని.. ఫలితంగా ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు.(పాక్‌కు సాయం ఆపేయండి.. అమెరికాకు విజ్ఞప్తి!) పీఐఏ జనరల్ మేనేజర్ అబ్దుల్లా హఫీజ్ ఖాన్ రాయిటర్స్‌తో స్పందిస్తూ.. ' అవును, మాకు లేఖ వచ్చింది, వారు దానిని డాక్యుమెంట్ చేస్తున్నారు. విమానంలోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా బాక్స్‌ను ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ వైమానిక ఏజెన్సీ బీఏ డీకోడ్ చేస్తోందని' పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను జూన్ 22 న పార్లమెంటుకు అందజేస్తామని పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ తెలిపారు. -
'దయచేసి మమ్మల్ని క్షోభ పెట్టకండి'
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన విమాన ఘోర ప్రమాదంలో 97 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలోంచి బాధిత కుటుంబాలు ఇంకా ఇంకా తేరుకోలేకపోతుండగా.. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం(పీఐఏ) మాత్రం వారిని ప్రశ్నలతో వేధిస్తూ మరింత చిత్రవధ చేస్తోంది. "మీకు మృతదేహాలు అందాయా?" అంటూ పదేపదే ఫోన్ చేస్తూ వారిని మానసిక క్షోభకు గురి చేస్తోంది. పీఐఏ తీరుపై మండిపడ్డ అదిల్ రెహ్మాన్ అనే వ్యక్తి ట్విటర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. (‘పైలెట్‌ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’) "ఈ భయంకర ప్రమాదంలో నా తల్లిదండ్రులను కోల్పోయాను. వారి మరణాన్ని నేను అంగీకరిస్తున్నాను. అయితే పీఐఏ చేతిలో మేము అనుభవిస్తున్న నరకం క్షమార్హం కానిది. అధికారులు ఫోన్ చేసి అడిగిన ప్రశ్నే మళ్లీ మళ్లీ అడుగుతూ మమ్మల్ని మరింత బాధకు గురి చేస్తున్నారు. తెల్లవారు జామున 2.30కి కూడా కాల్ చేసి అదే ప్రశ్న సంధిస్తున్నార"ని వాపోయాడు. కాగా రెహ్మాన్ యూఎస్‌లో నివసిస్తున్నాడు. శుక్రవారం లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న విమానం ప్రజానివాస ప్రాంతంలో కుప్పకూలగా, ఈ ప్రమాదంలో అతడి తల్లిదండ్రులు ఫజల్, వలీదా రెహ్మాన్ మరణించారు. వారి మృతదేహాలు ఇప్పటివరకు కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. దీంతో పీఐఏ అధికారులు మృతదేహాలు అందాయో లేదో తెలుసుకునేందుకు పదేపదే ఫోన్లో సంప్రదించడంతో అతడు విసిగిపోయాడు. అదే సమయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది. (ఇద్దరు తప్ప అందరూ..) ఈ విషయం గురించి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ట్యాగ్ చేస్తూ.. "కాస్త మా బాధల్ని అర్థం చేసుకోండి. ఇప్పటికే లాహోర్, కరాచీ ఫోరెన్సిక్ బృందాల మధ్య గొడవ వల్ల మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతోంది. ఈ సమయంలో కొన్ని మృతదేహాలు కూడా దొంగతనానికి గురవుతున్నాయి. అసలు మీకు ఆత్మ అనేదే లేదా?, కనీసం అల్లా అంటే కూడా భయం లేదా? దయచేసి చనిపోయిన మా పేరెంట్స్‌పై దయ చూపండి" అని రెహ్మాన్ ట్విటర్లో వేడుకున్నాడు. ఇప్పటివరకు 41 మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబానికి అందజేసినట్లు పాకిస్తాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. 19 మృతదేహాలను కరాచీ ఆసుపత్రిలో నుంచి వారి బంధువులు బలవంతంగా తీసుకెళ్లడంతో మిగతా మృతుల గుర్తింపు ఆలస్యం అయింది. (కుప్పకూలిన పాక్ విమానం) -
‘పైలెట్‌ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’
కరాచీ: రెండు రోజుల క్రితం పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పైలెట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తాము మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశామని.. కానీ పైలెట్ వాటిని పట్టించుకోలేదన్నారు. లాహోర్ నుంచి కరాచీకి ప్రయాణమైన ఎయిర్ బస్ ఏ-320 విమానం జిన్నా ఇంటరర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఏటీసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటికి భూమికి 7 వేల అడుగుల ఎత్తులో ఉండాల్సిన విమానం కాస్తా.. 10,000 అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు ఎత్తును తగ్గించాలల్సిందిగా పైలెట్‌ను హెచ్చరించారు. కానీ అతడు పట్టించుకోలేదు. (‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’) తర్వాత విమానాశ్రయానికి 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు విమానం ఎత్తు 3 వేల అడుగుల ఎత్తులో ఉండాలల్సింది. కానీ అప్పుడు విమానం 7 వేల అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు మరో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కానీ పైలెట్ మాత్రం ఏం పర్వాలేదని.. తాను హ్యాండిల్ చేయగలనని చెప్పాడు. సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) ఇచ్చిన నివేదిక ప్రకారం పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంజన్ మూడు సార్లు రన్‌వేకు తగిలిందని.. దాంతో ఇంజన్ ట్యాంక్, పంపు దెబ్బతిన్నాయని పేర్కొంది. పైలెట్, ఏటీసీ ఇచ్చిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిసస్థితి అదుపు తప్పిందని.. ఫలితంగా ప్రమాదం ఏర్పడిందని పాకిస్తాన్ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. (కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు) ఇంధనం అయిపోవడం వల్ల ప్రమాదం సంభవించిందని ప్రచారం అవుతున్న వార్తల్ని కొట్టి పారేశారు. అంతేకాక విమానంలో సరిపడా ఇంధనం ఉందని అధికారులు స్పష్టం చేశారు. విమానంలో ఉన్న ఇంధనంతో దాదాపు 2.34 గంటల పాటు ప్రయాణించగలదని.. కానీ ప్రమాద సమయానికి కేవలం 1.30 గంటలపాటే ప్రయాణించిందని అధికారులు తెలిపారు. (ఆ విమానంలో లేను : నటి) -
‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’
‘‘నా చుట్టూ అంతా మంటలు, విపరీతమైన పొగ. విమానం నలుదిక్కుల నుంచి ఏడుపులు. మంటల్లో చిక్కుకున్న పిల్లలు, పెద్దల ఆర్తనాదాలు. అగ్నికీలలే తప్ప మనుషులెవరూ కనిపించలేదు. నొప్పితో విలవిల్లాడుతున్న వారి గొంతులు మాత్రమే వినిపించాయి’’ అంటూ కరాచీ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఇంజనీర్ మహ్మద్ జుబేర్ తనకు ఎదురైన భయంకరమైన అనుభవాలు పంచుకున్నాడు. చావు అంచుల దాకా వెళ్లిన జుబేర్ ప్రస్తుతం కరాచీలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మీడియా జియో న్యూస్‌తో మాట్లాడుతూ.. సీటు బెల్టు తొలగించి.. వెలుతురు కనిపిస్తున్న చోటు వైపుగా నడిచి.. 10 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. విమానాన్ని కిందకు దించే క్రమంలో ఏవో ఆటంకాలు ఎదురయ్యాయని.. దాంతో మరోసారి విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పైలట్ చెప్పాడని.. అంతలోనే నేలకు తగిలి విమానం క్రాష్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. (భయానకం: ఆకాశం నుంచి మృతదేహాలు?) కాగా పాకిస్తాన్‌లోని కరాచీలో శుక్రవారం మధ్యాహ్నం జనావాసాల్లో ప్రయాణికుల విమానం కుప్పకూలిన విషయం విదితమే. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఈ విమానంలో ప్రమాద సమయంలో మొత్తం 99 మంది ఉన్నారు. ఇక బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జఫర్ మసూద్, ఇంజనీర్ జుబేర్‌తో పాటు మరో వ్యక్తి మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయులుగా నిలిచారు. కాగా ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఏర్పడిందని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారమిచ్చిన కొన్ని క్షణాల్లోనే ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇక ఇప్పటి వరకు ఘటనాస్థలి నుంచి 82 మృతదేహాలను వెలికితీసినట్లు పాక్ స్థానిక మీడియా పేర్కొంది. ఇదిలా ఉండగా.. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.(కుప్పకూలిన పాక్ విమానం) -
భయానకం: ఆకాశం నుంచి మృతదేహాలు?
కరాచీ: రాజు అమ్జద్ అనే వ్యక్తి కరాచీలో తన కారులో ప్రయాణిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి తన కారుపై ఓ మృతదేహం పడింది. దీంతో ఒక్కసారిగా రాజా షాక్‌కు గురై కారు నుంచి బయటకి వచ్చి పరుగులు తీశాడు. ఓ కుటుంబం రంజాన్ పండగ దగ్గరకి వస్తుండటంతో వారి ఇంటి డాబాపై పిండి పదార్ధాలు చేసుకుంటున్నారు. ఇంతలో రెండు మృతదేహాలు వారి ఇంటి డాబాపై పడ్డాయి. దీంతో భయానికి గురైన వారు ఇంట్లోకి పరుగులు తీశారు. కొద్దిసేపటి వరకు ఎవరికీ అర్థం కాలేదు ఈ మృతదేహాలు ఎక్కడివి? ఆకాశం నుంచి ఊడిపడుతున్నాయి అని? కానీ తర్వాత అర్థమైంది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఓ విమానం కరాచీలోని జనావాస ప్రాంతాల్లో కుప్పకూలిందని. విమానం కుప్పకూలిన ధాటికి మృతదేహాలు గాల్లోకి ఎగిరి కొన్ని మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనికి సంబంధించి ఎంతో భయానకంగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈద్ సమయంలో ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం చాలా బాధకరమని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విమానంలో 99 మంది ప్రయాణిస్తున్నారని, ఘటనాస్థలం నుంచి 57 మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. మిగతావాటి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రధాని ఇమ్రాన్ అధికారులను ఆదేశించారు. కాగా ఈ ప్రమాదం నుంచి ఇద్దరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇంతకీ ఏమైందంటే? లాహోర్ నుంచి వస్తున్న పీకే–8303 విమానం మరికొద్ది క్షణాల్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ కానుండగా, విమానాశ్రయం పక్కనే ఉన్న జిన్నా గార్డెన్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ పీఐఏ ఎయిర్‌బస్ ఏ320 విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 31 మంది మహిళలు, 9మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఏర్పడిందని కూలిపోవడానికి కాసేపటి ముందు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారమిచ్చారు. -
పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం
-
తీరని విషాదం : ముగ్గురు మృత్యుంజయులు
కరాచీ : కరాచీ విమాన ప్రమాదంలో మొత్తం ప్రయాణీకులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని భావిస్తున్న తరుణంలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారన్న భారీ ఊరట నిస్తోంది. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్, ప్రభుత్వ రంగ సంస్థ అర్బన్ యూనిట్ సీఈవో ఖాలిద్ షెర్డిల్ క్షేమంగా బయడపడ్డారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు తెలిపారు. అలాగే అమర్ రషీద్ అనే మరో యువకుడు కూడా ఈ ప్రమాదంనుంచి బయటపడడం మిరాకిల్. ఈ విషయాన్ని రషీద్ బంధువులు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. (కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు) పాకిస్తాన్ జియో న్యూస్ ప్రకారం, ప్రాణాలతో బయటపడిన వారిలో జాఫర్ మసూద్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం స్థలంనుంచి ఇప్పటికి 34 మృతదేహాలను వెలికితీయగా, వీరిలో ఇద్దరు పైలట్ల మృతదేహాలను గుర్తించారు. ఇంకా 24 న్యూస్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్టు అన్సార్ నఖ్వీ ఈ ప్రమాదంలో అసువులు బాసారు. వీరితో పాటు స్థానికులు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.సెకండ్ లెఫ్టినెంట్ హమ్జా యూసుఫ్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. పరేడ్ ముగిసిన తరువాత హంజా మొదటిసారి ఈద్ పర్వదినం సందర్భంగా ఇంటికి వెళుతున్నారు. (ఘోర ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?) హమ్జా యూసఫ్ మృతులు (స్థానికి మీడియా సమాచారం ఆధారంగా) -
కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు
కరాచీలో దిగడానికి ప్రయత్నిస్తూ కుప్పకూలిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఆఖరి నిమిషంలో చోటు చేసుకున్న కాక్‌పిట్ సంభాషణల వివరాలు వెలుగులోకి వచ్చాయి. విమానం పైలట్లలో ఒకరు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మధ్య జరిగిన సంభాషణ వివరాలు ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్లో నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్‌రాకపోకలను గమనించే ప్రసిద్ధ వెబ్సైట్ లైవ్ఏటీసీ.నెట్ పోస్ట్ చేసిన ఆడియో క్లిప్‌లో ఆఖరి నిమిషంలో పైలట్ రెండు ఇంజిన్లు చెడిపోయాయంటూ ఆందోళన చెందారు. తాము తీవ్ర ప్రమాదంలో ఉన్నామనేందుకు సంకేతంగా "మేడే, మేడే, మేడే" అనే సందేశాన్నిచ్చారు. రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయే కొన్ని క్షణాల ముందు ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా ఇబ్బంది ఏర్పడిందని పైలట్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీనికి స్పందించిన ఏటీసీ రెండు రన్ వేలు సిద్దంగా ఉన్నాయని చెప్పినా, పైలట్ (ఎ) గో-రౌండ్ చేయాలని నిర్ణయించుకున్నాడని, ఇది చాలా విషాదకరమైన సంఘటన అని పీఐఏ అధికార ప్రతినిధి అబ్దుల్లా హెచ్. ఖాన్ తెలిపారు. సంభాషణ ఇలా ఉంది పీకే8303 పైలట్: అప్రోచ్ ఏటీసీ: జీ సర్ పైలట్: మేం ఎడమవైపు తిరగాలా? ఏటీసీ: ఒకే (ధృవీకరణ) పైలట్: మేం డైరెక్టుగా వెళుతున్నాం. రెండు ఇంజన్లను కోల్పోయాము. ఏటీసీ: మీరు బెల్లీ ల్యాండింగ్ (గేర్-అప్ ల్యాండింగ్) చేస్తున్నారని నిర్ధారించండి? పైలట్: వినిపించడంలేదు. ఏటీసీ: ల్యాండింగ్ కోసం 2- 5 రన్‌వే అందుబాటులో ఉంది పైలట్: రోజర్ పైలట్: సర్, మేడే, మేడే, మేడే, పాకిస్తాన్ 8303 ఏటీసీ: పాకిస్తాన్ 8303, రోజర్ సర్. రెండు రన్వేలు అందుబాటులో ఉన్నాయి. అంతే ఇక్కడితో ఆడియో కట్ అయిపోయింది. కొద్దిసేపటి తరువాత, విమానాశ్రయానికి సమీపంలోని జనావాసప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తప్పా మిగిలిన అందరూ చనిపోయి వుంటారని భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి అందించిన సమాచారం ప్రకారం ముందు టవర్ ను ఢీకొట్టిన విమానం, తరువాత జనావాసాలపై కూలిపోయింది. చదవండి : ఘోర ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు? -
పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు..
సాక్షి, న్యూఢిల్లీ : పది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు మంగళూరు ఏయిర్‌పోర్టులో ఓ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్నుంచి ఇండియాకు వచ్చిన ఏయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ వన్ఎక్స్ 812 ఎయిర్‌పోర్టులో దిగుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 166 మంది ఉండగా.. 158 మంది మృత్యువాత పడ్డారు. విమానంలో నుంచి కిందకు దూకి ఓ ఎనిమిది మంది ప్రాణాలు కాపాడుకున్నారు. విమానం రెండుగా బద్ధలవటానికి ముందే వారు కిందకు దూకటం మంచిదైంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా భారతీయులు కావటం గమనార్హం. ( విమాన ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?) పాకిస్తాన్ విమాన ప్రమాద దృశ్యాలు విమాన ప్రమాదంలో మరణించిన వారికి గుర్తుగా మంగళూరులోని పనబారం పోర్టులో ఓ మెమోరియల్‌ను నిర్మించారు. ఈ ఉదయం మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమం కూడా జరిగింది. నివాళుల కార్యక్రమం ముగిసిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. దాదాపు 100 మంది ప్రయాణికులతో వెళుతున్న ఎయిర్ బస్ 320 కరాచీ ఏయిర్పోర్టు వద్ద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదని తెలుస్తోంది. ( కుప్పకూలిన విమానం : 100 మంది..) -
విమాన ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?
కరాచీ: తీవ్ర విషాదాన్ని నింపిన పాకిస్తాన్ విమాన ప్రమాదంలో బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన ఆయనను సైనిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ అనేది పాకిస్తాక్‌కు చెందిన బ్యాంక్. ఇది లాహోర్‌లో ఉంది. అటు ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలంటూ మోదీ ట్వీట్ చేశారు. (పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం) Deeply saddened by the loss of life due to a plane crash in Pakistan. Our condolences to the families of the deceased, and wishing speedy recovery to those injured. — Narendra Modi (@narendramodi) May 22, 2020 పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక దళాలు వెంటనే రంగంలోకి సహాయక చర్యల్ని చేపట్టాయి. మరోవైపు ఈ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. కరాచీలోని మహ్మద్ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సంభవించిన విమాన ప్రమాద ఘటనలో ఎనిమిది మంది సిబ్బందితోపాటు 99 మంది ప్రయాణికులు మొత్తం 106 మంది బతికి వుండే అవకాశం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్లో లాక్డౌన్ ఆంక్షలతో ఈద్ కారణంగా ప్రత్యేక పీఏఐ ఎయిర్‌బస్ ఎ 320 విమానం లాహోర్ నుంచి కరాచీకి బయలుదేరింది. ల్యాండిగ్‌కు ఒక నిమిషం ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో శుక్రవారం మధ్యాహ్నం కరాచీ విమానాశ్రయానికి అర కిలోమీటర్ దూరంలో జనసాంద్రత గల జిన్నా గార్డెన్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. కాగా, 2016 డిసెంబరు 7 తరవాత పాకిస్తాన్లో చోటు చేసుకున్న అతిపెద్ద విమాన ప్రమాదంగా దీన్ని భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్ (ఫైల్ ఫోటో) Shocked & saddened by the PIA crash. Am in touch with PIA CEO Arshad Malik, who has left for Karachi & with the rescue & relief teams on ground as this is the priority right now. Immediate inquiry will be instituted. Prayers & condolences go to families of the deceased. — Imran Khan (@ImranKhanPTI) May 22, 2020 -
పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం
-
కుప్పకూలిన విమానం : 100 మంది..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లాహోర్ నుంచి ప్రయాణికులతో కరాచీ వెళ్తుండగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ- ఏ320)కు చెందిన విమానం కుప్పకూలింది. కరాచీ ఎయిర్‌పోర్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో విమానం కూలినట్లు అక్కడి అధికారుల ద్వారా తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమాన ప్రమాద ప్రాణనష్టంపై స్పష్టత రాలేదు. కరాచీలోని మహ్మద్ ఆలీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్దమవుతున్న సమయంలో ఎయిర్ బస్ 320 కుప్పకూలిందని పాక్ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిందని, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయని తెలిపింది. ఇక ప్రజలు నివశిస్తున్న ప్రదేశంలో విమాన ప్రమాదం చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండచ్చని తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఆదేశ ఆర్మీ వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసింది. క్షతగ్రాతులను సమీపంలో జిన్నా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఓవైపు దేశంలో కరోనా వైరస్‌తో జనజీవనం అస్థవ్యస్థమవుతుండగా తాజాగా విమాన ప్రమాదం ఆ దేశ వాసులను తీవ్రంగా కలచివేస్తోంది. -
కరోనా.. ప్రజలకు వందనం చేస్తుండగా ప్రమాదం
టోరంటో : కెనడా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ విమానం ఆదివారం కుప్పకూలింది. కరోనా వైరస్‌పై పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ప్రజలకు అ తెలిపే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనాపై పోరాటంలో కెనడా ప్రజల సహాకారాన్ని అభినందించడానికి బ్రిటీష్ కొలంబియాపై స్నో బర్డ్స్ టీమ్ కు చెందిన ఏరోబెటిక్స్ టీమ్ విన్యాసాలు చేపట్టేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా కామ్లూప్స్ విమానాశ్రయం నుంచి రెండు విమానాలు టేకాఫ్ అయ్యాయి. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, అందులో ఒక విమానం అదుపుతప్పి ఓ ఇంటిముందు కుప్పకూలింది. ఈ ఘటనతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గరయ్యారు. ఏం జరుగుతుంతో తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు.(చదవండి : వదల బొమ్మాళీ..!) ఈ ఘటనకు సంబంధించి ఆ ప్రావిన్స్ ఆరోగ్య శాఖ మంత్రి అడ్రియన్ డిక్స్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడగా, అతన్ని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ‘విమానం అదుపు తప్పిన సమయంలో అది రెండు అంతస్థుల ఎత్తులో ఉంది. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ ప్యారాచూట్ సాయంతో ఓ ఇంటి పై కప్పుపై దిగాడు. ఈ సమయంలో అతని మెడకు, వీపు వెనకాల గాయాలు అయ్యాయి’ అని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదం చాలా బాధకరమని రాయల్ కెనడియన్ ఎయిర్‌ఫోర్స్ ట్వీట్ చేసింది. (చదవండి : మోదీపై విషం కక్కిన అఫ్రిది: పెను దుమారం) -
ఇస్తాంబుల్‌లో మూడు ముక్కలైన విమానం
-
షాకింగ్: మూడు ముక్కలైన విమానం
-
షాకింగ్: మూడు ముక్కలైన విమానం
ఇస్తాంబుల్: టర్కీలో విమాన ప్రమాదం జరిగింది. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. విమానం అదుపుతప్పడంతో దాని నుంచి మంటలు చెలరేగి మూడు ముక్కలుగా విడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా 179 మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. దీనిపై టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో విమానంలో 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఘటనలో ముగ్గురు టర్కీ వాసులు మృతి చెందగా.. 179 మందికి గాయాలయ్యాయని చెప్పారు. విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని.. ఎయిర్‌పోర్టు సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారని, లేదంటే భారీగా ప్రాణ నష్టం జరిగేదని అన్నారు. గాయపడిన వారిలో 12 మంది చిన్నపిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం పెగాసస్ ఎయిర్‌లైన్స్‌కి చెందినదని అధికారులు వెల్లడించారు. కాగా ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదని, దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
అది అమెరికా విమానం.. మేమే కూల్చేశాం!
కాబూల్: ఆఫ్గనిస్తాన్‌లో సోమవారం చోటుచేసుకున్న ప్రమాదంలో కూలిన విమానం అమెరికా సైన్యానికి చెందినదని తాలిబన్ గ్రూపు ప్రకటించింది. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు తాలిబన్ గ్రూపు అధికార ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. ఘాంజీ ప్రావిన్స్‌లో జరిగిన విమాన ప్రమాదానికి తామే కారణమని పేర్కొన్నాడు. సోమవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు 130 కిలోమీటర్ల దూరంలో మంటలు చెలరేగి విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఘటనాస్థలమైన దేహ్ యాక్ ప్రాంతం తాలిబన్ల అధీనంలో ఉన్నందున ఈ ఘటన గురించిన వివరాలు సేకరించడం అధికారులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తాలిబన్ గ్రూపు ప్రకటన విడుదల చేసింది. అమెరికా సైనిక స్థావరానికి 10 కిలోమీటర్ల దూరంలో విమానాన్ని కూల్చేశామని పేర్కొంది. కాగా అమెరికా సైనికాధికారులు మాత్రం తాలిబన్ల వ్యాఖ్యలను కొట్టిపడేశారు. విమాన ప్రమాద ఘటనపై అమెరికా సైన్యం విచారణ జరుపుతోందని.. ఈ ఘటనలో తాలిబన్ల ప్రమేయం ఉందా లేదా అన్న విషయం త్వరలోనే తేలుతుందని పేర్కొన్నారు. ఇక ప్రమాదానికి గురైంది ఆఫ్గనిస్తాన్ జాతీయ విమాన సంస్థ అరియానా ఆఫ్గాన్‌కు చెందిన పౌర విమానం అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. వీటి ఆధారంగా... సదరు విమానం ఆఫ్గనిస్తాన్ గగనతలంపై నిఘా నిర్వహించే అమెరికా సైన్యానికి చెందినదని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఘటనకు తామే కారణమంటూ తాలిబన్లు ముందుకు రావడం గమనార్హం. ఇక మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై.. ఇరాన్ తరచుగా రాకెట్ దాడులకు పాల్పడుతున్న విషయం విదితమే. ఆఫ్గనిస్తాన్‌లో విమాన ప్రమాదం! @pajhwok reporter Saifullah Maftoon visited the area in #Ghazni province, where an Aircraft crashed today, #Taliban said few US force officers were killed in this incident. #Afghanistan pic.twitter.com/vJ1fB2kspb — Pajhwok Afghan News (@pajhwok) January 27, 2020 -
అఫ్గానిస్తాన్‌లో కూలిన విమానం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాల రీత్యా మంటలు చెలరేగి ఘజ్ని ప్రావిన్స్‌లో కూలినట్లు అధికారులు నిర్ధారించారు. సోమవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కూలిన విమానం ఏ సంస్థకు చెందినదో, అందులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో అధికారులు స్పష్టం చేయలేదు. విమానం కూలిన దేహ్ యాక్ ప్రాంతం తాలిబన్ల అధీనంలో ఉన్నందున అధికారులు అక్కడికి చేరుకోవడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు. కూలిన విమానం ఏరియానా అఫ్గాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందినదంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఘజ్నిలో జరిగిన విమాన ప్రమాదంపై విచారించనున్నట్లు అమెరికా ఆర్మీ సోమవారం తెలిపింది. -
ఆఫ్గనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం!
కాబూల్: ఆఫ్గనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తాలిబన్ల ఆధీనంలో ఉన్న సెంట్రల్ ఘాంజీ ప్రావిన్స్‌లో సోమవారం ఘటన జరిగింది. ఆఫ్గనిస్తాన్‌కు చెందిన ఏరియానా ఆఫ్గాన్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం సోమవారం 1:40 గంటల సమయంలో కుప్పకూలినట్లుగా అధికారులు తెలిపారు. కాగా ప్రమాద సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్న విషయంపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా.. ఆఫ్గనిస్తాన్ జాతీయ విమాన సంస్థ అయిన అరియానా ఎయిర్‌లైన్స్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. తమ విమానాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని పేర్కొంది. కాగా హిందూకుష్ పర్వతాల పాదాల చెంతనున్న ఘాంజీ ప్రావిన్స్‌లో శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఇక 2005లో ఇదే ప్రాంతంలో మంచు కారణంగా ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అంతేకాదు అనేకమార్లు సైన్యం విమానాలు కూడా కూలిపోయాయి. కాగా ప్రస్తుత విమాన ప్రమాదానికి గల కారణాలు వెల్లడికావాల్సి ఉంది. -
176 మంది మృతి: ‘నా తండ్రి సజీవంగా ఉన్నారు’
ఒట్టావా: ఇరాన్- అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో చోటుచేసుకున్న ఉక్రెయిన్ విమాన ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన 13 ఏళ్ల ర్యాన్ పౌర్జామ్.. తన తండ్రి గొప్పతనాన్నిగుర్తు చేసుకున్నాడు. తన తండ్రి మన్సూర్ పౌర్జామ్ ఓ బలమైన, సానుకూలమైన భావజలం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. గత బుధవారం కెనడా రాజధాని ఒట్టావా నగరంలోని కార్లెటన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మన్సూర్ పౌర్జామ్ స్మారక సమావేశంలో ర్యాన్ పౌర్జామ్ ప్రసంగించాడు. తన తండ్రి గురించి మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఇప్పటివరకు మా తండ్రి మన్సూర్ పౌర్జామ్ చేసే పనిలోగాని.. చేతలు, మాటల్లోగాని ఎటువంటి ప్రతికూలతలు ఎదుర్కొన్నట్లు నేను చూడలేదు. నేను చెడు విషయాల గురించి మాట్లాడడానికి ఇష్టపడను. ఎందుకంటే నా తండ్రి సజీవంగా ఇక్కడే ఉన్నారని తెలుసు. అదేవిధంగా మా నాన్న చెడు విషయాలు గురించి మాట్లాడరు. నేను కూడా అంతే. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ ర్యాన్ పౌర్జామ్ చాలా భావోద్వేగంతో తన ప్రసంగాన్ని ముగించాడు.(క్షమించరాని తప్పు చేశాం: ఇరాన్) కాగా ర్యాన్పౌర్జామ్ ప్రసంగపు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ట్విటర్లో చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ.. ఆ యువకుడి మానసిక పరిపక్వతను ప్రశంసిస్తున్నారు. ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై దాడి చేసే క్రమంలో ఇరాన్ సైన్యం... ఉక్రెయిన్ విమానాన్ని కూల్చిన విషయం తెలిసిందే. అయితే తొలుత ఈ విషయాన్ని అంగీకరించని ఇరాన్... ఎట్టకేలకు తామే దుర్ఘటనకు కారణమని ఒప్పుకొన్నారు. ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన 176 మందిలో ర్యాన్ పౌర్జామ్ తండ్రి మన్సూర్ పౌర్జామ్ కూడా ఒకరు. కాగా ఇందులోఇరాన్ సంతతికి చెందిన వారే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. -
నోరు అదుపులో పెట్టుకోండి: ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అని చెప్పుకొంటున్న వ్యక్తి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఐరోపా దేశాల గురించి ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ’ఇరాన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకీ దిగజారిపోతోంది. అక్కడి ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాబట్టి ఇరాన్ సుప్రీం లీడర్ ఆచితూచి మాట్లాడాలి. అయినా ఆయన ఎంతో కాలం సుప్రీంగా ఉండబోరు’ అని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీపై విమర్శలు గుప్పించారు. కాగా పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆనాటి నుంచి ఇరు దేశాల నాయకులు మాటల యుద్ధానికి దిగుతున్నారు.(అమెరికా లక్ష్యంగా.. ఇరాక్ స్థావరాలపై దాడులు) ఈ క్రమంలో ఖమేనీ తాజాగా మరోసారి ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. అమెరికాలో ట్రంప్ పాలన జోకర్ మాదిరిగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే విధంగా ఇరాన్లో ఉక్రెయిన్ విమాన ప్రమాదం విషాదకర ఘటన అని.. అయితే ప్రత్యర్థి దేశాలు మాత్రం ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాయని ఖమేనీ వ్యాఖ్యానించారు. అణు ఒప్పందం తదితర విషయాల్లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ రోజుకో మాట మారుస్తూ... అమెరికా బానిసలు అని నిరూపించుకుంటున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.(క్షమించరాని తప్పు చేశాం: ఇరాన్) ఈ నేపథ్యంలో ఖమేనీ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్...‘ అమెరికాను ప్రేమించే ఇరాన్ అత్యున్నత ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పరువు కోసమని వారిని చంపడం సరికాదు. ఇరాన్‌ను నాశనం చేయడం కంటే.. ఉగ్రవాదాన్ని రూపుమాపడంపై ఎక్కువ దృష్టి సారించి.. ఇరాన్‌ను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దాలి’ అని ట్వీట్ చేశారు. అదే విధంగా ఇరాన్ సుప్రీం లీడర్ అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలని హెచ్చరించారు. (ఉద్రిక్తతలు తగ్గాలనే కోరుకుంటున్నాం) -
క్షమించరాని తప్పు చేశాం: ఇరాన్
టెహ్రాన్: ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేసి క్షమించరాని తప్పు చేశామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక్కరి వల్ల జరిగిన తప్పిదం కాదని పేర్కొన్నారు. ఏదేమైనా ఈ దుర్ఘటనకు ఇరాన్ ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్- అమెరికా పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ విమానాన్ని ఇరాన్ సైన్యం కూల్చి వేసిన విషయం విదితమే. ఈ ఘటనలో మొత్తం 176 మంది(82 మంది ఇరానియన్లు, 11 ఉక్రెయిన్ పౌరులు, 10 మంది స్వీడిష్ పౌరులు, నలుగురు ఆఫ్గన్లు, ముగ్గురు జర్మన్లు, ముగ్గురు బ్రిటన్ పౌరులు, 63 మంది కెనడియన్లు) దుర్మరణం పాలయ్యారు. కాగా తొలుత ఈ ఘటనతో తమకు సంబంధం లేదన్న ఇరాన్.. కెనడా, బ్రిటన్ తదితర పాశ్చాత్య దేశాధినేతల నుంచి విమర్శలు ఎదుర్కొంది.(అసలు ఆ ప్రమాదం జరిగేదే కాదు!) ఈ క్రమంలో ఉక్రెయిన్ విమానాన్ని క్షిపణి కూలుస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో విమానాన్ని కూల్చింది తామేనని ఇరాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ మంగళవారం మాట్లాడుతూ..‘ ఈ విషాదకర ఘటనకు కారణమైన వారిని విచారిస్తున్నాం. నిజానికి ఇది క్షమించరాని తప్పు. మాటలకు అందని విషాదం. అయితే దీనికి ఏ ఒక్కరినో బాధ్యులను చేయాలనుకోవడం లేదు. విమానాన్ని తామే కూల్చేశామని ఇరాన్ సైన్యం తమ తప్పిదాన్ని అంగీకరించడం మంచి విషయం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పని చేయగలరనే నమ్మకం ఉంది. విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన ఇరాన్ పౌరులు, వివిధ దేశాల పౌరుల కుటుంబాలకు మేం జవాబుదారీగా ఉంటాం. ప్రపంచం మొత్తం ఇప్పుడు మా వైపు చూస్తోంది’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఘటనకు బాధ్యులైన వారిని విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో జడ్జితో పాటు పలువురు న్యాయ నిపుణులు కూడా ఉంటారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.... హసన్ ప్రసంగం ముగిసిన వెంటనే... 176 మంది మృతికి కారణమైన విమాన ప్రమాదంలో పలువురిని అరెస్టు చేసినట్లు ఇరాన్ న్యాయ శాఖ అధికారి వెల్లడించారు. ఉద్రిక్తతలు తగ్గాలనే కోరుకుంటున్నాం -
ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలపై హింసాత్మక చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్ విమానాన్ని గత బుధవారం పొరపాటున కూల్చేశామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ ప్రమాద మృతులకు నివాళిగా టెహ్రాన్‌లోని ఆమిర్ కబీర్ వర్సిటీలో శనివారం ఒక కార్యక్రమం చేపట్టారు. అందులో పాల్గొ న్న ఇరాన్‌లోని బ్రిటన్ రాయబారి రాబ్ మెకెయిర్ని అధికారులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బ్రిటన్ మండిపడింది. ఆమిర్ కబీర్ యూనివర్సిటీలో జరిగిన నిరసనల్లో విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారని, ఇటీవల అమెరికా దాడిలో చనిపోయిన జనరల్ సులైమానీ పోస్టర్లను చింపేశారని ఇరా న్ మీడియా తెలిపింది. మరోవైపు, ఆందోళనలను అణచేయడంపై ట్రంప్ పలు ట్వీట్లు చేశారు. గత నవంబర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం మోపడాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ ‘శాంతియుత నిరసనకారులపై మరో ఊచకోత జరగకూడదు. ఇంటర్నెట్పై ఆంక్షలను సహించం. ఇరాన్ ప్రజలారా! మీకు నా సహకారం కొనసాగుతుంది’ అన్నారు. ఆందోళనలు తలెత్తే అవకాశమున్న ప్రాంతాల్లో ఇరాన్ బలగాలను మోహరించింది. కాగా ఉక్రెయిన్ విమాన ప్రమాదానికి తమదే బాధ్యతని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఆ విమానాన్ని క్షిపణిగా భావించడంతో తమ మిస్సైల్ ఆపరేటర్ సొంతంగా నిర్ణయం తీసుకుని కూల్చేశాడని పేర్కొంది. సమాచార వ్యవస్థలో 10 సెకండ్ల పాటు అడ్డంకి ఏర్పడటంతో ఉన్నతాధికా రుల నుంచి ఆ ఆపరేటర్ ఆదేశాలు తీసుకోలేకపోయాడని, సొంతంగా నిర్ణయం తీసుకుని ఆ పొరపాటు చేశాడని వివరించారు. -
ఇరాన్ విమాన ప్రమాదంపై అనుమానాలు!
న్యూఢిల్లీ : ఇరాన్లో బుధవారం చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. బోయింగ్ 737 విమానం టెహ్రాన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమాన సిబ్బందితోపాటు 176 మంది మృతిచెందారు. అయితే ఈ విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయని, ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తొలుత సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలిపిన ఉక్రేయిన్ ప్రతినిధులు.. ఆ తర్వాత కొద్దిసేపటికే విరుద్దమైన ప్రకటన చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. విమాన ప్రమాదం జరిగిన చోట రెండు బ్లాక్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్న ఇరాన్.. వాటిని బోయింగ్ సంస్థకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు వార్తలు ప్రచురించాయి. మరోవైపు అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్షిపణి దాడి కారణంగానే విమాన ప్రమాదం జరగి ఉంటుందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అలాగే రెండు రోజుల క్రితమే ప్రమాదానికి గురైన విమానానికి సాంకేతిక పరీక్షలు నిర్వహించామని బోయింగ్ సంస్థ తెలిపింది. ఇలా పలు సందేహాలు తలెత్తడంతో.. విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. -
టెహ్రాన్‌లో కూలిన విమానం
-
ఘోర విమాన ప్రమాదం, వైరల్ వీడియో
టెహ్రాన్: ఇరాన్లో బుధవారం చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ తీసుకున్నకొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో సిబ్బంది సహా, మొత్తం ప్రయాణీకులు 180 మంది సజీవ దహనమై పోయారు. దీనికి సంబంధించిన భయంకరమైన వీడియోలో ట్విటర్లో షేర్ అవుతోంది. మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమాని హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడింది. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చదవండి: ఇరాన్లో కుప్పకూలిన విమానం -
కజికిస్ధాన్లో కూలిన విమానం
-
టేకాఫ్ అవుతుండగానే ఘోర ప్రమాదం
నూర్ సుల్తాన్ : కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆల్మటీ ఎయిర్పోర్ట్ నుంచి టెకాఫ్ అవుతున్న సమయంలోనే విమానం అదుపు తప్పి కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 95 మంది ప్రయాణికులతో పాటు, 5గురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్టుగా అధికారులు ధ్రువీకరించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం కజకిస్తాన్‌లోని ప్రధాన నగరం ఆల్మటీ నుంచి రాజధాని నూర్ సుల్తాన్‌కు బెక్ ఎయిర్‌కు చెందిన విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ అవుతున్న సమయంలోనే విమానం గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కొల్పోయింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే రెండతస్తుల బిల్డింగ్‌ను ఢీ కొట్టింది. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన భద్రత సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మంది చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై కజకిస్తాన్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. -
విమానం కుప్పకూలి 9 మంది మృతి
న్యూయార్క్: అమెరికాలోని ఛాంబర్ లైన్లో దక్షిణ డకోటాకు చెందిన ఓ విమానం శనివారం మధ్యాహ్నం కుప్పకూలిపోంది. ఈ ప్రమాదంలో తూర్పు ఇడాహోకు చెందిన తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో పైలట్‌తోపాటు, ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారని బ్రూల్ కౌంటీ రాష్ట్ర అటార్నీ థెరిసా మౌల్ వెల్లడించారు. ప్రాణాలతో బయటపడి, తీవ్రమైన గాయాలపాలైన వారిని చికిత్స కోసం సియోక్స్ ఫాల్స్ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె పేర్కొన్నారు. పీలాటస్ పీసీ -12 విమానం శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరింది. ఈ విమానం ఛాంబర్లైన్ మునిసిపల్ విమానాశ్రయం నుంచి ఇడాహోకు బయలుదేరింది. కాగా, ఛాంబర్లైన్కు దక్షిణంగా ఉన్న కార్న్ఫీల్డ్లో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు చూస్తున్నామని రాష్ట్ర అటార్నీ థెరిసా మౌల్ వెల్లడించారు. తీవ్రమైన వాతావారణ పరిస్థితుల్లో బాధితులను రక్షించడానికి ముందుకు వచ్చిన అందరిని, వైద్యనిపుణులను మౌల్ ప్రశంసించారు. ఈ విమానంలో ఇడాహో చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు వారి కుటుంబ సభ్యులతో ప్రయణించినట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఇది రెండో అతిపెద్ద విమాన ప్రమాదంగా తెలుస్తోంది. -
అమెరికాలో డాక్టర్ దంపతులు దుర్మరణం
వాషింగ్టన్ : ప్రైవేట్ విమానం కూలిపోయిన ఘటనలో భారత్‌కు చెందిన వైద్య దంపతులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో వీరి వెంటే ఉన్న 19 ఏళ్ల కూతురు కూడా మృత్యువాత పడింది. గురువారం ఉదయం ఫిలడెల్ఫియాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... భారత్‌కు చెందిన జస్వీర్ ఖురానా(60), ఆయన భార్య దివ్యా ఖురానా(54) ఎయిమ్స్‌లో వైద్య విద్యనభ్యసించారు. ఈ క్రమంలో ఇరవై ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జస్వీర్ ఓ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పని చేస్తుండగా.. దివ్యా పిల్లల ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. కాగా సంపన్నులైన ఖురానా దంపతులు ఓ చిన్నపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌ను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో గురువారం కుమార్తె కిరణ్ ఖురానాతో కలిసి ఫిలడెల్ఫియా నుంచి ఓహియోకు విమానంలో బయల్దేరారు. 44 ఏళ్ల క్రితం నాటి ఆ విమానాన్ని నడుపుతున్న జస్వీర్ దానిని అదుపు చేయలేకపోయారు. దీంతో బయల్దేరిన కొద్ది సేపటికే జనావాసాల సమీపంలో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఖురానా దంపతులతో పాటు వారి కుమార్తె కూడా దుర్మరణం చెందింది. కాగా ఖురానా కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం పట్ల వారు పనిచేస్తున్న ఆస్పత్రి యాజమాన్యం, ఇరుగుపొరుగు వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందరితో కలివిడిగా ఉంటూ రోగులను కూడా ఎంతో ప్రేమగా పలకరించే దివ్యా మృతి తమను కలచివేసిందన్నారు. ఇక పెద్ద కూతురు వారితో వెళ్లకపోవడం వల్లే ప్రాణాలతో ఉందని, ఆ దేవుడు తనకు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. కాగా ఇంధనం అయిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
పాక్‌లో ఇళ్లపై కూలిన విమానం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఒక చిన్న సైనిక విమానం మంగళవారం తెల్లవారుజామున రావల్పిండిలోని నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనిక సిబ్బంది సహా 19 మంది మృతి చెందారు. పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్ విమానం మోరా కలు గ్రామ శివారులో కూలడంతో ఐదారు నివాస గృహాలు ధ్వంసం అయ్యాయని పాకిస్తాన్ మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం ఐదుగురు సిబ్బంది మరణించారని వెల్లడించింది. అయితే 19 మంది మృతదేహాలను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు స్థానిక సహాయ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అగ్నిప్రమాదం సంభవించింది. -
జనావాసాల్లో కూలిన విమానం.. 17 మంది మృతి
రావల్పిండి : పాకిస్తాన్ ఆర్మీకి చెందిన విమానం కూప్పకూలిన ఘటనలో 17 మంది మృతిచెందారు. మంగళవారం తెల్లవారు జామున రావల్పిండిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా పాక్ అధికారులు తెలిపారు. మృతుల్లో 5 గురు విమాన సిబ్బంది కాగా, 12 మంది పౌరులు ఉన్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 12 మందిని దగ్గర్లోని అధికారులు ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. ఈ విమానాన్ని పాక్ ఆర్మీ ట్రైనింగ్ కోసం వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. విమానం కుప్పకూలడంతో ఆ చుట్టపక్కల పలు ఇళ్లకు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ప్రమాదం జరిగిన చోటుకి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. -
అమెరికా: టెక్సాస్‌లో విమాన ప్రమాదం
-
విమానం కూలి 10 మంది సజీవ దహనం
వాషింగ్టన్ : టెక్సాస్‌లో విమానం కూలిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. టేకాఫ్ అవుతుండగా.. రన్‌వేపై ఉన్న హ్యాంగర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో విమానంలో మంటలు చెలరేగి.. అందులో ఉన్న ప్రయాణికులంతా అగ్నికి ఆహుతయ్యారు. రెండు ఇంజిన్ల బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఏయిర్ 350 రకానికి ప్రమాదానికి గురైనట్లు అధికారుల తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 10 మంది ప్రయాణికులు కాలి బూడిదయినయిట్లు అధికారులు వెల్లడించారు. విమానం టేకాఫ్ సమయంలో హ్యాంగర్‌ను ఎందుకు ఢీకొట్టిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన సమయంలో హ్యంగర్‌లో ఎవరూ లేనట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. -
విమానంపై పిడుగు!
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో ఆదివారం రాత్రి సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానప్రమాదానికి పిడుగుపాటే కారణమని విమాన పైలట్ డెనిస్ యెవ్‌డొకిమొవ్ చెప్పారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. తాము బయలుదేరిన కొద్దిసేపటికే సంభవించిన పిడుగుపాటు కారణంగానే తమ విమాన సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయనీ, తాము అత్యవసర నియంత్రణ పద్ధతిలోకి మారినప్పటికీ సమాచారాన్ని సరిగ్గా చేరవేయలేక పోతుండటంతో మాస్కోకు తిరిగొచ్చామని చెప్పారు. అయితే పిడుగు నేరుగా విమానంపైన పడిందా లేదా పక్కన ఎక్కడైనానా అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. కూలిపోయిన సమయంలో తమ విమాన ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయనీ, ఈ కారణంగానే మంటలు అంటుకుని ఉండొచ్చని అన్నారు. ఈ ప్రమాదంపై రష్యా ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయగా, అననుకూల వాతావరణం, పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడానికితోడు పైలట్లకు తగినంత అనుభవం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తాము ప్రాథమికంగా భావిస్తున్నట్లు వారు చెప్పారు. ప్రమాదంలో 41 మంది చనిపోగా 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మాస్కోలోనే అత్యంత రద్దీ విమానాశ్రయమైన షెరెమెటయెవో ఎయిర్‌పోర్ట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. మాస్కో నుంచి ముర్మాన్స్క్కు వెళ్లేందుకు ఏరోఫ్లోట్ విమానయాన సంస్థకు చెందిన సుఖోయ్ సూపర్‌జెట్ 100 విమానం (ఎస్‌యూ–1492) సాయంత్రం 6.02 గంటలకు (రష్యా కాలమానం ప్రకారం) బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 73 మంది ప్రయాణికులతోపాటు ఐదుగురు సిబ్బంది ఉన్నారు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో మళ్లీ 6.30 గంటలకు మాస్కోకు తిరిగొచ్చింది. విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు పైలట్లు ప్రయత్నిస్తుండగా రన్ వే పైనే కూలి మంటలు అంటుకున్నాయి. విమానం లోపల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడం మొదలైంది. పైలట్‌తో పాటు కొంతమంది ప్రయాణికులు అత్యవసర మార్గాల ద్వారా బయటపడగా, మరికొంత మంది సకాలంలో బయటకు రాలేక మంటలకు ఆహుతయ్యారు. అధికారులు బ్లాక్ బాక్స్‌లను బయటకు తీసి దర్యాప్తు జరుపుతున్నారు. -
‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్ దొరికింది
-
బాబోయ్ ఆ విమానాలు మాకొద్దు!
సింగపూర్ : ఆదివారం జరిగిన ఇథియోపియా విమాన ప్రమాదం నేపథ్యంలో సింగపూర్ తన విమానయాన సంస్థల వద్ద వున్న బోయింగ్ 737 విమానాలను పక్కనపెట్టాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తాత్కలికమే అని అధికారులు తెలిపారు. ఇథియోపియా దేశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 'బోయింగ్ 737 మ్యాక్స్ - 8' విమానం బయలుదేరిన కాసేపటికే కుప్పకూలి 157 మంది మరణించడంతో సింగపూర్ ఈ నిర్ణయం తీసుకుంది. చైనా, ఇండొనేషియా కూడా సింగపూర్ బాటలోనే నడుస్తున్నాయి. ఇథియోపియా విమాన ప్రమాదం నేపథ్యంలో చైనా, ఇండోనేషియా దేశ విమానయాన సంస్థలు కూడా బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. విమానాల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా పేర్కొంది. ఐదు నెలల కిందట ఇదే రకం లయన్ ఎయిర్ విమానం ఇండోనేసియాలో కుప్పకూలడంతో 189 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఆదివారం ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం కూడా బయలుదేరిన కొన్ని నిమిషాలకే ప్రమాదానికి గురవడంతో వీటి భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్ దొరికింది
ఎజియర్: ఇథియోపియాలో 157 మంది ప్రాణాలను బలిగొన్న అత్యంత విషాద విమాన ప్రమాదఘటనకు సంబంధించి కీలక ఆధారంగా భావించే బ్లాక్‌బాక్స్ దొరికింది. ‘విమానానికి సంబంధించి లభ్యమైన ఈ బ్లాక్‌బాక్స్‌లో విమాన సమాచారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డు అయి ఉంది’ అని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ సోమవారం పేర్కొంది. ‘అయితే బ్లాక్‌బాక్స్ పాక్షికంగా దెబ్బతింది. దాని నుంచి ఎంత సమాచారం పొందగలమనే దాన్ని మేం పరిశీలిస్తున్నాం’ అని ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. మరోవైపు, రెడ్‌క్రాస్ కార్యకర్తలు విమాన కూలిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న 157 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఘటనాస్థలిలో నలిగిపోయిన పాస్‌పోర్టులు, వస్తువులు, సామగ్రి చిందరవందరగా పడిఉన్నాయి. బోయింగ్‌కు చైనా షాక్! చైనా తన స్వదేశీ విమాన సంస్థలకు చెందిన దాదాపు వంద బోయింగ్ 737 మాక్స్–8 రకం విమానాల సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. విమానాల భద్రత దృష్ట్యా ఈమేరకు నిర్ణయించినట్లు పేర్కొంది. అడిస్ అబాబాలో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలి పోయిన సంగతి తెలిసిందే. ఐదు నెలల కిందట ఇదే రకం లయన్ ఎయిర్ విమానం ఇండోనేసియాలో కుప్పకూలడంతో 189 మంది చనిపోయారు. ఇండోనేసియా, ఇథియోపియా కూడా ఈ రకం విమానాల సేవలు నిలిపివేయాలని ఆదేశించాయి. విమాన ప్రమాద నేపథ్యంలో స్వదేశీ ఎయిర్‌లైన్స్ నిర్వహించే ఈ రకం విమానాల భద్రతపై సమీక్ష చేపట్టాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను కోరినట్లు భారత పౌర విమానయాన మంత్రి సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. -
ఇథియోపియా మృతుల్లో గుంటూరు యువతి
-
సాయం చేయండి ప్లీజ్ - సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి ట్విటర్లో బాధితుల పట్ల శరవేగంగా స్పందిస్తూ తన ప్రాధాన్యతను చాటుకుంటున్నారు. ఇథియోపియాలో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల ఆచూకీని కనుక్కోవడంలోనూ ఒక పక్క ఎంబసీ ఉన్నతాధికారులతో సంప్రదిస్తూ, పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ, మరో పక్క వారి బంధువులకు సమాచారం అందించడంలో మానవతను చాటుకుంటున్నారు. ముఖ్యంగా పర్యావరణశాఖ కన్సల్టెంట్ శిఖా గార్గ్ కుటుంబానికి ఇంకా ఆమె మరణ వార్త చేరకపోవడంపై ఆమె ట్వీట్ చేశారు. శిఖా గార్గ్ మృతి గురించి చెప్పేందుకు ఆమె భర్తకు ఎన్నో సార్లు ఫోన్ చేశాను. కానీ ఎలాంటి స్పందన లేదు. ఆమె కుటుంబాన్ని సంప్రదించేందుకు సాయం చేయండి ప్లీజ్ అని సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. సాయం చేయండంటూ ఆమె నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. కాగా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-8 మాక్స్ విమానం ఆదివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎనిమిదిమంది సిబ్బంది సహా 157మంది దుర్మరణం చెందగా, వీరిలో నలుగురు భారతీయులున్నారు. I am trying to reach the family of Shikha Garg who has unfortunately died in the air crash. I have tried her husband's number many times. Please help me reach her family. — Sushma Swaraj (@SushmaSwaraj) March 11, 2019 -
రెండు నిమిషాలు.. ఒక ప్రాణం
ఏథెన్స్ : ఆలస్యం అమృతం విషం.. ఇది సాధారణంగా అందరూ చెప్పే మాటే కానీ! ఆ ఆలస్యమే ఓ వ్యక్తి పాలట అమృతమైంది.. అతన్ని చావునుంచి తప్పించుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి బయల్దేరిన బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం ఆదివారం ఇథియోపియా వద్ద కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అదృష్టం కొద్ది.. కాదు కాదు ఆలస్యం కొద్ది ప్రాణాలతో బయటపడగలిగాడు. అతడే గ్రీకుకు చెందిన ఆంటోనిస్ మావ్రోపోలస్. ఆంటోని ‘‘ఇంటర్నేషనల్ సాలిడ్‌వేస్ట్ అసోషియేసన్’’ అనే ఓ స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షుడు. యూఎన్ నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి నైరోబికి టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. ఆదివారం ఆంటోనితో కలిపి 150మంది ప్రయాణికులతో విమానం బయలుదేరాల్సిఉంది. కానీ ఆంటోని ఆలస్యం చేయటం వల్ల 149 మంది ప్రయాణికులతోటే విమానం నైరోబి బయలుదేరింది. అనంతరం ప్రమాదానికి గురై అందులో ఉన్న వారందరూ మరణించారు. ఆలస్యం కారణంగా ఎయిర్ పోర్టు అధికారులతో చివాట్లు తిన్న ఆంటోని మాత్రం క్షేమంగా మిగిలాడు. ఈ సంఘటనపై ఆంటోని స్పందిస్తూ.. ‘‘ఆ రోజు నేను విమానాశ్రయానికి తొందరగా వెళ్లాలని చాలా ప్రయత్నించాను. కానీ నాకెవ్వరూ సహాయం చేయలేదు. అప్పుడు నాకు పిచ్చిపట్టినట్లైంద’’ని తెలిపాడు. విమానం కూలిపోయిందన్న విషయం తెలుసుకుని మొదట బాధపడ్డా తను ఆ విమానంలో లేనందుకు సంతోషించాడు. తన ఫేస్ బుక్ పేజీలో ‘‘ మై లక్కీ డే’’ అని ఫోటోలను ఉంచి ఆనందాన్ని వ్యక్తం చేశాడు. చదవండి : ఇథియోపియా మృతుల్లో గుంటూరు యువతి -
ఇథియోపియా మృతుల్లో గుంటూరు యువతి
సాక్షి, గుంటూరు : ఆఫ్రికా దేశంలోని ఇథియోపియా గగనతలంలో ఆదివారం బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 157 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో నలుగురు భారతీయులు ఉండగా ఒకరిని ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన యువతి నూకవరపు మనీషాగా అధికారులు గుర్తించారు. గుంటూరు వైద్య కళాశాలలో ఎమ్‌బీబీఎస్ పూర్తి చేసిన మనీషా అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడింది. నైరోబిలోని తన అక్కను చూడడానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మనీషా మృతితో ఉంగుటూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి : ఇథియోపియాలో కూలిన విమానం -
కొలంబియాలో విమాన ప్రమాదం
బొగటా: కొలంబియాలో శనివారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అందులోని మొత్తం పన్నెండు మంది చనిపోయారు. ప్రమాదంలో తరైరా, డోరిస్ గ్రామాల మేయర్, ఆమె కుటుంబ సభ్యులు, విమాన యజమాని, పైలట్, కో– పైలట్ సహా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. 1930లో అమెరికాలో తయారైన డగ్లస్ డీసీ–3 విమానం శాన్ జోస్ డెల్ గ్వావియేర్, విల్లావిసెన్సియో పట్టణాల మధ్య కూలిపోయిందని అధికారులు చెప్పారు. విమాన ఇంజిన్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నప్పటికీ కొలంబియా పౌర విమానయాన సంస్థ మాత్రం కారణాలు వెల్లడించలేదు. విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఎలాంటి ప్రతికూల వాతావరణం లేదని అధికారులు వివరించారు. అధ్యక్షుడు ఇవాన్ డుక్యూ మృతులకు ట్విట్టర్లో సంతాపం తెలిపారు. ప్రమాదానికి గురైన విమానాన్ని నిర్వహిస్తున్న లాజార్ ఏరియో కంపెనీ ఘటనపై స్పందించడానికి నిరాకరించింది. -
ఇథియోపియాలో కూలిన విమానం
అడిస్ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియా గగనతలంలో ఆదివారం పెను విషాదం చోటు చేసుకుంది. రాజధాని అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి బయల్దేరిన బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 157 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు భారతీ యులుసహా చైనీయులు, కెనడా, అమెరికా దేశాల పౌరులున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదా నికి కారణమేంటో తెలియరాలేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రయాణికులు బతికున్నట్లు సమాచారమేదీ లేదని ఇథియోపియా ప్రధాని కార్యా లయం ప్రకటించింది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా చనిపోయారని, మృతుల్లో 33 దేశాలకు చెందిన వారు ఉన్నారని ఇథియోపియా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ఈబీసీ వెల్లడించింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే.. అడిస్ అబాబాలోని బోలె విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇథియోపియా ప్రభుత్వ రంగ సంస్థ ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమా నం ఆరు నిమిషాలకే కుప్పకూలింది. దక్షిణ అడిస్ అబాబాకు సుమారు 50 కి.మీ దూరం లోని బిషోఫ్తులో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ ఎమర్జెన్సీ కాల్ చేశాడని, వెనక్కి వచ్చేందుకు అనుమతి ఇచ్చామని విమానయాన సంస్థ సీఈవో తెలిపారు. విమానం టేకాఫ్ అయిన తరువాత అస్థిర వేగంతో పైకి ఎగిరిందని ఎయిర్ ట్రాఫిక్ మానిటర్ వెల్లడించారు. ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 737–8 మ్యాక్స్ గత నవంబర్లోనే ఎయిర్‌లైన్స్‌లో చేరినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 32 మంది కెన్యా, 9 మంది ఇథియోఫియా, 18 మంది కెనడా పౌరులున్నట్లు చెప్పారు. అలాగే, చైనా, అమెరికా, ఇటలీ నుంచి ఎనిమిది మంది చొప్పున, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల నుంచి ఏడుగురు చొప్పున, ఈజిప్టు నుంచి ఆరుగురు, నెదర్లాండ్స్ నుంచి ఐదుగురు, భారత్, స్లోవేకియా నుంచి నలుగురేసి చొప్పున ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఇథియోపియా ప్రధాన మంత్రి కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ దుర్ఘటనపై విమాన తయారీ సంస్థ బోయింగ్ విచారం వ్యక్తం చేసింది. భారతీయ మృతుల గుర్తింపు.. విమాన ప్రమాదంలో మరణించిన భారతీయుల వివరాలను ఇథియోపియా రాయబార కార్యాలయం వెల్లడించింది. అందులో కేంద్ర పర్యావరణ శాఖకు సలహాదారుగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం కన్సల్టెంట్ శిఖా గార్గ్ ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. గార్గ్ యూఎన్ఈపీ సమావేశానికి వెళ్తున్నారని చెప్పారు. మిగిలిన ముగ్గురు వైద్య పన్నాగేశ్ భాస్కర్, వైద్య హాసిన్ అన్నాగేశ్, నూకవరపు మనీషా అని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మంత్రులు సుష్మా స్వరాజ్, హర్షవర్థన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఢీకొట్టుకున్న రెండు విమానాలు,పైలట్ మృతి
-
విమాన ప్రమాదం : ఆరు మృతదేహాలు లభ్యం
జకార్తా : ఇండోనేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి గంటలు గడిచిన నేపథ్యంలో... ఎవరూ బతికుండే అవకాశం లేదని అధికారులు ప్రకటించారు. సముద్రంలో విమాన శకలాలతోపాటు కొన్ని శరీర భాగాలను కూడా గుర్తించినట్టు తెలిపారు. జావా సముద్రంలో రెస్క్యూ టీమ్స్ ఎమర్జెన్సీ బోట్లతో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. విమానం మెయిన్‌బాడీ కూలిన చోటు కోసం గాలిస్తున్నాయి. బ్లాక్‌బాక్సులు స్వాధీనం చేసుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. సాంకేతిక లోపం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోడానికి కొన్ని క్షణాల ముందు.. వెనక్కి వచ్చేయాలని పైలట్‌కు కమాండ్ ఇచ్చినట్టు జకార్తా ఎయిర్పోర్ట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదానికి గురైన JT 610 విమానానికి గత ప్రయాణంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు తెలిసింది. సముద్రంలో కుప్పకూలిన సమయంలో ఫ్లైట్‌లో మొత్తం 189మంది ఉన్నారు. అపార అనుభవం ఉన్నా.. ఇండోనేషియాలో ఘోర ప్రమాదానికి గురైన విమానానికి ఢిల్లీకి చెందిన వ్యక్తి పైలట్‌గా వ్యవహరించారు. ఫ్లైట్ కెప్టెన్ భవ్యే సునేజా ఈ ప్రమాదంలో మరణించినట్టు జకార్తాలోని భారతీయ రాయబార కార్యాలయం ప్రకటించింది. సునేజా మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. భవ్యే సునేజా అపార అనుభవం కలిగిన పైలట్ అని లయన్ ఎయిర్ పేర్కొంది. కాగా సునేజా మరణించారని అధికారులు ప్రకటించడంతో.. ఢిల్లీలోని అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతానికి చెందిన భవ్యే సునేజా 2011లో లయన్ ఎయిర్ సంస్థలో చేరారు. -
సముద్రంలో కుప్పకూలిన విమానం
-
రోడ్డుపైనే కూలిన వింటేజ్ విమానం
కాలిఫోర్నియా : దక్షిణ కాలిఫోర్నియాలో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఓ మినీ వింటేజ్ విమానం రోడ్డుపైనే కూలిపోయింది. ప్రయాణ సమయంలోనే కాండర్ స్క్వాడ్రన్ ఆఫీసర్స్, ఎయిర్‌మెన్స్ అసోసియేషన్‌కు చెందిన నార్త్ అమెరికన్ ఎస్ఎన్జే-5 విమాన ఇంజిన్ ఫెయిల్ అయింది. పైలట్ రాబ్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఎవరూలేని ఓ రోడ్డుపై ల్యాండ్ చేశారు. అయితే అగోరా హిల్స్‌లోని 101 ఫ్రీవేపై ల్యాండింగ్ చేస్తుండగా విమాన రెక్క డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీ ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పైలట్‌ను విమానంలో నుంచి బయటకు తీశారు. తర్వాత కొద్దిసేపటికే విమానం మంటలకు ఆహుతైంది. ఈ ప్రమాదంతో కిలోమీటర్లమేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాద సమయంలో విమానంలో పైలట్ మినహా ఎవరూ లేరు. అదే సమయంలో రోడ్డుపై కూడా వాహనాలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. విమాన ఇంజిన్ ఫెయిలవ్వడంతో రద్దీగా లేని ఫ్రీవేపై ల్యాండ్ చేయాలనుకున్నానని రాబ్ తెలిపారు. ఎవరికీ గాయాలవ్వకుండా విమానాన్ని ల్యాండ్ చేయగలిగానన్నారు. -
విమానంలో మంటలు..తప్పిన పెనుప్రమాదం
-
రాహుల్ విమాన ఘటన పైలట్ల తప్పిదమే
ముంబై: కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా హుబ్లీలో రాహుల్ గాంధీ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పిన ఘటనకు పైలట్ల తప్పిదమే కారణమని డీజీసీఏ పేర్కొంది. ఇందులో కుట్రకోణమేదీ లేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 26న పదిసీట్ల సామర్థ్యమున్న విమానం ల్యాండింగ్‌కు ముందు ఒక్కసారిగా ఎడమవైపుకు వంగడంతో రాహుల్ సహా లోపలున్న వారు భయభ్రాంతులకు లోనయ్యారు. ‘చార్టెడ్ విమానం వీటీ–ఏవీహెచ్ ఆటోపైలట్ మోడ్‌లో ఉన్న సమయంలో విమానం ఎత్తు హఠాత్తుగా 125 అడుగుల.. తర్వాతి 9 సెకన్లలోనే మరో 610 అడుగులు కిందకొచ్చింది. దీంతో విమానం 65 డిగ్రీలు పక్కకు ఒరిగింది’ అని డీజీసీఏ పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో రాహుల్‌తోపాటు ఆయన మిత్రుడు కౌశల్ విద్యార్థి్థ, ఇద్దరు పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఇంజనీర్ ఉన్నారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని అప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మరోవైపు, రాహుల్ శుక్రవారం ఢిల్లీ నుంచి కైలాస్ మానససరోవర్ తీర్థ యాత్రకు బయలుదేరారు. ఈ సుదీర్ఘయాత్ర 12 నుంచి 15 రోజుల పాటు సాగనుంది. కైలాస పర్వతంపై ఉన్న శివుణ్ణి దర్శిస్తారు.