నేపాల్ రాజధాని ఖాట్మండులో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో సిబ్బంది సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయానికి విమానంలో నలుగురు సిబ్బంతో సహా 19 ప్రయాణికులుండగా.. కేవలం పైలట్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే హిమాలయ పర్వతాల మధ్య ప్రకృతి అందాల్లో ఉండే నేపాల్‌లో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఇందుకు అక్కడ ఎక్కువగా టేబుల్-టాప్ రన్‌వేలు ఉండటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇవి సవాళ్లతో కూడుకుని ఉంటాయి. తాజాగా ప్రమాదం జరిగిన త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా టేబుల్ టాప్ విమానాశ్రయమే. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర విమానాశ్రయాల్లో ఒకటి.
అన్ని వైపులా లోతైన లోయలు ఉండి.. ఎత్తైన కొండపై భాగంలో ఎయిర్‌పోర్టు ఉంటుంది.. ఈ రన్‌వే చుట్టుపక్కల భూభాగం కంటే ఎత్తులో ఉంటాయి. వీటికి దాదాపు అన్ని వైపులా లోయలు ఉంటాయి. కానీ దూరం నుంచి చూస్తే రన్‌వే, పక్కన ఉన్న భూభాగం సమాంతరంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల విమానం రన్‌వేపై అదుపుతప్పితే అది లోయలో పడి క్రాష్ అవ్వడం జరుగుతుంది.
సాధారణంగా విమానం టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేప్పుడు అది రన్‌వేపై ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం మధ్యలో విమానం టైరు నేలను తాకాలో ముందుగానే నిర్ణయించి మార్కింగ్ చేసి ఉంటుంది. అయితే వర్షాలు, ఇతర కారణాలతో రన్‌వే సరిగా కనిపించకపోతే విమానం దానికి మార్కింగ్ చేసిన నేలను దాటి తాకుతుంది. దీన్ని ఓవర్ షూట్ అంటారు. సాధారణ రన్‌వేలపై ఇలా జరిగినప్పుడు విమానం ఆగడానికి తగినంత అదనపు స్థలం ఉటుంది. కానీ టేబుల్‌టాప్ రన్‌వేలపై ఓవర్ షూట్ జరిగితే మాత్రం విమానం నేరుగా లోయ వంటి ప్రదేశంలో పడిపోతుంది.
ఇక భారత్‌లోనూ అయిదు విమానాశ్రయాలు టేబుల్-టాప్ రన్‌వేలను కలిగి ఉన్నాయి. సిమ్లా(హిమాచల్ ప్రదేశ్), కాలికట్(కేరళ), మంగళూరు(కర్ణాటక), లెంగ్‌పుయ్ (మిజోరం). పాక్యోంగ్ (సిక్కిం). వీటిలో కేరళ, మంగళూరు విమానాశ్రయాలు గతంలో పెద్ద ప్రమాదాలు సైతం జరిగాయి. మే 22, 2010న, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వస్తుండగా ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బందితో సహా 158 మంది ప్రయాణికులు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment