runway
-
రన్‌వేపై విమానం బోల్తా
టొరంటో: కెనడాలో టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్ లైన్స్ విమానం రన్‌వేపై దిగుతూ ఒక్కసారిగా బోల్తా పడింది! మంచు తుపాను, బలమైన గాలుల ధాటికి ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 80 మంది అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే 18 మంది గాయపడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విమానం బోల్తా పడ్డ తీరు, అందులోంచి ప్రయాణికులు సురక్షితంగా బయట కొస్తున్న వీడియోలు, అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు సిబ్బంది నురగ స్ప్రే చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ప్రమాదంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రతికూల వాతావరణం...వాతావరణ ఇబ్బందులతో పియర్సన్ విమానాశ్రయంలో కొన్ని రోజులుగా విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. బుధ, ఆదివారాల్లో రెండు తుపాన్లు నగరాన్ని 50 సెంటీమీటర్ల మంచుతో కప్పేశాయి. వారాంతంలోనైతే విమానాశ్రయంలో 22 సెంటీమీటర్లకు పైగా మంచు కురిసింది. ప్రమాద సమయంలోనూ తేలికపాటి మంచు కురిసినట్లు సమాచారం.ప్రాణాలతో ఎలా బయటపడ్డరంటే?విమానం పరిమాణం, సీట్ బెల్ట్, ఇంజనీరింగ్ నైపుణ్యం తదితరాలే టొరంటో ప్రమాదంలో ప్రయాణికులను కాపాడినట్టు నిపుణులు చెబుతున్నారు. విమానాలు తలకిందులవడం చాలా అరుదు. అలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కొనేలా డెల్టా విమానాన్ని రూపొందించారు. విమానంలోని సీట్లు గురుత్వాకర్షణ శక్తికి పదహారు రెట్లు ఎక్కువ శక్తిని కూడా తట్టుకునేలా ఉంటాయి. విమానం బోల్తా పడ్డా ప్రయాణికులు మాత్రం స్థిరంగా ఉండేలా, వారిని కట్టిపడేసేలా సీట్లను రూపొందిస్తారు.అందుకే టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విధిగా సీటు బెల్టులు ధరించేలా చూస్తారు. విమానం తలకిందులయితే రెక్కలు, తోకభాగం మాత్రమే విచ్ఛిన్నమయ్యేలా నిర్మాణం ఉంటుంది. ఇలాంటప్పుడు విమాన సిబ్బంది పాత్ర చాలా కీలకం. ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు వీలుగా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా వారికి శిక్షణ ఇస్తారు. సాధారణ సమయాల్లో ఫ్లైట్ అటెండెంట్లు మాత్రమే అయినా ఇలాంటప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తారు. విమానం కూలగానే ప్రయాణికులను సిబ్బంది హుటాహుటిన ఖాళీ చేయిస్తున్న దృశ్యాలు దీనికి నిదర్శనం. అత్యవసర సిబ్బంది కూడా క్షణాలపై స్పందించారు. ఆలస్యం చేయకుండా మంటలను ఆర్పేసి పెను ప్రమాదాన్ని నివారించారు.సైజూ కలిసొచ్చింది...ప్రమాదానికి గురైన బొంబార్డియర్ సీఆర్జే 900 విమానం చిన్నగా ఉంటుంది. ప్రయాణికులు ప్రా ణాలతో బయట పడేందుకు ఇది కూడా కారణమే. కేబిన్ ఎత్తు కేవలం ఆరడుగులే. దాంతో బోల్తా పడ్డా ప్రయాణికులు ఎక్కువ దూరం పడిపోరు. -
కెనడాలో విమాన ప్రమాదం..రన్‌వేపై మంటలు
ఒట్టావా:ఈ ఏడాది ముగుస్తుందనగా వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మరో రెండు రోజుల్లో 2024కు వీడ్కోలు పలకనున్న సమయంలో శనివారం(డిసెంబర్28) రాత్రి దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు తప్ప మొత్తం 179 మరణించినట్లు తెలుస్తోంది. ల్యాండిగ్ గేర్ విఫలమవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. ఇదే తరహా భారీ విమాన ప్రమాదం కెనడాలో శనివారం రాత్రి తృటిలో తప్పింది. ఎయిర్కెనడాకు చెందిన విమానం హలిఫాక్స్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ గేర్ విఫలమై అత్యవసరంగా ల్యాండయింది. ల్యాండయ్యే సమయంలో విమానం రన్‌వేపై అదుపుతప్పింది. దీంతో విమానం రెక్క రన్‌వేకు రాసుకుంటూ పోయి మంటలు లేచాయి. 🚨MOMENTS AGO: PLANE FULL OF PASSENGERS CRASH LANDS IN CANADA ⚠️ pic.twitter.com/AaEYJKDoyk— Matt Wallace (@MattWallace888) December 29, 2024అయితే ఎమర్జెన్సీ బృందాలు సత్వరమే స్పందించి మంటలార్పాయి. దీంతో ప్రాణ నష్టం తప్పి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే పెద్ద శబ్దం వచ్చిందని, భారీ ప్రమాదం జరిగి ఉంటుందనుకున్నామని ఓ ప్రయాణికుడు తెలిపారు.కాగా, కొద్ది రోజుల క్రితమే కజకిస్తాన్‌లో అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలి అందులోని ప్రయాణికుల్లో చాలా మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ జరిపిన కాల్పులే కారణమని ప్రచారం జరిగింది. తాజాగా పుతిన్ ఈ విషయమై క్షమాపణ కూడా చెప్పారు. అయితే విమాన ప్రమాదానికి తామే కారణమని రష్యా స్పష్టంగా ఎక్కడా ఒప్పుకోకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: ద.కొరియాలో విషాదం..179 మంది దుర్మరణం -
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు ముందడుగు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి రన్‌వేతో పెద్ద విమానాశ్రయాన్ని నిర్మించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ పనులు ప్రారంభమయ్యేనాటికి రాష్ట్రంలో మూడో విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియను కూడా కొలిక్కి తేవటానికి చర్యలు ప్రారంభించాయి. హైదరాబాద్, వరంగల్ విమానాశ్రయాల తర్వాత మూడో విమానాశ్రయాన్ని కొత్తగూడెంలో నిర్మించాలని నిర్ణయించాయి. ఇది కూడా రాష్ట్రంలో కీలక విమానాశ్రయంగా మారుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖను కోరింది. ఆ శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో వరంగల్ తరహాలో దీన్ని కూడా వేయి ఎకరాల్లో నిర్మించేందుకు ప్రాథమిక కసరత్తు మొదలైంది. పది రోజుల్లో సర్వేకు ఏఏఐ బృందంవిమానాశ్రయం కోసం గుర్తించిన ప్రాంతానికి సంబంధించి గత పదేళ్ల వాతావరణ (మెటియోరాలాజికల్) నివేదికలు, విండ్రోజ్ డయాగ్రామ్ తదితర వివరాలను ఏఏఐకి అధికారులు సమర్పించారు. విమానాశ్రయ నిర్మాణానికి ఈ భూమి యోగ్యమైందో కాదో తేల్చేందుకు మరో పదిరోజుల్లో ఏఏఐ సాంకేతిక బృందం ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేయబోతోంది. అది యోగ్యమైన భూమి అని తేలితే వెంటనే అటవీ శాఖతో సమన్వయం చేసుకుని ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఏఏఐకి అప్పగిస్తుంది. దీనికి బదులుగా అటవీ శాఖకు మరోచోట భూమిని కేటాయిస్తారు. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణం వల్ల వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కూడా పెద్ద రన్‌వే..వరంగల్‌లో దాదాపు 2,800 మీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించనున్నారు. కొత్తగూడెంలో కూడా అలాంటి భారీ రన్‌వేను నిర్మించాలని భావిస్తున్నారు. వచ్చే 40 ఏళ్ల అవసరాలను తీర్చేలా, భారీ విమానాలు దిగగలిగే సామర్థ్యంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ పేర్కొంది. 950 ఎకరాల భూమి గుర్తింపు రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు నిర్మించాలన్న ప్రతిపాదన చాలాకాలంగా పెండింగులో ఉంది. నిజాం హయాంలో కొనసాగిన ఎయిర్్రస్టిప్స్ను పునరుద్ధరించటంతోపాటు మరో మూడు చోట్ల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు నిర్మించాలన్నది ప్రతిపాదన. వీటిల్లో తొలుత వరంగల్ శివారులోని మూమునూరు పాత ఎయిర్‌్రస్టిప్ ఉన్న స్థలంలో ఎయిర్‌బస్ వంటి భారీ విమానాలు కూడా దిగగలిగే రన్‌వేతో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. మరో ఆరు నెలల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పుడు దానితోపాటు కొత్తగూడెం విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తేవాలన్న యోచనతో ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇక్కడ తొలుత చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని భావించినా.. ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వరంగల్ తరహాలో వేయి ఎకరాల్లో నిర్మించాలని ఇప్పుడు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) భావిస్తోంది. గతంలో విమానాశ్రయం కోసం పాల్వంచ సమీపంలో గుడిపాడు–బంగారుజాల మధ్య స్థలాన్ని ఎంపిక చేశారు. రాష్ట్రంలో విమానాశ్రయాల నిర్మాణానికి కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ఏఏఐ.. ఆ స్థలం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పనికిరాదని ఇటీవల నివేదిక సమరి్పంచింది. ఆ ప్రాంతంలో గుట్టలుండటంతోపాటు భూమి పొరలు కూడా నిర్మాణానికి వీలుగా లేవని పేర్కొంది. దీంతో తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏఏఐ అధికారులతోపాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడును కలిసి విమానాశ్రయ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు. ప్రత్యామ్నాయ స్థల సేకరణపై అధికారులతో చర్చించారు. దీనికి ఏఏఐ సమ్మతించటంతో జిల్లా కలెక్టర్‌కు ప్రత్యామ్నాయ స్థల సేకరణ కోసం ఆదేశాలిచ్చారు. దీంతో అధికారులు మూడు మండలాల పరిధిలోకి వచ్చే 950 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. కొత్తగూడెం మండలంలోని రామవరం గ్రామం, సుజాతానగర్ మండల పరిధిలోని సుజాతానగర్ గ్రామం, చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి గ్రామం పరిధిలో 950 ఎకరాల అటవీ భూములను ఎంపిక చేశారు. ఎన్నో ఉపయోగాలు కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయన్న మా ప్రతిపాదనకు అంగీకరించిన కేంద్రం.. అక్కడ విమానాశ్రయ నిర్మాణానికి సమ్మతించింది. బొగ్గు గనుల కేంద్రం, సిమెంటు పరిశ్రమల నిలయం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందే ప్రాంతం.. ఛత్తీస్‌గఢ్‌కు చేరువగా ఉన్నందున రెండు రాష్ట్రాల అనుసంధానం తేలికవుతుంది. ఇది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 300 కి.మీ. దూరంలో ఉన్నందున ఎలాంటి నిబంధనలు అడ్డు రావు. ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం దేవాలయానికి దేశవిదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేందుకు ఇది దోహదపడుతుంది.– తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి -
లక్నో ఎయిర్‌పోర్టును ముంచెత్తిన వర్షాలు.. వరదనీటిలో రన్‌వే
లక్నో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యియి. దీంతో రాజధాని కోల్కతాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును వరదనీరు ముంచెత్తింది. విమానాశ్రయంలోని రన్‌వే, టాక్సీవేలు జలమయమయ్యాయి. ఎయిర్ పోర్ట్‌లో రన్‌వేపై మోకాళ్ల లోతులో నీరు చేరి.. విమనాల టేక్ ఆఫ్, ల్యాండ్ అవ్వడానికి వీలు లేకుండా ఉంది. దీంతో పలు విమానాల రాకపోకలు రద్దు చేశారు. అయితే వరదనీటిలోనే విమానాలు పార్క్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు కోల్‌కతా, దాని పరిసర ప్రాంతాలైన హౌరా, సాల్ట్, మరియు బరాక్‌పూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. 📍Kolkata | Flight operations at Kolkata Airport are proceeding normally despite heavy rainfall. Both the runway and all taxiways are fully operational. However, a few parking stands are affected by waterlogging for which additional pumps have been deployed. pic.twitter.com/ddrEu4rmVE— NDTV (@ndtv) August 3, 2024 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ప్రస్తుతం బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ వైపు కదులుతోందని, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాలపై చురుకైన రుతుపవన ద్రోణిని మోస్తోందనిఎడతెగని వర్షాలకు కారణమైందని పేర్కొన్నారు. -
నేపాల్‌లో విమాన ప్రమాదం
కఠ్మాండు: హిమాలయాల నేల నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలిన ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారిసహా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. పైలట్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలైన పైలట్ మనీశ్ రత్న శాక్యకు కంటి, వెన్నుముక శస్త్రచికిత్స చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కఠ్మాండు ఎయిర్పోర్ట్ నుంచి పొఖారా సిటీకి బయల్దేరేందుకు టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే బంబార్డియర్ తయారీ సీఆర్జే–200 రకం విమానం కూలింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. టేకాఫ్ అయ్యాక ఎడమ వైపుగా పయనించాల్సిన విమానం దిశను హఠాత్తుగా కుడి వైపునకు తిప్పడంతో స్థిరత్వం కోల్పోయి నేలరాలిందని ఎయిర్పోర్ట్ చీఫ్ జగన్నాథ్ నిరౌలా ‘బీబీసీ న్యూస్ నేపాలీ’ వార్తాసంస్థతో చెప్పారు. కూలిన విమానంలో సాధారణ ప్రయాణికులెవరూ లేరుగానీ పైలెట్, సాంకేతిక సిబ్బంది, ఇద్దరూ విమాన సిబ్బందితో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. విమానం రన్ వే మీద పడిన వెంటనే మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటనే రంగంలోకి దిగిన అగి్నమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పేశారు. 15 మంది ఘటనాస్థలిలో ముగ్గురు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ మరణించారు. ఘటనాస్థలిని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి సందర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. టేబుల్ టాప్ రన్‌వే చుట్టూతా ఉండే హిమాలయ పర్వతాల మధ్య నుంచి దిగుతూ నేపాల్ ఎయిర్‌పోర్ట్‌ల గుండా రాకపోకలు సాగించడం ఇక్కడి పైలెట్లకు కత్తిమీద సామే. పర్వతప్రాంతం కావడంతో ఇక్కడి గాలి వీచే దిశ, వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతుంటాయి. తక్కువ ఎత్తులో నడపడం సవాల్‌తో కూడిన పని. అందులోనూ కఠ్మాండు విమానాశ్రయంలో టేబుల్ టాప్ రన్‌వే ఉంది. అంటే రన్‌వే దాటి ఏమాత్రం ముందుకు వెళ్లినా లోయలో పడే ప్రమాదముంది. రన్‌వేకు ఒక వైపు గానీ, రెండు వైపులా గానీ లోయ లేదా ఏటవాలు భూమి టేబుల్ టాప్ రన్‌వేగా పిలుస్తారు. దీనిపై టేకాఫ్, ల్యాండింగ్ ఖచి్చతత్వంతో చేయకుండా ప్రమాదమే. బుధవారం జరిగిన ప్రమాదానికి ఈ రకం రన్‌వే కూడా ఒక కారణమని వార్తలొచ్చాయి. భారత్‌లో సిమ్లా, కాలికట్, మంగళూరు, లెంగ్‌పుయ్ (మిజోరం), పాక్యోంగ్ (సిక్కిం)లలో ఈ టేబుల్–టాప్ రన్వేలు ఉన్నాయి. వీటిలో కేరళ, మంగళూరులో గతంలో పెద్ద విమాన ప్రమాదాలు జరగడం గమనార్హం. -
నేపాల్ ప్రమాదానికి టేబుల్ టాప్రనేవే కారణం!.. ఏంటిది?
నేపాల్ రాజధాని ఖాట్మండులో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో సిబ్బంది సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయానికి విమానంలో నలుగురు సిబ్బంతో సహా 19 ప్రయాణికులుండగా.. కేవలం పైలట్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే హిమాలయ పర్వతాల మధ్య ప్రకృతి అందాల్లో ఉండే నేపాల్‌లో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఇందుకు అక్కడ ఎక్కువగా టేబుల్-టాప్ రన్వేలు ఉండటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇవి సవాళ్లతో కూడుకుని ఉంటాయి. తాజాగా ప్రమాదం జరిగిన త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా టేబుల్ టాప్ విమానాశ్రయమే. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర విమానాశ్రయాల్లో ఒకటి.అన్ని వైపులా లోతైన లోయలు ఉండి.. ఎత్తైన కొండపై భాగంలో ఎయిర్‌పోర్టు ఉంటుంది.. ఈ రన్‌వే చుట్టుపక్కల భూభాగం కంటే ఎత్తులో ఉంటాయి. వీటికి దాదాపు అన్ని వైపులా లోయలు ఉంటాయి. కానీ దూరం నుంచి చూస్తే రన్‌వే, పక్కన ఉన్న భూభాగం సమాంతరంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల విమానం రన్‌వేపై అదుపుతప్పితే అది లోయలో పడి క్రాష్ అవ్వడం జరుగుతుంది.సాధారణంగా విమానం టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేప్పుడు అది రన్‌వేపై ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం మధ్యలో విమానం టైరు నేలను తాకాలో ముందుగానే నిర్ణయించి మార్కింగ్ చేసి ఉంటుంది. అయితే వర్షాలు, ఇతర కారణాలతో రన్‌వే సరిగా కనిపించకపోతే విమానం దానికి మార్కింగ్ చేసిన నేలను దాటి తాకుతుంది. దీన్ని ఓవర్ షూట్ అంటారు. సాధారణ రన్‌వేలపై ఇలా జరిగినప్పుడు విమానం ఆగడానికి తగినంత అదనపు స్థలం ఉటుంది. కానీ టేబుల్‌టాప్ రన్‌వేలపై ఓవర్ షూట్ జరిగితే మాత్రం విమానం నేరుగా లోయ వంటి ప్రదేశంలో పడిపోతుంది.ఇక భారత్‌లోనూ అయిదు విమానాశ్రయాలు టేబుల్-టాప్ రన్‌వేలను కలిగి ఉన్నాయి. సిమ్లా(హిమాచల్ ప్రదేశ్), కాలికట్(కేరళ), మంగళూరు(కర్ణాటక), లెంగ్‌పుయ్ (మిజోరం). పాక్యోంగ్ (సిక్కిం). వీటిలో కేరళ, మంగళూరు విమానాశ్రయాలు గతంలో పెద్ద ప్రమాదాలు సైతం జరిగాయి. మే 22, 2010న, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వస్తుండగా ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బందితో సహా 158 మంది ప్రయాణికులు మరణించారు. -
ఇండిగో, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు జరిమానా
ముంబై: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్‌వే పక్కనే నేలపై కూర్చుని భోజనంచేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఆగ్రహం వ్యక్తంచేసి జరిమానా విధించాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థపై రూ.1.5 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై రూ.90 లక్షల జరిమానా విధించాయి. ఒక పౌరవిమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారికావడం గమనార్హం. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది. చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకు దిగొచ్చి రన్‌వే పక్కనే కూర్చుని భోజనాలు చేశారు. ఈ ఘటనను పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. బీసీఏఎస్ అడిగేదాకా ఈ విషయంలో ఇండిగో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. రన్‌వేపై ప్రయాణికుల కదలికలను నియంత్రించకుండా ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఆక్షేపించింది. -
ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. అయిదుగురి మృతి
జపాన్ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని టోక్యోలోని ఓ ఎయిర్‌పోర్టు రన్‌వేపైని విమానంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు మృత్యువాతపడ్డారు. వివరాలు.. హోకియాడో నుంచి వస్తున్న జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన JAL 516 విమానం ప్రమాదానికి గురైంది. హనెడా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా మంటలు వ్యాపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానంలోని 379 ప్రయాణికులు, 12 మంది సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. JAL plane on fire at Tokyo Airport pic.twitter.com/EL9s7kVJbi — アトリン ✊🏾 (@phoojux) January 2, 2024 అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో విమానం రన్‌వేపై దిగుతుండగానే దాని చక్రాల నుంచి మంటలు వెలువడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని.. దాదాపు 70 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. JAL plane on fire at Tokyo Airport pic.twitter.com/EL9s7kVJbi— アトリン ✊🏾 (@phoojux) January 2, 2024 ప్రమాదానికి గల స్పష్టమైన కారణం తెలియరాలేదు కానీ.. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా అక్కడే ఉన్న కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీ కొనడం వల్లే ఈ ఘటన జరిగినట్లు విమానాశ్రయ అధికారులు జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కేకు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే కోస్ట్‌గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో మొత్తం ఆరుగురు సిబ్బంది ఉండగా.. వారిలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటన అనంతరం హనెడా విమానాశ్రాయాన్ని పూర్తిగా మూసివేసినట్లు చెప్పారు. -
నదిపైనే ల్యాండింగ్ !
మాస్కో: రన్‌వేపై ల్యాండ్ చేయడం మామూలే.. నది ఉపరితలంపై విమానాన్ని పరుగెత్తించడంలోనే ఉంది అసలు మజా అనుకున్నాడో ఏమో. రష్యాలో చిన్న విమానాన్ని ఒక పైలట్ నేరుగా నదిపైనే ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు నది ఉపరితలం మొత్తం దట్టంగా మంచుతో నిండిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలబడ్డాయి. రష్యాలో తూర్పు సైబీరియా పరిధిలోని జిర్యాంకా విమానాశ్రయ సమీపంలో జరిగిందీ ఘటన. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రాంతంలోని యాకుట్సŠక్ నగరం నుంచి 34 మంది ప్రయాణికులతో ఆంటోవ్ ఏఎన్–24 విమానం గురువారం ఉదయం జిర్యాంకా నగరానికి బయల్దేరింది. భారీగా మంచు కురుస్తుండటంతో జిర్యాంకా ఎయిర్పోర్ట్ రన్‌వే సరిగా కనబడక దానిని దాటేసి ఎదురుగా ఉన్న కోలిమా నదిపై ల్యాండ్‌చేశాడు. నగరంలో ప్రస్తుతం గడ్డకట్టే చలి వాతావరణం రాజ్యమేలుతోంది. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత దెబ్బకు నది ఉపరితలం మొత్తం గడ్డకట్టింది. దీంతో దీనిపై ల్యాండ్ అయిన విమానం అలాగే కొన్ని మీటర్లు సర్రున జారుతూ ముందుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఘటనకు కారకుడైన పైలట్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. సోవియట్ కాలంనాటి ఈ చిన్న విమానాన్ని పోలార్ ఎయిర్‌లైన్స్ నడుపుతోంది. -
పైలట్ తప్పిదం.. రన్‌వే అనుకొని నదిపై ల్యాండ్ అయిన విమానం
రష్యాలో ఘోర ప్రమాదం తప్పింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం రన్‌వే అనుకొని పొరపాటున గడ్డకట్టిన నదిపై ల్యాండ్ అయ్యింది. అయితే నదిలోని నీరంతా పూర్తిగా గడ్డుకట్టుకుపోవడంతో ఎవరికి ఏ ప్రమాదం జగరలేదు. ఈ ఘటన జిర్యాంగ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగింది. వివరాలు.. పోలార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సోవియెట్ కాలం నాటి ఏఎన్-24 విమానం రష్యాలోని యాకుత్స్క్ నుంచి గురువారం బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం జిర్యాంక ఎయిర్‌పోర్టులో దిగాల్సి ఉంది. అయితే ఈ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మానాశ్రయంలోని రన్‌వేపై మంచు పేరుకుపోయింది. విపరీతమైన మంచు కారణంగా పక్కనే నది కూడా గడ్డకట్టి ఉంది. దీంతో పైలట్ గందరగోళానికి గురై ఎయిర్‌పోర్టు సమీపంలోని కోలిమా నదిపై విమానాన్ని ల్యాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎమర్జెన్సీ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైలట్ తప్పిదం కారణంగానే విమానం నదిపై ల్యాండ్ అయ్యిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. గడ్డకట్టిన నదిపై విమానం ల్యాండ్ అవడం, అందులోని ప్రయాణికులను బయటకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. The AN-24 aircraft of Polar Airlines was flying on the route #Yakutsk - Zyryanka - Srednekolymsk. But, having arrived at Zyryanka airport, it landed on Kolyma river. There were 30 passengers and 4 crew members on board. No one was injured and the aircraft was not damaged.… pic.twitter.com/MFM85AKSJ6— WarMonitoreu (@WarMonitoreu) December 28, 2023 -
Video: ఓకే రన్‌వేపై ప్రమాదానికి గురైన రెండు విమానాలు
తూర్పు ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే రోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. కేవలం గంటల వ్యవధిలోనే ఒకే రన్‌వేపై అదుపుతప్పాయి. కికోబోగా ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం జరిగిన ఈ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు..యునైటెడ్ ఎయిర్ జాంజిబార్ విమానం 30 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో జాంజిబార్ నుంచి బయల్దేరింది. కికోబోగా విమానాశ్రయంలో దిగుతుండగా రన్‌వేను తాకగానే ల్యాండింగ్ గేర్ ఊడిపోయింది. దీంతో విమానం రన్‌వేపై నుంచి కొద్దిదూరం పక్కకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో విమానానికి బాగా నష్టం వాటిల్లినప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. This is crazy 🤯 An Embraer E120 had problems with its landing gear when landing in Kikoboga in Tanzania and left the runway. another aircraft was sent to rescue passengers, but this one had problems taking off, hit a building and caught fire.pic.twitter.com/sTJmeEcRx5 — Flight Emergency (@FlightEmergency) November 29, 2023 కాగా ఉదయం జరిగిన ఈ ప్రమాదం నుంచి ఎయిర్‌పోర్టు సిబ్బంది తేరుకోకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. కేవలం ఆరుగంటలకే కికోబోగా ఎయిర్పోర్ట్ నుంచి జాంజిబార్ వెళ్లేందుకు మరో విమానం సిద్ధమైంది. 30 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో జాంబిజార్కు వెళ్లడానికి బయలు దేరింది. రన్‌వేపై స్పీడ్ అందుకున్నాక గాల్లోకి లేవాల్సిన విమానం అదుపుతప్పి రన్ వే చివర్లో ఉన్న ఓ బిల్డింగ్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కూడా విమానం చాలా వరకూ దెబ్బతిన్నట్లు అక్కడి మీడియా నివేదించింది. ప్రమాదం తర్వాత ఘటనా స్థలి వద్ద భారీగా పొగలు వచ్చాయి. అయితే ఈ ప్రమాదంలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రెండు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: ఆలస్యం వద్దు.. నిషేధించండి: బైడెన్‌కు లేఖ 🇹🇿 Embraer E120 Brasília had problems with its landing gear in Kikoboga, Tanzania and left the runway. Another Brasília plane had problems taking off, hit a building and caught fire. pic.twitter.com/KauBBB3V5U — Ryan sikorski (@Ryansikorski10) November 30, 2023 -
రన్‌వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ
ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ కొన్నాయి. దీంతో అధికారులు రన్‌వేని మూసేశారు. ఈ ఘటకు గల కారణాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ ప్రమాదం జపాన్ రాజధాని టోక్యలో హనెడా విమానాశ్రయం వద్ద చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటనలో ప్రయాణికులకు తీవ్ర గాయలైనట్లు జపాన్ మీడియా పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎవరికీ ఏం కాలేదని అంటోంది. టోక్యోలోని హనెడా విమానాశ్రయం వద్ద టాక్సీవేలో ప్రయాణికులతో కూడిన రెండు విమానాలు ఢీ కొన్నాయి. దీంతో రన్‌వే ఒక్కసారిగా మూసివేశారు అధికారులు. బ్యాంకాకు బయలుదేరిని థాయ్ ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ జెట్ ప్రమాదవశాత్తు తైపీకి వెళ్తున్న ఎవా ఎయిర్వేస్ విమానాన్ని ఢీ కొట్టింది. ఈ షాకింగ్ ఘటన కారణంగా మిగతా విమానాలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ ఈ ఘటన శనివారం ఉదయం 11 గంటలకు జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎలాంటి నష్టం వాటిల్ల లేదని పేర్కొంది. కానీ జపాన్ స్థానిక మీడియాలు మాత్రం ప్రయాణికులు కొద్దిపాటి గాయాలయ్యాయని, అలాగే ఓ విమానం రెక్కదెబ్బతిందని పేర్కొంది. ఈ ప్రమాద సమయంలో టోక్యో విమానాశ్రయం సత్వరమే స్పందించడంలో జాప్యం చేసిందని పలు విమర్శనాత్మక కథనాలు వెలువరించడం గమనార్హం. కాగా, అసలు ఈ ఘటనకు దారితీసిన కారణాలేంటో తెలియాల్సి ఉంది. (చదవండి: రాజ భవనంలాంటి ఆ బంగ్లా.. ఎలుకలు ఉన్నాయని కూల్చేస్తున్నారు!) -
రన్‌వేపై విమానాన్ని ఢీకొన్న పక్షి
యశవంతపుర: ప్రయాణికులందరూ దుబాయ్‌కి వెళ్లడానికి ఉత్సాహంగా సీట్లలో కూర్చుని ఉన్నారు. విమానం రన్‌వేపై వేగంగా ముందుకు సాగుతోంది. ఇంతలో ఏదో తగిలినట్లు పెద్ద శబ్ధం. అందరూ హడలిపోయారు. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానాన్ని పక్షి ఢీకొనడంతో టేకాఫ్ వాయిదా పడింది. మంగళూరు విమానశ్రయం నుంచి దుబాయ్‌కి వెళ్లడానికి గురువారం ఉదయం 8:30 కి విమానం సిద్ధంగా ఉంది. ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమై రన్ వే మీదకు వచ్చింది. ముందుకు వెళ్తుండగా ఒక పక్షి విమానం రెక్కను ఢీకొని మృత్యువాత పడింది. పెద్ద చప్పుడు రావడంతో పైలట్ టేకాఫ్‌ను నిలిపివేశారు. ప్రయాణికులను కిందకు దించివేసి, విమానానికి ఏమైనా అయ్యిందా అని మెకానిక్‌లు పరిశీలించారు. చివరకు ఆ విమానాన్ని పక్కనపెట్టి బెంగళూరు నుంచి మరో విమానాన్ని రప్పించి అందులో ప్రయాణికులను దుబాయ్‌కి పంపించారు. ఈ సంఘటనతో మంగళూరు విమానశ్రయంలో కొన్ని గంటలపాటు ఆందోళన నెలకొంది. -
Shamshabad Airport: విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం..
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం నెలకొంది. విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతూనే టేకాఫ్ తీసుకుంది. పైలట్ తీరుతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ల్యాండ్ కావాల్సిన విమానం మళ్లీ టేకాఫ్ కావడం చూసి షాక్ అయ్యారు. అయితే ఐదు నిమిషాల తర్వాత విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశాడు పైలట్. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రన్‌వేపై వెలుతురు సరిగా లేకపోవడంతోనే పైలట్ ఇలా చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ -
నేపాల్ లో రన్‌వేపై కుప్ప కూలిన విమానం
-
పొగమంచుతో విమానాలకు ల్యాండింగ్ కష్టాలు
విమానాశ్రయం (గన్నవరం): దట్టమైన పొగమంచు రన్‌వే ప్రాంతాన్ని పూర్తిగా కప్పి వేయడంతో గన్నవరం విమానాశ్రయంలో గురువారం విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలుత హైదరాబాద్ నుంచి ఉదయం 7.35 గంటలకు వచ్చిన ఇండిగో విమానం రన్‌వేపై దిగేందుకు విజిబిలిటీ లేకపోవడంతో 40 నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచన మేరకు విమానం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. ఉదయం 8.15 గంటలకు న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో అరగంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. ఒకసారి రన్‌వేపై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలెట్లు ప్రయత్నించినప్పటికి విజిబిలిటీ లేకపోవడంతో టేకాఫ్ తీసుకున్నారు. మరో ప్రయత్నంలో సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. పొగమంచు ప్రభావం తగ్గిన తర్వాత హైదరాబాద్ తిరిగి వెళ్లిన ఇండిగో విమానం కూడా గన్నవరం ఎయిర్‌పోర్టుకి ఉదయం 10 గంటలు దాటిన తరువాత చేరుకుంది. ఫాస్టాగ్ సేవలు ప్రారంభం గన్నవరం విమానాశ్రయంలోని టోల్గేట్లో ఫాస్టాగ్ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రద్దీ సమయాల్లో టోల్గేట్ వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ సేవలను వినియోగంలోకి తీసుకువచ్చారు. టోల్గేట్ వద్ద జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న విమానాశ్రయ ఇన్చార్జ్ డైరెక్టర్ పీవీ రామారావు ఈ సేవలను ప్రారంభించారు. -
నింగి నుంచి నీళ్లలోకి...!
దక్షిణ ఫ్రాన్స్‌లోని మోంట్‌పిల్లర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యాక రన్‌వే దాటి దూసుకెళ్లి సరస్సులోకి దూసుకెళ్లింది ఓ సరకు రవాణా విమానం. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమయంలో బోయింగ్ 737 కార్గో విమానంలో మొత్తం ముగ్గురు ఉన్నారు. విమానాన్ని తొలిగంచే వరకు ఎయిర్‌పోర్ట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని సరస్సులోకి దూసుకెళ్లగా విమానంలోని ఒక ఇంజిన్ నీటిలో మునిగిపోయింది. శనివారం తెల్లవారుజామున పారిస్ ఛార్లెస్ డీ గౌల్లే ఎయిర్పోర్ట్ నుంచి మోంట్‌పిల్లర్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన క్రమంలో ప్రమాదం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ⚠️ Accident du @BoeingFrance #737 immatriculé EC-NLS exploité par #WestAtlantic / sortie de piste pendant atterrissage survenue le 24/09/22 à l’aéroport de @mplaeroport / 4 enquêteurs @BEA_Aero sur place / ouverture d’une enquête de sécurité. pic.twitter.com/H76U3BbRxk — BEA ✈️ ⚙️🔬🇫🇷 (@BEA_Aero) September 24, 2022 ఇదీ చదవండి: 8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ -
వామ్మో.. ఈ విమానం ల్యాండింగ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఎథెన్స్: గ్రీస్‌లోని స్కియాథోస్ విమానాశ్రయం సుందరమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విమానాలు దిగడాన్ని చూడటానికి ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు ల్యాండింగ్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను వీక్షించేందుకు రోజుకు సుమారు 100 మందికిపైగా ఇక్కడి వస్తారు. ఈ విమానాశ్రయం ఇతర అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లా అంత పెద్దగా ఉండదు. చిన్న రన్‌వే ఉంటుంది. ఇక్కడ దిగేందుకు అనుమతి పొందిన అతిపెద్ద విమానం బోయింగ్ 757. ఇటీవల ఓ ప్రయాణికుల విమానం అత్యంత తక్కువ ఎత్తులో ల్యాండింగ్ చేసిన విధానాన్ని చాలా మంది ఆశ్వాదించారు. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. విజ్‌ఎయిర్ ఎయిర్‌బస్ ఏ321నియో ప్లేన్.. సముద్ర నీటిని తాకుందా అన్నట్లు వెళ్తూ.. అలెగ్జాండ్రోస్ పపడియామంటిస్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ల్యాండింగ్‌కు కొద్ది సెకన్ల ముందు విమానం ముందు టైర్లు రోడ్డుపై ఉన్న వారిని తాకుతాయా అన్నట్లు కనిపించింది. రన్‌వే ఫెన్సింగ్ దాటిన క్రమంలో ఆ గాలికి అక్కడి వారు దూరంగా పడిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోను గ్రేట్ఫ్లైయర్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. స్కియథోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 5,341 అడుగుల రన్‌వే కలిగి ఉంటుంది. అతితక్కువ పొడవు, తక్కువ వెడల్పుతో ఉండటం దీని ప్రత్యేకత. ఈ ఎయిర్పోర్ట్ 1972లో ప్రారంభమైంది. ఇదీ చదవండి: దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే! -
విమానం టేకాఫ్ సమయంలో అపశ్రుతి... చక్రం బురదలో కూరుకుపోయి..
గౌహతి: ఇటీవల విమానాల్లో ఏదో సాంకేతిక సమస్య తలెత్తడం అప్పటికప్పుడూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరుగుతోంది. ఇలాంటి ఘటనలు ఇటీవల మొత్తం మూడు చోసుకున్నాయి. ఇప్పుడూ మళ్లీ ఇండిగో విమానం కూడా అదే బాటపట్టింది. ఈ మేరకు ఇండిగో విమానం అస్సాంలోని జోర్హాట్ నుంచి కోల్‌కతాకు వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో అపశ్రుతి చోటుచ చేసుకుంది. రన్‌వే నుంచి జారి పక్కనున్న గడ్డితో కూడిన నేలపైకి దూసుకొచ్చింది. ఆ విమానం చక్రాలు బురదలో ఇరుక్కుపోయాయి. దీంతో మధ్యాహ్నాం 2.30 గంటల కల్లా బయల్దేరాల్సిన విమానం కాస్త ఆలస్యంగా బయల్దేరింది. ఈ విమానంలో సుమారు 98 మంది ప్రయాణికులు ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఈ ఘటన తాలుకా పోటోలు ట్విట్టర్వలో వైరల్ అవుతున్నాయి. (చదవండి: ముసుగు దుండగుల దాడి.. మంగళూరులో దారుణ హత్య.. 144 సెక్షన్ విధింపు) -
ఇంగ్లండ్‌లో ఎండ దెబ్బకు కరిగిన రన్‌వే
లండన్: ఇంగ్లాండ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. వాహనాలకు నిప్పంటుకుంటోంది. గడ్డి భూములు అగ్నికి ఆహూతవుతున్నాయి. రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎండలను తట్టుకోలేక ప్రజలు బీచ్‌లకు పరుగులు తీస్తున్నారు. ఈత కొలన్లలో సేదతీరుతున్నారు. ఎండ దెబ్బకు లూటన్ ఎయిర్‌పోర్టులో రన్‌వే కరిగిపోయింది! దాంతో విమానాశ్రయాన్ని మూసేయాల్సి వచ్చింది. సోమవారం కేంబ్రిడ్జ్‌లో 38 డిగ్రీలు, లండన్‌లో 37.5 డిగ్రీలు నమోదైంది! సూర్యప్రతాపం వల్ల అడవుల్లో కార్చిచ్చు రగులుతోంది. లండన్‌లోని వాక్స్హాల్ ప్రాంతంలో రైలు పట్టాలు వ్యాకోచించి, వంగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. లండన్‌లో వుడ్గ్రీన్ క్రౌన్ కోర్టులో ఏసీ యూనిట్ పేలిపోవడంతో ఓ మర్డర్ కేసులో విచారణను వాయిదా వేశారు. యూకేలో వాతావరణం సహారా ఎడారిని తలపిస్తోందంటూ జనం సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే ప్రమాదముందన్న హెచ్చరికలు ఇంకా భయపెడుతున్నాయి. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైబిగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 9:45 గంటలకు శంషాబాద్ నుంచి మహారాష్ట్రలోని గోండియా వెళ్లాల్సిన ఫ్లైబిగ్ విమానం రన్‌వే పైకి వెళ్లగానే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి రన్‌వేపై నిలిచిపోయింది. అయితే ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు విమానం బయలుదేరకపోవడంతో అధికారులపై అసహం వ్యక్తం చేస్తున్నారు. ఆధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రన్ వేపై ప్రయాణికులు ధర్నాకు దిగారు. చదవండి: భయ్యా.. ఇదేమయ్యా! నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్‌లో -
ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం
న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్ జెట్ విమానం(ఎస్జీ 160) సోమవారం ఉదయం టేకాఫ్ అయ్యే సమయంలో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్యాసింజర్ టెర్మినల్ నుంచి టేకాఫ్ కోసం రన్‌వేపైకి విమానం వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం వెనక్కి తీస్తుండగా కరెంట్ పోల్‌ను విమానం కుడి వైపు ఉన్న వింగ్ బలంగా తాకింది. దీంతో విమానం కుడివైపు రెక్క(రైట్ వింగ్) దెబ్బతింది. అలాగే కరెంట్ స్తంభం కూడా డ్యామేజ్ అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి జమ్మూకి వెళ్లాల్సి ఉంది. విమానం ప్రమాదానికి గురికావడంతో మరో విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను జమ్మూకు పంపించారు. మరోవైపు విమానం కరెంట్ పోల్‌ను ఢీకొట్టడంపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. -
అన్నా ఏందిది..! అదేమన్నా ట్రక్కనుకున్నావా..? తోసుకెళ్తున్నారు..
ఎక్కడాగిపోతాయో తెలియని ఎర్ర బస్సులను ఎక్కాలంటే గుండెలు దడదడలాడాల్సిందే! చెప్పాపెట్టకుండా ఏ రోడ్డుమధ్యలోనే టైర్ పంక్చరయ్యో లేక ఇంజన్ ఫెయిలయ్యో ఆగిపోతే ఈసురోమంటూ.. ఎక్కిన ప్రయాణికులందరూ కిందికి దిగి బస్సును తొయ్యడం.. దాదాపు అందరి జీవితాల్లో ఈ సీన్ ఎదురయ్యే ఉంటుంది. ఐతే ఇక్కడ టైర్ పంక్చర్ అయ్యింది బస్సుకు కాదు, కారుకు అంతకన్నాకాదు. విమానానికి... ఆ..! అవును అక్షరాలా విమానానికే.. పాపం అందరూ తలోచెయ్యివేసి తోసుకుంటూ తీసుకెళ్లారు. నెపాల్‌కు చెందిన తారా ఎయిర్‌లైన్స్ చోటుచేసుకున్న ఈ సంఘటన ఇది. రన్‌వేపై ఆగివున్న విమానాన్ని ప్యాసెంజర్లు, సెక్యురిటీ సిబ్బంది నెట్టుకుంటూ తీసుకెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తుంది. నేపాల్ జర్నలిస్ట్ సుషీల్ భట్టారాయ్ కథనం ప్రకారం.. టైర్ పేలడంతో రన్‌వేపై ఈ విమానం ఆగింది. ఇతర విమానాల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్యాసెంజర్లు, సెక్యురిటీ సిబ్బంది సహాయంతో దానిని పక్కకు నెట్టవలసి వచ్చిందని పేర్కొన్నారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘అన్నా ఇది ట్రక్కు అనుకుంటున్నావా? 10 మందితో తోసుకుంటూ వెళ్లడానికి' అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు పేల్చుతున్నారు. నిజానికి ఇది నేపాల్ వైమానిక అధికారుల తప్పిదం. ఎయిర్‌పోర్టులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే సరిచేసే పరికరాలు వారి వద్ద ఉండాలి. లేకపోవడంతో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. చదవండి: Lucknow: ఫేస్బుక్లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్! सायद हाम्राे नेपालमा मात्र होला ! pic.twitter.com/fu5AXTCSsw — Samrat (@PLA_samrat) December 1, 2021 -
రహదారిపై ఎయిర్ స్ట్రిప్‌లు
సింగరాయకొండ/అద్దంకి: ఎయిర్ పోర్టులు లేనిచోట్ల విమానాల ల్యాండింగ్ కోసం జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో రన్‌వే (ఎయిర్ స్ట్రిప్)లను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. దేశవ్యాప్తంగా 13 చోట్ల వీటిని నిర్మించనుండగా.. మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో రెండుచోట్ల నిర్మిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు–రేణింగవరం వద్ద ఒకటి, సింగరాయకొండలోని కలికివాయ–సింగరాయకొండ అండర్ పాస్ వరకు మరొకటి ఏర్పాటవుతున్నాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా.. ► జాతీయ రహదారిలో ఈ రన్‌వేలపై విమానాలు దిగే సమయంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేపడతారు. సిమెంట్‌తో నిర్మించే రన్‌వేకు రెండు వైపులా రెండు గేట్లు ఉంటాయి. ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ► కొరిశపాడు–రేణింగవరం వరకు రూ.23.77 కోట్లతో 5 కి.మీ. పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఒకేసారి 4 విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా ఎయిర్ స్ట్రిప్ నిర్మిస్తున్నారు. ► కలికివాయ–సింగరాయకొండ మధ్య విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రూ.52 కోట్లతో 3.60 కిలోమీటర్ల మేర ఎయిర్ స్ట్రిప్ నిర్మించనున్నారు. 33 మీటర్ల వెడల్పున కాంక్రీట్‌తో రన్‌వే, రెండువైపులా 12.50 మీటర్ల వెడల్పున గ్రావెల్ రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా మీటరు వెడల్పున డ్రైనేజీ నిర్మాణం చేపడతారు. రన్‌వేకు 150 మీటర్ల దూరంలో ఏటీసీ భవనం నిర్మిస్తారు. ప్రస్తుతం రన్‌వేకు సంబంధించి కాంక్రీట్ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఇరువైపులా డ్రైనేజీ, గ్రావెల్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. ► కందుకూరు ఫ్లైఓవర్ వద్ద కల్వర్టు నిర్మాణం పూర్తి కాగా, కలికవాయ ఫ్లైఓవర్ వద్ద బ్రిడ్జి నిర్మాణ దశలో ఉంది. -
కొత్త రన్ వేపై విమాన రాకపోకలు ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా విస్తరించిన రన్‌వే పై గురువారం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం ఎయిర్‌బస్ ఎ320 ఉదయం 7.15 గంటలకు ఈ రన్‌వే పై తొలిసారిగా ల్యాండ్ అయ్యింది. అనంతరం అన్ని విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లను నూతన రన్‌వే పైనే నిర్వహించారు. విస్తరణ వల్ల 3,360 మీటర్ల రన్‌వే అందుబాటులోకి వచ్చిందని.. భారీ విమానాల రాకపోకలకు అడ్డంకులు తొలిగాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్వహణకు మార్గం సుగమమైందని చెప్పారు. అలాగే విమానాశ్రయంలో కొత్తగా ఏర్పాటు చేసిన అధునాతన డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్నీ రేంజ్(డీవీవోఆర్) సిస్టమ్‌ను గురువారం ఎయిర్పోర్ట్ అధికారులు ప్రారంభించారు. విమాన ప్రయాణ మార్గం, స్టేషన్ నుంచి అప్రోచ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మార్గాలను సమర్థంగా నిర్వహించడానికి డీవీవోఆర్ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. -
నేడు గన్నవరం ఎయిర్‌పోర్టు రన్‌వే ప్రారంభం
విమానాశ్రయం (గన్నవరం): కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీ విమానాల రాకపోకల కోసం కొత్తగా విస్తరించిన రన్‌వే గురువారం నుంచి వినియోగంలోకి రానుంది. ఇందుకోసం ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. 2017 జనవరి 12న ట్రాన్సిట్ టెర్మినల్‌ను ప్రారంభించడంతో పాటు తొలిదశ రన్‌వే విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. సుమారు రూ.100 కోట్లతో ప్రస్తుతమున్న 2,286 మీటర్ల రన్‌వేను.. 45 మీటర్ల వెడల్పు, 1,074 మీ. పొడవున విస్తరించారు. దీంతో రన్‌వే పొడవు 3,360 మీటర్లకు చేరుకుంది. తద్వారా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్ట్‌గా గన్నవరం ఎయిర్‌పోర్టు గుర్తింపు సాధించింది. తర్వాతి స్థానంలో 3,048 మీ. పొడవుతో విశాఖ ఎయిర్పోర్ట్ ఉంది. గన్నవరంలోని కొత్త రన్ వేపై బోయింగ్ బీ747, బీ777, బీ787, ఎయిర్‌బస్ ఎ330, ఎ340, ఎ350 వంటి భారీ విమానాలు రాకపోకలు సాగించవచ్చు. రన్‌వే విస్తరణతో పాటు ఐసొలేషన్ బే, ట్యాక్సీ వే, లింక్ ట్యాక్సీ ట్రాక్, రెండు వైపుల రన్‌వే ఎండ్ సేఫ్టీ ఏరియా, లైటింగ్, బౌండరీ వాల్ పనులను ఎయిర్పోర్ట్ అధికారులు పూర్తి చేశారు. వాస్తవానికి ఎయిర్పోర్ట్ రన్‌వే విస్తరణ పనులు రెండేళ్ల క్రితమే పూర్తయ్యాయి. కానీ పలు సెక్యూరిటీ కారణాల వల్ల డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరిగింది. ఈ నెల 15 నుంచి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు డీజీసీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. -
Vijayawada Airport: 15న నూతన రన్‌వే ప్రారంభం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించిన రన్‌వే ను ఈనెల 15న ప్రారంభించనున్నట్లు కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. బుధవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ గిరి మధుసూదనరావు జిల్లా కలెక్టర్‌ను కలిసి విమానాశ్రయ విస్తరణ పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం 700 ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు. ఈ పనులకు సంబంధించి ఎయిర్ పోర్టు అథారిటీకి జిల్లా యంత్రాంగం అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, రహదారుల విస్తరణకు సంబంధించి రెవెన్యూ అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విమానాశ్రయంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్లై ఓవర్‌కు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నివాస్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో జీఎం మహ్మద్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. చదవండి: ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు -
కొత్త రన్‌వేపై ఇక రయ్.. రయ్!
సాక్షి, అమరావతి: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్‌వే ట్రయల్ రన్‌కు సిద్ధమవుతోంది. రూ.125 కోట్ల వ్యయంతో 1,074 మీటర్ల మేర రన్‌వే నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటికే 2,286 మీటర్ల పొడవున్న పాత రన్‌వేపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్ తీసుకుంటున్నాయి. విమానాశ్రయానికి పెరుగుతున్న విమానాల తాకిడిని దృష్టిలో ఉంచుకుని కొత్త రన్‌వే నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడంతో విమానాశ్రయంలో మొత్తం రన్‌వే పొడవు 3,360 మీటర్లకు చేరింది. దీనిపై ట్రయల్ రన్‌కు అనుమతిలిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఉత్తర్వులిచ్చినట్లు సమాచారం. ఈ నెలాఖరు నాటికి కొత్త రన్‌వేపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ విజయవంతమయ్యాక ఈ రన్‌వే దేశీయ, అంతర్జాతీయ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు అనువైనదిగా గుర్తింపు వస్తుంది. (దేశీయ ప్రయాణాలకు ఊపు) -
రన్‌వేకు అనుకూలమేనా?
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు ఆరేళ్లుగా కసరత్తు జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో ఒక్కో అధికారుల బృందం ఒక్కో అంశాన్ని పరిశీలిస్తోంది. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి.? ప్రతికూల పరిస్థితులేంటి.? అనే దానిపై క్షేత్రస్థాయికి వెళ్లి ఆరా తీస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు, గాలివాటం, కావాల్సిన స్థలం, రన్‌వే ఏర్పాటుకు మట్టి నమునాల సేకరణ, పెద్దపెద్ద భవనాలు, విద్యుత్ టవర్ల తొలగింపు, తదితర అంశాలను అధ్యయనం చేస్తూ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా సాయిల్ ఇన్వెస్టిగేషన్ కన్సల్టెంట్ (నేల దర్యాప్తు సలహాదారు) బృందం సభ్యులు సోమవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి మట్టి నమూనాలు సేకరించనున్నారు. అయితే నమూనాల సేకరణకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి అనుమతి రాలేదని, అనుమతి రాగానే మట్టి నమూనాలను సేకరిస్తామని బృందం సభ్యులు తెలిపారు. ఒక్కో బృందం.. ఒక్కో అంశంపై పరిశీలన జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారుల బృందం 2014లో భూమి సర్వే చేపట్టింది. అప్పట్లో ఐదు రోజుల పాటు సర్వే చేసిన అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కలిపి 1,562 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మూడేళ్ల వరకు విమానాశ్రయ ఏర్పాటులో ఎలాంటి కదలిక లేదు. 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉడాన్’ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కదలిక వచ్చింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం అవకాశం కల్పించింది. ఇందులో ఆదిలాబాద్ కూడా ఉండడంతో విమానాశ్రయ ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే 2019 ఆగస్టులో ఎయిర్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారుల బృందం జిల్లాకు వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసింది. విమానాశ్రయానికి కావాల్సిన స్థలం, బౌండ్రీలు, గుట్టలు, విద్యుత్ టవర్లు, పెద్ద భవనాలు, ట్రాఫిక్, వ్యాపార అభివృద్ధి అవకాశాలు, తదితర వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. నేటి నుంచి మట్టి నమూనాల సేకరణ విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా రన్‌వే స్థలంలో ఉన్న మట్టిని పరిశీలించేందుకు నేల దర్యాప్తు సలహాదారు (సాయిల్ ఇన్వెస్టిగేషన్ కన్సల్టెంట్) బృందం సభ్యులు జిల్లాకు వచ్చారు. విమానాశ్రయ స్థలంలో ఉన్న మట్టి రన్‌వేకు అనుకూలంగా ఉందా.? లేదా.. అనేది తేల్చేందుకు మట్టి నమూనాలు సేకరించనున్నారు. అయితే మంగళవారం వరకు ఏఏఐ నుంచి మట్టి నమూనాల సేకరణకు అనుమతి రాకపోవడంతో బృందం సభ్యులు అక్కడే టెంట్ వేసుకొని ఉన్నారు. అనుమతి రాగానే నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపుతామని, తద్వారా ఇక్కడున్న మట్టిని దృష్టిలో ఉంచుకొని రన్‌వే ఏ విధంగా డిజైన్ చేయొచ్చనే ఐడియా వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం వరకు అనుమతి వస్తే సాయంత్రం నుంచి మట్టి నమూనాలు సేకరించనున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. త్వరలో మరో బృందం? ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు పరిస్థితులన్నీ అనుకూలించడంతో త్వరలో మరో అధికారుల బృందం జిల్లాకు రానున్నట్లు సమాచారం. ఇక్కడి సాంకేతిక అంశాలపై ఆ బృందం పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయానికి దగ్గరగా ఎలాంటి విద్యుత్ టవర్లు ఉండకూడదు. అయితే రన్‌వే స్థలానికి కొద్ది రూపంలో అనుకుంట గ్రామ శివారులో విద్యుత్ టవర్లు ఉన్నాయి. వాటిని తీసి కొత్త చోట ఏర్పాటు చేయడమా.? లేక విమానాశ్రయ డిజైన్‌ను మార్చడమా.? అనే దానిపై ఆ బృందం ఆరా తీయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు భూమి స్వాధీనం, విమానాశ్రయం చుట్టు పక్కల అనుకూలతలను పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. మట్టి నమూనాలు సేకరిస్తారు విమానాశ్రయ ఏర్పాటు విషయమై జిల్లాకు వచ్చిన అధికారుల బృందాలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన సాయిల్ ఇన్వెస్టిగేషన్ బృందం రన్‌వే ఏర్పాటు కోసం మట్టి నమూనాలు సేకరించనుంది. ఇందుకు సభ్యులకు లోకేషన్, ఇక్కడి పరిస్థితులు, స్థలం, బౌండ్రీలు తదితర విషయాలను వివరించాం. రాబోయే రోజుల్లో మరిన్నీ పరిశీలనలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. – సురేశ్ రాథోడ్, ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ -
రన్ వేకు దూరంగా ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
సాక్షి, ముంబై: నిసర్గ తుఫాను నేపథ్యంలో కురిసిన వర్షం కారణంగా ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో రన్ వై మీద వరద నీరు చేరుకుంది. గురువారం బెంగుళురు నుంచి వచ్చిన ఫెడెక్స్ కార్గో విమానం రన్ వే నుంచి దూరంగా ల్యాండ్ అయింది. ఈ విమానానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, విమాన కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. తుపాన్ కారణంగా ముంబైకి ఎయిర్ పోర్టుకు వచ్చే మొత్తం 19 విమానాల రాక పోకలను నిలిపి వేస్తున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు. నిసర్గ తుపాన్ ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్‌పోర్టును రాత్రి 7గంటల వరకు మూసివేశారు. తుపాను తీవ్రత నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 144 సెక్షన్ విధించినట్లు గ్రేటర్ ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. -
రన్‌వేపై ప్రయాణికుల ఆందోళన
దొడ్డబళ్లాపురం: విమానం ఆలస్యమైందంటూ ఆగ్రహించిన ప్రయాణికులు రన్‌వేపైకి వచ్చి విమానాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగింది. బెంగళూరు నుంచి థాయ్‌ల్యాండ్‌లోని పుకెట్ నగరానికి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరాల్సిన గో ఎయిర్‌బస్ విమానం సాంకేతిక కారణాల వల్ల టేకాఫ్ కాలేదు. దీంతో విమానంలోని 120 మంది ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పైలట్‌తోపాటు ఎయిర్‌హోస్టెస్‌లు తమ డ్యూటీ సమయం దాటిపోయిందంటూ వెళ్లిపోయారు. మరో మార్గం చూపుతామని అధికారులు చెప్పారు. అయితే ఉదయం 8 గంటలయినా మరో విమానం ఏర్పాటు చేయలేదు. అయిదారు గంటలపాటు విమానంలోనే కూర్చున్న ప్రయాణికులు చివరకు ఓపిక నశించి, రైన్వే పైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇతర విమానాలకు ఎదురెళ్లి ఆటంకం కలిగించడానికి యత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. పుకెట్‌కు మరో విమానం ఏర్పాటు చేయాలని భావించినా బీసీఏఎస్ నుంచి అనుమతి లభించలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో కొందరు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. -
ఎయిర్‌పోర్టు రన్‌వే.. తిరిగి ప్రారంభం
ముంబై: రన్‌వేపై విమానం కూలిపోవడంతో గత కొద్ది రోజులుగా నిలిపివేసిన ఎయిర్‌పోర్టు రన్‌వేను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. రన్‌వే పూర్తి స్థాయిలో శుక్రవారం 4.47 గంటల నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. స్పైస్ జెట్ విమానం జూలై 2న రన్‌వేపై కూలీపోవడంతో విమాన రాకపోకలను ఈ రన్‌వే గుండా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాంతో 60 మందితో కూడిన బృందం 90 గంటల పాటు ఈ రన్‌వేను రిపేర్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. అందులో భాగంగా దాదాపు 41 టన్నులు ఉన్న ఈ విమానాన్ని రన్‌వే నుంచి పక్కకు లాగారు. ఆ విమానంలో ఉన్న ఇందనం, సరుకులను ఖాళీ చేసి రన్‌వే నుంచి తొలగించారు. ఒక వైపు వర్షం పడుతుంటే.. ఆ విమానం గేర్ లభించకపోవడంతో తీవ్రం శ్రమించి దాన్ని పోక్లైన్ సాయంతో రన్‌వే నుంచి పక్కకు లాగారు. ఈ క్రమంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రమం లిమిటెడ్ రన్‌వేను తిరిగి ప్రారంభించనున్నట్టు పేర్కొంది. -
నదిలోకి దూసుకెళ్లిన విమానం
-
షిర్డీలో తృటిలో తప్పిన విమాన ప్రమాదం
సాక్షి, ముంబై: స్పైస్‌జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. షిర్డీ విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ సందర్భంగా రన్‌వే పై స్కిడ్ అయింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఢిల్లీనుంచి షిర్డీకి వస్తున్న సమయంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్పైస్ జెట్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వే మీదనుంచి జారిపోయింది. దాదాపు 30నుంచి 20 మీటర్ల దూరం దూసుకుపోయింది. దీంతో యాత్రికుల తాకిడి అధికంగా వుండే విమానాశ్రయంలో కార్యకలాపాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. ఈ ప్రమాదం ఉదంతాన్ని స్పైస్ జెట్ ప్రతినిధి నిర్ధారించారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. -
లేజర్ వెలుగులతో పైలట్ షాక్!
శంషాబాద్: మరికొద్ది క్షణాల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ చేయాల్సి ఉండగా.. రన్‌వే సమీపంలో ప్రసరిస్తున్న లేజర్ లైట్ల కారణంగా పైలట్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. దీంతో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అతడు అష్టకష్టాలు పడ్డాడు. సౌదీ నుంచి వచ్చిన ఆ విమానం రన్‌వేపై దిగబోతుండగా లేజర్ కిరణాలు అడ్డు తగిలాయి. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శంషాబాద్ మండల పరిధిలోని ఎయిర్‌పోర్టుకు ఆనుకుని ఉన్న రషీద్‌గూడ గ్రామ పరిధిలోని చెరువుకట్ట సమీపంలో ఓ యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా విందు ఏర్పాటు చేశాడు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు స్నేహితులతో కలసి డీజేతో పాటు లేజర్ షాట్స్, లేజర్ లైట్ల వెలుగుల మధ్య పార్టీ చేసుకున్నారు. ఇదే సమయంలో సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయబోతుండగా లేజర్ కిరణాల కారణంగా పైలట్ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఎట్టకేలకు సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ విషయమై ఆయన ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. 15 కి.మీ. పరిధిలో ఆంక్షలు.. ఎయిర్‌పోర్టు అధికారుల ఆదేశాలతో హెచ్ఎండీఏ, పంచాయతీ అధికారులు విచారణ చేపట్టారు. రషీద్‌గూడ సమీపంలోని చెరువుకట్ట వద్ద యువకులు పార్టీ చేసుకున్న విషయం తెలుసుకుని సోమవారం శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు చుట్టూ 15 కిలోమీటర్ల వరకు ఎక్కడా కూడా లేజర్ షాట్స్, లేజర్ లైట్లను ఉపయోగించకూడదని, అలాగే బాణసంచా కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆ పరిధిలోని అన్ని ఫంక్షన్ హాళ్లకు నోటీసులు జారీ చేశారు. -
తిరుపతి ఎయిర్పోర్ట్ తాత్కాలికంగా మూసివేత
సాక్షి, తిరుపతి: తిరుపతి విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రన్ వేలో ఏర్పడిన సమస్యలతో ఎయిర్పోర్ట్ అధికారులు అత్యవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్, విజయవాడ వెళ్లే విమానాలు నిలిపి వేయడంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎయిర్పోర్ట్ మూసివేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరికొన్ని గంటల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. -
రన్‌వేపై జారిన విమానం..తప్పిన పెను ప్రమాదం
ఖాట్మండు: నేపాల్ దేశీయ విమానం ఒకటి శనివారం రాత్రి రన్‌వేపై అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటన నేపాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో 12 గంటల పాటు ఎయిర్‌పోర్టు సర్వీసులకు అంతరాయమేర్పడింది. ప్రమాదానికి గురైన విమానం, యేటి ఎయిర్‌లైన్స్‌కు చెందినది గుర్తించారు. రన్‌వేపై పగుళ్లు ఉండటంతో ఇటీవలే మరమ్మతులు కూడా చేశారు. ప్రమాద సమయంలో 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్ గంజ్ నుంచి ఖాట్మండుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. గత మార్చి నెలలలో ఢాకా నుంచి ఖాట్మండు వెళ్తున్న యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్ విమానం, రన్‌వే నుంచి పక్కకు జారిపోయి ప్రమాదానికి గురవడంతో 51 మంది ప్రయాణికులు చనిపోయారు. అలాగే గత ఏప్రిల్‌లో 139 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియన్ ప్యాసింజర్ విమానం అదృష్టం కొద్దీ ప్రమాదం నుంచి బయటపడింది. టేక్ఆప్ అవుతున్న సమయంలో రన్‌వే నుంచి జారి బురదలో కూరుకుపోవడంతో ప్రమాదం తప్పింది. -
రయ్ అనేలా..
సాక్షి, హైదరాబాద్ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కోవడంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. రన్‌వేల పునరుద్ధరణకు అమెరికాలో రూపొందించిన అత్యాధునిక ఎయిర్‌పోర్టు గ్రేడ్ స్టీల్ గార్డ్ (ఏజీఎస్‌జీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ టెక్నాలజీతో అతి తక్కువ కాలపరిమితిలో రన్‌వేను తిరిగి వినియోగంలోకి తేవడంతోపాటు.. రన్‌వే జీవిత కాలం కూడా గణనీయంగా పెరగనుంది. ఇప్పటికే మూడొంతుల వరకు రన్‌వే అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు, మూడు నెలల్లో సుమారు 4.5 కి.మీ. పొడవైన రన్‌వే పునరుద్ధరణ పూర్తి కానుంది. అంతరాయం కలగకుండా..: రన్‌వే పునరుద్ధరణ పనుల వల్ల విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి రోజు 6 గంటలపాటు రన్‌వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలోవచ్చే విమానాలను రెండో రన్‌వే వైపు మళ్లిస్తున్నారు. పనులను పూర్తి చేసిన కొద్ది గంటల్లోనే తిరిగి వినియోగించేందుకు రన్‌వే అందుబాటులోకి వస్తుండటంతో విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. ఏజీఎస్‌జీ టెక్నాలజీతో చేపట్టిన పనులతో రన్‌వే మరో 5 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. 2008లో నిర్మించిన ఈ రన్‌వేను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నా.. తొలిసారిగా అమెరికాకు చెందిన ఏజీఎస్‌జీ పరిజ్ఞానంతో చేపట్టిన పునరుద్ధరణ ఎంతో కీలకమైనదని అధికారులు పేర్కొన్నారు. పూర్తిగా సురక్షితం అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే విధంగా రన్‌వేను అభివృద్ధి చేస్తున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలు, గాలులు వంటి వాతావరణ పరిస్థితుల వల్ల రన్‌వే ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఉంటుంది. రన్‌వే వల్ల టైర్లు పేలడం వంటి సంఘటనలకు ఏ మాత్రం అవకాశం ఉండదు. అలాగే తేలికపాటి రసాయన దాడులను కూడా తట్టుకొనే సామర్థ్యం ఉంటుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోజూ 480 జాతీయ, అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 50 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 1.8 కోట్ల మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించారు. మరో ముందడుగు.. శంషాబాద్ విమానాశ్రయంలో ఎప్పటికప్పుడు వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. విమానయాన రంగానికి సంబంధించి ప్రపంచంలో ఎక్కడ ఉత్తమ టెక్నాలజీ ఉంటే దాన్ని ఇక్కడ అమలు చేస్తున్నాం. ఈ క్రమంలో రన్‌వే పునర్నిర్మాణం మరో ముందడుగు – ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్జీకే కిషోర్ -
రన్ వేపై మూడు టన్నుల బంగారం
క్రస్నోయాక్స్, రష్యా : కోట్లు విలువజేసే బంగారం విమాన రన్ వేపై వర్షంలా కురిసింది. అవును. టేకాప్ అయిన కొద్ది నిమిషాల్లోనే కార్గో విమానం తలుపు తెరచుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో నల్లటి రోడ్డుతో కనిపించే రన్ వేపై బంగారం చెల్లాచెదురుగా పడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్యాలోని యకుస్క్ ప్రాంతంలో గల ఓ విమానాశ్రయం నుంచి ఆన్-12 కార్గో విమానం గురువారం ఉదయం క్రస్నోయాస్క్కు బయల్దేరింది. ఆ విమానంలో బంగారం వంటి ఖరీదైన లోహాలను తరలిస్తున్నారు. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం తలుపు తెరుచుకోవడంతో అందులో నుంచి బంగారం కడ్డీలు వర్షంలా పడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానం నుంచి కిందపడ్డ 172 బంగారు కడ్డీలను గుర్తించారు. వీటి బరువు దాదాపు 3.4 టన్నులు ఉంటుందని తెలిపారు. విమానంలో మొత్తం 9.3 టన్నుల బంగారం ఉండగా అందులో కొంత కింద పడిపోయినట్లు వివరించారు. విమానం తలుపు సరిగా మూత పడకపోవడంతోనే ఇలా జరిగిందని చెప్పారు. -
విమాన బ్రేకులు ఫెయిలై టైర్లు పేలడంతో..
జమ్మూలో ల్యాండ్ అవుతుండగా బ్రేక్ ఫెయిల్, పేలిన టైర్లు జమ్మూ: జమ్మూ విమానాశ్రయంలో శుక్రవారం 134 మంది ప్రయాణికులతో కూడిన ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఏఐ 821 విమానం మధ్యాహ్నం 12.15 గంటలకు ల్యాండ్ అవుతుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. తర్వాత నాలుగు టైర్లు పేలిపోయాయి విమానం రన్‌వేపై నుంచి పక్కకు జారి చివరకు రన్‌వే ఆఖరి భాగంలో నిలిచిపోయింది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటన వల్ల దాదాపు 10 విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. రన్‌వే తప్పిన విమానం ఎయిర్‌బస్ క్లాసిక్ ఏ320 రకానికి చెందినది. ఎయిరిండియా ఈ రకం పాత విమానాల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెడుతోంది. ఇప్పటికే నాలుగు కొత్త విమానాలను కొనుగోలు చేసింది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొండచిలువ కలకలం
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రం(శంషాబాద్ ఎయిర్‌పోర్టు)లోని రన్‌వేపై కొండచిలువ కలకలం సృష్టించింది. రన్‌వేపై శనివారం ఉదయం ఒక గంటపాటు అటూఇటూ తిరుగుతూ ఎయిర్‌పోర్టు అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. రన్‌వేపై నిలిపి ఉంచిన విమానం దగ్గరగా అది తిరుగుతుండడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది వచ్చి కొండచిలువను పట్టుకుని జూపార్కుకు తరలించారు. గంటసేపు హల్చల్ సృష్టించిన కొండచిలువను అధికారులు పట్టుకోవడంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
విమానాలకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
అహ్మదాబాద్: అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. విమానాశ్రయ రన్ వే పై ఇండిగో విమానం, స్పైస్ జెట్ విమానాల ల్యాండింగ్, టేక్ ఆఫ్ సందర్భంగా ఈ ఘోర ప్రమాదం తృటిలో తప్పిందని రన్ వే అధికారులు ప్రకటించారు. అకస్మాత్తుగా రన్ వే మీదికి ఓ కుందేలు దూసుకురావడం.. భయాందోళనకు దారి తీసిందని.. అయితే అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పిందని లేదంటే వందలమంది ప్రాణాలు ప్రమాదంలో చిక్కుకునేనవని ఎయిర్‌పోర్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఆఖరి నిమిషంలో జోక్యం చేసుకున్న ఏటీసీ అధికారులు అప్రమత్తమై పైలట్లను అలర్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండిగో విమానం జస్ట్ ల్యాండ్ అయ్యి ట్యాక్సీ వే వైపు పోతోంది. అదే సమయంలో స్పైస్ జెట్ విమానం టేక్ ఆఫ్(ఎగరడానికి) సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ చిన్న అనుకోని ఘటన ఎందురైంది. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదుగానీ రన్‌వై మీద కుందేలు ఉండడాన్ని గమనించారు అధికారులు. ఆఖరి నిమిషంలో ఏటీసీ అధికారులు అప్రమత్తమై పైలట్లను అలర్ట్ చేశారు. దీంతోవారు సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ఇండిగో విమానం ముక్కు నేలను తాకగా తోక మాత్రం గాల్లోనే ఉండిపోయింది. ఈ ఘటనతో సిబ్బంది ఒక్కక్షణం భయభ్రాంతులకు లోనయ్యారు. అటు రన్ వే పై కుందేలును గమనించినట్టు ఇండిగో పైలట్లు, రన్ వే క్లియర్ కాకుండా, ఇండిగోవిమానం అక్కడే ఉండడాన్ని చూసి అప్రమత్తమైనట్టు టేక్ ఆఫ్ తీసుకున్న స్సైస్ జెట్ పైలట్లు నివేదించారు. అయితే ఏటీసీ అధికారుల సూచనలతో విమానాల పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అటు ఏవియేషన్ విభాగం ఈ ఘటనపై విచారణ చేపట్టింది. ఈ ఉదంతంపై రెండు విమానాలకు చెందిన పైలెట్లు అహ్మదాబాద్ ఏటీసీకి తమ నివేదికను అందించారు. -
రన్‌వేపై నిర్బంధించడమేమిటి?
-
రన్‌వేపై నిర్బంధించడమేమిటి?
విమానాశ్రయంలో పోలీసులను నిలదీసిన జగన్ సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికులను ఇలా రన్‌వేపై అడ్డుకోవడమేమిటి? మీరసలు పోలీసులేనా? కేంద్ర బలగాల అధీనంలో ఉండే విమానాశ్రయప్రాంతంలోకి రాష్ట్రపోలీసులెలా వచ్చారు?.. విమానాశ్రయంలో తమను అడ్డుకున్న పోలీసులను వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఆ సందర్భంగా ఆయన అడిగిన ప్రశ్నలకు పోలీసులు నీళ్లు నమిలారు. ఖాకీలను జగన్ నిలదీశారిలా.... ‘‘ప్రయాణికుల ప్రయాణ మార్గంలో ఎందుకు పోనివ్వడం లేదు? మమ్మల్ని ఇక్కడ ఆపి ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఇక్కడ ఆపారు? మేం ఏంచేయాలిక్కడ? రన్‌వేపైనే ఆపడమేమిటి? వీళ్లు పోలీసులా? ఐడీ కార్డు కూడా లేదు? ఎవరసలు వీళ్లంతా?’’ ‘‘ప్రయాణికుల మార్గం గుండా ఎప్పుడూ వీఐపీ లాంజ్‌లోకి వెళతాం. మమ్మల్ని వేరే మూలకు ఎందుకు తీసుకుపోతున్నారు. అది లాంజ్ కాదుకదా. నా వెంట వస్తున్నవారిలో ఇద్దరిని కిడ్నాప్ చేశారు మీరు. అందులో ఒకరు లోక్‌సభ సభ్యుడు కూడా. అసలు మీరు లోనికెందుకు వచ్చారు? రాష్ట్రపోలీసులు విమానాశ్రయంలోకి ఎలా వస్తారు? ఇది కేంద్ర బలగాలైన సీఐఎస్ఎఫ్ అధీనంలో ఉండే ప్రాంతం.’’ ‘‘ఎలా వ్యవహరించాలో తెలియకుండా పోలీసు డిపార్ట్మెంట్లో ఎలా ఉన్నారు మీరంతా? డొమెస్టిక్ అరైవల్ అనే బోర్డు మీకు కనిపించడం లేదా? ప్రయాణికులను బైటకు పంపించరా? రన్‌వేపై మమ్మల్ని ఆపడమేమిటి? ఏం చేస్తున్నారో మీకు తెలుస్తున్నదా?’’‘‘రెండే రెండు సంవత్స రాలు. నేను ఎవరినీ మర్చిపోను. ఒక ప్రయాణికుడితో వ్యవహరించినట్లు కూడా వ్యవహరించరా? ఎందుకు ఆపుతున్నారు?’’ -
రన్ వే పైకి నీళ్లు
తిరుపతి: శనివారం రాత్రి నుంచి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రేణిగుంట విమానాశ్రయం రన్‌వే పైకి వర్షపు నీరు భారీగా చేరడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై నిలిచిన నీళ్లను తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, నగరి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. తిరుమలలో వర్షం కారణంగా భక్తులు ఇబ్బందిపడుతున్నారు. -
రన్ వేపై కూలిపోయిన విమానం
వల్లెట్టా: మాల్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై చిన్నపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. సోమవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. లుఖా విమానాశ్రయం నుంచి లిబియాకు బయల్దేరిన ఈ విమానం కాసేపటికే కుప్పకూలింది. మృతుల వివరాలు తెలియాల్సివుంది. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ విమానంలో యూరోపియన్ యూనియన్ బోర్డర్ ఏజెన్సీకి చెందిన అధికారులు ఉన్నారని మొదట వార్తలు వచ్చాయి. అయితే తమ సిబ్బంది ఎవరూ లేరని ఆ ఏజెన్సీ తెలియజేసింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే దిశ మార్చుకుని రన్ వే కూలినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. -
రన్‌వే మీద రైల్వే లైన్..
ఇది గ్రాఫిక్ చిత్రం కాదు.. అసలైనదే.. న్యూజిలాండ్‌లోని గిస్బార్న్ ఎయిర్‌పోర్టులో నిజంగానే ఇలా రైళ్లు వెళ్లివస్తుంటాయి. ఈ చిన్నస్థాయి ఎయిర్‌పోర్టు 160 హెక్టార్ల పరిధిలో ఉంది. ఇందులో ప్రధాన రన్‌వేతోపాటు మూడు చిన్న రన్వేలు ఉన్నాయి. ప్రధాన రన్‌వేకు మధ్యలో నుంచి ఈ రైల్వే లైను ఉంది. దీని వల్ల రైలు వచ్చినప్పుడు.. గేటు వద్ద మనమెలా ఆగుతామో.. అక్కడ విమానాలు కూడా ఆగుతాయట. లేదా విమానమే ముందు వెళ్లేటట్లుంటే.. రైలును ఆపుతారట. ఈ రెండింటినీ బాలెన్స్ చేయడంతోనే ఎయిర్‌పోర్టు సిబ్బందికి రోజంతా సరిపోతుందట. -
రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చిన విమానం
-
రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చిన విమానం
రోమ్: ఇటలీలో ఓ విమానం రోడ్డెక్కింది. రన్ వేను దాటుకుంటూ వచ్చిన విమానం రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చింది. దీంతో ఖిన్నులైన రోడ్డు వాహనాదారులు తమ వాహనాలు ఎక్కడికక్కడ నిలిపేశారు. అయితే, పేలుడులాంటి సంఘటన చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డీహెచ్ఎల్ సంస్థకు చెందిన బోయింగ్ 737-400 అనే కార్గో విమానం తెల్లవారు జామున ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే క్రమంలో రన్ వేను దాటుకుంటూ నియంత్రణ కోల్పోయి రయ్‌మంటూ రోడ్డెక్కింది. ఈ ప్రమాదం జరగడంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా కొన్నిగంటలు మూసి వేసి అనంతరం తెరిచారు. ప్రమాదానికి గురైన విమానం ప్యారిస్ నుంచి వచ్చినట్లు అధికారులు చెప్పారు. విమాన సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని మీడియా ప్రతినిధులు చెప్పారు. -
చుక్కలు చూపించిన విమానం!
న్యూయార్క్ః విమాన ప్రయాణం అంటేనే ఇటీవల వణుకు పుట్టే పరిస్థితి వస్తోంది. సాంకేతిక లోపాలు ఏర్పడటం, పక్షులు అడ్డు పడటం, ల్యాండింగ్ లో పొరపాట్లు జరగడం వంటి సంఘటనలు మామూలైపోయింది. తాజాగా న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ విమానం ఒక్క ఉదుటున ఎగిరి పడటంతో ప్రయాణీకులు అదిరి పడ్డారు. ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ 767 ప్యాసింజర్ విమానం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. ల్యాండ్ అయ్యే ముందు పైలట్ మనసు మార్చుకోవడంతో రన్ వే పై బౌన్స్ కొట్టి, తిరిగి టేకాఫ్ అయ్యింది. పైలట్ రఫ్ రైడింగ్ తో విమానంలోని ప్యానెల్స్, మెకానికల్ బాక్స్ లు ఇతర చిన్న చిన్న వస్తువులు ప్రయాణీకులపై పడ్డాయి. హోస్టన్ నుంచి 214 మంది ప్రయాణీకులతో బయల్దేరిన 557 విమానం ల్యాండింగ్ విషయంలో ఏర్పడ్డ అస్థవ్యస్థ స్థితికి ప్రయాణీకులు వణికిపోయారు. ల్యాండ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన విమానం స్కిప్ అవ్వడంతో పైలట్ తిరిగి టేకాఫ్ చేశాడని, తిరిగి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా విమానం తిప్పలు పెట్టడంతో మరోసారి టేకాఫ్ చేశాడని ఇలా పలుమార్లు ల్యాండింగ్ కు ప్రయత్నించడం, టేకాఫ్ అవ్వడం ప్రయాణీకులను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని ఓ ప్రత్యక్ష సాక్షి... ప్రయాణీకుడు తెలిపాడు. చివరిసారి ల్యాండ్ అయ్యేందుకు ముందు ఆకాశంలో పైటట్ కనీసం 30 సార్లు చక్కర్లు కొట్టించినట్లు తెలిపిన ప్రయాణీకుడు.. ఎట్టకేలకు ల్యాండ్ చేయడంతో ప్రయాణీకుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసినట్లు చెప్పాడు. అయితే విమానం చివరికి సేఫ్ గా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు తగల్లేదని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అయితే అంతటి సందిగ్ధావస్థలోనూ ఓ వ్యక్తి వీడియోను తీసి సిబ్బందికి అందించడం విశేషం. -
పైలట్లు రోడ్డునే రన్‌వేగా పొరబడి..
న్యూఢిల్లీ: ఇండిగో విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పైలట్లు రోడ్డును రన్‌వేగా భావించి విమానాన్ని ల్యాండ్ చేయబోయారు. చివరి నిమిషంలో పైలట్లకు హెచ్చరికలు రావడంతో ముప్పుతప్పింది. ఫిబ్రవరి 27న జైపూర్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇండిగో విమానం 6ఈ-237 అహ్మదాబాద్ నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు వచ్చింది. విమానాశ్రయంలో సమీపంలో ఓ రోడ్డును రన్‌వేగా భావించిన పైలట్లు ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. నేలకు అతి సమీపంగా విమానం వచ్చింది. ఈజీపీడబ్ల్యూఎస్ నుంచి హెచ్చరికలు రావడంతో పైలట్లు అప్రమత్తమై విమానం దిశను మళ్లించి, జైపూర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ల తప్పిదాన్ని డీజీసీఏ తీవ్రంగా పరిగణించింది. ఇద్దరు పైలట్ల లైసెన్సులను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. పైలట్లు ఇద్దరినీ విధుల నుంచి తప్పించినట్టు ఇండిగో అధికారులు చెప్పారు. -
విమానం దిగుతోంది.. గేరు విరిగింది!
జోహాన్నెస్‌బర్గ్: గత కొంతకాలంగా విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. విమానం ఎక్కినప్పటి నుంచి మళ్ళీ క్షేమంగా దిగేవరకు ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడపవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా సోమవారం బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానం ల్యాండ్ అవుతుండగా గేర్ విరిగిపోయింది. దీంతో విమానం బలంగా రన్ వేను తాకింది. అయినప్పటికీ పైలట్లు అప్రమాత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. జోహాన్నెస్‌బర్గ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో విమానంలో 94 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పైలట్ వారెన్ మాన్ తెలిపారు. విమానం రన్ వేపై ఒక్కసారిగా ఒరగడం వల్ల ఎడమ గేర్ విరిగిందని తెలిసింది. దీంతో ఒక్కసారిగా విమానంలో ప్రకంపనలు వచ్చాయి. దీనిని గమనించిన రెస్క్యూ టీమ్ వెంటనే ప్రయాణికులను అత్యవసర స్లైడ్స్ ద్వారా కిందకు దించారు. దీనిపై విమాన అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. -
రన్‌వేపై పేలిన విమానం టైరు
చెన్నై(టీనగర్): చెన్నై విమానాశ్రయంలో సోమవారం అండమాన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం వెనుక టైర్ పేలడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చెన్నై నుంచి అండమాన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సోమవారం ఉదయం 11.10 గంటలకు డొమెస్టిక్ టెర్మినల్ నుంచి బయలుదేరింది. విమానంలో 77 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. రన్‌వేపై వెళుతుండగా హఠాత్తుగా విమానం వెనుక టైరు భారీ శబ్దంతో పేలిపోయింది. భీతిల్లిన ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేశారు. పెలైట్ చాకచక్యంగా అదుపులోకి తీసుకుని రన్‌వేపై నిలిపివేశారు. వెంటనే భద్రతా అధికారులు, విమానాశ్రయ ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులను వరుసగా కిందికి దింపారు. ఎవరికీ ఏమీ కాలేదు. విమానాశ్రయంలో వారికి బస కల్పించారు. విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది విచారణ చేస్తున్నారు. -
విమానం రోడ్డెక్కితే..!
ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా విమానం వెళుతోందని అనుకుంటున్నారా? కానీ ఇది ఫ్లై ఓవర్ కాదు. విమానం రన్ వే! స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో రన్ వేలు ఇలా నగరంలోనే ఏర్పాటు చేయొచ్చంటూ అలెక్స్ సటన్ అనే ఆర్కిటెక్ట్ చెబుతున్నాడు. నగరంపై మధ్యలో ఓ పెద్ద విమానాశ్రయం, దాని నుంచి పెద్ద పెద్ద భవనాల మధ్య ఖాళీ గుండా రన్ వేలను నిర్మించవచ్చని, ఈ పద్ధతి వల్ల విమానయాన రంగం రూపురేఖలే మారిపోతాయంటూ ఆ యువ ఆర్కిటెక్ట్ ప్రతిపాదిస్తున్నాడు. భలే ఉంది కదూ.. ఈ ప్రతిపాదన అమలైతే విమానాలు రయ్యిన దూసుకొస్తూ ఇళ్ల మధ్యే దిగిపోతాయన్నమాట! -
పిట్టల్ని కొట్టబోతే మంటలంటుకున్నాయి
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు భయాందోళన కలిగించాయి. రన్ వేకు సమీపంలోని బే 55 వద్ద మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక దళం వెంటనే మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. పక్షులను చెదరగొట్టేందుకు పేల్చిన బాణాసంచా ఎండు గడ్డి మీద పడి మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. గత వారం బే 48 వద్ద ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. విమానాలు పైకి ఎగరడానికి, దిగడానికి ముందు పక్షులను చెదరగొట్టేందుకు బాణాసంచా కాల్చడం చేస్తుంటారు. -
విశాఖ నుంచి బోయింగ్ విమానాలు!
విశాఖపట్నం: ఏపీలోని విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో ప్రస్తుతమున్న రన్‌వేలను పదివేల అడుగులకు విస్తరించి త్వరలో బోయింగ్ విమానాలు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సివిల్ ఏవియేషన్ అకడామీ(సీఏఏ) సీఈవో, ఎయిర్ ఇండియా మాజీ డెరైక్టర్ ఎస్.ఎన్. రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో ఆదివారం ఏటీఏఐ(ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఇండియా) ఆధ్వర్యంలో ‘ప్రాంతీయ విమాన సర్వీసులు-ఎయిర్ కార్గో ఎగుమతులు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్టు రన్‌వే పెద్దదికావడంతో డ్రీమ్‌లైనర్ తరహాలో బోయింగ్ విమానాలు కూడా దిగవచ్చని, ఒక రన్‌వే ఏర్పాటు చేస్తే సరిపోతుందని అన్నారు. కఠ్మాండు, పోర్టుబ్లెయిర్ విమానాశ్రయాల తరహాలో వైజాగ్ ఎయిర్‌పోర్టుకు ఒకవైపే విమానాల రాకపోకలకు వీలుందని, ఎయిర్‌పోర్టును విస్తరించాలంటే వైజాగ్ పోర్టు భూములు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. 30 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలున్న వైజాగ్ విమానాశ్రయానికి ఏటా 10 లక్షల మందే వస్తున్నారని, అందువల్ల కొత్త ఎయిర్‌పోర్టు అవసరం లేదని చెప్పారు. -
రన్‌వేపై త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం
ఒక ఇండిగో విమానం గాల్లోకి లేస్తోంది.. అప్పుడే మరో ఎయిరిండియా విమానం రన్‌వే మీదకు దిగుతోంది. సరిగ్గా ఆ రెండూ ఒకదాన్ని ఒకటి దాదాపు ఢీకొట్టుకోబోయాయి. అంతే.. రెండింటిలో ఉన్న దాదాపు 250 మంది ప్రయాణికులు గుండెలు అరచేతిలో పట్టుకుని ప్రాణాలు ఉగ్గబట్టుకున్నారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్లోని బగ్డోరాలో జరిగింది. రెండు విమానాలకూ ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎయిరిండియా విమానంలో 120 మంది ప్రయాణికులున్నారు. అది రన్‌వే మీదకు దిగుతోంది. ఇండిగో విమానం బగ్డోరా నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకోబోతోంది అందులో 130 మందిప్రయాణికులున్నారు. రెండు విమానాల మధ్య కనీసం కిలోమీటరు దూరం ఉండాలన్న నిబంధనకు విరుద్ధంగా ఈ రెండూ చాలా సమీపానికి వచ్చేశాయి. అయితే, రెండు విమానాల పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ముందుగా ఇండిగో విమాన కెప్టెన్‌కు ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ నుంచి హెచ్చరిక వచ్చింది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం కెప్టెన్ వెంటనే విమానాన్ని కిందకు దించేశాడు. ఎయిరిండియా విమానం కూడా అలాగే కుడివైపు తిరిగిపోయింది. ఇద్దరు కెప్టెన్లకు 'క్లియర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్' సందేశం రాగానే వాళ్లు మళ్లీ విమానాలను మామూలు స్థితికి తీసుకొచ్చారు. ఈ సంఘటనపై డీజీసీఏ విచారణ చేపట్టింది. -
రన్ వే పై కుప్పకూలిన విమానం
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఒక విమానం టేకాఫ్ చేయబోతూ, టైర్ పేలి రన్‌వే పైనే కుప్ప కూలింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లోరిడా వెళ్లాల్సిన ఎయిర్ బస్ 320 ముందు టైర్ టేకాఫ్ చేసే ముందు గపేలిపోయింది. దాని తుక్కు బండి ఇంజన్‌లోకి దూరిపోయింది. దీంతో బారీగా పొగ వచ్చింది. కొద్ది క్షణాలకే విమానం రన్‌వే పై కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో 149 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది ఉన్నారు. నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలవడం మినహా ఏమీ కాలేదు. దీంతో అధికారులు, ప్రయాణికులు 'అమ్మయ్య' అని ఊపిరిపీల్చుకున్నారు.