రష్యాలో ఘోర ప్రమాదం తప్పింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం రన్‌వే అనుకొని పొరపాటున గడ్డకట్టిన నదిపై ల్యాండ్ అయ్యింది. అయితే నదిలోని నీరంతా పూర్తిగా గడ్డుకట్టుకుపోవడంతో ఎవరికి ఏ ప్రమాదం జగరలేదు. ఈ ఘటన జిర్యాంగ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగింది.
వివరాలు.. పోలార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సోవియెట్ కాలం నాటి ఏఎన్-24 విమానం రష్యాలోని యాకుత్స్క్ నుంచి గురువారం బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం జిర్యాంక ఎయిర్‌పోర్టులో దిగాల్సి ఉంది. అయితే ఈ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మానాశ్రయంలోని రన్‌వేపై మంచు పేరుకుపోయింది. విపరీతమైన మంచు కారణంగా పక్కనే నది కూడా గడ్డకట్టి ఉంది. దీంతో పైలట్ గందరగోళానికి గురై ఎయిర్‌పోర్టు సమీపంలోని కోలిమా నదిపై విమానాన్ని ల్యాండ్ చేశాడు.
విషయం తెలుసుకున్న ఎమర్జెన్సీ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైలట్ తప్పిదం కారణంగానే విమానం నదిపై ల్యాండ్ అయ్యిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. గడ్డకట్టిన నదిపై విమానం ల్యాండ్ అవడం, అందులోని ప్రయాణికులను బయటకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
The AN-24 aircraft of Polar Airlines was flying on the route #Yakutsk - Zyryanka - Srednekolymsk. But, having arrived at Zyryanka airport, it landed on Kolyma river. There were 30 passengers and 4 crew members on board. No one was injured and the aircraft was not damaged.… pic.twitter.com/MFM85AKSJ6— WarMonitoreu (@WarMonitoreu) December 28, 2023
Comments
Please login to add a commentAdd a comment