River
-
నదీ జలాల భాగస్వామ్యంపై భారత్‌తో బంగ్లా చర్చలు
ఢాకా: సరిహద్దు నదుల నీటి భాగస్వామ్యంపై బంగ్లాదేశ్ త్వరలో భారత్‌తో చర్చించనుంది. ఈ విషయాన్ని తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మీడియాకు తెలిపారు. 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఢాకా పర్యటన సందర్భంగా, తీస్తా నీటి భాగస్వామ్యంపై భారత్- బంగ్లాదేశ్ ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంది. అయితే నాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో నీటి కొరత కారణంగా ఈ ఒప్పందానికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు.బంగ్లాదేశ్ జలవనరుల సలహాదారు సైదా రిజ్వానా హసన్ మీడియాతో మాట్లాడుతూ సరిహద్దు నదుల నీటి భాగస్వామ్యంపై బంగ్లాదేశ్ త్వరలో భారత్‌తో చర్చలు జరుపుతుందన్నారు. అయితే ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని పరిశీలించిన తర్వాతే చర్చలు జరుపుతామన్నారు. అంతర్జాతీయ నదుల నీటిని పంచుకోవడం సంక్లిష్టమైన సమస్య అని, అయితే దీనిలో రాజకీయాలకు తావు ఉండకూడదని రిజ్వానా పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలపై ఏ దేశం కూడా ఏకపక్షంగా అంతర్జాతీయ కోర్టుకు వెళ్లదని, బదులుగా రెండు దేశాలూ వెళ్లాలని అన్నారు.భారత్‌తో వర్షపాతం డేటాను పంచుకోవడం మానవతా చర్య అని రిజ్వానా పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు ఈ డేటా ఉపకరిస్తుందన్నారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ వాదనలు స్పష్టంగా, బలంగా ఉన్నాయన్నారు. దేశంలోని అంతర్గత నదులను సమిష్టిగా రక్షించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాగా ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తీస్తా నీటి భాగస్వామ్య ఒప్పందంపై భారత్‌తో విభేదాలను పరిష్కరించడానికి తాత్కాలిక ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: చెరువులో మునిగి ఎనిమిది మంది చిన్నారులు మృతి -
80 ఏళ్ల స్విమ్మర్! ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయం..కానీ..!
ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక ఉంటే చాలు వయసు ఏ మాత్రం అడ్డంకి కాదు. అదే నిరూపించింది 80 ఏళ్ల బామ్మ. లేటు వయసులో స్విమ్మింగ్ నేర్చుకుని ఎన్నో పతకాలు సాధించింది. అతేగాదు నృత్యకారిణిగా కూడా రంగ ప్రవేశం చేసి ఆరంగేత్రం ప్రదర్శించిన అత్యంత వృద్ధురాలిగా పేరు తెచ్చుకుంది. జీవితంలో కష్టాలు మాములే వాటిని పక్కన పెట్టి మంచిగా ఆస్వాదించడం తెలిస్తే హాయిగా జీవించొచ్చు అంటోంది ఈ బామ్మ. ఎవరీమె? రెస్ట్ తీసుకునే వయసులో మెరుపుతీగలా పతకాలు సాధిస్తూ.. దూసుకుపోతున్న ఆమె నేపథ్యం ఏంటంటే..గుజరాత్‌కు చెందిన 80 ఏళ్ల బకులాబెన్ పటేల్ అనే బామ్మకి ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయమట. కానీ ఇప్పుడు గజ ఈతగాడి మాదిరి అలవోకగా ఈత కొట్టేస్తోంది. 58 ఏళ్ల వయసులో ఈత నేర్చుకోవడం ప్రారంభించిందట. మొదట్లో విభిన్న అథ్లెటిక్ క్రీడలు ప్రయత్నిస్తూ..చివరికి ఈత నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుందట. అలా ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈతల పోటీల్లో పాల్గొని ఎన్నో పతాకాలు, సర్టిఫికేట్లు సాధించింది. ఈ పోటీల నేపథ్యంలో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ఆస్ట్రేలియా వంటి 12 దేశాల్లో జరిగే టోర్నమెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అంతేగాదు ఆ బామ్మ పేరు మీదుగా ఏకంగా తొమ్మిది అంతర్జాతీయ పతకాలు, దాదాపు 500కి పైగా సరిఫికేట్లు ఉన్నాయి. అంతేగాదు 400 మందికి పైగా స్విమ్మర్లకు శిక్షణ కూడా ఇచ్చింది. అలాగే ప్రపంచంలో అత్యంత సవాలుతో కూడిన సముద్రాలు, నదులను కూడా ఈదేసింది. అత్యంత కష్టమైన కెనడియన్ సముద్రంలో కూడా అలవోకగా రెండుసార్లు స్విమ్ చేసింది. అంతేగాదు ఏదో ఒక రోజు ఇంగ్లిష్ ఛానెల్‌ను కూడా జయించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పాలని భావిస్తోంది బకులాబెన్. దీంతోపాటు ఏడు పదుల వయసులో భరతనాట్య నృత్యకారిణిగా రంగప్రవేశం చేసింది. పైగా ఆరంగేత్రం ప్రదర్శించిన అత్యంత వృద్దురాలిగా నిలవడమే గాక ఉత్తమ నృత్యకారిణిగా ప్రశంసలందుకుంది. ఇక బకులాబెన్ నేపథ్యం వచ్చేటప్పటికీ..ఆమె చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. 13వ ఏటనే వివాహం చేసుకుని ఇద్దర పిల్లలకు తల్లి అయ్యింది. అయితే కొంతకాలనికే భర్త మరణించడంతో ఒంటిరిగా పిల్లలను పోషించుకుంటూ బతికింది. వాళ్లు పెద్దవాళ్లై మంచి పొజిషన్లో సెటిల్ అవ్వడంతో మళ్లీ ఆమె జీవితం శూన్యంతో నిశబ్దంగా ఉండిపోయింది. దీన్నుంచి బయటపడేలా ఆమె తన దృష్టిని క్రీడలవైపుకి మళ్లించింది. అలా ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సాధించింది. తాను ఏ రోజుకైనా దేశం గర్వపడేలా విజయం సాధించి, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవాలనేది ప్రగాఢమైన కోరికట ఆమెకు. (చదవండి: ఫ్యాషన్ బ్లాగ్‌తో ..ఏకంగా రూ. 40 కోట్లు..!) -
నదిపై కుప్పకూలిన బ్రిడ్జి.. ఎనిమిది మంది గల్లంతు
హనోయ్: వియత్నాంలో ఎర్ర నదిపై ఉన్న 30 ఏళ్ల నాటి వంతెన కుప్ప కూలింది. ఉత్తర ప్రావిన్సు ఫుథోలో సోమవారం(సెప్టెంబర్9) ఈ ఘటన జరిగింది. బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో దానిపై ప్రయాణిస్తున్న 8 మంది నదిలో పడి గల్లంతయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ఎర్ర నదిపై ఉన్న మిగిలిన వంతెనల మీద రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని చోట్ల పూర్తిగా నిషేధించారు.ట్రాఫిక్ ఆపేసిన వాటిలో రాజధాని హనోయ్‌లోని చోంగ్డోంగ్ బ్రిడ్జి కూడా ఉంది. భారీ తుపాను యాగీ బీభత్సం వల్లే వంతెన కూలినట్లు అధికారులు తెలిపారు. తుపాను ధాటికి మొత్తం 58 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి.. నిప్పులు చిమ్మే డ్రోన్ డ్రాగన్ -
నా కూతురు అల్లుడిని నదిలో పడేయండి: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ(అజిత్‌పవార్) సీనియర్ నేత ధర్మారావు బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కూతురు భాగ్యశ్రీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతుందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. శనివారం అహేరి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లతో మాట్లాడుతూ.. నమ్మక ద్రోహానికి పాల్పడితే తన కూతురు భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హల్గేకర్‌లను ప్రాణహిత నదిలో పడేయాలని వ్యాఖ్యానించారు.అయితే మంత్రి ఈ వ్యాఖ్యలు ‘జన్సన్మాన్ యాత్ర’ సందర్భంగా ఎన్సీపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలోనే చేయడం గమనార్హం. ‘పార్టీని విడిచివెళ్లే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మా కుటుంబంలోని కొందరు వేరే పార్టీలో చేరాలనుకుంటున్నారు. 40 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు ఎన్నో ఫిరాయింపులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు శరద్ పవార్‌కు చెందిన నాయకులు నా కుటుంబాన్ని విభజించి నా కుమార్తెను నాపై పోటీకి దింపాలని చూస్తున్నారు. నా అల్లుడు, కూతురిని నమ్మవద్దు. వాళ్లు నన్ను విడిచిపెట్టారు. అలాంటి వారిని సమీపంలోని ప్రాణహిత నదిలో తోసేయాలి, వారు నా కుమార్తెను తమ వైపుకు తిప్పుకొని సొంత తండ్రికి వ్యతిరేకంగా ఆమెను తయారు చేస్తున్నారు. తండ్రికి కూతురు కాలేకపోయిన అమ్మాయి మీకు ఏం అవుతుంది? దాని గురించి మీరు ఆలోచించాలి. ఆమె నీకు ఏం న్యాయం చేస్తుంది? వారిని నమ్మవద్దు. రాజకీయాల్లో నేను కుమార్తె, సోదరుడు సోదరిలా చూడను. ’అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న ధర్మారావు ఆత్రమ్.. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అహేరి నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాలని చూస్తున్నారు. -
Nashik: ఉప్పొంగిన గోదావరి.. నీట మునిగిన ఆలయాలు
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్లవద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు.నాసిక్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం ఎనిమిదిన్నర వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. ఫలితంగా రాంకుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి.గంగాపూర్ డ్యాం సహా పలు డ్యాంల నుంచి అధికారులు క్రమంగా నీటిని విడుదల చేస్తున్నారు. నాసిక్‌లోని హోల్కర్ వంతెన కింద నుంచి 13,000 క్యూసెక్కుల వేగంతో నీటిని విడుదల చేస్తున్నారు. నాసిక్ పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, నది ఒడ్డున ఉన్న గ్రామాల్లోనివారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
బీహార్‌లో పడవ మునక.. పలువురు గల్లంతు
బీహార్‌లోని ఖగారియాలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. మాన్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిర్నియా సమీపంలోగల బాగ్మతి నదిలో నేటి (ఆదివారం) ఉదయం పడవ మునిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 25మందికి పైగా జనం ఉన్నట్లు సమాచారం.బాల్కుంద గ్రామానికి చెందిన గోపాల్ కుమార్(18), ఖిర్నియా గ్రామ నివాసి అమలా దేవి(50) ఈ ప్రమాదంలో గల్లంతైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. పడవ నదిలో మునిగిన వెంటనే కొందరు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నట్లు సమాచారం. ఖిర్నియా డ్యామ్ నుండి అంబ మీదుగా బహియర్ వైపు పడవ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవలో వ్యవసాయ కూలీలు ఉన్నట్లు సమాచారం. ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతోంది. మరోవైపు ఖగారియాలో గంగా నది ఉప్పొంగుతుండటంతో ఇక్కడి పర్బట్టా బ్లాక్‌లోని రింగ్ డ్యాం కూలిపోయేలా ఉందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఈ రింగ్ డ్యాం మీదుగా నీరు ప్రవహిస్తోంది. -
UP Flood: నీట మునిగిన 900 గ్రామాలు
ఉత్తరప్రదేశ్‌లోని గంగా, గోమతి, ఘఘ్రా నదుల నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. అలాగే రామగంగ, గర్రా, ఖానౌట్, రాప్తి, బుధి రాప్ట్, కానో, శారదా నదులు కూడా ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో లఖింపూర్ ఖేరీ, బల్రాంపూర్, అయోధ్య, ఉన్నావ్, బల్లియా, బస్తీ సహా 20 జిల్లాల్లోని దాదాపు 900 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. బల్లియాలో ఘఘ్రా నది కోతకు గురికావడంతో 13 గ్రామాలు నీట మునిగాయి.వారణాసిలోని గంగా నది నీటిమట్టం 48 గంటల్లో రెండు మీటర్ల మేర పెరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరద ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష జరిపేందుకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని, 24 గంటల్లో పరిహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని 1,571 గ్రామాలతో పాటు బరేలీ, పిలిభిత్, షాజహాన్‌పూర్ పట్టణ ప్రాంతాలు వరదల బారిన పడ్డాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.కాశీలో గంగానది నీటిమట్టం వరుసగా రెండో రోజు కూడా పెరుగుతూనే ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ప్రకారం గంగానది నీటిమట్టం 61.79 మీటర్లుగా నమోదైంది. రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. పురాతన దశాశ్వమేధ ఘాట్‌లో సాయంత్రం జరగాల్సిన గంగా హారతి వేదికను కూడా మార్చాల్సి వచ్చింది. విశ్వనాథ్ ధామ్ గంగా గేట్ పక్కనే ఉన్న లలితా ఘాట్, మణికర్ణికా ఘాట్ ర్యాంప్‌పైకి నీరు చేరుకుంది. -
బీహార్‌ను భయపెడుతున్న వరదలు
పట్నా: బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వరద ముప్పు అంతకంతకూ పెరుగుతోంది. వివిధ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోసి, గండక్ సహా పలు నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. సీఎం నితీష్ కుమార్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరదల నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గండక్ బ్యారేజీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వరద సహాయక చర్యలకు సంబంధించి అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. బోటు ఆపరేషన్లు, పాలిథిన్ షీట్లు, సహాయక సామగ్రి, మందులు, పశుగ్రాసం, వరద షెల్టర్లు, కమ్యూనిటీ కిచెన్లు, డ్రై రేషన్ ప్యాకెట్లు/ఆహార ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.వరదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు, జిల్లా మెజిస్ట్రేట్ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకు సహాయాన్ని అందించాలని, రాష్ట్ర ఖజానాపై విపత్తు బాధితులకు మొదటి హక్కు ఉంటుందని నితీష్ కుమార్ పేర్కొన్నారు. ఇదిలావుండగా రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ వరదల కారణంగా ఏటా లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ బాధితులను ఆదుకోవడం లేదని ఆరోపించారు. -
అమెరికా నౌక ప్రమాదం.. ఆరుగురు మృతి!
బాల్టిమోర్: అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలోని బాల్టీమోర్ నగరంలో చోటు చేసుకున్న బ్రిడ్జ్ కుప్పకూలిన ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. నదిలో పడి గల్లంతు అయిన ఆరుగురు మరణించారని భావించిన అధికారులు సహాయక చర్యలు నిలిపివేశారు. మంగళవారం అమెరికాలో మేరీలాండ్ రాష్ట్రంలోని బాల్టీమోర్ నగరంలో ఘోర ప్రమాదం సంభవించింది. పటాప్స్కో నదిలో వాహన కంటైనర్లతో వెళ్తున్న ఓ భారీ నౌక పవర్ ఫెయిల్యూర్‌కు గురైంది. అదుపు తప్పి నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని శరవేగంగా ఢీకొంది. దాంతో వంతెన కుప్పకూలింది. దానిపై ప్రయాణిస్తున్న వాహనాలు నీటిలో పడి మునిగిపోయాయి. వాటిలో ప్రయాణిస్తున్నవారు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై గుంతలు పూడుస్తున్న ఆరుగురు సిబ్బంది కూడా నదిలో పడిపోయారు. అధికారులు ఇద్దరిని రక్షించారు. కనీసం ఆరుగురి దాకా గల్లంతైనట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో నది 15 మీటర్ల లోతుంది. నీళ్లు కూడా బాగా చల్లగా ఉండటంతో వారంతా దుర్మరణం పాలై ఉంటారని భావిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 1.30 దాటాక ఈ దుర్ఘటన జరిగింది. నౌకలోని సిబ్బంది మొత్తం భారతీయులే. నౌక అదుపు తప్పిన వెంటనే వారు హుటాహుటిన ప్రమాద హెచ్చరికలు (మేడే) జారీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు అప్రమత్తమై వాహనాలేవీ బ్రిడ్జిపైకి వెళ్లకుండా నియంత్రించారు. దానికి తోడు ప్రమాదం జరిగింది అర్ధరాత్రి వేళ కావడంతో బ్రిడ్జిపై ట్రాఫిక్ కూడా భారీగా లేదు. ఇలా జరిగింది... ప్రమాద సమయంలో నౌక గంటకు 15 కి.మీ. వేగంతో వెళ్తోంది. పవర్ ఫెయిల్యూర్‌తో అదుపు తప్పి శరవేగంగా బ్రిడ్జికేసి దూసుకొచ్చి దాని తాలూకు పిల్లర్‌ను ఢీకొట్టింది. పిల్లర్ విరగడంతో 2.6 కిలోమీటర్ల పొడవున్న వంతెన ఒక్కసారిగా కుంగిపోయింది. సెకండ్ల వ్యవధిలో పాక్షికంగా కుప్పకూలింది. ఆ వెంటనే నౌకలో మంటలు చెలరేగి దట్టమైన పొగ వెలువడింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కనీవినీ ఎరగని ప్రమాదమని మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ అన్నారు. ప్రమాద హెచ్చరికకు అధికారులు శరవేగంగా స్పందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారంటూ కొనియాడారు. ప్రమాదం జరిగిన తీరు యాక్షన్ సినిమా సీన్‌ను తలపించిందని బాల్టీమోర్ మేయర్ బ్రాండన్ స్కాట్ అన్నారు. నగరంలో అత్యవసర పరిస్థితి విధించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పవర్ ఫెయిల్యూరే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలినా మరింత లోతుగా దర్యాప్తు సాగుతోంది. భారత సిబ్బంది క్షేమం ప్రమాదానికి గురైన నౌక పేరు డాలీ. గ్రీస్ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఈ నౌక ప్రస్తుతతం సినర్జీ మెరైన్ గ్రూప్ నిర్వహణలో ఉంది. ప్రఖ్యాత డెన్మార్క్ షిప్పింగ్ కంపెనీ ‘మెర్క్స్’కు చెందిన సరుకుతో బాల్టిమోర్ రేవు నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. 985 అడుగుల పొడవు, 157 అడుగుల వెడల్పున్న ఈ నౌకలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 22 మంది సిబ్బందీ భారతీయులేనని సినర్జీ మెరైన్ గ్రూప్ వెల్లడించింది. వారంతా క్షేమంగానే ఉన్నారని పేర్కొంది. ప్రమాదం నేపథ్యంలో అమెరికా తూర్పు తీరంలో అత్యంత బిజీ ఓడరేవుల్లో ఒకటైన బాల్టీమోర్కు నౌకల రాకపోకలు కనీసం కొద్ది నెలల పాటు స్తంభించనున్నాయి. గతేడాది బాల్టీమోర్ రేవు గుండా ఏకంగా 5.2 కోట్ల టన్నుల మేరకు సరుకు, దాదాపు 5 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు జరిగాయి! పోర్టుకు నౌకల రాకపోకలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. దుర్ఘటన ఉగ్రవాద చర్య కాదని స్పష్టం చేశారు. -
రామ్‌లల్లా శిల్పికి శ్రీకృష్ణ విగ్రహం ఆర్డర్!
అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహానికి రూపాన్ని ఇచ్చిన కళాకారుడు యోగిరాజ్ ఇప్పుడు కురుక్షేత్రలో శ్రీ కృష్ణుని భారీ విగ్రహాన్ని తయారుచేసేందుకు సిద్ధం అవుతున్నారు. మహాభారత సమయంలో అర్జునునితో సంభాషిస్తున్న శ్రీ కృష్ణుని భారీ రూపాన్ని యోగిరాజ్ తీర్చిదిద్దనున్నారు. శ్రీరాముని విగ్రహం తరహాలోనే ఈ విగ్రహాన్ని కూడా నేపాల్‌లోని గండకీ నది నుంచి సేకరించిన శాలిగ్రామశిలతో తయారు చేయనున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలో గల బ్రహ్మసరోవర్ ఒడ్డున నిర్మితమవుతున్న 18 అంతస్తుల జ్ఞాన మందిరంలోని గర్భగుడిలో యోగిరాజ్ రూపొందించే శ్రీ కృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మూడు ఎకరాల స్థలంలో 18 అంతస్తుల జ్ఞాన మందిరాన్ని నిర్మిస్తున్నట్లు శ్రీ బ్రహ్మపురి అన్నక్షేత్ర ట్రస్ట్ జ్ఞాన మందిర్ వ్యవస్థాపకులు స్వామి చిరంజీవ్పురి మహారాజ్ తెలిపారు. ఆలయ గర్భగుడిలో అర్జునునికి సందేశం ఇస్తున్న రీతిలో శ్రీ కృష్ణుని భారీ విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఇందుకోసం శిల్పి అరుణ్ యోగిరాజ్‌తో ఇప్పటికే చర్చలు జరిగాయి. త్వరలోనే శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్.. శ్రీకృష్ణుని విగ్రహ తయారీకి అంగీకరించిన నేపధ్యంలో గండకీ నది నుంచి ప్రత్యేక శాలిగ్రామ రాయిని తీసుకురావడానికి ట్రస్ట్ నేపాల్‌ను సంప్రదిస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయం నిర్మాణ దశలో ఉంది. 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. 18 అంతస్తుల జ్ఞాన మందిరం అనేక ప్రత్యేకతలతో కూడి ఉంటుంది. గీతలోని 18 అధ్యాయాలు, 18 అక్షోహిణి సేన, 18 రోజుల మహాభారత యుద్ధం, కురుక్షేత్రంలో పవిత్ర సరస్వతి నది రూపం కూడా ఈ ఆలయంలో కనిపించనుంది. -
అక్కడ నది హఠాత్తుగా నెత్తుటి రంగులో ప్రవహిస్తోంది!
ఎక్కడైన నదిలో నీళ్లు తెల్లగానే ఉంటాయి. కానీ ఇక్కడ నదిలో నీళ్లు మాత్రం ఎర్రటి నెత్తురులా మారిపోయాయి. చెప్పాలంటే రక్తంలా ప్రవహిస్తున్నాయి నీళ్లు. ఇలా ఎందుకు జరిగిందో అని స్థానికలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన దక్షిణ రష్యాలో చోటు చేసుకుంది. ఇలా జరగడానకి కారణం ఏంటన్నది అక్కడి అధికారులకు అంతు చిక్కని మిస్టరీలా ఉంది. వివరాల్లోకెళ్తే..దక్షిణ రష్యాలోని కెమెరోవోలోని ఇస్కిటిమ్కా నది సడెన్‌గా ఎరుపు రంగులో ప్రవహిస్తోంది. ఒకప్పుడూ చక్కగా ప్రవహించే నది ఇలా రక్తపు నదిలా ఎలా మారిందనేది తెలియక స్థానికులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడూ ఈ ఘటనే సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా ఈ ఘటన నీటి కాలుష్యం గురించి తక్షణమే తీసుకోవాల్సిన చర్యల ఆవశక్యతను తెలియజేసింది. అంతేగాదు బాతులు వంటి చిన్న జంతువులు ఏవీ ఆ నీటిలోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Travel Nature Wanderlust (@worlderlust) ఈ ఘటనపై పర్యావరణ అధికారులు సైతం భయాందోళనలు వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగానే ఇలా జరిగిందేమో! అని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ నగర డిప్యూటీ గవర్నర్ ఆండ్రీ పనోవ్ డ్రైనేజీ లీక్ కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అక్కడ నది ఇలా సడెన్‌గా రంగు మారడానికి కచ్చితమై కారణం ఏంటన్నది రసాయన పరీక్ష ద్వారా తెలియాల్సి ఉంది. కాగా, ఇలాంటి ఘటనే సరిగ్గా జూన్ 2020లో ఉత్తర సైబీరియాలో నోరిల్స్క్ సమీపంలోని పవర్ స్టేషన్లో డీజిల్ రిజర్వాయర్ కూలిపోవడంతో ఇలాంటి ఘటన జరిగింది. దీని కారణంగా అనేక ఆర్కిటిక్ నదులన్నీ ఎర్రగా మారి ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా దాదాపు 15 వేల టన్నుల ఇంధనం నదిలోకి పోగా, ఆరు వేల టన్నులు మట్టిలోకి ఇంకిపోయింది. ఆ టైంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అత్యవసర పరిస్థితిని కూడాప్రకటించారు. మళ్లీ ఇదే తరహాలో రష్యాలోని మరో నగరంలో చోటు చేసుకోవడం గమనార్హం. ఇలాంటి ఘటనలు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం, జలవనరులను కాలుష్య కోరల నుంచి కాపాడు కోవాల్సిన ప్రాముఖ్యతలను గూర్చి నొక్కి చెబుతున్నాయని అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. మానవ తప్పిదాలు, పారిశ్రామిక కార్యకలాపాలు పర్యావరణానికి ఎలా నష్టం కలిగిస్తున్నాయో ఇప్పటికైనా గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందేనని, లేదంటే మానవళికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. (చదవండి: తినే గమ్(గోండ్) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..) -
నదిపైనే ల్యాండింగ్ !
మాస్కో: రన్‌వేపై ల్యాండ్ చేయడం మామూలే.. నది ఉపరితలంపై విమానాన్ని పరుగెత్తించడంలోనే ఉంది అసలు మజా అనుకున్నాడో ఏమో. రష్యాలో చిన్న విమానాన్ని ఒక పైలట్ నేరుగా నదిపైనే ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు నది ఉపరితలం మొత్తం దట్టంగా మంచుతో నిండిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలబడ్డాయి. రష్యాలో తూర్పు సైబీరియా పరిధిలోని జిర్యాంకా విమానాశ్రయ సమీపంలో జరిగిందీ ఘటన. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రాంతంలోని యాకుట్సŠక్ నగరం నుంచి 34 మంది ప్రయాణికులతో ఆంటోవ్ ఏఎన్–24 విమానం గురువారం ఉదయం జిర్యాంకా నగరానికి బయల్దేరింది. భారీగా మంచు కురుస్తుండటంతో జిర్యాంకా ఎయిర్పోర్ట్ రన్‌వే సరిగా కనబడక దానిని దాటేసి ఎదురుగా ఉన్న కోలిమా నదిపై ల్యాండ్‌చేశాడు. నగరంలో ప్రస్తుతం గడ్డకట్టే చలి వాతావరణం రాజ్యమేలుతోంది. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత దెబ్బకు నది ఉపరితలం మొత్తం గడ్డకట్టింది. దీంతో దీనిపై ల్యాండ్ అయిన విమానం అలాగే కొన్ని మీటర్లు సర్రున జారుతూ ముందుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఘటనకు కారకుడైన పైలట్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. సోవియట్ కాలంనాటి ఈ చిన్న విమానాన్ని పోలార్ ఎయిర్‌లైన్స్ నడుపుతోంది. -
పైలట్ తప్పిదం.. రన్‌వే అనుకొని నదిపై ల్యాండ్ అయిన విమానం
రష్యాలో ఘోర ప్రమాదం తప్పింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం రన్‌వే అనుకొని పొరపాటున గడ్డకట్టిన నదిపై ల్యాండ్ అయ్యింది. అయితే నదిలోని నీరంతా పూర్తిగా గడ్డుకట్టుకుపోవడంతో ఎవరికి ఏ ప్రమాదం జగరలేదు. ఈ ఘటన జిర్యాంగ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగింది. వివరాలు.. పోలార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సోవియెట్ కాలం నాటి ఏఎన్-24 విమానం రష్యాలోని యాకుత్స్క్ నుంచి గురువారం బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం జిర్యాంక ఎయిర్‌పోర్టులో దిగాల్సి ఉంది. అయితే ఈ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మానాశ్రయంలోని రన్‌వేపై మంచు పేరుకుపోయింది. విపరీతమైన మంచు కారణంగా పక్కనే నది కూడా గడ్డకట్టి ఉంది. దీంతో పైలట్ గందరగోళానికి గురై ఎయిర్‌పోర్టు సమీపంలోని కోలిమా నదిపై విమానాన్ని ల్యాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎమర్జెన్సీ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైలట్ తప్పిదం కారణంగానే విమానం నదిపై ల్యాండ్ అయ్యిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. గడ్డకట్టిన నదిపై విమానం ల్యాండ్ అవడం, అందులోని ప్రయాణికులను బయటకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. The AN-24 aircraft of Polar Airlines was flying on the route #Yakutsk - Zyryanka - Srednekolymsk. But, having arrived at Zyryanka airport, it landed on Kolyma river. There were 30 passengers and 4 crew members on board. No one was injured and the aircraft was not damaged.… pic.twitter.com/MFM85AKSJ6— WarMonitoreu (@WarMonitoreu) December 28, 2023 -
Traffic Effect: నదిలో దూసుకెళ్లిన కారు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి ట్రాఫిక్‌ను తప్పించుకోవడం కోసం రోడ్డు దిగి తన ఎస్యూవీ కార్‌ను ఏకంగా నదిలో పరుగులు పెట్టించాడు. ఈ ప్రమాదకర ప్రయణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నదిలో వాహనం నడిపిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిలో కారును పరుగులు పెట్టించిన ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహోల్ స్పితి జిల్లాలో జరిగింది. కారు వెళ్లిన చంద్రా నదిలో ప్రస్తుతం నీళ్ల లోతు పెద్దగా లేదు. దీంతో ఎస్యూవీ ఈజీగా నదిని దాటేసింది. ఈ ప్రమాదకర చర్యకు పాల్పడ్డ వాహనదారునికి మోటార్ వెహికిల్ చట్టం కింద భారీ జరిమానా విధించినట్లు ఎస్పీ మయాంక్ చౌదరి తెలిపారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవులు రావడంతో హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి పెరిగింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తి వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. డ్రోన్లతో పోలీసులు ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. #WATCH | Himachal Pradesh: Challan issued after a video of driving a Thar in Chandra River of Lahaul and Spiti went viral on social media. SP Mayank Chaudhry said, "Recently, a video went viral in which a Thar is crossing the river Chandra in District Lahaul Spiti. The said… pic.twitter.com/V0a4J1sgxv — ANI (@ANI) December 25, 2023 ఇదీచదవండి..పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
నాగలదిన్నె బ్రిడ్జి ప్రారంభం.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరం
అయిజ/నందవరం: ఇరు తెలుగు రాష్ట్రాలకు నాగలదిన్నె బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం నందవరం మండలంలోని నాగలదిన్నె గ్రామ సమీపంలో తుంగభద్ర నదిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైలెవల్ వంతెన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, జిల్లా జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, తెలంగాణ రాష్ట్రం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రిబ్బన్ కట్ చేసి వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ.. 2009లో తుంగభద్ర నది ఉధృతిలో పాత బ్రిడ్జి కొట్టుకుపోయిందన్నారు. 2011లో ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి కొత్త బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేయించారన్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. కరోనా విపత్తు, తెలంగాణ వైపు భూ సేకరణ వంటి ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆయన పట్టుబట్టి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించారన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రజలకు బంధుత్వాలు ఉన్నాయని, వారందరికీ ఈ బ్రిడ్జి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాబోయే కాలానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి మాట్లాడుతూ.. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి రూ.42 కోట్ల అంచనాతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశామన్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. గత తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి భూ సేకరణ సమస్యను పరిష్కరించామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాంట్రాక్టరుకు బకాయిలు చెల్లించి వంతెన నిర్మాణానికి కావాల్సిన నిధులు సైతం మంజూరు చేసి పూర్తి చేయించిందన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం కోసం రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దకాలంగా ఎదురు చూశారని, ఎట్టకేలకు రెండు రాష్ట్రాల బంధాలకు వంతెన వారధిగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. బ్రిడ్జి ప్రారంభోత్సవంలో కర్నూలు కలెక్టర్ సృజన, సబ్ కలెక్టర్ అభిషేక్‌కుమార్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంతరెడ్డి, నియోజకవర్గ నాయకులు బసిరెడ్డి, భీమిరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు, ఆదోని డివిజన్ ఈఈ కృష్ణారెడ్డి, డీఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నిత్యానందరాజు, ఎంపీడీఓ దశరథ రామయ్య, సీఐ మోహన్‌రెడ్డి, ఎస్ఐలు తిమ్మయ్య, తిమ్మారెడ్డి, శరత్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
80 వేల కిలోల గంటను బిగిస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి
రాజస్థాన్‌లోని కోటా నగరంలో చంబల్ రివర్ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానిని బిగిస్తున్న సమయంలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఇంజినీరుతో పాటు మరో కార్మికుడు మృతి చెందారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోటా జిల్లా యంత్రాంగం, రివర్ ఫ్రంట్ అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్‌లోని కోటాలోని చంబల్ నది ఒడ్డున 80 వేల కిలోల బరువున్న గంటను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గంట చేసే శబ్దం 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఈ గంట ప్రపంచంలోనే అతిపెద్ద గంటగా గుర్తింపు పొందింది. ఈ గంట ఐదువేల సంవత్సరాల వరకు నిలిచివుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ గంటను రివర్ ఫ్రంట్‌కు తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించారు. ఈ గంటను నిర్దేశిత స్థానంలో అమరుస్తుండగా ఇంజనీర్ దేవేంద్ర ఆర్య, మరో కార్మికుడు 35 అడుగుల ఎత్తునుంచి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవేంద్ర కన్నుమూశారని వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు -
బొగ్గును మించిన నల్లని నది ఏది? కారణమేమిటి?
ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ వందల కొద్దీ నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో కొన్ని నదుల నీరు శుభ్రంగా ఉంటుంది. మరికొన్ని నదుల నీరు మురికిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం బొగ్గుకన్నా నల్లగా ఉండే నది గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత నల్లని నదిగా పేరొందింది. ఈ నదిలో బొగ్గు కన్నా నల్లటి నీరు ప్రవహించడం వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో రుకీ అనే నది ప్రవహిస్తుంటుంది. ఈ నదిలోని నీరు నల్లగా కనిపించడానికి కారణం.. ఆ నీటిలో కరిగిన సేంద్రియ పదార్థమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డెయిలీ మెయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రుకీ నదిలోని నీటితో కనీసం చేతులు కడుక్కునేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు. ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు ఈ నదికి సంబంధించిన తమ శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రపంచానికి అందించారు. నదిలోని నీటికి నలుపు రంగు రావడానికి కారణం వర్షారణ్యం నుండి సేంద్రియ పదార్థాలు వచ్చి, ఈ నీటిలో కలవడమేనని నిపుణులు చెబుతున్నారు. కాగా ఆఫ్రికన్ దేశమైన కాంగోలో స్విట్జర్లాండ్ కంటే నాలుగు రెట్లు అధికమైన డ్రైనేజీ బేసిన్ ఉంది. దీనిలో కుళ్ళిన చెట్లు, మొక్కల నుండి వచ్చే కార్బన్ సమ్మేళనాలు పేరుకుపోతున్నాయి. ఇవి వర్షాలు, వరదల కారణంగా నదులలోకి చేరుకుంటున్నాయి. నీటిలో కరిగిన ఇటువంటి కార్బన్ సమ్మేళనాల సాంద్రత అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది డార్క్ టీ మాదిరిగా కనిపిస్తుంది. దీనికితోడు రుకీ నది.. అమెజాన్ రియో నెగ్రా కంటే 1.5 రెట్లు లోతుగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నల్ల నీటి నదిగా పేరొందింది. రుకీ బేసిన్ దిగువన పెద్ద మొత్తంలో పీట్ బోగ్ మట్టి ఉంది. కాంగో బేసిన్‌లోని పీట్ బోగ్లలో సుమారు 29 బిలియన్ టన్నుల కార్బన్ ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా? -
వాటర్ విమెన్! ఆమె నదిలో నీళ్లు కాదు కన్నీళ్లని చూస్తోంది!
వాటర్ ఉమన్ నదుల గొప్పతనం గురించి చెప్పమంటే మాటల్లో ఎన్ని అయినా చెబుతాం. అలాంటి పుణ్య నదులు నిర్లక్ష్యం బారిన పడి జీవం కోల్పోయే పరిస్థితిలో ఉంటే మాత్రం పట్టించుకోము. ఈ ధోరణికి భిన్నమైన మహిళ శిర్ప పథక్. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శిర్పకు నదులు అంటే ఇష్టం. వాటికి సంబంధించిన పురాణ కథలు అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న పుణ్యనది గోమతి సంరక్షణ కోసం వెయ్యిన్కొక్క కిలోమీటర్ల పాదయాత్ర చేసింది... సన్నని ప్రవాహమై బయలుదేరే గోమతి ప్రయాణంలో బలపడుతుంది. ‘ప్రయాణం గొప్పతనం బలం’ అని ఆ నది మౌనంగానే చెబుతుంది. అందుకేనేమో ‘గోమతి నదిని రక్షించుకుందాం’ నినాదానికి బలం ఇవ్వడానికి పాదయాత్ర చేసింది శిర్ప పథక్. పారిశ్రామిక వ్యర్థాలు, నివాసాలలో నుంచి వచ్చే మురుగు నీరు... మొదలైన వాటి వల్ల గోమతి అనేక ప్రాంతాలలో కలుషితం అవుతుంది. మురుగునీటి శుద్ధి కర్మాగారాల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం జరగడం లేదు. ‘గంగానదితో పోల్చితే గోమతి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోంది’ అని నివేదికలు తెలియజేస్తున్నాయి. ‘ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన నదిని మనమే రక్షించుకుందాం’ అంటుంది శిర్ప. పంచతత్వ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన శిర్ప పథక్ ‘వాటర్ ఉమన్’గా పేరు తెచ్చుకుంది. ‘గోమతి నదిని రక్షించుకుందాం’ నినాదంతో పదిహేను జిల్లాలలో ఊళ్లు, పల్లెలు, పట్టణాల గుండా సాగిన పాదయాత్రలో ఆ పుణ్యనది ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి ప్రజలకు తెలియజేసింది. ‘పరిస్థితి ఇది. మనం చేయాల్సింది ఇది’ అంటూ స్పష్టంగా చెప్పింది. ప్రతిరోజు 30 నుంచి 35 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసింది. ‘నది ఒడ్డున మొక్కలు నాటుదాం’ అని ప్రజలతో ప్రమాణం చేయించింది. శిర్ప వెంట ప్రజలు వచ్చేవాళ్లు. పర్యావరణ సంబంధిత విషయాలను చర్చిస్తూ ఆమె పాదయాత్ర ముందుకు సాగేది. ‘ఆక్రమణలను అడ్డుకుందాం. పుణ్యనదిని కాపాడుకుందాం’ అనే నినాదంతో ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, అధికారులతో మాట్లాడేది. ఈ పాదయాత్రలో పాల్గొన్న వందలాది మంది ప్రజలు మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంలా చేసుకున్నారు. ‘నా పాదయాత్రలో భాగంగా నది చుట్టు పక్కల ప్రాంతాలలో నివసించే ఎంతోమందితో మాట్లాడాను. నది పరిస్థితి తెలిసినప్పటికీ ఏంచేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి మార్గనిర్దేశం చేశాను’ అంటుంది శిర్ప. శిర్ప విషయానికి వస్తే... నదుల సంరక్షణ గురించి పల్లెలు, పట్టణాల గుండా యాత్ర చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో నర్మద నది సంరక్షణ కోసం 3600 కిలోమీటర్ల యాత్ర చేసింది. ‘నదులకు ఏమైతే మనకేమిటి? మనం హాయిగానే ఉన్నాం కదా అనే భావన నుంచి బయటికి రావాలి. నదుల మనుగడలోనే మనుషుల మనుగడ ఉంది. ప్రకృతి వనరులే మన శక్తులు. నదులకు ముప్పు వాటిల్లితే మన కుటుంబ పెద్దలకు ముప్పు వాటిల్లినట్లుగా భావించి తక్షణ చర్యలపై దృష్టి పెట్టాలి. మనిషికి రక్తం ఎంత అవసరమో నది ఆరోగ్యానికి కలుషితం కాని నీరు అంతే అవసరం’ అంటోంది శిర్ప. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాకు చెందిన శిర్ప ఉన్నత చదువులు చదివింది. ‘ఏదో ఒక ఉద్యోగం చేయడం కంటే నదుల పరిరక్షణకు నా వంతుగా ఏదైనా చేస్తాను’ అంటూ ప్రయాణం మొదలు పెట్టింది. ఆ ప్రయాణం వృథా పోలేదని ఎన్నో ఊళ్లలో వచ్చిన మార్పు తెలియజేస్తుంది. నదిలో నీళ్లు మాత్రమే కాదు ఆ నది కార్చే కన్నీళ్లు కూడా ఉంటాయి. నీళ్లు అందరికీ కనిపిస్తాయి. కన్నీళ్లు కొందరికి మాత్రమే కనిపిస్తాయి. ఆ కొందరు అందరిలో అవగాహన రావడం కోసం ప్రయత్నిస్తారు. అలాంటి ఒక వ్యక్తి... వాటర్ ఉమన్ శిర్ప పథక్. ‘నా వల్ల ఏమవుతుంది అనే మాట బలహీనమైది. నా వల్ల కూడా అవుతుంది అనేది బలమైనది. బలమైన మాటే మన బాట అయినప్పుడు మార్పు సులభం అవుతుంది’ అంటుంది శిర్ప పథక్. (చదవండి: చిద్విలాస చిత్రగణితం! మ్యాథ్స్‌తో ఆర్ట్‌ను మిళితం చేసే సరికొత్త ఆర్ట్!) -
గల్లంతైన వారిలో 62 మంది సురక్షితం
గ్యాంగ్‌టక్/జల్పాయ్గురి: సిక్కింలో తీస్తా నదికి బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారిలో 62 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో, గల్లంతైన వారి సంఖ్య 143 నుంచి 81కి తగ్గిపోయింది. మరోవైపు, వరదల్లో మృతుల సంఖ్య 30కి చేరుకుంది. మరో వైపు, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరదల్లో గల్లంతైన 22 మంది ఆర్మీ సిబ్బందిలో మరో రెండు మృతదేహాలు శనివారం బయటపడ్డాయి. దీంతో, ఇప్పటి వరకు 9 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు చెప్పారు. నాలుగు జిల్లాల్లోని సుమారు 42 వేల మంది ప్రజలపై వరదలు ప్రభావం చూపగా, 1,320 నివాసాలు దెబ్బతిన్నాయని, 13 వంతెనలు కొట్టుకుపోయాయని రాష్ట్ర యంత్రాంగం శనివారం తెలిపింది. తీవ్రంగా గాయపడిన 26 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మంగన్ జిల్లాలోని లచెన్, లచుంగ్ల్లో వరద ముంపులో చిక్కుకున్న సుమారు 3వేల మంది పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని బయటకు తరలించేందుకు వైమానిక దళానికి చెందిన ఎంఐ–17 హెలికాప్టర్లతో ప్రయత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించలేదని అధికారులు చెప్పారు. చుంగ్థంగ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన పర్యాటకులకు హెలికాప్టర్ ద్వారా అత్యవసరాలను సరఫరా చేశారు. సింగ్టమ్, బర్దంగ్, రంగ్పోల్లోని వారిని రక్షించే పనుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తలమునకలై ఉన్నాయి. అనూహ్య వరదలతో చుంగ్థంగ్ పట్టణం 80 శాతం మేరకు తీవ్రంగా దెబ్బతింది. వరద ప్రభావిత మాంగన్ జిల్లాను సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ శనివారం సందర్శించారు. సహాయక కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అన్ని శాఖల అధికారులతో కూడిన అధికారుల కేంద్ర బృందం ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాలకు పంపుతున్నట్లు కేంద్ర మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా చెప్పారు. ఇలా ఉండగా, వచ్చే అయిదు రోజులపాటు మంగన్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ 150 మంది తృటిలో తప్పించుకున్నారు తీస్తా నదికి సమీపంలోని సిక్కిం– పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో రైల్వే సొరంగం పనుల్లో పాల్గొంటున్న సుమారు 150 మంది కార్మికులు ఆకస్మిక వరదల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎగువ నుంచి భారీగా వరద ముంచుకొస్తున్న సమాచారాన్ని అధికారులు కాలింపాంగ్ జిల్లా జీరో మైల్ ప్రాంతం వద్ద ఉన్న ప్రైవేట్ రైల్వే కాంట్రాక్ట్ సంస్థకు చేరవేశారు. సంస్థ అధికారులు వెంటనే ఒక సెక్యూరిటీ గార్డును హుటాహుటిన కార్మికులుండే క్యాంపునకు పంపించారు. పగలంతా పనులు చేసి, అలసిపోయి క్యాంపుల్లో నిద్రిస్తున్న కార్మికులను గార్డు అప్రమత్తం చేశారు. దాదాపు 150 మంది కార్మికులు ఉన్నఫళంగా విలువైన పత్రాలు, దగ్గరున్న డబ్బు, కట్టుబట్టలతో అక్కడి నుంచి అడ్డదారిన బయలుదేరారు. దాదాపు 20 నిమిషాల అనంతరం ప్రధాన రహదారికి వద్దకు చేరుకున్నారు. అప్పటికే వరద దిగువనున్న వారి క్యాంపును మింగేయడం కళ్లారా చూసి కార్మికులు షాక్ అయ్యారు. అప్పటికే అక్కడున్న ట్రక్కుల్లో 2 కిలోమీటర్ల దూరంలోని రాంబి బజార్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌నకు చేరుకున్నారు. వీరంతా అస్సాం, బిహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు. -
సిక్కిం కకావికలం.. అంతకంతకూ పెరుగుతున్న మరణాలు
ఆకస్మిక వరదలు, క్లౌడ్‌బర్స్ట్‌తో సిక్కిం రాష్ట్రం కకావికలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన కుంభవృష్టి వర్షం, చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో తీస్తా నదికి భారీ వరద పోటెత్తింది. దీంతో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా నదిలో నీటిమట్టం పెరగి వరద నీరు ఉప్పొంగి ప్రవహించింది. ఈ వరదల్లో ఆర్మీ జవాన్లు సహా వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిర్వీరామంగా గాలిస్తున్నాయి. పెరుగుతున్న మరణాలు సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. వరదల్లో చిక్కుకొని మరణించిన వారి సంఖ్య ప్రస్తుతం 53కు చేరింది. వీరిలో ఏడుగురు జవాన్లు కూడా ఉన్నారు. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నదిలో ఇప్పటి వరకు 27 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ఇంకా 140 మంది ఆచూకీ తెలియడం లేదు. రాష్ట్రంలో 1,173 ఇళ్లు దెబ్బతిన్నాయని, రద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 2,413 మంది ప్రజలను రెస్క్యూ బృందాలు రక్షించినట్లు సిక్కిం ప్రభుత్వం పేర్కొంది. జల విలయానికి 13 వంతెనలు ధ్వంసమయ్యాయని, రోడ్ల కనెక్టివీటి తెగిపోయిందని తెలిపింది. అయితే 6,875 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, రాష్ట్రవ్యాప్తంగా 22 సహాయ శిబిరాల్లో వీరంతా ఆశ్రయం పొందుతున్నాదరని తెలిపింది. తీస్తా-V జల విద్యుత్ కేంద్రానికి దిగువన ఉన్న అన్ని వంతెనలు మునిగిపోయి వరదలో కొట్టుకుపోయాయని పేర్కొంది. ఉత్తర సిక్కింలో కమ్యూనికేషన్‌కు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించింది. సీఎం ఉన్నతస్థాయి సమావేశం వదరల నేపథ్యంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ తమాంగ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు, పునరుద్దరణ పనులపై సమీక్షించారు. చుంగ్తంగ్ వరకు రోడ్డు కనెక్టివిటీని ప్రారంభించేందుకు చర్యలుచేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగా నుంచి టూంగ్ వరకు వీలైనంత త్వరగా రహదారిని నిర్మించాలని పేర్కొన్నారు. కుంభవృష్టి వర్షాలు, వరదలతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు. #सिक्किम में बदलफाड़ तबाही के अभी कई लोग लापता, एक्शन में सीएम प्रेम सिंह तमांग, नागा गांव मंगन में बाढ़ प्रभावित इलाकों और राहत शिविरों में पहुंचकर स्थिति का लिया जायजा।#Sikkim #sikkimflood @PSTamangGolay #SikkimCloudburst @BJP4Sikkim pic.twitter.com/uboYFaWOMC — हिंद उवाच (@TheHindUVAACH) October 7, 2023 నదిలో కొట్టుకొస్తున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తీస్తా నది వరదల్లో ఆర్మీకి చెందిన పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి కొట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కొట్టుకొని వచ్చిన ఆయుధం పేలి ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడటం కలవరపెడుతోంది. దీంతో నదిలో కొట్టుకువచ్చే పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువులను ముట్టుకోవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సిక్కిం ప్రభుత్వం కూడా అడ్వైజరీ జారీ చేసింది. నదీ తీరం వెంట వాటిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను సైన్యం రంగంలోకి దింపింది. The rescue of 68 people stranded for 3 days in the Glacier Lake Outburst Flood (GLOF) in North Sikkim by @ITBP_official Himveers needs to be appreciated for their heroic efforts. Respect! 👏👍👌💐👏 @ndmaindia @NDRFHQ https://t.co/m0mDOz0Gzs — Vinod Menon (@nvcmenon) October 7, 2023 మరో అయిదు రోజులు వర్షాలు భారత వాతావరణ శాఖ రాబోయే ఐదు రోజులలో మంగన్ జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. లాచెన్, లాచుంగ్ లోయలలో ప్రతికూల వాతావరణం కారణంగా గత రెండు రోజులుగా Mi-17 హెలికాప్టర్లతో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను నిర్వహించడానికి చేస్తున్న అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని భారత వైమానిక దళం వెల్లడించింది. వాతావరణం అనుకూలిస్తే నేడు ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్లు తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపింది. రూ. 44 కోట్లు విడుదల రాష్ట్రానికి మరోవైపు చుంగ్తాంగ్ డ్యామ్ తెగిపోవడానికి గత ప్రభుత్వాలు నాసిరకంగా నిర్మించడమే కారణమని ఆరోపించారు. చుంగుతాంగ్ డ్యామ్ నిర్మాణం సరైన పద్ధతిలో జరగలేదని, ఈ కారణంగానే డ్యామ్ కొట్టుకుపోయి ఇంతటి విపత్తుకు దారి తీసిందని తెలిపారు. ఇక వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డిడీర్ఎఫ్) కేంద్ర వాటా నుంచి ముందస్తుగా ₹ 44.8 కోట్ల విడుదలకు హోం మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT)ని కూడా ఏర్పాటు చేసింది. -
రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం
సెప్టెంబర్‌లో నెలలో ఓ వారం రోజుల పాటు శ్రీలంకలో పర్యటించే అవకాశం వచ్చింది. నేను చూసిన శ్రీలంకకు అక్షరరూప పరంపర ఇది. మొదట మదుగంగలో రివర్ సఫారీ మదుగంగ... ఈ నది శ్రీలంక దీవిలో ప్రవహిస్తోంది. బాల్‌పిటియా అనే చిన్న పట్టణం నుంచి ఈ నదిలో రివర్ సఫారీ చేయవచ్చు. ఈ ప్రదేశం కొలంబో– గాలే హైవేలో వస్తుంది. బెన్తోట నుంచి అరగంట ప్రయాణ (18 కి.మీలు) దూరంలో ఉంది బాల్‌పిటియా. ఇక్కడ మదుగంగ నది విశాలమైన సరస్సును తలపిస్తూ ఉంటుంది. నీరు నిశ్చలంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం నుంచి పడవలో ప్రయాణం మొదలు పెడితే ఒకటిన్నర గంట నదిలో విహరించవచ్చు. నది మధ్యలో ఉన్న దీవులను చుట్టిరావచ్చు. మధ్యలో బుద్ధుడి విగ్రహాన్ని, వినాయకుడి మందిరాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఇది ప్రకృతి రమణీయతను, మాన్‌గ్రోవ్ (మడ అడవులు) బారులను చూడడానికి వెళ్లాల్సిన ప్రదేశం. నదికి మహా స్వాగతం మదు గంగ నది తీరమంతా మడ అడవులు దట్టంగా ఉంటాయి. చెట్ల కొమ్మల నుంచి పుట్టుకొచ్చిన వేళ్లు నదిలోని నీటి కోసం ఊడల్లాగ కిందకు వేళ్లాడుతుంటాయి. బాల్‌పిటియా దగ్గర మొదలైన రివర్ సఫారీ మొదట మదుగంగ నది హిందూమహాసముద్రంలో కలిసే ప్రదేశం వరకు సాగుతుంది. నిశ్చలంగా ప్రవహించిన నదికి హిందూ మహా సముద్రం అలలతో స్వాగతం పలుకుతున్న అద్భుతాన్ని చూసిన తరవాత దీవుల పరిక్రమ దిశగా సాగింది మా పడవ. ప్రకృతి ప్రపంచమిది శ్రీలంకలో ఎటు చూసినా పచ్చదనమే. అయితే ఈ నది మధ్య ఉన్న దీవులు ఇంకా దట్టమైనవి, ఇంకా పచ్చనైనవి. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించినట్లు దట్టమైన అడవులవి. ఈ దీవులు కొన్ని ప్రైవేట్ వ్యక్తులవి. కొన్ని సామాన్య జనావాసాలు. ఒక దీవిలో పూర్తిగా దాల్చిన చెక్కను చెక్కే వాళ్లే నివసిస్తున్నారు. మొత్తం ఇరవై కుటుంబాలు. దాల్చిన చెక్క చెట్ల నుంచి బెరడును సేకరించడం, సినమిన్ ఆయిల్ తయారు చేయడమే ఆ దీవిలో నివసించే వారి వృత్తి. పడవలన్నీ ఆ దీవి దగ్గర ఆగుతాయి. ఒక ఇంట్లోకి వెళ్లగానే ఒక చిన్న గది, పర్యాటకులు కూర్చోవడానికి చేసిన ఏర్పాటు ఉంది. మనం వెళ్లగానే ఒక వ్యక్తి సినమిన్ ఆకులు రెండింటిని మన చేతిలో పెట్టి వాసన చూడమంటాడు. ఆ తర్వాత ఒక కర్రను చూపించి బెరడును ఒలుస్తాడు. ఆ తర్వాత పర్యాటకులందరికీ గాజు కప్పుల్లో దాల్చిన చెక్క టీ ఇస్తారు. చేపల పట్టే అమ్మాయి టీ తాగిన తర్వాత వారి వద్దనున్న దాల్చిన చెక్కతోపాటు సినమిన్ పౌడర్ ప్యాకెట్లు, సినమిన్ ఆయిల్ సీసాలను మన ముందు పెడతారు. కావల్సినవి కొనుక్కున్న తర్వాత పడవ ఇతర దీవుల వైపు సాగుతుంది. ఈ మధ్యలో బుద్ధుని విగ్రహం దగ్గర కొంతసేపు ఆగవచ్చు. ఒక్కో దీవిని చుట్టి వస్తుంటే మనం ప్రకృతి ప్రపంచాన్ని చుట్టి వస్తున్న విజేతగా ఒకింత అతిశయంగా ఫీలవుతాం. అన్నట్లు చేపలతో ఫుట్ మసాజ్ సౌకర్యం కూడా ఒక దీవిలో ఉంది. చేపలు పట్టే అమ్మాయి మదుగంగలో ఒకమ్మాయి చిన్న తెడ్డు పడవలో చేపలు పడుతూ కనిపించింది. ‘నువ్వు ఆడపిల్లవి, ఈ పనులు నువ్వు చేసేవి కాదు’ అని అడ్డగించే వాళ్లు లేకపోతే అమ్మాయిలు ఏ పనిలోనైనా అద్భుతాలు సాధిస్తారనిపించింది. ఆ అమ్మాయికి హాయ్ చెప్పి, మనసులోనే సెల్యూట్ చేసుకుని ముందుకు సాగిపోయాం. తిరుగు ప్రయాణంలో ఒక దీవి దగ్గర గబ్బిలాలు భయం గొల్పాయి. దీవి నిండా చెట్లకు తలకిందుగా వేళ్లాడుతూ నల్లటి పెద్ద పెద్ద గబ్బిలాలు. ఇంకొద్ది సేపు చూడాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ ఆ దృశ్యం ఆహ్లాదంగా అనిపించక ముందుకు సాగిపోయాం. ఇక్కడ ముందుకు సాగిపోవడం అంటే బయలుదేరిన ప్రదేశం వైపుగా అన్నమాట. పడవ దిగేటప్పటికి రెస్టారెంట్లో వంట సిద్ధంగా ఉంది. రివర్ సఫారీకి బయలుదేరేటప్పుడే ఫుడ్ ఆర్డర్ తీసుకున్నారు. రకరకాల కూరగాలయలను కొబ్బరి పాలతో ఉడికించిన కూరలతో మంచి భోజనం పెట్టారు. చేపల కూర కూడా రుచిగా ఉంది. ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... మాన్‌గ్రోవ్ బారుల మధ్య నదిలో విహారం అద్భుతంగా ఉంటుంది. చెట్లు ఒక్కో చోట నదిని ఇరుకు చేస్తాయి. గుహలోకి వెళ్లినట్లు పడవ కొమ్మల మధ్య దూరి పోతుంది. నది మీద ఇనుప వంతెనలుంటాయి. వాటి దగ్గరకు వచ్చినప్పుడు దేహాన్ని బాగా వంచి పడవలో ఒదిగి కూర్చోవడం, చిన్నపిల్లల్లాగ భయంభయంగా వంతెన వెళ్లిపోయిన తరవాత పైకి లేవడం, ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... లండన్ బ్రిడ్జి ఫాలింగ్ డౌన్ అని పాడుకున్నట్లే... ఈ రివర్ సఫారీలో ‘కమింగ్ సూన్ కమింగ్ సూన్ వన్మోర్ బ్రిడ్జ్ ఈజ్ కమింగ్ సూన్’ అని పాడుకుంటూ పడవలో దాక్కోవడం... పర్యాటకులను చిన్న పిల్లలను చేస్తుంది. – వాకా మంజులారెడ్డి (చదవండి: పర్యాటకుల స్వర్గధామం కోనసీమ, ఆతిథ్యం నుంచి ఆత్మీయత వరకు..) -
నిత్యం పొగలు గక్కుతుండే నది..ఏకంగా 100 డిగ్రీ సెల్సియస్..
ప్రకృతి నిజంగా చాలా గొప్ప అద్భుతాలను పరిచయం చేస్తుంది. అవి నిజంగా ఎలా ఏర్పడ్డాయన్నది ఓ మిస్టరీ. సహజసిద్ధంగా ఏర్పడే ఆ అద్భుతాలు చూసి ఎంజాయ్ చేయాలే గానీ వాటితో ఆటలు ఆడాలనుకుంటే అంతే సంగతి. అలాంటి అద్భుతమైన నదే ఈ బాయిల్డ్ రివర్. ఈ నది ఎక్కడ ఉంది? దాని కథ కమామీషు ఏంటో చూద్దాం.! ఈ నది దక్షిణ అమెరికాలోని పెరువియన్ అమెజన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఉంది. ఇది అమెజాన నదికి ఉపనిదిగా కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే మరుగుతున్న నది ఇదొక్కటే. దీని పేరు షానయ్-టింపిష్కా అనే మరుగుతున్న నది. నిజానికి ఇది లా బొంబా నదిగానే బాగా ప్రసిద్ధి చెందింది. ఇది సుమారు 6.4 కిలోమీటర్లు పొడవైన నది. ఈ నది నీటి ఉష్ణోగ్రతలు 212 డిగ్రీల ఫారెన్‌హీట్ (100 డిగ్రీల సెల్సియస్) ఉంటుంది. ఇలా ఈ నది ఎందుకు నిత్యం మరుగుతూ పొగలు గక్కుతూ ఉందనేది ఓ అంతు పట్టని మిస్టరీగా ఉంది. అక్కడ ఉండే రాతినేలల్లో విపరీతమైన వేడి ఉండటంతోనే ప్రవహించే నీరు మరుగుతుందని చెబుతుంటారు. మరికొందరూ భూ ఉష్ణోగ్రత కారణంగా అని అంటారు. మరీ మిగతా నదులు అలా లేవు కదా మరీ ఈ నది ఇలా ఎందుకు ఉందని? చాలా మందిని తొలిచే ప్రశ్న?. దీనికి గల కారణం గురించి ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు లేదా కనుగొనలేకపోయారు. ఈ ఉడుకుతున్న నీటిలో ఏవైనా క్షణాల్లో ఉడికిపోతాయి. పైగా నేరుగా ఒట్టి చేతులను అస్సలు పెట్టే సాహసం చేయకూడదు. కానీ స్థానికులు మాత్రం ఈ నది జలాలు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, ఇవి ఎన్నో వ్యాధులను నయం చేస్తాయని విశ్వస్తారు. అందుకే ఈ ప్రాంతానికి జనాలు తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉండగా పర్యావరణ ప్రేమికులు ఇలా పర్యాటకులు ఈ సహజ సిద్ధ ప్రకృతి అద్భుతాల వద్దకు వస్తే అవి కూడా కాలుష్యానికి గురవుతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజసిద్ధమైన ఈ హాట్ టబ్‌ని రక్షించడం కోసం పర్యాటకుల తాకిడిని తగ్గించేలా ఇప్టికే పపలు ఆంక్షాలను విధించే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి కూడా. (చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..) -
అమెజాన్‌లో వందల డాల్ఫిన్ల మృతదేహాలు ఎందుకు తేలుతున్నాయి? వాతావరణ మార్పులే కారణమా?
అమెరికాలోని అమెజాన్ నదిలో ఇటీవలి కాలంలో 120 డాల్ఫిన్ల మృతదేహాలు తేలుతూ కనిపించాయి. తీవ్రమైన ఎండవేడిమి కారణంగా డాల్ఫిన్లు చనిపోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల అమెజాన్ ఉప నదుల్లోని వేలాది డాల్ఫిన్లు నీటిలో ఆక్సిజన్ లేకపోవడం కారణంగానూ చనిపోయాయి. ఈ నేపధ్యంలో ఈ నదుల్లో మిగిలి ఉన్న డాల్ఫిన్లను శివార్లలోని చెరువులకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెజాన్ నదిలోని డాల్ఫిన్లు వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలకు విలవిలలాడిపోతున్నాయి. వేడి కారణంగా నదులు ఎండిపోతుండటంతో డాల్ఫిన్ల మనుగడకు ముప్పు ఏర్పడింది. తక్కువ నీటి మట్టాలు, అధిక ఉష్ణోగ్రతలు మొదలైనవి నదిలోని నీరు గణనీయంగా వేడెక్కడానికి కారణంగా నిలుస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్న చేపలలో పింక్ డాల్ఫిన్లు అధిక సంఖ్యలో ఉంటున్నాయి. ఇవి దక్షిణ అమెరికాలోని నదులలో మాత్రమే కనిపిస్తుంటాయి. బ్రెజిల్ సైన్స్ మినిస్ట్రీతో కలిసి పనిచేస్తున్న మామిరోవా ఇన్స్టిట్యూట్ ఇటీవల లేక్ టెఫేలో లెక్కకుమించిన డాల్ఫిన్ మృతదేహాలు కనిపించాయని తెలిపింది. వీటి మృతి వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని మామిరోవా ఇన్స్టిట్యూట్ తెలిపింది. సీఎన్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నదులలో మిగిలి ఉన్న డాల్ఫిన్లను శివార్లలోని మడుగులు, చెరువులకు తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ పని అంత సులభం కాదని, ఇలా చేస్తే వాటి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: తల్లి ఫోనులో మునక.. కుమారుడు నీట మునక! -
రొట్టె కోసం రక్తపాతం..అన్నను హత్య చేసిన తమ్ముడు!
యూపీలోని కాన్పూర్‌లో రొట్టె ముక్కకోసం అన్నదమ్ములు రక్తం కళ్లజూసుకున్నారు. రొట్టె కోసం జరిగిన వివాదంలో తమ్ముడు అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అన్నయ్య.. తమ్ముని కోసం ప్రత్యేకంగా రొట్టెలు తయారు చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అన్నను హత్య చేసిన తమ్ముడు అంతటితో ఆగక సోదరుని మృతదేహంతో ఏమి చేశాడో తెలిస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఈ ఉదంతం కాన్పూర్‌లోని బిల్హౌర్ పరిధిలోని నానామవు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక ఇంటిలో కల్లూ, భూరా అనే అన్నదమ్ములుంటున్నారు. వీరిలో కల్లూ పెద్దవాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. అయితే అతని సోదరుడు భూరాకు వివాహం జరిగింది. అతని భార్య రక్షాభంధన్ కోసం పుట్టింటికి వెళ్లి, ఇంకా తిరిగి రాలేదు. ఆమె ఇంటిలో ఉన్నప్పుడు భర్తకు, కల్లూకు వంటవండేది. తాజాగా భూరా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళుతూ అన్నతో తాను ఇంటికి వచ్చేసరికి రొట్టెలు తయారు చేసిపెట్టాలని కోరాడు. అయితే రాత్రి భూరా ఇంటికి వచ్చేసరికి కల్లూ అతని కోసం రొట్టెలు తయారు చేయలేదు. వెంటనే కోపంతో రగిలిపోయిన భూరా తన అన్నను ‘రొట్టెలు ఎందుకు తయారు చేయలేదని’ అడిగాడు. దానికి సమాధానంగా కల్లూ ‘నువ్వు నాకు రొట్టెలు తయారు చేయలేదు కనుక నేను నీకు రొట్టెలు తయారు చేయలేదు’ అని అన్నాడు. ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్య వివాదం మొదలయ్యింది. ఇంతలో తమ్మడు ఇంటి బయట ఉన్న పెద్ద బండరాళ్లు తీసుకు వచ్చి ఏకధాటిగా అన్నపై దాడి చేశాడు. ఈ దాడిలో అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న మృతిచెందినా తమ్ముని ఆగ్రహం ఇంకా చల్లారలేదు. అన్న మృతదేహానికి తాడుకట్టి, దానికి లాక్కుంటూ గ్రామం శివారులకు తీసుకువచ్చాడు. అక్కడున్న నదిలోని పడవలో అన్న మృతదేహాన్ని ఉంచి, నది మధ్యలో దానిని వదిలివేశాడు. అయితే తమ్ముడు అన్న మృతదేహాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువెళుతున్నప్పుడు గ్రామానికి చెందిన కొందరు దానిని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ విజయ్ ఢులా మాట్లాడుతూ తమ విచారణలో నిందితుడు.. రొట్టె కోసం తనకు, తన అన్నకు వివాదం జరిగిందని, ఈ నేపధ్యంలోనే తాను అన్నను హత్యచేశానని తెలిపాడన్నారు. నదిలోని కల్లూ మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు? -
రాకాసి మొసలి
ఈ రాకాసి మొసలి అమెరికాలోని మిసిసిపీ రాష్టంలో వేటగాళ్ల బృందానికి దొరికింది. యజూ నదిలో ఇటీవల వేటకు వెళ్లిన వేటగాళ్ల బృందానికి ఈ అతిభారీ మొసలి చిక్కింది. దీని పొడవు 14.3 అడుగులు, బరువు 364.007 కిలోలు. మిసిసిపీలో ఇదివరకు దొరికిన భారీ మొసలి కంటే ఇది పొడవులోను, బరువులోను ఎక్కువగా ఉండటంతో ఈ మొసలి కొత్త రికార్డును నెలకొల్పింది. మిసిసిపీలోనే 2017లో ఒక భారీ మొసలి దొరికింది. దాని పొడవు 14.0 అడుగులు, బరువు 347.67 కిలోలు. యజూ నది ఒడ్డుకు చేరువలో ఉండే జనాలు ఇక్కడకు తమ పెంపుడు కుక్కలను విహారానికి తీసుకొస్తుంటారు. కొంతకాలంగా ఈ మొసలి ఒడ్డుకు వచ్చి తిరుగుతూ, దొరికిన కుక్కనల్లా పలారం చేసేస్తుండటంతో దీనికోసం వేటగాళ్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వేటగాళ్లు పట్టి తెచ్చిన ఈ మొసలి పొడవు, బరువు వివరాలను మిసిసిపీ వన్యప్రాణులు, జలచరాలు, ఉద్యానవనాల సంరక్షణ శాఖ అధికారులు నమోదు చేసుకున్నారు. ఆరేళ్ల కిందట దొరికిన భారీ మొసలి రికార్డును ఇది అధిగమించిందని వారు ప్రకటించారు.