దారి మరువని ‘యమున’.. గతాన్ని గుర్తుచేసుకుంటూ.. | yamuna reclaims amid delhi floods mughal era painting | Sakshi
Sakshi News home page

దారి మరువని ‘యమున’.. గతాన్ని గుర్తుచేసుకుంటూ..

Published Sat, Jul 15 2023 1:15 PM | Last Updated on Sat, Jul 15 2023 1:33 PM

yamuna reclaims amid delhi floods mughal era painting - Sakshi

దేశరాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షాల కారణంగా యమునా నదికి వరదలు సంభవించాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. సుమారు 45 ఏళ్ల తరువాత యమునా నది తన మహోగ్రరూపాన్ని ప్రదర్శించింది. వరద ఉధృతికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. 

ప్రముఖ చారిత్రాత్మక ప్రాంతమైన ఎర్రకోట కూడా వరదలకు ప్రభావితమయ్యింది. కోటలోని తలుపుల వరకూ వరదనీరు చేసింది. ఈ నేపధ్యంలో పలువురు ఇంటర్నెట్‌ యూజర్స్‌ యమునా నది వరదలకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. యూజర్‌ హర్ష్‌ వత్స్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో మునిగిన ఎర్రకోట ఫొటోతోపాటు మొఘలుల కాలంనాటి ఒక పెయింటింగ్‌ ఫొటోను షేర్‌ చేశారు. 
 

దీనిలో శతాబ్ధాల కిందట సంభవించిన యమునా నది వరదల దృశ్యం కనిపిస్తోంది. ఈ ఫొటోకు క్యాప్షన్‌గా ‘ఆ నది ఈ విషయాన్ని ఎన్నడూ మరచిపోలేదు. దశాబ్ధాలు గడిచిన తరువాత కూడా తన సరిహద్దులను స్వాధీనం చేసుకునేందకు తిరిగి వచ్చింది. యమున తిరిగి తన వరద ప్రభావిత ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది’ అని రాశారు. మరో యూజర్‌ ఇదేవిధమైన ఫొటోను షేర్‌చేస్తూ ‘ప్రకృతి ఎప్పుడూ తన మార్గంలోకి తిరిగివస్తుంది..#DelhiFloods2023 #Yamuna #RedFort." అని ట్యాగ్‌ చేశారు. మరికొందరు యూజర్స్‌ ఏఏ ప్రాంతాలలోకి యమున వరద నీరు ‍ప్రవేశించిందో అవి శతాబ్ధాల క్రితం వరద ప్రవాహానికి గురైన ప్రాంతాలేనని, అందుకే యమున తిరిగి తన దారిని వెతుక్కుంటూ ఆయా ప్రాంతాలకు వచ్చిందని రాశారు.


ఇది కూడా చదవండి: 18 వ అంతస్తు నుంచి ‘అమ్మా’ అంటూ కేక... తల్లి పైకి చూసేసరికి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement