ఢిల్లీలో ఎర్రకోట ఉందనే విషయం తెలిసిందే. అయితే బీహార్‌లోని దర్భంగాలో అచ్చం ఎర్రకోటను పోలిన కోట ఉంది. ఈ కోటకు మూడువైపులా ఎత్తయిన ప్రకారాలు ఉన్నాయి.
దర్భంగాలోని కోటను దర్భంగా మహారాజు(The Maharaja of Darbhanga) నిర్మించారు. ఈ కోటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దర్భంగా మహారాజు జమీందారీ నుండి మహారాజుగా ఎదిగే వరకు జరిగిన ప్రయాణానికి ఇది గుర్తుగా మిగిలింది.
ఢిల్లీలోని ఎర్రకోటను పోలిన విధంగా ఈ కోట కూడా చక్కని నిర్మాణశైలి(Architecture)లో ఉంటుంది. ఈ కోటకు మూడు వైపులా ఎత్తయిన ప్రాకారాలున్నాయి. నాల్గవవైపు ప్రాకారపు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందిన తరువాత దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రాజరిక, జమీందారీ వ్యవస్థ రద్దయ్యింది. దీంతో అప్పట్లో ఏ స్థితిలో నిర్మాణపనులు ఆగిపోయాయో, ఇప్పటికీ అలానే ఉంది.
1934లో దర్భంగా మహారాజు ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దర్భంగా మహారాజు తన పదవీకాలంలో అనేక అద్భుతమైన కట్టడాలను నిర్మించాడు. నేడు ఆ వారసత్వ సంపద(Inheritance)కు పరిరక్షణ కొరవడినట్లు కనిపిస్తోంది.
ఈ కోట లోపల చుట్టూ లోతైన చెరువులు తవ్వించారు. నేడు ఈ కోట తన అందాన్ని కోల్పోతోంది. కోటపై మొక్కలు పెరిగాయి. ఈ కోట ప్రధాన ద్వారం వద్ద అద్భుత నిర్మాణ శైలి కనిపిస్తుంది. బీహార్‌లో 45 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కోట లోపల రాంబాగ్ ప్యాలెస్ ఉన్నందున ఈ కోటను రాంబాగ్ కోట అని కూడా పిలుస్తారు.
ఇది కూడా చదవండి: శీతాకాల తుపాను తీవ్రం.. అమెరికా హై అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment