జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ నేపధ్యంలో ప్రతీయేటా అదేరోజున రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఈ వేడుకల నిర్వహణకు ఇప్పుటికే దేశరాజధాని ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన అందమైన శకటాలు అందరినీ అలరించనున్నాయి. ఇప్పటికే ఈ శకటాల రూపకల్పన పూర్తయ్యింది.
లడఖ్ ఘనతను చూపే ఈ శకటం ఎంతో ప్రత్యేకంగా రూపొందింది. ఇది అత్యంత అందమైన శకటాలలో ఒకటి కానుంది. ఈ శకటాన్ని పాత్ ఆఫ్ డ్యూటీ ముందు నేషనల్ స్టేడియం క్యాంప్‌లో ప్రదర్శనకు ఉంచారు.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ శకటం ఎంతగానో ఆకట్టుకుంటోంది. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో దీనిని మనం చూడవచ్చు.
2025 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పశ్చిమ బెంగాల్ శకటాన్ని కూడా చూడవచ్చు. ఈ అందమైన శకటం అందరి ప్రశంసలు అందుకోనుంది.
జమ్ముకశ్మీర్ శకటం చాలా మంది హృదయాలను దోచుకోనుంది. జమ్ముకశ్మీర్ సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిందనే విషయం అందరికీ తెలిసిందే.
జార్ఖండ్ శకటాన్ని ఎంతో అందంగా తయారు చేశారు. ఈ శకటం రాజ్‌పథ్‌లో పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఉత్తరప్రదేశ్ శకటం జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ అందమైన శకటంలో ‘సముద్ర మథనం’ప్రాణం పోసుకుంది.
బీహార్ శకటం ఆ రాష్ట్రంలోని స్వర్ణయుగాన్ని ప్రతిబింబిస్తోంది. బీహార్ అనేక శతాబ్దాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞాన కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ శకటం కూడా అందరి దృష్టిని ఆకర్షించడంలో ముందుంటుంది. జనవరి 26న ఈ శకటాన్ని చూడవచ్చు.
2025 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనబోతున్న గోవా శకట కళాకారులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ ఆదేశాలు.. బంగ్లాదేశీయులపై ఉక్కుపాదం
Comments
Please login to add a commentAdd a comment