Republic Day-2025: అందంగా ముస్తాబు.. అణువణువునా గాలింపు | Republic Day-2025: Delhi Decorated, Security Soldiers Deployed at Every Nook | Sakshi
Sakshi News home page

Republic Day-2025: అందంగా ముస్తాబు.. అణువణువునా గాలింపు

Published Sun, Jan 26 2025 7:24 AM | Last Updated on Sun, Jan 26 2025 7:35 AM

Republic Day-2025: Delhi Decorated, Security Soldiers Deployed at Every Nook

నేడు (జనవరి 26) దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలను అందంగా ముస్తాబు చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను మరింతగా పెంచారు.
 

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో అత్యంత భారీగా పరేడ్‌ జరగనుంది. ఈ నేపద్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఢిల్లీలోని ప్రతీ ప్రాంతంలో సైనికులు పహారా కాస్తున్నారు. దీనికి సంబంధించి అనేక వీడియోలు వెలువడ్డాయి.

ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ నియంత్రణ కేంద్రం ద్వారా  భద్రతా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

భద్రతా సిబ్బంది ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్‌లో పెట్రోలింగ్ నిర్వహించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఢిల్లీ లోని చారిత్రాత్మక ఇండియా గేట్ త్రివర్ణ పతాక కాంతితో వెలిగిపోతోంది. సెంట్రల్ సెక్రటేరియట్ భవన సముదాయం కూడా రంగురంగుల లైట్లు, త్రివర్ణ పతాకాలతో మెరుస్తోంది. కుతుబ్ మినార్ కూడా త్రివర్ణ పతాక రంగుల్లో  కాంతివంతంగా మారింది.

ఒకవైపు జనవరి 26, మరోవైపు ఢిల్లీ ఎన్నికలు  ఉన్నందున విరివిగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఢిల్లీ అదనపు డీసీపీ (సౌత్) అచింత్ గార్గ్ తెలిపారు. సున్నితమైన ప్రదేశాలు,మార్కెట్లలో స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించారు. 

ఇది కూడా చదవండి: Republic Day 2025: 942 మందికి శౌర్య పురస్కారాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement