republic celebrations
-
శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్లో 75వ రిపబ్లిక్ డే వేడుకలు
భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అమెరికాలో వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్లో జరిగిన వేడుకలకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. ముఖ్య అతిథిలుగా 'శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా' డాక్టర్ శ్రీకర్ రెడ్డి, 'చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ మరియం' హాజరై, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలను చాటిచెప్పారు. వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ళ చరిత్రలో భారతదేశం సాధించిన పురోగతిని పలువురు కొనియాడారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులు హర్షం వ్యక్తం చేశారు. -
ఆరు నెలల్లో 7,877 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల్లోనే 7,877 కేసులను పరిష్కారించామని, ఈ విషయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో పాటు ఇతర సిబ్బంది కృషి ప్రశంసనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. ఆన్లైన్ సేవలను మరింత చేరువ చేయడం, కాగిత రహిత ఫైలింగ్ వంటి అంశాలు కేసుల సత్వర పరిష్కారానికి దోహదం చేస్తున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించడం హర్షణీయమన్నారు. త్వరలోనే భవన నిర్మాణం ప్రారంభం కానుందని, అందరికీ అన్ని వసతులు, సాంకేతికతతో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లోనూ న్యాయస్థానాల నిర్మాణానికి ప్రభుత్వం భూములు కేటాయించిందన్నారు. ఈ జిల్లాల్లో అన్ని వసతులతో భవన నిర్మాణాలు జరిగేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ.. హైకోర్టు ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సీజే జస్టిస్ అలోక్ అరాధే శుక్రవారం భూమిపూజ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు. -
Republic Day 2024: నారీశక్తి విశ్వరూపం
న్యూఢిల్లీ: భారత 75వ గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి వెల్లివిరిసింది. శుక్రవారం ఢిల్లీలో కర్తవ్య పథ్‌లో జరిగిన వేడుకలు మన సైనిక పాటవ ప్రదర్శనకు కూడా వేదికగా నిలిచాయి. దేశ ఘన సాంస్కృతిక చరిత్రకు అద్దం పట్టాయి. ఆర్మీ మిలిటరీ పోలీస్ విభాగానికి చెందిన కెపె్టన్ సంధ్య సారథ్యంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో జరిగిన త్రివిధ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. నేవీ, డీఆర్డీఓ శకటాలతో పాటు మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పలు రాష్ట్రాల శకటాలు కూడా ఆసాంతం నారీ శక్తికి అద్దం పట్టేలా రూపొందాయి. 265 మంది మహిళా సిబ్బంది మోటార్ సైకిళ్లపై ఒళ్లు గగుర్పొడిచేలా డేర్‌డెవిల్ విన్యాసాలు చేశారు. సంప్రదాయ మిలిటరీ బ్యాండ్ స్థానంలో కూడా ఈసారి 112 మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరాలతో పాటు గిరిజన తదితర సంగీత వాయిద్యాలతో అలరించారు. బీఎస్ఎఫ్, సీఆరీ్ప ఎఫ్ మొదలుకుని ఢిల్లీ పోలీస్, ఎన్సీసీ వంటి పలు విభాగాల కవాతులన్నీ పూర్తిగా నారీమయంగా మారి అలరించాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వీటన్నింటినీ ఆసాంతం ఆస్వాదిస్తూ కని్పంచారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి ఆయన సంప్రదాయ గుర్రపు బగ్గీలో ఆయన వేడుకలకు విచ్చేయడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జరిగిన పరేడ్‌లో ముర్ము, మేక్రాన్ త్రివిధ దళాల వందనం స్వీకరించారు. 90 నిమిషాలకు పైగా జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సైనిక దళాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వణికించే చలిని, దట్టంగా కమ్మేసిన పొగ మంచును లెక్క చేయకుండా భారీ జనసందోహం వేడుకలను తిలకించింది. ఈసారి ఏకంగా 75 వేల మందికి పైగా గణతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. మోదీ వారితో కలివిడిగా మాట్లాడుతూ గడిపారు. ఫొటోలు, సెలీ్ఫలకు పోజులిచ్చారు. ఆయన ధరించిన రంగురంగుల బంధనీ తలపాగా ఆహూతులను ఆకట్టుకుంది. మోదీ రాక సందర్భంగా భారత్ మాతా కీ జై అంటూ వారు చేసిన నినాదాలతో కర్తవ్య పథ్ మారుమోగింది. ఫ్రాన్స్‌కు చెందిన 95 మంది సభ్యుల కవాతు దళం, 30 మందితో కూడిన సైనిక వాయిద్య బృందం కూడా వేడుకల్లో పాల్గొన్నాయి. చివరగా వాయుసేనకు చెందిన 29 యుద్ధ విమానాలు, ఏడు రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు, ఒక హెరిటేజ్ ప్లేన్‌తో పాటు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బస్ ఏ330 మల్టీ ట్యాంకర్ రావాణా విమానం, రెండు రాఫెల్ ఫైటర్ జెట్లు చేసిన ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ విన్యాసాల్లో కూడా 15 మంది మహిళా పైలట్లు పాల్గొనడం విశేషం. అలరించిన నాగ్ మిసైల్ వ్యవస్థ ► వేడుకల్లో ప్రదర్శించిన టీ–90 భీష్మ ట్యాంకులు, నాగ్ మిసైల్ వ్యవస్థ, తేజస్ వంటి యుద్ధ వాహనాలు, ఆయుధాలను గుర్తించే రాడార్ వ్యవస్థ స్వాతి, డ్రోన్లను జామ్ చేసే వ్యవస్థ, అత్యాధునిక ఎల్రక్టానిక్ వార్ఫేర్ వ్యవస్థ, క్యూఆర్ఎస్ఏఎం తదితర క్షిపణులు అలరించాయి. మోదీ నివాళులు శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ తొలుత నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. దేశమాత రక్షణలో ప్రాణాలొదిలిన సైనిక వీరులకు ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముర్ము, మేక్రాన్ గుర్రపు బగ్గీలో వస్తున్న దృశ్యాలను కెమెరాలు, సెల్ ఫోన్లలో బంధించేందుకు జనం పోటీ పడ్డారు. అనంతరం జెండా వందనం, జాతీయ గీతాలాపన, 105 ఎంఎం దేశీయ శతఘ్నులతో 21 గన్ సెల్యూట్ అందరినీ ఆకట్టుకున్నాయి. భారత కీర్తి పతాకను వినువీధిలో ఘనంగా ఎగరేసిన చంద్రయాన్ థీమ్‌తో రూపొందిన శకటం అలరించింది. దాంతోపాటు అయోధ్య రామాలయ ప్రారంభం నేపథ్యంలో కొలువుదీరిన బాలక్ రామ్ శకటం ప్రధానాకర్షణగా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16 శకటాలు, కేంద్ర శాఖలకు సంబంధించి 9 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. వేడుకలు ముగిశాక మోదీ కర్తవ్య పథ్ పొడవునా కాలినడకన సాగి ఆహూతులను అలరించారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్లు, ముఖ్యమంత్రులు తదితరులు వాటిలో పాల్గొన్నారు. గొప్ప గౌరవం: మేక్రాన్ ‘‘గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాతో పాటు ఫ్రాన్స్‌కు కూడా గొప్ప గౌరవం. థాంక్యూ ఇండియా. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు భారత ప్రజలందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. వేడుకల అనంతరం ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది ఆరోసారి కావడం విశేషం! ఈ వేడుకలకు దేశాధినేతలను ముఖ్య అతిథిగా ఆహా్వనించడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా (1995లో) మొదలుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015లో) దాకా ఎందరో అధినేతలు వీటిలో భాగస్వాములయ్యారు. దేశాధినేతల అభినందనలు బ్రిటన్ రాజు చార్లెస్ 3 మొదలుకుని ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు దాకా పలు దేశాల అధినేతలు భారత్‌కు 75వ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలిపారు. అభినందన సందేశాలతో సామాజిక వేదికల్లో పోస్టులు పెట్టారు. భారత్‌తో బ్రిటన్ సంబంధాలు నానాటికీ పటిష్టమవుతున్నాయని రాష్ట్రపతి ముర్ముకు పంపిన సందేశంలో కింగ్ చార్లెస్ హర్షం వెలిబుచ్చారు. -
Republic Day 2024: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: దేశ సైనిక శక్తిని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చాటే 75వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ సిద్ధమైంది. కర్తవ్యపథ్‌లో గంటన్నరపాటు సాగే పరేడ్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సారథ్యం వహించనున్నారు. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ హాజరు కానున్నారు. పరేడ్‌లో క్షిపణులు, డ్రోన్జా మర్లు, నిఘా వ్యవస్థలు, సైనిక వాహనాలపై అమర్చిన మోర్టార్లు, పోరాట వాహనాలను ప్రదర్శించనున్నారు. మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళా అధికారులతో కూడిన త్రివిధ దళాల కంటింజెంట్ కవాతులో పాల్గొననుంది. గత ఏడాది ఆర్టిలరీ రెజిమెంట్‌లో విధుల్లో చేరిన 10 మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్లు దీప్తి రాణా, ప్రియాంక సెవ్దా సహా మొట్టమొదటిసారిగా స్వాతి వెపన్ లొకేటింగ్ అండ్ పినాక రాకెట్ సిస్టమ్‌కు సారథ్యం వహించనున్నారు. సంప్రదాయ మిలటరీ బ్యాండ్లకు బదులుగా ఈసారి భారతీయ సంగీత పరికరాలైన శంఖ, నాదస్వరం, నాగడ వంటి వాటితో 100 మంది మహిళా కళాకారుల బృందం పరేడ్‌లో పాల్గొననుంది. భారత వైమానిక దళానికి చెందిన 15 మంది మహిళా పైలట్లు వైమానిక విన్యాసాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే పరేడ్ 90 నిమిషాల పాటు కొనసాగనుంది. -
స్వయం పోషకత్వాన్ని దెబ్బతీసిన బ్రిటీష్ పాలన
మొగలుల సామ్రాజ్యం పతనమయ్యాక 1707 నుంచి ఆంగ్లేయుల రాక ప్రారంభమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం నెపంతో వచ్చి రాజకీయ పెత్తనం చెలాయించింది. తొలి స్వాతంత్య్ర సమరాన్ని(1857) అణచివేసిన తర్వాత 1858 నుంచి భారత ఉప ఖండం యావత్తూ పూర్తిగా బ్రిటిష్ వలస పాలనలోకి వెళ్లిపోయింది. 1947 వరకు సాగిన ఈ పరాయి దోపిడీ పాలనలో మన దేశ వ్యవసాయ రంగం అస్థవ్యస్థమైంది. బ్రిటీష్ వారు వచ్చే నాటికి భూమి ప్రైవేటు ఆస్తిగా లేదు. జమిందారీ, రైత్వారీ పద్ధతులను ప్రవేశపెట్టి రైతుల నుంచి పన్నులు వసూలు చేశారు. జనజీవనం కరువు కాటకాలతో చిన్నాభిన్నం అవుతూ ఉండేది. 1800 – 1900 మధ్య కాలంలో 4 దఫాలుగా విరుచుకు పడిన భీకర కరువుల వల్ల 2.14 లక్షల మంది చనిపోయారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి, గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడం కోసం 1880, 1898, 1901 సంవత్సరాలలో వరుసగా 3 కరువు కమిషన్లను నియమించారు. 1903లో నీటిపారుదల కమిషన్, 1915లో సహకార కమిటీలు చేసిన సిఫార్సులతో ఆయా రంగాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 1920 నాటికి భూమి వ్యక్తిగత ఆస్తిగా మారింది. భారతదేశ వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల అధ్యయనానికి 1926లో ‘రాయల్ కమిషన్’ ఏర్పాటైంది. ‘దేశానికి ఆహార విధానం అంటూ ఏదీ లేదు. అంతేకాదు, అలాంటిదొకటి అవసరమనే స్పృహ కూడా అప్పటికి లేద’ని అప్పటి భారత ఉప ఖండం స్థితిగతులపై రాయల్ కమిషన్ వ్యాఖ్యానించింది. 1928లో నివేదిక సమర్పించే నాటికి.. మొత్తం జనాభాలో పట్టణ జనాభా దాదాపు 11 శాతం మాత్రమే. కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. రోడ్లు, రవాణా సదుపాయాలు చాలా తక్కువ. చాలా గ్రామాలు స్వీయ సమృద్ధæయూనిట్లుగా పనిచేస్తూ, తమ అవసరాలన్నిటినీ ఉన్నంతలో తామే తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని కమిషన్ పేర్కొంది. భౌగోళికంగా ఇప్పటి మన దేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో కూడిన మొత్తం ‘బ్రిటిష్ ఇండియా’ ప్రాంతానికి సంబంధించి రాయల్ కమిషన్ నివేదించిన విషయాలివి. 8 కోట్ల ఎకరాలకు పైగా వరి.. 2.4 కోట్ల ఎకరాల్లో గోధుమ.. 3.3 కోట్ల ఎకరాల్లో జొన్న, సజ్జ తదితర చిరుధాన్యాలు.. 1.8 కోట్ల ఎకరాల్లో పత్తి, 1.4 కోట్ల ఎకరాల్లో నూనెగింజలు, 1.4 కోట్ల ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగవుతున్నాయని కమిషన్ పేర్కొంది. ‘పశువులకు ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ప్రాధాన్యత భారతదేశంలో ఉంది. పశువులు లేకుండా ఇక్కడ వ్యవసాయాన్ని ఊహించలేం. పాడి కోసం, ఎరువు కోసమే కాకుండా.. దుక్కికి, సరుకు రవాణాకు కూడా పశువులే ఆధారంగా నిలుస్తున్నాయి. 1924–25 నాటికి దేశంలో ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలు 15.1 కోట్లు, మేకలు, గొర్రెలు 6.25 కోట్లు, గుర్రాలు, గాడిదలు 32 లక్షలు, ఒంటెలు 5 లక్షలు ఉన్నాయని రాయల్ కమిషన్ తెలిపింది. భారతీయ వ్యవసాయ రంగం అభివృద్ధికి లార్డ్ కర్జన్ సారధ్యంలోని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కృషి శ్లాఘనీయమని రాయల్ కమిషన్ వ్యాఖ్యానించింది. 1903 జూన్ 4న బీహార్, దర్భాంగా జిల్లాలోని పూసలో జాతీయ వ్యవసాయ విద్య, పరిశోధనా స్థానం ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చారు. పూస ఎస్టేట్‌లో దేశీ పశు సంపదపై పరిశోధనా స్థానాన్ని కూడా పెట్టించారు. ఆ క్రమంలోనే భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా తొలి దశలో 1924కు ముందే 5 వ్యవసాయ కళాశాలలు ఏర్పాటయ్యాయి. పాడి, పంటలతో గ్రామం స్వయం పోషకత్వం కలిగి వుండేది. వ్యవసాయానికి ఉపాంగాలుగా వృత్తి పరిశ్రమలు వుండేవి. బ్రిటిష్ పారిశ్రామిక విప్లవం మన వృత్తులను దెబ్బతీసింది. బ్రిటన్‌లో పరిశ్రమల అభివృద్ధికి ముడిసరుకు కోసం ఇక్కడ వ్యాపార పంటలను ప్రోత్సహించారు. వ్యవసాయంతో పాటు కుటీర పరిశ్రమలను బ్రిటిష్ పాలకులు చావు దెబ్బతీశారు. దేశీ పత్తి పంట సాగు, కుటుంబ పరిశ్రమగా చేనేత వస్త్రాల తయారీలో భారతీయ గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాయి. మస్లిన్స్, కాలికోస్ వంటి మేలు రకాల వస్త్రాలను ప్రపం^è దేశాలకు ఎగుమతి చేసిన వెయ్యేళ్ల చరిత్ర మనది. అటువంటిది బ్రిటిష్ పాలనలో తల్లకిందులైంది. బ్రిటన్‌లో యంత్రాలకు పొడుగు పింజ అమెరికన్ పత్తి అవసరం. అందుకని, మన దేశంలో దేశీ పత్తికి బదులు అమెరికన్ రకాలను సాగు చేయించి, పత్తిని బ్రిటన్‌కు ఎగుమతి చేయటం.. అక్కడ యంత్రాలపై ఉత్పత్తి చేసిన వస్త్రాలను దిగుమతి చేసి మన దేశంలో అమ్మటం.. ఇదీ బ్రిటిష్ పాలకులు స్వార్థంతో చేసిన ఘనకార్యం. దీని వల్ల మన దేశీ పత్తి వంగడాలు మరుగునపడిపోయాయి. చేనేత పరిశ్రమ చావు దెబ్బ తిన్నది. ఆహార ధాన్యాలు పండించే పొలాలు కూడా అమెరికన్ పత్తి సాగు వైపు మళ్లాయి. 1928 తర్వాతి కాలంలో దేశం రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలతో పాటు వ్యవసాయం, నీటిపారుదల రంగాలు కూడా విస్తారమైన మార్పులకు గురయ్యాయి. 1757లో 16.5 కోట్లున్న దేశ జనాభా 1947 నాటికి 42 కోట్లకు పెరిగింది. పెరిగిన జనాభాకు తగినట్లుగా ఆహారోత్పత్తిని పెంచడానికి నీటిపారుదల సదుపాయాలను బ్రిటిష్ ప్రభుత్వం 8 రెట్లు పెంచింది. పంజాబ్, సిం«ద్ ప్రాంతాల్లో భారీ ఎత్తున నీటిపారుదల సదుపాయం కల్పించారు. అదేవిధంగా, కృష్ణా, గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసేందుకు సర్ ఆర్థర్ కాటన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్‌లను నిర్మించారు. 1920 తర్వాత పెద్దగా కరువు పరిస్థితుల్లేకపోవటంతో ఆహారోత్పత్తి కుదుటపడింది. అయినా, 1943లో 3 లక్షలకు పైగా బెంగాలీయులు ఆకలి చావులకు బలయ్యారు. ప్రకృతి కరుణించక కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విన్స్టన్ చర్చిల్ తీసుకున్న నిర్ణయాల వల్ల కృత్రిమ ఆహార కొరత ఏర్పడి ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. దీనికి మించిన విషాదం ఆధునిక భారతీయ చరిత్రలో మరొకటి లేదు. -
ఆకుపచ్చని అమృతం
మనదేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలకు మరొక సందర్భంగా నేటి ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ జతకూడింది. స్వాతంత్య్రానికి 75 ఏళ్లయితే, పర్యావరణ దినోత్సవ ఆలోచన ఆవిర్భావానికి ఇది 50వ సంవత్సరం. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా సంభవించిన వినాశనంతో మొత్తం ప్రపంచం తల్లడిల్లింది. ఈ విషాదాన్ని ఇంకా మరవకముందే రెండో ప్రపంచ యుద్ధం తీసుకొచ్చిన విపత్తు మరింత పెద్దది. అణ్వాయుధాల కారణంగా గాలి, నీరు, భూమి కాలుష్యమైన విషయం ఒక దశాబ్దం గడిస్తే కానీ ప్రపంచ దేశాలకు బోధపడలేదు. అలా మొదలైన అవగాహన, సమిష్టి కృషితో 1972 జూన్ 5న స్టాక్ హోమ్ లో ఒక పన్నెండు రోజులపాటు ‘యూ.ఎన్. కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్ మెంట్’ సదస్సు నడిచింది. ఈ సమావేశం మొదలైన జూన్ 5 వ తేదీన పర్యావరణ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం మొదలైంది! మొదలైంది మనదేశంలోనే! ఆలోచన లేదా ప్రతిపాదన... విశ్లేషణ లేదా సిద్ధాంత వివరణ... అటు తర్వాత ఆచరణ, అనువర్తన! అనంతరం.. తెలిసిన విషయాన్ని, అనుభవాన్ని మరింతమందికి, మరిన్ని ప్రాంతాలకు తీసుకుపోవడం! ఇది ఒక మనిషి మస్తిష్కం నుంచి బయలుదేరిన ఆలోచనా తరంగం ఎలా జనసంద్రంలో మమేకమవుతుందో చెబుతుంది. పర్యావరణ ఉద్యమశీలి, సంఘసేవకుడు సుందర్ లాల్ బహుగుణ (1927–2021) ప్రకృతి ప్రేమైక జీవనగమనాన్ని గమనిస్తే.. ఆ దంపతుల స్ఫూర్తికర్తల గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. బహుగుణ భార్య విమలకు మార్గదర్శి సరళాబెన్ (1901–1982) కాగా, బహుగుణకు మార్గనిర్దేశనం చేసింది మీరాబెన్ (1892–1982)! పరవళ్ళు తొక్కే గోదావరిని గమనించి, ఆ నది ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే త్రయంబకేశ్వరం వెళ్ళాలి. అలాగే సరళాబెన్, మీరాబెన్ కంటే ముందు తారసపడే మహనీయుడు జె సి కుమారప్ప (1892–1960). ఇంకొంచెం మూలాల్లోకి వెళితే తారసపడే పర్యావరణ వెలుగు.. గాంధీజీ! ఆలోచన గాంధీజీది కాగా, సిద్ధాంత వివరణను 1920 దశకంలో ఇచ్చింది ఆర్థిక శాస్త్రవేత్త జె సి కుమారప్ప. ఆచరణ, అనువర్తన దిశగా ఆలోచనను ప్రజల్లోకి తీసుకువెళ్ళినవాళ్ళు మీరాబెన్, సరళాబెన్ ద్వయం! ఈ క్రమంలో వారి కృషి, విజయాలు గమనిస్తే, మనదేశంలో రూపు దిద్దుకున్న ఆధునిక పర్యావరణ ఉద్యమం తొలిరూపు మన కళ్ళకు కడుతుంది. కనుకనే జె.సి.కుమారప్పను ‘గ్రీన్ గాంధియన్’ గా గౌరవిస్తే, మీరాబెన్ ను తొలి భారతదేశపు ‘ఎకో ఫెమినిస్ట్’ గా కొనియాడుతారు. ఇక సరళాబెన్ 1950, 60 దశాబ్దాలలో చండి ప్రసాద్ భట్, సుందర్ లాల్ బహుగుణ, విమలా బహుగుణ, రాధాభట్ వంటి ఎంతోమంది సామాజిక కార్యకర్తలను తీర్చిదిద్దారు. అంటే మనం చిప్కో ఉద్యమం పూర్వపు విషయాలు చెప్పుకుంటున్నామని గుర్తించాలి. అంటే ప్రపంచం గమనించకముందే పర్యావరణ సమస్య గుర్తించి రకరకాల ఆలోచనలు మొదలైంది మనదేశంలో! 1974 మార్చిలో మొదలైన చిప్కో ఉద్యమాన్ని.. ప్రపంచ దేశాలలో కూడా తొలి పర్యావరణ ఉద్యమంగా పరిగణిస్తారు. దీనికి నేపథ్యం ఏమిటో పరిశీలిస్తే భారతదేశపు పర్యావరణ త్రిమూర్తులనదగ్గ ముగ్గురు మహనీయుల ఉత్కృష్టమైన సేవ కనబడుతుంది. ఈ ముగ్గురూ క్రెస్తవులు కావడం ఒక విశేషం కాగా, అందులో మీరాబెన్, సరళాబెన్ ఇద్దరు ‘గాంధీజీ ఆంగ్లేయ కుమార్తెలు’గా గుర్తింపు పొందారు. జెసి కుమారప్ప అసలు పేరు జోసెఫ్ చెల్లాదురై కార్నోలియన్, మీరాబెన్ పేరు మ్యాడలిన్ స్లేడ్. సరళాబెన్ పూర్వపు పేరు క్యాథలిన్ మేరీ హెయిల్ మన్. గాంధీజీ ప్రతిపాదనలు అర్థిక స్థితిగతులు, ప్రజల బాగోగులు, పేదరికం, ఆకలి వంటి విషయాలు చర్చిస్తున్నపుడు గాంధీజీ ప్రకృతి వనరులు, వ్యవసాయం ప్రకృతిని రక్షించడం వంటి విషయాలు ప్రస్తావిస్తారు. అప్పటికి గాంధీజీ పర్యావరణం, ఎకాలజి, సస్టెయిన్ బుల్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ వంటి మాటలు వాడలేదు. నేటికి వందేళ్ళ క్రితం తనకు ఆర్థికశాస్త్రం అంత బాగా తెలియదు అంటూనే మనుషులుగా మన బాధ్యత ఏమిటి, ఇతర వ్యక్తులతో, ప్రకృతితో ఎలా నడుచుకోవాలో గాంధీజీ చాలా సందర్భాలలో చెప్పారు. గాంధీజీ ఆలోచనలను ఒక సిద్ధాంతంగా మనకు ఇచ్చిన దార్శనికుడు! ప్రపంచం ఇంకా కళ్ళు తెరుచుకోని సమయంలో పర్యావరణ భావనను గాంధీజీ, కుమారప్ప ప్రతిపాదిస్తే, ఆ భావనలను ఆచరించడమే కాక పరివ్యాప్తం చేసిన మహిళా ద్వయం మీరాబెన్, సరళాబెన్! భారతదేశపు స్వాతంత్య్రోద్యమం కేవలం రాజకీయ హక్కుల ఉద్యమం కాదు. గాంధీజీ భావనలో అది సమగ్ర అభ్యుదయ ఉద్యమం, అందులో ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, సహజవనరుల పొదుపు కూడా అంతర్భాగాలే! ఆ సమగ్ర స్ఫూర్తిని అందుకోలేకపోవడం మనదేశపు సామూహిక వైఫల్యం! పర్యావరణ ఉద్యమాలు మన నేల నుండి ఇతర దేశాలకు పాకాయి, స్ఫూర్తినిచ్చాయి. అంతకుమించి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వాదులంతా గాంధీజీ అహింసను ఆచరణాత్మకంగా విశ్వసిస్తారు. సంరక్షణ అహింసే కదా! – డా‘‘ నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
చైతన్య భారతి: ఇందిరాగాంధీ 1917–1984
ఇందిరాగాంధీ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధానమంత్రి. జనాకర్షకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, పాశ్చాత్య వ్యతిరేక విధానాల సమ్మేళనంతో పరిపాలన కొనసాగించారు. మధ్య తరగతి జీవితాలను సుస్థిరం చేయడానికి ఆమె ప్రవేశపెట్టిన చిన్న మొత్తాల పొదుపు పథకాలు, పన్ను మినహాయింపులు ఇప్పటికీ కొనసాగడమే కాదు, రాజకీయార్థిక కోణంలో వాటికున్న ఆకర్షణ ఎంతగానో పెరిగింది. బంగ్లాదేశ్ ఏర్పాటు ఆమె నాయకత్వ సామర్థ్యానికి ఒక మచ్చుతునకగా మిగిలిపోతుంది. ఆ ప్రాంతంలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో ఆమె యుద్ధం అనే సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారు. అలాగే, అమెరికా నాయకత్వానికి ఎదురొడ్డి నిలవడం, అంతరిక్ష పరిశోధన, శాస్త్ర పరిశోధన, సైన్యం వంటి రంగాలకు ఆమె ఇచ్చిన ఇతోధిక ప్రాధాన్యం దేశానికి బలమైన దిశా నిర్దేశం చేసింది. చాలామంది చెప్పినట్లు, ఇందిరా గాంధీ వ్యక్తిత్వంలో, విశ్వాసాలలో వైరుధ్యాలు బాగా కనిపిస్తాయి. ఆమెలోని వైరుధ్యాలు చాలా వరకు అత్యవసర పరిస్థితుల్లో వెలుగులోకి వచ్చాయి. స్వతంత్ర భారత దేశంలో ఏకైక అత్యవసర పరిస్థితిని విధించి, ప్రజాస్వామ్యయుతమైన హక్కులను కాలరాసిన ప్రధానిగా ఆమె ఎప్పటికీ గుర్తుండి పోతారు. అందుకు ఆమె పట్ల వ్యక్తమైన నిరసన కూడా ఎప్పటికీ భరతజాతికి గుర్తుండిపోతుంది. అయితే అత్యవసర పరిస్థితిని తొలగించి, ఎన్నికల బరిలోకి దిగాలని 1977లో ఆమె స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం, ‘ఇంతటితో ప్రజాస్వామ్యం సమాధి అయిపోయినట్లే’నని భావించిన నిపుణుల అంచనాలను తలకిందులు చేసింది. ఆమె లోని దేశభక్తిని, దేశం పట్ల ఆమెకున్న అంకిత భావాన్ని ఏ మాత్రం సందేహించాల్సిన పని లేదు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో సిక్కులను చేర్చుకోవడం మంచిది కాదని ఎందరో సూచించినా ఆమె దానిని లెక్క చేయలేదు. చివరికి ఆ కారణం వల్లే ఆమె మరణించారు. అలా ఆమె మరణం కూడా ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా వివరించింది. ఆమె సంక్లిష్ట సాహసిక నాయకురాలని చాటి చెప్పింది. – దీపేశ్ చక్రవర్తి , చికాగో యూనివర్సిటీలో చరిత్ర అధ్యయనాల ప్రొఫెసర్ -
సామ్రాజ్య భారతి 1861/1947.. స్వతంత్ర భారతి 1951/2022
సామ్రాజ్య భారతి 1861/1947 రవీంద్రనాథ్ టాగోర్, కాదంబిని గంగూలి, దేవకీ నందన్ ఖత్రీ, భికైజీ కామా, బాబా తాజుద్దీన్ నాగ్‌పురి జన్మించారు. టాగోర్ విశ్వకవి, నోబెల్ గ్రహీత. కాందబిని భారతదేశపు తొలినాళ్ల మహిళా డాక్టర్. దేవకీ నందన్ మార్మిక నవలల తొలి రచయిత. భిఖైజీ కామా స్వాతంత్య్ర సంగ్రామ ఉద్యమకారిణి. మేడమ్ కామా అని కూడా అంటారు. బాబా తాజుద్దీన్ ప్రసిద్ధ సాధువు. టాగోర్ కలకత్తాలో, కాందబిని భగల్పూర్ (బెంగాల్ ప్రెసిడెన్సీ)లో, దేవకీ నందన్ నమస్తిపుర్ (బిహార్)లో, మేడమ్ కామా నవ్సరీ (బాంబే ప్రెసిడెన్సీ)లో, బాబా తాజుద్దీన్ కంప్టీ (మహారాష్ట్ర)లో జన్మించారు. ఘట్టాలు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్–1861 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం భారతీయులకు శాసన నిర్మాణంలో పాల్పంచుకునే అవకాశం కల్పించింది. అంతకు నాలుగేళ్ల క్రితం 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా భారతదేశం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కిందకు వచ్చింది. (అంతకుముందు ఈస్టిండియా కంపెనీ పాలన ఉండేది). అందులో భాగంగా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన చట్టాలన్నిటినీ కౌన్సిల్ చట్టాలుగా పేర్కొన్నారు. భారతరాజ్య కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్ సభ్యుల పేరు మీద చట్టాలను రూపొందించడం వల్ల వాటిని కౌన్సిల్ చట్టాలుగా పరిగణించారు. అలహాబాద్‌లో గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజ్‌ని నెలకొల్పారు. ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ స్థాపన జరిగింది. చట్టాలు ఈ ఏడాదే.. ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్, ఇండియన్ హైకోర్ట్ యాక్ట్, పోలీస్ యాక్ట్, స్టేజ్–క్యారేజస్ యాక్ట్, ఫారిన్ లా అసెర్టెయిన్మెంట్ యాక్ట్, మేలీషియస్ డ్యామేజన్ యాక్ట్, విల్స్ యాక్ట్, డొమైసిల్ యాక్ట్.. అమల్లోకి వచ్చాయి. స్వతంత్ర భారతి 1951/2022 పంచవర్ష ప్రణాళికలు భారతదేశం రిపబ్లిక్‌గా మారిన రెండు నెలలకే ఉజ్వల భవితను అందుకోవడం కోసం ఐదేళ్లకోసారి ప్రణాళికను రూపొందిం చేందుకు ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పారు. అయితే 1960లో యుద్ధాలు, దుర్భిక్షాల వల్ల, 1970లలో యుద్ధం, ఆయిల్ సంక్షోభం వల్ల ప్రణాళికా లక్ష్యాలను పూర్తిగా సాధించలేక పోయాం. అయినప్పటికీ యోజనా భవన్ పెద్ద పెద్ద కలలు కనడం మానలేదు. 2014లో మోదీ ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, ఆ స్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టింది. -
మహోజ్వల భారతి: సాహితీ కుబేరుడు
కుబేర్నాథ్ రాయ్ హిందీ సాహితీవేత్త. సంస్కృత పండితులు. రచయిత. ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలోని మత్స గ్రామంలో భూమిహార్ కుటుంబంలో జన్మించారు. తండ్రి వకుంత్ నారాయణ్ రాయ్. కుబేర్నాథ్ తన ప్రాథమిక విద్యను మత్స గ్రామంలో అభ్యసించారు. వారణాసిలోని క్వీన్ కాలేజీలో మెట్రిక్యులేషన్ చదివారు. ఉన్నత చదువుల కోసం బనారస్ హిందూ యూనివర్సిటీలో చేరారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ చేశారు.. విద్యావేత్తగా ‘విక్రమ్ విశ్వవిద్యాలయ’ లో కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ కొంతకాలానికే ఇంగ్లిష్ లిటరేచర్ లెక్చరర్‌గా అస్సాంలోని నల్బరీకి మారారు. స్వామి సహజానంద మహావిద్యాలయ ప్రిన్సిపాల్‌గా పని చేశారు. భారతీయ జ్ఞానపీఠం నుంచి మూర్తిదేవి అవార్డు; యు.పి., పశ్చిమబెంగాల్, అస్సాం ప్రభుత్వాల నుంచి గౌరవ పురస్కారాలు పొందారు. 1933 మార్చి 26 న జన్మించిన కుబేర్నాథ్ 1996 జూన్ 5న మరణించారు. -
ఆపరేషన్ బ్లూ స్టార్
సిక్కుల పవిత్ర దేవాలయం స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరుతో జరిపిన సైనిక చర్యకు నేటికి 38 ఏళ్లు. గత కొన్నేళ్లుగా దేవాలయంపై దాడి జరిగిన రోజున కొంతమంది నినాదాలు చేయడం, ఘర్షణ జరగడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో సుమారు 4 దశాబ్దాలుగా స్వర్ణ మందిరం చుట్టుపక్కల పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరివేయడానికి నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1984లో సైనిక చర్యకు ఆదేశించారు. అయితే ఆపరేషన్ బ్లూ స్టార్ భారత దేశ చరిత్రలో ఒక రక్తసిక్త అధ్యాయంగా స్ధిరపడిపోయింది. ఈ ఆపరేషన్ లోనే వందలాది మంది చనిపోగా, అనంతరం ప్రతీకారంగా జరిగిన ఇందిర హత్య, పర్యవసానంగా జరిగిన మూకుమ్మడి హత్యాకాండలలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. సిక్కు అంగరక్షకుల చేతిలో ఆనాడు ఇందిరా గాంధీ మరణించారు. మరోవైపు స్వర్ణదేశాలయంపై మిలటరీ దళాలు చేసిన ఆపరేషన్ లో బ్రిటిష్ సైన్యం పాత్ర కూడా ఉందని బ్రిటిష్ సిక్కు కమ్యూనిటీ నమ్ముతోంది. ఆపరేషన్ బ్లూ స్టార్ లో బ్రిటిష్ సైన్యం పాత్రపై యూకే విదేశీ కార్యాలయంలో ఉన్న పత్రాలు మాయమయ్యాయని కూడా అక్కడి బ్రిటిష్ సిక్కు మతస్తులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ లో ఇండియాకు నాటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ పాలకవర్గం సహకరించిందని, బ్రిటిష్ ఆర్మీకి చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ సోల్జర్స్.. ఆపరేషన్ బ్లూస్టార్ లో పాల్గొన్నారని బ్రిటన్‌లోని సిక్కులు బలంగా విశ్వసిస్తున్నారు. -
శతమానం భారతి: లక్ష్యం 2047.. బ్యాంకింగ్
స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్లకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం–1949 వచ్చింది. ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం, డిపాజిటర్లు అడిగిన వెంటనే నగదు చెల్లింపులు చేయడం బ్యాంకుల బాధ్యత అని ఆ చట్టం నిర్దేశించింది. ఇప్పటి బ్యాంకులు అంతకు మించే చేస్తున్నాయి. ఒక్కో ఏటీఎం ఒక్కో బ్యాంకులా మారిపోయింది. స్వాతంత్య్రానంతరం.. ముఖ్యంగా ఈ ఇరవై, ఇరవై ఐదేళ్లలో భారతీయ బ్యాంకింగ్ రంగం సాధించిన ప్రగతి, పురోగతి ఇది. కస్టమర్ల సౌకర్యమే బ్యాంకుల ధర్మం అయింది. ఇదంతా వ్యక్తిగత స్థాయిలో మౌలికంగా. మరి దేశ స్థాయిలో? అంటే.. దేశంలోని మిగతారంగాలను ప్రభావితం చేసే స్థాయిలో? బ్యాంకింగ్ రంగంలోని అనేక మార్పులు, పరిణామాలు ఆర్థిక రంగాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుస్తూ వస్తున్నాయి. 1969లో నాడు దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ 14 బ్యాంకుల్ని జాతీయం చేశారు. తర్వాత పి.వి.నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో జరిగిన ఆర్థిక సంస్కరణలు బ్యాంకింగ్ రంగ స్వరూపాన్నే మార్చేశాయి. ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీ కరణం అనేవి బ్యాంకింగ్ పరిశ్రమకు అపరిమితమైన ప్రాధాన్యం చేకూర్చాయి. ఇక వచ్చే ఇరవై ఐదేళ్లలో లక్ష్యంగా పెట్టుకున్న కొన్ని అంశాలు నూరేళ్ల భారతావని ప్రతిష్టను మరింతగా పెంచేవే. కొత్త పరిశ్రమలు, వ్యాపారాలను ప్రారంభించే వ్యవస్థాపకులను బ్యాంకులు ప్రోత్సహించి, ఉపాథి కల్పనకు ఊతం ఇవ్వబోతు న్నాయి. ప్రధాని కార్యాలయ పర్యవేక్షణలో జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రాధికార సంస్థను.. ప్రభాత్ కుమార్ కమిటీ సూచన మేరకు.. ప్రభుత్వం నెలకొల్పబోతోంది. -
భారత్@75: స్వతంత్ర భారతం.. గణతంత్ర రాజ్యావిర్భావం
స్వతంత్ర భారతి 1950/2022 భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా, 1950 జనవరి 26 న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దేశం స్వతంత్రమైన సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం ఒక మహోత్తేజకరమైన అభిభాషణ కాగా, మరో మూడేళ్లకు 1950 జనవరి 26 వ తేదీన భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక రాజ్యంగా ఆవిష్కరణ జరిగిన సందర్భంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేసిన ప్రసంగం ఇంతకింతగా జాతి అంతటినీ ఊర్రూతలూగించినదే. అచంచల విశ్వాసంతో, సత్యంతో, అహింసామార్గంలో ఈ సర్వసత్తాక, స్వతంత్ర రాజ్య నిర్వహణను మనం ప్రారంభిద్దాం.. అంటూ సార్వభౌమ, సర్వసత్తాక, ప్రజాస్వామిక రాజ్యంగా భారతదేశ రాజ్యాంగంపై అధికార ముద్ర వేయడానికి ముందు ఆయన చేసిన అభిభాషణ జాతికి స్ఫూర్తిదాయకమైనది. ఆనాటి మహోజ్వల ఘడియలు ఏటా జనవరి 26 వ తేదీన పథనిర్దేశకమైన క్షణాలుగా ఈనాటికీ రిపబ్లిక్ పరేడ్‌గా కళ్లకు కడుతూనే ఉన్నాయి. నూతనమైన అశోక చిహ్నాన్ని ధరించిన అశ్విక రథాన్ని అధిరోహించి, రాజేంద్ర ప్రసాద్ ఐదు మైళ్ల దూరం ప్రయాణించి నేషనల్ స్టేడియం చేరుకున్నారు. చూడముచ్చటైన కవాతుతో సైనికులిచ్చిన వందనాన్ని స్వీకరించి, మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నాటికీ నేటికీ వేదిక మారి ఉండవచ్చు. కానీ జనవరి 26న జరిగే కవాతు ఈ రోజుకూ జాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే సందర్భం. జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రకమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకే సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు. -
గూగుల్ ప్రత్యేక డూడుల్
దేశ గణతంత్ర దినాన్ని పురస్కరించుకొని గూ గుల్ బుధవారం ప్రత్యేక డూడుల్‌ను ప్రదర్శించింది. ఏనుగులు, గుర్రాలు, సాక్సాఫోన్, తబ లా, పావురాలు, మూడురంగులతో ఈ డూ డుల్ను తీర్చిదిద్దింది. స్వతంత్ర గణతంత్రంగా భారత్ విజయవంతమైన మరో ఏడాది పూర్తి చేసుకుందని గూగుల్ శుభాకాంక్షలు తెలిపింది. -
మసీద్ నిర్మాణంలో వెల్లివిరిసిన మత సామరస్యం
అయోధ్య: గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒకపక్క ఘనంగా జరుగుతున్న తరుణంలో అయోధ్యలో నూతన మసీదు నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అయోధ్య సమీపంలోని ధనిపూర్ గ్రామంలో మసీదు ప్రాజెక్టు పనులను లాంఛనంగా ఆరంభించారు. 2019 సుప్రీం కోర్టు తీర్పుననుసరించి సున్నీ వక్ఫ్ బోర్డు మసీదు ట్రస్టును ఏర్పాటు చేసిన ఆరునెలలకు ప్రాజెక్టు పనులు ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్ జుఫర్ అహ్మద్ ఫరూఖీ జాతీయ పతాకం ఎగురవేశారు. ట్రస్టులోని ఇతర సభ్యులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి అన్ని మతాలకు చెందిన ప్రజలు హాజరై హర్షం ప్రకటించారు. గ్రామంలోని ఒక సూఫీ ప్రార్ధనా స్థలం పక్కన ఐదు ఎకరాలను మసీదు కోసం కేటాయించిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం సందర్భంగా ముగ్గురు హిందువులు మసీదుకు విరాళాలు ప్రకటించారు. వీరిలో ఆర్ఎస్ఎస్ నాయకుడు అనిల్ సింగ్ కూడా ఉన్నారు. గతేడాది మసీదు ప్రాజెక్టు కోసం తొలి విరాళాన్ని లక్నో విశ్వవిద్యాలయానికి చెందిన రోహిత్ శ్రీవాస్తవ ఇచ్చారు. అయోధ్యలో రామ జన్మభూమి ఆలయ నిర్మాణంతో పాటు ఇక్కడ మసీదు నిర్మించడాన్ని హిందువుల్లో ఎక్కువమంది సమర్ధిస్తారని ఈ సందర్భంగా అనిల్ సింగ్ తెలిపారు. -
వారధి ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ సంబరాలు
వాషింగ్టన్ : అమెరికాలోని మేరీలాండ్ ఎల్లికాట్ సిటీలో వారధి ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.కివానిస్ వల్లాస్ హాల్లో 400 మంది సమక్షంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలోని ప్రతి చిన్న ఘట్టాన్ని వారధి సభ్యులు అత్యంత శ్రద్ధతో నిర్వహించారు. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను ముందు తరాలకు అందచేసే విధంగా ప్రతి కార్యక్రమాన్ని తీర్చి దిద్దటం జరిగింది. మంత్రోచ్చారణతో కూడిన జ్యోతి ప్రజ్వలన, అనంతరం మన సంక్రాంతి సంప్రదాయాలతో ముగ్గుల పోటీలను నిర్వహించగా మహిళలు అంత్యంత ఉత్సాహం తో పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారధి ప్రెసిడెంట్ పుష్యమి దువ్వూరి, శ్రీధర్ కమ్మదనం, వెంకట్ గాలి, అశోక్ అన్మల్శెట్టి, మారుతి కంభంపతి, సురేష్ బొల్లి, జెరల్ సెక్రటరీ సుమా ద్రోణం, చైర్మన్ కిరణ్ కదాలి తదితరులు పాల్గొన్నారు. -
చికాగొలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
చికాగొ : అమెరికాలోని చికాగొలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్సులేట్ జనరల్ సుదాకర్ దలేలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశభక్తిని పెంపొందించే గీతాలు, డాన్పులతో పలువురు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు యూఎస్ ప్రతినిధులు, నగర అధికారులు , సుమారు 250 మంది భారతీయ పౌరులు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యాశాఖ శకటానికి ప్రథమ బహుమతి
సాక్షి, విజయవాడ: 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనం జరిగాయి. ఆదివారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డీజీపీ గౌతమ్ సవాంగ్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. (ఏపీ సచివాలయంలో గణతంత్ర వేడుకలు) గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా... రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ రంగాలపై 14 శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయ, గృహ నిర్మాణ, జల వనరులు, ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, మద్యనిషేధ మరియు అబ్కారీ, సమగ్ర శిక్షా-విద్యా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పశు సంవర్థక, మత్స్య, అటవీ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, పర్యాటక, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శటకాలను ప్రదర్శించారు. వీటిలో పాఠశాల విద్యాశాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. మహిళాభివృద్ధి-శిశు సంక్షేమశాఖ, దిశాచట్ట శకటానికి రెండో బహుమతి లభించింది. వ్యవసాయశాఖ శకటానికి మూడో బహుమతి దక్కింది. విశాఖలో రిపబ్లిక్ డే వేడుకలు విశాఖ పోలీస్ బ్యారక్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి
కోహెడ(హుస్నాబాద్): కోహెడలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుం ది. బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లికి చెందిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లికి చెందిన గొట్టే చంద్రయ్య(42) 20 సంవత్సరాల క్రితం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో అవుట్సోర్సింగ్ ద్వారా విధుల్లో చేరాడు. బస్వాపూర్ చెక్ పోస్టులో సై తం సెక్యూరిటీగార్డుగా విధులు నిర్వహించారు. కోహె డ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు అనంతరం కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కోహెడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట శుక్రవారం గణతంత్ర వేడుకలకు జాతీయ జెండా ఏర్పాటు చేస్తున్నాడు. జెండా కోసం సిద్ధం చేసిన ఇనుమ పైపు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో విద్యుత్‌షాక్‌కు గురై చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం కోసం కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు. రూ.5 లక్షలు విద్యుత్ శాఖ ద్వారా, మరో రూ.5 లక్షలు వ్యవసాయ మార్కెట్ శాఖ నిధుల నుంచి బాధిత కుటుంబానికి అందే విధంగా కృషి చేస్తామన్నారు. మూడు ఎకరాల ప్రభుత్వ భూమి పంపిణీ చేయాలని ఆర్డీఓ శంకర్‌కుమార్‌ను కోరారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. ఎస్ఐ చాంద తిరుపతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి నాగేశ్వర్‌శర్మ, పెర్యాల రవీందర్రావు, దేవేందర్‌రావు, ఎంపీపీ ఉప్పుల స్వామి, జెడ్పీటీసీ సభ్యుడు పొన్నాల లక్ష్మయ్య, కోహెడ పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు కర్ర శ్రీహరి, తైదాల రవి, వైస్ చైర్మన్లు కోల్ల రాంరెడ్డి, తోట ఆంజనేయులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. -
‘ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగడతాం’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని కోర్టుల ప్రమేయం లేకుండా అరెస్టు చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసే వారిపైనా చర్యలు తీసుకోబోతున్నారని, ‘పరుష పదజాలం’ అంటే కొలమానమేంటని ప్రశ్నించారు. రాజకీయ కక్షతో తీసుకునే నిర్ణయాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. శుక్రవారం టీజేఏసీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలు మారకుండా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేవని, ఫిబ్రవరిలో పార్టీపై ప్రకటన చేస్తామన్నారు. -
త్వరలో విద్యుత్ వాహనాల ప్రణాళిక!
సాక్షి, హైదరాబాద్: ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనకు త్వరలో ప్రభుత్వం విద్యుత్ వాహనాల ప్రణాళికను తీసుకురానుందని రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యుత్ సౌధలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. విద్యుత్ వాహనాల చార్జింగ్ ఏజెన్సీలతో పాటు రిటైల్ ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన విద్యుత్‌ను విక్రయించేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్ సరఫరా కోసం రిటైల్ టారిఫ్ పట్టికలో కేటగిరీని ఏర్పాటు చేశామన్నారు. -
అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, మండలిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభలో స్పీకర్ మధుసూదనాచారి, మండలిలో చైర్మన్ స్వామిగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనసభా కార్యదర్శి నరసింహాచార్యులు, శాసనసభ సచివాలయ ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర వేడుకలు జరిపారు. -
గణతంత్ర వేడుకలో ఉద్రిక్తత
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో గణతంత్ర వేడుకల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలోని చారిత్రాత్మక ఖిల్లాలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా అధికారులు ఓ వర్గానికి శకటాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వ డం.. అందులో సదరు వర్గానికి చెందిన యువకులు చేసిన నినాదాలు మరో వర్గాన్ని రెచ్చగొట్టినట్లు ఉండడంతో వివాదానికి దారితీసింది. ప్రజాప్రతినిధుల సమక్షంలోనే తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరో పిస్తూ మరో వర్గం యువకులు ఆందోళనకు దిగారు. అన్నివర్గాల ప్రజలు పాల్గొనే జాతీయ పండుగ వేడుకలో ఒక వర్గానికి అనుమతి ఇచ్చిన అధికారులు.. తమకూ అనుమతి ఇవ్వాలంటూ ఆ వర్గానికి చెందిన యువకులు జెండాలతో ఖిల్లాలోకి ప్రవేశించేందుకు ప్రయ త్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి కొంత అత్యుత్సాహం ప్రదర్శించడం.. అదే సమయంలో శకటాల ప్రదర్శన నిర్వహించిన యువకులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. స్పందనగా మరోవర్గ యువకులూ పరస్పర నినాదాలతో ఖిల్లా ప్రాంగణంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో శకటాల ప్రదర్శన నిర్వహించిన యువకుల తోపాటు, ఆందోళనకు దిగిన మరోవర్గ యువకులనూ పోలీసులు ఖిల్లా నుంచి బయటికి పంపించేశారు. ఖిల్లా బయట ధర్నాకు దిగిన ఆందోళనకారులు ప్రభుత్వా నికి, అధికారులకు వ్యతి రేకంగా నినాదాలు చేశారు. చివరకు ఎస్పీ అనంతశర్మ వచ్చి ముందుగా వ్యతిరేక నినా దాలు చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నిష్క్రమించిన ప్రజాప్రతినిధులు..! శకటాల ప్రదర్శన జరిగిన వెంటనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వేడుకల మధ్యలో నుంచే వెళ్లిపోయారు. స్థానిక ఎస్సారెస్పీ అతిథిగృహంలో జిల్లా అభివృద్ధిపై విలేకరుల తో మాట్లాడారు. ఈ సందర్భంగా గొడవకు కారణమైన బాధ్యులపై పీడీ యాక్ట్ పెట్టాలని ఎంపీ కవిత అధికారులను ఆదేశించినట్లు టీఆర్ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ సంజయ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. దీనిSపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్రంగా స్పందిం చారు. ‘ఇది ప్రజాసామ్య దేశం.. ఓ వర్గానికి శకటాల ప్రదర్శనకు అను మతి ఎలా ఇచ్చా రు? అనుమతి ఇస్తే రెండు వర్గాలకు ఇవ్వండి. లేకుంటే ఎవరికీ ఇవ్వొద్దు’ అంటూ కలెక్టర్ శరత్, ఎస్పీ అనంతశర్మలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ.. వేడుకల మధ్యలో నుంచి ఆయన కాలినడక ద్వారా తన ఇంటికి (3 కి.మీ) చేరుకున్నారు. -
అగ్రస్థానంలో ‘అనంత’
– జిల్లాను సమష్టిగా అభివృద్ధి చేసుకుందాం – సంక్షేమాన్ని పేదల దరి చేర్చుదాం -హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం – గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ పిలుపు అనంతపురం అర్బన్ : జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సమష్టిగా, త్రికరణ శుద్ధితో కృషి చేద్దామని కలెక్టర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. సంక్షేమాభివృద్ధిని పేదల దరిచేర్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. గురువారం అనంతపురంలోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన 68వ గణతంత్ర వేడుకలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సందేశాన్ని వినిపించారు. ప్రభుత్వం నిర్దేశించిన రెండంకెల వృద్ధి రేటును సాధించామన్నారు. ఈ ఏడాదిలో జిల్లా స్థూల ఉత్పత్తిలో 19.23 శాతం పెరుగుదల రేటును సాధించడానికి చర్యలు చేపట్టామన్నారు. వర్షాభావంతో నష్టపోయిన జిల్లా రైతులను ఆదుకునేందుకు రూ.2,161 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని ఇటీవల కేంద్ర కరువు బృందాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. హంద్రీ–నీవా నీటితో రిజర్వాయర్లు, చెరువులను నింపడం ద్వారా కరువు శాశ్వత నివారణకు, వాతావరణ బీమా, ఇన్పుట్ సబ్సిడీలతో పంట నష్టపోయిన రైతులను తాత్కాలికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా రూ.367.80 కోట్ల వాతావరణ బీమా పరిహారాన్ని ప్రకటించిందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.29.46 కోట్ల విలువైన 6,489 వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను రైతులకు సబ్సిడీపై పంపిణీ చేశామన్నారు. పశుగ్రాసం కొరతను గట్టెక్కేందుకు ఐదు వేల ఎకరాల్లో సామూహిక గ్రాసం పెంపకానికి చర్యలు చేపట్టామన్నారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి సబ్సిడీలను మంజూరు చేయడంతో పాటు, జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ ఏడాది 35 వేల హెక్టార్లలో బిందు, తుంపర సేద్యపు పరికరాలను అమర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు.అలాగే మల్బరీ సాగుపైనా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్ఎల్సీ) ఆధునికీకరణకు రూ.458 కోట్లతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటి వరకు రూ.240 కోట్లు ఖర్చు చేశామన్నారు. హెచ్ఎల్సీ ద్వారా పీఏబీఆర్ కుడికాలువ కింద 36 చెరువులకు, 45 చెక్ డ్యాంలకు, మిడ్ పెన్నార్ దక్షిణ కాలువ కింద 14 చెరువులకు, 15 చెక్‌డ్యాంలకు నీటిని ఇచ్చామన్నారు. 31,813 ఎకరాల ఆయకట్టుకూ అందించామన్నారు. హంద్రీ–నీవా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. దీని ద్వారా జిల్లా రైతులకు గరిష్టంగా నీటిని అందించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. హంద్రీ–నీవా ద్వారా ఈ ఏడాది 19 టీఎంసీల నీటిని జిల్లాకు ఇచ్చారన్నారు. ఇందులో 12.50 టీంఎసీలను పీఏబీఆర్‌కు ఇచ్చామన్నారు. మొదటి దశ, రెండో దశ కాలువల ద్వారా 37 చెరువులను, 72 చెక్‌డ్యాంలను నింపామన్నారు. జిల్లాను శాశ్వత కరువు రహితంగా మార్చేందుకు బీటీ ప్రాజెక్టు, పేరూరు జలాశయాల తొలిదశ పనులకు రూ.6,554 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని సీఎం ప్రకటించారన్నారు. నీరు–ప్రగతి, నీరు–చెట్టు పథకాల ద్వారా రూ.300 కోట్లతో 4,402 చిన్ననీటి వనరులు, 91 గొలుసుకట్టు చెరువులు తదితర వాటిని పునరుద్ధరించామన్నారు. జిల్లాను హరిత అనంతగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కొత్తగా 99,954 తెల్ల రేషన్ కార్డులను పేదలకు మంజూరు చేశామన్నారు. జిల్లాను బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించే లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. రూ.167 కోట్లతో 382 కిలోమీటర్ల పొడవునా రహదారులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అమృత్ పథకం కింద మంచినీటి సరఫరా, పార్కుల అభివృద్ధికి రూ.30 కోట్లతో పనులు చేపట్టామన్నారు. -
నిఘా నేత్రం మరిచారు!
సాక్షి, విజయవాడ బ్యూరో: నూతన రాజధాని ప్రాంతంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గణతంత్ర వేడుకల్లో సరైన నిఘా లేకపోవటం కలవరపాటుకు గురి చేస్తోంది. రాజకీయ రాజధానిగా ఖ్యాతి గడించిన విజయవాడలో ఈ వేడుకలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టినా సీసీ కెమెరాల ఏర్పాటుపై శ్రద్ధ చూపలేదు. సమయం చాలనందున ఏర్పాటు చేయలేకపోయామని, కట్టుదిట్టమైన నిఘా ఉం టుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ ఆదివారం రాత్రికే విజయవాడ చేరుకోనున్నారు. సోమవారం ఉదయం 7.15 గంటలకు ప్రారంభమ య్యే ఈ వేడుకలు దాదాపు రెండు గంటలకుపైగా కొనసాగనున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు, వెయ్యి మందికిపైగా అతి ముఖ్యమైన అతిథులు, 600 మంది ముఖ్య అతిథులు హాజరుకానున్నారు. మరో 1500 మంది అతిథులు స్టేడియం లోపల ఆశీనులవుతారు. సుమారు 15వేల మందికిపైగా విద్యార్థులు, ప్రజలను స్టేడియం గ్యాలరీలోకి అనమతించనున్నారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమంలో స్టేడియం ఆవరణలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. శనివారం నుంచి స్టేడియం ఆవరణలో అక్కడక్కడ వీటిని ఏర్పాటు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లతోపాటు బెంజి సర్కిల్, రమేష్ హాస్పిటల్, రామవరప్పాడు తదితర జంక్షన్లలో సీసీ కెమెరాలున్నా.. అవి ఎంత వరకు పనిచేస్తున్నాయన్నది అనుమానమే. భారీగా పోలీసుల మోహరింపు.. గణతంత్ర వేడుల సందర్భంగా మున్సిపల్ స్టేడియం వెలుపల ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు మోహరించారు. స్టేడియంలో శని వారం ఫుల్ డ్రెస్డ్ రిహార్సల్స్‌ను పరిశీలించిన డీజీపీ జేవీ రాముడు సంతృప్తి వ్యక్తంచేశారు. డీజీపీ నేతృత్వంలో నలుగురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. 14 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, వంద మంది ఎస్సైలు, 150 మంది ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్స్, వెయ్యి మందికిపైగా కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధుల్లో నిమగ్నమయ్యారు. -
శివాజీ పార్కులోనే గణతంత్ర వేడుకలు
సాక్షి, ముంబై: ఈ ఏడాది గణతంత్ర వేడుకలు దాదర్‌లోని శివాజీపార్క్ మైదానంలోనే జరుగుతాయని మంత్రాలయ వర్గాలు స్పష్టం చేశాయి. ఇకపై ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వేడుకలు శివాజీ పార్క్‌లోనే జరుగుతాయని వెల్లడించాయి. గతంలో పరిపాలన విభాగానికి సంబంధించిన వివిధ వేడుకలు ఇదే మైదానంలోనే నిర్వహించేవారు. గత సంవత్సరం ప్రభుత్వ వేడుకలు మెరైన్ డ్రైవ్ (క్వీన్ నెక్లెస్) ప్రాంతంలో నిర్వహించారు. ఈ కారణంగా మెరైన్ డ్రైవ్ మొదలుకుని చర్నీరోడ్ చౌపాటి వరకు ఒక వైపు రోడ్డును పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ రహదారి సీసీ రోడ్డు కావడంతో గుర్రాలపై విన్యాసాలు ప్రదర్శించేందుకు కూడా ఇబ్బంది ఏర్పడింది. మెరైన్ డ్రైవ్ ప్రాంతం నగరంలో ఒక మూలకు ఉంది. దీంతో గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రదర్శించే యుద్ధ ట్యాంకర్లు, మిసైల్ వాహకాలను అక్కడికి తరలించాలంచటం సైనిక దళాలకు ఎంతో శ్రమతో కూడిన పని. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రభుత్వ వేడుకలన్నీ శివాజీపార్క్ మైదానంలోనే నిర్వహించాలని హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ గణతంత్ర వేడుకలకు శివాజీపార్క్ మైదానం సిద్ధమైంది. కేంద్ర, రాష్ట్రానికి చెందిన 52 దళాలు కవాతులో పాల్గొననున్నాయి. వివిధ సందేశాత్మక దృశ్యాలతో ఎనిమిది శకటాలు పాల్గొననున్నాయి. భారత త్రివిధ దళాలకు చెందిన దాదాపు మూడు వేల మంది సైనికులు కవాతులో కదం తొక్కనున్నారు. దాదాపు 1,400 మంది వీఐపీలకు ఆహ్వానం పంపించారు. మూడు వేల మంది సాధారణ పౌరులకు పాస్‌లు పంపించారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవుతారు. సోమవారం ఉదయం 9.15 గంటలకు గవర్నర్ విద్యాసాగర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అది పూర్తికాగానే ప్రత్యేక వాహనం పైనుంచి పోలీసులు, సైన్యం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఆ తరువాత సైనిక కవాతు ప్రారంభమవుతుంది. ఈ సందర్బంగా అగ్నిమాపక శాఖలోకి కొత్తగా వచ్చిన రెండు అత్యాధునిక శకటాలను ప్రదర్శిస్తారు. ఉదయం 10.20 గంటలకు గణతంత్ర వేడుకలు పూర్తవుతాయని హోం శాఖ వర్గాలు తెలిపాయి.