సామ్రాజ్య భారతి 1861/1947
రవీంద్రనాథ్ టాగోర్, కాదంబిని గంగూలి, దేవకీ నందన్ ఖత్రీ, భికైజీ కామా, బాబా తాజుద్దీన్ నాగ్‌పురి జన్మించారు. టాగోర్ విశ్వకవి, నోబెల్ గ్రహీత. కాందబిని భారతదేశపు తొలినాళ్ల మహిళా డాక్టర్. దేవకీ నందన్ మార్మిక నవలల తొలి రచయిత. భిఖైజీ కామా స్వాతంత్య్ర సంగ్రామ ఉద్యమకారిణి. మేడమ్ కామా అని కూడా అంటారు. బాబా తాజుద్దీన్ ప్రసిద్ధ సాధువు. టాగోర్ కలకత్తాలో, కాందబిని భగల్పూర్ (బెంగాల్ ప్రెసిడెన్సీ)లో, దేవకీ నందన్ నమస్తిపుర్ (బిహార్)లో, మేడమ్ కామా నవ్‌సరీ (బాంబే ప్రెసిడెన్సీ)లో, బాబా తాజుద్దీన్ కంప్టీ (మహారాష్ట్ర)లో జన్మించారు.
ఘట్టాలు
ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్–1861 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం భారతీయులకు శాసన నిర్మాణంలో పాల్పంచుకునే అవకాశం కల్పించింది. అంతకు నాలుగేళ్ల క్రితం 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా భారతదేశం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కిందకు వచ్చింది. (అంతకుముందు ఈస్టిండియా కంపెనీ పాలన ఉండేది). అందులో భాగంగా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన చట్టాలన్నిటినీ కౌన్సిల్ చట్టాలుగా పేర్కొన్నారు. భారతరాజ్య కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్ సభ్యుల పేరు మీద చట్టాలను రూపొందించడం వల్ల వాటిని కౌన్సిల్ చట్టాలుగా పరిగణించారు.
అలహాబాద్‌లో గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజ్‌ని నెలకొల్పారు. ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్ స్థాపన జరిగింది.
చట్టాలు
ఈ ఏడాదే.. ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్, ఇండియన్ హైకోర్ట్ యాక్ట్, పోలీస్ యాక్ట్, స్టేజ్–క్యారేజస్ యాక్ట్, ఫారిన్ లా అసెర్టెయిన్‌మెంట్ యాక్ట్, మేలీషియస్ డ్యామేజన్ యాక్ట్, విల్స్ యాక్ట్, డొమైసిల్ యాక్ట్.. అమల్లోకి వచ్చాయి.
స్వతంత్ర భారతి 1951/2022
పంచవర్ష ప్రణాళికలు
భారతదేశం రిపబ్లిక్‌గా మారిన రెండు నెలలకే ఉజ్వల భవితను అందుకోవడం కోసం ఐదేళ్లకోసారి ప్రణాళికను రూపొందిం చేందుకు ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పారు. అయితే 1960లో యుద్ధాలు, దుర్భిక్షాల వల్ల, 1970లలో యుద్ధం, ఆయిల్ సంక్షోభం వల్ల ప్రణాళికా లక్ష్యాలను పూర్తిగా సాధించలేక పోయాం. అయినప్పటికీ యోజనా భవన్ పెద్ద పెద్ద కలలు కనడం మానలేదు. 2014లో మోదీ ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, ఆ స్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment