కుబేర్‌నాథ్ రాయ్ హిందీ సాహితీవేత్త. సంస్కృత పండితులు. రచయిత. ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలోని మత్స గ్రామంలో భూమిహార్ కుటుంబంలో జన్మించారు. తండ్రి వకుంత్ నారాయణ్ రాయ్. కుబేర్‌నాథ్ తన ప్రాథమిక విద్యను మత్స గ్రామంలో అభ్యసించారు. వారణాసిలోని క్వీన్ కాలేజీలో మెట్రిక్యులేషన్ చదివారు. ఉన్నత చదువుల కోసం బనారస్ హిందూ యూనివర్సిటీలో చేరారు.
కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ చేశారు.. విద్యావేత్తగా ‘విక్రమ్ విశ్వవిద్యాలయ’ లో కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ కొంతకాలానికే ఇంగ్లిష్ లిటరేచర్ లెక్చరర్‌గా అస్సాంలోని నల్బరీకి మారారు. స్వామి సహజానంద మహావిద్యాలయ ప్రిన్సిపాల్‌గా పని చేశారు. భారతీయ జ్ఞానపీఠం నుంచి మూర్తిదేవి అవార్డు; యు.పి., పశ్చిమబెంగాల్, అస్సాం ప్రభుత్వాల నుంచి గౌరవ పురస్కారాలు పొందారు. 1933 మార్చి 26 న జన్మించిన కుబేర్‌నాథ్ 1996 జూన్ 5న మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment