![Republic Day 2020: Governor Biswabhusan Harichandan hoists national flag At Vijayawada - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/26/Republic-Day-2020.jpg.webp?itok=NVlRyEg0)
సాక్షి, విజయవాడ: 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనం జరిగాయి. ఆదివారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డీజీపీ గౌతమ్ సవాంగ్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. (ఏపీ సచివాలయంలో గణతంత్ర వేడుకలు)
గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా... రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ రంగాలపై 14 శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయ, గృహ నిర్మాణ, జల వనరులు, ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, మద్యనిషేధ మరియు అబ్కారీ, సమగ్ర శిక్షా-విద్యా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పశు సంవర్థక, మత్స్య, అటవీ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, పర్యాటక, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శటకాలను ప‍్రదర్శించారు. వీటిలో పాఠశాల విద్యాశాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. మహిళాభివృద్ధి-శిశు సంక్షేమశాఖ, దిశాచట్ట శకటానికి రెండో బహుమతి లభించింది. వ్యవసాయశాఖ శకటానికి మూడో బహుమతి దక్కింది.
విశాఖలో రిపబ్లిక్ డే వేడుకలు
విశాఖ పోలీస్ బ్యారక్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment