Biswabhusan Harichandan
-
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు (ఫొటోలు)
-
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆత్మీయ వీడ్కోలు
-
గన్నవరం ఎయిర్ పోర్టులో గవర్నర్ కు సీఎం జగన్ వీడ్కోలు
-
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఉదయం.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసుల గౌరవ వందనం గవర్నర్ స్వీకరించారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీ అయిన బిశ్వభూషణ్.. మూడున్నరేళ్ల పాటు ఏపీ గవర్నర్‌గా కొనసాగారు. వీడ్కోలు కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, గవర్నర్ ముఖ్యకార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా,ఎస్పీ జాషువా, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. కాగా, హరిచందన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్.. గవర్నర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం సంతోషదాయకమని బిశ్వభూషణ్ ప్రశంసించారు. సమాజంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ పథకాలను అందిస్తుండటం నిజంగా అబ్బురమన్నారు. వీటిపై మేం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అన్ని నిధులు ఎలా సమకూరుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను అడిగితే అంతా దేవుడి ఆశీర్వాదమని వినమ్రంగా బదులిచ్చారు. చిత్తశుద్ధితో పథకాలను ఆయన విజయవంతంగా అమలు చేస్తున్నారని గవర్నర్ అన్నారు. నేడు రాష్ట్రానికి నూతన గవర్నర్.. నేడు రాష్ట్రానికి నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రానున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో నూతన గవర్నర్‌కు సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. ఎల్లుండి ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్ధుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి: సంక్షేమ సర్కారు ఆదర్శ పాలన -
గవర్నర్ కు ఆత్మీయ వీడ్కోలు
-
సంక్షేమ సర్కారు ఆదర్శ పాలన
సాక్షి, అమరావతి: సమాజంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన దేశానికి ఆదర్శప్రాయమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దారని అభినందించారు. రాజకీయ నేతల అంతిమ లక్ష్యం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సమాజ శ్రేయస్సే కావాలని, సీఎం జగన్ దీన్ని ఆచరణలో చూపిస్తున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీపై వెళ్తున్న హరిచందన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ గవర్నర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. అందరికీ సంక్షేమ ఫలాలు ఆశ్చర్యమే రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం సంతోషదాయకం. సమాజంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ పథకాలను అందిస్తుండటం నిజంగా అబ్బురం. వీటిపై మేం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అన్ని నిధులు ఎలా సమకూరుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను అడిగితే అంతా దేవుడి ఆశీర్వాదమని వినమ్రంగా బదులిచ్చారు. చిత్తశుద్ధితో పథకాలను ఆయన విజయవంతంగా అమలు చేస్తున్నారు. దేశానికి ఆదర్శంగా ఆర్బీకేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు దేశానికి ఆదర్శప్రాయం. ఆయన కోరికపై ఓసారి వాటిని సందర్శించి ముగ్దుడినయ్యా. సమాజంలో దాదాపు 70 శాతం ఉన్న రైతుల అన్ని అవసరాలను ఒకేచోట తీర్చేలా ఆర్బీకేలను తీర్చిదిద్దారు. భూసార పరీక్షలు నిర్వహణ నుంచి విత్తనాలు, ఎరువుల పంపిణీ వరకు అన్ని సేవలు అక్కడే అందిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతులు తమ పంటలను ఆర్బీకేల ద్వారా సరైన ధరకు విక్రయించగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు చెప్పా. కోవిడ్ సమర్థంగా కట్టడి కోవిడ్ మహమ్మరిని సమర్థంగా కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవంతమయ్యారు. అన్ని వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలను సమర్థంగా సమన్వయపరిచారు. వైద్యులు, వైద్య సిబ్బంది, సమాజంలో వివిధ వర్గాలు స్పందించిన తీరు అమోఘం. ఆరోగ్యశ్రీ ఓ అద్భుతమైన పథకం. అదే తరహాలో కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. రాజ్యాంగ సంప్రదాయాన్ని పాటించారు సీఎం జగన్ సదా రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమ కోసం పని చేస్తున్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రం, దేశం అభివృద్ధి, సమాజానికి మేలు చేయడమే రాజకీయ నేతల అంతిమ లక్ష్యం కావాలి. అవన్నీ ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో చూపిస్తున్నారు. గవర్నర్‌తో సత్సంబంధాలను కొనసాగించి గొప్ప రాజ్యాంగ సంప్రదాయాన్ని పాటించారు. ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై మేం తరచూ సంప్రదింపులు జరిపాం. ప్రజల శ్రేయస్సే అత్యంత ప్రాధాన్యత అంశంగా మేమిద్దరం భావించాం. అందుకే సమస్యల పరిష్కారం కోసం మెరుగైన రీతిలో చర్యలు తీసుకోగలిగాం. ముఖ్యమంత్రి జగన్‌తో అనుబంధాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఆయన్ను మా కుటుంబ సభ్యుడిగా భావిస్తా. ప్రజా ప్రభుత్వం సజావుగా పని చేసేలా.. గవర్నర్ హోదాలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సుహృద్భావపూర్వక వాతావరణాన్ని నెలకొల్పి ప్రజా ప్రభుత్వం సజావుగా సాగేలా చొరవ తీసుకున్నా. అందులో చాలావరకు సఫలీకృతమైనట్లు భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ను విడిచివెళ్లడం కాస్త బాధగానే ఉంది. విధి నిర్వహణలో భాగంగా చత్తీస్‌గఢ్ వెళ్తున్నా. ఏపీ ప్రజలు కనబరిచిన ప్రేమాభిమానాలు, ఆదరణను ఎప్పటికీ మరవలేను. ఆంధ్రప్రదేశ్‌ను నా రెండో ఇల్లుగా భావిస్తున్నా. నాకు సహకరించిన సీఎం జగన్, మంత్రులు, ప్రజలందరికీ కృతజ్ఞతలు. ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ► గవర్నర్ హరిచందన్ వీడ్కోలు కార్యక్రమంలో సీఎం జగన్ ► రాజ్యాంగ విలువలకు పెద్దపీట వేశారు ► వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలో చూపారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించి రాజ్యాంగ విలువలకు పెద్దపీట వేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్‌గా మూడేళ్ల పదవీ కాలంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలో ఆచరణలో గొప్పగా చూపించారన్నారు. ఓ ఆత్మీయుడైన పెద్దమనిషిగా గవర్నర్ వ్యవస్ధకు నిండుతనం తెచ్చారని ప్రశంసించారు. చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా వెళుతున్న విశ్వభూషణ్ హరిచందన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం తరపున శుభాకాంక్షలతోపాటు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. గవర్నర్‌కు వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. గవర్నర్ వీడ్కోలు సభలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ విద్యావేత్త, న్యాయ నిపుణుడు, స్వాతంత్య్ర సమరయోధుడు.. గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాలపై ఈమధ్య కాలంలో చాలా సందర్భాలలో వార్తలు చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్రం మాత్రం అందుకు భిన్నం. ఓ తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక్కడి ప్రజా ప్రభుత్వానికి మన గవర్నర్ సంపూర్ణంగా సహకరించి వాత్సల్యం చూపారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉన్నత విద్యావేత్త, న్యాయ నిపుణుడు. వీటన్నింటికీ మించి ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. ఒడిశా ప్రభుత్వంలో నాలుగుసార్లు మంత్రిగా పని చేసి తాను బాధ్యతలు నిర్వహించిన ప్రతి శాఖలోనూ తనదైన ముద్ర చూపారు. ఒడిశా అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికైన ఆయన 2000 ఎన్నికల్లో సమీప ప్రత్యర్ధిపై 95 వేల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. న్యాయవాదిగా కూడా పనిచేసిన బిశ్వభూషణ్ హరిచందన్ ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ యాక్షన్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించి న్యాయవాదుల సంక్షేమం, హక్కుల కోసం నిరంతరం పాటుపడ్డారు. ఆయన సతీమణి సుప్రవ హరిచందన్ వెన్నుదన్నుగా నిల్చి ఎన్నో విజయాలకు కారణమయ్యారు. ఆమెకి కూడా రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు నిండు నూరేళ్లు జీవించి ఇంకా ఎంతో సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నా. ఆయనతో పంచుకున్న తీపి జ్ఞాపకాలు మా మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. వెంకన్న చిత్రపటం బహూకరణ వీడ్కోలు సందర్భంగా తంజావూరు శైలిలో రూపొందించిన తిరుమల శ్రీవారు, పద్మావతి అమ్మవార్ల చిత్రాలతో కూడిన మెమెంటోను గవర్నర్ హరిచందన్‌కు సీఎం జగన్ బహూకరించారు. జ్ఞాపికను అందించే ముందు సీఎం జగన్ తన పాదరక్షలు విడిచి పెట్టి చిత్రపటాన్ని అందించగా గవర్నర్ కూడా తన పాదరక్షలను వదిలేసి జ్ఞాపికను స్వీకరించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. -
గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఆత్మీయ వీడ్కోలు సభ (ఫొటోలు)
-
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు
-
గవర్నర్‌తో నాకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనివి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. మూడు సంవత్సర కాలంలో రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆత్మీయుడైన పెద్దమనిషిగా గవర్నర్ వ్యహరించారని అన్నారు. గవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనని సీఎం పేర్కొన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాల మీద ఈ మధ్య కాలంలోనే చాలా సందర్భాలలో వార్తలు చూస్తూనే ఉన్నాం. కానీ మన రాష్ట్రం మాత్రం అందుకు భిన్నంగా గవర్నర్ ఒక తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అండగా నిలిచారని ప్రశంసించారు. ‘గవర్నర్ విద్యావేత్త, న్యాయ నిపుణులు, వీటన్నింటిని మించి ఆయన స్వాతంత్ర్య సమరయోధులు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధిపై 95 వేల మెజార్టీ సాధించి అప్పట్లో ఒక రికార్డు సృష్టించారు ఒడిశా ప్రభుత్వంలో నాలుగుసార్లు మంత్రిగా పనిచేశారు. న్యాయవాదిగా కూడా పనిచేసిన బిశ్వభూషణ్ ఒడిశా హైకోర్టులో బార్ అసోసియేషన్ యాక్షన్ కమిటీ ఛైర్మన్‌గా న్యాయవాదుల సంక్షేమం కోసం, హక్కుల కోసం నిరంతరం పాటుపడ్డారు. గవర్నర్ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి. ప్రజలకు మరింత సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రజలు, ప్రభుత్వం, నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా వెళ్తున్నందుకు అభినందనలు తెలుపుతున్నాను’ అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అనంతరం బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఆత్మీయంగా సత్కరించారు. చదవండి: నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఏపీ ప్రజలను మరవను: బిశ్వభూషణ్ హరిచందన్ -
ఏపీ నాకు రెండో ఇల్లు.. సీఎం జగన్‌ను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నా: గవర్నర్ బిశ్వభూషణ్
-
గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు: సీఎం జగన్
-
నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఏపీ ప్రజలను మరవను: గవర్నర్
సాక్షి, విజయవాడ: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సీఎం జగన్ చూపిన గౌరవం, ఆప్యాయత మరువలేనివని తెలిపారు. గవర్నర్, సీఎం సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. సీఎం జగన్ అందరికీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. ‘ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రారంభంలో అడిగా. దేవుడి దయతో అన్నీ పూర్తవుతాయని సీఎం జగన్ చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుంది. ప్రజలు అందించిన ప్రేమ, అభిమానం, సహకారం ఎంతో అద్భుతమైనది. కరోనా కాలంలో ఏపీలోని వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. సీఎం జగన్‌ను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నా రెండో ఇల్లు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీ ప్రజలను మరవను’ అని గవర్నర్ ప్రసంగించారు. కాగా బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. మూడున్నర సంవత్సరాల పాటు ఆయన ఏపీ గవర్నర్‌గా సేవలందించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: టీడీపీ పెత్తందారీ వ్యవస్థను బద్దలుకొట్టిన వ్యక్తి సీఎం జగన్: జోగి రమేష్ -
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన సీఎం వైఎస్ జగన్
-
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు
సాక్షి, అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు భేటీ అయ్యారు. ఏపీ గవర్నర్‌గా మూడున్నరేళ్లపాటు సేవలందించి ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్తున్న బిశ్వభూషణ్‌కు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా సుప్రీకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. ఏపీతోపాటు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిశ్వభూషన్ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లనున్నారు. చదవండి: జగన్ మళ్లీ సీఎం కావాలంటూ బైక్ యాత్ర -
ఏపీ కొత్త గవర్నర్‌గా అబ్దుల్ నజీర్
సాక్షి, ఢిల్లీ: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు గవర్నర్లను మారుస్తూ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఇదే సమయంలో కొత్త గవర్నర్లను నియమించింది. కొత్తగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారి, లద్దాక్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాధాకృష్ణ రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కొత్త గవర్నర్లు వీరే.. - ఏపీ.. సుప్రీంకోర్టు మాజీ జడ్డి ఎస్. అబ్దుల్ నజీర్ - అరుణాచల్ ప్రదేశ్.. త్రివిక్రమ్ పర్నాయక్ - సిక్కిం.. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య - ఛత్తీస్‌ఘఢ్.. బిశ్వభూషణ్ హరిచందన్ - మహారాష్ట్ర.. రమేష్ - మేఘాలయ.. చౌహాన్ -
ఆలయాల బోర్డుల్లో నాయీ బ్రాహ్మణులు..
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. అనాదిగా ఆలయాల వ్యవస్థలో అర్చకులతో పాటు నాయీ బ్రాహ్మణులకు విడదీయరాని బంధం ఉందని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామి వారి ఊరేగింపు పల్లకీ సేవల్లో నాయీ బ్రాహ్మణులు పాలు పంచుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే తమకు పాలక వర్గాల్లో చోటు కల్పించాలని నాయీ బ్రాహ్మణులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర సమయంలో దీనిపై సానుకూల హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నిర్వహించిన బీసీ గర్జన సభలలోనూ దీనిపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ దేవదాయ శాఖ చట్టానికి సవరణ తెచ్చి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 610 ఆలయాలకు త్వరలో నియామకం! హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం దేవదాయ శాఖ పరిధిలో ఐదు లక్షలకు పైబడి ఆదాయం సమకూరే ఆలయాల్లో మాత్రమే దేవదాయ శాఖ ట్రస్టు బోర్డులను నియమించే అవకాశం ఉంది. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ.ఐదు లక్షల పైబడి వార్షికాదాయం ఉన్న ఆలయాలు 1,234 వరకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ట్రస్టు బోర్డు నియామకాలు పూర్తైన వాటిని మినహాయిస్తే మరో 610 ఆలయాలకు కొద్ది రోజుల్లో కొత్తగా ట్రస్టు బోర్డులను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. వీటిల్లో ప్రతి ఆలయానికి ఒకరి చొప్పున నాయీ బ్రాహ్మణులకు ట్రస్టు బోర్డులో స్థానం కల్పించే అవకాశం ఉంది. నాడు అవమానం.. నేడు సముచిత స్థానం ఆలయాల ట్రస్టు బోర్డు నియామకాల్లో తమకు చోటు కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ హయాంలో తాము అవమానాలు ఎదుర్కొనగా ఇప్పుడు సముచితం స్థానం దక్కిందని ఆయా సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఆలయాల నిర్వహణలో తమకు తగిన స్థానం కల్పించాలని కోరిన నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను అధికారంలో ఉండగా చంద్రబాబు తీవ్రంగా అవమానించారని గుర్తు చేస్తున్నారు. నాడు సచివాలయంలో తనను కలసి సమస్యలు వినిపించిన సంఘాల నేతలనుద్దేశించి ‘తోకలు కత్తిరిస్తా.. ఆలయాల మెట్లు కూడా ఎక్కకుండా చేస్తా’ అంటూ చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దేశ చరిత్రలోనే అరుదు దేశ చరిత్రలో నాయీ బ్రాహ్మణులకు అరుదైన గౌరవం దక్కింది. మా వినతిని ఆలకించి ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల ఆత్మ గౌరవాన్ని మరో మెట్టు ఎక్కించింది. సీఎం జగన్‌కు నాయీ బ్రాహ్మణ జాతి రుణపడి ఉంటుంది. – సిద్దవటం యానాదయ్య (ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్), గుంటుపల్లి రామదాసు (కేశ ఖండనశాల నాయీ బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షుడు) -
గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1993 బ్యాచ్‌కు సింఘాల్ ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. రాజ్ భవన్లో మాననీయ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సింఘాల్ మర్యాద పూర్వకంగా కలిసారు. వీరిరివురు కొద్దిసేవు సమావేశం అయ్యారు. సింఘాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన శాఖలలో బాధ్యతలు నిర్వర్తించి మంచి అధికారిగా తనదైన ముద్ర వేసారు. కేంద్రంలో అత్యంత కీలకమైన డిఓపిటి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేసారు. కీలకమైన కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలు అందించి రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకున్నారు. టీడీడీ ఈవోగా పలు సంస్కరణలకు బీజం వేశారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, మెదక్ కలెక్టర్ గా, చిత్తూరు, గుంటూరు సంయిక్త కలెక్టర్‌గా ఆయా జిల్లాలలో తనదైన ముద్ర వేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉట్నూరు, కేఆర్ పురంలలో, సబ్ కలెక్టర్‌గా గద్వాల్ లో ప్రజలకు ఇతోధిక సేవలందించారు. సర్వీసు తొలి రోజుల్లో నెల్లూరు, అనంతపురం ఉప కలెక్టర్‌గా వ్యవహరించారు. -
గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రాంప్రకాష్ సిసోడియాను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. -
యూనివర్సిటీల్లో పరిశోధనల్ని ప్రోత్సహించాలి
సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలు బోధనలకు మాత్రమే పరిమితమవుతున్నాయని, పరిశోధనలకు దూరంగా ఉండటం బాధాకరమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ ఉపకులపతుల సదస్సు–2023ని ఏయూ కన్వెన్షన్ హాల్లో గవర్నర్ మంగళవారం ప్రారంభించారు. రెండురోజుల సదస్సులో తొలిరోజు ‘రీసెర్చ్ అండ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అంశంపై గవర్నర్ ప్రసంగించారు. ఉన్నతవిద్యలో పరిశోధనల్లో పూర్తిస్థాయిలో లక్ష్యాల్ని చేసుకోవాలని, అదేవిధంగా యూనివర్సిటీలు బోధనకే పరిమితం కాకూడదని సూచించారు. పరిశోధన రంగంవైపు విద్యార్థుల్ని ప్రోత్సహించాలని, ఇందుకనుగుణంగా రీసెర్చ్ రంగంలో పెట్టుబడుల్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచస్థాయి ర్యాంకింగ్‌లలో అత్యుత్తమ స్థానంలో భారతీయ విశ్వవిద్యాలయాలు స్థానం సాధించాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ కలిగిన దేశంగా భారత్ ఉందని నాస్కామ్ స్పష్టం చేసిందని, 2022 నాటికి దేశంలో 80 వేలకు పైగా స్టార్టప్ సంస్థలున్నాయని తెలిపారు. కోవిడ్ సమయంలో అమెరికా, చైనా, యూకే సహా 50 దేశాలకు మనదేశం మార్గదర్శిగా నిలవడాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నూతన విద్యావిధానంలో పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం చేసే దిశగా సమష్టిగా పనిచేయాలని ఆయన కోరారు. ఏయూ వీసీ ప్రొ.పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ స్వయం సమృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షల్ని సాకారం చేసే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పనిచేస్తోందని తెలిపారు. ఏఐయూ అధ్యక్షుడు ఆచార్య సురంజన్ దాస్ మాట్లాడుతూ దేశీయ పరిజ్ఞానాన్ని పరిరక్షించడంతో పాటు పరిశోధనలకు అనుగుణంగా ఉన్నతవిద్యని ఇంగ్లిష్తో పాటు స్థానిక భాషల్లో అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్యని పటిష్టం చేసేందుకు గవర్నర్, ముఖ్యమంత్రి ఐదు లక్ష్యాల్ని ఏర్పాటు చేసుకుని వాటిని సాధించే దిశగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సదస్సులో తొలుత ఏఐయూ ప్రత్యేక సంచికని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సదస్సులో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు రామ్మోహన్రావు, ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్, 140 విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
హిందూధర్మానికి ఉనికి ఆదిశంకరాచార్యులే..
సింహాచలం: హిందూ ధర్మానికి ఉనికి జగద్గురు ఆదిశంకరాచార్యులే అని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. శ్రీశారదాపీఠంలో ఐదురోజులుగా జరిగిన వార్షికోత్సవాలు మంగళవారం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన శాస్త్ర, శ్రౌతసభల్లో స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు. ఆచార్యుల పేరుతో మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ప్రచారం పొందినా ప్రపంచవ్యాప్తంగా ఆదిశంకరాచార్యులే తెలుసని చెప్పారు. శంకరాచార్య తత్వాన్ని కాపాడుతున్న శాస్త్ర పండితులతో ఏటా వార్షికోత్సవాల్లో శాస్త్ర, శ్రౌతసభలు నిర్వహిస్తున్నామని, బిరుదులిచ్చి స్వర్ణకంకణధారణ చేస్తున్నామని తెలిపారు. హిందూధర్మం అంటే ఆలయాలు, అర్చనలే అని సామాన్యులు భావిస్తారని, కానీ శాస్త్రం ఉంటేనే హిందూధర్మం నిలుస్తుందని తమ పీఠం నమ్ముతుందని చెప్పారు. రాజశ్యామల యాగం అంటే వ్యాపారం కాదన్నారు. అంగదేవతలతో కూడిన హోమాలు ఇందులో ఉంటాయన్నారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరకు రాజశ్యామల కృపను పొందారని చెప్పారు. ఈ సందర్భంగా శాస్త్రసభలో ప్రతిభకనబరిచిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి వ్యాకరణ భాస్కర బిరుదు ప్రదానం చేసి స్వర్ణకంకణధారణ చేశారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో జరిగిన ఈ సభలో షట్‌శాస్త్ర పండితులు విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, చిర్రావూరి శ్రీరామశర్మ, ఓరుగంటి రామ్‌లాల్, మణిద్రావిడ శాస్త్రి, ఆర్.కృష్ణమూర్తి శాస్త్రి, ప్రముఖ శ్రౌత పండితులు దెందుకూరి రాఘవ ఘనాపాఠి పాల్గొన్నారు. ఆశీస్సులందుకున్న గవర్నర్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ల్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వైభవంగా మహాపూర్ణాహుతి వైభవంగా జరిగిన రాజశ్యామలయాగం, శ్రీనివాస చతుర్వేద హవనం మహాపూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అదీప్‌రాజ్, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున, సీపీ శ్రీకాంత్, తెలంగాణకు చెందిన కంపెనీస్ లా ట్రిబ్యునల్ చైర్మన్ బదరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖ శారదాపీఠం చేస్తున్న ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలు ఎంతో గొప్పవని చెప్పారు. -
విశాఖ: దక్షిణ భారతదేశ వీసీల సదస్సు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో దక్షిణ భారతదేశ వీసీల సదస్సు ప్రారంభం అయ్యింది. మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ సదస్సును ప్రారంభించారు. సదస్సుకు ఏడు రాష్ట్రాల వైస్ ఛాన్సలర్లు హాజరయ్యారు. రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్ ట్రాన్స్ఫర్ మెటీవ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై జరగనుంది ఈ సదస్సు. మరోవైపు ఈ సదస్సుకు 140 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతుండడం విశేషం. -
ఏపీ ప్రగతి దేశానికి ఆదర్శం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు 73 ఏళ్ల రాజ్యాంగ సారాన్ని మూడున్నరేళ్లలో ప్రభుత్వం అందించిందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి పథంలో నిలిపిందని, మనం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. మన ప్రభుత్వం చేతల ప్రభుత్వమని నిరూపిస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని 43 నెలల్లోనే సాకారం చేశామన్నారు. సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ అందుకు దోహదం చేసిందన్నారు. ఇప్పటివరకు రూ.1.82 లక్షల కోట్లు అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకు చేరాయన్నారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న గవర్నర్ వ్యవసాయంలో ముందడుగు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా 29.77 లక్షల మంది రైతుల నుంచి 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.54,140 కోట్లు చెల్లించింది. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ కింద కౌలు రైతులకు కూడా మేలు చేస్తోంది. మూడున్నరేళ్లలో 52.38 లక్షల మంది రైతులకు రూ.25,971 కోట్లు అందచేసింది. దేశంలో సార్వత్రిక పంటల బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద గుర్తించిన అన్ని పంటలకు రైతుల తరపున ప్రీమియం వాటాను ప్రభుత్వమే చెల్లించింది. ఇప్పటివరకు రూ.6,684 కోట్ల విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాల ద్వారా రూ.1,442.66 కోట్ల వడ్డీ రాయితీని నేరుగా 73.87 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. విజయవాడలో జాతీయజెండాకు సెల్యూట్ చేస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గ్రామీణ పేదరిక నిర్మూలన రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచి నెలకు రూ.2,750 చొప్పున చెల్లిస్తోంది. ప్రతినెలా రూ.1,765 కోట్లను 64.06 లక్షల మంది లబ్ధిదారులకు ఒకటో తేదీన ఇంటివద్దే అందజేస్తోంది. మూడున్నరేళ్లలో పింఛన్ల కోసం రూ.63,303 కోట్లు ఖర్చు చేసింది. చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారి కోసం జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వయం సహాయక సంఘాలకు రూ.25,517 కోట్లను చెల్లించేందుకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించింది. వైఎస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద మహిళల జీవనోపాధి కోసం రూ.18,750 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాలకు చెందిన 3,56,143 మంది మహిళలకు రూ.1,518 కోట్లను అందించింది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 3,93,537 మందికి రూ.590 కోట్ల మొత్తాన్ని నేరుగా పంపిణీ చేసింది. రూ.40 కోట్ల వ్యయంతో 17.44 లక్షల ఎస్సీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. రాజ్యాంగ నిర్మాతకు నివాళిగా విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో రూ.268 కోట్ల అంచనా వ్యయంతో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. గ్రామ స్వరాజ్యం, పారదర్శక సేవలు లక్ష్యంగా ప్రవేశపెట్టిన సచివాలయాల వ్యవస్థతో 2.65 లక్షల మంది వలంటీర్లు ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ద్వారా ఇప్పటివరకు రూ.33,544 కోట్లతో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టగా 2.3 లక్షల గృహాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. సుమారు రూ.34 వేల కోట్లతో వైఎస్సార్ జగనన్న లేఅవుట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పథకాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యేలు తమ పరిధిలోని అన్ని ఇళ్లను సందర్శించేలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. గవర్నర్‌తో ఆప్యాయంగా సీఎం వైఎస్ జగన్ పరిశ్రమలు – వాణిజ్యం రాష్ట్రంలో 2019 జూన్ నుంచి 2022 డిసెంబర్ 31 వరకు పెట్టుబడుల ప్రవాహం బలంగా ఉంది. రూ.54,236 కోట్ల పెట్టుబడితో 109 పెద్ద పరిశ్రమలను స్థాపించారు. ఎంఎస్ఎంఈ రంగంలో రూ.72,608 కోట్లతో 1,45,496 యూనిట్లు వచ్చాయి. వీటిద్వారా 11,19,944 మందికి ఉపాధి లభిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ ‘టాప్ అచీవర్’గా ఎంపికైంది. జూన్ 2022లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. తలసరి ఆదాయం రూ.1,70,215కి పెరిగింది. మత్స్యకారుల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో 9 ఫిషింగ్ హార్బర్లు, మూడు ఓడరేవులను అభివృద్ధి చేస్తోంది. ఉపాధిలో మిన్న.. ఉపాధిహామీలో భాగంగా 1,871 లక్షల పనిదినాలను కల్పించి ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో ఉంది. రోడ్లు భవనాల శాఖ 5,181 కి.మీ పొడవైన వివిధ రహదారుల అభివృద్ధి పనులను రూ.2173 కోట్లతో చేపడుతోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఏడాది కాలంలో 992 కి.మీ. బీటీ రోడ్లు వేశారు. జీవనాడికి ప్రాధాన్యం.. ఏపీకి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తూ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, పెన్నార్ డెల్టా సిస్టం, కావలి కెనాల్, కనుపూరు కాలువల ఆయకట్టు స్థిరీకరణ పనులు పూర్తయ్యాయి. రూ.15,448 కోట్లతో బాబు జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టింది. పటిష్టంగా శాంతి భద్రతలు.. రాష్ట్ర పోలీసుల సమర్థతతో 2022లో నేరాలు గణనీయంగా తగ్గాయి. వినూత్న పోలీసింగ్ చర్యల ద్వారా ఇది సాధ్యమైంది. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే ఆదుకునేలా ప్రభుత్వం దిశ యాప్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు 1.11 కోట్ల మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. శాంతి భద్రతలను సమర్థంగా పరిరక్షించేందుకు 14 కొత్త పోలీసు సబ్ డివిజన్లు, 19 కొత్త సర్కిళ్లు, రెండు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు 21 స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసింది. వికేంద్రీకరణతో మొత్తం జిల్లాల సంఖ్య 26కి చేరింది. కొత్తగా ఏర్పాటైన వాటితో రెవెన్యూ డివిజన్లు 76కి పెరిగాయి. వందేళ్ల తరువాత భూముల సర్వే దేశంలో 100 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టిన తొలి రాష్ట్రం మనదే. 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు, 85 లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో విస్తరించిన 17,584 గ్రామాల్లో రీసర్వే ప్రాజెక్టు కొనసాగనుంది. కనువిందుగా కవాతు గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. బెస్ట్ ఆర్డ్మ్ కంటింజెంట్‌గా ఇండియన్ ఆర్మీ నిలవగా, ఏపీఎస్పీ కర్నూలు బెటాలియన్ రెండో స్థానంలో నిలిచింది. నాన్ ఆర్డ్మ్ కంటింజెంట్ విభాగంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (బాయ్స్) తొలి రెండు స్థానాలు సాధించాయి. ఈ ఏడాది నుంచి కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ పరేడ్‌లో పాల్గొన్న ఒడిశా స్టేట్ పోలీస్ విభాగానికి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారామ్, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న శకటాలు గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించిన 13 శకటాలు రాష్ట్ర ప్రగతి, సంక్షేమానికి నిదర్శనంగా నిలిచాయి. గృహ నిర్మాణ శాఖ శకటం ప్రథమ బహుమతిని కైవశం చేసుకోగా పాఠశాల విద్యాశాఖ (డిజిటల్ విద్యాబోధన) శకటం రెండో స్థానంలో నిలిచింది. ఊరూరా అభివృద్ధి– ఇంటింటా సమృద్ధి నేపథ్యంతో రూపుదిద్దుకున్న గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శకటం మూడో స్థానం దక్కించుకుంది. మొదటి, మూడో ఉత్తమ శకటాలకు గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి గవర్నర్ చేతుల మీదుగా బహుమతులను అందుకోగా రెండో ఉత్తమ శకటానికి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విద్యార్థులతో కలసి స్వీకరించారు. చదువులకు చేయూత పేదరికం కారణంగా చదువులు ఆగిపోరాదని అమ్మ ఒడితోప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఇప్పటి దాకా రూ.19,617 కోట్లను నేరుగా 44.49 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ చేసింది. 84 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతోంది. మన బడి – నాడు నేడు ద్వారా 45,484 ప్రభుత్వ పాఠశాలలు, 471 జూనియర్ కళాశాలలు, 151 డిగ్రీ కళాశాలలు, 3,287 హాస్టళ్లు, 55,607 అంగన్వాడీల్లో రూ.17,835 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను కల్పించింది. జగనన్న గోరుముద్ద కోసం ఇప్పటిదాకా రూ.3,239 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా కానుక ద్వారా 47 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు రూ.2,368 కోట్లు వెచ్చించింది. జగనన్న విద్యా దీవెన కింద మొత్తం ఫీజులను రీయింబర్స్ చేస్తూ ఇప్పటివరకు 24,74,544 మంది విద్యార్థులకు రూ.9,051 కోట్లు చెల్లించింది. డిజిటల్ లెర్నింగ్ ఆవశ్యకతను గుర్తించి 4,59,564 మంది 8వ తరగతి విద్యార్థులకు రూ.778 కోట్ల విలువైన ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్‌తో పాటు రూ.688 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం – కుటుంబ సంక్షేమం రాష్ట్రంలో 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా ఆసుపత్రులు, 12 జిల్లా ఆసుపత్రులు, 11 టీచింగ్, ఇతర స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా సేవలందిస్తోంది. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉండేలా కొత్తగా 88 ఆస్పత్రులను మంజూరు చేసింది. నాడు – నేడుతోపాటు కొత్త వైద్య కాలేజీల కోసం రూ.16,823 కోట్లు వ్యయం చేస్తోంది. వచ్చే రెండేళ్లల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 28కి పెరగనుంది. 16 హెల్త్ హబ్స్ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించనుంది. వైద్య శాఖలో ఖాళీలు లేకుండా 48,639 పోస్టులను భర్తీ చేసింది. చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటిన అన్ని సేవలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 95 శాతం మంది పథకం పరిధిలో ఉన్నారు. 104, 108 సేవలను పునరుద్ధరించి 1,444 వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డాక్టర్ వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలతోపాటు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. -
ఎట్‌హోం కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు (ఫొటోలు)
-
ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అయితే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఎట్‌హోం కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. వారితో పాటుగా హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు (ఫొటోలు)