జివితేష్‌ను అభినందిస్తున్న గవర్నర్
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): చేతిరాత ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించొచ్చని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. బాగా చదవడంతోపాటు అందంగా రాయడం ఒక కళ అని పేర్కొన్నారు. కాలిగ్రఫీ నిపుణులు భువనచంద్ర తరఫున జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను విజయవాడ రాజ్‌భవన్‌లో గురువారం గవర్నర్ అభినందించారు.
ఈ సందర్భంగా అమ్మఒడి హ్యాండ్ రైటింగ్ అండ్ కాలిగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కాలిగ్రఫీ పోటీలకు ఎంపికైన కలెక్టర్ ఢిల్లీరావు కుమారుడు జివితేష్ చేతిరాతను గవర్నర్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో కురసాల సిరి కృష్ణ సంహిత అంజలి, విశాఖ మనుశ్రీ ప్రభుత్వ పాఠశాల, ఏలూరుకు చెందిన జేఎన్ జె.స్కూల్, జయశ్రీ హోలీ ట్రినిటీ, డమరేష్ శుభోదయ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, శ్రావ్యాంజలి చైతన్య స్కూల్, స్ఫూర్తి సిద్ధార్థ స్కూల్, హర్షిత నేతాజీ స్కూల్ విద్యార్థులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment