సాక్షి, ఢిల్లీ: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు గవర్నర్లను మారుస్తూ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఇదే సమయంలో కొత్త గవర్నర్లను నియమించింది. కొత్తగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారి, లద్దాక్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాధాకృష్ణ రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
కొత్త గవర్నర్లు వీరే..
- ఏపీ.. సుప్రీంకోర్టు మాజీ జడ్డి ఎస్. అబ్దుల్ నజీర్
- అరుణాచల్ ప్రదేశ్.. త్రివిక్రమ్ పర్నాయక్
- సిక్కిం.. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
- ఛత్తీస్‌ఘఢ్.. బిశ్వభూషణ్ హరిచందన్
- మహారాష్ట్ర.. రమేష్
- మేఘాలయ.. చౌహాన్
Comments
Please login to add a commentAdd a comment