governers
-
రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు
ఢిల్లీ : ఆగస్ట్ 2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ,ఉపరాష్ట్రపతి జగదీప్ దంకర్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు యూనివర్సిటీలు అక్రిడేషన్ గిరిజన ప్రాంతాల అభివృద్ధి ,వెనుకబడిన జిల్లాలు- సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్ర, మై భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ వృక్ష మాకే నామ్, సేంద్రియ వ్యవసాయం, ప్రజా సంబంధాల మెరుగుదల, రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో మెరుగైన సమన్వయం వంటి కీలక అంశాలపై రెండు రోజులపాటు చర్చలు జరగనున్నాయి. గవర్నర్లతో విడివిడిగా బృందాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక అంశాలపై ప్రజెంటేషన్ జరగనుంది. -
ఏపీ కొత్త గవర్నర్‌గా అబ్దుల్ నజీర్
సాక్షి, ఢిల్లీ: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు గవర్నర్లను మారుస్తూ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఇదే సమయంలో కొత్త గవర్నర్లను నియమించింది. కొత్తగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారి, లద్దాక్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాధాకృష్ణ రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కొత్త గవర్నర్లు వీరే.. - ఏపీ.. సుప్రీంకోర్టు మాజీ జడ్డి ఎస్. అబ్దుల్ నజీర్ - అరుణాచల్ ప్రదేశ్.. త్రివిక్రమ్ పర్నాయక్ - సిక్కిం.. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య - ఛత్తీస్‌ఘఢ్.. బిశ్వభూషణ్ హరిచందన్ - మహారాష్ట్ర.. రమేష్ - మేఘాలయ.. చౌహాన్ -
రాజ్‌భవన్.. నివురుగప్పిన నిప్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తనపై వివక్ష చూపుతోందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు గవర్నర్ల పాత్ర, ప్రభుత్వాలతో సంబంధాలకు సంబంధించిన అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తమిళిసై స్థాయిలో బహిరంగంగా విమర్శలు చేసిన, ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్ మరొకరు లేరు. నాడు రామ్‌లాల్ నుంచి.. ఉమ్మడి ఏపీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు పనిచేసిన గవర్నర్లలో అత్యంత వివాదాస్పదుడిగా రామ్‌లాల్ పేరును చెబుతుంటారు. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన గవర్నర్‌గా ఆయన చరిత్రకెక్కారు. తర్వాత కుముద్‌బెన్ జోషి గవర్నర్‌గా ఉన్నప్పుడూ నాటి ఎన్టీఆర్ ప్రభుత్వంతో పలు విషయాల్లో విభేదించి వార్తల్లో నిలిచారు. రాజ్‌భవన్‌లో జోగినులకు వివాహం జరిపించి సంచలనం సృష్టించారు. కొంతకాలం నాటి సీఎం ఎన్టీఆర్‌తో కుముద్‌బెన్ కోల్డ్‌వార్ సాగింది. నరసింహన్ హయాంలో.. ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా నరసింహన్ పనిచేసిన కాలంలో పలుమార్లు రాజ్‌భవన్‌కు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఆ సమయంలో నరసింహన్ కొంత కఠినంగా వ్యవహరించారు. ఇక్కడి పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించారు. ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరగడంతో.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల బాధ్యతలను కొంతకాలం చూసుకున్నారు. ఈ సమయంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై వివాదం తలెత్తినప్పుడు.. సెక్షన్–8 ప్రయోగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆమోదం కోసం పంపించిన మున్సిపల్ చట్టంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపారు. మార్పులు చేసి తీసుకెళితే ఆమోదించారు. ప్రస్తుత గవర్నర్ తమిళిసై కూడా.. ప్రభుత్వం పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తే, ఆయనకు తగిన అర్హతలు లేవంటూ తిప్పిపంపారు. మరోవైపు పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర (ఉద్ధవ్‌ఠాక్రే సీఎంగా ఉండగా), కేరళ రాష్ట్రాల గవర్నర్లు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పలు అంశాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదించి వివాదాస్పదులుగా నిలిచారు. ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం.. -
రాష్ట్రపతి భవన్లో 51వ గవర్నర్ల సదస్సు
-
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
-
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ : దసరా పండుగ వేళ ఆయా రాష్ట్రాలకు గవర్నర్లు ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చారు. ఐదు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడుకు భన్వరిలాల్ పురోహిత్ , మేఘాలయకు గంగాప్రసాద్, అరుణాలచల్ ప్రదేశ్ కు బీడీ మిశ్రా, బిహార్‌కు సత్యపాల్ మాలిక్, అస్సోంకు జగదీష్ ముఖీ, అండమాన్ నికోబార్‌కు మాజీ అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషిని లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకమయ్యారు. గతంలో జగదీశ్ ముఖీ అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు. -
గరంగరంగా బీఏసీ
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామంపై స్పీకర్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఉభయసభలను ఉద్దేశించి శనివారం గవర్నర్ నరసింహన్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ వాయి దా పడింది. ఆ తర్వాత దాదాపు గంట న్నరసేపు బీఏసీ సమావేశం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయగీతం ఆలపిస్తుండగా అనుచితంగా ప్రవర్తించిన సభ్యులపై చర్య తీసుకోవాలన్న ప్రతిపాదనతో ఈ భేటీ మొదలైనట్లు సమాచారం. గంట పాటు ఇదే అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. సభలో జాతీయగీతం ఆలపిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి టేబు ళ్లు ఎక్కి గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై స్పీకర్ చర్య తీసుకోవాలన్న వాదన బీఏసీలో బలంగా వినిపించింది. అయి తే తమ సభ్యులపై దాడి చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని, అది తేలాకే మరో అంశాన్ని చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. ఈవివాదాన్ని ముగించేందుకు ముం దుగా ఫ్లోర్‌లీడర్లకు వీడియో దృశ్యాలను చూ పించాలని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ సభ్యులు డిమాండ్ చేశారు. కాగా, జాతీయగీతాన్ని అవమానపరిచిన సభ్యులు బేషరతు గా క్షమాపణ చెప్పాలని, లేదంటే వారిని సస్పెండ్ చేయాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా, వీడియో దృశ్యాలను చూ పించే విషయంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు చెప్పగా.. స్పీకర్‌పై తమకు నమ్మకం లేద ని టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్ర బెల్లి దయాకర్‌రావు అన్నట్లు తెలిసింది. టీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయని ఆయన నిరసన తెలిపినట్లు సమాచారం. మంత్రి తలసానిపై అనర్హత వేటు వేసే దాకా తమ నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పినట్లు తెలిసింది. కాగా, సాంకేతిక అంశాలను చూపెట్టి పార్టీలపై ఒత్తిడి పెంచొద్దని, సమావేశ తేదీలను హడావుడిగా ఎందు కు నిర్ణయించారని బీజేపీఎల్పీ నేత లక్ష్మణ్ పేర్కొన్నట్లు తెలిసింది. 26, 27 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరు కాలేదు. సమావేశం మొదలవడానికి ముందే ఆయన స్పీకర్‌ను కలిసి మాట్లాడి వెళ్లిపోయారు. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ దాకా సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై 9, 10 తేదీల్లో చర్చ ఉంటుంది. 11వ తేదీన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2015-16 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. 12వ తేదీన సెలవు ప్రకటించారు. 13, 14, 16 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. 17వ తేదీన ఆర్ధిక మంత్రి సమాధానం, 18, 19, 20, 23, 24, 25 తేదీల్లో ఆరు రోజులపాటు పద్దులపై చర్చ, ఓటింగ్ ఉంటాయి. 26న ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెడతారు. అదే రోజు ప్ర భుత్వ బిల్లులు, ఆర్డినెన్సులను ప్రవేశ పెడతారు. 27న శాసనమండలిలో ద్రవ్య విని మయ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. 15, 21, 22 తేదీలను సెలవుగా నిర్ణయించారు. ఒక వేళ విపక్షాలు పట్టుబడితే మరో రెండు రోజుల పాటు సభను జరపడానికి ప్రభుత్వానికి ఎ లాంటి అభ్యంతరం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నట్లు సమాచారం. కనీసం ఐదు రోజులు వర్కింగ్ లంచ్‌తో సభా సమయాన్ని పొడి గించడానికి మంత్రి సుముఖత తెలిపినట్లు తెలిసిం ది. వాయిదా తీర్మానాలను ప్రశ్నోత్తరాల తర్వాతనే చేపట్టాలని కూడా నిర్ణయించారు. సమావేశాల ప్రత్యక్ష ప్రసారానికి పాత పద్ధతినే అవలంభిస్తున్నట్లు హరీశ్ పేర్కొన్నారు. ఇక ఉద యం 9.30 గంటలకే సమావేశాలు మొదలుపెట్టాలని విపక్షాలు కోరడంతో దీనిపై నిర్ణయాన్ని స్పీకర్ పెండింగులో పెట్టారు. ఈ భేటీ లో సీఎల్పీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, సీపీఎం నుంచి సున్నం రాజయ్య, సీపీఐ నుంచి రవీంద్రకుమార్ పాల్గొన్నారు.