ఢిల్లీ : ఆగస్ట్ 2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ,ఉపరాష్ట్రపతి జగదీప్ దంకర్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు.
నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు యూనివర్సిటీలు అక్రిడేషన్ గిరిజన ప్రాంతాల అభివృద్ధి ,వెనుకబడిన జిల్లాలు- సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్ర, మై భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ వృక్ష మాకే నామ్, సేంద్రియ వ్యవసాయం, ప్రజా సంబంధాల మెరుగుదల, రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో మెరుగైన సమన్వయం వంటి కీలక అంశాలపై రెండు రోజులపాటు చర్చలు జరగనున్నాయి. గవర్నర్లతో విడివిడిగా బృందాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక అంశాలపై ప్రజెంటేషన్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment