
న్యూఢిల్లీ : దసరా పండుగ వేళ ఆయా రాష్ట్రాలకు గవర్నర్లు ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చారు. ఐదు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తమిళనాడుకు భన్వరిలాల్ పురోహిత్ , మేఘాలయకు గంగాప్రసాద్, అరుణాలచల్ ప్రదేశ్ కు బీడీ మిశ్రా, బిహార్‌కు సత్యపాల్ మాలిక్, అస్సోంకు జగదీష్ ముఖీ, అండమాన్ నికోబార్‌కు మాజీ అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషిని లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకమయ్యారు. గతంలో జగదీశ్ ముఖీ అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు.