అప్‌డేట్స్:
► రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ తిరుగు పయనమయ్యారు. రాష్ట్రపతి ఐఎన్‌ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకుంటారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొంటారు.
► విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు స్వాగతం పలికేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐఎన్ఎస్ డేగాకు బయల్దేరారు.
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి అవంతి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి స్వాగతం పలికారు. విశాఖపట్నంలో సోమవారం జరిగే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(పీఎఫ్‌ఆర్) కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు.
ఐఎన్‌ఎస్ డేగాలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తరువాత సీఎం వైఎస్ జగన్ తిరుగు పయనమవుతారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్‌ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకోనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment