President of India
-
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ఏమన్నారంటే..
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము మాట్లాడారు. కొత్త పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం చేయడం రాష్ట్రపతికి ఇది తొలిసారి కావడం విశేషం. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. రూ.7 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పన్ను చెల్లింపుదారులు ఇటీవల కాలంలో భారీగా పెరిగారు. దేశంలో 5జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోంది. రీఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్, ఐటీ రిటర్న్‌లు ఫైల్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ నినాదంతో అభివృద్ధి సాధించాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థలున్న దేశం ఇండియా. ప్రభుత్వం దేశ్యవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను ఆదునికీకరించింది. భారీగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. -
Republic Day 2024: అలా అనకూడదని తెలుసా?
Republic Day Celebrations 2024: ఇవాళ జెండా పండుగ. గణతంత్ర దినోత్సవం. అయితే ఇవాళ జెండా ఎగరేయడం అనొద్దు అంట. అది ముమ్మాటికీ తప్పంట. ఆవిష్కరించడం అనలాట. ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పైగా ఇవాళ జెండా ఆవిష్కరించబోయేది రాష్ట్రపతి. ఈ వేడుకలకు ప్రధాని హాజరైనా జెండా మాత్రం ఆవిష్కరించరు. ప్రధాని కేవలం స్వాత్రంత్య దినోత్సవం నాడు ప్రధాని జెండా ఎర్రకోటపై ఎగరేయడానికి.. జనవరి 26న రాష్ట్రపతి జెండా ఆవిష్కరించడానికి గల కారణం.. ఆ ఆనవాయితీ ఎన్నేళ్ల నుంచి కొనసాగుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి.. జనవరి 26 రిపబ్లిక్ డే, ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే.. ఈ రెండు తేదీలలో దేశవ్యాప్తంగా జెండాను రెపరెపలాడిస్తారు. పంద్రాగష్టున ప్రధాని ఎర్రకోటలో జెండా ఎగరేస్తారు. అయితే ఈ రోజు జనవరి 26న రాష్ట్రపతి న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జెండా ఆవిష్కరిస్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. కాబట్టే దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాం. అదే ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగుతారు. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. కాబట్టే.. జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేశారు. అది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీక. అదలా ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. నేడు రాష్ట్రపతి.. ఆరోజున ప్రధాని.. కారణం ఇదే.. ఇక్కడ గమనించాల్సిన మరో వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling). గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. ఘనంగా పరేడ్ నిర్వహిస్తారు. ఇక.. దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి ప్రత్యేకంగా కారణం చెప్పనక్కర్లేదు. ఎర్రకోటపై జెండా ఎగరేశారక ఆయన ప్రసంగం ఇస్తారు. -
రాష్ట్రపతి శీతాకాల విడిదికి ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు శీతాకాల విడిదికి కోసం హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రపతికి ఘనస్వాగతం పలకడంతోపాటు, శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరించాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆమె స్పష్టం చేశారు. సచివాలయంలో ఆమె డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి విడిది చేసే బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు, ట్రాఫిక్ సమస్యలేవీ రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వీవీఐపీల భద్రతకు ఉపయోగించే బ్లూబుక్ ఆధారంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. -
20న పోచంపల్లికి రాష్ట్రపతి రాక
సాక్షి, యాదాద్రి: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈనెల 20న భూదాన్‌పోచంపల్లికి విచ్చేయనున్నారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కత్ చేనేత వస్త్రాల తయారీ, చేనేత కార్మికులు, పద్మశ్రీ, సంత్‌కబీర్ జాతీయ అవార్డు గ్రహీతలతో ముఖాముఖి లో పాల్గొంటారు. అనంతరం పోచంపల్లి హెచ్‌డబ్ల్యూసీఎస్(హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ) షోరూం, హెచ్‌డబ్ల్యూసీఎస్ సీఎం ఇక్కత్ షోరూంను సందర్శించనున్నారు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి విడిది భవన్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.10 గంటలకు భూదాన్‌పోచంపల్లిలోని జేవీఎస్ గార్డెన్‌కు రాష్ట్రపతి చేరుకోనున్నారు. సుమారు గంటపాటు రాష్ట్రపతి పర్యటన కొనసాగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
రాష్ట్రపతికి కొత్త ఓటరు కార్డు
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త ఓటరు కార్డు అందుకున్నారు. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి.కృష్ణమూర్తి స్వయంగా మంగళవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్‌కు వచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కొత్త ఓటరు కార్డు అందజేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి పి.కృష్ణమూర్తి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త ఓటరు కార్డు అందుకున్నట్లు పేర్కొంది. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము గత ఏడాది జులై 25న భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆమె తన ఓటు హక్కును ఒడిశా నుంచి ఢిల్లీకి మార్చుకున్నారు. ఇందు కోసం ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి కృష్ణమూర్తి నవంబర్ 10న రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి సహకారాన్ని అందించినట్లు అధికారులు తెలిపారు. President Droupadi Murmu received her Voter ID card from Shri P. Krishnamurthy, Chief Electoral Officer of Delhi, at Rashtrapati Bhavan. pic.twitter.com/yE2tTXhzq4 — President of India (@rashtrapatibhvn) November 28, 2023 -
సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
ఢిల్లీ: సుప్రీం కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్నిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహాన్ని సుప్రీంకోర్టులో ఏర్పాటు చేయాలన్న అంబేద్కర్ మూమెంట్‌కు చెందిన కొందరు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు సీజేఐ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆర్గూయింగ్ కౌన్సిల్ అసోషియేషన్(ఎస్‌సీఏసీఏ) కూడా సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సీజేఐకి విజ్ఞప్తి చేసింది. 1949 నవంబర్ 26న కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. అనంతరం రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇదీచదవండి..దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన -
దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. గతంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పదహారు మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ట్రాన్స్ఫర్ అయిన జడ్జిల్లో ఏపీ హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలు, తెలంగాణకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. బదిలీ అయిన న్యాయమూర్తుల వారి జాబితా 1. జస్టిస్ ఎస్పీ కేసర్వాణి( అలహాబాద్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ) 2. జస్టిస్ రాజ్ మోహన్ సింగ్( పంజాబ్-హర్యాణా హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) 3. జస్టిస్ నరేందర్ జీ( కర్ణాటక హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) 4. జస్టిస్ సుధీర్ సింగ్(పాట్నా హైకోర్టు నుంచి పంజాబ్, హర్యానా కోర్టుకు బదిలీ 5. జస్టిస్ ఎంవీ మురళిధరన్( మణిపూర్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ) 6. జస్టిస్ మధురేష్ ప్రసాద్ (పాట్నా హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ) ఎపి హైకోర్టులో ఇద్దరు జడ్జిలు బదిలీ 7. జస్టిస్ అరవింద్ సింగ్ సాంగ్వాన్ (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ) 8. జస్టిస్ అవనీష్ జింగాన్ (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ) 9. జస్టిస్ అరుణ్ మోంగా (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ) 0. జస్టిస్ రాజేంద్ర కుమార్ (అలహాబాద్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) 11. జస్టిస్ నాని టాగియా [గువాహతి హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ) 12. జస్టిస్ సి మానవేంద్రనాథ్ రాయ్ [ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి హైకోర్టు గుజరాత్ హైకోర్టుకు బదిలీ) 13. జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ [తెలంగాణ హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ 14. జస్టిస్ జి అనుపమ చక్రవర్తి [తెలంగాణ హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ) 15. జస్టిస్ లపితా బెనర్జీ (అదనపు న్యాయమూర్తి) (కలకత్తా హైకోర్టు నుంచి పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ) 16. జస్టిస్ దుప్పల వెంకట రమణ (అదనపు న్యాయమూర్తి) (ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) ‘‘ఇక్కడ క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
కస్తూర్బా అప్పుడు గాంధీ వెంటే నడిచింది: రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీ: 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రథమ పౌరురాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ పటంలో భారత్ ఇవాళ సముచిత స్థానంలో ఉందని.. అలాగే ఆడబిడ్డలు తమకు ఎదురయ్యే ప్రతీ సవాళ్లను అధిగమిస్తూ.. ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారామె. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది మనందరికీ మహిమాన్వితమైన శుభ సందర్భం. ఆ సంబరం అంబరాన్నంటడం చూసి నా ఆనందానికి అవధుల్లేవు. భారతదేశంలోని నగరాలు, గ్రామాలలో పిల్లలు, యువత, వృద్ధులు.. ప్రతి ఒక్కరు ఎలా ఉత్సాహంగా జెండా పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారో చూడడం సంతోషంగా ఉంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇవాళ దేశం ప్రపంచ వేదికపై తన సముచిత స్థానాన్ని తిరిగి పొందడమే కాకుండా.. అంతర్జాతీయ క్రమంలో తన స్థానాన్ని కూడా పెంచుకున్నట్లు మనం చూస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి, మానవతా లక్ష్యాలను ప్రోత్సహించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ ఫోరమ్‌ల నాయకత్వాన్ని, ముఖ్యంగా G-20 అధ్యక్ష పదవిని కూడా చేపట్టింది. జీ20 ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది ప్రాతినిధ్యం వహిస్తున్నందున, ప్రపంచ ప్రసంగాన్ని సరైన దిశలో రూపొందించడంలో సహాయపడటానికి ఇది ఒక ప్రత్యేక అవకాశం. G-20 అధ్యక్షతతో.. భారతదేశం వాణిజ్యం, ఫైనాన్స్‌లో నిర్ణయాధికారాన్ని సమానమైన పురోగతి వైపు నడిపించగలదు. వాణిజ్యం, ఆర్థిక అంశాలకు అతీతంగా, మానవాభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. గ్లోబల్ సమస్యలతో వ్యవహరించడంలో భారతదేశపు నిరూపితమైన నాయకత్వంతో, సభ్య దేశాలు ఈ రంగాలపై సమర్థవంతమైన చర్యను ముందుకు తీసుకెళ్లగలవని నేను విశ్వసిస్తున్నాను. #WATCH | On the eve of Independence Day, President Droupadi Murmu says "I am happy to note that the economic empowerment of women is being given special focus in our country. Economic empowerment strengthens the position of women in the family and society. I urge all fellow… pic.twitter.com/gCv13rrqft — ANI (@ANI) August 14, 2023 మన దేశంలో మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించడాన్ని గమనించడానికి నేను సంతోషిస్తున్నాను. ఆర్థిక సాధికారత కుటుంబం, సమాజంలో మహిళల స్థానాన్ని బలోపేతం చేస్తుంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను తోటి పౌరులందరినీ కోరుతున్నాను. మా సోదరీమణులు, కుమార్తెలు ధైర్యంగా సవాళ్లను అధిగమించి జీవితంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. #WATCH | On the eve of Independence Day, President Droupadi Murmu says "Today, we see that India has not only regained its rightful place on the world stage, but it has also enhanced its standing in the international order. India is playing a crucial role in promoting… pic.twitter.com/yH2fwaJUbX — ANI (@ANI) August 14, 2023 మన స్వాతంత్య్ర పోరాటంలో మహిళల అభివృద్ధి ఆదర్శం. భారత స్వాతంత్ర సమరంలో.. కస్తూరాబా గాంధీ, మహత్మాగాంధీ వెంటనే ఉండి నడిచింది. ఇప్పుడు.. దేశాభివృద్ధిలో అన్నివిధాలుగా మహిళలు పాలుపంచుకుంటున్నారు. అవి ఎలా ఉన్నాయంటే.. కొన్నేళ్ల కిందట ఎవరూ కూడా ఊహించుకోలేని స్థాయిలో ఉన్నతస్థానాలను సైతం అధిరోహిస్తున్నారు అని హర్షం వ్యక్తం చేశారు. ఈ దేశంలో అంతా సమాన పౌరులే. ప్రతి ఒక్కరికి ఈ భూమిలో సమాన అవకాశాలు, హక్కులు, విధులు ఉన్నాయి. ఈ గుర్తింపు.. కులం, మతం, భాష అన్ని ఇతరాలను అధిగమించాయి అని వ్యాఖ్యానించారామె. -
ఇండియా కూటమికి రాష్ట్రపతి ముర్ము అపాయింట్మెంట్
ఢిల్లీ: మణిపూర్ అంశంపై తనతో చర్చించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ ఇచ్చారు. బుధవారం ఉదయం విపక్ష ఎంపీలతో భేటీ కానున్నారు. మణిపూర్ అంశంపై జోక్యం చేసుకోవాలని.. అవసరమైతే అక్కడ పర్యటించాలని వాళ్లు ఆమెను కోరే అవకాశాలూ లేకపోలేదు. మణిపూర్ వ్యవహారంపై తమ ఆందోళనను పట్టించుకోవాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విజ్ఞప్తికి ఆమె సానుకూలంగా స్పందించారు. ఉదయం 11.30 సమయంలో తనను కలవాలని ఆమె వాళ్లకు సూచించారు. ఇండియా కూటమిలో 21 పార్టీల ఎంపీలు రెండురోజులపాటు మణిపూర్‌లో పర్యటించారు. అల్లర్లు-హింసకు నెలవైన కొండాలోయ ప్రాంతాల్లో తిరిగి.. అక్కడి బాధితులను కలిశారు. ఈ క్రమంలో తిరుగు ప్రయాణ టైంలో మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికీని కలిసి శాంతి భద్రతలను తిరిగి నెలకొనేలా చూడాలంటూ మెమొరాండం సమర్పించారు కూడా. ఈ క్రమంలో ఇండియా కూటమి ఎంపీల మణిపూర్ పర్యటనపైనా బీజేపీ మండిపడింది. ఇటు పార్లమెంట్ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తూ.. డ్రామాలు ఆడుతోందంటూ ఇండియా కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో పార్లమెంట్లో మణిపూర్ హింసపై సుదీర్ఘ చర్చ జరగాలని.. ప్రధాని ప్రసంగించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సభను సజావుగా జరగనివ్వకుండా నినాదాలతో హెరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్ అంశంపైనా అవిశ్వాసం ప్రకటించగా.. 8,9 తేదీల్లో చర్చ జరగాల్సి ఉంది. -
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి (ఫొటోలు)
-
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి
సాక్షి, యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించుకున్నారు. రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి స్వాగతం పలికారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన ద్రౌపది ముర్ము.. యాదాద్రి గర్భాలయంలోప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. యాదాద్రిలో భారీ ఏర్పాట్లు కాగా రాష్ట్రపతి యాదాద్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధానాలయాన్ని మామిడి, అరటి తోరణాలు, పూలతో అలంకరించారు. ఉత్తర రాజగోపురం గుండా రాష్ట్రపతి శ్రీస్వామివారి దర్శనానికి వెళ్లనుండడంతో కృష్ణశిల స్టోన్ ఫ్లోరింగ్‌కు కూల్ పేయింట్ వేశారు. రాష్ట్రపతి ఆలయానికి చేరుకొని తిరుగుపయనం అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోలీసుల ఆధీనంలో యాదాద్రి రాష్ట్రపతి పర్యటన సందర్భంగా యాదాద్రి ప్రధానాలయంతో పాటు రింగ్ రోడ్డు, ఘాట్‌రోడ్డు, హెలిపాడ్లు ఏర్పాటు చేసిన యాగస్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో అడిషనల్ సీసీ సురేంద్రబాబు, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కోట్లా నర్సింహారెడ్డి, యాదగిరిగుట్ట పట్టణ సీఐ సైదయ్య బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి వెంట ఎస్పీజీ, ఐబీ, క్యూఆర్టీ టీంలు రానున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రధానాలయంలో భక్తులతో నిర్వహించే పూజలను రద్దు చేసి స్వామివారికి చేపట్టే ఆర్జిత సేవలను అంతరంగికంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు ఉదయం 9నుంచి 10 గంటల వరకు ఉన్న బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం తర్వాతనే భక్తులు శ్రీస్వామి దర్శనానికి రావాలని ఆలయ అధికారులు కోరారు. -
ములుగు: ముగిసిన రాష్ట్రపతి ముర్ము పర్యటన
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రప్రథమ పౌరురాలు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయా జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారామె. ఇక పర్యటన ముగియడంతో ఆమె హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉదయం భద్రాచలం సీతారాములవారిని దర్శించుకుని,ఆపై మధ్యాహ్నా సమయంలో ములుగు రామప్పను ఆమె సందర్శించారు. ఆమె వెంట గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు తెలంగాణ మంత్రులు ఉన్నారు. సాక్షి, ములుగు జిల్లా: యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించారు . కాకతీయుల కళానైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆమె పూజలు చేశారు. రాష్ట్రపతి వెంట ఆమె కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్లు ఉన్నారు. హెలిప్యాడ్ నుంచి రామప్ప స్టోన్ గేట్ వరకు కాన్వాయ్ వాహనంలో వచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆపై స్టోన్ గేట్ నుంచి రామప్ప ఆలయానికి కాలినడకన చేరుకున్నారు. అనంతరం.. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.రామప్ప ఆలయ ఆవరణలో ‘ప్రసాద్’ స్కీమ్ కింద రూ. 62 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యునెస్కో గుర్తింపు లో భాగంగా కామేశ్వరాలయం పునర్నిర్మాణంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. యునెస్కో గుర్తింపులో.. ఈ కామేశ్వరాలయం పునర్నిర్మాణమే కీలకంగా మారింది. వేయి స్థంభాల మండపం తరహాలో 33 మీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పుతో మహామండపం నిర్మాణం జరనుంది. 2023 జూన్ వరకు ప్రదక్షిణ పథం వరకు, 2026 మార్చి నాటికి కక్షాసనతో పూర్తి పునరుద్దరణ చేస్తారు. అలాగే.. 3 మీటర్ల లోతు నుంచి సాండ్ బాక్స్ పరిజ్ఞానంతో పునాదుల నిర్మాణం జరగనుంది. 8 శతాబ్దాల కిందట ఆలయం నిర్మించినప్పుడు వాడిన ఇసుకనే ఇప్పుడు వాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాచలం చేరుకున్నారు. రాజమండ్రి నుంచి వాయుమార్గం ద్వారా ఉదయం భద్రాచలం చేరుకున్నారు. ఐటీసీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర రాష్ట్రపతికి మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్,సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతా లక్ష్మణ సమేత భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు, వేద పండితులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. భద్రాచలం ఆలయంలో ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. సుమారు 3:45 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం హెలికాప్టర్లో ములుగు జిల్లాలోని రామప్పకు బయలుదేరుతారు. కాగా రాష్ట్రపతి పర్యటన సందర్భంగా 350 మంది అధికారులు విధుల్లో ఉండగా, రెండు వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లతో నిమగ్నమయ్యారని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే భద్రాచలంలో ప్రజల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని, అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని సూచించారు. భారీ కాన్వాయ్ రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మునుపెన్నడూ చూడనంత భారీ కాన్వాయ్ గోదావరి వంతెనపై కనిపించనుంది. మంగళవారం నిర్వహించిన మాక్డ్రిల్లోనే ఏకంగా 70కి పైగా వాహనాలతో కూడిన కాన్వాయ్ ఐటీసీ క్యాంపస్ నుంచి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఇక బుధవారం రాష్ట్రపతితో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా కలిస్తే వందకు పైగా వాహనాలతో కూడిన అతి భారీ కాన్వాయ్ భద్రాచలంలో సైరన్ మోగిస్తూ పరుగులు పెట్టనుంది. అయితే, ఆలయ తూర్పు ముఖద్వారం వరకు రాష్ట్రపతి, ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాహనాలకే అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం. మిగిలిన వీఐపీల వాహనాలను మిథిలా స్టేడియం వరకే అనుమతించనున్నారు. 15 రకాల వంటకాలు భద్రాచలం పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి కోసం 15 రకాల శాకాహార వంటలను సిద్ధం చేస్తున్నారు. ఉల్లిపాయ, చామగడ్డ, చింతపండు, అనపకాయలు ఉపయోగించకుండా వంటలు చేయాలని చెఫ్‌లకు ప్రత్యేక ఆదేశాలు అందాయి. రాష్ట్రపతి పర్యటన ఇలా.. ►ఉదయం 9 గంటలకు రాజమండ్రి నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరనున్న రాష్ట్రపతి సారపాక ఐటీసీలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు 9.50గంటలకు చేరుకుంటారు. రాజమండ్రి నుంచి సారపాక వరకు నడుమ 186 కి.మీ. మేర వాయుమార్గంలో ప్రయాణానికి 50 నిమిషాలు పడుతుందని షెడ్యూల్లో పొందుపర్చారు. ►10 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా 10:10 గంటలకు భద్రాచలం రామాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ►ఆలయ ప్రాంగణంలో ఉదయం 10:10 గంటల నుంచి 10:15 గంటల వరకు ఐదు నిమిషాలు రిజర్వ్ టైంగా కేటాయించారు. ► ఉదయం 10:15 గంటలకు లక్ష్మణ సమేత సీతారాముల దర్శనానికి రాష్ట్రపతి వెళ్తారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోనే ‘ప్రసాద్’ పనులకు శంకుస్థాపన చేస్తారు. ►10:30 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి 2 కి.మీ. దూరంలో ఉన్న శాంతినగర్‌లోని వీరభద్ర ఫంక్షన్ హాల్‌కు చేరుకుంటారు. అక్కడ ఐదు నిమిషాల పాటు రిజర్వ్ టైం కేటాయించారు. ►10:45 గంటల నుంచి 11:30 గంటల వరకు వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన సమ్మక్క – సారలమ్మ జన్జాతి పూజారి సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సమ్మేళనం తర్వాత అక్కడి నుంచే కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ►1:30 గంటలకు వీరభద్ర ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరి 11:40 గంటలకు ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. ►ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 గంటల వరకు భోజనానికి కేటాయించారు. ►మధ్యాహ్నం 1:15 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 1:25 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకున్నాక మంత్రి పువ్వాడతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు వీడ్కోలు పలుకుతారు ►మధ్యాహ్నం 1:35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరనున్న రాష్ట్రపతి 160 కి.మీ. దూరంలో ఉన్న ములుగు జిల్లా రామప్పకు మధ్యాహ్నం 2:20 గంటలకు చేరుకుంటారు. -
భద్రాద్రిలో రాష్ట్రపతి పర్యటన.. 144 సెక్షన్ విధింపు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి జిల్లాలో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(బుధవారం) ఆమె భద్రాచలం ఆలయానికి రానున్నారు. బుధవారం భద్రాచలం శ్రీసీతారాముడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. భద్రాచలంలో 144 సెక్షన్ విధించారు. ఉదయం ఏడు గంటల నుంచి 144 సెక్షన్ అమలులోకి రానుంది. రాకపోకల నిలిపివేత ఉంటుంది. సుమారు 2 వేల మంది పోలీసులతో, 350 అధికారులు రాష్ట్రపతి భద్రతను పర్యవేక్షించనున్నారు. అలాగే.. రాష్ట్రపతి రాక నేపథ్యంలో సారపాక బీపీఎల్ స్కూల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు అధికారులు. హెలిప్యాడ్ నుంచి ఆలయం చుట్టూ ప్రోటోకాల్ కాన్వాయ్ ట్రయల్ నిర్వహించారు. ఉదయం పది గంటల ప్రాంతంలో సీతారాములను దర్శించుకుంటారు. దేశ ప్రథమ పౌరురాలి రాక సందర్భంగా.. ఉదయం 8 గంటల నుంచి 11.30గం. దాకా అన్ని దర్శనాలు బంద్ కానున్నాయి. ఇక తెలంగాణలో మూడు రోజులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారు. ఈ నెల 28న అంటే బుధవారం భద్రాచలం సీతారాములను దర్శించుకుంటారు. ఈ నెల 29న ముచ్చింతల్ సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ నెల 30న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. -
న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.రాఘవరెడ్డి ఆయన కుటుంబీకులు–కోడలు ప్రజ్ఞా రెడ్డి మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞ ఈ–మెయిల్ ద్వారా లేఖ రాశారు. తనను న్యాయం చేయాలని కోరడంతో పాటు ఈ నెల 29న నారాయణమ్మ కాలేజీలో మీ పర్యటనను రాఘవరెడ్డి తదితరులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ లేఖ సోమవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీవిద్య రెడ్డి తదితరులు రెండేళ్లుగా తనతో పాటు తన కుమార్తెను వేధిస్తున్నారని ప్రజ్ఞ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు తమను చంపేందుకు ప్రయత్నించారని, వరకట్నం కోసం హింసించారని వాపోయారు. తామను ఇంటి నుంచి బయటకి రాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి తన గది బయట గోడ కట్టారని లేఖలో పేర్కొన్నారు. చదవండి: Hyderabad: వజ్రాలు కొట్టేసి..గోవా చెక్కేసి.. డైమండ్స్ విలువ తెలియక.. ఇవి తాను చేస్తున్న ఆరోపణలు కాదని.. ఈ విషయం న్యాయస్థానం వరకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించారని ప్రజ్ఞ పేర్కొన్నారు. తమ హక్కులను కాలరాస్తూ, నన్ను బెదిరిస్తున్న అత్తింటి వారిపై ఇప్పటికే హైదరాబాద్‌లో కేసులు నమోదై ఉన్నాయని, సాటి మహిళగా తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని రాష్ట్రపతిని ప్రాధేయపడ్డారు. రాఘవరెడ్డి ఇప్పటికే తన పలుకుబడి వినియోగించి తమను బెదిరించడంతో పాటు దర్యాప్తు సంస్థల్ని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 29న వారికి చెందిన జి.నారాయణమ్మ కళాశాలలో మీ పర్యటనతో మరింత రెచ్చిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పర్యటనను తమకు అనుకూలంగా మార్చుకునే వాళ్లు తనను మరింత వేధించడంతో పాటు దర్యాప్తు సంస్థలను ఇంకా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ప్రజ్ఞ లేఖలో పేర్కొన్నారు. ఈమె తన మెయిల్లో కోర్టు ఆదేశాల మేరకు గది బయట గోడను తొలగిస్తున్న అధికారుల వీడియోను జత చేశారు. -
రాష్ట్రపతి ముర్మును క్షమాపణలు కోరిన సీఎం మమతా.. ఎందుకంటే?
కోల్‌కతా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ క్షమాపణలు తెలియజేశారు. రాష్ట్రపతిపై తమ పార్టీ మంత్రి అఖిల్‌గిరి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ద్రౌపది ముర్మును క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని ఆమె స్పష్టం చేశారు. పార్టీలో ఎవరైనా పొరపాటు చేస్తే తాము వ్యతిరేకిస్తామని, అలాంటి వాటిని తాము సహించమని చెప్పారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అతన్ని హెచ్చరించినట్లు తెలిపారు. రాష్ట్రపతిని మేము ఎంతగానో గౌరవిస్తాం. అమె మంచి మహిళ. అఖిల్ గిరి తప్పు వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. మా ఎమ్మెల్యే తరపున నేను క్షమాపణలు కోరుతున్నా. ఐయామ్ సారీ. అందం అనేది బయటకు ఎలా కనిపిస్తారనేది కాదు. లోపల నుంచి ఎలా ఉన్నాం. ఎలా ఆలోచిస్తారనేది ముఖ్యం’ అని సీఎం మమతా పేర్కొన్నారు. చదవండి: రాష్ట్రపతి ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రిని పదవి నుంచి తప్పించాలని బీజేపీ డిమాండ్ కాగా రామ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యే, బెంగాల్ జైళ్ల శాఖ మంత్రి అఖిల్‌గిరి శుక్రవారం నందిగ్రామ్‌లో జరిగిన ఓ ర్యాలిలో మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ బీజేఎల్పీ నేత సువేందు అధికారిపై విమర్శలు చేస్తూ అఖిల్‌గిరి నోరుజారారు. ‘బీజేపీ నాయకులు నన్ను చూడటానికి అందంగా లేవని అంటున్నారు. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి మేము ఎవరినీ అంచనా వేయం. మేము రాష్ట్రపతి పదవిని గౌరవిస్తాము. కానీ మన రాష్ట్రపతి చూడటానికి ఎలా ఉంటారు? ’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అఖిల్‌గిరి వ్యాఖ్యాలపై పశ్చిమబెంగాల్లో తీవ్ర దుమారం రేగింది. CM Mamata Banerjee has always been Anti Tribal. His minister Akhil Giri took it further and insulted the president on her look. Why she and her govt hate tribals so much ? pic.twitter.com/zhArXBcooa — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) November 11, 2022 The @AITCofficial Min. Sh. Akhil Giri, unconditionally APOLOGISES for his insensitive comment on the @rashtrapatibhvn Smt. Droupadi Murmu, & expresses his deepest RESPECT for the Chair of the President. pic.twitter.com/BFUsr0P2x2 — 𝐑𝐢𝐣𝐮 𝐃𝐮𝐭𝐭𝐚 (@DrRijuDutta_TMC) November 12, 2022 17 సెకన్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చివరికి మంత్రి తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరారు. మంత్రి వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పింది. ‘గౌరవనీయ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల మాకు చాలా గౌరవం ఉంది. ఎమ్మెల్యే అఖిల్ గిరి చేసిన దురదృష్టకర వ్యాఖ్యలను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాంటి ప్రకటనలను మేము సమర్థించబోము.. మహిళా సాధికారత యుగంలో స్త్రీల పట్ల ద్వేషం ఆమోదయోగ్యం కాదు' అని పేర్కొంది. చదవండి: 'కాంగ్రెస్‌కి వేసి ఓట్లను వృధా చేయకండి': అరవింద్ కేజ్రీవాల్ -
‘రాష్ట్రపతిపై వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం’.. ఆ మంత్రిపై టీఎంసీ ఫైర్
కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. అంటూ ఆయన చేసిన కామెంట్ల తాలుకా వీడియో వివాదాస్పదమైన నేపథ్యంలో విపక్షాలు అధికార టీఎంసీ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో మంత్రి వ్యాఖ్యలపై స్పందించింది తృణమూల్ కాంగ్రెస్. ఆయన తీరు బాధ్యతారాహిత్యమేనని, ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, పూర్తిగా వ్యక్తిగతమని స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎంసీ అధికార ప్రతిని సాకెత్ గోఖలే ట్వీట్ చేశారు. ‘ఇది బాధ్యతారాహిత్యంగా చేసిన కామెంట్. ఆ వ్యాఖ్యలతో టీఎంసీకి ఎలాంటి సంబంధం లేదు. మేము భారత రాష్ట్రపతి పట్ల ఎంతో గర్వపడుతున్నాం. మేము ఆమెను, ఆమె పదవిని అత్యున్నతంగా చూస్తాం.’ అని తెలిపారు టీఎంసీ అధికార ప్రతినిధి సాకెత్ గోఖలే. Statement: This is an irresponsible comment & does NOT represent the views of @AITCofficial. We are extremely proud of the President of India & hold her & her office in the highest regard. https://t.co/v571435Snv — Saket Gokhale (@SaketGokhale) November 12, 2022 మంత్రి క్షమాపణలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన క్రమంలో క్షమాపణలు చెప్పారు టీఎంసీ మంత్రి అఖిల్ గిరి. ‘రాష్ట్రపతిని నేను చాలా గౌరవిస్తాను. సువేందు అధికారికి సమాధానం చెప్పేందుకు పదవిని చూపిస్తూ వ్యాఖ్యానించా. ఎవరి పేరును చెప్పలేదు. ఆయన అఖిల్ గిరి చాలా అంద వికారంగా ఉంటారని చెప్పారు. నేను ఒక మంత్రిని. నాగురించే ఏదైనా చెడుగా చెబితే.. అది రాజ్యాంగానికే అవమానం. నేను రాష్ట్రపతి అని సంబోధించాను కానీ, ఎవరి పేరు చెప్పలేదు. దీనిని భారత రాష్ట్రపతి అవమానంగా భావిస్తే.. క్షమాపణలు చెబుతున్నా. నేను చెప్పినదానికి పశ్చాతాపపడుతున్నా.’ అని పేర్కొన్నారు మంత్రి అఖిల్ గిరి. I respect President. I mentioned the post&made a comparison to respond to Suvendu Adhikari,I didn't take any name. He had said Akhil Giri looks bad in his appearance. I'm a min,took oath to office. If something is said against me, it's an insult to Constitution: WB Min Akhil Giri pic.twitter.com/9w1oY2BuZA — ANI (@ANI) November 12, 2022 ఇదీ చదవండి: వీడియో: మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. ముర్ముపై మంత్రి వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్ -
రాష్ట్రపతి ముర్ముపై మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు! వైరల్
కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నందిగ్రామ్‌లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. రాజకీయ విమర్శలకు కారణం అయ్యాయి. మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. అంటూ ఆయన చేసిన కామెంట్ల తాలుకా వీడియో ఒకటి వివాదాస్పదంగా మారింది. ‘‘ఆయన(బీజేపీ నేత సువేందు అధికారి).. నేను (అఖిల్ గిరి) చూడడానికి బాగోలేను అన్నాడు. మరి ఆయనెంత అందంగా ఉన్నాడు?. ఒకరిని అప్పీయరెన్స్ బట్టి అలా నిర్ణయించకూడదు. అంతెందుకు మనం మన రాష్ట్రపతి కుర్చీకి గౌరవం ఇస్తాం. మరి ఆ రాష్ట్రపతి చూడానికి ఎలా ఉంటారు?’’ అని అఖిల్ గిరి అక్కడ ఉన్న కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడున్న వాళ్లు ఈలలు, చప్పట్లతో అఖిల్‌ను మరింత ప్రొత్సహించారు. President Droupadi Murmu, hails from the Tribal community. Akhil Giri, TMC Minister of Correctional Homes made objectionable comments about her in the presence of Shashi Panja, another minister from the women’s welfare department Mamata Banerjee and TMC are anti-tribal. pic.twitter.com/vJNiZ7nBLM — BJP Bengal (@BJP4Bengal) November 11, 2022 ఇక టీఎంసీ నేత చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ప్రతిపక్ష బీజేపీ.. టీఎంసీ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. గిరిజనులకు మమతా బెనర్జీ, ఆమె నేతృత్వంలోని టీఎంసీ పార్టీ వ్యతిరేకమని విమర్శించింది. మరో మంత్రి.. అదీ మహిళా సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా సమక్షంలో అఖిల్ గిరి ఈ వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ హైలెట్ చేసింది. Akhil Giri, minister in Mamata Banerjee’s cabinet, insults the President, says, “We don't care about looks. But how does your President look?" Mamata Banerjee has always been anti-Tribals, didn’t support President Murmu for the office and now this. Shameful level of discourse… pic.twitter.com/DwixV4I9Iw — Amit Malviya (@amitmalviya) November 11, 2022 బీజేపీ నేత అమిత్ మాలవియా.. టీఎంసీ నేతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మమతా బెనర్జీ కేబినెట్లోని అఖిల్ గిరి.. రాష్ట్రపతిని ఘోరంగా అవమానించారు. అప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ముర్ముకు మమతా బెనర్జీ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడేమో ఇలా అవమానించడాన్ని ప్రొత్సహిస్తున్నారు అంటూ ట్వీట్ చేశారాయన. BJP MP Saumitra Khan writes to National Commission for Women (NCW), requesting them to "immediately arrest" Akhil Giri and take appropriate action against him and "try to dismiss him from the MLA post also" over his objectionable remark on President Droupadi Murmu. https://t.co/DJqIQ6uTFt pic.twitter.com/K4HnVBtHrT — ANI (@ANI) November 12, 2022 ఇదీ చదవండి: కేజ్రీవాల్ ఎంట్రీతో మారిన హిమాచల్ సీన్ -
బ్రిటన్ రాణి అంత్యక్రియలకు హాజరుకానున్న ద్రౌపది ముర్ము
సాక్షి,న్యూఢిల్లీ: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. భారత ప్రభుత్వం తరఫున రాణికి నివాళులు అర్పించనున్నారు. సెప్టెంబర్ 17-19 వరకు ముర్ము పర్యటన ఉంటుంది. ఎలిజబెత్ 2 అంత్యక్రియలు వెబ్‌మిన్‌స్టర్ అబ్బేలో సోమవారం(సెప్టెంబరు 19న) జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచదేశాల అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 96 ఏళ్ల బ్రిటన్ రాణి సెప్టెంబర్ 8న తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సెప్టెంబర్ 12 ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయానికి వెళ్లి భారత్ తరఫున సంతాపం తెలియజేశారు. రాణి మృతి పట్ల భారత్ సెప్టెంబర్ 11న సంతాప దినం నిర్వహించింది. చదవండి: పంజాబ్‌లో 'ఆపరేషన్ లోటస్'.. 10 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఆఫర్ -
Teachers Day 2022: మాతృభాషలో బోధనతో ప్రతిభకు పదును
న్యూఢిల్లీ: పాఠశాల స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిలషించారు. మాతృభాషలో బోధిస్తే పిల్లల్లో సైన్స్, సాహిత్యం, సామాజిక శాస్త్రాలకు సంబంధించి నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పాఠ్యాంశాలను వారు సులువుగా అర్థం చేసుకోగలుగుతారన్నారు. నూతన జాతీయ విద్యావిధానంలో పాఠశాల, ఉన్నత విద్యలో భారతీయ భాషలకు ప్రాధాన్యం లభించిందని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు. తమ గ్రామం నుంచి కాలేజీలో చదువుకునేందుకు వెళ్లిన మొదటి బాలికగా నిలవడం వెనుక ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహమే కారణమని చెప్పారు. వారికి తానెంతో రుణపడి ఉంటానన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము 46 మంది ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు అందజేశారు. వీరిలో హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులున్నారు. -
రాష్ట్రపతి ముర్ముతో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ
-
సమున్నత భారత్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలోని అసలైన శక్తిసామర్థ్యాలను గుర్తించడంలో ప్రపంచానికి భారత్ తోడ్పాటును అందించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. అణగారిన వర్గాలు, పేదలు, అవసరాల్లో ఉన్నవారి పట్ల భారత్ దయార్ధ్ర హృదయంతో మెలుగుతోందని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ఆమె రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 17 నిమిషాలపాటు ప్రసంగించారు. భారీ ఆర్థిక సంస్కరణలతోపాటు వినూత్న ప్రజా సంక్షేమ పథకాలతో దేశం ముందడుగు వేస్తోందన్నారు. ‘‘సమున్నతంగా ఎదుగుతున్న నూతన భారత్‌ను ప్రపంచం అబ్బురంగా వీక్షిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తోంది’’ అన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశాం ‘‘భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు అంతర్జాతీయ నాయకులు, పాశ్చాత్య నిపుణులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. పేదరికం, నిరక్షరాస్యత తాండవిస్తున్న భారత్‌లో ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదా? అని అనుమానించారు. వారి అనుమానాలను మనం పటాపంచలు చేశాం. ఈ గడ్డపై ప్రజాస్వామ్యం కేవలం పురుడు పోసుకోవడమే కాదు, దివ్యంగా వర్థిల్లుతోంది. దినదిన ప్రవర్థమానమవుతోంది. దేశ భద్రత, ప్రగతి, సౌభాగ్యం కోసం సర్వశక్తులూ ధారపోస్తామని పౌరులంతా ప్రతిజ్ఞ చేయాల్సిన తరుణమిది. ప్రాంతీయ అసమానతలను తగ్గించడంతోపాటు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా విధాన రూపకర్తలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయం. మానవ చరిత్రలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం కరోనా మహమ్మారిపై భారత్ సాగించిన పోరాటాన్ని ప్రపంచమంతా హర్షించింది. మానవ చరిత్రలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని మనం చేపట్టాం. కరోనా టీకాలను దేశీయంగానే తయారు చేసుకున్నాం. టీకా డోసుల పంపిణీలో 200 కోట్ల మార్కును గత నెలలోనే దాటేశాం. మహమ్మారిని నియంత్రించే విషయంలో అభివృద్ధి చెందిన కొన్ని దేశాల కంటే భారత్ గొప్ప విజయాలు సాధించింది. ఇందుకు మన సైంటిస్టులు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వ్యాక్సినేషన్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయాలి. కరోనా వైరస్ ఎన్నో జీవితాలను బలి తీసుకుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. ఈ సంక్షోభం వల్ల తలెత్తిన పరిణామాలతో ఎన్నో దేశాలు సతమతమవుతుండగా, భారత్ వేగంగా కోలుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటిగా నిలుస్తోంది. అప్పుడే మన మనుగడకు అర్థం భవ్యమైన భారత్‌ను నిర్మించుకుంటేనే మన మనుగడ మరింత అర్థవంతంగా మారుతుంది. మాతృదేశం కోసం, తోటి పౌరుల ప్రగతి కోసం త్యాగాలు చేయాలన్న పెద్దల మాటను గుర్తుంచుకోవాలి. 2047 నాటికి గొప్ప భారత్‌ను నిర్మించబోతున్న యువతకు ఇదే నా ప్రత్యేక విజ్ఞప్తి. ప్రజాస్వామ్యం బాగా వేళ్లూనుకున్న దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లభించేందుకు చాలాకాలం పట్టింది. అందుకోసం వారు పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ, గణతంత్ర భారత్‌లో మొదటినుంచే వయోజనులందరికీ ఓటు హక్కు లభించింది. జాతి నిర్మాణంలో వయోజనులందరికీ భాగస్వామ్యం ఉండాలని అప్పటి పాలకులు నిర్ణయించారు. ఆర్థిక విజయంతో జీవితాలు సులభతరం మన దేశంలో స్టార్టప్ కంపెనీలు మంచి విజయం సాధిస్తున్నాయి. యూనికార్న్ కంపెనీల సంఖ్య నానాటికీ పెరుగుతుండడం సంతోషకరం. మన పారిశ్రామిక ప్రగతికి ఇదొక ఉదాహరణ. ఈ క్రెడిట్ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, విధాన రూపకర్తలకు చెందుతుంది. మన ఆర్థిక వ్యవస్థ వెలుగులీనడానికి స్టార్టప్ కంపెనీలు దోహదపడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఫిజికల్, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో అనూహ్యమైన వృద్ధి నమోదవుతోంది. కార్మికులు, పారిశ్రామికవేత్తల కృషితోనే ఇది సాధ్యమవుతోంది. మనం సాధిస్తున్న అభివృద్ధి సమీకృతంగా, అసమానతలను తగ్గించేలా ఉంటుండడం ముదావహం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. దీర్ఘకాలంలో ఉపయోగపడేలా ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. విధాన నిర్ణయాలు అమలు చేయాలి. జాతీయ విద్యా విధానం కూడా ఆ కోవలోనిదే. ఆర్థిక విజయం ప్రజల జీవితాలను సులభతరం చేస్తుంది. సొంతిల్లు.. ఇక ఎంతమాత్రమూ కల కాదు పేదలకు సొంతిల్లు అనేది ఇక ఎంతమాత్రం కలగా మిగిలిపోవడం లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో అది వాస్తవ రూపం దాలుస్తోంది. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ కుళాయి నీరందుతోంది. ప్రజలందరికీ.. ముఖ్యంగా పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మన రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక విధులను ప్రజలంతా తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాటిని త్రికరణ శుద్ధితో ఆచరిస్తే మన దేశం ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ఖాయం. ‘నేషన్ ఫస్ట్’ అనే స్ఫూర్తితో పనిచేయాలి. మనం స్వేచ్ఛగా జీవించేందుకు ఎంతోమంది మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారు. వారిని స్మరించుకోవాల్సిన సందర్భం వచ్చింది. వలస పాలకుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి లభించిన దినం కేవలం మన ఒక్కరికే పండుగ రోజు కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ వేడుకే’’ అని రాష్ట్రపతి ముర్ము వివరించారు. భారత్ బహుమతులు యోగా, ఆయుర్వేదం యువత, రైతులు, మహిళలు దేశానికి కొత్త ఆశారేఖలు. ముఖ్యంగా మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో వారి భాగస్వామ్యం పెరుగుతోంది. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థల్లో 14 లక్షల మంది మహిళలు ఎన్నికయ్యారు. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో మహిళా క్రీడాకారులు మన దేశం గర్వపడేలా రాణించారు. వారిలో చాలామంది అణగారిన వర్గాల నుంచి వచ్చినవారే. మన బిడ్డలు యుద్ధ విమానాలు నడుపుతున్నారు. అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ స్ఫూర్తిని అందిపుచ్చుకొని మనమంతా కలిసి ప్రయాణం సాగించాలి. యోగా, ఆయుర్వేదం అనేవి ప్రపంచానికి భారత్ ఇచ్చి న విలువైన బహుమతులు. ప్రపంచమంతటా వాటికి ఆదరణ పెరుగుతోంది. -
రాష్ట్రపతి అంటే గౌరవం లేదా? కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే..
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి. గురువారం పార్లమెంటులో రాష్ట్రపతి అంటే గౌరవం లేకుండా ఆమె మాట్లాడారని ఆరోపించారు. పదే పదే ద్రౌపది ముర్ము అని పిలిచారని, పేరుకు ముందు రాష్ట్రపతి అని గానీ, మేడం, శ్రీమతి అని గానీ సంభోదించలేదని విమర్శించారు. ఈమేరకు అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాష్ట్రపతి అంటే మర్యాద లేకుండా మాట్లాడినందుకు స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా, గురువారమే పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అని సంభోదించారు అధిర్ రంజన్ చౌదరి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్రపతిని అవమానించేలా మాట్లాడినందుకు అధిర్ రంజన్‌తో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ పార్లమెంటు ఆవరణలో ఆందోళనలు కూడా చేపట్టారు. చివరకు అధిర్ రంజన్ చౌదరి వెనక్కితగ్గారు. క్షమాపణలు కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. చదవండి: మీరు బతికున్నారంటే మోదీ చలవే.. 'డోసు' పెంచిన బిహార్ మంత్రి -
Adhir Ranjan Chowdhury: రాష్ట్రపతిని క్షమాపణలు కోరిన కాంగ్రెస్ నేత
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈమేరకు రాష్ట్రపతికి లేఖ రాసి క్షమాపణలు కోరారు. పొరపాటుగా నోరుజారడం వల్లే ఆ పదం మాట్లాడినట్లు పేర్కొన్నారు. తన తప్పును క్షమిస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో రాసుకొచ్చారు. పార్లమెంటులో గురువారం మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అని అన్నారు అధిర్ రంజన్ చౌదరి. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అధిర్ రంజన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, రాష్ట్రపతి అయిన గిరిజన బిడ్డను అవమానించేలా ఆయన మాట్లాడారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగ్గారు. దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చదవండి: ‘రాష్ట్రపతి కాదు.. రాష్ట్రపత్ని’.. కాంగ్రెస్ నేత కామెంట్లపై దద్దరిల్లిన లోక్‌సభ -
రాష్ట్రపతి ముర్ము తొలి జ్యుడీషియల్ నియామకం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టు కొత్త అదనపు న్యాయమూర్తిగా రాజేశ్ సెఖ్రీ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. ఉత్తర్వుపై సంతకం చేశారు. రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి జ్యుడీషియల్ నియామకం ఇదే. దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గత సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము మరో రికార్డు సృష్టించారు. ఇదీ చదవండి: Draupadi Murmu: ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం.. ‘భారత్‌కు ఉద్వేగభరిత క్షణం’.. -
రాష్ట్రపతితో భేటీ అయిన ఏపీ గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం భేటీ అయ్యారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో.. రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా ఆమెను కలిశారు ఆయన. ఈ ఇద్దరూ ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రముఖులే కావడం గమనార్హం. సమకాలీన రాజకీయాలపై ఈ ఇద్దరూ చర్చించుకున్నట్లు ఏపీ రాజ్ భవన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. భేటీ అనంతరం తిరిగి ఆయన ఏపీకి వచ్చేశారు. -
ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము (ఫొటోలు)
-
రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము
-
నేను ఒక ఆదివాసీ గ్రామం నుంచి వచ్చా: రాష్ట్రపతి ముర్ము
సాక్షి, ఢిల్లీ: దేశంలో పేదలు కలలు కనొచ్చు.. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చని.. అందుకే తానే ఒక మంచి ఉదాహరణ అని భారత దేశ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సోమవారం(ఇవాళ) ఉదయం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో రాష్ట్రపతిగా ఆమె ప్రమాణం చేశారు. అనంతరం ఆమె ప్రసంగించారు. అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు అని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మీ ప్రేమ, ఆప్యాయత, నమ్మకం.. రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడానికి నన్ను ప్రోత్సహిస్తాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో.. రాష్ట్రపతిగా నేను బాధ్యతలు చేపట్టడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. స్వాతంత్ర్య సమరయోధుల లక్ష్యాల కోసం మనం కృషి చేయాలి. దేశ రక్షణ దళాలకు, పౌరులందరికీ కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు. నేను ఒక ఆదివాసీ గ్రామం నుంచి వచ్చా. మా గ్రామంలో బాలికలు స్కూల్‌కు వెళ్లడం ఎంతో పెద్ద విషయం.. మా ఊరిలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేనే. ఆదివాసీ మహిళగా దేశ అత్యున్నత పదవి చేపట్టం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. దేశంలో పేదలు కలలు కనొచ్చు. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చు. అందుకే నేనే ఒక ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, సంప్రదాయాలు నాకు అత్యంత ప్రాధాన్యత అంశాలు. దేశంలోని మహిళలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇస్తున్నా అని పార్లమెంట్ సెంట్రల్ హాల్ సాక్షిగా ఆమె ప్రసంగించారు. -
నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ, అమిత్ షా అభినందలు
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమం.. అప్డేట్స్ TIME: 3.00PM రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపదికి ముర్ముకు దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నూతన రాష్ట్రపతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. దేశానికి ఇదొక ఉద్వేగభరిత క్షణాలని హర్షం వ్యక్తం చేశారు. TIME: 2.30PM కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపారు. ముర్ము తన పదవీకాలంలో దే శ గర్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని నమ్మకం ఉందన్నారు. నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు అని అన్నారు. 11:35AM ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆమె మొదటి గార్డ్ ఆఫ్ ఆనర్‌ను తనిఖీ చేశారు. #WATCH President Droupadi Murmu inspects her first Guard of Honour after taking the oath, at Rashtrapati Bhavan in Delhi pic.twitter.com/T47qfSWHBu — ANI (@ANI) July 25, 2022 11:00AM ►రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము ► 10:48AM గుర్రపు కవాతు నడుమ అధికారిక వాహనంలో రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ► 10:47AM పార్లమెంట్ హాల్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ► హాల్ నుంచి బయటకు వచ్చిన రాష్ట్రపతి ముర్ము. వెంట.. సీజే ఎన్వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్పీకర్ ఓం బిర్లా. గౌరవ వందనం స్వీకరణ. ► 10:44 AM ముర్ము ప్రసంగం అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. అనంతరం ప్రధాని , కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులకు అభివాదం చేశారు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ► 10:15AM రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి ప్రసంగం జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం దేశ ప్రజలకు కృతజ్ఞతలు నాపై మీరు చూపిన ప్రేమ, అభిమానం, నమ్మకం రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రోత్సహిస్తాయి దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టేందుకు కృషి చేస్తా మా గ్రామం పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేను: ముర్ము భారత్ ప్రగతి పథంలో నడుస్తోంది. ఇంకా వేగంగా అభివృద్ది చెందాలని ఆశిస్తున్నా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ► 10:12AM భారత రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ద్రౌపది ముర్ము. ప్రమాణం చేయించారు భారత దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. ► 10:08AM పార్లమెంట్‌కు చేరిన కోవింద్, ముర్ము పార్లమెంట్‌కు చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. వెంట సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ముర్ముకు త్రివిధ దళాల గన్ సెల్యూట్. ► 10:00AM పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 15వ రాష్ట్రపతిగా సీజే ఎన్వీ రమణ సమక్షంలో ప్రమాణం చేయనున్న ద్రౌపది ముర్ము. ► పార్లమెంట్‌కు బయలుదేరిన రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. ► రాష్ట్రపతి ఫోర్‌కోర్టులో గౌరవ వందనం స్వీకరించిన రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. ► రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి ద్రౌపది ముర్ము నివాళులు. #DroupadiMurmu at Rajghat before taking oath as President NDTV's Sunil Prabhu reports pic.twitter.com/jsrQ30X4Sw — NDTV (@ndtv) July 25, 2022 ► ఉదయం 10గం.15ని. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్న ద్రౌపది ముర్ము ► ప్రమాణం తర్వాత 21 గన్ సెల్యూట్ స్వీకరించనున్న ద్రౌపది ముర్ము. ► ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఉప రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ తదితరులు పాల్గొననున్నారు. ► ప్రమాణం అనంతరం నూతన రాష్ట్రపతిగా ముర్ము ప్రసంగిస్తారు. ►భారత 15వ రాష్ట్రపతిగా గిరిజన ఆడబిడ్డ ద్రౌపది ముర్ము(64) ఇవాళ(సోమవారం) ప్రమాణం చేయనున్నారు. ► పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ► సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించనున్నారు. ► తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు. అయితే.. 1977 తర్వాత జూలై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న పదో రాష్ట్రపతిగా ముర్ము చరిత్రలో నిలిచిపోనున్నారు. ► నీలం సంజీవరెడ్డి ఆరవ రాష్ట్రపతిగా 1977 సంవత్సరం జూలై 25న ప్రమాణం చేశారు. ► ప్రమాణ స్వీకారం, ప్రసంగం తర్వాత ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. అక్కడ సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తారు. -
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు ప్రసంగం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు రామ్‌నాథ్ కోవింద్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా గొప్పగా ఉందన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సంస్కృతి నేటి యువతను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. 21వ శతాబ్దం భారత్‌దే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను కాన్పుర్ దేహాత్ జిల్లా పరౌఖ్ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరినట్లు కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా తన శాయశక్తుల మేరకు బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు. తనకు సమాజంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా పార్లమెంటేరియన్లు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. సోమవారం ఆమె భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చదవండి: ఉద్ధవ్ థాక్రేకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు.. ఆయన తలరాత ఆ రోజే ఖరారైంది -
Draupadi Murmu: సంబురంగా చిందులేసిన ద్రౌపది ముర్ము!
వైరల్: ఎక్కడో ఒడిశాలో మారుమూల పల్లెలో పుట్టి కౌన్సిలర్ స్థాయి నుంచి.. ఇవాళ దేశ ప్రథమ పౌరురాలి స్థాయికి ఎదిగి.. తొలి గిరిజన రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు ద్రౌపది ముర్ము(64). జులై 25న సర్వసత్తాక గణతంత్ర్య భారత్‌కు 15వ రాష్ట్రపతిగా ఆమె ప్రమాణం చేయబోతున్నారు. ఈ తరుణంలో.. ద్రౌపది ముర్ముకు సంబంధించిన అరుదైన ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. అందునా ఆమె హుషారుగా పాట పాడుతూ.. సరదాగా చిందులు (గిరిజన సంప్రదాయ నృత్యాలను చిందులనే వ్యవహరిస్తారు) వేసిన వీడియో ఒకటి కూడా విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. అయితే ఆ వీడియో ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు చేసింది కాదు. అసలు ఆ వీడియో ఈ మధ్యది కాదు. తన రాజకీయ ప్రస్థానంలో ప్రజానేతగా ఆమెకంటూ మంచి గుర్తింపు దక్కింది. 2018లో జార్ఖండ్ గవర్నర్‌గా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆమె స్వగ్రామం నుంచి వెళ్లిన కొందరు మహిళలు.. రాంచీ రాజ్‌భవన్ ఎదుట గిరిజన సంప్రదాయ నృత్యాలు నిర్వహించారు. ఆ సందర్భంలో హుషారుగా ఆమె వాళ్లతో కలిసి చిందులేసి.. పాట పాడారు అంతే. ముర్ము స్వగ్రామం ఒడిశా మయూర్భంజ్ జిల్లా రాయ్‌రంగ్‌పూర్ ప్రజలు.. దీదీ అని ఆమెను ఆప్యాయంగా పిల్చుకుంటారు. అందుకే ఆమె ఏ పదవిలో ఉన్నా.. తమ ఊరికే గర్వకారణమని భావిస్తుంటారు. తాజాగా ఆమె రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే ఆమె ఘన విజయాన్ని ఊరంతా సంబురంగా చేసుకుంది. ఇదీ చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతో తెలుసా? -
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక
-
Draupadi Murmu: నిరాడంబరతే ఆభరణం
పుట్టింది వెనకబడ్డ ఒడిశా రాష్ట్రంలో. అందులోనూ, దేశంలోకెల్లా అత్యంత వెనకబడ్డ జిల్లాలో. ఎలాంటి సౌకర్యాలకూ నోచని అత్యంత కుగ్రామంలో. అది కూడా అత్యంత వెనకబడిన సంతాల్ గిరిజన కుటుంబంలో. అలా అత్యంత అట్టడుగు స్థాయి నుంచి మొదలైన ద్రౌపదీ ముర్ము జీవన ప్రస్థానం అత్యున్నతమైన రాష్ట్రపతి పీఠం దాకా సాగిన తీరు ఆద్యంతం ఆసక్తికరం. సౌకర్యాల లేమిని అధిగమించడంలో ఎంతటి అసమాన పట్టుదల కనబరిచారో వ్యక్తిగత జీవితంలో ఎదురైన పెను విషాదాలను తట్టుకోవడంలోనూ అంతకు మించిన మనో నిబ్బరం చూపారామె. అన్నింటికీ మించి ఎదిగిన కొద్దీ అంతకంతా ఒదిగుతూ వచ్చారు. వినమ్రతకు పర్యాయ పదంలా నిలిచారు. నెలకు కేవలం 10 రూపాయలతో కాలేజీ జీవితం గడుపుకున్నప్పుడు ఎంత నిరాడంబరంగా ఉన్నారో, 2021లో జార్ఖండ్ గవర్నర్‌గా పదవీ విరమణ చేశాక కూడా అంతే నిరాడంబరత ప్రదర్శించారు. స్వస్థలానికి తిరిగొచ్చి భర్త కట్టించిన సాదాసీదా ఇంట్లోనే మామూలు జీవితం గడిపారు. అంతటి నిగర్వి ముర్ము. జార్ఖండ్ గవర్నర్‌గా కూడా వివాదరహితంగా బాధ్యతలను నిర్వర్తించిన సౌమ్యురాలు. అధికార కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన ఆమెకు విపక్షాల ఓట్లు కూడా గణనీయంగా పడేందుకు గిరిజన నేపథ్యంతో పాటు ఈ ప్రవర్తన కూడా కారణమైంది. ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా ఉపర్బేడ గ్రామంలో 1958 జూన్ 20వ తేదీన జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. పట్టుదలతో స్కూలు చదువు, తర్వాత భువనేశ్వర్‌లో కాలేజీ చదువు పూర్తి చేశారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్‌గా జీవితం మొదలు పెట్టారు. స్కూల్ టీచర్‌గా, రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. 1997లో బీజేపీలో చేరారు. రాయ్‌రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2000లో చైర్పర్సన్ అయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, తర్వాత బీజేపీ–బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2015లో జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ అయ్యారు. పేరు: ద్రౌపది ముర్ము పుట్టిన తేదీ: జూన్ 20, 1958 పుట్టిన ఊరు: ఉపర్బేడ, మయూర్భంజ్, ఒడిశా వయస్సు: 64 ఏళ్లు తండ్రి: బిరంచి నారాయణ్ తుడు రాజకీయ పార్టీ: బీజేపీ చదువు: రమాదేవి విమెన్స్ యూనివర్సిటీ నుంచి బీఏ చేపట్టిన పదవులు: జార్ఖండ్ గవర్నర్, ఒడిశా రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక, వాణిజ్యం, రవాణా శాఖలు సంతానం: ఇతిశ్రీ ముర్ము (బ్యాంకు ఉద్యోగి) భర్త: శ్యాం చరణ్ ముర్ము (2014లో మృతి) తీరని విషాదాలు... ముర్ము వ్యక్తిగత జీవితంలో తీరని విషాదాలున్నాయి. బ్యాంక్ ఉద్యోగి అయిన శ్యామ్ చరణ్ ముర్మును ఆమె పెళ్లాడారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2009–15 మధ్య కేవలం ఆరేళ్ల వ్యవధిలో భర్తతో పాటు ఇద్దరు కొడుకులను, తల్లిని, సోదరుడినీ కోల్పోయారు. ఈ విషాదం తనను ఆధ్యాత్మిక బాట పట్టించిందని 2016లో దూరదర్శన్ ఇంటర్వ్యూలో గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘అప్పట్లో పూర్తిగా కుంగిపోయి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అప్పుడే బ్రహ్మకుమారీల ఆశ్రమాన్ని సందర్శించాను. నా కుమార్తె కోసం జీవించాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు. ముర్ము చరిత్ర సృష్టించారు అత్యున్నత పదవికి ఎన్నికైన గిరిజన బిడ్డగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ఆమె గొప్ప రాష్ట్రపతిగా పేరు సంపాదిస్తారు. ఆమె పేదలు, అణగారిన వర్గాల ఆశారేఖగా ఉద్భవించారు. 130 కోట్ల మంది దేశ ప్రజలు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’జరుపుకుంటున్న వేళ గిరిజన బిడ్డ రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం గొప్ప విషయం. మారుమూల కుగ్రామంలో జన్మించిన ముర్ము సాధించిన విజయాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం. ముర్ముకు మద్దతుగా నిలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు మోదీ కృతజ్ఞతలు. – ప్రధాని నరేంద్ర మోదీ నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు నా అభినందనలు, శుభాకాంక్షలు. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రజా జీవితంలో ద్రౌపది ముర్ము సంపాదించిన అనుభవం, అందించిన నిస్వార్థ సేవలు, ప్రజా సమస్యలకు ఆమెకున్న అవగాహన దేశానికి ఉపయోగడపతాయి. ద్రౌపది ముర్ముకు మనస్ఫూర్తి అభినందనలు. – ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదుపరి రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక దేశానికి గర్వకారణం. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ముర్ముకు అభినందనలు. –హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ద్రౌపది ముర్ముకు అభినందనలు. దేశాధినేతగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను ఆమె కాపాడుతారన్న నమ్మకం ఉంది. – బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నా తండ్రి పీఏ సంగ్మా ఇప్పుడు జీవించి ఉంటే ద్రౌపది ముర్ము విజయాన్ని చూసి ఎంతగానో సంతోషించేవారు. ముర్ముకు నా అభినందనలు. –మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా రాష్ట్రపతి ఎన్నికలో నెగ్గిన ముర్ముకు నా అభినందలు. భయం, పక్షపాతానికి తావులేకుండా రాజ్యాంగ పరిరక్షణకు ఆమె కృషి చేస్తారని ఆశిస్తున్నా. – యశ్వంత్ సిన్హా 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు అభినందనలు. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. –రాహుల్ గాంధీ -
Draupadi Murmu: ద్రౌపది ముర్ముకు యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు.. ఆమె చేతిలో ఓడిపోయిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు తెలిపారు. భారత 15వ రాష్ట్రపతి ఎవరికీ భయపడకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా రాజ్యాంగానికి కట్టుబడి బాధ్యతలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజలతో పాటు తాను కూడా ముర్ముకు అభినందనలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. I join my fellow citizens in congratulating Smt Droupadi Murmu on her victory in the Presidential Election 2022. India hopes that as the 15th President of the Republic she functions as the Custodian of the Constitution without fear or favour. pic.twitter.com/0gG3pdvTor — Yashwant Sinha (@YashwantSinha) July 21, 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. విజయం అనంతరం ఆమెకు ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు, ఇతర రాజకీయ నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము -
ద్రౌపది ముర్ము నివాసానికి ప్రధాని మోదీ
-
President Election 2022: ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి,న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మోదీతోపాటు ముర్ము నివాసానికి వెళ్లారు. కాసేపు ఆమెతో ముచ్చటించారు. Delhi | Prime Minister Narendra Modi greets and congratulates #DroupadiMurmu on being elected as the new President of the country. BJP national president JP Nadda is also present. Visuals from her residence. pic.twitter.com/5wrcpCXElC — ANI (@ANI) July 21, 2022 మోదీ, నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర పార్టీల రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా ముర్ముకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ద్రౌపది ముర్ము చేతిలో ఓడిపోయిన యశ్వంత్ సిన్హా కూడా ఆమెకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచి ఆ బాధ్యతలు చేపడుతున్న తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు ద్రౌపది ముర్ము. ఎన్డీఏ బలపరిచిన ఈమెకు బీజేడీ, వైఎస్ఆర్సీపీ, జేఎంఎం వంటి ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో ఆమె ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ముర్ము విజయంతో ఒడిశాలోని ఆమె స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. చదవండి: కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము -
ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు!
ఆటలోనైనా, వేటలోనైనా... గెలవాలంటే వ్యూహం ముఖ్యం. రాజకీయాలకూ అది వర్తిస్తుంది. ఆ సంగతి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి తెలిసినంతగా విపక్షాలకు సైతం తెలిసినట్టు లేదు. భారత రాష్ట్రపతి పీఠానికి తాజాగా అధికార, విపక్ష కూటములు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తీరు అచ్చంగా అలాంటిదే. అభ్యర్థి ఎవరన్నది గుట్టుగా ఉంచి, మంగళవారం దాకా మంతనాలు సాగించిన బీజేపీ, చివరకు తన భాగస్వామ్య పక్షాలతో కూడిన ‘జాతీయ ప్రజాస్వామ్య కూటమి’ (ఎన్డీఏ) అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మూ పేరు బయటపెట్టింది. ఒక మహిళను, అందులోనూ ఆదివాసీని అభ్యర్థిగా ప్రకటించి, ఆటలో మొదటి బంతిలోనే ప్రతిపక్ష కూటమిని దాదాపు అవుట్ చేసింది. మరోపక్క బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ కలసి యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపాయి. కానీ, అభ్యర్థి ఎంపికకే కష్టపడిన విపక్షాలు రేపు ఎన్నికలలో గట్టి పోటీనిస్తామన్న నమ్మకం మాత్రం కలిగించలేకపోయాయి. కిందిస్థాయి నుంచి పైకొచ్చిన ద్రౌపది ప్రస్థానం ఆసక్తికరం. ఒడిశాలో మారుమూల మయూర్ భంజ్ జిల్లాకు చెందిన ఆమె రాజకీయాల్లోకి రాక ముందు గిరిజన ఉద్యమకారిణిగా ఓ అగ్గిబరాటా. నీటిపారుదల శాఖలో క్లర్కుగా మొదలై, టీచరుగా పనిచేసి, రాజకీయాల్లోకి వచ్చి కౌన్సిలరై, రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్ర ఆమెది. 2007లో రాష్ట్ర ఎమ్మెల్యేలలో బెస్ట్‌గా ఎంపికైన ఆమె నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ – బీజేపీ కూటమి సర్కారులో మంత్రిగా కూడా అనేక విభాగాలను సమర్థంగా నిర్వహించి పేరు తెచ్చుకోవడం విశేషం. మునుపు జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన ఈ సంథాల్ మహిళ సామర్థ్యానికి కొదవ లేదు. అయితే, అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపికలో ఆమె సమర్థత కన్నా మహిళగా, ఆదివాసీగా ఆమె అస్తిత్వానికే ప్రాధాన్యం ఇచ్చారనేది విశ్లేషకుల వాదన. పైపెచ్చు, ఉత్తర, దక్షిణ భారతావనుల నుంచే రాష్ట్రపతులు ఎన్నికవుతూ వస్తున్న దేశంలో తూర్పు ప్రాంతం నుంచి గిరిజన మహిళను బరిలోకి దింపడం బీజేపీకి సామాజిక, రాజకీయ ప్రయోజనాలు తెచ్చిపెట్టే తురుఫుముక్క. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో దూరమైన ఆదివాసీ ఓటర్లను ఆకర్షించడానికీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మహిళల– దేశంలోని 10 కోట్ల గిరిజనుల ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకోవడానికీ బీజేపీకి ఇదొక మంచి ఛాన్స్. రాగల రెండేళ్ళలో గుజరాత్ సహా అనేక ఎన్నికలున్న వేళ ఒక్క దెబ్బకు బోలెడు పిట్టలని ఆలోచించాకే ఆమెను అభ్యర్థిగా ప్రకటించారనుకోవచ్చు. మరోపక్క కారణాలు ఏమైనా, వయస్సు, అనుభవం ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, గోపాలకృష్ణ గాంధీ – ముగ్గురూ విపక్ష రాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీకి నిరాకరించడం గమనార్హం. ఎట్టకేలకు ఐఏఎస్ అధికారిగా పని చేసి, జనతా పార్టీలో చేరి, ఆ పైన బీజేపీకి వలస వచ్చి, 2014లో మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని గట్టిగా బలపరిచి, ఆనక పార్టీనీ, క్రియాశీలక రాజకీయాలనూ వీడి ఆయనకు తీవ్ర విమర్శకుడిగా మారిన యశ్వంత్ సిన్హా విపక్షాలకు దిక్కయ్యారు. 2020 బెంగాల్ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన రాజకీయ, సామాజిక అనుభవం మెచ్చ దగినదే. విపక్షాల చర్చల్లో ఆది నుంచీ ఆయన పేరు వినపడింది. విపక్షాలు మొదట ఇతర అభ్యర్థుల వైపు మొగ్గినా, చివరకు ప్రత్యామ్నాయాలు కరవయ్యాక సిన్హా పేరుకే సరే అనాల్సి వచ్చింది. ఆయన కాషాయ గతాన్ని పట్టించుకోనట్టు ప్రవర్తించాల్సి వచ్చింది. అయితే, ఆయన గెలుపు కష్టమే. నిజానికి, మండల్ కమిషన్ రోజుల నుంచి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేస్తూ వచ్చిన అస్తిత్వ రాజకీయాల ఛాయలోకి రాష్ట్రపతి భవన్ వచ్చి చాలాకాలమైంది. దళిత పక్షపాతులమనే ముద్ర కోసం కె.ఆర్. నారాయణన్‌ను కాంగ్రెస్ తెస్తే, మైనారిటీలకు అనుకూలమనే పేరు కోసం అబ్దుల్ కలామ్‌ను వాజ్‌పేయి హయాంలో ఎన్డీఏ తెర పైకి తెచ్చిందనే విశ్లేషణలూ లేకపోలేదు. అంత మాత్రాన ఆ మేధావుల సమర్థతను తక్కువగా చూడలేం. ద్రౌపది అభ్యర్థిత్వాన్ని సైతం ఆ దృష్టితోనే అర్థం చేసుకోక తప్పదు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకొని, పునాదిని విస్తరించుకొనే క్రమంలో క్రితంసారి 2017లో రామ్‌నాథ్ కోవింద్‌తో, ఇప్పుడు అందుకు కొనసాగింపుగా ద్రౌపదితో బీజేపీ తిరుగులేని పాచిక విసిరింది. దుర్భర దారిద్య్రం నుంచి పైకొచ్చిన ద్రౌపది లాంటి వారి కథ సమాజానికి స్ఫూర్తినిస్తూనే, ఓటర్లకు పార్టీ నుంచి తగిన రాజకీయ సూచనలు చేసినట్టయింది. అలా అటు సామాజిక మార్పు, ఇటు రాజకీయ బలం – రెండూ సమకూరాలన్నది వ్యూహం. వ్యూహం నుంచి, ఓట్ల అంకెల దాకా అన్నీ అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకే అనుకూలంగా ఉన్న వేళ... రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను నెల ముందే ఇప్పుడే ఇట్టే ఊహించవచ్చు. అటు మహిళ, ఇటు ఆదివాసీ కావడంతో ద్రౌపది అభ్యర్థిత్వాన్ని ఎవరైనా వ్యతిరేకించడం కష్టమే. ఒడిశా మూలాల రీత్యా నవీన్ పట్నాయక్ బీజేడీ సైతం ఆమెకే జై కొడుతుంది. ఎలక్టోరల్ కాలేజీలో సానుకూలతతో ఆమె గెలుపు నల్లేరుపై బండి నడకే. అద్భుతాలేమైనా జరిగితే తప్ప అతి పిన్నవయసు రాష్ట్రపతిగా ద్రౌపది అత్యున్నత పీఠంపై అధివసిస్తారు. 75 ఏళ్ళ స్వతంత్రభారతంలో తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా, ప్రతిభా పాటిల్ తర్వాత రెండో మహిళా రాష్ట్రపతిగా రికార్డుకెక్కుతారు. ఇన్నేళ్ళకైనా దేశ అత్యున్నత పీఠం గిరిజనులకు దక్కడం స్వాగతించాల్సిన విషయం. రాజకీయ ఎత్తుగడగానైనా, సామాజిక మార్పు తెచ్చే నిర్ణయం తీసుకున్నందుకు ఎన్డీఏను అభినందించాల్సిందే. ఇలాగే మహిళలకూ, గిరి జనులకూ పెద్దపీట వేయడాన్ని ఇతర రంగాల్లోనూ పాలకపక్షం కొనసాగిస్తే తప్పక హర్షించాల్సిందే. -
రాష్ట్రపతి ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం.. భారత దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం గెజిట్‌ను విడుదల చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. భారత దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఎన్నికల ద్వారా భారతదేశ 16వ రాష్ట్రపతిని ఎన్నుకోబోతున్నారు. ఈ నెల 29 వరకు రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్లు వేయవచ్చు. జులై 18న ఎన్నికలు జరుగుతాయి. జులై 21న కౌంటింగ్ జరుగుతుంది. Gazette notification issued for 16th Presidential Election today. (Source: ECI) pic.twitter.com/UBy3fNXnur — ANI (@ANI) June 15, 2022 ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24న ముగుస్తోంది. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఎలా ఎన్నుకుంటారంటే.. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతాయి. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీ సభ్యులు కూడా ఓటింగ్ లో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 4,809 మంది సభ్యులు ఓటు వేయబోతున్నారు. వీరిలో 776 మంది పార్లమెంటు సభ్యులు కాగా... 4,033 మంది రాష్ట్రాల చట్ట సభలకు చెందినవారు. వీరందరి ఓట్ల విలువ 10,86,431. అభ్యర్థి పేరేది? ఈసారి ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇంతవరకు అధికారపక్షం కానీ, విపక్షాలు కానీ తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో, సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇంకోవైపు, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ.. వివిధ పార్టీల మద్దతును కూడగట్టే బాధ్యతలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు అప్పగించింది. విపక్షాల తరపున ఆ బాధ్యతను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్నారు. -
President Election Schedule 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్.... ఎప్పుడంటే..!
-
దేశానికి ప్రధాని కావాలన్నదే నా డ్రీమ్..
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దేశ ప్రధాని కావాలని ఉందన్నారు. రాష్ట్రపతి కావాలనే కాంక్ష తనకు అసలులేదని మాయావతి స్పష్టం చేశారు. అయితే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తనపై ప్రతిరోజు పుకార్లు పుట్టిస్తున్నారని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లను మాయావతి.. బీజేపీకి ఇచ్చేసిందని అఖిలేష్ ఆరోపించారు. అనంతరం మాయావతి రాష్ట్రపతి అవుతుందేమో అంటూ( బీజేపీ ఆమెను క్విడ్ ప్రోకోగా దేశానికి రాష్ట్రపతిని చేస్తుందో లేదో చూడాలి) అఖిలేష్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా అఖిలేష్‌కు మాయావతి ఇలా కౌంటర్ ఇచ్చారు. కాగా, గురువారం మాయావతి మాట్లాడుతూ.. తాను అంబేద్కర్, కాన్షీరాం బాటలోనే నడవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. దళితులు, అణగారిన వర్గాలు, ముస్లింలు తిరిగి బీఎస్పీకి ప్రాణం పోస్తే, యూపీ సీఎం, ప్రధాని అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం లేదంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఆమె సన్నిహితురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా, ఆ పార్టీ ఏకైక యూపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్‌లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన తర్వాత మాయావతి ఇలా ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కూడా చదవండి: హిందీ జాతీయ భాష కాదు.. బడాయి వద్దు! -
President Fleet Review 2022: ఘనంగా రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ
-
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలికిన సీఎం జగన్
అప్డేట్స్: ► రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ తిరుగు పయనమయ్యారు. రాష్ట్రపతి ఐఎన్ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకుంటారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొంటారు. ► విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు స్వాగతం పలికేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐఎన్ఎస్ డేగాకు బయల్దేరారు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి అవంతి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి స్వాగతం పలికారు. విశాఖపట్నంలో సోమవారం జరిగే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(పీఎఫ్ఆర్) కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. ఐఎన్ఎస్ డేగాలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తరువాత సీఎం వైఎస్ జగన్ తిరుగు పయనమవుతారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకోనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొంటారు. -
కరోనాతో ఎన్నో జీవితాలు అతలాకుతలం అయ్యాయి
-
20 నుంచి 25 వరకు రాష్ట్రపతి విడిది!
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 20వ తేదీన హైదరాబాద్ రానున్నట్టు సమాచారం. ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు ఆయన హైదరాబాద్‌లో విడిది చేస్తారని తెలిసింది. అయితే ఈ షెడ్యూల్ పూర్తిగా ఖరారు కాకపోయినా.. రాష్ట్రపతి వస్తారన్న నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో గత సంవత్సరం రాష్ట్రపతి ఇక్కడ విడిదికి రాలేదు. కోవిడ్ తగ్గిందనుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ పేరుతో మళ్లీ కేసులు వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రపతి వస్తారా? లేదా? అన్నదానిపై తుది సమాచారం లేదని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిగా ఉన్నవారు డిసెంబర్లో హైదరాబాద్ నగరంలో విడిది చేయడం ఆనవాయితీగా వస్తోంది. -
ఏపీకి సంబంధించి 2 కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు కీలక బిల్లులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి కోసం వేర్వురు కమిషన్లు ఏర్పాటు చేస్తూ.. బిల్లు తీసుకొచ్చారు. ఎస్సీ కమిషన్‌కు సంబంధించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ గతేడాది జనవరిలో ఆమోదించింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు శానసమండలి కొన్ని సవరణలు చేసి వెనక్కు పంపింది. అయితే ఆ సిఫార్సులు ఆమోదయోగ్యం కావన్న శాసన సభ.. బిల్లును జనవరి, 2020 లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యథాతథంగా ఆమోదించింది. ఇప్పుడు ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో త్వరలోనే ఏపీలో ప్రత్యేక ఎస్సీ కమిషన్ అందుబాటులోకి రానుంది. -
రతన్ టాటాను రాష్ట్రపతి చేయాలి: నాగబాబు
సాక్షి, హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. నిత్యం ఏదో అంశం మీద కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా నాగబాబు రాష్ట్రపతి అంశంపై స్పందించారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ రాష్ట్రపతిగా రతన్‌టాటా పేరును సూచించి.. అందరిని ఆశ్చర్యపరిచారు నాగబాబు. దేశంలోనే అతి పెద్ద ఇండస్ట్రీయలిస్ట్‌లో ఒకరైన రతన్ టాటా తదుపరి రాష్ట్రపతి కావాలని నాగబాబు కోరుకున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం దాదాపుగా మరో ఏడాది వరకు ఉంది. దీని పైన జాతీయ స్థాయిలో కూడా గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడు చర్చలు జరుగుతున్నా...నిర్దిష్టంగా ఎవరు పోటీలో ఉంటారనే అంశం పైన మాత్రం క్లారిటీ లేదు. ఇక ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తదుపరి రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ దాని గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాంటిది ఇప్పుడు ఇంత సడెన్‌గా రాష్ట్రపతి ఎన్నిక అంశం పైన నాగబాబు ఎందుకు స్పందించారనేది అంతు చిక్కని విషయం. ‘‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులును ఎదుర్కొంటుంది. రోజు రోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇలాంటి సమయంలో తదుపరి రాష్ట్రపతి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు పన్నే వ్యక్తి కాకుండా.. దేశాన్ని తన కుటుంబంలా భావించి ప్రేమించే వ్యక్తి అయితే బాగుంటుంది. భారత దేశ తదుపరి రాష్ట్రపతిగా నేను ప్రతిపాదించే వ్యక్తి ఎవరంటే రతన్‌టాటా గారు’’ అంటూ నాగబాబు ట్వీట్‌చేశారు. దాంతో పాటు #RatanTataforPresident అనే హ్యాష్‌ట్యాగ్‌ని షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. With D Nation facing unprecedented Labyrinth's day after day Der is a need 4 "The President" who not only can strategise & implement, but also has a big heart & see whole nation as one Big Family ! I propose @RNTata2000 ji as the next President of India#RatanTataforPresident pic.twitter.com/rlstJGjyMJ — Naga Babu Konidela (@NagaBabuOffl) August 9, 2021 -
విభజన తర్వాత తొలిసారి కశ్మీర్‌కు రాష్ట్రపతి
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటించనున్నారు. రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జమ్ము కశ్మీర్లో త్రివిధ దళాల అధిపతిగా ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కశ్మీర్లో పర్యటిస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి జమ్ముకశ్మీర్, లద్దాక్‌లో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీన కార్గిల్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం 27వ తేదీన కశ్మీర్ విశ్వవిద్యాలయం 19వ స్నాతకోత్సవం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవంగా 2019లోనే రాష్ట్రపతి పర్యటించాల్సి ఉండగా అప్పుడు వాతావరణం సహకరించక పర్యటన రద్దయ్యింది. ఇప్పుడు ఈసారి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జమ్మూ కశ్మీర్ విభజన అనంతరం రాష్ట్రపతి తొలిసారిగా పర్యటించనుండడం విశేషం. జమ్మూ, లఢక్‌గా 2019లో కేంద్ర ప్రభుత్వం విభజించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణం ఏర్పడింది. -
ఢిల్లీకి సీఎం స్టాలిన్.. నేడు రాష్ట్రపతితో భేటీ
సాక్షి, చైన్నై: సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రి తమిళనాడు భవన్లో బస చేసి ఆయన సోమవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా గత నెల 17న స్టాలిన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మిత్రపక్షాల నేతల్ని కలిసి వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం హఠాత్తుగా ఆయన ఢిల్లీ పయనం అయ్యారు. సతీమణి దుర్గా స్టాలిన్, సోదరి, ఎంపీ కనిమొళి, దయానిధి మారన్‌తో కలిసి చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. స్టాలిన్‌తో పాటు పలువురు డీఎంకే ఎంపీలు సైతం పయనం అయ్యారు. తమిళనాడు భవన్లో ఆదివారం రాత్రి బసచేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా నీట్ మినహాయింపు, రాజీవ్ హంత కుల విడుదల, మేఘదాతు వివాదాలను రాష్ట్రపతి దృష్టికి స్టాలిన్ తీసుకెళ్లనున్నట్టు తెలిసింది. కరుణ చిత్ర పటం.. సెయింట్‌జార్జ్ కోటలోని అసెంబ్లీ సమావేశ మందిరంలో కామరాజర్, ఎంజీఆర్, జయలలిత సహా 17 మంది నేతల చిత్ర పటాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆగస్టు 7న కరుణానిధి మూడో వర్ధంతిని పురస్కరించుకుని అసెంబ్లీలో ఆయన చిత్ర పట ఆవిష్కరణకు స్టాలిన్ నిర్ణయించినట్టు తెలిసింది.. కరుణ చిత్ర పటాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవి ష్కరణకు నిర్ణయించినట్టు సమాచారం. అందుకే రాష్ట్రపతి అనుమతి కోరడం, ఆహ్వానించేందుకే ఈ ఢిల్లీ పర్యటన అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ పర్యటనకు ముందుగా లయోలా కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో తిరుచ్చికి చెందిన సామాజిక కార్యకర్త, ఇటీవల అనారోగ్యంతో ఉత్తరాది జైలులో మరణించిన స్టన్ స్వామి చిత్ర పటాన్ని స్టాలిన్ ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆయన కోసం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మైనారిటీ కమిషన్ చైర్మన్ పీటర్ అల్ఫోన్స్, ఎంపీలు కనిమొళి, దయానిధిమారన్ పాల్గొన్నారు. -
రాష్ట్రపతి నోట జీతం ప్రస్తావన.. రచ్చ రచ్చ
ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ల జీతం, సెలబ్రిటీల సంపాదన గురించి జనాల్లో ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. ‘ఫలానా వాళ్లు ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు?’ లాంటి హెడ్డింగ్‌లకు దక్కే ఆదరణే అందుకు ఉదాహరణ. అయితే తమ జీతాలు, సంపాదన గురించి వాళ్లు బహిరంగంగా మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్ కోవింద్ తన జీతం, కట్టింగ్ల గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. న్యూఢిల్లీ: తాజాగా ఓ న్యూస్ ఛానెల్ ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురించి ట్విటర్ ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘‘ దేశంలోనే అత్యధికంగా జీతం తీసుకుంటున్న వ్యక్తి నేను. నా నెల సంపాదన ఐదు లక్షలు. కానీ, అందులో 3 లక్షల దాకా ట్యాక్స్, కట్టింగ్ల రూపంలోనే పోతున్నాయి. ఆ లెక్కన నాకు మిగిలేది తక్కువే. అంటే మిగిలినవాళ్ల కంటే నేనేం బెటర్ కాదు. ఒక టీచర్ నాకంటే ఎక్కువే సేవింగ్స్ చేస్తున్నాడు’’ అంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడారు ఆయన. అంతే.. राष्ट्रपति बोले- मुझे 5 लाख प्रति महीना तनख्वाह मिलती है जिसमें से पौने 3 लाख टैक्स चला जाता है, हमसे ज्यादा बचत तो एक टीचर की होती है#presidentkovind #UttarPradesh pic.twitter.com/D6MAgmFCZm — News24 (@news24tvchannel) June 27, 2021 రెండు వాదనలతో.. ఇక రాష్ట్రపతి జీతంలో ట్యాక్స్ కట్టింగ్లు ఉండవని, ఆ విషయం తెలియక ఆయన అలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని కొందరు ట్విటర్ ద్వారా హేళన చేస్తున్నారు. పైగా పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతరత్రా అలవెన్స్‌లు కూడా ఉంటాయని గుర్తుచేస్తున్నారు. మరికొందరేమో రాజ్యాంగంలోని ప్రతులంటూ కొన్ని ఆధారాలను ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. పెన్షన్ యాక్ట్ 1951 ప్రకారం.. రాష్ట్రపతి జీతంపై పన్ను విధించరని చెప్తున్నారు. అయితే అదంతా ఉత్తదేనని, రాష్ట్రపతి జీతంలో కట్టింగ్లు ఉంటాయని వాదిస్తున్నారు. ఇంకొందరేమో మరి ఆ ట్యాక్స్ కట్టింగ్ల జీతం ఎటుపోతుందోనని ఇంటర్నెట్ ద్వారా ఆరా తీస్తున్నారు. ఈ వివాదం ఎటు నుంచి ఎటో వెళ్లి.. రాజకీయ దుమారానికి తెరలేపింది. ఇదిలా ఉంటే కిందటి ఏడాది కరోనా టైంలో జీతాల్లో కొంత వాటాను(30 శాతం దాకా) త్యాగం చేసినవాళ్లలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా ఉన్నారు. చదవండి: రాష్ట్రపతి కాన్వాయ్ కోసం ఆగిన ఊపిరి! -
కామారెడ్డికి అరుదైన గౌరవం
సాక్షి, కామారెడ్డి : జాతీయస్థాయిలో కామారెడ్డి జిల్లాకు అత్యుత్తమ పురస్కారం లభించింది. డిజిటల్ గవర్నెన్స్‌లో వెబ్‌రత్న –2020 అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని కలెక్టర్ శరత్ శనివారం తెలిపారు. అవార్డుకు ఎంపికవడానికి కారణాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో జిల్లా గురించి సంక్షిప్తంగా మ్యాప్, చరిత్ర, పరిపాలన విభాగం, జనాభా తదితర అంశాలను వివరణాత్మకంగా రూపొందించి వెబ్సైట్లో సమాచారాన్ని నమోదు చేశామన్నారు. జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారుల వివరాలు, ఫోన్‌నెంబర్లు, ఇతర అన్ని రకాల సమాచారాన్ని పొందుపరిచామని తెలిపారు. వెబ్సైట్లో జిల్లా పరిపాలన, చారిత్రక, భౌగోళిక నేపథ్యం గురించి చిత్రాలతో వివరించామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జీఐజీడబ్ల్యూ నిబంధనల ప్రకారం నవీకరించిన సమాచారం అందుబాటులో ఉందన్నారు. కలెక్టర్ శరత్ పర్యాటక సమాచారం, ప్రదేశాలు, వసతి, సంస్కృతి, పండుగలు, ఉత్పత్తులు, ముఖ్యమైన దేవాలయాల సమాచారాన్ని ఇంగ్లిష్, తెలుగు భాషల్లో జిల్లా వెబ్సైట్లో నమోదు చేశామని వివరించారు. ఆసక్తికర సంఘటనలు, మతపరమైన ప్రదేశాల ఫొటో గ్యాలరీలు, పథకాలు, ప్రాజెక్టులు లాంటి వివరాలతో వెబ్సైట్ సమగ్ర సమాచారాన్ని కలిగి ఉందన్నారు. హోంపేజీలో తాజా రోజువారి సంఘటనలు, ప్రెస్నోట్లు, కోవిడ్–19 సమాచారం ఉంచుతున్నామని తెలిపారు. జిల్లా వెబ్‌సైట్‌ను బలమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించామని, ఎప్పటికప్పుడు నవీకరిస్తున్నామని వివరించారు. కామారెడ్డి జిల్లా https://kamareddy.telangana.gov.in వెబ్సైట్ సేవలను ప్రజలందరూ వినియోగించుకుని అభిప్రాయాలను తెలపాలని కోరారు. ఈనెల 30 వతేదీన ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకోనున్నట్లు తెలిపారు. -
రాష్ట్రపతి తిరుమల పర్యటన
-
రాష్ట్రపతికి సీఎం జగన్ ఘన స్వాగతం
సాక్షి, విజయవాడ : తిరుమల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకుంటారు. అనంతరం 12.15 గంటలకు తిరుమల చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దేశ ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోందని, ఈ వ్యాధితో ముందుండి పోరాడుతున్న యోధులకు దేశం రుణపడిఉందని అన్నారు. కోవిడ్-19తో ప్రజల జీవనస్ధితిగతులు మారిపోయాయని చెప్పారు. ఈ విపత్కర పరిస్ధితుల్లో కేంద్రం పలు పధకాల ద్వారా ప్రజలకు సాయం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడంతో కరోనా ప్రభావాన్ని కొంతమేర కట్టడి చేయగలిగామని చెప్పారు. వేగవంతంగా మనం తీసుకున్న చర్యలతో ఎందరో ప్రాణాలు నిలబెట్టామని, దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని గుర్తుచేశారు. చదవండి : అగ్నిప్రమాదం కలచివేసింది వందేభారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న పది లక్షల మంది స్వదేశానికి చేరకున్నారని తెలిపారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన మార్పులకు శ్రీకారం చుడుతోందన్నారు.ఇక గల్వాన్‌లో అమరులైన సైనికులకు జాతి సెల్యూట్ చేస్తోందని చెప్పారు. ప్రత్యర్ధుల దూకుడుకు దీటుగా బదులిస్తామని గల్వాన్‌లో మన సైనికుల ధైర్యసాహసాలు సుస్పష్టం చేశాయని అన్నారు. ప్రపంచమంతా మహమ్మారితో ఐక్యంగా పోరాడుతున్న వేళ పొరుగు దేశం తన విస్తరణ కార్యకలాపాలను చేపట్టేందుకు దుస్సాహసానికి ఒడిగట్టిందని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ మనం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని చెప్పారు. దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
చైనాతో యుద్ధానికి నేను సైతం.. రాష్ట్రపతికి రక్తంతో..
సాక్షి, కర్ణాటక: ప్రస్తుతం భారత్–చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో యుద్ధంలో పాల్గొనడానికి తాను సిద్ధమని పేర్కొంటూ హోంగార్డ్ లక్ష్మణ్ మడివాళ రాష్ట్రపతికి రక్తంతో కూడిన లేఖను రాసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాయచూరు జిల్లా మస్కి ప్రాంతంలో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ మడివాళ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, కన్నడ వ్యాకరణం, గణితం, సైన్స్ వంటి విషయాలను బోధించడంతో పాటు గ్రామీణ పిల్లలకు క్రీడా మనోభావం, దేశభక్తి గురించి వివరించే లక్ష్యం ఏర్పరచుకున్నాడు. శనివారం వైద్యుల సలహాతో భారత్–చైనాల మధ్య యుద్ధం వస్తే దేశ రక్షణే కర్తవ్యంగా భావించానని, తనకు యుద్ధంలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ మూడు పేజీలతో లేఖను రాశారు. చదవండి: వంట మాస్టర్‌కు కరోనా.. క్వారంటైన్‌కు పెళ్లి బృందం -
నిర్భయ దోషుల్ని 22న ఉరితీస్తారా?
న్యూఢిల్లీ: నిర్భయ మూకుమ్మడి అత్యాచారం, హత్య కేసులో దోషులను ఈ నెల 22న ఉరి తీసే అవకాశాలపై సందిగ్ధం నెలకొంది. దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి మూడు రోజుల క్రితమే విజ్ఞప్తి చేశారు. అది పెండింగ్‌లో ఉన్నందున ఉరి అమలును వాయిదా వేయాలంటూ ముఖేష్ సింగ్ తరఫు లాయర్ తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారించించి కోర్టు, తాము జారీ చేసిన డెత్ వారెంట్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. దీంతో లాయర్ గురువారం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు అదనపు సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ అరోరా ఉరి అమలుపై సమగ్ర నివేదికను శుక్రవారానికల్లా సమర్పించాలని ఆదేశించారు. వ్యవస్థలకు కేన్సర్ సోకింది నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందు వల్ల ఉరిశిక్ష అమలు కోర్టు ఆదేశించినట్టుగా 22న సాధ్యం కాదని ఢిల్లీ సర్కార్ హైకోర్టుకు తెలిపింది. నిబంధనల ప్రకారం ఒక కేసులో ఉన్న దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాల్సి ఉంటుందని, ముఖేష్ క్షమాభిక్ష పెట్టుకోవడంతో మిగిలిన వారి ఉరినీ వాయిదా వేయాల్సి ఉంటుందని తీహార్ జైలు అధికారులు కోర్టుకు విన్నవించారు. దీనిపై హైకోర్టు బెంచ్ తీవ్రంగా స్పందించింది. ‘నిబంధనల్ని రూపొందించే సమయంలో ఎవరూ బుర్ర ఉపయోగించలేదా ? ఈ లెక్కన దోషులందరూ క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నంత వరకు వేచి చూస్తారా? దేశంలో వ్యవస్థలకి కేన్సర్ సోకింది’అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఎందుకు ఉరి అమలును ఆలస్యం చేస్తున్నారు ? ఎవరు మిమ్మల్ని నియంత్రిస్తున్నారు ? ఒకసారి డెత్ వారెంట్లు జారీ అయ్యాక ఉరి అమలులో తాత్సారం జరగకూడదంటూ వ్యాఖ్యానించింది. ఇలాగైతే దేశంలో వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ఉరి అమలు వాయిదా వేయాలన్న ముఖేష్ సింగ్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఢిల్లీ సర్కార్ ఆగమేఘాల మీద స్పందించి క్షమాభిక్షను తిరస్కరించాలని నిర్ణయించింది. కాగా,నిర్భయ దోషుల్ని ఉరి తీయడానికి ఢిల్లీలో ఆప్ సర్కార్ కావాలనే జాప్యం చేస్తోందని బీజేపీ ధ్వజమెత్తింది. 2017లోనే సుప్రీం కోర్టు వారికి ఉరిశిక్ష ఖరారు చేసినప్పటికీ ఆప్ ప్రభుత్వం ఉరి అమలును ఎందుకు నానుస్తోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావేద్కర్ ప్రశ్నించారు. వెంటాడుతున్న ప్రాణభయం నిర్భయ దోషుల్లో ప్రాణభయం రోజు రోజుకీ పెరిగిపోతోంది. దోషుల్లో అతి చిన్నవాడైన 26 ఏళ్ల వయసున్న వినయ్ శర్మ అందరికంటే ఎక్కువగా ఆందోళనకు లోనవుతున్నాడు. ఢిల్లీ హైకోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన దగ్గర నుంచి దోషులు నలుగురు ముఖేష్‌సింగ్, వినయ్ శర్మ, అక్షయ్‌కుమార్ రాథోడ్, పవన్ గుప్తాలను తీహార్ జైలు అధికారులు నాలుగు వేర్వేరు సెల్స్‌లో ఉంచారు. రేయింబగళ్లు వారి కదలికల్ని సీసీటీవీ కెమెరాల ద్వారా గమనిస్తున్నారు. వారి మానసిక స్థితి దెబ్బ తినకుండా ప్రతీ రోజూ వారితో మాట్లాడుతున్నారు. సైక్రియాటిస్టులు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. వీరిలో వినయ్ శర్మ తన సెల్లో ఒకేచోట ఉండకుండా అసహనంగా తిరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. -
ఏపీకి కొత్త గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న నరసింహాన్ ఇక నుంచి తెలంగాణకు మాత్రమే పరిమితం కానున్నారు. ఒడిశాకు చెందిన విశ్వభూషణ్ హరిచందన్ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు బీజేపీ నుంచి గెలవగా జనతా, జనతాదళ్ పార్టీల నుంచి మరో రెండు సార్లు గెలిచారు. భువనేశ్వర్ నుంచి మూడు సార్లు గెలిచిన ఆయన సిలికా నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు. 1971లో జనసంఘ్‌తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1977లో బీజేపీలో చేరారు. న్యాయవాద విద్యను అభ్యసించిన విశ్వభూషణ్.. ఒడిశా రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. పలు పుస్తకాలు రచించారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగిన ఆయన ప్రస్తుత వయసు 85 ఏళ్లు కాగా.. ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఇక చత్తీస్గడ్ నూతనగవర్నర్‌గా అనసూయ ఊకీ నియమితులయ్యారు. -
రాష్ట్రపతికి సీఎం జగన్ సాదర స్వాగతం
సాక్షిప్రతినిధి, తిరుపతి: వీవీఐపీలతో తిరుపతి పురవీధులు శనివారం రద్దీగా మారాయి. భారత ప్రథమ పౌరుడు రామనాథ్ కోవింద్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేశారు. దేవదేవుడు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునే నిమిత్తం భారత రాష్ట్రపతి దంపతులు శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ బసంత్‌కుమార్, కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త, ఆలయ ప్రధాన అర్చకులు, ఇతర అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి, కపిలతీర్థం చేరుకుని శ్రీకపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇదివరకు నీలం సంజీవరెడ్డి, శంకర్‌దయాళ్‌శర్మ, ప్రణబ్‌ముఖర్జీ ముగ్గురు రాష్ట్రపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ జాబితాలో నాలుగో రాష్ట్రపతిగా రామనా«థ్ కోవింద్ చేరారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట భద్రత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పర్యటన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు చేపట్టింది. నలుగురు ఎస్పీ స్థాయి అధికారులు, ఆరుగురు ఏఎస్సీలు, 22 మంది డీఎస్పీలు, 35 సీఐలు, 75 మంది ఎస్ఐలు, 300 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 400 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 200 మంది స్పెషల్ పోలీసులు, 3 కంపెనీల ఏపీఎస్పీ సిబ్బంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన మరో 475 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రపతి భద్రత నిమిత్తం 1,692 మందితో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలుకుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి గంట ముందే చేరుకున్న సీఎం రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్ తిరుమల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటుండడంతో స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఎంపీలు విజయసాయిరెడ్డి, మి«థున్‌రెడ్డి వచ్చారు. రేణిగుంటకు చేరుకున్న సీఎంకు డెప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి, ఏ.శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నవాజ్‌బాషా, ఆదిమూలం, కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త, డీఐజీ క్రాంతి రాణా టాటా, ఎస్పీలు అన్బురాజన్, వెంకట అప్పలనాయుడు, తిరుపతి నగర కమిషనర్ గిరీషా తదితరులు స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన ప్రముఖులు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డెప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్‌రావు, తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, సత్యవేడు ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఏ శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నవాజ్‌బాషా, ఆదిమూలం తదితరులు స్వాగతం పలికారు. -
రాష్ట్రపతికి సీఎం వైఎస్ జగన్ స్వాగతం
-
రాష్ట్రపతికి సీఎం వైఎస్ జగన్ స్వాగతం
సాక్షి, చిత్తూరు: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తిరుచనురు పద్మావతి అమ్మవారిని కోవింద్ దర్శించుకోనున్నారు. అనంతరం రాత్రి బస నిమిత్తం పద్మావతి అతిథి గృహానికి చేరుకోనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శన కార్యక్రమంలో పాల్గొన్ని.. మధ్యాహ్నాం నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు వెళ్లనున్నారు. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట భద్రత రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నలుగురు ఎస్పీ స్థాయి అధికారులు, ఆరుగురు ఏఎస్పీలు, 22 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 75 మంది ఎస్ఐలు, 300 మంది ఏఎస్ఐ, హెచ్‌సీలు, 400 మంది పీసీలు, స్పెషల్ పోలీసులు 200 మంది, మూడు కంపెనీల ఏపీఎస్పీ సిబ్బంది, ఇతర జిల్లాల నుంచి 470 మంది, మొత్తం 1,692 మందితో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. -
రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన యువతులు
మోగ : పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి రక్తంతో లేఖ రాశారు ఇద్దరు పంజాబీ యువతులు. తమకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా అత్మహత్య చేసుకుంటామని లేఖలో పేర్కొన్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన నిషా, అమాన్ జాట్ కౌర్ అనే యువతులు ఈ లేఖ రాశారు. తమపై పెట్టిన కేసులు తప్పని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అనంతరం వారు ఓ జాతీయ మీడియాతో మాట్లాడతూ... ‘ డబ్బులు తీసుకొని మోసం చేశామని మాపై కొంత మంది తప్పుడు కేసులు పెట్టారు. అవి తప్పుడు కేసులని, వాటిపై విచారణ చేపట్టాలని పోలీసులను వేడుకున్నా పట్టించుకోలేదు. విచారణ పేరుతో మమ్మల్ని వేధిస్తున్నారు. మా కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్రపతి చొరవ చూపి మాకు న్యాయం చేయాలి. న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యలు చేసుకుంటాం’ అని హెచ్చరించారు. కాగా యువతుల ఆరోపణలను మోగ జిల్లా డీఎస్పీ కొట్టిపారేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, విచారణ చేస్తున్నామని చెప్పారు. విదేశాలను పంపిస్తామని చెబుతూ ఏజెంట్ల రూపంలో ఈ ఇద్దరు యువతులు డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఫిర్యాదు అందయన్నారు. దానిపైనే విచారణ చేశామన్నారు. రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తనకు తెలియదని, అధికారికంగా తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదని డీఎస్పీ పేర్కొన్నారు. -
నిరుపమాన పాలనాదక్షుడు
భారతదేశ హృదయాల్లో పరి పాలనాదక్షుడిగా మహోన్నత స్థానాన్ని పొందిన వారిలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్త్రి, రాజగోపాలాచారి, ఇందిరాగాంధీ, కామరాజ్ నాడార్ ముఖ్యులు. కాగా ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా అనేక పదవులు అలంకరించి తన పరిపాలనా చాకచక్యంతో ఆ పదవులకే వన్నె తెచ్చిన పరిపాలనాదక్షుడు నీలం సంజీవరెడ్డి. సామాన్య రైతుబిడ్డగా జన్మించి, దేశంలో అత్యున్నతమైన భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన నీలం 106వ జయంతి నేడు. దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన రాయలసీమలోని అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో 1913 మే 19న నీలం సంజీవరెడ్డి జన్మించారు. గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి వరకు అన్ని కీలకపదవులు అలంకరించారు. ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా కొత్త సత్సంప్రదాయాలను సృష్టించిన మహా మనిషి. 1964లో కర్నూల్ జిల్లాలో బస్సు రూట్లను జాతీయం చేసే అంశంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అదే ఏడాది ఫిబ్రవరి 23న ఏపీ ముఖ్యమంత్రి పదవికి తనకు తానుగా రాజీనామా చేసి దేశంలోనే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 1967 లోక్‌సభ ఎన్నికల అనంతరం లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి గొప్ప సంప్రదాయాన్ని నెలకొల్పారు. ఏపీకి నీలం సంజీవరెడ్డి ఎంతో సేవ చేశారు. జిల్లా పరిషత్, పంచాయతీ సమితులు, విధాన పరిషత్ ఏర్పాటుకు కారకులయ్యారు. పంచాయితీ వ్యవస్థకు పరిపుష్టి చేకూర్చి జాతిపిత కలలు కన్న పంచాయితీ రాజ్ వ్యవస్థ పురోభివృద్దికి సోపానం వేశారు. ఆయన పరిపాలన విధానాలను నెహ్రూ సైతం ప్రశంసించారు. 1959లో ఏపీ పర్యటనకు వచ్చిన నెహ్రూ నీలం సంజీవరెడ్డి పరిపాలన విధానాలకు ఆకర్షితులయ్యారు. పంచాయితీ రాజ్ వ్యవస్థ పాలనలో దిట్టగా పేరుగాంచి, తద్వారా సాధించిన అనుభవం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లటానికి దోహపడింది. నీలం సంజీవరెడ్డి పరిపాలనాదక్షుడే కాదు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. అనంతపురం, మద్రాస్‌లలో విద్యనభ్యసించిన సంజీవరెడ్డి స్వాతంత్య్ర పోరాటంలో అనేకసార్లు జైలుకు వెళ్లారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని దీర్ఘకాలం అంటే 1942 నుంచి 1945 వరకు వేలూరు, అమరావతి జైళ్లలో నిర్బంధితులయ్యారు. 1946లో విడుదలైన తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. మద్రాస్ రాష్ట్ర లెజిస్లేచర్ పార్టీకి కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత 1949 ఏప్రిల్‌లో అప్పటి ఉమ్మడి మద్రాస్ ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి రాజా మంత్రివర్గంలో గృహనిర్మాణ, అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. 1951–53 మధ్య ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1953 అక్టోబర్ నుంచి టంగుటూరి ప్రకాశం, బెజ వాడ గోపాల్‌రెడ్డి మంత్రి వర్గాల్లో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. వారితో కలిసి పనిచేయడం వల్ల పరిపాలన రంగంలో అపారమైన అనుభవం గడించారు. ఫలి తంగా 1956 నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా నియమితులయ్యారు. తిరిగి 1962 మే నుంచి 1964 ఫిబ్రవరి వరకు సీఎంగా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూకు అత్యంత విశ్వాసపాత్రుడిగా మెలిగారు. 1956 నవంబర్ నుంచి 1959 డిసెంబర్ వరకు ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. నెహ్రూ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీల మంత్రివర్గాలలో నీలం సంజీవరెడ్డి పనిచేశారు. 1967 సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1977లో జనతాపార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జనతా పార్టీ తరఫున ఎన్నిక అయిన ఏకైక పార్లమెంట్ సభ్యుడిగా చరిత్ర సృష్టించారు. అనంతరం అదే ఏడాది జూలైలో భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మంత్రిగా, ఏపీ సీఎంగా, ఉపముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా వివిధ హోదాల్లో పనిచేశారు. తన హయాంలో అనేక భారీ పరిశ్రమలను స్థాపించారు. దేశానికి సేవలందించిన గొప్ప నాయకులలో ఒకడిగా తనదైన ముద్రవేశారు. అనేక క్లిష్టపరిస్థితుల్లో అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. దేశానికి నిరుపమాన సేవలందించిన నీలం సంజీవరెడ్డి 1996 జూన్ 1న తుది శ్వాసను విడిచారు. (నేడు నీలం సంజీవరెడ్డి 106వ జయంతి సందర్భంగా) డా. అగరాల ఈశ్వర రెడ్డి వ్యాసకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ -
‘జోక్యం చేసుకోండి.. లేఖ అందలేదు’
న్యూఢిల్లీ : భారత సాయుధ బలగాల త్యాగాలను రాజకీయం చేస్తున్నారంటూ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుకు చెందిన 150 మందికి పైగా రిటైర్డ్ ఆఫీసర్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ‘ఫ్రమ్ గ్రూప్ ఆఫ్ వెటరన్స్ టు అవర్ సుప్రీం కమాండర్’ పేరిట త్రివిధ దళాధిపతికి రాసిన లేఖలో సైనికుల త్యాగాలను రాజకీయాల కోసం వాడుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం.. భారత సైన్యం యూనిఫాం, గుర్తులు లేదా సైనికుల త్యాగాల గురించి నాయకులు ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు జారీచేయాలని రాష్ట్రపతిని కోరారు. ఇటువంటి వ్యాఖ్యల గురించి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదని, దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విఙ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రపతి భవన్ వర్గాలు మాత్రం తమకు ఎటువంటి లేఖ అందలేదని పేర్కొనడం గమనార్హం. కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత సైన్యాన్ని ‘మోదీ సేన’ గా అభివర్ణిస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రధాని మోదీ ఈనెల 9న మహారాష్ట్రలోని లాతూర్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు బాలాకోట్‌లో వైమానిక దాడులు జరిపిన వారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సైనికుల బలిదానాలను రాజకీయ పార్టీలు, నాయకులు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ.. ఆర్మీ మాజీ చీఫ్‌లు సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగస్, శంకర్ రాయ్‌చౌదరి, దీపక్ కపూర్... మాజీ నేవీ ప్రధానాధికారులు లక్ష్మీనారాయణ్ రామ్‌దాస్, విష్ణు భగవత్, అరుణ్ ప్రకాశ్, సురేష్ మెహతా, ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ఎన్సీ సూరీ తదితరులతో సహా 150 మంది రిటైర్డు అధికారులు రాష్ట్రపతికి లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక.. ‘మోదీ కోసమో, రాహుల్ కోసమో నా తండ్రి చనిపోలేదు. భారత్ కోసం చనిపోయారు. మన సైనికులను లాగకుండా మీరు ఎన్నికల్లో పోటీ చేయలేరా? ఎన్నికలైతే మీరు మమ్మల్ని కచ్చితంగా మరచిపోతారు. అది మాకు తెలుసు’ అంటూ పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ కౌశల్ కుమార్ రావత్ కూతురు అపూర్వ రావత్ రాజకీయ నాయకుల తీరును ఎండగట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలువురు నేతలు తమ పంథా మార్చుకోవడం లేదు. -
ఏపీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జనవరి 1 నుంచి అమరావతి నుంచి కార్యకలాపాలు ప్రారం భించాలని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో లాంఛనాలన్నీ శరవేగంగా పూర్తవు తున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ నియ మితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. జనవరి 1న హైకోర్టుకు సెలవు దినం కావడంతో 2వ తేదీన ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఏపీకి కేటాయించిన 14 మంది న్యాయమూర్తుల్లో జస్టిస్ ప్రవీణ్‌కుమారే సీనియర్. దీంతో రాష్ట్రపతి ఆయనవైపు మొగ్గు చూపారు. అత్యంత సౌమ్యుడిగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌కు పేరుంది. ఆ ముగ్గురూ తెలంగాణ హైకోర్టుకు... ఇదిలా ఉంటే ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. అలాగే న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్ర మణియన్‌లను తెలంగాణ హైకోర్టుకు కేటాయిస్తూ రాష్ట్రపతి కోవింద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో సంప్రదించిన తరువాత ఈ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టుకు కేవలం 10 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జస్టిస్ రాధాకృష్ణన్ కేరళ హైకోర్టుకు చెందిన వారు కాగా, జస్టిస్ చౌహాన్ రాజస్తాన్, జస్టిస్ రామసుబ్రమణియన్ చెన్నై హైకోర్టులకు చెందిన వారు. వీరు ముగ్గురు కూడా బయట న్యాయమూర్తులు కావడంతో వీరిని ఏపీ హైకోర్టుకు పంపాలా? తెలంగాణ హైకోర్టుకు పంపాలా? అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రపతి ఈ ముగ్గురు కూడా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా కొనసాగుతారంటూ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి జస్టిస్ రామసుబ్రమణియన్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారని హైకోర్టు వర్గాల్లో గట్టిగా ప్రచారం జరిగింది. 1న ప్రమాణ స్వీకారం... జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు మిగిలిన ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తులు జనవరి 1న ప్రమాణం చేయ నున్నట్లు తెలిసింది. వీరి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారని సమాచారం. ఉన్నతస్థాయి వర్గాల్లో దీనిపై ఓ నిర్ణయం జరిగిందని హైకోర్టు వర్గాల ద్వారా తెలుస్తున్నప్పటికీ, దీనిని ఎవ్వరూ అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఈ విషయంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తండ్రికి తగ్గ తనయుడు... జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఫిబ్రవరి 26, 1961లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. పద్మనాభరెడ్డి ఎంతో మంది పేదల తరఫున ఉచితంగా కేసులు వాదించారు. 10వ తరగతి వరకు ప్రవీణ్‌కుమార్ విద్యాభ్యాసం హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో సాగింది. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ నుంచి ఇంటర్ చేసి నిజాం కాలేజీ నుంచి బీఎస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తండ్రి పద్మనాభరెడ్డి వద్దే వృత్తి జీవితాన్ని ఆరంభించారు. అతి తక్కువ కాలంలో తండ్రి లాగా క్రిమినల్ లాపై పట్టు సాధించారు. 2012 జూన్ 29న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. -
రాష్ట్రపతి రక్షకుల నియామకంలో వివక్ష
న్యూఢిల్లీ: రాష్ట్రపతి బాడీగార్డుల నియామక ప్రక్రియలో మూడు కులాల వారికే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హరియాణాకు చెందిన గౌరవ్ యాదవ్ అనే వ్యక్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం.. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్మీ చీఫ్, ఆర్మీ నియామక బోర్డు డైరెక్టర్లతో పాటు రాష్ట్రపతి భద్రతా సిబ్బంది కమాండెంట్లకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఎస్.మురళీధర్, సంజీవ్ నారులాతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. కోర్టుకు సమర్పించిన వివరణలో ఏమైనా పొరపాట్లు, సవరణలు ఉంటే వాటిని వచ్చే ఏడాది మే 8వ తేదీ లోపు అందించవచ్చని పేర్కొంది. రాష్ట్రపతి బాడీగార్డుల కోసం 2017 సెప్టెంబర్ 4న చేపట్టిన నియామక ప్రక్రియలో కేవలం జాట్లు, రాజ్‌పుత్‌లు, జాట్ సిక్కు వర్గాల వారి దరఖాస్తులను మాత్రమే ఆహ్వానించారని గౌరవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్రపతి బాడీగార్డుగా ఎంపికయ్యేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నా పైన పేర్కొన్న మూడు కులాలకు చెందిన వాడిని కాకపోవడంతో ఉద్యోగం సాధించలేకపోయానని కోర్టుకు నివేదించారు. న్యాయవాది రామ్ నరేశ్ యాదవ్ ద్వారా గౌరవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. బాడీగార్డుల నియామకంలో మూడు కులాల వారినే అర్హులుగా ప్రకటించడం వల్ల మిగతా కులాల వారికి అన్యాయం జరిగిందని.. ఇది ఓ రకంగా కుల వివక్ష వంటిదేనని రామ్ నరేశ్ తెలిపారు. ఉద్యోగాల నియామకాన్ని కుల ప్రాతిపదికన చేపట్టడం రాజ్యాంగ నియమాల ఉల్లంఘన కిందకి వస్తుందని పేర్కొన్నారు. అందువల్ల బాడీగార్డుల నియామక ప్రక్రియను రద్దు చేయాలని కోర్టును కోరారు. -
రాష్ట్రపతి రక్షణగా మూడు కులాల వారేనా?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి అంగరక్షకుల (సెక్యూరిటీ సిబ్బంది) నియామక ప్రక్రియ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ వివాదంగా మారింది. రాష్ట్రపతి సిబ్బంది నియామకం కోసం గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దానిలో రాజ్‌పుత్, సిక్కు, జాట్ కులాల వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దీనిపై హర్యానాకు చెందిన గౌరవ్ యాదవ్ అనే యువకుడు ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దాఖలు చేశారు. బుధవారం దీనిపై విచారించిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్మీ నియామక బోర్డు డైరెక్టర్‌ను ఆదేశించింది. దేశాధ్యక్షుడుకి సంబంధించిన సిబ్బందిని కులాల వారిగా నియమించడం ఏంటని పిటిషన్‌దారుడు వ్యాజ్యంలో పేర్కొన్నారు. అంగరక్షకుడిగా తాను అన్ని విధాలా అర్హుడినని, తాను యాదవ కులానికి చెందిన వాడినని తన దరఖాస్తును తిరస్కరించారని గౌరవ్ తెలిపారు. రాష్ట్రపతి అంగరక్షకులుగా కేవలం జాట్, సిక్కు, రాజ్‌పుత్‌లనే నియమించడం ఏంటని పిటిషనర్ తరుఫు న్యాయవాది రామ్ నరేష్ యాదవ్ ధర్మాసనం ముందు వాదించారు. -
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన కోవింద్ నగరంలోని హకీంపేట్ విమానశ్రయానికి చేరుకున్నారు. కోవింద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డీలు స్వాగతం పలికారు. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు ఉండనున్నారు. -
‘బ్రహాస్త్ర’ సెట్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రస్తుతం మూడు దేశాల పర్యటనలో భాగంగా బల్గేరియాలో ఉన్నారు. ఈ సందర్భంగా బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌ను ఆయన కలుసుకున్నారు. అధికారులు ఇందుకు సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశారు. బాలీవుడ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. కరణ్‌జోహార్ నిర్మాణంలో, అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చ్రితం బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటుంది. మూడు దేశాల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ప్రస్తుతం బల్గేరియాలో ఉన్నారు. ‘బ్రహ్మాస్త్ర’ చిత్ర షూటింగ్ బల్గేరియాలో జరుగుతుందని తెలుసుకున్న రాష్ట్రపతి.. బల్గేరియా ప్రెసిడెంట్ రాదేవ్‌తో కలిసి బ్రహ్మాస్త్ర సెట్స్‌ని సందర్శించారు. వీరితో పాటు రామ్‌నాథ్ కోవింద్ భార్య రుమాన్ దేవి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రామ్ నాథ్ బ్రహ్మాస్త్ర నటీనటులందరితో మాట్లాడారు. బ్రహ్మాస్త్ర షూటింగ్ జరుగుతున్న సోషియా స్టూడియోని సందర్శించారు. ఇరు దేశాల ప్రెసిడెంట్స్ నటీనటులతో కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తమ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సినిమా అనేది రెండు దేశాల మధ్య బిజినెస్, కల్చరల్ లింక్ అవుతుందని ఇరుదేశాల అధ్యక్షులు ఆశాభావం వ్యక్తం చేసినట్టు రాష్ట్రపతి కార్యాలయం తమ ట్విట్టర్లో పేర్కొంది. #PresidentKovind and President Radev dropped in at the studio in Sofia where the Hindi film Brahmastra is being made. The Presidents met the Indo-Bulgarian crew and chatted about cinema as a business and cultural link between the two countries pic.twitter.com/8ApZq1gEJA — President of India (@rashtrapatibhvn) September 5, 2018 -
సరికొత్త తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కొత్తరూపు సంతరించుకుంటోంది. ఇప్పటికే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీల పునర్విభజన పూర్తవగా తాజాగా పరిపాలనలో కీలకమైన పోస్టుల భర్తీలో కొత్త వ్యవస్థ మొదలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్–2018గా దీన్ని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన జరిగింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం జోనల్ విధానాన్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి గురువారం ఉత్తర్వులు (124) జారీ చేశారు. కొత్త జోనల్ విధానం ప్రకారం తీసుకునే ఏ నిర్ణయమైనా రాజ్యాంగం లోని 371 (డీ) ప్రకారం 1975 అక్టోబర్ 18న జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి తాజా నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానికత, పోస్టులు, క్యాడర్, జిల్లా, జోన్, మల్టీజోన్ వంటి అంశాలను పేర్కొంటూ కొత్త విధానంలో 14 పాయింట్లలో పొందుపరిచారు. కొత్త జోనల్ విధానంలోని అంశాలివీ రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్ విధానం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లోని అన్ని రకాల పోస్టులను జిల్లా, జోన్, మల్టీజోన్, రాష్ట్రస్థాయి, సివిల్ సర్వీస్ కేడర్లవారీగా వర్గీకరించాలి. 36 నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా పూర్తి చేయని పరిస్థితుల్లో మళ్లీ రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, దీనికి సమానమైన, దీనికంటే తక్కువ కేడర్ పోస్టులను ప్రత్యేక కేటగిరీగా పేర్కొన్నారు. మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లోని నాన్ గెజిట్ కేటగిరీలోని టీచర్ల పోస్టులను జిల్లా యూనిట్‌గా ఒక కేడర్‌గా భావిస్తారు. జూనియర్ అసిస్టెంట్ పైస్థాయికి సమానమైన పోస్టుల నుంచి సూపరింటెండెంట్, దీనికి సమానమైన పోస్టులను ప్రత్యేక కేడర్‌గా పేర్కొన్నారు. ఈ పోస్టులు జోన్ పరిధిలో ఉంటాయని తెలిపారు. సూపరింటెండెంట్‌పై స్థాయికి సమానమైన పోస్టుల నుంచి డిప్యూటీ కలెక్టర్ పోస్టు వరకు ఉండే అన్ని రకాల పోస్టులను మల్టీజోనల్ పోస్టులుగా నిర్ధారించారు. అన్ని స్థానిక కేడర్లలోని ఉద్యోగుల ఉన్నతస్థాయి పదోన్నతులకు సమాన అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. లోకల్ కేడర్ నుంచి ఇతర ఆఫీసులకు, సంస్థలకు ఒక ఉద్యోగిని బదిలీ చేయడానికి ఈ ఉత్తర్వు వర్తించదు. ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు బదిలీ జరగాలి. ప్రతి మల్టీజోన్ ఒక లోకల్ ఏరియాగా ఉంటుంది. కొన్ని మినహా అన్ని రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పోస్టులు వీటి పరిధిలో ఉంటాయి. లోకల్ కేడర్‌కు బదిలీ చేయడంతో ఇబ్బంది పడినట్లుగా భావించిన ఉద్యోగి ఈ విషయంపై ప్రభుత్వానికి ఆరు రోజుల్లోగా వినతిపత్రం ఇవ్వాలి. పైకేడర్ పోస్టుల భర్తీ విషయంలో లోకల్ కేడర్ నుంచి సమానావకాశాలు వర్తిస్తాయి. లోకల్ కేడర్ అధికారిని ఏ కార్యాలయానికైనా బదిలీ చేయవచ్చని పేర్కొన్నారు. ఒక లోకల్ కేడర్‌లో ఉన్న ఉద్యోగిని ఇతర లోకల్ కేడర్‌కు బదిలీ చేయొచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి కేటగిరీ పోస్టులకు, ప్రతి ప్రాంతానికి ఒక లోకల్ కేడర్‌ను, నియామకాల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వచించిన ‘స్థానికత’ప్రకారం పోస్టులను, నియామకాలను, విధి నిర్వహణ అంశాలను పేర్కొన్నారు. ప్రతి జిల్లా ఒక లోకల్ ఏరియాగా ఉంటుంది. అలాగే ప్రతి జోన్‌ను ఒక లోకల్ ఏరియాగా పరిగణిస్తారు. మల్టీజోన్ విషయంలోనూ ఇదే విధంగా ఉంటుంది. ఒకటికంటె ఎక్కువ జిల్లాల్లోని ఒకే కేడర్ పోస్టులుగా ఉండే పోస్టులను ప్రత్యేక కేడర్‌గా పరిణగిస్తారు. జోన్, మల్టీజోన్ విషయంలోనూ ఇదే తరహా విధానం ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హత సాధించే వ్యక్తి అక్కడ స్థానికుడిగా ఉంటారు. పోస్టులవారీగా పేర్కొనే నిబంధనల ప్రకారం ఈ స్థానికతను పరిగణనలోకి తీసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వ అమోదిత విద్యా సంస్థల్లో వరుసగా నాలుగేళ్లు చదివిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు. చదివిన జిల్లాలను స్థానిక జిల్లాగా పేర్కొంటారు. జిల్లా, జోనల్, మల్టీజోనల్ పరిధిలోని అన్ని పోస్టుల భర్తీలో స్థానికులకు ప్రాధాన్యత ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ 95 శాతం పోస్టులను డెరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తారు. ఇలా భర్తీ చేసే 95 శాతం పోస్టుల్లో పూర్తిగా స్థానికులకే అవకాశం ఉంటుంది. ఈ మేరకు రిజర్వేషేన్లు కల్పిస్తారు. ఓపెన్ కేటగిరీ కింద 5 శాతం మాత్రమే ఉంటాయి. స్థానిక అభ్యర్థులు లేకపోవడం వల్ల ఖాళీగా మిగిలే పోస్టులను తర్వాత స్థానికులకే చెందేలా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రత్యేక కార్యాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసే కార్యాలయాలు, రాష్ట్రస్థాయి కార్యాలయాలకు జోనల్ విధానంలోని నిబంధనలు వర్తించవని గెజిట్‌లో పేర్కొన్నారు. ఆయా కార్యాలయాల్లోని సిబ్బందిని మాత్రం జిల్లాల్లోని కార్యాలయాలకు పరస్పరం బదిలీ చేయవచ్చని పేర్కొన్నారు. -
కోవింద్ మంచి వ్యక్తే, కానీ...
సాక్షి, ముంబై: నేషనల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం పెట్టిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా కనిపించటం లేదు. విజేతలందరికీ రాష్ట్రపతి అవార్డులు ఇవ్వకపోవటంపై యావత్ సినీ పరిశ్రమ అసంతృప్తితో ఉంది. విషయం ముందుగా తెలియటంతో సుమారు 60 మంది విజేతలు కార్యక్రమాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై వెటరన్ నటుడు, బీజేపీ సీనియర్ నేత శతృఘ్నసిన్హా తనదైన శైలిలో స్పందించారు. శుక్రవారం ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ... ‘రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. గతంలో ఆయన బిహార్ గవర్నర్‌గా పని చేసిన సమయంలో చాలా దగ్గరగా చూశాను. ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ, ఇలా జరగాల్సింది కాదు. ఎక్కడో పొరపాటు జరగటంతో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ, ఇలా జరగాల్సింది కాదు. నటులు అంటే దేశ గౌరవానికి ప్రతీకలు. అలాంటి వారిని అవమానించటం మంచి పద్ధతి కాదు’ అని సిన్హా తెలిపారు. ‘రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వాల్సిన అవార్డులను వేరే ఎవరో ఇవ్వటం సరైంది కాదు. అలాగని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని నేను తక్కువ చేయడం లేదు(మిగతా అవార్డులు ఆమె ప్రదానం చేశారు). ఆమె మంచి నేత. కానీ, ఈ అవార్డులను ఆమె ఇవ్వటాన్ని నేను అంగీకరించను. భోజనానికి పిలిచి ఒకరికి ఒకరకమైన భోజనాన్ని.. మరొకరికి ఒకరకమైన భోజనాన్ని పెడితే ఎలా ఉంటుంది? ఈ వ్యవహారం కూడా అలాగే ఉంది. గతంలో రాష్ట్రపతులంతా చాలా ఓపికగా అవార్డులను ఇచ్చారు. మహిళ అయి ఉండి కూడా ప్రతిభా పాటిల్ మినహాయింపు తీసుకోలేదు. కానీ, కోవింద్ మాత్రం ఎందుకు ఆ సంప్రదాయాన్ని పాటించలేదో అర్థం కావట్లేద’ని శతృఘ్నసిన్హా ఆక్షేపించారు. ఇదిలా ఉంటే జరిగిన పరిణామాలపై రాష్ట్రపతి కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చి నెల నుంచే తాము ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి(సాంకేతిక మరియు సమాచార మంత్రిత్వ శాఖ) సమాచారం అందిస్తూ వస్తున్నామని, అయిన విషయాన్ని గోప్యంగా ఉంచి చివరి నిమిషంలో వెల్లడించటంతో ఈ వివాదం చెలరేగిందని పేర్కొంటూ ఓ లేఖను రాష్ట్రపతి కార్యాలయం కేంద్రానికి రాసింది. -
రాష్ట్రపతి కోవింద్ నిర్ణయం.. తీవ్ర దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(72) తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 65వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానం వేడుక గురువారం సాయంత్రం విజ్ఞాన్ భవన్లో జరగనుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా విజేతలందరూ అవార్డులను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఈ కార్యక్రమానికి కోవింద్ గంట మాత్రమే అపాయింట్మెంట్ మాత్రమే ఇవ్వటంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు విజేతలు తాము ఈ కార్యక్రమాన్ని బహిష్కరించటం దుమారం రేపింది. ఈ ఏడాది మొత్తం 140 మంది అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే. ‘రాష్ట్రపతి గంట మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, కేటాయించిన సమయంలో 11 అవార్డులు మాత్రమే అందిస్తారని, మిగిలిన అవార్డులను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అందిస్తారని’ రాష్ట్రపతి కార్యాలయం.. నిర్వాహకులకు తెలిపింది. ఈ నిర్ణయంపై విజేతల్లో చాలా మంది అభ్యంతరం తెలిపారు. గతేడాది జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ(82) ఎంతో ఓపికగా విజేతలకు అవార్డులను అందజేశారని.. అలాంటిది ఇప్పుడు కోవింద్‌కు వచ్చిన అభ్యంతరం ఏంటని కొందరు నిర్వాహకులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవార్డుల వేడుకను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అలాగని తాము అవార్డులను అగౌరవపరచటం లేదని వారు చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రపతి కేవలం ఒకే ఒక్క అవార్డు మాత్రమే బహుకరిస్తారని, మిగతావి మంత్రులతో ప్రధానం చేయించాలని రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో కేంద్రానికి తెలియజేసింది. ఏప్రిల్ 13న ప్రకటించిన 65వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరణానంతరం దిగ్గజ నటుడు వినోద్ ఖన్నాకు దాదాసాహెచ్ పాల్కే అవార్డును.. నటి శ్రీదేవికి ఉత్తమ నటిగా మామ్ చిత్రానికి అవార్డులను ప్రకటించారు. -
ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: అత్యాచార దోషులకు కఠిన శిక్షలతోపాటు, రుణ ఎగవేత దారుల ఆస్తుల జప్తు, శిక్షల విధింపునకు సంబంధించి కేంద్రం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరగడం లేనందున, ఈ ఆర్డినెన్స్‌లను అత్యవసరమైనవిగా భావించి.. రాజ్యాంగంలోని 123 ఆర్టికల్ ప్రకారం వీటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని గెజిట్ నోటిఫికేషన్ తెలిపింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్‌లను కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదించిన రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ ప్రకారం.. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు. అలాగే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తునకు మరో ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది. -
ఆ తీర్పుపై పునఃసమీక్షకు సుప్రీంను కోరండి
సాక్షి, అమరావతి : ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదైన నిందితులను అరెస్టు చేయడం తప్పనిసరి కాదంటూ గత నెల 20వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సోమవారం వేర్వేరుగా లేఖలు రాశా రు. డాక్టర్ సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం, ఏఎన్ఆర్ కేసులో తాజా గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం స్ఫూర్తిని నీరుగార్చే విధంగా ఉందని వైఎస్సార్ సీపీ బలంగా విశ్వసిస్తున్నట్లు ఆ లేఖల్లో జగన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి, ప్రధానికి జగన్ రాసిన లేఖల్లోని సారాంశమిదీ... నిందితులు తప్పించుకునే అవకాశం ఉంది ‘ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం–1989 కింద కేసులు నమోదైన నిందితులెవరినీ తక్షణమే అరెస్టు చేయరాదు. సంబంధిత నియామక అధికారి అనుమతిస్తేనే ఈ కేసులో నిందితులైన ప్రజా సేవకులు / ఉద్యోగులను అరెస్టు చేయాల్సి ఉంటుంది. పోలీసు సూపరింటెండెంటు అనుమతించిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద నిందితులను అరెస్టు చేయాలి. ఈ విషయంలో తగిన కారణాలను రికార్డ్ చేయాలి. తదుపరి విచారణ సమయంలో మేజిస్ట్రేట్ ఈ కారణాలను తప్పనిసరిగా పరిశీలించాలి’అంటూ గత నెల 20వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం మీకు విదితమే. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఈ తీర్పు ఉందని వైఎస్సార్సీపీ ప్రగాఢంగా విశ్వసిస్తోంది. నిందితుని అరెస్టును అడ్డుకోవడం, దుర్భలుడైన బాధితుని కంటే బలవంతుడైన నిందితునికి ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాక, తదుపరి దర్యాప్తునకు సైతం అవరోధం కలిగిస్తుంది. అంతేకాక, సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అరెస్ట్ నుంచి నిందితులకు రక్షణ కల్పించినట్లుంది. ఇది అణగారిన వర్గాల హక్కులకు సంరక్షకుడిగా న్యాయస్థానం ఉందన్న తిరుగులేని నమ్మకాన్ని తగ్గించేదిగా ఉంది. వేధింపులు లేని రోజు లేదు... దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు లేకుండా ఒక్క రోజు కూడా గడవటం లేదనేది కాదనలేని సత్యం. ఈ పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన ఈ చట్టాన్ని నీరుగార్చడం వల్ల ఎస్సీ, ఎస్టీల మనోస్థైర్యం దెబ్బతింటుంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటికీ సమాజంలో ఎస్సీ, ఎస్టీలు అత్యంత అణచివేతకు గురవుతున్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధికి నోచుకోక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. సమానావకాశాలకు నోచుకోక, విద్యలో వెనుకబడి పౌష్టికాహార లోపంతో దుర్భర స్థితిలో అల్లాడుతున్నారు. కుల రహిత సమాజమే లక్ష్యం... కుల రహిత సమాజ స్థాపనే మన రాజ్యాంగ లక్ష్యం. అది నెరవేరే వరకూ ప్రభుత్వం అణగారిన వర్గాలకు సమానావకాశాలు కల్పించాలి. ఈ పరిస్థితుల్లో అతి ముఖ్యమైన ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం – 1989ని బలహీన పరచడాన్ని మనం ఏమాత్రం అనుమతించరాదని వినయపూర్వకంగా కోరుతున్నా. అందువల్ల ఈ తీర్పుపై పునఃసమీక్ష కోసం సుప్రీంకోర్టుకు ప్రతిపాదించాలని కోరుతున్నా’అని వైఎస్ జగన్ రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖల్లో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులే ఇలా అవమానిస్తుంటే? 40 ఏళ్లుగా ప్రజాజీవితంలో (రాజకీయాల్లో) కొనసాగుతూ అత్యంత అభివృద్ధి చెందుతున్న ఒక రాష్ట్రానికి 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు లాంటి వారే ఎస్సీ, ఎస్టీలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. ‘ఎవరు మాత్రం ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారు?’అని ఎస్సీ, ఎస్టీల గురించి చంద్రబాబు మాట్లాడారు. ‘ఎస్సీలకు శుచి, శుభ్రత ఉండదు. చూడటానికి అసహ్యంగా ఉంటారు. హుందాగా బతకటం తెలియదు.. ’అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలకులు ఇలా ఫ్యూడల్ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ దళితులను అణచివేస్తున్నారు. దళితుల పట్ల ప్రజాజీవనంలో ఉండే వారి మనస్తత్వమే ఇలా ఉంటే ఇతరుల మైండ్‌సెట్ ఎలా ఉంటుందో ఆలోచించండి. -
రాష్ట్రపతి, ప్రధానిలకు వైఎస్ జగన్ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును పునసమీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధానిలకు వైఎస్ జగన్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎస్సీ, ఎస్టీలు అభద్రతా భావానికి లోనవుతారని తెలిపారు. ఎందుకంటే.. రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు.. దళితుడిగా పుట్టాలని ఎవరూ కోరుకోరంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ మంత్రి ఆది నారాయణరెడ్డి దళితులు అపరిశుభ్రంగా ఉంటారని పేర్కొన్నారని గుర్తుచేశారు. దళితులను కించపరిచే వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుత పాలకుల ఫ్యూడల్ భావజాలానికి నిదర్శనమని, పాలకులే అలా మాట్లాడితే మిగిలిన వారి సంగతి ఏంటో మీరే ఆలోచించాలి. భారత రాజ్యాంగం కుల రహిత సమాజాన్ని కోరుకుందని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు రాసిన లేఖల్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్ జగన్ రాసిన లేఖ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ రాసిన లేఖ -
భారత రాష్ట్రపతి ఎవరు?.. చాలా కష్టం!
సాక్షి, ముంబై : నటన సంగతి ఏమోగానీ.. సినిమా వాళ్లకి బయటి విషయాల్లో పరిజ్ఞానం కాస్త తక్కువేనని అలియా భట్ లాంటి వాళ్లు తరచూ నిరూపిస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఇప్పుడు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా చేరిపోయాడు. టైగర్ నటించిన భాఘీ-2 రిలీజ్ అయ్యి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఏబీపీ న్యూస్ ఇంటర్వ్యూకు గర్ల్ ఫ్రెండ్, ఈ చిత్ర హీరోయిన్ దిశా పఠానీతో టైగర్ హాజరయ్యాడు. వ్యక్తిగత విషయాల తర్వాత యాంకర్.. భారతదేశానికి రాష్ట్రపతి ఎవరు? అని టైగర్‌ను ప్రశ్నించింది. ‘ఇది చాలా కష్టతరమైన ప్రశ్న’... అంటూ తటపటాయించిన టైగర్ ‘మిస్టర్ ముఖర్జీ(ప్రణబ్ ముఖర్జీ)’... అని పేర్కొన్నాడు. ఆ సమాధానానికి కంగుతిన్న యాంకర్.. మైక్‌ను దిశపఠానీ ముందు ఉంచేసరికి ఆవిడ ‘రామ్ నాథ్ కోవింద్’ అని చెప్పేసింది. కెరీర్ తొలినాటి నుంచి టైగర్ ష్రాఫ్‌ను ట్రోల్ చేస్తున్న వాళ్లకు ఈ వీడియో దొరికితే ఊరుకుంటారా? ఇప్పుడు చెలరేగిపోతున్నారు. -
భారత రాష్ట్రపతి ఎవరు?.. చాలా కష్టతరమైన ప్రశ్న!
-
సైనిక సంప్రదాయాన్ని మార్చిన ‘బీటింగ్ రిట్రీట్’
ఆదిత్య హృదయం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం, ఎకనమిక్ సర్వే తర్వాత బీటింగ్ ద రిట్రీట్ (సైనిక సంరంభోత్సవం) గురించి తెలుసుకోవడానికి మీకు సమయం లేకపోతే, మీరు కోల్పోయింది ఏదీ లేదని నేను నొక్కి చెబుతాను. ప్రతి ఏడాదిలాగే ఈసారీ నేను దాన్ని తిలకించటానికి ప్రయత్నించాను కానీ పూర్తిగా అసంతృప్తి, ఆశాభంగం కలిగించింది. పైగా అసహ్యం వేసింది కూడా. బీటింగ్ ద రిట్రీట్ ఎప్పుడూ నాకు ఇష్టమైన కార్యక్రమంగా ఉంటూ వచ్చింది. ఇది ఏ ప్రమేయం లేకుండానే మనతో డ్యాన్స్ చేయించే సంగీతంతో, అత్యంత నిర్దిష్టమైన మార్చింగ్తో కూడిన సంరంభోత్సవం. కార్యక్రమం చివర్లో ప్రదర్శించే లేజర్ లైటింగ్ మిరిమిట్లు గొలుపుతుంది. కాని ఈ అన్ని అంశాల్లోనూ ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఘోరంగా తయారైంది. ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపర్చామని భావిస్తున్న వ్యక్తులు నిజానికి దాని హృదయాన్ని తూట్లు పొడిచేశారు. నా స్నేహితుడు, బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో స్ట్రాటెజిక్ ఎఫైర్స్ ఎడిటర్ కల్నల్ అజయ్ శుక్లా ఈ కార్యక్రమానికి సరిగ్గా సరిపోయే ‘ట్వీటింగ్ రిట్రీట్’ శీర్షికతో తన విచారాన్ని వ్యక్తం చేశారు. ‘సైనిక ఉత్సవానికి వీరేం చేశారో నాకు తెలీదు. డ్రమ్మర్ల డ్యాన్సింగ్, సితార్ ప్లేయర్లు, సంగీతం అన్నీ ఉన్నాయి కానీ మిలిటరీకి సంబంధించిన స్పృహ లేకుండా చేశారు. అర్థరహితమైన మార్పులతో ఒక గొప్ప సంప్రదాయాన్ని బలిపెట్టడానికి సైనికాధికారులు ఎలా అనుమతించారో చూస్తుంటే విచారమేస్తుంది!’ బాధ్యతారహితమైన మన సైనిక జనరల్స్ బీటింగ్ ద రిట్రీట్ ఒక సంప్రదాయమని, నిరంతర కొనసాగింపే దాని ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయారు. పూర్తిగా పతనమయ్యే స్థాయికి దాన్ని మార్చేశారు. ఈ విశిష్ట సైనిక సంప్రదాయం 1690లో ప్రారంభమైంది. ఇంగ్లండ్ చక్రవర్తి జేమ్స్–ఐఐ యుద్ధం ముగిసిన రోజు చివరలో సైనిక దళాలు వెనక్కు వచ్చే సందర్భంగా సైనిక వాయిద్యాలను మోగించాలని ఆదేశించాడు. కాబట్టి అది ఒక ముగింపుకు సంబంధించిన సమ్మేళనం. అంతిమ పరిణామానికి అది చిహ్నం. ఇది పూర్తిగా సైనిక సంరంభ కార్యక్రమం. శతాబ్దాలుగా బీటింగ్ ద రిట్రీట్ ఒక అత్యద్భుతమైన సంగీతం, అత్యంత నిర్దిష్టంగా సాగే మిలిటరీ డ్రిల్‌కు మారుపేరుగా ఉంటూ వస్తోంది. చక్కటి పొందికతో పాదాలను కదపడమే ఈ మ్యూజికల్ మార్చ్ విశేషం. విషాదమేమిటంటే, గత సోమవారం ఈ కార్యక్రమాన్ని భారతీయులే కంపోజ్ చేసి ఉండవచ్చు కానీ వాళ్లు అసలైన కవాతును మాత్రం చేయించలేదు. రెండు. ఈ కార్యక్రమం కోసం వాడే సంగీత వాయిద్యాలు సాంప్రదాయిక మిలిటరీ బ్యాండ్‌కు సంబంధించినవిగానే ఉండాలి. అందరూ ఇష్టపడే సితారకు ఈసారి వారు చోటు ఇవ్వలేదు. వచ్చే ఏడాదికి వారు షెహనాయ్‌ని పరిచయం చేస్తారా? మూడు. బ్యాండ్ తప్పకుండా సంగీతానికి అనుగుణంగా మార్చ్ చేయాలి లేదా డ్రిల్ చేయాలి. సమర్థవంతమైన డ్రమ్మింగ్ మెప్పించవచ్చు కానీ దాన్ని సరైన విధంగా మేళనం చేయలేదు. ఇలాంటి సంగీతంతో మీరు మార్చ్ చేయలేరు. పైగా జాజ్ సంగీ తాన్ని పరిచయం చేయడానికి చేసిన ప్రయత్నం అయితే మరీ అసంబద్ధంగా కనిపించింది. నేను 1960లు, 70లు, 80ల నాటి బీటింగ్ రిట్రీట్స్ను గుర్తు తెచ్చుకున్నాను. అవి శ్రోతలకు దిగ్భ్రమ కలిగించేవి. బ్యాండ్లు కూడా మేటి సంగీతంతో అలరించేవి. బాలీ వుడ్ అనుకరణలను పక్కనబెడితే సైనిక కవాతు నిజానికి అలాంటి ప్రభావం కలిగిస్తుంది మరి. చివరగా, సూర్యుడు దిగంతంలోకి జారుకుంటున్నవేళ, సాయంవేళ దీపకాంతులను ప్రతిబింబించేది. రైసినా హిల్స్ విద్యుద్దీపాలతో మెరిసిపోయేది. ప్రతి ఒక్కరూ ఆ క్షణం తీసుకువచ్చే ఆకస్మిక వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. కానీ ఈ సంవత్సరం వారు లైటింగ్ కూడా మార్చేశారు. జాతీయ పతాక రంగులను ప్రతిబింబించే లైటింగ్‌లో దిగ్భ్రమ కలిగించే ప్రభావం లేకుండా పోయింది. కొత్త లైటింగ్ చీకటిలో మెప్పించవచ్చు కానీ సాయంత్రం ప్రారంభంలో అది కలిగించే ప్రభావం పెద్దగా ఉండదు. మీరు ఊహించే పతాకదశను ప్రదర్శించడంలో అది మిమ్మల్ని వంచిస్తుంది అంతే. కాని ‘అబైడ్ విత్ మి’, ‘సారే జహాసె అచ్ఛా’ గీతాలాపనతో వారు కాస్త దయ చూపినందుకు నేను కృతజ్ఞుడిని. వీటిని కూడా వారు ఉపసంహరిస్తారేమోనని నేను భావించాను. ఎందుకంటే మొదటి గీతం క్రిస్టియన్ కీర్తన. చివరి గీతాన్ని స్వరపర్చింది పాకిస్తాన్ సంస్థాపకులలో ఒకరు. ఈ సంవత్సరానికి మటుకు ఈ రెండూ బతికిపోయాయి మరి. మొత్తంగా నా అభిప్రాయం చాలా సరళమైంది. సంప్రదాయానికి విలువ ఇవ్వని దేశం తన గతాన్ని గౌరవించదు, పైగా అది విలువ ఇచ్చే జాతీయ మనోభావాలను కూడా పలుచన చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎప్పటికీ మీరు మార్చకూడని కొన్ని విషయాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం మీరు వాటిని అదేవిధంగా కొనసాగిస్తూ ఉండాలి. బీటింగ్ రిట్రీట్ అలాంటి అంశాల్లో ఒకటి. - కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
సత్తా చాటిన త్రివిధ దళాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో 69వ గణతంత్య్ర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. రాజ్ పథ్ వేదికగా.. ఏషియన్ 10 దేశాల ముఖ్యఅతిథులు వీక్షిస్తుండగా తమ విన్యాసాలను ప్రదర్శించిన త్రివిధ దళాలు ‘భారత్ సత్తా ఇది’ అని చాటి చెప్పాయి. వివిధ రకాల క్షిపణులు, సైనికుల విన్యాసాలను అహుతులు ఆసక్తిగా తిలకరించారు. ముందుగా ఉదయం ట్వీటర్లో దేశ ప్రజలకు గణతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. అమర్ జవాన్ జ్యోతి వద్ద అమర వీరులకు పుష్ఫ గుచ్ఛాలతో నివాళులర్పించారు. ఆయన వెంట రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాల అధిపతులు ఉన్నారు. అక్కడి నుంచి వారంతా రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. ఆసియాన్ కూటమిలో సభ్యదేశాలైన బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, సింగపూర్, వియత్నాం అధినేతలు ఈ వేడుకలకు హాజరుకాగా.. వారిని ప్రధాని మోదీ స్టేజీపైకి సాదరంగా ఆహ్వానించారు. ఆపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌పథ్‌కు చేరుకోగా.. మోదీ ఆయనకు కరచలనంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతిగా కోవింద్‌కు ఆయనకు ఇదే తొలి వేడుకలన్న విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. కాగా, దాదాపు 100 అడుగుల పొడవైన వేదికను అతిథుల కోసం ఏర్పాటు చేయగా, చుట్టూ బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్, భద్రత కోసం 60 వేల మంది సిబ్బందిని కేంద్రం ఏర్పాటు చేసింది. ఢిల్లీ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ సహా వివిధ విభాగాలు భాగస్వామ్యమయ్యాయి. చుట్టుపక్కల భవనాలపై స్నిప్పర్స్ ను ఏర్పాటు చేశారు. ఇండియా సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తూ త్రివిధ దళాల విన్యాసాలు కొనసాగాయి. వివిధ శాఖల, రాష్ట్రాల శకలాలు ఆకట్టుకున్నాయి. ఎయిర్ ఫోర్స్ సీ-130 జే సూపర్ హెర్క్యులెస్, సీ-17 గ్లోబ్ మాస్టర్, సుఖోయ్ - 30 ఎంకేఐ ఎస్, లైట్ కాంబాట్ తేజాస్ విమానాలు గాల్లో చేసిన విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. సైన్యానికి చెందిన టీ-90 ట్యాంకులు, బ్రహ్మోస్ మిసైల్స్, ఆకాష్ వెపన్ సిస్టమ్‌లతో పాటు 113 మంది మహిళలతో కూడిన 'సీమా భవానీ' పరేడ్ లో కదులుతున్న వేళ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. బైకులపై జవాన్లు చేసిన విన్యాసాలు కూడా ఆకర్షించాయి. ఈసారి లడ్డూ ఇవ్వలేదు... గణతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా పాక్ సైనికులకు భారత సైన్యం స్వీట్లు పంచటం తెలిసిందే. అయితే ఉరి దాడి తర్వాత... మిఠాయిలను పంచకూడదని బీఎస్ఎఫ్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు లడ్డూ పంచకుండానే వేడుకలు నిర్వహించింది. అయితే బంగ్లా సైనికులతో మాత్రం యథావిధిగా స్వీట్లు పంచుకుని వేడుకలు జరుపుకుంది. -
24 న హైదరాబాద్‌కు రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల 24 నుంచి 27 వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్లో రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు రావడం ఆనవాయితీ. 24 వ తేదీ రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ ఇచ్చే విందులో రామ్‌నాథ్ పాల్గొంటారు. ఆ తర్వాత 26 న రాష్ట్రపతి నిలయంలో తేనేటి విందు నిర్వహిస్తారు. నగరంలో నాలుగు రోజుల పర్యటన అనంతరం 27వ తేదీ ఆయన అమరావతికి బయల్దేరుతారు. కాగా, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులు శుక్రవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సమావేశమవుతారు. -
రాష్ట్రపతి విశాఖ పర్యటన ఖరారు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖ పర్యటన ఖరారైంది. తూర్పు నౌకాదళ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన నగరానికి రానున్నారు. డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా నేవల్ బేస్‌కు చేరుకుని సాయంత్రం బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. అక్కడ కాసేపు నేవీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆయన ముచ్చటిస్తారు. అనంతరం ఏయూ విశ్వవిద్యాలయంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం నేవల్ బేస్‌కు చేరుకొని రాత్రి బస చేస్తారు. 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే స్వర్ణోత్సవాల్లో రామ్‌నాథ్ కోవింద్ పాల్గొననున్నారు. పరేడ్‌లో రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆపై మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి బయల్దేరతారని అధికారిక వర్గాల సమాచారం. -
వర్షంలో తడుస్తూ రాష్ట్రపతి అరుదైన సీన్
తిరువనంతపురం : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సౌమ్యుడు అని మరోసారి అనిపించుకున్నారు. వర్షంలో తడుస్తూనే గౌరవం వందనం స్వీకరించారు. ఆత్రంగా ఆయనకు గొడుకు పట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా అవసరం లేదని చెప్పి నిర్మలంగా వర్షంలోనే నిల్చొని ఆయన వందనం స్వీకరించారు. అదే విధంగా ఆయనకు సెల్యూట్ చేసిన గార్డుకు ప్రతి నమస్కారం చేశారు. ఈ సంఘటన తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. రాష్ట్రపతి హోదాలో తొలిసారి కేరళకు వచ్చిన రామ్‌నాథ్ తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం 9.30గంటల ప్రాంతంలో దిగారు. ఆ సమయంలో జోరుగా వర్షం పడుతోంది. గవర్నర్ పీ సదాశివం, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. 'రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వర్షం పడుతుండటంతో ఆయనకు గొడుకుపట్టేందుకు అధికారులు ప్రయత్నించినా వద్దని చెప్పి వర్షంలోనే గౌరవవందనం స్వీకరించారు' అని అధికారులు తెలిపారు. -
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
-
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ : దసరా పండుగ వేళ ఆయా రాష్ట్రాలకు గవర్నర్లు ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చారు. ఐదు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడుకు భన్వరిలాల్ పురోహిత్ , మేఘాలయకు గంగాప్రసాద్, అరుణాలచల్ ప్రదేశ్ కు బీడీ మిశ్రా, బిహార్‌కు సత్యపాల్ మాలిక్, అస్సోంకు జగదీష్ ముఖీ, అండమాన్ నికోబార్‌కు మాజీ అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషిని లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకమయ్యారు. గతంలో జగదీశ్ ముఖీ అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు. -
తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించిన ఆయన తొలుత ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసి అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా అంతకుముందు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్రపతి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనార్థం తిరుచానూరు బయలుదేరారు. -
తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
-
రేపు తిరుపతి రానున్న రాష్ట్రపతి
-
1 న తిరుమలకు రాష్ట్రపతి
తిరుమల: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెప్టెంబర్ 1న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి శుక్రవారం మధ్యాహ్నం తిరుమల చేరుకుంటారు. శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి తిరుమల పర్యటన నేపథ్యంలో టీటీడీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అదేవిధంగా తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తొలిసారి తిరుమలకు రానున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ట్విట్టర్లో నిమిషాల్లో దూసుకుపోయిన కోవింద్
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్‌నాథ్ కోవింద్ అప్పుడే ట్విట్టర్లో దూసుకుపోతున్నారు. ప్రమాణ స్వీకారం చేసి నిమిషాలు కూడా గడవకముందే ఆయన ట్విట్టర్ ఖాతాకు ఏకంగా 3.5మిలియన్ల ఫాలోవర్స్ చేరుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్‌నాథ్ 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'(@rashtrapatibhvn) పేరుతో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. అయితే, నిమిషాల్లోనే ఆయనకు ఫాలోవర్స్ లక్షల్లో పెరిగిపోవడం గమనార్హం. ఆయన 'భారతదేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నా బాధ్యతలన్నీ కూడా వినమ్రంగా నిర్వహిస్తాను' అంటూ ఆయన తొలి ట్వీట్ చేశారు కూడా. సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్రమోదీతో సహా ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్న విషయం తెలిసిందే. అయితే, కోవింద్ ఖాతాకు మాత్రం గతంలో ఏ రాష్ట్రపతికి రానంత వేగంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖేహర్ మంగళవారం రామ్‌నాథ్‌తో రాష్ట్రపతిగా ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే. -
'పూరి గుడిసెలో పుట్టాను.. నేడు రాష్ట్రపతిగా..'
-
'పూరి గుడిసెలో పుట్టాను.. నేడు రాష్ట్రపతిగా..'
న్యూఢిల్లీ: తానొక కుగ్రామంలో, పూరిగుడిసెలో మట్టి ఇంట్లో పుట్టానని భారత రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఇలాంటి తనకు రాష్ట్రపతిగా గొప్ప గౌరవం లభించిందని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖేహర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో తొలిసారి కోవింద్ ప్రసంగించారు. 'పూర్తి వినమ్రంగా నేను ఈ బాధ్యత స్వీకరిస్తున్నాను. ఈ బాధ్యతను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. రాష్ట్రపతిగా నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. ఒక కుగ్రామంలో పూరిగుడిసెలో నేను పుట్టి పెరిగాను. అలాంటి నాకు రాష్ట్రపతిగా గొప్ప గౌరవం లభించింది. ఎంతోమంది స్ఫూర్తితో బాధ్యతలు స్వీకరిస్తున్న నేను వాటిని వినమ్రంగా నిర్వహిస్తాను. ఇప్పటి వరకు రాష్ట్రపతులుగా పనిచేసిన వారి బాటలోనే నడుస్తాను. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, రాజేంద్రప్రసాద్, అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ అడుగుజాడల్లో ముందుకెళతాను. 125కోట్ల మంది ప్రజలు నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా. మన దగ్గర భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఉన్నాయి.. అయినా మనం భారతీయులమే. సైనికులు, శాస్త్రవేత్తలు, పోలీసులు, రైతులూ, మహిళలు, యువతే ఈ దేశ నిర్మాతలు. భారత్ ఎన్నో మైలు రాళ్లు అధిగమించింది. ఇంకా ఎన్నో చేరుకోవాలి. వేలాదిమంది పోరాటం ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చింది. గాంధీజీ కలలుగన్న నవసమాజాన్ని మనం నిర్మించాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాతి నిర్మాతలే. ఈ సందర్భంగా భారత్ నాలుగో పారిశ్రామిక విప్లవానికి స్వాగతం పలుకుతోంది..' అంటూ ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి హోదాలో ఆయన తొలి ట్వీట్ కూడా చేశారు. 'భారతదేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నా బాధ్యతలన్నీ కూడా వినమ్రంగా నిర్వహిస్తాను' అంటూ ఆయన తొలి ట్వీట్ చేశారు. Honoured to be sworn in as the 14th President of India; would be carrying out my responsibilities with all humility #PresidentKovind — President of India (@rashtrapatibhvn) July 25, 2017 -
రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం
-
రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ 14వ రాష్ట్రపతిగా బిహార్ మాజీ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిగా పదవీకాలం ముగించుకున్న ప్రణబ్ ముఖర్జీ... కోవింద్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో దళిత నేత కోవింద్. అంతకు ముందు ఆయన కుటుంబసమేతంగా రాజ్‌ఘాట్ చేరుకుని, మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా తొలిసారి ప్రసంగం చేశారు. దేశప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని ఆయన తెలిపారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధానులు దేవగౌడ, మన్మోహన్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ అగ్రనేత అద్వానీ, రెండు తెలుగురాష్ట్రల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, పౌర, సైనిక విభాగాల ముఖ్యాధికారులు హాజరు అయ్యారు. కోవింద్ ప్రమాణం చేశాక సాయుధ బలగాలు 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించాయి. ఈ కార్యక్రమం ముగిశాక కోవింద్ రాష్ట్రపతి భవనానికి చేరుకున్నాక, అక్కడికి సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. -
రాజన్‌బాబు నుంచి నేటి వరకూ
♦ అత్యధిక ఓట్ల శాతంలో...12వ స్థానం కోవింద్‌ది! పద్నాలుగో రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏబీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌కోవింద్‌పోలైన ఓట్లలో 65.65 శాతం ఓట్లు సాధించి, ఇప్పటి వరకూ జరిగిన 14 ఎన్నికల్లో (ఏకగ్రీవమైన 1977 నాటి ఎన్నికను మినహాస్తే) అత్యధిక ఓట్లు పొందినవారి వరుస క్రమంలో 12వ స్థానం సంపాదించారు. భారత రాష్ట్రపతి రెండో ఎన్నిక(1957)లో మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్పోలైన ఓట్లలో 98.99 శాతం సాధించి మొదటి స్థానంలో నిలిచారు. అత్యధిక ఓట్లు దక్కించుకోవడంలో రెండో ర్యాంక్రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు(1962లో 98.24 శాతం) లభించింది. అప్పట్లో ప్రతిపక్షాలకు బలం లేకపోవడమే కాంగ్రెస్అభ్యర్థులుకు భారీగా ఓట్లు రావడానికి కారణమైంది. 1997లో జరిగిన ఎన్నికలో కేఆర్నారాయణన్94.97 శాతం ఓట్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. అప్పుడు శివసేన వంటి ఒకట్రెండు పార్టీలు మినహా బీజేపీ, కాంగ్రెస్, పాలక యునైటెడ్ఫ్రంట్సహా దాదాపు అందరూ మద్దతు ఇవ్వడంతో కేఆర్‌కు ఇన్ని ఓట్లుపడ్డాయి. 2002లో జరిగిన ఎన్నికలో వామపక్షాలను మినహాయించి మిగిలిన పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య దాదాపు ఏకాభిప్రాయం కుదరడంతో ఏపీజే అబ్దుల్‌కలాం 89.57 శాతం ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. అత్యల్ప మెజారిటీ వి.వి.గిరికే! ఓ మోస్తరు త్రిముఖ పోటీ 1969లోనే జరిగింది. ప్రధాని ఇందిరాగాంధీ మద్దతుతో పోటీకి దిగిన వీవీ గిరి, కాంగ్రెస్అభ్యర్థి నీలం సంజీవరెడ్డి మధ్య గట్టిపోటీతోపాటు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి చింతామణ్డి.దేశ్ముఖ్కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో(13 శాతం) ఓట్లు రాబట్టడంతో ఫలితం రెండో లెక్కింపులో తేలింది. మొదటి లెక్కింపులో గిరికి 48 శాతం, నీలంకు 37 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్ప ఓట్ల మెజారిటీతో భారత రాష్ట్రపతి అయిన రికార్డు గిరి పేరు చరిత్రలో నిలిచింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ ఎప్పుడూ రాలేదు. అయితే, అంతకు ముందు జరిగిన 1967 ఎన్నికలో కూడా మొదటిసారి ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య తీవ్రపోటీ నెలకొంది. కాంగ్రెస్అభ్యర్థి జాకిర్హుసేన్కేవలం 56.23 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. తక్కువ ఓట్లు, మెజారిటీతో గెలిచినవారి జాబితాలో హుసేన్‌ది వీవీ గిరి తర్వాత రెండో స్థానం. 1967 ఎన్నికల్లో కాంగ్రెస్అనేక రాష్ట్రాల్లో ఓడిపోయింది. దీనికితోడు లోక్‌సభలో 300 కన్నా తక్కువ సీట్లు సాధించడం, సోషలిస్ట్దిగ్గజం డా. రాంమనోహర్‌లోహియా ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధించడం వంటి కారణాలే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోకా సుబ్బారావుకు 43.43 ఓట్లు తెచ్చిపెట్టాయి. 65 శాతంతో గెలిచిన ఇద్దరు ప్రతిభ, కోవింద్! వీవీ గిరి, జాకిర్హుసేన్తర్వాత తక్కువ శాతం ఓట్లు తెచ్చుకున్నవారిలో తర్వాత స్థానం ఇప్పటి బీజేపీ అభ్యర్థి రామ్నాథ్కోవింద్ది. ఆయనకు 65.65 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్అభర్థి మీరాకుమార్34.35 శాతం ఓట్లు సాధించారు. (సాక్షి నాలెడ్జ్సెంటర్) సంబంధిత వార్త ఈ లెక్కన వెంకయ్యకు 482 ఓట్లు -
‘రాష్ట్రపతి రేసులో నేను లేను’
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేరు బలంగా తెరపైకి రావడంతో ఈ కథనాలపై ఆమె స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తాను అధికార పార్టీ అభ్యర్థిగా నిలబడనున్నట్టు వచ్చిన కథనాలు వదంతులు మాత్రమేనని ఆమె తోసిపుచ్చారు. వచ్చే నెల 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అయినప్పటికీ ఇటు అధికార బీజేపీ కానీ, అటు ప్రతిపక్షాలు కానీ తమ అభ్యర్థిని ప్రకటించకుండా సస్పెన్స్ ను కొనసాగిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల రేసులో పలువురి పేర్లు ఉన్నట్టు కథనాలు వచ్చాయి. అందులో సుష్మా పేరు కూడా ఉందని, బీజేపీ, ఆరెస్సెస్ సన్నిహిత వర్గాల ప్రకారం సుష్మ పేరు దాదాపు ఖరారైనట్లుగా జాతీయ మీడియా కథనాలు గుప్పించింది. ‘అవి రూమర్స్ మాత్రమే. నేను ప్రస్తుతం విదేశాంగమంత్రిని. (రాష్ట్రపతి అభ్యర్థిపై) మీరు అడుగుతున్న ప్రశ్న అంతర్గత వ్యవహారం’ అని సుష్మా శనివారం విలేకరులతో అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో మీరు ఉన్నారా? అన్న ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించారు. -
క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: మరో నెల రోజుల్లో బాధ్యతల నుంచి దిగిపోతుండగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తాజాగా మరో రెండు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. దీంతో ఇప్పటి వరకు ఆయన వద్దకు తిరస్కరణకు గురైన క్షమాభిక్ష పిటిషన్ల సంఖ్య 30కి చేరింది. తాజాగా తిరస్కరించిన ఈ రెండు పిటిషన్లపై రాష్ట్రపతి ప్రణబ్ గత మే నెలాఖరున నిర్ణయం తీసుకున్నారు. 2012లో నాలుగేళ్ల బాలికపై ఇండోర్‌లో ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి చంపేయగా ఆ కేసుకు సంబంధించి వారికి మరణ శిక్షను కోర్టు విధించింది. అలాగే, పుణెలో ఓ క్యాబ్ డ్రైవర్ అతడి స్నేహితుడు కలిసి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించిన క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి వద్దకు గత ఏప్రిల్, మే నెలలో చేరాయి. వీటిని రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ రెండు కేసులు కూడా అత్యంత అమానవీయ స్థితిలో చోటుచేసుకున్న నేపథ్యంలో వారికి క్షమాభిక్ష పెట్టకూడదని రాష్ట్రపతి నిర్ణయించుకున్నట్లున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతిగా ప్రణబ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబయి దాడులకు సంబంధించి అజ్మల్ కసబ్, అఫ్జల్‌గురు, యాకుబ్ మీనన్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదులకు క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణకు గురవడంతోపాటు ఉరిశిక్ష కూడా అమలైంది. ఈ ఏడాది జనవరిలో ప్రణబ్ ఓ నాలుగు మరణశిక్షలను జీవితకాల శిక్షలుగా కూడా మార్చారు. వచ్చే నెలలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగుస్తున్న విషయం తెలిసిందే. -
‘రాష్ట్రపతిగా కాదు.. ఉషాపతిగా చాలు’
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కొత్త రాష్ట్రపతి అభ్యర్థి విషయంపై పెద్ద మొత్తంలో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్రంమంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండొచ్చేమోనని, కనీసం ఉపరాష్ట్రపతి అయిన అవుతారేమోనని మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో వెంకయ్యనాయుడు ఈ ఊహాగానాలపై స్పష్టతను ఇచ్చారు. తాను అసలు రాష్ట్రపతి రేసులో లేనంటూ తనదైన శైలిలో పరోక్షంగా స్పష్టతనిచ్చారు. ‘నాకు రాష్ట్రపతి అవ్వాలని లేదు.. అలాగే ఉప రాష్ట్రపతి అవ్వాలని లేదు. ప్రస్తుతానికి ఉషాపతిగా (వెంకయ్యనాయుడి సతీమణి పేరు ఉష) చాలా సంతోషంగా ఉన్నాను’ అంటూ చమత్కరించారు. వాస్తవానికి దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతి ముఖ్యమైనవిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాలకు సౌమ్యుడిగా ఉండే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా తెర మీదకు తెస్తే పార్టీకి చాలా ప్రయోజనకరం అని బీజేపీ భావిస్తుందంట. అందులో భాగంగానే ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగానో లేక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగానో ప్రకటించే అవకాశాలు లేకపోలేదని మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలైలో ముగియనుంది. -
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
-
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి బుధవారం హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకుని ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిపివేత, మళ్లింపు ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి పర్యటన ఇలా..: బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి వెళ్లనున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలీలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ అడిటోరియంలో జరిగే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ల్యాంగేజ్ యూనివర్సిటీ కార్యక్రమానికి హాజరువుతారు. అక్కడి నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాష్ట్రపతి ఈ రూట్లలో పర్యటించే నిర్ణీత సమయాలలో ఆయా రూట్లలో ఆంక్షలు కొనసాగుతాయని సీపీ వెల్లడించారు. వాహనాల మళ్లింపు, నిలిపివేయడాలు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్లే ఆర్టీసి బస్సు రూట్‌ను మళ్లిస్తుండడంతో వాహనదారులు, ప్రయాణీకులు తమ గమ్యస్థానాలను సులువుగా చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సీపీ సూచిస్తూ రాష్ట్రపతి పర్యటించే రూట్ల వివరాలను వెల్లడించారు. బేగంపేట్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ (మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 నిమిషాల మధ్య) బేగంపేట్ ఎయిర్‌పోర్టు, బేగంపేట్ పీఎస్, రసూల్‌పురా జంక్షన్, పీజీ కాలేజీ, సీటీవో ఫ్లైఓవర్, ప్లాజా, వైఎంసీఏ ఫ్లైఓవర్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్స్, నాయుడు మోటర్స్ లేన్, భారత్ పెట్రోల్ పంప్, ఆర్ఆర్సీ గ్రౌండ్స్ లేన్, అలుగడ్డ బావి జంక్షన్, ఎస్ఎన్టీ వర్క్ షాప్, మెట్టుగూడ జంక్షన్, రైల్వే డిగ్రీ కాలేజీ, తార్నాక ఎక్స్ రోడ్స్, ఆర్టీసి దవాఖాన, ఉస్మానియా యూనివర్శిటీ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజ్‌భవన్‌కు (మధ్యాహ్నం 1.15 నిమిషాల నుంచి 2 గంటల మధ్య) ఉస్మానియా యూనివర్శిటీ, ఆర్టీసీ దవాఖాన, తార్నాక ఎక్స్ రోడ్స్, రైల్వే డిగ్రీ కాలేజీ, మెట్టుగూడ జంక్షన్, ఎస్ఎన్టీ వర్క్ షాప్, అలుగడ్డ బావి జంక్షన్, ఆర్ఆర్సీ గ్రౌండ్స్ లేన్, భారత్ పెట్రోల్ పంప్, నాయుడు మోటర్స్ లేన్, సంగీత్ ఎక్స్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, నార్త్ జోన్ డీసీపీ అఫీస్, వైంఎసీఏ ఫ్లైఓవర్, ప్లాజా, సీటీవో ఫ్లైఓవర్, పీజీ కాలేజీ, రసూల్‌పురా జంక్షన్, పీఎన్టీ ఫ్లైఓవర్, శ్యాంలాల్ బిల్డింగ్, హెచ్‌పీఎస్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ ఎక్స్ రోడ్స్, మోనప్ప ఐలాండ్, జయ గార్డెన్, యశోధ దవాఖాన, ఎంఎంటీఎస్, రాజ్‌భవన్ రైల్వే గేట్, రాజ్‌భవన్, వీవీ విగ్రహాం. రాజ్‌భవన్ నుంచి గచ్చిబౌలి (సాయంత్రం 4 గంటల నుంచి 4.45 నిమిషాల మధ్య) మోనప్ప ఐలాండ్, రాజ్‌భవన్, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహాం, కేసీపీ జంక్షన్, అన్సారీ మంజిల్, హోటల్ తాజ్ కృష్ణ టీ జంక్షన్, రోడ్డు నెం.1/10 జంక్షన్, రోడ్డు నెం. 1/12 జంక్షన్, ఖాజా మెన్షన్, మాసబ్ ట్యాంక్, ఎన్ ఎండీసీ, ఎస్.డీ.ఐ దవాఖాన, హుమాయిన్‌నగర్ పీఎస్, రైతు బజార్, రేతి బౌలి, నాలానగర్, టోలిచౌక్ ఫ్లైఓవర్, గాలక్సీ ధీయేటర్, షేక్‌పేట్ నాలా, నారాయణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి. గచ్చిబౌలి నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టు గచ్చిబౌలి, నారాయణమ్మ కాలేజీ, షేక్‌పేట్ నాలా, గాలక్సీ ధీయేటర్, టోలిచౌక్ ఫ్లైఓవర్, నాలానగర్, రేతిబౌలి, మెహిదీపట్నం, ఎస్.డి.కంటి ఆసు పత్రి, ఎన్ఎండీసీ, మాసబ్ ట్యాంక్, ఖాజ మెన్షన్, రోడ్డు నెం.1/12, రోడ్డు నెం.1/10 జంక్షన్, హోటల్ తాజ్ కృష్ణ జంక్షన్, రోడ్డు నెం. 1/7 జంక్షన్, రోడ్డు నెం. 1/4 జంక్షన్, నాగార్జున సర్కిల్ (ఎన్ఎఫ్సీఎల్), పంజాగుట్ట ఫ్లైఓవర్, సీఎం క్యాంప్ అఫీస్, బేగంపేట్ ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్, శ్యాంలాల్, పీఎన్టీ జంక్షన్, బేగంపేట్ ఎయిర్‌పోర్టు, రసూల్‌పురా. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు... ⇒ అడిక్‌మెట్ ఫ్లైఓవర్, ఆర్ట్స్ కాలేజీ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలు సీతాఫల్ టీ జంక్షన్ వద్ద సతాఫల్మండి వైపు మళ్లిస్తారు. ⇒ హబ్సిగూడ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలను వీవీఐపీలు వచ్చే సందర్భంగా రాజ్యాభిలేఖ తార్నాక స్ట్రీట్ నెం.1 వద్ద, లాలాపేట్ నుంచి వచ్చే వాహనాలను డేవిడ్ మెమోరియల్ స్కూల్ వద్ద నిలిపివేస్తారు. ఆర్టీసీ బస్సుల మళ్లింపు ⇒ఎన్సీసీ గేట్ నుంచి పాసు ఉన్న వాహనాదారులను మాత్రమే ఉస్మానియా క్యాంపస్‌లోకి పంపిస్తారు. సాధారణ వాహనాలను డీడీ కాలనీ, విద్యానగర్ వైపు మళ్లిస్తారు. ⇒ ప్రధాన డైవర్షన్ రాంనగర్ టీ జంక్షన్, విద్యానగర్ టీ జంక్షన్ (డీడీ ఆసుపత్రి) వద్ద ఉంటుంది. ⇒ తార్నాక నుంచి వెళ్లే రూట్ నెం. 3 ఆర్టీసి బస్సులు స్ట్రీట్ నెం. 8 హబ్సి గూడ, రామాంతపూర్, అంబర్పేట్ 6 జంక్షన్, నింబోలిఅడ్డా మీదుగా కాచిగూడ రూట్లో వెళ్లాలి. ⇒ ఆఫ్జల్‌గంజ్ లేదా కోఠి నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్లే వాహనాలు చాదర్‌ఘాట్, నింబోలి అడ్డా, అంబర్‌పేట 6 జంక్షన్, అంబర్పేట్, రామాం తపూర్, హబ్సిగూడ స్ట్రీట్ నెం. 8 నుంచి ఈసీఐఎల్‌కు వెళ్లాలి. ⇒దిల్సుఖ్నగర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే 107 రూట్ బస్సులను విద్యానగర్ వద్ద మళ్లిస్తారు, ఈ బస్సులు హిందీ మహా విద్యా లయ, ఆర్టీసి ఎక్స్ రోడ్స్, ముషీరాబాద్ మీదుగా సికింద్రాబాద్ రూట్లో నడుస్తాయి. -
ప్రముఖులకు రాష్ట్రపతి పద్మ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఆయన అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. గత నెల 30వ తేదీన జరిగిన కార్యక్రమంలో 39 ప్రముఖులు అవార్డులు అందుకోగా, గురువారం మొత్తం 44 మందికి సంబంధించి అవార్డులను ప్రదానం చేశారు. వీరిలో 40 మంది రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు. ముగ్గురికి వారు మరణించిన తర్వాత జ్ఞాపకార్థం అవార్డులను ప్రకటించగా, వారి తరఫు బంధువులు స్వీకరించారు. పద్మశ్రీ పురస్కారం పొందిన కన్నడ నిఘంటుకర్త జి.వెంకటసుబ్బయ్య వేడకకు హాజరుకాలేకపోయారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రఖ్యాత శిల్పి ఎక్కా యాదగిరిరావు, ప్రముఖ వైద్యుడు డా.మహమ్మద్ అబ్దుల్ వాహీద్, పోచంపల్లి పట్టుచీరలను నేయడంలో సమయం, కష్టం తగ్గించేలా ‘లక్ష్మీ ఆసు’ యంత్రం సృష్టించిన చింతకింది మల్లేశం, టెలికాం నిపుణుడు త్రిపురనేని హనుమాన్ చౌదరిలు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాలు అందుకున్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్, గాయకుడు కేజే ఏసుదాసులకు పద్మ విభూషణ్ అవార్డులను ప్రణబ్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ‘మోహన్ వీణ’ సంగీత వాద్యాన్ని రూపొందించిన పండిట్ విశ్వమోహన్ భట్, ఆధునిక భాషల అధ్యాపకుడు, కాశీ విశ్వనాథ్ గుడిలో ఆచార్యుడైన దేవీ ప్రసాద్ ద్వివేదీ, జైనమత సాధువు రత్నసుందర్‌సూరి మహరాజ్ తదితరులు పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. దివంగత పాత్రికేయుడు చో రామస్వామికి పద్మభూషణ్ పురస్కారం ప్రకటించగా, ఆయన భార్య స్వీకరించారు. ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్, గాయకుడు కైలాష్ ఖేర్, బాలీవుడ్ సినిమాల విమర్శకురాలు భావనా సోమయ తదితరులకు పద్మశ్రీ అవార్డులను ప్రణబ్ బహుకరించారు. అమరవీరులకు అవార్డు అంకితం: ఎక్కా యాదగిరి తాను అందుకున్న పద్మ శ్రీ పురస్కారాన్ని తెలంగాణ అమర వీరులకు అంకిత ఇస్తున్నట్టు ఎక్కా యాదగిరి తెలిపారు. అవార్డు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ పురాస్కారానికి తనను ఎంపిక చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో శిల్ప కళను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో శిల్ప కళా అకాడమీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మరో అవార్డు గ్రహీత, చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం మాట్లాడుతూ.. చేనేత కార్మికుడైన తనను పుస్కారానికి ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. తాను తయారు చేసిన ఆసు యంత్రాలు ఇంకా కింది స్థాయి వరకు చేరలేదని, 90 శాతం సబ్సిడీతో చేనేత కార్మికులకు అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఆనందంగా ఉందన్నారు. -
కొత్త రాష్ట్రపతి ఎవరో?
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో గెలవడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. మరో నాలుగు నెలల్లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు కావల్సిన బలం చాలావరకు ఎన్డీయేకు వచ్చేసింది. దాంతో ఇప్పుడు కొత్త రాష్ట్రపతి ఎవరవుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఐదేళ్లు జూలై నెలలో ముగుస్తుంది. దాంతో ఈలోపుగానే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. తన గురుతుల్యులు, తాను ఈ స్థానానికి చేరుకునేందుకు వేలుపట్టి అడుగులు వేయించిన కురువృద్ధులు మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీలలో ఎవరో ఒకరికి రాష్ట్రపతి పదవిని మోదీ కట్టబెడతారా.. లేక వాళ్లిద్దరూ కాకుండా వేరే ఎవరికైనా అవకాశం ఇస్తారా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. తన తొలి నాళ్లలో ఢిల్లీ పార్టీ కార్యాలయంలో ఉన్నప్పుడు ప్రతిరోజూ సాయంత్రం పూట మురళీ మనోహర్ జోషి చెప్పే పాఠాలను మోదీ వింటుండేవారు. 1992లో శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో జోషి మూడు రంగుల జెండా ఎగరేసినప్పుడు.. ఆయన పక్కనే మోదీ నిలబడ్డారు. అలాగే, మోదీ సంక్షోభంలో ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయనను తప్పించాలని తీవ్రంగా ఇంటా బయటా ఒత్తిడి వచ్చినా, ఎల్కే అద్వానీ మాత్రం మోదీకి గట్టి మద్దతుగా నిలబడి, ఆయనను ఆ పదవిలో కొనసాగేలా చేశారు. దాంతో వీళ్లిద్దరి పట్ల మోదీకి కృతజ్ఞతాభావం ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ.. అంతమాత్రాన వాళ్లలో ఒకరిని రాష్ట్రపతిగాను, మరొకరిని ఉప రాష్ట్రపతిగాను చేస్తారా అంటే.. అనుమానమేనని బీజేపీలో కొందరు నాయకులు అంటున్నారు. మహిళలు, దళితులు, గిరిజనులు లేదా ఆర్ఎస్ఎస్ సీనియర్లు.. వీళ్లలో ఎవరో ఒకరికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. ఇందుకు తగినట్లుగా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మోదీ మాత్రం ఈ ఆలోచనలన్నింటికీ భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరుస్తారని కేంద్రంలోని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్ని ఓట్లు కావాలి.. రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టొరల్ కాలేజిలో మొత్తం 10,98,882 ఓట్లుంటాయి. అందులో సగం ఓట్లకు పైగా వస్తేనే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. అంటే, 5,49,442 ఓట్లు కావాలన్న మాట. ఉత్తరప్రదేశ్‌లో 321 స్థానాలు, ఉత్తరాఖండ్‌లో 57 స్థానాలతో పాటు మణిపూర్, గోవాలలో సాధించిన విజయాలతో ఎన్డీయే చాలావరకు ఈ సంఖ్యకు దగ్గరగా వచ్చింది. ఇక మరో 25,354 ఓట్లు సంపాదిస్తే చాలు.. రాష్ట్రపతి ఎన్నికకు మార్గం సుగమం అయిపోతుంది. శనివారం నాటి ఎన్నికల ఫలితాలకు ముందు ఈ తేడా 79,274గా ఉండేది. ఇప్పుడది గణనీయంగా తగ్గింది. మొత్తం అన్ని రాష్ట్రాలలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లతో ఎలక్టొరల్ కాలేజి ఉంటుంది. నామినేటెడ్ ఎమ్మెల్యేలకు ఇందులో ఓటుహక్కు ఉండదు. రాష్ట్ర జనాభాను బట్టి ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఓటుకు ఒక విలువ ఉంటుంది. ఉదాహరణకు ఎంపీలకు ప్రతి ఓటుకు గరిష్ఠంగా 708 విలువ ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 208. యూపీ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కావడంతో కేవలం ఆ రాష్ట్రంలోనే మొత్తం 83,824 ఓట్లుంటాయి. ఇలా.. అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ల వాళ్ల ఓటు విలువను బట్టి రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేస్తారు. -
అమలకు నారీ శక్తి అవార్డు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: సినీనటి అక్కినేని అమలకు నారీ శక్తి పురస్కారం లభించింది. సమాజంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏటా అందించే ఈ పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఢిల్లీలో ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 33 మంది మహిళలకు రాష్ట్రపతి నారీశక్తి పురస్కారాలను అందజేశారు. వ్యక్తిగత సమాజ సేవకు గుర్తింపుగా అమలకు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. అవార్డుతో సమాజ సేవలో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. సమాజ సేవకు తాను చేస్తున్న కృషికి తన కుటుంబం నుంచి అందుతున్న సాయం ఎంతో ఉందన్నారు. వివిధ రంగాల్లో మరింత సాయం చేయడానికి తన వద్ద ప్రణాళిక ఉందని, దీన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు అందించి తన భవిష్యతు కార్యాచరణను ప్రకటిస్తానని ఆమె తెలిపారు. -
జల్లికట్టును పరిరక్షించండి : కేతిరెడ్డి
న్యూ ఢిల్లీ: తమిళ సంప్రదాయ జల్లికట్టు ఆటను పరిరక్షించాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి లేఖ రాశారు. వ్యవసాయంతో పాటూ, రోజూ వారి జీవితంలో సహాయపడే ఎద్దులు, ఇతర జంతువులకు కృతజ్ఞత తెలిపడానికే జల్లికట్టు ఆట అని వివరించారు. నిర్దిష్ట స్థలంలో కొందరు యువకుల మధ్యకు బలిష్టమైన గిత్తను వదులి ఆడే ఈ జల్లికట్టు ఆచారం కళితోగై కాలం నుంచే ఉందని పేర్కొన్నారు. జంతువులకు శిక్షణ (కోతులు, ఎలుగుబంట్లు, పులులు తదితర) ఇచ్చి... వాటితో ప్రదర్శనలు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం 1991లో నిషేధించింది. 2011లో ఈ జాబితాలో గిత్తను కూడా చేర్చారు. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... 2014లో అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ జల్లికట్టుపై నిషేధం విధించింది. అనంతరం ఎద్దు నిషేధిత జాబితాలో ఉన్నా జల్లికట్టు ఆడుకోవచ్చని కేంద్రం ఆదేశించింది. ఇది కోర్టు ధిక్కారమని జంతు పరిరక్షణ సంస్థ ‘పెటా’ సుప్రీం తలుపు తట్టింది. ఈ ఆదేశాలను సుప్రీం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో క్రీడ మద్దతుదారులు కొందరు అనుమతించాలని మళ్లీ సుప్రీంకు వెళ్లగా వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు కోసం ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చి, రాజ్యాంగ సవరణ చేసి తమిళ సంప్రదాయ ఆట జల్టికట్టును పరిరక్షించాలని కేతిరెడ్డి ప్రణబ్ ముఖర్జీని కోరారు. -
పాత నోట్లు : జరిమానాకు రాష్ట్రపతి ఓకే
న్యూఢిల్లీ: మార్చి 31 తర్వాత రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు భారీ ఎత్తున కలిగి ఉన్నవారిపై జరిమానా విధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి డిసెంబర్ 30 శుక్రవారం నాటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఈ ఆర్డినెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి గడువు ముగియడం, శీతాకాల విడిది కోసం గత పది రోజులుగా హైదరాబాద్ లో విడిది చేసిన రాష్ట్రపతి శుక్రవారం సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకోవడం, ఆ వెంటనే కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు ఆయన ఆమోదం తెలపడం వెనువెంటనే జరిగిపోయాయి. తాజా ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా జరిమానా విధించనున్నారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు. (చదవండి : పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే!) గత నవంబర్ 8 నుంచి పెద్ద నోట్లను రద్దు చేయగా, అప్పటి నుంచి వాటిని డిపాజిట్ చేసే గడువు పూర్తయ్యే వరకు విదేశాల్లో ఉండిపోయిన వారికి మాత్రం మరో అవకాశం కల్పించారు. అలాంటి వాళ్లు వచ్చే మార్చి 31 వరకు తమ పాత నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే విదేశాల్లో ఉన్న భారతీయ కరెన్సీ తెచ్చుకోవాలంటే అందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను కూడా విధించింది. ఒక్కో వ్యక్తి 25 వేల రూపాయలకు మించి తెచ్చుకోవడానికి వీలులేదు. పైగా ఎయిర్ పోర్టుల్లో వాటిని విధిగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరైనా తప్పుగా నమోదు చేస్తే మాత్రం 50 వేల రూపాయల జరిమానా లేదా దానికి అయిదింతల మేరకు జరిమానా ఉంటుంది. నేపాల్, భూటాన్ దేశాల నుంచి తీసుకురావాలనుకుంటే వారికి ఫెమా చట్టం పరిధికి లోబడి మాత్రమే అనుమతిస్తారు. -
ముక్కుకు ముక్కు రాసి..
న్యూజిలాండ్‌లో ప్రణబ్‌కు సంప్రదాయ స్వాగతం అక్లాండ్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మూడు రోజుల పర్యటన కోసం శనివారం న్యూజిలాండ్ చేరుకున్నారు. స్వాగత కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక సంప్రదాయం ప్రకారం మవోరీ తెగ అధిపతితో, ఆయన భార్యతో పరస్పరం ముక్కు రాసుకున్నారు. తొలుత గవర్నర్ జనరల్ సర్ జె ర్రీ మట్‌పరే నివాసానికి చేరుకున్న ప్రణబ్‌ను ఆచారం ప్రకారం అతిథి శత్రువో, స్నేహితుడో తెలుసుకోవడానికి మవోరి యుద్ధవీరులు అడ్డుకున్నారు. ఓ అత్యున్నత అధికారి దీని గురించి ప్రణబ్‌కు వివరిస్తుండగా యుద్ధవీరులు కేకలు వేశారు. ప్రణబ్‌కు ముందు ఓ చెట్టుకొమ్మ అందించారు. అతిథి దాన్ని అందుకుంటే వారు అతడిని స్నేహితుడిగా అంగీకరించి అక్కడి నుంచి తప్పుకుంటారు. ప్రణబ్ ముఖర్జీ సహాయకుడు ఆ కొమ్మను అందుకుని ఆయనకు అందించాక యుద్ధవీరులు ఆటపాటలతో ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత మవోరీ తెగ అధిపతితో, ఆయన భార్యతో ప్రణబ్ ముక్కు, నుదురు రాసుకుని, సైనిక వందనం అందుకున్నారు. ముక్కు రాసుకునే సంప్రదాయాన్ని ‘హోంగీ’గా పిలుస్తారు. దీని వల్ల శ్వాస మార్పిడి జరిగి, రెండు మనసులు కలుస్తాయని స్థానికులు విశ్వాసం. న్యూజిలాండ్ మూలవాసులైన మవోరీలు క్రీ.శ. 1280లో అక్కడ శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారని ప్రతీతి. గవర్నర్ జనరల్‌తో ద్వైపాక్షిక చర్చలు.. స్వాగతం తర్వాత ప్రణబ్.. గవర్నర్ జనరల్ మట్‌పరే భేటీ అయ్యారు. న్యూజిలాండ్-భారత్‌ల మధ్య విమాన సర్వీసుల అనుసంధానంపై చర్చించారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగం కావాలని న్యూజిలాండ్ కంపెనీలను కోరారు. ప్రణబ్‌కు మట్‌పరే గౌరవ విందు ఇచ్చారు. భారత విజయ గాథలో తమ దేశం భాగం కావాలనుకుంటోదన్నారు.తమ ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో న్యూజిలాంజ్ ప్రాధాన్య దేశమని, దానితో వ్యాపార రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రణబ్ ‘న్యూజిలాండ్ హెరాల్డ్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. న్యూజిలాండ్‌లో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. -
జ్ఞాపకాల ‘నిగ్రహం’
లోకంతో పంచుకోవాల్సినవి ఉన్నాయనుకున్నప్పుడే ఎవరైనా ఆత్మకథల్ని, జ్ఞాపకాల్ని గ్రంథాలుగా వెలువరిస్తారు. మిగిలినవారి మాటెలా ఉన్నా రాజకీయ నాయకులు రాసే ఆ మాదిరి పుస్తకాలకు బాగా గిరాకీ ఉంటుంది. వాటిని జనం ఆసక్తితో చదువుతారు. సామాజిక, రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసేవారికైతే వాటితో అవసరం ఎక్కువుంటుంది. ముఖ్యంగా కీలక పదవులు నిర్వహించిన నేతలు తమకు తెలిసిన అంశాల విషయంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో, వాటి గురించి అదనంగా ఏం చెప్పారో తెలుసుకోవడానికి వారు ఉత్సాహం చూపుతారు. అధికారంలో కొనసాగుతూ ఆత్మకథలు రాయడం ఇబ్బంది గనుక ఎక్కువమంది నేతలు విశ్రాంత తీరం చేరాకే ఆ పని చేస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇలాంటివారికి భిన్నం. ఆయన నిరుడు ‘ద డ్రమెటిక్ డికేడ్’ (నాటకీయ దశాబ్దం) పేరిట 70వ దశకంనాటి పరిణామాలను విశ్లేషణాత్మకంగా గ్రంథస్తం చేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ ఆవిర్భావం, ఎమర్జెన్సీ విధింపు, జనతాపార్టీ ఆవిర్భావంలాంటి అనేక ఘట్టాలను ఆయన పరామర్శించారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడాయన ‘ద టర్బ్యులెంట్ ఇయర్స్’(సంక్షుభిత సంవత్సరాలు) అనే గ్రంథం తీసుకొచ్చారు. ఇందులో 1980 మొదలుకొని 1996 వరకూ జరిగిన కీలక పరిణామాలను వివరించారు. దేశ చరిత్రలో ఈ కాలం అత్యంత కీలకమైనది. అంతేకాదు...ఆ పరిణామాలకు దారితీసిన నిర్ణయాల్లో, విధానాల్లో, అందుకు జరిగిన చర్చోపచర్చల్లో ఆయన భాగస్వామి. దేశం దిశనూ, దశనూ మార్చిన పరిణామాలవి. అంతవరకూ అనుసరించిన నెహ్రూ సామ్యవాద విధానాల నుంచి వైదొలగి దేశం ఉదారవాద ఆర్థిక సంస్కరణలను నెత్తికెత్తుకున్న సమయమది. కనుక ఈ పుస్తకంలో ప్రణబ్ వాటన్నిటి గురించీ ఏం చెబుతారోనన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. అయితే అలాంటివారి ఉత్సాహంపై ఆయన ముందే చన్నీళ్లు చల్లారు. కొన్ని రహస్యాలను తాను ఉద్దేశపూర్వకంగానే చెప్పడం మానేశా నని ఆయన ప్రకటించారు. అవి తనతోనే ముగిసిపోతాయని కూడా అన్నారు. అలాగని వాటిని ఆయన అక్షరబద్ధం చేయడం మానలేదు. వాటికి సంబంధించిన డిజిటల్ కాపీ వేరేగా ఉన్నదని, అది తన వారసులకే పరిమితమవుతుందని చెప్పారు. జ్ఞాపకాలను...మరీ ముఖ్యంగా అక్షరబద్ధమయ్యే జ్ఞాపకాలను యాంత్రి కంగా చూడలేం. జ్ఞాపకాలంటే ఏకకాలంలో రచయిత తనతో తాను సంభాషించు కోవడం...లోకంతో సంభాషించడం. ఆ సంభాషణల్లో పరిహరించినవేమిటో, ప్రాధాన్యత సంతరించుకున్నవేమిటో, అప్రాధాన్యంగా మిగిలినవేమిటో...పాక్షికత ఎంతో, నిష్పాక్షికత ఎంతో చెప్పాల్సింది విమర్శకులే. అయితే కొన్ని రహస్యాలను వెల్లడించబోనని ముందే చెప్పి అలాంటివారి పనిని ప్రణబ్ కాస్త తగ్గించారు. నిజానికి జ్ఞాపకాలు రాసేవారందరూ అన్నీ చెబుతారనుకోవడానికి లేదు. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడం...తనకు సంబంధించిన మంచీ చెడూ ఏకరువు పెట్టడం, ఆత్మ పరిశీలన చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అలా రాయడం మహాత్ములకే సాధ్యం. ప్రణబ్ తాజా గ్రంథం అనేక విధాల మొదటి పుస్తకం కంటే ఆసక్తికరమైనది. ఇందులో అస్సాం, పంజాబ్ రాష్ట్రాల్లో వెల్లువెత్తిన ఉద్యమాలు, ఉద్రిక్తతల ప్రస్తావ నలున్నాయి. వేలమంది ముస్లింలను ఊచకోత కోసిన నెల్లి మారణకాండ ఉదం తం, పంజాబ్‌లోని ఖలిస్తాన్ ఉద్యమం, ఉగ్రవాదం, ఆపరేషన్ బ్లూస్టార్ వంటివి ఉన్నాయి. ఇందిరాగాంధీ, ఆమె ఇద్దరు కుమారులు రాజీవ్‌గాంధీ, సంజయ్ గాంధీల మరణాలకు సంబంధించిన అంశాలున్నాయి. వీరిలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైతే ఆయన తల్లి ఇందిరాగాంధీ తన నివాస గృహం ఆవరణలోనే దుండగుల తుపాకి గుళ్లకు నేలకొరిగారు. రాజీవ్‌గాంధీని తమిళ టైగర్లు ఆత్మాహుతి దాడిలో బలితీసుకున్నారు. వీరిలో సంజయ్‌గాంధీతో ప్రణబ్‌కు చాలా చనువుండేది. ఆయనంటే ఉన్న అభిమానాన్ని ప్రణబ్ దాచుకోలేదు. రాజకీయాల్లో సంజయ్ తళుక్కుమన్నది కేవలం ఆరేళ్లే అయినా దేశ రాజకీయ చిత్తరువుపై ఆయన చెరగని ముద్రవేశారన్నది ప్రణబ్ నిశ్చితాభి ప్రాయం. రాజీవ్‌గాంధీ ప్రధాని కావడం, ఆ తర్వాత ఆయనకు దూరమై ప్రణబ్ కాంగ్రెస్‌నుంచి నిష్ర్కమించాల్సిరావడం, రాజీవ్ మరణానంతర పరిణామాల్లో మళ్లీ పార్టీలోకి పునఃప్రవేశం, ఆర్ధిక సంస్కరణల సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుతో సన్నిహితంగా పనిచేయడం, బాబ్రీ మసీదు విధ్వంసంలాంటి అనేక విషయాలను ప్రణబ్ వివరించారు. ఆయా ఘట్టాలపై తన మనోగతాన్ని వెల్లడించారు. ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రణబ్ ప్రధాని కావాలనుకున్నారని, ఆ సంగతి తెలిసే రాజీవ్ ఆ తర్వాత కాలంలో ఆయన్ను దూరం పెట్టారన్న కథ నాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పుస్తకంలో ప్రణబ్ అలాంటి కథనాలను తోసిపు చ్చారు. మరి ప్రణబ్‌ను ముందుగా కేబినెట్నుంచీ, ఆ తర్వాత పార్టీనుంచీ రాజీవ్ ఎందుకు తొలగించారు? ఆర్ధిక శాఖను చూసేవారు ‘చాలా కఠినంగా’ ఉండాలని భావించడంవల్ల అక్కడినుంచి ప్రణబ్‌ను తప్పించవలసివచ్చినట్టు రాజీవ్‌గాంధీయే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే తానిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పని మాటల్ని ఓ పత్రిక ప్రచురించడంవల్ల పార్టీనుంచి బహిష్కరించారని తెలిపారు. ఈ దేశాన్ని మలుపు తిప్పిన అనేక ఉదంతాల్లో ప్రణబ్ కీలక భూమికనైనా పోషించారు లేదా అలాంటి ఉదంతాలకు ప్రత్యక్షసాక్షిగానైనా ఉన్నారు. ఆయనే చెప్పుకున్నట్టు వీటిల్లో కొన్నిటినే గ్రంథస్తం చేశారు. రహస్యాలున్నాయంటూనే వాటిని వెల్లడించబోనని చెప్పడం ద్వారా ప్రణబ్ కొత్త సంప్రదాయాన్ని నెలకొ ల్పారు. దేశ అత్యున్నత పీఠంపై ఉన్నా కొన్నిటిపై నిష్కర్షగా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇదీ కొత్త ఒరవడే. కానీ ‘ఎక్కువ నిజాలు’ చెబితేనే ఏ గ్రంథానికైనా శాశ్వతత్వం వస్తుందని మూడో పుస్తకం నాటికైనా ప్రణబ్ గ్రహించాలి. -
ఉదయం 7 గంటల్లోగా ఏ సమయంలోనైనా ఉరి!
ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష దాదాపు ఖరారైంది. రాష్ట్రపతి వద్ద అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తే, గురువారం ఉదయం 7 గంటల్లోగా అతడిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జైల్లో ఉరి తీస్తారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 7 గంటల్లోగా ఏ సమయంలోనైనా ఈ శిక్షను అమలుచేయొచ్చు. టాడా కోర్టు జారీచేసిన డెత్ వారంటును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ వారంటు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రపతి గతంలో క్షమాభిక్షను తిరస్కరించిన తర్వాత, దాన్ని 14 రోజుల్లోగా కోర్టులో సవాలు చేయాల్సి ఉండగా మెమన్ అలా చేయలేదని సుప్రీం విస్తృత ధర్మాసనం తెలిపింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను తిరస్కరించడం సరైనదేనని కూడా విస్తృత ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో, ఇక మెమన్ను ఉరి తీయడం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్న క్షమాభిక్ష పిటిషన్ విషయం తేలడం ఒక్కటే ఇక మిగిలి ఉంది. -
రాష్ట్రపతికి గవర్నర్ నివేదిక
- ఇరు రాష్ట్రాల్లో పరిస్థితిపై ప్రణబ్‌కు నివేదన - రేవంత్ ఎపిసోడ్.. ఏపీ సీఎం చంద్రబాబు ఆడియో వ్యవహారం.. - ఇద్దరు సీఎంల పరస్పర విమర్శలపై సమగ్ర నివేదిక - హోంమంత్రి రాజ్‌నాథ్‌తోనూ సమావేశం - నా పర్యటన సాధారణమైందే.. సంచలనమేదీ లేదు: నరసింహన్ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాల పనితీరు, శాంతిభద్రతలు, ఓటుకు నోటు అంశంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి చిక్కడం, సీఎం చంద్రబాబు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ల మధ్య ఫోను సంభాషణల ఆడియో టేపు వ్యవహారం, ఇరు రాష్ట్రాల సీఎంల పరస్పర విమర్శలకు సంబంధించి అంశాలవారీగా సమగ్ర నివేదికను రాష్ట్రపతికి అందజేసినట్టు సమాచారం. మరోవైపు బుధవారం సాయంత్రం నరసింహన్ నార్త్‌బ్లాక్‌లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఇరురాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. అంతకుముందు బుధవారం ఉదయమే గవర్నర్.. జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆర్.ఎన్.రవిని కలిశారు. అంతర్గత, విదేశాంగ భద్రతకు సంబంధించిన బాధ్యతలు నిర్వహించే జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ నేరుగా పీఎంవో ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఓటుకు నోటు అంశంతో ఇరు రాష్ట్రప్రభుత్వాల మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో కేసు పూర్వాపరాలు, తాజా పరిణామాలపై నివేదికను అందచేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా గవర్నర్.. హోంమంత్రిని కలసిన కొద్దిసేపటికే ఏపీ సీఎం చంద్రబాబు రాజ్‌నాథ్‌ను కలవడానికి వస్తున్నట్టు తెలిసింది. దీంతో నరసింహన్ బయటికొచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్, చంద్రబాబు ఎదురుపడ్డారు. వెంటనే గవర్నర్ ఫొటోగ్రాఫర్‌ను పిలిపించి బాబుతో కలసి ఫొటో తీయించుకున్నారు. రాజ్‌నాథ్‌తో చంద్రబాబు భేటీ సమయంలో గవర్నర్ హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో సమావేశమయ్యారు. చంద్రబాబు వెళ్లిపోయాక గవర్నర్ మరోసారి రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. మరోవైపు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. అన్నీ సర్దుకుంటాయి రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం నరసింహన్ విలేకరులతో మాట్లాడారు. తన ఢిల్లీ పర్యటన సాధారణమైనదేనని, ఇందులో సంచలనమేమీ లేదని చెప్పారు. ఇరురాష్ట్రాల మధ్య పరిస్థితులన్నీ సర్దుకుంటాయని ఆశాభావం వెలిబుచ్చారు. విభజన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏపీ, తెలంగాణలో ఏం జరుగుతుందనేది కేంద్రానికి వివరించడానికి వచ్చానన్నారు. సెక్షన్ 8పై గవర్నర్ అభిప్రాయాన్ని కేంద్రం తెలుసుకునే అవకాశంపై ప్రశ్నించగా.. ‘‘సమావేశంలో ఇలాంటివేమీ చర్చకు రాలేదు’’ అని చెప్పారు. గవర్నర్ అధికారాలపై అడగ్గా.. ‘నో కామెంట్’ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను కేబినెట్లోకి ఎలా తీసుకుంటారని టీడీపీ ప్రశ్నించడంపై.. ఆయన ‘నో కామెంట్’ అన్నారు. ఫోన్‌ట్యాపింగ్‌పై తానెలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల పరస్పర విమర్శలపై ‘నో కామెంట్’ అన్నారు. కాగా గవర్నర్ గురువారం ప్రధానితో భేటీ కానున్నారు. -
ఢిల్లీ బయల్దేరిన వైఎస్ జగన్
-
ఢిల్లీ బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్:వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పలువురు పార్టీ ముఖ్యులతో కలసి మంగళవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరారు. సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు ఫిర్యాదు చేస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. రెండురోజుల పాటు జగన్ హస్తినలో ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కోసం రూ.5 కోట్ల మేరకు ఎర చూపి అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి కేసు వ్యవహారంలో స్వయంగా చంద్రబాబునాయుడు పాత్ర ఉన్నట్టు ఆడియో టేపులు వెల్లడైన నేపథ్యంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను రాష్ట్రపతి, హోంమంత్రులకు వైఎస్ జగన్ వివరించే అవకాశం ఉంది. -
నేడు రాష్ట్రపతితో జగన్ భేటీ
- ‘ఓటుకు నోటు’..చంద్రబాబు అవినీతిపై ప్రణబ్‌కు, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయనున్న ప్రతిపక్ష నేత హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పలువురు పార్టీ ఎంపీలతో కలసి మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళుతున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు వ్యవహారంపై ఫిర్యాదు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ రెండురోజుల పాటు హస్తినలో ఉండే అవకాశం ఉంది. ఆయన సోమవారం తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కోసం రూ.5 కోట్ల మేరకు ఎర చూపి అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి కేసు వ్యవహారంలో స్వయంగా చంద్రబాబునాయుడు పాత్ర ఉన్నట్టు ఆడియో టేపులు వెల్లడైన నేపథ్యంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యమంత్రిగా నిత్యం నీతి వచనాలు వల్లిస్తూ మరోవైపు సభ్య సమాజం తలదించుకునేలా అనైతిక చర్యలకు పాల్పడటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను బాబు దెబ్బతీశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ పరిణామాలను మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి వివరించాలని నిర్ణయించారు. ఇలావుండగా ఏపీలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి శాసనమండలికి జరిగే ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం జారీ కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా జగన్ నేతలతో చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వి.విజయసాయిరెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.పి.సారథి, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సినిమా చూసిన రాష్ట్రపతి
షూజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొంది, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'పికూ' సినిమాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చూశారు. ఆయన కోసం ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆయనకు ఈ సినిమాతో పాటు సినిమాలో బెంగాలీ యాసలో ఉన్న హిందీ కూడా బాగా నచ్చిందని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే చక్కటి అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇందులో కూతురి పాత్ర పోషించిన దీపికా పడుకొనే.. తన సొంత జీవితాన్ని సైతం పక్కన పెట్టి, తండ్రి (అమితాబ్) చెప్పే కథలు వింటూ ఉంటుంది. ఇర్ఫాన్ ఖాన్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా మే 8వ తేదీన విడుదలైంది. ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీ కోసం ఈ సినిమాను ప్రత్యేకంగాప్రదర్శించారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో రాశారు. -
నెట్లోనే అర్జీలు
సీతంపేట: పలు సార్లు అధికారులకు ఫిర్యాదు చేశాం... పాలకులకు విన్నవిం చాం... కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తూనే ఉన్నాం... అయినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ వాపోయేవారిని వందల మందిని నిత్యం చూస్తుంటాం. అయితే.. ఇలాంటి సినిమా కష్టాలతో ఇక పని ఉండదు. ఆ పరిస్థితి నుంచి బయటపడే సరికొత్త పోకడలు అందుబాటులోకి వచ్చాయి. నెట్‌ను వినియోగించుకుని సమస్యలపై అర్జీలను అందజేయవచ్చు. ఆన్లైన్లో జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు పాలకులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. సమస్య పరిష్కారం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. రాష్ట్ర దేశ ప్రజాప్రతినిధులను మొదలుకొని, రాష్ర్టపతి వరకు ఫిర్యాదు చేయొచ్చు. అదెలాగో చూద్దాం. రాష్ట్రపతికి వినతిపత్రం ఇలా... రాష్ట్రపతికి వినతిపత్రం పంపించాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్యూ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.ఎన్ఐసీ.ఇన్. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. కుడివైపున హెల్ప్‌లైన్ పోర్టల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ప్రెసిడెంట్ సెక్రేటేరియేట్ అనే పేజీ తెరుచుకుంటుంది. అక్కడ కనిపించే లోడేజ్ ఎ రిక్వస్ట్ పై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. దాన్ని నింపి గ్రీవెన్స్ డిస్క్రిప్షిన్ బాక్సులో సమస్యను టైప్‌చేసి పీడీఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. దీన్ని గుర్తించుకుంటే మన సమస్య ఎంతవరకు పరిష్కారమైందో తరువాత తెలుసుకోవచ్చు. ూ గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలంటే.. ఏపీరాజ్‌భవన్ ఎట్‌ద రేట్ ఆఫ్ జిమెయిల్.కామ్‌కు మెయిల్ చేయాలి. ూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ.జీవోవి.ఇన్ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. పేజీ ఓపెన్ కాగేనే ఎడమవైపు దిగువభాగంలో సిటిజన్ ఇంటర్ఫేస్ అనే పోర్టల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ మెయిల్ ఐడీ నమోదు చేసి ఫిర్యాదు చేయవచ్చు. -
రాష్ట్రపతి పదవికి అద్వానీ అర్హులు
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ రాష్ట్రపతి పదవికి అర్హులని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అద్వానీ స్థాయికి ఆ పదవే సరైనదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఉప ప్రధానిగా పనిచేసిన అద్వానీని లోక్‌సభ స్పీకర్‌ను చేయడం సముచితం కాదని గడ్కరీ అన్నారు. అద్వానీ అంటే బీజేపీలో అందరికీ గౌరవమని, ఆయన స్థాయికి తగిన పదవిని అలంకరించాలని కోరుకుంటున్నామని గడ్కరీ వ్యాఖ్యానించారు. అద్వానీ, మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ వంటి వారికి కేబినెట్లో చోటు కల్పించడం కష్టమని, అందుకే ప్రధాని నరేంద్ర మోడీ 75 ఏళ్ల పైబడిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోరాదని నిర్ణయించారని తెలిపారు. సీనియర్ నేతలు అద్వానీ, జోషీలను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పోల్చారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిని జోషీ ఆశిస్తున్నారన్న వార్తలను గడ్కరీ కొట్టిపారేశారు. జోషీ తెలివితేటలు, అనుభవాన్ని పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని చెప్పారు. -
పాలనా ప్రహసనం.. ముగిసింది
అనూహ్య పరిస్థితుల్లో శాసనసభ స్తుప్తాచేతనావస్థలోకి జారుకుంది. రాష్ట్రపాలన రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్లిపోయింది. మంత్రులు మాజీలయ్యారు. త్వరలో ఎన్నికలకు వెళుతున్న తరుణంలో గత ఐదేళ్లలో మన ప్రజాప్రతినిధులు.. ముఖ్యంగా అధికార భోగాలను అనుభవించిన మంత్రి పుంగవులు జిల్లాకు ఏం చేశారని ఒక్కసారి వెనుదిరిగి చూస్తే.. ఒక్క ధర్మానను మినహాయిస్తే.. మిగతావారు చెప్పుకొనేందుకు ఏమున్నది గర్వకారణం.. అంతా నిరాశే తప్ప.. అన్న నిట్టూర్పే మిగులుతుంది. పక్క జిల్లా నుంచి వచ్చి ఇక్కడి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన శత్రుచర్ల.. రాజాంకు మారి రాజయోగం అబ్బిన కోండ్రు జిల్లాకు చేసింది శూన్యమేనని చెప్పకతప్పదు. : కోటి ఆశలతో ఆరంభం.. అంతలోనే మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణం.. దిశా నిర్దేశం లేని ప్రభుత్వాలు.. ప్రజల బాగోగు లు పట్టని మంత్రులు.. ఇవి చాలవన్నట్లు తెలుగుజాతిని చీల్చిన విభజన చిచ్చు... చివరికి రాష్ట్రపతి పాలనలోకి వెళ్లడంతో ప్రస్తుత అసెంబ్లీ ప్రస్థానం ముగిసింది. ప్రహసనప్రాయంగా మారిన పాలనకు తెరపడింది. 2009లో కాంగ్రెస్‌కు ప్రజలు కట్టబెట్టిన అధికారం బూడిదలో పోసిన పన్నీరైంది. జిల్లాకు ఇది చేశామని చెప్పుకోవడానికి కూడా లేని దుస్థితిలో రాష్ట్ర మంత్రులు డమ్మీలైపోయారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో జిల్లా ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. 2009 ఎన్నికల్లో ప్రజల తీర్పు సారంశం ఒక్కటే. 2004-09లో సంక్షేమ రాజ్యాన్ని అందించిన వైఎస్‌ను మళ్లీ సీఎం చేయడమే. అందుకే జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఏకంగా 9 చోట్ల కాంగ్రెస్‌ను గెలిపించారు. ప్రజలు ఆశించిన విధంగానే వై.ఎస్. సీఎం అయ్యారు కానీ విధి వక్రీకరించింది. రెండోసారి అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే 2009 సెప్టెంబరు 2న ఆయన హఠాన్మరణం చెందారు. పిడుగుపాటులాంటి ఈ దుర్ఘటన జిల్లా ప్రగతికి గొడ్డలిపెట్టుగా పరిణమించింది. మంత్రులు ముగ్గురు.. ప్రగతి పిడికెడే! 2009-14 మధ్య కాలంలో జిల్లా నుం చి ముగ్గురు ప్రతినిధులు రాష్ట్ర మంత్రులుగా చేశారు. వై.ఎస్. మూడు నెలల పాలనను మినహాయిస్తే మిగిలిన పరిపాలనా కాలమంతా మాటలతోనే కాలక్షేపం చేశారని చెప్పొచ్చు. ఈ కాలంలో జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు, కోండ్రు మురళీమోహన్‌లు మంత్రులుగా చేశారు. వీరిలో ధర్మాన చాలావరకు నయం. శత్రుచర్ల, కోండ్రు మురళీలు పూర్తిగా విఫలమయ్యారు. దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం -ధర్మాన ఎంతో నయం వైఎస్ ప్రభుత్వంలో చూపించిన జోరును కొనసాగించకపోయినా.. తనకున్న అనుభవంతో, నిధులు రప్పించే సామర్థ్యంతో కొంతవరకు నెట్టుకువచ్చారు. రోశయ్య ప్రభుత్వంలో కూడా ధర్మాన రెవెన్యూ మంత్రిగా కొనసాగారు. ఈ సమయంలోనే అరసవల్లిలో టీటీడీ కల్యాణ మండపం, పర్యాటక శాఖ బడ్జెట్ హోటల్‌ను మంజూరు చేయించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ధర్మాన ప్రభ కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. ఆయనను కీలకమైన రెవెన్యూ శాఖ నుంచి తప్పించి ఆర్ అండ్ బి శాఖ కేటాయించారు. ఈ శాఖ మంత్రిగా ధర్మాన జిల్లాకు ఏకంగా మూడు ప్రధాన వంతెనలు మంజూరు చేయించారు. జిల్లా కేంద్ర ప్రజల చిరకాల కోరిక అయిన పొన్నాడ వంతెన దాదాపు పూర్తి కావచ్చింది. శ్రీకాకుళం పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. అదే విధంగా పాదయాత్రలో వైఎస్ ఇచ్చిన హామీని ఆచరణలోకి తీసుకువచ్చారు. జలుమూరు మండలం కొమ్మనాపల్లి వద్ద వంశధార నదిపై వంతెన నిర్మాణం చేపట్టారు. ఇక జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో రోడ్లకు మహర్దశ కలిగిందనే చెప్పాలి. కళింగ రోడ్డు, జీటీ రోడ్డు, జెడ్పీ రోడ్లను విస్తరించారు. అరసవల్లి జంక్షన్ నుంచి కలెక్టరేట్‌కు 80 అడుగుల రహదారి నిర్మించారు. నవభారత్ జంక్షన్ నుంచి పాతవంతెన, రామలక్ష్మణ జంక్షన్ మీదుగా పెద్దపాడు వరకు ప్రధాన రహదారిని విస్తరించారు. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని వేధించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పన్నిన కుట్రలో ధర్మాన కూడా బాధితుడయ్యారు. సీబీఐ చార్జిషీట్లో తన పేరును కూడా చేర్చడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అక్రమంగా తనను ముద్దాయిని చేసిన కాంగ్రెస్‌లో కొనసాగలేనని చెప్పి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. హోదాకే మంత్రి - శత్రుచర్ల తీరు ఇదీ! ‘ఆరో వేలు’ మాదిరిగా మారిపోయింది మంత్రి శత్రుచర్ల వ్యవహారం. ఆయన మంత్రి అనే విషయాన్నే ప్రజలు పెద్దగా గుర్తించలేదనే చెప్పొచ్చు. రోశయ్య ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా పని చేసిన ఈ ఐదేళ్లలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించిన సందర్భం దాదాపు లేదనేది విస్మయకర వాస్తవం. ఒక్కసారి కూడా ఉన్నతాధికారులతో తన శాఖ వ్యవహారాలుగానీ, జిల్లా ప్రగతి గురించి కనీసం చర్చించలేదు. డీఆర్సీ వంటి సమావేశాలకు మొక్కుబడిగా హాజరుకావడం మినహా అధికార కార్యక్రమాలను ఏమాత్రం పట్టించుకోలేదు. తన నియోజకవర్గమైన పాతపట్నానికే ఎప్పుడోగానీ వచ్చేవారు కాదు. వచ్చిన సందర్భాల్లో కూడా చిన్న చిన్న కార్యక్రమాలకే పరిమితమయ్యేవారు. ఇక జిల్లా కేంద్రానికి ఆయన వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కెట్టొచ్చు. వరుసగా వారం రోజులు ఎప్పుడూ జిల్లాలో లేని ఆయనకు చెప్పుకోవడానికి ఇంకేముంటుంది! ఆత్రం.. ఆరాటం... ఆచరణ శూన్యం - ఇదీ కోండ్రు కథ మంత్రి కావాలన్న రాజకీయ లక్ష్యాన్ని సాధించిన కోండ్రు మురళీ జిల్లాకు చేసింది మాత్రం ఏమీ లేదు. కిరణ్ ప్రభుత్వంలో ఆయనకు మంత్రియో గం ప్రాప్తించింది. కీలకమైన వైద్యవిద్య, ఆరోగ్యశ్రీ, 108,104 శాఖలను కేటాయించారు. మంత్రి హోదాను తన రాజకీయహంగు, ఆర్భాటాలకే ఆయన వినియోగించుకున్నారన్న విమర్శలున్నాయి. జిల్లాలో రిమ్స్ సమస్యల పరిష్కారంపై కూడా ఆయన దృష్టి పెట్టలేదు. అదనపు సీట్లు ఆశించిన రీతిలో సాధించలేదు. రిమ్స్ విస్తరణ పూర్తికాలేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సేవలు పడకేశాయి. ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ రెండు సేవలు నిర్వీర్యం కావడం ఆయన వైఫల్యమేనని చెప్పొచ్చు. పేదల ప్రజల సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకం కోండ్రు హయాంలో నీరుగారిపోయిం ది. దాదాపు 133 రోగాలను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధి నుంచి తప్పిం చింది. తన నియోజకవర్గం రాజాంకు కూడా కోండ్రు చేసిందేమీ లేదు. కీలకమైన రాజాం రైల్వే లైన్‌ను సాధించలేకపోయారు. పారిశ్రామిక కేంద్రంగా పేరుగాంచిన రాజాంలో కొత్త ప్రాజెక్టులు తేలేకపోయారు. వెరసి జిల్లా మంత్రుల పదవీకాలం నిరాశాజనకంగా ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా ప్రగతి పడకేసింది. -
హంగ్ పార్లమెంట్.. రాష్ట్రపతి పాత్ర.. అవిశ్వాస తీర్మానం
హంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ ఏర్పడితే రాష్ట్రపతి/గవర్నర్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి? విశ్వాస, అవిశ్వాస తీర్మానాల గురించి రాజ్యాంగం ఏం చెబుతోంది? గత అనుభవాలు.. తదితర అంశాలపై విశ్లేషణ.. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు, రాజకీయ పార్టీలు అనివార్యం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది. పౌరులు తమ ఓటు హక్కు ద్వారా ప్రతినిధులను ఎన్నుకుంటారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలను పాలిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేసిన ఏదైనా పార్టీ చట్టసభల్లో నిర్ణీత మెజారిటీ సాధించాలి. లోక్‌సభ, రాష్ట్ర విధానసభలలోని మొత్తం స్థానాల్లో సగానికంటే ఎక్కువ స్థానాలు దక్కించుకున్న పార్టీ లేదా కూటమిగానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. లోక్‌సభలో మొత్తం స్థానాల సంఖ్య 545 (నామినేట్ సభ్యులతో సహా). ఇందులో 273 స్థానాలు సాధించిన పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రపతి కోరతాడు. ఈ పద్ధతినే గవర్నర్లు రాష్ట్రాల్లో అనుసరిస్తారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా కూటమికి సంపూర్ణ మెజారిటీ రాకపోతే దాన్ని హంగ్ పార్లమెంట్/హంగ్ అసెంబ్లీ అని వ్యవహరిస్తారు. ప్రభుత్వ ఏర్పాటు - రాజ్యాంగ ప్రస్తావన: రాజ్యాంగ ప్రకరణ 74 (1) ప్రకారం విధుల నిర్వహణలో రాష్ట్రపతికి సలహా, సహకారాలను అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది. ప్రకరణ 75 (1) ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు. అతని సలహాపై మంత్రిమండలి ఏర్పాటవుతుంది. రాష్ట్రాల విషయంలో కూడా ఇలాంటి ఏర్పాటును రాజ్యాంగ ప్రకరణ 163 (1), 164 (1)లో ప్రస్తావించారు. ఈ ప్రకరణల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని నియమించే విషయంలో అనుసరించాల్సిన పద్ధతులు, నియమాలను వివరించలేదు. పార్లమెంటరీ పాలనా వ్యవస్థ అమల్లో ఉన్న దేశాలు ముఖ్యంగా బ్రిటిష్ తరహా రాజ్యాంగాన్ని అనుసరించే విధంగా మనదేశంలో కూడా కొన్ని సంప్రదాయాలు, రాజకీయ ఆచారాలున్నాయి. అవి.. ఎన్నికల ఫలితాలను బట్టి రాష్ట్రపతి లోక్‌సభలో మెజారిటీ సాధించిన రాజకీయ పార్టీ లేదా కూటమి నాయకున్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తాడు. ఉదాహరణకు 1977లో ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడి మెజారిటీ సాధించిన జనతాపార్టీ కూటమి నాయకుడైన మొరార్జీదేశాయ్‌ని ప్రధానమంత్రిగా నియమించారు. ఎన్నికైన పార్టీల్లో కొన్ని సంకీర్ణ కూటమిగా రూపొంది, తమ నాయకున్ని ఎన్నుకుంటే.. ఆ నాయకున్ని ప్రధానమంత్రి పదవి చేపట్టమంటూ రాష్ట్రపతి ఆహ్వానించవచ్చు. ఉదాహరణకు 1999లో బీజేపీ 12 పార్టీలతో కలిసి (ఎన్డీఏ) ప్రభుత్వాన్ని, 2004లో కాంగ్రెస్ పార్టీ మరో 11 పార్టీలతో కలిసి (యూపీఏ పేరుతో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏ ఒక పార్టీ లేదా కూటమికి పూర్తి మెజారిటీ లభించని పక్షంలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరవచ్చు. ఉదాహరణకు 1989 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించడంతో అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించగా, కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. దాంతో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి వి.పి.సింగ్‌ను ప్రధానమంత్రిగా నియుమించారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు రాష్ట్రపతి విచక్షణాధికారంతో తన దృష్టిలో ఎవరైతే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరో ఆ రాజకీయ పార్టీ నాయకున్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించవచ్చు. అలాంటి ప్రభుత్వం రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా తన మెజారిటీని నిరూపించుకోవాలి. గత సందర్భాలు: 1952, 1957, 1962, 1967, 1971 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ప్రధానమంత్రిని నియమించడంలో నాటి రాష్ట్రపతులకు ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. 1964లో నెహ్రూ మరణానంతరం ప్రధానమంత్రి నియామకంలో సమస్యలు మొదలయ్యాయి. నెహ్రూ వారసున్ని సర్వసమ్మతితో ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను ప్రతిపాదించి (కామరాజ్ నాడర్) 1964లో లాల్ బహదూర్శాస్త్రిని ప్రధానమంత్రిగా నియమించారు. 1971, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన ఆధిక్యత వల్ల ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1977లో జనతా పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికీ, ఆది ఐదు పార్టీల కూటమి కావడంతో.. జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలానీ కృషి ఫలితంగా మొరార్జీ దేశాయ్‌ని జనతా పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆనాటి తాత్కాలిక రాష్ట్రపతి బి.డి. జెట్టి మొరార్జీ దేశాయ్‌ని ప్రధానమంత్రిగా నియమించారు. ఆ సందర్భంలో రాష్ట్రపతి.. జనతా పార్టీ స్వరూప స్వభావాలను విచారించాక కేవలం పార్లమెంటరీ సంప్రదాయాన్ని పాటించారు. 1979లో మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొన్నారు. జనతాపార్టీ చీలికతో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో లోక్‌సభలో తమకు మెజారిటీ ఉందని, చరణ్‌సింగ్, జగ్జీవన్రామ్లు తమ మద్దతుదారుల జాబితాను రాష్ట్రపతికి సమర్పించారు. ఇక్కడ వారు ప్రస్తావించిన సభ్యుల సంఖ్య లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యను మించిపోయింది. అయితే రాష్ట్రపతి తన అంతరాత్మ ప్రభోదాన్ని అనుసరించి చరణ్‌సింగ్‌ను ప్రధాని పదవిని చేపట్టమని ఆహ్వానించారు. రాష్ట్రపతిగా సంజీవ రెడ్డి అనుసరించిన ఈ పద్ధతి బ్రిటిష్ పార్లమెంటరీ సంప్రదాయాలకు పూర్తిగా భిన్నమైంది. చరణ్‌సింగ్ రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా లోక్‌సభ విశ్వాసం పొందకుండానే రాజీనామా చేశారు. అరుుతే జగ్జీవన్‌రామ్ తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నానంటూ లిఖిత పూర్వకంగా తెలిపినా అవకాశం ఇవ్వకుండా లోక్‌సభ విశ్వాసం పొందని ప్రధాని చరణ్‌సింగ్ సలహా మేరకు రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేశారు. 1990లో వి.పి.సింగ్ ప్రభుత్వం పడిపోవడంతో కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. కానీ, కొన్ని నెలల్లోనే ఆ ప్రభుత్వం కూడా పడిపోయింది. 1996లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడంతో వాజ్‌పేయ్‌ని ప్రధానిగా నియమించారు. కానీ లోక్‌సభ విశ్వాసం పొందలేక ఆ ప్రభుత్వం 13 రోజుల్లోనే రాజీనామా చేసింది. ఆ తర్వాత దేవేగౌడ, గుజ్రాల్ ప్రభుత్వాలు కూడా ఇదే తరహాలో పడిపోయాయి. రాష్ట్రాల్లో కూడా: రాష్ట్రాలలో హంగ్ అసెంబ్లీలు ఏర్పడిన సందర్భాలు తక్కువే. 1965 ఎన్నికల్లో కేరళలో తొలిసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఏ ఒక్క పార్టీ మరొక పార్టీ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించకపోవడంతో రెండేళ్లపాటు అనిశ్చితి సాగింది. చివరకు ఒక్క సమావేశం జరగకుండానే శాసనసభ రద్దయింది. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పరిస్థితే తలెత్తింది. అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ ప్రభు త్వ ఏర్పాటుకు అనాసక్తత వ్యక్తపర్చడంతో రెండో పెద్ద పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నాయకుడైన అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆహ్వానించిన పరిణామాన్ని గమనించవచ్చు. హంగ్ పార్లమెంట్- రాజ్యాంగం: ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో రాష్ట్రపతి ఏ విధంగా వ్యవహరించాలి? అనే విషయాన్ని రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ప్రకరణ 75 (1)ని అనుసరించి రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు అని మాత్రమే ఉంది. స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు ఏ పద్ధతిని అనుసరించాలి అనేది సంశయమే? పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్వయించుకోవాలి. సర్వ విషయాలను, సర్వ సందర్భాలను ఊహించి రాజ్యాంగాన్ని రూపొందించడం సాధ్యం కాదు. అలా చేస్తే రాజ్యాంగం సరళతను కోల్పోయి సంక్లిష్ట సనాతన చట్ట స్వభావాన్ని సంతరించుకొంటుంది. అది ప్రగతికి ఆటంకమే కాకుండా సందర్భహితాన్ని కోల్పోతుంది. అందువల్ల అనుభవాల దృష్ట్యా కొన్ని అలిఖిత రాజ్యాంగ విలువలను, ఆచారాలను సృష్టించి పాటించడం పరిపాటి. దీనికి ఏ రాజ్యాంగం మినహాయింపు కాదు. అయితే మంచి సంప్రదాయాలను ఏర్పరచాల్సి ఉంటుంది. అవిశ్వాస- విశ్వాస తీర్మానం రాజ్యాంగ ప్రకరణ 75(3) ప్రకారం మంత్రిమండలి సంయుక్తంగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది. అది లోక్‌సభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత వరకే అధికారంలో కొనసాగుతుంది. ప్రభుత్వంపై విశ్వాసం లేదని ఒక తీర్మానంతో మెజారిటీ సభ్యులు తెలిపితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రభుత్వాన్ని నియంత్రించడానికి, తప్పొప్పులకు బాధ్యున్ని చేయడానికి ఉన్న పార్లమెంటరీ ప్రక్రియగా దీన్ని పేర్కొనవచ్చు. అవిశ్వాస తీర్మానం: ఈ తీర్మానం గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు. పైన పేర్కొన్నట్లు ప్రకరణ 75(3)తో పరోక్ష సంబంధం ఉంది. అయితే ప్రకరణ 118 ప్రకారం ఉభయ సభలు తమ పద్ధతులను, ప్రక్రియలను నిర్దేశించుకొనే అధికారాన్ని కలిగి ఉంటాయి. ఆ ప్రకారం పార్లమెంట్ రూల్స్ అండ్ ప్రోసీజర్సను రూపొందించుకొంది. అందులో భాగంగా లోక్‌సభ నియమం 198 (1) ప్రకారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. సభ్యులు సంతకాలు చేసి, అవిశ్వాస తీర్మాన నోటీస్‌ను స్పీకర్‌కు అందజేయాలి. ఈ నోటీస్‌కు 50మంది సభ్యుల మద్దతు ఉంటే స్పీకర్ నోటీస్‌కు అనుమతిస్తాడు. దానిపై సభలో చర్చ ఉంటుంది. ఆ తర్వాత ఓటింగ్ కూడా నిర్వహిస్తారు. మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే ప్రభుత్వం పడిపోతుంది. అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక కారణం సూచించాల్సిన అవసరం లేదు. విశ్వాస తీర్మానం: దీన్ని ‘ట్రస్ట్ మోషన్’ అని కూడా అంటారు. విశ్వాస తీర్మానం గురించి రాజ్యాంగంలోగానీ, పార్లమెంటరీ రూల్స్‌లో గానీ లేదు. రూల్ 184 కింద సాధారణ తీర్మానం మాదిరిగానే విశ్వాస తీర్మానాన్ని అనుమతిస్తారు. అధికారంలోని పార్టీ మెజారిటీ కోల్పోతే, తిరిగి మెజారిటీ నిరూపించుకోవాలంటూ రాష్ట్రపతి ప్రధానమంత్రిని కోరతాడు. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రానప్పుడు, ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ముందుకు వచ్చిన నాయకున్ని ప్రధానమంత్రిగా నియమించి, నిర్ణీత గడువులో సభ విశ్వాసాన్ని పొందాల్సిందిగా రాష్ట్రపతి కోరవచ్చు. రాజకీయ సంక్షోభంలో ఎవరు మిత్రులో, శత్రువులో, ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారో తెలుసుకొని సంఘటితం కావడానికి కూడా విశ్వాస తీర్మానాన్ని వాడుకోవచ్చు. తక్కువేమీకాదు: ఇంతవరకూ ఏర్పడిన 15 లోక్‌సభల్లో 26 సార్లు అవిశ్వాస తీర్మానాలను, 12 సార్లు విశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. మొదటి, రెండో లోక్‌సభల్లో ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టలేదు. అత్యధికంగా అవిశ్వాస తీర్మానాలను మూడు, నాలుగో లోక్‌సభలో ఆరు సార్లు, అతి తక్కువగా 13వ లోక్‌సభలో ఒక సారి మాత్రమే ప్రవేశపెట్టారు. అతి ఎక్కువ విశ్వాస తీర్మానాలను నాలుగు సార్లు 11వ లోక్‌సభ ఎదుర్కొంది. మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంపై 1963లో ఆచార్య జె.బి.కృపలాని ప్రవేశపెట్టారు. అత్యధికంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న ప్రధానమంత్రి ఇందిరా గాంధీ. కానీ వీటిలో ఏ ఒక్క తీర్మానం కూడా నెగ్గలేదు. లాల్ బహదూర్ శాస్త్రి, పి.వి.నరసింహా రావు చెరో మూడు సార్లు, మొరార్జీ దేశాయ్ రెండు సార్లు, రాజీవ్ గాంధీ, వాజ్‌పేయి ఒక్కోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. క్రియాశీలకం: తొమ్మిదో లోక్‌సభ (1989) నుంచి ఏ రాజకీయ పార్టీకి ప్రజలు స్పష్టమైన మద్దతు ఇవ్వడంలేదు. వూరిన పరిస్థితుల నేపథ్యంలో హంగ్ పార్లమెంట్ అనివార్యం అవుతోంది. హంగ్ పార్లమెంట్, సంకీర్ణ రాజకీయాల నేపథ్యంలోనే రాష్ట్రపతి పాత్ర క్రియాశీలకమవుతోంది. రాజకీయాలకు అతీతంగా, రాజ్యాంగ సంప్రదాయాలు, ఉత్తమ రాజకీయ సంస్కృతికి అద్దం పట్టేలా రాష్ట్రపతి, గవర్నర్లు వ్యవహరించాలి. అప్పుడే మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి ద్విగుణీకృతమవుతుంది. ‘రాజ్యాంగం గొప్పతనం దాన్ని గౌరవించి, అమలు చేసే వారిపై ఆధారపడి ఉంటుంది గానీ, రాజ్యాంగంపై మాత్రమే కాదు. రాజ్యాంగం ఉత్కృష్టమైంది. అయినా పాలించే వారిని బట్టి దానికి విలువ ఉండదు. పాలకులు మంచివారైతే రాజ్యాంగంలో లోపాలున్నా పాలన ఉత్తమంగానే ఉంటుంది’. - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ‘రాజ్యాంగబద్ధ ప్రభుత్వం పాలనలో ఉండటం పాలకులకు దాసోహం కాదు. స్వేచ్ఛకు, విముక్తికి ప్రతీక’ - అరిస్టాటిల్ మధ్య తేడా? విశ్వాస, అవిశ్వాస తీర్మానాల ఉద్దేశం ఒక్కటే. ప్రభుత్వానికి ఉన్న మెజారిటీని తెలుసుకోవడమే. ప్రక్రియలో కొంత తేడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కేంద్రం, రాష్ట్రాలలో మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడటం, మద్దతు ఇస్తున్న పార్టీలు తర్వాత మద్దతు ఉపసంహరించడం, పార్టీలో చీలికలు రావడం, హంగ్ పార్లమెంట్లు ఏర్పడడంతో ఈ తీర్మానానికి సమకాలీన ప్రాముఖ్యత పెరిగింది. విశ్వాస తీర్మానానికి సభ అనుమతి అవసరం లేదు కానీ అవిశ్వాస తీర్మానానికి సభ అనుమతి ఉండాలి. ఒకవేళ రెండు తీర్మానాలు ఒకేసారి సభ ముందుకు వస్తే విశ్వాస తీర్మానానికి ప్రాధాన్యత ఇస్తారు. బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
వైఎస్సార్ సీపీ బృందం ఢిల్లీ పర్యటన