సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈమేరకు రాష్ట్రపతికి లేఖ రాసి క్షమాపణలు కోరారు. పొరపాటుగా నోరుజారడం వల్లే ఆ పదం మాట్లాడినట్లు పేర్కొన్నారు. తన తప్పును క్షమిస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో రాసుకొచ్చారు.
పార్లమెంటులో గురువారం మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అని అన్నారు అధిర్ రంజన్ చౌదరి. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అధిర్ రంజన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, రాష్ట్రపతి అయిన గిరిజన బిడ్డను అవమానించేలా ఆయన మాట్లాడారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగ్గారు. దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
చదవండి: ‘రాష్ట్రపతి కాదు.. రాష్ట్రపత్ని’.. కాంగ్రెస్ నేత కామెంట్లపై దద్దరిల్లిన లోక్‌సభ
Comments
Please login to add a commentAdd a comment