Parliament Monsoon Session
-
పార్లమెంట్లో వయనాడ్ విలయంపై కేంద్రమంత్రి జేపీ నడ్డ ప్రకటన
updates:ప్రతినేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడారు.ఈరోజు తెల్లవారుజామున, వయనాడ్ కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 70 మందికి పైగా మరణించారు. ముండక్కై గ్రామం ఊడ్చిపెట్టుకుపోయింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదం స్థాయిని అంచనా వేయడానికి రక్షణ మంత్రి, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాను. మరణించిన వారికి తక్షణమే నష్టపరిహారం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ పరిహారాన్ని కూడా పెంచండి.రవాణా, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించండి. వీలైనంత త్వరగా సహాయాన్ని అందించండి. బాధిత కుటుంబాల పునరావాసం కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయండి. పశ్చిమ కనుమల్లో గత కొన్నిఏళ్లుగా కొండచరియలు విరిగిపడటం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.వయనాడ్ విలయంపై పార్లమెంట్లో కేంద్రమంత్రి జేపీ నడ్డ ప్రకటనప్రధాని మోదీ కేరళ సీఎం విజయన్ మాట్లాడారు. కేంద్ర అండగా ఉంటుందని భోరోసా ఇచ్చారు.కేంద్రం అన్ని విధాలా సహాయం అందిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగాయిఘటానాస్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాం.#WATCH | Wayanad landslide: In Rajya Sabha, Union Minister JP Nadda says, "Discussions began here and all the Members expressed their concern over the massive tragedy that has occurred there. I would like to say this is a tragedy of not just Kerala alone, but the entire nation is… pic.twitter.com/xgDNA73S9R— ANI (@ANI) July 30, 2024 Live: Parliament Session: Congress gives Adjournment Motion notice in Lok Sabha on Wayanad landslidesLIVE @ANI | https://t.co/n7jkluCMdz#ParliamentSession #WayanadLandslide #Congress pic.twitter.com/H5m6K2ly28— ANI Digital (@ani_digital) July 30, 2024 వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విపత్తుపై లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది జనగణన ఆలస్యంపై చర్చ జరపాలని లోక్‌భలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. జన గణన ఆలస్యం వల్ల మహిళా రిజర్వేషన్ అమలు ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ నోటీసులో పేర్కొంది. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.సరిహద్దు పరిస్థితి, చైనాతో భారీ వాణిజ్య లోటుపై చర్చ జరగాలని కోరారు.Congress MP Manish Tewari gives Adjournment Motion notice in Lok Sabha, 'to have a discussion on the border situation and the huge trade deficit with China'. pic.twitter.com/Hh08uiwp8Y— ANI (@ANI) July 30, 2024 ఇవాళ లోక్ సభలో బడ్జెట్‌పై చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానం ఇవ్వనున్నారు. -
పార్లమెంట్లో ‘నీట్’పై మాటల మంటలు
Live Updates:లోక్‌సభలో నీట్ అంశంపై నిరనసకు దిగిన విపక్షాలునీట్పై పార్లమెంట్లో మాటల మంటలు పేపర్ లీకేజీలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందంటూ విపక్షా ఫైర్ పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య: ప్రతిపక్ష నేత రాహుల్గాంధీఈ సమస్య మూలాల నుంచి పెకిలించాలి. డబ్బులు ఉన్నవాళ్లు విద్యావ్యవస్థనే కొనేస్తున్నారు. విద్యార్థులు జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం తగదు. విద్యాశాఖమంత్రి తనను తప్ప అందిరినీ తప్పు పడుతున్నారు.దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు: అఖిలేష్ యాదవ్రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ జరుపుతోంది. నీట్‌పై తాము ఏమి దాచటం లేదు. నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకు వచ్చింది.విద్యా వ్యవస్థను రాహుల్ గాంధీ తప్పుపట్టడం దారుణంరాజ్యసభ ప్యానెల్ వైస్‌ఛైర్మన్‌గా అయోధ్య రామిరెడ్డిరాజ్యసభ ప్యానెల్ వైస్‌ఛైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి నియామకంరాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ పునర్వ్యవస్థీకరణప్యానెల్ వైస్ ఛైర్మన్ హోదాలో సభా కార్యక్రమాలను నిర్వహించనున్న అయోధ్య రామిరెడ్డిరాజ్యసభలో నూతన ప్యానెల్‌ను ప్రకటించిన జగదీప్ ధన్కడ్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయిపార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియా మాట్లాడారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాం. అమృతకాలంలో ఇదొక అద్భుతమైన బడ్జెట్. 2047 నాటికి వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దుతాం. మూడోసారి అధికారంలోకి రావటం సంతోషకరం. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం: ప్రధాని మోదీబడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. రేపు (మంగళవారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నీట్ లీకేజీ, కన్వర్ యాత్ర, రైల్వే ప్రమాదం అంశాలపై ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.ఏపీలో శాంతి భద్రతలు క్షీణించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్సీపీ నిరసనకు దిగుతోంది. 45 రోజుల చంద్రబాబు పాలనలో 31 రాజకీయ హత్యలు జరిగిన వైనంపై వైఎస్సార్సీపీ అఖిలపక్షంలో గళం విప్పింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆల్ పార్టీ మీటింగ్‌లో వైఎస్సార్సీపీ కోరిగా.. టీడీపీ సైలెంగా ఉండిపోయింది. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏఐ డీప్ ఫేక్, పౌరసత్వ సవరణ చట్టం, రిటైర్డ్ న్యాయమూర్తులు రాజకీయాల్లోకి రావడం సహ పలు అంశాలపై 23 బిల్లులు ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
లోక్‌సభలో పాసైన డేటా పరిరక్షణ బిల్లు
ఢిల్లీ: దేశ పౌరుల డిజిటల్హక్కుల్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు.. లోక్‌సభలో ఎట్టకేలకు పాసైంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఆగస్టు 3న లోక్‌సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ‘గోప్యత’ దెబ్బతింటుందన్న విపక్షాల అనుమాన ఆందోళనల నడుమే ఇవాళ బిల్లు పాస్ కావడం గమనార్హం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లు ప్రకారం.. ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా రూ.50 కోట్ల నుంచి గరిష్టంగా 250 కోట్ల రూపాయల జరిమానా విధిస్తారని కేంద్ర ఐటీశాఖ మంత్రి(సహాయ) రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ చట్టం అమలు కోసం డేటా ప్రొటెక్షన్ బోర్డు ఆఫ్‌ఇండియాను ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లులోని నిబంధనం ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బోర్డు రిఫరెన్స్‌తో కేంద్రం ఏదైనా సమాచారాన్ని బ్లాక్ చేసేందుకు పర్మిషన్ ఉంటుంది. ఆన్లైన్ వేదికల్లో.. వ్యక్తుల నుంచి సమాచార దుర్వినియోగం విపరీతంగా జరుగుతుంటుంది. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం గనుక పొందితే.. ప్రతి పౌరుడి డిజిటల్ హక్కులకు రక్షణ లభిస్తుంది అని కేంద్రం చెబుతోంది. కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లుతో సోషల్ మీడియా కంపెనీల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఈ బిల్లు భారతదేశంలోని డిజిటల్ వ్యక్తిగత డేటాను ఆన్లైన్లో సేకరించిన.. ఆఫ్‌లైన్‌లో సేకరించి డిజిటలైజ్ చేయబడిన వాటి ప్రాసెసింగ్‌కు వర్తిస్తుంది. ► వ్యక్తిగత డేటా ఆ వ్యక్తి సమ్మతితో చట్టబద్ధమైన ప్రయోజనం కోసం మాత్రమే ప్రాసెస్ చేయబడుతుంది. వినియోగదారుల డేటాను ఉపయోగించడానికి కంపెనీలు ఇప్పుడు అనుమతి తీసుకోవాలి. ► డేటా విశ్వసనీయులు డేటా ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి, డేటాను సురక్షితంగా ఉంచడానికి, దాని ప్రయోజనం అందించిన తర్వాత డేటాను తొలగించడానికి బాధ్యత వహిస్తారు. ► సమాచారాన్ని స్వీకరించే, సరిదిద్దే, తొలగించే హక్కు, ఫిర్యాదులను పరిష్కరించే హక్కుతో సహా వ్యక్తులకు ఈ బిల్లు నిర్దిష్ట హక్కులను అందిస్తుంది. ► రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్, నేరాల నిరోధం వంటి కారణాలతో బిల్లులోని నిబంధనలను అమలు చేయడం నుంచి ప్రభుత్వ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వవచ్చు. ఇదీ చదవండి: కుటుంబ పాలన.. క్విట్ ఇండియా -
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు సరైందే.. రాజ్యసభలో చర్చ
Delhi Ordinance Bill LIVE ► ఢిల్లీ ఆర్డినెన్స్‌బిల్లుకు రాజ్యసభ సభ్యులు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ పూర్తి మద్దతు ప్రకటించారు. #WATCH | "...To me the bill is correct, right...," says Rajya Sabha MP and former CJI Ranjan Gogoi on The Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023. pic.twitter.com/uDZYZMbLdM — ANI (@ANI) August 7, 2023 #WATCH | Rajya Sabha MP and former CJI Ranjan Gogoi on The Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023 "What is pending before the Supreme Court is the validity of the ordinance, and the two questions referred to the Constitution bench, and that has… pic.twitter.com/EeTDZ8AfWE — ANI (@ANI) August 7, 2023 ► ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ‘ఇండియా కూటమి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ తానా షాహీ పార్టీ. ఢిల్లీ ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీకి చెందింది కాదు.. దేశ ప్రజలకు చెందింది.ఈ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోంది. రాజ్యాంగానికి లోబడే బిల్లు.. అందుకే మద్దతు తెలిపాం’ అని అన్నారు. ► రాష్ట్ర అధికారాలను లాక్కోవడమే ఈ బిల్లు ఉద్దేశం. వాజ్‌పేయి, అద్వానీ ఆశయాలకు వ్యతిరేకంగా ఉంది ఈ బిల్లు: ఆప్ ► బిల్లు రాజ్యాంగ విరుద్ధం.. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంది: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ సాక్షి, ఢిల్లీ: వివాదాస్పదమైన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఇవాళ(సోమవారం, ఆగష్టు7) పెద్దల సభకు చేరింది. రాజ్యసభలో ఈ బిల్లను ప్రవేశపెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. వెంటనే కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర సర్కారు మే 19న తెచ్చిన ఈ ఆర్డినెన్స్ బిల్లు.. లోక్‌సభలో విపక్షాల నినాదాల నడుమ పాస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్యసభలో కీలకం కానుంది. రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 110 మంది ఎంపీలే ఉన్నారు. కాంగ్రెస్‌సహా అన్ని విపక్ష పార్టీలు కలుపుకుని 128 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో.. పెద్దల సభలో బిల్లును ఎలాగైనా ఓడించాలనే ధీమాతో విపక్ష ఇండియా కూటమి ఉంది. Union Home Minister Amit Shah moves the Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023, in Rajya Sabha pic.twitter.com/fQEnsf60fj — ANI (@ANI) August 7, 2023 -
ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం మాకుంది: అమిత్ షా
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ.. అప్డేట్స్ ► ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాల రగడతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. ► బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టింది. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని కాంగ్రెస్.. ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on GNCT (Amendment) bill 2023 in the Lok Sabha, says "Constitution has given the House, power to pass any law regarding the state of Delhi. Supreme Court judgement has clarified that Parliament can bring any law regarding the state of… pic.twitter.com/IoAlEP6prt — ANI (@ANI) August 1, 2023 ► లంచ్ తర్వాత తిరిగి లోక్‌సభ ప్రారంభమైంది. సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు వచ్చింది. ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఆర్ఎస్పీ సైతం ప్రకటించింది. ►పార్లమెంట్లో మణిపూర్ సంక్షోభంపై ప్రధాని మోదీ ప్రకటనకు పదే పదే డిమాండ్ చేసినా చైర్మన్ జగదీప్ ధంకర్ పట్టించుకోకపోవడంతో రాజ్యసభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ► లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ తేదీలు ఖరారు చేశారు. ఈనెల 8.9,10 తేదీల్లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈనెల 10న ప్రధాన మోదీ సమాధానం ఇవ్వనున్నారు. లోక్‌సభ ముందు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ► ఢిల్లీలోని అధికారుల నియామకాలు, బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును ఆప్, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే మణిపూర్, అవిశ్వాసంపై రచ్చ జరుగుతున్న సభలో ఈ బిల్లుతో మరింత గందరగోళం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. VIDEO | "As far as we are concerned, the introduction of the Delhi bill will certainly have to be opposed because it is of profound Constitutional consequence for our country. It tampers with the federal system of our country," says Congress leader @ShashiTharoor on Delhi… pic.twitter.com/jpMvoaC3x8 — Press Trust of India (@PTI_News) August 1, 2023 ఉభయ సభలు వాయిదా ► ప్రతిపక్షాల నిరసనలు, ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ప్రారంభమైన 16 నిమిషాల్లోనే లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఇక రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. రూల్ 267 కింద చర్చకు మొండిపట్టు ► రాజ్యసభలో గందరగోళం నెలకొనడంతో రూల్ 267 కింద చర్చకు ప్రతిపక్షాలు సమర్పించిన 60 నోటీసులను చైర్మన్ తిరస్కరించారు. అయితే మణిపూర్ సంక్షోభంపై స్వల్పకాలిక చర్చకు రూల్ 176 కింద నోటీసులను ఆమోదించారు. రాజ్యసభలో రచ్చ ► రూల్ 267 ప్రకారం మణిపూర్‌పై చర్చ జరగాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని పార్లమెంట్‌కు రావాలని, మణిపూర్‌పై చేయాలని డిమాండ్ చేశాయి. గత 8 రోజులుగా సభకు నిరంతర అంతరాయంపై చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రసంగిస్తున్న నేపథ్యంలో మణిపూర్ సంక్షోభంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ►మణిపూర్ ఘటనపై చర్చ చేపట్టాలని ఉభయసభల్లో విపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. రాజ్యసభలో రూల్ 267 కింద మణిపూర్ అంశంపై చర్చ జరపాలని బీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. లోక్‌సభలో బీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు. వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు సమయం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించారు. వెంటనే ప్రతిపక్షాలు మణిపూర్ అంశంపై నిరసనలు తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ►పార్లమెంట్ సమావేశాలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ►పార్లమెంట్‌లోని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ప్రతిపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. #WATCH | Meeting of like-minded Opposition floor leaders underway at the Rajya Sabha LoP chamber in Parliament to discuss the strategy for the floor of the House. pic.twitter.com/tvScC6fGuz — ANI (@ANI) August 1, 2023 ►ఢిల్లీ ఆర్డినెన్స్‌తో సహా ఆరు బిల్లులను లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. న్యూఢిల్లీ: పార్లమెంట్లో మణిపూర్ నిరసనలు మిన్నంటడంతో ఉభయ సభల కార్యకలాపాలు నిలిచిపోయాయి. జూలై 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గత ఎనిమిది రోజులుగా ముందుకు సాగడం లేదు. మణిపూర్ వ్యవహారంతో ఉభయసభలు అట్టుడుకుతున్నాయి. మణిపూర్ హింసపై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయడంతోపాటు, దీనిపై దీర్ఘకాలిక చర్చ జరగాలని ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేయడంతో.. లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. చదవండి: ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్? మణిపూర్‌పై చర్చకు సిద్ధమని ప్రభుత్వం తెలిపినప్పటికీ.. మొండి వైఖరితో విపక్షాలు ఆందోళనలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించడంతో ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది.విపక్షాలకు సర్దిచెప్పేందుకు సభాపతులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఇరుసభలూ వరుసగా వాయిదా పడుతున్నాయి. మణిపూర్‌తోపాటు అవిశ్వాసంపై వెంటనే చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే అవిశ్వాస తీర్మానానికి బదులుగా మణిపూర్‌పై చర్చకు కేంద్రం సిద్ధమైంది. రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెబుతుండగా...ప్రతిపక్షం రూల్ 267 కింద చర్చకు పట్టుబట్టింది. చర్చకు ముందు ప్రధానమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఏకాభిప్రాయం కుదరకపోవడం, విపక్షాలు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో సభను వాయిదా వేశారు. -
ఎన్డీయేపై సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం?
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. విపక్ష కూటమి ఇండియా(INDIA) లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రసంగంపై కేంద్రం వెనకడుగు వేస్తున్న వేళ.. విపక్షాల కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే మణిపూర్ అంశం మళ్లీ కుదిపేసింది. ఈ క్రమంలో విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ తర్వాతే విపక్ష కూటమి అవిశ్వాసం దిశగా ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మణిపూర్ అంశంతో రాజ్యసభలోనూ గందరగోళం నెలకొనగా.. వాయిదా పడింది. ప్రధాని సెటైర్లు.. ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రానా(విపక్షాల) వారి తీరు మారుతుందా? అంటూ ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి దిశ దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదని వ్యాఖ్యానించిన ఆయన.. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిద్దీన్లోనూ ఇండియా అనే పదం ఉందంటూ సెటైర్లు వేసినట్లు సమాచారం. -
Parliament Monsoon session: 267 X 176
మణిపూర్ అమానవీయ ఘటనపై పార్లమెంటులో చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ఏ నిబంధన కింద చర్చించాలన్న దానిపై పీటముడి నెలకొంది. 267 కింద మణిపూర్‌పై రాజ్యసభలో పూర్తి స్థాయిలో చర్చ జరిపి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనంతట తానుగా ఒక ప్రకటన చేయాలని విపక్ష పారీ్టలు పట్టుబడుతున్నాయి. దానికి బదులుగా నిబంధన 176 కింద చర్చకు సిద్ధమని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ రెండు నిబంధనలకున్న ప్రాథమికమైన తేడా చర్చా సమయం. నిబంధన 267 కింద సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంటే, నిబంధన 176 కింద స్వల్పకాలిక చర్చ మాత్రమే జరుగుతుంది. రూల్ 267 ► రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) ప్రకారం రూల్ 267 కింద చర్చ సుదీర్ఘంగా సాగుతుంది. ఆ రోజు ఏదైనా అంశంపై చర్చకు సభ్యులు ముందుగా నోటీసులు ఇచ్చి ఉంటే రాజ్యసభ చైర్మన్ వాటిని పూర్తిగా రద్దు చేసి దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చకు అనుమతినిస్తారు. ఈ చర్చ సందర్భంగా సభ్యులు ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నించే అవకాశం లభిస్తుంది. చర్చ ఎన్ని గంటలు కొనసాగించాలన్న దానిపై ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేవు. చర్చ జరపడానికి తీర్మానం, దానిపై ఓటింగ్ వంటి వాటికి అవకాశం ఉంటుంది. రూల్ 176 ► స్వల్పకాలిక వ్యవధిలో ముగిసే చర్చలు 176 నిబంధన కింద జరుపుతారు. ఈ నిబంధన కింద రెండున్నర గంటలకు మించి చర్చ కొనసాగదు. ఈ నిబంధన కింద సభ్యుడెవరైనా అప్పటికప్పుడు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇవ్వొచ్చు. ఆ నోటీసులో చర్చకు గల కారణాలు వివరించాలి. ఆ నోటీసుకి మద్దతుగా మరో ఇద్దరు సభ్యులు సంతకాలు చేయాలి. రాజ్యçసభ చైర్మన్ చర్చకు అంగీకరించిన తర్వాత ఆ రోజైనా, ఆ మర్నాడైనా చర్చకు అనుమతినిస్తారు. ఈ చర్చకు సంబంధిత మంత్రి మాత్రమే సమాధానమిస్తారు. ఇదంతా రెండున్నర గంటల్లోనే ముగిసిపోతుంది. లాంఛనంగా తీర్మానం, దానిపై ఓటింగ్ వంటివి ఉండవు. గతంలో 267 కింద చర్చ జరిగిందా ? పార్లమెంటు రికార్డుల ప్రకారం రూల్ 267 కింద 1990 నుంచి 2016 వరకు 11 సార్లు చర్చలు జరిగాయి. 2016లో చివరిసారిగా పెద్ద నోట్ల రద్దుపై అప్పటి రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ రూల్ 267 కింద చర్చకు అనుమతినిచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఆ నిబంధన కింద ఏ నోటీసును చైర్మన్ అనుమతించలేదు. గత శీతాకాల సమావేశాల్లో వాస్తవా«దీన రేఖ వెంబడి చైనా పెత్తనం పెరిగిపోవడం, ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చించడానికి రూల్ 267 కింద విపక్ష సభ్యులు ఇచి్చన నోటీసుల్ని ఎనిమిది సార్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కార్ తోసిపుచ్చారు. ఈ నిబంధన కింద చర్చకు అనుమతిస్తే సభలో గందరగోళం నెలకొనడం మినహాయించి సమగ్రమైన చర్చ జరిగే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. రోజంతా సభా కార్యక్రమాలన్నీ రద్దు చేసి అత్యవసరంగా చర్చ జరిపే ప్రజా ప్రాముఖ్యత అంశాలు ఉండవని కొందరు అధికార పక్ష ఎంపీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్‌పై స్వల్పకాలిక చర్చ జరిపి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమాధానమివ్వాలని అధికార పక్షం భావిస్తూ ఉంటే, ప్రతిపక్షాలు సుదీర్ఘంగా చర్చించాక ప్రధాని నరేంద్ర మోదీయే బదులివ్వాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఎవరికివారే మెట్టు దిగకపోవడంతో సభా కార్యక్రమాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
Parliament Monsoon session: ‘మణిపూర్’ రగడ..
సాక్షి, న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండ వరుసగా రెండో రోజు శుక్రవారం సైతం పార్లమెంట్‌ను కుదిపేసింది. ఈ అంశంపై తక్షణమే చర్చ ప్రారంభించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. నినాదాలు, నిరసనలతో హోరెత్తించడంతో ఉభయసభలు స్తంభించాయి. మణిపూర్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పలువురు కేంద్ర మంత్రులు ప్రకటించారు. అయినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే నోరు విప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే పార్లమెంట్ ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై 267 నిబంధన కింద పూర్తిస్థాయిలో చర్చించాలని, అనంతరం ప్రధానమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అయితే, 176 నిబంధన కింద చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం తేలి్చచెప్పింది. ఇందుకు ప్రతిపక్ష ఎంపీలు అంగీకరించలేదు. మణిపూర్ రక్తమోడుతోంది మణిపూర్ అంశంపై లోక్‌సభ, రాజ్యసభలో చర్చించాలని కోరుతూ మంగళవారం ఉదయం ఉభయ సభల ప్రారంభానికి ముందే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ఇతర పారీ్టలు వాయిదా తీర్మానం నోటీసులిచ్చాయి. లోక్‌సభ ఆరంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. మణిపూర్ కు రక్తస్రావమవుతోంది అని పేర్కొన్నారు. మణిపూర్‌లో కొనసాగుతున్న దారుణ హింసపై తక్షణమే చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని, సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. శాంతించాలంటూ విపక్షాలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పదేపదే విజ్ఞప్తి చేశారు. సభ సక్రమంగా కొనసాగడం, ప్రశ్నోత్తరాలు నిర్వహించడం మీకు ఇష్టం లేదా? అంటూ ప్రతిపక్షలపై అసహనం వ్యక్తం చేశారు. నినాదాలతో సమస్యకు పరిష్కారం లభించదని, చర్చలే అందుకు మార్గమని సూచించారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించవద్దని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు. ఈ సమయంలో మాట్లాడేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్పీకర్ అనుమతి ఇచ్చారు. మణిపూర్ ఘటనలపై చర్చకు తాము సిద్ధమేనని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ‘‘మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం చాలా హేయమైన చర్య అని, ఈ ఘటన యావత్ దేశం తలదించుకునేలా చేసిందని ప్రధానమంత్రి మోదీ స్వయంగా చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అయినా ప్రతిపక్షాలు పార్లమెంట్లో చర్చ జరగకుండా గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ అంశంపై చర్చకు విపక్షాలు సీరియస్‌గా లేవని భావిస్తున్నా’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అయినా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. నినాదాలు ఆపలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. చర్చకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. అయినా ప్రతిపక్షాలు వినిపించుకోలేదు. గందరగోళం కొనసాగుతుండడంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఆందోళన మణిపూర్ అంశంపై చర్చకు రాజ్యసభలోనూ విపక్షాలు పట్టుబట్టాయి. సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్ పార్లమెంట్లో ఉపయోగించే పదాలపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. మణిపూర్ సమస్యపై మాట్లాడేందుకు సభలో ప్రధానమంత్రి ఉండాలని గురువారం ప్రతిపక్షాలు కోరాయని అన్నారు. అయితే ప్రధానమంత్రి, మణిపూర్ అనే పదాలను రికార్డు నుండి తొలగించారని సభాపతి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు సహా మణిపూర్ అంశంపై విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో రాజ్యసభ తొలుత మధ్యాహ్నం 2.30 గంటల దాకా, ఆ తర్వాత సోమవారానికి వాయిదా పడింది. లోక్‌సభలో ‘ఇండియా’ ప్లకార్డులు ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ప్లకార్డులు తొలిసారిగా శుక్రవారం లోక్‌సభలో దర్శనమిచ్చాయి. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి సమాధానం చెప్పాలంటూ విపక్ష సభ్యులు ఈ ప్లకార్డులను సభలో ప్రదర్శించారు. ‘ఇండియా సమాధానం కోరుతోంది. మౌనాన్ని కాదు’, ‘పార్లమెంట్లో ప్రధాని మాట్లాడాలని ఇండియా కోరుతోంది’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. -
'ఇండియా' కూటమి తొలి భేటీ రేపే.. కేంద్రాన్ని ఇరుకున పెట్టడంపైనే చర్చ..
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. అటు 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరు భేటీతో ఏకమయ్యాయి. అయితే.. పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష కూటమి 'ఇండియా' ఏకతాటిపై నడవడానికి ప్రణాళికలు సిద్ధం చేయనుంది. ఇందుకు తొలిసారిగా 'ఇండియా' కూటమి తొలిసారిగా రేపు సమావేశం కానుంది. ఈ మేరకు రాజ్యసభలోని విపక్షాల ఛాంబర్లో భేటీ జరగనుందని సమాచారం. వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై సందించాల్సిన ప్రశ్నల గురించి చర్చించనున్నారని ఓ విపక్ష పార్టీ నేత తెలిపారు. అయితే.. బెంగళూరులో మంగళవారం 26 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిపై పోరుకు సిద్ధమయ్యాయి. విపక్ష కూటమికి 'ఇండియా' అనే పేరును కూడా సూచించారు. గురువారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నీపార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఉన్న ప్రధాన సమస్యలను ఒకే గొంతుకగా వినిపించనున్నారు. అటు.. వర్షాకాల సమావేశాలకు ముందు పార్లమెంట్లో నేడు అఖిలపక్షాల భేటీని కేంద్రం నిర్వహించింది. సమావేశాలకు అన్ని పార్టీలు సహకరించాలని కోరింది. మణిపూర్ హింస, ధరల పెరుగుదల వంటి పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించనున్నాాయి విపక్షాలు. ఇదీ చదవండి: డిప్యూటీ స్పీకర్‌పై పేపర్లు విసిరిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్.. -
ముగిసిన అఖిలపక్ష భేటీ.. సహకరించాలని విపక్షాలకు ప్రభుత్వం వినతి..
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు జరిగిన అఖిలపక్ష భేటీ ముగిసింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అన్ని పార్టీలు ఈరోజు పార్లమెంట్లో సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి దేశంలో వివిధ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను ప్రభుత్వం కోరింది. కాగా.. ఈ వర్షాకాల సమావేశాలల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. #WATCH | Delhi: Defence Minister Rajnath Singh is chairing an all-party meeting ahead of the Monsoon Session of Parliament. pic.twitter.com/UnSWa8yMP5 — ANI (@ANI) July 19, 2023 అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ విజయ సాయిరెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఎంపీలు కేశవ రావు, నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. టీడీపీ నుంచి ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ సమావేశానికి హాజరయ్యారు. కాగా.. ఇక ఈ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అల్లర్లపై ప్రభుత్వం పెదవి విప్పనుందని సమాచారం. #MonsoonSession | Central Government informed all parties during the all-party meeting that government is ready to discuss on Manipur issue: Sources — ANI (@ANI) July 19, 2023 ఈ సమావేశాల్లోనే ఢిల్లీ పాలనాధికారాల ఆర్డినెన్స్ పై బిపార్ల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే.. విపక్షాలు పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఎన్నికల సమయం అయినప్పటికీ ప్రజా సమస్యల చర్చ కోసం పార్లమెంటుకు వస్తున్నామని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రం జాన్ చౌదరి తెలిపారు. విపక్షాలకు మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి మౌనాన్ని వీడాలని అన్నారు. ఇదీ చదవండి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: నేడు అఖిలపక్ష భేటీ.. ఎన్డీయే వర్సెస్ ఇండియాతో ఆసక్తికరంగా.. -
పార్లమెంటు సమావేశాలు ముందుగానే నిరవధిక వాయిదా?
సాక్షి,న్యూఢిల్లీ: సోమవారం రాజ్యసభలో వెంకయ్య నాయుడుకు వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. వివిధ పార్టీలకు చెందిన నేతలు వీడ్కోలు ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం పార్లమెంటు సమావేశాలు అనుకున్న సమయానికంటే ముందుగానే నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. మొహర్రం , రక్షాబంధన్ సెలవుల నేపథ్యంలో సమావేశాలను ముందుగానే ముగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం సెషన్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వీడ్కోలు కార్యక్రమం, మధ్యాహ్నం తర్వాత రెండు బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. అనంతరం సభను ఛైర్మన్ నిరవధికంగా వాయిదా వేయనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12 వరకు జరగాల్సి ఉంది. కానీ సెలవుల వల్ల ముందే ముగించే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ? -
Adhir Ranjan Chowdhury: రాష్ట్రపతిని క్షమాపణలు కోరిన కాంగ్రెస్ నేత
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈమేరకు రాష్ట్రపతికి లేఖ రాసి క్షమాపణలు కోరారు. పొరపాటుగా నోరుజారడం వల్లే ఆ పదం మాట్లాడినట్లు పేర్కొన్నారు. తన తప్పును క్షమిస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో రాసుకొచ్చారు. పార్లమెంటులో గురువారం మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అని అన్నారు అధిర్ రంజన్ చౌదరి. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అధిర్ రంజన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, రాష్ట్రపతి అయిన గిరిజన బిడ్డను అవమానించేలా ఆయన మాట్లాడారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగ్గారు. దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చదవండి: ‘రాష్ట్రపతి కాదు.. రాష్ట్రపత్ని’.. కాంగ్రెస్ నేత కామెంట్లపై దద్దరిల్లిన లోక్‌సభ -
లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వారు సభలోకి రాకుండా నిషేధం విధించారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై నిరసనలు చేపట్టి సభా కార్యకలాపాలకు అడ్డుపడినందుకు వారిపై ఈ చర్యలు తీసుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జోతిమణి, టీఎన్ ప్రథాపన్ సభ మధ్యలోకి వెళ్లి నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి కేంద్రానికి వ్యతిరేకంగా సభలో పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలను సభ బయట చేపట్టాలని, సభాకార్యకలాపాలకు అడ్డుపడొద్దని స్పీకర్ హెచ్చరించారు. అయినా వారు వెనక్కి తగ్గకుండా నిరసనలు కొనసాగించడంతో సస్పెన్షన్ వేటు వేశారు. 4 Congress MPs suspended for entire Monsoon session over 'unruly behaviour' Read @ANI Story | https://t.co/BFKThevzAm#Congress #MonsoonSession #LokSabha pic.twitter.com/akZYlgGZRr — ANI Digital (@ani_digital) July 25, 2022 స్పీకర్ చర్యపై కాంగ్రెస్ స్పందించింది. నేతలపై వేటు వేసి ప్రభుత్వం తమను భయపెట్టాలని చూస్తోందని ఆరోపించింది. ప్రజా సమస్యలను సభలో లేవనెత్తేందుకే వారు ప్రయత్నించారని పేర్కొంది. సస్పెన్షన్ అనంతరమూ విపక్షాలు ఆందోళనలను కొనసాగించిన నేపథ్యంలో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. చదవండి: మంత్రిగారి లైఫ్ స్టైల్ మామూలుగా లేదుగా.. కుక్కల కోసం ఖరీదైన ఫ్లాట్.. అర్పితకు కానుకలు! -
ఎన్డీఏ అంటే ఏమిటో కొత్త అర్థం చెప్పిన రాహుల్
సాక్షి,న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం తమ వద్ద సమాచారం లేదని బదులివ్వడంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం తీరును తప్పుబడుతూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ అంటే 'నో డేటా అవైలబుల్' అని సెటైర్లు వేశారు. ఓ జిఫ్ ఇమేజ్ను కూడా జత చేసి ట్వీట్ చేశారు. ' ఆక్సీజన్ కొరత వల్ల ఒక్కరు కూడా చనిపోలేదు. నిరసనలు చేపట్టిన రైతుల్లో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు. కాలినడక వల్ల ఒక్క వలస కూలీ కూడా మరణించలేదు. మూక దాడుల వల్ల ఒక్కరు కూడా మరణించలేదు. ఒక్క జర్నలిస్టును కూడా అరెస్టు చేయలేదు అని నో డేటా అవైలబుల్(ఎన్డీఏ) ప్రభుత్వం ప్రజల్ని నమ్మించాలనుకుంటుంది. డేటా లేదు. సమాధానం లేదు. జవాబుదారీ లేదు' అని రాహుల్ శనివారం ట్వీట్ చేశారు. ‘No Data Available’ (NDA) govt wants you to believe: • No one died of oxygen shortage • No farmer died protesting • No migrant died walking • No one was mob lynched • No journalist has been arrested No Data. No Answers. No Accountabilty. pic.twitter.com/mtbNkkBoXe — Rahul Gandhi (@RahulGandhi) July 23, 2022 పార్లమెంటు సమావేశాల్లో భాగంగా.. కోవిడ్ వల్ల ఎంతమంది అంగన్వాడీ కార్యకర్తలు చనిపోయారని విపక్షాలు కేంద్రాన్ని శుక్రవారం అడిగాయి. అందుకు తమవద్ద సమాచారం లేదని కేంద్రం బదులిచ్చింది. 2014 నుంచి దేశంలో ఎంత మంది జర్నలిస్టులు అరెస్టయ్యారనే ప్రశ్నకు కూడా తెలియదని సమాధానం చెప్పింది. దీంతో కేంద్రం తీరును విమర్శిస్తూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. చదవండి:మొక్కజొన్న కంకులు బేరమాడిన మంత్రి.. షాకిచ్చిన యువకుడు -
మీ సహకారమే నాకు ఫేర్వెల్ గిఫ్ట్: వెంకయ్య
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు. ఈ సందర్భంగా ‘‘వర్షాకాల సమావేశాలు సక్రమంగా సాగేందుకు నాకు సహకరించండి. అదే నాకు వీడ్కోలు బహుమానం’’ అని రాజ్యసభ సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో జరిపిన అఖిలపక్ష భేటీలో 41 మంది నాయకులు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్యకివే చివరి సమావేశాలు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ధన్‌ఖడ్‌కు వెంకయ్య విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం హాజరయ్యారు. ఇదీ చూదవండి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులన్నింటిపై చర్చ! -
కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ. 119 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ. 119,53,758 కోట్లుగా ఉందని, ఇది జీడీపీలో 60.5 శాతంగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. ఎంపీ సజ్దా అహ్మద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సోమవారం లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 6.8 శాతంగా ఉన్న ద్రవ్యలోటును 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీలో 4.5 శాతానికంటే దిగువకు పరిమితం చేసే దిశగా కేంద్రం దృష్టి సారించింది. పన్నుల ఎగవేతను నివారించి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి స్థలాల అమ్మకం, ఆస్తుల ద్వారా ఆదాయ సముపార్జన వంటి అదనపు చర్యల ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకునే దిశగా ప్రణాళిక ఉంటుంది..’ అని తెలిపారు. ‘కేంద్ర ప్రభుత్వ అప్పు అంచనాలు ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి ఉన్నాయి. రాష్ట్రాలు తెస్తున్న రుణాలపై తగిన పరిమితులు, అలాగే కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటుకు తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రస్తుత అప్పు వల్ల పెద్ద ఆందోళన ఏమీ లేదు..’ అని తెలిపారు. ‘ద్రవ్య లోటు తగ్గింపు చర్యలు, పన్నుల ఎగవేతను నివారించి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి స్థలాల అమ్మకం, ఆస్తుల ద్వారా ఆదాయ సముపార్జన వంటి అదనపు చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వానికి చెల్లింపు సామర్థ్యం సమకూరుతుంది..’ అని పేర్కొన్నారు. -
పార్లమెంట్లో మూడోరోజూ వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆందోళన
-
కిసాన్ పార్లమెంటు: ముళ్ల కంచె, మేకులు ఏర్పాటు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపడానికి రైతులకు అనుమతి లభించింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడు నెలలకు పైగా ఉద్యమిస్తున్న రైతులు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సమీపంలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలకు అనుమతి కోరగా... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింఘు బార్డర్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. టిక్రి బార్డర్ వద్ద కూడా సెక్యూరిటీ పెంచారు. రోడ్డు మీద మేకులు పర్చడమే కాక ముళ్ల కంచె కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిసాన్ ఏక్తా మోర్చా సభ్యులు మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నుంచి కిసాన్ పార్లమెంట్ ప్రారంభం అవుతుంది. వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు ప్రతి రోజు 200 మంది రైతులు పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేస్తారు. మా అంతిమ లక్ష్యం నూతన రైతు చట్టాలను రద్దు చేయడమే’’ అని తెలిపారు. మూడో రోజు పార్లమెంట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. నేడు ప్రధానంగా ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదన్న కేంద్రం సమాధానంపై ప్రతిపక్షాల నోటీసులు ఇచ్చాయి. పెగాసెస్ వ్యవహారం పార్లమెంట్‌ను మరోసారి కుదిపేయనుంది. -
‘పోలవరం ప్రాజెక్ట్‌కు తక్షణమే రూ. 55వేల కోట్లు ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినా.. కేంద్రం పటించుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి.. పోలవరం ప్రాజెక్ట్ అంశం మీద లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్ట్‌కు జీవం పోసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అన్ని అనుమతులు తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్‌దే. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పోలవరంకు 55వేల కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలి. 29 నెలలు గడిచినా ఇంకా పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించలేదు. పోలవరం ప్రాజెక్టు ఆఫీస్‌ను రాజమండ్రికి తరలించాలి’’ అని కోరినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు. ఏపీ ప్రయోజనాల కోసం పని చేస్తాను: గురుమూర్తి ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులు, తిరుపతి ప్రజల దీవెనలతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాను. ఏపీ ప్రయోజనాలను సాధించేందుకు పని చేస్తాను. విభజన హామీల అమలు కోసం ప్రతి నిమిషం పోరాడుతాం’’ అన్నారు తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి. -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
-
వర్షాకాల సమావేశాలు: రేపు ఉదయం అఖిలపక్ష సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 19(సోమవారం) నుంచి 17వ లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశాలలో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరనుంది. మొత్తం 19 రోజులు సమావేశాలు జరగనున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ భయాల నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ తరువాత వచ్చిన తొలి సమావేశాలు ఇవే. అలా పలువురు కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించాక సభలో ప్రతిపక్షాలను తొలిసారి ఎదుర్కోవాల్సి వస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రాంతీయ పార్టీల చేతిలో బీజేపీ ఓటమి పాలయ్యాక జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలూ ఇవే. అలా ఈ ఏడాది జరగనున్న వర్షాకాల సమావేశాలకు ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం తన అజెండాను ముందుకు తీసుకురావాలనీ, ప్రతిపక్షాలు తమ వాణిని వినిపించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనీ ప్రయత్నించే వేళ... మొత్తం 19 రోజులు పార్లమెంట్ సమావేశం కానుంది. -
ప్రజాకాంక్షల వర్షం కురుస్తుందా?
ప్రజలెన్నుకున్న ప్రతినిధులు పార్లమెంట్ సాక్షిగా తమ గళం విప్పి, స్వరం వినిపించే అవకాశం మరోసారి వచ్చింది. సోమవారం నుంచి మొదలయ్యే 17వ లోక్‌సభ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ 19 నుంచి ఆగస్టు 13 దాకా జరగనున్న ఈ సమావేశాలలో కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి సర్కారు సిద్ధమవుతుంటే, ప్రజా సమస్యలపై నిలదీయడానికి ప్రతిపక్షం ఆయుధాలకు పదును పెట్టుకుంటోంది. కరోనా సెకండ్‌వేవ్‌ను ఎదుర్కోవడంలో, వ్యాక్సిన్ల విధానంలో పలు విమర్శలెదుర్కొన్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు తయారవుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరుకుల ధరలు, సెంచరీ మార్కు దాటేసిన పెట్రోల్ ధరలు, కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం, ప్రజారోగ్య సమస్యలు, అలాగే దేశ సరిహద్దు భద్రత అంశం- ఇలా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలు చాలా ఉన్నాయి. మరోపక్క అధికార పక్షం సైతం రకరకాల బిల్లులతో ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో సమావేశాలు వేడిగా, వాడిగా జరిగేలా ఉన్నాయి. కరోనా థర్డ్‌వేవ్ భయాల నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ తరువాత వచ్చిన తొలి సమావేశాలు ఇవే. అలా పలువురు కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించాక సభలో ప్రతిపక్షాలను తొలిసారి ఎదుర్కోవాల్సి వస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రాంతీయ పార్టీల చేతిలో బీజేపీ ఓటమి పాలయ్యాక జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలూ ఇవే. అలా వీటికి ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం తన అజెండాను ముందుకు తీసుకురావాలనీ, ప్రతిపక్షాలు తమ వాణిని వినిపించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనీ ప్రయత్నించే వేళ... మొత్తం 19 రోజులు పార్లమెంట్ సమావేశం కానుంది. నిజానికి, గత ఏడాది కరోనా మహమ్మారి దేశం మీద పడినప్పటి నుంచి పార్లమెంట్ సమావేశాలపై ఆ ప్రభావం గణనీయంగా పడింది. గత ఏడాది బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాల మొదలు ఈ ఏటి బడ్జెట్ సమావేశాల దాకా మూడింటినీ నిర్ణీత వ్యవధి కన్నా ముందుగానే ముగించాల్సి వచ్చింది. నిరుటి శీతకాల సమావేశాలనైతే ప్రజారోగ్య సంక్షోభం రీత్యా అసలు జరపనే లేదు. అయితే, టీకాలు అందుబాటులోకి రావడం, ఎంపీలు, పార్లమెంట్ ఉభయసభల సిబ్బందిలో ఎక్కువ మంది టీకాలు వేయించుకోవడంతో ఈ తాజా వానాకాల సమావేశాలు మునుపటి కన్నా కాస్తంత దీర్ఘంగానే జరగవచ్చు. పని కొంత ముందుకూ సాగవచ్చు. ఈసారి అనేక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఇప్పటికే 38 దాకా బిల్లులు, 5 ఆర్డినెన్స్‌లు పార్లమెంట్ ముందు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లుల్లో 17 కొత్తవి. వీటిని సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. దివాళా నియమావళిలో కొన్ని మార్పులు, డిపాజిట్ బీమా బిల్లు లాంటివి అనేకం వాటిలో ఉన్నాయి. 2008 నాటి ‘లిమిటెడ్ లయబులిటీ పార్టనర్షిప్’ (ఎల్ఎల్పీ) చట్టానికి కీలక సవరణను సైతం ప్రభుత్వం చేపట్టనుంది. విద్యుచ్ఛక్తి బిల్లు కూడా చర్చకు రానుంది. అయితే, క్రిప్టో కరెన్సీ - అధికారిక డిజిటల్ కరెన్సీకి సంబంధించిన మరో కీలక బిల్లు మాత్రం ఈ సమావేశాల్లో కూడా సభ ముందుకు రావడం లేదన్నది గమనార్హం. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలన్నిటినీ నిషేధించి, అధికారిక డిజిటల్ కరెన్సీ ఆరంభానికి సంబంధించిన విధివిధానాలను అందించడం ఆ బిల్లు లక్ష్యం. నిజానికి ఈ ఏటి బడ్జెట్ సమావేశాలకే ఆ బిల్లును లిస్టులో పెట్టారు. కరోనాతో సమావేశాలను కుదించడంతో అది రాకుండానే సమావేశాలు ముగిశాయి. ఆ బిల్లు పరిధినీ, పరిమితులనూ ప్రభుత్వం ఇంకా ఖరారు చేయాల్సి ఉండడంతో ఈసారీ అది ఆగినట్టు వార్త. ఇక, సెన్సార్ వివాదాల విషయంలో సినీవర్గం ఆశ్రయించే సెన్సార్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సహా అనేక ట్రిబ్యు నళ్ళను ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు కూడా ఈసారి సభలో రానుంది. తల్లితండ్రుల, వృద్ధుల జీవనభృతి - సంక్షేమానికి సంబంధించిన సవరణ కూడా సర్కారు సభ ముందుకు తేనుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా నాలుగు రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతం పుదు చ్చేరీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ తొలి సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రజల్లో పెరిగిన బలంతో, నైతికంగా రెట్టించిన ఉత్సాహంతో, ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబం ధించి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం, ఇప్పటికీ అమలు కాని రాష్ట్ర విభజన హామీల లాంటివి పార్లమెంటులో ప్రస్తావనకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. వాటికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం, సంజాయిషీ ఇస్తుందో చూడాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ఏ చట్టసభ సమావేశాలకైనా అర్థం, పరమార్థం. ప్రభుత్వం తాము చేపడుతున్న చర్యలను వివరించాల్సిందే. అదే సమయంలో క్షేత్రస్థాయిలోని లోటుపాట్లను ప్రతి పక్షాలు ఎత్తిచూపాల్సిందే. పరస్పరం సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ప్రజాకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా వట్టి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య విలువైన సభాసమయం వృథా అయితేనే సమస్య. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కేవలం పాలకపక్షం మెరుపులకూ, ప్రతిపక్షాల ఉరుములకే పరిమితం కాకుండా ప్రజాసమస్యల పరిష్కార వేదిక కావాలన్నదే ఆకాంక్ష. సభ అలా సాగితే, ప్రజాస్వామ్యంలో అంతకన్నా కావాల్సింది ఏముంది! -
కరోనా వ్యాక్సిన్ త్వరగా రావాలని కోరుకుంటున్నా: ప్రధాని మోదీ
-
ప్రణబ్ ముఖర్జీకి లోక్‌సభ నివాళులు
-
ప్రణబ్ ముఖర్జీకి లోక్‌సభ నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం లోక్ సభ సమావేశాలు ఆరంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాపం తెలిపింది. దేశానికి ప్రణబ్ సేవలను సభ కొనియాడింది. ఏ పదవిలో ఉన్నా ప్రణబ్ ముఖర్జీ ఆ పదవికి వన్నె తెచ్చారని స్పీకర్ ఓం బిర్లా ప్రశంసించారు. ఇటీవల మృతి చెందిన తమిళనాడు ఎంపీ వసంత్‌కుమార్, పండిత్ జస్రాజ్, అజిత్ జోగి, చేతన్ చౌహాన్ తదితరులకు సభ సంతాపం తెలిపింది. అలాగే కరోనాతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన కరోనా యోధులకు కూడా పార్లమెంట్ నివాళి అర్పిచింది. అనంతరం సభను గంటసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. అన్ని జాగ్రత్తలతో, కోవిడ్ –19 నిబంధనలను పూర్తిగా పాటిస్తూ, కొత్త విధి, విధానాలతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. కోవిడ్–19 నెగెటివ్ ఉన్నవారికే సభలోనికి అనుమతించడంతో పాటు, మాస్క్ కచ్చితంగా ధరించాలన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఉభయ సభలు తొలిసారి విడతలవారీగా సమావేశం కావడం ఈ సమావేశాల ప్రత్యేకత. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. ఇక విజృంభిస్తున్న కరోనా, కుదేలైన ఆర్థిక వ్యవస్థ, సరిహద్దుల్లో చైనా దుస్సాహసాలు.. తదితర వైఫల్యాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం సిద్ధమవుతోంది. చైనా ఆక్రమణలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు, ఆక్రమణలపై సభలో చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ ఎంపీలు అధిర్ రంజన్ చౌదరీ, కే సురేశ్‌లు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇక ఢిల్లీ అల్లర్ల సమయంలో పోలీసులు మావన హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన అంశంపై సీపీఎం, నీట్ నిర్వహణను వ్యతిరేకిస్తూ, అలాగే 12 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన అంశంపై చర్చ చేపట్టాలని డీఎంకే, సీపీఎం.. లోక్‌సభలో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. -
సమాచార హక్కుపై కేంద్రం దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో సమాచార హక్కు చట్టంలో సవరణలు తీసుకొచ్చే బిల్లును ప్రవేశ పెడుతుందన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. అయితే ఆ బిల్లులో ఏముంటుందన్న విషయం నిన్నటి వరకు వెల్లడి కాలేదు. ఈ చట్టంలోని సవరణ ప్రతిపాదనల గురించి కేంద్రం మంగళవారం పార్లమెంట్ సభ్యులకు ఓ సర్కులర్ జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్లతోపాటు, సమాచార కమిషనర్ల జీత భత్యాలను, వారి పదవీకాలాన్ని నిర్ణయించే అధికారం ఇక కేంద్రానికి దఖలు పడుతుందని అందులోని సారాంశం. తద్వారా కేంద్ర ప్రభుత్వం సమాచార కమిషనర్లందరిని తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తోంది. ఈ అధికారాలు కేంద్రానికి సిద్ధించినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సమాచార కమిషనర్లు భయపడాల్సి వస్తుందని, లేదంటే జీత, భత్యాల విషయంలో కోత పెట్టడం, పదవి నుంచి తొలగింపు లాంటి బెదిరింపులతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆర్టీఐ చట్టం ఆవశ్యకత గురించి విస్తృతంగా ప్రచారం చేసిన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ నిఖిల్ దేవ్ వ్యాఖ్యానించారు. ఇది చట్టాన్ని పూర్తిగా నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నమేనని ఆయన విమర్శించారు. ఈ సవరణల వల్ల ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్న సహకార సమాఖ్య వ్యవస్థ విధానం కూడా దెబ్బతింటుందని కామన్వెల్త్ మానవ హక్కుల కార్యకర్త వెంకటేశ్ నాయక్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన, ఇతర సమాచార కమిషనర్ల జీత భత్యాలను కేంద్రమే నిర్ణయిస్తుందంటే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హక్కులను కాలరాయడమే అవుతుందని ఆయన అన్నారు. కేంద్రం ఏ చట్టం, ఏ సవరణ బిల్లును తీసుకురావాలన్నా వాటిలోని ప్రతిపాదనలను ప్రజల ముందు విధిగా ఉంచాలని ‘ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టెన్సీ పాలసీ–2014’ నిర్దేశిస్తోంది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం బిల్లులోని ప్రతిపాదనలను ఎంపీలకు మాత్రమే సర్కులేట్ చేసింది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్ల జీత భత్యాలను చట్టమే నిర్దేశిస్తూ వచ్చింది. అందుకని వారు స్వతంత్య్రంగా వ్యవహరించేందుకు వీలు పడింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ వేతనం, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమానంగా ఉంటుందని, ఇతర సమాచార కమిషనర్ల వేతనం, ఇతర ఎన్నికల కమిషనర్లతో సమానంగా ఉంటుందని సమాచార చట్టం నిర్దేశిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనరల్ వేతనం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమానం, ఇతర రాష్ట్ర సమాచార కమిషనర్ల వేతనం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేతనంతో సమానంగా ఉంటుందని చట్టం చెబుతోంది. అలాగే పదవీ కాలాన్ని ఐదేళ్లు, పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లు నిర్దేశించింది. 2005 నాటి సమాచార హక్కు చట్టంలో సవరణ తీసుకరావడం ఇది రెండోసారని, దీని వల్ల చట్టం పూర్తిగా నీరుగారి పోతుందని ‘నేషనల్ కాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్’ సంస్థకు చెందిన అంజలి భరద్వాజ్ ఆరోపించారు. సమాచార చట్టం నుంచి రాజకీయ పార్టీలను మినహాయిస్తూ 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తొలిసారి సవరణ తీసుకొచ్చింది. ఆ సవరణ వల్ల రాజకీయ పార్టీలకు ఎక్కడి నుంచి నిధులు లేదా విరాళాలు వస్తున్నాయో, ఏ మొత్తంలో వస్తున్నాయో ప్రజలు తెలుసుకోవడానికి వీల్లేకుండా పోయింది. -
‘పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడండి’
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్టు టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత జితేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ తరఫున ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బడ్జెట్ సమావేశాలు పూర్తిగా జరగలేదని గుర్తు చేశారు. ఈ సమావేశాల్లోనైనా సమస్యలపై చర్చ జరిగేలా చూడాలని కేంద్రాన్ని కోరామన్నారు. తెలంగాణకు సంబంధించి బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్, ఐఐఎం వంటి సమస్యలపై సభలో చర్చ జరిగేలా చూడాలని కేంద్రానికి విన్నవించామన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సమస్యలు ఉన్నందున.. అన్ని పార్టీల నేతలు కలిసి సమావేశాలు సజావుగా సాగేలా చూడాల్సిన అవసరముందన్నారు. టీడీపీ రెండు విషయాల్లో టీఆర్ఎస్ మద్దతు కోరిందని వెల్లడించారు. రాష్ట్ర విభజన హామీలపై తాము వాయిదా తీర్మానం ఇస్తామన్నారు. అది చర్చకు వస్తే తాము కూడా తెలంగాణ అంశాలను లేవనెత్తుతామన్నారు. టీడీపీ అవిశ్వాస తీర్మానికి కూడా మద్దతు అడిగిందని.. దానిపై తమ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. -
పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్
-
జులై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల (జూలై) 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 18 రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటం, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం, అధికార బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో సభలు దద్దరిల్లే అవకాశముంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. గత సమావేశాలను స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. ఇటు లోక్‌సభలోనూ, అటు రాజ్యసభలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా, ఏపీకి విభజన హామీల అమలు విషయంలో ఉదాత్తమైన పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా కోసం హస్తిన వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేయడమే కాదు.. చివరకు వైఎస్సార్ సీపీ లోక్‌సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి.. ఆమోదింపచేసుకున్నారు. పదవులకు కన్నా ఏపీ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మరోసారి వైఎస్సార్ సీపీ ఎంపీలు చాటారు. -
మేడ్ ఇన్ చైనా.. తక్కువ ధర సీక్రెట్ ఇదేనట!
- పార్లమెంట్లో ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆసక్తికర సమాధానం న్యూఢిల్లీ: గడిచిన 15 ఏళ్లుగా ‘మేడ్ ఇన్ చైనా’ సరుకులు ప్రపంచాన్ని ముంచెత్తుతూనే ఉన్నాయి. ఆయా దేశాల పరిశ్రమలు కుదేలయ్యేలా అతి తక్కువ ధరలకే వస్తువులను అమ్ముకుంటోంది చైనా. భారత్‌లో సైతం పట్టణాలు, పల్లెలనే తేడాల్లేకుండా చైనా సరుకులు విస్తరించాయి. చైనా దూకుడు పట్ల సగటు భారతీయుడి సందేహం.. ‘ఈ వస్తువులను మనదగ్గరే తయారుచేసుకోలేమా?’ అని! సరిగ్గా ఇదే ప్రశ్నను పార్లమెంట్లో లేవనెత్తారు ఓ ఎంపీ. ‘ఇండియాలో తయారైన వస్తువుల కంటే మేడిన్ చైనా సరుకులు చీప్‌గా ఎలా దొరుకుతున్నాయి? వాటి వల్ల మన పరిశ్రమలు దెబ్బతింటున్నాయి కదా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ పటేల్.. ఆసక్తికర సమాధానాలను లిఖిత పూర్వకంగా ఇచ్చారు. ‘చైనా ప్రభుత్వం అక్కడి చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భారీ ఎత్తున సబ్సిడీలు అందిస్తోంది. తద్వారా సరుకుల ఉత్పత్తి సునాయాసంగా, వేగవంతంగా జరుగుతోంది. అందువల్లే ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రపంచమార్కెట్లోకి తక్కువ ధరకే అమ్ముకోగలుగుతున్నాయి’ అని చైనీస్ గూడ్స్ లోకాస్ట్ సీక్రెట్‌ను వెల్లడించారు మంత్రి హరిభాయ్. చిన్న, మధ్యతరహా ఉత్పత్తి సంస్థల మనుగడ.. ప్రధానంగా వాటి సంఖ్యపై ఆధారపడి ఉంటుందన్న మంత్రి.. సమయానుకూలంగా ప్రభుత్వం అందించే రుణాలు, టెక్నాలజీ స్థాయిని పెంచుకోవడం, మార్కెటింగ్ సదుపాయాలు, నాణ్యత తదితర అంశాలు కూడా ఉత్పత్తి సంస్థలను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. దేశవాళీ సంస్థల మధ్య నెలకొన్న పోటీ, బహుళజాతి సంస్థలు బహుగా విస్తరించడం లాంటివి చిన్న,మధ్యతరహా పరిశ్రలకు ప్రతికూలాంశాలుగా మారాయని మంత్రి హరిభాయ్ అభిప్రాయపడ్డారు. -
తెలుగు ప్రముఖులకు పార్లమెంట్ సంతాపం
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన సభ్యులు, మాజీ సభ్యులకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. తర్వాత రెండు సభలు రేపటికి వాయిదా పడ్డాయి. తెలుగు ప్రముఖులు దాసరి నారాయణరావు, పాల్వాయ్ గోవర్థన్ రెడ్డి, డాక్టర్ సి. నారాయణరెడ్డి మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడింది. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర్నాథ్ యాత్రికుల మృతికి పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. బీజేపీ నేత వినోద్ ఖన్నా మృతికి లోక్‌సభ సంతాపం తెలిపింది. లోక్‌సభలో ఎంపీగా ఫరూఖ్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన శ్రీనగర్ ఉప ఎన్నికలో ఆయన ఎంపీగా గెలుపొందారు. వర్షాకాల సమావేశాలు విజయవంతంగా జరిగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందు విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీల ఎంపీలు చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. జీఎస్టీ స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. -
పార్లమెంటు సమావేశాలు అదుర్స్!
చట్టసభలపై గౌరవం నానాటికీ తగ్గిపోతున్న ఈ రోజుల్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నూటికి నూరుశాతం జరిగాయి! లోక్‌సభ నిర్దేశిత సమయం కంటే ఎక్కువగా.. 110.84% పనిచేయగా, రాజ్యసభ మాత్రం కొద్ది తక్కువగా 99.54% పనిచేసింది. ఈ లెక్కలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశాల్లో మొత్తం 15 బిల్లులను ప్రవేశపెట్టారు. వాటిలో లోక్‌సభ మొత్తం 15 బిల్లులను ఆమోదించగా, రాజ్యసభ మాత్రం 14 బిల్లులను ఆమోదించింది. వాటిలో జీఎస్టీ అమలు కోసం తలపెట్టిన రాజ్యాంగ సవరణ కూడా ఒకటి ఉంది. లోక్‌పాల్, లోకాయుక్త సవరణ బిల్లు లాంటి వాటిని ప్రవేశపెట్టినరోజే ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేసినా కూడా సభా సమయాన్ని మాత్రం వృథా చేయలేదు. వీళ్లు నిరసన తెలుపుతున్నా సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. వర్షాకాల సమావేశాలు మొత్తం 20 రోజుల పాటు ఉండగా వాటిలో లోక్‌సభ 11 రోజులు, రాజ్యసభ 14 రోజులు నిర్దేశిత సమయం కంటే తక్కువ సేపు పనిచేశాయి. మిగిలిన రోజుల్లో అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం పనిచేశాయి. దాంతో మొత్తం నూరుశాతం పనిచేసినట్లయింది. ద్రవ్యోల్బణం, దళితులపై దాడుల్లాంటి అంశాల గురించిన చర్చకు లోక్‌సభ 40 శాతం, రాజ్యసభ 52 శాతం సమయాన్ని కేటాయించాయి. కశ్మీర్ అంశం గురించి ఉభయ సభల్లో కలిపి 16 గంటల పాటు చర్చించారు. -
పార్లమెంట్‌ను స్తంభింపచేస్తాం
హైకోర్టు విభజనపై కేటీఆర్ - పునాదులు కదులుతాయనే ప్రాజెక్టుల అడ్డగింపు - శిఖండి రాజకీయాలు మాని అభివృద్ధికి సహకరించాలి ముస్తాబాద్ : హైకోర్టు విభజన జరిగే వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను స్తంభింపచేస్తామని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ సత్తా చూపుతామన్నారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు హైకోర్టు విభజన సీఎం చేతిలోనే ఉందన్నట్లు మాట్లాడుతున్నారని, విభజన అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే రెండు మూడు రోజుల్లోనే విభజన పూర్తయ్యేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ హైకోర్టు విభజన అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. కేంద్రం ఇంకా జాప్యం చేయకుండా హైకోర్టు విభజన చేస్తారో లేదో స్పష్టం చేయాలన్నారు. భూ నిర్వాసితులకు జీవో 123 ద్వారా పరిహారం ఇస్తామంటే కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకుంటున్నాయన్నారు. నిర్వాసితుల బాధలు తెలిసిన కేసీఆర్ రైతులకు న్యాయం చేస్తానంటే ప్రతిపక్షాలు శిఖండి రాజకీయాలు చేస్తున్నాయని, రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దత్తత గ్రామం చీకోడుకు వరాలు మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ముస్తాబాద్ మండలం చీకోడులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి పలు వరాలు ప్రకటించారు. ఇప్పటికే రూ.6.50 కోట్లతో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, భవనాలు, బీటీ రోడ్డు నిర్మించడం జరిగిందన్నారు. లక్ష లీటర్ల సామర్థ్యం గల మంచినీటి పథకం, మోడల్‌స్కూల్ బిల్డింగ్, ప్రహరీ, కులసంఘాలకు కమ్యూనిటీ భవనాలు, అర్బన్ ఫీడర్ కరెంట్, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా మారిన మెతుకు లావణ్య అనే బాలిక మంత్రికి తన గోడు వినిపించగా, ఆమెను అన్ని విధాలా ఆదుకుంటామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరుతోపాటు జీవనానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి, చీకొడు గ్రామాల్లో హరితహారంలో భాగంగా బుధవారం మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామని కేటీఆర్ తెలిపారు. -
18 నుంచి పార్లమెంట్ భేటీ!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై మూడో వారంలో ప్రారంభమై ఆగస్ట్ మధ్య వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు ఈ నెల 29న భేటీ కానుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం జూలై 18న వర్షాకాల సమావేశాలు ప్రారంభమై.. ఆగస్ట్ 13 వరకూ కొనసాగనున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -
ఈ వారమూ ఇంతేనా!?
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చివరి వారం కూడా పరిస్థితిలో మార్పు వచ్చే సంకేతాలేవీ కనిపించటం లేదు. లలిత్‌గేట్, వ్యాపమ్ అంశాలకు సంబంధించి ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు వర్షాకాల సమావేశాల ఆరంభం నుంచీ చేస్తున్న ఆందోళన మిగిలిన 4 రోజులు సైతం కొనసాగేట్లే కనిపిస్తున్నది. బీజేపీ నిందారాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తే.. కాంగ్రెస్ విధ్వంసక విపక్షంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. గతవారం 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయటంతో ఇరుపక్షాల మధ్య ఉద్వేగాల స్థాయి మరింత పెరిగింది. ఎప్పుడూ సాత్వికంగా కనిపించే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మునుపెన్నడూ లేనివిధంగా ఆగ్రహంతో కాంగ్రెస్ నేతలతో కలిసి పార్లమెంట్ ఆవరణలో నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ గడువు ముగియటంతో సోమవారం కాంగ్రెస్ సభ్యులంతా లోక్‌సభకు హాజరవుతారు. అయితే సభ కొనసాగటం మాత్రం అనుమానమే. కనీసం ఈ నాలుగురోజులైనా సభను సజావుగా సాగనివ్వాలని మంత్రి వెంకయ్యనాయుడు ఆదివారం చెన్నైలో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన బాధ్యత తెలుసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ కార్యకలాపాలను తిరిగి సజావుగా నడపడానికి కాంగ్రెస్ పార్టీ అర్థవంతమైన సూచనలు ఇస్తే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ముఖ్యమైన ఎనిమిది బిల్లులు పార్లమెంట్లో పాస్ అయ్యేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ‘రాజకీయంగా దివాలా తీసిన కాంగ్రెస్’ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అభివృద్ధి నిరోధక పాత్ర పోషించిన కాంగ్రెస్ రాజకీయంగా దివాలా తీసిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ సంకుచిత రాజకీయ ఆలోచనలకు పార్లమెంటును వేదికగా చేసుకుందని ఆదివారం తన బ్లాగులో మండిపడ్డారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాస్తవాలకు ఆమడ దూరంలో ఉన్నారని విమర్శించారు. నిరాధార అంశాలపై పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ అడ్డుకోవడం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధమని నఖ్వీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ సంస్కరణల ప్రయత్నాలను అడ్డుకుంటూ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. -
'సుష్మా దేశ సంపద'
న్యూఢిల్లీ: లలిత్ గేట్, వ్యాపం కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీ నేతలను బీజేపీ మంత్రి వెంకయ్యనాయుడు మరోసారి వెనకేసుకొచ్చారు. సుష్మా స్వరాజ్ దేశానికే సంపదలాంటివారన్న ఆయన.. వసుంధరరాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ లను అద్భుతమైన పెర్మార్మర్లుగా అభివర్ణించారు. వరుస ఆందోళనలతో సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న విపక్ష కాంగ్రెస్ పార్టీ తీరు గర్హనీయమన్న వెంకయ్య.. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ సాధించలేని విజయాలను మోదీ సర్కార్ ఏడాదిలో సాధించి చూపిందని, బీజేపీ విజయాలతో కాంగ్రెస్ పార్టీకి దడ పుడుతున్నదని, అందుకే తమను అడ్డుకుటుంటున్నారని మండిపడ్డారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన సభలోకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. సరైన అంశంపై కాలపరిమితిలేని చర్చకు సిద్ధంగా ఉన్నాం. కానీ అహేతుక చర్చలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం' అని వెంకయ్య చెప్పారు. -
'పాక్, బంగ్లా మైనారిటీలకు భారత పౌరసత్వం'
న్యూఢిల్లీ: స్వదేశంలో మైనారిటీలుగా ఉంటూ.. మతపరమైన హింసను ఎదుర్కోలేక భారత్‌కు శరణార్థులుగా వచ్చినవారందరికీ పౌరసత్వం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ల నుంచి ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించినవారికి లాంగ్‌టర్మ్ వీసా లేదా పౌరసత్వం ఇస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ రిజిజు మంగళవారం లోక్‌సభలో చెప్పారు. స్వదేశంలో అక్కడి ప్రభుత్వ నిర్బంధాన్ని తాళలేక భారత్‌కు వచ్చిన వారిలో బాంగ్లాదేశీలే అధికం. ఆ తరువాతి స్థానంలో పాకిస్థానీలు ఉన్నారు. మతద్వేషం ఎదుర్కోలేక ఇక్కడికి వచ్చిన వారిని ఆదుకోవడం కనీస ధర్మంగా భావిస్తున్నామని, అలాంటి శరణార్థులకు పౌరసత్వం జారీ చేసేందుకు సులువైన విధివిధానాలు రూపొందించామని రిజిజు చెప్పారు. -
‘హిందూ ఉగ్రవాదం’ నీరుగార్చింది
ఉగ్రవాదంతో పోరుపై యూపీఏ సర్కారును దుయ్యబట్టిన రాజ్‌నాథ్ * లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్ గొడవ న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం సృష్టించిన ‘హిందూ ఉగ్రవాదం’ పదం ఉగ్రవాదంపై పోరును బలహీనపరచిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మండిపడ్డారు. ఉగ్రవాద దాడులపై దర్యాప్తు దిశను పక్కదారి పట్టించేందుకు ఈ పదాన్ని తెచ్చారన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ ఉగ్రవాద దాడిపై ఆయన శుక్రవారం లోక్‌సభలో ప్రకటన చేస్తూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఆయన ఈ అంశంపై రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ కూడా ఎదురుదాడి చేసింది. లలిత్ మోదీ, వ్యాపం అంశాలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అడ్డుకుంటూ వస్తున్న కాంగ్రెస్ సభ్యులు గురుదాస్‌పూర్ ఘటనపై హోంమంత్రి ప్రకటన సందర్భంగాఆందోళనను పక్కనపెట్టి సీట్లలో కూర్చున్నారు. గురుదాస్‌పూర్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారని రాజ్‌నాథ్ తెలిపారు. ఆయన ప్రకటన తర్వాత కాంగ్రెస్ సభ్యలు తిరిగి సభాపతి స్థానం వద్దకు దూసుకుపోయి సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. సమావేశాలను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడాన్ని దష్టిలో ఉంచుకుని రాజ్‌నాథ్ తన ప్రకటనలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1962 నాటి చైనా యుద్ధం, తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం సహా పలు విషయాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఉటంకించారు. ‘‘ఉగ్రవాదం దేశానికి అతి పెద్ద సవాలుగా మారింది. దీనిని ఎదుర్కొనే విషయంలో పార్లమెంటులోకానీ, దేశంలోకానీ ఏ విధమైన విభేదాలు తగవు. ఒకవైపు మన జవాన్లు ఉగ్రవాదంపై పోరులో తమ ప్రాణాలను సైతం అర్పిస్తుంటే.. మరోవైపు సభ్యులు సభలో గలాటాను సృష్టిస్తున్నారు.. అడ్డుకుంటున్నారు. దీనిని దేశం ఎలా ఆమోదిస్తుంది?’’ అని అన్నారు. సరైన రీతిలో నోటీసిస్తే ఈ అంశంపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధమన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాజ్‌నాథ్ వారిపై విరుచుకుపడుతూ.. 2013లో అప్పటి హోంమంత్రి(పి.చిదంబరం) ఉగ్రవాద ఘటనలపై దర్యాప్తు దిశను పక్కకు మళ్లించేందుకోసం ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాన్ని సృష్టించారని, ఇది ఉగ్రవాదంపై మన పోరును బలహీనపరచిందని అన్నారు. దీనిపై పాక్‌కు చెందిన హఫీజ్ సయీద్ (లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు) అప్పటి హోంమంత్రిని ప్రశంసించారని గుర్తుచేశారు. అటువంటి అవమానకర పరిస్థితిని తమ ప్రభుత్వం మళ్లీ తలెత్తనివ్వబోదన్నారు. ఉగ్రవాదానికి కులం లేదా మతం ఉండదంటూ.. ఉగ్రవాదం వల్ల తలెత్తుతున్న తీవ్ర పరిణామాలపై మనమంతా తప్పక చర్చించాలన్నారు. రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు మాట్లాడేందుకు యత్నించగా.. స్పీకర్ అనుమతించలేదు. మధ్యాహ్నం సభ తిరిగి మొదలయ్యాక.. రాజ్‌నాథ్ రాజకీయాలకు పాల్పడుతూ పార్లమెంటును విభజిస్తున్నారని ఖర్గే(కాంగ్రెస్) ఆరోపించారు. మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అందుకు డిప్యూటీ స్పీకర్ తంబిదురై అంగీకరించలేదు. -
ఆ బాధ్యత అందరిదీ: మోదీ
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అయితే ఈ బాధ్యతను అన్ని పార్టీలు పంచుకోవాల్సిన అవరసముందని అభిప్రాయపడ్డారు. భూసేకరణ బిల్లుపై చర్చించేందుకు సోమవారం ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, అన్ని అంశాలపై చర్చించేందుకు వీటిని ఉపయోగించుకోవాలన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. -
ఎంపీలతో భేటీకానున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశంకానున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ ఎంపీలతో చర్చించనున్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు కోట్లు కేసు పార్లమెంట్లో చర్చకు రానుంది. -
పార్లమెంటును సాగనివ్వండి: వెంకయ్య
మధురై: పార్లమెంటును స్తంభింపజేయవద్దని, ముఖ్యబిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం విపక్షాలకు విజ్ఞప్తి చేసింది. ఏ అంశంపై చర్చకైనా తాము సిద్ధమని ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో చర్చలు, సంప్రదింపులే సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విరుధునగర్‌లో కె.కామరాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళుతూ బుధవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడా రు. ఏ చర్చకైనా తాము సిద్ధమని, అందువల్ల ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేసే ప్రయత్నాలు చేయవద్దని వెంకయ్య కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
బీజేపీకి కాంగ్రెస్ ఆసక్తికర ఆఫర్!
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్'లో చిక్కుకున్న మోదీ సర్కారుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆసక్తికరమైన 'ఆఫర్' ప్రకటించింది. 'సుష్మా స్వరాజ్, వసుంధర రాజెలపై వేటు వేయండి. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదించుకోండి' అంటూ కాంగ్రెస్ ప్రతిపాదించింది. లలిత్ మోదీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజెలను పదవుల నుంచి తొలగిస్తే పార్లమెంట్ లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందేందుకు సహకరిస్తామని 'హస్తం' పార్టీ ఆఫర్ ఇచ్చింది. ఈనెల 21 నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ ఉన్న వర్గాలు ఈ ఆఫర్ ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఫలితంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా 'లలిత్ గేట్'లో కొట్టుకుపోయే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నేటి నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటీవలి కాలంలో పార్లమెంటు సమావేశాలన్నీ పలు అంశాలపై ఆందోళనలు, గందరగోళాల మధ్య ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో ఈసారైనా సజావుగా సాగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అత్యంత కీలకమైన ఆహార భద్రత బిల్లుకు ఆమోదం వంటి అంశాలతో భారీ ఎజెండా సమావేశాలు ముందుండగా.. ఆంధ్రప్రదేశ్ విభజనపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగే అవకాశం ఉభయసభలపైనా ప్రభావం చూపనుంది. రాష్ట్ర విభజనకు నిరసనగా ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వారి రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు. తెలంగాణ అంశంతో పాటు.. కొన్ని ఇతర రాష్ట్రాల్లో తీవ్రమవుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల ప్రభావం కూడా ఈ సమావేశాలపై పడనుంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి, ఆమోదించాలని పట్టుపట్టటం ద్వారా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న తీరును, ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో ఈ నిర్ణయం రాజేసిన ఆగ్రహజ్వాలలను ఉభయ సభల్లో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని భావిస్తోంది. తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తీరుపై సమగ్ర చర్చతో పాటు.. ఇకపై దేశంలో మరే రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమనే విస్పష్ట ప్రకటన కోసం పశ్చిమబెంగాల్లో గూర్ఖాలాండ్ ఉద్యమ సెగను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పట్టుబట్టబోతోంది. అలాగే త్వరలో ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడివేడిగా సాగుతాయని భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు సక్రమంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రతిపక్షానికి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ విజ్ఞప్తిచేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపైనా చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయినప్పటికీ బొగ్గు కుంభకోణం, రైల్ గేట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అన్ని రంగాల్లో ద్వారాలు తెరవడం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రతిపక్షాల నుంచి సర్కారుపై ముప్పేట దాడి తప్పకపోవచ్చు. ఎఫ్‌డీఐ పెంపును వ్యతిరేకిస్తున్న బీజేపీ... బీమా, పెన్షన్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన కీలకమైన సంస్కరణల బిల్లులపై సహకరించాలని ప్రతిపక్ష బీజేపీకి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం శనివారం నాడే విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్న ఆర్థిక బిల్లులపై బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, యశ్వంత్‌సిన్హాలతో చిదంబరం చర్చలు జరిపారు. సాధారణ, ఆర్థిక కార్యక్రమాలపై తమ పార్టీ మద్దతు ఇస్తుందని.. అయితే బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందని వారు సంకేతాలిచ్చారు. పెన్షన్ రంగంలోనూ ఎఫ్‌డీఐని పెంచే ప్రతిపాదనను కూడా బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఆహార భద్రత బిల్లుకు సూత్రప్రాయంగా అనుకూలమే అయినా తాము ప్రతిపాదించిన అనేక సవరణలను ఆమోదిస్తేనే సహకరిస్తామని ఆదివారం ఢిల్లీలో సమావేశమైన బీజేపీ వ్యూహకర్తల బృందం స్పష్టం చేసింది. రూపాయి విలువ పతనం, ధరల పెరుగుదల, ఆర్ధికాభివృద్ధి మందగించటం నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై చర్చ జరపాలని సుష్మా డిమాండ్ చేశారు. ఇందుకు సర్కారు సమ్మతించింది.