న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు. ఈ సందర్భంగా ‘‘వర్షాకాల సమావేశాలు సక్రమంగా సాగేందుకు నాకు సహకరించండి. అదే నాకు వీడ్కోలు బహుమానం’’ అని రాజ్యసభ సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు.
ఆదివారం ఆయన తన నివాసంలో జరిపిన అఖిలపక్ష భేటీలో 41 మంది నాయకులు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్యకివే చివరి సమావేశాలు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ధన్‌ఖడ్‌కు వెంకయ్య విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం హాజరయ్యారు.
ఇదీ చూదవండి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులన్నింటిపై చర్చ!
Comments
Please login to add a commentAdd a comment