venkaiah naidu comments
-
మీ సహకారమే నాకు ఫేర్వెల్ గిఫ్ట్: వెంకయ్య
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు. ఈ సందర్భంగా ‘‘వర్షాకాల సమావేశాలు సక్రమంగా సాగేందుకు నాకు సహకరించండి. అదే నాకు వీడ్కోలు బహుమానం’’ అని రాజ్యసభ సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో జరిపిన అఖిలపక్ష భేటీలో 41 మంది నాయకులు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రాజ్యసభ చైర్మన్గా వెంకయ్యకివే చివరి సమావేశాలు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ధన్ఖడ్కు వెంకయ్య విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం హాజరయ్యారు. ఇదీ చూదవండి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులన్నింటిపై చర్చ! -
'సీఎంను అవమానించేలా వెంకయ్య వ్యాఖ్యలు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాను లేకపోతే దిక్కులేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. వెంకయ్య వ్యాఖ్యలు ప్రజలను నిరాశపరిచేలా, ముఖ్యమంత్రిని అవమానించేలా ఉన్నాయని అన్నారు. విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసేందుకే చంద్రబాబు భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాని రఘువీరా డిమాండ్ చేశారు.