venkaia naidu
-
మీ సహకారమే నాకు ఫేర్వెల్ గిఫ్ట్: వెంకయ్య
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు. ఈ సందర్భంగా ‘‘వర్షాకాల సమావేశాలు సక్రమంగా సాగేందుకు నాకు సహకరించండి. అదే నాకు వీడ్కోలు బహుమానం’’ అని రాజ్యసభ సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో జరిపిన అఖిలపక్ష భేటీలో 41 మంది నాయకులు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్యకివే చివరి సమావేశాలు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ధన్‌ఖడ్‌కు వెంకయ్య విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం హాజరయ్యారు. ఇదీ చూదవండి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులన్నింటిపై చర్చ! -
అమెరికా వ్యాప్తంగా ప్రారంభమైన మనబడి తరగతులు
ప్రపంచంలోని 12 దేశాల్లో ముఖ్యంగా అమెరికాలోని 35 రాష్ట్రాల్లోని 260కి పైగా కేంద్రాలలో తెలుగు భాషను ప్రవాసాంధ్రుల పిల్లలకు నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి కొత్త విద్యా సంవత్సరానికి గాను తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో 10,000 మందికి పైగా విద్యార్ధులు నమోదు చేసుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో మనబడి నూతన విద్యా సంవత్సరం చికాగోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సిలికానాంధ్ర మనబడి, మన గుడి అన్నారు. మనబడి ద్వారా పిల్లలకు తెలుగు నేర్పించడం గొప్ప కార్యక్రమమని, అందులోనూ ముఖ్యంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, ప్రతిష్టాత్మక వాస్క్ ఎక్రిడిటేషన్, పలు స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపులాంటి అనేక విజయాలు సొంతం చేసుకున్న ఏకైక తెలుగు విద్యావిధానం సిలికానాంధ్ర మనబడి అని మనబడి డీన్ (అధ్యక్షులు) రాజు చమర్తి అన్నారు. ఇక్కడ తెలుగు నేర్చుకున్న పిల్లలు వారి వారి రంగాలలో ఎంతో ఉన్నత స్థాయిల్లో ఉన్నారని, 11 సంవత్సరాలుగా మనబడి ద్వారా 45000 మందికి పైగా పిల్లలకు తెలుగు నేర్పించామని తెలిపారు. అమెరికా వ్యాప్తంగా 260కి పైగా ప్రాంతాలలో ప్రారంభమైన మనబడిలో తెలుగు మాట్లాట, బాలానందం, తెలుగుకుపరుగు, పద్యనాటకం, తెలుగు పద్యం, నాటకోత్సవాలు, పిల్లల పండుగలు వంటి ఎన్నో కార్యక్రమాలతో విద్యార్ధులకు తెలుగు భాషతో పాటు మన కళలు సంప్రదాయాలు కూడా తెలియజేస్తున్నామని శరత్ వేట తెలిపారు. సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరంలో ప్రవేశం కావాలనుకున్న వారు వెంటనే manabadi.siliconandhra.org ద్వారా ఈ నెల 21 వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని లేదా 1-844-626-2234 కు కాల్ చేయవచ్చని మనబడి ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు. మనబడి విజయాలకు కారణమైన విద్యార్ధులు, తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లాస్ ఏంజిలస్‌లో డాంజి తోటపల్లి, న్యూజెర్సీ లో శరత్ వేట, డల్లాస్‌లో భాస్కర్ రాయవరం, సిలికాన్ వ్యాలీలో దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, స్నేహ వేదుల, రత్నమాల వంక, లక్ష్మి యనమండ్ల, జయంతి కోట్ని, శ్రీరాం కోట్ని , చికాగోలో సుజాత అప్పలనేని, వెంకట్ గంగవరపు, వర్జీనియా నుండి శ్రీనివాస్ చివలూరి, మాధురి దాసరి, గౌడ్ రామాపురం, నార్త్ కెరొలిన అమర్ సొలస, అట్లాంటా విజయ్ రావిళ్ళ తదితరుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల మనబడి ఉపాధ్యాయులు, సమన్వయకర్తల సహకారంతో మనబడి నూతన విద్యా సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి. -
మహాత్ముడి ఆలోచనలే స్ఫూర్తి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోని కోట్ల మందికి మహాత్ముడి ఆలోచనలు స్ఫూర్తి మంత్రమని ప్రధాని నరేంద్రమొదీ స్పష్టం చేశారు. జాతిపిత మహాత్మ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మహాత్ముడికి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ, ఇతర సందర్భాల్లో మహాత్ముడి సందేశాలను కూర్చి.. రూపొందించిన ఒక వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. -
సభ్యులతో మమేకంకండి
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నెల్లూరు(అగ్రికల్చర్): మహాసంపర్క అభియాన్ ద్వారా బీజేపీ సభ్యులతో మమేకం కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆ పార్టీ నాయకులకు సూచించారు. నెల్లూరు భక్తవత్సలనగర్‌లో శనివారం ఆ పార్టీ నిర్వహించిన మహాసంపర్క అభియాన్‌లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. దేశాన్ని 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని విస్మరించిందని, అవినీతి, అక్రమాలతో అగ్రభాగాన నిలి చిందన్నారు. గత ఎన్డీఏ హయాంలో 8.6 శాతంగా ఉన్న జీడీపీని 4 శాతానికి తీసుకొచ్చిందన్నారు. మోడీ ప్రధానిగా జీడీపీ రేటును 7.3 శాతం పెంచడంలోనే తమ విజయం దాగిఉందన్నారు. ప్రపంచంలోనే ఏ పార్టీకి లేని విధంగా తమకు దేశంలో 11 కోట్ల మంది సభ్యులు ఉన్నారన్నారు. కేంద్రం ప్రకటించిన 500 అమృత పట్టణాల్లో నెల్లూరు, కావలికి చోటు కల్పించామన్నారు. నాలుగులైన్ల హైవేని ఆరులైన్లుగా, నెల్లూరు చెరువును ట్యాంక్‌బండ్ నిర్మాణం, సోమశిల ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు, నడికుడి రైల్వేలైను నిర్మాణం, పక్కాగృహాల నిర్మాణాలకు తోడ్పటునందజేస్తామని హామీ ఇచ్చారు. యోగాకు ప్రపంచవ్యాపితంగా గుర్తింపు తెచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, నగర అధ్యక్షులు మండ్ల ఈశ్వరయ్య, దువ్వూరు రాధాక్రిష్ణారెడ్డి, కందుకూరి సత్యనారాయణ, వడ్డే శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కోలాహలంగా ‘అక్షర’ వార్షికోత్సవం
వెంకటాచలం : మండలంలోని సరస్వతీనగర్‌లో ఉన్న అక్షర విద్యాలయం వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం కోలాహలంగా జరిగాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ, విద్యార్థులతో దేశభక్తిని చాటే నృత ప్రదర్శనలు చేయించారు. మల్లి మస్తాన్‌బాబు మృతి కి సంతాపంగా రెండు నిమిషాలు మౌ నం పాటించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలకు మన భారతదేశం నెలవు అని, అన్నీ దేశాలు మన సంప్రదాయాలను గౌరవిస్తున్నాయన్నారు. విద్యకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మన దేశాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రదేశాల సరసన నిలబెడుతారన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు అక్షర విద్యాలయం సంస్కృతి, సంప్రదాయాలకు నెలవుగా అభివర్ణించారు. చిన్నతనం నుంచి విద్యార్థులకు దేశ భక్తిని పెంపొదిస్తున్న అక్షర విద్యాలయం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శ్రీసిటీ అధినేత రవిసన్నారెడ్డి , బీజేపీ నేత నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, స్వర్ణభారత్ట్రస్టీ అట్లూరి అశోక్, ఐ.దీపావెంకట్, ఐ.వెంకట్, ప్రిన్సిపల్ కుముద పలువురు బీజేపీ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా జలరవాణా పనులు
ప్రతిష్టాత్మకంగా జలరవాణా పనులు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో చేపట్టే అంతర్గత జలరవాణా పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సకాలంలో పూర్తిచేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. జాతీయ జలరవాణా సంస్థ చేపట్టే కాల్వల ఆధునీకరణ పనులు వేగంగా జరిగేందుకు ఎంపీలు, అధికారులు సహకరించాలని కోరారు. కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు చేపట్టే జలరవాణా పనులపై కేంద్ర అంతర్గత జలరవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కాకినాడ-పుదుచ్చేరి మధ్య బకింగ్‌హాం కాలువ ద్వారా జలరవాణాను అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించిందని చెప్పారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ సహాయమంత్రి పొన్ను రాధాకృష్ణ మాట్లాడుతూ గడువులోగా ఈ జలమార్గం పనులను పూర్తి చేస్తామన్నారు. తోటలు తగులబెట్టిన వారిని ఉరితీయాలి: కొత్త రాజధాని ప్రాంతంలో తోటలను తగులబెట్టడం దారుణమని, అలాంటి వారిని ఉరి తీయాలని కేంద్రమంత్రి వెంకయ్య వ్యాఖ్యానించారు.ఆదివారం నగరంలో హడ్కో ప్రాం తీయ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. విభజన హామీల గురించి కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తనను రాజీనామా చేయమంటున్నారని మండిపడ్డారు. అలాంటి చిల్లర వ్యక్తుల విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. -
జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కేంద్రమంత్రిగా జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖా మంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి అయిన తరువాత తొలిసారిగా నెల్లూరుకు వచ్చిన ఆయన్ను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి నారాయణ కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారని, ఆయనకు తన పూర్తి సహకారాన్ని అందజేస్తానని తెలిపారు. గతంలో ఆచరణకు నోచు కోని పథకాలను పూర్తి చేయడానికి తన వంతు సహకారం అందజేస్తానని తెలిపారు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల రెండు పార్టీలు లాభం పొందాయని తెలిపారు. అయితే నెల్లూరు ప్రజలే తమకు న్యాయం చేయలేదన్నారు. ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ-బీజేపీకి రాలేదని తెలిపారు. తిరుపతి, నెల్లూరు ఎంపీ స్థానాలు బీజేపీకి దక్కకపోవడం బాధాకరమన్నారు. అయితే ఆ ఎంపీలు కూడా సమర్థులేనని తెలిపారు నెల్లూరును అభివృద్ధి చేయడానికి తన సంపూర్ణ సహకారం అందజేస్తానని తెలిపారు. జిల్లాలోని సమస్యలపై కలెక్టరును వివరాలు అడిగానని, నివేదిక అందిన వెంటనే ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తానని తెలిపారు. సమస్యలెదురైనా పోలవరం ఆర్డినెన్స్ తెచ్చాం కేంద్ర ప్రభుత్వం స్థాయిలో రాష్ట్రానికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామని, ఇందులో భాగంగానే సమస్యలు ఎదురైనా పోలవరం ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో తీసుకొచ్చామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. విభజనకు కట్టుబడ్డా, విభజన తీరును వ్యతిరేకించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని విభజించిందని తెలిపారు. ఇందులో భాగంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని చెప్పారు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ సభ్యులు దేశ సమస్యలు అనేకం ఉన్నా, వాటిని చర్చించ కుండా పాలస్తీనాపై చర్చించమని గొడవకు దిగడం సమంజసం కాదన్నారు. రైలు చార్జీలను పెంచకుండా అభివృద్ధి అసాధ్యమన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రైలు ప్రాజెక్టులు విలువ ఐదు లక్షల కోట్ల రూపాయలని తెలిపారు. అంత ఆదాయం రైల్వేలో లేనందున రైలు చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రానికి ఇంకా అనేక విద్యా సంస్థలు, రాష్ట్రం కోరిన ప్రాజెక్టులు తెప్పిస్తామని చెప్పారు. అన్ని అంశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అవసరం ఉందన్నారు. అభివృద్ధి విషయంలో టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలు ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. ఘనసన్మానం: నెల్లూరు (దర్గామిట్ట): కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన మువ్పవరపు వెంకయ్యనాయుడుకు సింహపురి ప్రజలు ఘనంగా సన్మానించారు. అనిల్ గార్డెన్స్‌లో శుక్రవారం రాత్రి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి మాణిక్యరావు, వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మాత్యులు నారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వెంకయ్యనాయుడు సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. తనకు ఇద్దరు గురువులున్నారని, మొదటి గురువు చంద్రబాబు అయితే రెండో గురువు వెంకయ్యనాయుడని చెప్పారు. కేంద్రంలో వెంకయ్యనాయుడుకు, రాష్ట్రంలో తనకు ఒకే శాఖ రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన సహకారంతో నెల్లూరును పూర్తిగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషిచేస్తానన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ వెంకయ్యనాయుడు వల్లే ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా 900 వైద్య సీట్లు వచ్చాయని కొనియాడారు. వెంకయ్యనాయుడు సింహపురి ముద్దు బిడ్డ కాదని, తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డగా ఎదిగారన్నారు. ఆయన స్నేహితుడుగా తాను గర్వపడుతున్నాని తెలిపారు. మంత్రి మాణిక్యరావు మాట్లాడుతూ అధికారంతో సంబంధం లేకుండా నమ్మిన సిద్దాంతంతో పనిచేసే తత్వం వెంకయ్యనాయుడుకు ఉందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేష్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి భానుప్రకాష్, మాజీ ఎమ్మెల్యేలు కృష్ణయ్య, దారా సాంబయ్య, ఎప్సీఐ మాజీ డెరైక్టర్ రాధాకృష్ణారెడ్డి, బీజీపీ నేతలు కందుకూరి సత్యనారాయణ, కప్పిర శ్రీనివాసులు, ఆంజనేయరెడ్డి, వరదయ్య, రమేష్, మండల ఈశ్వరయ్య, వెంకటేశ్వర్లరెడ్డి, రంగినేని కృష్ణయ్య, టీడీపీ నేత విజయకృష్ణారెడ్డి, రత్నం విద్యాసంస్థల అధినేత కిషోర్ పాల్గొన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యకు ఘన స్వాగతం నెల్లూరు (సెంట్రల్): జిల్లా ముద్దుబిడ్డ ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి అయిన తరువాత మొదటిసారి సొంతగడ్డపై అడుగుపెట్టడంతో బీజేపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అయ్యప్పగుడి వద్ద పెద్ద ఎత్తున బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అయ్యప్పగుడి వద్ద నుంచి వేదాయపాళెం, నిప్పోసెంటరు, కరెంటుఆఫీస్, వెంకటరమణ హాల్ సెంటరు, కేవీఆర్ పెట్రోలు బంకు మీదుగా ర్యాలీ నిర్వహించి నగరంలోకి ప్రవేశించారు. బ్యాండు, కీలుగుర్రాలు, మహిళలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాండు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
రాజధాని నిర్మాణానికి అన్ని రకాల సహకారం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అన్నిరకాలుగా సహకారాన్ని అందిస్తానని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆయన బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధానిపై అధ్యయనంకోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా తనను కలిసినట్లు తెలిపారు. వారి అభిప్రాయాలను ప్రజెంటేషన్ రూపంలో వివరించారని చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున ట్రాన్సుపోర్టేషన్ నెట్వర్క్, రోడ్లు, బీఆర్టీఎస్, మెట్రోరైలు నెట్వర్క్, లింకు రోడ్లు అవసరమని, ఆ విషయంలో పట్టణాభివృద్ధి శాఖ తగిన సహకారం అందించాలని కోరినట్లు వివరించారు. రైల్వే, ఉపరితల రవాణా, పెట్రోలియం నేచురల్ గ్యాస్, ఇతరత్రా మంత్రిత్వశాఖలు తగిన విధంగా సహకరిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమవుతుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారని చెప్పారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహకారాన్ని తప్పనిసరిగా అందిస్తాననే విషయాన్ని చెప్పినట్లు ఆయన తెలిపారు. -
శ్రీవారి సేవలో వెంకయ్యనాయుడు
తిరుమల, న్యూస్‌లైన్: తిరుమల శ్రీవారిని శని వారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దర్శిం చుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా వైకుం ఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లా రు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నా రు. అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శిం చుకున్నారు. వీరికి టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈవో శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయక మండపంలో శ్రీవారి లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. వీరితో పాటు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, తిరుపతి బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి ఉన్నారు. టీడీపీ నేత అంబికా కృష్ణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
రాజకీయ నిర్ణయం మేరకే
ఆంధ్ర కొత్త రాజధాని ఎంపికపై వెంకయ్య వెల్లడి చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక రాజధానిపై కసరత్తు కొత్త రాజధానిగా హైదరాబాద్ అంతటి నగరాన్ని ఆశించలేం {పధాని మోడీ స్మార్ట్ సిటీ ఆలోచనకు హైదరాబాద్ అనువైనది ఆంధ్ర, తెలంగాణలను కేంద్రం కన్నబిడ్డల్లా ఆదుకుంటుంది హైదరాబాద్: విభజన తరువాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపిక అన్నది అంతిమంగా అక్కడ ప్రభుత్వంలోకి వచ్చేవారు రాజకీయంగా తీసుకునే నిర్ణయం మేరకే జరుగుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఆయన మంత్రివర్గ విస్తరణ తరువాత రాజధానికి సంబంధించి తదుపరి చర్యలు మొదలవుతాయని చెప్పారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వెంకయ్యనాయుడు శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా లేక్‌వ్యూ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి సంబంధించి ఇప్పటికే తానొకసారి చంద్రబాబుతోనూ చర్చిం చినట్టు తెలిపారు. కొత్త రాజధాని హైదరాబాద్ అంతటి నగరంగా ఉంటుం దని ఆశించ లేమని.. ఎంత మేరకు అవసరం, ఎలాంటి సౌకర్యాలు కావాలన్నదే ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. అలాగని కేవలం అసెంబ్లీ, సచివాలయం, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస గృహాలకు పరిమితమై రాజధాని నగరాన్ని నిర్మిం చడం సరికాదన్నారు. రాజధానిగా ఉండే నగరానికి ఉండాల్సిన మౌలిక వసతులు, మంచినీటి సౌకర్యం వంటి అవసరాలను పరిశీలించి అధికారులు నివేదికలు సిద్ధం చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గుంటూరు-విజయవాడ, ఖాజీపేట-వరంగల్ వంటి జంట నగరాల అభివృద్ధి మంత్రిగా తన ప్రాధాన్యత అంశాల్లో ఒకటిగా చెప్పారు. ప్రధాని మోడీ ఆలోచనల్లోని స్మార్ట్ సిటీ విధానానికి హైదరాబాద్ అనువైనదిగా వెంకయ్య పేర్కొన్నారు. ఈ నగరం చుట్టూ కొన్ని చిన్న నగరాలను అభివృద్ధి చేసి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ఆలోచన ఉందన్నారు. హైదరాబాద్‌లో మెట్రో పనులు 2017 వరకు పూర్తవుతాయని, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు దీనిని విస్తరించే ఆలోచన ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాలను కన్నబిడ్డల్లా చూసుకుంటాం... అంతకుముందు పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన వెంకయ్య.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కేంద్రం కన్నబిడ్డల మాదిరి ఆదుకుంటుందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి సాధ్యమని.. ఒకరినొకరు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఉద్యోగుల పంపిణీపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. నిబంధనల మేరకు ఉద్యోగుల పంపిణీ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు జరిగిన పంపిణీ తాత్కాలికమైనదని.. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే మూడు నెలల్లో తెలియజేసి పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఎక్కడి వారు అక్కడ పనిచేయాలని కొందరు అంటున్నా రెండో ప్రాంతంలో సూపర్ న్యూమరీ పోస్టుల ఏర్పాటుకు అంగీకారం తెలిపితేనే అది సాధ్యమని చెప్పారు. ఘన స్వాగతం.. అధికారులతో సమీక్ష కేంద్రమంత్రి పదవి చేపట్టాక తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన వెంకయ్యకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆయన బెంగళూరులో ఉన్నందునే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని పార్టీ నేతలు చెప్పారు. -
మంచి బెర్త్‌లు
కేంద్ర కేబినెట్లో రాష్ట్రానికి పెద్ద పీట రాజ్యసభ సభ్యుడు వెంకయ్యకూ స్థానం మొత్తం నాలుగు మంత్రి పదవులు ఆర్ఎస్ఎస్ జోక్యం వల్లే ఈ గౌరవం సాక్షి, బెంగళూరు : దేశ నూతన ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ముగ్గురు నూతన పార్లమెంట్ సభ్యులు, ఓ రాజ్యసభ సభ్యుడికి అమాత్య పదవులివ్వడం ద్వారా కర్ణాటకకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చినట్లైంది. బ్రాహ్మణ వర్గానికి చెందిన అనంతకుమార్, ఒక్కలిగ వర్గంలో వివాద రహిత నాయకుడిగా పేరుగడించిన సదానందగౌడ, కర్ణాటక రాజకీయాలను శాసించడంలో ముందున్న లింగాయత్ వర్గానికి చెందిన జీ.ఎం సిద్దేశ్వర్‌కు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. రాష్ట్ర శాసన సభ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకయ్యనాయుడికి కూడా తన మంత్రి మండలిలో మోడీ స్థానం కల్పించారు. షెడ్యూల్ కులానికి చెందిన రమేష్ జిగజిణగి, రాష్ట్రం నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన ఏకైక మహిళ శోభాకరంద్లాజే మంత్రి పదవుల కోసం చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. మొదట్లో కర్ణాటకకు ఒకటి లేదా రెండు మంత్రి పదవులు మాత్రమే కేటాయించాలని నరేంద్ర మోడీ భావించినా.. ఆర్ఎస్ఎస్ నాయకుల సూచనల మేరకు నాలుగు మంత్రి పదవులు (వెంకయ్య సహా) ఇచ్చినట్లు సమాచారం. రైల్వే శాఖ మళ్లీ కర్ణాటకకే కేంద్ర రైల్వే శాఖ మళ్లీ కర్ణాటకకే లభించనుంది. యూపీఏ-2 ప్రభుత్వంలో చివరి కొద్దికాలం పాటు కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖరే ఆ శాఖ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో కర్ణాటకకే చెందిన సదానందగౌడకు ఈ శాఖను కట్టబెట్టుతూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేగనుక జరిగితే వరుసగా రెండు పర్యాయాలు కన్నడిగులే రైల్వే శాఖ మంత్రులుగా పనిచేసినట్లవుతుంది. అదేవిధంగా కర్ణాటక శాసనసభ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్యనాయుడుకు పట్టణాభివృద్ధి శాఖ, అనంతకుమార్‌కు రసాయనాలు, ఎరువుల శాఖ కేటాయించనున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో కేంద్ర మంత్రి మండలిలో స్థానం సంపాదించుకున్న జీ.ఎం సిద్దేశ్వరకు సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెల్సింది. కాగా, కర్ణాటకకు చెందిన జాఫర్ షరీఫ్ కూడా గతంలో రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు. -
కలిస్తేనే విజయం
టీడీపీ, బీజేపీ శ్రేణులకు వెంకయ్య సూచన హైదరాబాద్: ఇద్దరం కలిస్తేనే రాష్ట్రంలో విజయం సాధిస్తామన్న విషయాన్ని టీడీపీ, బీజేపీల నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు సూచించారు. రెండు పార్టీల శ్రేణులు రానున్న రోజుల్లో మరింత సఖ్యతగా మెలగాల్సిన అవసరముందన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి కె.లక్ష్మణ్ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయలతో కలసి విలేకరులతో మాట్లాడారు. పొత్తుల కారణంగా సీటు కోల్పోతే ఏ పార్టీకైనా, నాయకుడికైనా బాధ ఉండడం సహజమని.. అయితే పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు తమ కూటమే గెలుచుకుంటుందని.. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో బీజేపీ-టీడీపీ ప్రభుత్వాలే వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. సీమాంధ్ర ప్రాంతంలో తమ కూటమికే స్పష్టమైన అధిక్యత ఉందని.. తెలంగాణలో ఇప్పుడు ముక్కోణపు పోటీ జరుగుతున్నప్పటికీ 20వ తేదీ తరువాత మార్పులు చోటుచేసుకొని తమ కూటమి విజయం సాధించే పరిస్థితులు వస్తాయని చెప్పుకొచ్చారు. ఓటమి భయం, అభద్రతాభావంతో కొందరు తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారంటూ పరోక్షంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాటికి ప్రజలే బదులిస్తారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ను ఓడించాలని తాము ప్రయత్నం చేయడం లేదని, తమ కూటమిని గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. -
సీమాంధ్రలో 5 సీట్లకేనా?
మోడీ హవా ఉంటే పరిమిత సీట్లకే పోటీ చేయడమేంటన్న మీడియా ప్రశ్నకు వెంకయ్యనాయుడు తటపటాయింపు ఓట్లు చీలకూడదనే నిర్ణయం తీసుకున్నామని జవాబు హైదరాబాద్: ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీదే హవా అంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నేతలకు ఆంధ్రప్రదేశ్‌లో ఇరకాట పరిస్థితి ఏర్పడింది. మోడీ హవా అంతగా ఉంటే సీమాంధ్రలో ఐదు లోక్‌సభ సీట్లకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందన్న ప్రశ్నకు జవాబిచ్చేందుకు ఆ పార్టీ నేతలు తడబడుతున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుదీ ఇదే పరిస్థితి. మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురవగా.. జవాబు చెప్పేందుకు ఆయన కాసేపు తటపటాయించారు. కొద్ది క్షణాల తరువాత ‘అలా నిర్ణయం తీసుకున్నాం’ అని బదులిచ్చారు. ‘‘మా పార్టీ నిర్ణయాలపై మీరు(మీడియా) ఎలాంటి అభిప్రాయాలు వెలిబుచ్చినప్పటికీ.. మా బలమేంటో ప్రజలే తీర్పిస్తారు’’ అని అంటూ.. సీమాంధ్రలో ఓట్లు చీలకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. బీజేపీ-టీడీపీల పొత్తుపై కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. గతంలో వారు పొత్తులు పెట్టుకున్నప్పడు ఒప్పయింది.. ఇప్పుడు తప్పెలా అవుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి కాకుండా ఇతరులకు ఓటు వేస్తే అస్థిరత్వానికి ఓటు వేసినట్టే అవుతుందని చెప్పారు. తాను వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని.. అన్నిచోట్లా నరేంద్ర మోడీ హవా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనూ లోక్‌సభకు మోడీకే ఓటేయాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నార న్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన మూడుదశల పోలింగ్‌లో బీజేపీ ముందుకు దూసుకుపోతోందని స్పష్టమైందని, ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు కూడా ఊహించని ఫలితాలొస్తాయని జోస్యం చెప్పారు. మోడీ ప్రభావంతోనే యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటున్నారన్నారు. మన్మోహన్సింగ్ ప్రధాని పదవిలో కొనసాగినా అధికారిక నిర్ణయాలన్నీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చలాయించారని ప్రధానికి సలహాదారునిగా పనిచేసినవారు రాసిన పుస్తకంపై ఆ పార్టీ ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నా.. ఎన్నికల తర్వాత మళ్లీ అందర్నీ కూడగట్టి వెనుక నుంచి అధికారం చలాయించే ప్రమాదముందని హెచ్చరించారు. -
కాంగ్రెస్ రెండంకెలకే పరిమితం: వెంకయ్య
-
కాంగ్రెస్ రెండంకెలకే పరిమితం: వెంకయ్య
విశాఖ : రానున్న ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీకి 300 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆపార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. ఆయన శనివారం విశాఖలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రెండంకెల సీట్లే వస్తాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నీటి బుడగ అని తెలిసిపోయిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చి చారిత్రాత్మక తప్పు చేసిందని వెంకయ్య వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలి విస్తోందని ఆయన అన్నారు. బీజేపీ ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీ కాదని....భారతీయులకు ప్రాతినిధ్యం వహించే పార్టీ అన్నారు. మూడో ప్రత్యామ్నాయం కెప్టెన్ ఎవరో ఎవరికీ తెలియదని వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. దక్షిణాది ప్రజలు కూడా బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. పార్లమెంట్లో జరిగిన ఘటనను బీజేపీ ఖండిస్తోందని ...అది భారత జాతికి అవమానం జరగడమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులే వెల్‌లోకి వచ్చారని ... ఈ ఘటనపై కాంగ్రెస్ పూర్తి బాధ్యత వహించాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకోలేని కాంగ్రెస్ పైపెచ్చు తమపై విమర్శలా అని ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందన్నారు. సభ సజావుగా జరగలేదని తెలిసినా...కాంగ్రెస్‌కు ముందే తెలిసినా చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం స్పీకర్ ప్రకటించాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, సీమాంధ్రల సమస్యలు పరిష్కరించాలని అద్వానీ చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.