
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోని కోట్ల మందికి మహాత్ముడి ఆలోచనలు స్ఫూర్తి మంత్రమని ప్రధాని నరేంద్రమొదీ స్పష్టం చేశారు. జాతిపిత మహాత్మ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మహాత్ముడికి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ, ఇతర సందర్భాల్లో మహాత్ముడి సందేశాలను కూర్చి.. రూపొందించిన ఒక వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.




