వెంకటాచలం : మండలంలోని సరస్వతీనగర్‌లో ఉన్న అక్షర విద్యాలయం వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం కోలాహలంగా జరిగాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ, విద్యార్థులతో దేశభక్తిని చాటే నృత ప్రదర్శనలు చేయించారు. మల్లి మస్తాన్‌బాబు మృతి కి సంతాపంగా రెండు నిమిషాలు మౌ నం పాటించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలకు మన భారతదేశం నెలవు అని, అన్నీ దేశాలు మన సంప్రదాయాలను గౌరవిస్తున్నాయన్నారు. విద్యకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మన దేశాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రదేశాల సరసన నిలబెడుతారన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు అక్షర విద్యాలయం సంస్కృతి, సంప్రదాయాలకు నెలవుగా అభివర్ణించారు. చిన్నతనం నుంచి విద్యార్థులకు దేశ భక్తిని పెంపొదిస్తున్న అక్షర విద్యాలయం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శ్రీసిటీ అధినేత రవిసన్నారెడ్డి , బీజేపీ నేత నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, స్వర్ణభారత్‌ట్రస్టీ అట్లూరి అశోక్, ఐ.దీపావెంకట్, ఐ.వెంకట్, ప్రిన్సిపల్ కుముద పలువురు బీజేపీ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కోలాహలంగా ‘అక్షర’ వార్షికోత్సవం
Published Sat, Apr 25 2015 2:46 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement