కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
నెల్లూరు(అగ్రికల్చర్): మహాసంపర్క అభియాన్ ద్వారా బీజేపీ సభ్యులతో మమేకం కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆ పార్టీ నాయకులకు సూచించారు. నెల్లూరు భక్తవత్సలనగర్‌లో శనివారం ఆ పార్టీ నిర్వహించిన మహాసంపర్క అభియాన్‌లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
దేశాన్ని 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని విస్మరించిందని, అవినీతి, అక్రమాలతో అగ్రభాగాన నిలి చిందన్నారు. గత ఎన్‌డీఏ హయాంలో 8.6 శాతంగా ఉన్న జీడీపీని 4 శాతానికి తీసుకొచ్చిందన్నారు. మోడీ ప్రధానిగా జీడీపీ రేటును 7.3 శాతం పెంచడంలోనే తమ విజయం దాగిఉందన్నారు. ప్రపంచంలోనే ఏ పార్టీకి లేని విధంగా తమకు దేశంలో 11 కోట్ల మంది సభ్యులు ఉన్నారన్నారు. కేంద్రం ప్రకటించిన 500 అమృత పట్టణాల్లో నెల్లూరు, కావలికి చోటు కల్పించామన్నారు.
నాలుగులైన్ల హైవేని ఆరులైన్లుగా, నెల్లూరు చెరువును ట్యాంక్‌బండ్ నిర్మాణం, సోమశిల ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు, నడికుడి రైల్వేలైను నిర్మాణం, పక్కాగృహాల నిర్మాణాలకు తోడ్పటునందజేస్తామని హామీ ఇచ్చారు. యోగాకు ప్రపంచవ్యాపితంగా గుర్తింపు తెచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, నగర అధ్యక్షులు మండ్ల ఈశ్వరయ్య, దువ్వూరు రాధాక్రిష్ణారెడ్డి, కందుకూరి సత్యనారాయణ, వడ్డే శ్రీనివాసులు పాల్గొన్నారు.
సభ్యులతో మమేకంకండి
Published Sun, Jul 12 2015 1:50 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement