Central Minister
-
రియల్ఎస్టేట్ ఏజెంట్లకు కేంద్రమంత్రి సూచన
భారత రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి వీలుగా.. కార్యకలాపాల్లో విశ్వాసం, పారదర్శకత ఉండేలా చూడాలని ఈ రంగానికి చెందిన ఏజెంట్లకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సూచించారు. 2030 నాటికి రియల్ ఎస్టేట్ మార్కెట్ రూ.85 లక్షల కోట్లకు చేరుకోనుందన్న అంచనాను ప్రకటించారు.నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా (నార్–ఇండియా) వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రమాణాలను, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని పరిశ్రమను కోరారు. నార్–ఇండియాలో 50వేల మంది ఏజెంట్లు సభ్యులుగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో ఏజెంట్ల పాత్రను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.డెవలపర్లు, వినియోగదారుల మధ్య వీరు కీలక వారధిగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఏజెంట్ల సూచలను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. 2016లో రెరాను తీసుకురావడాన్ని అద్భుత సంస్కరణగా పేర్కొన్నారు. డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య వివాదాల నివారణకు దీన్ని తీసుకొచ్చారు.అలాగే, రియల్ ఎస్టేట్‌లోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం, వ్యాపార సులభతర నిర్వహణకు తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. 2047 నాటికి దేశ జనాభాలో సగం మంది పట్టణాల్లోనే నివసించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఇది 35 శాతంగా ఉంది. -
ప్రమాదానికి గురైన కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ కారు
సాక్షి,ఢిల్లీ : కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారు ప్రమాదానికి గురైంది. పార్లమెంట్ నుంచి తన కార్యాలయానికి వెళ్లే సమయంలో శ్రీనివాస వర్మ కారును ఓ ప్రైవేట్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, కాలికి గాయాలయ్యాయి. కారులో ఉన్న సిబ్బందికి సైతం గాయాలయ్యాయి.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన సిబ్బంది రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ వైజాగ్‌కు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కాలుకు, తలకు కట్టుతోనే శ్రీనివాసవర్మ. వైజాగ్‌కు బయలు దేరారు. వైజాగ్‌కు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కాలుకు, తలకు కట్టు తోనే విజయవాడ బయల్దేరిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ. -
కేంద్ర మంత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ : కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను అగ్రవర్ణాల నేతలే నిర్వహించాలి. ఒక బ్రాహ్మణుడు లేదా ఇతర అగ్రవర్ణాల నాయకులు బాధ్యతలు స్వీకరిస్తే గణనీయమైన మార్పు ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే గిరిజన వ్యవహారాల మంత్రిని చేయడం మన దేశానికి శాపమని అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారంటూ పలు జాతీయ మీడియాలో కథనాలు వెలుగులోకి వచ్చాయి. వారి సంక్షేమం కోసం గిరిజన వర్గానికి చెందిన వ్యక్తి కాకుండా అగ్రవర్ణాలకు చెందిన నేతలకు కేటాయించాలనే నా కల, నిరీక్షణ. అదేవిధంగా, గిరిజన నాయకుల సంక్షేమం కోసం పోర్ట్‌ఫోలియో ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం చేశారని కథనాలు హైలెట్ చేశాయి. ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో సురేష్ గోపి మాట్లాడుతూ అగ్రవర్ణాల నాయకులకు పోర్ట్‌ఫోలియో బాధ్యతలు అప్పగిస్తేనే గిరిజన సంక్షేమంలో నిజమైన పురోగతి సాధ్యమవుతుంది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను నాకు అప్పగిస్తే బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధం. ఇప్పటికే తనకు ఆ మంత్రివర్గం కేటాయించాలని ప్రధాని మోదీని అభ్యర్థించానని, అయితే పోర్ట్‌ఫోలియో కేటాయింపుల్లో సాధ్యం కాలేదన్నారు. సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలపై కేరళలో తీవ్ర దుమారం రేపాయి. సీపీఐ రాష్ట్రకార్యదర్శి బినోయ్ విశ్వం.. సురేష్ గోపి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అతన్ని మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బినోయ్ విశ్వంతో పాటు ఇతర గిరిజన వర్గానికి చెందిన నేతలు సురేష్ గోపి వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు. కాగా, ప్రస్తుతం, ఒడిశాకు చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన, ప్రముఖ బీజేపీ నేత జుయల్ ఓరం కేంద్ర మంత్రివర్గంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహిస్తున్నారు. -
విశాఖ ఉక్కు కార్మికులకు కేంద్రమంత్రి కుమారస్వామి షాక్
-
బాదల్‌పై కాల్పులు..కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ మీద కాల్పులు జరిగిన ఘటనపై కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాల్పులు జరిపిన నరేన్ సింగ్ చౌరా సిక్కు జాతి రత్నం అని కొనియాడారు. నరేన్‌కు న్యాయ సహాయం అందించాలని శిరోమణి గుర్ద్వారా ప్రబంధక్ కమిటీకి విజ్ఞప్తి చేశారు.నరేన్ కాల్పులు జరపడం వెనుక తన వ్యక్తిగత కారణాలేవీ లేవని, సిక్కుల మనోభావాలు దెబ్బతినడంపై ప్రతీకారం తీర్చుకున్నారన్నాడన్నారు. గతంలో అధికారంలో ఉన్నపుడు బాదల్ ప్రభుత్వం సిక్కులు పవిత్రంగా భావించే శ్రీ గురు గ్రాంత్ సాహిబ్‌ను అపవిత్రం చేయడమే కాకుండా స్వర్ణ దేవాలయం నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బాదల్ చేసిన తప్పుల ఫలితంగానే కాల్పులు జరిగాయని తెలిపారు. నరేన్ టార్గెట్ స్వర్ణ దేవాలయం, అకల్ తక్త్ సాహిబ్ కాదని కేవలం సుఖ్బీర్ సింగ్ బాదలేనని చెప్పారు. అయితే హింసకు పాల్పడడాన్ని మాత్రం ఖండిస్తున్నట్లు బిట్టు తెలపడం గమనార్హం. ఇదీ చదవండి: స్వర్ణ దేవాలయంలో కాల్పులు -
టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై కేంద్రమంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై ఆ పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ఒకసారి చూసుకోవాలని హెచ్చరించారు.ఓ కార్యక్రమంలో పాల్గొన్న పెమ్మసారి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకేసారి ఎమ్మెల్యే అయితే చాలు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మళ్లీ మళ్లీ ఎమ్మెల్యేలు అవ్వాలనుకున్నవారు ఎవరు అవినీతికి పాల్పడిన అది తప్పే. లిక్కర్ షాపులు నిర్వహించుకోవాలంటే అందుకు పెద్దమొత్తంలో వాటాలు అడుగుతున్న ఎమ్మెల్యేల నుంచి సమస్యలు ఎదురవ్వొచ్చు. వ్యవస్థ గురించి మాట్లాడాలంటే ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి.ఇవాళ ఎన్నికలంటే డబ్బులతో కూడుకున్న పెద్ద ప్రక్రియ. ఈ వ్యవస్థను చూస్తుంటే ఒకరకంగా అసహ్యం వేస్తుంది. నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలి ప్రజా సేవ చేయాలనే వారికి రాజకీయాలు దూరమయ్యాయి.ఎన్నికలు వచ్చాయంటే నాయకులు డబ్బుల కోసం పీక్కుతింటున్నారు. ప్రజలు కూడా మాకు డబ్బు రాలేదని అడుగుతున్నారు’ అని పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై మండిపడ్డారు. -
టోల్ ఫీజు మినహాయింపు ఉంటుందా..? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ
-
జేడీఎస్ అధినేత కుమారస్వామికి అస్వస్థత
బెంగళూరు: జేడీఎస్ అధినేత, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఆదివారం(జులై 28) సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో బీజేపీ, జేడీఎస్ నాయకులు ఉమ్మడిగా నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతుండగా కుమారస్వామి ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం కారింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
బడ్జెట్లో ఏపీకి నిధులు.. కేంద్రమంత్రి అథవాలే కీలక వ్యాఖ్యలు
సాక్షి,మెదక్: దేశంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. శనివారం(జులై 27) మెదక్‌లో పర్యటించిన అథవాలే మీడియాతో మాట్లాడారు.‘ఎన్డీఏ ప్రభుత్వానికి దేశమంతా సమానమే. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కూడా బడ్జెట్లో నిధులు ఇచ్చాం. ఏపీకి రాజధాని లేకపోవడం వల్లే ఎక్కువ నిధులు కేటాయించాం. సౌత్ ఇండియాలో ఎన్డీఏ మెజార్టీ స్థానాలు సాధించింది. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాం అని అథవాలే తెలిపారు. -
మూసీ ప్రక్షాళన: కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
సాక్షి,ఢిల్లీ: కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో సోమవారం(జులై 22) భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సహకరించాలని కేంద్ర మంత్రిని ఈ సందర్భంగా సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లతో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నగరానికి తాగునీటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు. -
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది- బండి సంజయ్
-
Bengaluru: కేంద్రమంత్రి ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
బెంగళూరు: కేంద్రమంత్రి శోభా కరంద్లాజె కారును ఢీకొట్టి బెంగళూరులో ప్రకాష్ అనే బీజేపీ కార్యకర్త మృతి చెందాడు. ఈ ఘటన బెంగళూరు కేఆర్‌పురంలో సోమవారం(ఏప్రిల్ 8)జరిగింది. కేంద్ర మంత్రి కారు డోర్‌ను స్కూటర్‌పై వచ్చిన ప్రకాష్ ఢీకొట్టాడు. దీంతో అతను కింద పడిపోయాడు. ఈ సమయంలో అతడిపై నుంచి బస్సు వెళ్లింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున బెంగళూరు నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి శోభ ప్రచారం కోసం కేఆర్ పురం వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినపుడు కేంద్ర మంత్రి శోభ కారులో లేరు. కారుకు మరో పక్క నుంచి స్కూటర్‌పై వస్తున్న ప్రకాష్‌ను గమనించకుండా డ్రైవర్ డోర్ తెరవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌తో పాటు బస్సు డ్రైవర్ ఇద్దరిపై పోలీసులు 304ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో బీజేపీ కార్యకర్త చనిపోవడం తమలో ఎంతో విషాదం నింపిందని, ప్రకాష్ కుటుంబానికి నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి శోభ తెలిపారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ లైసెన్స్ రద్దు చేశా.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు -
రష్మిక మరో ఫేక్ వీడియో.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
సినీనటి రష్మిక మందన్నాపై కొద్ది రోజుల్లోనే రెండు ఫేక్ వీడియోలు వైరల్ కావడంపై కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. రష్మిక డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇలాంటి వీడియోలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చిన్న పిల్లలు, మహిళలపై ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ..'డీప్ ఫేక్ వీడియోలపై దృష్టి సారించాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మార్ఫింగ్ లాంటివి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇలాంటి పరిస్థితి రావడం చాలా ప్రమాదకరం. గత రెండేళ్లుగా ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టాం. సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. ఫిబ్రవరి నుంచి నిబంధనలు మరింత కఠినతరం చేస్తాం.' అని అన్నారు. ఇటీవల నేషనల్ క్రష్ రష్మికకు సంబంధించిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. భారత సంతతికి చెందిన జరా పటేల్ వీడియోను కొందరు డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేశారు. ఈ సంఘటనపై పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో మరవకముందే.. మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు విజ్ఞప్తి చేశారు. రష్మికతో పాటు బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ టైగర్-3 సినిమాలో ఓ ఫోటోను అలాగే మార్ఫింగ్ చేశారు. దీంతో రోజు రోజుకు ఇలాంటి వాటి బారిన పడే వారిసంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కఠినమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. -
నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు.. ఇది చాలా స్పెషల్!
భారతదేశం అభివృద్ధివైపు వేగంగా పరుగులు పెడుతున్న తరుణంలో ఈ రోజు కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రపంచంలోనే మొట్ట మొదటి బిఎస్6 హైబ్రిడ్ కారుని ఆవిష్కరించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగంతో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ప్రపంచంలోని చాలా దేశాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఫ్యుయల్ పుట్టుకొచ్చింది. టయోటా కంపెనీకి చెందిన ఈ 'ఇన్నోవా హైక్రాస్' ఇథనాల్ శక్తితో నడిచే ప్రోటోటైప్ హైబ్రిడ్ కారు. ఈ లేటెస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ ఇంజిన్ E100 గ్రేడ్ ఇథనాల్‌తో (100 శాతం ఇథనాల్) పనిచేసేలా తయారైంది. సెల్ఫ్ ఛార్జింగ్ లిథియం అయాన్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. కావున ఈవీ మోడ్‌లో కూడా నడుస్తుంది. ఇందులోని 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ.. ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ అనేది ఇంజిన్‌ను ఇథనాల్-పెట్రోల్ మిశ్రమంతో పనిచేసేలా చేస్తుంది. దీని వల్ల కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా E20 ఇంధనం అందుబాటులో ఉంది. ప్రస్తుతం బ్రెజిల్ అత్యధిక ఇథనాల్ మిశ్రమాన్ని 48 శాతం వరకు మిక్స్ చేస్తోంది. భారతదేశంలోని అనేక సంస్థలు తమ వాహనాలను E20 ఇంధన సామర్థ్యంతో ప్రారంభించాయి. ఇదీ చదవండి: ఉత్పత్తి నిలిపివేసిన టయోటా.. షాక్‌లో కస్టమర్లు - కారణం ఇదే! ఇథనాల్.. ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇథనాల్ అనేది తక్కువ ఖర్చుతో లభిస్తుంది. ఎందుకంటే బయోవేస్ట్ నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. కావున ఇలాంటి వాహనాల వినియోగానికి అయ్యే ఖర్చు.. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. అయితే ఈ రకమైన కార్లు ఎప్పటి నుంచి వినియోగంలోకి వస్తాయనేది తెలియాల్సి ఉంది. -
మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన మణిపూర్ ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు సంఘటనపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీడియో బయటకు వచ్చే వరకు ఏం చేస్తున్నారని కేంద్రానికి సుప్రీం కోర్టు సూటి ప్రశ్నలు వేసింది. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనపై సుప్రీంకోర్టు కేంద్రంపై సీరియస్ అయ్యింది. బాధిత మహిళల తరపున సినియన్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రశ్నిస్తూ.. ఒక వీడియో బయటకు వచ్చేంతవరకు ఏం చేస్తున్నారని, ఇలాంటి సంఘటనలు అదొక్కటే కాదు చాలా జరిగాయని అన్నారు. మే 3న అల్లర్లు జరిగితే ఇప్పటివరకు ఎన్ని ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మణిపూర్‌లో ఇప్పటివరకు చాలా మంది చనిపోయారు. ఈ కేసులో సీబీఐ విచారణను బాధిత మహిళలు వ్యతిరేకిస్తున్నట్లు వేరే ఏ కోర్టులోనూ ఈ కేసును బదిలీ చేయవద్దంటున్నట్లు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరపున కేసును వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేసును అస్సాం కు బదిలీ చేయమని ప్రభుత్వం కోరలేదని అన్నారు. అయితే విచారణ మణిపూర్ వెలుపల జరిగితే బాగుంటుందని మాత్రమే వారు కోరినట్లు తెలిపారు. బాధితుల్లో ఒకరి సోదరుడు, తండ్రి మృతి చెందారని.. ఇంతవరకు ఆ కుటుంబానికి ఆ మృతదేహాలను అప్పగించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కపిల్ సిబాల్. మే 18న ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు సుప్రీంకోర్టు కేసును సుమోటోగా స్వీకరించేంత వరకు కేసులో కదలిక రాలేదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 595 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. కేసు విచారణ విషయమై హైపవర్ మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. చదవండి: సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఊరట.. -
ఆ యాడ్ చేస్తే.. రూ. కోట్లలో ఇస్తామన్నారు: స్మృతి ఇరానీ
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా, రాజకీయవేత్తగా, అందరికీ సుపరిచితురాలే. 2014లో మోదీ కేబినెట్లో మంత్రి పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా స్మృతి ఇరానీ నిలిచారు. తొలుత టెలివిజన్ నటి అయిన స్మృతి అనంతరం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అమె మోడల్ రంగంలో కూడా రానించారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' టీషర్ట్ కావాలంటే ఉచితంగా ఇలా బుక్ చేసుకోండి) తాజాగ ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టీవి సీరియల్స్లలో పనిచేస్తున్న రోజుల్ని గుర్తుచేసుకున్నారు. నటిగా తను కెరీర్ ప్రారంభించిన రోజుల్లో తన వద్ద సరిగ్గా డబ్బుల్లేవు. షూటింగ్‌ల ద్వారా వచ్చే డబ్బు సరిపోయేది కాదు. కనీసం బ్యాంక్ ఖాతాలో రూ.30 వేలు కూడా ఉండేవి కాదని గుర్తు చేసుకుంది. తనకు పెళ్లైన కొత్తలో బ్యాంక్ నుంచి రూ.25 లక్షలు లోన్ తీసుకుని ఒక ఇంటిని కొనుగోలు చేశామని తెలిపారు. కానీ ఆ సమయంలో ఇంటికి సంబంధించిన ఈఎంఐ చెల్లించడం చాలా కష్టంగా అనిపించేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదు. అలాంటి సమయంలో ఓరోజు తన వద్దకు కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక భారీ ఆఫర్ ఇచ్చారని ఇలా తెలిపింది. 'పాన్ మసాలా యాడ్‌లో పనిచేయమని, అందుకోసం రూ.కోట్లలో డబ్బులు ఇస్తామని భారీ ఆఫర్ చేశారు. కాకపోతే ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించాను. దీంతో నా స్నేహితులు.. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా..? అంత డబ్బు ఇస్తామంటే ఎందుకని కాదంటున్నావు' అని అని స్మృతి ఇరానీ తెలిపారు. (ఇదీ చదవండి: నయనతార రిచ్ లైఫ్.. సొంతంగా విమానంతో పాటు ఇవన్నీ కూడా) ఆ సమయంలో సీరియల్ ద్వారా ప్రేక్షకులందరూ తనను తమ కుటుంబ సభ్యురాలిగా భావించారని ఇరానీ తెలిపారు. దీంతో పాన్ మసాలా లాంటి యాడ్స్‌లో నటిస్తే వాళ్లు ఎలా తీసుకుంటారోననే ఆలోచన రావడంతో నో చెప్పానని ఆమె తెలిపారు. అంతే కాకుండా చిన్నపిల్లలు కూడా ఈ యాడ్స్ చూసే ప్రమాదం ఉండటంతో పాన్ మసాలా, అల్కహాల్ కంపెనీలకు చెందిన యాడ్స్‌కు దూరంగా ఉంటూ వచ్చానని స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. -
మాజీ ట్విటర్ సీఈఓ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ కేంద్రమంత్రి.. కారణం ఇదే!
Rajeev Chandrasekhar Vs Jack Dorsey: మాజీ ట్విటర్ సీఈఓ 'జాక్ డోర్సే' (Jack Dorsey) భారత ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు చేశారు. ఇందులో తమ బృందానికి షట్‌డౌన్ మాత్రమే కాకుండా వారి ఇళ్లపై కూడా దాడులు జరుగుతాయని బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించాడు. ఈ ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని కేంద్ర మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' స్ఫష్టం చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. జాక్ డోర్సే చేసిన ప్రకటనలు పూర్తిగా అవాస్తవాలని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ట్విటర్ బృందం మీద ఎవరూ దాడి చేయలేదని, జైలుకి పంపలేదని స్పష్టం చేసారు. అంతే కాకుండా డోర్సే, అతని బృందం భారతదేశ చట్టాన్ని పదేపదే ఉల్లంఘించిందని 2020 నుంచి 2022 వరకు ఇదే పద్దతిని పాటించినట్లు చెప్పుకొచ్చాడు. జాక్ డోర్సే భారత చట్టానికి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని అంగీకరించడానికి సుముఖ చూపడంలేదని, చట్టాలు అతనికి ఏ మాత్రం వర్తించనట్లు ప్రరవర్తించారని చెప్పడమే కాకుండా, దేశంలో ఉన్న కంపెనీలన్నీ చట్టాలను తప్పకుండా అనుసరించాలాని పేర్కొన్నారు. రైతుల నిరసనను డోర్సే ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారో కూడా చంద్రశేఖర్ వివరించారు. నిరసనల సందర్భంగా చాలా తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని, అలాంటి తప్పుడు వార్తలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. డోర్సీ ఆధ్వర్యంలోని ట్విట్టర్ కేవలం భారతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే కాదు, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19ని ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా, పక్షపాతంతో వ్యవహరించిందని.. తప్పుడు సమాచారాన్ని ఆయుధాలుగా చేయడంలో సహాయం చేస్తుందని అన్నారు. ప్రస్తుతం భారత ప్రభత్వం విధి విధానాలు స్పష్టంగా ఉన్నాయని.. సంస్థలు కూడా విశ్వసనీయంగా, జవాబుదారీగా వ్యవహరించాలని చంద్రశేఖర్ సూచించారు. This is an outright lie by @jack - perhaps an attempt to brush out that very dubious period of twitters history Facts and truth@twitter undr Dorsey n his team were in repeated n continuous violations of India law. As a matter of fact they were in non-compliance with law… https://t.co/SlzmTcS3Fa — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) June 13, 2023 -
రెజ్లర్ల ఆందోళనలపై మీడియా ప్రశ్నలకు మంత్రి పరుగులు
రెజ్లర్ల ఆందోళనలపై మీడియా ప్రశ్నలకు మంత్రి పరుగులు -
‘శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి’
న్యూఢిల్లీ: జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జమ్ము కాశ్మీర్ లెఫ్టి నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ,కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం చైర్మన్ వీరిని కలసి మహాసంప్రోక్షణ ఆహ్వాన పత్రికను అందజేశారు. జూన్ 3వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు జమ్మూ శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారికి వైవీ సుబ్బారెడ్డి వివరించారు. జూన్ 8వ తేదీ మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. చైర్మన్ వీరిద్దరినీ శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చదవండి: సివిల్స్ ఫలితాల్లో ఇద్దరికి ఓకే ర్యాంకు, రోల్ నెంబర్.. నాదంటే.. నాది.. చివరికి! -
అడ్వెంచర్ టూరిజానికి విస్తృత అవకాశాలు: కిషన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా సాహస పర్యాటకాని(అడ్వెంచర్ టూరిజం)కి విస్తృత అవకాశాలు ఉన్నా యని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి అనేక ప్రదేశాలున్నాయని తెలిపారు. ఆయా అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి వినూత్న విధానాలతో కేంద్రం ముందుకెళ్తోందని తెలిపారు. రెండో పర్యాటక రంగ జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాల సందర్భంగా పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో ‘సాహస పర్యాటకం’పై ఏర్పాటు చేసిన సమావేశానికి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అడ్వెంచర్ టూరిజానికి హిమాలయాలను మించిన ఉత్తమమైన ప్రదేశం మరొకటి ఉండదని, అందుకే ఈ సామర్థ్యాన్ని సద్వినియోగ పరుచుకునే దిశగా కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్, మౌంటనీరింగ్ వంటి వాటికి డిమాండ్ పెరిగిందని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు. పులుల సంరక్షణలో తెలంగాణ విఫలం పులుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో గొప్పలు మినహా క్షేత్రస్థాయిలో నిధులు అందడం లేదని, పులుల సంరక్షణకు రూ.2.2 కోట్లు కూడా కేటాయించక పోవడమే అందుకు నిదర్శనమన్నారు. దేశంలో పులుల సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించి శనివారంతో యాభై ఏళ్లు పూర్తి కాగా ప్రపంచ అడవి పులుల సంఖ్యలో భారత్‌లోనే 70 శాతానికి పైగా పులులున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్, ఏటూరు నాగారం, కిన్నెరసాని, పాఖల్, పోచారం, మంజీర, ప్రాణహిత వంటి వన్యప్రాణుల అభయారణ్యాలకు కేంద్రం రూ.30 కోట్లు ఇచి్చందని తెలిపారు. అనంతరం...కిషన్‌రెడ్డి అడ్వెంచర్ టూరిజంకు ఉన్న అవకాశాలపై వివిధ దేశాల ప్రతినిధులు ప్యానల్ చర్చలో పాల్గొన్నారు. -
గుడ్‌న్యూస్..కేంద్రంలో దాదాపు 10 లక్షల ఉద్యోగ ఖాళీలు!
న్యూఢిల్లీ: కేంద్రంలో పలు విభాగాల్లో 9.79 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని ప్రభుత్వం బుధవారం తెలిపింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘‘2021 మార్చి 1 నాటికి అన్ని శాఖలు, విభాగాలు, సంస్థల్లో 9.79 లక్షలకుపైగా ఖాళీలున్నాయి. రైల్వేశాఖలోనే 2.93 లక్షలున్నాయి. రక్షణ శాఖలో 2.64 లక్షలు, హోం శాఖలో 1.43 లక్షలు, రెవెన్యూలో 80,243, ఆడిట్–అకౌంట్ విభాగంలో 25,934, అణు ఇంధన శాఖలో 9,460 ఖాళీలున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆదేశించాం’’ అన్నారు. -
జడ్జీల సెర్చ్ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలి
-
మళ్లీ 'షా'రొస్తున్నారు..అప్పటిదాకా ఇక్కడే మకాం..!
తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడం లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా నేరుగా కదన రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల వ్యూహాల రూపకల్పన నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం దాకా పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసేదాకా అమిత్‌షా హైదరాబాద్‌లోనే మకాం వేసి పార్టీ శ్రేణులను ఉరుకులు, పరుగులు పెట్టించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయ లేమి, ఆధిపత్య పోరు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టనున్నారని వివరించాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన తెలంగాణపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించనున్నారని పేర్కొన్నాయి. ఇప్పటికే కర్ణాటకలో షురూ.. కర్ణాటకలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. అయితే కొంతకాలం నుంచి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందన్న అభిప్రాయం ఉంది. దీనికితోడు రాహుల్ గాంధీ భారత్‌జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుందన్న అంచనాలూ వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ. ఆ రాష్ట్రంలో పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను అమిత్‌షాకే అప్పగించింది. గత ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కకపోవడానికి నేతల మధ్య కుమ్ములాటలు, సమన్వయం లేకపోవడమే ముఖ్య కారణమని గుర్తించిన నాయకత్వం.. ఈసారి ఆ సమస్య పునరావృతం కాకుండా అమిత్‌షా నేతృత్వంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ రాష్ట్రంలో యావత్ ఎన్నికల వ్యూహ రచన ఆయన కనుసన్నల్లోనే సాగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని, పూర్తి సమయం కేటాయించేందుకూ అమిత్‌షా సిద్ధమవుతున్నారు. కర్ణాటకలో ఎన్నికలు ముగిశాక.. అదే తరహాలో తెలంగాణపైనా దృష్టి పెట్టనున్నారు. సమన్వయ లేమి సమస్యతో.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల వాతావరణం ఉందని.. కానీ రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయ లేమి సమస్యగా మారిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనిని పార్టీ అగ్ర నాయకత్వం గుర్తించిందని అంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరగడం, అందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సాధించిన ఫలితాలు, సుపరిపాలన దోహదపడ్డాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలు, అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రుల పర్యటనలతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు. కాషాయ జెండా ఎగిరేందుకు ఇంత అనుకూలంగా ఉన్న పరిస్థితిని.. ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దనే అభిప్రాయంతో అధినాయకత్వం ఉందని వివరిస్తున్నారు. ఇప్పటికే పరోక్షంగా పర్యవేక్షణ అమిత్‌షా ఇప్పటికే పరోక్షంగా రాష్ట్ర పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడి రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్ సర్కార్ తీరు, సీఎం కేసీఆర్ వ్యవహారశైలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తున్నారు. పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలన్నీ ఆయన అదుపాజ్ఞలు, పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అమిత్‌షా, ఇతర అగ్రనేతలు కలసి.. గతంలో లోక్‌సభ, యూపీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషిచేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ను రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్చార్జిగా నియమించారు. ప్రస్తుతం బన్సల్ నేతృత్వంలోనే ‘ప్రజాగోస– బీజేపీ భరోసా’ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ సంస్థాగత పటిష్టత, బూత్ సశక్తికరణ్ అభియాన్ వంటివి చేపడుతున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదు విడతల్లో చేపట్టిన పాదయాత్రతో దాదాపు సగం అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పాదయాత్రలు కాకుండా.. రాష్ట్రంలోని నాలుగైదు రూట్లలో ముఖ్యనేతలంతా సమాంతరంగా పాల్గొనేలా రథయాత్రలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్టు పార్టీ నేతల సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే జాతీయ నాయకత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. -
చార్జీ పెంపు.. ఎయిర్‌టెల్‌ను ప్రశ్నించనున్న కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: డేటా వ్యయం, పరికరాల ధర పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. కనీస నెలవారీ చార్జీని ఎయిర్టెల్ 57 శాతం పెంచిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘డేటా ధరలు అధికం కావడం వేగవంతమైన డిజిటైజేషన్‌కు అవరోధాలు. 2025 నాటికి 120 కోట్ల భారతీయులను ఆన్‌లైన్‌కు తీసకురావాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం 83 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. పెరుగుతున్న డేటా వినియోగం లేదా పరికరాల ధరలో ఏదైనా పెరుగుదల వంటి సమస్యలు వస్తే ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఎయిర్టెల్ ఇటీవల మొబైల్ సేవల ధరల పెంపుపై అధ్యయనం చేయలేదు. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ పరిశీలించే వరకు వేచి చూస్తాం.ట్రాయ్‌తో తప్పకుండా మాట్లాడబోతున్నాం. రష్యా–ఉక్రెయిన్ సమస్య కారణంగా ఇది స్వల్పకాలికమా? లేదా దీర్ఘకాలికమా? ఇది ట్రెండ్‌గా మారబోతుందా? ఇవీ మేం అడగబోయే ప్రశ్నలు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ధరలపై ప్రభావం పడింది. డేటా ధరల ప్రభావాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. చార్జీలు పెంచడానికి కారణం ఏమిటని ఆపరేటర్‌ను ప్రశ్నిస్తాం. డేటా వ్యయాలు అందుబాటులో ఉండాలన్నదే మా ఆశయం’ అని ఆయన అన్నారు. చదవండి: గూగుల్ నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు! -
తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కేంద్రమంత్రి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ నేతలకు జాతీ యస్థాయిలో మరో కీలక పదవి లభించనుందా ? ఈ ప్రశ్నకు ఢిల్లీ పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. 2024 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నట్టు చెబుతున్నారు.ప్రస్తుతం జాతీయస్థాయిలో రాజకీయ మార్పులు చేర్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ కీలక పరిణా మాల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సంస్థాగతంగా కూడా కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న పార్టీ జాతీయకార్యవర్గ భేటీలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. కేంద్రమంత్రివర్గ విస్తరణతో పాటు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సిన కొన్ని రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు కూడా జరగొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలకంగా మారిన తెలంగాణ... ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో అధికారంలోకి రావడంతోపాటు మధ్యప్రదేశ్, కర్ణాటకలలో అధికారాన్ని నిలబెట్టుకోవడం, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ను ఓడించడం అనేది బీజేపీకి కీలకంగా మారింది. గతంలో బీజేపీ ఎప్పుడూ గెలవని, రెండోస్థానంలో నిలిచిన, మిత్రపక్షాలకు కేటాయించిన 160 ఎంపీ సీట్లను జాతీయనాయకత్వం గుర్తించింది. 2024 ఎన్నికల్లో వీటిలో గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలవాలనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే బీజేపీ అమలు చేయడం మొదలుపెట్టింది. వచ్చే లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో... ఇప్పటికే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి తోడుగా తెలంగాణ నుంచి ఎంపీలుగా ఉన్న బండిసంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావులలో ఒకరికి కేబినెట్బెర్త్ దక్కే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన డా.కె.లక్ష్మణ్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్టుగా చెబుతున్నారు. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను మరింతగా ఎండగట్టేలా... తెలంగాణలో కచ్ఛితంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న జాతీయనాయకత్వం ఈ దిశలో కేసీఆర్ సర్కారు వైఫల్యాలను మరింత గట్టిగా ఎండగట్టేందుకు మరో కేబినెట్ పదవి ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. గత 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయలేకపోయామనే అభిప్రాయంతో జాతీయనాయకత్వం ఉన్నట్టు సమాచారం. మరో పది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఇప్పటికైనా మోదీ ప్రభుత్వ విజయాలు, తెలంగాణలో వివిధవర్గాల పేదలకు చేకూరిన ప్రయోజనాలను గురించి ప్రజలకు తెలియచేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో తెలంగాణకు చెందిన నేతకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్‌ను కేంద్రమంత్రిని చేస్తే రాష్ట్ర పార్టీలో బీసీవర్గం నుంచి కీలకనేతగా ఉన్న మరో ముఖ్యనేతకు రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు అప్పగించవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటికే సోషల్ మీడియాలోని కొన్ని వెబ్సైట్లలో వార్తలు పెద్దఎత్తున హల్చల్ చేస్తున్నాయి. -
తెలంగాణ మెట్రో కారిడార్‌కు రూ.8,453 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: 2017 మెట్రో రైల్ పాలసీలో భాగంగా 50:50 ఈక్విటీ షేర్ పద్ధతిలో రూ.8,453 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరినట్లు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ వెల్లడించారు. మెట్రోకారిడార్ సాయం ఏమైందని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అదేవిధంగా రాయదుర్గం స్టేషన్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,105 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మెట్రో ప్రాజెక్టు విషయం కూడా తమ దృష్టిలో ఉందని తెలిపారు. ఎన్‌హెచ్–65లో 6 లేన్లు అవసరం లేదు ప్రస్తుతం నందిగామ సెక్షన్లో నాలుగు లేన్లు సరిపోతాయి లోక్‌సభలో ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల ప్రశ్నలకు కేంద్రమంత్రి గడ్కరీ జవాబు ఇచ్చారు. ఎన్‌హెచ్-65లో 6 లేన్లు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్–విజయవాడ ఎన్‌హెచ్-65పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు.. -
హిమాచల్‌లో బీజేపీ ఓటమి.. అనురాగ్ ఠాకూర్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు!
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ పరాజయం పాలైంది. ప్రతి ఐదేళ్లకోసారి అధికార మార్పు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్‌కు పట్టంకట్టారు హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు. అయితే, అధికారంలో ఉండి కూడా బీజేపీ ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాషాయ దళం పరాజయం చెందడానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో అనురాగ్ ఠాకూర్‌పై ట్రోల్స్‌తో ఆయన ట్రెండింగ్‌లోకి వచ్చారు. రాష్ట్ర బీజేపీలో ఠాకూర్ అంతర్యుద్ధానికి తెరలేపారంటూ కొందరు కాషాయ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. I am presuming C. R. PATIL new BJP president on card. Great leader with thumping majority in Gujarat. Anurag Thakur should be sacked from BJP for family politics over and above party lines. — 🇮🇳🌞 GIREESH JUYAL 🇮🇳🌞जय श्री राम, (@juyal3405) December 8, 2022 బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఈసారి రెబల్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొత్తం 68 స్థానాల్లో 21 ప్రాంతాల్లో బీజేపీ రెబల్ అభ్యర్థులు పోటీ చేశారు. రెండు చోట్ల మాత్రమే విజయం సాధించినప్పటికీ.. బీజేపీ అనుకూల ఓట్లు చీలిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. అదే కాంగ్రెస్ విజయానికి సాయపడింది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో బీజేపీలో మూడు వర్గాలు ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. అనురాగ్ ఠాకూర్, జేపీ నడ్డా, సీఎం జైరాం ఠాకూర్ వర్గం. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెబల్స్ బరిలోకి దిగారు. ఎవరి వర్గం వారిని వారు గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేయటం పార్టీ ఓటమికి కారణమైంది. మరోవైపు.. బీజేపీలో కీలక నేత, మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ థుమాల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వలేదు అధిష్ఠానం. దీంతో ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అనురాగ్ ఠాకూర్ సొంత జిల్లాలోనే ఐదు సీట్లలో బీజేపీ ఓడిపోవడం విమర్శలకు తావిచ్చింది. బీజేపీలో కీలక నేతలు ఉన్నప్పటికీ.. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఒక్కరే ప్రచారం చేసి హస్తం పార్టీకి ఘన విజయం సాధించిపెట్టారని ఓ నెజిటన్ కామెంట్ చేశారు. In a head to head contest, in Nadda's state, in Anurag Thakur's state, against the might of the BJP's money, media and institutions, Priyanka Gandhi has defeated Modi. — Dushyant A (@atti_cus) December 8, 2022 Choice of candidates by JP Nadia & Anurag Thakur is questionable If a rebel is winning means the rebel was right candidate Also the home state of BJP Chief Nadda? Any effects of that? Look at the effect of Narendra Modi on his Home State Gujarat If BJP means business then act — Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) December 8, 2022 ఇదీ చదవండి: ఛండీగఢ్ కాదు.. షిమ్లాలోనే! కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?.. ఉత్కంఠ -
మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీ.. కేంద్రం ఏం చెప్పిందంటే?
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్నారు. ఇక ఉద్యోగులు, వ్యాపారస్తులు ఏకంగా రెండు పైనే ఖాతాలను నిర్వహిస్తున్నారు. కొందరు బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో మినిమం బ్యాలెన్స్ (కనీస మొత్తంలో నగదు) నిల్వ చేయలేక జరిమానాలు, అదనపు ఛార్జీలు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాంక్ అకౌంట్లో ఇక మినిమం బ్యాలెన్స్ జరిమానాలపై తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కిషన్రావ్ కారడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీని మాఫీ చేయడంపై వ్యక్తిగత బ్యాంకుల బోర్డులు నిర్ణయం తీసుకోవచ్చని కారడ్ తెలిపారు. ‘బ్యాంకులు స్వతంత్ర సంస్థలు. పెనాల్టీని రద్దు చేసే నిర్ణయం తీసుకునే అధికారం బోర్డులకు ఉన్నాయని’ అన్నారు. బ్యాంక్ రూల్స్ ప్రకారం తక్కువ నిల్వ (మినిమం బ్యాలెన్స్) ఉన్న ఖాతాలపై జరిమాన విధిస్తున్న విషయం విదితమే. అయితే ఇలాంటి అకౌంట్లపై ఎలాంటి పెనాల్టీ వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించడంపై కేంద్రం పరిశీలిస్తుందా అని అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 58 శాతంగా ఉందని, దానిని పెంచాలని అధికారులను కోరినట్లు కారడ్ తెలిపారు. అయితే ఇక్కడ క్లిష్టమైన భూభాగాలు ఉన్నప్పటికీ, జమ్మూ కాశ్మీర్లో బ్యాంకు కమ్యూనికేషన్ లేని ఒక్క గ్రామం కూడా లేదని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్ -
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
-
తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోంది: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే ప్రభుత్వం మర్యాద పాటించలేదని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా బేగంపేటలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వానికి కనీస మర్యాద లేదు. ప్రధాని తెలంగాణకు వస్తే ప్రభుత్వం మర్యాద పాటించలేదు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్‌ది నిజాం రాజ్యాంగం. సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రికి అభివృద్ధి పట్టదు. తెలంగాణ.. కుటుంబ పాలనలో బందీ అయ్యింది. రాష్ట్రంలో కుటుంబ, రాచరిక పాలన నడుస్తోంద’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు కిషన్ రెడ్డి. ఇదీ చదవండి: తెలంగాణ రామగుండంలో ప్రధాని మోదీ పర్యటన.. కీలక అప్డేట్స్ -
Viral Video: కేంద్ర మంత్రి చేసిన పనికి అంతా షాక్!
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బిలాస్పూర్ నియోజకవర్గం పరిధిలో ఆయన పర్యటిస్తుండగా.. ఆసక్తికర సంఘటన జరిగింది. నడి రోడ్డుపై బస్సు బ్రేక్‌డౌన్ అయ్యింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేంద్ర మంత్రి ఠాకూర్ కాన్వాయ్ సైతం నిలిచిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. విషయం తెలుసుకున్న ఆయన కారు దిగి అక్కడున్న వారితో కలిసి బస్సును వెనక్కి తోశారు. అనంతరం బస్సు డ్రైవర్, ప్రయాణికులతో కాసేపు మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ సర్దుకున్నాక అక్కడి నుంచి ప్రచారానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతకుముందు బిలాస్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఠాకూర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పర్యటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ‘ప్రాజెక్ట్ శక్తి’ పేరిట వచ్చే 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా! -
ట్విటర్ ఉద్యోగుల తొలగింపు సరైంది కాదు, అలా చేసుండాల్సింది: కేంద్రం ఆగ్రహం!
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో భారీ స్థాయిలో మార్పులకు నాంది పలికారు. అందులో ప్రధానంగా ఉద్యోగుల తీసివేత, అది కూడా ట్విటర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలగింపులు ఉండడంతో అది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులను తొలగిస్తూ ట్విటర్ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఖండించారు. ఈ అంశంపై స్పందిస్తూ.. భారత్‌లో ట్విటర్ ఉద్యోగుల అకస్మిక తొలగింపు సరైన చర్యకాదన్నారు. తొలగించిన వారికి మరో ఉద్యోగంలో మారేందుకు తగిన సమయం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.దేశంలో దాదాపు 150-180 మంది ఉద్యోగులతో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వర్క్‌ఫోర్స్‌లో సగం మందిని తొలగించిన సంగతి తెలిసిందే. భారత్‌లో సేల్స్ నుంచి మార్కెటింగ్ వరకు, కంటెంట్ క్యూరేషన్ నుంచి కార్పొరేట్ కమ్యూనికేషన్ల విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించారు. ఇదిలా ఉండగా ట్విట్టర్ ఇండియాలో మిగిలిన ఉద్యోగులు కూడా భవిష్యత్తులో తమ పరిస్థతి ఏంటని భయంతో జీవిస్తున్నారు. మరో వైపు మస్క్ మాత్రం ట్విట్టర్ సంస్థ రోజుకు 4 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోతున్నందున కంపెనీలోని సగం మంది ఉద్యోగులను తొలగించడం తప్ప వేరే మార్గం లేదంటున్నారు. చదవండి: ట్విటర్‌కు షాక్: లక్షలకొద్దీ కొత్త యూజర్లతో ప్రత్యర్థులకు పండగ -
ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబమే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
దేశానికే ఆర్ధికశాఖ మంత్రి..కూరగాయల మార్కెట్లో ఇలా..
ఎప్పుడూ దేశ బడ్జెట్, జీడీపీ, జీఎస్టీ అంటూ ఆర్ధిక అంశాల్లో ఊపిరి సలపని పనితో బిజీగా ఉండే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ మహిళగా మారారు. చెన్నైకి చెందిన ఓ వీధిలో కూరగాయలు కొంటూ స్థానికుల కంట పడ్డారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై జిల్లా మైలాపూర్ దక్షిణ మాడ వీధిలో శనివారం సాయంత్రం నిర్మలా సీతారామన్ సందడి చేశారు. కేంద్ర మంత్రి హోదాను పక్కన పెట్టి సాధారణ గృహిణిగా కూరగాయాల్ని కొనుగోలు చేశారు. న్యూఢిల్లీకి బయలు దేరే ముందు ఇంట్లో వంటకు కావాల్సిన టర్కీ బెర్రీ (ఉస్తికాయలు), పిడి కరణై (కందగడ్డ), ములై కీరై (ఒక రకమైన ఉసిరికాయ), మనతక్కలి కీరై (పాల కూర)ను కొనుగోలు చేశారు. During her day-long visit to Chennai, Smt @nsitharaman made a halt at Mylapore market where she interacted with the vendors & local residents and also purchased vegetables. pic.twitter.com/emJlu81BRh — NSitharamanOffice (@nsitharamanoffc) October 8, 2022 కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో స్థానికులతో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగ్గారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ ‘వీధిల్లో కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో ఆమె సెక్యూరిటీని చూసి వ్యాపారులు కాస్త బయపడ్డారు. ఇక్కడికి వచ్చింది నిర్మలా సీతారామన్ అని తెలుసుకొని సంతోషించారని, స్థానికులు టీ తాగేందుకు పిలిచినట్లు బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ అన్నారు. చదవండి👉 ‘ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది’: నిర్మలా సీతారామన్ -
లోక్‌సభ స్థానాల్లో రాజకీయ వేడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుస పర్యటనలతో కేంద్ర మంత్రులు రాజకీయ దుమారం రేపుతున్నారు. ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జహీరాబాద్ లోక్‌సభ పరిధిలో పర్యటన చేపట్టారు. గురువారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆమె ఘాటైన విమర్శలు చేయడం తెలిసిందే. ఇక శుక్రవారం బీర్కూర్‌లో జిల్లా కలెక్టర్‌ను రేషన్ బియ్యంపై నిలదీయడం చర్చనీయాంశమ య్యింది. ఈ పథకం కింద కిలో బియ్యానికి రూ.35 వరకు ఖర్చవుతుంటే, కేంద్రం 28 చెల్లిస్తున్న విషయాన్ని వెల్లడించడంతో పాటు రేషన్ షాపుల్లో మోదీ చిత్రపటాలు పెట్టాలంటూ ఆదేశించడం టీఆర్ఎస్ ఆగ్రహానికి కారణమైంది. గతంలో పర్యటించిన కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర సర్కార్, గులాబీ పార్టీపై విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రాష్ట్ర మంత్రులు స్పందించడం తెలిసిందే. 14 ఎంపీ స్థానాల్లో..పక్కా వ్యూహంతో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాల్లో (బీజేపీ సిట్టింగ్ స్థానాలు సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహాయించి) పర్యటించి కేంద్రం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను గురించి ప్రజలకు ప్రత్యక్షంగా తెలియజేయా లని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించాలని సూచించింది. విభిన్న పథకాల ద్వారా వివిధ వర్గాల పేదలకు కేంద్రం నుంచి అందుతున్న సహాయం, ఆయా సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేంద్ర వాటాగా అందజేస్తున్న నిధులు కేంద్రమంత్రుల ద్వారా వివరిస్తే దాని ప్రభావం ప్రజల్లో ఎక్కువగా ఉంటుందనే భావనతో బీజేపీ ఈ వ్యూహాన్ని ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు జిల్లాల్లో మకాం వేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా.. లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా ఈ పర్యట నలు కొనసాగనున్నాయి. ఇప్పటికే హైదరా బాద్ లోక్‌సభ పరిధిలో జ్యోతిరాధిత్య సింధియా, ఆదిలాబాద్ (ఎస్టీ) స్థానంలో పురు షోత్తం రూపాలా, మల్కాజిగిరిలో ప్రహ్లాద్ జోషి, నల్లగొండలో కైలాష్‌చౌదరి, భువనగి రిలో దేవీసింగ్, ఖమ్మంలో బీఎల్ వర్మ పర్యటించారు. తాజాగా నిర్మలా సీతారామన్ జహీరాబాద్ పర్యటన చేపట్టారు. ఇక మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే శుక్రవారం నుంచి పర్యటన ప్రారంభించారు. ఈ నెల 4,5 తేదీల్లో మహబూబా బాద్ ఎంపీ స్థానంలో కేంద్రమంత్రి బీఎల్ వర్మ పర్యటించనున్నారు. ఇప్పటికే పర్యటించినా మళ్లీ నెలా, రెండునెలల వ్యవధిలో మరోసారి తమకు కేటాయించిన లోక్‌సభ సీట్ల పరిధిలో పర్యటిస్తారు. -
కేంద్ర మంత్రిని గుర్తుపట్టని అధికారి.. ఉద్యోగానికి ఎసరు?
లక్నో: పైఅధికారులు ఫోన్ చేస్తేనే ఎంతో హడావిడి చేస్తారు అధికారులు. అలాంటిది కేంద్ర మంత్రి ఫోన్ అంటే మరి ఎలా ఉంటుంది? కానీ, ఫోన్ చేసిన కేంద్రమంత్రి గొంతును గుర్తుపట్టకపోవడం వల్ల ఓ అధికారి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గ ఎంపీ స్మృతి ఇరానీ ఫోన్ చేయగా ఓ శాఖలో పని చేస్తున్న క్లర్క్ గుర్తించకపోవటంతో ఆయనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఏం జరిగింది? అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగస్టు 27న పర్యటించారు. అదే సమయంలో ముసఫిర్ఖానా తహసిల్‌లోని పూరే పహల్వాన్ గ్రామానికి చెందిన కరుణేశ్(27) అనే వ్యక్తి తన తల్లికి పెన్షన్ మంజూరు కాలేదనే విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్థానిక కార్యాలయంలో క్లర్క్ దీపక్ కారణమని పేర్కొన్నారు. పెన్షన్ దరఖాస్తును ఇంకా అతడు ధ్రువీకరించలేదని తన గోడు వెల్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన స్మృతి ఇరానీ.. ఆ అధికారికి ఫోన్ చేశారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం కేంద్ర మంత్రి గొంతును గుర్తు పట్టలేకపోయారు. దీంతో ఆమె పక్కనే ఉన్న జిల్లా ఉన్నతాధికారి ఆ ఫోన్ తీసుకొని క్లర్క్‌తో మాట్లాడారు. వెంటనే కార్యాలయానికి రావాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై విచారణ జరపాలని జిల్లా అధికారులకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సూచించారు. కరుణేశ్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అధికారులు.. క్లర్క్ నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ముసఫిర్ఖానా సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్ విచారణ జరుపుతారని.. నివేదిక ప్రకారం నిర్లక్ష్యం వహించిన అధికారిపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మోదీ రోజుకు ఏడు సార్లు నమాజ్ చేసేవారు.. కాంగ్రెస్ మహిళా నేత వ్యాఖ్యలపై దుమారం.. -
నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు.. బాగున్నారా..
సాక్షి, విశాఖపట్నం: ‘బాగున్నారా.. కాఫీ చాలా చాలా బాగుంది.. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు’ అంటూ ఇథియోపియా కేంద్ర మంత్రి ఎర్గోగి టిస్‌ఫాయే తెలుగులో మాట్లాడి అబ్బురపరిచారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంత్రపాలజీ విభాగంలో పీహెచ్డీ చేశానని, ఆ సమయంలో విశాఖలో ఉన్నప్పుడు కొన్ని తెలుగు పదాలను నేర్చుకున్నానని చెప్పారు. పూర్తిగా తెలుగులో మాట్లాడలేకపోయినా, అర్థం చేసుకోగలనన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ తనకు తల్లితో సమానమని, వర్సిటీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. శుక్రవారం ఏయూకు విచ్చేసిన ఆమె ఇష్టాగోష్టిలో పలు విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఐసీసీఆర్ నుంచి విశిష్ట పూర్వవిద్యార్థి పురస్కారం నేను ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) అందించిన స్కాలర్‌షిప్‌తో చదువుకున్నాను. ఏయూలో ప్రొఫెసర్ల బోధన నాకు ఎంతో నచ్చింది, ఉపకరించింది. మానవ అధ్యయనానికి భారత్ సరైన వేదిక అని నాకు అనిపించింది. ఇక్కడ విభిన్న సంస్కృతులు, భాషలు, వైవిధ్యాల సమ్మేళనం దర్శనమిస్తుంది. ఐసీసీఆర్ నుంచి విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం అందుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. ఏయూ విద్యార్థిగా నేను గర్విస్తాను. భారత్‌ను ఎంచుకోమంటాను ప్రతీ సంవత్సరం ఇథియోపియా నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. వీరికి భారత్‌కు వెళ్లాలని నేను సూచిస్తున్నాను. ముఖ్యంగా ఏయూలో చదువుకోవాలని, ఇక్కడ వాతావరణం, ప్రజలు బాగుంటారని వారికి పలు సందర్భాలలో తెలియజేస్తున్నా. వాతావరణం, ఆహారం, ప్రజలు తదితర అంశాల్లో భారత్, ఇథియోపియా దేశాల మధ్య సారూప్యత అధికంగా ఉంటుంది. ఏయూతో కలసి పని చేస్తాం నాకు తల్లితో సమానమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తాం. స్టార్టప్ రంగంలో ఇథియోపియాకు కొంత సహకారం, మార్గదర్శకత్వం అవసరం. ఏయూ ఇప్పటికే ఈ రంగంలో మంచి ప్రగతిని సాధించింది. ఈ దిశగా ఏయూ సహకారం తీసుకుంటాం. డ్యూయల్ డిగ్రీ కోర్సులను సైతం నిర్వహించే ప్రదిపాదన ఉంది. తెలుగు ప్రజలు మంచివారు నా పీహెచ్డీ పూర్తిచేసే క్రమంలో తెలుగు ప్రజలతో ఉండే అవకాశం లభించింది. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. విశాఖ సుందరమైన నగరం. ఇక్కడ ఉన్న సమయంలో కొన్ని తెలుగు పదాలను నేర్చుకున్నారు. ఎవరు, ఎంత.. ఇలా అనేక పదాలను నేను ఇప్పటికీ మరచిపోలేదు. ఉన్నతంగా ఎదిగారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన ఇథియోపియా దేశస్తులు ఉన్నత స్థితిలో రాణిస్తున్నారు. విభిన్న శాఖల్లో మంత్రులుగా, విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా సేవలు అందిస్తున్నారు. వీరంతా ఏయూ పూర్వవిద్యార్థులే అనే విషయం మరువలేదు. ఇథియోపియాలో భారత్ పెట్టుబడులు ఇథియోపియా దేశంలో అనేకమంది భారతీయులు పెట్టుబడులు పెడుతున్నారు. వాటిని స్వాగతిస్తున్నాం. అదే విధంగా పెద్దసంఖ్యలో భారతీయులు ఇథియోపియా విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నారు. మా దేశంలో శాంతిని కాంక్షిస్తాం. ఇండియా ఇన్క్రెడిబుల్ నేను తొలిసారిగా విద్యార్థిగా ఇథియోపియా నుంచి భారత్‌కు వచ్చే సమయంలో విమానాశ్రయంలో ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ అనే పదాన్ని చూశాను. ఇది నిజమా అనే భావన నాకు కలిగింది. తరువాత నేను భారత్‌లో ఉన్న కాలంలో చూసిన పరిస్థితులు, అనుభవాల తరువాత ఇది సరిగ్గా సరిపోతుందనే భావన నాకు కలిగింది. ఇథియోపియాలో ఏయూ ముద్ర ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేపట్టే సంస్కరణలు, అభివృద్ధి ఆలోచనలు ఇథియోపియాపై ప్రభావం చూపుతాయి. ఇక్కడ అధికారులు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థుల నుంచి ఇథియోపియాకు చేరతాయి. పరోక్షంగా ఇథియోపియా విద్యా వ్యవస్థను ఏయూ ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. (క్లిక్: పెంపుడు కుక్కతో ‘టెక్కీ’ లవ్ జర్నీ.. ఎందుకో తెలుసా..?) -
బెంగాల్‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ముగ్గురు కేంద్ర మంత్రులకు బాధ్యతలు
న్యూఢిల్లీ: 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విపక్ష రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది బీజేపీ. 2019 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అనూహ్యంగా పుంజుకుంది. 42 పార్లమెంట్ స్థానాలకు గానూ ఏకంగా 18 స్థానాలు సాధించింది. అదే ఊపును 2024లోనూ కనబరచాలని తహతహలాడుతోంది. అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ముగ్గురు కేంద్ర మంత్రులకు పశ్చిమ బెంగాల్ బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రులు ధర్మేద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, జోతిరాదిత్య సింధియాలకు పశ్చిమ బెంగాల్ బాధ్యతలు అప్పగించింది బీజేపీ. ఇప్పటికే.. ఆయా మంత్రులు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సహా స్థానిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన ప్రాంతాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హాకు సైతం ఈ రాష్ట్రానికే పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్.. ఉపరాష్ట్రపతి అయిన క్రమంలో బెంగాల్‌పై ఇతర ఛానల్స్ ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఇటీవల ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. దీంతో బీజేపీ, టీఎంసీ మధ్య ఒప్పందం వంటి ఆరోపణలను తిప్పికొట్టాలని రాష్ట్ర శాఖను ఆదేశించారు నేతలు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు బెంగాల్లో సువేందు అధికారితో పాటు పార్టీ శ్రేణులతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో 42 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు.. మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అప్పగించనున్నారని సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీలు బెంగాలీలో అనార్గళంగా మాట్లాడగలరు. అది మరింత ప్రయోజనం చేకూర్చనుంది. జోతిరాదిత్య సింధియాకు అతిపెద్ద నియోజకవర్గం దమ్‌దమ్‌ను అప్పగించనున్నారు. ఇదీ చదవండి: బెంగాల్ రాజకీయాల్లో కలకలం.. ఎవరీ అనుబ్రతా మోండల్? -
కేంద్రమంత్రి సతీమణి పర్స్ మిస్సింగ్.. పెద్దసంఖ్యలో రంగంలోకి పోలీసులు.. చివరకి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: యాత్ర కోసం కన్యాకుమారి జిల్లాకు వచ్చిన కేంద్రమంత్రి భార్య మనీ పర్స్ కనపడకుండా పోవడం కలకలం రేపింది. పెద్దసంఖ్యలో పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి వెతుకులాట ప్రారంభించి పర్స్‌ను గుర్తించారు. వివరాలు.. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్రావ్ కారత్ కన్యాకుమారి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మంగళవారం ఉదయం అక్కడి సుచీంద్రం దానుమలయస్వామి ఆలయానికి సతీమణి అంజలికారత్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడ అంజలీకారత్ తన మనీపర్స్ కనపడక పోవడంతో ఆలయ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది వెదికినా పర్స్ కనపించలేదు. దీంతో బందోబస్తుగా వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఆలయ సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు. ఇందిర వినాయక సన్నిధిలో ఆమె దర్శనం చేసుకునేటప్పుడు పర్స్ చేతి నుంచి జారి కిందపడినట్లు, దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు దాన్ని తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. నిందితుడు చెన్నైకి చెందిన ఓ జ్యోతిష్కుడి అని తేలింది. అతడు నాగర్‌కోవిల్ రైల్వేస్టేషన్లో రైలు కోసం వేచి ఉన్నట్లు తెలియడంతో, అక్కడికి వెళ్లి పోలీసులు పర్స్‌ను స్వాధీనం చేసుకుని కేంద్ర మంత్రి సతీమణికి అప్పగించారు. చదవండి: ఓపీఎస్‌కు మరో షాకిచ్చిన ఈపీఎస్.. 18 మంది బహిష్కరణ -
దేశంలోనే తొలి 'ఎలక్ట్రిక్ హైవే'.. ఆ నగరాల మధ్య నిర్మాణం!
ఢిల్లీ: దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవేను నిర్మించేందుకు ప్రణాళిక రచిస్తోంది భారత ప్రభుత్వం. తొలి రహదారిని దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలమధ్య నిర్మించనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ రహదారిపై ట్రాలీబస్సుల మాదిరిగానే ట్రాలీ ట్రక్కులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. దాని ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఢిల్లీలో నిర్వహంచిన హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ కార్యక్రమం వేదికగా తొలి ఎలక్ట్రిక్ హైవే వివరాలను బహిర్గతం చేశారు గడ్కరీ. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2.5 లక్షల సొరంగాలను నిర్మించినట్లు తెలిపారు. 'ఢిల్లీ నుంచి ముంబై వరకు ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలని ప్రణాళిక చేస్తున్నాం. ట్రాలీబస్సుల మాదిరిగానే మీరు ట్రాలీట్రక్కులను ఈ దారిలో తీసుకొస్తాం.' అని తెలిపారు. అయితే.. ఈ రహదారి గురించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ హైవే అంటే ఏమిటి? ఎలక్ట్రిక్ హైవే అనగానే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. వాహనాలకు ఈ రహదారులపై వెళ్తున్న క్రమంలో ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్ల ద్వారా పవర్ సరఫరా చేస్తారు. రైల్వే ట్రాక్‌ల మాదిరిగానే ఉంటాయి. హైవే పొడవున ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేస్తారు. ట్రాలీబస్సులు, ట్రాలీట్రక్కులను ఉపయోగించటం ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు రవాణా సామర్థ్యం పెరుగుతుందనేది కేంద్రం ఆలోచన. మరోవైపు.. పెట్రోల్, డీజిల్‌ల ద్వారా కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో భారీ వాహనాల ఓనర్లు ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాలవైపు వెళ్లాలని కోరారు నితిన్ గడ్కరీ. అలాగే.. అన్ని జిల్లా కేంద్రాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానిస్తామన్నారు. ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుందని, ఆర్టీఓల ద్వారా అందే సేవలను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించటమే తమ లక్ష్యమన్నారు. వస్తు రవాణా వ్యయం చైనా, ఐరోపా, అమెరికాలతో పోలిస్తే భారత్‌లోనే అధికమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? -
TS: కేంద్ర మంత్రికి చేదు అనుభవం.. బీజేపీ నేతలు ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు కాషాయ పార్టీకి చెందిన నేతలు నగరానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో మెదక్ ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, కేంద్ర మంత్రి బాల్యన్ కోసం స్థానిక బీజేపీ నేతలు గెస్ట్ హౌస్ బుక్ చేశారు. ఈ క్రమంలో శనివారం మంత్రితో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. కానీ, ఆర్ అండ్ బీ అధికారులు గెస్ట్ హౌస్‌కు తాళాలు వేసి ఉండటం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో మంత్రితో పాటు అక్కడికి వచ్చిన బీజేపీ నేతలు అర గంట పాటు వేచి చూశారు. అనంతరం.. అధికారులను సంప్రదిస్తే ఎవరు ఫోన్‌కి స్పందించలేదు. మెదక్ ఆర్డీవో, తహసీల్దార్లను సంప్రదించగా వారి నుంచి కూడా స్పందన రాలేదు. దీంతో, అధికారుల తీరుపై ఆగ్రహించిన బీజేపీ నేతలు తాళం పగల కొట్టి లోపలికి వెళ్లారు. కేంద్ర మంత్రి వస్తే కనీస గౌరవం లేకుండా తాళం వేసి అధికారులు అందుబాటులో లేకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: సీఎం యోగి.. భాగ్యలక్ష్మి టెంపుల్ పర్యటనలో మార్పు -
కేంద్రమంత్రులకు సీఎం జగన్ లేఖలు
-
దేశంలోనే ఎక్కడలేని పరిశోధన కేంద్రం
-
ఎస్టీ రిజర్వేషన్లపై అబద్ధం చెప్పారు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడుపై లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ పెంపు అంశంపై ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటును పక్కదోవ పట్టించేందుకు బిశ్వేశ్వర్ వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీసు అందించారు. దీంతోపాటు బుధవారం సభా కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ప్లకార్డులతో వెల్‌లో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలు అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను 6.8% నుంచి 10శాతానికి పెంచుతూ 2017 ఏప్రిల్ 16న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్ర హోంశాఖ, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖకు పంపిన విషయాన్ని నోటీసులో గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఈ నెల 21న ఒక ప్రశ్నకు బిశ్వేశ్వర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం పార్లమెంటును పక్కదోవ పట్టించేదిలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను బర్తరఫ్ చేసి కేంద్రప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాలోత్ కవిత మాట్లాడారు. అబద్ధం చెప్పారు ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశంపై తెలంగాణ నుంచి బిల్లు వచ్చిన విషయం తెలిసినప్పటికీ, బిశ్వేశ్వర్ అబద్ధం చెప్పారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ఆరోపించారు. తెలంగాణ నుంచి ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశంపై బిల్లు తమకు వచ్చిందని మూడేళ్ల క్రితం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిందన్నారు. ‘ఐదేళ్ళుగా ఈ బిల్లుకు సంబంధించి అనేకసార్లు కేంద్రమంతులకు వినతిపత్రాలు ఇచ్చాం. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖలు రాయడంతోపాటు భేటీ అయిన సందర్భంలో చర్చించారు. అయినప్పటికీ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. తెలంగాణపై బిశ్వేశ్వర్ అక్కసు వెళ్లగక్కారు’అని నామా చెప్పారు. ఆ నలుగురు ఏంచేస్తున్నారు: ప్రభాకర్ రెడ్డి లోక్‌సభలో ఉన్న తెలంగాణకు చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు ప్రతీరోజు కేసీఆర్‌ను తిట్టడమే తప్ప, తెలంగాణకు ఏం చేస్తారో చెప్పరని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. బిశ్వేశ్వర్ సమాధానంతో తెలంగాణ గిరిజనులు కలత చెందారని ఎంపీ మాలోత్ కవిత చెప్పారు. మీడియా సమావేశంలో ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, వెంకటేశ్ నేత, రంజిత్‌రెడ్డి, రాములు, పసునూరి దయాకర్, లింగయ్య యాదవ్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘ఏపీ అభివృద్ధికి అన్నివిధాలా కేంద్రం సహకారం’
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. శుక్రవారం పోలవరంలో పర్యటించిన అనంతరం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ పేరిట ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. దేశంలో బీజేపీ ఒకటి నుంచి మొదలు పెట్టి ఈ రోజు ఈ స్థాయికి చేరుకుందని, ఈ విజయ పయనం వెనుక ఎంతోమంది కృషి ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. దేశంలో మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పార్టీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో షెకావత్ సమావేశమయ్యారు. ఏపీకి మోదీ అందిస్తున్న వరం పోలవరం అని అన్నారు. -
పురోగతికి ఇది బూస్టర్ బడ్జెట్
ఆర్థిక సంక్షోభ సమయంలోనూ బడ్జెట్లోని ఉద్దీపనల ప్రణాళికల లక్ష్యాన్ని కూడా మించి భారత్ గత రెండేళ్లుగా సత్ఫలితాలను పొందగలుగుతోందంటే కారణం– దేశాన్ని నడిపిస్తున్నవారి దృఢత్వం. బడ్జెట్‌పై ఎవరెన్ని విమర్శలు చేసినా, లెక్కల ఎక్కువ తక్కువల నుంచి నిరాశాపూరితమైన అర్థతాత్ప ర్యాలను ఎత్తి చూపినా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రానున్న పాతికేళ్లలో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర గమనాన్ని అభివృద్ధిపథంలోకి వేగవంతం చేసే భవిష్యత్ ప్రణాళికే ఈ బడ్జెట్. కరోనా ప్రభావ పర్యవసానాల నుంచి దేశాన్ని ముందుగానే భద్రతా వలయంలోకి తప్పిం చడం, అభివృద్ధిని కుంటపడ నివ్వని విధంగా స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం అనే రెండు అంశాలపై తాజా కేంద్ర బడ్జెట్ చక్కని సమతుల్యతను పాటిం చింది. కరోనా తన అనూహ్యమైన ఉత్పరివర్తనలతో ప్రపంచ దేశా లతో పాటు భారత్‌నీ లాక్డౌన్లోకి నెట్టేసిన నేపథ్యంలో మిగతా దేశాల మాదిరిగానే మనమూ ఈ విపత్తువంటి పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు అనుగుణంగా రెండు వార్షిక బడ్జెట్లకు, మధ్యమధ్య కొన్ని చిన్నతరహా బడ్జెట్లకు రూపకల్పన చేసుకున్నాం. సహజంగానే ఈ అత్యయిక స్థితిలో సంపన్న దేశాలు తమ బడ్జెట్లలో భారీ ఉద్దీపన ప్రణాళికలను ఏర్పరచుకున్నాయి. భారత్ కూడా అదే బాటలో ఆర్థికపరమైన స్థిర నిర్ణయాలకు మొగ్గు చూపింది. రెండేళ్లు గడిచినా నెమ్మదించని కరోనా... సంపన్న దేశా లను సైతం అప్పుల పాలు చేసింది. యావత్ ప్రపంచ పురోగతి మార్గాలు మూసుకుపోయాయి. ద్రవ్యోల్బణం ఆయా దేశాలను వరదలా ముంచెత్తింది. అదే సమయంలో భారత్... ప్రపంచం లోనే అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఈ ఏడాది 9.2 శాతం స్థూల జాతీయోత్పత్తిని సాధించే దిశగా పయని స్తోంది. కఠినమైన ఈ ఆర్థిక సంక్షోభ సమయంలోనూ బడ్జెట్ లోని ఉద్దీపనల ప్రణాళికల లక్ష్యాన్ని మించి కూడా సత్ఫలితా లను భారత్ పొందగలుగుతోందంటే కారణం... దేశాన్ని నడిపి స్తున్నవారి దృఢత్వం, వారి తిరుగులేని అధినాయక ఆర్థిక దిశా నిర్దేశకత్వమే! గత రెండేళ్లుగా భారత్ అనుసరిస్తూ వస్తున్న చురుకైన విధానాల రూపకల్పన, వస్తు సేవల సరఫరాలను పెంపొందిం చేలా తీసుకువచ్చిన సంస్కరణలు వర్తమాన ఆర్థిక స్థితికి పటిష్ఠ మైన పునాదిని అందించాయి. 2047 నాటికి వందేళ్ల స్వాతంత్య్రం వైపు భారతదేశాన్ని తీసుకెళ్లే పాతికేళ్ల ‘అమృత కాల’ జవ, జీవనయాన మార్గాన్ని సుగమం చేశాయి. ఆర్థిక అవ రోధాలను, అంతరాయాలను వినూత్న ఆవిష్కరణలతో నెగ్గుకు వచ్చేందుకు భారత ప్రధాని దర్శించిన ‘ఆత్మనిర్భర భారత్’ ప్రపంచ దేశాలకు కూడా దారి చూపగలిగినంతటి శక్తిమంత మైనది. ఈ దార్శనికతకు కొనసాగింపుగానే భారత సమ్మిళిత, స్థిరాభివృద్ధి కోసం 2022–23 బడ్జెట్‌కు సూత్రకల్పన జరిగింది. ఇందులో భావి భారత నిర్మాణానికి పునాది స్తంభాలుగా కనిపి స్తున్న కొన్ని ముఖ్యాంశాలను నేను ఇక్కడ ప్రస్తావించదలిచాను. ఒక పార్టీ నాయకుడిగా కాక, ప్రజాహితాన్ని ఆశించే ఒక పరిశీల కుడిగా బడ్జెట్లోనే నేను నాలుగు అంశాలను తరచి చూశాను. మొదటిది – మూలధన వ్యయం. భారతదేశ మధ్యకాలిక వృద్ధిని ప్రగతిపథంలో పైపైకి పురోగమింపజేసే శక్తి.. నిరంత రాయంగా కొనసాగే స్థిరత్వమే. ఆ స్థిరత్వాన్ని కల్పించే మౌలిక సదుపాయాల వ్యయానికి గత ఏడాది బడ్జెట్లో జరిగిన భారీ కేటాయింపులు తాజా బడ్జెట్లో గణనీయంగా అపూర్వ రీతిలో రూ. 7.5 లక్షల కోట్లు అయి, 35.4 శాతం పెరిగాయి. ఇదే ఊపులో గతిశక్తి బృహత్ ప్రణాళికలో ఒక భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించే 1.5 ట్రిలియన్ డాలర్ల జాతీయ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఈ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది. అనుసంధాన పరిధిలోకి వచ్చే విద్య, రక్షణ, వాణిజ్య రంగాలపైన కూడా గతిశక్తి సానుకూల ప్రభావం, ప్రయోజనం ఉంటాయి. రెండవది – డిజిటైజేషన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంభ వించగల మార్పులు, పరిణామాలకు అనుగుణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని పునఃపరిశీలించుకునేందుకు అవసర మైన ముఖ్యమైన పనిని తాజా బడ్జెట్ నిర్దేశించుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటల్ కరెన్సీతో బలోపేతం చేసే ఈ అద్భుతమైన ఆలోచన మోదీ ప్రగతిశీల భావజాలం నుంచి ఆవిర్భవించిందే! దీంతో భారత్ ప్రపంచంలోనే డిజిటల్ కరెన్సీ కలిగిన అతి పెద్ద దేశాలలో ఒకటిగా అవతరించినట్లయింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు డిజిటల్ కరెన్సీ గట్టి రక్షణను ఇస్తుంది. ఆన్లైన్ మోసాల నుంచి భద్రతనిస్తుంది. మనీ లాండరింగ్‌ను నిరోధిస్తుంది. మూడవది – పన్ను ఆదాయాల రాబడిని పెంచే నిర్ణ యాలు. గడిచిన ఏడాదిలో ప్రతినెలా కూడా వస్తుసేవల పన్ను వసూళ్లు (జీఎస్టీ) రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. ఒక్క జనవరిలోనే మునుపెన్నడూ లేనంత అత్యధికంగా వసూళ్లు రూ. 1.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి! ఫలితంగా ద్రవ్యోల్బణం నెమ్మదిగానే అయినా కచ్చితంగా దారికి వస్తుంది. నాల్గవది, వ్యక్తులను ఆర్థికంగా శక్తిమంతులను చేయడం. వారికి సాధికారతను కలిగించడం. నిర్ణయాధికార బలాన్ని చేకూర్చడం. బడ్జెట్లోని సామాజిక రక్షణను పునర్వచించిన విలక్షణమైన గుణం ఇది. పి.ఎం. ఆవాస్ యోజన, పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి వంటి కీలకమైన పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు స్పష్టమైన వ్యత్యాసంతో పెరిగాయి. అత్యంత ప్రజావశ్యక ‘హర్ ఘర్ నల్ సే జల్’ పథకం కింద 3 కోట్ల 50 లక్షల ఇళ్లకు తాగు నీటిని అందించేందుకు కేంద్ర 60 వేల కోట్ల రూపాయలను ప్రత్యేకించింది. దేశంలో వివిధ ప్రాంతాలను కలిపే విధంగా 25 వేల కి.మీ. జాతీయ రహదారుల నిర్మా ణానికి ప్రాధాన్యం ఇచ్చింది. ‘ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సా హాక’ ప్రణాళికతో 60 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించ బోతోంది. మహమ్మారి నీడ పడిన ప్రతి రంగానికి, ప్రతి విభా గానికి వెలుగును ప్రసరింపజేసేందుకు ఉద్దేశించిన ఈ బడ్జెట్... రైతులకు నేరుగా కూ. 2.37 లక్షల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించబోతోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభి వృద్ధి కోసం ప్రస్తుతం ఉన్న అత్యవసర రుణ సహాయ వ్యవస్థను పరిపుష్టం చేసి, ఆ పరిశ్రమల పనితీరును వేగవంతం చేసే పథ కాన్ని ప్రవేశపెట్టనుంది. అంకుర సంస్థలకు పన్ను మినహా యింపులను విస్తృతం చేస్తోంది. ఎవరెన్ని విమర్శలు చేసినా, లెక్కల ఎక్కువ తక్కువల నుంచి నిరాశాపూరితమైన అర్థతాత్పర్యాలను ఎత్తి చూపినా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో.. రానున్న పాతికేళ్లలో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర గమనాన్ని అభివృద్ధి పథంలోకి వేగవంతం చేసే సమీప భవిష్యత్ ప్రణాళికే ఈ బడ్జెట్. ముందే చెప్పినట్లు కరోనా ప్రభావాల నుంచి జాతికి రక్షణ వలయాన్ని ఏర్పరుస్తూ, అదే సమయంలో స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేలా ఒక చక్కటి సమతుల్యాన్ని పాటిస్తూ రూపొందిన బడ్జెట్ ఇది. ప్రపంచ దేశాలలో భారత్ మహాశక్తిగా ఎదిగే పరివర్తన క్రమాన్ని మోదీ పాలనలోనే దేశ ప్రజల చూడబోతున్నారు. ఈ పరివర్తన.. మౌలిక సదుపాయాలు, డిజిటైజేషన్, మూలధన పెట్టుబడులు, వాణిజ్య స్నేహశీలతల చక్రాలపై, ఇంకా.. కోటీ ముప్పై లక్షల మంది ప్రజల స్ఫూర్తి సామర్థ్యాలపై సాగబోతోందని బడ్జెట్ సారాంశం తెలియ జేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాలన వ్యవహారశైలిలోని దృఢత్వం, భావిభారత లక్ష్యాలపై పట్టు, భారత్ ఎంత గడ్డు స్థితినైనా ఎదుర్కోగలదని ఆయన ఇస్తున్న ధీమా, అర్థంలేని విమర్శలతో విలువైన చట్టసభల సమయాన్ని, ప్రజాధనాన్ని వృ«థా పరిచే ప్రతిపక్షాల కుటిలయత్నాలకు గట్టి సమాధానం బడ్జెట్లో ప్రతిఫలించాయి. జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రి –బీజేపీ నాయకుడు -
అధికారులపై కేంద్రమంత్రి దాడి.. తలుపులు మూసి కుర్చీ తీసుకొని..
భువనేశ్వర్: కేంద్రమంత్రి విశ్వేశ్వర టుడు ప్రభుత్వ అధికారులపై దాడి చేసి, వారిని గాయపరిచారు. మయూర్భంజ్ జిల్లాలో ఈ సంచలనాత్మక సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో మయూర్భంజ్ జిల్లా ప్రణాళిక, పర్యవేక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టరు అశ్వినికుమార్ మల్లిక్, సహాయ డైరెక్టరు దేవాశిష్ మహాపాత్రో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. లక్ష్మీపోషీ దగ్గరున్న పార్టీ కార్యాలయానికి సదరు అధికారులను రప్పించుకుని, మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి, అధికారుల మధ్య జరిగిన చర్చ వేడెక్కడంతో మంత్రి తన అనుచరులతో కార్యాలయం తలుపులు మూయించి, అధికారులను దుర్భాషలాడి అక్కడి కుర్చీతో వారిపై దాడికి పాల్పడినట్లు ప్రధాన ఆరోపణ. ఈ దాడిలో అశ్వినికుమార్ మల్లిక్ ఎడమ చేయి విరిగింది. ఈ విషయం జిల్లా కలెక్టరు దృష్టికి వెళ్లగా లిఖితపూర్వకమైన ఫిర్యాదు దాఖలు చేస్తే తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణ అవాస్తవమని మంత్రి విశ్వేశ్వర టుడు ఖండించారు. -
2023 వరకు సీఎం మార్పు ఉండదు: కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): రాష్ట్రంలో 2023 వరకు సీఎం మార్పు ఉండదని, ముఖ్యమంత్రిగా బొమ్మై కొనసాగుతారని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. హుబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రి ఈశ్వరప్ప సీఎం మార్పు వ్యాఖ్యలు చేయడం తప్పన్నారు. అదే విధంగా ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవెగౌడల కలయిక సాధారణమేనని, హాసన్ ఐఐటీ తదితర విషయాలపై మాట్లాడారని అన్నారు. పొత్తు విషయం తనకు తెలియదన్నారు. -
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అబద్దాలు చెబుతున్నారు
-
సూర్యాపేటలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర
-
కేంద్రమంత్రికి కాల్పులతో స్వాగతం?
సాక్షి, రాయచూరు(కర్ణాటక): ప్రముఖులు వచ్చినప్పుడు పూలదండలు, మేళతాళాలతో స్వాగతం పలకడం ఆనవాయితీ. అయితే కేంద్ర సహాయ మంత్రికి ఓ మాజీ మంత్రి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు తుపాకులతో కాల్పులు జరిపి స్వాగతించారు. యాదగిరిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. బీజేపీ జనాశీర్వాద యాత్రలో పాల్గొనడానికి కొత్తగా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి అయిన భగవంత్ ఖూబా బుధవారం యాదగిరికి వచ్చారు. మాజీ మంత్రి బాబురావ్ చించనసూరూ, మరో నలుగురు తుపాకులు తీసుకొని ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి మంత్రికి వినూత్న స్వాగతం పలికారు. కాల్పుల శబ్ధం విని కార్యకర్తలు భీతిల్లారు. కాగా కాల్పులు జరిపిన నింగప్ప, మాళప్ప, శరణప్ప, రేణప్పలపై యాదగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు యాదగిరి జిల్లా ఎస్పీ వేదమూర్తి తెలిపారు. మాజీ మంత్రి బాబురావ్‌పై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
స్వచ్ఛంద సంస్థల్లో రూ. 49 వేల కోట్ల విదేశీ నిధులు
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన 18 వేలకు పైగా స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓలు) కలసి మూడేళ్లలో రూ. 49 వేల కోట్లుకు పైగా విదేశీ నిధుల్ని పొందాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2017–18లో రూ. 16,940.58 కోట్లు, 2018–19లో రూ. 16,525.73 కోట్లు, 2019–20లో రూ. 15,853.94 కోట్ల విదేశీ నిధులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. విదేశీ భాగ స్వామ్య నియంత్రణ సవరణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)–2020 చట్టానికి ముందు ఎఫ్సీఆర్ఏ ఖాతాలను ఐచ్ఛికంగా ఉంచారని ఆయన పేర్కొన్నారు. అయితే సవరణ చట్టం వచ్చాక దగ్గర్లో ఉన్న ఎస్బీఐలో ఎఫ్సీఆర్ఏ ఖాతా తెరవడాన్ని తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు. 2021 జూలై 31న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన ప్రకారం మొత్తం 18,377 గుర్తింపు పొందిన ఎఫ్సీఆర్ఏ ఖాతాలు ఉన్నాయి. పోలీస్ కస్టడీలో 348 మంది మృతి.. గత మూడేళ్లలో పోలీసుల కస్టడీలో 348 మంది వ్యక్తులు మరణించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. మరో 5,221 మంది జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా మరణించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలవారీగా చూస్తే 2018–20 మధ్య ఉత్తరప్రదేశ్‌లో పోలీస్ కస్టడీలో 23, జ్యుడీషియల్ కస్టడీలో 1,295 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో పోలీస్ కస్టడీలో 34, జ్యుడీషియల్ కస్టడీలో 407 మంది మరణించారు. పశ్చిమబెంగాల్లో పోలీస్ కస్టడీలో 27, జ్యుడీషియల్ కస్టడీలో 370 మంది మరణించారు. -
Kishan Reddy: ఆ ఓటమితోనే కలిసొచ్చిన అదృష్టం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు గంగాపురం కిషన్‌రెడ్డి జాక్‌పాట్ కొట్టారు. ఎంపీగా గెలుపొందిన ఆయనకు తొలి ప్రయత్నంలోనే కేంద్ర సహాయ మంత్రి పదవి లభించగా.. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కింది. తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. శాసనసభ ఎన్నికల్లో పరాజయం ఎదురైనా.. పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్ల ఆదరణ చూరగొన్న కిషన్‌రెడ్డి.. ప్రధాని మోదీకి సన్నిహితుడు కావడంతో రెండేళ్లలోనే కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందారు. గతంలో ఇదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయ కేంద్రంలో పదవులు నిర్వర్తించినా.. సహాయ మంత్రి హోదాకే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన బల్దియా ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించడం కూడా కిషన్‌రెడ్డి ప్రమోషన్‌కు కలిసొచ్చిన అంశంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు బీజేపీ అగ్రనాయకత్వంతో మంచి పరిచయాలు ఉండడం ఆయనకు ప్లస్ పాయింటైంది. సున్నిత మనస్తత్వం.. కార్యకర్తలతో మమేకం కావడం కూడా ఆయనకు ఎదుగుదలకు కారణంగా చెప్పవచ్చు. మార్నింగ్ వాక్‌తో మమేకం.. కిషన్‌రెడ్డి మొదటి నుంచీ మార్నింగ్ వాక్‌తో ప్రజలతో మమేకమయయ్యేవారు. కోవిడ్ ఉద్ధృతి సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా గాంధీ, కింగ్‌కోఠి, టిమ్స్ ఆస్పత్రుల్లో పర్యటించారు. రోగులను పరామర్శించారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల కొరతను నివారించారు. వివాదరహితుడిగా కిషన్‌రెడ్డికి పేరుంది. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ.. కోవిడ్ ఇతర కారణాలతో చనిపోయిన ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించేవారు. బీజేపీ సీనియర్ నేతలు ఆలె నరేంద్ర, బద్దం బాల్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావులతో సన్నిహితంగా ఉండి వారి విశ్వాసాన్ని చూరగొన్నారు. వారి మార్గదర్శకత్వంలోనే నగరంలో పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డారు. ఒదిగి ఉండటంతోనే ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారని పార్టీ కార్యకర్తలు చెబుతుంటారు. అదృష్టం తలుపుతట్టింది లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్, వాజ్‌పేయి ఆదర్శాలకు ఆకర్షితుడైన కిషన్‌రెడ్డి.. విద్యార్థి దశలోనే అప్పటి జనతా పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలోనే ఉంటూ చదువు కొనసాగించారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. 2002 నుంచి 2004 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999లో కార్వాన్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2004 హిమాయత్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గ పునర్విభన తర్వాత అంబర్‌పేట నుంచి 2009, 2014లలో రెండుసార్లు గెలుపొందారు. 2018లో ఇదే స్థానం నుంచి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నాలుగోసారి అనూహ్యంగా ఓటమిని చవిచూసిన ఆయనకు సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఎమ్మెల్యేగా ఓటమిని చవిచూసిన ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టడమే తరువాయి అమాత్య పదవి వరించింది. మోదీ మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో పూర్తిస్థాయి కేబినెట్ హోదా లభించడంతో రాష్ట్ర బీజేపీ కేడర్‌లో నూతనోత్తేజాన్ని నింపింది. ఆయనకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను అప్పగించారు. -
చమురు ధరలు: ప్రత్యామ్నాయాలపై భారత్ చూపు!
న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు ‘భరించగలిగే స్థాయిలో’ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఒపెక్‌ను (పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య– ఓపీఈసీ) భారత్ డిమాండ్ చేసింది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశీయంగా రిటైల్ ఇంధన ధరలు రికార్డు గరిష్టాలకు చేరిన నేపథ్యంలో గురువారం భారత్ ఈ కీలక పిలుపునిచ్చింది. చమురు ధరలను ‘తగిన సమంజసమైన శ్రేణిలో’ ఉండేలా తక్షణ చర్యలు అవసరమని సూచించింది. ప్రత్యేకించి ఉత్పత్తి కోతల విధానానికి ముగింపు పలకాలని స్పష్టం చేసింది. సౌదీ అరేబియాసహా పలు ఒపెక్ దేశాలు భారత్ ప్రధాన చమురు వనరుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒపెక్ సెక్రటరీ జనరల్‌తో చర్చలు ఒపెక్ సెక్రటరీ జనరల్ మహమ్మద్ సనౌసి బర్కిం దోతో భారత్ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు ధరల విషయమై వర్చువల్‌గా చర్చలు జరిపారు. 2019 ఏప్రిల్ తరువాత మొదటిసారి అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు బేరల్‌కు 75 డాలర్లపైకి ఎగసిన సంగతి తెలిసిందే. దీనికితోడు దేశీయంగా సుంకాలతో భారత్‌లోని పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర దాదాపు రూ.100 స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో తగిన స్థాయిలో అంతర్జాతీయంగా ధర ఉండాలని భారత్ కోరినట్లు ఒక ప్రకటనలో ఒపెక్ తెలిపింది. అనంతరం చమురు మంత్రిత్వశాఖ కూడా ఒక ప్రకటన చేస్తూ, ‘‘క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వినియోగదారులు అలాగే ఎకానమీ రికవరీపై చూపుతున్న ప్రభావాన్ని చర్చించారు. భారత్‌లో తీవ్ర ద్రవ్యోల్బణానికి పరిస్థితులు దారితీస్తున్నాయని వివరించారు’’ అని పేర్కొంది. ఇరు వర్గాల ప్రకటనల ప్రకారం, చమురు మార్కెట్ పరిణామాలు చర్చల్లో చోటుచేసుకున్నాయి. ఆయిల్ డిమాండ్ రికవరీ, ఎకానమీ వృద్ధిపై ప్రభావం, ఇంధన సవాళ్లను అధిగమంచడం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. చదవండి: అదిరిపోయే ఫీచర్స్, త్వరలో మెక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల ప్రధాన్ కృతజ్ఞతలు.. భారత్‌లో మహమ్మారి రెండవ వేవ్ సమయంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్సహా పలు ఒపెక్ సభ్య దేశాలు చేసిన సహాయం పట్ల ప్రధాన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒపెక్ సెక్రటేరియట్ నిరంతర సంప్రతింపుల కార్యక్రమంలో భాగంగా తాజా వీడియోకాన్ఫరెన్స్ జరి గింది. ప్రపంచ ఎకానమీ 5.5 శాతం పురోగమిస్తుందని, 2021లో రోజూవారీ ఆయిల్ డిమాండ్ 6 మిలియన్ బేరళ్లకుపైగా పెరుగుతుందని జూన్‌లో ఒపెక్ నెలవారీ ఆయిల్ మార్కెట్ నివేదిక పేర్కొంది. ప్రత్యామ్నాయాలపై భారత్ చూపు! సరఫరాల కోతలకు ముగింపు పలకాలని భారత్ పలు నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, ఒపెక్ దాని అనుబంధ దేశాలు (ఒపెక్ ప్లస్) పట్టించుకోవడం లేదు. దీనితో ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా భారత్ తన చమురు అవసరాలకు ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టి సారిస్తోంది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో భారత్ చమురు దిగుమతుల్లో ఒపెక్ వాటా మేలో 60 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో ఇది ఏకంగా 74 శాతంగా ఉండడం గమనార్హం. నిజానికి చమురు ధరల విషయంలో ఈ ఏడాది మార్చిలో భారత్–ఒపెక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిమాండ్ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు నిర్ణయించిన నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరగాయి. ఈ నేపథ్యంలో చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఇందుకు సంబంధించి ఉత్పత్తి, సరఫరాలపై నియంత్రణలను సడలించాలని భారత్ అప్పట్లో విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. పైగా ఒపెక్ సమావేశం అనంతరం మార్చి 4వ తేదీన సౌదీ అరేబియా భారత్‌కు ఒక ఉచిత సలహా ఇస్తూ, కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సూచించింది. 2020 ఏప్రిల్–మే మధ్యన భారత్ 16.71 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్‌తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాట క)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారెల్ క్రూడాయిల్ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది. ఒపెక్ చేసిన ప్రకటనపై అప్పట్లో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా స్పందించారు. చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్‌ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో కరోనా వైరస్‌పరమైన కారణాలతో డిమాండ్ పడిపోయి, ఉత్పత్తి తగ్గించుకోవాలని ఒపెక్ కూటమి నిర్ణయించుకున్నప్పుడు తాము కూడా మద్దతునిచ్చామని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్ అప్పట్లో హామీ ఇచ్చిందని .. కానీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తి మాత్రం సాధారణ స్థితికి రావడం లేదని ప్రధాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం పెరిగిపోతే రేట్లు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్రూడ్ ఆయిల్‌ను ఏ దేశం తక్కువ ధరకు సరఫరా చేస్తుందో ఆ దేశం నుంచే భారత్ కొనుగోలు చేస్తుందని కూడా ప్రధాన్ స్పష్టం చేయడం గమనార్హం. ఉత్పత్తి, సరఫరాల విషయంలో నియంత్రణలు లేకుండా చూస్తూ, తక్కువ ధరకు చమురు సరఫరా చేయాలన్న భారత్ విజ్ఞప్తి పట్ల సౌదీ అరేబియా సమాధానం ‘దౌత్యధోరణి’ కాని రీతిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. భారత్ చమురు వినియోగంపై సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్లాజిజ్ బిన్ సల్మాన్ చేసిన ప్రకటనను ‘‘సన్నిహితమైన స్నేహితుని’’ నుంచి ‘‘దౌత్యరీతిలేని సమాధానం’’ అని ప్రధాన్ అభివర్ణించారు. ఇలాంటి వైఖరిని భారత్ అసలు అంగీకరించబోదని అన్నారు. భారత్ వ్యూహాత్మక చమురు నిల్వలను ఎలా ఎప్పుడు వినియోగించుకోవాలన్నది భారత్ నిర్ణయమని పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకన్నా, అమెరికాకే భారత్ ప్రాధాన్యత ఇస్తోందా? అన్న అంశంపై ప్రధాన్ సమాధానం ఇస్తూ, ‘‘మేము ఎవరికి దగ్గర అవుతున్నామన్న అంశం ఇక్కడ ప్రధానం కాదు. భారత్ ప్రయోజనాల పరిరక్షణ ఎలా అన్నదే ఇక్కడ ముఖ్యం. మాది బహిరంగ, స్వేచ్ఛాయుత మార్కెట్. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చమురు దిగుమతిచేసుకునే అవకాశం మా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రైవేటు రంగం చమురు దిగ్గజ సంస్థలకు ఉంది. తక్కువ ధరకు చమురు లభ్యత మాకు ముఖ్యం. అది అమెరికానా లేక ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియానా అన్నది ప్రధానం కాదు.’’ అని అన్నారు. భారత్‌లో రిఫైనర్స్ ఇప్పటికే తమ చమురు అవసరాలకు పశ్చిమ ఆసియావైపుకాకుండా తక్కువ ధరకు లభించే ఇతర దేశాల వైపూ దృష్టి పెడుతుండడం కీలకాంశం. -
ప్రధాని నివాసం లో సీనియర్ మంత్రుల సమావేశం
-
కరోనా కల్లోలం: ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన వారిలో చాలా మంది ఆసుపత్రులలో చేరుతున్నారు. అయితే, కరోనా సోకిన తర్వాత ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, రుచి తెలియక పోవడం, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురవ్వడం మొదలైన లక్షణాలు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే, ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకొన్న కూడా కోవిడ్ నెగెటివ్ అనంతరం కూడా అనేక శారీరక సమస్యలు కొత్తగా ఉత్పన్న మవుతున్నాయి. వీటిని పోస్ట్ కోవిడ్ సమస్యలుగా పేర్కొంటారు. తాజాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ కోవిడ్ అనంతరం సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రిలో చేరారు. కాగా, 61 ఏళ్ల వయస్సున్న పోఖ్రియల్ నిశాంక్ గత ఏప్రిల్ 21 న కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మందులు, డైట్ పాటించడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. అప్పటి నుంచి ఆన్లైన్లో విద్యా శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కొత్తగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే డాక్టర్ల సూచన మేరకు ఆయన ఎయిమ్స్‌లో చేరారు. అయితే, ఇప్పటికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా వుండగా కేంద్ర విద్యాశాఖ గత కొన్ని రోజులుగా సిబిఎస్ఇ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు. ఈ క్రమంలో సుప్రీం కోర్ట్ వెంటనే సిబిఎస్ఇ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే, ప్రస్తుతం కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ ఆసుపత్రిలో ఉన్న తరుణంలో, సిబిఎస్ఇ పరీక్షలపై సరైన నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు రోజుల సమయం కావాలని కేంద్ర విద్యాశాఖ సుప్రీం కోర్టును కోరింది. చదవండి: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. నల్లగా మారిన మహిళ చేయి -
కరోనాతో కేంద్రమంత్రి కుమార్తె కన్నుమూత
ఇండోర్: కేంద్ర మంత్రి తావర్ చంద్ గహ్లోత్ కుమార్తె గోయిత సోలంకి (42) కరోనా బారినపడి కన్నుమూశారు. చికిత్స తీసుకుంటూ ఆమె మరణిం చారని ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించారు. కరోనా సోకిన అనంతరం ఆమెను మొదట గా ఉజ్జయినిలోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో వారం క్రితం ఇండోర్‌లోని మేదాంత ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆమె ఊపిరితిత్తుల్లో 80 శాతం వైరస్ బారినపడటంతో రక్షించలేకపోయామని ఆస్పత్రి డైరెక్టర్ సందీప్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఆమె మరణం పట్ల మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, పలువురు పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు. -
నా తమ్ముడికి బెడ్ కేటాయించండి: కేంద్రమంత్రి అభ్యర్థన
లక్నో: కరోనా దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్‌లో కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక రాష్టాల్లో ప్రజలు ఆక్సిజన్ సిలెండర్లు, బెడ్ల కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే అనేక ఆసుపత్రుల్లో కరోనా సోకిన వారు బెడ్లు లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కాగా, సాక్షాత్తు కేంద్రమంత్రి ఒకరు.. కరోనా సోకిన తన సోదరుడికి ఆసుపత్రిలో బెడ్ కేటాయించాల్సిందిగా కోరారు. దీన్ని బట్టి చూస్తే... వీఐపీలకే ఇలాంటి పరిస్థితుంటే.. ఇక మాముల ప్రజలు పరిస్థితులను ఊహించుకొవచ్చు. అయితే, కేంద్రమంతి వీకే సింగ్ ఘజియాబాద్ నియోజకవర్గంలో తన సోదరుడికి బెడ్‌ను కేటాయించాల్సిందిగా కోరారు. ఈ మేరకు ట్వీటర్లో ఆయన చేసిన ట్వీట్ మన దేశంలో వైద్యపరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఒక కేంద్ర మంత్రి మెడికల్ సాయం కావాలని కోరడం బాధకరమని, దీన్ని బట్టి మనం చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నామని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైన ప్రజలందరు విధిగా మాస్క్‌ను ధరించి, కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. అదేవిధంగా కోవిడ్ టీకాను వేసుకోవాలని పేర్కొన్నారు. చదవండి: కనీసం 15 రోజులు లాక్డౌన్ విధించాలి! -
రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు: కిషన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రైతులు స్వేచ్ఛగా తమ పంటలను లాభసాటి ధరకు అమ్ముకునేలా తమ ప్రభుత్వం చట్టం తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ రైతుల పంటల అమ్మకంపై ఉన్న ఆంక్షలు తొలగించిందన్నారు. కనీస మద్దతు ధర విషయంలో ఎలాంటి మార్పు చేయలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు చట్టాలపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని, రైతులకు నష్టం కలిగించే చర్యలను కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయని విమర్శించారు. (చదవండి: షాద్‌నగర్‌లో కేటీఆర్.. సిద్ధిపేటలో హరీష్‌రావు) నిరసనలతో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని నిర్వీర్యం చేసిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో ఎరువుల కొరత లేకుండా చేశామని, రికార్డు స్థాయిలో గిట్టుబాటు ధరలు కల్పించామన్నారు. సన్న బియ్యం వేయమని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పడు చేతులెత్తేసిందని మండిపడ్డారు. (చదవండి: ఢిల్లీతో ఢీకి టీఆర్ఎస్ రెడీ) ఆ బాధ్యతను కేంద్రంపై నెట్టి వేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. కాగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. చట్టాలను మార్చాలంటూ రైతుల ఈ నెల 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలతో పాటు పలువురు రైతులకు మద్దతుగా భారత్ బంద్‌కు సంఘీభావం తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా రైతుల సంఘీభావం తెలుపుతూ భారత్ బంద్‌కు మద్దతు తెలిపింది. బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేకే..: లక్ష్మణ్ కాంగ్రెస్ అనుబంధ రైతు సంఘాల బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని.. బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్‌తో చేతులు కలిపారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. రుణ మాఫీ చేయలేని కేసీఆర్.. రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ ఉచ్చులో పడొద్దని రైతులకు లక్ష్మణ్ సూచించారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు:డీకే అరుణ రైతులకు వ్యతిరేకంగా చట్టాల్లో ఒక్క పదం కూడా లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ఈ చటాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. రైతులను కొందరు తప్పు దోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. -
‘ఒంటరిగా పోరాడితే.. బలవంతులవుతారు’
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిత్యం సామాజిక సమస్యలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలన తెలుపుతూ యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అంతేగాక తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ.. ప్రేరణ కలిగించే సందేశాలను నిత్యం షేర్ చేస్తూంటారు. తాజా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ఆమె స్పందిస్తూ.. జీవితానికి సంబంధించిన కొన్ని స్పూర్తిదాయకమైన కోట్స్‌ను మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (స్మృతి ఇరానీ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా..) అవి.. ‘‘మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది ఎప్పటికీ మరవొద్దు.. అలాగే మీరు చేరుకునే గమ్యం వచ్చే వరకు మీ కళ్లను తీప్పుకోవద్దూ’’, ‘‘ఎవరైతే ఒంటరిగా పోరాడుతారో.. వారు మరింత బలవంతులు అవుతారు’’ అలాగే ‘‘మీ ఆశలను, కలను నెరవేర్చుకునే క్రమంలో ఇతరులు ద్వేషించడం మొదలు పెడుతారు.. ఎందుకంటే అక్కడ వారు ఉండరు’ చివరిగా ‘‘మీరు కష్టపడి ఎదుగుతున్న క్రమంలో మీరు ఎవరీకి స్పూర్తినిస్తారో మీకు తెలియదు.. కాబట్టి ఈ ప్రయాణంలో మీరు పట్టుదలతో ముందుకు సాగాలి’’ అంటూ షేర్ చేశారు. కాగా సుశాంత్ ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు దర్యాప్తులో తెలిపారు. -
పీఐబీ చీఫ్‌కు కరోనా పాజిటివ్..
-
పీఐబీ చీఫ్‌కు కరోనా పాజిటివ్..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ ధత్వాలియాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. పీఐబీకి నాయకత్వం వహించే ధత్వాలియా కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రధాన ప్రతినిధి. కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం ఆయనను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో గత రాత్రి 7 గంటల సమయంలో చేర్చించారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: కేంద్రం జోక్యాన్ని కోరిన మాయావతి ధత్వాలియాకు కరోనా సోకడంతో జాతీయ మీడియా కేంద్రాన్ని సోమవారం రోజున మూసి, శానిటైజ్ చేయనున్నట్లు పీఐబీ అధికారులు వెల్లడించారు. అయితే ధత్వాలియా ఈ మధ్య జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నరేంద్ర సింగ్ తోమర్, ప్రకాష్ జవదేకర్లతో కలిసి సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో అతని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించడంపై అధికారులు దృష్టి సారించారు. చదవండి: కేన్సర్‌తో ఆస్పత్రిలో చేరి.. కరోనాతో..! -
‘ఎండలో కూర్చుంటే మేలన్న కేంద్ర మంత్రి’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంటే కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే ప్రజలకు అసాధారణ సలహా ఇచ్చారు. గోమూత్రంతో క్యాన్సర్‌కు చికిత్స అందించవచ్చని గతంలో వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి తాజాగా కరోనా వైరస్‌ను అధిగమించేందుకు 15 నిమిషాల పాటు ఎండలో కూర్చోవాలని సూచించారు. సూర్యరశ్మితో వైరస్‌ను చంపేందుకు అవసరమైన వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్య భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంటుందని, ఈ సమయంలో మనం ఎండలో కూర్చుంటే మన శరీరంలో విటమిన్ డీ నిల్వలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఇలా చేస్తే వ్యాధి నిరోధక శక్తి మెరుగై కరోనా వైరస్ వంటి వైరస్‌లను చంపవచ్చని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై అశాస్ర్తీయ వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలు, మంత్రులకు సూచించిన క్రమంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కరోనా వైరస్‌ను నియంత్రించే ముందస్తు చర్యలపై సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మూడు పేజీల డాక్యుమెంట్లో ఎక్కడా విటమిన్ డీని పొందాలని లేదా ఎండ తగిలేలా చూసుకోవాలని కానీ లేకపోవడం విశేషం. సూర్యరశ్మి ద్వారా విటమిన్ డీ పొందడం వాస్తవమే అయినా ఈ విటమిన్ లేదా సూర్యరశ్మి ద్వారా కోవిడ్-19 వైరస్ నుంచి రక్షణ పొందవచ్చనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. మరోవైపు గోమూత్రం, ఆవు పేడ ద్వారా కరోనా వైరస్‌కు చెక్ పెట్టవచ్చని అసోం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అయితే అశాస్త్రీయమైన ఇలాంటి చిట్కాలను ఎవరూ అనుసరించవద్దని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం, దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోటికి మోచేయి అడ్డుపెట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి : చేతికి క్వారంటైన్ ముద్రతో గరీబ్ రథ్‌లో.. -
‘క్యారెట్లు తినండి..మ్యూజిక్ వినండి’
సాక్షి, న్యూఢిల్లీ : కాలుష్యం అత్యంత ప్రమాదకరస్ధాయికి చేరడంతో దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతుంటే కేంద్ర మంత్రులు చేసిన ట్వీట్లు ఆన్లైన్లో పలు విమర్శలకు తావిచ్చాయి. కాలుష్యం కాటేస్తున్న తరుణంలో ఉపశమనం పొందేందుకు వీరిచ్చిన సలహాలపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఢిల్లీ వాసులు సంగీతం ఆస్వాదిస్తూ సేదతీరాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేయగా, క్యారెట్లు తిని కాలుష్య సంబంధిత అనారోగ్య సమస్యలను తప్పించుకోండని వైద్యారోగ్య మంత్రి డాక్టర్ హర్ష్వర్ధన్ ట్వీట్ చేశారు. సంగీతంతో మీ రోజును ప్రారంభించాలంటూ సూచించిన ప్రకాష్ జవదేకర్ వీణ నిపుణులు ఈమని శంకర్ శాస్త్రి కంపోజిషన్‌తో కూడిన యూట్యూబ్ లింక్‌ను పోస్ట్ చేశారు. ఇక విటమిన్ ఏ, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే క్యారెట్లను తింటే కాలుష్య సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తంటూ మరో కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్‌వర్థన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇక ఉత్తరాది అంతటా కాలుష్యంతో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే పర్యావరణ మంత్రి ఎలాంటి సలహాలిస్తున్నారో చూడండి అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. తాజా గాలిని పీల్చుతూ రోజును ప్రారంభించాలని, సంగీతంతో కాదని మరి కొందరు నెటిజన్లు మంత్రుల సలహాలపై మండిపడ్డారు. -
‘పాత ఙ్ఞాపకాలు.. కానీ కొంచెం కొత్తగా’
న్యూఢీల్లి : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులు, ఫాలోవర్స్‌తో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా స్మతి తన పాత ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తెలుపు రంగు దుస్తుల్లో, లూజ్ హేర్‌తో చిరునవ్వులు చిందిస్తున్న స్మృతి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పాతవే కానీ కొత్త ఙ్ఞాపకాలు’ అంటూ స్మృతి షేర్ చేసిన ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘అందంగా ఉన్నారు.. ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండండి’ అంటూ హర్ట్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా హిందీ సీరియళ్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి ఇరానీ అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని మట్టికరిపించి కాంగ్రెస్ కంచుకోట ఆమేథీలో జయకేతనం ఎగురవేశారు. ఈ క్రమంలో రెండో దఫా కేంద్రమంత్రిగా మోదీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఇక ఆమెకు భర్త జుబిన్ ఇరానీ , పిల్లలు జోయిస్, జోహార్ ఉన్నారు. ప్రస్తుతం ఆమె కేంద్ర జౌళి, మహిళా-శిశు సంక్షేమ అభివృద్ది మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
నార్త్ ఇండియన్స్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : నార్త్ ఇండియన్స్‌కు సరైన నైపుణ్యాలు లేవని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వర్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించడంతో తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యల సందర్భం వేరని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజల నైపుణ్యాలను పెంచేందుకు చేపడుతున్న చర్యలను వివరించే ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు. నైపుణ్యాలు లేనివారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు తగిన అర్హతలను వారికి అందించేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందనే కోణంలో తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఉపాధి అవకాశాలు కొరవడిన తీరుపై కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరి వంద రోజులైన నేపథ్యంలో రాయ్‌బరేలిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉద్యోగాలు పెద్దసంఖ్యలో అందుబాటులో ఉన్నాయని అయితే నార్త్ ఇండియన్స్‌లో నైపుణ్యాలు లోపించడమే సమస్యని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చదవండి : నార్త్ ఇండియన్స్‌కు ఆ సత్తా లేదా..? -
సన్యాసి కాబోయి కేంద్రమంత్రి అయిన సారంగి
-
తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తా
-
కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు
-
లక్కీ లష్కర్
సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర రాజకీయాల్లో గురువారం లష్కర్ (సికింద్రాబాద్) మరో కొత్త చరిత్రను లిఖించింది. ఈ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన జి.కిషన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఎక్కువ మంది కేంద్ర మంత్రులను అందించిన నియోజకవర్గంగా మారిపోయింది. ఇక్కడి నుంచి 1979, 80లో ఎంపీగా ఎన్నికైన పి.శివశంకర్.. ఇందిరాగాంధీ, రాజీవ్ కేబినెట్లో విదేశీ వ్యవహారాలు, న్యాయ, పెట్రోలియంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1984లో ఇక్కడి నుంచే గెలిచిన టి.అంజయ్య రాజీవ్ కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1991, 1998, 99లో ఎంపీగా ఎన్నికైన దత్తాత్రేయ.. వాజ్‌పేయి మంత్రివర్గంలో అర్బన్ డెవలప్మెంట్, రైల్వే శాఖ సహాయ మంత్రిగా, 2014లో మోదీ కేబినెట్లో కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగాను దత్తాత్రేయ పనిచేశారు. తాజాగా మోదీ నూతన కేబినెట్లో తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి అవకాశం లభించింది. కిషన్‌రెడ్డి వెరీ స్పెషల్ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికకావటంతో పాటు, ఎంపీగా ఎన్నికైన తొలిసారే కేంద్ర కేబినెట్లో చోటుదక్కిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలిచారు. ఈయన 2004లో హిమాయత్‌నగర్, 2009, 2014లో అంబర్‌పేట శాసనసభ స్థానం నుంచి విజయం సాధించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం రావడం నగర రాజకీయాల్లో అరుదైన అంశంగా ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. అయితే, 1989లో గోషామహల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండారు దత్తాత్రేయ ఓటమి పాలై మళ్లీ శాసనసభకు కాకుండా వరసగా లోక్‌సభకే పోటీ చేస్తూ వచ్చారు. కిషన్‌రెడ్డి సైతం 1999లో కార్వాన్ శాసనసభ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీలోనూ జాతీయ యువజన విభాగం అధ్యక్షుడిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేఎల్పీ నాయకుడిగా దాదాపు అన్ని హోదాల్లోనూ పనిచేశారు. పార్టీ నగర నేతల్లో ఆనందం కేంద్ర క్యాబినెట్లో ఎంపీ కిషన్‌రెడ్డికి స్థానం దక్కడంపై నగర బీజేపీ నేతలు గురువారం హర్షం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల్లో నగరంలో భారీ సభను నిర్వహించే యోచనలో ఉన్నారు. కిషన్‌రెడ్డికి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కడంపై మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థులు బి.జనార్దన్‌రెడ్డి, రామచంద్రరరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
ఎగువ సభకు ముగ్గురే ముగ్గురు
సాక్షి, అరసవల్లి: జిల్లా రాజకీయ ముఖ చరిత్రలో రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వంటి పదవులు అలంకరించిన స్థాయి వ్యక్తులు ఉన్నారు. అయితే లోక్‌సభకు, రాజ్యసభకు కూడా ఎందరో ముఖ్య నేతలు ఎన్నికయ్యారు. ఎంపికయ్యారు. అయితే ఇందులో ఎగువ సభ (రాజ్యసభ)కు మాత్రం ఇప్పటివరకు ముగ్గురంటే ముగ్గురే ఎంపికయ్యారు. పూర్తి కాలం పదవుల్లో పనిచేశారు. ఇందులో ముందుగా పాలవలస రాజశేఖరం జిల్లా నుంచి తొలి రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారు. తర్వాత మజ్జి తులసీదాస్, కళా వెంకటరావులు కూడా రాజ్యసభ ఎంపీలుగా జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించారు. కేంద్ర మంత్రులుగా నలుగురే... జిల్లా నుంచి కేంద్ర మంత్రులుగా ఇంతవరకు నలుగురే పనిచేశారు. ముందుగా పాతపట్నం ఎంపీగా ఉన్న వి. వి.గిరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత కె.ఎర్రం నాయుడు, గత యూపీఏలో కేంద్ర మంత్రివర్గంలో కిల్లి కృపారాణి, కిషోర్ చంద్రదేవ్‌లు మంత్రులుగా పనిచేశారు. రాష్ట్ర మంత్రులుగా జిల్లా నుంచి చాలామంది నేతలు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులుగా పనిచేశారు. గౌతు లచ్చన్న, గొర్లె శ్రీరాముల నాయుడు, మజ్జి తులసీదాస్, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు, లుకలాపు లక్ష్మణదాస్, తంగి సత్యన్నారాయణ, చిగిలిపల్లి శ్యామలరావులు మంత్రులుగా ఓ వెలుగు వెలిగారు. తర్వాత తరంలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, కిమిడి కళావెంకటరావు, కావలి ప్రతిభాభారతి, గౌతు శివాజీ, గుండ అప్పలసూర్యనారాయణ, కోండ్రు ముర ళీ మోహన్, కె.అచ్చెన్నాయుడు తదితరులు మంత్రులుగా పనిచేశారు. అలాగే జిల్లా ఆర్ఎల్ఎన్.దొర, తంగి సత్యనారాయణ, కావలి ప్రతిభాభారతిలు స్పీకర్లుగా పనిచేశారు. -
సునాయిక
సకల సుగుణ నాయిక సుష్మాస్వరాజ్! వాగ్ధాటి, సుపరిపాలన, సత్వర ప్రతిస్పందన, సంస్కృతి, సంప్రదాయం, మానవత కలగలిసిన రాజనీతిజ్ఞురాలు.. సుగుణాలకే వన్నెతెచ్చిన నాయిక.. సునాయిక..సుష్మాస్వరాజ్. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. ప్రత్యర్థి పార్టీలు కూడా గౌరవించే వ్యక్తిత్వం. దేశ రాజధానికి... ముఖ్యమంత్రి అయిన తొలి మహిళ. మూడు సార్లు ఎమ్మెల్యే... ఏడుసార్లు ఎంపీ. ‘బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’.. వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రశంస. ‘బెస్ట్ అవుట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్’.. మన దేశం. కొత్త తరం పొలిటీషియన్లకు రోల్‌మోడల్. అన్నీ కలిస్తే.. సుష్మా స్వరాజ్. ఓ రోజున సుష్మా స్వరాజ్ ట్విట్టర్ అకౌంట్‌కి ‘మేడమ్ ప్లీజ్ హెల్ప్’ అంటూ ఒక ట్వీట్ వచ్చింది. అది దోహా ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన తన సోదరుడిని రక్షించమని కోరుతూ ప్రన్షు సింఘాల్ అనే వ్యక్తి చేసిన ట్వీట్. మూడవ రోజునే ‘నా సోదరుడు అంకిత్ క్షేమంగా విడుదలయ్యాడు. కృతజ్ఞతలు’ అంటూ మరో ట్వీట్ చేశాడు ప్రన్షు సింఘాల్. అంతకంటే ముందు... బెర్లిన్‌లో పాస్‌పోర్టు, డబ్బు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను పోగొట్టుకున్న అగర్త అనే అమ్మాయి నుంచి సుష్మకు ఒక ట్వీట్ వచ్చింది. ఆ మరుసటి రోజే ‘ఈ రోజు ఇండియన్ ఎంబసీకి వెళ్లి పాస్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక అనుమతి తీసుకున్నాను. కృతజ్ఞతలు’ అంటూ ఎంబసీ ఉద్యోగుల పేర్లతో సహా మరో ట్వీట్ చేసింది అగర్త. మరికొన్నాళ్లకు.. దేవ్ తంబోలి అనే వ్యక్తి నుంచి ఓ ట్వీట్.. ‘మా చెల్లెలు ఉద్యోగం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి వెళ్లింది. ఆమెను ఓ గదిలో బంధించారు. రక్షించండి’ అంటూ తన ఫోన్ నంబరు కూడా ఇచ్చాడతడు. కొన్ని గంటల్లోనే దేవ్ ట్విట్టర్ అకౌంట్‌కి ‘యుఎఈ అంబాసిడర్‌ని సహాయం అడిగాను. ఆయన మీతో మాట్లాడతారు, వివరాలు చెప్పండి’ అని భారత విదేశాంగ మంత్రి నుంచి రిప్లయ్ ట్వీట్ వచ్చింది. ఆ రోజు సాయంత్రానికే ‘దుబాయ్ పోలీసుల సహాయంలో మీ చెల్లెల్ని రక్షించాం. ఇప్పుడామెను దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ షెల్టర్‌కు చేర్చడమైంది’ అని దేవ్‌కి ట్వీట్ చేశారు భారత విదేశాంగ మంత్రి. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకే కాదు, మనదేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకూ అంతే వేగంగా సుష్మ నుంచి సేవలు అందుతున్నాయి. సుజాన్నె లుగానో అనే డచ్ మహిళ తన సోదరి సబినె హార్మెస్ భారత పర్యటనలో రిషికేశ్‌లో తప్పి పోయిందని ట్వీట్ చేసింది. సోదరిని గుర్తుపట్టడానికి ఆనవాళ్లను కూడా వివరించింది సుజాన్నె. ఆ ట్వీట్‌కు బదులుగా ‘మా అధికారులు సబినె హార్మెస్ను కనుగొన్నారు. ప్రస్తుతం ఆమె స్వతంత్ర ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటోంది. డెహ్రాడూన్‌లోని పాస్‌పోర్టు అధికారి ఆమెను స్వయంగా కలిశారు’ అని ఒక ట్వీట్. మరి కొన్ని గంటలకు ‘ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. ఆమె మానసికంగా కూడా స్థిమితంగా లేదు. నిర్మల్ జాలీ గ్రాంట్ హాస్పిటల్’లో చేర్చి చికిత్స చేస్తున్నారు’ అని మరో ట్వీట్ చేశారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. ఇవి మాత్రమే కాదు.. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల వీడియో చూసి మనోవేగంతో స్పందించారు సుష్మ. ఆపదలో ఉన్న వారిని విడిపించారు, మరణించిన వారిని వారి బంధువులకు అప్పగించారామె. ఇవన్నీ భారతీయులుగా మన ఛాతీ ఉప్పొంగే సేవలైతే... సోనూ అనే చిన్నారిని రక్షించడంలో ఆమెలో అమ్మతనం దేశం హృదయాన్ని తాకింది. సోనూ నాలుగేళ్ల కుర్రాడు. ఢిల్లీలో ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా 2010లో ఇద్దరు మహిళలు ఆ చిన్నారిని అపహరించుకుని వెళ్లారు. సుష్మ దృష్టికి వచ్చిన తర్వాత సోనూ కోసం శోధించి 2016లో బంగ్లాదేశ్‌లోని షెల్టర్ హోమ్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ ప్రభుత్వంతో సంప్రదించి సోనూను ఇండియాకు రప్పించి అతడి తల్లిదండ్రులకు అప్పగించినప్పటి దృశ్యం దేశ ప్రజల గుండెల్ని కదలించింది ఆ స్థానంలో మగవాళ్లు ఉంటే ఆ సందర్భం కర్తవ్య నిర్వహణలో భాగంగానే ఉండేది. మీడియా కోసం ఫొటోకి పోజిచ్చి, పిల్లాడిని అమ్మానాన్నలకు అప్పగించేవాళ్లు్ల. సుష్మాస్వరాజ్ మంత్రిగా మాత్రమే కాదు, ఓ తల్లిలా కూడా స్పందించారు. సోనూను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. తన బిడ్డే తప్పిపోయి తిరిగి దగ్గరకు చేరితే తల్లిపేగు కన్నీరు పెట్టుకున్నట్లు స్పందించారామె. ఇలా ఆమెలో దేశాన్ని తల్లిలా భావించే లక్షణం కూడా ఆమెతోపాటే పెరిగింది. పాలకులు ప్రజలను బిడ్డల్లా పాలించాలనే తత్వాన్ని ఆమెకు పొలిటికల్ సైన్స్ నేర్పించింది. హరియాణా అమ్మాయి సుష్మాస్వరాజ్ పూర్వికులు లాహోర్ (పాకిస్థాన్)లోని ధరంపురా నుంచి హరియాణాకు వచ్చారు. తండ్రి హర్దేవ్ శర్మ ఆర్ఎస్ఎస్లో క్రియాశీలక సభ్యుడు. అంబాలా కంటోన్మెంట్లో స్థిరపడ్డారాయన. సుష్మ బాల్యం, కాలేజ్ చదువు అంతా అంబాలాలోనే. వరుసగా మూడేళ్లు బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్ అవార్డు నుంచి బెస్ట్ హిందీ స్పీకింగ్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ అవార్డు, సంగీతం, సాహిత్యం, లలిత కళలు, నాటకాలు, వక్తృత్వం... అన్నింటిలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది. పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదివే రోజుల్లో విద్యార్థి పరిషద్‌లో చురుగ్గా పాల్గొంటున్నప్పుడు ఆమె ఊహించి ఉండరు.. దేశంలో ఇంతటి క్రియాశీలకమైన రాజకీయవేత్తగా మారతానని. లా కోర్సు పూర్తయిన తర్వాత అందరిలాగానే న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. జార్జి ఫెర్నాండెజ్ లీగల్ డిఫెన్స్ టీమ్‌లో చేరడం... ఆమె జీవితాన్ని మలుపు తిప్పి, ఇప్పుడు మనం చూస్తున్న గమ్యానికి చేర్చింది. సుష్మ... స్వరాజ్ 1975, జూలై 13. అప్పటి వరకు ఆమె కేవలం సుష్మ, ఆ రోజు నుంచి సుష్మా స్వరాజ్. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ.. ఫెర్నాండెజ్, జయప్రకాశ్ నారాయణ్లతోపాటు సుష్మ ఉద్యమించిన సమయంలోనే ఫెర్నాండెజ్ టీమ్‌లో చేరి, పరిచయం అయిన న్యాయవాది కౌశల్ స్వరాజ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. తర్వాత రెండేళ్లకు హరియాణా శాసనసభకు ఎన్నికలు వచ్చాయి. జనతాపార్టీకి చురుకైన అభ్యర్థులు కావాల్సి వచ్చింది. పార్టీ నాయకులకు సుష్మాస్వరాజ్ కనిపించారు. పాతికేళ్లకే ఆమె శాసన సభకు పోటీ చేయడం, గెలవడం, దేవీలాల్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేయడం జరిగిపోయాయి. మరో రెండేళ్లకే పార్టీ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు. విప్లవాత్మక నిర్ణయాలు సుష్మాస్వరాజ్ దేశంలో అనేక రాజకీయ అనిశ్చితులకు ప్రత్యక్ష సాక్షి. ఎమర్జెన్సీ నుంచి సంకీర్ణ యుగం వరకు, పదమూడు రోజుల ప్రభుత్వం వంటి ఒడిదుడుకులను కూడా చూశారు. సమాచార ప్రసార మంత్రిగా పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆరు ఎయిమ్స్‌ల స్థాపన ఆమె చొరవే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ల తనిఖీ వంటి సాహసోపేతమైన అడుగులు కూడా వేశారు. అప్పట్లో ఉల్లిపాయలు కేజీ ఐదు నుంచి యాభై రూపాయలను చేరడం భారత దేశం ఊహించని పరిణామం. ఆ ఫలితాన్ని ఆమె ఢిల్లీ ఎన్నికలలో మోయాల్సి వచ్చింది. భారతీయత– విదేశీయత సుష్మాస్వరాజ్ రాజకీయ జీవితం ఇందిరా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా మొదలవడం అనుకోకుండా జరిగిపోయింది. భారత విదేశాంగ శాఖను నిర్వహించిన మహిళల్లో ఇందిరాగాంధీ తర్వాత సుష్మ పేరు చేరడం కూడా యాదృచ్చికమే. అయితే 1999లో గాంధీ కుటుంబంతో బరిలో దిగడం మాత్రం అప్పటి రాజకీయ అవసరం. సోనియా గాంధీ కర్నాటకలోని బళ్లారి లోక్‌సభ స్థానానికి కూడా పోటీ చేశారు. అప్పుడు అద్వానీ, వాజ్‌పేయి వంటి పార్టీ పెద్దలు సుష్మాస్వరాజ్ వైపు మొగ్గుచూపారు. భారతీయతకు– విదేశీయతకు మధ్య పోటీగా రూపుదిద్దుకున్న ఆ ఎన్నికల్లో చివరి నిమిషంలో బరిలో దిగిన సుష్మాస్వరాజ్... ప్రచారంలో కన్నడ భాషలో మాట్లాడి కన్నడిగులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మూడున్నర లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. కొద్ది తేడాతో విజయానికి దూరంగా ఉండిపోయినప్పటికీ ఆ ఎలక్షన్ సుష్మ పొలిటికల్ చరిష్మా గ్రాఫ్‌ను పెంచింది. నిత్య విద్యార్థి సుష్మా స్వరాజ్ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. టెక్నాలజీతోపాటు అప్డేట్ అవుతుంటారు. ట్విటర్‌ను పరిపాలనకు ఆమె ఉపయోగించినంత విరివిగా మరెవరూ వాడి ఉండరు. ఏ క్షణమైనా ప్రపంచానికి ఒక ట్వీట్ దూరంలోనే ఉంటారు. సుష్మాస్వరాజ్... స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలాగన్నది చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో చేసి చూపిస్తున్నారు. అదే వేదికగా ప్రజాభిమానాన్ని కూడా చూరగొంటున్నారు. ఆమెకు కిడ్నీ సమస్య వచ్చినప్పుడు వెల్లువెత్తిన అభిమానం రాజకీయ పార్టీల హద్దులను చెరిపేసింది. తమ కిడ్నీ ఇస్తామంటూ అభిమానుల నుంచి ట్వీట్లు వచ్చాయి. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆమె సంపాదించుకున్న స్థిరాస్తి అది. నాయకులు రెండు రకాలు. తమకు మార్గదర్శనం చేసిన వారి అడుగుజాడల్లో నడిచేవాళ్లు, తర్వాతి తరం కోసం తమ పాదముద్రలతో పథనిర్మాణం చేయగలిగిన వాళ్లు. సుష్మా స్వరాజ్‌ది రెండో కోవ. ప్రధాని అవుతారా?! సుష్మా స్వరాజ్ గత వారం... తన ఆరోగ్య రీత్యా రాబోయే 2019 ఎన్నికల్లో పోటీ చేయలేనని యథాలాపంగా అన్నట్లు అన్నారు. ఆ మాట ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాజకీయాల నుంచి రిటైర్ అవుతారా? అన్ని పార్టీల్లోనూ సందేహం. ‘ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అయినట్లేనా? రాజ్యసభ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యి ప్రధానమంత్రి కావచ్చు కదా, ఇందిరాగాంధీలాగా’ అని సీనియర్ జర్నలిస్టు బర్ఖాదత్ ఆశాజనకమైన సందేహాన్ని వ్యక్తం చేశారు. అదే నిజం కావాలని కోరుకునే వాళ్లు దేశంలో చాలామంది ఉన్నారు. తొలి మహిళ రికార్డులు ► ఢిల్లీ ముఖ్యమంత్రి ► భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేత ► జాతీయ పార్టీకి అధికార ప్రతినిధి ► అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు ► హరియాణా క్యాబినెట్ మంత్రి ► హరియాణా జనతాపార్టీ అధ్యక్షురాలు బర్ఖాదత్, సీనియర్ జర్నలిస్టు కూతురు బాన్సూరి కౌశల్‌తో సోనూను తల్లిదండ్రులకు అప్పగిస్తూ.. భర్త స్వరాజ్ కౌశల్‌తో (పెళ్లి ఫొటో) సుష్మలాగ అభినయిస్తున్న చిన్నారి (ఫ్యాన్సీ డ్రస్ పోటీ) – వాకా మంజులారెడ్డి -
2022లోపు ప్రతి పేదోడికి పక్కా ఇల్లు
సుభాష్‌నగర్ (నిజామాబాద్‌అర్బన్): దేశంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి 2022 లోపు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నామని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ సహాయమంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు. బీడీ కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. పీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బులను అవసరమైనప్పుడు వాడుకునేలా చట్టబద్ధం చేశామని తెలిపారు. కార్మిక చట్టాల నిబంధనలను సరళతరం చేశామని, కార్మికులకు ఉపయోగపడేలా చట్టాల్లో అనేక మార్పులు తెచ్చామని స్పష్టం చేశారు. కేంద్రం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సక్రమంగా వినియోగించుకోవడంలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా ఉండాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మోదీ అభివృద్ధికి అన్నివిధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. -
‘అవినీతి’ వివరాలకు పీఎంఓ నో
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల సమాచారాన్ని వెల్లడించడానికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నిరాకరించింది. ఆ వివరాలు అంతర్గతమని, వాటిని బహిర్గతపర్చడం పెద్ద కసరత్తు అని బదులిచ్చింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌధరిపై సీబీఐ ఉన్నతాధికారి ఒకరు అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో పీఎంఓ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులపై అప్పుడప్పుడు అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ చతుర్వేది ఆర్టీఐ కింద దాఖలుచేసిన అర్జీకి సమాధానంగా చెప్పింది. -
రాహుల్‌పై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
పట్నా : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం నేపథ్యంలో విమర్శలు గుప్పిస్తున్న రాహుల్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చూబే వ్యాఖ్యానించారు. బిహార్‌లోని ససరాంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌తో రాఫెల్ డీల్‌పై ప్రధాని మోదీ లక్ష్యంగా రాహుల్ చేస్తున్న దాడి అర్ధరహితమని అన్నారు. ఆకాశం వంటి సమున్నత ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్న రాహుల్‌ను మానసిక వ్యాధుల ఆస్పత్రిలో చేర్చాలని అన్నారు. రాహుల్ తనకు తాను గొప్ప వ్యక్తిగా, మేధావిగా, సరైన వ్యక్తిగా ఊహించుకుంటూ రఫేల్ ఒప్పందంలో మోదీ అవాస్తవాలు చెబుతున్నారని రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. స్కీజోఫ్రెనియా వ్యాధితో బాధపడే వ్యక్తులే ఇలా వ్యవహరిస్తారని, ఆయనను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని మంత్రి సూచించారు. అవినీతి మాతగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ బిహార్‌లో మహా కూటమిని మహా అవినీతి కూటమిగా మార్చిందని ఆరోపించారు. దేశానికి నరేంద్ర మోదీ వంటి పురోగామి ప్రధాని అవసరమని, దేశమంతా తిరిగి మోదీని ప్రధానిని చేసేందుకు ఏకమవుతోందన్నారు. కాగా రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చూబేకు ఇదే తొలిసారి కాదు. ఎవరో రాసిన స్ర్కిప్ట్‌ను చదివే చిలక రాహుల్ గాంధీ అని 2015లో ఆయన ఆరోపించారు. -
కేంద్రమంత్రి అనంతకూమార్కు కడప ఉక్కు సెగ
-
నార్త్‌బ్లాక్‌లోకి అడుగుపెట్టనున్న జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : మూడు నెలల విరామం అనంతరం ఆగస్టు మాసాంతంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తిరిగి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టనున్నారు. కిడ్నీ మార్పిడి చికిత్స నేపథ్యంలో గత మూడు నెలలుగా అధికారిక కార్యక్రమాలకు జైట్లీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్ ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నార్త్‌బ్లాక్‌లోని ఫస్ట్‌ఫ్లోర్‌లో జైట్లీ కార్యాలయంలో ప్రస్తుతం మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు. జైట్లీకి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా అత్యంత పరిశుభ్రంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా సోషల్ మీడియా వేదికగా జైట్లీ గత కొద్దివారాలుగా విపక్షాల విమర్శలకు దీటుగా బదులిస్తున్నారు. మరోవైపు జైట్లీ అనారోగ్యంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతులు చూస్తున్న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం, సమావేశాలకు హాజరవుతుండటంతో దేశ ఆర్థిక మంత్రి ఎవరని విపక్షాలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
ఆసుపత్రికి ఆ స్థలం అనువుగా లేదు
ఢిల్లీ : విశాఖపట్నం జిల్లా షీలానగర్‌లో 500 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 8.59 ఎకరాల భూమి అనువుగా లేదని కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ బుధవారం రాజ్య సభలో వెల్లడించారు. షీలానగర్‌లో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందా? అలాంటి పరిస్థితులలో ఉత్తరాంధ్రలోని లక్ష మందికి పైబడి ఉన్న కార్మికులు శిధిలమైన భవనంలో ఉన్న ప్రస్తుత ఈఎస్ఐ ఆస్పత్రిలో ఇంకా ఎంత కాలం వైద్య సేవలను పొందాల్సి ఉంటుంది? అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కార్మిక మంత్రి సవివరంగా జవాబిచ్చారు. విశాఖపట్నంలో 500 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం ఈఎస్ఐకి షీలానగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం 8.59 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది. అయితే ఈ భూమి ఆస్పత్రి నిర్మాణానికి అనువు కాదని తేలింది. దీనికి ప్రత్యామ్నయంగా విశాఖపట్నంలో ఏదైనా అభివృద్ధి చెందిన ప్రాంతంలో 10 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ఈఎస్ఐ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి తగిన భూమిని ఇంకా కేటాయించాల్సి ఉంది. అంతే తప్ప ఈఎస్ఐ ఆస్పత్రి భవన నిర్మాణ ప్రాజెక్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం వైదొలగలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి ఉన్న విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (వీపీటీ) ఆవరణలోని భవనం శిధిలావస్థకు చేరిన దృష్ట్యా దీనిని ఆస్పత్రి సేవలను అద్దెకు తీసుకున్న భవనంలోకి మార్చినట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో అంతర్జాతీయ కార్గో టెర్మినల్ కార్యకలాపాలు నవంబర్ 2017 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమైనట్లు పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు బుధవారం రాజ్య సభలో ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లాజిస్టిక్స్, అలైడ్ సర్వీసెస్ కంపెనీ ఆధ్వర్యంలో కార్గో టెర్మినల్ కార్యకలాపాల నిర్వహణ జరుగుతున్నట్లు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి చెప్పారు.అంతర్జాతీయ కార్గో ఆపరేషన్స్‌కు అవసరమైన ట్రక్-డాక్ ఏరియా, కార్గో స్టోరేజ్ స్థలం, కోల్డ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్స్, ఎక్స్-రే స్క్రీనింగ్ మెషీన్, ఎక్స్‌ప్లోజివ్ డిటెక్టర్ మెషీన్ వంటి అన్ని వ్యవస్థల ఏర్పాటు జరిగినట్లు మంత్రి తెలిపారు. అన్ని రకాల కార్గో, బల్క్ కార్గో కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన రీతిలో కార్గో టెర్మినల్‌ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఏటా 20,00 మెట్రిక్ టన్నుల కార్గో ఎగుమతి, దిగుమతి సామర్ధ్యం కలిగి ఉన్న ఈ టెర్మినల్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 170 మెట్రిక్ టన్నుల కార్గో ఎగుమతులు, 155 మెట్రిక్ టన్నుల కార్గో దిగుమతి జరిగింది. పెరిగే అవసరాలకు అనుగుణంగా టెర్మినల్ సామర్ధ్యాన్ని పెంచడం జరుగుతుందని మంత్రి తెలిపారు. -
తుని-కొత్తవలస రైల్వే లైన్ ప్రాజెక్ట్ రద్దు
న్యూఢిల్లీ : తుని-కొత్తవలస బ్రాడ్‌గేజ్ రైల్వే ప్రాజెక్టుకు రైల్వే బోర్డు మంగళం పాడేసింది. ఈ ప్రాజెక్ట్ ఎంతమాత్రం గిట్టుబాటు కాదని రైల్వే బోర్డు అభిప్రాయపడినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహెయిన్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, తుని-కొత్తవలస ఇప్పటికే విద్యుద్దీకరణ చేసిన డబుల్ లైన్‌తో అనుసంధానం అయింది. అయినప్పటికీ తుని-కొత్తవలస వయా నర్సీపట్నం, మాడుగుల మధ్య 155.34 కి.మీ దూరం సింగిల్ లైన్ రైల్ మార్గం నిర్మాణం కోసం సర్వే నిర్వహించినట్లు చెప్పారు. ఈ రైల్ మార్గం నిర్మాణానికి సుమారు 3771.21 కోట్లు ఖర్చు అవుతుందని తేలింది. ప్రస్తుతం తుని-కొత్తవలస మధ్య ఉన్న డబుల్ లైన్ వినియోగ సామర్ధ్యం 46 నుంచి 122 శాతం ఉండగా, తుని-కొత్తవలస మధ్య ప్రతిపాదించిన కొత్త రైల్వే మార్గంలో అతి తక్కువ ట్రాఫిక్ కారణంగా పెట్టుబడులపై రాబడి పూర్తిగా నెగెటివ్‌లో ఉన్నట్లు సర్వే వివరాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత రైల్వే బోర్డు అభిప్రాయపడింది. అందుకే ఈ కొత్త రైల్వే లైన్ ఆర్ధికంగా గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతో ప్రాజెక్టును రద్దు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. ధాన్యం సేకరణ విషయంలో ఏపీ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా తమ దృష్టికి రాలేదని ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ శుక్రవారం రాజ్యసభలో చెప్పారు. ఏపీలో ప్రభుత్వ ధాన్యసేకరణ కేంద్రాలంలో ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా రబీ సీజన్లో ధాన్యం రైతులను మిల్లర్లు, దళారీలు పీల్చుకు తింటున్న విషయం వాస్తవమేనా? అంటూ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ ధాన్యం సేకరణలో తేమ పరిమితులు, ఇంకా ఇతరత్రా నిబంధనలను పాటించకపోవడం వల్ల రాష్ట్ర రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు ఏవీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాలేదని చెప్పారు. ధాన్యం సేకరణకు సంబంధించినంత వరకు ఏపీ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్(డీసీపీ) రాష్ట్ర జాబితాలో ఉంది. అందువలన రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అవుతుంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద సంబంధిత రాష్ట్రం అవసరాలు తీరిన తర్వాత మిగిలిన కస్టమ్ మిల్డ్ రైస్(సీఎంఆర్)ను ఇతర రాష్ట్రాల వినియోగం కోసం సెంట్రల్ పూల్‌లోని ఎఫ్‌సీఐకి పంపించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరిస్తుంది. ధాన్యం సేకరించిన 48 గంటల్లోగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా కనీస మద్ధతు ధర ప్రకారం సొమ్ము చెల్లింపు జరుగుతుందని మంత్రి వివరించారు. -
విశాఖ మెట్రో..రేసులో ఐదు సంస్థలు
న్యూఢిల్లీ: విశాఖపట్నంలో పీపీపీ విధానంలో మెట్రో రైల్ నిర్మాణం చేపట్టడానికి ఐదు సంస్థలను రాష్ర్ట ప్రభుత్వ షార్ట్‌లిస్ట్ చేసింది. వారికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)ను జారీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చినట్లు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. విశాఖపట్నం మెట్రోరైల్ ప్రాజెక్ట్‌ను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్(ఈఓఐ)ని ఆహ్వానించగా పలు సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన పిమ్మట ఆర్‌ఎఫ్‌సీలను జారీ చేయడానికి ఐదు సంస్థలను రాష్ర్ట ప్రభుత్వం ఎంపిక చేసినట్లు మంత్రి చెప్పారు. మెట్రో రైల్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించిన తర్వాత విశాఖపట్నం మెట్రోరైల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో ఎన్ని కారిడార్లు ఉంటాయి. ప్రతి కారిడార్ పొడవు ఎంత అన్న ప్రశ్నలకు మంత్రి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. నగర రవాణా వ్యవస్థ నగర అభివృద్ధిలో ఒక అంతర్భాగం. ఇది పూర్తిగా రాష్ర్ట ప్రభుత్వం పరిధిలో మాత్రమే ఉంటుంది. అందువలన మెట్రో రైలు ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆయా రాష్ర్ట ప్రభుత్వాలే రూపొందిస్తాయి. అందువలన విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు అలైన్మెంట్ ఎలా ఉండాలి, మొత్తం ఎంత వ్యయం అవుతుందో ఏపీ ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయం కోరుతున్నట్లయితే ఆ ప్రతిపాదనలు మెట్రో రైల్ విధానంలోని పలు అంశాలకు అనుగుణంగా ఉండి తీరాలని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం 20,500 మంది సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ఉద్వాసన పలికిన అంశంపై విజయసాయి రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి మంత్రి ఉపేంద్ర కుష్వాహా జవాబిస్తూ..వారిని తొలిగించినట్లుగా రాష్ర ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. త్వరలోనే సాక్షర భారత్ స్థానంలో కొత్త పథకం అమలులోకి వస్తుంది. సాక్షర భారత్‌లో కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న వారి సేవలను కొత్త పథకంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించవచ్చునని మంత్రి స్పష్టం చేశారు. గడచిన నాలుగేళ్ల కాలంలో సాక్షర భారత్ పథకం అమలు కోసం మొత్తం 498.99 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. -
నిందితులను సన్మానించిన కేంద్ర మంత్రి..!
సాక్షి, న్యూఢిల్లీ: గోవు మాంసం విక్రయిస్తున్నాడనే అనుమానంతో గతేడాది జూన్‌లో అలీముద్దీన్ అన్సారీ అనే వ్యక్తిని ఉరి వేసి చంపారు. రామ్‌ఘర్‌లోలో జరిగిన ఈ ఘటనలో 11 మందిని ముద్దాయిలుగా పేర్కొంటూ జార్ఖండ్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తీర్పుకు హైకోర్టులో బ్రేకులు పడ్డాయి. విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు నిందితులందరికీ బెయిలు మంజూరు చేసింది. అయితే కోర్టు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జయంత్ సిన్హా హత్య కేసులోని 8 మంది నిందితులకు శుక్రవారం హజారీబాగ్‌లోని తన ఇంటిలో పూల మాలలు వేసి సన్మానం చేశారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో సిన్హాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యనభ్యసించిన జయంత్ తీరు మరీ అధ్వానంగా ఉందనీ జార్ఖండ్ ప్రతిపక్ష నేత హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు అజోయ్ కుమార్‌లు మండిపడ్డారు. మత విద్వేశాల్ని రెచ్చగొట్టే హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కేంద్ర మంత్రి మద్దతుగా నిలవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాగా, ఈ విమర్శలపై జయంత్ సిన్హా శనివారం స్పందించారు. రాజకీయ పరిపక్వత లేనివారు తనను విమర్శిస్తున్నారని అన్నారు. భారతీయ న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకముందనీ, హైకోర్టు తీర్పుపై ఆనందం వ్యక్తం చేయడం నేరం కాదని స్పష్టం చేశారు. సిన్హా హర్వార్డ్ బిజినెస్ స్కూల్లో పట్టభద్రులు కావడం గమనార్హం. -
కొత్త మిత్రుల కోసం బీజేపీ వేట..
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఇబ్బందికరమేనని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ అంగీకరించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు అవసరమైతే కొత్త మిత్రుల వైపు దృష్టిసారిస్తామన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహరి వాజ్‌పేయి హయాం నుంచే కూటమి భాగస్వామ్య పక్షాలకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తున్న విషయం ప్రస్తావించారు. తాము సమాఖ్య వ్యవస్థకు కట్టుబడి ఉంటామని, అందుకే భాగస్వామ్య పక్షాలు తమతోనే ఉండాలని కోరుకుంటామన్నారు. కొత్త భాగస్వామ్య పార్టీల కోసం అన్వేషిస్తామని..కూటమిలో ఎవరికీ ప్రవేశం లేదనే బోర్డు పెట్టలేదని స్పష్టం చేశారు. ఎన్డీఏ నుంచి ఇటీవల వైదొలిగిన పార్టీలు సైతం తిరిగి కూటమిలోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీ, మహారాస్ర్ట సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఇటీవలి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమిపై ఆయన స్పందిస్తూ ఉప ఎన్నికల్లో ఓటమి తమపై ప్రభావం చూపబోదని తాను చెబితే అది పొరపాటు అవుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం. తమకు వ్యతిరేకంగా పలు పార్టీల అపవిత్ర కలయికలను దీటుగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ ఫలితాలు తమకు ఉపకరిస్తాయని అన్నారు. యుద్ధరంగంలో ప్రత్యర్థుల వ్యూహాలు, ఎత్తుగడలను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని, ప్రస్తుత ఫలితాలు తమకు భవిష్యత్ వ్యూహాలు రూపొందించుకునే క్రమంలో ఉపయోగపడతాని వ్యాఖ్యానించారు. దేశంలో రైతాంగ సమస్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనపై స్పందిస్తూ అన్నారు. -
‘మూడో ఫ్రంట్’ పునరావృతం కాదు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ వెనక బీజేపీ ఉందన్న ప్రచారాన్ని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. ఎలాంటి మూడో, నాలుగో కూటమికీ బీజేపీ అధికారికంగానూ, అనధికారికంగానూ ఏ విధంగా కూడా సలహాదారు కాదని స్పష్టం చేశారు. 1990ల్లో దేవేగౌడ, ఐకే గుజ్రాల్ నేతృత్వంలో కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడిన ఘటనలు 2019లో పునరావృతం కాబోవని ధీమా వెలిబుచ్చారు. విపక్ష పార్టీలతో అతుకుల బొంతగా ఏర్పడే కూటములు ఎక్కువ రోజులు నిలవబోవన్నారు. బీజేపీ వంటిæ బలమైన పార్టీ నేతృత్వంలోనే సుస్థిర ప్రభుత్వం సాధ్యమవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2019లో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని నిలుపుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సాధించిన పురోగతి, విజయాలను గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భారీగా భూములు మింగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టులు ఆచరణలో సాధ్యం కావని, అందుకే దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా వాటిని పక్కన పెట్టామని చెప్పారు. ఈ విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ముందుకు వస్తే పరిశీలిస్తామన్నారు. ‘‘ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయిస్తేనే హైకోర్టు విభజన ప్రక్రియ సాధ్యమవుతుంది. ఏపీలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యేదాకా హైకోర్టు విభజన జరపరాదని ఆ రాష్ట్ర సీఎం హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి’’అని చెప్పారు. ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటములకు బీజేపీ ఆందోళనపడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘విజయ్ మాల్యా, నీరవ్ మోదీ కుంభకోణాలకు గత ప్రభుత్వమే కారణం’’అని ఆరోపించారు. తాజాగా బయటపడిన ఎయిర్ ఏషియా కుంభకోణమూ గత ప్రభుత్వ హయాంలో జరిగిందేనన్నారు. తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర కీలకం కానుందని జోస్యం చెప్పారు. ‘‘జాతీయ వృద్ధి రేటు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వంటి అభివృద్ధికి సూచికలు నాలుగేళ్లలో బాగా పెరిగాయి. పారదర్శకతతో అవినీతిని అడ్డుకున్నాం. భారీగా రహదారులను విస్తరిస్తున్నాం. ఉజ్వల యోజన పథకాల, అటల్ యోజన, ప్రధాని జీవన్ జ్యోతి వంటి సంక్షేమ పథకాలు తెచ్చాం. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్ర పథకాలతో యువతకు ఉపాధి కల్పిస్తున్నాం. నాలుగేళ్లలో 7 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలొచ్చాయి’’అని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలయ్యేదాకా పెట్రోల్ ధరలు పెరగకుండా కేంద్రం నియంత్రించిందన్న విమర్శలు అవాస్తవమన్నారు. దేశ గతిని మార్చిన మోదీ అన్ని విషయాల్లో ప్రపంచం ప్రాధాన్యమిచ్చేలా దేశ గతిని ప్రధాని నరేంద్ర మోదీ మార్చేశారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ అన్నారు. మోదీని విజ్ఞుడైన ప్రపంచ నేతగా, భారత్‌ను ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందుతున్న దేశంగా గుర్తిస్తున్నారని, ఇది భవిష్యత్తులో మన దేశం వేగంగా పురోగమించేందుకు సహకరిస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం రూపాయి విడుదల చేస్తే లబ్ధిదారుకు కేవలం 15 పైసలే చేరేవని.. ఇప్పుడు లబ్ధిదారు ఖాతాలో కేంద్రం రూ.వేయి జమ చేస్తే రూ.వేయి చేరుతోందన్నారు. ప్రస్తుత కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో దేశానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తోంది భారతే.. ప్రపంచంలో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశం భారతేనని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. 2014లో మన దేశంలో కేవలం రెండు మొబైల్ ఫోన్ తయారీ పరిశ్రమలుంటే ఇప్పుడు వాటి సంఖ్య 120కి పెరిగిందని వెల్లడించారు. అన్ని దేశాలు భారత్‌తో మైత్రిని కోరుకుంటున్నాయని, దాన్ని నిలబెట్టుకుంటూ వాటితో మన దేశం స్నేహంగా మెలుగుతోందన్నారు. భారత్ అనుసరిస్తున్న విధానాలతో పాకిస్తాన్ బెదిరిపోతోందని చెప్పారు. మోదీ నిజాయితీకిదే నిదర్శనం.. 14 ఏళ్లు గుజరాత్ సీఎంగా, నాలుగేళ్లు దేశ ప్రధానిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ మోదీ కుటుంబ సభ్యులు సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అతి సాధారణ జీవితాలను గడుపుతున్నారని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఇది ఆయన నిజాయితీకి నిదర్శమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య, ఓయూ మాజీ వీసీ తిరుపతిరావు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. -
గూగుల్‌కు పెద్ద ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు ఇండియాలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇండియాలో ‘స్ట్రీట్ వ్యూ’ సర్వీసు ప్రారంభిద్దామనుకున్న గూగుల్ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచింది. భద్రతా కారణాలతో తిరస్కరిస్తున్నట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ గంగారం అహిర్ వెల్లడించారు. బహిరంగ ప్రదేశాలను 360 డిగ్రీల కోణంలో చూయించేందుకు అనుమతి తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి 2015, జూలైలో సమర్పించింది. కానీ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.ఈ విషయం గురించి వేలూరు ఎంపీ బాలసుబ్రమణియన్ రాతపూర్వకంగా పశ్న అడిగినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి ప్రత్యేక కారణం లేదంటూ సమాధానం దాటవేశారు. రక్షణశాఖ అధికారులు భద్రతకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని చెప్పినట్లు మంత్రి వివరించారు. ఈ ‘స్ట్రీట్ వ్యూ’ సర్వీసును మొదటగా 2011లో బెంగుళూరులో ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాలను కెమెరాలో బంధింస్తుడటంతో స్థానిక అధికారులు అభ్యంతరంవ్యక్తం చేశారు. దీంతో అప్పుడు సర్వీసు నిలిచిపోయింది. మళ్లీ 31 చారిత్రాత్రక కట్టడాలను 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించేందుకు 2015లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంతో ఈ సర్వీసు గురించి చర్చలు జరుపుతోంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ సర్వీస్ ప్రస్తుతం 82 దేశాల్లో ఉంది, ఈ సర్వీసు వల్ల పర్యాటకులకు ఎంతో మేలు కలుగుతుంది. మొట్టమొదటి సారి 2007లో కార్లు, బైక్‌లపై కెమెరాలను అమర్చి 360 డిగ్రీల కోణంలో చిత్రాలను సేకరించడం, సేకరించిన చిత్రాలను పనోరమిక్ త్రీడీ కోణంలో చూసేవిధంగా గూగుల్ అమెరికాలో ప్రవేశపెట్టింది. -
నేనేందుకు లొంగిపోవాలి?
న్యూఢిల్లీ : భాగల్పూర్లో మతఘర్షణ కేసులో లొంగిపోయేది లేదని కేంద్ర సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే కుమారుడు అరిజిత్ శష్వత్ చౌబే అన్నారు. పోలీసుల ఎదుట తాను లొంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన న్యాయస్థానమే తనకు రక్షణ కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. ‘నేనేందుకు లొంగిపోవాలి? కోర్టు వారెంట్ జారీ చేసింది కానీ అదే కోర్టు నాకు రక్షణ కల్పిస్తుంది. పోలీసులు ఒక్కసారి కోర్టుకు వెళ్లితే అక్కడ ఏమి జరుగుతుందో తెలుస్తుంద’ని అన్నారు. తాను ఎక్కడికి పారిపోవట్లేదని, జనం మధ్యలో ఉన్నానని తెలిపారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే సహకరిస్తానని, కోర్టుకు వెళ్లి ముందుస్తు బెయిల్ తెచ్చుకుంటానని చెప్పారు. బిహర్‌లోని భాగల్పూర్లో మార్చి 17న రెండు వర్గాల మధ్య మతఘర్షణలను ప్రేరేపించేలా మాట్లాడినందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో అరిజిత్‌తో సహా మరో ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టు శనివారం అరెస్ట్ వారెంట్ జారీచేసింది. కాగా ఈ అంశంపై ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ స్పందిస్తూ... రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో సీఎం నితీశ్‌కుమార్ విఫలమయ్యారని విమర్శించారు. అరిజిత్‌ను కాపాడేందుకు డమ్మి అరెస్ట్ వారెంట్ జారీచేశారని ఆరోపించారు. -
మూడేళ్లలో ఏపీకి 1767 కోట్లు ఇచ్చాం
సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,767 కోట్లు ఇచ్చామని కేంద్ర పారిశుద్ధ్యశాఖ మంత్రి రమేష్ చందప్ప తెలిపారు. సోమవారం రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ మేరకు వివరాలతో కూడిన ఓ పత్రికా ప్రకటనను ఆయన విడుదల చేశారు. ఏపీలో 5లక్షల ఇళ్లకు మరుగు దొడ్ల సౌకర్యం లేదని, 2015-16 నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు ఈ వార్షిక ప్రణాళికల అమలుకోసం ఏపీ 4,470 కోట్లు కోరగా అందుబాటులో ఉన్న నిధుల నుంచి 1,767 కోట్లు ఇచ్చామని మంత్రి రమేష్ చందప్ప సమాధానమిచ్చారు. ఐఎన్ఎస్ విరాట్‌పై డీపీఆర్ పరిశీనలో ఉంది భారత నౌకాదళ సేవల నుంచి విశ్రమించిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్‌ను హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌గా రుపుదిద్దాలన్న ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ప్రస్తుతం తమ పరిశీనలో ఉన్నట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ భామ్రే వెల్లడించారు. సోమవారం రాజ్య సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విరాట్‌ను మ్యూజియం, హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌గా మార్చే ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో రక్షణ మంత్రిత్వ శాఖకు డీపీఆర్ పంపినట్లు తెలిపారు. తమ మంత్రిత్వ శాఖ ఈ డీపీఆర్‌ను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
ఆశీర్వదించండి
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో తాము అధికారంలో లేకపోయినా అభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాయిస్తున్నామని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహేర్ హామీ కోరారు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, తమ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిజాం చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి చేస్తామని ఇచ్చారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధానితో చర్చించాలని సూచించారు. చెరుకు రైతుల చర్నాకోల్ మహా పాదయాత్ర ముగిం పు సందర్భంగా ఆదివారం బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. చెరుకు రైతులు, కార్మికులకు భరోసా కల్పించేందుకు నాయకులు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము ఎప్పుడూ అధికారంలో లేకపోయినా.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిధులు ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆర్మూర్ – ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. గోదావరి, పెన్‌గంగా నదులపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు వెంటవెంటనే అనుమతులిచ్చామని, మహారాష్ట్రలోని తమ ప్రభుత్వం కూడా ఇందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. అధికారం కష్టమేమీ కాదు.. త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల మాదిరి తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వలస వెళ్లకుండా స్థానికంగా ఉపాధి కల్పించేందుకు యువతకు నైపుణ్య అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూత పడ్డాయని, రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు సైతం ఇదే ధోరణితో ముందుకెళుతోందని విమర్శించారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజ్యసభకు పంపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని శాసన మండలి బీజేపీ పక్ష నేత రాంచంద్రరావు విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు చేసుకోవడమే గుణాత్మకమైన మార్పా అని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, 140 కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో సమస్యలు దృష్టికి వచ్చాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. బోధన్ చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేసిన చంద్రబాబు మహా పాపాత్ముడని, దీన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనతోనే రైతుల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలిస్తామని ప్రకటించిన కేసీఆర్ పాలనలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ విమర్శించారు. చక్కెర కర్మాగారం కార్మికులకు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, మహిళా సంఘాలకు రూ.2,200 కోట్ల వడ్డీ రాయితీ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికార ప్రతినిధి అడ్లూరు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు, కార్మికులకు అండగా నిలిచేందుకు చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లెగంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, లోక భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి, బస్వ లక్ష్మినర్సయ్య, శివప్ప, గురూజీ బాబుసింగ్రాథోడ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులపై తీరుపై అసహనం ముగింపు సభలో కేంద్రమంత్రి మాట్లాడుతుండగా ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన తెలిపారు. వర్గీకరణపై బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు పాదయాత్ర చేసి ముగింపు సభ నిర్వహిస్తే కొందరు వచ్చి నిరసన తెలుపుతుంటే పోలీసులు చూస్తూ ఉండడం ఏమిటని ప్రశ్నించారు. చేతులు కట్టుకోవడానికి వచ్చారా? అని అసహనం వ్యక్తం చేశారు. -
పసుపు బోర్డుపై స్పందించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కె తారకరామారావు రాసిన లేఖకు కేంద్ర మంత్రి స్పందించారు. స్పైసెస్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ కోరకు ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. పసుపు పంట మార్కెటింగ్ రీసెర్చీ ద్వారా పంట అభివృద్ది చేయాల్సిన బాద్యత కేంద్ర, రాష్ట్రాల వ్యవసాయ శాఖలపై ఉందని సురేష్ ప్రభు అన్నారు. స్పైసెస్ బోర్డు పసుపుతో పాటు ఇతర ఎగుమతులు, నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం ప్రత్యేక సెలల్‌ను స్పైసెస్ బోర్డులో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీం పథకం కింద ప్రత్యేకంగా ఓస్పైసెస్ పార్క్‌ను కూడా నెలకొల్పుతామని ఆయన లేఖలో పేర్కొన్నారు. -
‘అభిప్రాయం తీసుకున్న తర్వాతే విభజన నిర్ణయం’
విజయవాడ : నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాతే విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు వ్యాఖ్యానించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో పల్లం రాజు విలేకరులతో మాట్లాడారు. నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వ వాగ్ధానాన్ని నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై కొన్ని నెలల క్రితం నుంచే చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారని అన్నారు. కేంద్ర ఇచ్చిన నిధులు, చేసిన ఖర్చుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు. సోనియాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా లేఖలో ఆంధ్ర్ర ప్రదేశ్‌కు కేటాయించవలసిన నిధులు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరారని చెప్పారు. మార్చ్ 2న ఏపీలో రాస్తారోకో నిర్వహిస్తామని, అనంతరం ఢిల్లీలో మార్చి 7, 8వ తేదీల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రానికి న్యాయం జరిగే విధముగా ప్రభుత్వాలు కనీస ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరారు. -
ఈ బడ్జెట్ నిరాశ కలిగించింది: కేంద్ర మంత్రి
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎలాంటి ప్రత్యేకత చూపలేదని, ఈ బడ్జెట్ చాలా నిరాశగా ఉందని కేంద్ర మంత్రి సుజానా చౌదరీ విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..రెవిన్యూ లోటు, అమరావతికి నిధులు వంటి అంశాల ప్రస్తావన లేకపోవడం విచారం కలిగించిందని వాపోయారు. పోలవరం ప్రాజెక్ట్‌కి నిధుల సమీకరణ నాబార్డు ద్వారా ఏర్పాటు చేశారు..కానీ నిధుల ప్రవాహమేమీ చెప్పుకోదగిన రీతిలో లేదన్నారు. ఎక్కడెక్కడో మెట్రోలు ఇచ్చారు కానీ విజయవాడ, విశాఖపట్నం నగరాలకు మెట్రో ప్రస్తావన లేదని మండిపడ్డారు. ఓవరాల్‌గా ఈ బడ్జెట్ మీద నిరాశగా ఉన్నామని చెప్పారు. ఏపీ ప్రజల అభిప్రాయమే తమ వాదమని, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఒత్తిడి చేయాల్సి బాధ్యత తమపై ఉందన్నారు. బడ్జెట్లో ప్రస్తావించకపోయినా, లైన్ అకౌంట్ నుంచి ఇవ్వొచ్చని, తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తాము నడుచుకుంటామని వివరించారు. మా అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశం తర్వాత కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు. గత నాలుగు ఏళ్లలో కొంత సాధించామని, ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నారు. రైల్వే జోన్ తీసుకొచ్చి తీరుతామని, దీన్ని అసలు వదులుకోమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా మాత్రమే దేన్నైనా సాధించుకోవాలని సూచించారు. -
దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం: కేంద్ర మంత్రి గెహ్లాట్
సాక్షి, చిక్కడపల్లి(హైదరాబాద్): కేంద్ర సామాజిక న్యాయం శాఖ మంత్రిగా మూడున్నరేళ్లుగా ఆనందంగా పనిచేస్తున్నానని, తన శాఖలో మూడు గిన్నిస్ రికార్డులు రావడం గర్వకారణంగా ఉందని తావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల హక్కుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చిందన్నారు. ఇక్కడి త్యాగరాయ గానసభలో వికలాంగుల హక్కుల చట్టం-2016 పై శనివారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 21 కేటగిరీలను చట్టంలోకి తెచ్చిన ఘనత తమదేనని, 3 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 4 శాతానికి పెంచామని, కళాశాలల్లో చేరికల కోసం 5 శాతం రిజర్వేషన్‌ను తమ ప్రభుత్వమే మొదలు పెట్టిందని వివరించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో 6 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, తెలంగాణలో కూడా ఇస్తే సంతోషమని అన్నారు. వికలాంగుల గుర్తింపు కార్డులు జిల్లాస్థాయిలో మాత్రమే కాదు దేశమంతా చెల్లుబాటయ్యేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఒక్క స్కూల్ అయినా ప్రారంభించిందా అని నిలదీశారు. 10 లక్షల మంది దివ్యాంగులలో 4 లక్షల మందికి మాత్రమే సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. మెట్రో రైలులో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగులకు కేంద్రం అమలు జరిపే పథకాలపై అవగాహన కల్పిస్తామని, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు త్వరలో వికలాంగుల హక్కుల భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు రాములు కూడా పాల్గొన్నారు. -
ఓసీలకు 25% రిజర్వేషన్లు ఇవ్వొచ్చు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందిస్తున్న రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వొచ్చని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతశాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. మొత్తంగా వారికి 25 శాతం రిజర్వేషన్లను కల్పించడం వల్ల ఎవరికీ నష్టం ఉండదన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే క్రీమీలేయర్ పద్ధతిని వర్తింపజేయవచ్చన్నారు. ప్రస్తుతం ప్రజల సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అయితే ప్రజల ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత చట్టాల్లో మార్పులను పరిశీలించొచ్చన్నారు. రిజర్వేషన్ల కోసం గుజరాత్లో పాటిదార్లు, ఉత్తరాది రాష్ట్రాల్లో జాట్లు చేస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయన్నారు. మరాఠాలకు రిజర్వేషన్లను తాను సమర్థించినట్లు అథవాలే ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల కులాంతర వివాహాలకు ప్రభుత్వం రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తోందని, ఈ మొత్తాన్ని రూ. లక్షకు పెంచాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. గోరక్ష పేరిట దాడులు జరగడం అమానుషమని, గోవులకు రక్షణ ఇవ్వడం మంచిదేనని, కానీ దాని పేరిట మనుషులకు రక్షణ ప్రశ్నార్థకం కారాదన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం కింద ఏటా 42 వేల కేసులు నమోదవుతున్నాయని మంత్రి అన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు అప్పటికప్పుడు స్పందించ డం తప్ప దాడులు జరగకుండా నిరోదించేందుకు కృషి చేయాలని సూచించారు. హెచ్‌సీయూలో రోహిత్‌వేముల లాంటి ప్రతిభావంతుడు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ల భర్తీపై చర్చించేందుకు సంబంధిత అధికారులతో ఆయన అంతకుముందు సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ‘అంబేడ్కర్–రాజ్యాంగవాదం’అనే అంశంపై జరిగిన సదస్సులో కూడా అథవాలే పాల్గొన్నారు. -
మన్నవరం ప్రాజెక్టును పూర్తిచేయండి
సాక్షి, న్యూఢిల్లీ : విద్యుత్తు ప్రాజెక్టుల స్థాపనలో ఈపీఎస్ కాంట్రాక్టుల అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన మన్నవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో విస్తరించి త్వరగా పూర్తిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన శనివారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతెను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వినతిపత్రంలోని వివరాలు ఇలా ఉన్నాయి.... మొదటి విడతలో రూ.1,200 కోట్లతో, రెండో విడతలో రూ.4,800 కోట్లతో మన్నవరం ప్రాజెక్టును స్థాపించాలని 2008లో ఎన్టీపీసీ, బీహెచ్ఈల్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీపీసీ, బీహెచ్ఈల్ పవర్ ప్రాజెక్టు ప్రయివేటు లిమిటెడ్(ఎన్బీపీపీఎల్) ఏర్పడింది. కానీ కేంద్రం తొలి విడతగా రూ.1,200 కోట్లు వెచ్చించకుండా కేవలం రూ.364 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఇందులో కూడా కేవలం రూ.1,27 కోట్లు మాత్రమే ఇచ్చింది. విద్యుత్తు రంగానికి డిమాండ్ తగ్గిందని, సామర్థ్యానికి మించి విద్యుత్తు ప్రాజెక్టులు ఉన్నాయన్న ప్రచారం సరైనది కాదు. విద్యుత్ రంగానికి అవసరమైన యంత్రాలు, విభాగాలను వివిధ సంస్థలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అలాంటప్పుడు డిమాండ్ లేదని, సామర్థ్యానికి మించి విద్యుత్ సంస్థలు ఉన్నాయని ఎలా చెప్పగలం?. పైగా దేశంలో విద్యుత్తు రంగ యంత్రాలు, విడిభాగాల తయారీ తగ్గిపోతోంది. ఎన్బీపీపీఎల్ ఈ కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం విద్యుత్తు రంగ పరికరాల తయారీకి ఉద్దేశించినది మాత్రమే కాకుండా దేశంలోని, ఇతర దేశాల్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన యంత్రాలు తయారు చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. కానీ ఎన్బీపీపీఎల్ ఈ విషయంపై ఎందుకు దృష్టిపెట్టడం లేదో అర్థం కాని పరిస్థితి. పైగా ఈ ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ వైదొలిగినట్టు తెలుస్తోంది.. కారణమేంటో తెలియదు. విభజన అనంతరం నూతన ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క కేంద్ర పబ్లిక్ సెక్టార్ యూనిట్ కూడా మిగలలేదు. ఉన్న ఒక్క ఈ ఆశనూ కేంద్రం తుంచివేస్తోంది. ఈ వైఖరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. అందువల్ల మీరు స్వయంగా దీనిపై దృష్టిపెట్టి పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టును అభివృద్ధి పరచాలని కేంద్ర మంత్రిని కోరారు. -
హైకోర్టు విభజనపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. విభజన చేస్తే ప్రస్తుత హైకోర్టు తెలంగాణకు చెందుతుందని తెలిపారు. ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర కొత్త రాజధానిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేయడానికి నాలుగు భవనాలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారని తెలిపారు. అందులో ఏదో ఒకటి ఖరారు చేయాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారని వివరించారు. భవనాలు సిద్ధంగా ఉన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరపాలని, హైకోర్టును తాత్కాలికంగా మార్చగలం కానీ శాశ్వతంగా మార్చడానికి చాలా సమయం పడుతుందని వెల్లడించారు. అంతవరకు పరస్పరం ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలని రెండు రాష్ట్రాలను కోరుతున్నానని విన్నవించారు. న్యాయమూర్తుల నియామకం, పదోన్నతులు తమ పరిధిలోని అంశం కాదని, నియామకలన్నీ కొలీజియమే చేస్తుందని పేర్కొన్నారు. పదోన్నతులు నిలిపివేయాలన్న విషయంపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు. నాలుగు భవనాలను ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఏపీ ప్రభుత్వం కూడా ఈ దిశగా ముందుకు రావడం సంతోషం అయితే విభజన జరిగే వరకు న్యాయమూర్తుల పదోన్నతులు చేయవద్దని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్ రెడ్డి కేంద్రమంత్రికి విన్నవించారు. హైకోర్టు విభజన ఒక్కటే సమస్య కాదు. విభజన చట్టంలో అనేక పెండింగ్ అంశాలున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో పాటు రెవెన్యూ లోటు, ఇంకా చాలా అంశాలు పరిష్కరించాల్సి ఉన్నాయని మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాలని, ఆ సమావేశం ఏర్పాటు చేసేందుకు తాము రెడీగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. -
కేంద్రమంత్రికి మహిళా డాక్టర్ చీవాట్లు
-
కేంద్రమంత్రికి మహిళా డాక్టర్ చీవాట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రమాదకర పరిస్థితిలో ఉన్న రోగికి చికిత్స అందించేందుకు వెళుతుండగా విమానం ఆలస్యం కావడంతో కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచార, సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయమంత్రి అల్ఫోన్స్ కన్నాథనమ్పై ఓ మహిళా డాక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి కారణంగా విమానం జాప్యం కావడంతో మహిళా వైద్యురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ కల్చర్‌ను తీవ్రంగా తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు. విమానం మరింత ఆలస్యం కాదని స్పష్టం చేస్తూ తనకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని మంత్రిని పట్టుబట్టారు. ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్‌లో వీవీఐపీల కారణంగా విమానాలు ఆలస్యమవుతున్నాయంటూ మహిళా డాక్టర్ మంత్రితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. -
‘అలాంటిదేమీ లేదు’
సాక్షి,న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖను విపక్షాలపై ఉసిగొల్పుతున్నారని విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ తోసిపుచ్చారు. బీజేపీ నేతల కంపెనీలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ఏఐఏడీఎంకే నేత వీకే శశికళ, ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులపై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడులో విపక్ష పార్టీలు కేంద్రం తమను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే పలు రాష్ట్రాల్లో బీజేపీ నేతలకు చెందిన కంపెనీలపైనా ఆదాయపన్ను దాడులు జరిగిన విషయం మరువరాదని కేంద్ర రహదారులు, హైవేలు, నౌకాయాన సహాయ మంత్రి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్రం ఐటీ దాడులు నిర్వహిస్తోందనే ఆరోపణలు అవాస్తవమని అన్నారు. జీఎస్టీ పన్నురేట్ల తగ్గింపు ప్రజలకు ముఖ్యంగా పేదలు, చిన్న వ్యాపారులకు ఊరట ఇస్తుందని చెప్పారు. నూతన పన్ను వ్యవస్థ ప్రయోజనాలను త్వరలోనే వ్యాపారులు గ్రహిస్తారన్నారు. కాగా, డీఎంకే చీఫ్ కరుణానిధిని ఇటీవల ప్రధాని మోదీ కేవలం మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని స్పష్టం చేశారు. -
దళితులను విస్మరిస్తే ఊరుకోం
ఆదిలాబాద్: దళితులను విస్మరిస్తే ఊరుకునేది లేదని, దళితులను విస్మరించే ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామని కేంద్ర సామాజిక, న్యాయసాధికారిత మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఆదిలాబాద్‌లో ఆదివారం ధమ్మచక్ర పరివర్తన్ దివస్, భీం గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, దళిత, మైనార్టీల కోసం అంబేడ్కర్ రాజ్యాంగంలో అన్నిరకాల హక్కులను పొందుపర్చారని, వర్గ విభేదాలు లేకుండా సమన్యాయ హక్కులతో రాజ్యాంగం రూపొందించారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా సమస్యలను రాజ్యసభలో పరిష్కరించేలా చూస్తామన్నారు. దేశంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలకు భూమి హక్కు పత్రాలు అందించేలా రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. అంబేడ్కర్ గీతాలతో కూడిన సీడీని ఆవిష్కరించారు. ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్, దళిత సంఘాల నాయకులు ప్రజ్ఞకుమార్, శైలేందర్, దీపక్‌కుమార్, రమాబాయి, తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది'
-
'చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది'
సాక్షి, న్యూఢిల్లీ: విష జ్వరాలతో సతమతమవుతున్న ప్రకాశం జిల్లాను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కేంద్రమంత్రిని కోరారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖా సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ను కలిసి జిల్లాలో నెలకొన్న పరిస్థతులను వివరించారు. ప్రకాశం జిల్లాలో విషజ్వరాలు ప్రభలతున్నాయని, వాటికారణంగా మందిలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారని మంత్రికి తెలిపారు. జ్వరాల నివారణకు కేంద్రం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు. అంతేకాకుండా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ కౌంటింగ్ మిషన్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రిని కోరారు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలతో వంద మందికిపైగా మృతిచెందితే చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని వైవీ మండిపడ్డారు. -
‘95 మొబైల్ కంపెనీలను తీసుకొచ్చాం’
సాక్షి, న్యూఢిల్లీ : తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 95 మొబైల్ తయారీ కంపెనీలు దేశంలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేశాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీకి భారత్ హబ్‌గా మారుతున్నదని అన్నారు. భారత్‌కు వచ్చిన మొబైల్ తయారీ ప్లాంట్ల్లో 32 ప్లాంట్లు నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో ఏర్పాటయ్యాయని తెలిపారు. సిలికాన్‌వ్యాలీలో జరిగే ఐటీ నూతన ఆవిష్కరణల్లో 14 శాతం భారత్‌కు చెందిన వారి మేథోశక్తి ఫలితమేనని అన్నారు. ఐఐటీల్లో చదివి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉద్యోగాలను వదిలి దేశానికి తిరిగివస్తున్నారని, వారు స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారని మంత్రి తెలిపారు.న్యాయ ప్రక్రియ వేగవంతానికి డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్న సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. -
‘అగ్రకులాలకు 25 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి’
► క్రిమిలేయర్ పద్దతిని పాటించి అమలు చేయాలి ► అన్ని పార్టీలు సహకరించి చట్టం తేవాల్సి ఉంది ► కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే సాక్షి, హైదరాబాద్: జనరల్ కేటగిరీలో ఉన్న కులాలకూ రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చెప్పారు. మిగతా 50.5 శాతం కోటాలో జనరల్ కేటగిరీలో ఉన్న కులాలకు 25శాతం వరకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. క్రిమిలేయర్ పద్దతిలో ఈ రిజర్వేషన్లు పక్కాగా అమలు చేస్తే సరిపోతుందన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, కాపు, రెడ్డి, వెలమ కులాలు, మహారాష్ట్రలో మరాఠాలు, గుజరాత్లో పటేల్, హర్యానాలో జాట్, రాజస్థాన్‌లో రాజ్‌పుథ్ కులాలు రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేస్తున్నాయి. అగ్రవర్ణాలైనప్పటికీ ఆయా కులాల్లో కొందరు పేదలున్నారు. ఆర్థిక స్థితిని బట్టి వారికి కూడా ప్రయోజనాలు కల్పించాలి.. ఈ ప్రక్రియంతా పూర్తి పారదర్శకతతో జరగాలి’ అని అన్నారు. కేంద్ర మంత్రి మండలి మొదలు, రాజ్యసభలోనూ రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రైల్వేశాఖల్లోనూ రిజర్వేషన్ల వారీగా ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. వికలాంగుల రిజర్వేషన్ల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం 3 శాతం ఉన్న వికలాంగుల రిజర్వేషన్లు 4 శాతానికి పెంచనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వికలాంగులకు ఉద్యోగావకాశాలపై దృష్టి పెట్టామని, అన్ని శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందని, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు విజన్ ఉన్న నాయకుడన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల ఏర్పాటు ప్రశంసించదగ్గ కార్యక్రమమని, మైనార్టీల కోసం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. అనంతరం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తరపున రూ.702 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు. ఈమేరకు అథవాలేకు వినతి పత్రాన్ని సమర్పించాడు. రాష్ట్రంలో తలపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ.100 కోట్ల సాయం కావాలని కేంద్రమంత్రిని కోరారు. అదేవిధంగా గురుకులాల అభివృద్ధి రూ.400 కోట్లు ఇస్తే వీటిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. -
ఏపీలో ఏ ఒక్కపాఠశాల మూతబడదు: కేంద్రం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల మూసివేతపై కేంద్రం వివరణ ఇచ్చింది. క్టస్టరైజేసన్, రేషనలైజేషన్, పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఏఒక్క పాఠశాల మూతపడట్లేదని కేంద్రప్రభుత్వం తెలిపింది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని పాఠశాలలు మూసివేయబడుతున్నాయని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మానవ వనరుల శాఖా సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఏఒక్క పాఠశాలలను మూసివేయట్లేదని రాష్ట్ర ప్రభుత్వం తమకు సమాచారం అందించిందని మంత్రి తెలిపారు. అయితే విద్యార్థుల సంఖ్య 30మంది కన్నా తక్కువగా ఉన్న 1434 ప్రాధమిక పాఠశాలలను సంఘటితం చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఈ ప్రక్రియను కూడా చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం తమ దృష్టికి తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
–కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆదోని: దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. మూడేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో పేదలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారని చెప్పారు. ఆదోని పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ æహాలులో సోమవారం ఆర్డీఓ ఓబులేసు అధ్యక్షతన సబ్కా సాథ్ సబ్కా వికాష్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత పాలకులు తమ వ్యక్తిగత సంపాదన, కార్పొరేట్ సంస్థల ఉన్నతి కోసం పాటు పడ్డాయి తప్ప పేదలను ఏ నాడు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేదల అభ్యున్నతి, దేశ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అసంఘటిత కార్మికులు 60 ఏళ్ల తర్వా నెలకు కనీసం రూ.5వేలు పింఛను పొందేందుకు అటల్ పెన్షన్ యోజనను ప్రవేశ పెట్టామని చెప్పారు. హౌస్ ఫర్ ఆల్ పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని చెపా్పరు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు, జాతీయ మీడియా ప్రతినిధి చెల్లపల్లి నరిసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూల్‌రెడ్డి, ప్రకాష్‌జైన్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు గిరిరాజవర్మ, రమేష్‌బాబు, సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కునిగిరి నాగరాజు, నాయకులు మేధా మురళీధర్, రంగాస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు..
పెద్దపల్లి: మూడేళ్ల మోదీ పాలనలో నయాపైసా అవినీతి ఆరోపణలు ఎదుర్కొలేదని కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి పరుషోత్తం రూపాల అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం "సబ్కా సాత్.. సబ్కా వికాస్" కార్యక్రమంలో మాట్లాడారు. మూడేళ్లలో కేంద్రం నుంచి లక్ష కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి అందజేశామన్నారు. గత ప్రభుత్వాలు నింగి నుంచి నేలదాకా కుంభకోణాలకు పాల్పడ్డాయని విమర్శించారు. ఫసల్‌బీమా యోజన ద్వారా రైతులకు నయాపైసా నష్టం జరగకుండా తక్కువ ప్రీమియంతో ఎక్కువ పరిహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని, సంబంధిత నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందజేయకపోతే పన్నుల రూపంలో జరిమానాతోపాటు గ్రామాలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఔషధ నియంత్రణ బీజేపీ ఘనతే స్వాతంత్ర్య భారతంలో ఔషధ ధరలను నియంత్రించిన ఘనత బీజేపీకే దక్కిందని మంత్రి అన్నారు. ఔషధ కంపెనీలపై నియంత్రణ పెట్టడంతో పాటు ప్రజలకు చౌకగా మందులు అందించేందుకు జనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బల్మూరి వనిత, ఎన్టీపీసీ ఈడీ వివేక్ దుబే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, రాష్ట్ర నాయకులు ఎస్.కుమార్ పాల్గొన్నారు. -
విమర్శిస్తే ఊరుకునేది లేదు: దత్తన్న
హైదరాబాద్: మిర్చి రైతుల ఇబ్బందులు తీర్చలేక కేంద్రాన్ని విమర్శిస్తే ఊరుకోబోమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. పత్తి వద్దు మిర్చి ముద్దు అని స్వయంగా సీఎం కేసీఆరే ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆయన ప్రచారం కారణంగా మిర్చి సాగు పెరిగి దిగుబడి ఎక్కువ వచ్చిందని అన్నారు. మిర్చి కొనుగోలు కేంద్రాలు ప్లాన్ చేయక పోవడం వల్ల రైతులు వ్యాపారుల చేతుల్లో నలిగి పోయారని ధర దక్కక మిర్చిని తగుల బెడుతున్నారని మంత్రి తెలిపారు. అందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని నిందిస్తే ఊరుకునేది లేదన్నారు. వాణిజ్య పంటల ధరలతో కేంద్రానికి సంబంధం ఉండదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసిన మొదటి నివేదికలో స్పష్టత లేదు..ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని విమర్శించారు. ప్రభుత్వం తమ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరి కాదని తెలిపారు. ఇంతగా గొడవలు జరుగుతున్నా రాష్ట్ర సర్కారు ఎవరిపై అయినా చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. అయినా మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ కింద మిర్చి పంటను కొనాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని వివరించారు. -
2019లో అధికారంలోకి రావడమే లక్ష్యం..
భువనగిరి: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన తమ పార్టీ రాష్ట్ర అభివృద్ధికీ సహకరిస్తుందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. భువనగిరిలో శనివారం ఏర్పాటు చేసిన పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలంగాణలో 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకోసం కార్యకర్తలు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు సహకరిస్తూనే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అన్ని రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నా ఇక్కడెందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందని చూడకుండా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నామన్నారు. మోదీ నాయకత్వంలో దేశం శరవేగంతో ప్రగతిపథంలో పయనిస్తుండగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఊహించని రీతిలో విజయపథంలో దూసుకెళ్తుతుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. అస్సాం, మణిపూర్‌ను ఆదర్శంగా తీసుకొని 2019లో భువనగిరి నియోజకవర్గంలో ఖాతా తెరుస్తామన్నారు. ప్రజలను అన్ని రకాలుగా వంచించిన టీఆర్ఎస్కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. టీఆర్ఎస్కు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు. జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌సుందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు ఇంద్రసేనారెడ్డి, వెదిరె శ్రీరామ్, కాసం వెంకటేశ్వర్లు, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆశోక్ గజపతిరాజుతో కేటీఆర్ భేటీ
-
కేంద్రమంత్రి వెంకయ్య దిష్టిబొమ్మ దహనం
వర్గీకరణ ప్రకటనపై మాలల ఆందోళన ఉప్పలగుప్తం : ఎస్సీ వర్గీకరణ చేస్తామని చేసిన ప్రకటనతో కేంద్రమంత్రులు ఎం.వెంకన్నాయుడు, బండారు దత్తాత్రేయ మాలలను మోసం చేశారని, తమపై చౌకబారు వ్యాఖ్యలు చేసి అవమానపరిచారని ఆరోపిస్తూ మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు ఆందోళన దిగారు. వెంకయ్య దిష్టిబొమ్మను వారు దహనం చేశారు. గొల్లవిల్లి సెంటరులో మంగళవారం నియోజకవర్గ నలుమూలల నుంచి వందలాది మంది మాలలు సుమారు గంట సేపు రాస్తారోకో చేశారు. సుప్రీంకోర్టు కొట్టివేసినా ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ కేంద్రమంత్రులు మాదిగలను రెచ్చగొడుతున్నారని నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, పెయ్యల శ్రీనివాసరావు, గెడ్డం సురేష్‌బాబు, జంగా బాబూరావు, నందిక శ్రీనివాసరావు ఆరోపించారు. మాదిగలకు అండగా ఉంటామని చెప్పిన వీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని, వీరిని మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ పేరుతో మాల, మాదిగలను విడదీసి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడితే మాలల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. మాలమహానాడు మండల అధ్యక్షుడు కొంకి వెంకట బాబ్జీ, పెయ్యల విష్ణుమూర్తి, పరశురాముడు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, పినిపే జయరాజ్, పరమట సత్యనారాయణ, బడుగు అబ్బులు, యాళ్ళ లక్ష్మినారాయణ, గుత్తాల బోసు, ఉండ్రు బాబ్జీ, మెండు రమేష్ తదితరులు ఈమేరకు తహసీల్దార్ ఎస్.సుబ్బారావు, ఎంపీడీఓ వి.శ్రీనివాస్‌లకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా.. కాకినాడ సిటీ : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దండోరా సభలో ప్రకటించడాన్ని నిరసిస్తూ మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు మాలలు నిరసించారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ దళితుల మధ్య చిచ్చురేపి విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏబీసీడీ వర్గీకరణను అడ్డుకుని తీరుతామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ విరమించుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బి.అచ్చారావు, పెయ్యల అరుణ్‌కుమార్, గంటా వీరబాబు, ఎ¯ŒS.వీరబాబు, బూషణం, అమర్నాధ్, నాని, కిషోర్ తదితరలు పాల్గొన్నారు. -
ఆ వేడిలో.. ‘హోదా’ అన్నా
-
ఆ వేడిలో.. ‘హోదా’ అన్నా
విజయవాడ సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి రూ. 4 వేల కోట్ల ప్రయోజనం మాత్రమే ఉంటుందని, ప్యాకేజీతో రూ. 2.25 లక్షల కోట్ల నిధులు వస్తాయని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి మించి మరో మార్గం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించి, ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పానన్నారు. శనివారం విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్యాకేజీ అవగాహన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్యాకేజీ ప్రకటనకు చొరవ చూపిన వెంకయ్యను రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ‘‘విభజన బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే సమయంలో అప్పటికి ఉన్న రాజకీయ వేడిలో తెలంగాణలో గొడవలు జరుగుతున్నాయి. బిల్లుపై చర్చించడానికి ఒక రోజు ఆలస్యం జరిగితేనే తెలంగాణలో పలుచోట్ల నా దిష్టిబొమ్మ తగలబెట్టారు. దీంతో ఏపీకి న్యాయం చేసేందుకు రాజ్యసభలో హోదా గురించి డిమాండ్ చే శాను’’ అని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.. హోదా వస్తే రాత్రికి రాత్రే హైదరాబాద్‌లా మారిపోతుందని కొందరు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. చంద్రబాబు విశాఖపట్నంలో ఒక సదస్సు పెడితే రూ. 4.25 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని, వాళ్ల్లు ఎవరూ ప్రతే ్యక హోదా కోసం రాలేదని చెప్పారు. లోపాయికారీ ఏంటీ.. అది బహిరంగమే! తాను చెప్పిన వెంటనే ప్యాకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోగానే మా ఇద్దరి మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగినట్టు విమర్శలు చేస్తున్నారని వెంకయ్య తప్పుపట్టారు. అదేమీ లోపాయికారీ కాదని, బహిరంగమేనని చెప్పారు. మండిపడిన వామపక్షాలు విజయవాడ(రామవరప్పాడు): ప్రత్యేక హోదా అంశంలో ఆంధ్రులను నమ్మించి నట్టేట ముంచిన వెంకయ్య నాయుడుకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని వామపక్షాలు మండిపడ్డాయి. శనివారం విజయవాడవచ్చిన వెంకయ్యకు వామపక్షాలనుంచి గట్టి నిరసన ఎదురైంది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఆయన వస్తున్నారని తెలుసుకున్న సీపీఎం, సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున రామవరప్పాడు రింగ్ సెంటర్‌కు చేరుకున్నాయి. దీంతో పోలీసులు పలువురిని అరెస్టుచేశారు. -
అందుకే విజయవాడ వచ్చా...
-
అందుకే విజయవాడ వచ్చా...
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ప్రజలు సానుకూలంగానే ఉన్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. దీని ద్వారా నేతల కంటే ప్రజలు తెలివైన వారని మరోసారి రుజువు అయిందని ఆయన అన్నారు. శనివారం విజయవాడలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ప్యాకేజీపై వస్తున్న విమర్శలు తిప్పికొట్టేందుకే తాను విజయవాడ వచ్చినట్లు వెల్లడించారు. జై ఆంధ్రా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నీరుగార్చిందని విమర్శించారు. 1972లోనే రాష్ట్రం విడిపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోయి ఉండేదని వెంకయ్య ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దేశ సరిహద్దు, కొండ ప్రాంతాల్లోని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చారని... అంతేకాని మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ప్యాకేజీపై అవగాహన కల్పించేందుకే తాను ఈ సభకు విచ్చేసినట్లు వెంకయ్య స్పష్టం చేశారు. ఆంధ్రులు మేధావులని... వారు ఎక్కడ ఉన్న రాణిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విభజించారని వెంకయ్య ఈ సందర్బంగా ఆరోపించారు. అంతకుముందు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావుతోపాటు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సన్మాన వేదిక వరకు వెంకయ్యనాయుడుతోపాటు బీజేపీ నేతలు ర్యాలీగా వచ్చారు. -
కేంద్రమంత్రి అశోక్ కనిపించడం లేదని ఫిర్యాదు
–తిరుపతిలో సీపీఎం, సీపీఐ ఫిర్యాదు తిరుపతి క్రైం: కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కన్పించడం లేదని మంగళవారం ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో సీపీఐ జనరల్ సెక్రటరీ చిన్నం పెంచులయ్య సీఐ రాంకిషోర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులుగా, ఎంతో రాజకీయ అనుభవం ఉండి కూడా ప్రత్యేక హోదాపై ఎక్కడా కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించ లేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవ్వరికీ కనపడడం లేదని, ఆయన ఏమయ్యారని రాష్ట్ర ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు అశోక్‌గజపతి రాజు ప్రత్యేకహోదా కోసం మాట్లాడాలని, రాష్ట్ర అభివద్ధికి సహకరించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని విన్నవించారు. తమపై దయ ఉంచి పార్లమెంట్ సభ్యులు అశోక్‌గజపతిరాజు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని రాష్ట్ర అభివద్ధికి సహకరించేలా చూడాలన్నారు. హరినాధరెడ్డి, లక్ష్మీ,తదితరులు పాల్గొన్నారు. -
లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా ?
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు బోగస్ ప్రచారం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. హోదా బదులు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని కాంగ్రెస్ నేతలు సైతం మెచ్చుకుంటున్నారన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండించారు. మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ప్యాకేజీ మంచిదదని తనతో చెప్పినట్లు సుజనా చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని రఘువీరా అన్నారు. 'సుజనా.. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మీరు చేసిన వ్యాఖ్యలు నిజమో కాదో తేల్చేందుకు లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమేనా?' అని రఘువీరా సవాల్ విసిరారు. ఈమేరకు ఆదివారం విజయవాడలోని పీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో సుజనాచౌదరికి రఘువీరా రాసిన లేఖను విడుదల చేశారు. సుజనా చౌదరి చేస్తున్న ప్రచారంపై ఇప్పటికే తాను జైరాం రమేష్‌తో మాట్లాడానని, కేంద్ర ప్యాకేజీ ప్రకటనను జైరాం కంటితుడుపు చర్యగా అభివర్ణించారని రఘువీరా పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ నేతలు ఇకనైనా హోదా కోసం పోరాడాలని అన్నారు. విభజన చట్టంలోని హామీలన్ని నెరవేర్చాలని రఘువీరా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
సామాన్యుడూ ప్రధాని కావచ్చు
పాలకుర్తి: కుటుంబ పాలనకు చరమగీతం పాడి, సామాన్యుడు సైతం భారత ప్రధాని కావచ్చని నిరూపించిన ఘనత భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కే దక్కుతుందని కేంద్ర ఆహార ఉత్పత్తులు, పరిశ్రమల శాఖ మంత్రి సాద్వి నిరంజన్‌జ్యోతి అన్నారు. శనివారం పాలకుర్తి పట్టణంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట యో««దlురాలు, చాకలి ఐలమ్మ 31వ వర్ధంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక బషారత్ ఫంక్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడు పెదగాని సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన అయిలమ్మ వర్ధంతి సభలో సాద్వి నిరంజన్ జ్యోతి మాట్లాడారు. యూపీఏ హయాంలో ఒ్కసారైనా కేంద్రమంత్రులు ఐలమ్మకు నివాళులర్పించడానికి వచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. అప్పట్లో దేశంలో రోజుకు సగటున 2 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరిగితే, ప్రస్తుతం 20 కిలోమీటర్ల మేర రహదారుల పనులు జరుగుతున్నాయన్నారు. నేటి యువత చేతిలో ఉండాల్సింది ఆయుధాలు కాదని పుస్తకాలు, కంప్యూటర్లు అని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. హామీలను విస్మరించిన కేసీఆర్ : లక్ష్మణ్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. వరంగల్ పట్టణంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని ప్రజలకు ఇచ్చిన మాట ఇప్పటిదాకా అమలుకాలేదన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వన్నాల శ్రీరాములు, జయపాల్, చాకలి అయిలమ్మ మనుమడు చిట్యాల రాంచంద్రం, అయిలమ్మ కుటుంబ సభ్యులు, సామాజిక తెలంగాణ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభంజన్ యాదవ్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్, కుమార్, రాజశేఖర్, నరేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కంటతడి పెట్టిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
-
అధికార మదం..!
-
కేంద్రమంత్రికి చేదు అనుభవం
కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు భవానీపురం : మనిషి జీవితం నీటితో ముడిపడి ఉందని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన పున్నమిఘాట్లో పుష్కర స్నానమాచరించారు. కాగా, కేంద్రమంత్రికి కాస్త చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం లభించలేదు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో పున్నమిఘాట్‌కు వచ్చినా జిల్లా ఉన్నతాధికారులెవరు అక్కడ లేకపోవడం గమనార్హం. హడావుడిగా కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. -
18న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాక
బీచ్‌రోడ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 18వ తేదీన నగరానికి రానున్నారని బీజేపీ నగర అధ్యక్షుడు ఎం. నాగేంద్ర తెలిపారు. నగర పార్టీ కార్యాలయంలో మంగళవారం బీజేపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 70వ స్వాతంత్య్రదిన వేడుకలను పురస్కరించుకుని బీజేపీ చేపట్టిన తిరంగ యాత్రలో పాల్గొనడానికి గడ్కరీ వస్తున్నారని, దీనికి నగర పార్టీ నాయకులంతా సిద్ధంగా ఉండాలని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.వి.ఎస్.ప్రకాస్ రెడ్డి, నాని, గుండ రఘుబాబు పాల్గొన్నారు. -
మోదీ అంటే సంతోషాన్ని ఇచ్చేవారు
-
కొంత అసంతృప్తి ఉంది.. అయినా...
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఏపీ భవన్లో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ... రెండేళ్లలో కొన్ని విషయాల్లో కేంద్రంపై కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అని ఆయన స్పష్టం చేశారు. అయినా మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. బీజేపీ మిత్రధర్మం పాటిస్తుందో లేదో తెలపాలని అన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ బిల్లుకు టీడీపీ మద్దతు ఇస్తుందని.. అనుకూలంగా ఓటు వేస్తామని ఆయన ప్రకటించారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ బయటపెడతామన్నారు. ఆర్థిక, హోంశాఖలు సమాధానం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరు అయ్యారు. -
'ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని కేంద్ర పర్యావరణ, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అనంతపురం జిల్లాలో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ...ఏపీ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. ఏపీ ప్రాజెక్టులకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు ఇస్తున్నామన్నారు. యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని.. ఎన్డీఏ హయాంలో బొగ్గు కేటాయింపులు పారదర్శకంగా కేటాయిస్తున్నామని జవదేకర్ చెప్పారు. -
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : అశోక్‌గజపతిరాజు
విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మోదీ ప్రభుత్వాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతి రాజు డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరంలోని ప్రభుత్వాసుపత్రిలో రూ.1.50 కోట్లతో ఆధునికరించిన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే రూ.1.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక మార్చురీకి కూడా అశోక్‌గజపతిరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు గతంలో కంటే మెరుగయ్యాయని చెప్పారు. ఇదే స్పూర్తితో ఇక ముందు పని చేయాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. దేశంలోని ప్రతి ఎయిర్‌పోర్టులో సోలార్ విద్యుత్ వినియోగిస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని ఆయన చెప్పారు. హోదా ఆలస్యమైన కొద్దీ రాష్ట్రానికి మరిన్ని ఆర్థిక కష్టాలు తప్పవని అశోక్ గజపతిరాజు చెప్పారు. -
సుజనా చౌదరికి వారెంట్ జారీ చేసిన కోర్టు
హైదరాబాద్ : కేంద్ర మంత్రి సుజనా చౌదరికి బుధవారం నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. ఆయన వరుసగా మూడు సార్లు కోర్టులో విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేసింది. సుజనా సంస్థల అధినేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి రూ.106 కోట్లు తమకు ఎగవేశారని ఆరోపిస్తూ... మారిషస్ బ్యాంక్ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
వచ్చామా.. చూశామా... వెళ్లామా...!
బాలుర పరిశీలనా గృహాన్ని సందర్శించిన సుజనాచౌదరి ప్రోటోకాల్ పాటించని అధికారులు విజయవాడ(భవానీపురం) : వచ్చామా.. చూశామా.. వెళ్లామా.. అన్నట్లుంది కేంద్రమంత్రి సుజనా చౌదరి తీరు. ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్లారో అక్కడ ఎవరికీ అర్ధం కాలేదు. అయితే సుజనా వస్తున్నారని తెలిసి తెలుగు తమ్ముళ్లు చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. చైల్డ్‌కేర్ సంస్థల పని తీరును పరిశీలన చేయాల్సిందిగా మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధి సూచనల మేరకు సుజనా విద్యాధరపురం కబేళా రోడ్డులోని ప్రభుత్వ బాలుర పరిశీలనా కేంద్రానికి శుక్రవారం వచ్చారు. తొలుత విచారణలో ఉన్న బాలురతో ముచ్చటించారు. ఇక్కడి ఎందుకు వచ్చారు, నేరాలు చేసి వచ్చారా, మోపబడి వచ్చారా, ఇక్కడి పరిస్థితులేమిటి అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయారు. విచారణలో ఉన్న బాలురకు చదువు చెప్పిద్దామంటే వారికి ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియని పరిస్థితి అని పేర్కొన్నారు. విచారణలో ఉన్నప్పటికీ జనజీవన స్రవంతిలో కలిపి సమాజంపై అవగాహన కల్పించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పశ్చిమ ఇన్చార్జ్ కె.నాగుల్‌మీరా, టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి హరిబాబు, కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, వి.హరనాథస్వామి, కె.వెంకటేశ్వరరావు, ఉమ్మడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జలీల్‌ఖాన్ దూరం ‘ఉన్నదీ పోయె.. ఉంచుకున్నదీ పోయె’ అన్నట్లుంది జలీల్‌ఖాన్ పరిస్థితి. పార్టీ వీడిన తరువాత వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. మారిన టీడీపీలో కూడా ఎవరూ పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కూడా పిలవలేదని సమాచారం. కాగా కార్యక్రమం జరిగిన డివిజన్ కార్పొరేటర్ సంధ్యారాణికి సమాచారం అందించ కపోవడంపై వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
'అసదుద్దీన్‌ను చంకనెత్తుకోవడం సరికాదు'
నాగారం: దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చంకనెత్తికున్నాడని కేంద్ర ఎరువులు, రసాయనాల సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్ విమర్శించారు. ప్రతి ఒక్కరూ దేశాన్ని గౌరవించాలనీ, భారత్ మాతాకు జై అనాల్సిందేనని అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఎక్కువ మొత్తంలో రాయితీలు ఉన్నాయని, ప్రచారం అంతగా లేకపోవడంతో ప్రజలకు తెలియడం లేదన్నారు. గోధుమలకు 27 శాతం కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోందన్నారు. ఒక్కశాతమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంతా తామే చేస్తున్నామని గొప్పలు చేప్పుకోవడం విడ్డూరమన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 1700 ఎకరాల్లో పెద్ద ఎత్తున సీమెంట్ ఫ్యాక్టరీనీ నిర్మాణించడాకి కషి చేస్తున్నామన్నారు. రామగుండంలో ఫ్యాక్టరీకి రూ. 5 వేల కోట్లు మంజురు చేశామన్నారు. దేశంలోని రోడ్లపై గల రైల్వే లైన్‌పై ఆర్ఓబీ బ్రీడ్జీలు నిర్మిస్తున్నామన్నారు. ప్రధాన రహదారులను అభివద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ నుంచి నారాయాణపేట్ రహదారికి రూ. 1900 కోట్లు కేంద్ర మంత్రి గడ్కరీ మంజూరు చేశారని, మరో రూ. 160 కోట్లతో రహదారులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అమృత సిటీ పథకంలో నిజామాబాద్ నగరం ఉందన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఇందుర్ అభివృద్ధి చెందుతుందన్నారు. సురక్షిత త్రాగునీరు అందిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు స్కిల్‌డెవలప్‌మెంట్ ద్వారా 50 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిని అమలు చేయడం లేదన్నారు. బోధన్ షుగర్‌ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. -
'సుజనా కంపెనీలతో నాకెలాంటి సంబంధం లేదు'
ఢిల్లీ: సుజనా కంపెనీలతో తనకెలాంటి సంబంధం లేదని కేంద్ర సహయ మంత్రి సుజనా చౌదరి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... కోర్టు సమన్లు తనకే కాదని, ప్రధాని మోదీకి కూడా వస్తుంటాయన్నారు. ఆరోపణలు వస్తే ఆ కంపెనీలనే అడగాలని సుజనా సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్లు పెంచాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు సుజనా చౌదరి తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని... ప్రస్తుత రైల్వే బడ్జెట్లో విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించే అవకాశముందన్నారు. మారిషస్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను సుజనాకు చెందిన కంపెనీ చెల్లించలేదని బ్యాంకు ఇప్పటికే కోర్టుకు ఎక్కింది. మార్చి ఐదో తేదీన విచారణకు హాజరుకావాలని సుజనాకు కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. -
నల్లగొండలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన
చౌటప్పల్ : నల్లగొండ జిల్లాలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం పర్యటించారు. మర్రిగూడ మండలంలో ఫ్లోరైడ్ బాధితులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫ్లోరైడ్ బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం చౌటప్పల్‌లో జరిగే చేనేత కార్మికుల సమావేశంలో నడ్డా పాల్గొననున్నారు. -
ఆడ శిశువు రక్షణ ఇలాగా?!
మన దేశంలో చడీచప్పుడూ లేకుండా నిత్యమూ సాగే నరమేథం ఒకటుంది. అభివృద్ధి చెందిన టెక్నాలజీ సాక్షిగా... కాసుల కక్కుర్తి రోగంతో చెలరేగే వైద్యుల సాక్షిగా... చేతగానట్టు మిగిలిపోయే చట్టాల సాక్షిగా ‘గర్భ’గుడిలో ఆడ శిశువుల్ని చిదిమేసే భయంకర నరమేథమది. బాలిక పుడితే కుటుంబానికి భారమవుతుంద నుకునే పాపిష్టి ఆలోచన దేశంలో రోజుకు 1,370మంది ఆడ శిశువుల్ని కడతేరుస్తున్నదని ఆమధ్య కొన్ని గణాంకాలు వెల్లడించాయి. ఇంతటి దారుణాన్ని ఆపడానికి తీసుకోవాల్సిన చర్యలపై పౌర సమాజ కార్యకర్తలనుంచి, ఇతరుల నుంచి ఎన్నో సలహాలు, సూచనలు వస్తూనే ఉన్నాయి. వీటన్నిటి మాటెలా ఉన్నా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ ఇటీవల చేసిన ప్రతిపాదన అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఇప్పుడు నిషేధం అమలవుతున్న లింగ నిర్ధారణ పరీక్షల్ని తప్పనిసరి చేయాలన్నదే ఆ ప్రతిపాదన సారాంశం. ఆ పరీక్షల అనంతరం గర్భంలో ఉన్నది ఆడ శిశువో, మగ శిశువో తేలాక ఆ వివరాలను ఒక రిజిస్టర్లో నమోదు చేయాలని, పుట్టేది ఎవరైనా కనాల్సిందేనని వారికి నచ్చ జెప్పాలని ఆమె అభిప్రాయం. ఆ రిజిస్టర్‌లోని వివరాలకు అనుగుణంగా శిశు జననాలున్నాయో లేదో తనిఖీ చేయాలని కూడా ఆమె చెప్పారు. అలా చేస్తే అమ్మ కడుపులో ఉన్న ఆడ శిశువులకు రక్షణ ఉంటుందని ఆమె అంటున్నారు. ఈ మాట చెబుతూ ఇది కేవలం తన ఆలోచన మాత్రమేనని కూడా మేనక వివరించారు. ఈ ఆలోచన వెనకున్న కారణాన్ని కూడా ఆమె చెప్పారు. చట్టవిరుద్ధంగా అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లు చేస్తున్న వారిని ఎంతకాలం అరెస్టు చేస్తూ పోతాం...అది శాశ్వత పరిష్కారం ఎలా అవుతుంది అన్నదే ఆమె ప్రశ్న. కానీ ఈ క్రమంలో గర్భిణులను నేరస్తులుగా పరిగణిస్తున్నామన్న సందేహం ఆమెకు కలగలేదు. బిడ్డను కనాలో లేదో నిర్ణయించుకునే హక్కును మహిళలకు లేకుండా చేసినట్టవుతుందన్న ఆలోచన కూడా రాలేదు. అందువల్లే మేనకాగాంధీ ప్రతిపాదనపై మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు విరుచుకుపడ్డాయి. బాలలు, బాలికల నిష్పత్తి విషయంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నా యన్నది వాస్తవం. 1991నాటికి ప్రతి వెయ్యిమంది బాలలకూ 945 బాలిక లుండగా...2011 జనాభా లెక్కల్లో అది 919కి పడిపోయింది. హైదరాబాద్ నగరంలో అది 914 మాత్రమే. వాస్తవానికి వెయ్యిమంది బాలురకూ 950 మంది ఆడపిల్లలు ఉండటం ఆరోగ్యకరమైన నిష్పత్తి అంటారు. కానీ మహిళలను గౌరవిస్తున్నామని, పూజిస్తున్నామని చెప్పే దేశంలోనే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీన్ని ఎంతో కొంత మార్చాలన్న సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు జనవరిలో ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడపిల్లల్ని పుట్టకముందే చంపేసే ధోరణి అత్యంత హీనమని ఆ సందర్భంగా మోదీ చెప్పారు. ఆడపిల్లల విషయంలో వివక్ష ప్రదర్శించడం అలవాటైన సమా జానికి ఆధునిక టెక్నాలజీ కూడా తోడ్పడుతున్నది. కనీస వైద్య సదుపాయాలు కరువైన మారుమూల ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పోర్టబుల్ స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉంటున్నాయని ఢిల్లీ ఐఐటీకి చెందిన ఒక ప్రొఫెసర్ జరిపిన అధ్యయనంలో తేలింది. చట్టాలున్నా వాటిని సమర్థవంతంగా అమలు పరిచే వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడంవల్ల ఈ జాడ్యం నానాటికీ ముదురుతోంది. లింగ నిర్ధారణ పరీక్షల్ని నిషేధించే చట్టం వచ్చి రెండు దశాబ్దాలవుతున్నది. అయినా మెరుగైన ఫలితాలు రావడంలేదని జనాభా లెక్కలు చెబుతున్నాయి. మెరుగైన జీవనం, చదువు వంటివి భ్రూణ హత్యల్ని నివారిస్తాయని అందరూ అనుకుంటారు. కానీ అది నిజంకాదు. ఆర్ధిక సంస్కరణలు అమలై అవకాశాలు పెరిగాక కుటుంబాలు కుంచించుకుపోవడం, ఒక్కరితో సరిపెట్టుకోవాలను కోవడం, ఆ ఒక్కరూ మగపిల్లాడైతే బాగుంటుందని భావించడం పెరిగిందని సామాజిక అధ్యయనకారులు చెబుతున్నారు. ఇలాంటి ఆలోచనలు మధ్య తరగతిలో ప్రబలంగా ఉన్నాయంటున్నారు. ఈ విషయంలో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కాస్త మెరుగు. సమాజంలో మహిళల స్థితిగతులకూ, వారిపట్ల చూపుతున్న వివక్షకూ...గర్భస్త శిశు పిండాలను చిదిమేయడానికీ ఉన్న సంబంధాన్ని గుర్తించనంతకాలమూ ఈ స్థితి మారదు. సామాన్య పౌరుల సంగతలా ఉంచి నాయకులుగా చలామణి అవుతున్నవారు సైతం మహిళల విషయంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో, వారి సమస్యల విషయంలో ఎంత వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అదే కుటుంబాల్లోనూ కొనసాగుతోంది. లింగ నిర్ధారణ పరీక్ష మొదలుకొని భ్రూణ హత్యల వరకూ అన్నిటినీ నిర్దేశిస్తున్నది కుటుంబాల్లోని పురుషాధిక్యతే. ఇప్పుడు సాగుతున్న భ్రూణహత్యల్లో మహిళలు నేరస్తులు కాదు...బాధితులు. అయితే మేనకాగాంధీ తాజా ప్రతిపాదన బాధితుల్నే నేరస్తులుగా మార్చేట్టు కనబడుతోంది. పైగా ఇది ఆచరణసాధ్యం కూడా కాదు. కొన్ని లక్షల సంఖ్యలో ఉండే వైద్యులనూ, వారి కార్యకలాపాలనూ పసిగట్టలేని వ్యవస్థ కోట్లాదిమంది తల్లులపై నిఘా పెట్టి ఉంచడం కుదిరేపనేనా? రోజుకు 50,000 శిశు జననాలుండే మన దేశంలో గర్భిణుల డేటా సేకరణ, దానికనుగుణంగా ఆడ శిశువులు జన్మిస్తున్నారో లేదో చూడటమన్నది సాధ్యమేనా? మారుమూల పల్లెల్లో ఇప్పటికీ చాలాచోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. ఉన్నా వాటిల్లో సరైన వైద్య సదుపాయాలు లేవు. మాతాశిశు సంర క్షణకంటూ ఎన్నో పథకాలున్నా అవి సక్రమంగా అమలు కావడంలేదు. పౌష్టికాహార లేమితో, ప్రాణాంతక వ్యాధులతో శిశువులు కన్నుమూసే సిగ్గుమాలిన పరిస్థితులున్నాయి. వీటన్నిటినీ సరిచేయడమెలాగో ఆలోచించి చర్యలు తీసుకోవడం తక్షణావసరం. మేనకాగాంధీ అలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి. -
హైదరాబాద్‌లో ఎవరూ సెటిలర్లు కాదు: వెంకయ్య
హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాల రాజకీయాలతో రోహిత్ ఆత్మ బాధపడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో వెంకయ్యనాయుడు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ...ఐసిస్ సానుభూతిపరులు మాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పరోక్షంగా ఎంఐఎంపై మండిపడ్డారు. హెదరాబాద్లో ఎవరూ సెటిలర్లు కాదని.... అందరూ భారతీయులే అని వెంకయ్య స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ముంపు మండలాలు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కో ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. సమాజంలో దళితులు, దళితేతరులు అంటూ చర్చ తేవడమే దారణమన్నారు. అభివృద్ధి విషయంలో సమాజంలో అన్ని వర్గాలను మోదీ గౌరవిస్తారని వెంకయ్య గుర్తు చేశారు. ఒక్క ఏడాదిలోనే 20 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరచిన ఘనత నరేంద్ర మోదీదే అని చెప్పారు. అలాగే రూ. 12 తో ప్రజలకు బీమా సౌకర్యం కల్పించిన ఘనత కూడా మోదీ ప్రభుత్వానిదే అని వెంకయ్య నాయుడు తెలిపారు. -
నివేదిక వచ్చిన తర్వాతే స్పందిస్తా: స్మృతీ
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం రాష్ట్రానికి చెందిన వ్యవహారమని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్యపై మంగళవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. విద్యార్థి ఆత్మహత్యపై ద్విసభ్య కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే తాను ఈ అంశంపై స్పందిస్తానని చెప్పారు. అప్పటి వరకు తాను ఈ అంశంపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని స్మృతీ ఇరానీ తెలిపారు. -
'రామారావుది అరుదైన వ్యక్తిత్వం'
-
'రామారావుది అరుదైన వ్యక్తిత్వం'
హైదరాబాద్ : బిజేపీ సీనియర్ నేత, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్ వి. రామారావు అరుదైన వ్యక్తిత్వం గల వారని కేంద్రవాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే కాలనీలోని రామారావు మృతదేహాన్ని ఆయన నివాసంలో సందర్శించి... ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ... జనసంఘ్ ప్రారంభ సమయంలో వి.రామారావు కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. అలాగే పార్టీకి రామారావు చేసిన సేవలను ఈ సందర్భంగా నిర్మలాసీతారామన్ ప్రస్తుతించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారన్నారు. రామారావు మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. -
సరైన రీతిలో స్పందిస్తాయని ఆశీస్తున్నా
-
కేంద్ర మంత్రిపై న్యాయవాదుల ఫిర్యాదు
హైదరాబాద్: కేంద్ర మంత్రి సదానందగౌడ మోసం చేశారంటూ పలువురు న్యాయవాదులు ఆదివారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మూడు నెలల్లోగా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. ఇంత వరకు ఆ హామీ నెరవేర్చకుండా మోసం చేశారని న్యాయవాదులు గోవర్ధన్‌రెడ్డి, శ్రీధర్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
‘ఎంఐఎంతో టీఆర్ఎస్ రహస్య ఒప్పందం’
కాచిగూడ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంతో టీఆర్ఎస్ పార్టీ రహస్య ఒప్పందం చేసుకోవడం హైదరాబాద్ నగరానికి ప్రమాదకరమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం బర్కత్‌పురలోని బీజేపీ గ్రేటర్ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఐఎం కన్నుసన్నల్లో అధికార పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏకపక్ష నిర్ణయాలతో మహా నగరాన్ని ఉగ్రవాద నిలయంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి అన్నారు. ఈ ప్రమాదాన్ని నివారించడానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. -
'కాల్‌మనీపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలి'
‘కాల్‌మనీ’పై కేంద్ర మంత్రి వెంకయ్య సాక్షి, విజయవాడ: కాల్‌మనీపై అసెంబ్లీలో విస్తృత చర్చ జరగాలని, దోషులు ఏ పార్టీలో ఉన్నా కఠినంగా శిక్షించాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలు మాని దోషులను గుర్తించేందుకు ప్రయత్నించాలని సూచించారు. దోషులకు రాజ కీయ రంగు పులమడం వల్ల వారు తప్పించుకునే అవకాశముందన్నారు. కేసు మూలాల్లోకి వెళ్లి దోషులను గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు. ‘హెరాల్డ్’ను పక్కదోవ పట్టించేందుకే.. పార్లమెంట్ సజావుగా సాగేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సహకరించాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ, రియల్ఎస్టేట్, ఇన్లాండ్ వాటర్ వేస్ట్ వంటి 16 ముఖ్యమైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసును సోనియా, రాహుల్‌గాంధీ పక్కదోవ పట్టించేందుకు బీజేపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. 2012లో హెరాల్డ్ కేసును సుబ్రహ్మణ్యస్వామి కోర్టులో వేశారని, అప్పుడు ఆయన బీజేపీ సభ్యుడు కాదన్నారు. హిందూత్వం భారతీయ వారసత్వం: వెంకయ్య గుంటూరు ఎడ్యుకేషన్: హిందూత్వం అంటే మతం కాదు.. అనాదిగా వస్తున్న భారతీయ వారసత్వమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గుంటూరులో జరుగుతున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 33వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా శనివారం ఏబీవీపీ పూర్వ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఒకప్పటి ఏబీవీపీ కార్యకర్తలు, ప్రస్తుత కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, జగత్ ప్రకాష్ నడ్డా ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి కామినేని, ఏబీవీపీ నాయకులు సునీల్ అంబేకర్, మురళీమనోహర్, తిరుమలరెడ్డి, పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
'సోనియాపై కక్ష సాధించాల్సిన అవసరం లేదు'
-
'సోనియాపై కక్ష సాధించాల్సిన అవసరం లేదు'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కక్ష సాధించాల్సిన అవసరం బీజేపీకి లేదని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ తన నివాసంలో వెంకయ్యనాయుడు విలేకర్లతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసుతో ప్రభుత్వానికేం సంబంధమని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీని అప్రతిష్టపాలు చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులుపై వెంకయ్య మండిపడ్డారు. పార్లమెంట్‌ను అడ్డుకుని ప్రజలను మంచి జరగకుండా చేస్తున్నారని ఆ పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. బెయిల్ ఇస్తే సంబరాలు ఎందుకు అని కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా ప్రశ్నించారు. -
వీకే సింగ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన
-
టీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది: బండారు దత్తాత్రేయ
హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలు, పత్తి కొనుగోళ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లో ఆరోపించారు. పత్తి కొనుగోలుకు కేంద్రం రూ.10 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కేటాయించిందని ప్రశ్నించారు. కరువు మండలాలు ప్రకటించకపోవడంతోనే కేంద్రం నుంచి సాయం అందలేదని బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని బండారు దత్తాత్రేయ వివరించారు. -
మోదీ నాయకత్వంలో అభివృద్ధి దిశగా భారత్
విజయవాడ : నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా చల్లపల్లిలో స్వచ్ఛ భారత్ పనులను వెంకయ్యనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... స్వచ్ఛ భారత్ తఅంటే ప్రభుత్వ కార్యక్రమం కాదని... ప్రజా ఉద్యమం అని ఆయన స్పష్టం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకుంటే అనారోగ్యాలు చేరతాయని ప్రజలకు వెంకయ్య సూచించారు. మడమ తిప్పని మహానేత ఎన్టీఆర్ అని అభివర్ణించారు. మహనీయుల నుంచి మనం స్ఫూర్తి పోందాలని సూచించారు. ప్రస్తుత మానవ జీవితం యాంత్రికమైపోయిందని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. -
'అమెరికాలోని వైద్యుల్లో సగం మంది భారతీయులే'
హైదరాబాద్ : భారతదేశానికి గొప్ప సంస్కృతి, సంప్రదాయం ఉందని కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ లీడర్ షిప్ సదస్సులో పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ.... భారత్‌కు చెందిన అనేక మంది విదేశాలలో ఉన్నత పదవులను అలంకరించారని తెలిపారు. అమెరికాలో ఉన్న వైద్యుల్లో సగం మంది భారతీయులే అని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాంకేతిక రంగంలో పురోగతి దిశగా భారత్ ముందుకు సాగుతుందన్నారు.హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి గాంచిందని చెప్పారు. ఐఎస్బీ పరిశోధనల వల్ల అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. భారత్‌లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
వరంగల్‌లో కేంద్ర మంత్రి వెంకయ్య
ఖిలా వరంగల్ : కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం ఖిలావరంగల్ కోటను సందర్శించారు. కేంద్రం తలపెట్టిన హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అగ్మెంటేషన్ యోజన (హృదయ్) పథకాన్ని ప్రారంభించేందుకు ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రకాళి ఆలయం, వేయిస్తంభాల గుడిలోని శిల్పకళా సంపదను మంత్రి తిలకించారు. 18 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. 4.5 కిలోమీటర్ల మేర జరుగుతున్న అగడ్త తవ్వకం పనులను కూడా వెంకయ్యనాయుడు పరిశీలించారు. -
'కౌన్సెలింగ్ కేంద్రాలుగా ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్‌లు'
కోల్‌కతా: ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్‌లను త్వరలో కెరీర్ కౌన్పిలింగ్ సెంటర్లుగా మార్చనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్ విధానంలో సమూలమైన మార్పుల ద్వారా జాతీయ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్లుగా మార్చనున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల సమాచారాన్ని సేకరించడం, ఉద్యోగవకాశాలు కల్పించే సంస్థలకు నిరుద్యోగుల సమాచారాన్నిచేరవేయడం ద్వారా ఉద్యోగవకాశాలు కల్పించడంలో ఈ కౌన్సెలింగ్ సెంటర్లు కీలక పాత్ర పోషించేలా చూస్తామన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 978 ఎంప్లాయ్మెంట్ సెంటర్లు ఉన్నాయని వీటిని త్వరలోనే కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్లుగా మార్చే ప్ర్రక్రియ ప్రారంభమౌతుందన్నారు. తొలుత 100 మోడల్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పటు చేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ కెరీర్ సర్వీస్ అనే మరో కార్యక్రమాన్నిన్ని కూడా ప్రారంభిస్తుందనీ, ఈ రెండు పథకాలకు కలిపి 800 కోట్ల రూపాయలు కెటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నూతన కా పథకాల ద్వారా ఈ ఆర్థీక సంవత్పరం చివరి నాటికి కోటి ఉద్యోగాలను కల్పించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. 'మేక్ ఇన్ ఇండియా', 'స్కిల్ ఇండియా' కేంద్రం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశాలుగా దత్తాత్రేయ తెలిపారు. -
'గడువులోపే పోలవరం పూర్తి చేస్తాం'
న్యూఢిల్లీ: గడువులోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఆమెతో భేటీ అయిన సందర్భంగా మాట్లాడారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు అంశంపైనే వారిరువురు చర్చించుకున్నారు. అనంతరం ఉమాభారతి మాట్లాడుతూ పోలవరం పూర్తి చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు నదుల అనుసంధానం చేయడం గర్వకారణంగా ఉందని తెలిపారు. -
రైతుల పట్ల కాంగ్రెస్ ది మొసలి కన్నీరు
న్యూఢిల్లీ : గత 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ రైతుల నుంచి 10 లక్షల ఎకరాల భూమిని సేకరించిందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఆరోపించారు. రైతుల నుంచి సేకరించిన భూమికి 4 రెట్లు నష్ట పరిహారం ఇచ్చారా అని ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. శుక్రవారం వెంకయ్యనాయుడు న్యూఢిల్లీలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట విలన్ అని అభివర్ణించారు. రైతుల విషయంలో ఆ పార్టీ మొసలి కన్నీరు కారుస్తుందని ఎద్దేవా చేశారు. రైతుల కోసం ఏమీ చేసిందో ట్యాలీ చేసుకుని ర్యాలీలో చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి వెంకయ్య హితవు పలికారు. తమ ప్రభుత్వం తీసుకువస్తున్న భూసేకరణ పథకంలో 4 రెట్లు నష్ట పరిహారం ఇస్తున్నామని వెంకయ్య చెప్పారు. బ్రిటీష్ చట్టాలను ఉపయోగించి ఒక్క హర్యానాలోనే 70 వేల ఎకరాల భూమిని కాంగ్రెస్ సేకరించిందని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
'మోదీ'పై చర్చకు సిద్ధం'
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీ అంశంపై ఈ రోజు తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో సుష్మా స్వరాజ్ మాట్లాడారు. రాజ్యసభలో కూడా ఇదే విషయాన్ని వెల్లడించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పినట్లు తెలిపారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీ ... ఆ సంస్థ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 20 - 20 క్రికెట్ టోర్నీ ఐపీఎల్ నిర్వహణలో తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో పాటు ఈడీ సహా పలు జాతీయ దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటూ ఆయన విదేశాలకు పరారైయ్యారు. దాంతో భారత్ ప్రభుత్వం ఆయనపై బ్లూ కార్నర్ నోటుసులు జారీ చేసింది. లండన్ ఉన్న లలిత్ మోదీ తన భార్యకు వైద్య చికిత్స నిమిత్తం పోర్చుగల్ వెళ్లాల్సి వచ్చింది. వీసా మంజూరు కోసం ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను సంప్రదించారు. ఆమె బ్రిటన్‌లోని ఉన్నతాధికారులతో మాట్లాడి... లలిత్ మోదీ సమస్యను పరిష్కరించారు. ఆ విషయం బయటకు పొక్కడంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. బీజేపీపై ఎదురుదాడికి దిగింది. మోసానికి పాల్పడిన లలిత్ మోదీకి ఎలా సహాయం చేశారంటూ సుష్మా స్వరాజ్‌పై కాంగ్రెస్ ప్రశ్నలు సంధించింది. దాంతో తాను మానవత్వంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సుష్మా ప్రకటించారు. కానీ సుష్మా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
'మొన్న జరిగిన ఘటన దురదృష్టకరం'
రాజమండ్రి : రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆకాంక్షించారు. గోదావరి పుష్కరాలు సందర్భంగా శుక్రవారం సుజనా చౌదరి రాజమండ్రిలోని వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడారు. మొన్న చోటు చేసుకున్న తొక్కిసలాట సంఘటన దురదృష్టకరమన్నారు. పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్‌లో తొక్కిసలాట సందర్భంగా చనిపోయిన వారి ఆత్మకు శాంతి చూకూరాలని కోరుకున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రకృతి సహకరించాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. గోదావరి పుష్కరాలకు ఇప్పటివరకు కోటి మంది భక్తులు హాజరయ్యారని వెల్లడించారు. అయితే ప్రస్తుతం పుష్కర ఏర్పాట్లు అన్నీ బాగున్నాయని సుజనా చౌదరి చెప్పారు.