సినీనటి రష్మిక మందన్నాపై కొద్ది రోజుల్లోనే రెండు ఫేక్ వీడియోలు వైరల్ కావడంపై కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. రష్మిక డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇలాంటి వీడియోలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చిన్న పిల్లలు, మహిళలపై ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు.
రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ..'డీప్ ఫేక్ వీడియోలపై దృష్టి సారించాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మార్ఫింగ్ లాంటివి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇలాంటి పరిస్థితి రావడం చాలా ప్రమాదకరం. గత రెండేళ్లుగా ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టాం. సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. ఫిబ్రవరి నుంచి నిబంధనలు మరింత కఠినతరం చేస్తాం.' అని అన్నారు.
ఇటీవల నేషనల్ క్రష్ రష్మికకు సంబంధించిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. భారత సంతతికి చెందిన జరా పటేల్ వీడియోను కొందరు డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేశారు. ఈ సంఘటనపై పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో మరవకముందే.. మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఆమె అభిమానులు మండిపడుతున్నారు.
ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు విజ్ఞప్తి చేశారు. రష్మికతో పాటు బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ టైగర్-3 సినిమాలో ఓ ఫోటోను అలాగే మార్ఫింగ్ చేశారు. దీంతో రోజు రోజుకు ఇలాంటి వాటి బారిన పడే వారిసంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కఠినమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment