Pushpa Movie: Spider Man Steps To Rashmika Mandanna RaRa Sami Song, Video Goes Viral- Sakshi
Sakshi News home page

Pushpa Movie: రారా సామీ పాటకు స్పైడర్‌ మ్యాన్‌ స్టెప్పులు.. ఎలా ఉందంటే..

Published Sat, Jan 8 2022 2:12 PM | Last Updated on Sat, Jan 8 2022 3:29 PM

Spider Man Steps To Rashmika Mandanna RaRa Sami Song In Pushpa Movie - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం 'పుష్ప'. డిసెంబర్‌17న విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీగా రూపొందిన ఈ సినిమా హ్యాట్రిక్‌ హిట్‌గా నిలిచింది. ఇక సినిమా రిలీజ్‌కు ముందే ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇక ‘ఊ అంటావా మావా..  ఊఊ అంటావా’ పాట ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక దీనికి ముందు విడుదలైన ‘రారా సామీ’ పాటకు కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ జాబితా చేరింది. ఎక్క డ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. ఇక ఈ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ సోషల్‌ మీడియాలో పలువురు వీడియోలు కూడా షేర్‌ చేస్తున్నారు.

చదవండి: Kim Mi Soo: ప్రముఖ ‘స్నోడ్రాప్‌’ నటి అనుమానాస్పద మృతి

అంతేకాదు ఈ పాటపై మీమ్స్‌ క్రియేట్‌ చేస్తూ పోస్ట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇక పుష్ప ప్రమోషన్లో హీరోయిన్‌ రష్మిక కూడా ఈపాటకే డ్యాన్స్‌ చేయడం అందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ పాటకు స్పైడర్‌ మ్యాన్‌ కూడా ఫిదా అయ్యాడు. రారా సామీ అంటూ స్పైడర్‌ మ్యాన్‌ చేస్తున్న డ్యాన్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.  క్రిస్మస్‌ సెలబ్రెషన్స్‌లో భాగంగా స్పైడర్‌ మ్యాన్‌ వేషంలో ఉన్న వ్యక్తి రారా సామీ పాటకు డ్యాన్స్‌ చేస్తుంటే.. ఎదురుగా క్రిస్మస్‌ సంటా వేషంలో ఉన్న వ్యక్తులు అతడిని అనుసరిస్తూ ఈపాటకు డ్యాన్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

చదవండి: ‘మణిరత్నంను ఇంతవరకు కలవలేదు, ఆయనతో నాకు చేదు అనుభవం ఉంది’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement