Spider Man
-
పాపులారిటీ కోసం పాకులాట.. ‘స్పైడర్ మ్యాన్’ అరెస్ట్
సోషల్ మీడియాలో తొందరగా పాపులరిటీ సంపాదించేందుకు కొందరు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. చేయకూడని పనులు చేసి చిక్కుల్లో పడుతున్నారు. రకరకాల రీల్స్ చేస్తూజనాల చేత తిట్లు తింటున్నారు. ప్రమాదకర స్టంట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటివి మానుకోవాలని అధికారులు చెబుతున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.తాజాగా ఓ వ్యక్తి తన ప్రమాదకర స్టంట్తో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి కటకటాల పాలయ్యాడు. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని ఆదిత్య అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి ఢిల్లీ రోడ్డుపై డేంజరస్ స్టంట్లు చేశాడు. ద్వారక ప్రాంతంలో గౌరవ్ సింగ్ (19) డ్రైవింగ్ చేస్తుండగా.. స్పైడర్ మ్యాన్ వేషం ధరించిన ఆదిత్య కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేశాడు.దీనిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో అనేక మంది ఫిర్యాదు చేశారు. చివరికి సమాచారం అందుకున్న ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. యువకులపై చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఇద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు. Delhi | On receiving a complaint on social media about a car seen on Dwarka roads with a person dressed as Spiderman on its bonnet, the Delhi Traffic Police took action. The person in the Spiderman costume was identified as Aditya (20) residing in Najafgarh. The driver of the… pic.twitter.com/UtMqwYqcuK— ANI (@ANI) July 24, 2024ప్రమాదకర డ్రైవింగ్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడం, సీటు బెల్టు ధరించకపోవడం వంటి చర్యలకు పాల్పడినందుకు జైలు శిక్షతో పాటు రూ. 26 వేల జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆదిత్య గతంలోనూ స్పైడర్ మ్యాన్ దుస్తుల్లో ప్రమాదకర స్టంట్లకు పాల్పడి కటకటాల పాలైనట్లు తెలుస్తోంది. -
స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు..
న్యూయార్క్: 15 ఏళ్ల అమెరికా టీనేజర్ స్పైడర్ మ్యాన్ వేషధారణలో పార్కుకు వెళ్తే అక్కడి ఆకతాయి యువత బాలుడిని ఎగతాళి చేసి గాయపరిచారు. పాపం స్పైడర్ మ్యాన్ కు ముక్కు నుండి రక్తం ధారకట్టడంతో నిస్సహాయంగా నిలుచుండిపోయాడు. వారు దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హడ్సన్ ఫాల్స్ కు చెందిన 15 ఏళ్ల అయిడిన్ పెడోన్ న్యూయార్క్ లోని ఒక పార్కు వారు నిర్వహించిన సూపర్ హీరో థీమ్ లో పాల్గొనేందుకు తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకుని పార్కుకి వెళ్ళాడు. అంతలోనే అక్కడికి వచ్చిన కొంతమంది టీనేజర్లు అయిడిన్ చుట్టూ చేసిరి మొదట ఎగతాళి చేశారు. ఆ గుంపులోని ఒక అమ్మాయి అయిడిన్ ముఖంపై బలంగా కొట్టింది. దాంతో తూలిపడబోయిన అయిడిన్ ఆపుకుని స్పైడర్ మ్యాన్ మాస్క్ తొలగించగా ముక్కు మీద తీవ్ర గాయం కావడంతో రక్తం బొటబొటా కారింది. ఈ సంఘటన జరుగుతుండగా పార్కులో మిగతావారు ఫోన్లో ఈ సన్నివేశాన్ని వీడియో తీస్తూ కనిపించడం విశేషం. This is actually disgusting… I hope there were consequences for what they did to that poor boy pic.twitter.com/vQ2hHEDcU4 — FadeHubb (@FadeHubb) July 1, 2023 స్థానిక మీడియా న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అయిడిన్ చికిత్స పొందుతున్నాడని, గో ఫండ్ మి అనే పేజీ ప్రతినిధులు మరోసారి అయిడిన్ ఇలా దెబ్బలు తినకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి చందాలు వసూలు చేయగా ఇప్పటికి 10,000 యూఎస్ డాలర్లు( రూ 8.21 లక్షలు) పోగయ్యాయని అన్నారు. ఆరో తరగతి చదువుతున్న అయిడిన్ కు ఆత్మన్యూనతా భావం ఎక్కువని, స్కూల్లో తరచుగా సహచరులు తనని ఆటపట్టిస్తూ ఉండటంతో ఆ భావం నుండి బయటపడేందుకు ఆదివారం తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నాడని, తీరా అక్కడ ఇలా జరగడం అమానుషమని అన్నారు. చుట్టూ ఉన్నవారు దాడిని ఆపకపోగా వీడియోలు తీస్తూ నవ్వుతుండడం మరింత బాధించిందని తెలిపారు. అయిడిన్ తల్లి ఫిర్యాదు మేరకు హడ్సన్ ఫాల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేసిన టీనేజ్ అమ్మాయిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: Roller Coaster: తలకిందులుగా వేలాడుతూ.. 3 గంటలు నరకయాతన.. -
సంతలో స్పైడర్ మ్యాన్ మాస్ డ్యాన్స్.. మహిళల నవ్వులే నవ్వులు!
Desi Spider Man Dance.. హాలీవుడ్లో స్పెడర్ మ్యాన్ మూవీ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. స్పైడర్ మ్యాన్ సినిమా సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఇక, ఇండియాలో సైతం ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కాగా, తాజాగా దేశీయ స్పెడర్ మ్యాన్.. పశ్చిమ బెంగాల్లో డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. కోల్‌కత్తాలో శాంతినికేతన్‌లోని సోనాజురిలోని మార్కెట్లో స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్న ఓ వ్యక్తి కిరాక్ డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మిస్టర్ స్పైడర్ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ సంతాలీ సంగీతానికి అక్కడి మహిళలతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేశాడు. View this post on Instagram A post shared by Kolkata's illusion | Kolkata (@kolkatas.illusion) సంతాలీ సంగీతంలో ఉన్న ఓ జానపద పాటకు స్పైడర్ మ్యాన్ డ్రెస్‌లో ఉన్న వ్యక్తి స్టెప్పులు ఇరగదీశాడు. మహిళలతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ముందుకు సాగాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నైట్‌క్లబ్ వద్ద రచ్చ.. ఐటీ యువతులతో అసభ్యకర ప్రవర్తన.. -
ఖరీదైన ఇంటిని కొన్న స్పైడర్ మ్యాన్, ప్రియురాలితో ఉండటానికే!
టామ్ హాలండ్, జెండయా.. వీరిద్దరూ నటించిన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' రూ.12 వేల కోట్ల కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తర్వాత మరింత హ్యాపీగా ఉన్న ఈ జంట తమ బంధాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాలనుకున్నారు. ఇందుకోసం యూకేలో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దీని విలువ ఎంతనుకుంటున్నారు. భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా 36 కోట్ల రూపాయలు. టామ్, జెండయా 2016లో 'స్పైడర్ మ్యాన్: హోమ్ కమింగ్' సినిమా సెట్స్‌లో తొలిసారిగా కలుసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణలోనే ఇద్దరూ లవ్‌లో పడ్డారట. ఆ తర్వాత స్నేహితుల పెళ్లికి ఈ లవ్‌బర్డ్స్ కలిసే వెళ్లేవారు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఉన్న వీడియోలు, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇక వీరు డేటింగ్ చేయడానికి ఒక ఇల్లు ఉండాలనుకున్నారో ఏమో కానీ ఇప్పుడేకంగా లండన్‌లో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. ఇందులో సినిమా థియేటర్, జిమ్ ఇలా అన్నీ ఉన్నాయట! టామ్‌కు యూకేలో ఇదివరకే మూడు గదుల ఫ్లాట్ ఉండగా, జెండయాకు లాస్ ఏంజిల్స్‌లో సొంత ఇల్లు ఉంది. -
Pushpa Movie: రారా సామీ పాటకు స్పైడర్ మ్యాన్ స్టెప్పులు
-
రారా.. సామీ పాటకు స్పైడర్ మ్యాన్ స్టెప్పులు.. ఎలా ఉందంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన చిత్రం 'పుష్ప'. డిసెంబర్17న విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన ఈ సినిమా హ్యాట్రిక్ హిట్‌గా నిలిచింది. ఇక సినిమా రిలీజ్‌కు ముందే ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’ పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక దీనికి ముందు విడుదలైన ‘రారా సామీ’ పాటకు కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్ జాబితా చేరింది. ఎక్క డ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. ఇక ఈ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో పలువురు వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. చదవండి: Kim Mi Soo: ప్రముఖ ‘స్నోడ్రాప్’ నటి అనుమానాస్పద మృతి అంతేకాదు ఈ పాటపై మీమ్స్ క్రియేట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక పుష్ప ప్రమోషన్లో హీరోయిన్ రష్మిక కూడా ఈపాటకే డ్యాన్స్ చేయడం అందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ పాటకు స్పైడర్ మ్యాన్ కూడా ఫిదా అయ్యాడు. రారా సామీ అంటూ స్పైడర్ మ్యాన్ చేస్తున్న డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. క్రిస్మస్ సెలబ్రెషన్స్‌లో భాగంగా స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్న వ్యక్తి రారా సామీ పాటకు డ్యాన్స్ చేస్తుంటే.. ఎదురుగా క్రిస్మస్ సంటా వేషంలో ఉన్న వ్యక్తులు అతడిని అనుసరిస్తూ ఈపాటకు డ్యాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చదవండి: ‘మణిరత్నంను ఇంతవరకు కలవలేదు, ఆయనతో నాకు చేదు అనుభవం ఉంది’ -
Spider Man No Way Home: స్పైడర్ మ్యాన్... సునామీ
-
స్పైడర్ మాన్ ‘బల్లి’..! సోషల్ మీడియాలో ఫోటో వైరల్
Spider Man lizard: స్పైడర్ మాన్ సీరిస్‌లో భాగంగా తాజాగా ‘స్పైడర్ మాన్: నో వే హోమ్’ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా అచ్చంగా స్పైడర్ మాన్‌ను పోలినట్లు ఉన్న ఒక జాతి బల్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సాధారంగా గోదుమ రంగులో ఉండే బల్లి మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ బల్లి మాత్రం అందుకు భిన్నం నీలం, ఎరుపు రంగులో ఉండి ఆకర్షిస్తోంది. ఈ బల్లి ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్) ఆఫీసర్ సుశాంత నంద డిసెంబర్ 21న తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. Spider-Man in real life… DYN that the Mwanza flat-headed rock agama, referred to sometimes as Spider-Man agama, climbs up vertical walls like the reel life spider man😊😊 pic.twitter.com/ydpZvFNUvY — Susanta Nanda IFS (@susantananda3) December 21, 2021 అదేవిధంగా ‘రియల్ లైఫ్ స్పైడర్ మాన్’ అని కామెంట్ కూడా జతచేశారు. స్పైడర్ మాన్‌గా కనిపిస్తున్న బల్లి ఎక్కువగా టాంజానియా, రువాండా, కెన్యా దేశాల్లో కనిపిస్తుంది. అయితే ఈ జాతి మగ బల్లి తల, భుజాలు ఎరుపు రంగులో ఉండగా.. మిగతా శరీరం నీలం రంగులో ఉంటుంది. బల్లి ఫోటోను చూసిన నెటిజన్లు.. తమ అభిమాన సూపర్ హీరోతో పోలికలు ఉన్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ బల్లి అచ్చం స్పైడర్ మాన్లా ఫోజు పెట్టింది’.. ‘ఎట్టకేలకు స్పైడర్ మాన్ ఫ్యాషన్ డిజైనర్‌ను పొందాను’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
స్పైడర్‌మ్యాన్ క్రేజ్..! మార్కెట్లలోకి సూపర్ హీరోస్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్స్
Tvs Ntorq 125 Price And Mileage: ప్రపంచవ్యాప్తంగా మార్వెల్స్ హీరోస్‌పై క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు పలు కంపెనీలు మార్వెల్స్ హీరోస్ స్ట్రాటజీతో తమ వ్యాపారాలకు మరింత ఆదాయాలను సంపాదించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16 న రిలీజైన స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్ వెండి తెర సంచలనం సృష్టిస్తోంది. భారత్‌లో కూడా స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్ క్రేజ్ మామూలుగా లేదు. మార్వెల్స్ హీరోస్ లవర్స్ కోసం ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మార్వెల్స్ సూపర్ హీరోస్ ఎడిషన్ స్కూటర్లను లాంచ్ చేసింది. చదవండి: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..! అందులో టీవీలు, హెడ్‌ఫోన్స్, ఇంకా మరెన్నో..! టీవీఎస్ మోటార్ కంపెనీ టీవీఎస్ NTORQ 125 సూపర్‌స్క్వాడ్ ఎడిషన్‌లో భాగంగా మరో రెండు మార్వెల్ సూపర్ హీరోస్ స్పైడర్ మ్యాన్, థోర్ ప్రేరేపిత స్కూటర్లను కంపెనీ విడుదల చేసింది. గత ఏడాది సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌లో భాగంగా మార్వెల్ సూపర్ హీరోస్ - ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా ఎడిషన్ టీవీఎస్ Ntorq 125బైక్‌లను ప్రారంభించింది. భారత్‌లోకి RT-Fi సాంకేతికతతో వచ్చిన మొట్టమొదటి బ్లూటూత్ కనెక్ట్ చేయబడిన స్కూటర్‌గా టీవీఎస్ Ntorq 125 నిలుస్తోంది. సూపర్ హీరోస్ ఫీచర్స్‌తో..! కొత్త మార్వెల్ స్పైడర్ మ్యాన్ , థోర్ వెర్షన్లు స్కూటర్స్ సూపర్ హీరోల ముఖ్య లక్షణాలను టీవీఎస్ Ntorq 125 ఏర్పాటుచేశారు. స్పైడర్ మ్యాన్, థోర్ కు సంబంధించిన విషయాలను ఇందులో ఉండేలా టీవీఎస్ డిజైన్ చేసింది. ఈ స్కూటర్లలోని స్మార్ట్‌కనెక్ట్ యాప్ స్పైడర్ మ్యాన్ లోగో , థోర్స్ హమర్ వంటి సంబంధిత పాత్రల చిహ్నాల సిల్హౌట్‌తో ఒపెన్ కానుంది.ఈ స్కూటర్లు మార్వెల్ సూపర్ హీరోస్ అనుభూతిని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ధర ఎంతంటే..! టీవీఎస్ NTORQ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 84,850 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ స్కూటర్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు... స్కూటర్ మొదటి-రకం వాయిస్ అసిస్ట్ ఫంక్షన్, మొదటి-ఇన్-సెగ్మెంట్ డ్యూయల్ రైడ్ మోడ్‌లను అందించే వేరియంట్‌తో రానుంది. చదవండి: మల్టీప్లెక్సుల బిజినెస్ అదరహో.. సాయం చేసిన స్పైడర్‌మ్యాన్- భరోసా ఇచ్చిన పుష్ప -
Spider Man Cyber Security Alert: సూపర్ హీరోస్ క్రేజ్.. పొంచి ఉన్న సైబర్ దాడులు..
Spider Man Cyber Security Alert: మార్వెల్ స్టూడియోస్ సూపర్ హీరోస్ సిరీస్‌లో తాజాగా విడుదలైన సినిమా స్పైడర్‌మ్యాన్: నో వే హోం. అయితే ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌ని ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అనేక ఫిషింగ్ సైట్లు నిర్వహిస్తున్నట్టు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కై ఇంటర్నెట్ యూజర్లను హెచ్చరించింది. ప్రీమియర్‌తో ఎర స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో లెటెస్ట్ మూవీ నో వే హోం సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంతకు ముందు ఈ సినిమా ప్రీమియర్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్లో వల వేశారని క్యాస్పర్‌స్కై పేర్కొంది. స్పైడర్‌మ్యాన్ నో వే హోం ప్రీమియర్ అందిస్తున్నట్టుగా ఫిషింగ్ సైట్లను రూపొందించాయని.. వీటిని క్లిక్ చేసిన వారికి ప్రీమియర్ లింక్ పంపిస్తామని అంతకు ముందు గేట్‌వే ఫీజు చెల్లించాలంటూ క్రెడిట్ కార్డు, బ్యాంకు డిటెయిల్స్ అడిగినట్టు ఆ సంస్థ పేర్కొంది. బ్యాంకు వివరాలు అందించిన వారి ఖాతాల్లో సొమ్ము మాయమైనట్టు తాము గుర్తించామంది. క్రేజ్‌ను క్యాష్ చేసుకునేలా మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలుకు పిల్లల్లో ఎంతో క్రేజ్ ఉంది. దీనికి తోడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, ముగ్గురు స్పైడర్మ్యాన్లను ఒకేసారి తెరమీద చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిపస్తున్నారు. ఈ సూపర్‌హీరోస్ ఎడ్వెంచర్స్ చూసేందుకు టీనేజర్లు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో వీరిని టార్గెట్ చేసుకుని మూవీ లింకుల పేరుతో ఫిషింగ్ సైట్లు పుట్టగొడుగుల్లా నెట్లో ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరించింది. మరిన్ని మోసాలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించింది. అయితే ఇప్పటి వరకు ఎంత మంది బాధితులు ఉన్నారనే వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు. చదవండి: -
స్పైడర్ మ్యాన్‌తో స్టెప్పులేయించిన శిల్పా శెట్టి.. ఎందుకో తెలుసా ?
Shilpa Shetty Dances With Spider Man For A Ticket Of Spider Man Movie: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, తన భర్త రాజ్ కుంద్రాను అనేక వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఆ సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుకుంటోంది శిల్పా శెట్టి. తాజాగా ఆమె ఒక ఉల్లాసభరితమైన వీడియోను షేర్ చేసింది. అందులో సూపర్ హీరో స్పైడర్ మ్యాన్‌తో స్టెప్పులేసింది శిల్పా. స్పైడర్ మ్యాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ (Spider Man: No Way Home)'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17న విడుదల కానుండగా భారత్‌లో మాత్రం డిసెంబర్ 16న రిలీజ్ అయింది. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది శిల్పా శెట్టి. భారత్‌లో స్పైడర్ మ్యాన్ కొత్తం చిత్రం టికెట్లు హాట్ కేక్‌ల్లా అమ్ముడైపోతున్నాయి. క్షణాల్లో హాళ్లు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో శిల్పా శెట్టి ఒక్క టికెట్ కోసం స్పైడీని బతిమాలింది. ఆన్లైన్లో టికెట్ల కోసం చూస్తున్న శిల్పా శెట్టి తన గదిలోకి ప్రవేశించడంతో వీడియో ప్రారంభమవుతుంది. టికెట్లన్నీ అమ్ముడైపోయాయని అంటూ ఆమె గదిలోకి చూస్తుంది. గదిలో స్పైడర్ మ్యాన్ దుస్తుల్లో ఉన్న వ్యక్తిని ఆశ్చర్యోపోతుంది శిల్పా. వెంటనే అతని దగ్గరికి వెళ్లి 'నా కొడుకు కోసం ఒక్క టికెట్ ఇవ్వు' అని శిల్పా శెట్టి స్పైడీని వేడుకుంటుంది. దానికో నో అన్న స్పైడర్ మ్యాన్‌తో ఒక ఒప్పందం చేసుకుంటుంది శిల్పా శెట్టి. స్పైడీకి డ్యాన్స్ స్టెప్ నేర్పిస్తే తనకు టికెట్ ఇవ్వాలని ఇద్దరూ ఒప్పందం చేసుకుంటారు. 'చురా కే దిల్ మేరా' సాంగ్‌లోని సిగ్నేచర్ స్టెప్‌తో పాటు కొన్ని డ్యాన్స్ స్టెప్పులను శిల్పా శెట్టి స్పైడీకి నేర్పుతుంది. అయితే నటి నుంచి డ్యాన్స్ స్టెప్పులను నేర్చుకున్నా కూడా శిల్పాకు టికెట్ ఇప్పించలేకపోతాడు స్పైడీ. 'టికెట్ దొరక్కపోతే నాకు ఇంటికి వెళ్లే మార్గం లేదు (టికెట్ నహీ దోగే తో దేర్ ఈజ్ నో వే హోమ్ ఫర్ మీ). వియాన్ (శిల్పా కుమారుడు) నన్ను చంపుతాడు. నాకు టికెట్ ఇవ్వండి స్పైడర్ మ్యాన్.' అంటూ స్పైడర్ మ్యాన్‌ను శిల్పా శెట్టి బతిమాలుతుంది. అలాగే తను షేర్ చేసిన వీడియోకు 'అద్భుతమైన శక్తితో గొప్ప బాధ్యత వస్తుంది స్పైడీ. నాకు నో వే హోమ్ ఉండకుండా టికెట్ ఇప్పించడం నీ బాధ్యత. ఎందుకంటే వెబ్‌లో నేను టికెట్‌ను పొందలేను కాబట్టి.' అని క్యాప్షన్ యాడ్ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల శిల్పా శెట్టి 'హంగామా 2' చిత్రంలో నటించింది. ఈ సినిమాలో పరేశ్ రావల్, మీజాన్, ప్రణిత సుభాష్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
అమెరికా కంటే ముందుగా భారత్‌లో విడుదల.. ఏంటో తెలుసా?
Spider Man No Way Home Release In India Before The US: విపరీతమైన క్రేజ్ సంపాందించుకన్న హాలీవుడ్ చిత్రాలలో స్పైడర్ మ్యాన్ సిరీస్ ఒకటి. స్పైడర్ మ్యాన్ సిరీస్, అమెజింగ్ స్పైడర్ మ్యాన్ సిరీస్, మార్వెల్ స్పైడర్ మ్యాన్ సిరీస్‌ల్లోని అన్ని చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో వండర్ విజువల్స్‌తో వస్తోన్న చిత్రం స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. ఈ చిత్రానికి మొదటి నుంచే అంచనాలు పెరిగాయి. సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా సోనీ పిక్చర్స్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ట్వీట్ చేసింది. టామ్ హాలండ్, జెండయా నటించిన ఈ స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ చిత్రాన్ని అమెరికాలో కంటే ఒకరోజు ముందే భారతదేశంలో విడుదల చేస్తున్నారు. 'స్పైడర్ మ్యాన్, మార్వెల్ అభిమానులందరికీ మేము కొన్ని ఆసక్తికర వార్తలు ఇవ్వనున్నాం. మన అభిమాన సూపర్ హీరో యూఎస్ కంటే ఒకరోజు ముందుగానే స్వింగ్ చేయనున్నాడ. డిసెంబర్ 16న స్పైడ్ మ్యాన్: నో వే హోమ్ చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో చూడండి.' అని 'సోనీ పిక్చర్స్ ఇండియా' పోస్ట్ చేసింది. అంటే దీని అర్థం అమెరికాలో కంటే ముందే ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రపంచానికి స్పైడర్ మ్యాన్ ఎవరో తెలిసిపోతుంది. అది సమస్యగా మారుతుంది. దీంతో తాను స్పైడర్ మ్యాన్ అని తెలీకుండా ఉండేందుకు డాక్టర్ స్ట్రేంజ్ సహాయం కోరుతాడు స్పైడీ. ఇందులో నలుగురు విలన్లతో స్పైడీ పోరాడనున్నట్లు సమాచారం. We have some exciting news for all the Spider-Man & Marvel fans! Our favourite superhero will be swinging in one day earlier than the US! Catch #SpiderManNoWayHome on December 16 in English, Hindi, Tamil & Telugu. pic.twitter.com/uUNQNJ7e3h — Sony Pictures India (@SonyPicsIndia) November 29, 2021 ఇది చదవండి: విజువల్ వండర్‌గా స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ట్రైలర్.. -
పిక్‌ని పోస్ట్ చేసిన ‘స్పైడర్ మ్యాన్’.. ఎమోషనల్ అయిన ప్రియురాలు
మార్వెల్ మూవీ ‘స్పైడర్ మ్యాన్’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు హాలీవుడ్ స్టార్ టామ్ హోలండ్. ఈ మూవీలో తనతో జతకట్టిన జెండయాతో ఆ సినిమా నుంచి డేటింగ్ చేస్తున్నాడు ఈ కుర్రాడు. ఆమె తాజాగా ‘డ్యూన్’ అనే చిత్రంలో నటిస్తోంది. జెండయా కొత్త సినిమా ప్రీమియర్ సందర్భంగా ప్రియురాలి పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు టామ్. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆ పిక్కి హార్ట్ ఐస్ ఏమోజీని జత చేశాడు ఈ స్పైడర్ మ్యాన్ స్టార్. దీనిపై స్పందించిన ఆయన ప్రియురాలు ఎమోషనల్ ఎమోజీని షేర్ చేసింది. దీంతో ఈ పిల్ నెట్టింట వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 7 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ఇలా ఇప్పుడే కాకుండా టైమ్ వచ్చినప్పుడల్లా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని వ్యక్తి పరుచుకుంటూ ఉంటుంది ఈ జంట. చదవండి: కొత్త ‘బ్యాట్‌మ్యాన్’ ట్రైలర్ విడుదల.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే.. View this post on Instagram A post shared by Tom Holland (@tomholland2013) -
‘ఐరన్‌మ్యాన్’కి ఏమైంది?, కారులో ముద్దులతో ‘స్పైడర్‌మ్యాన్’ అలా..
ఐరన్‌మ్యాన్.. మార్వెల్ కామిక్స్‌లో పిల్లలకు ఓ ఫేవరెట్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్‌కు తనదైన శైలి నటనతో వెండితెరపై ప్రాణం పోసి.. అశేష అభిమానాన్నిసంపాదించుకున్నాడు నటుడు రాబర్డ్ డానీ జూనియర్. అయితే తాజాగా ఆయన చర్యలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. రాబర్డ్ డానీ.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కొందరిని అన్‌ఫాలో అయ్యాడు. అయితే ప్రత్యేకించి మార్వెల్ నటులను అన్ ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. ‘కెప్టెన్ అమెరికా’ క్రిస్ ఎవాన్స్, స్పైడర్ మ్యాన్ ‘టామ్ హాలాండ్’ లాంటి మంచి స్నేహం ఉన్న నటులను సైతం అన్‌ఫాలో కావడం విశేషం. దీంతో అభిమానుల్లో ఏం జరిగిందో అనే ఆత్రుత పెరిగింది. కొంపదీసి మార్వెల్‌కు డానీ గుడ్‌బై చెప్పాడా? ఇక ఐరన్ మ్యాన్‌గా కనిపించడా? అనే వాళ్లలో వాళ్లు చర్చించుకున్నారు కూడా. అయితే డానీ తన ఇన్‌స్టా వాళ్లతో పాటు మరికొందరిని కూడా అన్‌ఫాలో అయ్యాడు. మొత్తంగా అతని 43 మంది ఫాలోవర్స్‌లో.. ఏ ఒక్క యాక్టర్ లేకుండా చూసుకున్నాడు అంతే. ఇక ట్విటర్లో మాత్రం అందరినీ ఫాలో అవుతున్నాడు 56 ఏళ్ల రాబర్ట్ జాన్ డానీ జూనియర్. ముద్దులతో స్పైడర్‌మ్యాన్ టామ్దయా.. ఇది కొత్తగా ఆ హాలీవుడ్ జంటకు అభిమానులు పెట్టుకున్న పేరు. స్పైడర్‌మ్యాన్ ఫేమ్ టామ్ హోలాండ్(25).. తన కో స్టార్ జెన్దయాతో రిలేషన్లో ఉన్నాడని కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ రిలేషన్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఇద్దరు కారులో ముద్దుపెట్టుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. కాగా, ఈ బ్రిటిష్ నటుడు.. 24 ఏళ్ల అమెరికన్ నటి జెన్దయాతో ప్రేమలో ఉన్నాడు. స్పైడర్‌మ్యాన్ హోంకమింగ్(2017) నుంచి పీటర్ పార్కర్-ఎంజే క్యారెక్టర్ జోడిగా వీళ్లిద్దరూ అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. I can’t breathe #TOMDAYA #TOMHOLLAND #ZENDAYA pic.twitter.com/bYLEf2YpBM — 🦖 (@8ncvrr) July 2, 2021 -
పోప్‌ను కలిసిన రియల్ సూపర్ హీరో
వాటికన్ సిటీ: వాటికన్ సిటీలో శాన్ దమాసో వేదికగా ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్ వేషధాణలో అందరి దృష్టిని ఆకర్షించాడు. మాటియో విల్లార్డిటా అనే వ్యక్తి స్పైడర్ మ్యాన్ వేషధాణలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను బుధవారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశాడు. పోప్‌కు తలకు ధరించే స్పైడర్ మ్యాన్ మాస్క్‌ను ఇచ్చాడు. అనంతరం మాటియో మాట్లాడుతూ.. ఆనారోగ్యంతో ఉన్న చిన్న పిల్లలు, వారి కుటుంబాల కోసం ప్రార్థించాలని పోప్ ఫ్రాన్సిస్ని కోరినట్లు తెలిపారు. చిన్నారుల వద్దకు తాను వెళ్లినప్పుడు వారి బాధను మాస్క్ ద్వారా చూస్తున్నట్లు తెలియజేడానికి పోప్‌కు మాస్క్ ఇచ్చినట్లు తెలిపాడు. తనకు పోప్ ఫ్రాన్సిస్‌ను కలవటం చాలా ఆనందంగా ఉందని, ఆయన తన మిషన్‌ను గుర్తించారని మాటియో పేర్కొన్నారు. ఇక స్పైడర్ మ్యాన్ వేషాధారణలో ఉన్న మాటియోతో పలువురు సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఉన్న మాటియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. చదవండి: ప్రాణం కోసం విలవిల.. గట్టిగా చుట్టి మింగేసింది -
మొతేరాకు మోదీ పేరు, పప్పులో కాలేసిన భారత నెటిజన్లు
బ్రిటన్ రచయిత టామ్ హోలాండ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ భారత నెటిజన్లు స్పైడర్ మ్యాన్ నటుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి రచయిత చేసిన కామెంట్స్‌కు నటుడిపై ఎందుకు మండిపడుతున్నారని ఆశ్చర్యపోతున్నారా!. ఇక్కడే కొందరు మన ఇండియన్ నెటిజన్లు పప్పులో కాలేశారు. ఆవేశంలో ఎవరో కూడా చూసుకోకుండా స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హోలాండ్పై ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. అసలేం జరిగిందంటే.. ఇంగ్లాండ్ రచయిత టామ్ హోలాండ్ ‘ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పేరును పెట్టించుకోవాలని తహతహలాడారు. ఓ నాయకుడు అలా చేయడం శుభపరిణామం కాదు’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో మోదీ అభిమానులు టామ్ హోలాండ్పై విరుచుకుపడటం ప్రారంభించారు. అయితే స్పైడర్ మ్యాన్ నటుడు టామ్, రచయిత టామ్ పేర్లు ఒకేలా ఉండటంతో నెటిజన్లు కన్ఫ్యూజ్ అయ్యారు. I’m a huge admirer of the modesty Modi showed in naming the world’s largest cricket stadium after himself. — Tom Holland (@holland_tom) February 24, 2021 ఈ ట్వీట్ చేసింది స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ యే అనుకొని అతడిని టార్గెట్ చేసి ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. అంతేగాక ‘బాయ్‌కాట్ స్పైడర్ మ్యాన్’ పేరిట హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. అయితే దీనిపై నటుడు టామ్ హోలాండ్ ఇంతవరకూ స్పందించలేదు. కానీ రచయిత టామ్ మాత్రం ‘స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హోలాండ్ను ఇండియా ఎందుకు నిషేధించాలని భావిస్తున్నదంటే...’ అంటూ మరో ట్వీట్ చేసి భారత నెటిజన్లకు స్పష్టత ఇచ్చాడు. దీంతో నెటజన్లంత తమ తప్పిదానికి నాలుక కరుచుకున్నారు. కాగా అహ్మదాబాద్ మొతేరాలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియాన్ని ఇటీవల గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ నిర్మించింది. ఈ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ పేరును పెట్టడం వివాదాస్పదమైంది. చదవండి: నరేంద్ర మోదీ స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి 14 గంటలు యముడితో పోరాడాడు! వైరల్ : 11 ఏళ్లపాటు సేవలు.. జాగిలానికి ఘనంగా వీడ్కోలు -
రియల్ స్పైడర్ మ్యాన్.. వీడియో వైరల్
పారిస్: స్పైడర్ మ్యాన్ సిరీస్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానులు. హీరో చేతులతోనే పెద్ద పెద్ద భవంతులను ఎక్కడం.. ట్రైన్లు వంటి వాటిని ఆపుతూ ప్రజలను కాపాడటం వంటి సాహసాలు చేస్తాడు. ఇక స్పైడర్ మ్యాన్ అంటే పిల్లల్లో ఉండే క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. ఓ యూ ట్యూబర్ 58 అంతస్తుల భవంతిని చకాచకా చేతులతోనే ఎక్కేశాడు. అది కూడా గంట వ్యవధిలోనే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రియల్ స్పైడర్ మ్యాన్ అంటూ నెటిజనులు సదరు యూట్యూబర్‌ని ప్రశంసిస్తున్నారు. వివరాలు.. అథ్లెట్ లియో అర్బన్ శనివారం ఎలాంటి భద్రతా సామాగ్రి లేకుండా కేవలం తన చేతులతోనే పారిస్ మోంట్‌పార్నాస్సేలోని ఆకాశహర్య్యాన్ని ఎక్కాడు. 58 అంతస్తుల భవనాన్ని అర్బన్ ఒక గంటలోపే ఎంతో సులువుగా అధిరోహించాడు. అతడు ఈ సాహసోపేతమైన ఫీట్‌ని వేలాది మంది ప్రజలు, వీలేకరులు ప్రత్యక్షంగా చూడటమే కాక వీడియోలు కూడా తీశారు. (చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ట్రక్ దూసుకెళ్లినా బతికింది) అర్బన్ గతంలో ఈఫిల్ టవర్, టూర్ టీ1, అరియాన్ ఆకాశహర్మ్యాలు ఎక్కాడు. ఇక తాజాగా ఫ్రెంచ్ రాజధాని పారిస్‌లో 210 మీటర్ల (690 అడుగులు) ఎత్తైన భవనం పైకి ఎక్కిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫీట్ చేయడానికి ముందు తాను ఎన్నో వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానని.. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన ఫీటు ఇదేనని తెలిపాడు అర్బన్. -
స్పైడర్ మ్యాన్‌ను ఆదుకున్న యాచకుడు
చిన్న పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ల దాకా అందరూ ఇష్టపడే కార్టూన్ స్పైడర్ మ్యాన్ . దీనిపై వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈలలు కొట్టించాయి. సినిమాలో ఎవరికైనా కష్టం ఉందనగానే స్పైడర్ మ్యాన్ చటుక్కున ప్రత్యక్షమవుతాడు. ఎంతటి సాహసానికైనా పూనుకుని వారిని కాపాడతాడు. అలాంటి స్పైడర్ మ్యాన్‌కు నిజ జీవితంలో ఓసారి కష్టం వచ్చింది. అప్పుడు ఓ యాచకుడు అతన్ని ఆదుకుని గండం నుంచి గట్టెక్కించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరోగా నటించిన టామ్ హాలండ్ లండన్‌లో షాపింగ్‌కు వెళ్లాడు. అక్కడ ట్రాలీని తీసుకోడానికి ఒక పౌండ్ (భారత కరెన్సీలో రూ.92) రుసుము ఇవ్వాలి. అయితే ఈ హీరో దగ్గర చిల్లర లేక ఇబ్బందిపడుతున్నాడు. (‘జుమాంజి’ నటికి కరోనా) దీన్ని దూరం నుంచి గమనించిన ఓ యాచకుడు అతనికి ఆ పౌండ్‌ను అందించి సాయపడ్డాడు. అయితే షాపింగ్ అనంతరం టామ్ ఆ భిక్షగాడి దగ్గరకు వెళ్లి అతనిచ్చిన ఒక్క పౌండ్‌ను తిరిగివ్వడమే కాకుండా మరో వంద పౌండ్లను అదనంగా ఇచ్చాడు. ఇది అక్కడే ఉన్న ఓ తల్లీకూతుళ్లను ఆశ్చర్యచకితులను చేసింది. స్పైడర్ మ్యాన్ గొప్ప మనసుతో అతనికి రెట్టింపు సాయం చేయడాన్ని చూసి తమ కళ్లల్లో నీళ్లు తిరిగాయని వారు పేర్కొన్నారు. 23 యేళ్ల టామ్ హాలండ్.. స్పైడర్ మ్యాన్ నటి జెండయాతో డేటింగ్లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. (రుచి...వాసన తెలియడంలేదు) -
భారత్‌లో ఒక రోజు ముందుగానే!
వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని ఆకట్టుకున్న సూపర్ హీరో స్పైడర్ మ్యాన్. అవెంజర్స్ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ‘స్పైడర్ మ్యాన్ : ఫార్ ఫ్రమ్ హోం’ రికార్డులను బ్రేక్ చేయడానికి ‘స్పైడర్ మ్యాన్ : ఫార్ ఫ్రమ్ హోం’ సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఓ రోజు ముందుగానే సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా విడుదల చేస్తుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జూలై 4న ఈ సినిమా భారీ రేంజ్లో విడుదలవుతుంది. మార్వెల్ సంస్థ నుండి వస్తున్న సినిమాలపై క్రేజ్ క్రమంగా పెరుగుతుంది. ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్నాని మాట్లాడుతూ ‘సూపర్‌హీరో స్పైడర్ మ్యాన్ సినిమాలకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రారంభం నుండే స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాను జూలై 4న విడుదల చేస్తున్నాం. 30వ తారీఖునే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళంలో సినిమాను విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. -
సిటీలో స్పైడర్‌మ్యాన్..!
విశాఖసిటీ: మీరు చూస్తున్నది నిజమే.. సాహసాల స్పైడర్ మ్యాన్ విశాఖ వీధుల్లో విహరించాడు. సినిమాల్లో ఆపదలో ఉన్న వారిని ఆదుకునే స్పైడర్ మ్యాన్..నగరంలో నిరాశ్రయుల చెంతకు వచ్చాడు.వారి బాగోగుల గురించి ఆరా తీశాడు.సినిమా క్యారెక్టర్లో కనిపించే స్పైడర్ మ్యాన్.. నిజ జీవితంలోకి ఎలా వచ్చాడా అని ఆలోచిస్తున్నారా.? ఇదంతా.. స్ట్రీట్ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారం. బిగ్ స్కౌట్ పేరుతో ఈ నెల 16 నుంచి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో 100 మందికి పైగా వలంటీర్లు హాజరుకానున్నారు. నగరాన్ని 6 భాగాలుగా విడదీసి ఈ 100 మంది టీమ్స్‌గా ఏర్పడతారు. గాజువాక నుంచి మధురవాడ వరకూ ఉన్న నిరాశ్రయుల్ని ఈ బృందాలు కలిసి వారి వివరాలు తీసుకుంటుంది. వారికి ఆహారపదార్థాలు, దుస్తుల్ని ఇవ్వడమే కాకుండా ఆరోగ్య పరిస్థితి బాగులేకపోతే వైద్య పరీక్షలకు తీసుకెళ్లడంతో పాటు మందులు పంపిణీ చేస్తామని స్ట్రీట్ ప్రతినిధులు తెలిపారు. అదే విధంగా ఉపాధి కోసం ఎదురు చూసేవారికి వెంటనే ఉపాధి అవకాశాలు కల్పిం చనున్నట్లు స్ట్రీట్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగానే స్పైడర్ మ్యాన్ నగరంలో సందడి చేశాడు. ఈ సంస్థలో వలంటీర్‌గా చేరి సేవలందించానుకునేవారు 6305182805 నం బర్లో సంప్రదించాలని సూచించారు. -
స్పైడర్ మ్యాన్ క్రియేటర్ ఇకలేరు
సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ సృష్టికర్త స్టీవ్ డిట్కో కన్నుమూశారు. ఆయన మృతి వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 90 ఏళ్ల డిట్కో న్యూయార్క్‌లోని తన ఇంట్లో జూన్ 29న విగత జీవిగా పడి ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. అంతకు రెండురోజుల ముందే ఆయన ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఆయన మృతిపై గల కారణాలపై స్పష్టత లేదు. ఒంటరితనం భరించలేకే ఆయన సూసైడ్ చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. 1961లో మార్వెల్ కామిక్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టాన్లీతో కలిసి డిట్కో.. స్పైడర్‌మ్యాన్ పాత్రను రూపొందించారు. ఆ క్రెడిట్ స్టాన్లీదే అయినా.. స్పైడర్‌మ్యాన్ కాస్టూమ్స్, వెబ్ షూటర్స్, డిజైన్ ఇలా అంతా డిట్కో ఆలోచనలోంచి పుట్టిందే. తొలుత కామిక్ రూపకంలో వచ్చిన స్పైడర్‌మ్యాన్ కు అనూహ్య స్పందన రావటంతో చిన్నచిన్న మార్పులు చేసి యానిమేటెడ్ సిరీస్‌గా మార్వెల్ కామిక్స్ రూపొందించింది. స్పైడర్మ్యాన్తోపాటు ఆ సిరీస్‌లోని విలన్ పాత్రలు గ్రీన్ గోబ్లిన్, డాక్టర్ అక్టోపస్, సాండ్‌మ్యాన్, ది లిజర్డ్ అన్నీ డిట్కో డిజైన్ చేశారు. వీటితోపాటు 1963లో డాక్టర్ స్ట్రేంజ్ పాత్రను ఆయన రూపొందించారు. అనంతరం సహచరుడు స్టాన్లీతో విభేదాల కారణంగా మార్వెల్ కామిక్స్‌కు గుడ్‌బై చెప్పిన డిట్కో.. డీసీ కామిక్స్, ఛార్ల్టోన్, మరికొన్ని ఇండిపెండెంట్ పబ్లిషర్స్‌తో పని చేశారు. తిరిగి 1979లో మార్వెల్‌కు తిరిగొచ్చిన ఆయ.. మెషీన్ మ్యాన్, మైక్రోనట్స్ లాంటి పాత్రలను రూపొందించారు. 1992లో స్క్విరిల్ గర్ల్ ఆయన రూపొందించిన చివరి పాత్ర. ఆయన మృతిపై హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
స్పైడర్ మ్యాన్‌ను తలపిస్తున్న రకూన్
మిన్నెసోటా : అమెరికన్లు మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య జరిగినచారిత్రక భేటీపైనే కాకుండా ఓ రకూన్(పిల్లిని పోలిన జీవి) గురించి కూడా విపరీతంగా చర్చించారు. ఎందుకంటే అది చేసిన విన్యాసం అటువంటింది. ఆ రకూన్ సెయింట్ పాల్ మిన్నెసోటాలోని యూబీఎస్ భవనాన్ని స్పైడర్ మ్యాన్‌లా ఎక్కడానికి ప్రయత్నించింది. మధ్యాహ్నం గోడపై పాకుంటూ దాదాపు 12 ఫోర్లు ఎక్కాక అది గమనించిన.. మిన్నెసోటా పబ్లిక్ రెడియో రిపోర్టర్ టిమ్ నెల్సన్ ఈ విషయాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. క్షణాల్లో ఈ వార్త వైరల్‌గా మారింది. సాధారణంగా ఇండ్లలో పెంచుకునే రకూన్లు చాలా కూల్‌గా ఉంటాయి. కానీ ఈ రకూన్ ఇలా చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బిల్డింగ్‌లో ఉన్నవారు కూడా దానిని లోపలి నుంచి ఫొటోలు తీయడం ప్రారంభించారు. స్థానిక టీవీ చానెళ్లు దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టాయి. మెల్లిమెల్లిగా 22వ ఫ్లోర్‌కు చేరుకున్న రకూన్ అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంది. #MPRraccoon ట్యాగ్‌తో ట్విటర్లో విపరీతమైన చర్చ జరిగింది. దానిని ఎలాగైనా కిందికి తీసుకురావాలంటూ నెటిజన్లు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఆ బిల్డింగ్ అద్దాలు తెరుచుకునేవి కాకపోవడం, అది అంత ఎత్తులో ఉండటంతో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. అది ఆ తర్వాత కిందికి దిగడం ప్రారంభించింది. నిల్సన్తో పాటు స్థానిక మీడియా కూడా దీనిపై తాజా సమాచారాన్ని అందిస్తున్నాయి. మంగళవారం రాత్రి కూడా రకూన్ కదలికలను గమనిస్తూనే ఉన్నారు. బుధవారం ఉదయం అది 17వ ఫ్లోర్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం. -
క్షణాల వ్యవధిలో స్పైడర్‌మ్యాన్‌లా వెళ్లి..
-
సెకన్ల వ్యవధిలో చిన్నారి ప్రాణాలను... వైరల్
పారిస్: ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో కూడా తెలీని పరిస్థితి నెలకొనటం సహజం. కానీ, కొందరు మాత్రం సమయస్ఫూర్తిని, తెగువను ప్రదర్శిస్తుంటారు. మాలికి చెందిన 22 ఏళ్ల మమౌడూ గస్సామా కూడా అదే జాబితాలోకి వస్తాడు. ప్రాణాలకు తెగించి ఓ చిన్నారిని కాపాడి సూపర్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆదివారం ఉత్తర ప్యారిస్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా, ఆ వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. నాలుగేళ్ల బాబు తాను ఉంటున్న ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు వేలాడటం కొందరు స్థానికులు గమనించారు. వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే అంచుల నుంచి వేలాడుతున్న ఈ చిన్నారి ఎప్పుడైనా కిందపడి పోయేలా పరిస్థితి నెలకొంది. కింద జనం చేరి హాహాకారాలు చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మమౌడూ గస్సామా క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు దూకాడు. గబగబా పైకి భవనం ఎక్కడి ఆ పిల్లాడిని కాపాడే యత్నం చేశాడు. ఆ సమయంలో పక్క ప్లాట్లోని వ్యక్తి చిన్నారి జారకుండా ఒకచేత్తో అదిమి పట్టుకున్నాడు. నిమిషం వ్యవధిలోనే పైకి ఎక్కేసిన గస్సామా.. ఆ బాబును అమాంతం లాగేసి ప్రాణాలు కాపాడాడు. కాసేపటికి వచ్చిన అధికారులు చిన్నారి సురక్షితంగా ఉన్నాడని తెలిసి ఆ యువకుడిని అభినందించి వెళ్లిపోయారు. గస్సామా సాహసంపై పారిస్ మేయర్ ప్రశంసలు గుప్పించగా, సోషల్ మీడియాలో అతన్ని హీరోగా, స్పైడర్ మ్యాన్‌గా అభివర్ణిస్తున్నారు. మాలి నుంచి పారిస్‌లో స్థిరపడదామని వచ్చిన అతనికి అన్ని తోడ్పాట్లు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంట్లో ఒంటిరిగా ఉన్నాడు... ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో ఎవరూ లేరని పోలీసులు నిర్ధారించారు. పిల్లాడి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు అతని తల్లి ఊళ్లో లేదని తెలుస్తోంది. ‘ఆ క్షణంలో ఆ చిన్నారిని అలా చూసేసరికి భయం వేసింది. వణికిపోయా. ప్రజలంతా కేకలు పెడుతున్నారే తప్ప.. ఒక్కరూ కూడా తెగించే ధైర్యం చేయలేదు. ఫైర్ సిబ్బంది రావటానికి సమయం పడుతుందని అనిపించింది. ఇంతలోపే ఆ చిన్నారికి ఏమైనా జరిగితే ఎలా?.. మరో ఆలోచన రాలేదు. దుకే ఈ పని చేశా’ అని గస్సామా చెబుతున్నాడు. -
భారీ గోడలే బలాదూర్.. స్పైడర్‌మేన్ దొరికేశాడు
సాక్షి, న్యూఢిల్లీ : అతడిని ఎంత పెద్ద గోడలు అడ్డుకోలేవు.. ఎలాంటి తలుపులు నిలువరించలేవు.. ఎంతపెద్ద ఇంటిపైకైనా పాకేస్తాడు.. ఎంత పెద్ద గోడనైనా ఎక్కేస్తాడు. అయితే, ఇదంతా విని అతడు రికార్డులు సృష్టించే వ్యక్తేమో అనుకుంటే పొరబడ్డట్టే . ఎందుకంటే అతడు ఓ గజదొంగ.. ఇంకా చెప్పాలంటే అక్కడ అందరు అతడిని స్పైడర్ మేన్ అని కూడా అంటారు. పోలీసులు కూడా ఆ దొంగతనం జరిగిన సమయంలో ఇది ఆ స్పైడర్ మేన్ చేసి ఉంటాడని అంటుంటారు. ఆ దొంగ ఇప్పుడు దొరికిపోయాడు. అయితే, ఇతడు విదేశాల్లో స్పైడర్‌మేన్ కాదు.. మన ఢిల్లీని దోచుకునే దొంగ స్పైడర్‌మేన్.. మరో ముగ్గురు సన్నిహితులకు కలిసి చివరకు బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జహంగిరిపురి అనే ప్రాంతానికి చెందిన జైప్రకాశ్(24) అనే వ్యక్తి వరుస దొంగతనాలకు పాల్పడుతూ పెద్ద పెద్దగోడలను, భవనాలను సైతం ఎక్కి హడలు పుట్టిస్తూ ఉండేవాడు. అతడు స్పైడర్మేన్లాగా పూర్తి ముసుగును ధరించి దొంగతనాలు చేస్తుండేవాడు. అతడితోపాటు రవికుమార్, సంజయ్గోయల్, ప్రమోద్ కుమార్ షా అనే వ్యక్తి కూడా ఈ పనులకు దిగుతుండేవారు. దీంతో వీరిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఆటకట్టించారు. వారు నలుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జైప్రకాశ్ ఇంటి నుంచి రూ.50లక్షల నగదు, ఖరీదైన గడియారాలు, అరకిలో బరువున్న 30 బంగారు వెండి నగలు, లైసెన్స్డ్ రివాల్వర్, ఐదు క్యాట్రిజ్లు స్వాధీనం చేసుకున్నారు.